20, జులై 2020, సోమవారం

నేడు మంగళ్ పాండే 193వ జయంతి



బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కోసం అలనాడు జరిగిన పో రాటంలో ఎందరో ధీరులు ప్రాణాలర్పించారు. తెల్లదొరలపై యు ద్ధాన్ని ప్రకటించిన తొలి స్వాతంత్య్ర సమర యోధుడు.
మంగళ్ పాండే 1827 జూలై 19న యూపీలోని నగ్వ గ్రామంలో జన్మించాడు. 22 సంవత్సరాలప్పుడు తనకు తెలిసిన వ్యక్తి బ్రిటీషు సైన్యంలో చేరుతుంటే అతని సహాయంతో ఈస్టిండియా కంపెనీలోని 34వ బెంగాల్ రెజిమెంట్లో సిపాయిగా పనిచేశాడు.

ఆ రోజుల్లో బ్రిటీషు పాలకులు సిపాయిలకు ‘ఆవు, పంది కొవ్వును పూసి తయారుచేసిన తూటాల’ను ఇచ్చేవారు. ఆ తూటాలను నోటితో కొరికి తొక్క తొలగిస్తేనే పేలతాయి. అలా నోటితో కొరకాల్సి రావడం  నచ్చలేదు.

జనరల్ జాన్ హెగ్డే మంగళ్ పాండేను ‘మత పిచ్చి పట్టినవాడి’గా భావించి, అతడిని బంధించాలని జమిందారీ ఈశ్వరీ ప్రసాద్‌ను ఆజ్ఞాపించాడు. ఈశ్వరీ ప్రసాద్ ఆ ఆజ్ఞను తిరస్కరించాడు.
పాండే పారిపోవడానికి ప్రయత్నించి తనను తాను కాల్చుకున్నాడు. ప్రాణాలు పోలేదు కానీ బలమైన గాయమైంది. బ్రిటీష్ అధికారులు అతనిని బంధించారు. పాండేను బంధించని కారణంగా ఈశ్వరీ ప్రసాద్‌కు, సైనికుడిగా ఉంటూ తిరుగుబాటు చేసినందుకు పాండేకు ఉరిశిక్ష విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటనతో సిపాయిల తిరుగుబాటు మొదలైంది. బ్రిటీష్ వారిని భారత సిపాయిలు ఊచకోత కోశారు. మంగళ్ పాండేకు ఉరిశిక్ష ఏప్రిల్ 18న జరగాల్సి ఉన్నా, పది రోజుల ముందు అంటే ఏప్రిల్ 7వ తేదీన శిక్షను అమలు జరిపారు. జమీందార్ ఈశ్వరీ ప్రసాద్‌ను ఏప్రిల్ 21న ఉరితీశారు. పాండే స్ఫూర్తితో మధ్య భారతదేశంలో ఝాన్సీరాణి, నానాసాహెబ్ లాంటి ధీరులు స్వతంత్య్ర సంగ్రామంలో పోరాడారు. పాండేకు గుర్తుగా 1984లో కేంద్ర ప్రభుత్వం పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది. మంగళ్ పాండే ధైర్యసాహసాల నుంచి నేటి యువత ప్రేరణ పొందవలసిన అవసరం ఎంతైనా ఉంది.
[7/20, 10:19 AM] Akella Prabhakararao: ఈ స్ఫూర్తిని నాశనం చేశారు బ్రిటిష్ క్రిస్టియన్లు ప్రభుత్వం పేరుతో. హిందువులలో  దేశభక్తి, హిందూత్వం మీది దృఢవిశ్వాసం, త్యాగశీలత, ఇంకా మిగిలి ఉండబట్టే మనం ఈనాటికీ ప్రపంచంలో కీర్తి ప్రతిష్టలు పొందగలుగు తున్నాము. మనలను నేటికీ ముందుకు సాగిస్తున్నది నిష్కల్మషమైన దైవభక్తి, దేశం పట్ల మాతృ భావం తో నిండిన దేశభక్తి.
ఈ రెంటినీ దృఢంగా ప్రతి పసివాడి మనస్సు లో నాటుకునే విధంగా వైదిక ధర్మాన్ని అవలంబించే రీతిగా శిక్షణను ప్రతి తల్లి, తండ్రి అకుంఠిత దీక్షతో ఇవ్వాలి. శివాజీ, ఝాన్సీ లక్ష్మీబాయి, నేతాజీ సుభాష్ చంద్రబోస్, వంటి వీరుల ధీరత్వాన్ని, వీరత్వాన్ని, వారి తల్లిదండ్రులు నూరిపోసినట్లు వీరిని ధర్మం పట్ల ఉత్తేజితులను చేయాలి. ధర్మం కోసం త్యాగం చేయాలి. ధర్మాన్ని నిలబెట్టడమే మానవలక్ష్యం. అటువంటి లక్ష్యంకలవారే మానవులు. సహృదయులందరూ ధర్మోద్ధరణకై ధైర్య వీర్యోద్ధరణకై
మంగళ్ పాండే వంటి ధర్మబద్ధవీరులను తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకోవాలి.

మన విద్యావిధానాలను తగిన విధంగా మార్చాలి. భగవత్ప్రార్థనలు ఉధృతం చేయాలి. ధర్మాన్ని పునరుద్ధరించడానికి మనమే చాలు. నిశ్చయాత్మక బుద్ధి, భగవద్భక్తి తప్ప వేరేమీ అవసరంలేదు. ఇవే మనకు భాగవతం, భగవద్గీత బోధిస్తున్న మార్గాలు. వీటిని అందరూ నేర్చికొని ఆచరించాలి. స్ఫూర్తిదాయక
మంగళ్ పాండే  కు వారి 193వ జయంతి సందర్భంగా  శ్రద్ధాంజలి ఘటిస్తూ, ఈ విన్నపం.

కోటేశ్వరరావు.
20.7.2020.

కామెంట్‌లు లేవు: