🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
. *🌹సౌందర్యలహరి🌹*
*శ్లోకం - 32*
🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷
*శివః శక్తిః కామః క్షితి రథ రవిశ్శీతకిరణః*
*స్మరో హంస శ్శక్ర స్తదనుచ పరా మార హరయః |*
*అమీ హృల్లేఖాభి స్తిసృభి రవసానేషు ఘటితాః*
*భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతామ్ ‖*
ఇంతకు ముందు శ్లోకంలో శ్రీవిద్యా తంత్రమును గురించి చెప్పిన శంకరులు ఈ శ్లోకంలోనూ తరువాతి శ్లోకంలోనూ శ్రీవిద్యా మంత్రమును గురించి చెప్తున్నారు.
ఇందులో కొన్ని బీజాక్షర సంకేతాలను నిక్షిప్తం చేశారు. రహస్య మంత్రములను అర్హత లేనివారికి ఉపదేశించరు. కానీ సామాన్యులైన ప్రతివారు తరించటానికి ఇలా చేశారు. ఇందులో పంచదశీ మంత్రమును చెప్పారు.
శ్రీవిద్య మూడు కూటములతో కూడిన విద్య. అవి 'క' 'హ' 'స' విద్యలు. ఈ మంత్ర బీజాక్షరాల సంపుటములైన 'హా'ది విద్య 'కా'ది విద్యలను గురించి తరువాతి శ్లోకంలో వివరంగా చెప్పారు. ఈ సంకేతములు కూడా గురుబోధ లేని వారికి అర్ధం కావటం సులభం కాదు.
శివః శక్తిః కామః = ఈ మూడూ ఒక కూటమి.
కామః అనగా సంకల్ప శక్తి (ఇచ్చా శక్తి ). ఒక్కడుగా వున్న పరమేశ్వరుడు తాను అనేకుడుగా కావాలనుకోవడం. ఈ మూడూ 'హ' కారమును సూచిస్తాయి.
తరువాత క్షితిః 'ల'కారం
అథః తరువాత
రవిః శీతకిరణః స్మరః హంసః శక్రః ఇవన్నీ ఒక కూటమి.
క్షితి = భూమి
రవిః = సూర్య సంబంధమైన బీజం 'హ'కారం
శీతకిరణః = చంద్ర సంబంధమైన బీజం 'స'కారం
స్మరః =మన్మధుడు
హంసః = సూర్యుడు 'హ'కారం
శక్రః = ఇంద్రుడు 'ల'కారం వీరి సంకేతములైన వర్ణములు
తదనుచ = వీటిని అనుసరించి
పరా (శక్తి), మార (మన్మధుడు) హరుడు (శివుడు) వీరి సంకేతాలైన వర్ణాలు (అక్షరాలు)
హృల్లేఖాభిః = హ్రీoకారం(బీజాక్షరం)
అవసానేషు ఘటితా = చివరిలో కలిపితే హాది విద్యా మంత్రము అవుతుంది. మంత్రాధిదేవతలను ఈ విధంగా రహస్య మంత్రములుగా నిక్షిప్తం చేశారు.
తవ జనని = తల్లీ నీ రూపాలైన
భజంతే వర్ణాస్తే = ఈ వర్ణములను ధ్యానిస్తే
నామావయవతామ్ = నీ నామమే అవుతుంది.
అనగా మంత్ర శబ్దాకృతి దేవత యొక్క అవయవములుగా, రూపముగా, నామముగా, పరిణమిస్తుంది.
🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి