26, సెప్టెంబర్ 2023, మంగళవారం

నాలుగవదైన ముక్తి

 శ్లోకం:

*తథా చైత్రమాసస్య రాకాదినే వాఽథ*

  *భద్రే చ రాధాష్టమి సద్దినే వా ।*

*పఠేద్భక్తియుక్తస్త్విదం పూజయిత్వా*

 *చతుర్ధా సుముక్తిం తనోతి ప్రశస్తః ॥*


భావం: చైత్రమాస పౌర్ణమినాడు లేదా భాద్రపదమాసం రాధాష్టమి నాడు ఇష్టదేవతను భక్తితో పూజించి, పారాయణ చేసిన వ్యక్తి నాలుగవదైన ముక్తిని పొందుతాడు.

ముక్తి నాలుగు విధాలని - అవి సారూప్య, సాలోక్య , సామీప్య మరియు సాయుజ్య ముక్తి అని శ్రీమన్మధ్వాచార్యులు వివరించారు.

*సారూప్యం*: భగవంతుని రూపం పొంది ఆయనకి సేవ చేయడం

*సాలోక్యం*: భగవంతుని దివ్య ధామంలో ఉంటు ఆయన సేవ చేయడం

*సామీప్యం*: భగవంతునికి అతి చేరువలో సమీపంగా ఉంటూ సేవించడం

*సాయుజ్యం*: భగవంతునిలో ఐక్యమవ్వడం. (ఇది అద్వైతములో చెప్పబడిన ముక్తి.)

కామెంట్‌లు లేవు: