14, డిసెంబర్ 2022, బుధవారం

ధాతుపౌష్టిక లేహ్యం

 ధాతుపౌష్టిక  లేహ్యం  ఉపయోగాలు  - 


 *  శరీరమునందలి ధాతువులకు బలం చేకూర్చును . 


 * రక్తము నందలి దోషములను  పోగొట్టి రక్తమును శుభ్రపరచును . 


 *  కండరములు బలాన్ని చేకూర్చును . ఎముకలు గట్టిబడచేయును . 


 *  వాత, కఫ సంబంధ రోగములు నాశనం చేయును . 


 * శరీర నిస్సత్తువ , నరాల దోషములు నివారణ చేయును . 


 *  వృద్దాప్యము నందు కలుగు శారీరక రుగ్మతలు నశింపచేయును . 


 *  ఎదైనా రోగము చేత శరీరము కృశించబడి ఉండువానికి శరీరం కండబట్టి దుర్బలత్వము నుండి బయటపడును . 


 *  రక్తశుద్ధి వలన ముఖవర్చస్సు పెరుగును . 


 *  చిన్నపిల్లల శారీరక ఎదుగుదల మీద అద్బుతముగా పనిచేయును . 


 *  స్త్రీలయందు కలుగు హార్మోనల్ సమస్యలకు చక్కగా పనిచేయును . 


 * మెనోపాజ్ స్ధితికి దగ్గరగా ఉండు స్త్రీలలో కలుగు "ఆస్ట్రియోపోరొసిస్ " అను ఎముకల బలహీనపరిచే వ్యాధిని  దరిచేరనియ్యదు . 


 * పిల్లల ఙ్ఞాపకశక్తి పెరుగును . 


 *  మగవారిలో సంభోగ సంబంధ సమస్యలకు , నరాల బలహీనత పైన పనిచేయును . 


 *  థైరాయిడ్ సమస్యల వలన వచ్చు నీరసం మరియు అసహన సంబంధ సమస్యలకు దీన్ని తప్పక వాడాలి . 


 *  మానసిక సంభంద సమస్యలకు కూడా ఇది అద్భుతంగా పనిచేయును . 


       పైన చెప్పినవే కాకుండగా మరెన్నో సమస్యలకు ఇది వజ్రాయుధములా పనిచేయును . దీనియందు 16 రకాల విశిష్ట మూలికలు మరియు ముత్య , స్వర్ణ , అభ్రక భస్మాల మిళితముగా ఉండి అత్యంత శక్తివంతముగా పనిచేయును . దీనికి ఎటువంటి పథ్యములు పాటించవలసిన అవసరం లేదు . చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎవరైనను వాడవచ్చు .  


      ఈ ధాతువృద్ధి లేహ్యము కావలసిన వారు 9885030034 నంబర్ నందు సంప్రదించగలరు . 


      కాళహస్తి వేంకటేశ్వరరావు 


   అనువంశిక ఆయుర్వేద వైద్యులు  


                9885030034

ఆత్మ విద్య

 ఆత్మ విద్య మీ జన్మ రహస్యం- / ఆత్మ-మీ సొంత ఇల్లు, మీ శరీరం అద్దె ఇల్లు. ఆత్మ విద్య:

ఉచిత

  ఎవరైనా హిందూ సోదరుడు తన కొడుకును హరిద్వార్ గురుకులంలో బోధించాలనుకుంటే, 15 మార్చి నుండి 15 జూలై 2023 వరకు ఆచార్య పాణిగ్రాహి చతుర్వేద సంస్కృత వేద్ పాఠశాల హరిద్వార్‌లో ఇంటర్వ్యూ ఉంటుంది.  "అబ్బాయి క్లాస్-6 పాస్ అయి ఉండాలి."  గురుకులంలో ఉండడం, తినడం, తాగడం అన్నీ ఉచితంగానే ఉంటాయి.  మరియు నెలకు 8000 రూపాయల స్కాలర్‌షిప్ కూడా ఇవ్వబడుతుంది.  నాలుగు వేదాలు, వ్యాకరణం, సాహిత్యం, ఇంగ్లీషు మొదలైన ఆధునిక విషయాలపై కూడా పిల్లలకి విద్యను అందించబడుతుంది మరియు వేదాలలో నిపుణుడిని తయారు చేస్తారు.  ఆచార్య (M.A.) వరకు చదివేందుకు కూడా మార్గనిర్దేశం చేస్తారు.  ఈ సందేశాన్ని మీ అన్ని హిందూ సమూహాలలో ఉంచండి మరియు మీ పిల్లల మతం యొక్క అద్భుతమైన పాఠశాలను ప్రోత్సహించడానికి వీలైనంత వరకు ప్రతి హిందువుని చేరుకోవడానికి ప్రయత్నించండి.

  వెంటనే సంప్రదించండి!

   హీరాలాల్ జీ 9654009263


🕉🕉🕉    * 🕉🕉🕉


               🙏🏼 *సత్యం తెలుసుకుంటే మనం చేసే సంకల్పాలన్నీ మనవి కాదని అర్థం అవుతుంది. అన్నం ముద్ద గొంతు దిగేవరకు మనకు తెలుస్తుంది. అప్పటివరకు మన ప్రతిభ అనుకుంటాం. తర్వాత జీర్ణం అవ్వడంలో మన సంకల్పం ఎంత ఉంది? అని ఆలోచిస్తే అహంకారం పతనమవుతుంది. ఒక విత్తనం నాటడం మన సంకల్పమైతే, దాని నుండి వేల ఫలాలు వెలువడడం మన సంకల్పం కాదుకదా?*


       *ఈశ్వరుడి సంకల్పశక్తిని మనం ఆపాదించుకోవడం అహంకారమే అవుతుంది*


               *మనది కేవలం గమనించే లక్షణం మాత్రమే. భగవదనుగ్రహంలో  ఏనాడు పక్షపాతం ఉండదు. యోగాయోగ్యత కలిగినవారికి తదనుగుణమైన ఫలితం లభిస్తుంది. ఈ ప్రపంచం పట్ల మనకున్న వ్యామోహాన్ని విసర్జించి అభ్యాసం ద్వారా దైవాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడమే చేయవలసిన కర్తవ్యం. మనస్సు పరిశుద్ధం కాకుంటే ఆత్మ దర్శనం, దైవ దర్శనం అసాధ్యం!* 🙏🏼


🕉✡✡🕉☸☸🕉⚛⚛🕉

త్రివిధోపాయములు

 ఆయుర్వేదం నందు త్రివిధోపాయములు  - 


  ఆయుర్వేదం నందు త్రివిధోపాయములు అనగా 


                *  దర్శనము . 


                *  స్పర్శ .  


                *  ప్రశ్న . 


    పైన చెప్పిన మూడు విధాలుగా రోగిని పరీక్షించవలెను . వీటిని త్రివిధోపాయాలు అంటారు. 

ఇప్పుడు మీకు వాటి గురించి వివరిస్తాను . 


  *  దర్శనము - 


       నేత్రములతో రోగి యొక్క ఆకారము , నాలుక , కండ్లు , మలమూత్రాదులను పరీక్షించి రోగమును గుర్తించవలెను . 


 *  స్పర్శ  - 


        రోగి శరీరంను చేతితో తాకి నాడి , ఉష్ణత్వము , కడుపుబ్బరము మున్నగు వాటిని పరీక్షించి రోగము గురించి తెలుసుకొనవలెను . 


 *  ప్రశ్న  - 


        రోగిని ప్రశ్నించి నిద్ర , ఆకలి , బలము , తాపము , బరువు , శరీరము యొక్క మలమూత్ర ప్రవృత్తి మున్నగునవి తెలుసుకొనవలెను . 


               స్త్రీలైనచో పైన చెప్పిన ప్రశ్నలతో పాటు ఋతుప్రవృత్తి , రుతుశూల , కుసుమాది రోగముల గురించి ప్రశ్నించి తెలుసుకొనవలెను . 


       ఈ మూడు పరీక్షలు చేయనిచో వ్యాధి వైద్యుడను తప్పుదోవ పట్టించును. కావున మూడు పరీక్షలు సంపూర్ణముగా చేసి వ్యాధిని సరిగ్గా అంచనావేసి సరైన ఔషధం ఇవ్వవలెను . 


 

   ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


 

విద్య అన్నివిధాల విలువైనది*.

 *శుభోదయమ్*😊🙏🏼


శ్లో𝕝𝕝 పుస్తక ప్రత్యయాధీతం

నాధీతం గురుసన్నిధౌ|

సభామధ్యే న శోభన్తే

జారగర్భా ఇవ స్త్రియః||


తా𝕝𝕝 *గురుముఖంగా నేర్వక పుస్తకం ద్వారా నేర్చిన విద్యగలవారు గౌరవంతో శోభిల్లరు*..... 


*పుస్తకం ద్వారా నేర్చిన విద్యకంటే గురుముఖతః నేర్చిన విద్య అన్నివిధాల విలువైనది*......

జప_మాల

 #జప_మాల..!👍👍💐💐


జ‌ప‌మాల ప్రాముఖ్య‌త అంద‌రికీ తెలిసిందే. హిందూ ధ‌ర్మంలో పూజ‌ల స‌మ‌యంలో... శ్లోకాలు, మంత్రాలు చ‌దివేట‌ప్పుడు జ‌ప‌మాల‌ను ఉప‌యోగిస్తుంటారు. ఇందులో 108 పూస‌లుంటాయి. ఇంత‌కూ జ‌ప‌మాల‌లో 108 పూస‌లే ఎందుకుంటాయి అని ఎప్పుడైనా ఆలోచించారా.. దాని వెన‌క కొన్ని ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు ప్ర‌చారంలో ఉన్నాయి. ఒక‌వ్య‌క్తి ఒక‌రోజులో అంటే 24 గంట‌ల్లో 21600 సార్లు శ్వాస తీసుకుంటాడ‌ట‌. అంటే 12 గంట‌ల్లో 10800 సార్లు శ్వాస తీసుకుంటాడు. అంటే ఒక మ‌నిషి దేవుడి స్మ‌ర‌ణ‌లో జ‌ప‌మాల చేసేట‌ప్పుడు 10800 సార్లు చేయ‌డం క‌ష్టం కాబ‌ట్టి... చివ‌రి రెండు సున్నాల‌ను తీసేసి 108 ను నిర్ధారించార‌ని చెబుతారు.   108 వెన‌క మ‌రో క‌థ ప్ర‌చారంలో ఉంది. మొత్తం 12 రాశులున్నాయి. ఈరాశుల‌తో తొమ్మిది గ్ర‌హాలున్నాయి. రాశుల సంఖ్య‌ను గ్ర‌హాల‌తో గుణిస్తే వ‌చ్చేది 108. అందుకే జ‌ప‌మాల‌లో 108 పూస‌ల‌ను నిర్థారించార‌ట‌. ఈ 108 పూస‌లు మొత్తం విశ్వానికి ప్రాతినిధ్యం వ‌హిస్తాయ‌ట‌. జ్యోతిష్య శాస్త్రంలో 27 న‌క్ష‌త్రాలుంటాయ‌ని భావిస్తారు. ఒక్కో న‌క్ష‌త్రానికి 4 పాదాలుంటాయి. అంటే 27 న‌క్ష‌త్రాల‌కు క‌లిపి మొత్తం 108 పాదాల‌వుతాయి. జ‌ప‌మాల‌లోని ఒక్కో పూస ఒక్కో పాదానికి ప్రాతినిధ్యం వ‌హిస్తుంద‌ట‌.  అన్నింటికి మించి 108ని అదృష్ట సంఖ్య‌గా భావిస్తారు. హిందూ ధ‌ర్మ శాస్త్ర ప్రకారం 108 సార్లు ఏదైనా స్తోత్రాన్ని చ‌దవాల‌ని చెబుతారు. 108 సార్లు కొలిస్తే దేవుడి క‌రుణ ఉంటుంద‌ని అంటారు. దానికి అనుగుణంగా 108 పూస‌ల‌ను నిర్ధారించార‌ని  ప్ర‌చారంలో ఉంది.

