15, మార్చి 2022, మంగళవారం

కవిత్వమునకు ప్రాధమిక లక్షణం.

 సౌందర్యాన్ని లయాకత్మకంగా సృష్టించడం,   అర్థ గాంభీర్యాన్ని కలిగియున్న వాక్యాల కూర్పు కవిత్వం అవుతుంది. నిగూఢతను కలిగి, సాధారణం వాక్యానికి భిన్నంగా ఉండి చదవగానే మనసును రంజింపజేసి, ఆలోచింపజేసే రచనను కవిత్వం అనవచ్చు. 


కవిత్వం అను పదం,ఆంగ్లం లోని ""ఫ్రీవర్స్"" పదమునకు సమానార్ధకంగా వచన కవిత పదము ప్రయోగించబడుతోంది. తెలుగు కవిత్వంలో అనాదిగా వస్తున్న పద్యకవిత్వాన్ని ఆస్వాదించలేకపోతున్న కొంతమందికి సాహిత్యం పై అభిమానం,గౌరవం కలిగించే విధంగా ఛందస్సు లేని వ్యావహారిక భాషా పదజాలాన్ని ఉపయోగించి భాషపై పట్టు సడలకుండా రాసే అర్ధగాంభీర్య రచనలే వచన కవిత్వం అని గ్రహించవచ్చు.

      రచనలు చేసేవారు భాషపై అధికారం కలిగి ఉండి,

అవగాహన తో పదప్రయోగ కౌశలం,పదబంధ నిర్మాణంలోని నేర్పు, వాక్యవిన్యాసంలోని ప్రావీణ్యత

అనేవి కలిసి "శైలి""  గా రూపొందుతాయి.రచనోద్దేశాన్ని,సమర్థవంతంగా నిర్వహించే రచనా విధానం అంటే ఉత్తమమైన శైలిగానే పేర్కొనవచ్చు. రచనలో భాషను వాడుకుని

శక్తి,నైపుణ్యాన్ని ప్రత్యేకతను " శైలి"" గా చెప్పవచ్చు. 

      ఆధునిక   వచన శైలిలో పదాల కూర్పు ఎంత  నిరాడంబరంగా, సంగ్రహంగా ఉంటే శైలి అంత గంభీరంగా, ప్రసన్నంగా సూక్ష్మగ్రాహ్యంగా ఉంటుంది. 

రచనల్ని అంశాలను పాఠకులు గ్రహించడానికి,

అనుభవించడానికి,ఎక్కువ అవకాశం ఉంటుంది. సరళ శైలి ఆధునిక వచన రచనకు అనుకూలమైనది.

దీర్ఘసమాసరచనతో కూడిన పదగుంఫన శైలి ఆమోదయోగ్యంకాదు...

సామాజిక చైతన్యాన్ని రగిలించే కవితా వస్తు నిర్మాణం వచన కవితకు ప్రత్యేకం. అదేవిధంగా 

భావుక ప్రాధాన్యత కలిగి ఉండాలి. ఆకర్షణీయమైన 

అంత్యప్రాసలు వచన కవితకు అలంకారం కావాలి. 

నిరాడంబరం,అనవసర పద ప్రయోగం చేయకుండా 

జనజీవితంలోని అలంకారాలకు ప్రాధాన్యం ఇవ్వడం వచన కవిత్వమునకు ప్రాధమిక లక్షణం.

        కవి భావుకతకు,భావ ప్రకటనకు స్వేచ్ఛకు 

ఆటంకం లేకుండా సర్దుబ�

కామెంట్‌లు లేవు: