20, జులై 2020, సోమవారం

*ఈవిడ ఎవరో తెలుసా ?*

అది 1986 సెప్టెంబరు 5న అమెరికాకు చెందిన పాన్‌ ఆమ్‌-73 విమానం ముంబైలోని సహార్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నుండి పాకిస్తాన్‌లోని కరాచీ జిన్నా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్తోంది. సరిగ్గా ఉదయం 5 గంటల ప్రాంతంలో కరాచీలో ఆ విమానాన్ని తీవ్రవాదులు హైజాక్‌ చేశారు. అందులో ఉన్న 360 మంది ప్రయాణికులు, 19 మంది విమాన సిబ్బందిని నిర్బంధించారు. అయితే అమెరికన్లే లక్ష్యంగా వచ్చిన ఉగ్రవాదులు.. వారిని గుర్తుపట్టేందుకు యత్నిస్తున్నారు. అంతలోనే నీర్జాకు ఓ ఉపాయం తట్టింది. ప్రయాణికుల వద్దున్న పాస్‌పోర్టులన్నింటినీ చిక్కకుండా దాచేసింది. దీంతో ఉగ్రవాదులు అమెరికన్లెవరో? విదేశీయులెవరో తెలుసుకోలేకపోయారు. దాదాపు 17 గంటల పాటు డ్రామా నడిచింది. చివరకు లాభం లేదనుకుని విమానంలో బాంబులు పేల్చేందుకు సిద్ధమయ్యారు.

గంటల కొద్ది ఉగ్రవాదులను తికమక పెట్టిన నీర్జా.. ప్రయాణికులను ఎలాగైనా కాపాడాలని నిశ్చయించుకుంది. విమానంలోని అత్యవసర ద్వారాన్ని తెరిచి ప్రయాణికులను బయటకు తోసేస్తోంది. దీన్ని గమనించిన తీవ్రవాదులు తుపాకులకు పనిచెప్పారు. పిల్లలపై తూటాల వర్షం కురిపిస్తుండగా చిన్నారులకు అడ్డుగోడగా నిలిచి వారి ప్రాణాలను రక్షించింది. నీర్జా మాత్రం కుప్పకూలింది. వివిధ దేశాలకు చెందిన 20 మంది ప్రయాణికులు అప్పటికే ప్రాణాలోదిలారు. అయితే వందల మంది క్షేమంగా బయట పడటం వెనుక సాహసనారి నీర్జా ధీరత్వమే కారణం. ఉగ్రవాదుల తూటాలకు తీవ్రంగా గాయపడిన ఆ ధీరవనిత అదేరోజు (సెప్టెంబరు 5, 1986)న ఓ ఆసుపత్రిలో కన్నుమూసింది. మరణానంతరం నీర్జా ధైర్యసాహసాలకు గుర్తుగా భారత ప్రభుత్వం అశోకచక్ర అవార్డు ప్రకటించింది.

ఈమె జీవితాన్ని సినిమా గా కూడా చిత్రీకరించారు, నీర్జా అనే పేరుతో వచ్చిన సినిమాలో నటించిన సోనం కపూర్ కు ఉన్న గుర్తింపు ఈవిడకు రావడం లేదు, వీరి అసలు చిత్రాలు చూడకపోతే, నిజమిన హీరోలను మర్చిపోయి తెరవేల్పులనే అభిమానించడం మొదలవుతుంది ... అందుకే అప్పుడప్పుడు వీళ్ళ గురించి గుర్తుచేసుకోవడం మన కనీస కర్తవ్యం అనిపించి ఈ పోస్ట్ చేస్తున్నాను ...

*ఇటువంటి త్యాగజీవులు ఎందరో మన భారాతవనిలో.*
విశ్వేశ్వరరావు అయ్యగారి పోస్టు.
***************************************************

కామెంట్‌లు లేవు: