🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
. *🌹సౌందర్యలహరి🌹*
*శ్లోకం - 44*
🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷
*తనోతు క్షేమం న స్తవ వదన సౌందర్యలహరీ*
*పరీవాహ స్రోతస్సరణిరివ సీమన్తసరణిః |*
*వహంతీ సిందూరం ప్రబల కబరీభార తిమిర*
*ద్విషాం బృందై ర్బన్దీకృతమివ నవీనార్క కిరణమ్ ‖*
అమ్మవారి పాపిట సిందూరాన్ని వర్ణిస్తూ *సౌందర్యలహరి* అనే మాట ఇక్కడ వాడారు శంకరులు.
తనోతు క్షేమం = మా క్షేమాన్ని విస్తరింపజేయుగాక! ఏది?
తవ వదన సౌందర్యలహరీ పరీవాహ స్రోతః సరణిరివ
సీమన్త సరణిః = నీ ముఖ సౌందర్యం ఒక ప్రవాహంలాగా వుంటే ఈ ప్రవాహం ప్రసరించటానికి కాలువ వలె వున్నది నీ పాపిట.
సీమంత సరణిః వహంతీ సిందూరం = ఆ కాలువ చివర మెరుస్తున్నది సిందూరం. అది ఎలా వున్నది?
ఉదయిస్తున్న సూర్యుని కిరణము వలె వున్నది.
ప్రబల కబరీభార తిమిర ద్విషాం బృందై ర్బందీకృత మివ = దట్టమైన జుట్టు అనే చీకట్లు బృందముగా ఏర్పడి సూర్యకిరణమును బంధించినట్లు వున్నది.
ఈ సిందూర కాంతి నందనవనము నుండి నీ కబరీభరమును అలంకరించిన సుగంధభరితమైన దివ్యపుష్పములు మా అజ్జ్ఞానాంధకారాన్ని తొలగించుగాక!
🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి