రామాయణమ్ 345
...
నీవు చెప్పినది నాకు ఆనందము కలిగించినది .ఒక విశ్వాస పాత్రుడైన సేనాపతి తన ప్రభువు ఆనందము కోసము ఆలోచించవలె.నీ ఆలోచన ఆరీతిగనే వున్నది .
.
కానీ !
.
స్త్రీల విషయములో నేను శాపగ్రస్తుడను తనంతతానై నా దరికి వచ్చిన వనితను తప్ప ఇతరులను బలాత్కారముగా అనుభవించ తలపెట్టితినా అదే నా చివరి రోజు !
.
ఒక సారి నేను బ్రహ్మ లోకమునకు వెళ్లినప్పుడు పుంజికస్థల అను అతిలోక సౌందర్యరాశి అయిన అప్సరసను ఒంటరిగా చూడటము తటస్థించినది.
.
కాముడి శరములు నామదిని తూట్లు పొడిచినవి. శరీరమునందు సెగలు పుట్టినవి . మదన జ్వరపీడితుడనై ఆపుకొనలేక ఆమెను వివస్త్రను చేసి బలాత్కారముగా అనుభవించితిని .
.
ఆమె బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకొనినది.
.
బ్రహ్మదేవుడు అంత ఆగ్రహించి ," రావణా ఈనాడు మొదలుకొని నీవు ఏ పడతినైనా ఆమె ఇష్టములేక బలాత్కరించి అనుభవించితివా ! నీ తల నూరు వ్రక్కలగును " అని శపించినాడు....నీకు ఇంకొక రహస్యము కూడ చెప్పెదను వినుము ....
.
రంభ అందమును చూసి మహాసంరంభమున బలవంతముగా ఆమెను అనుభవించితిని . నలకూబరుడు నన్ను ఇదేవిధముగా శపించినాడు .
అది ఆరంభము !...
.
ఆ! నలకూబరుని శాపము నన్నేమిచేయునని లెక్కచేయలేదు ...
.
కానీ ఈ సారి శపించినది సాక్షాత్తూ విధాత ! ...అందుకే నాకు భయము ,దిగులు ..ఆ శాపమే లేకపోయెనా ! ఈ పాటికి సీతాదేవిని ఎప్పుడో వశము చేసుకొని యుండెడి వాడను....
.
వీరి మాటలు విభీషణుడు వింటున్నాడు ...ఇక లాభము లేదు హితము చెప్పవలెనని అనుకొన్నాడు.....తన ఆసనమునుండి పైకి లేచినాడు.
.
వూటుకూరు జానకిరామారావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి