26, సెప్టెంబర్ 2023, మంగళవారం

Panchaag

 


Motor coil


 

Sewing machine thread mechanism


 

Cheep electric bike


 

Mechanical engineering


 

Motion of mercury


 

Perpetual motion


 

Clasic steem engine


 

Up coming steem engine


 

Table


 

Pesarattu




 

చింత చిగురు పప్పు



 

Stotram


 

Photo










 

భాగవతశ్రవణం

 భాగవతశ్రవణం!


శుకబ్రహ్మ పరీక్షిత్తు సమక్షంలో ఏడురోజులపాటు భాగవత ప్రవచనమును చేశారు. దాని ఫలితం ఏమిటి? తాను చనిపోతానని బెంగపెట్టుకున్న పరీక్షిత్తు భాగవతమునంతటిని విన్నాడు. విన్న తరువాత ఆయన అన్నాదు – ’ఈ శరీరం చచ్చిపోతుంది – బెంగలేదు’ అన్నాడు. ఆయనకు తెలిసిపోయింది. ఏమిటి? చనిపోవడం అనేది అసలు ఆత్మకు లేదు. మరి చనిపోయేది ఏది? శరీరం. పుణ్యంచేసినా యజ్ఞంచేసినా యాగం చేసినా తపస్సు చేసినా, అశ్వమేధయాగములు చేసినా తాను ధనుస్సు పట్టుకుని దేవతల పక్షాన నిలబడి యుద్ధం చేసినా కల్పములు మారిపోయినా యుగములు మారిపోయినా శరీరము పడకుండా ఉంటుందా? ఉండదు. పడితీరుతుంది. ధ్రువుడంతటివాని శరీరం పడిపోయింది. ఎవని శరీరం అయినా పడిపోవలసిందే! పడిపోయేటటువంటి సత్యము శరీరమునకు చెందినది. అది పడిపోయి తీరుతుంది. కానీ పడదు పడదు అని ఒక అసత్యమునందు నీవు ఒక పూనిక పెట్టుకొని ఉన్నావు. ఈ భ్రాంతిచేత లోకమునందు సంగమము కలిగి చేయకూడని పనులన్నింటిని చెయ్యడానికి పూనుకుంటున్నావు. ఈ శరీరం ఉండిపోతుందన్న భ్రాంతిని పొందుతున్నావు. వెళ్ళవలసింది వెళ్ళిపోయి తీరుతుంది. వెళ్ళనిది ఎప్పుడూ వెళ్ళదు. కాబట్టి ’నేను’ అనబడినది ఆత్మ అయితే దానికి చావులేదు. ’నేను’ అనబడునది శరీరం అయితే అది చచ్చిపోయి తీరుతుంది. కాబట్టి ఉన్న సత్యవస్తువును పట్టుకుంటే మరణ భయంలేదు. అసత్యవస్తువును పట్టుకుంటే మరణ భయం ఉంది. మరణభయంలో సమస్తమయిన అజ్ఞానం ఉంది. అవిద్య ఉంది. భయం ఉంది. ఏది పట్టుకుంటావు? సత్యమును పట్టుకో. 


      అది అంత తేలికయిన విషయం కాదు. భాగవతమును వినినవాడు మాత్రమే సత్యమును తేలికగా పట్టుకొనగలడు. అలా పట్టుకునేటట్లు సత్యవస్తువు గురించి వ్యాసుడు తన భాగవతమునందు ప్రతిపాదన చేశారు. అందుకని ఎవరు భాగవతమును వింటున్నారో చదువుతున్నారో వారికి సత్యముపట్ల పూనిక కలుగుతుంది. ఈశ్వరుని పట్ల పూనిక కలుగుతుంది. ఆయన పాదములు పట్టుకున్నవాళ్ళు ఎలా తరించారో భగవంతుని భక్తుల గాథలు ఆవిష్కరింపబడతాయి.

ఏడురోజులు భాగావతమును వినిన పరీక్షిత్తుకు మరణము రాకుండా పోలేదు. మరణం వచ్చింది. కానీ ఆ ఏడురోజులు పోయిన తరువాత పరమ ధైర్యంతో ఒక మాట అన్నాడు. 


– ’"శరీరమునకు మరణం వచ్చినా నాకు బెంగలేదు. ఇపుడు నేను ఆత్మగా నిలబడిపోతున్నాను"-

    ’ అన్నాడు. ఈ శక్తి కొన్ని కోట్ల జన్మలలో లోపించడం వలన మనం అలా తిరుగుతూనే ఉన్నాము. ’మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషీ’ (సౌందర్యలహరి – 97) అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. అలా మాయలో తిరుగుతూనె ఉన్నాము. ఈ సత్యమును భాగవతం ఆవిష్కరిస్తోంది. అటువంటి భాగవతమును శుకబ్రహ్మ ప్రవచనం చేశారు. పెద్దలు అంటారు –


" నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖాదమృత ద్రవసంయుతం!

పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః!!’

భాగవతమును వినేవాళ్ళు ’భాగవతమును నేను వింటున్నాను” అని ఎప్పుడూ వినకూడదు. ’పిబత భాగవతం’ – భాగవతమును తాగేసెయ్యి. కానీ ఇదెలా సాధ్యం? భాగవతమును తాగడం ఎలా కుదురుతుంది? తాగడమును నోరు అనబడే ఇంద్రియం చెయ్యాలి. వినడం అనబడే దానిని చెవి అనే ఇంద్రియం చెయ్యాలి.కాని చెవి అనే ఇంద్రియానికి ఒక లక్షణం ఉంది. నోరు తాగుతున్నప్పుడు మనస్సు ఎక్కడో తిరుగుతూ ఉన్నదనుకోండి – అయినా నోరు ఆ పదార్థమును తీసుకొని కడుపులోకి పంపించివేస్తుంది. ఒకవేళ ఆ పాలలో ఒక చీమ వున్నా నోరు పుచ్చుకోను అనదు. పుచ్చేసుకుంటుంది. తాగేసే పదార్థంలొ సాధారణంగా మీరు తీసిపారేసేది ఏదీ ఉండదు. భాగవతము కూదా అటువంటిదే. దీనిలో తీసిపారవేయవలసినది ఏదీ ఉండదు. భాగవతము నందు ఉన్నవాడు ఒక్కడే! భాగవతంలో భగవంతుడు శబ్దరూపముగా వస్తున్నాడు. దానిని నీవు చెవులతో పట్టి తాగేసెయ్యి. విడిచిపెట్టావంటే జారి క్రిందపడిపోతుంది. ఏమిటి దాని గొప్పతనం?


  వేదములనే కల్పవృక్షం ఒకటి ఉన్నది. వేదములను సేవించడం చేత మీకు కావలసిన సమస్తమయిన కోర్కెలను మీరు తీర్చుకోగలరు. అటువంటి వేదములనబడే కల్పవృక్షము శాఖల చిట్టచివర పండు పండింది. వేదముల చివర ఉపనిషత్తులు ఉంటాయి. ఉపనిషత్తులు జ్ఞానమును ప్రబోధము చేస్తాయి. ఉపనిషత్తులనే జ్ఞానమును బోధించే వేదముల చివర ఉన్న శాఖల చివరిభాగములలో పండిన పండు ఉపనిషత్తులచేత ప్రతిపాదింపబడిన పరబ్ర

హ్మస్వరూపము. ఈ పరబ్రహ్మ స్వరూపము ఈవేళ పండుగా పండింది. దీనిని చిలక కొట్టింది. ఎవరా చిలక? శుకబ్రహ్మ. శుకుడు తననోటిద్వారా ప్రవచనం చేశారు. దేనిమీదా అపేక్షలేనటువంటి ఒక మహాపురుషుడు ప్రవచనం చేశారు. అటువంటి శుకబ్రహ్మ నోట్లోంచి వచ్చింది. అందుకని ఆ భాగవతమును తాగేసెయ్యి. ఇది ఈశ్వరుడితో నిండిపోయి ఉంది. భూమియందు నీవు భావుకుడివి అయితే నీవు చేయవలసిన ప్రధాన కర్తవ్యం ఇదే. అందుకని ఈ భాగవతం అంత గొప్పది.

ఇటువంటి భాగవతమును సంస్కృతంలో మహానుభావుడు వ్యాసమహర్షి ద్వాదశ స్కంధములలో ప్రవచనం చేశారు. దానిని ఆంధ్రీకరించినది మహానుభావులు పోతనామాత్యులవారు. పోతనగారిలో మీరు గమనించవలసిన విషయం ఒకటి ఉంది. మనకి ముగ్గురు రాజులు ఉన్నారు.


వారిలో ఒకరు త్యాగరాజు, ఒకరు పోతురాజు, ఒకరు గోపరాజు. వీరి ముగ్గురిపేర్లలో రాచరికం ఉంది. వీరు ముగ్గురూ భగవంతుని సేవించారు. సేవించి ఈ దిక్కుమాలిన రాచరికం వద్దు అని తీసి అవతల పారేశారు. పిమ్మట గోపరాజుగారు సాక్షాత్తుగా రామదాసుగారు అయిపోయారు. త్యాగరాజుగారేమో త్యాగయ్య అయ్యారు. పోతరాజుగారు పోతన్న అయ్యారు. ముగ్గురూ రాచరికాలను తీసి అవతలపారేసి ఈశ్వరుని పాదముల దగ్గర దాస్యమును అభిలషించారు. వీళ్ళు ముగ్గురూ జగత్తును ఏలి భక్తిని పంచిపెట్టేశారు.


పోతనగారికి జీవనాధారంగా కేవలం కొద్ది భూమిమాత్రమే ఉండేది. మనం సాధారణంగా ఒకమాట వింటూ ఉంటాము – ’ఏదోనండి, రామాయణం చదువుకుందాం, భాగవతం చదువుకుందాం అని ఉంటుంది – కానీ ఎక్కడండీ ఆఫీసు, ఇల్లు, ఇంటికి వచ్చిన తరువాత సంసారం – వీటితోనే సరిపోతోంది – భాగవతం పన్నెండు స్కంధములు చదవాలంటే ఎక్కడ జరుగుతుందండీ – కుదరడం లేదు – నాకూ చదవాలని ఉంటుంది’ అంటూ ఉంటారు. మనం పోతనగారి జీవితమును పరిశీలిస్తే ఆయనకు చిన్న పొలం ఉండేది. ఆయన ఏకశిలానగరం ఓరుగల్లుకి దగ్గరలో ఉండేవారు. ఉండి ఆ పొలం దున్నుకొని ఎప్పుడు నాగలిపట్టారో, ఎప్పుడు విత్తనములు చల్లారో, ఎప్పుడు పొలము దున్నారో, ఎప్పుడు మంచెమీద కూర్చున్నారో తెలియదు. త్రికాలములయందు సంధ్యావందనం చేసుకొని ఒకానొకనాటి సాయంకాలం చంద్రోదయం జరుగుతున్న సమయంలో వారు గోదావరినదిలో స్నానం చేసి ఒకసైకతం మీద ధ్యానమగ్నులై అరమోడ్పు నేత్రములతో కూర్చుని ఉన్నారు. అప్పుడు వారికి రామచంద్రమూర్తి సాక్షాత్కారం అయింది. ’పోతనా! నీజన్మ ఉద్ధరించాలని నేను అనుకుంటున్నాను. అందుకని నీవు మహాభాగవతమును ఆంధ్రీకరించు. తెలుగులో వ్రాయి’ అన్నారు. వెంటనే పోతనగారు రామచంద్రమూర్తికి నమస్కరించి అన్నారు – ’అయ్యా మీరు ఆనతిచ్చారు. నేను భాగవతమును వ్రాయడమేమిటి!’


పలికెడిది భాగవతమట

పలికించెడి వాడు రామభద్రుండట నే

బలికిన భవహర మగునట

పలికెద వేరొండు గాథ పలుకగనేలా?


ఎంత వినయముతో చెప్పారో చూడండి! ’నేను భాగవతమును రచించడం ప్రారంభంచేస్తున్నాను. కానీ భాగవతమును రచిస్తున్నవాడు పోతనా! నా వెనకాతల ఉండి దానిని నాచేత పలికిస్తున్నవాడు రామచంద్రమూర్తి. ఎన్నో కోట్ల జన్మలనుంచి పొందిన పాపమును పోగొట్టడానికి నాచేత భాగవతమును రచింపచేశాడు. ఇంకొకగాథ నేను ఎందుకు పలకాలి? అందుచేత ఈశ్వరుడు ఏది పలికిస్తున్నాడో అదే నేను పలుకుతాను” అన్నారు ఎంత గొప్ప మాటయో చూడండి

సంస్కృత ఉపాధ్యాయుడి బాధ.*

 *ఒక సంస్కృత ఉపాధ్యాయుడి బాధ.*


*#SAVE SANSKRIT IN ANDHRAPRADESH* 


*#సంస్కృత భాషను ఆంధ్రప్రదేశ్లో రక్షించండి.*


అందరికీ నమస్కారం. నేను ఒక సంస్కృత ఉపాధ్యాయుడను. 


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రభుత్వంలో ఉండే ఇద్దరు అధికారులు SSC బోర్డు చైర్మన్ దేవానంద రెడ్డి, ఏపీఆర్ APRIE స్కూల్స్ సెక్రెటరీ నరసింహారావు (ఈ ఇద్దరు వాళ్లే) ఇద్దరు అధికారులు  ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో సంస్కృత విద్య ఉండకూడదని, కాంపోజిట్ తెలుగుకు అనుబంధంగా 30 మార్కులకు ఉన్న సంస్కృతాన్ని పూర్తిగా తొలగించేశారు, విద్యాశాఖ మంత్రి గారి చేత చెప్పించారు.  


ఈ అధికారుల దగ్గరికి కొంతమంది సంస్కృత ఉపాధ్యాయులు వెళ్తే, సంస్కృతాన్ని బోధించి ఆకులు కట్టుకునే కాలానికి తీసుకుని వెళ్లాలనుకుంటున్నారా? ఏం లాభం ఈ సంస్కృత విద్య వల్ల అని చెబితే నోరు మూసుకొని రావాల్సి వచ్చింది. ఉర్దూ తీసేస్తే విద్యా వ్యవస్థలో నుంచి ముస్లింస్ అంతా వస్తారు, మా భాషకు అన్యాయం జరుగుతుందని, ఇంగ్లీష్  తీసేస్తే క్రిస్టియన్స్ మిగతా వాళ్ళు కూడా వస్తారు.  


కానీ అందరూ అనుకుంటారు సంస్కృతం హిందువుల భాషని సంస్కృతాన్ని తీసేస్తే ఏ ఒక్క హిందువు స్పందించడు. అసలు సంస్కృతం విద్యా వ్యవస్థలో ఉందనే విషయం కూడా మనలో చాలామందికి తెలియదు, చాలామంది అనుకోవచ్చు సంస్కృతం తీసేసారు కాబట్టి నేను ఈ మెసేజ్ పెడుతున్నానని. నేను ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుతాను నా కుటుంబాన్ని పోషించుకుంటాను, కానీ భాష పైన జరుగుతున్న ఈ దాడిని అడ్డుకోవడానికి ఏ ఒక్క హిందువు, ఏ హిందూ సంఘము ముందుకు రాకపోవడమే బాధాకరమైన విషయం. హిందూ సంస్కృతికి మూలమే సంస్కృత భాష అటువంటి భాష పైన దాడి జరుగుతుంది,

  

దీన్ని అడ్డుకోవడానికి ఎవరూ రారని నాకు తెలుసు. చదివి చదివి మెసేజ్ ని డిలీట్ చేస్తారని తెలుసు. కానీ నా బాధను హిందూ సంఘాల గ్రూపులో చెప్పుకోవాలనిపించి ఈ మెసేజ్ పెడుతున్నారు.  


*జయతు సంస్కృతం, జైహింద్*

Glass bridge


 

ధైర్యం లేకుండా

 🚩🔯🌸🌄⚛🌅🌸🔯🚩

🌸🌼ಬೆಳಗಿನ 🌅 ಸೂಳ್ನುಡಿ🌼🌸


*ನ ಧೈರ್ಯೇಣ ವಿನಾ ಲಕ್ಷ್ಮೀಃ*

*ನ ಶೌರ್ಯೇಣ ವಿನಾ ಜಯಃ |*

*ನ ಜ್ಞಾನೇನ ವಿನಾ ಮೋಕ್ಷೋ*

*ನ ದಾನೇನ ವಿನಾ ಯಶಃ ||*

(ಸಭಾರಂಜನ ಶತಕ)


ಧೈರ್ಯವಿಲ್ಲದೆ ಧನವಿಲ್ಲ. 

ಶೌರ್ಯವಿಲ್ಲದೆ ಜಯವಿಲ್ಲ. 

ಜ್ಞಾನವಿಲ್ಲದೆ ಮೋಕ್ಷ ದೊರೆಯದು. 

ದಾನಮಾಡದೆ ಕೀರ್ತಿ ದೊರೆಯದು.


*🌷🌺🙏ಶುಭದಿನವಾಗಲಿ!🙏🌺🌷*


ధైర్యం లేకుండా లక్ష్మి వరించదు. శౌర్యము లేకుండా విజయం లభించదు. జ్ఞానం లేకుండా మోక్షం పొందలేము. దానం చేయకుండా కీర్తి దొరకదు

ॐ వినాయక చవితి సందేశాలు సందేశం 11/11

 ॐ    వినాయక చవితి సందేశాలు 

        

                        సందేశం 11/11 

గమనిక 


    వినాయక చవితి సందర్భంగా, 

    మొదటి తొమ్మిదిరోజులూ కొన్ని విషయాలు తయారుచేసి పెట్టబడ్డాయి. 

    నిన్న కంచి పరమాచార్య సమీక్ష చూశాం. 

    పద్యాలతో చక్కటి నైవేద్యం దాసరి శ్రీనివాస్ గారు పెట్టింది చూశాక, అది అందఱూ కూడా ఆస్వాదిస్తే బాగుంటుందని, దానిని పెడుతున్నా.  

     


వినాయకునికి పద్యాల నైవేద్యం 

                   - దాసరి శ్రీనివాస్


అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు!

వినాయకచవితి తెలుగువాళ్ళకి ఆహ్లాదకరమైన పండగ. వినాయకుడంటే తెలుగువాళ్ళందరికీ ఒక రకమైన ఆప్యాయత. ఎందుకో మరి! అతని రూపమే చిత్రం! అతని వాహనం మరీ విచిత్రం! ఇష్టమైన పిండివంటలు సరే సరి! మరే దేవుణ్ణైనా మనం గడ్డితో పూజిస్తామా! అతనితో ఎన్ని సరదాలు, మరెన్ని సరాగాలు! ఆ చనువుతోనే కాబోలు నిన్న రాత్రి ఎలక గుఱ్ఱాన్నెక్కి సరాసరి నా కల్లోకి వచ్చేసి పిచ్చాపాటీ మొదలుపెట్టాడా స్వామి!


వినాయకుడు: రేపు వినాయకచవితి గుర్తుందా!


నేను: అయ్యో ఎంత మాట! నాకు గుర్తులేకపోవడమేమిటి, మాకు సెలవు కూడానూ!


వినాయకుడు: అయితే మరి నాకేం నైవేద్యం పెడుతున్నావ్?


నేను: అదీ...మరీ...స్వామీ... మా ఆవిడ ఉండ్రాళ్ళో ఏవో చేస్తానంది. ఆవిడ దయా మీ ప్రాప్తం!


వినాయకుడు: అది కాదోయ్! నువ్వు పెట్టే నైవేద్యమేవిటీ అని అడుగుతున్నా...


నేను: నేనా? ఏంటంటున్నారు స్వామీ?


వినాయకుడు: అదేనయ్యా, నీ బ్లాగులో పండగలకీ పబ్బాలకీ పద్యాలు వేస్తున్నావు కదా! ఆ తెలుగు పద్యాల ప్రసాదం గురించి నేనడుగుతున్నది.


నేను: ఓ, అదా! అయినా మా తెలుగు పద్యాలు మీకు ఆనతాయా అని...


వినాయకుడు: అదేంటయ్యా అలా అంటావ్! అసలు నాకు సంస్కృతశ్లోకాల కన్నా తెలుగు పద్యాలే ప్రీతిపాత్రం తెలుసా!


నేను: అవునా స్వామీ! అదేం?


వినాయకుడు: నన్ను తల్చుకోగానే అందరికీ గుర్తుకొచ్చే సంస్కృత శ్లోకం ఏంటో చెప్పు.


నేను: శుక్లాంబరధరం విష్ణుం...


వినాయకుడు: అవునా! మరి నన్ను తల్చుకోగానే గుర్తుకొచ్చే మీ తెలుగు పద్యం ఏవిటి?


నేను: తోండము నేకదంతమును...


వినాయకుడు: ఊ...పూర్తిగా చదువు.


నేను:

తొండము నేకదంతమును తోరపుబొజ్జయు వామహస్తమున్

మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసముల్

కొండొక గుజ్జురూపమును కోరిన విద్యలకెల్ల నొజ్జయై

యుండెడి పార్వతీతనయ! ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్!


వినాయకుడు: చూసావా! నువ్వు చదివిన ఆ సంస్కృత శ్లోకం నేనుకూడా చాలా కాలంనుంచీ నా గురించే అనుకుంటున్నాను. కానీ కొంతమంది అది నాది కాదు, అసలందులో నాగురించి ఏవిటుందని సందేహం వెలిబుచ్చారు. దాంతో నాక్కూడా అనుమానం వచ్చేసింది, అది నా గురించేనా అని. అదే మీ తెలుగు పద్యం చూడు. స్పష్టంగా, వివరంగా నా గురించి ఎంత చక్కగా చెప్తోందో! అందికే మీ తెలుగు పద్యాలంటే నాకిష్టం!


నేను: బావుంది స్వామీ! మీకు తెలుగు పద్యాలిష్టమని విని చాలా ఆనందంగా ఉంది!


వినాయకుడు: మీ తెలుగు కవులు ఎన్నెన్ని రకాలుగా నన్ను ప్రస్తుతించారు! అవన్నీ గుర్తు చేసుకుంటే నా బొజ్జ నిండిపోతుందనుకో!


నేను: అలాగా!


వినాయకుడు: అవునయ్యా! అతనెవరూ... జిగిబిగి కవిత్వం రాసాడు. ఆ... అల్లసాని పెద్దన. అతను బలే గడుసువాడు సుమా! నా గురించి బలే పద్యాన్ని రాసాడు. ఏదీ ఆ పద్యం ఒక్కసారి చదివి వినిపించూ.


నేను:

అంకము జేరి శైలతనయా స్తనదుగ్ధములాను వేళ బా

ల్యాంక విచేష్ట దొండమున నవ్వలి చన్ గబళింపబోయి యా

వంక గుచంబు గాన కహివల్లభ హారము గాంచి వే మృణా

ళాంకుర శంక నంటెడి గజాస్యుని గొల్తు నభీష్ట సిద్ధికిన్!


వినాయకుడు: తస్సాదియ్యా! కవంటే ఇతనేనయ్యా. నాక్కూడా ఎప్పుడూ రాలేదిలాంటి అల్లరి ఆలోచన! దీనికి మీ విమర్శకులేవో చాలా లోతైన విశ్లేషణలు చేస్తారు. అసలిది నా గురించే కాదనీ ఏదో వేదాంతం చెప్తారు. కానీ నాకవేవీ పట్టవు. నా గురించి అలాటి చమత్కారమైన ఆలోచన చేసాడు చూడూ! అది నాకు బలే బలే అద్భుతంగా అనిపించింది.


నేను: అవును స్వామీ! పెద్దనవలె కృతిసెప్పిన పెద్దనవలె అని అందుకేగా మేం అనుకునేది! అయితే ఇంతకన్నా ముందే కేతన కవి ఇలాంటిదే మరో చిత్రమైన ఆట మీచేత ఆడించాడు స్వామీ!


వినాయకుడు: అవునా! ఎందులో? ఏదీ ఆ పద్యం కూడా వినిపించు మరి.


నేను: ఈ పద్యం దశకుమారచరిత్రములోది. వినండి.

గ్రక్కున నేత్రయుగ్మము కరద్వితయంబున మూసిపట్టి యా

మిక్కిలి కంటికిం దనదు మిక్కిలి హస్తము మాటుసేసి యిం

పెక్కెడు బాలకేళి బరమేశ్వరు చిత్తము పల్లవింపగా

దక్కక ముద్దునం బొలుచు దంతిముఖుం గొలుతుం బ్రసన్నుగాన్!


వినాయకుడు: ఓరి మీ అసాధ్యంగూలా! మీ తెలుగుకవులు భలే వాళ్ళయ్యా! నా చేత ఎన్నెన్ని చిత్రమైన చేతలు చేయించారూ! నా రెండు చేతులతోనూ మా నాన్న రెండు కళ్ళూ మూసేసి, మా నాన్న మూడో కంటిని నా మూడో చేత్తో, "హస్తంతో", అంటే తొండంతో మూసేసానా! ఆ నిప్పుకంటి జోలికి వెళితే నా తొండమేం గానూ!


నేను: పొండి స్వామీ మీరు మరీను! పరమేశ్వరుని చిత్తం చిగురిస్తే, ఆ కన్ను మంటలు కురిపిస్తుందా ముద్దులు కురిపిస్తుంది కానీ.


వినాయకుడు: ఆలా అంటావా! అయితే ఓకే. ఇంతకీ, నన్ను మొట్టమొదట కావ్యంలో ప్రత్యేకంగా స్తుతించిన కవి ఎవరో చెప్పు?


నేను: నన్నెచోడుడు అనుకుంటాను స్వామీ!


వినాయకుడు: ఓహో! అతనే కదూ మా తమ్ముడు పుట్టుకగురించి కుమారసంభవం తెలుగులో రాసిన కవి. ఏదీ అతను రాసిన పద్యం వినిపించు.


నేను: చిత్తం.

తను వసితాంబుదంబు, సితదంతముఖం బచిరాంశు, వాత్మ గ

ర్జన మురుగర్జనంబు, గర సద్రుచి శక్రశరాసనంబునై

చన మదవారివృష్టి హితసస్య సమృద్ధిగ నభ్రవేళ నా

జను గణనాథు గొల్తు ననిశంబు నభీష్టఫల ప్రదాతగాన్!


వినాయకుడు: బావుందయ్యా! నన్ను కాస్తా నల్లనివాణ్ణి చేసేసి వర్షాకాలంతో పోల్చాడే యీ కవి! మరి నేను పుట్టింది వానాకాలంలోనే కదా! ఇంకా ఎవరెవరు ఏం చమత్కారాలు చేసారో త్వరగా వినిపించు.


నేను: కాస్త ప్రౌఢమైన చమత్కారమేదో చేసిన కవి ఒకడున్నాడు స్వామీ. అతను రామరాజభూషణుడు, ఉరఫ్ భట్టుమూర్తి. ఆ పద్యం నాకు సరిగా అర్థం కాలేదు. మీరే వివరించాలి!


వినాయకుడు: ఏవిటి నేనా! ఇప్పుడంత సమయం లేదే. సరే చదువు చూద్దాం.


నేను:

దంతాఘట్టిత రాజతాచల చలద్గౌరీ స్వయంగ్రాహముం

గంతుద్వేషికి గూర్చి శైలజకు దద్గంగాఝరాచాంతి న

త్యంతామోదము మున్నుగా నిడి కుమారాగ్రేసరుండై పితృ

స్వాంతంబు ల్వెలయింపజాలు నిభరాడ్వక్త్రుం బ్రశంసించెదన్!


వినాయకుడు: అబ్బో, యీ భట్టుమూర్తి చాలా ఘటికుడయ్యా! వాక్యాలని అటూ ఇటూ చేసి అన్వయం కష్టం చేసిపారేసాడు! మధ్యలో శ్లేష ఒకటి!

నా తొండంతో ముందు గంగ నీళ్ళన్నీ పీల్చేసి సవతిపోరు లేకుండా మా అమ్మ పార్వతికి ఆనందాన్ని ఇచ్చానట! తర్వాత నా దంతంతో వెండి కొండని ఒక్కసారి కదిలిస్తే, ఆ ఊపుకి, మా తల్లి పార్వతి మా తండ్రి శివదేవుని దగ్గరగా హత్తుకొందిట. ఆ రకంగా తండ్రికి ఆనందాన్ని కలిగించేనట. ఇలా తల్లిదండ్రులిద్దరికీ ఆనందాన్ని చేకూర్చి నేను వాళ్ళ కుమారులలో అగ్రస్థానాన్ని (కుమారస్వామికి అన్ననే కదా!) సంపాదించానట. దానికి నన్ను ప్రశంసిస్తున్నాడోయ్ మీ భట్టుమూర్తి!


నేను: బాగా వివిరించారు స్వామీ! స్వయంగా మీ నోటితో దీని వివరణ వినడం పరమానందంగా ఉంది!


వినాయకుడు: అది సరేగానీ, ఇన్నేసి చమత్కారాలు గుప్పించిన పద్యాలు కాకుండా, వినసొంపుగా హాయిగా మనసుకి హత్తుకొనే పద్యాలు ఎవరూ రాయలేదా?


నేను: ఎందుకు రాయలేదు స్వామీ! అలాటివాటికి పెట్టింది పేరు పోతన, ఆ తర్వాత కొంతవరకూ మొల్ల.


వినాయకుడు: అయితే తొందరగా వినిపించు మరి!


నేను: పోతన తనకి సహజమైన అంత్యప్రాసలతో రాసిన పద్యం ఇదిగో:

ఆదరమొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతా హృదయానురాగ సం

సాదికి దోషభేదికి బ్రసన్నవినోదికి విఘ్నవల్లికా

చ్ఛేదికి మంజువాదికి నశేష జగజ్జననందవేదికిన్

మోదక ఖాదికిన్ సమద మూషికసాదికి సుప్రసాదికిన్!


వినాయకుడు: ఆహా! పోతన పద్యంలో తీయని మకరంద ధార జాలువారుతునే ఉంటుంది. మరి మొల్ల పద్యమో?


నేను: చిత్తం సిద్ధం!


చంద్రఖండ కలాపు జారు వామనరూపు

గలిత చంచలకర్ణు గమల వర్ణు

మోదకోజ్జ్వలబాహు మూషికోత్తమవాహు

భద్రేభవదను సద్భక్తసదను

సన్ముని స్తుతిపాత్రు శైలరాడ్దౌహిత్రు

ననుదినామోదు విద్యాప్రసాదు

బరశువరాభ్యాసు బాశాంకుశోల్లాసు

నురుతరఖ్యాతు నాగోపవీతు


లోకవందిత గుణవంతు నేకదంతు

నతుల హేరంబు సత్కరుణావలంబు

విమల రవికోటితేజు శ్రీవిఘ్నరాజు

బ్రథిత వాక్ప్రౌఢికై యెప్డు ప్రస్తుతింతు!


వినాయకుడు: చాలా బావుంది! సీసంలోని తూగు మరే పద్యానికొస్తుంది! అన్నట్టు సీసమనగానే గుర్తుకొచ్చింది. అసలుసిసలు తెలుగుకవి, మీ శ్రీనాథ కవిసార్వభౌముడు నా గురించేమీ రాయలేదా?


నేను: అయ్యో పొరపాటైపోయింది స్వామీ! మరచిపోయాను. ఇదిగో మీ గురించి అతను రాసిన సీసం!


కలితశుండాదండ గండూషితోన్ముక్త

సప్తసాగర మహాజలధరములు

వప్రక్రియా కేళివశ విశీర్ణ సువర్ణ

మేదినీధర రత్నమేఖలములు

పక్వ జంబూఫల ప్రకటసంభావనా

చుంబిత భూభృత్కదంబకములు

వికట కండూల గండక దేహమండలీ

ఘట్టిత బ్రహ్మాండ కర్పరములు


శాంభవీశంభు లోచనోత్సవ కరములు

వాసవాద్యమృతాశన వందితములు

విఘ్నరాజ మదోల్లాస విభ్రమములు

మించి విఘ్నోపశాంతి గావించు గాత!


వినాయకుడు: అబ్బబ్బా! ఏవి ధారా, ఏవి ధారా! ఇందుకేగా ఇతన్ని ప్రసిద్ధ ధారాధుని అని పిలిచేది. సెభాష్!

అవునూ, నువ్వందరూ పాతకవులనే చెప్తున్నావ్, ఆధునిక కాలంలో నా గురించి పట్టించుకున్న కవే లేడా ఏంటి?


నేను: అయ్యో లేకేం స్వామీ! పైన చెప్పిన కవులందరూ తమ కావ్యాల్లో ఒక పద్యంలో మిమ్మల్ని స్తుతిస్తే, ఏకంగా ఒక పద్య ఖండికనే మీకు సమర్పించిన ఆధునిక కవి ఒకరున్నారు. అతనే, కరుణశ్రీ అలియాస్ జంధ్యాల పాపయ్య శాస్త్రి. తన ఉదయశ్రీలో మీకు "నమస్తే" చెప్పారు.


వినాయకుడు: అవన్నీ వినడానికి ఇప్పుడు నాకు సమయం చాలదు. అవతల మీవాళ్ళందరూ నన్ను ఎన్నెన్ని రూపాల్లో తయారుచేసారో, ఎన్నెన్ని పిండివంటలు చేసారో చూడ్డానికి వాహ్యాళికి వెళ్ళాలి. నువ్వు కూడా తొందరగా నిద్రలేచి పూజ చేసుకోవాలి కదా! మచ్చుకి ఒక్క పద్యం వినిపించు చాలు. ఆనక మిగతావి వింటాను.


నేను: సరే అలాగే స్వామీ! చిత్తగించండి.


ఎలుకగుఱ్ఱము మీద నీరేడు భువనాలు

పరుగెత్తి వచ్చిన పందెకాడు

ముల్లోకముల నేలు ముక్కంటి యింటిలో

పెత్తనమ్మొనరించు పెద్దకొడుకు

"నల్లమామా!" యంచు నారాయణుని పరి

యాచకాలాడు మేనల్లుకుఱ్ఱ

వడకుగుబ్బలి రాచవారిబిడ్డ భవాని

నూఱేండ్లు నోచిన నోముపంట


అమరులందగ్ర తాంబూలమందు మేటి

ఆఱుమోముల జగజెట్టి అన్నగారు

విఘ్నదేవుడు వాహ్యాళి వెడలివచ్చె

ఆంధ్రవిద్యార్థి! లెమ్ము జోహారు లిడగ!


వినాయకుడు: నేను విష్ణుమూర్తిని "నల్ల మామా" అని ఆటపట్టిస్తానా! ఆహా బలే అయిడియా ఇచ్చాడే ఇతను! ఎంతైనా మీ తెలుగుకవులకి సరసం ఎక్కువే సుమీ!

మొత్తానికివాళ పంచభక్ష్య పరమాన్నాలతో విందుభోజనం చేసినట్టుంది! బావుంది నీ పద్య నైవేద్యం!

కాకపోతే ఇన్ని పద్యాలు చూసి నాకొకటే లోటుగా అనిపిస్తోంది.


నేను: లోటా! ఏవిటి స్వామీ?


వినాయకుడు: మీ తెలుగు కవులు ఇందరిగురించి కావ్యాలు రాసి, నా గురించి మాత్రం రాయలేదే అని వెలితిగా అనిపిస్తోంది. మా తమ్ముడు కుమారస్వామి గురించి కూడా వెయ్యేళ్ళ కిందటే ఎవరో రాసారని చెప్పావే, మరి ఇన్నాళ్ళై నా కథని ఎవరూ కావ్యంగా ఎందుకు రాయలేదు?


నేను: అవును స్వామీ! మీరు చెప్పే దాకా నాక్కూడా తట్టలేదు. ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఆశ్చర్యంగానే ఉంది.


వినాయకుడు: పోనీలే. ఇంతమంది రాసిన పద్యాలు చెప్పేవు కదా. సొంతంగా నువ్వొక్క పద్యం నా గురించి యిప్పుడు చెప్పకూడదూ. విని దానితోనే సంతృప్తి పడతాను.


నేను: అయ్యో అంత కన్నా మరో భాగ్యం ఉంటుందా! అవధరించండి!


శ్రీకంఠుని సతి ప్రేమకి

ఆకారమ్మైన సామి! హరుని దయన్ నూ

త్నాకృతి దాల్చిన గజముఖ!

చేకూర్చుము సిద్ధి బుద్ధి స్థిరముగ మాకున్!


నేనిలా పద్యం చదివానో లేదో, అలా అదృశ్యమైపోయాడా గణనాథుడు! నా పద్య ప్రభావమేనో ఏమో! సరే పొద్దున్న యథావిథిగా పూజా కార్యక్రమాలు సాగించి, మా ఆవిడ చేసిన పిండివంటలు స్వామికి నైవేద్యం పెట్టి నేను తిని, ఇదిగో నా నైవేద్యాన్ని మీ ముందు పెట్టాను. ఆరగించండి మరి!


🙏🌹🙏


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం

Landing vertically


 

BMTC bus passes


 

Conservation of energy


 

Multy function wood work machine


 

Ganapatye


 

Electric tips


 

Electricity🔌


 

mechanism


 This mechanism we can see in seeing machine thread movement

Ganesh costing


 

In hyderabad

 అందరికి నమస్కారం🙏

మా కొత్త కార్ లో కూర్చుంటే ఫ్లైట్ లో కూర్చున్నట్లు ఉంటుంది.

మీకు ఎప్పుడు అద్దెకు కార్ కావాలన్న మమ్ములను సంప్రదించగలరు. మా కారును డ్రైవర్ తో సహా అందుబాటులో మీ ప్రయాణార్ధం అందుబాటులో ఉంచగలము.

మరిన్ని వివరములకు,

సంప్రదించగలరు:

తంగిరాల విశ్వనాధ్

8639447717

Chahiye


 

కోరికలు ఏవైననూ

 *అనుష్టుప్*

కీర్తిర్విద్యా వివాహశ్చ

ఐశ్వర్యం వంశ వర్ధనం

అభీష్టోయస్తు తేహిస్యాత్

గణేశోయం ప్రదాస్యతి.,

*భావం*:-- కీర్తి, విద్య, వివాహము, ఐశ్వర్యము, వంశాభివృధ్ధి వంటి కోరికలు ఏవైననూ విఘ్నేశ్వరుడు తీర్చును.

*** *కొంపెల్ల వేంకట సత్య సుబ్బరాయశాస్త్రి*

హుండీలో

 హుండీలో వేసేది మొక్కు. పూజారికి ఇచ్చేది దక్షిణ. మొక్కిన మొక్కు రూపాయి అయినా సరే హుండీలో వేయడం ధర్మం అవుతుంది

 భక్తునికి దైవానికి అనుసంధానం చేసే అర్చకునికి దక్షిణ ఇవ్వడం సహేతుకం. ధర్మాదాయ శాఖ అర్చకులు అయితే వారికి కూడా జీతాలు వస్తాయి. అయినా..తోచింది ఇచ్చి ఆశీర్వాదం పొందవచ్చు. ఇక యాచకులు. వీరు ఎంత వెనకేసుకున్నారనేది ఆలోచించ కూడదు. కృష్ణార్పణగా తృణమో ఫణమో ఇవ్వవచ్చు. చేసే ప్రతి పనిలో ధర్మ దృష్టి ఉండాలి. ఇచ్చేవాడిని నేనే అనే అహంకారం కూడదు. కర్తుత్వము కూడదు. అందరికీ ఇచ్చేవాడు ఆ ఆది నారాయణుడే. ఆయనిది ఆయనకే, ఆయన చెప్పిన వారికే ఇస్తున్నాం. కాలాన్ని బట్టి తనకు మాలిన ధర్మం చేయకుండా, దర్మార్జనలో కొంత భాగం దైవ సేవకు, దీనాజనులను ఆదుకునేందుకు వెచ్చించాలి. అదే మాధవ సేవ. హరి ఓం/అంతరంగ తరంగం/AVR 🙏

 .

ఐశ్వర్యములను ఇచ్చేవాడు

 *అనుష్టుప్*

శుభైశ్వర్య ప్రదాతారం

దుస్సంకట వినాశకం

సర్వాభీష్టకరం వందే

శ్రీ అభీష్ట గణాధిపం.

*భావం*:-- శుభకరమైన ఐశ్వర్యములను ఇచ్చేవాడు, బలమైన కష్టము లను తొలగించేవాడు, అన్ని కోరికలనూ తీర్చేవాడు అయిన శ్రీ అభీష్ట గణపతి కి నమస్కారములు.

*సూచన*:-- ఈ జగత్తు లో శుభాశుభములు అన్నియునూ ఈశ్వరుడే ఇచ్చును,అంటే అన్నియునూ ఐశ్వర్యములే, అందులో శుభైశ్వర్యకరునికి ఈ సందర్భంగా నమస్కారములు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

కల్యాణ కారకుడు

 *అనుష్టుప్*

కల్యాణ కారకం దేవం

సుబ్రహ్మణ్యం సదాశుభం

సంతాన దాయకం శైవం

కార్తికేయం నమామ్యహం.

*భావం*:-- కల్యాణ కారకుడు,సుబ్రహ్మణ్యుడు, సదా శుభుడు, సంతానము నిచ్చేవాడు  దేవతామూర్తి, శైవుడు(శివపుత్రుడు) అయిన కార్తికేయునకు నమస్కారములు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

స్పాండిలైటిస్ మరియు సయాటిక

 స్పాండిలైటిస్ మరియు సయాటిక గురించి వివరణ - 


          ఈ రెండు సమస్యలు నేడు సర్వసాధారణం అయినవి . దీనికి ప్రధానకారణం మన ఆహారపు అలవాట్లు మరియు మనం చేయు ఒత్తిడితో కూడుకొనిన పనులు కూడా కారణమే . ఇవి శరీరము నందు పెరుగు వాతదోషము వలన కలుగును. 


       ఈ స్పాండిలైటిస్ లో మెడ వెనుక భాగములో గల C 2 , C 3 , C 4 డిస్క్ ల మధ్య ఖాళి ఏర్పడటం వలన నరం ఒత్తుకుపోయి ఈ సమస్య ప్రారంభం అగును. కొందరు తల పైకి ఎత్తలేరు . కొందరు తలను పక్కలకు సరిగా తిప్పలేరు . దీనికి కారణం వారి మెడ నరాలు , కండరాలు బిగుసుకొని పోతాయి . ఇంతకు ముందు చెప్పిన విధముగా నరము నొక్కుకొని పోయినప్పుడు నొప్పి మెడ నుంచి భుజాలకు మరియు చేతులకు కూడా పాకును . 


          సయాటిక నందు వెన్నుపాము చివర నొప్పి మొదలయ్యి కుడికాలు నందు గాని ఎడమకాలి చివర వరకు గాని నొప్పి ఉండును. ఈ నొప్పి తీవ్రత చాలా అధికంగా ఉండును. కదిలినప్పుడల్లా సూదులతో పొడుస్తున్నట్లు ఉంటుంది. వెన్నపాము నందలి L4 , L5 , S1 డిస్క్ ల మధ్య ఖాళి ఏర్పడి ఆ ఖాళి నందు నరం పడి నలగడం వలన ఈ సమస్య ఏర్పడును . 


              నేను ఈ రెండు సమస్యలకు చికిత్స చేస్తున్నప్పుడు గమనించిన విషయాలు ఏమిటంటే స్పాండిలైటిస్ వచ్చిన వారికి చిన్నగా కొంతకాలానికి సయాటిక కూడా వస్తుంది. సయాటిక వచ్చిన వారికి కొంతకాలానికి స్పాండిలైటిస్ వస్తుంది. సమస్య మొదలైనప్పుడు సరైన చికిత్స తీసుకోకున్న రెండు సమస్యలు చుట్టుముట్టును . మరొక్క ముఖ్యవిషయం ఈ రెండు సమస్యలు మొదలు ఒకవైపు మాత్రమే మొదలై చివరికి రెండోవైపు కూడా సమస్య మొదలగును . ఉదాహరణకు సయాటిక వెన్నుపాము చివర నుంచి మొదలు అయ్యి కుడికాలుకు వచ్చింది అనుకుందాం మనం మన శరీర బరువును ఎడమకాలి మీద వేసి నడవటం కాని నిలబడటం కాని చేస్తాము . ఇలా కొంతకాలానికి ఎడమ కాలికి కూడా నొప్పి ప్రారంభం అగును. ఇది అత్యంత తీవ్రమైన సమస్య . 


       అల్లోపతి వైద్యము నందు వైద్యులు దీనికి సర్జరి పరిష్కారంగా చెప్తారు. కాని కొంతకాలానికి మరలా సమస్య తిరగబెట్టడం నేను గమనించాను . ఆయుర్వేద వైద్య విధానంలో దీనికి అత్యంత అద్బుతమైన చికిత్సలు కలవు. 


      ఈ రెండు సమస్యలతో బాధపడుతున్నవారు నన్ను సంప్రదించగలరు. ముఖ్యముగా ఆయుర్వేద చికిత్స యందు పథ్యం  ప్రధానపాత్ర పోషిస్తుంది . ఇక్కడ పాటించవలసిన ఆహార పథ్యాలు మీకు వచ్చిన ఆనారోగ్య సమస్యకు మాత్రమే తప్ప ఔషధాలుకు కావు . నేను తయారుచేసి ఇచ్చు ఔషధాలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.  


                కాళహస్తి వేంకటేశ్వరరావు 


            అనువంశిక ఆయుర్వేద వైద్యం 


                      9885030034

చాటు పద్య సుమ మాలిక **

 ((((( ఆలోచనాలోచనాలు ))))) *


**** చాటు పద్య సుమ మాలిక *****    

           1* కం. సిరిగలవానికిఁ జెల్లును / తరుణులఁ బదియాఱువేలఁ దగఁ బెండ్లాడన్ / తిరిపమున కిద్దఱాండ్రా? / పరమేశా? గంగ విడువు పార్వతి చాలున్.  

     2* ఉ. బూడిద బ్రుంగివై యొడలుపోఁడిమిఁదప్ప మొగంబు వెల్లనై / వాడలవాడలన్ దిరుగ వారును వీరును జొచ్చొచో యనన్ / గోడలగొందులన్ దిరిగి కూయుచు నుండెదు కొండవీటిలో / గాడిద? నీవునుం గవివి కావుగదా? యనుమానమయ్యెడున్.    

  3* ఉ. కొందఱు భైరవాశ్వములు, కొందఱు పార్థుని తేరిటెక్కెముల్ / 

కొందఱు ప్రాక్కిటీశ్వరులు, కొందఱు కాలునియెక్కిరింతలుం / కొందఱు కృష్ణజన్మమునఁ గూసినవారలు, నీ సదస్సులో / నందఱు నందఱే మఱియు నందఱు నందఱె యందఱందంఱే!       

  (1 నుండి 3 పద్యములు శ్రీనాథ మహాకవి కృతము)    

   4* శ్రీనీరేజదళేక్షణాహృదయ రాజీవభ్రమచ్చంచరీ / కానూనాస్త్ర దురంధురుండు హరుఁడార్యాప్రాణానాథుండు ని / త్యానందుండు శివుండు నాహృదయపద్మాసనస్థుడై యుండగా / స్నానంబా? తలకా? జపంబు మడికా? జందెంబు నా తప్పుకా?         

   5* ఉ. పండితులైనవారలు సభాస్థలి నుండగ నల్పుఁడొక్కఁడు / ద్దండతఁ బీఠమెక్కిన బుధప్రకరంబున కేమి లోటగున్/ గొండొకకోఁతి చెట్టుకొనకొమ్మకు నెక్కినఁ గ్రిందమత్త వే / దండ మహోగ్రసింహములు తాలిమినందవె రాజచంద్రమా!                   

   6* కం. కవి యల్లసానిపెద్దన / కవి తిక్కన సోమయాజి గణుతింపంగాఁ / గవి నేను రామకృష్ణుఁడఁ / గవియను నామంబు నీరుకాకికి లేదే?      7* కం. "" వాకిటి కావలి తిమ్మా""/ "" ప్రాకటమగు సుకవివరుల పాలిటి సొమ్మా!""/ "" నీకిదె పద్యము కొమ్మా!""/ "" నాకీ పచ్చడమె చాలు నయముగ నిమ్మా!""              

  (5, 6 మరియు 7 పద్యములు తెనాలి రామకృష్ణ కవి గారివిగా ప్రసిద్ధాలు)               చివరగా చమత్కార పద్యం 

8* అసమాన కోదండుడైన రాజెవ్వండు ?                         రాజు పేరిట గల్గు రత్నమేది?                            రత్నంబు పేరిట రంజిల్లు ఋతువేది?                          ఋతువు పేరిట గల్గు రుద్రుడెవరు?                        రుద్రుని పేరిట రూఢిల్లు జగమేది?                             జగము పేరిట గల జంతువేది?                          జంతువు పేరిట జన్మించు పక్షేది?                                   పక్షి పేరిట గల వృక్షమేది?      అన్నిటికి జూడ మూడేసి యక్షరములు / ఆదులుడుపంగ తుదలెల్ల నాదులగును / సమ్మతిగ జెప్ప భావజ్ఞ చక్రవర్తి / చెప్పలేకున్న నగదు నే చిన్ని నవ్వు!!    

                    ( ఈ పద్యంలో ప్రశ్నలన్నింటికి మూడేసి అక్షరాల సమాధానాలుంటాయి. ఒక సమాధానంలోని చివరి అక్షరం , రెండో సమాధానానికి మొదటి అక్షరం అవుతుందనే నిబంధన మామాలే! ఇప్పుడీ పద్యంలోని ప్రశ్నలకు సమాధానాలు ఇట్లా ఉంటాయి

. 1* శ్రీరామ 2* మౌక్తిక 3* కర్కశ  4* శంభువు 5* వసుధ 6* ధేనువు 7* వాయసం 8* సంపంగె.ఈ పద్యంలోని రత్నం పేరిట గల ఋతువు  గ్రీష్మం. గ్రీష్మాన్ని కర్కశ ఋతువంటారు. కాబట్టి ఆ ప్రశ్నకి సమాధానాన్ని దారివిడిచి వెదుక్కోవలసి వస్తుంది.)                                      తేది 26--9--2023, మంగళవారం, శుభోదయం.


వామనావతారం

 *వామనావతారం* 


అమృతోత్పాదనం అయిన తరువాత ఆ అమృతమును సేవించిన దేవతలు వార్ధక్యమును మరణమును పోగొట్టుకున్న వారై మళ్ళీ సామ్రాజ్యమును చేజిక్కించుకొని అత్యంత వైభవముతో జీవితమును గడుపుతున్నారు. ఒక గొప్ప ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. అమృతం త్రాగిన తరువాత ఒకవేళ అది అహంకారమునకు కారణం అయితే పరిస్థితి ఏమిటి? ఈ అనుమానములను తీర్చడానికే కాలగమనంలో ఉత్థాన పతనములు జరుగుతాయి. రాక్షసులకు నాయకత్వం వహించిన బలిచక్రవర్తి యుద్ధంలో ఓడిపోయాడు. ఓడిపోయినందుకు బెంగ పెట్టుకోలేదు. తన గురువయిన శుక్రాచార్యుల వారి వద్దకు వెళ్ళి పాదములు పట్టుకున్నాడు. ‘మహానుభావా! మాకందరికీ కూడా అమృతోత్పాదనంలో భాగం ఇచ్చారు కష్టపడ్డాము. కానీ అమృతమును సేవించలేకపోయాము. అమృతమును సేవించకపోవడం వలన ఇక మేము శాశ్వతంగా ఎప్పుడూ దేవతల కన్నా అధికులం కాకుండా ఉండిపోవలసినదేనా? అమృతం త్రాగినవారిని కూడా ఓడించగలిగిన శక్తి మాకు మీ పాదముల నుండి వస్తుందని మేము నమ్ముతున్నాము. మీరు మమ్మల్ని ఆ స్థితికి తీసుకువెళ్ళాలి. నేను పరిపూర్ణమయిన విశ్వాసంతో మీ పాదములు పట్టి ప్రార్థన చేస్తున్నాను’ అన్నాడు.

ఇపుడు గురుశక్తి గొప్పదా? అమృతము గొప్పదా? ఈ విషయం తేల్చాలి. శుక్రాచార్యులవారు బలి చక్రవర్తితో ‘ఇప్పుడు నేను నీతో ఒక యాగం చేయిస్తాను. దీనిని ‘విశ్వజిత్ యాగము’ అంటారని ఆ యాగమును బలిచక్రవర్తి చేత ప్రారంభింప జేశారు. యాగమునకు ఫలితము విష్ణువే ఇవ్వాలి. విశ్వజిత్ యాగము నడుస్తోంది. అది పరిపూర్ణం అయ్యేసరికి ఆ యాగగుండములో నుండి ఒక బంగారురథము బయటకు వచ్చింది. దానిమీద ఒక బంగారు వస్త్రము కప్పబడి ఉన్నది. సింహము గుర్తుగా గలిగిన పతాకం ఒకటి ఎగురుతున్నది. అద్వితీయమయిన అక్షయ తూణీరముల జంట వచ్చింది. ఒక గొప్ప ధనుస్సు వచ్చింది. శుక్రాచార్యుల వారి అనుమతి మేరకు బలిచక్రవర్తి వాటిని స్వీకరించాడు. బలిచక్రవర్తి తాతగారు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. విరోచనుని కుమారుడు బలిచక్రవర్తి. ఆయన వచ్చి ఒక స్వర్ణ పుష్పమాల బలిచక్రవర్తి మెడలో వేశాడు. శుక్రాచార్యుల వారు అనుగ్రహంతో అమృతం తాగిన వాళ్ళని ఓడించడం అనేది బలిచక్రవర్తి కోరిక. విశ్వజిత్ యాగం ఫలించింది. స్వర్ణ పుష్పమాలను మెడలో వేసుకొని దివ్యరథమును ఎక్కి అమరావతి మీదకి దండయాత్రకు వెళ్ళాడు.

ఇంద్రుడు ఈవార్త తెలుసుకున్నాడు. ‘అవతలి వాడు గురువుల అనుగ్రహంతో వస్తున్నాడు. నేను యుద్ధం చేయగలనా? శుక్రాచార్యులు బలిచక్రవర్తి చేత విశ్వజిత్ యాగం చేయించాడు. ఆయన శక్తిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. తను సలహా నిమిత్తం గురువుగారి దగ్గరకు వెళ్ళాలి’ అనుకుని ఇంద్రుడు దేవతలతో కలిసి గురువు గారయిన బృహస్పతి వద్దకు వెళ్ళాడు. దేవతలను ఉద్దేశించి ఆయన అన్నారు ‘ఈవేళ బలిచక్రవర్తికి శుక్రాచార్యుల వారి అనుగ్రహం పరిపూర్ణముగా ఉన్నది. నాకు తెలిసినంత వరకు బలిచక్రవర్తిని ఓడించగలిగిన వాడు సృష్టిలో ఇద్దరే ఉన్నారు. ఒకడు శివుడు, రెండు కేశవుడు. ఇంకెవరు బలిచక్రవర్తిని ఓడించలేరు. మనం ఆయననే ప్రార్థన చేద్దాము’ అని చెప్పగా వారందరూ శ్రీమహావిష్ణువును ప్రార్థన చేశారు.

శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఒక చిత్రమయిన మాట చెప్పారు ‘బృహస్పతి చెప్పినది యథార్థము. ఏ గురువుల అనుగ్రహముతో ఈవేళ బలిచక్రవర్తి ఈ స్థితిని పొందాడో మళ్ళీ ఆ గురువుల అనుగ్రహానికి బలిచక్రవర్తి దూరమైన రోజున మీరు బలిచక్రవర్తిని చిటికిన వేలితో కొట్టగలరు. గురువుల అనుగ్రహం అంత స్థాయిలో ఉండగా మీరు వానిని ఏమీ చేయలేరు. యుద్ధం చేయడం అనవసరం. మీరు అమరావతిని విడిచిపెట్టి వేషములు మార్చుకుని పారిపోండి’ అని చెప్పాడు. దేవతలు తలొక దిక్కుపట్టి వెళ్ళిపోయారు. బలిచక్రవర్తి అమరావతి వచ్చి చూశాడు. ఒక్కడు కూడా లేడు. దివ్యమయిన అమరావతీ పట్టణం సునాయాసంగా తనది పోయింది. ఇంద్ర సింహాసనమును అధిరోహించి కూర్చున్నాడు. ఇకనుంచి యజ్ఞ యాగాది క్రతువులు ఏవి చేసినా హవిస్సులు తనకే ఇమ్మనమని ఆజ్ఞాపించాడు. మళ్ళీ అహంకారము ప్రారంభమవుతుంది. బలిచక్రవర్తి వైభవం కొనసాగుతోంది. ఆయన దానధర్మములకు పెట్టింది పేరు. అటువంటి బలిచక్రవర్తి రాజ్యం చేస్తున్నాడు. ముల్లోకములను పాలన చేస్తున్నాడు. ఆయన మహాభక్తుడు రావణాసురుని వంటి ఆగడములను చేసిన వాడు కాదు. ఇటువంటి సమయంలో చిత్రమయిన ఒక సంఘటన జరిగింది.

కశ్యపప్రజాపతికి ఇద్దరు భార్యలు. ఒకరు అదితి, ఒకరు దితి. ఇంద్రాదులు అదితి కుమారులు. ఇవాళ వారు అమరావతిని విడిచిపెట్టి అరణ్యములలోకి వెళ్ళిపోయారు. ఆవిడ బాధ భరించలేక ఒకనాడు తన భర్త అయిన కశ్యప ప్రజాపతికి చెప్పింది. కశ్యపప్రజాపతి గొప్ప బ్రహ్మజ్ఞాని. ఆయన ఒక నవ్వు నవ్వి ‘అదితీ! ఈ భార్యలేమిటి? కొడుకులేమిటి? రాజ్యాలేమిటి? ఈ సింహాసనములు ఏమిటి? ఈ గొడవలు ఏమిటి? ఇదంతా నాకు అయోమయంగా ఉన్నది. ఈ సంబంధములకు ఒక శాశ్వతత్వం ఉన్నదని నీవు అనుకుంటున్నావా? నేను అలా అనుకోవడం లేదు. ఉన్నదే బ్రహ్మమొక్కటే అని అనుకుంటున్నాను. నీవు విష్ణు మాయయందు పడిపోయావు. అందుకని ఇవాళ నీ బిడ్డలు, దితి బిడ్డలు అని రెండుగా కనపడుతున్నారు. ఒకరికి ఐశ్వర్యం పోయింది. ఒకరికి ఐశ్వర్యం ఉన్నదని బాధపడుతున్నావు. నేనొక మాట చెప్పనా! ఈ ప్రపంచంలో కష్టములో ఉన్నవానిని ఈశ్వరుడు ఒక్కడే రక్షించగలడు. ఆయనను అడగాలి గానీ నన్ను అడుగుతావేమిటి? నిజంగా రక్షణ పొందాలి, నీ కొడుకైన దేవేంద్రుడు దేవతలు తిరిగి ఆ సింహాసనమును పొందాలి అని నీవు అనుకున్నట్లయితే మహానుభావుడయిన ఆ జనార్దనుని పూజించు. ఆయన ప్రీతి చెందితే ఆయన చేయలేనిది ఏదీ ఉండదు. సర్వేశ్వరుడయిన నారాయణుని ప్రార్థించు’ అని చెప్పి ‘పయో భక్షణము’ అనే ఒక వ్రతమును కల్పంతో ఆమెకు ఉపదేశం చేశాడు. ఆ వ్రతం చాలా గమ్మత్తుగా ఉంటుంది. అది మనందరం చేసే వ్రతం కాదు.

ముళ్ళపంది లేదా అడవిపంది తన కోరతో పైకెత్తిన మట్టిని తీసుకొని ఒంటికి రాసుకుని స్నానం చేసి చాలా జాగ్రత్తలు తీసుకొని పన్నెండు రోజులు ఆ కల్పమును ఉపాసన చేయాలి. అలా చేయగలిగితే భగవంతుడిని సేవించగలిగితే పన్నెండు రోజులలో శ్రీమన్నారాయణుని అనుగ్రహము కలుగుతుంది. భగవంతుడయిన శ్రీమన్నారాయణుని అనుగ్రహమును కోరి నీవు ఈ వ్రతమును చేయవలసింది’ అని చెప్పాడు. ఆవిడ భర్త మాటలను నమ్మి పన్నెండు రోజులు ఈ వ్రతం చేయగా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షం అయ్యాడు. ఆవిడ శ్రీమన్నారాయణుడు కనపడితే తన కొడుకుకి రాజ్యం ఇప్పించాలని వ్రతం చేస్తోంది. నిజంగా శ్రీమన్నారాయణుడు కనపడేసరికి అదితి ఆయన రూపమును కళ్ళతో జుర్రుకు త్రాగేసింది. గట్టిగ కంఠం రాక ఏమి మాట్లాడుతున్నదో కూడా వినపడకుండా అలా చూస్తూ ఉండిపోయింది. ఆమె చేస్తున్న ఆ స్తోత్రము అంతటా నిండి నిబిడీకృతమయిన వాడెవడున్నాడో ఆయనకే వినపడాలి.

స్వామి అదితిని ‘నీవు ఈపూజ ఎందుకు చేశావు?’ అని అడిగాడు. ఆవిడ ‘స్వామీ! నా కుమారుడయిన దేవేంద్రుడు రాజ్యభ్రష్టుడు అయ్యాడు. నా కుమారునికి రాజ్యం ఇవ్వవలసింది’ అని అడిగింది. స్వామి ‘నీ కుమారునికి రాజ్యం ఇప్పిస్తాను’ అని అనకుండా ‘అమ్మా! నీ కుమారుడు ఇంద్రుడు, కోడలు శచీదేవి బాధపడుతున్నారని అనుకుంటున్నావు కదా! వాళ్ళందరూ నీవు సంతోషించేటట్లు నేను తప్పకుండా నీవు అడిగిన పని చేస్తాను. కానీ అమ్మా, నాకు ఒక కోరిక ఉంది. ‘ఇపుడు ఈశ్వరుడు అదితిని వరం అడుగుతున్నాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి! వరము అడగడానికి కూర్చున్న అదితిని నారాయణుడు వరము అడుగుతున్నాడు. ‘అమ్మా! నాకు నీ కొడుకునని అనిపించుకోవలెనని ఉన్నది. నీ గర్భవాసము చేయాలని అనిపిస్తోంది. నీ కొడుకుగా పుడతాను’ అని అడిగాడు. అలా అడిగేసరికి అదితి తెల్లబోయింది. ఆమె ‘స్వామీ! నాకు అంత భాగ్యమా! తప్పకుండా’ అన్నది. స్వామి ‘నీ భర్తను ఇదే రూపంతో ఇంతకు పూర్వం ఏ భక్తితో ఉన్నావో అలా నీ భర్తను సేవించు. నేను నీ భర్తలోకి ప్రవేశించి ఆయన తేజస్సుగా నీలోకి వస్తాను’ అన్నాడు. ఎంతో యథాపూర్వకంగా పుట్టాడు. ఆమె గర్భమునందు ప్రవేశిస్తే బ్రహ్మగారు శ్రీమన్నారాయణుని స్తోత్రం చేశారు. అదితి గర్భం గర్భాలయం అయింది.

గర్భము నిలబడినది కనుక ఆవిడ చుట్టూ ఉన్న స్త్రీలు వేడుక చేశారు. అమ్మ కడుపులో ఉండవలసిన కాలము పూర్తయిన తరువాత మంచి ముహూర్తం చూసుకొని శ్రవణ నక్షత్రము లో ద్వాదశి తిథి నాడు మిట్ట మధ్యాహ్నం వేళ అభిజిత్సంజ్ఞాతలగ్నంలో ఆయన జన్మించాడు. ఆయన పుడుతూనే ఉపనయనం చేసుకోవలసిన వయస్సు పొందిన బాలుడిగా శంఖ, చక్ర, గద, పద్మములతో శ్రీమన్నారాయణుడిగా పుట్టాడు. అదితి స్తోత్రం చేసింది. కశ్యపప్రజాపతి స్తోత్రం చేశారు. వెంటనే ఆయన తన రూపమును ఉపసంహారం చేశారు. ఉపనయనం చేసుకునే వయస్సు ఉన్న వటువుగా ఎనిమిది సంవత్సరముల పిల్లవానిగా మారిపోయాడు. వటువుకి కశ్యప ప్రజాపతి ముంజెగడ్డితో చేసిన మొలత్రాడు ఇచ్చారు. తల్లి అదితి కౌపీనం ఇచ్చింది. బ్రహ్మగారు కమండలం ఇచ్చారు. సరస్వతీ దేవి అక్షమాలను ఇచ్చింది. సూర్యభగవానుడు ఆదిత్యమండలమునుండి క్రిందికి దిగి వచ్చి గాయత్రీ మంత్రమును ఉపదేశం చేశాడు. చంద్రుడు చేతిలో పట్టుకునే మోదుగకర్రతో కూడిన దండమును ఇచ్చాడు. ఇంతమందీ ఇన్ని ఇస్తే కృష్ణాజినంతో కట్టుకునే నల్లటి జింకచర్మమును దేవతలు పట్టుకు వచ్చి ఇచ్చారు. యజ్ఞోపవీతమును పట్టుకుని దేవతల గురువైన బృహస్పతి వచ్చారు. వీళ్ళందరూ ఉపనయన మంత్రములతో పిల్లవానికి సంస్కారములన్నీ చేశారు. భిక్షాపాత్రను సాక్షాత్తు కుబేరుడు ఇచ్చాడు. భవానీమాత వచ్చి పూర్ణ భిక్ష పెట్టింది. ఇది తీసుకొని మహానుభావుడు బయలుదేరి బలిచక్రవర్తి కూర్చున్న చోటికి వెళ్ళాడు. బలిచక్రవర్తి తన భార్య వింధ్యావళితో కూర్చుని ఉన్నాడు. బలిచక్రవర్తి మహాతేజస్సుతో వస్తున్న వటువును చూశాడు. వటువు బ్రహ్మచారి కాబట్టి రాజును ఆశీర్వచనం చేయవచ్చు. వటువు ‘ఓహో! నీవేనా బలిచక్రవర్తివి. నీవేనా భూరి దానములు చేసే వాడివి. నీకు స్వస్తి స్వస్తి స్వస్తి. స్వస్తి అంటే శుభము. ఇలా బలిచక్రవర్తిని చూడగానే ఆశీర్వదించాడు.

బ్రహ్మచారి సభలోకి నడిచి వస్తున్నప్పుడు చక్రవర్తి అయినా సరే వేదిక దిగి ఆహ్వానించాలి. బలిచక్రవర్తి వెంటనే లేచి నిలబడి వింధ్యావళిని బంగారు పళ్ళెమును తీసుకురమ్మనమని చెప్పాడు. వటువును ఉచితాసనము మీద కూర్చోబెట్టి ఆ బంగారుపళ్ళెమును వటువు కాళ్ళ క్రింద పెట్టి ఆయన పాదములు కడిగి తాను తీర్థంగా తీసుకున్నాడు. వింధ్యావళికి తీర్థం ఇచ్చాడు. ఆయన పాదోదకమును శిరస్సున ప్రోక్షణ చేసుకున్నాడు.

‘నాయనా వడుగా! నీవు ఎవరి వాడివి? ఎక్కడ ఉంటావు? నీవు రావడం వలన ఇవాళ ఈ కాలము మంగళప్రదమయిపోయింది. బ్రహ్మచారీ! వడుగు చేసుకొనిన వాడవు నీవు వచ్చావు. ఇప్పటివరకు అగ్నిహోత్రం మామూలుగా వెలుగుతోంది. నీవు రాగానే అగ్నిహోత్రం మహాప్రకాశంతో పైకి లేస్తోంది. నీరాక వలన నా వంశము నా జన్మ సఫలం అయ్యాయి. ఇంతకుముందు తొంభైతొమ్మిది యాగములు చేశాను. ఇది నూరవది. నా జన్మ ధన్యమయింది’ అన్నాడు. బలిచక్రవర్తి అడిగిన ప్రశ్నలకు వామనుడు ఒక నవ్వు నవ్వి ‘ఓ చక్రవర్తీ! నేను ఒకచోట ఉంటానని చెప్పలేను అంతటా తిరుగుతుంటాను. ఒకళ్ళు చెప్పినట్లు వినడం నాకు అలవాటు లేదు. నే చెప్పినట్లే ఇంకొకరు వింటూ ఉంటారు. నాకు ఏది తోస్తే అది చేస్తాను. ఇది చదువుకున్నాను, ఇది వచ్చు అది చదువుకోలేదు, అది రాదని చెప్పడం ఎలా కుదురదు. ప్రపంచంలో ఎన్ని చదువులు ఉన్నాయని నీవు అనుకుంటున్నావో అవన్నీ నాకు వచ్చునని నీవు అనుకో! పైగా నేను ఇలాగే ప్రవర్తిస్తానని చెప్పడము కూడా కష్టమే. నేను మూడురకములుగా మాత్రము ప్రవర్తిస్తూ ఉంటాను. నాకు చుట్టమనేవాడు ప్రపంచంలో ఎవడూ లేదు. ఒకప్పుడు నాకు డబ్బు ఉండేది. బ్రహ్మచారి ఎక్కడ మంచిమాట వినబడితే అక్కడ వినాలి. అందుకని మంచి వాళ్ళ దగ్గర నా బుర్ర తిరుగుతూ ఉంటుంది. అంతేకాదు నన్ను కోరుకున్న వాళ్ళ దగ్గర నేను తిరుగుతూ ఉంటాను’ అన్నాడు. ఆ మాటలను విన్న బలిచక్రవర్తి ఈ వామనుడి బొజ్జలో ఎన్ని మాటలున్నాయో అని ఆశ్చర్యపోయాడు. పొంగిపోయి పిల్లవాడా! నిన్ను చూస్తే నాకు చాలా ఆనందముగా ఉన్నది. నీవు వటువువి నేను చక్రవర్తిని నీకు ఏదో ఒక కానుక ఇవ్వాలి. నీకు ఏమి కావాలో కోరుకో’.

వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో

కరులో రత్నములో రథంబులొ విమృష్టాన్నంబులో కన్యలో

కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో

ధరణీఖండమొ కాక ఏమడిగెదో దాత్రీసురేంద్రోత్తమా!

ఈ భూమిమీద పుట్టిన అద్భుతమయిన బ్రహ్మచారీ! నీకేమి కావాలో అడుగు. ధనమా? గోవులా? కన్యలా? రథములా? బంగారమా? వజ్రములా? రాజ్యములో భాగమా? నీకు ఏమి కావాలి ? నేను ఏదయినా ఇవ్వగల సమర్థుడిని. నీకు ఏమి కావాలో అడుగు. నీకిస్తాను’ అన్నాడు. వామనుడు నవ్వి ‘నాకు ఏది కావాలంటే అది నీవు ఇస్తావా! నేను అల్పమునకు సంతోషించేవాడిని. నాకు నీవు ఇవ్వగలిగినది ఏమిటి? నేను తృప్తి పొందేవాడిని. అయినా ఏదో ఒకటి పుచ్చుకోమని నీవు అడిగావు కదా! నాకు ఒకటి రెండు అడుగుల నేల ఇవ్వు. చాలామంది దీనిని కూడేసి బలిచక్రవర్తి మూడడుగుల నేల ఇమ్మనమని అడిగాడని చెపుతారు. వామనుడు అలా అడగలేదు. నీవు నాకు ఒకటి రెండడుగుల నేలను ఇస్తే దానితో ఒక అడుగుతో ఊర్ధ్వలోకములను కొలుస్తాను. ఒక అడుగుతో అధో లోకములను కొలుస్తాను. మూడవ అడుగు పెట్టడానికి మళ్ళీ నిన్ను చోటు అడుగుతాను. నీవు కానీ ఒకటి రెండు అడుగులు నేలను ఇచ్చానని అంటే నేను బ్రహ్మానందమును పొందుతాను ఈ బ్రహ్మాండమంతా నిండిపోతాను’ అన్నాడు.

బలిచక్రవర్తి ‘నీవు పిల్లవాడివి. నీకు అడగడం కూడా చేతకాదు. నీవు మూడు అడుగుల భూమిని కొలిస్తే నీకు ఎంత వస్తుంది? నేను బ్రహ్మాండములను జయించిన వాడిని. మూడడుగుల నేలా నేను నీకు ఇవ్వడం! ఇంకేదయినా అడుగు. నీవు ఏది అడిగితే అది ఇస్తాను’ అన్నాడు.

వామనుడు ఆశ్రమ ధర్మమును పాటించాడు

గొడుగో, జన్నిదమో, కమండలువొ, నాకున్ ముంజియో, దండమో,

వడుఁ గే నెక్కడ" భూము లెక్కడ? కరుల్, వామాక్షు, లశ్వంబు లె

క్కడ? నిత్యోచిత కర్మ మెక్కడ? మదాకాంక్షామితంబైన మూఁ

డడుగుల్ మేరయు త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్.

‘అవన్నీ ఇస్తానంటావేమిటి? నేను బ్రహ్మచారిని. బ్రహ్మచారిని పట్టుకుని వరచేలంబులు, మాడలు, ఫలములు, వన్యంబులు, గోవులు మొదలయిన వాటిని పుచ్చుకొనమంటావేమిటి? వాటిని నేను పుచ్చుకోకూడదు. నేను గొడుగు, యజ్ఞోపవీతము, కమండలము, ముంజి, దండము మొదలయిన వాటిని మాత్రమే అడగాలి. నాకివన్నీ అక్కరలేదు. నేను జపం చేసుకోవడానికి నేను అగ్నికార్యం చేసుకోవడానికి నాకు మూడడుగుల నేల ఇస్తే చాలు’ అన్నాడు. బలిచక్రవర్తి

ఓ వటువా! ఇదిగో బంగారుపాత్ర ఇక్కడ పెట్టాను. వచ్చి నీ పాదములు ఇందులో పెట్టు. వింధ్యావళీ! బంగారుచెంబుతో నీళ్ళు పొయ్యి. ఈ పిల్లవాడి పాదములు కడిగి వానికి మూడడుగుల నేల ధారపోస్తాను. నీళ్ళు పట్టుకొని రా’ అన్నాడు. వింధ్యావళి వటువు వంక చూసి పొంగిపోతూ నీళ్ళు పట్టుకువద్దామని లోపలి వెళుతున్నది. ఈలోగా బ్రహ్మచారి బంగారుపాత్రలో పాదములు పెట్టబోతున్నాడు. అక్కడికి శుక్రాచార్యుల వారు పరుగుపరుగున వచ్చి రాజా! నీచేత విశ్వజిత్ యాగమును చేయించి ఇవాళ నీకు ఇంత వైభవమును ఇచ్చాను. వచ్చినవాడు ఎవరో తెలుసా? ఏమయినా మాట ఇచ్చావా? అని అడిగాడు. బలిచక్రవర్తి ‘ ఈ బ్రహ్మచారి మూడు అడుగుల నేల అడిగితే ఇస్తానన్నాను’ అన్నాడు. శుక్రాచార్యులు ‘రాజా! ఆ వచ్చినవాడు శ్రీమహావిష్ణువు. ఎప్పుడూ ఆయన ఎవరి దగ్గర ఏదీ పుచ్చుకోలేదు. ఇవాళ నీ దగ్గర చెయ్యి చాపి దానం పుచ్చుకుంటున్నాడు. ఎందుకో తెలుసా! ప్రహ్లాదుడికి నువ్వు మనవడివి. ఆ వంశంలో వాడిని ఆయన నిగ్రహించడు. ఒక మహాపురుషుడు వంశంలో ఉంటే ఆ క్రింద వాళ్ళకి ప్రమాదం ఉండదు. నీజోలికి రాలేడు. నీతో యుద్ధం చేయకుండా నువ్వు ఇంద్రుడి దగ్గర నుంచి పొందిన రాజ్యమును తీసుకుని ఇంద్రునకు ఇస్తాడు. మూడడుగులు పుచ్చుకుంటున్నాడు. నేను నా దివ్యదృష్టితో చూసి చెపుతున్నాను. ఆ రెండడుగులతో ఉత్తరక్షణం ఈ బ్రహ్మాండములన్నీ నిండిపోతాడు. మూడవ అడుగు ఎక్కడ పెట్టనని అడుగుతాడు. నువ్వు నీ నెత్తిమీద పెట్టించుకోవాలి. నా మాట విను. నేను నీ గురువుని కాబట్టి నీకొక గొప్ప ధర్మశాస్త్ర విషయం చెపుతున్నాను. తనకు మాలిన దానం గృహస్థు చేయనవసరం లేదు. మాటచ్చినా తప్పవచ్చు. ఇంకొక మాట కూడా చెపుతున్నాను.

వారిజాక్షులందు వైవాహికములందు, బ్రాణ విత్తమాన భంగమందు

జకిత గోకులాగ్ర జన్మరక్షణమందు, బొంకవచ్చు నఘము వొందదధిప !

శుక్రాచార్యుల వారు రాక్షసనీతి చెప్పారు. దానిని ప్రాణభయంతో ఉన్నప్పుడు రాక్షసనీతిగా ఆయన చెప్పారు. ఆయన చెప్పిన విషయం ‘ఆడవారి విషయంలో, వివాహ విషయంలో, ప్రాణం పోయేటప్పుడు, డబ్బులు పోయేటప్పుడు, మానం పోయేటప్పుడు, అబద్ధం చెప్పవచ్చు. గోవుల విషయంలో, బ్రాహ్మణులను రక్షించే విషయంలో అబద్ధం చెప్పవచ్చు దాని వలన పాపం రాదు. మూడు అడుగుల నేల ఇవ్వనని చెప్పు. ఒక్క అడుగుకూడా ఇవ్వకు ఇస్తే ప్రమాదం ఆయనను నమ్మకు’ అన్నాడు.

బలిచక్రవర్తి శుక్రాచార్యుల వంక చూసి ‘ఎంతమాట అన్నారు! లక్ష్మీనాథుడయిన వాడు వచ్చి నా దగ్గర చెయ్యి చాపాడని మీరే చెపుతున్నారు.

ఆదిన్ శ్రీసతి కొప్పుపై, దనువుపై, నంసోత్తరీయంబుపై

బాదాబ్జమ్ములపై గపోలతటిపై బాలిండ్లపై నూత్న మ

ర్యాదన్ జెందు కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మేల్

గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే? కాయంబు నాపాయమే ?

‘ఆయన చేయి లక్ష్మీఅమ్మవారి కొప్పుపై పడుతుంది. ఆవిడ శరీరమును నిమురుతుంది. ఒక్కొక్కసారి ఆవిడ పమిట పట్టుకుని ఆడుకుంటాడు. ఒక్కొక్క సారి ఆవిడ పాదములు పట్టుకుంటాడు. అమ్మవారి బుగ్గలను నిమురుతాడు. ఆ చెయ్యి లక్ష్మీదేవిని పొంగి పోయేట్లు చేయగలిగిన చెయ్యి. కొన్ని కోట్లమంది ఏ తల్లి అనుగ్రహమునకై చూస్తున్నారో అటువంటి తల్లి ఆ చెయ్యి పడితే పొంగిపోతుంది. దేవదానవులను శిక్షించిన చెయ్యి. భక్తుల కోర్కెలు తీర్చిన చెయ్యి. పాంచ జన్యమును పట్టుకునే చెయ్యి. ఏ చేయి వరదముద్ర చూపిస్తే భక్తులకు ధైర్యం కలుగుతుందో అటువంటి చెయ్యి భిక్ష కోసమని క్రింద నిలబడుతోంది. నా చేయి పైదవుతున్నది. నాకీ అదృష్టం చాలదా! మళ్ళీ పుడతానా? రాజ్యం ఉండిపోతుందా? దేహం ఉండిపోతుందా? పోతే పోనీ ఈ రాజ్యముకాదు, ఈ శరీరము కాదు నేను కాదు ఏది పోయినా పరవాలేదు’.

కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?

వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే? భూమిపైఁ.

బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై.

యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యి క్కాలమున్? భార్గవా!

‘ప్రపంచంలోనికి ఎంతోమంది రాజులు వచ్చారు. వచ్చిన వారందరూ తాము భూమికి పతులమని పరిపాలించామని అన్నారు. వారేరి? నాది నాదని ఇంత సంపాదించాను అని అన్నారు. ఏ కొద్ది కూడా పట్టుకెళ్ళిన వాడు ఈ భూమిమీద లేడు. కీర్తిని ఆశించి ఆనాడు శిబి మొదలయిన మహాపురుషులు అద్భుతమయిన దానములు చేశారు. వాళ్ళు యశోశరీరులై నిలబడిపోయారు. ఇవన్నీ మూట కట్టుకుని నేను దాచుకుంటే ఈ రాజ్యం ఉండిపోతుందా! ఈ శరీరం ఉండిపోతుందా!

నాకు రాజ్యం తీసేస్తాడు, దరిద్రుడను అయిపోతానని అంటున్నావు కదా! నా స్వామి చేతికి నా రాజ్యం అంతా ఇచ్చిన వాడిని నేను అనిపించుకుని నేను భిక్షువునై తిరుగుతాను. నాకు బెంగలేదు. నాకు దరిద్రం రావచ్చు, జీవితం పోవచ్చు, నా ధనం పోవచ్చు. మాటపోయిన తరువాత ఆ మనిషి బ్రతికినా ఒకటే వెళ్ళిపోయినా ఒకటే. భూదేవి మనుషుల సంఖ్యను చూసి భయపడదు. మాట తప్పే వాళ్ళ బరువును తాను మోయలేనని ప్రార్థన చేస్తుంది. నేను ఆ జాబితాలో చేరను. నేను దానం చేస్తాను’ అన్నాడు. శుక్రాచార్యుడు ‘నేను నా తపశ్శక్తితో అమృతం త్రాగిన వాళ్ళని ఓడిపోయేటట్లు చేసాను. ఇవాళ నువ్వు గురువు మాటకాదన్నావు. ఉత్తర క్షణం నీవు రాజ్యభ్రష్టుడవు అవుతావు!’ అని శపించాడు.

వెంటనే బలిచక్రవర్తి స్వామి పాదములను బంగారుపళ్ళెంలో పెట్టమన్నాడు. వామనుడు వచ్చి పళ్ళెంలో పాదమును పెడదామని కుడిపాదము కొద్దిగా పైకి ఎత్తాడు. బలిచక్రవర్తి కింద కూర్చుని పాదము వంక చూస్తున్నాడు. ఆ పాదము క్రింద ధ్వజరేఖ, అమృతపాత్ర, నాగలి వంటి దివ్యమయిన చిహ్నములు కనపడ్డాయి. ఎర్రటి అరికాలు. పైన నల్లనిపాదము. ఏ వేదమును చదువుకుని ఆమ్నాయము చేస్తారో అటువంటి వేదము ఆయన కాలి అందెగా మారి అలంకరింపబడి ఉన్నది. బ్రహ్మచారిగా ఉన్నా నిద్రలేవగానే శ్రీమహావిష్ణువు పాదముల దగ్గర వంగి లక్ష్మీ దేవి నమస్కరించడంలో లక్ష్మీదేవి నొసటన ఉన్న కస్తూరీ తిలకం ఆయన పాదము మీద ముద్రపడి ఉన్నది. అటువంటి పాదమును దగ్గరనుంచి చూసాడు. మహా యోగులయిన వారు ఇక్కడ దర్శనం చేసి పొంగిపోయి జన్మ పరంపరల నుండి గట్టెక్కే భవసాగరమును దాటించ గలిగిన ఓడ అయిన పాదము ఏది ఉన్నదో ఆ పాదమును చూసాడు. ఇంకా బ్రాహ్మీ ముహూర్తంలోనే సప్తర్షుల చేత పూజింపబడిన తామరల చేత సుగంధమును పొందిన పాదమును చూసాడు. చూసి పొంగిపోయి బంగారు పళ్ళెము ముందుకు జరిపాడు. వామనుడు అందులో కుడికాలు వుంచి ఎడమకాలు ఎత్తి అందులో పెట్టాడు. ఆ రెండు పాదములను చూసి బలిచక్రవర్తి ‘ఆహా ఏమి నా భాగ్యము! ఈ పాదములను ఎవరు కడుగగలరు! ఈ పాదములను ముట్టుకోగలిగిన వాడెవడు? ఈ కీర్తి ఎవడూ పొందలేడు. నేను పొందుతున్నాను’ అనుకుని వింధ్యావళిని నీళ్ళు పోయమన్నాడు. పైకి చూసాడు. బలిచక్రవర్తి తాను పతనం అయిపోతానని తెలిసి దానం ఇస్తున్నాడు. శుక్రాచార్యుల వారు చూస్తున్నారు. వింధ్యావళి కమండలంలో నీళ్ళు పోస్తోంది. శుక్రాచార్యుల వారికి ఇంకా తాపత్రయం పోలేదు. సూక్ష్మ రూపంలో వెళ్ళి ఆ కమండల తొండమునకు అడ్డుపడ్డాడు. బలిచక్రవర్తి నీళ్ళు పోస్తున్నా నీరు కమండలంలోంచి పడడం లేదు. స్వామి నవ్వి చేతిలో దర్భ ఒకటి తీసి కమండలం లోకి పెట్టి ఒక్కపోటు పొడిచాడు. పొడిచేసరికి శుక్రుని కంట్లో గుచ్చుకుని ఒక కన్ను పోయి శుక్రాచార్యుల వారు బయటపడ్డారు. వెంటనే నీటి ధార పడిపోయింది బలిచక్రవర్తి కంకణములు మెరిసిపోయే వామనుని చేతిని తన రెండు చేతులతో పట్టుకుని కళ్ళకు అద్దుకుని ‘స్వామీ! ఈ చేతులు కదా లోకరక్షణ చేసే చేతులు’ అని దానం చేసాడు.


వెంటనే వామనుడు పెరిగిపోవడం మొదలు పెట్టాడు.


ఇంతింతై, వటుడింతయై, మఱియుదానింతై, నభోవీధిపై

నంతై, తోయదమండలాగ్రమున కల్లంతై, ప్రభారాశిపై

నంతై, చంద్రునికంతయై, ధ్రువునిపైనంతై, మహర్వాటిపై

నంతై, సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంతసంవర్థియై.

పొట్టివానిగా వచ్చిన వామనుడు అంతకంతకు పెరిగిపోతున్నాడు. బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా పది అంగుళములు పైకి ఎదిగిపోయాడు. లోకములన్నిటిలో పైకి కొలవడానికి విష్ణుపాదం వస్తున్నదని బ్రహ్మగారు తపస్సమాధిలోనుండి పైకి వచ్చి కమండలం పట్టుకుని ఆ పాదమును తన కమండలం లోని జలములతో కడిగి శిరస్సున ప్రోక్షణ చేసుకొని ఆచమనం చేశారు. ఆ పాదములు కడిగిన నీళ్ళు ఆకాశంలో దేవనదిగా ప్రవహించాయి. ఆ పాదం ఇంకా పెరిగి వెళ్ళిపోయింది. అలా పైకి వెళ్ళి పై లోకములనన్నిటిని కొలిచినది. కింది లోకముల నన్నిటిని ఒక పాదము కొలిచినది. ఆ విధంగా రెండు అడుగులతో వామనుడు భూమ్యాకాశములను కొలిచాడు.

రవిబింబం బుపమింపఁ బాత్ర మగు ఛత్రం బై, శిరోరత్న మై

శ్రవణాలంకృతియై గళాభరణ మై సౌవర్ణకేయూరమై

ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచ ద్ఘంటయై నూపుర

ప్రవరంబై పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్.


వామనమూర్తి ఇలా పెరగడం మొదలుపెట్టగానే ఆకాశంలోని సూర్యబింబము మొట్టమొదట ఆయన తలమీది గొడుగులా, తరువాత తలమీద పెట్టుకున్న రత్నంలా మెరిసింది. ఇంకా కొంచెం పైకి వెళ్ళినపుడు కంఠంలో పెట్టుకున్న ఆభరణం అయింది. చెవులకు పెట్టుకున్న మకర కుండలంగా ఉన్నది. స్వామి సూర్యుని దాటి ఇంకా పైకి వెళ్ళిపోయారు. సూర్య బింబము నడుముకి పెట్టుకున్న వడ్డాణమునకు చిన్న గంటలా గుండ్రంగా అయింది. ఇంకా దాటితే పాదములకు పెట్టుకున్న అందెలా అయింది. ఆ తరువాత పాదముల క్రింద వేసుకున్న గుండ్రని పీటలా అయిపోయింది. బ్రహ్మాండమంతా నిండిపోయిన వామనమూర్తికి సూర్యుడు అలా మారిపోయాడు. ఆయన లోకం అంతా అలా నిండిపోయి రెండు అడుగులతో లోకం అంతా కొలిచాడు.

ఆయన బలిచక్రవర్తితో నేను రెండడుగుల నేలను కొలుచుకున్నాను. ఇంకొక అడుగు భూమి ఏది? అని అడిగాడు. బలిచక్రవర్తి

సూనృతంబు గాని సుడియదు నా జిహ్వ, బొంకజాల; నాకు బొంకు లేదు;

నీ తృతీయ పదము నిజము నా శిరమున, నెలవు సేసి పెట్టు నిర్మలాత్మ!


నా నోరు ఎప్పుడూ అబద్ధం చెప్పదు. నేను అబద్ధం చెప్పలేదు. నీ మూడవ అడుగు నా తలమీద పెట్టు అని చెప్పి బలిచక్రవర్తి లేచాడు. వరుణుడికి అనుజ్ఞ ఇవ్వబడింది. ఆయన వరుణ పాశములతో కట్టేశారు. బలిచక్రవర్తి అలా నిలబడిపోయాడు. శ్రీమన్నారాయణుడు వటువు రూపంలో వచ్చి తమ రాజ్యమును కొల్లగొట్టాడని రాక్షసులు గ్రహించారు. నిర్జించడానికి ఆయుధములను పట్టుకు వచ్చారు. బలిచక్రవర్తి ‘వేళకాని వేళా క్రోధము తెచ్చుకోకూడదు. ఎవరు తనకు సిరిని ఇచ్చిన వాడే తిరిగి ఈ సిరిని తీసేసుకున్నాడు. మీరంతా ప్రశాంత మనస్కులై ఉండండి. ఎవ్వరూ యుద్ధం చేయకండి’ అన్నాడు. రాక్షసులంతా రసాతలమునకు పారిపోయారు. వింధ్యావళి శ్రీమన్నారాయణుని పాదముల మీద పడి స్వామీ! నా భర్తకి వచ్చిన వాడెవడో తెలుసు. రాజ్యము పోతుందని తెలిసికూడా దానం చేశాడు. ఏం పాపం చేశాడని ఇలా కట్టి నిలబెట్టావు? నాకు జవాబు చెప్పవలసింది. నీకు అనాథరక్షకుడని పేరు. నీ సన్నిధానములో నేను అనాథను కావడమా! నాకు భర్తృ భిక్ష పెట్టు’ అని ప్రార్థన చేసింది. ఆశ్చర్యకరంగా అక్కడికి బ్రహ్మగారు వచ్చి ప్రార్థన చేశారు.

పది దిక్కుల వాళ్ళు కూడా బలిని చూసి శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తికి ఇంత శిక్ష వేయడమా! అని హాహాకారములు చేశారు. బ్రహ్మగారు వచ్చి ‘ఇటువంటి భక్తుడిని నేను ఇంతకు పూర్వం చూడలేదు. దయచేసి బలిచక్రవర్తిని విడిచి పెట్టవలసినది’ అని కోరారు. బలిచక్రవర్తి తాతగారయిన ప్రహ్లాదుడు వస్తే బలిచక్రవర్తి ‘నా కాళ్ళు చేతులు వరుణ పాశములతో కట్టేశారు. అంతటి మహాపురుషుడయిన తాతగారు వస్తుంటే నా చేతులు ఉండి కూడా నేను నమస్కరించలేకపోతున్నాను’ అని ఏడుస్తూ నిలబడ్డాడు. ప్రహ్లాదుడు వామనుని వద్దకు వచ్చి ‘స్వామీ! ఇంతకూ పూర్వం ఇతనికి ఇంద్రపదవి నీ అనుగ్రహం వలననే వచ్చింది. నీవే మొదటి గురువువి. నీవే శుక్రాచార్యులలో ప్రవేశించి యాగం చేయించావు. గురువు అనుగ్రహంగా యాగభోక్తవై ఆనాడు విశ్వజిత్ యాగమును ఆదరించి బ్రహ్మాండమయిన రథమును ఇచ్చావు. దానివల్ల అమరలోకం వచ్చింది. ఇంద్రపదవి వచ్చింది. వీటినన్నిటిని నీవే ఇచ్చావు. ఈవేళ నీవే తీసేశావు. చాలా మంచిపని చేశావు. హాయిగా నీ పాదములు నమ్ముకుని నిన్ను సేవించు కోవడంలో ఉన్న ఐశ్వర్యం మరెక్కడా లేదు. స్వామీ!ఎంత వరమును ఇచ్చావు’ అన్నాడు.

శ్రీమహావిష్ణువు ‘మీరందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను బలిచక్రవర్తికి గొప్ప సన్మానమును చేశాను. అతను ఆత్మను తెచ్చి నా పాదముల దగ్గర పెట్టేశాడు. ఆత్మనివేదనం చేశాడు. సంపూర్ణ శరణాగతి చేశాడు. ఇటువంటి వాడిని నేను పాడుచేస్తానా? నేను ఉన్నాను అనడానికి నేను వీనిని రక్షించాలి. వానిని వరుణపాశములతో కట్టాను. అలా నిలబడిపోయాడే కానీ తెంచుకునేందుకు ప్రయత్నించ లేదు. సావర్ణిమనువు అయిన కాలంలో ఇతనిని నేను దేవేంద్రుని చేస్తాను. ఆ తరువాత ఎవ్వరూ రాని ప్రదేశము, ఎవ్వరూ దర్శించని ప్రదేశము కేవలము నిలబడి ప్రార్థన చేస్తే నా అశరీరవాణి వినపడుతుంది తప్ప నేనున్న మూలమయిన చోటును ఎవరు చూడరో అటువంటి చోటుకు వీనిని రప్పించుకుని నాలో కలిపేసుకుంటాను. అప్పటివరకు దేవతలు కూడా ఎక్కడ ఉండాలని కోరుకుంటారో అటువంటి సుతల లోకమునకంతటికీ ఇతనిని అధిపతి చేస్తున్నాను. సర్వకాలములయందు నా సుదర్శన చక్రము ఇతనికి అండగా వుండి రక్షిస్తుంది. పదిదిక్కులను పరిపాలించే దిక్పాలకులు ఎవరూ కూడా బలిచక్రవర్తి జోలికి వెళ్ళడానికి వీలులేదు ఇది నా శాసనం. అటువంటి వాడై సుతల లోకంలో రోగములు కాని, ఆకలి గాని, దప్పిక గాని, ఏమీ లేకుండా ఉంటాడు’ అన్నారు.

మరి బలిచక్రవర్తి యందు దోషమేమిటి? అతనికి శిక్ష ఎందుకు పడింది? బలిచక్రవర్తికి దుర్జన సాంగత్యము ఉన్నది. అతను లోపల ఎంత గొప్పవాడయినా చాలాకాలం రాక్షసులతో కలిసి తిరిగాడు. ఇవాళ సజ్జనుడై మనస్సు నిలబెట్టుకున్నాడు. భ్రుగువంశ సంజాతులయిన బ్రాహ్మణులతో కలిసి తిరగడంతో అతనికి ఇప్పుడు ఈశ్వరుడు అంటే ఏమిటో అర్థం అయింది. ఈ తిరిగిన ఫలితమునకు ఇంత గొప్ప వరమును ఇస్తున్నాను. రాక్షసులతో తిరగడం వలన మనసులో ఉండిపోయిన ‘నేను దానం ఇస్తున్నాను’ అనే చిన్న అభిజాత్యానికి వరుణపాశంతో కట్టాను. కానీ అతను చేసిన శరణాగతికి అతడిని సుతల లోకమునకు అధిపతిని చేసి సావర్ణిమనువు వేళకు ఇంద్రుడిని చేసి తదనంతరము నాలో కలుపుకుంటాను.


‘అదితి ఆరోజు కోరింది కాబట్టి ఇంద్రునికి తమ్మునిగా పుట్టాను. ఇవాళ నుండి నన్ను ఉపేంద్రుడని పిలుస్తారు’ అని అన్నారు. యథార్థమునకు ఇంద్రుడు ఆయన కాలి గోటికి చాలడు. అటువంటి వానికి తమ్ముడని పిలిపించుకుని పొంగిపోతున్నాడు. తాను సంపాదించిన రాజ్యములో భాగము అడగకుండా ఇంద్రునికి ఇచ్చేశాడు. ఇంద్రుడు రాజ్యాభిషిక్తుడై తిరిగి స్వర్గమును పొందాడు. అమ్మకి ఇచ్చిన వరమును పూర్తిచేశాడు. తను మళ్ళీ శ్రీమన్నారాయణుని పథమును చేరుకుంటూ ఒకమాట చెప్పాడు.

ఈ వామనమూర్తి కథను వింటున్నవారు ‘ఎక్కడయినా పితృ కార్యములు చేయకపోతే వామనమూర్తి కథ వింటే వారు సశాస్త్రీయంగా పితృకార్యం చేసినట్లే. ఎక్కడైనా ఉపనయనం చేస్తే ఆ ఉపనయనంలో తెలిసి కాని, తెలియక గాని, ఏమయినా దోషములు దొర్లితే ఆ దోషములు పరిహరింపబడతాయి. ఆ ఉపనయనము పరిపూర్తియై ఆ బ్రహ్మచారి గాయత్రీ మంత్రము చేసుకోవడానికి పూర్ణమయిన సిద్ధిని పొందాలంటే వటువు వామనమూర్తి కథను వినాలి. ఎవరు ఈ వామనమూర్తి కథను చదువుతున్నారో అటువంటి వారి పాపములను దహించి ఊర్ధ్వలోకములయందు నివాసము ఇస్తాను. వారికి లక్ష్మీకటాక్షము కలుగుతుంది. వాళ్లకి ఉన్న దుర్నిమిత్తములు అన్నీ పోతాయి’ అని సాక్షాత్తుగా భగవానుడే ఫలశ్రుతిని చెప్పారు.


ఇది అంత పరమ ప్రఖ్యాతమయిన ఆఖ్యానము.


🙏💐🌹🌺🌸🪷🌷🌻

ఆదిశంకరాచార్యుల రచనలు

 *ఆదిశంకరాచార్యుల రచనలు సంబంధ 49  పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------

శంకరాచార్య చరిత్రము www.freegurukul.org/g/AdiShankaracharya-1


శంకర భగవత్పాద గ్రంధ మాల www.freegurukul.org/g/AdiShankaracharya-2


వివేకచూడామణి(సర్వవిధానంద సరస్వతి స్వామి అనువాదం) www.freegurukul.org/g/AdiShankaracharya-3


శంకర గ్రంధ రత్నావళి www.freegurukul.org/g/AdiShankaracharya-4


శంకర హృదయము www.freegurukul.org/g/AdiShankaracharya-5


పంచీకరణ భాష్యము www.freegurukul.org/g/AdiShankaracharya-6


ప్రభోధ రత్నావళి www.freegurukul.org/g/AdiShankaracharya-7


ఆదిశంకరుల అపరోక్షానుభూతి www.freegurukul.org/g/AdiShankaracharya-8


సిద్ధాంత బిందు www.freegurukul.org/g/AdiShankaracharya-9


జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్య www.freegurukul.org/g/AdiShankaracharya-10


శంకర గ్రంధ రత్నావళి-1 www.freegurukul.org/g/AdiShankaracharya-11


శంకర గ్రంధ రత్నావళి-2 www.freegurukul.org/g/AdiShankaracharya-12


శంకర గ్రంధ రత్నావళి-7 www.freegurukul.org/g/AdiShankaracharya-13


శంకర గ్రంధ రత్నావళి-13 www.freegurukul.org/g/AdiShankaracharya-14


శంకర గ్రంధ రత్నావళి-16 www.freegurukul.org/g/AdiShankaracharya-15


ఆదిశంకరాచార్య దివ్యచరితామృతము www.freegurukul.org/g/AdiShankaracharya-16


ఆదిశంకరుల ఆత్మ బోధ www.freegurukul.org/g/AdiShankaracharya-17


బ్రహ్మ సూత్రాలు www.freegurukul.org/g/AdiShankaracharya-18


శివానందలహరి www.freegurukul.org/g/AdiShankaracharya-19


శివానందలహరి,బ్రమరాంబ అష్టకం www.freegurukul.org/g/AdiShankaracharya-20


సౌందర్యలహరి(వచన) www.freegurukul.org/g/AdiShankaracharya-21


శ్రీ విద్యా లహరి-సౌందర్యలహరికి విశేష వ్యాఖ్య www.freegurukul.org/g/AdiShankaracharya-22


సౌందర్యలహరి www.freegurukul.org/g/AdiShankaracharya-23


నిత్య సౌందర్య లహరి www.freegurukul.org/g/AdiShankaracharya-24


భవాని సౌందర్యలహరి www.freegurukul.org/g/AdiShankaracharya-25


వివేక చూడామణి www.freegurukul.org/g/AdiShankaracharya-26


వివేక చూడామణి(పుల్లెల శ్రీరామచంద్రుడు అనువాదం) www.freegurukul.org/g/AdiShankaracharya-27


భజ గోవిందం www.freegurukul.org/g/AdiShankaracharya-28


భజగోవిందం(విద్యాప్రకాశానందగిరి స్వామి అనువాదం) www.freegurukul.org/g/AdiShankaracharya-29


అవధూత గీత www.freegurukul.org/g/AdiShankaracharya-30


భజించు మనసా(పాటలు) www.freegurukul.org/g/AdiShankaracharya-31


భజగోవిందం(వచన) www.freegurukul.org/g/AdiShankaracharya-32


ఆదిశంకరుల అమృత గుళికలు www.freegurukul.org/g/AdiShankaracharya-33


ఆదిశంకరుల స్తోత్రాలు www.freegurukul.org/g/AdiShankaracharya-34


ఆదిశంకరుల ప్రకరణాలు www.freegurukul.org/g/AdiShankaracharya-35


మణిరత్నమాల స్తోత్రం www.freegurukul.org/g/AdiShankaracharya-36


శ్రీ శాంకర సూక్తం www.freegurukul.org/g/AdiShankaracharya-37


అష్టావక్ర గీత www.freegurukul.org/g/AdiShankaracharya-38


కనకధార స్తవం www.freegurukul.org/g/AdiShankaracharya-39


ప్రభోద సుధాకరం www.freegurukul.org/g/AdiShankaracharya-40


శంకర విజయం(వచన) www.freegurukul.org/g/AdiShankaracharya-41


ప్రశ్నోత్తరి మణిమాల www.freegurukul.org/g/AdiShankaracharya-42


షట్పదీ స్తోత్రం www.freegurukul.org/g/AdiShankaracharya-43


దక్షిణామూర్తి స్తోత్రం-వివరణ www.freegurukul.org/g/AdiShankaracharya-44


దక్షిణామూర్తి స్తోత్రం www.freegurukul.org/g/AdiShankaracharya-45


దక్షిణామూర్తి స్తోత్రం(వచన) www.freegurukul.org/g/AdiShankaracharya-46


శంకర గ్రంధ రత్నావళి లలితా త్రిశతి భాష్యం www.freegurukul.org/g/AdiShankaracharya-47


గాయత్రి మంత్ర శంకర భాష్యము www.freegurukul.org/g/AdiShankaracharya-48


శ్రీమద్భగవద్గీత -శ్రీ శంకర భాష్యం యధాతదం www.freegurukul.org/g/AdiShankaracharya-49

మంగళవారం, సెప్టెంబరు 26, 2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


మంగళవారం, సెప్టెంబరు 26, 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - వర్ష ఋతువు

భాద్రపద మాసం - శుక్ల పక్షం

తిథి:ద్వాదశి రా11.15 వరకు  

వారం:మంగళవారం(భౌమవాసరే)

నక్షత్రం:శ్రవణం ఉ7.45 వరకు తదుపరి ధనిష్ఠ తె6.05 వరకు

యోగం:సుకర్మ మ10.58 వరకు

కరణం:బవ మ12.27 వరకు తదుపరి బాలువ రా11.15 వరకు

వర్జ్యం:ఉ11.29 - 12.58

దుర్ముహూర్తము:ఉ8.16 - 9.04 &

రా10.41 - 11.29

అమృతకాలం:రా8.24 - 9.53

రాహుకాలం:మ3.00 - 4.30

యమగండ/కేతుకాలం:ఉ9.00 - 10.30

సూర్యరాశి: కన్య

చంద్ర రాశి : మకరం 

సూర్యోదయం:5.53

సూర్యాస్తమయం: 5.53


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

పంచాంగం 26.09.2023 Tuesday,

 ఈ రోజు పంచాంగం 26.09.2023 Tuesday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస శుక్ల పక్ష: ద్వాదశి తిధి భౌమ వాసర: శ్రవణా నక్షత్రం సుకర్మ యోగ: బవ తదుపరి బాలవ కరణం ఇది ఈరోజు పంచాంగం.

ద్వాదశి రాత్రి 01:44 వరకు.

శ్రవణం పగలు 09:39 వరకు .

సూర్యోదయం : 06:09

సూర్యాస్తమయం : 06:05

వర్జ్యం : మధ్యాహ్నం 01:14 నుండి 02:40 వరకు.

దుర్ముహూర్తం : పగలు 08:32 నుండి 09:20 వరకు తిరిగి రాత్రి 10:55 నుండి 11:43 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.


యమగండం : పగలు 09:00 నుండి 10:30 వరకు.  



శుభోదయ:, నమస్కార:

వామన జయంతి విశిష్టత

 *🌻. వామన జయంతి విశిష్టత 🌻*


ధర్మ సంస్థాపనకోసం అవసరమైన సందర్భాల్లో అవతరిస్తూనే ఉంటా'నని శ్రీమహావిష్ణువు అభయ ప్రదానం చేశాడు.


ఆ పరంపరలో ఆవిష్కారమైన అయిదోది వామనావతారం. భాద్రపద శుద్ధ ద్వాదశినాడు అదితి , కశ్యపుల కుమారుడిగా శ్రీహరి వామనమూర్తిగా అవతరించాడు.


దీన్ని వామన ద్వాదశిగా , విజయ ద్వాదశిగా వ్యవహరిస్తారు.


సృష్టిలోని జీవావరణంలో జీవులు సూక్ష్మరూపం నుంచి మహా భారీకాయం వరకు వైవిధ్యభరితంగా గోచరమవుతాయి. ఈ అణుత్వం , మహారూపాలు పరస్పర విరుద్ధమైనవి. కానీ, ఆ వైవిధ్యం ఆత్మ , పరమాత్మల విషయంలో లేదని వేదోక్తి. ఆత్మ అణువు కంటే సూక్ష్మమైనది , మహత్తరమైనది. అది ఎంత సూక్ష్మమైనదో , అంత స్థూలమైనదని కఠోపనిషత్తు ప్రకటించింది. వామనావతార నేపథ్యం ఇదే !


వామనావతార విశేషాల్ని శ్రీమద్భాగవతం , వామన పురాణాలు విశదీకరిస్తున్నాయి.


ఓసారి బలి చక్రవర్తి ఇంద్రుణ్ని ఓడించి , స్వర్గానికి అధిపతి అయ్యాడు. విజయగర్వంతో రాక్షసులు అనేక అకృత్యాలకు పాల్పడసాగారు. దాంతో దేవతల మాతృమూర్తి అదితి కలత చెంది , కేశవుణ్ని వేడుకుని , అనుగ్రహాన్ని పొందింది.  ఫలితంగా నారాయణుడు దేవతల రక్షణార్థం వామనుడిగా అవతరించాడు.


అతనికి ఉపనయన సంస్కారాలు జరిగాయి. బ్రహ్మ తేజస్సు , దివ్య యశస్సులతో వెలిగే వటుడైన వామనుడు దండాన్ని , గొడుగును , కమండలాన్ని ధరించి బలి చక్రవర్తి నిర్వహించే యజ్ఞశాలలోకి ప్రవేశించాడు.



'స్వస్తి జగత్త్రయీ భువన శాసనకర్తకు...' `అంటూ బలిని ఆశీర్వదించాడు. సందర్భోచిత లౌక్యాన్ని ప్రదర్శించాడు. వామనుడి వర్చస్సు, వాక్చాతుర్యానికి ముగ్ధుడై బలి చక్రవర్తి ఏం కావాలో కోరుకొమ్మన్నాడు.


*కేవలం నా పాదాలకే పరిమితమైన మూడు అడుగుల భూమిని మాత్రం నాకివ్వు చాలు'  అన్నాడు వామనుడు.


ఆ వటుడి రూపంలాగానే అతడి కోరిక కూడా కురచగానే ఉందని బలి భావించాడు. భూ దానానికి సమాయత్తమైన బలిని అతడి గురువు శుక్రాచార్యుడు నిలువరించాడు.


అయినా బలి శుక్రుడి మాట వినకుండా, వామనుడికి ఉదకపూర్వకంగా భూమిని దానం చేశాడు. త్రివిక్రముడిగా వామనుడు విరాట్‌ రూపాన్ని సంతరించుకుని, ఓ పాదంతో భూమినీ, మరో పాదంతో స్వర్గాన్నీ ఆక్రమించి, మూడోపాదం బలి శిరస్సుపై ఉంచి, అతణ్ని రసాతలానికి అణగదొక్కాడు.


బలి సర్వ సమర్పణా భావానికి ప్రసన్నుడైన వామనుడు సుతల లోక రాజ్యాన్ని అనుగ్రహించాడు. ఇంద్రుడికి తిరిగి స్వర్గలోకాధిపత్యాన్ని కల్పించాడు.


వామన పురాణంలో ఇదే గాథను పోలిన మరో వృత్తాంతం గోచరమవుతుంది.


దుంధుడు అనే దానవుడు దేవతలపై దండెత్తే బలాన్ని సమకూర్చుకోవడానికి దేవికా నదీ తీరాన అశ్వమేధ యాగం చేయసాగాడు. దుంధుణ్ని యుక్తితో జయించాలని, శ్రీహరి వామన రూపంలో దేవికానదిలో ఓ దుంగలాగా తేలుతూ కొట్టుకుపోసాగాడు. దుంధుడు, అతడి అనుచరులు ఆ బాలుణ్ని రక్షించారు. తన పేరు గతి భానుడనీ, తాను మరుగుజ్జునైనందువల్ల ఆస్తి వివాదాల్లో తనను దాయాదులు నదిలో పడవేశారని చెప్పాడు.


అతడి దీనగాథను విని దుంధుడు ఏం కావాలో కోరుకొమ్మన్నాడు.


మూడడుగుల నేల కోరిన వామనుడు ఆ సంవిధానంలోనే దుంధుణ్ని భూమిలోకి తొక్కి సమాధి చేశాడని పురాణగాథ.


వామనావతారం ఆత్మ తత్వాన్ని అద్భుతంగా ప్రకటించింది. జీవుడు తనలో ఉన్న ఆత్మ, విశ్వాంతరాళంలో ఉన్న పరమాత్మ ఒక్కటేనని జ్ఞానపూర్వకంగా గుర్తించాలి. ఆ స్పృహ ఏర్పడే కొద్దీ వామనరూపం అనూహ్యంగా పెరిగి పెద్దదై, విశ్వవ్యాప్తమై, పరమాత్మ తత్వమై భాసిల్లుతుంది.


యజ్ఞయాగాదులనేవి పేరుకోసం చేయవద్దనీ, నేను ప్రభువును, నేను గొప్ప దాతనని గర్వించడం తగదని భగవద్గీత హెచ్చరించింది.


పరుల ధనాన్నీ, భూమిని ఆక్రమించడం, దానం చేయడం, నేను కర్తను, భోక్తను అని విర్రవీగేవారు అజ్ఞానులని ఈశావాస్య ఉపనిషత్తు చెబుతోంది.


ఈ నేపథ్యమే బలి పతనానికి దారి తీసింది. మనిషి బిందు స్థితిలో బీజప్రాయంగా నిద్రాణంగా ఉన్న శక్తిని ఆత్మవిశ్వాసంతో గుర్తించాలి. దీని ద్వారా మనిషి మహనీయుడిగా ఎదగవచ్చని వామనావతారం సందేశమిస్తుంది.


మరుసటి రోజు వామన ద్వాదశి ముందు రోజు ఏకాదశినాడు ఉపవసించి, జాగారం చేసి, వామన విగ్రహాన్ని పూజిస్తారు. శుక్ర ద్వాదశి, వామన ద్వాదశి, శ్రవణ ద్వాదశి, మహా ద్వాదశి, అనంత ద్వాదశి, కల్కి ద్వాదశి అన్న పేర్లూ ఈ పర్వదినానికున్నాయి.

గోపాష్టమి నాడు..

 ఇందిరా గాంధీ 3వ ప్రధానిగా పదవి అలంకరించడానికి ముందు పరిస్థితి..


ఆమె ఎట్టి పరిస్థితులలో ప్రధాని అయ్యే అవకాశమే కనిపించలేదు.  ఆనాటి పరిస్థితులలో (దక్షిణాది) మద్రాస్ వాడైన నిజలింగప్పకు పూర్తి మద్దతు ఉంది.  అప్పుడు ఇందిరా గాంధీ గారు సాధు సంతుల ఆశీర్వాదం కోసం తిరిగింది.  వారిలో కరపాత్రి స్వామి (హరిహరానంద సరస్వతి) ఒకరు.  ఆయన అమ్మా మాకు ఒక మాట ఇస్తే మేము నీవు ప్రధనిగా కావడానికి ఆశీర్వాదం ఇస్తాము అన్నారు.  మీరు కోరిన ప్రమాణం చేస్తాను నన్ను ప్రధాని పదవి వరించేట్లు ఆశీర్వదించండి అని వేడుకుందట ఇందిర...


నీవు ప్రదాని పదవిని చేపట్టిన వెంటనే గోవధ నిషేధ చట్టం తీసుకురావాలి అన్నారు.  అలాగే స్వామి అని ఇందిరా గాంధీ మాట ఇచ్చింది. కరపాత్రి స్వామి (హరిహరానంద సరస్వతి) మరియు శంకరాచార్య ఇద్దరూ ఆమెను ఆశ్వీర్వదించారు.  వారి ఆశీర్వాద బలమో లేక ఆమె అదృష్టమో గాని తర్వాత ఇందిరా గాంధీ భారతదేశానికి 3వ మురియు మొదటి మహిళా ప్రధాని గా పదవి చేపట్టింది.


కరపాత్రి స్వామి, శ్రీ శంకరాచార్య ఇద్దరూ రెండు సార్లు ఆమెను కలసి ఆమె ఇచ్చిన మాటనిలబెట్టుకోమని అడిగారు. ఆమె వారికి కల్లబొల్లి కబుర్లు చెప్పి పంపించి వేసింది.  గోపాష్టమి నాడు కరపాత్రి స్వామి, శ్రీ శంకరాచార్యుల ఆద్వర్యంలో డిల్లీకి గోవులు సంతులు  బయలు దేరారు.


 ఇందిరా గాంధీ వారిమీద కాల్పులు జరిపించింది.  అనేకమంది సంతులు చాలా గోవులు తూటాల బారిన పడి చనిపోయాయి. కరపాత్రి స్వామి కోపంతో అమ్మా మమ్మల్ని బాధించావు.. సంతులం కనుక క్షమిస్తాము.  కానీ మా తల్లి గోమాతలను చంపించావు.. దీనికి నా శాపం తప్పక నీకు తగిలి తీరుతుంది.  నీ వంశం నిర్వంశమౌతుంది అని శపించారు.


ఈ విషయం ఆనాటి పత్రికలలో వచ్చింది. ఆర్యవ్రత్, కేసరి పత్రికలలో ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రచురించారు.


సాధువుల శాపవాక్కుకు ఎంతటి బలం ఉందో చూడండి.


ఇందిరా గాంధీ సాధువుల మీద, గోవులమీద తుపాకులతో కాల్పులు జరిపించిన రోజు గోపాష్టమి..


ఇందిరాగాంధీ రెండవ కుమారుడు సంజయ్ గాంధీ చనిపోయినది గోపాష్టమి నాడు..


ఇందిరా గాంధీ హత్య చేయబడింది గోపాష్టమి నాడు..


రాజీవ్ గాంధీ హత్య చేయబడింది గోపాష్టమి నాడు..


సాధువులను, గోవులను హింసించిన వాడు ఎవ్వరూ బాగుపడలేదని చెప్పడానికి ఇది గొప్ప ఉదాహరణ.


Forwarded message

అద్భుతం

 *అద్భుతం*                                                                                              

ఒక చిన్నబాబు అతని పిగ్గీబ్యాంక్ పగలగొట్టి అందులోని డబ్బులు లెక్కపెడుతున్నాడు...

చాలా జాగ్రత్తగా లెక్క పెడుతున్నాడు...మూడుసార్లు లెక్కపెట్టాడు.


తప్పు ఉండకూడదు అని తనకు తాను చెప్పుకుంటున్నాడు..

ఆ డబ్బులు తీసుకుని నెమ్మదిగా 

తన ఇంటి వెనకాల తలుపు నుండీ వెళ్ళి ఒక మందుల షాప్ దగ్గర నుంచున్నాడు..


షాప్ లో ఆవిడ తనవేపు చూసేవరకు ఎదురుచూస్తూ నుంచున్నాడు...

షాప్ ఆవిడ బాబుని చూసి అడిగింది.. ఏమి కావాలి బాబు అని..బాబు చెప్పాడు..

నాకు ఒక అద్భుతం కావాలి అని..

షాప్ ఆవిడ అర్ధం కానట్టూ ఏంటి బాబు సరిగ్గా చెప్పవా అని అడిగింది..


నాకూ సరిగ్గా తెలీదు..కానీ చెల్లికి ఆరోగ్యం ఏమీ బాలేదు కదా..నాన్న అంటున్నారు ఒక అద్భుతం మాత్రమే చెల్లిని కాపాడగలదు అని..చెల్లి చాలా కష్టపడుతోంది..అందుకే నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తెచ్చాను అద్భుతం కొనుక్కుని వెళ్దామని..అది ఉంటే చెల్లికి నయం అయిపోతుంది..అని అడిగాడు బాబు...


ఆవిడకి ఏమి చెప్పాలో అర్ధం కాలేదు..

ఇక్కడ అద్భుతాలు అమ్మము బాబు అని షాప్ ఆవిడ బాధగా చెప్పింది..బాబు మాటలకి విషయం అర్ధం అయ్యి ఆవిడకి బాధేస్తోంది....


నా దగ్గర డబ్బులు ఉన్నాయి అద్భుతం కొనేందుకు..అవి చాలకపోతే నేనింకా డబ్బులు తెచ్చిస్తాను..అని బతిమలాడుతున్నట్టుగా అడుగుతున్నాడు బాబు...


ఇంతలో బాబు పక్కనే ఇదంతా వింటున్న 

పొడుగ్గా ఉన్న , మంచిగా తయారయ్యి ఉన్న , హుందాగా ఉన్న ఒకాయన బాబుని అడిగారు...


ఏమిటి నీ చెల్లి సమస్య, నీకు తెలుసా అని ...

బాబు చెప్తున్నాడు..చెల్లికి తలలో చెడుది ఏదో పెరుగుతోందంటా..

అది బాగవ్వాలంటే సరిపడా డబ్బులు లేవు, అద్భుతం ఉంటే చెల్లి తప్పక బాగవుతుంది.

 అని నాన్న అమ్మకి చెప్తుంటే విన్నాను...సరే అదేదో కొందామని నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తెచ్చేసాను, కావాలంటే ఇంకా డబ్బులు పోగేసి తెస్తాను..

అని చెప్తుంటే బాబుకి తెలీకుండానే అతని చిట్టి చెంపల మీద కన్నీళ్ళు జారుతున్నాయి....


ఆ పొడుగు మనిషి కొంచెం కిందకు వంగి బాబుని అడిగారు నీ దగ్గర ఎంత డబ్బు ఉందీ అని..బాబు చెప్పాడు 83 రూపాయలు...అని...అదీ వినపడి వినపడనట్టు..


ఓ అవునా ...తమాషా చూడు నీ చెల్లికి కావాల్సిన అద్భుతం కూడా సరిగ్గా 83 రూపాయలే..ఏదీ పద నా దగ్గర ఉన్న అద్భుతం నీ చెల్లెలికి సాయపడగలదేమో చూద్దాం.. అని నెమ్మదిగా ఒక చేత్తో బాబు చెయ్యి పట్టుకుని ఇంకో చేత్తో బాబు అందించిన డబ్బులు తీసుకుని చొక్కా జేబులో పెట్టుకున్నారు బాబు తృప్తి కోసం..


ఆయన ఒక పేరు పొందిన పెద్ద హాస్పిటల్ కి డైరెక్టర్...ఆయన ఒక్కరే చిన్నిపాప సమస్యకు వైద్యం చెయ్యగలరు...


ఆయన దయ వల్ల పాపకు ఒక్క పైసా కూడా ఇవ్వనక్కరలేకుండానే ఆపరేషన్ జరిగింది...తొందరగానే పాప ఇల్లు చేరి మునుపటిలాగా ఆరోగ్యంగా బాబుతో సరదాగా ఉండగలుగుతోంది...తల్లి అంటోంది...

ఎంత అద్భుతం జరిగిందీ అది కూడా ఒక్క పైసా ఖర్చు పెట్టనక్కరలేకుండానే అని తండ్రితో అంటోంది...


అది విన్న బాబు నవ్వుకుంటున్నాడు. వాడికి మాత్రమే తెలుసు.

..ఒక అద్భుతం ఖరీదు 83 రూపాయలు అని...

కానీ ఒక అద్భుతం విలువ 83 రూపాయలు ప్లస్ ఆ చిన్ని బాబు అపార విశ్వాసం...

కల్మషం లేని ప్రేమ, స్వార్ధం లేని ప్రయత్నం తప్పక ఫలిస్తాయి..దేవుడిని నమ్ముకున్నవారికి ఏదో ఒక రూపేణా తప్పక సాయం అందుతుంది..

అది ఒక అద్భుతం లాంటి ఒక మంచి మనిషి మానవత్వం రూపంలో...

మనిషికి మనిషి సాయం చెయ్యాలి, అని అనుకోవాలి, అంతే.....................                                 *సేకరణ*

_*మన దేవాలయాలు

 _*మన దేవాలయాలు*_



 _*నవ గ్రహ దేవాలయాలు..!!*_

*ఓం గం గణపతయే నమః*

 *ఓం నమః శివాయ..!!*

                        

*ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ*

*గురు శుక్ర శనిభ్యచ్చ రాహావే కేతవే నమః..!!* 


నవగ్రహములు తొమ్మిది, 

ఒకొక్క గ్రహనికి ఒక్కొక్క దేవాలయము ఉన్నది. 


*కుంభ‌కోణం:.*


తమిళనాడు లోని కుంభకోణం క్షేత్రానికి అతి సమీపంలో నవగ్రహ దేవాలయాలున్నాయి. వీటిని దర్శించిన భ‌క్తులు విశేషంగా గ్రహ పీడలను తొలగించుకొంటారు. 

ఈ ఆలయాలనే నవగ్రహ స్థలాలు అంటారు.


*1) సూర్యనార్ కోయిల్ ., తిరుమంగళంకుడి.*


తమిళనాడు రాష్ట్రము లోని తంజావూరు జిల్లాలో కుంభకోణం నుండి 15 k.m దూరములో గల తిరుమంగళంకుడి అను ప్రాంతములో


సూర్యనార్ కోయిల్ అనీ పిలువబడే సూర్యదేవాలయము వున్నది. ఈ ఆలయములో సూర్యభగవానుడు ఆయన సతీమణులు అయిన ఉష , ఛాయా సమేతముగా భక్తులకు దర్శనమిస్తున్నారు .ఈ ఆలయాన్ని క్రీ . శ 1075 -1120 సంవత్సరాల మధ్య కాలంలో ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది . ఈ ఆలయ ప్రాంగణములో కాశీ విశ్వేశ్వరుడు విశాలక్ష్మీని, నవగ్రహాలచే ప్రతిష్టించిన వినాయకుని దర్శించు కోవచ్చు. ఈ ఆలయములో సూర్యభగవానుడికి తామర పుష్పాలతో పూజలు చేయడము విశేషము.ఈ ఆలయ పూజలు చాల నిష్ఠగా జరుగుతాయి, పూజాంనతరము (పూజ తరువాత) ఆలయము చుట్టూ 9 సార్లు ప్రదక్షణ చెయ్యవలసి వుంటుంది, మరియు ఇక్కడ పూజలు చేయిస్తే ఆయురా రోగ్యాలతో ఉంటారని అక్కడి భక్తుల ద్వారా తెలుస్తుంది. 

ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. రవి సంపద ప్రదాత కూడా. 1100వ సంవత్సరంలో కులోత్తుంగ చోళ మహారాజు సూర్య దేవాలయాన్ని నిర్మించాడు. ప్రతి ఏడాది పంటలు చేతికి వచ్చే జనవరి మాసంలో సూర్యునికి కృతజ్ఞతలు తెలియ జేసేందుకు విశేషమైన ఉత్సవాన్ని ఇక్కడ నిర్వహిస్తారు.


*2) చంద్రగ్రహ దేవాలయము., తిరువైయార్..*


తిరువైయారుకు 5k.mదూరములో 

చంద్రగ్రహ దేవాలయము వుంది. 

తిన్గాలుర్ కోవిల్ అని పిలువబడే 

చంద్ర దేవాలయములోని చంద్ర భగవానుని దర్శనము సుఖాన్ని, దీర్ఘాయుస్సున్ని, ప్రసాదిస్తుందని 

భక్తుల నమ్మకము. మానసిక ఒత్తిడి, దుఖాన్ని తగ్గించేవాడు చంద్రుడని చెబుతారు. సెప్టెంబర్. అక్టోబర్ మాసాలలో వచ్చే ఫాల్గుణ నక్షత్ర సమయాలలో చంద్రకాంతి ఇక్కడి ఆలయములోని శివ లింగముపై సరాసరిగా ప్రసరించడము విశేషమయినది.


*3) అంగారక (కుజ) గ్రహ దేవాలయము., వైథీశ్వరన్ కోవిల్.*


తిరువైయార్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో కుజ దేవాలయం ఉంది. 

దీనికి ‘’వైథీశ్వరన్ కోవిల్’’అని పేరు. 

అనేక వ్యాధులను అంగారకుడు పోగొడతాడని విశ్వాసం. ధైర్యం విజయం శక్తికి అంగారకుడే కారణం. ఇక్కడే జటాయువు, గరుడుడు, సూర్యుడు అంగారకుని పూజించారని స్థల పురాణం చెపుతోంది. వివాహం ఆలస్యం అయితే అంగారక క్షేత్రాన్ని దర్శిస్తే వెంటనే పెళ్ల‌యిపోతుంది. ఇక్కడ అనేక వ్యాధులను అంగారకుడు రూపుమపుతాడని భక్తుల విశ్వాసము, నమ్మకము. ధైర్యము, విజయము, శక్తికి అంగారకుడే కారణము.వివాహము ఆలస్యము అయితే ఈ అంగారక క్షేత్రాని దర్శిస్తే వెంటనే వివాహము అవుతుందని స్థానికులు చెపుతున్నారు .


*4) బుధగ్రహ దేవాలయము., తిరువెన్నాడు.*


అంగారక ఆలయానికి 10 k.m దూరములో బుధగ్రహ దేవాలయము వున్నది.ఇక్కడి స్వామి శ్వేతారన్యేశ్వరుడు. 

అమ్మవారు బ్రహ్మ విద్యయంభి కాదేవి.వాల్మీకి రామాయణములో ఈ దేవాలయము గురించి వుంది అని చెబుతారు. కనుక ఈ ఆలయానికి 3000 ఏళ్ల నాటి చరిత్ర వున్నది అని తెలుస్తుంది .ఇక్కడ బుధగ్రహ దేవాలయము దర్శించిన వారికి వ్యాపారానికి మరియు బుద్ధిని ప్రసాదిస్తాడని ఇక్కడ ప్రజలకు నమ్మకము.


*5) బృహస్పతి (గురు) గ్రహ దేవాలయము., ఆలంగుడి.*


కుంభకోణానికి 18 k.m దూరములో ఆలంగుడి లో గురు గ్రహ దేవాలయము వున్నది. 

ఈ ఆలయాన్ని గురు దక్షిణామూర్తి ఆలయంగా భక్తులు పిలుస్తారు.ఇది తమిళనాడులో ప్రఖ్యాతి గాంచిన దివ్యక్షేత్రము.దీనిని క్రీ.శ 1131 లో విక్రమచోల చక్రవర్తి నిర్మిచారు. శివుడే దేవ గురువు బృహస్పతి నామదేయముతో గురుదక్షిణా మూర్తిగా పూజలు అందు కుంటూన్న పుణ్యక్షేత్రము ఇది. 

పార్వతి అమ్మవారు ఇక్కడి ఆలయం లోపలున్న అమృత పుష్కరిణిలో పునర్జనం పొందిందని కధనం. ఇక్కడే శివునిలో ఐక్యమైందని చెబుతారు.

భోలాశంఖరుడు ఇక్కడే హాలాహలంని సేవించి గొంతులో దాచిన స్థలము ఇదే. ఆ విధముగా ఆపద నుంచి గట్టెకించిన శివుణ్ణి ' ఆపత్ సహాయేశ్వరర్ (ఆపద్భాందవుడు) గా కొలిచారు దేవతలు.గురుడికి ఇష్టమైన గురువారము నాడు, నాన బెట్టిన శనగలను పసుపుతాడుతో మాలగ చేసి గురు గ్రహానికి దండ వేసిన చదువులో ఆటంకాలు, వెనుక బడిన వారు చదువులో మరియు 

ఏ పని అయిన అయిపోవలిసిన వారికి, విద్యలో ఆటంకాలు, 

పనిలోనూ అన్నీ తొలగి పోతాయని నమ్మకము.గురు గ్రహ దోషాలు వున్నవారు దక్షిణామూర్తి గుడి చుట్టూ 24 ప్రదక్షిణలు చేసి ఈ స్వామి సన్నిధిలో నేతితో 24 దీపాలు భక్తితో వెలిగిస్తే ఆ దోషాలు తొలిగిపోయి, గ్రహ శాంతి కలుగు తుంది అని భక్తుల ప్రగాడ విశ్వాసము.


*6) శుక్ర గ్రహ దేవాలయము.*


కామ్చనూరు.కంచానూర్లో సూర్య దేవాలయానికి 3 k.m దూరములో శుక్ర గ్రహ దేవాలయము వుంది .

దీనికి పలాశవనం, బ్రహ్మపరి, అగ్నిస్థలము అని పేర్లు కూడా వున్నాయి. ఇక్కడే బ్రహ్మ దేవుడు, పార్వతీ పరమేశ్వరుల


వివాహాన్ని దర్శించాడట. ఇక్కడ తమ భార్యల ఆరోగ్యము కొరకు తమ భర్తలు పూజలు చేస్తారు.


*7) శని గ్రహ దేవాలయము., తిరునల్లార్..* ఇది కుంభకోణానికి 53 k.m కరైకాల్‌కు 5 కి.మీ దూరంలో వున్నది .ఇక్కడి నది తీర్ధములో స్నానం చేస్తే సర్వ పాపాలు హరించిపోతాయి అని భక్తుల నమ్మకము. ఈ ఆలయము లో వెలిసిన స్వామివారి పేరు దర్భారన్యేశ్వరుడు, ఈ దేవుడికి గరిక అంటే చాల ప్రీతి. అందుకే ఈ గుడిలో గరిక మొక్కను అతి పవిత్రముగా భావిస్తారు. అందువల్ల ఈ స్వామిని దర్భాదిపతి అని కూడా అంటారు.ఈ దేవాలయము దర్శించినపుడు భక్తులు దర్భల కొసలు ముడివేస్తారు. ఇలా ముడివేస్తే తమ కష్టాలు గట్టు ఎక్కుతాయని భక్తుల నమ్మకము .

ఇచట నలనారాయణ అనే విష్ణు దేవాలయము వున్నది. ఇక్కడ నలదమయంతుల విగ్రహాలు వున్న గుడి ఇదే.శనీశ్వరునితో పాటు నలదమయంతులను పూజ చేస్తే శని ప్రభావము ఉండదు . ఇక్కడ బ్రహ్మదండ అనే తీర్ధము కూడ వున్నది. ఇక్కడే నల మహారాజును శని పట్టుకొని పీడించటం ప్రారంభిం చాడని కధ. ఇక్కడి ‘’నల తీర్ధం ‘’చాలా మహిమ కలిగింది. ఇందులో స్నానం చేస్తే పాపాలన్నీ కొట్టుకు పోతాయ‌ని భ‌క్తుల న‌మ్మిక‌.

ఇక్కడ శనీశ్వరునికి నిత్యము అభిషేకము జరుగుతుంది.


*8) రాహు గ్రహ దేవాలయము.*

*తిరునగేశ్వరాము.*

కుంభకోణానికి 5 k.m దూరములో వుంది.ఇక్కడ రాహు గ్రహామునకు గల దేవాలయము ఇది ఒక్కటే.

ఇక్కడ నిత్యము వచ్చే రాహుకాల సమయములో పాలాభిషేకము చేస్తారు. ఆ పాలాభిషేకము జరిపినపుడు రాహువు శిరస్సు పైన నుండి పాలు పోస్తే కంట భాగము (మెడ) దగ్గరకు వచ్చేసరికి పాలు అన్నినీలము రంగులోకి మార తాయి. మిగిలిన సమయాలలో ఇలా జరగదు.ఇక్కడి శివుడు నాగనాద స్వామి. అమ్మవారు ‘’గిరి గుజాంబికా దేవి’’. ఇక్కడ ఆది శేషుడు, దక్షుడు, కారకోటుడు 

రాహువు స్థలమైన ఈ శివుడిని అర్చించారు.ఇక్కడ పూజలు చేసుకునేవారికి రాహు దోషాలు పోతాయి.


*9) కేతు గ్రహ దేవాలయము.*

*కిల్ పేరుంపళ్లమ్.*


తిరువేన్నాడ్ నుండి 6 k.m దూరములో వున్నది. ఈ ఆలయములో కేతు గ్రహ దోషానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 

ఈ ఆలయము వద్ద ఒక ప్లేటులో 7 ప్రమిదలలో దీపము వెలిగిస్తారు. 

ఇక్కడ కేతు గ్రహానికి సంబందించిన నివారణ పూజలు చేస్తారు. ఇక్కడి శివుడు మహా మహిమాన్వితుడు. రాహుకేతువులు జంట సర్పా కారంలో కలిసి ఉండి, క్షీర సాగర మథనంలో శివునికి సాయం చేశారని ప్రతీతి.


ఈ ఆలయాల వద్ద గల 9 పుష్కరిణిలో స్నానములు చేసి 12 వారాలు నవగ్రహాలను ఆరాదిస్తే, 

ఈ నవగ్రహ అనుగ్రహము లభిస్తుంది. అదిత్యాయచ సోమాయ మంగళాయ బుదాయచ..గురు శుక్ర శనిభ్యచ్చ రాహావే కేతవే నమః..!!

ఓం నమః శివాయ..!!

లోకా సమస్తా సుఖినో భవంతు..!!                

*శ్రీమాత్రే నమః-శివాయ గురవే నమః*

*సేకరణ*

Home made


 

Nirvana shatkam aadi dhankaracharya


 

Pineapple candy making


 

కాగితం కప్పులల్లో -- క్యాన్సర్

 *లండన్లో జరిగిన అంతర్జాతీయ క్యాన్సర్ సెమినార్లో నూటికి నూరు మంది సైంటిస్ట్ లు చెప్పిన నిజమిది. ఇండియాలో చదువుకున్న వాళ్లు కూడా కాగితం కప్పులల్లో టీలు, కూల్ డ్రింక్ లు తాగుతూ క్యాన్సర్ ని కొనుక్కుంటున్నారు,*


*గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు అని బాధపడ్డారు. ఎయిడ్స్ నివారణ కోసం కండోమ్ లు పంచిన ప్రభుత్వం క్యాన్సర్ నివారణచేసేందుకు గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు అని బాధపడ్డారు.*


*మీరు ఎప్పుడైనా కాగితం తయారు చేసే ఫ్యాక్టరీ కి వెళ్ళరా? ఒకసారి వెళ్లి చూడండి. జీవితంలో మీరు కాగితం కప్పులో టి తాగరు. కాగితం తయారు చేయడానికి మురికి కాలువలో ప్రవహించే నీళ్ళు వాడతారు.*


*వాటర్ ట్యాంక్ నాచుతో కంపు వాసనతో ఉంటుంది. దాని నిండా పురుగులే. చనిపోయిన ఎలుకల ఎముకలు తేలుతాయి. రా మేటిరియల్ని కుల్లబెడతారు. కాళ్ళతో తొక్కి మెత్తగా చేస్తారు. దాదాపు 15 రకాల కెమికల్స్ వాడుతారు. అందులో ఆసిడ్ లాంటి విషపూరిత కెమికల్స్ ఎక్కువ.*


*కాగితం కప్పు మెత్తబడుకుండా ప్లాస్టిక్ తో చేసిన ఫెవికాల్ లాంటి కెమికల్ గమ్ కూడా వాడతారు.*


*ఆ కాగితంలో చేసిన కప్పులో వేడి వేడి టీ పోయగానే చాలా రకాల కెమికల్స్ బయటికి వచ్చి టీలో కలుస్తాయి. మీరు గమనించండి...☝️🎥🎤

సమాన శీలవ్యసనేషు సఖ్యమ్ |



మృగా మృగైః సంగ మనుప్రజన్తి గావళ్చే గోభి స్తురగా స్తురంగైః | మూర్ఖశ్చ మూర్ఖః సుధియః సుధీభిః సమాన శీలవ్యసనేషు సఖ్యమ్ | 




మృగములు మృగములతో కలియును. గోవులు గోవులతో కలియును. గుఱ్ఱములు గుఱ్ఱములతో కలియును. మూర్ఖులు మూర్ఖులతో కలియుదురు. బుద్ధిమంతులు బుద్ధిమంతులతో కలియుదురు. గుణ దోషములలో సమానత్వము. కలవారితోనే సఖ్యము కలుగును.


శ్రీ సదానంద సరస్వతీ మహారాజ్

Gestures


 

Srinivaasa


 

Song

 https://youtu.be/NhMoe8DGYkk?si=dDIHfbiZBqwnkFNU


నిజమైన హిందువు




 నిజమైన హిందువు హిందువుగా పుడితే హిందువు కాదు హిందూ ధర్మాలను పద్ధతులను కాలరాసేవారు పార్టీ ప్రముఖులైన బంధుమిత్రులైన నిలదీయాలి అప్పుడే నీవు నిజమైన హిందువు అవుతావు ఈనాడు పార్టీ పిచ్చితో అన్ని పార్టీలలో హిందువులు ఉన్నారు కానీ అన్ని పార్టీలు ముస్లింలకు వత్తాసు పలుకుతూ హిందువులను హిందూ దేవి దేవతలను గుళ్ళు గోపురాలను బలవంతంగా కూల్చివేస్తున్నారు అయినను ఆయా పార్టీలలో ఉన్నవారు మానవత్వాన్ని చంపుకొని ధర్మాన్ని విడనాడి  హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన వాళ్లు హిందూ దేశాన్ని కాపాడాల్సిన వాళ్లు హిందూ మతానికి హిందూ ధర్మానికి హిందూ దేశానికి తీరని ద్రోహం చేసుకుంటూ ఆత్మాభిమానాన్ని చంపుకుంటూ పార్టీ  పిచ్చితో హిందూ ధర్మాన్ని కాళరాస్తున్నారు తప్పు ఎవరు చేసినా నిలదీసే దమ్ము లేని వాడు హిందువే కాదు ఈ చిన్న అమ్మాయి ఏం చెబుతున్నదో ఇకనైనా విని బుద్ధి తెచ్చుకొని నీవు ఇష్టపడ్డ పార్టీలో నీకు నీ కులానికి నీ మతానికి విలువ ఇవ్వనిచో అలాంటి పార్టీని కాలితో తన్నుకుంటూ వదిలేసి బయటికి రా నీ కులానికి నీ మతానికి నీ దేశానికి విలువ ఇచ్చే పార్టీని ఎంచుకో నిజమైన హిందువుగా బ్రతుకు లేనిచో చావు అంతేకానీ హిందువు అని చెప్పుకుంటూ హిందూ మతానికి ద్రోహం చేస్తూ బ్రతుకకు

భక్తి -ముక్తి..అంటే

 భక్తి -ముక్తి..అంటే


శంకర భగవత్పాదులు ఇలా అంటారు. “మోక్షకారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ స్వస్వరూపానుసంధానం భక్తి రిత్యభిదీయతే” అంటే మోక్షానికి కార​ణాలైన వాటిల్లో “భక్తి” ​గొప్పది​ అని ​. “స్వస్వరూప అనుసంధానమే” భక్తి అనబడుతుంది. భగవంతుడు దూరంగా ఉన్నాడనుకొంటే దూరంగానే ఉంటాడని, దగ్గర ​ఉన్నాడని ​అనుకొంటే దగ్గరే ​ఉంటాడని ​అని చెప్తారు! అవగాహన కానంతసేపూ దూరంగా ఉంటుంది​,​ అర్థమయితే దగ్గరే (లోపలే) ఉంటుందని అర్థం. 


చిత్త వృత్తులు పరమేశ్వరుని ​చేరి చేరి ఎల్లప్పుడూ ఉండట​మే భక్తి. ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్రా, స్మృతి అనే ఐదూ చిత్త-వృత్తుల నిరోధమే “యోగ” మనబడుతుందనీ పతంజలి మహర్షి ​చెప్పాడు . అదే భక్తి ​అని శంకరుల వివరణ.


ఇలాంటి భక్తి వలనే మానవుడు తరిస్తాడు.​ ఒక్క మాటలో చెప్పాలంటే ​భగవంతుని పట్ల ప్రేమనే భక్తి ​అనొచ్చు. అటువంటి​ ​​భక్తుల పట్ల పరమేశ్వరుడు ​సంతృప్తిగా ఉండి ,వారి బాధ్యతలను తానే భరిస్తాడు.


 “అనన్యాశ్చింతయంతోమాం​ ​ యే జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం” ఎవరైతే నన్ను అనన్య భక్తితో సేవిస్తారో వారి యోగక్షేమాలు నేనే వహిస్తాను అన్నది భగవంతుడి ​హామీ!


ఇంతకన్నా మనకు ఏమి కావాలి? ఈ భక్తి ఎప్పుడైతే ​ఏమీ ఆశించదో అప్పుడే దానిని శరణాగతి అంటారు.


చాలా మంది భక్తి భావాన్ని వివిధ కారణాల చేత ఏర్పరుచుకుంటుంటారు.​ ​కొంత మంది పుణ్యం కోసం భక్తిని పెంచుకుంటే,​ ​కొందరు పాప ​భయంతో , మరికొందరు మన అవసరాలను భగవంతుడు తీరుస్తాడ​ని భక్తిని అలవరుచుకుం​టున్నారు. భక్తులలో నాలుగు రకాల

వారుంటారని ,ఈ నాలుగు రకాల వారు భగవంతుడితో సంబంధం పెట్టుకుంటారని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు.


ఆ​ ​నాలుగు రకాలవాళ్ళు–​కష్టాల్లో ఉన్నవాడు, కోరికలున్నవాడు​, జిజ్ఞాసువు (అంటే జ్ఞానం పొందాలనే ఆసక్తి ఉన్నవాడు​)​​, జ్ఞాని.​ 


నేటి ప్రపంచంలో మొదటి రెండు కోవలకు చెందినవాళ్లనే మనం ​ఎక్కువగా ​​చూస్తున్నాం!


భక్తి అనేది ఒక యోగం.​


దీన్ని గురించి రెండు ఉదాహరణలు చెప్పారు.


మొదటిది మర్కట కిశోర న్యాయం. మర్కట కిశోరం అంటే కోతిపిల్ల. ఇది తన తల్లి ఒక కొమ్మ నుంచి మరొక కొమ్మకు ఎగిరేటప్పుడు తల్లి కడుపును జాగ్రత్తగా పట్టుకునే ఉంటుంది. ఇది కష్టమైన పని. వేదాంత మార్గంలో ​నడిచేవాడు దీన్ని అనుసరిస్తాడు.


రెండవది మార్జాల కిశోర న్యాయం. మార్జాల కిశోరమంటే పిల్లిపిల్ల. దీన్ని దాని తల్లే నోటితో పట్టుకుని జాగ్రత్తగా తీసుకెళుతుంది. భక్తి మార్గంలో ​నడిచేవాడు దీన్ని అనుసరిస్తాడు.


ఎవరైతే మనసా, వాచా, కర్మణా భగవంతుని యందు భక్తి కలిగి ఉంటారో ,వారి యోగక్షేమాన్ని ​భగవంతుడే భరిస్తాడనేదానికి ​ఒక యదార్ధ సంఘటనకు ఉదాహరణ.


కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చంద్ర​శేఖర​ ​సరస్వతుల​ ​వారికి ముందు పీఠాధిపతులుగా ​అదే పేరుతో ఇంకో స్వామి వారుండేవారు. వారు అమ్మవారి​కి​ ​గొప్ప ఉపాసకులు.


 వారితో వాదభిక్ష (వాదించాలని కోరుకోవడం) కావాలని ఒకసారి కొందరు వచ్చారు.


వారిని వాదం మొదలెట్టమన్నారు స్వామి వారు.


అందుకు ​వారన్నారు “స్వామీ మీ ఒళ్ళో కూర్చున్న ఆ అందమైన పాపను చూస్తుంటే మా నోట మాట ​రావటం లేదు. ఆ పాపను ​ మాకు కనిపించకుండా చేస్తే మేము మాట్లా​డగలం ” అన్నారు.


అప్పుడు స్వామి వారన్నారు “నేనొక సన్యాసిని. నా ఒళ్ళో పాప ఆడుకోవడం ఏంటి? మీరేదో పొరబడుతున్నారు” అన్నారు.


అప్పుడు వారన్నారు “కాదు స్వామీ! మీ ఒళ్ళో పాపను ​ప్రత్యక్షంగా ​మేం చూస్తున్నాం. ​అందువల్లే మేము మాట్లాడలేకపోతున్నాం! “


అప్పుడు ​ఆ ​స్వామి ​వారు ”ఆ పాప మరెవరో కాదు. నేను ఉపాసిస్తున్న కామాక్షి అమ్మవారే​! ఆమె​కు నామీద కల ​​దయ వలనే మీరు వాదించలేక పోతున్నారు.” అన్నారు.


శరణాగతి స్థితికి చేరుకున్న భక్తులతో ,భగవంతుడు ఇలా ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటాడు​.​ భక్తి భావా​నికి అంతిమ ​లక్ష్యం ​ఏమిటంటే-జన్మరాహిత్యం.


దీనికోసం​ నిరంతరం ​భగవంతుడిపై భక్తిని ​కలిగివుండాలి . ఆ భగవత్ స్వరూపాన్ని మనలో నిక్షిప్తం ​చేసుకుంటే ​ఏదో ఒకరోజు ​ఈ జీవు​డు పరమాత్ముడితో అనుసంధానం ​అవుతాడు. దాన్నే ఆత్మ సాక్షాత్కారమని అంటారు.


భగవంతుడికి కావలసింది భక్తి మాత్రమే.


మనకు ఎంత సంపద ఉందన్నది అనవసరం.​ ​భక్తితో​ ​ఎంత సమర్పించా​మన్నది మాత్రమే ​ప్రధానం.


విజయమాల్యా లాంటి వాళ్ళు దేవునికి సమర్పించిన కొన్ని వేల కోట్ల కంటే​,​ బడుగుజీవి కష్టపడి కూలీనాలీ చేసుకొని సంపాదించి భక్తితో ఇచ్చిన ఒక్క రూపాయే భగవంతుడికి ప్రీతి.


కొన్ని బారువుల ​బంగారంతో సత్యభామ శ్రీ కృష్ణుడిని తూచలేకపోయింది. రుక్మిణీ దేవి అదే శ్రీ కృష్ణుడిని భక్తితో ఒక తులసీద​ళంతో ​తూచి దక్కించుకుంది. యశోద కృష్ణుడిని ఏకంగా భక్తి , ప్రేమ, అనురాగాలతో కట్టి పడేసింది!

                 స్వస్తి!