26, సెప్టెంబర్ 2023, మంగళవారం

సంస్కృత ఉపాధ్యాయుడి బాధ.*

 *ఒక సంస్కృత ఉపాధ్యాయుడి బాధ.*


*#SAVE SANSKRIT IN ANDHRAPRADESH* 


*#సంస్కృత భాషను ఆంధ్రప్రదేశ్లో రక్షించండి.*


అందరికీ నమస్కారం. నేను ఒక సంస్కృత ఉపాధ్యాయుడను. 


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రభుత్వంలో ఉండే ఇద్దరు అధికారులు SSC బోర్డు చైర్మన్ దేవానంద రెడ్డి, ఏపీఆర్ APRIE స్కూల్స్ సెక్రెటరీ నరసింహారావు (ఈ ఇద్దరు వాళ్లే) ఇద్దరు అధికారులు  ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో సంస్కృత విద్య ఉండకూడదని, కాంపోజిట్ తెలుగుకు అనుబంధంగా 30 మార్కులకు ఉన్న సంస్కృతాన్ని పూర్తిగా తొలగించేశారు, విద్యాశాఖ మంత్రి గారి చేత చెప్పించారు.  


ఈ అధికారుల దగ్గరికి కొంతమంది సంస్కృత ఉపాధ్యాయులు వెళ్తే, సంస్కృతాన్ని బోధించి ఆకులు కట్టుకునే కాలానికి తీసుకుని వెళ్లాలనుకుంటున్నారా? ఏం లాభం ఈ సంస్కృత విద్య వల్ల అని చెబితే నోరు మూసుకొని రావాల్సి వచ్చింది. ఉర్దూ తీసేస్తే విద్యా వ్యవస్థలో నుంచి ముస్లింస్ అంతా వస్తారు, మా భాషకు అన్యాయం జరుగుతుందని, ఇంగ్లీష్  తీసేస్తే క్రిస్టియన్స్ మిగతా వాళ్ళు కూడా వస్తారు.  


కానీ అందరూ అనుకుంటారు సంస్కృతం హిందువుల భాషని సంస్కృతాన్ని తీసేస్తే ఏ ఒక్క హిందువు స్పందించడు. అసలు సంస్కృతం విద్యా వ్యవస్థలో ఉందనే విషయం కూడా మనలో చాలామందికి తెలియదు, చాలామంది అనుకోవచ్చు సంస్కృతం తీసేసారు కాబట్టి నేను ఈ మెసేజ్ పెడుతున్నానని. నేను ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుతాను నా కుటుంబాన్ని పోషించుకుంటాను, కానీ భాష పైన జరుగుతున్న ఈ దాడిని అడ్డుకోవడానికి ఏ ఒక్క హిందువు, ఏ హిందూ సంఘము ముందుకు రాకపోవడమే బాధాకరమైన విషయం. హిందూ సంస్కృతికి మూలమే సంస్కృత భాష అటువంటి భాష పైన దాడి జరుగుతుంది,

  

దీన్ని అడ్డుకోవడానికి ఎవరూ రారని నాకు తెలుసు. చదివి చదివి మెసేజ్ ని డిలీట్ చేస్తారని తెలుసు. కానీ నా బాధను హిందూ సంఘాల గ్రూపులో చెప్పుకోవాలనిపించి ఈ మెసేజ్ పెడుతున్నారు.  


*జయతు సంస్కృతం, జైహింద్*

కామెంట్‌లు లేవు: