5, మే 2023, శుక్రవారం

శంకర జయంతి ప్రత్యేకం - 10

 ॐ          శంకర జయంతి ప్రత్యేకం - 10

          ( క్రితం నెల 25వతేదీ వైశాఖ శుక్ల పంచమి - శంకర జయంతి ) 


శంకరుల అవతారం 


9.  మహావాక్య చతుష్టయము

      (నాలుగు మహా వాక్యాలు) 


      నాలుగు వేదాలకి సంబంధించి, నాలుగు ఉపనిషత్తులనూ కలుపుకొని, అద్వైతానికి సంబంధించి,  నాలుగు మహావాక్యాలు శంకరభగవత్పాదులు వెలికి తీశారు. అవి 



1. "ప్రజ్ఞానం బ్రహ్మ" 

     {ఋగ్వేదము, ఐతరేయోపనిషత్తు, లక్షణ(విధి) వాక్యము} 

    దీని భావము 

    "సర్వమును తెలియు ప్రజ్ఞయే బ్రహ్మము" 


వివరణ 


అ) పురుషుడు ఏ చైతన్యముతోనైతే, 

* చూచుటకు యోగ్యమైన ఈ రూపాదికమును చూచుచున్నాడో, 

* శబ్దములను వినుచున్నాడో, 

* గంధమును ఆఘ్రాణించుచున్నాడో, 

* శబ్ద సమూహమును ఉచ్చరించుచు వ్యవహరించుచున్నాడో, 

* రుచులను ఎఱుగుచున్నాడో, 

      ఆ చైతన్యమే "ప్రజ్ఞానము" అని చెప్పబడుచున్నది. 


"యేనేక్షతే శృణోతీదం జిఘ్రతి వ్యాకరోతి చ I 

  స్వాద్వస్వాదూ విజానాతి తత్ప్రజ్ఞానముదీరితమ్ ॥" 


ఆ) బ్రహ్మదేవునియందును, 

      దేవేంద్రాది దేవతలయందును, 

      మనుష్యులందును, 

      అశ్వము గోవు మొదలగువానియందునుగల ఒక్కటియగు చైతన్యమే బ్రహ్మమవుతుంది. 

     ఆ కారణాలవల్ల నా దేహమందు గల ప్రజ్ఞానము కూడా బ్రహ్మమే అవుతుంది. 


"చతుర్ముఖేన్ద్రదేవేషు మనుష్యాశ్వగవాదిషు I 

 చైతన్యమేకం బ్రహ్మాతః  ప్రజ్ఞానం బ్రహ్మమయ్యపి॥" 



2.  "అహం బ్రహ్మాఽస్మి" 

     { యజుర్వేదము, బృహదారణ్యకోపనిషత్తు, అనుభవ వాక్యము} 

     దీని భావము 

  "నేను బ్రహ్మమైతిని" 


వివరణ 


అ) పరిచ్ఛిన్నత్వములేని పరమాత్మ ఈ మాయాకల్పితమైన జగత్తునందు, 

     జ్ఞానసంపాదమునకు యోగ్యమైనట్టి వేదాంత శ్రవణాద్యనుష్ఠానవంతమగు ఈ మనుష్య శరీరమందు 

     బుద్ధికి సాక్షిగా నిర్వికారముగా ప్రకాశించుచుండి, (లక్షణావృత్తిచేత) "అహం" అనెడి పదంచే "నేను" అని చెప్పబడుచున్నాడు. 


"పరిపూర్ణః పరాత్మాఽస్మిన్ దేహే విద్యాధికారిణి I 

 బుద్ధేస్సాక్షితయా స్థిత్వా స్ఫురన్నహమితీర్యతే॥" 


ఆ) స్వాభావికముగా అపరిచ్ఛిన్నుడగు పూర్వోక్తపరమాత్మ ఈ మహావాక్యమందు బ్రహ్మమనెడి పదముచేత లక్షణావృత్తిచే చెప్పబడుచున్నాడు. 

    "అస్మి" "ఇతి" అనే పదం ఏకత్వాన్ని(జీవ బ్రహ్మైక్యాన్ని) తెలిపేదవుతుంది. 

     అందుచేత నేను బ్రహ్మమునే అగుచున్నాను. 


"స్వతః పూర్ణః పరాత్మాఽత్ర బ్రహ్మశబ్దేన వర్ణితః I 

 అస్మీత్యైక్యపరామర్శస్తేన బ్రహ్మ భవామ్యహమ్ ॥" 



3. "తత్త్వమసి" 

    {సామవేదము, ఛాందోగ్యోపనిషత్తు, ఉపదేశవాక్యము} 

    దీని భావము 

    "నీవు ఆ పరబ్రహ్మము అయితివి" 


వివరము 


అ) సృష్టికి పూర్వము నామరూపములు లేనిదియు, 

     రెండవది లేనట్టిదియు, 

     ఏకమునగు ఏ సద్వస్తువు ప్రతిపాదింపబడి యున్నదో, 

      ఆ సద్వస్తువునకు ఇప్పుడును(సృష్ట్యుత్తరకా మందును) విచారదృష్టిచే అట్టి స్వభావమే "సత్" (అది) అనే పదముచేత, (లక్షణావృత్తిచే) చెప్పబడుచున్నది. 


"ఏకమేవాద్వితీయం సన్నామరూపవివర్జితమ్ I 

 సృష్టేః పురాఽధునాఽప్యస్య తాదృక్త్వం తదితీర్యతే॥" 


ఆ) ముముక్షువుయొక్క స్థూలాది శరీరత్రయమునకంటె విలక్షణమగు సద్వస్తువు ఈ మహావాక్యమునందు "నీవు" అనే శబ్దంచేత చెప్పబడుతోంది. 

      "ఐతి"వనెడి పదముచేత ఐక్యము కనబడుతోంది. 

       ఆ "తత్త్వం" పదార్థాలయొక్క ఏకత్వము ముముక్షువులచే అనుభవింపబడునుగాక! 


"శ్రోతుర్దేహేన్ద్రియాతీతం వస్త్వత్ర త్వం పదేరితమమ్ i 

 ఏకతా గ్రాహ్యతేఽసీతి తదైక్యమనుభూయతామ్ ॥" 



4. "అయమాత్మా బ్రహ్మ" 

    {అథర్వణవేదము, మాండూక్యోపనిషత్తు, సాక్షాత్కార వాక్యము} 

దీని భావము 

"ఈ జీవాత్మయే పరబ్రహ్మము" 


వివరణ 


అ) "అయం" = "ఈ" అనే పదంచేత ఆత్మకు స్వప్రకాశత్వము అపరోక్షత్వము యుక్తిపూర్వముగ చెప్పబడింది. 

      అహంకారము మొదలు స్థూలదేహము వరకూ గల ప్రపంచంకంటె (అధిష్ఠాన సాక్షిత్వములచేత) వేరుగా ఉండడంచేత అయ్యది "ప్రత్యగాత్మ" అని చెప్పబడుతోంది. 


"స్వప్రకాశాపరోక్షత్వమయమిత్యుక్తితో మతమ్ I 

 అహంకారాది దేహాన్తాత్ప్రత్యగాత్మేతి గీయతె" 


ఆ) కనబడుచుండే సకల జగత్తునకు అధిష్ఠానరూపము బ్రహ్మ శబ్దంచేత చెప్పబడుతోంది. 

     ఆ బ్రహ్మము స్వయం ప్రకాశమానుడగు ప్రత్యగాత్మయే స్వరూపంగా గలది అవుతుంది. 

  (అనగా ప్రత్యగాత్మయే బ్రహ్మమనడం) 


"దృశ్యమానస్య సర్వస్య జగతస్తత్త్వమీర్యతే I 

 బ్రహ్మశబ్దేన తద్బ్రహ్మ స్వప్రకాశాత్మ రూపకమ్  ॥ 


*  శంకరజయంతి సందర్భంగా, 

    పది రోజులుగా మనం తెలుసుకొంటున్న విషయాలు, దీనితో పూర్తయ్యాయి. 

    

          జయజయ శంకర హరహర శంకర 


                     =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం


 


 

బ్రాహ్మణ గుర్తింపు

 బ్రాహ్మణ గుర్తింపు 

ఒకసారి నా మిత్రునితో ఏదో   చర్చిస్తూ వున్నప్పుడు  బ్రాహ్మణుల గురించిన చర్చ వచ్చింది.  నా మిత్రుడు తెలుగు వాడు కాదు అతను ఉత్తరదేశపు బ్రాహ్మణుడు. ఉదరనిమిత్తం ఇక్కడికి వచ్చాడు. నాకు ఆయన చెప్పిన విషయం నచ్చింది అది మన సోదర బ్రాహ్మణులతో పంచుకోవాలని ఇది వ్రాస్త్తున్నాను. 

బ్రాహ్మణుడు మూడు గుణముల వలన గుర్తింపబడతాడు అని ఆయన తెలిపారు అవి 

1) స్వరూపు, (ఆకారము)

2) స్వర్ (వాక్కు మాట్లాడే విధానం)

3) స్వభావం. (నడవడిక)

ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. 

మొదటిగా స్వరూపం సహజంగా బ్రాహ్మణులు  చాలావరకు అందంగా, ఆకర్షణీయంగా   వుంటారు దానికి కారణం బహుశా వారు భుజించే ఆహరం అయివుండొచ్చు లేదా వంశపారంపర్యంగా సంప్రాప్తించిన అనువంశిక లక్షణాల వలన కావచ్చు. అంతేకాక వారి వస్త్రధారణ అంటే పంచకట్టుకోవటం, గుండుచేసుకొని పిలక కలిగి ఉండటం. నిత్యము గాయత్రి మంత్రానుష్టానము చేయటము, సత్కర్మలను అనగా జప, తప హోమాదులు చేయటము వలన ముఖము, నుదుట కుంకుమ లేక తిలకం ధరించటం వలన  బ్రహ్మత్వముతో తొణకిసలాడుతూ ఉండి ముఖ కమలము నిత్య  శోభాయమానంగా ఉండి చూపరులను ఆకట్టుకొనే విధంగా తన ముఖ తేజస్సుతో గుర్తింపబడతాడు.

ఇక రెండు స్వరము: బ్రాహ్మణుడి భాష అది ఏ బాష అయినా కానీయండి చక్కటి ఉచ్చారణ, బాషా స్పష్టత, మృదు  బాషత్వము, ఇతరులు వినుటకు ఆసక్తి చూపించేలా భాషించటం ఇవ్వన్నీ కూడా బ్రాహ్మణుడికి తాను చేసే కర్మల వలన కలుగుతాయి. ఈ రకంగా బ్రాహ్మణుడు  సమాజంలో గుర్తించేలాగ చేస్తాయి. 

తదుపరి లక్షణము స్వభావము: బ్రాహ్మణుడి స్వభావము సత్వగుణవంతమై మృదుత్వముగా వుంది అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది. ఎంతటి విపత్కర పరిస్థితులల్లో కూడా తొణకకుండా స్థితప్రజ్ఞత కలిగి బ్రాహ్మణుడు ఉండటమే కాకుండా మోసము, దగా, కుట్రలు చేయటము, దుర్వ్యూహాలు పన్నటం, హింసించటం, ఆగ్రహావేశానికి లోనుకావటం, అన్యాయానికి పాల్పడక పోవటం,  దుర్వేసనాలకు లోను కాకుండా వుండటము, ఎల్లప్పుడూ సమాజ హితం కోరటం అంటే లోకా సమస్తా సుఖినో భవంతు అని కోరుకోవటం ఇలాంటి సద్గుణములు కలిగి ఉండి స్వభావము చేత గుర్తించ బడతాడు. ఇవి బ్రాహ్మణుడిని చుసిన వెంటనే గుర్తించటానికి కనపడే లక్షణాలు.

  ఈ రోజుల్లో మన దురదృష్టానికి చాలా అరుదుగా బ్రాహ్మణులు గుండు పిలక కలిగి వుండటము చూస్తున్నాము, పౌరోహిత్యం చేస్తున్న బ్రాహ్మణులుకూడా శిఖ ధారణ లేనివారు అనేకులు మనకు తారస పడుతున్నారు. పంచ కట్టటం కొందరు పౌరహిత్యులకు భారంగా మారి మధ్యకు ధోవతిని మడిచి లుంగీ లాగ ధరించే వారు కూడా సమాజంలో దర్శనం ఇస్తున్నారు. యజ్ఞ యాగాది క్రతువులమాట పరమేశ్వరుడెరుగు ప్రతి రోజు గాయత్రీ అనుష్ఠానం ఎంతమంది చేస్తున్నారు అనేది ప్రస్నార్ధకమే.  ఇటీవల కంచి కామకోటి  పీఠాధిపతులు ఒక సందర్భంలో పేర్కొన్న విషయం ఇక్కడ ప్రస్తావించదలచాను.  స్వామి ఏమంటారంటే ఈ రోజుల్లో అనేకమంది బ్రాహ్మణ కులసంఘాలు పెడుతున్నారు, బ్రాహ్మణుల అభివృద్ధికి పాటుపడుతున్నాము అంటున్నారు.  కనీసం ఆ సంఘ పెద్దలైన నిత్య సంధ్యావందనం చేస్తున్నారా.  చేయకపోతే చేయండి చేయటమేకాక సంఘసభ్యులకు మార్గదర్కులుగా వుండండి అని హితవు చెప్పారు. బ్రాహ్మణపరిషత్ వారు బ్రాహ్మణులకు అనేక పథకాలద్వారా లాభాలు చేకూర్చటానికన్నా ముందు బ్రహమణులను బ్రాహ్మణులుగా మలిచే ప్రయత్నం చేయవలసిన అవసరం ఎంతయినా వుంది. 

  అగ్రతః చతురో వేదాః 

పృష్ఠతః స శరం ధనుః  

ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం 

శాపాదపి శరాదపి

శిరస్సులో అంటే మదిలో నాలుగు వేదాలు కలిగి వీపున ధనుర్బాణాలు కలిగిన బ్రహ్మమనుడు శాపమును ఇవ్వగలదు, శరమును సందించగలడు అంటే రెండు విధములుగా సమర్ధుడు అని ఫై శ్లోకం చెపుతున్నది.  మనం ఎంతవరకు ఈ శ్లోకాన్ని అన్వయించుకోవటానికి సమర్థులం అని ప్రతి బ్రాహ్మణోత్తముడు యోచించాల్సిన సమయం ఆసన్నమైనది. ఇప్పటికి సనాతనధర్మం మొక్కవోని పటుత్వం కలిగి ఉండటానికి కారణం బ్రాహ్మణులే ఈ విషయాన్నీ ప్రతి బ్రాహ్మడు గుర్తించి ధర్మాచరణలో నిమగ్నుడైహిందూ  సమాజ,  శ్రేయస్సుకై ప్రాకులాడవలెను. 

ఓం తత్సత్ 

ఓంశాంతి శాంతి శాంతిః 

మీ భార్గవ శర్మ

వైశాఖ పూర్ణిమ*

 *నేడు(05.05.23)వైశాఖ పూర్ణిమ*

✨✨✨✨✨✨✨✨✨✨


మహా వైశాఖి అనే పేరు వ్యవహారంలో కనబడుతున్నది. సంపూర్ణమైనటువంటి వ్రతం ఇది. ఈరోజున ఆధ్యాత్మిక సాధనలు ఏవి చేసినప్పటికీ అధికఫలితాలను ఇస్తాయని శాస్త్రం చెప్తున్నది. సంవత్సరంలో ప్రధానమైన కాలములు రెండు ఋతువులు చెప్పారు – *వసంత ఋతువు, శరదృతువు.* *శరదృతువు ఆశ్వయుజ , కార్తికాలలో వస్తుంది. వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాలలో వస్తుంది.* ఈ రెండింటినీ సంవత్సరారంభము లుగా చెప్తారు. ఈ రెండు ఋతువు లలోనూ భగవదారాధనకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఈ రెండు ఋతువు లలో శరన్నవరాత్రులు , వసంత నవరాత్రులు చేయడం జరుగు తుంది. సమ ప్రాధాన్యం ఈ రెండింటికీ మనకు సంవత్సరంలో కనబడుతుంది. వాతావరణం లోనూ రెండింటిలోనూ ఒకవిధమైన సమ లక్షణం కనబడుతుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న కారణం చేతనే ఈ రెండు ఋతువులలో వచ్చిన పూర్ణిమలకు అత్యంత ప్రాధాన్యం ఉన్నది. ఈ రెండు ఋతువులలో మనకు మొత్తం నాలుగు పూర్ణిమలు వస్తాయి – చైత్ర పూర్ణిమ , వైశాఖ పూర్ణిమ , ఆశ్వయుజ పూర్ణిమ , కార్తిక పూర్ణిమ. ఈ నాలుగు పూర్ణిమలు ప్రత్యేకమైన ఆరాధనలు చేసి సంపూర్ణమైనటువంటి యజ్ఞ ఫలాన్ని పొందవచ్చు అని శాస్త్రములు చెప్తున్నటువంటి విషయం.


ఆశ్వయుజ పూర్ణిమకు *‘ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజితా”* అనే నామంలోనే *‘ముఖ్యరాకా’* అని చెప్పారు. అప్పుడు అమ్మవారి ఆరాధనలు అత్యంత విశిష్టమైన ఫలితాలను ఇస్తాయి అని చెప్తారు. అదేవిధంగా కార్తిక పూర్ణిమ కృష్ణ పూజకి , అమ్మవారి ఆరాధనకి , శివారాధనకు అత్యంత ప్రాధాన్యం కలిగినది. ఇవి కాకుండా సంవత్సర మధ్య కాలంలో ఆషాఢపూర్ణిమ ఒకటి. దానికొక ప్రాధాన్యం ఇచ్చారు. దక్షిణాయన పుణ్య కాలంలో వచ్చేటటువంటి పూర్ణిమ అది. ఇవి ప్రధానమైన పూర్ణిమా వ్రతాలుగా మనకు శాస్త్రం చెప్తున్న అంశం. ఇవి కాకుండా మాఘ మాసంలో యజ్ఞసంబంధమైన పూర్ణిమ. ఇలా ఆరు పూర్ణిమలు సంవత్సర కాలంలో ప్రధానం అని చెప్పారు.అందులో అత్యంత ప్రధానమైన వైశాఖ పూర్ణిమలో మనం ఉన్నాం ఇప్పుడు.

చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 51*


బౌద్ధ క్షిపణకుడు జీవసిద్ధి అర్ధ నిమిలిత నేత్రాలతో ధ్యానంలో ఉన్నాడు. వందలాది మంది పౌరులు అతని అనుగ్రహం కోసం ఆత్రుతతో నిరీక్షిస్తున్నారు. సుకల్పానందుడు, రాక్షసామాత్యాదులు అక్కడికి వచ్చినప్పటికీ వారిని గమనించినప్పటికీ ప్రజలు వారిని గౌరవించాలనే స్థితిలో లేరు. వారందరి దృష్టి జీవసిద్ధిపైననే కేంద్రీకృతమైవుంది. జీవసిద్ధి ఎవరిని అనుగ్రహిస్తాడో వాళ్ళని మాత్రమే పేరు పెట్టి పిలుస్తాడు. అలా పిలిచిన వాళ్ళు తన వద్దకు ఏ పని మీద వచ్చారో చెప్పి, దానికి తగ్గ నివారణ విధానాన్ని కూడా ప్రసాదిస్తాడు. అతను ఎవరిని పిలుస్తాడో ? ఆ అదృష్టవంతుడు ఎవరో ? అందరిలో ఒకే ఉత్కంఠ. తమ పేరు పిలుస్తాడేమో నన్న ఆశ. తనని పిలవాలని మనసులోనే ప్రార్థన. అందుకే, ఆ ఆరాటం వల్లనే అంతమందిలో ఒక్కరు కూడా ప్రభువులనూ, ఆమాత్యుడినీ పట్టించుకోలేదు. 


సుకల్పానందునికీ, రాక్షసామాత్యునికీ కూడా ఆత్రుతగానే ఉంది, ఆ తమాషా ఏమిటో చూడాలని... అందుకే వాళ్లు ఉత్కంఠతో జీవసిద్ధి వైపు చూస్తున్నారు. అంతలో... 


"దాసు ! రంగదాసూ ....!" అని పిలిచాడు జీవసిద్ధి కళ్ళు తెరవకుండానే. అన్ని వందల మందిలోంచి పది పన్నెండు మంది చేతులు పైకి లేచాయి. 


జీవసిద్ధి కళ్ళు మూసుకునే "మీరు కాదు .... దీర్ఘరోగంతో ఆరుమాసాలుగా మంచంలో పడున్న రంగదాసుని... మంచంతో మా ముందుకు తీసుకురండి" చెప్పాడు. 


మరుక్షణం జనం మధ్యలోంచి నలుగురు వ్యక్తులు లేచి ఓ మంచాన్ని మోసుకు రాసాగారు. మంచంలో జీవచ్ఛవంలా ఉలుకూ పలుకూ లేకుండా పడున్నాడు ఓ పాతికేళ్ల యువకుడు. కొద్దిసేపట్లో అతన్ని మంచంలోనే జీవసిద్ధి ముందుంచారు.  


"ఏరా ! తాళి కట్టిన భార్యని తన్ని తగలేసావు. వేశ్య మాయలో పడి ఇల్లూ వొళ్ళూ గుల్ల చేసుకున్నావు. మాయరోగం ముంచుకొచ్చి మంచంలో పడేసింది. తిండి లేదు. తీర్థంలేదు. ఆరుమాసాల నుంచీ అన్నీ పడకలోనే.... ఆఖరి ఘడియలు తరుముకొచ్చాయి. 'ఇప్పుడా... ఇంకాసేపా..' అంటోంది ప్రాణం. అవునా ?" ప్రశ్నించాడు జీవసిద్ధి కళ్ళు తెరవకుండానే. 


ఆ యువకుడితో పాటు వచ్చిన వాళ్ళు చేతులు జోడించి "సత్యం చెప్పారు స్వామీ ! మా రంగదాసుగాడు ఎవరు చెప్పినా వినకుండా ఈ స్థితికి తెచ్చుకున్నాడు. వీడి డబ్బూ దస్కం కాజేసిన ఆడది వీడికి విషప్రయోగం చేసి మరొకడితో లేచిపోయింది. చూసేవాళ్ళు లేక వీడు చావుకు దగ్గరయ్యాడు. వీడు పాపాత్ముడే... కానీ, పాపం వీడి భార్య ఉత్తమురాలు. వీడికీ దుస్థితి దాపరించిందని తెలియగానే దుఃఖంతో స్మృతి తప్పి పడిపోయింది. మూడురోజులైంది. ఆ అమాయకురాలి కోసమైనా వీడికి ప్రాణభిక్ష పెట్టండి స్వామీ ...!" అని వేడుకున్నారు. 


"భిక్ష.... హు... కన్నవాళ్ళకి గుప్పెడు మెతుకులు కూడా పెట్టకుండా భిక్షమెత్తుకోమంటూ తరిమేసాడు కదరా ఈ దూర్తుడు.... వీడికి ఇలాంటి శిక్షే సరైనది. కానీ.... ఈ స్థితిలో వీడు పశ్చాతాపంతో మాపేరే స్మరిస్తున్నాడు. ఇకనుంచీ బుద్ధిగా ఉంటానంటూ మనస్సులోనే వేడుకుంటున్నాడు" అంటూ జీవసిద్ధి చేతిని గాలిలో గిరగిరా తిప్పి ఖాళీ చేతిలోంచి అక్షింతలు ఆ రోగి మీదకు విసిరి "ఏరా మేము చెబుతున్నది అంతా సత్యమేనా ? నీకు వాక్కు ప్రసాదించాం మాట్లాడు" అని ఆజ్ఞాపించాడు. 


ఆ మాట విన్న మరుక్షణం ఉలుకూ పలుకూలేని ఆ రోగి ఒక్కసారిగా కుడిచేతిని బయటకు చాపి జీవసిద్ధి పాదాల మీద ఆనించి "మీ పాదాల మీద ప్రమాణం చేస్తున్నా స్వామీ. ఇకనుంచీ బుద్ధిగా ఉంటా... నా అమ్మా నాన్నలనీ, ఆలినీ కాయకష్టం చేసి పోషించుకుంటా... మీరు ఎలా చెబితే అలా నడుచుకుంటా ... నా వాళ్ళ కోసమైనా నన్ను కాపాడండి స్వామీ" అని రోదించాడు. 


ఆ విచిత్రాన్ని అందరూ గుడ్లప్పగించి చూస్తున్నారు. 'దాదాపుగా శవమై వచ్చినవాడు మాట్లాడుతున్నాడంటే.... అది స్వామి మహత్తు కాక మరేమిటి ?'


"మాట తప్పవుగా...?" ప్రశ్నించాడు జీవసిద్ధి. 


రోగి గట్టిగా అతని పాదాలు పట్టుకుని "తమ మీద ఆన స్వామీ ! తప్పను గాక తప్పను ?" అన్నాడు బిగ్గరగా ఏడుస్తూ. వాడినోరు, చెయ్యి తప్ప మిగతా శరీరాంగాలన్నీ కదలిక లేకుండా జీవం లేనట్లుగా పడుండడాన్ని గమనించి విస్తూబోయాడు రాక్షసామాత్యుడు. 


"సరే ...!" అంటూ జీవసిద్ధి రెండు చేతులూ పైకెత్తి ఆకాశం వైపు చూచి "తధాగతా ! రక్ష రక్ష... తధాగతా ... పాహి పాహి .... ఈ ఆశ్రితుడిని నా మహత్తుతో ఆరోగ్యదానం చేస్తున్నాను... క్షమ... క్షమ..." అని ప్రార్థించాడు. క్షణం తర్వాత అరచేతుల్ని ఒక్కటిగా కలిపి శంఖంలాగా రూపొందించి నోటి దగ్గర ఉంచుకొని ఊదాడు. 


ఒక్కసారిగా ఆ చేతుల్లోంచి శంఖనాదం ధ్వనించసాగింది. 


ఆ హఠాత్పరిమానానికి నందులూ, రాక్షసుడూ అదిరి పడి ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. అంతలో ఆ శంఖం మధ్యనించి అకస్మాత్తుగా విభూది దూసుకొచ్చి ఆ రోగి మీద రాలసాగింది. 


ఆ దృశ్యాన్ని చూస్తున్న జనం ఉద్వేగాన్ని పట్టలేక "జీవసిద్ధి స్వాముల వారికీ జై..." అంటూ బిగ్గరగా జేజేలు కొట్టసాగారు. నందులకీ, రాక్షసునికీ ఆ దృశ్యం విభ్రాంతిని కలిగిస్తోంది. 


జీవసిద్ధి హఠాత్తుగా శంఖనాధాన్ని ఆపేశాడు. మరుక్షణం ఆ చేతుల్లోంచి విభూధి రాలడం ఆగిపోయింది. 


(ఇంకా ఉంది)...🙏

సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్. 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

ఇడ్లీ - ఆకులు

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌷


*ఇడ్లీ - ఆకులు*



[By వారణాసి శ్రీరామా కృష్ణ శాస్త్రి 18/04/2023]



" ఏమి తల్లీ ఇప్పటికి ముప్పది ఏండ్లుగా కాపురము చేయుచున్నాను అని చెప్పినావు. మరి ఇప్పుడు విడాకులు ఎందుకు అడిగేదీ ఈ కోర్టు వారికి వివరించి చెప్పమ్మా! అని జడ్జీ గారు అడిగిరి. 

ఆ ఇల్లాలు ఇట్లన్నది " నా ఖర్మ బాగో లేక నాకు పదహారో ఏటనే పెండ్లి అయినది.

మా వారికేమో ఇడ్లీల పిచ్చి. ఈ పిచ్చి వారికి వారి అమ్మమ్మ చేసి తిన పెట్టిన అవిటి కుడుముల వల్ల  వచ్చినది. ఆయనకు రోజూ ఇడ్లీలు కావలెను. అవి తినిన కానీ దుక్క బలవనని ఆయన నమ్మకము. అవియన్న నాకు డోకు. చివరికి వేవిళ్లు సమయమున కూడా చింతకాయ పచ్చడి నంజుకొని ఇడ్లీలే తింటిని.

డోకులు + వేవిళ్లు కలిపి చచ్చి బ్రతికి నట్లాయితిని. మావారు వూరిలో ఎక్కడ కొత్తగా పాక హోటల్ వెలిసిన ను అక్కడికల్లా వెళ్లి తాను  ఇడ్లీలు తినివచ్చి - నాకిన్ని తెచ్చి ఇచ్చును. ఆ మరునాడు నేను ఆ ఇడ్లీలను పోలిన ఇడ్లీలు అల్లం చెట్నీలు కారపు పొడులు చేయవలెను. ఏ మాత్రము తేడా వచ్చినా సహింపరు. నాతో ఎడమొఖం పెడమొహం వేద్దురు. ఆదివారం నాడు ఏదన్న స్టార్ హోటల్ నుండి ఇడ్లీ తెచ్చుకొని, తిని - ఆ మరునాడు నుండీ నేను  వారిలాగా సాంబారు సప్లై చేయలేదని  నా మీద అలుగుదురు.  ఆయన ఏ  రోజున ఏ  ఊపున ఎన్ని ఇడ్లీలు తిందురో నావూహకు అందదు. రొండు ఇడ్లీకి రొండు జగ్గులు సాంబారు చొప్పున చేయ నా వల్ల అగుటలేదు. నాకు లెక్కలు లో తక్కువ మార్కులు.  ఇది కాక  ఇడ్లీ పిండి నేనే రుబ్బనిచో ఆయనకు రుచిలో తేడా కొట్టును. మిక్సీ  వేసినది ఆయన వంటికి వేడి ఆట.   ఇడ్లీలలోకి కారంపొడి నేను దంచవలెను.

అల్లం చెట్నీ రుబ్బవలెను. వెన్న చిలికి అచ్చ నేయి కాచవలెను.  *అప్పుడప్పుడు డ్రాయింగ్ కూడా గీసి ఇచ్చి ఇడ్లీ సైజు చెప్పెదరు.* ఆ రకముగా చేసినచో *పట్టు చీర* అని ఆశపెడుదురు. ఈనాటి ఇడ్లీ వల్ల నాకు పట్టు చీర వచ్చునో లేదో అని నాకు టెన్షన్ వచ్చును. ఇప్పటివరకూ నాకు ఒక్క పట్టు చీరా రాలేదు - పిచ్చి తిక్క మాత్రము వచ్చినది. అప్పుడప్పుడు దోస అంత ఇడ్లీ వేయమని - ఇంకో సారి రూపాయ బిళ్ళంత చిట్టి ఇడ్లీలు వేయమని అడుగుదురు. నాకొడుకు ఇప్పడు పాతిక ఏండ్లవాడైనాడు. వాడికి మొదటిలో పూరీల పిచ్చి. వాళ్ళ నాన్నకు తెలియకుండా వాడు పూరీలు తిని నాకు తెచ్చుచుండెడి వాడు. ఇప్పుడు వాడికి గ్యాస్ వచ్చి, వాడు కూడా ఇడ్లీలపై పడినాడు.

పురిటి కి పోయిన నా కోడలు తిరిగి వచ్చినది. ఆ పిల్ల కూడా - తన కొడుకు క్షేమము కొరకై - నాకొడుకు తో పాటు కూచొని ఇడ్లీలు మాత్రమే తినుచున్నది. ఆమె  బాలింత కాన,  కాచిన నేయి,  వేచిన కరివేపాకు కారం పొడి ఆమెకు తప్పక ఉండవలెను. నా కూతురు కొడుకున్నాడు. అందరూ కలిపి వాడికి నేతి ఇడ్లీలు తినుట మప్పినారు. వాడు స్కూల్ ఆటో లో స్కూల్ కు పోవుచూ, ఒక్క క్షణము లోనికి వచ్చి - ఇడ్లీ ఇడ్లీ అని టిఫిన్ బాక్స్ చూపును. అందులో ఇడ్లీతో పాటు ఆవకాయ - టమోటా జ్యూస్ వేయవలెను. అందరూ వెళ్లిరి అనుకొనుచున్నంతలో "అమ్మా ఇడ్లీలు వున్నవానే. నేను ఉల్లి దోసెలు తింటిని గానీ కడుపు నిండలేదు" అనుచూ నా కూతురు వచ్చును. దానికి ఇడ్లీలు మప్పినది దాని తండ్రియే. ఈ రకముగా నేను ప్రతి రోజు సాయంత్రము నాలుగు నుండి ఎనిమిది వరకూ మరునాటి ఇడ్లీలకు ప్రేపరేషన్లు - ఉదయము ఆరు నుండి పది వరకు ఆరారగా వేడి వేడి ఇడ్లీ వేయుచూ తీయుచూ కాలము గడుపుచున్నాను. చుట్టు పక్కల పిల్లలు నన్ను ఇడ్లీ బామ్మ అనుచున్నారు - ఇదంతా ఈయన వల్లనే. సహధర్మచారిణిగా నేనుకూడా ఆయనకు పుట్టినదే  తినవలయునని రూలు కదా! ఈయన ఇడ్లీ పిచ్చి వల్ల నేను - బొండాలు బజ్జీలు పూరీలు ఉల్లి దోశలు  ఊతప్పలు ఎరుగను. నాబ్రతుగు ఇడ్లీ పాలు చేసినాడు. ఎప్పటికీ విముక్తి కలగనట్లు తోచుచున్నది. నాకు విడాకులిచ్చి నన్ను రక్షింపవలసినదని చెప్పుకొని కోరుచున్నాను" అని ఆ ఇల్లాలు ముగించినది.


జడ్జీ గారు ఓర్పుగా అంతా వినిరి. అడ్డు ప్రసంగాలు చేయలేదు. అందున మన కధ నేరుగా హంస నడక నడిచినది. చివరికి ఆయన ఇట్లనిరి...

*"అమ్మడూ - ఇడ్లీకోసము విడాకులు అడుగుట.. ఇచ్చుట ఈ కోర్టులు ఒప్పవమ్మా - సరే కానిమ్ము కానీ నీవు కోరినన్ని రకాల టిఫిన్లు కోరినన్ని పొట్లాలు నీకు ఇప్పించవలసిందిగా నీ కోడలికి ఆర్డర్ వేయుచున్నాను. ఆమె తన నెల జీతములోనుండి నీకు అన్ని టిఫిన్లు ఇప్పించవలెను. ఇకపై నీముందు ఇడ్లీ పేరెత్తినా, ఇడ్లీ చేయమని నీకు హుకూం వేసినా - మూడు నెలల జైలు శిక్ష తప్పదని నీ మగాడికి హెచ్చరించుచున్నాను.

సేకరణ: శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్. 

🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

సుభాషితమ్

 .

             _*సుభాషితమ్*_



భోగే రోగభయం కులే చ్యుతి భయం  విత్తే నృపాలాద్భయం,

మానే దైన్యభయం బలే రిపుభయం రూపే జరాయా భయమ్।

శాస్త్రే వాదభయం గుణే ఖలభయం కాయే కృతాన్తాద్భయం,

సర్వం వస్తుభయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవాsభయమ్।।

            ~భర్తృహరి,వైరాగ్యశతకమ్.


భావం-భోగాలు అనుభవిస్తున్నామనే తృప్తి మిగలకుండా రోగాలొస్తాయేమోనని రోగభయం, మంచి కులంలో పుట్టామని తృప్తి పడడానికి ఏం తప్పు జరిగినా కులానికి అప్రతిష్ఠ వస్తుందేమోనని భయం, బాగా డబ్బుఉన్నదిలే అని ఆనందపడితే రాజు ఆధనాన్ని(పన్నులరూపంలో)కైంకర్యం చేస్తాడేమోనని భయం(దొంగలవలనకూడా భయం), మానశౌర్యంచేత విర్రవీగే వీలులేకుండా అనుక్షణం ఎప్పుడు  ఏంజరుగుతుందోనని భయం, సౌందర్యం ఉందనుకుంటే ముసలితనం వస్తుందని భయం, శాస్త్రవిజ్ఞానం ఉందనుకుంటే ప్రతివాదులతో వాదనాభయం, మంచిశరీరం ఉందనుకుంటే దీనికి ఎప్పుడు యముని వలన బాధ కలుగుతుందోనని భయం, ఇలా ప్రతీదానికి ఏదోఒక విఘాతం ఉందిగాని భయం లేనిది ఒక్క వైరాగ్యానికే.

🚩వైశాఖ పురాణం - 14 వ అధ్యాయము🚩

 _*🚩వైశాఖ పురాణం - 14 వ అధ్యాయము🚩*_


🕉🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️


*ఛత్రదాన (గొడుగు) మహిమ*


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

శ్రుతదేవమహాముని ఇట్లు పలికెను. వైశాఖమాసమున ఏండకు బాధపడు సామాన్యులకు , మహాత్ములకు ఎండ వలన బాధ కలుగకుండుటకై గొడుగుల నిచ్చిన వారి పుణ్యమనంతము. దానిని వివరించు కథను వినుము.


పూర్వము కృతయుగమున జరిగిన వైశాఖమాస వ్రతమును వివరించు కథ ఇది వంగదేశమున సుకేతు మహారాజుకుమారుడగు హేమకాంతుడను రాజు కలడు. మహావీరుడగు నతడు ఒకప్పుడు వేటకు పోయెను. అడవిలో వరాహము మున్నగు జంతువులను పెక్కిటిని వేటాడి అలసి యచటనున్న మునుల యాశ్రమమునకు బోయెను. ఆ ఆశ్రమము శతర్చినులను మునులయాశ్రమము. ఆ విషయము నెరుగని రాజకుమారుడు వారిని పలు విధములుగ పలుకరించినను వారు సమాధానమీయక పోవుటచే వారిని చంపపోయెను. ఆ మునులు తనను ఆదరింపలేదని రాజు కోపగించెను. అప్పుడా మునుల శిష్యులు అనేకులచటకు వచ్చి రాజును వారించిరి. ఓ దుర్బుద్ధీ ! మా గురువులు తపోదీక్షలోనున్నారు. వారికి బాహ్యస్మృతి లేదు. కావున వారు నిన్ను చూడలేదు. గౌరవింపలేదు. ఇట్టివారిపై కోపము కూడదని వారు పలికిరి.


అప్పుడు కుశకేతుని కుమారుడగు హేమకాంతుడు వారిని జూచి మీ గురువులు తపోదీక్షలో నున్నచో మీరు అలసిన నాకు ఆతిధ్యమునిండని అలసట వలన వచ్చిన కోపముతో పలికెను. అప్పుడు వారు రాజకుమారా ! మేము భిక్షాన్నమును తినువారము మీకు ఆతిధ్యమిచ్చుటకు మా గురువుల యాజ్ఞలేదు. ఇట్టిమేము నీకాతిధ్యము నీయజాలము అని చెప్పిరి. హేమకాంతుడు ప్రభువులమగు మేము క్రూరజంతువులు దొంగలు మున్నగు వారి నుండి మిమ్ము రక్షించు ప్రభువులము. మేమిచ్చిన అగ్రహారములు మున్నగువానిని పొందియు మీరు మాయెడల నీ విధముగ నుండరాదు. కృతఘ్నులైన మిమ్ము చంపినను తప్పులేదు. అని పలికి వారిపై బాణములను ప్రయోగించి కొంతమందిని చంపెను. మిగిలిన శిష్యులు భయముతో పారిపోయిరి. రాజభటులు ఆశ్రమములోని వస్తువులను కొల్లగొట్టిరి. ఆశ్రమమును పాడు చేసిరి.


పిమ్మట హేమాంగదుడు తన రాజ్యమునకు మరలిపోయెను. కుశకేతువు తన కుమారుడు చేసిన దానికి కోపించెను. నీవు రాజుగనుండదగవని వానిని దేశము నుండి వెడలగొట్టెను. హేమకాంతుడు తండ్రిచే పరిత్యక్తుడై దేశబహిష్కృతుడై అడవులలో వసించుచు కిరాతుడై జీవింపసాగెను. ఈ విధముగ నిరువదియెనిమిది సంవత్సరములు గడచెను. హేమకాంతుడు కిరాత జీవనమునకు అలవాటుపడి కిరాతధర్మముల నాచరించుచు కిరాతుడై జీవించుచుండెను. బ్రహ్మహత్యాదోషమున నిలకడలేక అడవుల బుట్టి తిరుగుచు జీవించుచుండెను.


వైశాఖమాసమున త్రితుడను ముని ఆ యడవిలో ప్రయాణించుచుండెను. ఎండవేడికి బాధపడి దప్పికచే పీడింపబడుచు నొకచోట మూర్ఛిల్లెను. దైవికముగ ఆ యడవిలోనే యున్న హేమకాంతుడు వానిని జూచి జాలిపడెను. మోదుగ ఆకులనుదెచ్చి ఎండపడకుండ గొడుగుగ చేసెను. తన యొద్ద సొరకాయ బుఱ్ఱలోనున్న నీటిని జల్లి వానిని సేద తీర్చెను. త్రితుడును వాని చేసిన యుపకారములచే సేదదీరి సొరకాయబుఱ్ఱలోని నీరు తాగి మోదుగాకుల గొడుగుతో ప్రయాణము చేసి ఒక గ్రామమును చేరి సుఖముగ నుండెను. హేమాంగదుడు వ్రతము నాచరింపక పోయినను జాలిపడి త్రితునకు గొడుగును కల్పించి నీటిని ఇచ్చుటచే వానికి గల పాపములన్నియు పోయెను. దీనికి హేమకాంతుడు మిక్కిలి ఆశ్చర్యపడెను. కొంత కాలమునకతడు రోగగ్రస్తుడై యుండెను. పైకి లేచియున్న జుట్టుతో భయంకరాకారులగు యమదూతలు వాని ప్రాణములగొనిపోవచ్చిరి. హేమకాంతుడును వారిని జూచి భయపడెను. వైశాఖమున మోదుగాకుల గొడుగును , సొరకాయ బుఱ్ఱనీటిని ఇచ్చిన పుణ్యబలమున వానికి శ్రీమహావిష్ణువు స్మృతికి వచ్చి విష్ణువును స్మరించెను.


దయాశాలియగు శ్రీమహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి నీవు హేమాంగదుని భయపెట్టుచున్న యమదూతలను నివారింపుము. వైశాఖమాస ధర్మమును పాటించిన హేమాంగదుని వారి నుండి రక్షింపుము. హేమాంగదుడు వైశాఖధర్మము నాచరించి నాకిష్టమైన వాడయ్యెను. పాపహీనుడయ్యెను. ఇందు సందేహము లేదు. ఇంతకు పూర్వము అపరాధములను చేసినను నీ కుమారుడు వైశాఖధర్మము నాచరించి ఒక మునిని కాపాడినవాడు. మోదుగాకుల గొడుగును నీటిని ఇచ్చినవాడు. ఆ దాన ప్రభావమున నితడు శాంతుడు , దాంతుడు , చిరంజీవి. శౌర్యాదిగుణ సంపన్నుడు. నీకు సాటియైనవాడు. కావున వీనిని రాజుగ చేయుమని నామాటగ చెప్పుమని శ్రీమహావిష్ణువు విష్వక్సేనుని హేమాంగదుని వద్దకు బంపెను.


భగవంతుని యాజ్ఞ ప్రకారము విష్వక్సేనుడు హేమాంగదుని వద్దకు పోయెను. యమదూతలకు విష్ణువు మాటలను చెప్పి పంపెను. హేమాంగదుని తండ్రియగు కుశకేతువు వద్దకు గొనిపోయి శ్రీమహావిష్ణువు చెప్పిన మాటలను చెప్పి వానికి హేమాంగదుని అప్పగించెను. కుశకేతువు భక్తితో చేసిన పూజను స్తుతులను స్వీకరించెను. కుశకేతువు కూడ సంతోషముతో తన పుత్రుని స్వీకరించెను. తన పుత్రునకు రాజ్యము నిచ్చి విష్వక్సేనుని యనుమతితో భార్యతో బాటు వనముల కేగి తపమాచరింపబోయెను. విష్వక్సేనుడును కుశకేతువును హేమాంగదుని ఆశీర్వదించి విష్ణుసాన్నిధ్యమున కెరిగెను.


హేమకాంతుడును మహారాజైనను ప్రతి సంవత్సరము వైశాఖమాసమున వైశాఖవ్రతమును దానికి చెందిన దానములను చేసి విష్ణు ప్రీతికి పాత్రుడయ్యెను. హేమాంగదుడు బ్రహ్మజ్ఞానియై ధర్మమార్గము నవలంభించి , శాంతుడు , దాంతుడు , జితేంద్రియుడు , దయాస్వభావి అయి అన్ని యజ్ఞములను చేసెను. సర్వసంపదలను పొంది , పుత్ర పౌత్రులతో కూడినవాడి సర్వభోగముల ననుభవించెను. చిరకాలము రాజ్యమును చక్కగా పాలించి విష్ణులోకమును పొందెను. శ్రుతకీర్తి మహారాజా ! వైశాఖ ధర్మములు సాటిలేనివి. సులభసాధ్యములు పుణ్య ప్రదములు. పాపమును దహించునని ధర్మార్థకామమోక్షములను కలిగించునవి. ఇట్టి ధర్మములు సాటిలేని పుణ్యఫలమునిచ్చునని శ్రుతదేవుడు వివరించెను , అని నారదుడు అంబరీషునకు చెప్పెను.


_*వైశాఖపురాణం పద్నాలుగవ అధ్యాయం సంపూర్ణం*_


🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

వైశాఖ పురాణం - 14 వ అధ్యాయము

 _*🚩వైశాఖ పురాణం - 14 వ అధ్యాయము🚩*_


🕉🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️


*ఛత్రదాన (గొడుగు) మహిమ*


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

శ్రుతదేవమహాముని ఇట్లు పలికెను. వైశాఖమాసమున ఏండకు బాధపడు సామాన్యులకు , మహాత్ములకు ఎండ వలన బాధ కలుగకుండుటకై గొడుగుల నిచ్చిన వారి పుణ్యమనంతము. దానిని వివరించు కథను వినుము.


పూర్వము కృతయుగమున జరిగిన వైశాఖమాస వ్రతమును వివరించు కథ ఇది వంగదేశమున సుకేతు మహారాజుకుమారుడగు హేమకాంతుడను రాజు కలడు. మహావీరుడగు నతడు ఒకప్పుడు వేటకు పోయెను. అడవిలో వరాహము మున్నగు జంతువులను పెక్కిటిని వేటాడి అలసి యచటనున్న మునుల యాశ్రమమునకు బోయెను. ఆ ఆశ్రమము శతర్చినులను మునులయాశ్రమము. ఆ విషయము నెరుగని రాజకుమారుడు వారిని పలు విధములుగ పలుకరించినను వారు సమాధానమీయక పోవుటచే వారిని చంపపోయెను. ఆ మునులు తనను ఆదరింపలేదని రాజు కోపగించెను. అప్పుడా మునుల శిష్యులు అనేకులచటకు వచ్చి రాజును వారించిరి. ఓ దుర్బుద్ధీ ! మా గురువులు తపోదీక్షలోనున్నారు. వారికి బాహ్యస్మృతి లేదు. కావున వారు నిన్ను చూడలేదు. గౌరవింపలేదు. ఇట్టివారిపై కోపము కూడదని వారు పలికిరి.


అప్పుడు కుశకేతుని కుమారుడగు హేమకాంతుడు వారిని జూచి మీ గురువులు తపోదీక్షలో నున్నచో మీరు అలసిన నాకు ఆతిధ్యమునిండని అలసట వలన వచ్చిన కోపముతో పలికెను. అప్పుడు వారు రాజకుమారా ! మేము భిక్షాన్నమును తినువారము మీకు ఆతిధ్యమిచ్చుటకు మా గురువుల యాజ్ఞలేదు. ఇట్టిమేము నీకాతిధ్యము నీయజాలము అని చెప్పిరి. హేమకాంతుడు ప్రభువులమగు మేము క్రూరజంతువులు దొంగలు మున్నగు వారి నుండి మిమ్ము రక్షించు ప్రభువులము. మేమిచ్చిన అగ్రహారములు మున్నగువానిని పొందియు మీరు మాయెడల నీ విధముగ నుండరాదు. కృతఘ్నులైన మిమ్ము చంపినను తప్పులేదు. అని పలికి వారిపై బాణములను ప్రయోగించి కొంతమందిని చంపెను. మిగిలిన శిష్యులు భయముతో పారిపోయిరి. రాజభటులు ఆశ్రమములోని వస్తువులను కొల్లగొట్టిరి. ఆశ్రమమును పాడు చేసిరి.


పిమ్మట హేమాంగదుడు తన రాజ్యమునకు మరలిపోయెను. కుశకేతువు తన కుమారుడు చేసిన దానికి కోపించెను. నీవు రాజుగనుండదగవని వానిని దేశము నుండి వెడలగొట్టెను. హేమకాంతుడు తండ్రిచే పరిత్యక్తుడై దేశబహిష్కృతుడై అడవులలో వసించుచు కిరాతుడై జీవింపసాగెను. ఈ విధముగ నిరువదియెనిమిది సంవత్సరములు గడచెను. హేమకాంతుడు కిరాత జీవనమునకు అలవాటుపడి కిరాతధర్మముల నాచరించుచు కిరాతుడై జీవించుచుండెను. బ్రహ్మహత్యాదోషమున నిలకడలేక అడవుల బుట్టి తిరుగుచు జీవించుచుండెను.


వైశాఖమాసమున త్రితుడను ముని ఆ యడవిలో ప్రయాణించుచుండెను. ఎండవేడికి బాధపడి దప్పికచే పీడింపబడుచు నొకచోట మూర్ఛిల్లెను. దైవికముగ ఆ యడవిలోనే యున్న హేమకాంతుడు వానిని జూచి జాలిపడెను. మోదుగ ఆకులనుదెచ్చి ఎండపడకుండ గొడుగుగ చేసెను. తన యొద్ద సొరకాయ బుఱ్ఱలోనున్న నీటిని జల్లి వానిని సేద తీర్చెను. త్రితుడును వాని చేసిన యుపకారములచే సేదదీరి సొరకాయబుఱ్ఱలోని నీరు తాగి మోదుగాకుల గొడుగుతో ప్రయాణము చేసి ఒక గ్రామమును చేరి సుఖముగ నుండెను. హేమాంగదుడు వ్రతము నాచరింపక పోయినను జాలిపడి త్రితునకు గొడుగును కల్పించి నీటిని ఇచ్చుటచే వానికి గల పాపములన్నియు పోయెను. దీనికి హేమకాంతుడు మిక్కిలి ఆశ్చర్యపడెను. కొంత కాలమునకతడు రోగగ్రస్తుడై యుండెను. పైకి లేచియున్న జుట్టుతో భయంకరాకారులగు యమదూతలు వాని ప్రాణములగొనిపోవచ్చిరి. హేమకాంతుడును వారిని జూచి భయపడెను. వైశాఖమున మోదుగాకుల గొడుగును , సొరకాయ బుఱ్ఱనీటిని ఇచ్చిన పుణ్యబలమున వానికి శ్రీమహావిష్ణువు స్మృతికి వచ్చి విష్ణువును స్మరించెను.


దయాశాలియగు శ్రీమహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి నీవు హేమాంగదుని భయపెట్టుచున్న యమదూతలను నివారింపుము. వైశాఖమాస ధర్మమును పాటించిన హేమాంగదుని వారి నుండి రక్షింపుము. హేమాంగదుడు వైశాఖధర్మము నాచరించి నాకిష్టమైన వాడయ్యెను. పాపహీనుడయ్యెను. ఇందు సందేహము లేదు. ఇంతకు పూర్వము అపరాధములను చేసినను నీ కుమారుడు వైశాఖధర్మము నాచరించి ఒక మునిని కాపాడినవాడు. మోదుగాకుల గొడుగును నీటిని ఇచ్చినవాడు. ఆ దాన ప్రభావమున నితడు శాంతుడు , దాంతుడు , చిరంజీవి. శౌర్యాదిగుణ సంపన్నుడు. నీకు సాటియైనవాడు. కావున వీనిని రాజుగ చేయుమని నామాటగ చెప్పుమని శ్రీమహావిష్ణువు విష్వక్సేనుని హేమాంగదుని వద్దకు బంపెను.


భగవంతుని యాజ్ఞ ప్రకారము విష్వక్సేనుడు హేమాంగదుని వద్దకు పోయెను. యమదూతలకు విష్ణువు మాటలను చెప్పి పంపెను. హేమాంగదుని తండ్రియగు కుశకేతువు వద్దకు గొనిపోయి శ్రీమహావిష్ణువు చెప్పిన మాటలను చెప్పి వానికి హేమాంగదుని అప్పగించెను. కుశకేతువు భక్తితో చేసిన పూజను స్తుతులను స్వీకరించెను. కుశకేతువు కూడ సంతోషముతో తన పుత్రుని స్వీకరించెను. తన పుత్రునకు రాజ్యము నిచ్చి విష్వక్సేనుని యనుమతితో భార్యతో బాటు వనముల కేగి తపమాచరింపబోయెను. విష్వక్సేనుడును కుశకేతువును హేమాంగదుని ఆశీర్వదించి విష్ణుసాన్నిధ్యమున కెరిగెను.


హేమకాంతుడును మహారాజైనను ప్రతి సంవత్సరము వైశాఖమాసమున వైశాఖవ్రతమును దానికి చెందిన దానములను చేసి విష్ణు ప్రీతికి పాత్రుడయ్యెను. హేమాంగదుడు బ్రహ్మజ్ఞానియై ధర్మమార్గము నవలంభించి , శాంతుడు , దాంతుడు , జితేంద్రియుడు , దయాస్వభావి అయి అన్ని యజ్ఞములను చేసెను. సర్వసంపదలను పొంది , పుత్ర పౌత్రులతో కూడినవాడి సర్వభోగముల ననుభవించెను. చిరకాలము రాజ్యమును చక్కగా పాలించి విష్ణులోకమును పొందెను. శ్రుతకీర్తి మహారాజా ! వైశాఖ ధర్మములు సాటిలేనివి. సులభసాధ్యములు పుణ్య ప్రదములు. పాపమును దహించునని ధర్మార్థకామమోక్షములను కలిగించునవి. ఇట్టి ధర్మములు సాటిలేని పుణ్యఫలమునిచ్చునని శ్రుతదేవుడు వివరించెను , అని నారదుడు అంబరీషునకు చెప్పెను.


_*వైశాఖపురాణం పద్నాలుగవ అధ్యాయం సంపూర్ణం*_


🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

హృదయం

 *శుభోదయం*

🙏🙏💐💐🙏🙏


*హృదయం ద్వేషించదు* 


*దేహమనే దేవాలయంలో హృదయం గర్భాలయం..* 


*అక్కడ దైవం కొలువై ఉంటాడు..* 

 

*దైవత్వం ఉంటుంది.*

  

*అక్కడ స్పందన ఉంటుంది.*


*అందుకే హృదయానికి ప్రేమ తప్ప.. ద్వేషం తెలియదు..* 


----------------------


*మనసు ప్రేమించదు.* 


*దేహమనే దేవాలయంలో  మనసు దేవుడు లేని గర్భగుడి..*


*అక్కడ అహంకారం అనే దానవుడు కొలువై ఉంటాడు..*

 

*భావోద్రేకముతో నిండి ఉంటుంది.*

 

*అక్కడ స్వార్థం ఉంటుంది.*   


*అందుకే మనసు ప్రేమించదు. అలాగని ద్వేషించదు.*


*అవసరాన్ని బట్టి అభిప్రాయం మార్చుకుంటుంది..*


🙏🙏🙏🙏🙏

కరావలంబ స్తోత్రమ్

 ॐ శ్రీ లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రమ్ 

           (శ్రీ ఆది శంకర విరచితమ్) 


                          శ్లోకం :21/25 


21. నాకు 

       తల్లి నృసింహస్వామియే, 

       తండ్రియు నృసింహస్వామియే, 

       సోదరుడు నృసింహుడే, 

       మిత్రుడు నృసింహుడే, 

       చదువు నృసింహస్వామియే, 

       ధనము నృసింహుడే, 

       రక్షకుడు నృసింహస్వామియే, 

నా జీవితమందలి సర్వస్వమూ శ్రీలక్ష్మీనృసింహస్వామియే. 


శ్లో॥ మాతా నృసింహశ్చ పితా నృసింహః 

       భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహః I 

       విద్యా నృసింహో ద్రవిణం నృసింహః 

       స్వామీ నృసింహః సకలం నృసింహః ॥ 


https://youtu.be/4VKFhHAgDgg 


                  =x=x=x= 


  — రామాయణంశర్మ 

           భద్రాచలం

అల్లం గురించి

 అల్లం గురించి సంపూర్ణ వివరణ - ఉపయోగాలు .


      సంస్కృతంలో అల్లమును "విశ్వాఔషధ" అని అంటారు. ఇది వాతాన్ని తగ్గిస్తుంది . జీర్ణకరము , విరేచనకారి , కళ్లు , గొంతుకు మంచిది . దీని విరేచనగుణం వలన పేగులలో పురుగులను నాశనం చేస్తుంది . అలా నాశనం అయిన క్రిములు మూత్రము ద్వారా బయటకి విసర్జించబడతాయి. పేగులకు అల్లం మంచి టానిక్ లాగా పనిచేస్తుంది . దీనిని వాడటం వలన ఇటువంటి సైడ్ ఎఫక్ట్స్ ఉండవు.


         అల్లము నందు విటమిన్ A , మరియు విటమిన్ C , ఫాస్ఫరస్ కొంత మోతాదులో ఉంటుంది. భోజనం తీసుకోవడానికి గంట ముందు చాలా చిన్నమొత్తంలో మినరల్ సాల్ట్ , నిమ్మకాయ రసం కొన్ని చుక్కలు , నాలుగు స్పూనుల అల్లం రసం కలిపి లోపలికి తీసుకుంటే ఆకలిని అద్భుతముగా పెంచును. గ్యాస్ సమస్య కూడా పరిష్కారం అగును. దగ్గు , జలుబు , రొంప మొదలయిన సమస్యలతో బాధపడేవారు అల్లం వాడటం వలన సమస్య నుంచి తొందరగా బయటపడతారు. గుండెజబ్బు ఉన్నవారు తరచుగా అల్లం వాడటం చాలా మంచిది . అన్ని రకాల ఉదరవ్యాధులకు అల్లం చాలా మంచి పరిష్కారం చూపిస్తుంది.


           అల్లం రసం ప్రతినిత్యం తీసుకోవడం వలన మూత్రసంబంధ సమస్యలు , కామెర్లు , మూలశంఖ , ఆస్తమా , దగ్గు , నీరుపట్టడం వంటి సమస్యలు త్వరగా నయం అగును. ఔషధాలు సేవిస్తూ అల్లంకూడా వాడటం వలన త్వరగా ప్రయోజనం చేకూరును . ఆయుర్వేదం ప్రకారం అల్లాన్ని ప్రతినిత్యం తీసుకోవడం వలన గొంతు , నాలుక సంబంధ సమస్యలకు అద్భుతముగా పనిచేయును . తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నప్పుడు అల్లంరసం ముక్కులో వేయుచున్న తలనొప్పి తగ్గును. పంటినొప్పితో బాధపడుతున్నప్పుడు పంటిపైన అల్లం ముక్కతో రుద్దిన నొప్పి తగ్గును. సైనసైటిస్ నుంచి కూడా విముక్తి లభించును.


  మరింత విలువైన మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు .  


   

మురుగన్ భక్తి

 మురుగన్ భక్తి


భారతదేశంలో పుట్టి, ఈనాటికీ, ఇక ఎప్పటికీ ప్రపంచం చేత కొనియాడబడుతున్న మహాపురుషులు పరమహంస పరివ్రాజక మహాసన్నిధాన పూజ్య శ్రీ చన్ద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు. అటువంటి కంచి పరమాచార్యులవారి అనుగ్రహానికి పాత్రుణ్ణి అవ్వడం నా పుణ్యఫలం. ఇన్నేళ్లల్లో నేను చేసుకున్న మహాస్వామి వారి దర్శనాలు, నేను పొందిన స్వామివారి ఆశీస్సులు తలచుకుంటే అవన్నీ ఈరోజు మరలా పొందినట్టు భావిస్తున్నాను.


మహాస్వామి వారి నుండి నాకు లభించిన ఒక మంచి అనుగ్రహం ఉంది. దాదాపు నలభై నిముషాల పాటు మహాస్వామి వారితో ఏకాంతంగా సంభాషించగలగడం. దాన్ని నేను మరచిపోకపోవడమే కాదు, తలచుకుంటే ఈనాటికి నాలో ధార్మిక ప్రకంపనలు కలుగుతాయి. అది బహుశా 1983లో జరిగినది అనుకుంటా. అప్పుడు కాంచి ముని కర్నూలులో మకాం చేస్తున్నారు.


నేను కేసుల నిమిత్తం న్యాయస్థానానికి వెళ్లాను. వాటిని ముగించి, నా భార్యతో కలిసి కాంచి ముని వద్దకు వచ్చి మాట్లాడాను. స్వామివారు నన్ను చూసిన వెంటనే, నా స్వస్థలం గురించి అడిగి, “నీవు తిరుప్పళనం బ్రహ్మశ్రీ పంచపకేశ శాస్త్రి మనవరాలి భర్తవు కదూ?” అని అడిగారు. నా భార్య తాతగారు హరికథా కాలక్షేప చక్రవర్తి. అలాగే మా మావగారు శ్రీ టి.పి. కళ్యాణరామ శాస్త్రి గారి గూర్చి, “అతను ఏమి చేస్తున్నారు? భాగవత కాలక్షేపమే చేస్తున్నారా?” అని అడిగారు. నా ఆశ్చర్యానికి అవధులు లేవు.


నన్ను ఆశ్చర్యపరచింది అంతటి జ్ఞాపకశక్తే. తరువాత నేను నా గురించి స్వామివారికి చెప్పాను. 1937నుండే నేను సుబ్రహ్మణ్యుడి భక్తుడినని; మా నాన్నగారు కందసామి అయ్యర్ చిన్నప్పటి నుండి చివరి రోజుల దాకా ఇంట్లో రోజూ సుబ్రహ్మణ్యుడికి పూజ చేసేవారు; దాన్ని కొనసాగించమని కుటుంబసభ్యులకు తెలిపారు.


దాంతోపాటు, 1937లో చెన్నైలోని కందకొట్టంలో శ్రీ రామలింగం పిళ్ళై గారి “పరిపూజిత పంచామృత వణ్ణం” (పంబన్ స్వామిగా ప్రసిద్ధులైన శ్రీల శ్రీ శుద్ధాద్వైత కుమార గురుదాస స్వామివారు రచించినది)పై ప్రవచనం విన్నానని; దాన్ని స్వరబద్ధంగా అయిదు రాగాలలో పాడడటం నేర్చుకోవడానికి చాలాకాలం సాధన చేశానని; అరుణగిరినాథర్ తిరుప్పుగళ్ మరియు ఈ వణ్ణాలు వేరే తాళాలలో ఉన్నాయని చాలాకాలం క్రితం వాటిని వర్గీకరించాచి, ఎన్నో సభలలో పాడటం జరిగిందని తెలిపాను.


నేను చెప్పిన విషయాన్ని పరమాచార్య స్వామివారు ఎంతో ఆశ్చర్యంతో విని, ఆ వణ్ణాలలో కొద్ది భాగాలను పాడమని, శ్రద్ధగా విని, “అప్పా! నువ్వు చెప్పిన పంబన్ స్వామి గురించి మా స్వామినాథన్ గారు (మహామహోపాధ్యాయ శ్రీ స్వామినాథ అయ్యర్) నాకు ఎందుకు చెప్పలేదు? కనీసం, జగన్నాథన్ (కి. వ. జగన్నాథన్) కూడా నాటో చెప్పలేదు” అని అన్నారు. తరువాత పంబన్ స్వామివారు కాంచీపురం కందకొట్టంలో సేవ చేశారని చెప్పగా, “అప్పా! ఆ విషయం నాకు తెలియదు. నేను అప్పుడు కుంభకోణ మఠంలో ఉండేవాణ్ణి. నువ్వు చెప్పిన ఈ విషయం మొదటిసారి విని నాకు చాలా సంతోషంగా ఉంది” అన్నారు. అంతటి మహాత్ముల సరళత్వాన్ని, గొప్పదనాన్ని ఎలా అక్షరబద్ధం చెయ్యగలం?


స్వామివారు నన్ను ఆశీర్వదించి, ఒక శాలువా ఇచ్చి, “అప్పా! నా పేరు కూడా స్వామినాథన్ యే. మా నాన్నగారి పేరు కూడా సుబ్రహ్మణ్యం యే. మీ నాన్నగారి పేరు కందసామి. సుబ్రహ్మణ్య స్వామి విశేషణం అయిన ‘స్వామి’ గురించే నేను మాట్లాడాను. నీవు మంచి మురుగన్ భక్తుడివి అవుతావు”.


ఆ అనుగ్రహ ఫలాల చేతనే, ఈనాటికీ ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలం ఆత్మానుభావం కోసం, పలు సందర్భాల్లో పంబన్ స్వామి సమాధి ఉన్న తిరువాన్మియూర్ లో మరియు అనేక మురుగన్ క్షేత్రాలలో, తిరుప్పుగళ్ ముఖ్యంగా పంచామృత వణ్ణాలు సంగీత ఉపన్యాసం చేస్తున్నాను. మురుగా శరణం!


--- కె. ఇరాజ, న్యాయవాది, చెన్నై - 78. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

భాషా చమత్కారాలు*

 *🌹 భాషా చమత్కారాలు*  🌹


              *నక్షత్రయుక్తo చమత్కారం చూ( చదవండి )డండి* 


*నక్షత్రము గల చిన్నది*

*నక్షత్రము చేతబట్టి నక్షత్రప్రభున్*

*నక్షత్రమునకు రమ్మని*

*నక్షత్రము పైనవేసి నాథుని పిలిచెన్*


   *ఇందులో నాలుగు నక్షత్రాలు దాగి ఉన్నాయి. పదే పదే చదివితేనే కానీ అంతసులువుగా అర్థమయేవికావు*. 


*ఇటువంటి ప్రహేళికలను'ప్రముషితా' ప్రహేళికలని అంటారని కవి దండి తన'కావ్యాదర్శం' లో చెప్పాడు*.


    *ఇప్పుడు వివరణ చూద్దాం!*


       *మహాభారతంలో విరాటపర్వం చదువనివారుండరు. విరాటరాజు కుమార్తె "ఉత్తర" (నక్షత్రం పేరు ) ఆమె అభిమన్యుని భార్య*.

*నక్షత్రము చేతబట్టి అంటే కుంకుమ పాత్ర "భరణిని" ( నక్షత్రం పేరు ) చేతిలో పట్టుకొని ; నక్షత్రప్రభున్ నక్షత్రాలకు ప్రభువైన చంద్రుని వంశపు ( చంద్రవంశము ) అభిమన్యుని; నక్షత్రమునకు రమ్మని అంటే ఒక "మూల" ( నక్షత్రం పేరు ) కు రమ్మని పిలిచి;*

*నక్షత్రము పైనవేసి అంటే "హస్త" (నక్షత్రం పేరు ) మును అతని మీదవేసి; నాథుని పిలిచెన్ అంటే పతియైన అభిమన్యుని ప్రేమగా పిలిచిందట*.


*అమ్మో! ఈ పద్యం అర్థంకాకుంటే మీకు నిజంగానే నక్షత్రాలు కనిపించేవి కదూ! అదీ మరి కవి చమత్కారమంటే!*


*తెలుగు భాషాభిమానులందరికి...🙏* 🌈


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

ఆత్మను అంటవు

 శ్లోకం:☝️

*జలే శైత్యాదికం యద్వజ్జల*

 *భానుం న సంస్పృశేత్ l*

*బుద్ధేః కామాదికం తద్వత్*

 *చిదాభాసం న సంస్పృశేత్ ll*


భావం: తటాకములోని జలములోగల సూర్యబింబమునకు ఆ జలము యొక్క గుణములుగానీ, జలచరములుగానీ ఏవిధముగా అంటవో, అదే విధముగా బుద్ధి యొక్క గుణములు ఆత్మను అంటవు.🙏