ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
25, మార్చి 2024, సోమవారం
శరీరంలో ధాతువులు
శరీరంలో ధాతువులు విపరీత పరిమాణంలో వృద్ది చెందుట వలన కలుగు దుష్పరిమాణాలు -
మనిషి శరీరంలో అన్ని రకాల ధాతువులు సమానముగా ఉన్నప్పుడు మాత్రమే ఆ మనిషి సంపూర్ణంగా ఆరోగ్యవంతుడు అయ్యి ఉంటాడు. ఆయా ధాతువులు హెచ్చుతగ్గులు సంభవించినపుడు కొన్ని విపరీత పరిణామాలు సంభవించి శరీరం రోగగ్రస్తం అవుతుంది. ఇప్పుడు మీకు ధాతువులు విపరీత పరిమాణంలో పెరుగుట వలన శరీరంలో కలుగు మార్పుల గురించి వివరిస్తాను.
* రసధాతు వృద్ది లక్షణాలు -
గుండె యందు ఒకరకమయిన వికారం కలిగి వాంతి కలుగును. నోట నీరు కారుతుంది .
* రక్తధాతు వృద్ది లక్షణాలు -
శరీరం ఎర్రబారుతుంది. నేత్రాలు ఎరుపెక్కుతాయి. రక్త సిరలు వంగినట్టుగా ఉంటాయి.
* మాంసధాతు వృద్ది లక్షణాలు -
పిరుదులు , తొడలు, పెదవులు , గుహ్యభాగం , దౌడలు , చేతులు , పిక్కలు బాగా లావెక్కుతాయి. శరీరం బరువెక్కును.
* మేధోదాతు వృద్ది లక్షణాలు -
శరీరం చమురు పూసినట్టు అవుతుంది . పొట్ట పక్క బాగాలు పెరిగిపోతాయి. దగ్గు వచ్చును. చిన్న పనిచేసినను అలసట వచ్చును. శరీరం నుండి చెడువాసన వచ్చును.
* అస్థిధాతు వృద్ది లక్షణాలు -
కొత్త ఎముకలు పుడతాయి. మాములుగా ఉండవలసిన దంతాల కంటే ఎక్కువ దంతాలు జనిస్తాయి. వెంట్రుకలు , గోర్లు విపరీతంగా పెరుగుతాయి.
* మజ్జాధాతు వృద్ది లక్షణాలు -
సర్వ శరీర అవయవాలు , నేత్రాలు బరువెక్కుతాయి. వ్రేళ్ల సందుల యందు తీవ్రంగా కురుపులు లేస్తాయి .
* శుక్రధాతు వృద్ది లక్షణాలు -
శుక్రం అధికంగా వెలువడును. శుక్రశ్మరీ అనురోగం వచ్చును. శుక్రశ్మరీ అనగా విపరీతంగా పెరిగిన శుక్రం రాయి వలే మార్పుచెంది శుక్రనాళాలలో అడ్డుపడి నొప్పి వచ్చును.
* పురీషధాతు వృద్ది లక్షణాలు -
ఉదరం నందు వాయవు బందించబడి ఉబ్బరం కలుగును. శబ్దములు వెలువడును. ఉదరం నందు పోట్లు పుట్టును . ఉదరం బరువుగా ఉండును.
* మూత్రవృద్ధి లక్షణాలు -
మూత్రస్రావం అధికం అగును. తరచుగా మూత్రవిసర్జన కు వెళ్లవలసి వస్తుంది. మూత్రాశయంలో పోటు మరియు మూత్రాశయం ఉబ్బినట్టు అగును.
* స్వేదవృద్ధి లక్షణాలు -
అతిగా చెమట పట్టుట, చర్మం దుర్గంధం వచ్చును. చర్మం నందు జిల పుట్టును .
* ఆర్తవవృద్ధి లక్షణాలు -
ఋతురక్తం అధికం అయ్యినచొ ఒక విధమైన బాధ కలుగును. రక్తం వృద్ది అవ్వడం చేత శరీరంలో వాతం సంచరించుటకు అవరోధం కలిగి శరీరాంగాలలో బాధ , పోటు జనించును. అలా విపరీతంగా స్రవించిన రక్తం దుర్గంధపూరితంగా ఉండును.
* స్తనవృద్ధి లక్షణాలు -
స్థనములు విపరీతంగా లావు పెరుగుతాయి . పాలు అధికంగా స్రవించును . స్థనముల యందు తీపి మరియు పోటు కలుగును.
పైన ధాతువులతోపాటు శరీర భాగాలలో అతివృద్ధి సంభవించినపుడు కలుగు సమస్యల గురించి వివరించాను.
ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
బంధవిముక్తి మోక్షమార్గం*
*బంధవిముక్తి మోక్షమార్గం*
➖➖➖✍️
```
అన్ని బంధాల నుంచీ మనిషిని విముక్తం చేసేదే ముక్తి. దీన్నే‘మోక్షం’ అంటాం. అది ఎలా లభిస్తుందనే చర్చ అనాదిగా సాగుతోంది. ఎవరి వాదం వారికి వేదం. ఎవరి మతం వారికి సమ్మతం. వ్యక్తిగత వాదాలే మతాలుగా పరిణమించి, అనేకంగా ఆవిర్భవించాయి. ఇవన్నీ ముక్తిని సాధించడానికి తోడ్పడేవే.
ఒక గమ్యస్థానానికి వెళ్లాలనుకొన్నప్పుడు మనిషి బయలుదేరే చోటు నుంచి ఒకే దారి ఉండదు. అన్ని దిక్కుల నుంచీ దారులెన్నో ఉంటాయి. ఎటు నుంచి వెళ్లినా చేరాల్సిన చోటు ఒకటే.
ఏ దారిలో వెళ్లినా గమ్యం చేరేవరకు విశ్రమించడు. జీవన స్వభావం ఇదే.
ఇదే విషయాన్ని మోక్షానికీ అన్వయిస్తూ ‘శివ మహిమ్న స్తోత్రం’ ఇలా ప్రబోధించింది:```
*“పరమేశ్వరా! నిన్ను చేరడానికి మనుషులు ఎన్నో మార్గాలను ఏర్పరచుకొన్నారు. కొందరు వేదమార్గంలో నిన్ను చేరుకుంటూ ఉండగా మరికొందరు సాంఖ్య మార్గంలో, ఇంకొందరు శైవ మార్గంలో, కొందరు యోగ మార్గంలో, కొందరు వైష్ణవ మార్గంలో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎవరికి వారు తాము నమ్మిన మార్గాలే గొప్పవని వాదిస్తారు. ‘లోకో భిన్న రుచిః’ అన్నారు కదా…!*```
లౌకిక బంధాలనన్నింటినీ పరిత్యజించి పరమేశ్వరుడిలో లీనం కావడమే మోక్షం. అది నాలుగు విధాలని ‘శివానంద లహరి’లో శంకర భగవత్పాదులు స్పష్టం చేశారు.```
*మొదటిది సారూప్య ముక్తి.*```
భక్తుడు శివుణ్ని అర్చిస్తున్నప్పుడు తానూ శివుడిలా రూపం ధరించాలని కోరుకోవడమే ఈ ప్రక్రియలోని పరమార్థం. స్తోత్ర పఠనంలో శివుడి రూపాన్ని స్మరించడం, ఆ రూపాన్నే ఆరాధించడం అంటే శివుడితో సమానమైన రూపాన్ని కోరుకోవడమే! అందువల్ల దీన్ని ‘సారూప్య ముక్తి’గా భావిస్తాం.```
*రెండోది సామీప్య ముక్తి.*```
శివుడి కథలు ప్రవచించేవారికి ఎప్పుడూ దగ్గరగా ఉండటం, వారు చేసే ఆరాధనల్లో పాలుపంచుకోవడం, వారితోనే స్నేహం చేస్తూ కలిసి మెలిసి తిరగడం వంటివి ఇందులో ఉంటాయి. ఇవన్నీ ఆనందదాయకాలైన అంశాలే. కనుక దీన్ని ‘సామీప్య ముక్తి’ అని వ్యవహరిస్తాం.```
*మూడవది సాలోక్య ముక్తి.*```
అంటే శివుడు ఉండే లోకంలోనే ఉండాలనుకోవడం! శివుడు లేని చోటు ఏదైనా ఉందా అంటే ‘లేనే లేదు’ అని బదులిస్తుంది ప్రాచీన సాహిత్యం. చరాచరాలతో కూడిన మానవ లోకంలో ప్రతీ అణువులో శివుడున్నాడంటారు. మానవ లోకంలోని మనిషి శివుడున్నచోటే ఉన్నాడని దీని అర్థం. ఈ ప్రపంచం అంతా శివుడి శరీరమే అని వేదాలు చెబుతున్నాయి. ‘శివుడి తనువే ఈ జగత్తు’ అనే భావన ఇందులో కనిపిస్తుంది. శివుడున్న లోకంలోనే తానూ ఉన్నాననే భావనను భక్తుడికి కలిగించడమే “సాలోక్య ముక్తి”.```
*ఇక నాల్గవది “సాయుజ్య ముక్తి”.* ```‘సాయుజ్యం’ అంటే “కలిసి ఉండటం”. చరాచరాలన్నీ శివమయాలే అన్నప్పుడు అందులో చరాలు (చైతన్యం కలిగిన ప్రాణులు)గా మనుషులూ ఉన్నట్లే. అందరూ శివస్వరూపాలే ఐనప్పుడు ఆయనతో వారు నిరంతరం కలిసి ఉన్నట్లే అవుతుంది. దీన్నే ‘మనిషికి శివుడితో సాయుజ్య ముక్తి లభించడం’ అంటాము.
ఇలా ప్రతి మనిషికీ నాలుగు విధాలైన మోక్షాలు అందుబాటులో ఉంటాయి.
’ముక్తి’ఎవరికైనా సాధ్యమే! శివుడి కరుణకు ఎలాంటి తారతమ్యాలూ ఉండవు. అందుకే ఆయన తనను అర్చించిన సాలీడు,పాము,ఏనుగును తనలో లీనం చేసుకొన్నాడు.
శ్రీ(సాలీడు), కాళ(పాము), హస్తి (ఏనుగు) నామాలతో ‘శ్రీకాళహస్తీశ్వరుడు’ అయ్యాడని మనకు తెలుసు.
కాలు కదపనివాడికి ఏదీ లభించదు. కదిలి ముందుకు సాగేవాడికి ప్రపంచమంతా ఓ కుగ్రామంలా కనపడుతుంది. “మోక్షం” విషయంలోనూ ఇదే సూత్రాన్ని అన్వయించుకోవాలి.✍️```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
కళ్యాణ ఘడియలు
*కళ్యాణ ఘడియలు తెలుసుకోవడం ఎలా..?*
మనిషి జీవితంలో వివాహం అనేది చాలా ముఖ్యమైన సందర్భం. పెళ్లి ఎప్పుడు జరుగుతుందని వయసు వచ్చిన ప్రతి వ్యక్తిలో ఆలోచన మొదలవుతుంది. కొందరిలో అనుకున్న సమయంలో వివాహం కాక.. అది ఒక సమస్యగా మారుతుంది. జాతకం ప్రకారమే వివాహ సమయం నిర్థేశించబడుతుందని గమనించాలి. అయితే 22 సంవత్సరాల్లోపు జరిగే వివాహాలను తొందరగా(శీఘ్రం) జరిగే వివాహాలుగా చెప్పుకోవచ్చు. 28 సంవత్సరాలు, ఆ పై వయస్సులో జరిగేవి ఆలస్య వివాహం.
*తొందరగా(శీఘ్రం) జరిగే వివాహాలకు కారణం*
లగ్నం, సప్తమభావముల యందు శుభ గ్రహాలు ఉండి సప్తమాధిపతి పాప గ్రహాలతో కలవకుండా శుభ గ్రహాల దృష్టి పొందడం వల్ల, లేదా శుక్రుడు బలంగా ఉన్నప్పుడు. అనగా మిథున రాశిలో గాని, తుల, వృషభ రాశులలోగాని, రవికి 150 లకుపైగా దూరంగా ఉన్నప్పుడు. లేదా
శుక్రుడు, శని గ్రహాలపైన చంద్రుని దృష్టి పడకుండా ఉన్నప్పుడు. లేదా శుభ గ్రహాలు వక్రగతి పొందకుండా ఉన్నప్పుడు. లేదా ద్వితీయ అష్టమ స్థానమలలో శుభ గ్రహాలు ఉన్నప్పుడు. లేదా శుభ గ్రహాలు వక్రగతి పొందకుండా ఉన్నప్పుడు లేదా జలతత్వ రాశులలో శుభగ్రాహాలు ఉన్నప్పుడు వివాహం తొందరగా జరుగుతుంది.
*ఆలస్య వివాహానికి గల కారణాలు*
లగ్నమందు, సప్తమ స్థానమందు పాపగ్రహాలు అనగా.. శని, రాహు, కేతువు, రవి, కుజ గ్రహాలు ఉన్నప్పుడు, సప్తమ స్థానమందు 2 గాని అంతకన్నా ఎక్కువ పాపగ్రహాలు ఉన్నప్పుడు. లేదా ద్వితీయ అష్టమ భావములలో పాపగ్రహా లు గాని, వక్రములు గాని ఉన్నప్పుడు. లేదా శుక్రుడు రాహువుతో గాని, శనితో గాని కలిసివున్నప్పుడు. లేదా శుక్రుడు రవి గ్రహానికి ఎక్కువ దూరంలో ఉన్నప్పుడు. లేదా జాతకంలో ఎక్కువ గ్రహాలు నీచంలో గాని వక్రించి గాని ఉన్నప్పుడు. లేదా సప్తమ భావముపై, సప్తమాధిపై పాప గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఆలస్య వివాహం జరుగును.
ఇలా జాతకంలో శ్రీఘ్ర వివాహమా? ఆలస్య వివాహమా అని నిర్ణయించిన తర్వాత జరుగుతున్న దశ అంతర్దశలను బట్టి గోచారంలో గురువు, శుక్ర గ్రహాలను బట్టి వివాహ కాలం నిర్ణయించుకోవచ్చు.
వివాహకాలం నిర్ణయించుటకు జాతకునికి 21 సంవత్సరాలు దాటిన తరువాత వచ్చు దశ అంతర్దశలను పరిశీలించాలి. సప్తమాది యెక్క లేదా సప్తమ భావాన్ని చూస్తున్న లేదా సప్తమాధిపతితో యతి వీక్షణలు పొందుతున్న గ్రహాల యొక్క దశ, అంతర్దశలలో వివాహం జరుగుతుంది. అలాగే నవాంశ లగ్నాధిపతి యొక్క, లేదా సప్తమాదిపతి నవాంశమందున్న రాశి నాథుని యొక్క దశ, అంతర్దశలలో పెళ్లి జరుగుతుంది. ఈ విధంగా పెళ్లి జరిగే సమయం నిర్ణయించిన తర్వాత గురు గ్రహం గోచార గమనాన్ని బట్టి వివాహం జరుగే సంవత్సరం నిర్ణయించాలి. వరుడి జాతకంలో శుక్రుడు, వధువు జాతకంలో కుజుడు ఉన్న రాశులపై గోచార గురువు యొక్క దృష్టి లేదా కలయిక వచ్చిన సంవత్సరంలో వివాహం జరుగుతుంది.
ఉత్తరాయణ కాలంలో జన్మించిన వారికి నవాంశలో గురువు ఉన్న రాశిలోనికి గాని, గురువుకు 5, 9 స్థానాల్లోగాని రవి గోచార రీత్యా వచ్చిన నెలలో వివాహం జరుగుతుంది. దక్షిణాయణంలో జన్మించిన వారికి నవాంశలో శుక్రుడున్న రాశిలోగాని, శుక్రునికి 5, 9 స్థానాలల్లోనికి గాని గోచార రవి వచ్చిన మాసంలో పెళ్లి జరుగుతుంది. ఈ విధంగా గురువు యొక్క సంచారాన్ని బట్టి పెళ్లి జరుగు సంవత్సరం, రవి యొక్క సంచారాన్ని బట్టి వివాహం జరుగు మాసం నిర్ణయించాలి. తర్వాత చంద్రుని యొక్క గమనాన్ని అనుసరించి పెళ్లి జరిగే రోజు నిర్ణయించాలి.
జాతక చక్రం పరిశీలించేటప్పుడు ఆలస్య వివాహానికి కారణం తెలుసుకొని తత్సంబంధమైన గ్రహానికి సంబంధించిన పరిహారాలు చేయాలు చేయాలి. అప్పుడే దోషాలు తొలగి శ్రీఘ్ర వివాహం జరుగుతుంది. సప్తమస్థానంపై రాహు, కేతువుల ప్రభావం ఉన్నప్పుడు ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా ఫలితం ఉండదు. కొన్ని సందర్భాల్లో నిశ్చితార్ధం జరిగిన తరువాత కూడా పెళ్లి ముందు రోజు కూడా ఏవో కారణాల వల్ల వాయిదా పడుతుంటాయి. ఇటువంటి వారు కనక దుర్గమ్మ వారికి 8 శుక్రవారాలు కుంకుమార్చన జరిపించడం వల్ల దోషాలు తొలగిపోతాయి.
వివాహం తొందరగా కావాలని కోరుకునే వారు 8 మంగళవారాలు హనుమాన్ ఆలయంలో స్వామివారికి 108 తమల పాకులతో అర్చన జరిపించడం వల్ల పెళ్లి కుదుదరుతుంది. శని గ్రహ దోషం వల్ల వివాహం ఆలస్యమవుతుంటే తమల పాకులలో తేనె పోసి నల్ల చీమలకు ఆహారంగా ఉంచడం వల్ల ఆ దోషం నశించిపోతుంది.
ఏదో ఒక కారణం వల్ల వివాహం ఆలస్యం అవుతుంటే ఈ క్రింది మంత్రమును ప్రతి రోజూ 108 సార్లు పారాయణం చేయాలి.
దేవీంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభాషిణి సర్వ సౌభాగ్య కార్యేషు సర్వ సౌభాగ్యదాయ
*మీ మిత్రుడు యస్.నాగేశ్వరశర్మ(ప్రకాష్)*
చక్కటి ఆంధ్ర భోజనము
దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్న రైల్వే ప్రయాణికులకు చక్కటి ఆంధ్ర భోజనము అందజేస్తాము. మీరు చేయవలసినదల్లా ఒక్కరోజు ముందు గా మాకు తెలియ చేయవలెను. మీ భోగి వద్దకు మీరు కోరిన విధంగా టిఫి న్స్, భోజనం, పులిహార, దద్దోజనం, జ్యూస్, వాటర్ అందజేస్తాము.
విజయవాడ: మోహన్ గారు 7396881404
విజయవాడ: మధువని గారు 9182554800
బెంగళూరు ద్రాక్షాయిని గారు: 9738979748
బెంగళూరు శర్మగారు: 8892447050
సికింద్రాబాద్: ప్రసన్న గారు: 090329 10106
సికింద్రాబాద్: లంచ్ హోమ్: 9885785556
వైజాగ్ : మల్లికార్జున శర్మ గారు: 6281023114
వైజాగ్ : సాయిశర్మ గారు: 70323 24851
కాకినాడ హరి గారు: 081427 29222
తిరుపతి :లక్ష్మి గారు: 99598 59227
న్యూఢిల్లీ ఫణి కుమార్ గారు: 9650873730
చెన్నై తాంబరం స్టేషన్: 73959 32954
రాజమండ్రి :ప్రసన్న గారు: 63040 49434
నెల్లూరు :రాధాగారు: 93469 43145
వారణాసి : శైలజ గారు: 6387 716 431
షిర్డీ : అనిల్ గారు: 95111 11585
ఒరిస్సా :లహరి గారు: 70081 79751
గుంటూరు సాయి గారు: 7989585295
అరుణాచలం రవి గారు: 88702 18670
ఏలూరు: 86885 25350
ఒంగోలు సునీత గారు: 92907 77270
నలుగురికి ఉపయోగపడే పోస్ట్ అండి.. దయచేసి మీ వాళ్ళందర
శ్రీ బసవన్న గుడి
🕉 మన గుడి : నెం 766
⚜ కర్నాటక : బెంగళూరు
⚜ శ్రీ బసవన్న గుడి
💠 నంది ..హిందూ మతంలో పవిత్రమైన ఎద్దు. (కన్నడలో బసవ) ఇది శివుని వాహనం . సంస్కృతంలో "నంది" అనే పదానికి "ఆనందకరమైనది" అని అర్థం .
💠 భారతదేశంలో ఉన్న నందీశ్వరుడు ఆలయాల్లో కెల్లా అతి పెద్ద నంది ఆలయం ఇది. 15 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవు ఉండే నంది విగ్రహాన్ని గ్రానైట్ రాతితో మలచారు. ఈ ఆలయం ద్రవిడ నిర్మాణ శైలిలో ఉంటుంది. ఏడాదికొకసారి, డిసెంబర్ మాసంలో నిర్వహించే శనక్కాయల సంత (వేరుశెనగ పండగ) ప్రధాన ఆకర్షణ.
💠 బెంగళూరులోని బసవనగుడి నంది దేవాలయాన్ని బిగ్ బుల్ టెంపుల్ అని కూడా అంటారు. ఇది అతిపెద్ద నంది ఏకశిలాను కలిగి ఉంది.
💠 బెంగుళూరులో గౌరవనీయమైన మైలురాయి అయిన బుల్ టెంపుల్, మతపరమైన ప్రాముఖ్యత మరియు నిర్మాణ వైభవం రెండింటిలోనూ పవిత్రమైన ఉనికిని కలిగి ఉంది
💠 ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ దేవాలయం యొక్క ప్రధాన భాగం ఒకే గ్రానైట్ శిల నుండి చెక్కబడిన నంది యొక్క అద్భుతమైన ఏకశిలా విగ్రహం.
15 అడుగుల ఎత్తు మరియు 20 అడుగుల పొడవుతో విస్మయం కలిగించే నంది, గంభీరత మరియు ఆధ్యాత్మికత యొక్క సౌరభాన్ని వెదజల్లుతుంది.
💠 నంది విగ్రహం నలుపు రంగులో కనిపించినప్పటికీ, దానిని నిర్మించినప్పుడు ఈ రంగు లేదు.
విగ్రహం మొదట బూడిద రంగులో ఉంది. అయితే భక్తులు నిరంతరంగా బొగ్గు, నూనెతో విగ్రహానికి పూయడంతో కొన్నేళ్లుగా అది నల్లబడింది.
💠 ఒక పురాణం ప్రకారం, విగ్రహం పెరగకుండా నిరోధించడానికి ఎద్దు తలపై ఉన్న ఇనుప పలకను శివుడు అక్కడ ఉంచాడు. బెంగుళూరు పశ్చిమ భాగం గుండా ప్రవహించే వృషభావతి నది నంది విగ్రహం క్రింద ఉన్న నీటి బుగ్గ నుండి ఉద్భవించిందని ఆలయం వద్ద ఉన్న శాసనం తెలుపుతుంది.
💠 ఈ ఆలయాన్ని 1537లో విజయనగర సామ్రాజ్యం క్రింద విజయనగర నిర్మాణ శైలిలో కెంపె గౌడ నిర్మించారు , అతను బెంగళూరు నగరాన్ని కూడా స్థాపించాడు.
💠 శతాబ్దాలుగా ఆలయంలో చాలా వరకు మార్పులేకుండా ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఉన్న 'విమానం' 20వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించబడింది.
1500 సం.లో ప్రబలంగా ఉన్న విజయనగర శైలి ద్వారా ఆలయ వాస్తుశిల్పం ఎక్కువగా ప్రభావితమైంది.
నంది విగ్రహం ఒకే గ్రానైట్ రాయితో చెక్కబడింది మరియు దాని వెనుక శివలింగం ఉంటుంది.
💠 బుల్ టెంపుల్ నిర్మాణంలో ఒక ఆసక్తికరమైన పురాణం ఉంది.
స్థానిక పురాణాల ప్రకారం, ఈ ప్రాంతం వేరుశెనగ సాగుకు ప్రసిద్ధి చెందింది.
అయితే ఆ ప్రాంతంలో ఓ ఎద్దు పంటను పాడుచేసేది. నష్టం పెరిగి పెద్దదవడంతో రైతులు ఆందోళన చెంది చివరకు ఎద్దును శాంతింపజేయాలనే ఆశతో ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు.
💠 అద్భుతం ఏమిటంటే, ఆలయ నిర్మాణం తర్వాత ఎద్దు పంటలను నాశనం చేయడం మానేసింది.
ఎద్దు శాంతించిందని సంతోషించిన రైతులు ఆలయం పక్కన వేరుశెనగ జాతరను నిర్వహించడం ప్రారంభించారు.
మాతృభాషలో ‘కడలెకై పరసె’ అని పిలువబడే ఈ పండుగ ఇప్పటికీ ఈ ప్రాంతంలో కొనసాగుతోంది మరియు స్థానికులలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇది సాంప్రదాయకంగా నవంబర్ లేదా డిసెంబరు నెలల్లో జరుగుతుంది, ఇందులో పంటల మొదటి పంటను రైతులు నంది ఆలయానికి అందజేస్తారు.
💠 బెంగుళూరు సిటీ రైల్వే స్టేషన్ నుండి 5 కి.మీ దూరంలో, బసవనగుడి అనే ప్రాంతంలో ఉంది.
© Santosh Kumar
రాశిఫలాలు
☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️
•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━
*25-03-2024 / సోమవారం / రాశిఫలాలు*
•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━
మేషం
ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆరోగ్యసమస్యలు భాదిస్తాయి. బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. వ్యాపారమున ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగులకు స్థానచలనాలు తప్పవు.
---------------------------------------
వృషభం
చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్ధిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు కలసి వస్తాయి. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయి.
---------------------------------------
మిధునం
కీలక సమయంలో సన్నిహితుల సాయం అందుతుంది. ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. వాహన వ్యాపారస్తులకు లాభాలు అందుకుంటారు. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది.
---------------------------------------
కర్కాటకం
వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటా బయట జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.
---------------------------------------
సింహం
బంధువులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నూతన రుణాలు చేస్తారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోమున అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి.
---------------------------------------
కన్య
నూతన పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఉద్యోగ యత్నాలు విజయం వరిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్నేహితుల నుండి ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభాలు పొందుతారు.
---------------------------------------
తుల
కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ కలుగుతుంది. బంధుమిత్రుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాట పట్టడం కష్టంగా మారుతుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమ అధికం ఫలితం తక్కువగా ఉంటుంది.
---------------------------------------
వృశ్చికం
అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలను పొందుతారు. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.
---------------------------------------
ధనస్సు
ఉద్యోగుల విషయంలో అధికారుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. సోదరులతో వివాదాలు పెరుగుతాయి. వ్యాపారం నిరాశ కలిగిస్తాయి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.
---------------------------------------
మకరం
విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగ విషయమై అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. దేవాలయ దర్శనం చేసుకుంటారు.
---------------------------------------
కుంభం
సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధన లాభం పొందుతారు కీలక వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది.
---------------------------------------
మీనం
కీలక వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. చెయ్యని పనికి సన్నిహితుల నుండి నిందలు ఎదుర్కొంటారు. ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదా పడతాయి వృధా ఖర్చులు చేస్తారు. నూతన వ్యాపారాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.
•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━
🍁 *శుభం భూయాత్* 🍀
శ్రీ కూడల సంగమ
🕉 మన గుడి : నెం 758
⚜ కర్నాటక : ఆల్మట్టి డ్యాం
⚜ శ్రీ కూడల సంగమ
💠 భారతదేశంలోని కూడలసంగమ లింగాయత్‌లకు ఒక ముఖ్యమైన తీర్థయాత్ర కేంద్రం .
ఇది కర్ణాటక రాష్ట్రంలోని బాగల్‌కోట్ జిల్లాలోని ఆల్మట్టి డ్యామ్ నుండి 15 కిమీ దూరంలో ఉంది .
కృష్ణా మరియు మలప్రభ నదులు ఇక్కడ కలుస్తాయి మరియు తూర్పున శ్రీశైలం వైపు ప్రవహిస్తాయి .
ఐక్య మంటపం లేదా స్వయంభూగా విశ్వసించబడే లింగంతో పాటు లింగాయత్ స్థాపకుడు బసవన్న యొక్క పవిత్ర సమాధి ఇక్కడ ఉంది .
💠 ఈ ప్రాంతం లింగాయత్ మతం పుట్టిన పవిత్ర ప్రదేశం. దీనినే కప్పడి సంగమ అని కూడ పిలుస్తారు.
💠 ఈ కూడల సంగమ 800 సంవత్సరాల క్రితం బసవన బగీవాది అనే పేరుతో విలసిల్లిన పవిత్ర పుణ్యక్షేత్రం. బసవేశ్వరుడు పుట్టిన పుణ్యభూమి. బసవేశ్వరునికి విద్యగరిపిన ఈశాన గురువు నివసించిన ప్రాంతం కూడా ఇదే.
⚜ విశ్వగురు బసవన్న చరిత్ర ⚜
💠 విశ్వగురు బసవన్న ప్రసిద్ధ తత్వవేత్త మరియు సంఘ సంస్కర్త, ఇతను ఉత్తర కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలోని బసవన బాగేవాడి అనే చిన్న గ్రామంలో జన్మించాడు , దీనిని ఇంగలేశ్వర బాగేవాడి అని కూడా పిలుస్తారు.
పట్టణానికి అధిపతి అయిన మాదిరాజా ఇల్లు ఇక్కడే ఉంది.
💠 బసవేశ్వరుడు ఆనందనామ సంవత్సరం వైశాఖ మాసం మూడవ రోజున మదిరాజా మరియు మాదాంబికలకు జన్మించాడు (సంవత్సరం 1134తో సమానంగా ఉంటుంది).
💠 ఆ ఊరిలో నందీశ్వర దేవాలయం ఉంది. భార్యాభర్తలు నందీశ్వరుని భక్తులు. మదంబాంబకి నాగమ అనే కుమార్తె ఉంది మరియు కొడుకు పుట్టాలని ఆశించింది.
ఆమె రోజూ శివుని పూజించి తన కోరిక తీర్చమని ప్రార్థించింది.
ఒకరోజు పూజ తర్వాత ఆమె ధ్యానంలో కూర్చుంది. శివలింగానికి నైవేద్యంగా ఉంచిన మల్లెపూవు ఒడిలో పడింది. ఎంతో భక్తితో దాన్ని తీసుకుని కళ్లకు మెల్లగా అదుముకుని జుట్టులో వేసుకుంది. ఆమె రోజంతా సంతోషంగా ఉంది మరియు ఆ రాత్రి ఆమెకు ఒక కల వచ్చింది: కైలాసం నుండి, శివుడు ఈ లోకంలోకి తన నందిని పంపాడు.
నంది మదర్సా మరియు మాడంబాంబా ఇంటికి వచ్చింది. అప్పుడు ఎక్కడ చూసినా వెలుతురు.
💠 మరుసటి రోజు మదాలంబాకే ఈ కలను మదరసాకు వెల్లడించింది. అతను దానిని గ్రామ ఆధ్యాత్మిక గురువుకి నివేదించాడు.
ఇది శుభసూచకమని గురువు అతనికి చెప్పాడు.
దంపతులకు యోగ్యమైన కుమారుడు ఉంటాడు; వారు మొత్తం కుటుంబాన్ని పెంచుతారు. అతను సమస్త విశ్వాన్ని ఉద్ధరిస్తాడు మరియు జ్ఞానోదయం చేస్తాడు.
ఈ జోస్యం మాటలు విని ఆ దంపతులు ఆనందానికి లోనయ్యారు.
💠 కాలక్రమేణా మదాలంబాకే ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. మనోహరమైన పిల్లవాడి
ముఖం ప్రకాశిస్తుంది. అప్పుడు గురువు ఇలా అన్నాడు: “శివుని దయతో, నంది (వృషభ అని కూడా పిలుస్తారు) స్వయంగా మీకు కొడుకుగా జన్మించాడు, అతను గొప్ప వ్యక్తిగా మారి ప్రపంచంలో మతాన్ని ప్రోత్సహిస్తాడు, అతను మొత్తం సంక్షేమాన్ని సాధిస్తాడు.
అతనికి 'బసవ' అని పేరు పెట్టండి. "
💠 సరైన ప్రవర్తనను బోధించిన బసవ విప్లవకారుడు అయ్యాడు.
పనిలో నిమగ్నమవ్వడం స్వర్గమని, సాదాసీదా జీవితం, స్త్రీ పురుషుల మధ్య సమానత్వం అనే ఆదర్శాలను బోధించారు.
బసవన్న గొప్ప సాధువు; అతని అనుచరులు ఆయనను గురువుగా భావిస్తారు .
అతని కాలంలోని నిజమైన దార్శనికుడు మరియు లింగాయత్ శాఖను ప్రారంభించిన విప్లవకారుడు. ఈ ప్రాథమిక హక్కు ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావడమే బసవన్న అంతిమ లక్ష్యం .
💠 బసవన్న, సంక్షేమాన్ని అంతిమ లక్ష్యంగా ఉంచుకుని, కన్నడలో మతపరమైన సాహిత్యాన్ని ప్రబోధించడం మరియు వ్రాయడం ద్వారా మతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలను వేగవంతం చేశారు . అతని గడ్డుగే (సమాధి) కూడలసంగమలో ఉంది.
💠 ఎంతో రమణీయంగా నిర్మించిన ఇక్కడి బసవేశ్వరాలయంలో బసవేశ్వరుడు, నీలమ్మ ఉంటాయి. గర్భాలయంలో ఉన్న ద్వారబంధాలపై మంచి నగిషీలతో, అనేక జంతువుల శిల్పాలు మలిచి చాలా అద్భుతంగా ఉంటుంది.
ఈ ఆలయంలోని శివలింగానికి సంగమేశ్వరుడని, సంగమనాథ్ అని కూడా నామాంతరాలు ఉన్నాయి.
💠 ఇక ఈ చుట్టుపక్కల చూడదగ్గ ప్రదేశాల్లో ఇప్పుడు మనం చెప్పుకొన్న సంగమనాథ దేవాలయం . చాలా ముఖ్యమైనది. ఐక్యలింగ బసవేశ్వర మందిరం, బసవ ధర్మపీఠం, అతి చిన్న అరణ్యప్రదేశంగా భాసిల్లే పూజావనం మొదలైనవి.
ఇవికాక ఇక్కడ నిర్మించిన ఆడిటోరియం 6000 మంది కూర్చోవడానికి వీలుగా నాలుగు ద్వారాలతో ఉంటుంది.
ఇందులో ఒక్కో ద్వారానికి గంగాంబికా, నీలాంబిక, చెన్నబసవన్న, అక్కనాగమ్మ అనే పేర్లు పెట్టారు. ఈ ఆడిటోరియం ఎంతో ప్రశాంతంగా ఉండి అనేక కార్యక్రమాలకి వేదికగా అలరారుతోంది.
💠 కూడలసంగమ 850 సంవత్సరాల పురాతనమైన సంగమేశ్వర ఆలయానికి ప్రసిద్ధి చెందింది, దీనిని శివునికి అంకితం చేసిన కూడల సంగమేశ్వర అని పిలుస్తారు.
12వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం కృష్ణా నది ఒడ్డున ఉంది మరియు ఇది అనేక సార్లు పునరుద్ధరించబడింది.
ఈ ఆలయం ద్రావిడ శైలిలో ప్రవేశద్వారం వద్ద పెద్ద ఆలయ గోపురంతో నిర్మించబడింది, దాని తర్వాత ప్రధాన ఆలయం వాకిలి, నవరంగ మరియు గర్భగుడితో ఉంటుంది.
💠 బెంగళూరు నుండి 450 మరియు జిల్లా రాజధాని బాగలకోట్ నుండి 51 కి.మీ.
© Santosh Kumar
వేద ఆశీర్వచనం
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*కలియుగాబ్ది 5124*
*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం - పూర్ణిమ - ఉత్తరాఫల్గుణి - ఇందు వాసరే* (25.03.2024)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
-----------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*
సోమవారం, మార్చి 25, 2024
*శ్రీమతే రామానుజాయ నమ:*
*శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*
*ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం*
*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *నమామ్యహం*
సోమవారం, మార్చి 25, 2024
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం - శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం
తిథి:పౌర్ణమి ఉ11.34 వరకు
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:ఉత్తర ఉ9.59 వరకు
యోగం:వృద్ధి రా8.52 వరకు
కరణం:బవ ఉ11.54 తదుపరి బాలువ రా12.32 వ
వర్జ్యం:రా7.15 - 9.01
దుర్ముహూర్తము:మ12.29 - 1.17 మరల మ2.54 - 3.42
అమృతకాలం:తె5.50నుండి
రాహుకాలం:ఉ7.30 - 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 - 12.00
సూర్యరాశి: కుంభం
చంద్రరాశి: కన్య
సూర్యోదయం:6.07
సూర్యాస్తమయం:6.07
*శ్రీరంగనాచ్చియర్ (మహాలక్ష్మి) తిరునక్షత్రం*
*శ్రీమతే రామానుజాయ నమ:*
*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*
*మిట్టాపల్లి*
సుఖం కలుగుతుంది*
💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎
శ్లో॥ *ఇచ్ఛతి శతీ సహస్రం |*
*సహస్రీ లక్ష మీహతే* |
*లక్షాధిప స్తథా రాజ్యం |*
*రాజ్యస్థః స్వర్గ మీహతే* ||
{ తృప్తి ఉండాలి }
*భావం : ఒక వంద ధనం కలవాడు వేయి ధనాన్ని కోరతాడు. వేయిగలవాడు లక్షను కోరతాడు. లక్షగలవాడు లక్షాధికారి. లక్షాధికారి రాజ్యాన్ని కోరతాడు. రాజ్యాధిపతి స్వర్గం కావాలని కోరతాడు. ఇలా ఆశకు అంతులేదు. కనుక తృప్తిని ఇవ్వని ఆశను విడిచి తనకు లభించినదానితో తృప్తిచెందు వానికి సదా సుఖం కలుగుతుంది*.
🙏🪷 ✍️🙏