ఆవుపాల ఉపయోగాలు - సంపూర్ణ వివరణ 2 .
* ఆవుపాలలో విటమిన్ A , B2 , D నికోటిక్ యాసిడ్ ఉన్నాయి. తాజా పాలలో విటమిన్ C కూడా ఉంటుంది. కాని పాలు కాచినప్పుడు విటమిన్ C నశిస్తుంది. కాబట్టి ప్రతినిత్యం పాలని ఆహారంగా తీసుకొనే అలవాటు ఉన్నవారు విటమిన్ C కలిగిన కాస్త పుల్లనికాయలు , పండ్లు తీసుకోవడం మంచిది .
* పాలలో సమృద్దిగా ఉన్న విటమిన్ A , B కాంప్లెక్స్ , C & D అనునవి సూర్యుని అతినీలలోహిత కిరణాల ( Ultra voilet Rays ) ప్రసార ప్రభావం వలన కొన్ని మార్పులకు లోనగుటచేత ఉబ్బసము, క్షయ , కొన్ని ఎలర్జీలకు , దగ్గు , శరీరంలో కొన్ని మాంసకృత్తులు లోపించుట , శారీరకశక్తి లోపించినట్లుగా బాధపడువారికి , జుట్టు రాలిపోవువారికి , వయస్సు మీరినట్లు కనిపించుట , బలహీనంగా ఉన్న చిన్నపిల్లలకు మంచి బలవర్ధకమైన ఆహారముగా పనిచేయును .
* గ్లాసు పాలలో 4 నుంచి 5 చుక్కలు " సోడియం నైట్రేట్ " కలిపి ఆహారంగా వినియోగిస్తుంటే పాలలో విడిగా ఉన్న క్యాల్షియం ఎంతో ఉపకరిస్తుంది.
* పుల్లటి పండ్లు గాని , బిస్కెట్స్ కాని తిన్న తరువాత పాలు తాగితే జీర్ణక్రియ తేలికగా జరుగును.
* పాలు జీర్ణాశయము నందలి " పెప్సిన్"తో కలిసి జీర్ణాశయంలో అధికంగా జనియించే " హైడ్రోక్లోరికామ్లం " ను తగ్గించడంలో సహకరిస్తుంది. జీర్ణాశయంలో గ్యాస్ట్రిక్ అల్సర్ ఉన్నవారు ప్రతిరోజు పాలను ఆహారంగా స్వీకరిస్తూ ఉంటే మంచి మందుగా పనిచేస్తాయి.
* పాలు పిల్లలలో జీర్ణం అయినంత త్వరగా పెద్దవారిలో జీర్ణం కావు . రికెట్స్ వ్యాధి ఉన్నవారికి కొవ్వుపదార్దాలు , క్యాల్షియం జీర్ణం అగుట అసాధ్యం . కాబట్టి పాలు స్వీకరించరాదు. రికెట్స్ వ్యాధి ఉన్నవారు పాలు తాగినప్పుడు జీర్ణం అగుట కష్టసాధ్యం అగుట చేత విరేచనాలు కూడా అయ్యే అవకాశం ఉంది. క్యాల్షియం అరగక ప్రమాదంగా మారే అవకాశంగా ఉంది.
* పాలు సరిపడనివారు స్వీకరించరాదు. పాలు మితిమీరి తాగుతూ ఉంటే మలబద్దకం , అజీర్తి వంటి అనారోగ్యాలు దరిచేరే ప్రమాదం ఉన్నది. కడుపు నిండుగా భోజనం చేసినవెంటనే పాలు తాగుట మంచిది కాదు.
* పాల ద్వారా కలరా , టైఫాయిడ్ , క్షయ వంటి రోగాలను కలిగించే సూక్ష్మక్రిములు అతితేలికగా పయనించగలవు. కావున పాలను తాగేముందు బాగా కాచి తాగుతూ ఉంటే వ్యాధులను సంక్రమింపచేసే క్రిములు నశించుటయే కాక జీర్ణక్రియ తేలికగా జరుగును.
* పాలను పెద్ద మంటతో అతిగా కాచి నిదానముగా చల్లార్చుతూ ఉంటే పాలలో రుచి పోతుంది.
* పాలను కాచే ముందుగా పాలపాత్రను బాగా శుభ్రపరచవలెను . పాలు వాసన వచ్చినా , నీలిరంగుకు మారినా త్రాగరాదు. ఇటువంటి పాలు తాగిన వాంతులు , విరేచనాలు , కడుపునొప్పి వంటి సమస్యలు వచ్చును. ఆరోగ్యం పూర్తిగా చెడిపోవును
* భోజనానంతరం 2 నుంచి 3 గంటలు ఆగి పాలు తాగిన సంపూర్ణంగా జీర్ణం అగును.
* గోరువెచ్చని పాలలో తగుమాత్రం తేనె కలిపి కాని లేదా ఏమి కలపకుండా కాని తాగితే మంచిది . అలా కాకుండా పంచదార కలిపిన పాలు తాగితే జీర్ణాశయంలో " హైడ్రోక్లోరిక్ ఆసిడ్ " అధికం అయ్యి జీర్ణం అగుట కష్టసాధ్యం అగును.
* గర్భము ధరించిన ( సూడి పశువు ) పశువుల పాలు తాగుతూ ఉంటే వయస్సుకు వచ్చిన స్త్రీ , పురుషుల ముఖము పైన మొటిమలు వస్తాయి. దీనికి కారణం ఆ పాలలో " ప్రొజెస్టిరాన్ " " ఈస్ట్రోజెన్ " అను సెక్స్ హార్మోన్స్ మిళితమై ఉండటమే దీనికి కారణం .
* పిల్లల వయస్సును అనుసరించి పాలలో నీటిశాతం పెంచుటయో , తగ్గించుటయో చేయాలి . ఉదాహరణకు ఒక నెల వయస్సు ఉన్న పిల్లలకు 1 వంతు పాలు , 3 వంతులు నీరు కలిపి 2 నుంచి 3 గంటల కొకమారు పట్టాలి.
* పిల్లలకు ఆవుపాలు పట్టువారు ఆ పాలలో కొద్దిగా తేనె కలిపి తాగిస్తే ఉపయోగకరంగా ఉండును.
* రాత్రి సమయంలో పసి పిల్లలకు ఆవుపాలు తాగించుట అంత మంచిది కాదు. ఈ సమయంలో నులివెచ్చని నీటిలో గ్లూకోజ్ గాని , పంచదార గాని కలిపి తాగించుట మంచిది .
* ఆవుపాలను తరచుగా వేడిచేయుట మంచిది కాదు. ఒకేసారి పాలు కాచి అవసర సమయాలలో ఆ పాలలో వేడినీరు కలిపి పిల్లలకు పాలు తాగిస్తుంటే ఆ పాలు తేలికగా జీర్ణం అగును.
* తల్లిపాలు సమృద్దిగా లభించే పిల్లలకు పోతపాలు పోయుట అనర్థదాయకం . ఎందుకంటే తల్లిపాలలో కంటే ఆవుపాలలో క్యాల్షియం , ఫాస్పరస్ 4 నుంచి 5 రెట్లు అధికంగా ఉండటం చేత చిన్నపిల్లల మూత్రపిండాలకు వాటి విసర్జన కష్టం అయ్యి మూత్రపిండాలు పాడగును. అవసరం అయితే అత్యంత పలచగా చేసి పోయవలెను .
మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్
9885030034
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034