*🙏🙏మాఘ మాసం ప్రారంభం సందర్భంగా... 🙏🙏*
*🌺 మాఘ స్నానం విశిష్టత🌺*
*మాఘ మాసం మహత్మ్యం*
హిందూ సంప్రదాయాల్లో ప్రతి నెల కూడా పవిత్రమైందే. ప్రతి మాసానికి ఓ విశిష్టత ఉంది. చాంద్రమానం ప్రకారం పదకొండవ మాసమైన మాఘమాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యం ఉంటుందో మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యం ఉంటుంది.
ఈ నెలలో పరమేశ్వరుడు లింగ రూపం ధరించాడని పౌరాణిక గాధ. అంతేకాకుండా, చదువుల తల్లి సరస్వతి జన్మించినంది కూడా వసంత పంచమి అయిన మాఘ మాసంలోనేని నమ్ముతారు. సూర్యభగవానుడు తన రథంపై సంచారానికి బయలుదేరుతాడని కూడా విశ్విసిస్తారు. మాఘ మాసం పుణ్యస్నానాలకు పెట్టింది పేరు.
ఈ మాసంలో మకర లగ్నంలో సూర్యభగవానుడు ఉండే సమయంలో చేసే స్నానాలకు విశిష్టత ఉది. ఈ జలమంతా హరి పరిపూర్ణుడై ఉంటాడని, ఆ విధంగా విష్ణుమూర్తి దయకు పాత్రులవుతామని చెబుతారు. ఈ మాసమంతా తెల్లవారు జామున లేచి స్నానం ఆచరించడమనేది నిత్య కృత్యమంటారు.
*మాఘ శుక్ల త్రయోదశి నుంచీ మూడు రోజులు ' మాఘీ ' అంటారు.. కనీసము ఆ మూడురోజులయినా నదీ/ సముద్ర స్నానము చేయాలి.*
*మాఘ స్నానమున నియమములు*
స్నానం చేయకుండా అగ్ని దగ్గర కూర్చోరాదు. స్నానం చేయకుండా అగ్ని సేవనము తగదు. హోమము కొరకు వహ్నిని సేవించాలేకానీ శీతము కొరకు వద్దు.
ప్రతి రోజు చక్కెర తో కూడిన నువ్వులను దానము చేయాలి. మూడు భాగములు నువ్వులు , ఒక భాగము చక్కెర ఉండాలి.
వ్రతమందున్నవాడు నెలమొత్తము అభ్యంగనస్నానము లేకుండా గడపాలి. వహ్నిహోమము చేసి ఏకాశనుడు కావాలి. భూశయ్య , బ్రహ్మచర్యము వీని యందు శక్తుడైనవాడు స్నానం చేయాలి.
అశక్తుడు అంతట స్వేచ్చగా ఉండొచ్చు. అట్లాగే తిలల స్నానము. తిలలు ( నువ్వులు ) వంటికి రాచుకోవడము , తిల హోమము , తిలతర్పణము , తిలభోజనము , తిలదానము.--ఈ ఆరు రకముల తిలలు పాప నాశకములు.
స్నానము తర్వాత కట్టెవలె మౌనము గానుండి నమస్కరించి పురుషోత్తముని పూజించాలి.
*దానములు*
నూనె , ఉసిరికాయలు వీటిని ప్రతిరోజు తీర్థమందు ఇవ్వాలి. బ్రాహ్మణుల సేవనము కొరకు అగ్నిని ప్రజ్వలింపజేయాలి. భోజనాలు తృప్తి వరకూ ఏర్పాటు చేయాలి.
వస్త్ర భూషణములతో అలంకరించి ద్విజ దంపతులను భుజింపజేయాలి. కంబలము , జింక చర్మము , రత్నములు, వివిధ వస్త్రములు , రవికలు , కప్పుకొనుటకు వస్త్రాలు ఇవ్వాలి.
చెప్పులు గుల్మ మోచకములు మరియు పాపమోచకములు కాబట్టి వానిని ఇవ్వాలి.
శక్తి కొద్దీ అన్నదానము చేయాలి. వేదవిద్వాంసునకు గుంజెత్తు అయినా బంగారమివ్వాలి. మాఘమాసాంతమందు షడ్రస భోజనమాచరించాలి.
నిజానికి ప్రాతఃస్నానము పుష్య మాస శుక్ల పక్ష ఏకాదశిన మొదలు పెట్టి మాఘ శుక్ల ద్వాదశిన గానీ , పౌర్ణమి యందు గానీ సమాప్తి చేయాలి. రోజు భూమిపై పరుండాలి ( మంచము వదలి ) నెలరోజులు మితాహారుడై , లేదా నిరాహారుడై త్రికాలములయందు స్నానము చేసి , భోగములను వదలి , జితేంద్రియుడై త్రికాలాలలోను విష్ణువును అర్చించాలి.
*దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణోః తోషణాయ చ*
*ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం ॥*
*మకరస్థే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ*
*స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భవ ॥*
ప్రతి రోజు సూర్యార్ఘ్యమివ్వాలి.
మాఘస్నానాలు సకల పాపాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం. మాఘస్నాన మహాత్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది.
మృకండుముని మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం. కల్యాణ కారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం.
*మాఘస్నాయీ వరారోహు దుర్గతిం వైవ పశ్యతి |*
*తన్నాస్తి పాతకం యత్తు మాఘస్నానం న శోధయేత్ |*
*మారిన అగ్ని ప్రవేశాదధికం మాఘస్నానం న శోధయేత్ |*
*జీవితా భుజ్యతే దుఃఖం మృతేన బహుళం సుఖమ్ |*
*ఏతస్మాత్కారణేద్భద్రే మాఘస్నానం విశిష్యతే*
మాఘ స్నానానికి ఒక ప్రత్యేకత ఉంది. చాలామంది మాఘమాసం కోసం ఎదురుచూస్తుంటారు. దీనికి కారణం ఈ మాఘస్నానాల వెనుక ఉన్న ప్రత్యేకత, ప్రయోజనాలే. మాఘమాసం స్నానానికి ప్రసిద్ది. మాఘస్నానం ఇహపరదాయకం.
సూర్యుడు ఉదయించే సమయంలో స్నానం చేస్తే మహాపాతకాలు నశిస్తాయని కమలాకర భట్టు
రచించిన నిర్ణయ సింధులో చెప్పారు.