శ్రీ వరదరాజ పెరుమాళ్ దేవాలయం, వరదరాజపురం*

 *గుండెలపై కాదు... తలపై కుంపటి ఈ గుడి - "తెలంగాణ కంచి" శ్రీ వరదరాజ పెరుమాళ్ దేవాలయం, వరదరాజపురం*


*ఈ దేవాలయంకి వెళ్లే దారి:-*

*E.C.I.L క్రాస్ రోడ్* నుంచి *కుశాయిగుడా, కీసర* గ్రామాలు దాటి *అంకిరెడ్డిపల్లె* చౌరస్తాకి వెళ్లాలి. అక్కడ నుంచి *మూడుచింతల క్రాస్ రోడ్* చేరుకుని, *కరకపట్ల* ఊరు దాటాలి. ఆ తరువాత *8 కి.మీ.* వెళ్తే *వరదరాజుపురం* వస్తుంది. 

ఓ *40 కి.మీ.* ప్రయాణించాలి. దారి బాగుంటుంది. లేదా *షామీర్ పేట* దాటి *ప్రజ్ఞాపూర్* చౌరస్తా వెళ్లి, అక్కడ కుడివైపుకి తిరిగి *12 కి.మీ.* వెళ్తే *వరదరాజ పురం* చేరుకోవచ్చు. ఈ దారిలో *సిద్ధిపేట - భోనగిర్* బస్సులు కూడా వెళ్తాయి


*గూడ పెరుమాళ్లు పంతులు* తలపై కుంపటి...;

చేతుల్లో *వరదరాజపెరుమాళ్* దేవతా మూర్తి...;

కుంపట్లో కణకణలాడే నిప్పు కణికలున్నాయి...;

ఆయన కళ్లలో మాత్రం మిలమిలలాడే ధృడతసంకల్పం, తళతళలాడే దృఢనిశ్చయం ఉన్నాయి...;

జనం వేల సంఖ్యలో పోగై *పెరుమాళ్* ను చూస్తున్నారు...; *పెరుమాళ్*  చేతులోని *పెరుమాళ్* ను చూస్తున్నారు. భక్తితో జోతలు చేస్తున్నారు. పారవశ్యంతో జోహార్లు చేస్తున్నారు.


అక్కడ *గోల్కొండ నవాబు* సైన్యం మొహరించింది. *జాగీర్దారు* ఓ కుర్చీపై కూర్చున్నాడు. *కంచికి వెళ్లి, వరదరాజ పెరుమాళ్ ని దర్శించి, వస్తూ వస్తూ నా ఊరిలోనూ వరదరాజ పెరుమాళ్ల గుడి కట్టుకుంటానని "గూడ పెరుమాళ్ల పంతులు" అనుకున్నాడు. అనుకోవడమేమిటి... వరదరాజపెరుమాళ్ విగ్రహాన్ని చేయించుకుని, అపార భక్తి శ్రద్ధలతో, అనంత పారవశ్యంతో తలపై మోసుకొచ్చాడు.*


సరిగ్గా *మెదక్* జిల్లా *జగదేవపూర్* మండలానికి వచ్చే సరికి *నవాబు సైనికులు* ఆగమన్నారు. *విగ్రహాన్ని పెట్టడాన్ని, గుడి కట్టటాన్ని ఒప్పుకునేది లేదని* దబాయించారు. *నా దేవుడి గుడిని నేను కట్టుకుంటాను. నన్నూ నా దేవుడిని వదిలేయండి* అని *పెరుమాళ్లు పంతులు* వేడుకున్నాడు. ఆ వెర్రి బాపడిని చూసి నవాబు సైనికులు పగలబడి నవ్వారు. *జాగిర్దారు తలపై కణకణమండే బొగ్గుల కుంపటిని మోసుకుని నడిస్తే గుడి కట్టుకునేందుకు అనుమతినిస్తానన్నాడు.* పెరుమాళ్లు పంతులు అంతే పట్టుదలగా *నా పెరుమాళ్లుకి ఈ పెరుమాళ్లు భక్తుడు. నా భక్తే నిజమైతే నడవటం ఏమిటి... పరిగెడతాను కూడా* అన్నాడు.

*అయితే ఒక షరతు... కుంపట్లో బొగ్గు మసి కాకూడదు. నీకు వేడి తగలకూడదు*

*నా పెరుమాళ్లు ప్రహ్లాదుడిని రక్షించాడు. గజేంద్రుడిని కాపాడాడు. నన్నూ కాపాడతాడు*

*పాగల్ బొమ్మన్...* పగలబడి నవ్వాడు జాగిర్దారు.


*నాదీ ఒక షరతుంది ఒప్పుకుంటావా!? జాగీర్దార్ సాబ్.. పెరుమాళ్లు గొంతు పెనుసింహం గర్జనలా గర్జించింది...

నేను కుంపటి తలకెత్తుకుని ఎంత దూరం నడుస్తానో అంత మేర భూమిని నాకిచ్చేయాలి. నా దేవుడికి గుడి కట్టుకునేందుకు ఆ భూమి నాకిచ్చేయాలి.

సరే ...కానిమ్మన్నాడు జాగిర్దార్. *జాగిర్దార్ ది హిరణ్యకశిపుడి అహంకారం. పెరుమాళ్లుది ప్రహ్లాదుడి భక్తి...*

పెరుమాళ్లు నడిచాడు... నడిచాడు... రోజు రోజంతా నడుస్తూనే ఉన్నాడు. అలసట లేదు. ఆయాసం లేదు. ఆగడం అంతకన్నా లేదు. అమ్మా అనలేదు. అయ్యో అనలేదు. వరదరాజ స్వామి వరద హస్తం తలపైనుందో లేక నరసింహుడే అవరించాడో తెలియదు కానీ *1,500 ఎకరాలు* చుట్టివచ్చి, జాగిర్దారు ముందు కుంపటి దించాడు. *బొగ్గు బూడిద కాలేదు. కణకణ మండుతూనే ఉంది. పెరుమాళ్లు తలపై కనీసం మాడినట్టుగా మచ్చ లేదు*. ఖంగుతిన్న జాగీర్దార్ *తూ జీత్ గయారే బొమ్మన్* అని గుడి కట్టుకోవడానికి అనుమతిచ్చాడు. అంతే కాదు... *1,500 ఎకరాలూ* వదులుకున్నాడు.


*ఆ 1,500 ఎకరాల్లో ఒక్క అంగుళం కూడా తన కోసం దాచుకోలేదు పెరుమాళ్లు పంతులు.* మొత్తం గుడి కట్టించాడు. *సువిశాలమైన గుడి, బృహదాకారపు కోనేరు, వసతి గృహాలు, విశ్రామ మంటపాలు, మహాసింహద్వారం, పెద్ద రాజ గోపురం, వాహనాల మంటపం, రథాల మంటపం చూస్తే పెరుమాళ్లు పంతులు సమర్పణ భావం కనిపిస్తుంది. తన సంపదను దేవుడికి పెట్టాడు. నగలు, కిరీటాలు, వడ్డాణాలు, యజ్ఞోపవీతాలు చేయించాడు. 16 మంది పూజారుల్ని పెట్టాడు. పండగలు, పబ్బాలు, జాతరలు, తీర్థాలకు లోటు లేకుండా చేశాడు. వరదరాజుల వారికి రక్షణగా ఊరి మొదట్లో అంజనేయ స్వామిని కూడా ప్రతిష్ఠించాడు.*


ఊళ్లో గుడి వెలియలేదు. గుడి చుట్టూ ఊరు వెలిసింది. వరదరాజ స్వామి పేరిట *వరదరాజపురం* ఏర్పాటైంది. *మెదక్* జిల్లా *జగదేవ్ పూర్* మండలంలో *వరదరాజు* ఇప్పటికీ ఉన్నాడు. *పెరుమాళ్లు పంతులు వారసులు 450 ఏళ్లుగా సేవలందిస్తూనే ఉన్నారు. పరంపరాగత ధర్మకర్తలుగా కొనసాగుతూనే ఉన్నారు. వారిప్పుడు మౌలాలీ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉంటున్నారు. అలనాటి పూజారుల వారసులే ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నారు. దేవుడిని నమ్ముకుని పూజలు చేస్తూనే ఉన్నారు.*


ఇదంతా *450 ఏళ్ల* క్రితం సంగతి. ఇదంతా కట్టుకథ అనుకునేవాళ్లు, స్థానిక జనసందోహం చేసిన ధార్మిక విప్లవానికి ముస్లిం నవాబు తలొగ్గాడని టీకా చెప్పుకోవచ్చు. *రామదాసు భద్రాచలం గుడి కట్టడం హైందవ జన చైతన్యానికి ఎలా ప్రతీకో, వరదరాజపురం గుడి కూడా అలాగే ఒక ధార్మిక జన విప్లవ ప్రతీక.* అయితే *ఇప్పటి తరానికి ఈ గుడి కథ తెలియదు. దీని గొప్పదనం తెలియదు. ఎప్పుడైనా రాత్రి నిద్ర చేయాల్సి వస్తే మాత్రం పది ఊళ్లకి వరదరాజస్వామే దిక్కు.*


టాల్స్టాయ్ కథ ఒకటుంది. ఓ రైతు రోజంతా ఎంత మేర నడిస్తే అంత భూమి ఇస్తానని జమీందారు చెపుతాడు. అయితే మొదలుపెట్టిన చోటకి తిరిగి రావాలని షరతు పెడతాడు. ఆశ, ఆత్రం కలగలిసి రైతు పరుగు పెట్టి పెట్టి చివరికి గమ్యం చేరకుండానే చనిపోతాడు. *వరదరాజపురం* లో *పెరుమాళ్లు పంతులు* కూడా రోజంతా తిరిగాడు - అదీ తలపై కుంపటిపెట్టుకుని... ఈయన చనిపోలేదు. ఈ గుడి రాతి బండల్లో, స్తంభాల్లో, గోపురంలో, పునాదిరాయిలో ఇంకా బతికే ఉన్నాడు. తన కోసం చేసుకునే దానికి, ధర్మం కోసం చేసే దానికి ఉన్న తేడా అది.


*_ఒక్కసారి "వరదరాజపురం" వెళ్లండి. వరాలిచ్చే వరదరాజుని దర్శించుకొండి. తరతరాలుగా గుడిని నమ్ముకుని బతుకుతున్న పూజారికి దక్షిణ ఇవ్వండి. శతాబ్దాలుగా గుడికి పోషకులుగా ఉన్న గూడ పెరుమాళ్లు వారసుల ఫోటోలను చూసి దండం పెట్టుకొండి._*.


*మీరు ఈ దేవాలయాన్ని దర్శించండి. ఆ స్వామినే నమ్ముకుని ఆ దేవాలయంలో స్వామీ సేవ చేస్తున్న వంశపారంపర్య అర్చకులకు దక్షిణ ఇచ్చి వారికి ఇతోధికంగా సహాయం చేయండి. మీ మిత్రులతో మరియు సన్నిహితులతో ఈ దేవాలయం గురించి హి వివరించండి. ఈ క్షేత్రం "తెలంగాణా కంచి" వరదరాజ దేవాలయంగా మారడానికి కృషి చేద్దాము_*

దేవుడంటే ఏంటి

 *దేవుడంటే ఏంటి? పూజ చేయకపోతే ఏమవుతుంది?* 

అని చిన్నపిల్లలే కాదు… నేడు చదువుకున్న పెద్దవాళ్ళు కూడా అడిగే ప్రశ్న ఇది.

మనవాళ్లు వెంటనే చెప్పే సమాధానం… "అలా మాట్లాడితే కళ్లుపోతాయి" అని.

మనకు భవవంతుని గురించి అవగాహనలేనప్పుడు, చెప్పడం చేతగానప్పుడు, మనం వాడే మాట అదే!.


కళ్లు పోగొట్టడానికి దేవుడేం శాడిస్ట్‌ కాదు గదా!

మనం చెప్పాల్సిన సమాధానం అది కాదు.

తెలియని వారికి అలా చెప్పడం వల్ల వారికి దేవునిపై మనసు విరిగే ప్రమాదం ఉందని గ్రహించాలి.


పూజ అనేది కూడా ఒక యోగ ప్రక్రియ… మనసుతో చేసే వ్యాయామం…

మన తెలివితేటలు, జ్ఞానం పెరగడానికి మన మెదడుని మనమే ట్యూన్‌ చేసుకునే ప్రక్రియ…

"దీప ప్రజ్వలనం" అనేది "త్రాటకం" అనే యోగ ప్రక్రియ.

రోజూ ఓ మూడు నిమిషాలు నూనె దీపాన్ని తదేకంగా చూస్తే కంటి జబ్బులను అరికట్టవచ్చు అని పెద్దలు చెప్పిన మాట.

ఏదైనా కష్టమైన మంత్రాన్ని ఓ 11 సార్లు జపిస్తే నాలిక మొద్దుబారదు.

అది నాలికకు ఎక్సర్‌సైజ్‌. అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా పలకగలిగే శక్తి వస్తుంది,

ధారణ శక్తి పెరుగుతుంది. భాష మీద పట్టు పెరిగితే స్టేజ్‌ ఫియర్ కూడా‌ పోతుంది.


పూజ అంటే చాదస్తం కాదు. మన ఆరోగ్యం, మన జ్ఞానానికి సంబంధించిన విషయమని చెప్పండి.

మన హిందూ ధర్మాన్ని ప్రోత్సహించండి.

అదే సమయంలొ మూడ విశ్వాసాలకు దూరంగా ఉండే విధంగా పిల్లలను తయారు చేయాల్సిన భాద్యత కూడా పెద్దవారిపై ఉంది…


*1. మూలవిరాట్* 🚩

భూమిలో ఎక్కడైయితే Electronic & Magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ "మూల విరాట్" ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు Catalyst గా పని చేస్తాయి.

 

*2. ప్రదక్షిణ* 🚩

మనం గుడి చుట్టు Clockwise Directionలో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన… ఎక్కడైన వుంటాడు కాని ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు? పుణ్యక్షేత్రాలు Vedic Architecture మీద ఆధారపడి వుంటాయి. యివి మన శరీరంలోని "షఠ్ చక్రాలను" ప్రభావితం చేస్తాయి.


 *3. ఆభరణాలతో దర్శనం* 🚩

ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు… బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని.


 *4. కొబ్బరి కాయ* 🚩

ఇది "స్వచ్ఛత"కు గుర్తు. పై 'టెంక మన 'అహంకారాన్ని'… దాన్ని పగలగొడితే వచ్చే 'కొబ్బరి' మన 'కల్మషం లేని మనసును'… అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం.


 *5.మంత్రాలు* 🚩

ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే 96.. 26.. అలా ఒక పధ్ధతిలో అమరుస్తాం.. అంటే మనకి తెలియకుండానే Neuronsని ఆక్టివేట్ చేసి డేటాని దాస్తున్నాం… అదే విధంగా మంత్రోచ్ఛారణలు అక్షర నియమంతో ఒక లయను కల్గి Neuronలను ఉత్తేజపరువస్తాయి.


*6. గర్భగుడి* 🚩

గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు.


*7. అభిషేకం* 🚩

విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి… వాటికి పాలు, తేనె వంటి వాటితో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. అంతేగాని సినీ కటౌట్ లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం.


*8. హారతి* 🚩

పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి …హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి… దీనికి ఆయుర్వేద పరిభాషలో స్వేదకర్మ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు.


*9. తీర్థం* 🚩

ఇందులో పచ్చ కర్పూరం, తులసి, లవంగాలు ఇలా ఎన్నో పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థంగా ఇస్తారు.


*10. మడి* 🚩

తడిబట్టలకి ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది. అందుకే మడి.!


*సేకరణ*