*🕉️🪷 ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః 🪷🕉️*
*🪷 శ్రీ మద్భగవద్గీత🪷*
*🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸*
*🌸 సాంఖ్య యోగః 🌸*
*2-అధ్యాయం,50వ శ్లోకం*
*బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే ।*
*తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్ ।। 50*
*ప్రతిపదార్థం*
బుద్ధి-యుక్తః = జ్ఞానం కలిగి ఉండి; జహాతి = త్యజించుము; ఇహ = ఆ జన్మలో; ఉభే =రెంటినీ; సుకృత-దుష్కృతే = మంచి, చెడు కార్యములు; తస్మాత్ =కాబట్టి; యోగాయ = యోగము కొరకు; యుజ్యస్వ = ప్రయత్నింపుము; యోగః = యోగ అంటే; కర్మసు కౌశలమ్ =నేర్పు తో పని చేసే కళ.
*తాత్పర్యము*
వివేకముతో ఈ కర్మ శాస్త్రమును ఆచరణలో పెట్టినవాడు ఈ జన్మ లోనే పుణ్య పాపములను రెంటినీ త్యజించును. కాబట్టి నైపుణ్యం తో (సరియైన దృక్పథం తో) పని చేయటం అనే, యోగ అభ్యాసము చేయుము.
*సర్వేజనాః సుఖినోభవంతు*
*హరిః ఓం 🙏🙏*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి