"సన్యాసం" పునర్జన్మ తో సమానమని,ఈ జన్మలో చేసిన కర్మంతా నశించి పోతుంది..సన్యాసి తల్లి దండ్రులే గాక ,అతని ఏడు పురుషాంతరముల వరకూ అందరూ తరిస్తారని శాస్త్రం చెబుతూ ఉంది.. లోకంలో తల్లిదండ్రులు,పుత్రులు మొదలైన వారు గల సముదాయాన్ని "కుటుంబం" అంటారు.. జగద్గురు శంకరాచార్యుల వారు ఒక చిన్న కుటుంబానికి చెందిన వారుగా,ఫలానా వారి పుత్రుడిగా,ఫలానా వారి తండ్రిగా ఉందాలనుకోలేదు..ప్రపంచమంతా వారి కుటుంబం కావాలని కోరి 8సంవత్సరాల వయస్సు లోనే తల్లి అనుమతితో సన్యసించారు..వీరు వారి తల్లి దండ్రులకు ఒక్కరే కుమారుడు..తండ్రి ముందే పరమపదించారు.."తనకు భిక్షా ప్రదానం చేసిన వారంతా తన తల్లులు,తనకు జ్ఞానం ఉపదేశించిన గురువులు, తండ్రులు, శిష్యులే తన కుమారులు "అని సన్యాసి భావిస్తాడు..అటువంటి విశాల భావంతో శంకరులు సన్యసించి మనకు మహోపకారం చేశారు..అద్వైత జ్ఞానం మనకందించారు..అంత్య కాలంలో తనను స్మరిస్తే వస్తానని తల్లికి చెప్పి శంకరులు నర్మదా నదీ తీరానికి వెళ్లారు...మన వైదిక సంస్కృతిని నిలబెట్టింది మాత్రం శంకరుల వారే..వీరు మన ధర్మానికి మూల స్తంభం లాంటి వారు. వీరికి 3వ సంవత్సరం నుండే అనేక శాస్త్రాలు స్పురించాయి..5వ ఏట ఉపనయనం జరిగింది..8 ఏళ్లు వయస్సు వచ్చే నాటికి సర్వ శాస్త్రాలు,వేదాలు అభ్యసించి,పూర్ణత్వాన్ని పొంది సన్యసించారు.. గోవిందా యోగీంద్రుల శిష్యరికం చేశారు..అద్వైతాన్ని ఒక జీవన విధానం గా అలవాటు చేసేందుకు గాను దేశానికి నలువైపులా నాలుగు ఆమ్నాయ పీఠాలను స్థాపించారు..కంచిలో "మూలామ్నాయ " శంకర పీఠం ' నెలకొల్పినారు..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి