26, సెప్టెంబర్ 2023, మంగళవారం

హుండీలో

 హుండీలో వేసేది మొక్కు. పూజారికి ఇచ్చేది దక్షిణ. మొక్కిన మొక్కు రూపాయి అయినా సరే హుండీలో వేయడం ధర్మం అవుతుంది

 భక్తునికి దైవానికి అనుసంధానం చేసే అర్చకునికి దక్షిణ ఇవ్వడం సహేతుకం. ధర్మాదాయ శాఖ అర్చకులు అయితే వారికి కూడా జీతాలు వస్తాయి. అయినా..తోచింది ఇచ్చి ఆశీర్వాదం పొందవచ్చు. ఇక యాచకులు. వీరు ఎంత వెనకేసుకున్నారనేది ఆలోచించ కూడదు. కృష్ణార్పణగా తృణమో ఫణమో ఇవ్వవచ్చు. చేసే ప్రతి పనిలో ధర్మ దృష్టి ఉండాలి. ఇచ్చేవాడిని నేనే అనే అహంకారం కూడదు. కర్తుత్వము కూడదు. అందరికీ ఇచ్చేవాడు ఆ ఆది నారాయణుడే. ఆయనిది ఆయనకే, ఆయన చెప్పిన వారికే ఇస్తున్నాం. కాలాన్ని బట్టి తనకు మాలిన ధర్మం చేయకుండా, దర్మార్జనలో కొంత భాగం దైవ సేవకు, దీనాజనులను ఆదుకునేందుకు వెచ్చించాలి. అదే మాధవ సేవ. హరి ఓం/అంతరంగ తరంగం/AVR 🙏

 .

కామెంట్‌లు లేవు: