.
_*సుభాషితమ్*_
భోగే రోగభయం కులే చ్యుతి భయం విత్తే నృపాలాద్భయం,
మానే దైన్యభయం బలే రిపుభయం రూపే జరాయా భయమ్।
శాస్త్రే వాదభయం గుణే ఖలభయం కాయే కృతాన్తాద్భయం,
సర్వం వస్తుభయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవాsభయమ్।।
~భర్తృహరి,వైరాగ్యశతకమ్.
భావం-భోగాలు అనుభవిస్తున్నామనే తృప్తి మిగలకుండా రోగాలొస్తాయేమోనని రోగభయం, మంచి కులంలో పుట్టామని తృప్తి పడడానికి ఏం తప్పు జరిగినా కులానికి అప్రతిష్ఠ వస్తుందేమోనని భయం, బాగా డబ్బుఉన్నదిలే అని ఆనందపడితే రాజు ఆధనాన్ని(పన్నులరూపంలో)కైంకర్యం చేస్తాడేమోనని భయం(దొంగలవలనకూడా భయం), మానశౌర్యంచేత విర్రవీగే వీలులేకుండా అనుక్షణం ఎప్పుడు ఏంజరుగుతుందోనని భయం, సౌందర్యం ఉందనుకుంటే ముసలితనం వస్తుందని భయం, శాస్త్రవిజ్ఞానం ఉందనుకుంటే ప్రతివాదులతో వాదనాభయం, మంచిశరీరం ఉందనుకుంటే దీనికి ఎప్పుడు యముని వలన బాధ కలుగుతుందోనని భయం, ఇలా ప్రతీదానికి ఏదోఒక విఘాతం ఉందిగాని భయం లేనిది ఒక్క వైరాగ్యానికే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి