3, ఏప్రిల్ 2026, శుక్రవారం

పంచాంగం

 


శ్రీరామాయణం‌శ్రీరామాయణం‌ ➖➖➖✍️ (108 ప్రశ్నలు) 1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు? 2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు? 3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు? 4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి? 5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు? 6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది? 7. అయోధ్య ఏ దేశానికి రాజధాని? 8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు? 9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి? 10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు? 11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను? 12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వారెవ్వరు? 13. వాలి ఎవరి అంశతో జన్మించెను? 14. వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు? 15. కౌసల్య కుమారుని పేరేమిటి? 16. భరతుని తల్లి పేరేమిటి? 17. రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేమిటి? 18. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు? 19. విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు? 20. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు? 21. రామునికి అలసట, ఆకలి లేకుండా వుండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి? 22. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు? 23. తాటక భర్త పేరేమిటి? 24. తాటకను శపించిన మహర్షి ఎవరు? 25. గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు? 26. గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను? 27. అహల్య భర్త ఎవరు? 28. జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు? 29. సీత ఎవరికి జన్మించెను? 30. శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద వుంచెను? 31. శివధనుస్సును తయారు చేసినదెవరు? 32. భరత శత్రుఘ్నల భార్యల పేర్లు? 33. లక్ష్మణుని భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు? 34. జనకుడి తమ్ముడి పేరు ఏమిటి? 35. పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేమిటి? 36. భరతుని మేనమామ పేరు ఏమిటి? 37. దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు? 38. కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడెచట వుండెను? 39. రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది? 40. సీతారాములు తమ వనవాసం మొదటిరోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించెను? 41. శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు? 42. పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి? 43. దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు రోజులపాటు ఎక్కడ భద్రపరిచారు? 44. శ్రీరామునితో నాస్తికవాదన చేసినదెవరు? 45. భరతుడు రాముని పాదుకలనుంచిన పట్టణమేది? 46. అత్రిమహాముని భార్య ఎవరు? 47. దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు? 48. పంచవటిలో నివసింపుమని రామునికి సలహా ఇచ్చినదెవరు? 49. పంచవటి ఏ నదీతీరమున ఉన్నది? 50. లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను? 51. ఖరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడినుండి పంచవటికి వచ్చెను? 52. సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయము కోరెను? 53. సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది? 54. సీతను తీసుకుపోతున్న రావణునితో యుధ్ధము చేసిన పక్షి ఎవరు? 55. సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపెను? 56. సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములలో చిక్కుకొనెను? 57. సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో వున్నది? 58. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించు చుండెను? 59. రామలక్ష్మణులను గురించి తెలుసుకొనుటకై వారివద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను? 60. రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను? 61. రాముడు తన బాణములు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునికి చెప్పెను? 62. సుగ్రీవుని భార్య పేరు? 63. వాలి భార్యపేరు? 64. వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి? 65. వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేమిటి? 66. హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు? 67. వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడెను? 68. వాలి కుమారుని పేరేమిటి? 69. రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షములను భేదించెను? 70. సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించెను? 71. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు తూర్పు దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు? 72. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు దక్షిణ దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు? 73. సుగ్రీవునికి, సీతాన్వేషణ కోసం పశ్చిమ దిక్కుకు పంపబడిన సుషేణునికి బంధుత్వమేమిటి? 74. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు ఉత్తర దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు? 75. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చెను? 76. హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానరసేనలో వుండెను? 77. సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమిచ్చెను? 78. హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న బిలంలో వున్న తాపసి పేరేమిటి? 79. సముద్రమవతల వున్న రావణునిని, సీతను చూడగల్గుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి? 80. హనుమంతుని తల్లి యైన అంజన అసలు పేరు? 81. హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి? 82. హనుమంతుడు సముద్రం దాటుతున్నపుడు విశ్రమించమంటూ ఆతిధ్యమిచ్చిన పర్వతం ఎవరు? 83. హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేమిటి? 84. హనుమంతుని నీడను ఆకర్షించి తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి? 85. హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత? 86. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి? 87. హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి? 88. రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువిచ్చెను? 89. రామునకు విజయము, రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు? 90. హనుమంతుడు చెట్టుపై దాగివుండి సీతకు వినబడునట్లు ఎవరి కథ వినిపించెను? 91. రామునికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి యిచ్చిన ఆభరణం పేరేమిటి? 92. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను? 93. హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి రావణుని వద్దకు పోయెను? 94. దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు? 95. తిరిగి వచ్చిన హనుమంతునితో కలసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన వనం పేరేమిటి? 96. వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసిన దెవరు? 97. సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి ఏమిటి? 98. సముద్రం దాటుటకు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి? 99. ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించెను? 100. రామునికి ఆదిత్యహృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు? 101. రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు? 102. రామ రావణ యుద్ధంలో రాముని రథసారధి ఎవరు? 103. పుష్పకవిమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ, ఎవరికోసం ఆగుతుంది? 104. గుహునకు, భరతునికి తన రాకను తెలియచేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపెను? 105. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి? 106. శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిధి గృహంగా ఎవరి భవనము నిచ్చెను? 107. పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది? 108. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికిచ్చిన బహుమతి ఏమిటి?

 శ్రీరామాయణం‌

➖➖➖✍️

(108 ప్రశ్నలు)

1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు?

2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?

3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు?

4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి?

5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు?

6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?

7. అయోధ్య ఏ దేశానికి రాజధాని?

8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు?

9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి?

10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు?

11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను?

12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వారెవ్వరు?

13. వాలి ఎవరి అంశతో జన్మించెను?

14. వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు?

15. కౌసల్య కుమారుని పేరేమిటి?

16. భరతుని తల్లి పేరేమిటి?

17. రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేమిటి?

18. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు?

19. విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు?

20. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు?

21. రామునికి అలసట, ఆకలి లేకుండా వుండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి?

22. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు?

23. తాటక భర్త పేరేమిటి?

24. తాటకను శపించిన మహర్షి ఎవరు?

25. గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు?

26. గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను?

27. అహల్య భర్త ఎవరు?

28. జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు?

29. సీత ఎవరికి జన్మించెను?

30. శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద వుంచెను?

31. శివధనుస్సును తయారు చేసినదెవరు?

32. భరత శత్రుఘ్నల భార్యల పేర్లు?

33. లక్ష్మణుని భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు?

34. జనకుడి తమ్ముడి పేరు ఏమిటి?

35. పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేమిటి?

36. భరతుని మేనమామ పేరు ఏమిటి?

37. దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు?

38. కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడెచట వుండెను?

39. రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది?

40. సీతారాములు తమ వనవాసం మొదటిరోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించెను?

41. శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు?

42. పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి?

43. దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు రోజులపాటు ఎక్కడ భద్రపరిచారు?

44. శ్రీరామునితో నాస్తికవాదన చేసినదెవరు?

45. భరతుడు రాముని పాదుకలనుంచిన పట్టణమేది?

46. అత్రిమహాముని భార్య ఎవరు?

47. దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు?

48. పంచవటిలో నివసింపుమని రామునికి సలహా ఇచ్చినదెవరు?

49. పంచవటి ఏ నదీతీరమున ఉన్నది?

50. లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను?

51. ఖరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడినుండి పంచవటికి వచ్చెను?

52. సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయము కోరెను?

53. సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది?

54. సీతను తీసుకుపోతున్న రావణునితో యుధ్ధము చేసిన పక్షి ఎవరు?

55. సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపెను?

56. సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములలో చిక్కుకొనెను?

57. సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో వున్నది?

58. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించు చుండెను?

59. రామలక్ష్మణులను గురించి తెలుసుకొనుటకై వారివద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను?

60. రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను?

61. రాముడు తన బాణములు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునికి చెప్పెను?

62. సుగ్రీవుని భార్య పేరు?

63. వాలి భార్యపేరు?

64. వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి?

65. వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేమిటి?

66. హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు?

67. వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడెను?

68. వాలి కుమారుని పేరేమిటి?

69. రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షములను భేదించెను?

70. సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించెను?

71. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు తూర్పు దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?

72. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు దక్షిణ దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?

73. సుగ్రీవునికి, సీతాన్వేషణ కోసం పశ్చిమ దిక్కుకు పంపబడిన సుషేణునికి బంధుత్వమేమిటి?

74. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు ఉత్తర దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?

75. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చెను?

76. హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానరసేనలో వుండెను?

77. సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమిచ్చెను?

78. హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న బిలంలో వున్న తాపసి పేరేమిటి?

79. సముద్రమవతల వున్న రావణునిని, సీతను చూడగల్గుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి?

80. హనుమంతుని తల్లి యైన అంజన అసలు పేరు?

81. హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి?

82. హనుమంతుడు సముద్రం దాటుతున్నపుడు విశ్రమించమంటూ ఆతిధ్యమిచ్చిన పర్వతం ఎవరు?

83. హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేమిటి?

84. హనుమంతుని నీడను ఆకర్షించి తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి?

85. హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత?

86. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి?

87. హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి?

88. రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువిచ్చెను?

89. రామునకు విజయము, రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు?

90. హనుమంతుడు చెట్టుపై దాగివుండి సీతకు వినబడునట్లు ఎవరి కథ వినిపించెను?

91. రామునికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి యిచ్చిన ఆభరణం పేరేమిటి?

92. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను?

93. హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి రావణుని వద్దకు పోయెను?

94. దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు?

95. తిరిగి వచ్చిన హనుమంతునితో కలసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన వనం పేరేమిటి?

96. వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసిన దెవరు?

97. సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి ఏమిటి?

98. సముద్రం దాటుటకు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి?

99. ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించెను?

100. రామునికి ఆదిత్యహృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు?

101. రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు?

102. రామ రావణ యుద్ధంలో రాముని రథసారధి ఎవరు?

103. పుష్పకవిమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ, ఎవరికోసం ఆగుతుంది?

104. గుహునకు, భరతునికి తన రాకను తెలియచేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపెను?

105. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి?

106. శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిధి గృహంగా ఎవరి భవనము నిచ్చెను?

107. పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది?

108. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికిచ్చిన బహుమతి ఏమిటి?

శ్రీచక్ర వైభవం రెండవ భాగం

 శ్రీచక్ర వైభవం 

                 రెండవ భాగం 

ముందుగా శ్రీ చక్రం ఎలా ఉంటుందో చూద్దాము;


"బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ మన్వస్ర నాగదళ షోడశ పత్రయుక్తం

వృత్త త్రయంచ ధరణీ సదన త్రయంచ శ్రీ చక్ర రాజ ఉదితః పరదేవతాయాః"

గోపురము వలే కనబడు శ్రీ చక్రము చూడటానికి పైనుండి క్రిందకు క్రమముగా; 

1. బిందువు

2. త్రికోణము

3. వసుకోణం

4. అంతర్దశారము

5. బహిర్దశారం

6. చతుర్దశారం

7. అష్టదళపద్మం

8. షోడశదళపద్మం, దాని చుట్టూ మూడు వృత్త రేఖలు

9. మూడు రేఖలతో ధరణీ సదనం (భూపురం)


బిందువు వద్ద పరదేవత అయిన శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారు ఆశీనురాలై ఉంటుంది.


మంత్రం శబ్దంనుండి పుట్టింది , శబ్దము ఆలోచననుండి పుట్టినది .మంత్ర శబ్దములు ఉచ్చరించినపుడు శబ్ద తరంగాలు బయలుదేరుతాయి . ఈ తరంగాలు చక్రాకారంగా ఉంటాయి .ఆయా శబ్దమును బట్టి, ఆచక్రాకారమునకు దళములు, కోణములు ఏర్పడును. మంత్రోచ్చారణ వల్ల శరీరములో సూక్ష్మ నాడీ కూటమునందు కొన్ని స్పందనలు కలిగి అవి చక్రరూపం దాల్చును. చైతన్య రూపమును పొందిన ఈ సూక్ష్మ చక్రములు విశ్వ ప్రాణమును ఆకర్షించి శక్తివంతములగును. ఈవిధముగా శబ్దసమూహమైన మంత్రము చైతన్యవంతమై సిద్ధి ప్రదమగును.అంటే శబ్ద బ్రహ్మం నుండి శ్రీచక్ర ఆవిర్భావం జరిగింది.

.ఈ విషయం గుర్తుంచుకోవాలి 

ఈ శ్రీచక్రం త్రిమాతా స్వరూపం…శక్తి -పార్వతి, విద్య – సరస్వతి, స్థితి – శ్రీలక్ష్మి. ఈ ముగ్గురి కలయిక శక్తియే జగన్మాత అనీ, ఆదిశక్తి అని మనం భావించే శ్రీమాత లలితా దేవి . త్రిమూర్తులను సృజించిన మాతృమూర్తి జగన్మాత. జగధ్ధాత్రి చల్లని కటాక్ష వీక్షణాల వలనే సమస్త ప్రకృతి ఏర్పడింది. పంచభూతాలు, ఆరు ఋతువులు, సప్తలోకాలు, అష్టదిక్కులూ, నవరసములు సృజించినది.

. ఈ యంత్రము శక్తి స్వరూపిణులైన శ్రీ విద్య, లలితా దేవి అనే త్రిపుర సుందరి అనే దేవతను సూచిస్తాయి. శ్రీచక్రంలో నాలుగు సమద్విబాహు త్రిభుజాలు ఉర్ధ్వముఖంగా ఉండి శివుణ్ణి అనగా పురుష శక్తిని సూచిస్తాయి. అయిదు సమద్విబాహు త్రిభుజాలు నిమ్న (అధో) ముఖంగా ఉండి శక్తిని అనగా స్త్రీని సూచిస్తాయి. కావున శ్రీ చక్ర యంత్రము వ్యతిరేక దివ్యశక్తుల సంగమమును సూచిస్తుంది

   

మానవ శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క స్థానము,, తగిన పనిని కలిగి ఉంటాయి.కన్ను, ముక్కు, చెవి మొదలగునవి వేటి పనులు వాటివే. అలాగే శ్రీచక్రంలో ఒక్కొక్క దేవతకు ఉండవలసిన స్థానములు, చేయవలసిన పనులు, ప్రత్యేకంగా నిర్దేశింపబడి ఉన్నాయి. ఇక్కడ కూడా వేటి పనులు వాటివే..ఈ దేవతలకు యంత్రం రూపమయితే, మంత్రం నాదమవుతుంది. వేదవాక్కులచే (బీజాక్షరములచే ) ఆదేవతలు ప్రత్యక్షమవుతారని, అనుగ్రహిస్తారని, తెలుసుకొన్న మన మహర్షులు మనకు మంత్ర, యంత్ర శాస్త్రాలను అందించారు.


వేదమునకు మూలము నాదము.దాని నుండి బీజాక్షరములు ఉద్భవించి మంత్రములుగా శక్తిని సంతరించుకున్నాయి.



ఇక శరీర విషయానికి వస్తే 

మన దేహమే ఈ శ్రీచక్రరాజము . సాధకుడి దేహము ఈ శ్రీచక్రమనే దేవాలయము. మన దేహము నవ రంద్రములతో ఏర్పడిందని మనమెరుగుదుము అటులనే ఈ శ్రీచక్రము తొమ్మిది ఆవరణలతో ఏర్పడిన చక్ర సమూహమే. ఈ శ్రీచక్రము మనిషి శరీరంలో ఉన్న షట్చక్రాలకూ, ఈ శ్రీచక్రము లో ఉన్న తొమ్మిది అవరణలు అవినాభావ సంబధము ఉంది .

ఈ విషయం భావానోపనిషత్ లో వివరించాను. ఆ వ్యాసం కూడా చూడండి 

శంకరులు, "సౌందర్యలహరి" లోని పదకొండవ శ్లోకాన్ని, శ్రీచక్ర స్వరూపాన్ని గూర్చి వర్ణిస్తూ, ఇలా రచించారు,


"చతుర్బిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి

ప్రభిన్నాభిః శంభో ర్నవభి రపి మూలప్రకృతిభిః

త్రయశ్చత్వారింశ ద్వసుదళకళాశ్రత్రివలయ

త్రిరేఖాభిః సార్దం - తవ శరణకోణాః పరిణతాః"


భావం 

అమ్మా ఈశ్వరీ - శ్రీచక్రం--నాలుగు శివచక్రాలు, వాటి‌నుండి విడివడిన ఐదు‌ శక్తి చక్రాలతో ఉన్నది. ప్రపంచానికి మూలకారణమైన తత్త్వముతో కూడిన నీ నివాసమైన శ్రీచక్రంలోని కోణాలు--అష్టదళాలు --షోడశదళ పద్మాలు-- మేఖలా త్రయము మూడు భూపురాలు కలిసి నలభైనాలుగు అంచులు (కోణాలు ) కలిగి‌ వున్నాయి.‌


అనగా,అమ్మవారు కొలువై ఉండే శ్రీచక్రము,నాలుగు శివ కోణములు మరియు ఐదు శక్తి కోణములు కలిగి, సృష్టికి మూల కారణమైన తొమ్మిది మూల ప్రకృతులతోనూ (తొమ్మిది చక్రాలు ), అష్టదళపద్మమూ,షోడశదళ

పద్మమూ, మేఖలా త్రయము, రేఖా త్రయము, అనే భూపురత్రయముతోనూ కలిసి, నలభై నాలుగు అంచులు కలిగి ఉంటుంది.

                సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