15, మార్చి 2022, మంగళవారం

కవిత్వమునకు ప్రాధమిక లక్షణం.

 సౌందర్యాన్ని లయాకత్మకంగా సృష్టించడం,   అర్థ గాంభీర్యాన్ని కలిగియున్న వాక్యాల కూర్పు కవిత్వం అవుతుంది. నిగూఢతను కలిగి, సాధారణం వాక్యానికి భిన్నంగా ఉండి చదవగానే మనసును రంజింపజేసి, ఆలోచింపజేసే రచనను కవిత్వం అనవచ్చు. 


కవిత్వం అను పదం,ఆంగ్లం లోని ""ఫ్రీవర్స్"" పదమునకు సమానార్ధకంగా వచన కవిత పదము ప్రయోగించబడుతోంది. తెలుగు కవిత్వంలో అనాదిగా వస్తున్న పద్యకవిత్వాన్ని ఆస్వాదించలేకపోతున్న కొంతమందికి సాహిత్యం పై అభిమానం,గౌరవం కలిగించే విధంగా ఛందస్సు లేని వ్యావహారిక భాషా పదజాలాన్ని ఉపయోగించి భాషపై పట్టు సడలకుండా రాసే అర్ధగాంభీర్య రచనలే వచన కవిత్వం అని గ్రహించవచ్చు.

      రచనలు చేసేవారు భాషపై అధికారం కలిగి ఉండి,

అవగాహన తో పదప్రయోగ కౌశలం,పదబంధ నిర్మాణంలోని నేర్పు, వాక్యవిన్యాసంలోని ప్రావీణ్యత

అనేవి కలిసి "శైలి""  గా రూపొందుతాయి.రచనోద్దేశాన్ని,సమర్థవంతంగా నిర్వహించే రచనా విధానం అంటే ఉత్తమమైన శైలిగానే పేర్కొనవచ్చు. రచనలో భాషను వాడుకుని

శక్తి,నైపుణ్యాన్ని ప్రత్యేకతను " శైలి"" గా చెప్పవచ్చు. 

      ఆధునిక   వచన శైలిలో పదాల కూర్పు ఎంత  నిరాడంబరంగా, సంగ్రహంగా ఉంటే శైలి అంత గంభీరంగా, ప్రసన్నంగా సూక్ష్మగ్రాహ్యంగా ఉంటుంది. 

రచనల్ని అంశాలను పాఠకులు గ్రహించడానికి,

అనుభవించడానికి,ఎక్కువ అవకాశం ఉంటుంది. సరళ శైలి ఆధునిక వచన రచనకు అనుకూలమైనది.

దీర్ఘసమాసరచనతో కూడిన పదగుంఫన శైలి ఆమోదయోగ్యంకాదు...

సామాజిక చైతన్యాన్ని రగిలించే కవితా వస్తు నిర్మాణం వచన కవితకు ప్రత్యేకం. అదేవిధంగా 

భావుక ప్రాధాన్యత కలిగి ఉండాలి. ఆకర్షణీయమైన 

అంత్యప్రాసలు వచన కవితకు అలంకారం కావాలి. 

నిరాడంబరం,అనవసర పద ప్రయోగం చేయకుండా 

జనజీవితంలోని అలంకారాలకు ప్రాధాన్యం ఇవ్వడం వచన కవిత్వమునకు ప్రాధమిక లక్షణం.

        కవి భావుకతకు,భావ ప్రకటనకు స్వేచ్ఛకు 

ఆటంకం లేకుండా సర్దుబ�

మానసిక ఒత్తిడి

 *నా సబ్జెక్టులో మంచి రిజల్ట్ రావాలని Subject Teacher.....*


*మా పాఠశాల ఫలితాలు 100% రావాలని Headmaster......*


*మా జిల్లా అగ్రశ్రేణిలో ఉండాలని DEO ........*


*రాష్ట్ర ఫలితాలు ఢంకా* *భజాయించాలని GOVT.*

*తలమునకలౌతుంటే,*


*నాకేం అవసరం లేదు అన్నట్లు.*

*చచ్చినట్టు టీచర్ రే* *చూచుకుంటాడు అన్నట్లు*

*STUDENT హాయిగా ఉన్నాడు*


*పరీక్షలు ఎలా రాయాలని విద్యార్థులు భయపడి, అనారోగ్యాల పాలై, ఒత్తిడి కి గురి అయ్యే రోజులు పోయాయి.*


*ఈ పరీక్ష నాకే అన్నట్టు గా*

*ఉపాధ్యాయులు భయపడిపోయే రోజులు వచ్చాయి .*


*మనగూర్చి ఆలోచించే వారున్నంతకాలం మనకు రక్షణే*


*సాగరసంగమం సినిమాలో  బావిమీద డ్యాన్స్ చేస్తుంటే కమలహసన్ కన్నా ప్రేక్షకులే ఎక్కువగా భయపడ్డారట.*


*ఏది ఏమైనా పాత రోజుల్లో టీచర్ కు లేని.., ప్రస్తుతం టీచర్కు వున్న మరియు రోజు రోజుకు పెరుగుతున్న ఒకే ఒక భయంకర ఆరోగ్య సమస్య*


*"మానసిక ఒత్తిడి"*

Hindu

 *The Govt of India has abolished "The Roshni Act" of Jammu & Kashmir!*


*Imagine that till date, your TOI & The Indian Express, and the entire Leftist controlled media have never told us about "The Roshni Act"!*


*Now because of the power of Facebook and WhatsApp you will know, understand what was done by Farooq Abdullah and Mufti Muhamed Syed, Gulam Nabi Azad and Kashmiri bureaucrats!*


*This "Roshni Act" was a conspiracy,  made by Farooq Abdullah, to legally give away to the Muslims of Kashmir, the houses, shops, gardens and fields of the Hindus who had fled Kashmir in 1990*


 *All the Hindus who fled Kashmir in the 1990s were not killed by Pakistani Muslims, but by their own Kashmiri neighbours, with whom they used to eat breakfast and lunch together, celebrate festivals together, consume tea together, for generations together!*


*After that, when the entire Kashmir valley became empty of Hindus, then the Muslims, with the help of the bureaucracy and Farooq Abdullah, petitioned that some rules be framed so that these houses, shops, lands, fields and barns of Hindus be given to the Muslims!*


*So the Farooq Abdullah as the Chief Mnister of Jammu & Kashmir, signed "The Roshni Act" and through this "Roshni Act", the land, farm, , house or shop of any Hindu became that of a Muslim for just ₹ 101 (USD 1.30)!*



*The trick used was as follows:*


*Since  three hundred thousand Hindus were slaughtered, raped and thrown out of the Kashmir Valley  over 6 months in 1990, with their bag and baggage and left everything else behind in Kashmir like all immovable properties like houses, shops , offices and building buildings and farms!*


*They could not pay the Electricity bill, due to the fear of death on returning to the Kashmir Valley to their homes and so the electricity connections of their fields or shops or houses were first disconnected by the Govt of J&K because of non payment of dues!*


*It was omitted in the disconnection orders that the Hindus who stayed around the houses of the Muslims, are no longer in Kashmir!*


*Due to disconnection of the electricity meters, there was darkness around these properties, which was a danger to the neighbouring Muslims!*


*That is why it was necessary to light such properties!*


*In this way,  the fabric of "The Roshni Act" was woven by Farooq, Omar and supported by other CMs like Mehbooba Mufti and the Congress swines!*


*Then Farooq Abdullah got The Roshni ( Light) Act passed by the State Assembly!*


*Through this Act, any Muslim could apply in his name to get an electricity connection for the farm, farm house or shop of that Hindu by paying only ₹ 101 fee!*


*In this way, first the electricity bill was generated in the name of the applying Muslim, and after that in a few years the full ownership of the house, shop or farm of the Hindu was given to that Muslim!*


*In this way, by this "Roshni ( Light ) Act", Chief Minister Farooq Abdullah and all the swines mentioned above gave the valuable properties of 300,000 Hindus of the Kashmir Valley to the Muslims for just Rs 101. (Today's USD 1.30 )!*


*And the most surprising thing is that the Left media of India never discussed this "Roshni Act" in the last 30 years, and so today by the power of the Social Media I came to know about it!*


*By the way, the same was done in Europe with the wealth of the massacred Jews by the Nazis and the neighbours of the Jews!*


*Your duty is to make all Indians aware of this information by sharing this news so that Farooq, Mehbooba Mufti and Ghulam Nabi Azad and the Kashmiri bureaucrats are made to stand trial and are put to death for the killing of 10,000 Hindus and the systematic driving out of 300,000 Kashmiri Hindus from their Motherland!!*


The Hindu  👍🕉️🌹

ఎంత అదృష్టమో

 ఎంత అదృష్టమో!


     "ఆహా!  మీరు ఎంత అదృష్ట వంతులయ్యా! ధర్మరాజా!" అన్నాడు  నారద మహర్షి. 

 ఇంతకీ ఏమిటి ఆ  అదృష్టం?


జలజాత ప్రభవాదులున్ మనములో చర్చించి  భాషావళిన్ 


పలుకన్ లేని జనార్దనాహ్వయ పరబ్రహ్మంబు మీ యింటిలో 


చెలియై మేన మరందియై  సచివుడై చిత్త ప్రియుండై మహా 


ఫల సంధాయకుడై చరించుటలు మీ భాగ్యంబు రాజోత్తమా!


 (ఆంధ్ర మహా భాగవతం- 

- బమ్మెర పోతన)


  'శ్రీకృష్ణుడు సామాన్యుడా?

 వర్ణించటానికి మాటలకూ

ఊహించటానికి మనస్సుకూ  అందని వాడు. 

 'కృష్ణుడు' అనే పేరుతో  ఆవిర్భవించిన  ఆది దేవుడు.  

ఆ పరబ్రహ్మ తత్త్వమే  ఈ రూపంతో దిగి వచ్చింది.  

"యతో వాచో నివర్తన్తే అప్రాప్య మనసా సహ.."

అన్న ఉపనిషత్సూక్తికి ఆలంబనం ఈ స్వామి. 

సత్యమూ, జ్ఞానమూ, అనంతమూ అయిన ఆ పరబ్రహ్మే   కృష్ణుడుగా  అవతరించాడు.

సత్యము- అంటే  ఎప్పుడూ ఉండేది.  భూత భవిష్య ద్వర్తమానాలు అనే తేడా లేకుండా అన్ని కాలాల లోనూ ఉండే  అసలు సిసలు తత్త్వమే సత్యం.

అలాంటి సత్య స్వరూపుడు  కృష్ణుడు.  

ప్రతి జీవుడూ  తప్పక తెలుసుకో వలసిన 'జ్ఞానం' అతడే. 

అంతటి వాడు మీ ఇంటిలో  మీకు ఎంత సన్నిహితుడుగా ఉన్నాడు!

 మీకు స్నేహితుడుగా మెలగుతున్నాడు.   బావగా మీతో  బంధుత్వం పాటిస్తూ మీకు ఆనందం కలిగిస్తున్నాడు.    మీకు మంత్రిగా ఉంటూ మీ పనులన్నీ  సక్రమంగా, సార్థకంగా  సాగటానికి దోహదం చేస్తున్నాడు.  

మీ హృదయాలకు ఎంతో చేరువై,   మీకు ప్రీతిపాత్రుడుగా ఉన్నాడు అతడు.  అన్నింటినీ మించి  మోక్ష  సామ్రాజ్యాన్ని కరతలామలకం చేసి,  మీకు గొప్ప  ఫలాన్ని కట్టబెట్టగల ముకుందుడు ఆ స్వామి.   అంతటివాడు  మీకు ఇంత దగ్గరివాడై  మెలగటం  మీ అదృష్టం కదా! " అన్నాడు  నారద మహర్షి. 


   అంతటి వాడు పాండవులకు ఇంతటి సన్నిహితుడై  ఎందుకు ఉన్నాడు ?  

ఏమిటి  పాండవులు చేసిన పుణ్యం?

అని ఆలోచిస్తే,  ఒకే ఒక్క కారణం కనిపిస్తుంది. 

సత్య ధర్మాలకు కట్టుబడి ఉండటం పాండవుల స్వభావం.  కష్టమైనా  నష్టమైనా  భరిస్తూ, ధర్మ మార్గాన్ని మాత్రం వదలని దీక్షా దక్షులు పాండవులు. 


వాసుదేవుడు పాండవ పక్షపాతి.   కాదు కాదు.

ధర్మ పక్షపాతి " అని తమ నాటకాలు పలికించారు  తిరుపతి వేంకట కవులు.  


"యతో ధర్మో యత స్సత్యం 

యతో హ్రీ రార్జవం యతఃl

 తతో భవతి గోవిందః 

యతః కృష్ణ స్తతో జయఃll"

(సత్యమూ ధర్మమూ కూడని పనులకు వెనుకంజ వేసే స్వభావమూ మనసూ మాటలూ  చేతలూ ఒకే విధంగా ఉండటం అనే స్వభావం   ఉన్నచోట 

ఆ వ్యక్తులకు అండగా  ఉంటాడు శ్రీకృష్ణుడు.  

వారిని గెలిపించే విజయ సారథి అవుతాడు  శ్రీకృష్ణుడు.

  

   అర్జునుడి రథానికే కాదు, 

పాండవుల జీవిత రథాలకూ  సారథి శ్రీకృష్ణుడే. 


కారణం...?

పాండవులు అవకాశ వాదులవలె  సుఖ సన్నివేశాలు పట్టుకుని వేళ్ళాడే  వాళ్ళు కాదు. 

ధర్మమే ఊపిరిగా ఉన్నవారు పాండవులు. 


కనుక వారి "భక్తికి" మెచ్చి 

వారి దగ్గరే ఎప్పుడూ ఉన్నాడు శ్రీకృష్ణుడు. 


పరికింపగ పరమాత్ముడె 

పరమాప్తుడు జగతిలోని 

                 ప్రాణుల కెల్లన్

వరదుండగు  ఆతనిపై 

పరమంబగు  ప్రేమ కాదె 

                  భక్తి యనంగా.

                 (-స్వీయం)


నమస్సులతో 


మీ 


మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి.

ఈ ప్రశ్నకు సమాధానం

 శ్రీ సీతారామాభ్యోనమః. శ్రీ హనుమతే నమః


ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం కొంచెం ఇబ్బందే.


అసలు ప్రశ్నకు సమాధానం ఇచ్చే ముందు శ్రీ హనుమ జన్మ ఉద్దేశ్యం ఏంటో చూద్దాం. అలాగే ఆయన అవతరించిన అపూర్వమైన విధానం కూడా చూద్దాం.


ఆయనను .. మారుతాత్మజుడు(వాయు నందనుడు) రుద్రవీర్య సంభవుడు, కేసరీ నందనుడు..ఇలా కదా పిలుస్తాం. అంటే శ్రీరామచంద్రమూర్తి భూమి మీద చేయవలసిన కార్యంలో హనుమకు వున్న ప్రాముఖ్యత కు అనుగుణంగా..వాయుదేవుడు, పరమశివుడు..తమ తమ శక్తులు ఇస్తే, కపి రూపం కావాలి కాబట్టి.. కేసరి,అంజనాదేవి ల సహాయంతో భూమి మీదకు వచ్చాడు ఆ అప్రమేయ పరాక్రముడు. పరమశివుడే, శ్రీరాముల వారి మీద వున్న పరమ భక్తితో , ఆంజనేయస్వామి గా వచ్చాడంటారు కూడా కదా.


సరే. మనకు వాల్మీకి మహర్షి రామాయణంలో కిష్కింధ కాండలో మొదటి సారి కనపడతారు..శ్రీ హనుమ. అనన్యసామాన్యమైన కార్యాలు చేస్తాడు..రావణ వధ జరిగే వరకు. ఆ తర్వాత రామానుగ్రహం చేత, ఆయన ఆజ్ఞ తీసుకొని,కలియుగాంతం వరకు వుంటానని వుండి పోతాడు. అదికూడా తపస్సు చేసుకుంటూ. మహాభారతంలో భీమసేనుడికి కూడా కనప డేది..హిమాలయాలలో కదా. అవతార ఉద్దేశ్యం అయిపో యింది కనుక ఆయన ఇంకా ఎక్కడా కనపడడు.


మహానుభావులు,తపస్సు చేసుకునేవారు ..ఇలా చాలా మందికి దర్శనం ఇచ్చాడు అంటారు. నా బోటి సామాన్యులకు కష్టకాలంలో ఆదుకుంటో వుంటాడు.


మరి వివాహం ఎప్పుడు అయింది స్వామికి. పరాశర సంహిత, ఇంకా కొన్ని సంహితలలో ఉందంటారు. దానిని సహాయంగా తీసుకొని మన తెలుగునాట చాలా దేవాలయాలు కూడా కట్టారు. ఈ మధ్యకాలంలో రాసిన సుప్రభాతంలో వుంటుంది "సువర్చల" ప్రస్తావన. కానీ హనుమ అష్టోత్తరంలో కానీ సహస్రనామాల్లో కానీ మనకు వివాహం విషయం కానరాదు. కనీసం వెయ్యి ఎనిమిది పేర్ల లో .... "సువర్చలా ప్రాణనాధాయ నమ: " అని వుండాలి కదా! అదే నాకు ..ఈ ప్రస్తావన ను ఆనాటి పెద్దలే నమ్మ లేదేమో అని అనిపిస్తుంది.


ఇకపోతే ఇంకొక రకమైన లెక్క కూడా ఉంది. అది నాలుగు యుగాలు అయిపోయిన తర్వాత మళ్లీ సృష్టి మొదలవుతుందని అప్పుడు ఈ నాలుగు యుగాలు పునరావృతం అవుతాయని చెప్తారు. అంటే మళ్లీ శ్రీరాముడు శ్రీకృష్ణుడు వస్తారని. అలా వచ్చిన ఒక యుగంలో హనుమంతుల వారికి వివాహం అయిందని ఒక వర్గం ప్రజలు చెప్తారు. దాని ఆధారంగానే హనుమంతుల వారికి సువర్చలాదేవికి వివాహం అయిందని చెప్పి చెప్తారు. ఇంకా చెప్పాలంటే దేశంలో యింకో రాష్ట్రంలో ఎక్కడా భార్యతో కూడి వున్న హనుమ దేవాలయాలు చూడలేదు.

కూర్చునే సమయంలో

 🪔 *ॐ卐 _-|¦¦|శుభోదయమ్-సుభాషితమ్|¦¦|-_ ॐ*💎


శ్లో𝕝𝕝 “ఆసనే శయనే దానే భోజనే వస్త్రసంగ్రహే। 

వివాదే చ వివాహే చ క్షుతం సప్తసు శోభనమ్”।


తా𝕝𝕝 *కూర్చునే సమయంలో*..

*పడుకునే సమయంలో*..

*దాన సమయంలో*..

*భోజన సమయంలో*..

*వస్త్ర సంగ్రహ సమయంలో*..

*వివాద సమయంలో*..

*వివాహ సమయంలో*..


ఈ ఏడు సందర్భాల్లో తుమ్ము శుభ సూచకం☝️.....

-----------------------


*||క్షుతఫలం...||* 

[అంటే తుమ్ము గురించి] 

శ్లో|| ఔషధే వాహనారోహే వివాదే శయనే౭శనే!

బీజావాపే నిత్యపాఠే శుభదం సప్తసు క్షుతమ్!!


తా||  *ఔషధసేవ, వాహనారోహణము కలహము, శయనము, భోజనము, విత్తులు  చల్లుట , అధ్యయనము*


ఈ ఏడిటియందు తుమ్ము శుభప్రదమైనది.!!

------------------------


*!!విషఘటికాకర్తవ్యములు!!*

[అంటే!?వర్జ్యములో చేయదగిన పనులు] 


*!!శ్లోకము!!*


స్నానే దానేజపే హోమే వైశ్వదేవే సూరార్చనే!

ప్రాయశ్చిత్తే తథా శ్రాద్ధే విషనాడీ ప్రశశ్యతే!!


*!!తాత్పర్యము!!*


*స్నానము, కన్యాప్రదానముగాక మిగిలినదానములు, జపము, హోమము, వైశ్వదేవము, దేవతార్చనము ప్రాయశ్చిత్తము, శ్రాద్ధము*

వీనికి విషఘడియలు మంచివి ....🙏

ఆయుర్వేద వైద్యం - బొమ్మల కొలువు

 ఆయుర్వేద వైద్యం - బొమ్మల కొలువు


అది మహారాష్ట్రలోని సతారాలో ఉత్తర శ్రీ నటరాజ స్వామి వారి దేవాలయం కడుతున్నప్పటి రోజులు. మహాస్వామి వారు అక్కడే ఉంటూ అన్నీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పరమాచార్య స్వామి వారి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. 


ఒకనాటి ఆదివారం మద్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో 30 సంవత్సరముల వయస్సుగల ఒక యువకుడు మహాస్వామి వారికి సాష్టాంగం నమస్కారం చేసి నుంచున్నాడు. అతని కళ్ళల్లో కన్నీటి ధారను మహాస్వామి వారు చూసి ప్రేమతో “ఏమప్పా! ఎవరు నీవు? ఎక్కడనుండి వచ్చావు? నీ కళ్ళల్లో ఆ తడి ఎందుకు?” అని అడిగారు. అతను ఏమి సమాధానం చెప్పకుండానే పెద్దగా ఏడ్వటం మొదలుపెట్టాడు. చుట్టూ ఉన్న వారు అతన్ని ఊరడించి మహాస్వామి వారిముందు కూర్చోపెట్టారు. 


”ఎక్కడినుండి వచ్చావు అప్పా?” మహాస్వామి అడిగారు. ”పాలక్కాడ్ కేరళ”


వెంటనే మహాస్వామి వారు “పాలక్కాడ్ నుండి ప్రయాసపడి ఇక్కడిదాకా వచ్చావా?” అని అడిగారు. ”అవును పెరియావ మీకొసం అక్కడినుండి వచ్చాను”


“సరే. నీ పేరు ఏంటి?” 


“హరిహర సుబ్రమణియన్”


“భేష్! చాలా మంచి పేరు. మీ తండ్రి గారు ఏం చేస్తుంటారు?” అని అడిగారు. ”మా తండ్రి గారు ఇప్పుడు శరీరంతో లేరు. వారు పాలక్కాడ్ లో ఆయుర్వేద వైద్యుడు. వారి పేరు డా. హరిహర నారాయణన్”


అతను ముగించక ముందే మహాస్వామి వారు కుతూహలంతో ”ఓ నువ్వు పాలక్కాడ్ ఆయుర్వేద వైద్యులు హరిహర నారాయణన్ కుమారుడవా. మంచిది! సరే చెప్పు. అలా అయితే నువ్వు డా. హరిహర రాఘవన్ గారి మనవడివి కదూ! వారందరూ ఆయుర్వేద వైద్యంలో మంచి పేరు సంపాయించారు” అని చెప్తూ వచ్చిన అతణ్ణి పరిశీలనగా చూస్తూ కనుబొమ్మలు పైకెత్తారు.


”అవును పెరియావ” సమాధానమిచ్చాడు ఆ యువకుడు.


మహాస్వామి వారు నవ్వుతూ “భేశ్! ఉన్నతమైన వైద్య వంశం మీది. అది సరే నువ్వు నీ పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోలేదా?” అని అన్నారు. 


”నేను అది చెదవలేదు పెరియావ. మా తండ్రి గారు నన్ను ఆ మార్గంలో పెంచలేదు” కొంచం నిర్లక్ష్యంగా అన్నాడు. ”నువ్వు అలా చెప్పరాదు. మీ తండ్రిగారు చెప్పించలేదా లేదా నీకే దానిపైన శ్రద్ధ లేదా?”


అతను ఏమి చెప్పలేదు. “అంతటి మహా వైద్యుల వంశంలో పుట్టి నువ్వు నేర్చుకునే భాగ్యం పోగొట్టుకున్నావు. సరే ఎంతదాకా చదువుకున్నావు?” అడిగారు మహాస్వామి వారు. ”తొమ్మిది దాకా పెరియావ”


“ఏం మరి చదువుకోవాలని అనిపించలేదా?”


“ఏమో నాకు అప్పుడు అనిపించలేదు. కాని ఇప్పుడు చింతిస్తున్నాను.”


“నీకు వివాహం అయ్యిందా?”


“అయ్యింది పెరియావ. మాకు ఏడు సంవత్సరముల కూతురు ఉంది”


“సరే. ఇప్పుడు ఏమి చేస్తున్నావు?”


అతని కళ్ళల్లో నుండి నీరు జారసాగింది. “నాకు మంచి చదువు లేకపోవడం వల్ల మంచి ఉద్యోగం లభించలేదు పెరియావ. నేను ఒక రైస్ మిల్లులో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాను. నా జీతం ఏడు వందల రూపాయలు. దాంతోనే మా కుటుంబం గడుస్తోంది.”


“ఓహో అలాగా? సరే నీకు మీ పూర్వీకులు స్వంత ఇల్లు వదిలివెళ్ళారా?”


అతను కళ్ళు తుడుచుకుంటూ “మా తాత గారు ఒక ఇంటిని కట్టించారు. నేను ఇక్కడకి రావటం ఆ ఇంటి గురించే పెరియావ. కాలా ఏళ్ళ క్రితం మా అత్తయ్య (నాన్న గారి చెల్లెలు) భర్త చనిపోవడంతో తన ఇద్దరు కూతుళ్లను తీసుకుని పాలక్కాడ్ వచ్చింది. నవరాత్రులప్పుడు మా నాన్న గారు మేము ఉన్న ఇంటిని 25వేల రూపాయలకు తకట్టుపెట్టారు. మా అత్తగారి పిల్లల పెళ్ళిళ్ళు చేసారు. తరువాత మా నాన్న మా అత్త ఇద్దరూ కాలం చేసారు.”


“పెరియావ నా బాధ ఏంటంటే నవరాత్రి సమయంలో లక్ష్మీకారకం అయిన ఇంటిని తాకట్టు పెట్టి పోయారు. ఇప్పుడు ఆ అప్పు 45వేల రూపయలు అయ్యింది. ఇక ఇల్లు నా నుండి వెళ్ళీపోతుంది”

పరమాచార్యస్వామి వారు ధ్యానంలోకి వెళ్ళారు. కొద్దిసేపటి తరువాత చిరువవ్వుతో “సరే ప్రతి నవరాత్రికి నువ్వు ఇంట్లో బొమ్మల కొలువు పెద్తున్నావు కదూ?”


“లేదు పెరియావ. మా తండ్రి గారు ఉన్నప్పుడు పెట్టేవారం. వారు వెళ్ళీపోయిన తరువాత నేను పెట్టడంలేదు.”


మహాస్వామి వారు అడ్డుపడుతూ “పూర్వీకుల గురించి నువ్వు అలా మాట్లాడకూడదు. వారు చాలా గొప్పవారు. నాకు తెలుసు. వారు చాలా మంచి పనులు చేసి వెళ్ళిపోయారు. నువ్వు మనసులో ఏదో పెట్టుకుని తరతరాలుగా వస్తున్న ఆచారాలను వదలరాదు. మరొక్క వారంలో నవరాత్రి మొదలు అవుతుంది. పాలక్కాడ్ లోని మీ ఇంటిలో బొమ్మలు కొలువు పెట్టి దేవిని ఆరాధించు. నీ కష్టాలు తీరి ఊరట లభిస్తుంది.” అని చెప్పి అతనికి ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించి పంపించారు. 


ఇరవై రోజులు గడిచాయి. ఆ రోజు ఆదివారం. సతారా లో మహాస్వామి దర్శనార్థం చాలా మంది భక్తులు వచ్చారు. శ్రీ మఠం పరిచారకుడు ఒకరు ఆ భక్తుల మధ్యలో త్రోవ చేసుకుంటూ ఒక 60 65 సంవత్సరముల వయస్సు ఉన్న ఒక పెద్దాయనను తీసుకుని వచ్చారు. వారు కాషాయ వస్త్రములు ధరించి మెడలో ఎన్నో తుళసి రుద్రాక్ష మాలలు ధరించి ఉన్నారు. వారు మహాస్వామి వారికి సాష్టాంగం చేసి హిందీలో మాట్లాడారు. పరమాచార్య స్వామి వారు కూడా అతనితో హిందీలో మాట్లాడి తమ ఎదురుగా ఉన్న వేదిక పైన కూర్చోమన్నారు.కొద్దిసేపటి తరువాత పాలక్కాడ్ హరిహర సుబ్రమణియన్ వచ్చి మహాస్వామి వారికి నమస్కరించాడు. అతని చేతిలో చిన్న ట్రంకు పెట్టె ఉంది. మహాస్వామి వారు అతణ్ణి అతని చేతిలోని ట్రంకు పెట్టెని చూసారు. ఆ యువకుడు ఆ దబ్బా తెరిచి అందులో ఉన్న పట్టు బట్టలో చుట్తబడియున్న కొన్ని తాళపత్రాలను బయటకు తీసాడు. మహాస్వామి వారు ఏమి తెలియనట్టు ఏంటవి? అన్నాట్టుగా చూసారు. 


అతను అమాయకంగా “మీరు ఈ సంవత్సరం నుండి బొమ్మల కొలువు పెట్టమని నాకు అనుజ్ఞ ఇచ్చారు. నేను బొమ్మల కోసం వెతికితే నాకు ఈ డబ్బా దొరికింది. నేను ఎప్పుడూ దీన్ని చూడలేదు. నేను తెరచి చూసి అందులో ఉన్న భాష అర్థం కాక ఇక్కడకి తెచ్చాను.” 


మహాస్వామి వారు నవ్వుతూ తమ ఎదురుగా కూర్చొని ఉన్న ఆ కాషాయ వస్త్రధారిని చూసి హిందీలో “కొద్దిసేపటి ముందు నువ్వు నన్ను అడిగిన ఆ అపూర్వ వస్తువు వచ్చింది. వచ్చి చూడు” అని అన్నారు. అతను కింద కూర్చుని ఆ తాళ పత్రాలను నిశితంగా పరిశీలించసాగాడు. అతని మొహం ఆనందమయమైంది. వాటిని ఎత్తుకుని తలపై ఉంచుకొని ఆనందంతో గట్టిగా “ఓ పరమ ఆచార్య పురుషా! ఈ అపూర్వ అయుర్వేద గ్రంథం కోసం ఎన్నో ఏళ్ళుగా వెతుకుతున్నాను. నువ్వు ప్రత్యక్ష దైవానివి. అరగంటలో నేను అడిగినదాన్ని నాకు ప్రసాదించావు. నేను ధన్యుణ్ణి.” అని పరమాచార్య స్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేసాడు.


హరిహర సుబ్రమణియన్ ఏమి అర్థం కాక నిలుచుండిపోయాడు. మహాస్వామి వారు దగ్గరకు పిలిచి “ఇతను పండరీపురం నుండి వచ్చిన ఆయుర్వేద సిద్ధాంతి. అరగంట క్రితం తను ఒక అపూర్వ గ్రంథం కోసం వెతుకుతున్నానని నాతో చెప్పాడు. నా మనస్సుకు ఏదో తోచినట్టయ్యి కొద్దిసేపు వేచియుండమని చెప్పాను. తరువాత నువ్వు ఈ ట్రంకు పెట్టెతో వచ్చావు. వారికి ఇవి ఉపయోగపడతాయి. నీ తండ్రిని తాతని తలచుకొని నీ చేతులతో వాటిని ఆయనకు ఇవ్వు” అని ఆజ్ఞాపించారు. 


ఆ యువకుడు వారు చెప్పినట్టే చేసాడు. వాటిని తీసుకుంటున్నప్పుడు ఆ పెద్దమనిషి కళ్ళలో ఆనందభాష్పాలు కారాయి. అతను ఆ యువకుడితో “నీ వల్ల నాకు అపూర్వ గ్రంథము దొరికింది. దానికి వెల నేను కట్టలేను. అలాగని ఈ అపూర్వ సంపదని ఉచితముగా తీసుకోలేను” అని ఒక పళ్ళెంలో యాభైవేల రూపాయలు, పళ్ళు ఉంచి వినయంగా ఇచ్చాడు. ఆ యువకుడు మహాస్వామి వారి వంక చూసాడు. వారు చిరునవ్వుతో తీసుకుమ్మన్నారు. వణుకుతున్న చేతులతో అతను దాన్ని అందుకున్నాడు.


మహాస్వామి వారు దగ్గరకు పిలిచి “నువ్వు నీ పూర్వీకుల గురించి తప్పు గా మాట్లాడినప్పుడు నేను నీకు ఏమి చెప్పానో గుర్తుందా? వారు చాలా గొప్పవారు. చాలా మంచి పనులు చేసారు. చూసావా బొమ్మల కొలువు పెట్టమన్నందుకు నీకు ఇది దొరికింది. ఇంటి అప్పు 45వేలు అన్నావుగా! చంద్రమౌళీశ్వరుడు నిన్ను అనుగ్రహించాడు. పాలక్కాడ్ కి తిరిగి వెళ్ళు. డబ్బు జాగ్రత్త” అని చెప్పి అశీర్వదించి పంపించారు.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


https://t.me/paramacharyavaibhavam


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం