శ్రీమాత్రేనమః *శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉️
*38వ నామ మంత్రము*
*ఓం ఐం హ్రీం శ్రీం రత్నకింకిణికా రమ్య రశనా దామ భూషితాయై నమః*రత్నములతోను, చిఱుగజ్జెలతోను మిక్కిలి రమణీయమై అలరారే ఒడ్డాణపు త్రాడును ధరించియున్న శ్రీమాతకు నమస్కారముశ్రీలలితా సహస్ర నామావళియందలి *రత్నకింకిణికా రమ్య రశనా దామ భూషితా* అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును *ఓం ఐం హ్రీం శ్రీం రత్నకింకిణికా రమ్య రశనా దామ భూషితాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ జగదీశ్వరిని భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ జగన్మాత కరుణించి సకలాభీష్టములను నెరవేర్చునురత్నకింకిణికా (రత్న ఖచితములైన చిఱుగంటలచే) రమ్య (అందమైన) రశనా దామ (మొలనూలుచే) భూషితా (శోభిల్లుచున్నద - శోభితయైనది). జగన్మాత నడుముకు గల ఒడ్డాణము అంచుల చివరిలో గజ్జలతోను, కూర్చబడిన రత్నాలతోను అత్యంత రమణీయముగా ఉంటుందట జగన్మాతపూర్వకాలమున స్త్రీలు మొలనూలు (మొలత్రాడు) ధరించేవారు. నవరత్న ఖచితమైన చిఱుగంటల తోడి బంగారు మొలనూలు ధరించినది. శ్రీదేవి అట్టి మొలనూలుచే భాసిస్తుంది. శ్రీదేవి ఆవిర్భావకాలమున పృథ్వియంశమున నితంబములయ్యెను1) సృష్టి రచనా శిల్పాత్మకమైన - నర్తనా హేలా విన్యాస రూపమైన - శ్రీదేవి స్వరూపం, ఈ షోడశాక్షరిలో స్పష్టంగా సాక్షాత్కరిస్తుంది. 2) ఓం కార సూత్ర ధారిణియే పరాశక్తి అనదగును. రత్న స్థగితయైన బంగారు చిఱుగంటలచే అలంకృతమైన పదునారు తీగల మేఖలాసూత్రము మొలనూలుచే (ఒడ్డాణము) గలిగియున్నదని భావముశ్రీమాతకు నమస్కరించునపుడు *ఓం ఐం హ్రీం శ్రీం రత్నకింకిణికా రమ్య రశనా దామ భూషితాయై నమః* అని అనవలెనుఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* అనుగ్రహముతో, వారి విరచితమైన *శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ* అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది🕉🕉🕉నేడు సోమ వారముఇందు వారము అని కూడా అంటామునీలకంఠుని ఆరాధించు పవిత్రమైన దినము *ఓం నమశ్శివాయ* అనే పంచాక్షరిని పదిసార్లు మననం చేసుకుందాము.🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు
శ్రీమాత్రేనమః *శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉️
*615వ నామ మంత్రము*
*ఓం ఐం హ్రీం శ్రీం ఆదిశక్త్యై నమః*అన్నిటికి ప్రప్రథమంగా ఉన్న శక్తిస్వరూపిణి అయిన జగన్మాతకు నమస్కారముశ్రీలలితా సహస్ర నామావళి యందలి *ఆదిశక్తిః* అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం ఐం హ్రీం శ్రీం ఆదిశక్త్యై నమః* అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరాశక్తిని ఆరాధించు భక్తులకు విశేషమైన జ్ఞానసంపదను, ఆధ్యాత్మకానందమును కలగించి ఆ తల్లి తరింపజేయునుఆది - శక్తి అనగా ముందుగా (సర్వజగత్తులకును) అన్న శక్తి స్వరూపిణిసకల జగదుత్పత్తికి మూలకారణమగుటచే సృష్టికి పూర్వమే ఉండే శక్తిని చిచ్ఛక్తి అందురు. *అనాదిమత్ పరంబ్రహ్మ*. మహాశక్తి స్వరూపిణి. సర్వమునకు, సర్వశక్తులకు ఆదియందే ఉండుటచే మూలశక్తి అనియు, ఇచ్ఛాశక్తి అనియు, మాయాశబలిత రూపము. సృష్ట్యారంభ కాలమునకు ముందు పరమాత్మకు సృష్టి కావలయునని కోరిక, ప్రేరణా శక్తి శ్రీమాతవే. *బహుస్యాంప్రజామే యేతి సోకామయత* బ్రహ్మాండముకానీ, పిండాండముకానీ, ఇతర ఏ శక్తులైనను చైతన్య శక్తియగు ఆత్మశక్తి ఉండినవే అన్నీ గోచరము కాగలవు. అందుచేత చైతన్య శక్తియగు ముఖ్యప్రాణ శక్తియే ఆదిశక్తి అనబడును. ఈ ఆదిశక్తి ఎక్కడనుండి ఆగమనమో చెప్పలేము. మనకు కనిపించే దానికి ముందే మనలో కనిపింపజేసే రూపము తానై ఉంటుంది. ఈ శక్తి మనలో మనము గాఢనిద్ర పోయిన తర్వాత నిద్రిస్తుంది. మనకన్నా ముందుగనే మేల్కొంటుంది. మనకు మెలకువ కలుగక ముందు కూడా చైతన్యవంతమైన ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలు జరుగుతూ ప్రాణశక్తి పనిచేయుచునే ఉంటుంది. మెలకువ వచ్చే శక్తి, మెలకువ రాకముందే ఉండి పనిచేసే శక్తి, చైతన్యవంతమగు ప్రాణశక్తి, శ్రీమాతయే కావున ఆ తల్లిని ఆదిశక్తి అందురు.జగన్మాతకు నమస్కరించు నపుడు *ఓం ఐం హ్రీం శ్రీం ఆదిశక్త్యై నమః* అని అనవలెనుఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* అనుగ్రహముతో, వారి విరచితమైన *శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ* అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది🕉🕉🕉నేడు సోమ వారముఇందు వారము అని కూడా అంటామునీలకంఠుని ఆరాధించు పవిత్రమైన దినము *ఓం నమశ్శివాయ* అనే పంచాక్షరిని పదిసార్లు మననం చేసుకుందాము.🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి 7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి