20, జులై 2020, సోమవారం

కర్మ ఫలం

కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు. తన వందమంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు.కృష్ణుడిరాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురువెళ్ళి బోరున విలపిస్తాడు. చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న ధృతరాష్ట్రుడిని కృష్ణుడు ఓదార్చే ప్రయత్నం చేస్తాడు.

ధృతరాష్ట్రుడి దుహ్ఖం కోపంగామారి కృష్ణుడిని నిలదీస్తాడు. "అన్నీ తెలిసి కూడా, మొదటి నుంచీ జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తూ భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్నకుండిపోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? ఈరోజు తనకి వందమంది పుత్రులని పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు అని నిలదీస్తాడు. అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు.

. "ఓ రాజా! ఇదంతా నేను చేసిందీ కాదూ, నేను జరగనిచ్చిందీ కాదు. ఇది ఇలా జరగటానికి, నీకు పుత్రశోకం కలగటానికీ అన్నిటికీ కారణం నువ్వూ నీ కర్మ. యాభై జన్మల క్రితం నువ్వొక కిరాతుడివి (వేటగాడు). ఒకరోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడినా నీకు యేమీ దొరకని సందర్భంలో ఒక అశోక వృక్షం మీద రెండు గువ్వల జంట వాటి గూట్లో గుడ్లతో నివసిస్తున్నాయి. వాటిని నీవు చంపబోగా ఆ రెండు పక్షులూ నీ బాణాన్ని తప్పించుకుని బ్రతుకగా అప్పటికే సహనము నశించినవాడివై కోపంతో ఆ గూట్లో ఉన్న వంద గుడ్లను ఆ రెండు పక్షులు చూస్తుండగా విచ్చిన్నం చేశావు. తమ కంటి ముందే తమ నూర్గురు పిల్లలు విచ్చిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూఉండిపోయాయి. ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపము నుండి విముక్తుడిని చేసి కర్మబంధం నుండి విడిపించింది, నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా నీ కర్మ నిన్ను తప్పక వెంటాడుతుంది, వదలక వెంటాడి ఆ కర్మ ఫలాన్ని అనుభవింపచేస్తుంది. కర్మ నుండి ఎవరూ తప్పించుకోలేరు" అని అంటాడు.

ధృతరాష్ట్రుడు సమాధానపడ్డట్టు అనిపించినా మళ్ళీ కృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు. కర్మ అంత వదలని మొండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు? ముందే ఎందుకు శిక్షించలేదు అని ప్రశ్నిస్తాడు. అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి "ఓ రాజా! వందమంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి.. ఎన్నో సత్కర్మలు ఆచరించాలి. ఈ యాభై జన్మలు నువ్వు ఈ వందమంది పుత్రులను పొందడానికి కావల్సిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు. వందమంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పని చేయడం మొదలుపెట్టింది అని శెలవిస్తాడు. అది విన్న ధృతరాష్ట్రుడు కుప్పకూలిపోతాడు.

మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్యఫలాలన్నీ ఒక్క చెడ్డపనితో తుడిచిపెట్టుకుపోతాయి అని శ్రీ కృష్ణుడు అంతరార్థం.

- మహాభారతం


ధర్మధ్వజం
హిందు చైతన్య వేదిక

శ్రీమాత్రేనమః



లలితా దేవికి సంబంధించిన ముఖ్యమైన స్తోత్రాలలో త్రిశతి స్తోత్రం ఒకటి ఉంది.ఈ త్రిశతి స్తోత్రం కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. త్రిశతి స్తోత్ర రూపంలోనూ నామావళి రూపంలోనూ ఉంటుంది.  పారాయణం చేయదలచుకున్నవారు స్తోత్రాన్ని,  అర్చన కోసం నామావళి ఉపయోగించవచ్చు.  ఈ స్తోత్రం లో ఉండే ప్రత్యేకత ఏమిటంటే స్తోత్రం ప్రారంభం నుండి చివరి వరకు ఉండే మొదటి అక్షరాలన్నీ ఒక వరుస క్రమంలో రాసి చదివితే శ్రీచక్ర మంత్రం అయినటువంటి పంచదశి మంత్రం ఏర్పడుతుంది, 
   
క ఏ ఈ ల హ్రీo      హ స క హ ల హ్రీo       స క ల హ్రీo ( పంచదశి మంత్రం )

లలితా సహస్రనామ స్తోత్రాన్ని 10 సార్లు చదివితే వచ్చే ఫలితం ఈ త్రిశతి స్తోత్రాన్ని ఒకసారి చదివితే వస్తుంది. 

లలితా సహస్రనామ స్తోత్రంను వాగ్దేవతలు రాస్తే,  ఈ స్తోత్రాన్ని స్వయంగా శివ కామేశ్వరులే చెప్పారు కాబట్టి ఈ స్తోత్రం చాలా శక్తి వంతమైనది. 

 లలితా దేవిని అర్చన చేసుకోడానికి వీలుగా నామావళి ఇక్కడ చెప్తున్నాను.

శ్రీ లళితాత్రిశతి నామావలి
1 . ఓం కకారరూపాయై నమః
2 . ఓం కల్యాణ్యై నమః
3 . ఓం కల్యాణగుణశాలిన్యై నమః
4 . ఓం కల్యాణశైలనిలయాయై నమః
5 . ఓం కమనీయాయై నమః
6 . ఓం కలావత్యై నమః
7 . ఓం కమలాక్ష్యై నమః
8 . ఓం క‍న్మషఘ్న్యై నమః
9 . ఓం కరుణామృత సాగరాయై నమః
10 . ఓం కదంబకాననావాసాయై నమః
11 . ఓం కదంబ కుసుమప్రియాయై నమః
12 . ఓం కన్దర్‍ప్పవిద్యాయై నమః
13 . ఓం కన్దర్‍ప్ప జనకాపాంగ వీక్షణాయై నమః
14 . ఓం కర్‍ప్పూరవీటీసౌరభ్య కల్లోలితకకుప్తటాయై నమః
15 . ఓం కలిదోషహరాయై నమః
16 . ఓం కఞ్జలోచనాయై నమః
17 . ఓం కమ్రవిగ్రహాయై నమః
18 . ఓం కర్‍మ్మాదిసాక్షిణ్యై నమః
19 . ఓం కారయిత్ర్యై నమః
20 . ఓం కర్‍మ్మఫలప్రదాయై నమః
21 . ఓం ఏకారరూపాయై నమః
22 . ఓం ఏకాక్షర్యై నమః
23 . ఓం ఏకానేకాక్షరాకృతయే నమః
24 . ఓం ఏతత్తదిత్యనిర్దేశ్యాయై నమః
25 . ఓం ఏకానన్ద చిదాకృతయే నమః
26 . ఓం ఏవమిత్యాగమాబోద్ధ్యాయై నమః
27 . ఓం ఏకభక్తి మదర్‍చ్చితాయై నమః
28 . ఓం ఏకాగ్రచిత్త నిర్‍ద్ధ్యాతాయై నమః
29 . ఓం ఏషణా రహితాద్దృతాయై నమః
30 . ఓం ఏలాసుగన్ధిచికురాయై నమః
31 . ఓం ఏనః కూట వినాశిన్యై నమః
32 . ఓం ఏకభోగాయై నమః
33 . ఓం ఏకరసాయై నమః
34 . ఓం ఏకైశ్వర్య ప్రదాయిన్యై నమః
35 . ఓం ఏకాతపత్ర సామ్రాజ్య ప్రదాయై నమః
36 . ఓం ఏకాన్తపూజితాయై నమః
37 . ఓం ఏధమానప్రభాయై నమః
38 . ఓం ఏకదనేకజగదీశ్వర్యై నమః
39 . ఓం ఏకవీరాది సంసేవ్యాయై నమః
40 . ఓం ఏకప్రాభవ శాలిన్యై నమః
41 . ఓం ఈకారరూపాయై నమః
42 . ఓం ఈశిత్ర్యై నమః
43 . ఓం ఈప్సితార్‍త్థ ప్రదాయిన్యై నమః
44 . ఓం ఈద్దృగిత్య వినిర్‍దే്దశ్యాయై నమః
45 . ఓం ఈశ్వరత్వ విధాయిన్యై నమః
46 . ఓం ఈశానాది బ్రహ్మమయ్యై నమః
47 . ఓం ఈశిత్వాద్యష్ట సిద్ధిదాయై నమః
48 . ఓం ఈక్షిత్ర్యై నమః
49 . ఓం ఈక్షణ సృష్టాణ్డ కోట్యై నమః
50 . ఓం ఈశ్వర వల్లభాయై నమః
51 . ఓం ఈడితాయై నమః
52 . ఓం ఈశ్వరార్‍ద్ధాంగ శరీరాయై నమః
53 . ఓం ఈశాధి దేవతాయై నమః
54 . ఓం ఈశ్వర ప్రేరణకర్యై నమః
55 . ఓం ఈశతాణ్డవ సాక్షిణ్యై నమః
56 . ఓం ఈశ్వరోత్సంగ నిలయాయై నమః
57 . ఓం ఈతిబాధా వినాశిన్యై నమః
58 . ఓం ఈహావిరహితాయై నమః
59 . ఓం ఈశశక్త్యై నమః
60 . ఓం ఈషల్‍ స్మితాననాయై నమః
61 . ఓం లకారరూపాయై నమః
62 . ఓం లళితాయై నమః
63 . ఓం లక్ష్మీ వాణీ నిషేవితాయై నమః
64 . ఓం లాకిన్యై నమః
65 . ఓం లలనారూపాయై నమః
66 . ఓం లసద్దాడిమ పాటలాయై నమః
67 . ఓం లసన్తికాలసల్‍ఫాలాయై నమః
68 . ఓం లలాట నయనార్‍చ్చితాయై నమః
69 . ఓం లక్షణోజ్జ్వల దివ్యాంగ్యై నమః
70 . ఓం లక్షకోట్యణ్డ నాయికాయై నమః
71 . ఓం లక్ష్యార్‍త్థాయై నమః
72 . ఓం లక్షణాగమ్యాయై నమః
73 . ఓం లబ్ధకామాయై నమః
74 . ఓం లతాతనవే నమః
75 . ఓం లలామరాజదళికాయై నమః
76 . ఓం లంబిముక్తాలతాఞ్చితాయై నమః
77 . ఓం లంబోదర ప్రసవే నమః
78 . ఓం లభ్యాయై నమః
79 . ఓం లజ్జాఢ్యాయై నమః
80 . ఓం లయవర్‍జ్జితాయై నమః
81 . ఓం హ్రీంకార రూపాయై నమః
82 . ఓం హ్రీంకార నిలయాయై నమః
83 . ఓం హ్రీంపదప్రియాయై నమః
84 . ఓం హ్రీంకార బీజాయై నమః
85 . ఓం హ్రీంకారమన్త్రాయై నమః
86 . ఓం హ్రీంకారలక్షణాయై నమః
87 . ఓం హ్రీంకారజప సుప్రీతాయై నమః
88 . ఓం హ్రీంమత్యై నమః
89 . ఓం హ్రీంవిభూషణాయై నమః
90 . ఓం హ్రీంశీలాయై నమః
91 . ఓం హ్రీంపదారాధ్యాయై నమః
92 . ఓం హ్రీంగర్‍భాయై నమః
93 . ఓం హ్రీంపదాభిధాయై నమః
94 . ఓం హ్రీంకారవాచ్యాయై నమః
95 . ఓం హ్రీంకార పూజ్యాయై నమః
96 . ఓం హ్రీంకార పీఠికాయై నమః
97 . ఓం హ్రీంకార వేద్యాయై నమః
98 . ఓం హ్రీంకార చిన్త్యాయై నమః
99 . ఓం హ్రీం నమః
100 . ఓం హ్రీంశరీరిణ్యై నమః
101 . ఓం హకారరూపాయై నమః
102 . ఓం హలధృత్పూజితాయై నమః
103 . ఓం హరిణేక్షణాయై నమః
104 . ఓం హరప్రియాయై నమః
105 . ఓం హరారాధ్యాయై నమః
106 . ఓం హరిబ్రహ్మేన్ద్ర వన్దితాయై నమః
107 . ఓం హయారూఢా సేవితాంఘ్ర్యై నమః
108 . ఓం హయమేధ సమర్‍చ్చితాయై నమః
109 . ఓం హర్యక్షవాహనాయై నమః
110 . ఓం హంసవాహనాయై నమః
111 . ఓం హతదానవాయై నమః
112 . ఓం హత్యాదిపాపశమన్యై నమః
113 . ఓం హరిదశ్వాది సేవితాయై నమః
114 . ఓం హస్తికుంభోత్తుంగ కుచాయై నమః
115 . ఓం హస్తికృత్తి ప్రియాంగనాయై నమః
116 . ఓం హరిద్రాకుఙ్కుమా దిగ్ద్ధాయై నమః
117 . ఓం హర్యశ్వాద్యమరార్‍చ్చితాయై నమః
118 . ఓం హరికేశసఖ్యై నమః
119 . ఓం హాదివిద్యాయై నమః
120 . ఓం హాలామదాల్లాసాయై నమః
121 . ఓం సకారరూపాయై నమః
122 . ఓం సర్‍వ్వజ్ఞాయై నమః
123 . ఓం సర్‍వ్వేశ్యై నమః
124 . ఓం సర్‍వమంగళాయై నమః
125 . ఓం సర్‍వ్వకర్‍త్ర్యై నమః
126 . ఓం సర్‍వ్వభర్‍త్ర్యై నమః
127 . ఓం సర్‍వ్వహన్త్ర్యై నమః
128 . ఓం సనాతనాయై నమః
129 . ఓం సర్‍వ్వానవద్యాయై నమః
130 . ఓం సర్‍వ్వాంగ సున్దర్యై నమః
131 . ఓం సర్‍వ్వసాక్షిణ్యై నమః
132 . ఓం సర్‍వ్వాత్మికాయై నమః
133 . ఓం సర్‍వ్వసౌఖ్య దాత్ర్యై నమః
134 . ఓం సర్‍వ్వవిమోహిన్యై నమః
135 . ఓం సర్‍వ్వాధారాయై నమః
136 . ఓం సర్‍వ్వగతాయై నమః
137 . ఓం సర్‍వ్వవిగుణవర్‍జ్జితాయై నమః
138 . ఓం సర్‍వ్వారుణాయై నమః
139 . ఓం సర్‍వ్వమాత్రే నమః
140 . ఓం సర్‍వ్వభూషణ భూషితాయై నమః
141 . ఓం కకారార్‍త్థాయై నమః
142 . ఓం కాలహన్త్ర్యై నమః
143 . ఓం కామేశ్యై నమః
144 . ఓం కామితార్‍త్థదాయై నమః
145 . ఓం కామసఞ్జీవిన్యై నమః
146 . ఓం కల్యాయై నమః
147 . ఓం కఠినస్తనమణ్డలాయై నమః
148 . ఓం కరభోరవే నమః
149 . ఓం కలానాథముఖ్యై నమః
150 . ఓం కచజితాంబుదాయై నమః
151 . ఓం కటాక్షస్యన్ది కరుణాయై నమః
152 . ఓం కపాలి ప్రాణనాయికాయై నమః
153 . ఓం కారుణ్య విగ్రహాయై నమః
154 . ఓం కాన్తాయై నమః
155 . ఓం కాన్తిభూత జపావల్ల్యై నమః
156 . ఓం కలాలాపాయై నమః
157 . ఓం కంబుకణ్ఠ్యై నమః
158 . ఓం కరనిర్‍జ్జిత పల్లవాయై నమః
159 . ఓం కల్‍పవల్లీ సమభుజాయై నమః
160 . ఓం కస్తూరి తిలకాఞ్చితాయై నమః
161 . ఓం హకారార్‍త్థాయై నమః
162 . ఓం హంసగత్యై నమః
163 . ఓం హాటకాభరణోజ్జ్వలాయై నమః
164 . ఓం హారహారి కుచాభోగాయై నమః
165 . ఓం హాకిన్యై నమః
166 . ఓం హల్ల్యవర్‍జ్జితాయై నమః
167 . ఓం హరిల్పతి సమారాధ్యాయై నమః
168 . ఓం హఠాల్‍కార హతాసురాయై నమః
169 . ఓం హర్‍షప్రదాయై నమః
170 . ఓం హవిర్‍భోక్త్ర్యై నమః
171 . ఓం హార్‍ద్ద సన్తమసాపహాయై నమః
172 . ఓం హల్లీసలాస్య సన్తుష్టాయై నమః
173 . ఓం హంసమన్త్రార్‍త్థ రూపిణ్యై నమః
174 . ఓం హానోపాదాన నిర్‍మ్ముక్తాయై నమః
175 . ఓం హర్‍షిణ్యై నమః
176 . ఓం హరిసోదర్యై నమః
177 . ఓం హాహాహూహూ ముఖ స్తుత్యాయై నమః
178 . ఓం హాని వృద్ధి వివర్‍జ్జితాయై నమః
179 . ఓం హయ్యంగవీన హృదయాయై నమః
180 . ఓం హరిగోపారుణాంశుకాయై నమః
181 . ఓం లకారాఖ్యాయై నమః
182 . ఓం లతాపూజ్యాయై నమః
183 . ఓం లయస్థిత్యుద్భవేశ్వర్యై నమః
184 . ఓం లాస్య దర్‍శన సన్తుష్టాయై నమః
185 . ఓం లాభాలాభ వివర్‍జ్జితాయై నమః
186 . ఓం లంఘ్యేతరాజ్ఞాయై నమః
187 . ఓం లావణ్య శాలిన్యై నమః
188 . ఓం లఘు సిద్ధిదాయై నమః
189 . ఓం లాక్షారస సవర్‍ణ్ణాభాయై నమః
190 . ఓం లక్ష్మణాగ్రజ పూజితాయై నమః
191 . ఓం లభ్యేతరాయై నమః
192 . ఓం లబ్ధ భక్తి సులభాయై నమః
193 . ఓం లాంగలాయుధాయై నమః
194 . ఓం లగ్నచామర హస్త శ్రీశారదా పరివీజితాయై నమః
195 . ఓం లజ్జాపద సమారాధ్యాయై నమః
196 . ఓం లమ్పటాయై నమః
197 . ఓం లకుళేశ్వర్యై నమః
198 . ఓం లబ్ధమానాయై నమః
199 . ఓం లబ్ధరసాయై నమః
200 . ఓం లబ్ధ సమ్పత్సమున్నత్యై నమః
201 . ఓం హ్రీంకారిణ్యై నమః
202 . ఓం హ్రీంకారాద్యాయై నమః
203 . ఓంహ్రీంమద్ధ్యాయై నమః
204 . ఓం హ్రీంశిఖామణయే నమః
205 . ఓం హ్రీంకారకుణ్డాగ్ని శిఖాయై నమః
206 . ఓం హ్రీంకార శశిచన్ద్రికాయై నమః
207 . ఓం హ్రీంకార భాస్కరరుచయే నమః
208 . ఓం హ్రీంకారాంభోదచఞ్చలాయై నమః
209 . ఓం హ్రీంకారకన్దాంకురికాయై నమః
210 . ఓం హ్రీంకారైకపరాయణాయై నమః
211 . ఓం హ్రీంకారదీర్‍ఘికాహంస్యై నమః
212 . ఓం హ్రీంకారోద్యానకేకిన్యై నమః
213 . ఓం హ్రీంకారారణ్య హరిణ్యై నమః
214 . ఓం హ్రీంకారాలవాలవల్ల్యై నమః
215 . ఓం హ్రీంకారపఞ్జరశుక్యై నమః
216 . ఓం హ్రీంకారాఙ్గణ దీపికాయై నమః
217 . ఓం హ్రీంకారకన్దరా సింహ్యై నమః
218 . ఓం హ్రీంకారాంభోజ భృంగికాయై నమః
219 . ఓం హ్రీంకారసుమనోమాధ్వ్యై నమః
220 . ఓం హ్రీంకారతరుమఞ్జర్యై నమః
221 . ఓం సకారాఖ్యాయై నమః
222 . ఓం సమరసాయై నమః
223 . ఓం సకలాగమసంస్తుతాయై నమః
224 . ఓం సర్‍వ్వవేదాన్త తాత్పర్యభూమ్యై నమః
225 . ఓం సదసదాశ్రయాయై నమః
226 . ఓం సకలాయై నమః
227 . ఓం సచ్చిదానన్దాయై నమః
228 . ఓం సాధ్యాయై నమః
229 . ఓం సద్గతిదాయిన్యై నమః
230 . ఓం సనకాదిమునిధ్యేయాయై నమః
231 . ఓం సదాశివ కుటుంబిన్యై నమః
232 . ఓం సకాలాధిష్ఠాన రూపాయై నమః
233 . ఓం సత్యరూపాయై నమః
234 . ఓం సమాకృతయే నమః
235 . ఓం సర్‍వ్వప్రపఞ్చ నిర్‍మ్మాత్ర్యై నమః
236 . ఓం సమానాధిక వర్‍జ్జితాయై నమః
237 . ఓం సర్‍వ్వోత్తుంగాయై నమః
238 . ఓం సంగహీనాయై నమః
239 . ఓం సగుణాయై నమః
240 . ఓం సకలేష్టదాయై నమః
241 . ఓం కకారిణ్యై నమః
242 . ఓం కావ్యలోలాయై నమః
243 . ఓం కామేశ్వరమనోహరాయై నమః
244 . ఓం కామేశ్వరప్రణానాడ్యై నమః
245 . ఓం కామేశోత్సంగవాసిన్యై నమః
246 . ఓం కామేశ్వరాలింగితాంగ్యై నమః
247 . ఓం కమేశ్వర సుఖప్రదాయై నమః
248 . ఓం కామేశ్వరప్రణయిన్యై నమః
249 . ఓం కామేశ్వరవిలాసిన్యై నమః
250 . ఓం కామేశ్వర తపఃసిద్ధ్యై నమః
251 . ఓం కామేశ్వర మనఃప్రియాయై నమః
252 . ఓం కామేశ్వరప్రాణనాథాయై నమః
253 . ఓం కామేశ్వరవిమోహిన్యై నమః
254 . ఓం కామేశ్వరబ్రహ్మవిద్యాయై నమః
255 . ఓం కామేశ్వరగృహేశ్వర్యై నమః
256 . ఓం కామేశ్వరాహ్లాదకర్యై నమః
257 . ఓం కామేశ్వరమహేశ్వర్యై నమః
258 . ఓం కామేశ్వర్యై నమః
259 . ఓం కామకోటినిలయాయై నమః
260 . ఓం కాంక్షితార్‍త్థదాయై నమః
261 . ఓం లకారిణ్యై నమః
262 . ఓం లబ్ధరూపాయై నమః
263 . ఓం లబ్ధధియే నమః
264 . ఓం లబ్ధ వాఞ్ఛితాయై నమః
265 . ఓం లబ్ధపాప మనోదూరాయై నమః
266 . ఓం లబ్ధాహఙ్కార దుర్‍గ్గమాయై నమః
267 . ఓం లబ్ధశక్త్యై నమః
268 . ఓం లబ్ధ దేహాయై నమః
269 . ఓం లబ్ధైశ్వర్య సమున్నత్యై నమః
270 . ఓం లబ్ధ వృద్ధ్యై నమః
271 . ఓం లబ్ధ లీలాయై నమః
272 . ఓం లబ్ధయౌవన శాలిన్యై నమః
273 . ఓం లబ్ధాతిశయ సర్‍వ్వాంగ సౌన్దర్యాయై నమః
274 . ఓం లబ్ధ విభ్రమాయై నమః
275 . ఓం లబ్ధరాగాయై నమః
276 . ఓం లబ్ధపతయే నమః
277 . ఓం లబ్ధ నానాగమస్థిత్యై నమః
278 . ఓం లబ్ధ భోగాయై నమః
279 . ఓం లబ్ధ సుఖాయై నమః
280 . ఓం లబ్ధ హర్‍షాభి పూజితాయై నమః
281 . ఓం హ్రీంకార మూర్‍త్త్యై నమః
282 . ఓం హ్రీం‍కార సౌధశృంగ కపోతికాయై నమః
283 . ఓం హ్రీంకార దుగ్ధాబ్ధి సుధాయై నమః
284 . ఓం హ్రీంకార కమలేన్దిరాయై నమః
285 . ఓం హ్రీంకారమణి దీపార్‍చ్చిషే నమః
286 . ఓం హ్రీంకార తరుశారికాయై నమః
287 . ఓం హ్రీంకార పేటకమణయే నమః
288 . ఓం హ్రీంకారదర్‍శ బింబితాయై నమః
289 . ఓం హ్రీంకార కోశాసిలతాయై నమః
290 . ఓం హ్రీంకారాస్థాన నర్‍త్తక్యై నమః
291 . ఓం హ్రీంకార శుక్తికా ముక్తామణయే నమః
292 . ఓం హ్రీంకార బోధితాయై నమః
293 . ఓం హ్రీంకారమయ సౌవర్‍ణ్ణస్తంభ విద్రుమ పుత్రికాయై
నమః
294 . ఓం హ్రీంకార వేదోపనిషదే నమః
295 . ఓం హ్రీంకారాధ్వర దక్షిణాయై నమః
296 . ఓం హ్రీంకార నన్దనారామ నవకల్పక వల్లర్యై నమః
297 . ఓం హ్రీంకార హిమవల్‍గ్గంగాయై నమః
298 . ఓం హ్రీంకారార్‍ణ్ణవ కౌస్తుభాయై నమః
299 . ఓం హ్రీంకారమన్త్ర సర్‍వ్వస్వాయై నమః
300 . ఓం హ్రీంకారపర సౌఖ్యదాయై నమః
శ్రీ లళితాత్రిశతి నామావలి సమాప్తం

ఓం శ్రీమాత్రేనమః

కేనోపనిషత్తులో ఒక కథ ఉన్నది.

అదేమిటంటే- ''ఒకసారి దేవదానవులక ఒక గొప్ప యుద్ధం జరిగింది. అందులో అదృష్టవశాత్తు చివరకు దేవతలకు విజయం లభించింది. అపుడు దేవతలంతా కలిసి ఒకవిజయోత్సవం ఏర్పాటు చేశారు. అందులో పాల్గొన్నవారు గర్వంతో ఆత్మస్తుతి, పరనింద ప్రారంభించారు. ''అహం'' తలకెక్కింది. ఇది గమనించిన పరాశక్తి, జ్ఞానోదయం కలుగడానికి విజయోత్సవం జరిగేచోట బ్రహ్మండమంతా వ్యాపించిన ఒక పెద్దజ్యోతిరూపంలో ప్రత్యక్షమయింది. దానికే ఉపనిషత్తులో ''యక్షరూపం'' అని పేరు పెట్టబడింది. దానిని చూసిన దేవతలంతా ఒక్క క్షణం ఆశ్చర్య చకితులయ్యారు. ఉత్తరక్షణంలో అంతా సమావేశ##మై, తమకంటే అతిరిక్తమైన శక్తి మంతులు లేరనే అహంకారంతో తమ ప్రతినిధిగా అగ్నిని ఆ జ్యోతివిషయం తెలుసుకు రమ్మని పంపారు.

అగ్ని మహాగర్వంతో జ్యోతి సమీపానికి వెళ్ళాడు. అపుడు దానినుంచి ''నీ వెవరు? అనే శబ్దం వినిపించింది. దానికి సమాధానంగా అగ్ని ''నన్ను జాతవేదుడు'' అంటారు. ''ప్రపంచంలోనున్న ఏవస్తువునైనా దహించివేసే శక్తి నాకున్న'' దని చెప్పాడు. అపుడు ఆ జ్యోతి ఒక తృణం అతని ముందు పెట్టి, దానిని దహించమని చెప్పింది. అగ్ని తన యావచ్ఛక్తిని ఉపయోగించాడు. కాని దానిని దహించలేక విఫలుడయ్యాడు. ఆ అవమానంతో దేవతలవద్దకు తిరిగి వెళ్ళి, అహంనశింపగా జరిగింది వారితో చెప్పాడు.

అది విన్న దేవతలు మరింద అహంకారంతో ఈసారి వాయువును ఉపయోగించారు. వాయువు వెళ్ళాడు, వాయువుకు కూడా ''నీవెవరు?''-అనే ప్రశ్న వినిపించింది. అపుడు వాయువు నన్ను ''మాతలి'' అంటారు. సర్వప్రాణులకు ఆధారభూతుణ్ణి, ''ఏ వస్తువునైనా క్షణంలో స్థానభ్రంశం కల్గించగలను'' అని చెప్పాడు, వెంటనే ఆ జ్యోతి అతనికి కూడ ఒక తృణం ఇచ్చి, దానిని ఎగురగొట్టమని చెప్పింది. వాయువు కూడా తనయావచ్ఛక్తిని వినియోగపరచి, దానిని కదల్చలేక నిర్విణ్ణు డయి పశ్చాత్తాపంతో వెనకకు తిరిగి వచ్చాడు.

అగ్ని, వాయువు-ఇద్దరూ అశక్తులవడంతో, దేవతలంతా భయభ్రాంతు లయ్యారు. అపుడు ఇంద్రుడు ఆ జ్యోతిని సమీపించి, హృదయపూర్వక వందనం చేసి ''నీవెవరవో తెలియ జేయవలసింది''-అని ప్రార్థించాడు. అపుడు ఆజ్యోతినుండి దివ్యమైన తేజస్సుతోను, రూపంతోను కూడిన ''పరాశక్తి'' ఆవిర్భవించింది.

ఆ పరాశక్తియే ఇంద్రునికి బ్రహ్మోపదేశం గావించింది. తర్వాత మిగిలిన దేవతలకు జ్ఞానోదయం గల్గి, తమకు విజయం ఈశ్వరసంకల్ప వల్లనే కలిగిందని తెలుసుకున్నారు

మారేడు చెట్టు.

లక్ష్మీదేవి సృష్టించిన చెట్టు మారేడుచెట్టు. అందుకే ఆ చెట్టుకు పండిన కాయను ‘శ్రీఫలం’  అని పిలుస్తారు. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. పూర్వం మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి దానిని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు. మారేడు ఆయుర్వేదంలో ప్రధానంగా ఉపయోగ పడుతుంది. మారేడు దళం మూడుగా ఉంటుంది. అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం! త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం!! అని తలుస్తాము. దళాలు దళాలుగా ఉన్నవాటినే కోసి పూజ చేస్తారు.

ఈ దళం మూడు ఆకులుగా ఉంటుంది. అరుణాచలంలో బహుబిల్వదళం ఉంటుంది. అది మూడు, తొమ్మిది కూడా ఉంటాయి.పుష్పాలతో పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేయాలి. కానీ మారేడు దళంతో పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా ఈనెనే పట్టుకుని శివలింగం మీద వేస్తారు. మనకి శాస్త్రంలో అయిదు లక్ష్మీ స్థానాలు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళం ఒకటి. మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈనె శివలింగానికి తగలడం ఐశ్వర్యప్రదం..అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా, పిల్లలకు ఉద్యోగాలు రాకపోవడం వంటి ఇబ్బందులు ఉంటే మూడు ఆకులు ఉన్న దళాలతో శివునికి పూజ చేసేవారు.

మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే మూడు కోట్లమంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్లే. ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చుని ఎవరయినా జపం చేసినా పూజ చేసినా అపారమయిన సిద్ధి కలుగుతుంది. యోగ్యుడయిన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టుకింద చక్కగా శుభ్రం చేసి ఆవుపేడతో అలికి పీట వేసి ఆయనను అక్కడ కూర్చోపెట్టి భోజనం పెడితే అలా చేసిన వ్యక్తికి కోటిమందికి భోజనం పెట్టినంత ఫలితం వస్తుందని శాస్త్రోక్తి. అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉంది.

‘మా–రేడు’ తెలుగులో రాజు ప్రకృతి, రేడు వికృతి. మారేడు అంటే మా రాజు. ఆ చెట్టు పరిపాలకురాలు. అన్నిటినీ ఇవ్వగలదు. ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు. అది పువ్వు పూయవలసిన అవసరం లేదు. ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా మారేడు పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు.
సేకరణ:- (సాక్షి - పేపర్ )

తారకేశ్వరాలయం - సిద్ధబాబా ఆపన్నాహస్తాలు



హిమాలయాలలో ఘర్వాల్ జిల్లాలో ల్యాండ్స్ డౌన్ గ్రామానికి 12 మైళ్ళ దూరం లో 6500 అడుగుల ఎత్తులో దట్టమైన అరణ్య ప్రాంతం మధ్య తారకేశ్వర అనే చోట సుమారు 650 ఏళ్ళ నాటి చిన్న శివాలయం ఉంది. ఈ ప్రాంత ప్రజలు తమకు పండిన పంటను ఈ శివుడికి నైవేద్యం పెట్ట కుండా తినరు. ఒక వేళ పొరబాటున అలాచేయకపోతే వాళ్ళ ఇల్లు కదులుతుంది...తన 14 వ ఏట ఈ ప్రదేశాన్ని గురించి విని స్వయంగా సంగతులు తెలుసుకోవాలనుకొన్నాడు స్వామి రామా. నడిచి అక్కడికి చేరుకున్నాడు అప్పటికే రాత్రి 7 అయింది. చీకట్లు అలముకున్నాయి. ఒక కొండ గుట్ట అంచున ఉన్నాడు. చేతిలో బాటరీ లైట్ కూడా లేదు, కాళ్లకు కర్ర చెప్పులు -పాంకోళ్ళు మాత్రమే ఉన్నాయి మంచు మీద అవి జారిపోతూ నడక చాలా ఇబ్బంది అయింది. నిలువైన కొండ అంచు నుంచి ఒక్కసారిగా జారిపోయాడు. ఇంతలో పొడవుగా  తెల్లని వస్త్రాలతో పొడవైన తెల్లని గడ్డంతో ఉన్న ఒక ముసలాయన ఆపన్న హస్తాలు అందించి పైకి లాగి  బయటకు చేర్చి కాలిబాట పట్టించి  రామాతో "ఇది దివ్యధామం.రక్షిత ప్రదేశం. నేను నిన్ను నీ గమ్యానికి చేరుస్తానని” చెప్పి పది నిమిషాలలో  బయట  దీపం వెలుగుతున్న ఒక చిన్న కుటీరం దగ్గరకు తీసుకువెళ్ళాడు  ఇద్దరూ కలిసి గుడిసె చుట్టూ ఉన్న రాతి గోడ దగ్గరకు వచ్చారు. స్వామి రామా ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే తనను తీసుకొచ్చిన ముసలాయన కనపడ లేదు.. ఆయనకోసం వెతుకుతూ పిలిచాడు. ఇంతలో గుడిసెలో ఉన్న ఒక సాధువు ఈ కేకలు విని బయటి కొచ్చి, తానుంటున్న గుడిసెలో తనతోపాటు ఉండమని ఆహ్వానించాడు. వెచ్చదనం కోసం లోపల మంట  మండుతోంది.
రామా గుడిసెలో చేరి జరిగిన విషయం సాధువుకు తెలియ జేశాడు.సాధువు కన్నీరు కారుస్తూ "నువ్వు చాలా అదృష్టవంతుడివి నాయనా !గొప్ప మహానుభావుని దర్శించగలిగావు .నేనెందుకు ఇక్కడ ఉంటున్నానో తెలుసా? ఏడేళ్ల క్రితం నేను కూడా నువ్వు జారిపోయిన ప్రదేశంలోనే రాత్రి 11 గంటలకు అంచునుండి జారిపోయాను. నీకు కనిపించిన మహానుభావుడే నన్నూ  తన ఆపన్నహస్తాలు అందించి రక్షించి ఈ గుడిసెకు చేర్చాడు. మళ్ళీ ఆయన దర్శనం నాకు కాలేదు.ఆయనను నేను "సిద్ధ బాబా ”అని పిలుస్తాను. నిన్ను రక్షించిన చేతులే నన్నూ అప్పుడు రక్షించాయి” అన్నాడు గద్గద స్వరంతో.
మర్నాడు స్వామిరామా ఆ చుట్టు ప్రక్క ప్రదేశాలన్నీ గాలించి చూశాడు. తాను  జారిన ప్రదేశం దగ్గర వెతికాడు. తాను  జారిన పాదపు గుర్తులు మాత్రమే కనిపించి గుర్తించాడు. ముసలాయన పాద చిహ్నాలు లేవు. ఇది చాలా ప్రమాదకరమైన అంచు అని గ్రహించాడు అందుకే ఆ అదృశ్య మహాత్ముడు ఆపన్న హస్తాలు అందించి కాపాడుతున్నాడు అని అర్ధం చేసుకొన్నాడు స్వామిరామా. తాను  బ్రతికి బయట పడటానికి ఆ సిద్ధబాబాయే కారణమని గ్రహించాడు. దగ్గరే ఉన్న ఊళ్లోకి వెళ్లి అక్కడున్న వారిని కలిసి తన అనుభవం చెప్పాడు. అక్కడి వారందరికీ తమ కుటుంబాలలో పిల్లా పెద్ద అందరినీ ప్రమాదాలనుంచి కాపాడేవాడు ఆ సిద్ధ బాబాయే అని తెలుసుకొన్నాడు. ఇక్కడ సాధువుతో తానున్న గుడిసె ప్రసిద్ధ శివాలయానికి 100 గజాల దూరంలో మాత్రమే ఉంది . శివాలయాన్ని దట్టమైన ఫర్ వృక్షాలమధ్య కొంత ప్రదేశం ఖాళీ చేసి కట్టారు. అందుకే ఇక్కడ అద్భుత ఆధ్యాత్మిక తరంగ ప్రసారం జరుగుతుందని ఊహించాడు. గ్రామస్తులను అడిగితె సిద్ధబాబా సుమారు 650 సంవత్సరాలక్రితం ఇక్కడ ఉండేవాడని నిరంతర మౌనంలో ఉన్నా ఇక్కడి ప్రజలను సన్మార్గం లో నడిపించేవాడని తెలిసింది. ఆయన సిద్ధి పొందాక ఆ ప్రదేశంలో ఆరు అడుగుల చతురంలో గుడికట్టారని, లోపల శివ లింగాన్ని ప్రతిష్టించారని, అప్పటి నుండి ప్రతి మూడు నెలలకోసారి ప్రజలు వచ్చి కృతజ్ఞత పూర్వకంగా దర్శించి సిద్ధబాబాను స్మరించి వెడతారని,ఆ సిద్ధ బాబాయే తన ప్రాణ రక్షకుడని రామా గ్రహించాడు. ఈ ఆలయం దగ్గరే ఒక గదిలో స్వామిరామా చాలా నెలలు ఉండి యోగ, ధ్యానాలు చేశాడు. స్వామి రామా అక్కడ నుండి వెళ్లి పోయాక కొన్నేళ్ళకు అక్కడి బ్రాహ్మణులు ఆలయం శిధిలమై పోతోంది కనుక శివాలయాన్ని ఇంకొంచెం పెద్దదిగా కడదామని ప్రయత్నం చేశారు..కూలీలు వచ్చి గుడిని పడగొట్టటానికి పలుగు పారలతో ప్రయత్నించారు. అడుగులోతు నుంచి చిన్న చిన్న పాములు అనేక రంగుల్లో కనిపించాయి. తవ్విన మట్టి తీసి పాముల్ని ఏరేసి మళ్ళీ తవ్వారు. లోతుకు వెళ్లిన కొద్దీ పాముల సంఖ్య పెరిగిందే కాని తగ్గలేదట. దగ్గర గ్రామంలోని ఒక ముసలామె రోజూ సాయంకాలం వచ్చి ఆలయంలో దీపం వెలిగించి, మళ్ళీ మర్నాడు ఉదయం వచ్చి ఆర్పేస్తుందిట ఆమె ఇలా ఎన్నో ఏళ్లుగా భక్తితో చేస్తోందట. ఆమె రోజూ త్రవ్వేవారితో గుడిని కూల్చవద్దు, దాన్ని మార్చే ప్రయత్నం చేయద్దు అని గోల చేసేది. కొత్త గుడి కట్టటానికి ఏర్పాటు చేయబడిన ఇంజనీర్ ఆమె మాటలను పట్టించుకొనే వాడు కాదు. ఆరు రోజులు త్రవ్వాక పాములు అనంతంగా ఉన్నాయని  గ్రహించి త్రవ్వకం ఆపేశారు. పోనీ శివలింగాన్ని త్రవ్వి పైకి తీద్దామని ప్రయత్నం చేశారట. 8 అడుగులు తవ్వారు. యెంత లోతుకు తవ్వినా దాని మూలం ఎక్కడుందో తెలియలేదట. కనుక పీకలేక తోక ఝాడించేశారు. ఒక రోజు రాత్రి ఇంజనీర్కు కలలో ఒక పొడవైన తెల్లగడ్డం ముసలి యోగి కనిపించి "ఈ శివలింగం అత్యంత మహిమాన్వితమైనది. దీన్ని కదిలించే ప్రయత్నం చేయద్దు. ఆలయాన్ని పెంచి కట్టే ప్రయత్నమూ చేయద్దు", అని చెప్పాడట. అంతే ఆ ప్రయత్నాలన్నీ ఆపేసి ఉన్న చిన్న గుడినే ఏ మాత్రమూ మార్చకుండా  రిపేర్ చేసి లెంపలు వాయించుకొన్నారట. అందమైన ప్రకృతి  మధ్య విలసిల్లిన వెలసిల్లిన ఆరు శతాబ్దాల మహిమాన్విత శివాలయం అది. దానికే తారకేశ్వరాలయమనీ పేరు. ఇక్కడే శివుడు తారకాసురుని సంహరించాడని ఐతిహ్యం. దీనికి శివసిద్ధ క్షేత్రమనీ పేరు కూడా ఉంది. తరువాత కాలంలో తాండవ శివ విగ్రహ ప్రతిష్ట చేసి వసతులేర్పాటు చేసి ధర్మశాల కట్టించారు.

ఉర్వారుక మివ బంధనం.....

ఇసుకలో ఆడుకొంటున్న పిల్లల్ని చూస్తుంటాం. అద్భుతంగా గుడి కడతారు. తీరికగా అలంకారాలు అద్దుతారు. తోచినంతసేపు హాయిగా ఆడుకుంటారు. పొద్దు వాలేటప్పటికి, ఆ కట్టడాలన్నింటినీ చటుక్కున కూలదోస్తారు. కిలకిల నవ్వులతో నిశ్చింతగా ఇంటిదారి పడతారు. అక్కడి ఆ నిర్మాణాలకు సంబంధించిన మమకారాలు, వియోగ దుఃఖాలు ఏవీ వారికి ఉండవు. ‘అంతగా అయితే, మరునాడు వచ్చి మళ్ళీ కడతాం. పోయేదేముందీ’ అనే ధీమాతో పిల్లలందరూ ‘సొంతిళ్ల’కు వెళ్లిపోతారు. ‘త్య్రంబకం యజామహే...’ అనే మృత్యుంజయ మహామంత్ర సారాంశమూ అదే. ‘జీవితాన్ని ఎంతైనా నిర్మించుకో...ఆత్మీయ బంధాలెన్నింటినో పెంచుకో. ప్రేమానురాగాల్ని గాఢంగా పంచుకో. ఆట ముగిసే సమయానికి, వాటిని అదే విధంగా సునాయాసంగా తెంచుకో’ అని ఆ మంత్రం బోధిస్తుంది. వాటికి, మనిషికి మధ్య ముడి ‘ఉర్వారుక మివ బంధనం’ లా ఉండాలంటుంది. పచ్చి దోసకాయ ముచికకు, దోస తీగకు మధ్య బంధం ఎంత గట్టిగా ఉంటుందంటే- ఆ కాయను పట్టుకు లాగితే ఆ తీగ మొత్తం వచ్చేస్తుంటుంది. అవి ఒకదాన్ని మరొకటి అంత గట్టిగా పట్టుకొని ఉంటాయి.
అదే రీతిలో మనిషి తన చుట్టూ ఉన్న పరివారంతో, ప్రపంచంతో బంధాన్ని అంత గట్టిగానూ పెనవేసుకొని ఉంటాడు. పిల్లలు ఇసుక గూళ్ళు కట్టినంత ప్రీతిగా తన, తనవారి జీవితాల్ని తీర్చిదిద్దుకుంటాడు. దోసపండు ముగ్గే నాటికి పరిస్థితి మారుతుంది. ఉన్నట్లుండి ఆ తీగ నుంచి అది చటుక్కున విడిపోతుంది. అప్పడు చూస్తే ముచిక గాని, తీగ గాని ఎండి ముదిరి పోయినట్లు ఉంటాయి. అంతవరకు ఆ రెండూ ఒకదానితో మరొకటి గాఢంగా, బలంగా ఒకానొక సందర్భంలో అతుక్కునే ఉన్నాయా అనే అనుమానం వస్తుంది. ప్రపంచంతో అన్నింటినీ అంతర్ముఖంగా తెంచుకోగలిగితే, ‘ఈ ఆత్మ నిత్యం’ అని నమ్మగలిగితే మృత్యుభయాన్ని అధిగమించడం సాధ్యమవుతుంది. సాయంత్రం అయ్యేసరికి పిల్లలు నిశ్చింతగా సొంతింటికి తిరిగి వెళ్లిపోయినట్లు, ఈ అద్దె ఇంటితో అనుబంధాన్ని వీడాలన్నదే ఆ మంత్ర మహోపదేశం! ‘దేహం వీడి వెళుతున్నాను’ అనేది అసురీ భావం. ‘అద్దె గృహాన్ని వీడుతున్నాను’ అనేది అమృత భావన! అలా అమృతత్వ స్థితిలోకి చేరుకోవడమే ముక్తి అనిపించుకుంటుంది. మనిషి జీవించి ఉండగానే సాధించాల్సిన స్థితి అది. అందుకే దాన్ని ‘జీవన్ముక్తి’ అంటారు...

ఈ సమూహంలోని ప్రతీవ్యక్తి ఏ స్థితిలో ఉన్నా జీవన్ముక్తిని ప్రసాదించు భగవంతుడా...అని అంతర్ముఖంగా ఆ పరమాత్మను వేడుకుంటున్నాను...

ఓం నమో నారాయణాయ...అరుణాచల శివ...

#గుడ్డు #పాలు #_శాకాహారమా #_మాంసాహారమా?

వివరణాత్మకమైన వ్యాసం ఒక గ్రూపు నుండి సేకరించింది దయచేసి కొంత సమయం వెచ్చించి తీరికగా చదువగలరు.

ముందుగా మనం శాకాహారం అంటే ఏమిటి?
మాంసాహారం అంటే ఏమిటి?
అనే విషయం పై శాస్త్రం చెప్పిన వివరణ పరిశీలిద్దాం!

భగవంతుని ప్రేరణ చేత ఈ భూమిపై చరాచర సృష్టి (పుట్టుక) అనేది నాలుగు రకాలుగా విభజించి అర్ధంచేసుకోబడింది.
వీటిని జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భిజములు అని పిలుస్తారు.
1. జరాయుజములు: గర్భంలోని పిండమునావరించియుండి మాయవలన పుట్టునవి.(మనుష్యులు పశువులు)
2. అండజములు: గ్రుడ్డు నుండి పుట్టు పక్షులు, పాములు, మొదలగునవి.
3. స్వేదజములు: చెమట వలన పుట్టు దోమలు, నల్లులు మొదలగునవి.
4. ఉద్భిజములు : విత్తనము పగలదీసి జన్మించు వృక్షలతాదులు.

ఇక ఇందులో రెండురకాలు:
"చర సృష్టి" , "అచర సృష్టి" .
జరాయుజములు, అండజములు, స్వేదజములను "చరసృష్టి" అనియు; ఉద్భిజములను మాత్రం "అచర సృష్టి" అనియు; 
చర అంటే కదిలేవి (మనుషులు, పశువులు, పక్షులు, పాములు, దోమలు, నల్లులు ఇటువంటివి కదలిక కలిగి ఉంటాయి). ఇవి ముఖ్యంగా తమ కదలికలను తమను తాము కాపాడుకునే పనిలోనూ తమ ఆహార ప్రయత్నంలోనూ వాడతాయి.
ఇవి రజోగుణ, తమోగుణ స్వభావులు. అందువల్ల ఇవి ధరించే శరీరాలను దోషభూయిష్టమైనవిగా, అంతర్గతంగా దుర్గంధాన్ని ఆవరించి యుండేవిగా భావించి వీటిని ’నీచమని’, ’మాంసమని’, మాంసాహారమనీ పూర్వీకులు చెప్పారు.
ఈ నీచము అనే మాటనుండే నీచు అనే అర్థం మాంసానికి వచ్చింది.
ఈ చరసృష్టి అంతా తల కిందకు దించి తమ ఆహారాన్ని స్వీకరించ ప్రయత్నంచేస్తాయి. పశువులు మేతమేసినా, మానవులు ఆహారంతింటున్నా తలను నీచానికి చూస్తారు కాబట్టి నీచం అనే పదం వాడారు.
ఇకపోతే ఉద్భిజములు:  విత్తనమునుండి వచ్చేవి. వీటిని ఉచ్చములు అని అంటారు.
ఇవి వీలైనంతవరకూ సూర్యుడిని అందుకోవడానికి ఆకాశంవైపు సాగుతాయి. ఇవి అత్యధికశాతం సత్వగుణపూరితములు.
అందువల్ల వీటిని ’శాకాహారమని’ అంటారు.

చరసృష్టిని ఆహారము కొరకు వాడగూడదు అని యాజ్ఞవల్క్యస్మృతి చెబుతోంది. ఒక జంతువు యొక్క ఒక కాలు మనం కత్తిరిస్తే అది జీవితాంతం కుంటుతుంది. అంతేగానీ వేరొక కాలు మొలిపించుకోలేదు.
కానీ అచరసృష్టి దీనికి భిన్నం. ఒక చెట్టుయొక్క ఒక కొమ్మని నరికితే అది వేరొక కొమ్మను మళ్లీ మొలిపించుకుంటుంది. చెట్టు తన ఆకులను సమృద్ధిగా రాల్చేస్తుంది. చెట్టు తన పండ్లను రాల్చేస్తుంది. అలాగే వరి వంటి మొక్కల ధాన్యాన్ని మనం ఆ మొక్క ప్రకృతిసిద్ధంగా చనిపోయిన తర్వాతే పంటను కోసి విత్తనాలను ఇంటికి తెచ్చుకుంటాము. ఈ అచరసృష్టి తమకు ఒకచట ఆహారం దొరకలేదుగదా అని వేరొకచోటికి కదలవు వీటిలో సత్వగుణం (సత్వం సుఖే సంజయతి). అందువల్ల అరటి, మామిడి, గోధుమలు, యవలు, తిలలు, వంటి వాటిని భుజిస్తే సత్వగుణవృద్ధి జరిగి ఆలోచనలో క్రూరత్వం నశించి మనిషి ఆరోగ్యపూరితమైన జీవనాన్ని సాగిస్తాడు కాబట్టి శాకాహారము (అచర చేతనా సృష్టి) ని భుజించి మానవుడు సుఖించి కైవల్యాన్ని పొందవచ్చని సాధనాగ్రంధములలో ఋషులు బోధించారు.

ఇక ఈ శాకాహార మాంసాహారం గూర్చి.
మానవులు మావినుండి పుడతారు. తల్లి పాలు తాగి పెరుగుతారు. అలాగే తోటి జరాయుజములైన ఆవులు, లేడులు, గుర్రముల వంటి వాటి పాలు వీరు తాగవచ్చు అని చెప్పారు.
ఈ పాలు అనేవి తమ బిడ్డ తాగేదాని కంటే రెండింతల ఎక్కువగానే జరాయుజములు ఉత్పత్తిచేస్తాయి. కాబట్టి దూడ తాగిన తర్వాత మిగిలిన పాలను ఈ జరాయుజములు సహజంగానే విసర్జించేస్తాయి. అంటే పితకకపోతే ఎక్కువైన పాలను ఏ చెట్టుకో పొదుగును అదిమిపెట్టి కార్చేస్తాయి. కాబట్టి ఇలాంటి పాలు సేకరించడంవల్ల జరాయుజముల ప్రాణనష్టాన్ని కలిగించడం జరగడంలేదు!
కాబట్టి #పాలు #ఖచ్చితంగా #శాకాహారమే!
అయితే దీనికి ఒక నియమం చెప్పారు. ఉద్భిజములను’ తిని బ్రతికే ’జరాయుజముల’ పాలు మాత్రమే శాకాహారం – అంటే గడ్డి తిని పాలిచ్చే ఆవుపాలు శాకాహారం.
కానీ మిగిలినవాటిని తిని పాలిచ్చే జరాయుజముల పాలు మాంసాహారం అంటే ఆవును తిని పాలిచ్చే పులి పాలు మాంసాహారమే!
మానవులు స్వతస్సిద్ధంగా ఉద్భిజములను’ తిని బ్రతికే ’జరాయుజములు’.

#గుడ్డు అనేది #ఖచ్చితంగా #మాంసాహారమే! Sterile Egg అనేదాన్ని కొన్ని రసాయనాలనుపయోగించి పెరగకుండా దానిలోని జీవాన్ని మాతృగర్భంలో ఉండగానే చంపేస్తారు. అందుకే అది పుట్టిన తర్వాతగూడా పెరగకుండా గుడ్డులాగా మిగిలిపోతుంది. ఆ గుడ్డులోనుండి పిల్ల బైటికి రాకుండా రసాయనాలు వాడి, పైగా పిల్లరాదుగదా! అది శాకాహారమే అని చెప్పడం అర్ధంలేని వాదం.

కాబట్టి సూక్షంగా ఏది కదులుతుందో, ఏది కదిలి తన ప్రాణాలను కాపాడుకో ప్రయత్నిస్తుందో, ఏది కదలిక కలిగే తనవంటి ప్రతిరూపానికి జన్మనిస్తుందో దానిని తినడం మాంసాహారం.
గుడ్డు ఖచ్చితంగా మాంసమే!

 పాలు  శాకాహారం

ఏది కదలదో, ఏది తన కొమ్మలను మరింతగా, ఆకులను మరింతగా మొలిపించుకో గలుగుతుందో అది శాకాహారం.

చేపలు ‘అండజముల‘ క్రిందకే వస్తాయి. అంటే గుడ్లనుండి పుట్టేవి, కదలిక కలిగినటువంటివి కాబట్టి చేపల వంటివి గూడా మాంసాహారం క్రిందకే పరిగణించబడుతుంది.
ప్రతి జీవికి తన స్వతస్సిద్ధమైన తిండి ఉంటుంది. మేకలు, ఆవులు, గుర్రములు స్వతస్సిద్ధంగా పచ్చిక మేస్తాయి. పులులు, సింహములు, గద్దలు స్వతస్సిద్ధంగ మాంసమును తింటాయి.
మానవులు స్వతస్సిద్ధంగా పండ్లు, కూరగాయలు, కొన్నిరకముల గడ్డి మరియు గడ్డిగింజలు (వరి, గోధుమ మొదలగునవి) తింటారు.
మనుషుల శరీర నిర్మాణాకృతి అంతర్గతమైన జీర్ణావయవములు
ఈ విషయాన్నే నిర్ధారిస్తాయి.

మానవుల ప్రేగులు దాదాపు ఏడు మీటర్ల పొడవుంటాయి.
ఇవి మిగిలిన శాకాహార జరాయుజములైన దుప్పి,లేడి, ఆవులను పోలిన నిర్మాణం.
కానీ పులి, సింహము వంటి సహజసిద్ధమైన మాంసాహార జరాయుజముల పొట్టలోని ప్రేగులు మీటరు పొడవుగూడా ఉండవు. ఎందుకంటే ఇవి మాంసం తింటాయి, మాంసము అంటే అప్పటికే ఒక జంతువు తిని అరిగించుకుని బలంగా మార్చుకున్న పదార్థం. అందువల్ల తిరిగి మాంసాన్ని అరిగించుకోవాల్సిన అవసరం వీటి ప్రేగులకు ఉండదు,
వీటి ప్రేగులపై అంత భారమూ పడదు. అందుకని స్వతస్సిద్ధంగా మాంసం తినే జంతువుల ప్రేగులు చాలా చిన్నవిగా ఉంటాయి.

కాబట్టి మానవులు స్వతస్సిద్ధంగా శాకాహరజీవులు. అలాగే జీవించాలి.

తప్పకుండా బాబు


మనవాళ్ళు ఇప్పుడు యుక్తవయస్సులో కూడా లేనిపోని ఆలోచనలు పెట్టుకోకుండా ఎంత అవహేళనకు గురవుతున్న వైదిక కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటూ మన ధర్మాలకు ప్రధాన్యత నిస్తున్నవారు చాలమంది వున్నారు.
వీరికి వివాహాలు కావటం పెద్ద సమస్య ఐపోతోంది.
నిజానికి ఒక ఉద్యోగికంటే ఎన్నోరెట్లు అర్ధింకగా ఎదుగుతున్నారు సమాజంలో మంచి స్థానాన్ని సంపాదించి పూజింప బడుతున్నారు.
కానీ వీరిలో ఒకలోపం వుంది
ఏదైనా ఒకమంత్రం జపిస్తే దాని అర్ధాన్నికూడా గ్రహించాలి.
అందులో వీరు నిష్నాతులు కాలేకపోతున్నారు.ఒకవేళ అలాగే వీరు కృషిచేస్తే ఎవరైనా  దీనికి అవహేళన చేసినప్పుడు వేద ధర్మం ఇదీ అని చెప్పుతీసికొట్టినట్టు సమాధానం చెప్పగలిగేవారు.వారు చేయిస్తున్న ధర్మ కార్యానికి విలువ కల్పించేవారు.
అకాల మృత్యుహారణం సర్వవ్యాధి నివారరణం అనేది మంత్రమా అందులో భారతీయ సనాతన వైద్యమర్మం వుందికదా....
అందులో ఏలా లవంగాలు పఛ్చ కర్పూరాలు కలిపిన ఆకాశగంగాజలంతో శ్రీ వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేస్తారు.
సాలగ్రామ శిలావారి పాపహారి అంటే మంత్రమా....
భూమి అట్టడుగుపొరల్లో బంగారం వెండి వజ్ర వైఢూర్యాలు అణువులు సమ్మేళనం తో ఒక కఠిన శిలా ఏర్పడి ఆ శిల తో దేవతా మూర్తులు తయారైతే అమూర్తికి చేసేఅభిషేక జలం.తీర్థంగా పుచ్చు కుంటే    ఆరోగ్యం
 కాదా.....
నిజానికి సంస్కృతపరిజ్ఞానం తగ్గిపోయింది కనుకే బ్రాహ్మణులు అవహేళనకు గురవుతున్నారు రేపటి తరానికి
మంచి విద్వత్ గల గురువు  వీరికి లభించాలని ఆకాంక్ష.
శివాసీస్సులు

గురువు

ఒకానొక  చక్రవర్తి  యుద్ధంలో గెలిచి వచ్చాడు. భట్రాజుల పొగడ్తలతో గర్వం మరింత అతిశ యిల్లింది. తన జీవితాన్ని తీర్చిదిద్దిన మార్గదర్శి, జ్ఞాని, గురువు అయిన మహా మంత్రే ఆయనకా సమయంలో చులకనగా కనిపించాడు. దీన్నే అంటారు కళ్లునెత్తికెక్కాయని.

 అతనిలో గర్వంతో బాటు అహంభావం కూడా పెరిగింది. మంత్రితో ఎలా వ్యవహరించాలో కూడా మరచిపోయాడు.
'మంత్రివర్యా! మీరెంతో తెలివైనవారు, జ్ఞాన నిధి, గొప్ప వ్యూహ కర్తలు. ఈ తెలివి తేటలతో బాటు అందం కూడా ఉంటే ఎంత బాగుం డును' అన్నాడు.

అసలతను చక్రవర్తి కావడానికి కారణభూతుడు ఆ మంత్రే. కొలువులో అందరూ చక్రవర్తి మాటలకు ఆశ్చర్యపోయారు.

తనను నిండు సభలో అవమానించిన చక్రవర్తిపై ఆ మంత్రికి కోపం రావాలి. ఆ మంత్రి ఏ భావమూ ప్రకటించలేదు. తనను తక్కువ చేసి మాట్లాడిన రాజును తూలనాడలేదు.

దగ్గరలో ఉన్న ఒక పరిచారకుడిని పిలిచి 'ఎండ మండిపోతోంది. ప్రభువులకు దాహంగా ఉంది తక్షణమే స్వర్ణ పాత్రలో ఉన్న శుద్ధమైన జలాన్ని తెచ్చి ప్రభువులకు తాగడానికి ఇవ్వు' అన్నాడు.

పరిచారకుడు స్వర్ణ పాత్రలోని జలాన్ని ఒక బంగారు గ్లాసులో తెచ్చి ఇచ్చాడు.

'ఆ నీళ్లు వెచ్చగా ఉండి ఉంటాయి. దాహం తీరి ఉండ దు. మట్టి కుండలో నీరు తెచ్చి ఇవ్వు' అన్నాడు మంత్రి మళ్ళీ. ..పరిచారకుడు మట్టి కుండలోనుంచి తెచ్చి ఇచ్చిన నీటిని చక్రవర్తి తృప్తిగా తాగాడు.

వెంటనే ఆలోచించాడు...

 మంత్రి ఒక్క సారిగా నీటిని గురించి ప్రస్తావించడడం, పరిచారకుడి చేత స్వర్ణ పాత్ర, మట్టి పాత్ర ల్లోని నీటిని తెప్పించడం ఇదంతా ఎందుకు చేశాడని ఆలోచించాడు. వివేకవంతుడు కనుక వెంటనే అర్థమయింది. జ్ఞానోదయమయింది.

వెంటనే సింహాసనం దిగి మంత్రి వద్దకు వచ్చి, 'గురు దేవా! మన్నించండి. గర్వాతిశయంతో కాని మాట అన్నాను. బంగారు పాత్ర విలువైనదే కావచ్చు. అందంగా ఉండవచ్చు. కాని దానికి నీటిని చల్ల్లపరిచే గుణం లేదు. మట్టి పాత్ర బంగారు పాత్రతో సరితూగలేదు. అయినా నీటిని చల్ల్లగా ఉంచు తుంది. అందం కాదు గుణం, జ్ఞానం, క్షమ అనే ఆభరణాలే అతి విలువైనవని మీరు బహు చక్కగా బోధించారు. నా అపరాధాన్ని మన్నించండి' అన్నాడు.

ఆ చక్రవర్తి మరెవరో కాదు మౌర్య వంశ వ్యవస్థాపకుడు మౌర్య చంద్ర గుప్తుడు. ఆ మహా మంత్రి మరెవరో కాదు. మహారాజనీతి వేత్త, చతురుడు, అర్థశాస్త్ర రచయిత, కౌటిల్యునిగా పేరు గాంచిన చాణక్యుడు.

 నరస్యాభరణం రూపం
 రూపస్యాభర ణం గుణమ్‌
 గుణస్యాభరణం జ్ఞానమ్‌
 జ్ఞానస్యాభరణం క్షమా

మానవులకు ఆభరణం రూపమని, రూపానికి ఆభరణం సుగుణమని, సుగుణానికి ఆభరణం జ్ఞానమని, జ్ఞానానికి ఆభరణం క్షమ అని దీని అర్థం.

పై శ్లోకంలో మనిషికి రూపం మంచి ఆభరణమని చెప్పినా గుణం, జ్ఞానం, క్షమ అనేవి రూపం కన్నా అతి ప్రధానమైనవని స్పష్టం చేయబడింది.

అంటే మంచి అంద గాడైనా ఏ వ్యక్తి అయినా ఆ ఒక్క లక్షణం ద్వారా పూజ్యుడు కాడు.

వినయం అనేది మనిషిలో ఎల్ల్లవేళలా అన్ని పరిస్థితుల్లోనూ ఉండాలి.

కొందరు ఓటమి చవి చూసి నప్పుడో, బాధలలో మునిగిపోయినప్పుడో తమ బాధలు వెళ్ళబుచ్చుకునేందుకు ఇతరుల ముందు వినయం ప్రదర్శిస్తారు.

అయితే ఇలాంటి వ్యక్తులు గెలుపు సాధించి నపుడు, సంపదలు వచ్చినపుడు, మంచి పదవి ఉన్నపుడు గర్వాతిశయంతో ఇతరులను చిన్న చూపు చూస్తారు. కించ పరుస్తారు. మాటలతో ఎదుటివారిని చులకన చేస్తారు.

అందంగా ఉండడం మంచిదే కాని తను అందంగా ఉన్నానని అందవిహీన మయిన పనులు చేయడం తగనిది.

అన్నీ ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నపుడు కూడా హద్దులెరిగి ప్రవర్తించాలన్నది పెద్దల మాట.

  🙏  లోకాసమస్తా సుఖినో భవంతు 🙏

హిందువులకు దేముళ్ళు ఎందరు;


ఈ మధ్య నేను ఒక క్రెస్తవ పాస్టర్ వీడియో చూసా అందులో ఆయన ఒక మాట అన్నాడు. బహు దేముళ్ళను కొలిచే వారికి నరకం వస్తుంది అని. అంతేకాదు హిందువులు బహు దేముళ్ళని సేవిస్తున్నారు కావట్టి వాళ్లు నరకం పొందుతారని వారి బైబులు చెపుతున్నదని హిందువులని వాళ్ళ మతంలోకి మార్చుకొనే ప్రయత్నంలో భాగంగా ఆ ప్రసంగం. ఇటువంటి విమర్శలను మన హిందువులు అందరు ఎదుర్కొనే స్థాయికి మన జ్ఞానం పెంపొందించువాలి. అప్పుడే అటువంటి వాటినుండి మనలను, మన ధర్మాన్ని కాపాడుకోగలం. 
ఈ శ్లోకం గమనించండి

ఆకాశాత్ పతితం తోయం యధా గాస్చేతి సాగర 
సర్వ దేవా నమస్కారం కేశవం ప్రతి గచ్ఛతి. 

భావం ఆకాశం నుండి వచ్చిన నీరు ఏవిధంగా అయితే సముద్రాన్ని చేరుతుందో అదే విధంగా అన్ని దేవతలకు చేసిన నమస్కారం కేశవునికే చెందుతుంది అని అర్ధం. 
దీనిని బట్టి మనకు రెండు విషయాలు తెలుస్తాయి అవి. 1) ఎంతమంది దేముళ్ళకు నమస్కరించిన అందరు ఒక్కరే ఆ ఒక్కరు కేశవుడు మాత్రమే. కాబట్టి మనం ఏదేముడిని ఏ పేరుతొ కొలిచిన మన నమస్కారం మాత్రం ఆ దేవా దేవుడైన కేశవుడిని మాత్రమే చేరుతాయి అని అర్ధం. ఇప్పుడు చెప్పండి హిందువులకు దేముళ్ళు ఎందరు. ఉన్నది ఒక్కడే ఆ దేముడిని మనం వివిధ రూపాలతో వివిధ నామాలతో పూజిస్తున్నాం. 

మీకు ఇంకా సరళంగా అర్ధం కావటానికి ఒక సాధారణ ఉపమానంతో చెప్పే ప్రయత్నం చేస్తాను. 

మీకు తహసీల్దారు ఆఫీసు నుండి ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలి మీరు ఏమి చేస్తారు మీరు మీ అర్జీని అక్కడి ఇన్వార్డ్ క్లర్కుకి ఇస్తారు, ఆ క్లర్కు మీ అర్జీని తీసుకుంటాడు. నిజానికి మీ అర్జి తహసీల్దారుగారి పేరుమీదనే వుంది. ఆ క్లార్క్ రెండు మూడు రోజుల్లో కార్యాల ఇతర సిబ్బంది, వీ ఆర్ ఓ , ఆర్, ఓ. ల ఎండోస్మెంట్ తో తహసీల్దారు గారివద్దకు పంపుతారు. అవన్నీ మీకు తెలియకుండానే జరుగుతాయి. తరువాత మీరు వచ్చి ఔట్వేర్డ్ క్లర్కునుండి తహసీల్దారు గారి సంతకంతో మీకు మీ సర్టిఫికెట్ వస్తుంది. ఇప్పుడు చెప్పండి ఇక్కడ మీకు తహసీల్దారుగారు మాత్రమే మీ పని చేయ సమర్ధుడు. కానీ మీరు అతనిని కనీసం కలవను కుడా కాలవ లేదు. కానీ ఆయన ద్వారా మాత్రమే మీకు సర్టిఫికెట్ వచ్చింది. 
మీరు ఆఫీసుకి వెళ్ళినప్పుడు అక్కడి ఇన్వార్డ్ కాలేర్క్ కు నమస్కరించారు కానీ తహసీల్దారిని చూడను కూడా చూడలేదు. మరల మీ సర్టిఫికెట్ పొందినప్పుడు కూడా మీకు అది ఇచ్చిన క్లర్కుకే నమస్కరించారు. అదే విధంగా మన హిందూ సాంప్రదాయంలో భగవంతుని కంట్రోల్లో వున్న అనేక శాఖలు వివిధ ఉద్యోగస్తులకు అంటే వివిధ దేవతలకు ఆయన అప్పచెప్పారు ఉదాహరణకు ధనము కావాలంటే లక్షి దేవికి, విద్య కావాలంటే సరస్వతికి, ధైర్యం కావాలంటే పార్వతి దేవికి తన శక్తిని ఇచ్చారు, ఇంకా ఉప శాఖలు కూడా ఉదాహరణకు ధనానికి ధన లక్ష్మి, ధాన్యానికి ధన్య లక్ష్మి, సౌభాగ్యానికి సౌభాగ్య లక్ష్మి అదే విధంగా మిగిలిన దేవతలకు కూడా. 
ప్రతి పని చేయటానికి కార్యాలయంలో ఒక్కొక్క ఉద్యోగస్తుడు వున్నా అన్నీ కూడా ఆ ఆఫీసరు పేరుమీదే జరుగుతాయి. అదేవిధంగా మనం ఏ దేముడిని కొలిచిన అన్ని ఆ పరమాత్మా పేరుమీదే.  అది తెలుసుకోలేని, తెలవని ఇతర మతస్తులు మన ధర్మాన్ని విమర్శిస్తున్నారు. మన వాళ్ళు వాళ్ళ మాటలు నమ్ముతున్నారు
మిత్రులారా ఇప్పుడు కాదు ఎప్పటికి మన హిందూ ధర్మాన్ని విమర్శించే స్థాయికి ఇతర మతస్తులు ఎవ్వరు ఎదగ లేదు, ఎదగ లేరు ఎందుకంటె మన ధర్మం, మన జ్ఞానం అపారమైనది. మన దేశంలో దైవ సాక్షాత్కారం పొందిన మహానుభావులు ఎందరో వున్నారు. ఇప్పటిలో కొన్ని వందల  సమత్సరాల్నుండి తప్పస్సు చేస్తున్న మహర్షులు ఎందరో మన హిమాలయాలలో వున్నారు ఇది సత్యం. 
ఓ హిందూ మేలుకో నీ ధర్మాన్ని తెలుసుకో 
సర్వ్ జన సుఖినోభవంతు 
ఓం శాంతి శాంతి శాంతిః 
****************&&&&****************

కర్మ

కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు. తన వందమంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు.కృష్ణుడిరాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురువెళ్ళి బోరున విలపిస్తాడు. చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న ధృతరాష్ట్రుడిని కృష్ణుడు ఓదార్చే ప్రయత్నం చేస్తాడు.

ధృతరాష్ట్రుడి దుహ్ఖం కోపంగామారి కృష్ణుడిని నిలదీస్తాడు. "అన్నీ తెలిసి కూడా, మొదటి నుంచీ జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తూ భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్నకుండిపోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? ఈరోజు తనకి వందమంది పుత్రులని పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు అని నిలదీస్తాడు. అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు.

. "ఓ రాజా! ఇదంతా నేను చేసిందీ కాదూ, నేను జరగనిచ్చిందీ కాదు. ఇది ఇలా జరగటానికి, నీకు పుత్రశోకం కలగటానికీ అన్నిటికీ కారణం నువ్వూ నీ కర్మ. యాభై జన్మల క్రితం నువ్వొక కిరాతుడివి (వేటగాడు). ఒకరోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడినా నీకు యేమీ దొరకని సందర్భంలో ఒక అశోక వృక్షం మీద రెండు గువ్వల జంట వాటి గూట్లో గుడ్లతో నివసిస్తున్నాయి. వాటిని నీవు చంపబోగా ఆ రెండు పక్షులూ నీ బాణాన్ని తప్పించుకుని బ్రతుకగా అప్పటికే సహనము నశించినవాడివై కోపంతో ఆ గూట్లో ఉన్న వంద గుడ్లను ఆ రెండు పక్షులు చూస్తుండగా విచ్చిన్నం చేశావు. తమ కంటి ముందే తమ నూర్గురు పిల్లలు విచ్చిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూఉండిపోయాయి. ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపము నుండి విముక్తుడిని చేసి కర్మబంధం నుండి విడిపించింది, నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా నీ కర్మ నిన్ను తప్పక వెంటాడుతుంది, వదలక వెంటాడి ఆ కర్మ ఫలాన్ని అనుభవింపచేస్తుంది. కర్మ నుండి ఎవరూ తప్పించుకోలేరు" అని అంటాడు.

ధృతరాష్ట్రుడు సమాధానపడ్డట్టు అనిపించినా మళ్ళీ కృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు. కర్మ అంత వదలని మొండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు? ముందే ఎందుకు శిక్షించలేదు అని ప్రశ్నిస్తాడు. అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి "ఓ రాజా! వందమంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి.. ఎన్నో సత్కర్మలు ఆచరించాలి. ఈ యాభై జన్మలు నువ్వు ఈ వందమంది పుత్రులను పొందడానికి కావల్సిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు. వందమంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పని చేయడం మొదలుపెట్టింది అని శెలవిస్తాడు. అది విన్న ధృతరాష్ట్రుడు కుప్పకూలిపోతాడు.

మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్యఫలాలన్నీ ఒక్క చెడ్డపనితో తుడిచిపెట్టుకుపోతాయి అని శ్రీ కృష్ణుడు అంతరార్థం.

- మహాభారతం
*****************&&&&*********

ఆందోళన వీడుదాం! అవగాహన పెంచుకుందాం!!

కొవిడ్‌ విస్తృతంగా, వేగంగా వ్యాప్తి చెందుతోంది. లాక్‌డౌన్‌ సడలింపులు, ప్రజల రాకపోకలు, వ్యాపార లావాదేవీలు మొదలవడంతో.. గత నెల రోజులుగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇళ్లూ, కార్యాలయాలు, మార్కెట్లూ.. ఒక్కచోటని కాదు ఎక్కడ్నించి ఎవరి ద్వారా వైరస్‌ ముప్పు పొంచి ఉందోనన్న భయాందోళనలు వెన్నాడుతున్నాయి. దీంతో వైరస్‌ను ధైర్యంగా ఎదుర్కొంటూ జీవనాన్ని కొనసాగించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. నిజానికి కరోనా పాజిటివ్‌ వస్తే భయపడాల్సిన పనిలేదు. ఆసుపత్రులకు పరుగులు తీయాల్సిన అవసరమూ లేదు. అవగాహనతో ధైర్యంగా ఉంటే కరోనాను సగం జయించినట్లే. భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) మార్గదర్శకాల ప్రకారం.. ఎటువంటి లక్షణాలు లేని పాజిటివ్‌లు, స్వల్ప లక్షణాలున్నవారు ఇంట్లోనే ఉండి చికిత్స పొందవచ్చు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో వేల మంది ఇంట్లో ఉండి కోలుకున్నారు. కోలుకుంటున్నారు. అయినా కొన్ని ప్రశ్నలు మనల్ని నిత్యం వెంటాడుతూనే ఉన్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో పాజిటివ్‌ వచ్చినా స్వల్ప లక్షణాలున్నవారు, అసలు లక్షణాలు లేనివారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పని ప్రదేశాల్లో పాటించాల్సిన నిబంధనలేమిటి? ఒకవేళ ఇంట్లో, ఆఫీసుల్లో సన్నిహితుల్లో ఎవరికైనా కరోనా వస్తే ఏం చేయాలి? అసలు ఎవరు పరీక్షలు చేయించుకోవాలి? ఎలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్లాలి? 


 ఇలా ప్రజలను నిరంతరం వెన్నాడుతున్న ఎన్నో సందేహాలు ఎన్నో. అలాంటి వాటిని ప్రముఖ జనరల్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ ఎంవీ రావు ముందు ఉంచింది ‘ఈనాడు’.

కొవిడ్‌ అనేది ఒక వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌. దీని జీవితకాలం వారం, రెండు వారాలే. ఆ తర్వాత క్రమేణా శరీరంలో దాని ప్రభావం తగ్గిపోతుంది. వైరస్‌ సోకినవారిలో 85 శాతం మందిలో ఎటువంటి ప్రమాదం ఉండదు. కరోనా సోకినా.. వారిలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. ఆ వ్యక్తికి తెలియకుండానే వైరస్‌ సోకి తగ్గిపోవచ్చు కూడా. కొంత కాలం తర్వాత శరీరంలో యాంటీబాడీస్‌ వృద్ధి చెందుతాయి. కేవలం 15 శాతం మందిలోనే లక్షణాలు కనిపించడం, కొంత తీవ్రత పెరగడం వంటివి చూస్తున్నాం. ఇందులోనూ కేవలం 5 శాతం మందికి మాత్రమే ఐసీయూలో చికిత్స అందించాల్సి వస్తోంది. అందుకే అవగాహనతో ధైర్యంగా ఉంటే సగం కరోనాని జయించినట్లే. కొవిడ్‌ కొత్త జబ్బు కాబట్టి దీని గురించి శాస్త్రపరమైన అవగాహన కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతోంది.


కరోనా బాధితులు 5 రకాలు

1. లక్షణాలు లేనివారు(ఎసింప్టమేటిక్‌)    2. అతి స్వల్ప, స్వల్ప లక్షణాలున్నవారు(మైల్డ్‌)
3. మధ్యస్థ లక్షణాలున్నవారు(మోడరేట్‌)    4. తీవ్ర లక్షణాలున్నవారు(సివియర్‌)
5. పరిస్థితి విషమించినవారు(క్రిటికల్‌)
వీరిలో లక్షణాలు తీవ్రంగా ఉన్నవారిని, పరిస్థితి విషమించినవారిని, మధ్యస్థ లక్షణాలున్నవారిని కూడా ఎలాగూ ఆసుపత్రిలోనే చేర్చి, చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇక ఇంట్లో ఐసొలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్న మిగిలిన రెండు రకాల లక్షణాలున్నవారు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎప్పుడు ఆసుపత్రికి వెళ్లాలి? ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉంటే పాటించాల్సిన విధి విధానాలేమిటి?మళ్లీ పరీక్షలు చేయించుకోవాలా? అనేవి ముఖ్యమైన అంశాలు.


లక్షణాలు లేనివారు

* పాజిటివ్‌గా నిర్ధారణ అవుతుంది. కానీ వీరిలో ఎటువంటి లక్షణాలు ఉండవు.
* ఆరోగ్యంగా ఉన్నవారు, 60 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు దీని గురించి ఏమాత్రం కంగారు పడొద్దు.
* వీరికి ప్రత్యేకమైన మందులేవీ అవసరం లేదు.
* సమయానికి పడుకోవడం, సరిగా భోజనం చేయడం, కంగారు పడకుండా ఉండడం వంటివి చేస్తే చాలు.
* ఒకవేళ వీరిలో అధిక రక్తపోటు, మధుమేహం, గుండె, మూత్రపిండాలు, కాలేయం, మెదడు, తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, 60 ఏళ్ల పైబడినవారుంటే.. వారి ఆరోగ్యం బాగానే ఉంది.. ఇంట్లోనే ఉండొచ్చని వైద్యులు ధ్రువీకరించాలి.
* హెచ్‌ఐవీ, క్యాన్సర్‌, అవయవమార్పిడి, శస్త్రచికిత్సలు జరిగినవారిలో లక్షణాలు లేకపోయినా వారు ఆస్పత్రుల్లోనే ఉండాలి.
* వీరు 10 రోజుల పాటు ఐసొలేషన్‌లో ఉండాలి. ఆ తర్వాత కూడా రోగ లక్షణాలను గమనిస్తూ మరో 7 రోజులు  ఇంటి పట్టునే ఉండాలి.

అతి స్వల్ప, స్వల్ప లక్షణాలున్నవారు


* సాధారణంగా వైరస్‌ వచ్చిన తర్వాత ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. కానీ కరోనాలో మాత్రం లక్షణాలు రాకముందు నుంచే వ్యాప్తికి అవకాశాలున్నాయి.
* జ్వరం, దగ్గు వంటి లక్షణాలు రావడానికి 2, 3 రోజుల ముందు నుంచి కూడా.. వీరి ద్వారా ఇతరులకు వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. అయితే ఎంత ఎక్కువగా, తీవ్రంగా ఉంటుందో ఇంకా తేలలేదు.
* వీరిలో జ్వరం 101 డిగ్రీల ఫారెన్‌హీట్‌ కంటే తక్కువగా ఉంటుంది.
* అప్పుడప్పుడూ పొడి దగ్గు ఉంటుంది.
* కొద్దిగా గొంతునొప్పి కూడా ఉండొచ్చు.
* ఆక్సిజన్‌ స్థాయి రక్తంలో 95 అంతకంటే ఎక్కువ శాతం ఉంటుంది.
* ఆయాసం ఏమీ ఉండదు. వీరిని కూడా 10 రోజులు ఐసోలేషన్‌లో ఉంచాలి. మరో 7 రోజులు ఇంటినుంచి బయటకు రావద్దు.

మధ్యస్థ లక్షణాలున్నవారు

* వీరిలో జ్వరం 101 డిగ్రీల ఫారెన్‌హీట్‌ కంటే ఎక్కువగా ఉంటుంది.
* తరచూ పొడి దగ్గు, గొంతునొప్పి ఉంటాయి.
* ముఖ్యంగా వీరి రక్తంలో ఆక్సిజన్‌ శాతం 90-94 శాతం ఉంటుంది.
* ఊపిరి పీల్చడం, విడవడం నిమిషానికి 24-30 మధ్యలో ఉంటుంది.
* వీరు ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సాయంతో వైద్యసేవలు పొందాల్సి ఉంటుంది.
* వీరితో పాటు తీవ్ర లక్షణాలు, విషమంగా ఉన్నవారిని ఆసుపత్రిలో చేర్పించాలి.

ఎవరికి పరీక్షలు?

కొవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో.. కొందరు తమలో లక్షణాలు లేకపోయినా కూడా కరోనా ఉందేమోనన్న అనుమానంతో పరీక్షల కోసం వరుసల్లో నిలబడుతున్నారు. ఆఫీసుల్లో, అపార్టుమెంటుల్లో ఒకరికి వస్తే.. అందులో పనిచేసేవారు, అక్కడుంటున్నవారు అందరూ పరీక్షించుకోవడానికి పరుగులు పెడుతున్నారు. నిజానికి పరీక్షలు ఎవరికి అవసరం?
* జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం వంటి లక్షణాలున్నవారికి
* తీవ్ర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లతో బాధపడుతున్నవారికి
* గత రెండు వారాల్లో కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారించిన వ్యక్తికి దగ్గరగా మెలిగి, లక్షణాలు గుర్తిస్తే..  * ఆరోగ్య కార్యకర్తల్లో లక్షణాలుంటే...
* పాజిటివ్‌ వ్యక్తి కుటుంబంలో లక్షణాలు కనిపించకపోయినా.. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె, మూత్రపిండాల జబ్బు.. తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, వృద్ధులుంటే వారు పరీక్షలు చేయించుకోవాలి.

ఎందుకు కొవిడ్‌ ప్రమాదం

కొవిడ్‌ వైరస్‌ సాధారణంగా శ్వాస వ్యవస్థలోకి ప్రవేశించి, తేలికపాటి గొంతునొప్పి నుంచి జ్వరం వంటి సమస్యలనే తెచ్చిపెడుతుంది. చాలామందిలో తేలికగానే తగ్గిపోతుంది కూడా. కొంత మందిలో ఇది న్యుమోనియాకు దారి తీస్తోంది. కానీ అతి కొద్దిమందిలో మాత్రం.. వైరస్‌ తగ్గినా.. అది రాజేసిన నిప్పురవ్వతో శరీరంలో వాపు (ఇన్‌ఫ్లమేషన్‌) ప్రక్రియ మొదలవుతోంది. ఈ సమయంలో మనలోని రోగనిరోధక వ్యవస్థ కొంత అతిగా స్పందించి సైటోకైన్స్‌ వంటి ఎన్నో రసాయనాలను ఉద్ధృతంగా విడుదల చేస్తోంది. దీన్నే ‘సైటోకైన్‌ స్టార్మ్‌’ అంటున్నారు. ఈ మార్పుల వల్ల రక్తనాళాల్లోపల అతి సున్నితంగా, మృదువుగా ఉండే ‘ఎండోథీలియం’ పొర దెబ్బతినటం (వాస్క్యులోపతి) కూడా ఆరంభమవ్వొచ్చు. ఈ దుష్పరిణామాల వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకడుతుంది. దీంతో శరీరంలోని కీలక అవయవాలకు కూడా రక్తం, దాని ద్వారా అందాల్సిన ఆక్సిజన్‌, రసాయనాలు, పోషకాల వంటివి అందకుండా పోతాయి. ఇలా పరిస్థితి ప్రమాదకరంగా పరిణమిస్తోంది.

ఐసొలేషన్‌లో ఉన్నప్పుడు..

* అస్సలు ఆందోళనకు గురికావద్దు. భయాందోళనలతో రోగ నిరోధకత శక్తి తగ్గుతుంది.
* మనసు ప్రశాంతంగా ఉంచే అంశాలపై దృష్టిపెట్టాలి.
* నచ్చిన పుస్తకాలు చదువుకోవాలి.
* ఎక్కువగా కొవిడ్‌ వార్తలు టీవీలో చూడొద్దు. అందులో మరణాల గురించి దృశ్యాలు చూస్తే అనవసర ఆందోళనలు కలుగుతాయి.
* సంగీతం వినండి. నచ్చినవారితో వీడియో కాల్స్‌లో మాట్లాడాలి.
* రోజూ బీపీ, జ్వరం, రక్తంలో ఆక్సిజన్‌ ఎంతుంది? ఆయాసం వస్తోందా? కళ్లు తిరుగుతున్నాయా? ఇలాంటివి పరీక్షించుకోవాలి.
* జలుబు, దగ్గు, గొంతునొప్పి లక్షణాలున్నప్పుడు నిత్యం మూడు పూటలా ఆవిరి పట్టాలి.
* రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహారాలను తీసుకోవాలి.

పాజిటివ్‌ వచ్చిన వారిలో 10 రోజుల తర్వాత లక్షణాలేమీ లేకపోతే మళ్లీ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు.

ఇంట్లో జాగ్రత్తలు

* ఇతరులకు వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండడం కోసం కొవిడ్‌ బాధితుడు ఇంట్లోనే విడి గదిలో ఉండాలి.
* ఎన్‌ 95 మాస్క్‌ ధరించనక్కర్లేదు. సర్జికల్‌ మాస్క్‌ మాత్రం ధరించాలి.
* గదిలో గాలి, వెలుతురు బాగా ఉండాలి. ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. వీరికి విడి బాత్‌రూమ్‌ ఉండాలి.
* వీరు వాడే పాత్రలు, వస్తువులు, దుస్తులు ఇతరులు వాడొద్దు.
* ఒక శాతం సోడియం హైపోక్లోరేట్‌ ద్రావణంతో శుభ్రపర్చుకోవాలి.
* కొవిడ్‌ వ్యక్తికి ఆహారాన్ని అందించేవారు, సహాయకులు కూడా మాస్క్‌లు ధరించాలి.
* పాజిటివ్‌ వ్యక్తితో కనీసం ఆరు అడుగుల దూరం పాటించాలి.
* మరగబెట్టి చల్లార్చిన నీరును తగినంతగా తాగాలి.
* ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
* ఆరోగ్య కేంద్రంతో అనుసంధానమై ఉండాలి.
* రోగి వాడిన మాస్క్‌, ఇతరత్రా వస్తువులను కాల్చి వేయాలి.
* వాడిన వస్తువులను వేయడానికి.. మూసివేయడానికి అవకాశమున్న డస్ట్‌బిన్‌ను వాడాలి.
* 40-60 సెకన్ల పాటు చేతులను కడుక్కోవాలి. అనంతరం చేతులను వస్త్రంతో తుడుచుకోకుండా వాటంతట అవే ఆరిపోయేలా గాల్లో ఉంచాలి.
 శుభ్రపర్చేవారు కూడా మాస్క్‌ ధరించాలి.

పాజిటివ్‌ వ్యక్తి వినియోగించిన దుప్పట్లు, దుస్తులను 30 నిమిషాల పాటు వేన్నీళ్లలో ముంచి ఉంచాలి. తర్వాత మామూలుగా ఉతుక్కోవచ్చు.

ఎప్పుడు ఆసుపత్రికి వెళ్లాలి?

* జ్వరం 101 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవడం.. వణికిపోవడం
* దగ్గు ఆగకుండా వస్తుండటం, క్రమేణా ఎక్కువ కావడం
* నీరసం పెరిగి నిస్సత్తువ ఆవహించడం (వీరిలో సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి)
* ఆయాసం ఎక్కువవడం..సాధారణంగా నిమిషానికి 14-18 సార్లు ఊపిరితీసుకుంటాం. కానీ ఊపిరి తీసుకునే క్రమం నిమిషానికి 24 సార్ల కంటే ఎక్కువైనప్పుడు..
* రక్తంలో ఆక్సిజన్‌ శాతం 94 కంటే తక్కువైతే
* పెదాలు, ముఖం నీలిరంగులోకి మారిపోయినప్పుడు
* అపస్మారక స్థితి, అయోమయానికి గురైనప్పుడు  * ఛాతీలో ఇబ్బందిగా ఉన్నప్పుడు

లక్షణాలుంటే చికిత్స

* పారాసెటమాల్‌ ప్రతి ఆరు గంటలకోసారి వేసుకోవాలి. ఇంకా ముందుగానే జ్వరం వస్తే ప్రతి నాలుగు గంటలకోసారి కూడా వేసుకోవచ్చు.
* వైద్యుల సూచనల మేరకు యాంటీబయాటిక్స్‌, విటమిన్‌ సి, డి, జింక్‌ మాత్రలు వాడాలి.
* విటమిన్‌ మాత్రల వల్ల కరోనా తగ్గదు. కానీ వైరస్‌ను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
* ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం.. హైరిస్క్‌ ఉన్నవారికి హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మందులు ప్రస్తుతం ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఔషధానికి బదులుగా కొత్తగా వచ్చిన యాంటీ వైరల్‌ ఔషధం ‘ఫావిపిరావిర్‌’ను వైద్యులు వాడుతున్నారు.

ఇంట్లో ఉండాల్సినవి.. వాడాల్సినవి..


* డిజిటల్‌ థర్మామీటర్‌ లేదా ఇన్‌ఫ్రారెడ్‌ థర్మామీటర్‌
* పారాసెటమాల్‌ మాత్రలు 650 మి.గ్రా. రోజుకు 4-6 సార్లు
* యాంటీ బయాటిక్స్‌.. అజిథ్రోమైసిన్‌ 500మి.గ్రా. రోజుకు ఒకటి.. లేదా డాక్సిసైక్లిన్‌ 100 మి.గ్రా. రోజుకు రెండుసార్లు
* జింక్‌ మాత్ర రోజుకు ఒకటి.
* విటమిన్‌ సి 500 మి.గ్రా. రోజుకు రెండు
* విటమిన్‌ డి మాత్ర (60వేల యూనిట్లు) వారానికి ఒకటి.

కార్యాలయాల్లో ఎలా?


కొవిడ్‌తో పాటు సహజీవనం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటప్పుడు ఎవరి పనులు వారు చేసుకోవాల్సిందే. కార్యాలయాలకు వెళ్లాల్సిందే. ఇలాంటప్పుడు కొవిడ్‌ బారిన పడకుండా... ఆందోళన చెందకుండా ఎవరికి వారు స్వీయ రక్షణ పొందడమే చాలా కీలకం.

ముప్పు లేకపోతే యథావిధిగా విధులు

* ఒక గది, ప్రాంతంలో ఒకరు కంటే ఎక్కువమంది ఉన్నచోట ఒకరిలో కరోనా సోకితే.. పాజిటివ్‌ వ్యక్తితో సన్నిహితంగా మెలిగినవారిని గుర్తించి వారిని క్వారంటైన్‌లో ఉంచాలి.
* ఆ ప్రాంతాన్ని వైరస్‌ రహితంగా(డిస్‌ఇన్‌ఫెక్షన్‌) చేసి, తిరిగి ఆ ప్రాంతాన్ని వినియోగించుకోవచ్చు. మొత్తం భవనాన్ని మూసివేయాల్సిన అవసరం లేదు.
* లక్షణాలు రావడానికి 2 రోజుల ముందు నుంచి ఎవరెవరిని కలిశారో.. అప్పట్నించి ఐసొలేషన్‌కు వెళ్లే వరకూ ఎవరెవరి దగ్గరకు వెళ్లారో.. వారందరూ కాంటాక్టు వ్యక్తుల కిందకే వస్తారు. వీరందరూ క్వారంటైన్‌లో ఉండాల్సిందే.
* దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు మాత్రం 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండడంతో పాటు పరీక్షలు చేయించుకోవాలి.
* ఎటువంటి అనారోగ్య సమస్యలు లేని ఆరోగ్యవంతులు యథావిధిగా పనులు చేసుకోవచ్చు. అయితే వీరిలో 14 రోజుల పాటు లక్షణాలను పరిశీలిస్తుండాలి.
* 65 ఏళ్లు పైబడినవారు, అధిక రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బు, మూత్రపిండాల జబ్బు తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, గర్భిణులు ఇంటి వద్ద ఉండడమే మేలు. వారికి ఇంటి వద్ద నుంచి పనిచేయడానికి అనుమతించాలి.
* కార్యాలయంలో ఎక్కువమంది(15కు పైగా)కి పాజిటివ్‌గా నిర్ధారణ అయితే మాత్రం ఉద్ధృతంగా నివారణ చర్యలు చేపట్టాలి. ఆ భవనం మొత్తం 48 గంటల పాటు మూసేసి, సమగ్రంగా వైరస్‌ రహితంగా చేయాల్సి ఉంటుంది.
* అప్పటి వరకూ సిబ్బంది ఇంటి నుంచి పనిచేయాలి.
* కంటెయిన్‌మెంటు ప్రాంతాల్లో నివసించే ఉద్యోగి ఇంటి వద్ద నుంచే పనిచేయడానికి అనుమతించాలి.

గుంపులుగా ఉండొద్దు

* కార్యాలయాల్లో కనీసం 6 అడుగుల దూరం పాటించాలి. పనిప్రదేశాల్లో గుంపులుగా ఉండొద్దు.
* మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలి.
* కనీసం 40-60 సెకన్ల పాటు చేతులను సబ్బుతో శుభ్రపర్చుకోవాలి. ఒకవేళ ఆల్కహాల్‌ ఆధారిత శానిటైజర్‌తో అయితే 20 సెకన్ల పాటు శుభ్రపర్చుకోవాలి.
* బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయవద్దు.
* జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలులేనివారిని మాత్రమే కార్యాలయాల్లోకి అనుమతించాలి.
* ఉద్యోగులందరు ఒకే సమయంలో భోజనాలు చేయకుండా వేళలను మార్చాలి.
* కార్యాలయాల్లో క్రమం తప్పకుండా వైరస్‌ రహిత ప్రక్రియను నిర్వహించాలి.
వాట్సాప్ నుండి సేకరణ 

మానవత్వానికి - బహుమతి

ఆమె సేవకు బహుమతిగా ఇల్లు... ఎవరిచ్చారంటే...! 
తన ఉద్యోగి సేవా గుణాన్ని మెచ్చిన యజమాని...ఆమెకు ఒక ఇంటిని బహుమతిగా ఇచ్చారు...! 
తిరువనంతపురంలో సరిగ్గా పది రోజుల క్రితం సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలో  బస్సు వెనకాలే పరిగెత్తి ఆపి మరీ ఓ అంధుడిని బస్సు ఎక్కించిన మహిళ...ఆమె పేరు గత పది రోజులుగా సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. నెటిజెన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు...! 
♦️కేరళ తిరుపత్తూర్ జిల్లా పరిధిలోని తిరువల్లకు చెందిన సుప్రియ అనే మహిళ... స్థానికంగా ఆలుకాస్ గ్రూపులో ఉద్యోగి. సుప్రియ సేవలను కొనియాడుతూ దేశవిదేశాల నుంచి నెటిజెన్లు ప్రశంసిస్తుండగా...తాను కూడా అభినందించాలని భావించి ఆమె ఇంటికి వెళ్లారు ఆలుకాస్ గ్రూప్ చైర్మన్ జాయ్ ఆలుకాస్...చిన్న కిరాయి ఇంట్లో కుటుంబంతో గడుపుతున్న సుప్రియను కలిసి అభినందించన చైర్మన్...త్రిస్సూర్ కు రావాల్సిందిగా ఆహ్వానించారు.  జాయ్ ఆలుక్కాస్ సూచన మేరకు త్రిస్సూర్ వెళ్లిన సుప్రియకు...ఆమె ఆశ్చర్యపోయేలా ఇల్లును జాయ్ ఆలుకాస్ బహుమతిగా ఇచ్చారు... జాయ్ ఆలుకాస్ సతీమణి జొల్లి ఆలుకాస్ ఆమెను ఘనంగా సత్కరించారు.
♦️పరిగెత్తుతూ వెళ్లి అంథుడిని బస్ ఎక్కించే వీడియోను తిరుపత్తూరు జిల్లాకు చెంది

నేడు మంగళ్ పాండే 193వ జయంతి



బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కోసం అలనాడు జరిగిన పో రాటంలో ఎందరో ధీరులు ప్రాణాలర్పించారు. తెల్లదొరలపై యు ద్ధాన్ని ప్రకటించిన తొలి స్వాతంత్య్ర సమర యోధుడు.
మంగళ్ పాండే 1827 జూలై 19న యూపీలోని నగ్వ గ్రామంలో జన్మించాడు. 22 సంవత్సరాలప్పుడు తనకు తెలిసిన వ్యక్తి బ్రిటీషు సైన్యంలో చేరుతుంటే అతని సహాయంతో ఈస్టిండియా కంపెనీలోని 34వ బెంగాల్ రెజిమెంట్లో సిపాయిగా పనిచేశాడు.

ఆ రోజుల్లో బ్రిటీషు పాలకులు సిపాయిలకు ‘ఆవు, పంది కొవ్వును పూసి తయారుచేసిన తూటాల’ను ఇచ్చేవారు. ఆ తూటాలను నోటితో కొరికి తొక్క తొలగిస్తేనే పేలతాయి. అలా నోటితో కొరకాల్సి రావడం  నచ్చలేదు.

జనరల్ జాన్ హెగ్డే మంగళ్ పాండేను ‘మత పిచ్చి పట్టినవాడి’గా భావించి, అతడిని బంధించాలని జమిందారీ ఈశ్వరీ ప్రసాద్‌ను ఆజ్ఞాపించాడు. ఈశ్వరీ ప్రసాద్ ఆ ఆజ్ఞను తిరస్కరించాడు.
పాండే పారిపోవడానికి ప్రయత్నించి తనను తాను కాల్చుకున్నాడు. ప్రాణాలు పోలేదు కానీ బలమైన గాయమైంది. బ్రిటీష్ అధికారులు అతనిని బంధించారు. పాండేను బంధించని కారణంగా ఈశ్వరీ ప్రసాద్‌కు, సైనికుడిగా ఉంటూ తిరుగుబాటు చేసినందుకు పాండేకు ఉరిశిక్ష విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటనతో సిపాయిల తిరుగుబాటు మొదలైంది. బ్రిటీష్ వారిని భారత సిపాయిలు ఊచకోత కోశారు. మంగళ్ పాండేకు ఉరిశిక్ష ఏప్రిల్ 18న జరగాల్సి ఉన్నా, పది రోజుల ముందు అంటే ఏప్రిల్ 7వ తేదీన శిక్షను అమలు జరిపారు. జమీందార్ ఈశ్వరీ ప్రసాద్‌ను ఏప్రిల్ 21న ఉరితీశారు. పాండే స్ఫూర్తితో మధ్య భారతదేశంలో ఝాన్సీరాణి, నానాసాహెబ్ లాంటి ధీరులు స్వతంత్య్ర సంగ్రామంలో పోరాడారు. పాండేకు గుర్తుగా 1984లో కేంద్ర ప్రభుత్వం పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది. మంగళ్ పాండే ధైర్యసాహసాల నుంచి నేటి యువత ప్రేరణ పొందవలసిన అవసరం ఎంతైనా ఉంది.
[7/20, 10:19 AM] Akella Prabhakararao: ఈ స్ఫూర్తిని నాశనం చేశారు బ్రిటిష్ క్రిస్టియన్లు ప్రభుత్వం పేరుతో. హిందువులలో  దేశభక్తి, హిందూత్వం మీది దృఢవిశ్వాసం, త్యాగశీలత, ఇంకా మిగిలి ఉండబట్టే మనం ఈనాటికీ ప్రపంచంలో కీర్తి ప్రతిష్టలు పొందగలుగు తున్నాము. మనలను నేటికీ ముందుకు సాగిస్తున్నది నిష్కల్మషమైన దైవభక్తి, దేశం పట్ల మాతృ భావం తో నిండిన దేశభక్తి.
ఈ రెంటినీ దృఢంగా ప్రతి పసివాడి మనస్సు లో నాటుకునే విధంగా వైదిక ధర్మాన్ని అవలంబించే రీతిగా శిక్షణను ప్రతి తల్లి, తండ్రి అకుంఠిత దీక్షతో ఇవ్వాలి. శివాజీ, ఝాన్సీ లక్ష్మీబాయి, నేతాజీ సుభాష్ చంద్రబోస్, వంటి వీరుల ధీరత్వాన్ని, వీరత్వాన్ని, వారి తల్లిదండ్రులు నూరిపోసినట్లు వీరిని ధర్మం పట్ల ఉత్తేజితులను చేయాలి. ధర్మం కోసం త్యాగం చేయాలి. ధర్మాన్ని నిలబెట్టడమే మానవలక్ష్యం. అటువంటి లక్ష్యంకలవారే మానవులు. సహృదయులందరూ ధర్మోద్ధరణకై ధైర్య వీర్యోద్ధరణకై
మంగళ్ పాండే వంటి ధర్మబద్ధవీరులను తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకోవాలి.

మన విద్యావిధానాలను తగిన విధంగా మార్చాలి. భగవత్ప్రార్థనలు ఉధృతం చేయాలి. ధర్మాన్ని పునరుద్ధరించడానికి మనమే చాలు. నిశ్చయాత్మక బుద్ధి, భగవద్భక్తి తప్ప వేరేమీ అవసరంలేదు. ఇవే మనకు భాగవతం, భగవద్గీత బోధిస్తున్న మార్గాలు. వీటిని అందరూ నేర్చికొని ఆచరించాలి. స్ఫూర్తిదాయక
మంగళ్ పాండే  కు వారి 193వ జయంతి సందర్భంగా  శ్రద్ధాంజలి ఘటిస్తూ, ఈ విన్నపం.

కోటేశ్వరరావు.
20.7.2020.

హిందూ ధర్మాన్ని కాపాడాలి


ఇది ఎవ్వరిని విమర్శించటానికి, లేక ఎవ్వరి మనస్సు నొప్పించటానికి కాదు.  కేవలం ఇప్పటి మన హైందవ ధర్మం యెక్క పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వ్రాసింది. 
ఇప్పుడు మన హిందూ ధర్మానికి మూడు విధాల గ్లానులు కలుగుతున్నాయి. 
1) ఇతర మతస్తులు మన హిందువులపై మాయ మాటలు చెప్పి వారి మతంలోకి మార్చుకోటం అంటే మతమార్పిడి. 
2) నాస్తిక వాదం 
3) సాయి బాబా వాదం. 
ఇప్పుడు ప్రతిది క్షుణ్ణంగా పరిశీలిద్దాం. 

1) మతమార్పిడి.: మన దేశంలో ముఖ్యంగా క్రైస్తవులు మన హిందువులలో మన ధర్మం మీద అవగాహన లేని గ్రామీణ ప్రజలని మభ్య పెట్టి కొంత ధనం, ద్రవ్యాలు ఇచ్చి మతమార్పిడి చేస్తున్నారు. మన ధర్మంలో కూడా కొంతమంది హిందూ ధర్మ ప్రచారకులు వాటిని ఆపటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతవరకు వారి ప్రయత్నాలు సఫలం అవుతున్నాయి.  కానీ ఇంకా ఇంకా మన ధర్మం మీద ప్రతివారికి అవగాహన రావాలి అందరు ఒక ఉద్యమంగా మారి ఈ మాత మార్పిడులను అరికట్టాల్సిన అవసరం వుంది. 
ఎవరైనా అనారోగ్యంగా ఉంటే మేము ప్రార్ధన చేసి మీ రోగం తగ్గిస్తామని వారికి నమ్మబలికి కొన్నాళ్లకు వారిని తమ మతంలోకి మార్చుకుంటున్నారు. దీనిని మనమందరం అరికట్టాల్సిన అవసరం ఎంతయినా వుంది. 

2) నాస్తిక వాదులు; మన హిందుత్వంలోనే జన్మించిన కొందరు హిందూ ధర్మం మీద అవగాహన లేక కొంతమంది చెప్పే వాటిని నమ్మి దేముడు లేడు అని ప్రచారం చేస్తున్నారు.  వారికి మన హిందూ ధర్మం మీద మన పురాతన జ్జ్ఞానంమీద అవగాహన కల్పిస్తే తప్పక వీరు హిందుత్వపు గొప్పతనం తెలుసుకోగలుగుతారు. 

3) సాయి బాబా వాదం ఇది ముఖ్యంగా మన బ్రహ్మళ్లలో వుంది.  సాయి బాబా దేముడని సాక్షాత్తు దత్తాత్రయ అవతారం అని ప్రచారం చేస్తున్నారు.   మన ధర్మం ఎవరిని నీచంగా చూడామని, విమర్శించమని చెప్పదు. కానీ మన ఉనికికి ప్రమాదం ఏర్పడే టప్పుడు మనం మన జాగ్రత్తలో ఉండాలి మన వారికి సరైన మార్గంలో ఉంచాలిసిన అవసరం వుంది. 
సాయి బాబా ఒక మంచి ఫకీర్ ఐ ఉండవచ్చు, కానీ అతను మొదటగా హిందువు కాదు, రెండు ఆయన ఒక పాడుబడ్డ మసీదులో నివాసం ఉన్నట్లు చెపుతున్నారు, మూడు తను ఎప్పుడు తన మత దేముడి స్మరణే చేసినట్లు చెపుతున్నారు.  మరి ఆయన మన హిందూ దేముడు యెట్లా అవుతారు.  ఆలోచించండి. జ్ఞానులు ఇతర మతాలలో కూడా వుంటారు.  వారిని మనం జ్ఞానులుగానే పరిగణించాలి కానీ దేముడి హోదా ఇవ్వకూడదు కదా. 

తన తప్పశెక్తితో కొన్ని మహిమలు చూపి ఉండొచ్చు మనం కాదనం. కానీ ఇటీవల కాలంలో వున్న మహానుభావులు, శ్రీ రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి, రమణ మహర్షిలను కూడా మనం యోగులుగా చూస్తున్నాం కానీ ఎవరికి దేముడి హోదా ఇవ్వలేదు కదా.  అంతేకాదు ఆది శంకరాచార్య, రామానుజచార్య, మద్వాచార్య లను మనం హిందూ ధర్మమును కాపాడటానికి వచ్చిన మహానుభావులుగా చూస్తున్నాము కానీ ఎవ్వరికీ మనం దేముడి హోదా ఇవ్వలేదు గమనించగలరు.  ఇంకా వెనకకి వెళ్ళితే, ఎందరో మహర్షులు, బ్రహ్మర్షులు, మన భారత గడ్డమీద జన్మించారు అది మనకు వారి జ్ఞాన సంపద వల్ల తెలుస్తున్నది. విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేశారు. ఎందరో ఋషులు వరాలు, శాపాలు ఇచ్చారని మనకు పురాణాలవల్ల తెలుస్తున్నది. మరి మనం ఎవ్వరికీ దేముడి హోదా ఇవ్వలేదు.  కాబట్టి మేధావులు ముఖ్యంగా సాయి బాబాను ఆరాధించే వారు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని మన సనాతన హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. 
ధర్మాన్ని రక్షించండి అది మిమ్ములను మీ కుటుంబాన్ని రక్షిస్తుంది. 
సార్వే జానా సుఖినోభవంతు 
ఓం శాంతి శాంతి శాంతిః 
మీ 
భార్గవ శర్మ 



ఉచ్ఛిష్టగణేశ కవచం

అథ శ్రీఉచ్ఛిష్టగణేశకవచం ప్రారంభః
దేవ్యువాచ ..

దేవదేవ జగన్నాథ సృష్టిస్థితిలయాత్మక .
వినా ధ్యానం వినా మంత్రం  వినా హోమం వినా జపం .. 1..

యేన స్మరణమాత్రేణ లభ్యతే చాశు చింతితం .
తదేవ శ్రోతుమిచ్ఛామి కథయస్వ జగత్ప్రభో .. 2..

ఈశ్వర ఉవాచ ..

శ్రుణు దేవీ ప్రవక్ష్యామి గుహ్యాద్గుహ్యతరం మహత్ .
ఉచ్ఛిష్టగణనాథస్య కవచం సర్వసిద్ధిదం .. 3..

అల్పాయాసైర్వినా కష్టైర్జపమాత్రేణ సిద్ధిదం .
ఏకాంతే నిర్జనేఽరణ్యే గహ్వరే చ రణాంగణే ..  4..

సింధుతీరే చ గంగాయాః కూలే వృక్షతలే జలే .
సర్వదేవాలయే తీర్థే లబ్ధ్వా సమ్యగ్జపం చరేత్ .. 5..

స్నానశౌచాదికం నాస్తి నాస్తి నిర్వంధనం ప్రియే .
దారిద్ర్యాంతకరం శీఘ్రం సర్వతత్త్వం జనప్రియే .. 6..

సహస్రశపథం కృత్వా యది స్నేహోఽస్తి మాం ప్రతి .
నిందకాయ కుశిష్యాయ ఖలాయ కుటిలాయ చ .. 7..

దుష్టాయ పరశిష్యాయ ఘాతకాయ శఠాయ చ .
వంచకాయ వరఘ్నాయ బ్రాహ్మణీగమనాయ చ .. 8..

అశక్తాయ చ క్రూరాయ గురూద్రోహరతాయ చ .
న దాతవ్యం న దాతవ్యం న దాతవ్యం కదాచన .. 9..

గురూభక్తాయ దాతవ్యం సచ్ఛిష్యాయ విశేషతః .
తేషాం సిధ్యంతి శీఘ్రేణ హ్యన్యథా న చ సిధ్యతి .. 10..

గురూసంతుష్టిమాత్రేణ కలౌ ప్రత్యక్షసిద్ధిదం .
దేహోచ్ఛిష్టైః ప్రజప్తవ్యం తథోచ్ఛిష్టైర్మహామనుః .. 11..

ఆకాశే చ ఫలం ప్రాప్తం నాన్యథా వచనం మమ .
ఏషా రాజవతీ విద్యా వినా పుణ్యం న లభ్యతే .. 12..

అథ వక్ష్యామి దేవేశి కవచం మంత్రపూర్వకం .
యేన విజ్ఞాతమాత్రేణ రాజభోగఫలప్రదం .. 13..

ఋషిర్మే గణకః పాతు శిరసి చ నిరంతరం .
త్రాహి మాం దేవి గాయత్రీఛందో ఋషిః సదా ముఖే .. 14..

హృదయే పాతు మాం నిత్యముచ్ఛిష్టగణదేవతా .
గుహ్యే రక్షతు తద్బీజం స్వాహా శక్తిశ్చ పాదయోః .. 15..

కామకీలకసర్వాంగే వినియోగశ్చ సర్వదా .
పార్శ్వర్ద్వయే సదా పాతు స్వశక్తిం గణనాయకః .. 16..

శిఖాయాం పాతు తద్బీజం భ్రూమధ్యే తారబీజకం .
హస్తివక్త్రశ్చ శిరసీ లంబోదరో లలాటకే .. 17..

ఉచ్ఛిష్టో నేత్రయోః పాతు కర్ణౌ పాతు మహాత్మనే .
పాశాంకుశమహాబీజం నాసికాయాం చ రక్షతు .. 18..

భూతీశ్వరః పరః పాతు ఆస్యం జిహ్వాం స్వయంవపుః .
తద్బీజం పాతు మాం నిత్యం గ్రీవాయాం కంఠదేశకే .. 19..

గంబీజం చ తథా రక్షేత్తథా త్వగ్రే చ పృష్ఠకే .
సర్వకామశ్చ హృత్పాతు పాతు మాం చ కరద్వయే .. 20..

ఉచ్ఛిష్టాయ చ హృదయే వహ్నిబీజం తథోదరే .
మాయాబీజం తథా కట్యాం ద్వావూరూ సిద్ధిదాయకః .. 21..

జంఘాయాం గణనాథశ్చ పాదౌ పాతు వినాయకః .
శిరసః పాదపర్యంతముచ్ఛిష్టగణనాయకః .. 22..

ఆపాదమస్తకాంతం చ ఉమాపుత్రశ్చ పాతు మాం .
దిశోఽష్టౌ చ తథాకాశే పాతాలే విదిశాష్టకే .. 23..

అహర్నిశం చ మాం పాతు మదచంచలలోచనః .
జలేఽనలే చ సంగ్రామే దుష్టకారాగృహే వనే .. 24..

రాజద్వారే ఘోరపథే మాతు మాం గణనాయకః .
ఇదం తు కవచం గుహ్యం మమ వక్త్రాద్వినిర్గతం  .. 25..

త్రైలౌక్యే సతతం పాతు ద్విభుజశ్చ చతుర్భుజః .
బాహ్యమభ్యంతరం పాతు సిద్ధిబుద్ధిర్వినాయకః .. 26..

సర్వసిద్ధిప్రదం దేవి కవచమృద్ధిసిద్ధిదం .
ఏకాంతే ప్రజపేన్మంత్రం కవచం యుక్తిసంయుతం .. 27..

ఇదం రహస్యం కవచముచ్ఛిష్టగణనాయకం .
సర్వవర్మసు దేవేశి ఇదం కవచనాయకం .. 28..

ఏతత్కవచమాహాత్మ్యం వర్ణితుం నైవ శక్యతే .
ధర్మార్థకామమోక్షం చ నానాఫలప్రదం నృణాం .. 29..

శివపుత్రః సదా పాతు పాతు మాం సురార్చితః .
గజాననః సదా పాతు గణరాజశ్చ పాతు మాం .. 30..
సదా శక్తిరతః పాతు పాతు మాం కామవిహ్వలః .
సర్వాభరణభూషాఢయః పాతు మాం సిందూరార్చితః .. 31..

పంచమోదకరః పాతు పాతు మాం పార్వతీసుతః .
పాశాంకుశధరః పాతు పాతు మాం చ ధనేశ్వరః .. 32..

గదాధరః సదా పాతు పాతు మాం కామమోహితః .
నగ్ననారీరతః పాతు పాతు మాం చ గణేశ్వరః .. 33..

అక్షయం వరదః పాతు శక్తియుక్తిః సదాఽవతు .
భాలచంద్రః సదా పాతు నానారత్నవిభూషితః .. 34..

ఉచ్ఛిష్టగణనాథశ్చ మదాఘూర్ణితలోచనః .
నారీయోనిరసాస్వాదః పాతు మాం గజకర్ణకః .. 35..

ప్రసన్నవదనః పాతు పాతు మాం భగవల్లభః .
జటాధరః సదా పాతు పాతు మాం చ కిరీటికః .. 36..

పద్మాసనాస్థితః పాతు రక్తవర్ణశ్చ పాతు మాం .
నగ్నసామమదోన్మత్తః పాతు మాం గణదైవతః .. 37..

వామాంగే సుందరీయుక్తః పాతు మాం మన్మథప్రభుః .
క్షేత్రపః పిశితం పాతు పాతు మాం శ్రుతిపాఠకః .. 38..

భూషణాఢ్యస్తు మాం పాతు నానాభోగసమన్వితః .
స్మితాననః సదా పాతు శ్రీగణేశకులాన్వితః .. 39..

శ్రీరక్తచందనమయః సులక్షణగణేశ్వరః .
శ్వేతార్కగణనాథశ్చ హరిద్రాగణనాయకః .. 40..

పారభద్రగణేశశ్చ పాతు సప్తగణేశ్వరః .
ప్రవాలకగణాధ్యక్షో గజదంతో గణేశ్వరః .. 41..

హరబీజగణేశశ్చ భద్రాక్షగణనాయకః .
దివ్యౌషధిసముద్భూతో గణేశాశ్చింతితప్రదః .. 42..

లవణస్య గణాధ్యక్షో మృత్తికాగణనాయకః .
తండులాక్షగణాధ్యక్షో గోమయశ్చ గణేశ్చరః .. 43..

స్ఫటికాక్షగణాధ్యక్షో రుద్రాక్షగణదైవతః .
నవరత్నగణేశశ్చ ఆదిదేవో గణేశ్వరః .. 44..

పంచాననశ్చతుర్వక్త్రః షడాననగణేశ్వరః .
మయూరవాహనః పాతు పాతు మాం మూషకాసనః .. 45..

పాతు మాం దేవదేవేశః పాతు మామృషిపూజితః .
పాతు మాం సర్వదా దేవో దేవదానవపూజితః .. 46..

త్రైలోక్యపూజితో దేవః పాతు మాం చ విభుః ప్రభుః .
రంగస్థం చ సదా పాతు సాగరస్థం సదాఽవతు .. 47..

భూమిస్థం చ సదా పాతు పాతలస్థం చ పాతు మాం .
అంతరిక్షే సదా పాతు ఆకాశస్థం సదాఽవతు .. 48..

చతుష్పథే సదా పాతు త్రిపథస్థం చ పాతు మాం .
బిల్వస్థం చ వనస్థం చ పాతు మాం సర్వతస్తనం .. 49..

రాజద్వారస్థితం పాతు పాతు మాం శీఘ్రసిద్ధిదః .
భవానీపూజితః పాతు బ్రహ్మావిష్ణుశివార్చితః .. 50..

ఇదం తు కవచం దేవి పఠనాత్సర్వసిద్ధిదం .
ఉచ్ఛిష్టగణనాథస్య సమంత్రం కవచం పరం .. 51..

స్మరణాద్భూపతిత్వం చ లభతే సాంగతాం ధ్రూవం . స్మరణాద్భూభుజత్వం
వాచః సిద్ధికరం శీఘ్రం పరసైన్యవిదారణం .. 52..

ప్రాతర్మధ్యాహ్నసాయాహ్నే దివా రాత్రౌ పఠేన్నరః .
చతుర్థ్యాం దివసే రాత్రౌ పూజనే మానదాయకం .. 53..

సర్వసౌభాగ్యదం శీఘ్రం దారిద్ర్యార్ణవఘాతకం .
సుదారసుప్రజాసౌఖ్యం సర్వసిద్ధికరం నృణాం .. 54..

జలేఽథవాఽనలేఽరణ్యే సింధుతీరే సరిత్తటే .
స్మశానే దూరదేశే చ రణే పర్వతగహ్వరే .. 55..

రాజద్వారే భయే ఘోరే నిర్భయో జాయతే ధ్రువం .
సాగరే చ మహాశీతే దుర్భిక్షే దుష్టసంకటే .. 56..

భూతప్రేతపిశాచాదియక్షరాక్షసజే భయే .
రాక్షసీయక్షిణీక్రూరాశాకినీడాకీనీగణాః .. 57..

రాజమృత్యుహరం దేవి కవచం కామధేనువత్ .
అనంతఫలదం దేవి సతి మోక్షం చ పార్వతి .. 58..

కవచేన వినా మంత్రం యో జపేద్గణనాయకం .
ఇహ జన్మాని పాపిష్ఠో జన్మాంతే మూషకో భవేత్ .. 59..

ఇతి పరమరహస్యం దేవదేవార్చనం చ
     కవచపరమదివ్యం పార్వతీ పుత్రరూపం .
పఠతి  పరమభోగైశ్వర్యమోక్షప్రదం చ
     లభతి సకలసౌఖ్యం శక్తిపుత్రప్రసాదాత్ .. 60..

   var 
(ఇతి పరమరహస్యందేవదేవార్చితస్య-
     కవచముదితమేతత్పార్వతీశేన దేవ్యై
పఠతి స లభ్యతే వైభక్తితో భక్తవర్యః
     ప్రచురసకలసౌఖ్యం శక్తిపుత్రప్రసాదాత్ ..)

🌷🙏ఇతి శ్రీరుద్రయామలతంత్రే ఉమామహేశ్వరసంవాదే
శ్రీమదుచ్ఛిష్టగణేశకవచం సమాప్తం 🙏🌷

*ఇది ఒక నియమంగా పెట్టుకోవాలి.*

 *ఎవరి గురించి అయినా మనం ఎప్పుడూ చెడుగా*
_ఆలోచించకూడదు._
☀అలా ఆలోచించకుండా ఉండగలమా అని సందేహం కలుగుతుంది. అయినా దీన్ని మనం అభ్యాసం చెయ్యాలి. ఎందుకంటే, 
*దీనివల్ల చాలా లాభాలున్నాయి.*

☀నిరంతరం ఇతరుల గురించి చెడుగా ఆలోచించటంవల్ల ముందు మన మనసులో చెడ్డ వాతావరణం ఏర్పడుతుంది. అది అవతలవారికి ఎంత హాని చేస్తుందో తెలియదు కాని, ముందు మన ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది అనిచెప్పటంలో తిరుగు లేదు.
*దీనికి శాస్త్రీయమైన దాఖలాలు ఉన్నాయి.*

☀రక్తపోటు పెరుగుతుంది. మధుమేహం అదుపు తప్పుతుంది.మనిషి ఎలా ఆలోచిస్తే అలాగే ఉంటాడంటారు. చెడుగా ఆలోచించి, ఆలోచించి చెడ్డలో మునిగిపోతే మన మనసును దయ్యంలా చెడు పట్టుకుంటుంది. 
*అది అవతలవారికి హాని చేసే లోపలే మనం దానికి బలి అయిపోతాం.*

☀నేడు చాలామంది తనలోనిమంచిని వదిలేసి ఎదుటివారిలో చెడుని చూస్తున్నారు-చూపిస్తున్నారు. 
*దీనివలన ఎదుటివారికి చెందవలసిన అశుభపరిణామాలను ప్రత్యక్షంగాకాని పరోక్షంగాకాని వీరు అనుభవిస్తున్నారు.*

☀దుర్యోధనుడు ఒకసారి వెదికితే ఎక్కడా అతడికి ఒక్క మంచివాడు కూడా కనపడలేదట. 
చెడ్డవాడికి మంచి ఎక్కడ కనిపిస్తుంది? 
*_ఏ చూపుతో చూస్తే ఆ భావమే అందరిలో కనిపిస్తుంది._*

☀ఉదయం లేవగానే ఈ లోకం బాగుండాలి, అందరూ బాగుండాలి అని హృదయపూర్వకంగా పది నిమిషాలపాటు కోరుకోవాలి. ఇలా చేస్తే...
*_మందులు వేసుకోకుండానే ఆరోగ్యం బాగుంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఆధ్యాత్మిక శాస్త్రాలు తెలియజేస్తున్నా యి. గురువులు బోధిస్తున్నారు._*

☀మనం కూడా ఆలోచించాలి, ఆచరించాలి. మంచి చెడుల మిశ్రమమే జీవితం. సుఖదుఃఖాల సంగమమే జీవనం. త్రేతాయుగంలో అవతార పురుషుడైన శ్రీరాముడున్నాడు. మంచికి, ధర్మానికి మారుపేరు ఆయన. ఆ యుగంలోనే అతి దురాత్ముడు, మహా పాపి అయిన రావణాసురుడూ ఉన్నాడు. ఏ యుగమూ చెడ్డను తప్పించుకోలేదు. 
*మంచిని నిర్మించే శక్తి మనకు లేకపోవచ్చు. చెడ్డను నిరసించే శక్తి కావాలి. చెడుభావనలు మనసును హింస పెడుతున్నప్పుడు తత్సమానమైన మంచి భావాలతో నింపుకోవాలి.*

☀అంతేకాని మీకు సంబంధం లేని *_ఎదుటివారి పాపకర్మలను నిందించి లేదా ప్రచారం చేసి_* వారికి చెందవలసిన చెడు ను మీరు అనుభవించకండి.

☀పుట్టుకతో ఎవరూ దుర్మార్గులుకాదు, పాపాత్ములుకాదు ప్రతివారిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. 
కానీ మన దురదృష్టమేమిటంటే నేటి సమాజం చెడును చూసినంత ఎక్కువగా మంచిని చూడటంలేదు *దీనివల్ల అలాంటివారిపై దుష్ప్రభావం ఎక్కువగా ఉండి అనేకరకాలుగా ఇబ్బందులకు గురి అవుతున్నారు.*

☀ *_దయచేసి అంతా క్షమాగుణం కలిగి, ఎదుటివారిలోగల చెడుని వదిలేసి మంచిని మాత్రమే చూద్దాం, మంచిగురించిమాత్రమే చెబుదాం!_*
 
🙏 *_సర్వేజనా సుఖినోభవంతు_*🙏