25, ఫిబ్రవరి 2025, మంగళవారం

మాఘ పురాణం - 27

 🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️


*🌷మంగళవారం 25 ఫిబ్రవరి 2025🌷*

_*మాఘ పురాణం - 27 వ*_

       _*అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


  *సులక్షణ మహారాజు కథ*


☘☘☘☘☘☘☘☘☘


గృత్నృమదమహర్షి జహ్నుమునితో నిట్లనెను. జన్మ సంసారమను సముద్రమును దాటనక్కరలేని సాధనమే మాఘమాసవ్రతము. దాని ప్రశస్తిని వెల్లడించు మరియొక కథను వినుము. పూర్వము ద్వాపరయుగమున అంగదేశమును పాలించుచు సులక్షణ రాజు కలడు. అతడు సూర్యవంశమున జన్మించినవాడు. బలపరాక్రమములు కలవాడు ప్రజలను చక్కగా పరిపాలించువాడు. వానికి నూరుగురు భార్యలున్నను సంతానము మాత్రము లేదు. రాజులందరును వానికి సామంతములై కప్పములు చెల్లించుచున్నను సంతానము లేదను విచారము మాత్రము రాజునకు తప్పలేదు.


నేనేమి చేసిన కులవర్ధనుడగు పుత్రుడు జన్మించును , పెద్దలు పుత్రులు లేనివారికి దరిద్రునికి , కృతఘ్నునకు , వేదహీనుడగు విప్రునకు సద్గతి లేదనియందురు. పుత్రులు లేని నేను మహర్షుల యాశ్రమమునకు పోయి అచట పెద్దలను ప్రార్థించినచో పుత్రులు కలుగుటకు వారేమైన ఉపాయము చెప్పగలరేమో ? ప్రయత్నించి చూచెదను అని నిశ్చయించెను. అనేకమంది మహర్షులు కల నైమిశారణ్యమునకు పోవుటయే మంచిదని నైమిశారణ్యమునకు వెళ్లెను , అచట మునులకు నమస్కరించి తన బాధను వారికి వివరించెను. అప్పుడు వారు కొంతసేపు ఆలోచించి యిట్లనిరి. రాజా ! వినుము నీవు పూర్వజన్మలో సౌరాష్ట్ర మహారాజువు , సర్వసంపన్నుడవైనను మాఘమాసమున రథసప్తమి నాడు కూష్మాండ దానమును చేయలేదు. అందువలన నీకీ జన్మలో సంతానము కలుగలేదు. ఇందువలననే ఇంతమంది భార్యలున్నను నీకు సంతానము కలుగలేదు అని చెప్పిరి. అప్పుడు రాజు నాకు సంతానము కలుగు ఉపాయము చెప్పుడని వారిని ప్రార్థించెను. అప్పుడా మునులు ఒక ఫలమును మంత్రించి రాజునకిచ్చిరి. దీనిని నీ భార్యలందరికిని పెట్టుము. ఇందువలన నీకు నూరుగురు పుత్రులు జన్మింతురని చెప్పిరి. సులక్షణ మహారాజు సంతోషముతో మునులకు నమస్కరించి కృతజ్ఞతను వెల్లడించి ఇంటికి వచ్చెను. రాణులు సంతోషముతో వారికెదురు వెళ్ళిరి. ప్రజలు సంతోషముతో స్వాగతమును చెప్పిరి. అలసి ఇంటికి వచ్చిన రాజు ఆ ఫలమును శయ్యా గృహమునుంచెను. స్నానము మున్నగునవి చేయవలెనని లోనికి వెళ్ళెను. ఆ రాజు చిన్న భార్య ఆ ఫలము దొంగలించి తానొక్కతియే ఆ ఫలమును తినెను. మహారాజు తిరిగి వచ్చి చూడగా ఆ ఫలము లేదు. సేవకులను , రాణులను తర్కించి అడుగగా వారు తమకు తెలియదనిరి , తుదకు చిన్న భార్య తాను చేసిన పనిని చెప్పెను. రాజు యేమియు చేయలేక ఊరకుండెను. కొన్నాళ్లకామె గర్భవతి అయ్యెను. మహారాజు మునుల మాట ఫలించినది కదా అని సంతుష్టుడయ్యెను. చిన్న భార్య యిట్లు గర్భవతి యగుట మిగిలిన భార్యలకిష్టము లేదు. ఆమె గర్భము పోవుటకై వారెన్నియో ప్రయత్నములను చేసిరి. కాని దైవబలమున అవి అన్నియు వ్యర్థములయ్యెను. కాని వారు చేసిన ప్రయత్నము వలన గర్భపాతమునకిచ్చిన మందుల వలన చిన్న భార్య మతిచెడెను. ఎవరికి తెలియకుండ అడవిలోనికి పారిపోయెను. ప్రయాణపు బడలికకు ఆమె అలసెను ఒక పుత్రుని కని యొడలు తెలియకపడియుండెను. గుహలోనున్న పులి బాలింతను యీడ్చుకొని పోయి భక్షించెను.


అప్పుడే పుట్టిన బిడ్డ రక్తపు ముద్దగా నుండి దుఃఖించుచుండగా హంసల గుంపు వచ్చి రెక్కలను చాపి యెండ మున్నగువాని బాధ ఆ శిశువునకు లేకుండ చేసినది. తేనె పండ్ల గుజ్జు మున్నగువానిని బాలునకు పెట్టి ఆ పక్షులు వానిని రక్షించినవి. బాలుడును పక్షుల పెంపకమునకు అలవాటుపడి అచటనే తిరుగుచుండెను. అచటి సరస్తీరమున అతడాడుకొనుచుండగా హంసలు నదిలో విహరించెడివి. ఒకనాడు పవిత్రదినమగుటచే  సమీప గ్రామముల వారు సకుటుంబముగా ఆ సరస్సునందు స్నానమాడవచ్చిరి , అట్లు వచ్చినవారిలో ఇద్దరు భార్యలుండి సంతానము లేని గృహస్థు ఒకడు వారితో బాటు స్నానమునకు వచ్చెను. అచట తిరగాడుచున్న బాలుని చూచి ముచ్చటపడి ఇంటికి గొనిపోవలెను అని తలచి ఈ బాలుడెవరు యెవరి సంతానము అడవిలో యేల విడువబడెను అని యెంత ఆలోచించినను వారికి సమాధానము దొరకలేదు , వనమున , జలమున , గర్భమున నెచటనున్న వానినైనను రక్షించి పాలించు వాడు శ్రీమన్నారాయణ మూర్తియే కదా ! ఆయనయే నాకీ బాలుని యిట్లు చూపినాడని తలచెను. బాలుని ఇంటికి గొనిపోయెను. సవతులైన వాని ఇద్దరు భార్యలు ఎవరికి వారు వారే ఆ బాలుని పెంచవలెను అని పరస్పరము వివాద పడుచుండిరి. ఈ విధముగా రెండు సంవత్సరములు గడచెను. ఒకనాడు ఆ గృహస్థు ఇంట లేని సమయములో పెద్ద భార్య ఆ బాలుని అడవిలో విడచి వచ్చెను. ఇంటికి వచ్చిన గృహస్థు బాలుని యెంత వెదకినను కనిపించలేదు.


అడవిలో విడువబడిన బాలుడేడ్చుచు వింటివలెనున్న తులసి పొదవద్దకు వెళ్ళెను అచటనే పండుకొనెను. తులసీ స్పర్శవలన బాలునకా వనమున యెట్తి ఆపదయు రాలేదు. శ్రీహరి అనుగ్రహమున వానికి రాత్రి గడచినది యెవరును లేని ఆ బాలుడు యేడ్చుట తప్ప మరేమి చేయగలడు. వాని దైన్యము , నిస్సహాయత ఆ అడవిలోనుండు పశుపక్ష్యాదులలోని జీవలక్షణమునకు విలువైనది. అడవిలో గల ప్రాణులు , మృగములు , పక్షులు అచటికి వచ్చినవి , బాలుని నిస్సహాయత ధైర్యము వానిలోని దివ్యలక్షణములను మేల్కొలిపి వానిపై జాలిని కలిగించినవి. ఆ ప్రాణులును కన్నీరు కార్చినవి. ఒకరి బాష మరొకరికి తెలియని రాజకుమారుడు పశుపక్ష్యాదులు యిట్టి సహానుభూతి నందినప్పుడు మరియొక మానవుడున్నచో వాడెంత దుఃఖించునో కదా ! అట్లే బాలుడును పక్షియోమృగమైనప్పుడు వాని దుఃఖము యెట్లుండునో కదా , బాలుడు పశుపక్ష్యాదులు  విభిన్నజాతులవారైనను వారిలోని పరమేశ్వరుని అంశయగు జీవాత్మ మూలము ఒక చోటనుండి రేవునుండి వచ్చినదే. అదియే దివ్యత్వము, కాని విచిత్రమేమనగా బాలునికి తనజాతిదే అయిన స్త్రీ వలన ఆపదవచ్చినది. ఆ విప్రుని మొదటి భార్య , ఆమెలోని దివ్యత్వము లోపించినది. సృష్టి విచిత్రమని యనుకొనుట తప్ప మనకే సమాధానమును తోచదు. ఇదియే భగవంతుని లీల, అట్లు వచ్చిన పక్షులు, మృగములు బాలునిపై జాలిపడినవి. పక్షులు యెండ వానిపై బడకుండ రెక్కలతో నీడను కల్పించినవి , తమ విచిత్ర రూపములతో వాని మనస్సును శోకము నుండి మరల్చినవి. మృగములును. తేనె , మగ్గినపండ్లు వంటి ఆహారములను వానికి తెచ్చి ఇచ్చినవి. ఈ విధముగా మృగములు పక్షులు వానికి తెచ్చి ఇచ్చినవి. ఈ విధముగా మృగములు , పక్షులు వానికి తాము చేయగలిగిన యుపచారములను చేసి వాని దుఃఖమును  మాన్పించి తమ యుపచారములచే వాని ఆకలిని తీర్చినవి. బాలుడు తులసి పాదులో నుండుట , తులసిని జూచుట , తాకుట మున్నగు పనులను ఆతర్కితముగ చేయుటచే పవిత్ర తులసీ దర్శన స్పర్శనాదుల వలన దైవానుగ్రహము నాతడు పొందగలిగెను. తన జాతికి చెందని పశుపక్ష్యాదుల సానుభూతిని , యుపచారములను పొందెను. ఆ బాలుని పునర్జన్మ సంస్కారము వలన ఇట్టి సానుభూతిని ఇతరుల నుండి పొందగల్గెను. అప్రయత్నముగ వాని నోటి నుండి కృష్ణ , గోవింద ,  అచ్యుత మున్నగు భగవన్నామముల ఉచ్ఛారణ శక్తి కలిగినది. అతడా మాటలనే పలుకుచు తులసి పాదులో నివసించుచు , ఆడుకొనుచు కాలమును గడుపసాగెను. అడవిలోనున్న తులసియే దీనుడైన యొక బాలునకట్టి దయను పశుపక్ష్యాదుల ద్వారా చూపినది. అట్టి తులసి మన ఇండ్లలోనుండి మనచే పూజింపబడిన మనపై యెట్టి అనుగ్రహమును చూపునో విచారింపుడు. తులసి మన ఇంట నుండుట వలన మనము తులసిని పూజించుట వలన మనకు దైవానుగ్రహము కలిగి మరెన్నియో ఇహపరలోక సుఖములనంద వచ్చును. పాపములను పోగొట్టుకొనవచ్చును. భగవదనుగ్రహమును మరింత పొందవచ్చును.


*🌳రాజకుమారుని పూజ - శ్రీహరి యనుగ్రహము🌳*


సులక్షణ మహారాజు గర్భవతియగు తన భార్యయేమైనదో తెలిసుకొనవలెనని సేవకులను పంపి వెదకించెను. కాని ఆమె జాడ తెలియలేదు. నిరాశపడి యూరకుండెను. అడవిలోనున్న రాజకుమారుడు పూర్వమునందువలెనే శ్రీహరినామస్మరణ చేయుచు పశుపక్ష్యాదులతో మైత్రి చేయుచుండెను. తల్లి , తండ్రి , తాత , సోదరుడు యిట్టి బంధువుల నెరుగడు. కేవలము శ్రీహరి నామోచ్ఛారణము శ్రీహరి పూజ వానికి నిత్యకృత్యములయ్యెను. శ్రీహరి దర్శనము కలుగలేదు అని విచారము వానికి కల్గెను. అయినను శ్రీమన్నారాయణ స్మరణ మానలేరు. ఒకనాడు ఆకాశవాణి మాఘస్నాన వ్రతము నాచరింపుమని వానికి చెప్పెను. రాజకుమారుడును ఆకాశవాణి చెప్పిన మాటల ననుసరించి మాఘస్నానము పూజ మున్నగు వానిని ప్రారంభించెను.


మాఘశుక్ల చతుర్దశినాడు రాజకుమారుని పూజాంతమున శ్రీహరి వానికి దివ్యదర్శనమునిచ్చెను. శుభమును కలిగించు బాహువులలో బాలుని కౌగిలించుకొనెను. ఓ బాలకా నాభక్తుడవైన నీకు వరమునిత్తును కోరుకొమ్మని పలికెను. బాలుడును నాకు నీపాద సాన్నిధ్యమును చిరకాలమనుగ్రహింపుమని కోరెను. శ్రీహరి బాలకా ! నీవు రాజువై యీ భూమిని చిరకాలము పాలింపుము. మాఘమాస వ్రతమును మానకుము , పుత్రపౌత్ర సమృద్ధిని , సంపదలను , భోగభాగ్యములను పొందుము. నీవిప్పుడు నీ తండ్రి వద్దకుపొమ్ము రాజువై చిరకాలము కీర్తిని సర్వసంపదలను , సర్వసమృద్దులను , సర్వసుఖములను అనుభవింపుము. మాఘమాస వ్రతమును మాత్రము విడువక చేయుము. ఆ తరువాత నా సన్నిధిని చేరుమని పలికెను. అచటనున్న సునందుడను వానిని పిలిచి రాజకుమారుని వాని తండ్రి వద్దకు చేర్చుమని చెప్పెను. సపరివారముగ అంతర్దానమందెను. సునందుడును రాజకుమారుని దీసుకొని సులక్షణ మహారాజు వద్దకు వెళ్ళెను. రాజకుమారుని పూర్వ వృత్తాంతమును శ్రీహరి అనుగ్రహమును వానికి వివరించెను. పుత్రుని వానికి అప్పగించెను తన స్థానమునకు తాను పోయెను.


సులక్షణ మహారాజు ఆశ్చర్యమును , ఆనందమును పొందెను. కుమారునకు సుధర్ముడని పేరిడెను. బాలుడు విద్యాబుద్ధులను పొంది పెద్దవాడైన తరువాత వానిని తన విశాల సామ్రాజ్యమునకు ప్రభువును చేసెను. వృద్ధుడైన సులక్షణుడు భార్యలతో వనమునకేగెను. వానప్రస్థమును స్వీకరించి కొంతకాలమునకు మరణించెను. వాని భార్యలును సమాగమనము చేసి పరలోకమునకు భర్తననుసరించి తరలిరి. సుధర్ముడు భక్తితో తండ్రికి , తల్లులకు శ్రద్ధతో శ్రార్ధకర్మల నాచరించెను. సుధర్ముడును తగిన రాజకన్యను వివాహమాడెను. ధర్మయుక్తముగ ప్రజారంజకముగ చిరకాలము రాజ్యమును పాలించెను. పుత్రులను , పౌత్రులను పెక్కు మందిని పొందెను. అతడెప్పుడును మాఘమాస వ్రతమును మానలేదు. పుత్రులతోను , మనుమలతోను , భార్యలతోను కలసి జీవించియున్నంతవరకు మాఘమాస వ్రతము నాచరించెను. తుదకు కుమారులకు రాజ్యమునిచ్చి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.


జహ్నుమునీ ! ప్రతి జీవియు తప్పక మాఘమాస వ్రతమును తప్పక విడువక ఆచరింప వలయును. అట్లు చేసిన శ్రీహరి భక్తులకు యెట్టి భయమునుండదు. ఈ వృత్తాంతమును వినినవాడును విష్ణుభక్తుడై మాఘమాసవ్రతము నాచరించి విష్ణుప్రియుడై ఇహపరలోక సుఖములనంది శ్రీహరి సాన్నిధ్యమునందును. సందేహము లేదు అని జహ్నుమునికి గృత్నృమదమహర్షి చెప్పెను.


*మాఘపురాణం ఇరవైఏడవ* 

  *అధ్యాయము సంపూర్ణము*


         *🌷సేకరణ🌷*

*న్యాయపతి నరసింహారావు*

మహాశివరాత్రి

 *మహాశివరాత్రి బుధవారం సందర్భంగా సంపూర్ణ సమాచారం.*              


*"మహాశివరాత్రి పూజ నియమాలు , విధానం, విశిష్టత....!!"*

----------------------------------------

*"దేవాది దేవుడు పరమశివుని ప్రసన్నం కొరకై చేసే పూజల్లో శివరాత్రి ఎంతో ప్రాధాన్యమైనది. శివరాత్రి నెలకు ఒకటి చొప్పున్న పన్నెండు నెలలకు పన్నెండు శివరాత్రులు వస్తాయి. వీటిల్లో మహాశివరాత్రి సంవత్సరకాలానికి ఒకటి మాత్రమే వస్తుంది. మహాశివరాత్రి హిందువుల పండగలలో అత్యంత ప్రముఖమైనది. ఈ మహాశివరాత్రి మాఘ బహుళ చతుర్ధి నాడు అనగా చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తమైనపుడు సంభవిస్తుందని, పరమశివుడు ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించాడని  శివపురాణంలో చెప్పబడిందని పండితులు చెబుతున్నారు.* 

*మహాశివరాత్రి నాడు శివభక్తులు దేశవ్యాప్తముగా శివనామ ఆరాధనతో విశేషంగా శివాలయాలను సందర్శిస్తుంటారు. తెల్లవారుఝామునే నిద్ర లేచి శిరస్నానం చేసి సంప్రదాయ దుస్తులు ధరించి శివుడిని గృహములో పూజలు చేసి సమీప శివాలయాన్ని దర్శించుకొంటారు. శివునికి ప్రీతికరమైన బిల్వపత్రాలను, ఆవుపాలు, తేనే, పంచామృతాలతో అభిషేకింఛి తన్మయత్వం చెందుతుంటారు. రోజంతా ఉపవాసం చేసి శివనామ స్మరణతో రాత్రంతా మెలుకువగా వుండి మహాశివరాత్రి జాగారం చేసి శివకృపకు పాతృలవుతారు."*

----------------------------------------

   *"శివరాత్రి కధలు:*

*క్షీరసాగరమధనం":*

----------------------------------------

*"శివరాత్రి ఎలా వచ్చిందనే కథలు పురాణంలో చాలానే ఉన్నవి. క్షీరసాగారమధనంలో కాలకూట విషం ఉద్భవించి నపుడు దేవతలు, రాక్షషులు ఖంగారుపడ్డారు. ఈ కాలకూట విషానికి లోకాన్ని నాశనం చేసే శక్తి ఉంది. దీని నుంచి లోకాన్ని ఎలా కాపాడాలో  తెలియక దేవతలు, రాక్షషులు పరుగు పరుగున శంకరుని వద్దకు వెళ్లి శరణు వేడుకొన్నారు.అంతట ఆ మహాశివుడు లోక శ్రేయోదాయకమై గరళాన్ని మింగి తన గొంతులో దాచుకొన్నాడు. లోకాన్ని నాశనం చేసే శక్తిమంతమైన గరళాన్ని తన కంఠంలో దాచుకొన్నందున కంఠసీమ మొత్తం నీలి రంగులోకి మారిపోయింది. అందుచేతనే ఆ పరమశివునకు నీలకంఠడనే పేరు వచ్చింది. లోకానికి ముప్పు తొలగిన ఆ రాత్రినే హిందువులు           మహాశివరాత్రి గా జరుపుకొంటున్నారు.వేటగాడు అడవిలో చేసిన శివరాత్రి జాగరణ, ఫలితం :"*

----------------------------------------

*"ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతములో ఉన్న గూడెంలో కర్కసుడైన ఓ వేటగాడు ఉండేవాడు. అనుదినం అడవిలోకి వెళ్లి కిరాతకంగా ఏదేని జంతువుని వేటాడి  తన కుటుంబానికి ఆహారంగా తెస్తుండేవాడు.ఒకనాడు అడవిలో ఎప్పటివలె వేటకు వెళ్ళగా ఒక్క జంతువుకూడా కనపడక నానా యాతన పడ్డాడు. ఒక్క జంతువునైనా వేటాడకుండా తిరిగి వెళ్ళటం ఇష్టం లేక అడవంతా కలియ తిరిగాడు.ఒక్క జంతువైన కనపడలేదు సరికదా అప్పటికే చీకటి పడిన సంగతిని గమనించిన వేటగాడు తాను దట్టమైన అడవి మధ్యభాగంలో ఉన్నట్లు గుర్తించి, తన గూడెంకు చేరుకొనే అవకాశం లేకపోవటంతో, అక్కడే ఉన్న ఓ చెట్టు పైకెక్కాడు. రాత్రి సమయంలో ఆ అడవిలో కౄరమృగాలు సంచరిస్తాయి."*

----------------------------------------

*"ఇవి తలచుకున్న వేటగాడు భయంతో గజ గజలాడుతూ చెట్టు ఆకులను ఒక్కొక్కటి పీకుతూ కిందకు వేస్తున్నాడు. పడుకుని కిందకు పడితే కౄరమృగాలకు ఫలహారంగా మరిపోతననే భయంతో కునుకు దరిచేరకుండా, ధైర్యం పొందేందుకు శివనామ స్మరణ చేస్తూ గడిపాడు. అంతే సూర్యుడు ఉదయించే సరికి పరమశివుడు ప్రత్యక్షమై వేటగానికి శివలోకప్రాప్తి కలిగించాడు. వేటగాడు భయంతో ఎక్కినా ఆ చెట్టు బిల్వవృక్షం! శివనామ స్మరణతో జాగరణ చేసిన రాత్రి మహాశివరాత్రి కావడం!!  వేటగాడు శివకృపకు పాత్రుడై శివలోకప్రాప్తి చెందినట్లు మరొక కథనం!!"*

----------------------------------------

*మహాశివరాత్రి*

----------------------------------------

*"ఈ సంవత్సరం మహాశివరాత్రి .         మహాశివరాత్రి పూజనాడు ఆచరించాల్సిన నియమాలు :సూర్యోదయానికి ముందే మేల్కొనాలి.  ప్రవహించే నదిలో కానీ, సమీపంలో గల తటాకము లేదా చెరువులో కానీ, నూతి నీటితో కానీ శిరస్నాన మాచరించాలి. రోజంతా ఉపవాస దీక్షలో ఉండాలి.  రోజంతా యోగదీక్షలో ఉంటూ ఈ క్రింది మంత్రాలను పఠిస్తూ జాగారం దీక్షను ఆచరించాలి."*

---------------------------------------

 *"శివ బీజాక్షరీ మంత్రం"*

---------------------------------------    *"ఓం నమః శివాయ"*

*"మృత్యుంజయ మంత్రం :"* 

--------------------------------------- *"ఓంత్రయంబకం.    యజామహే                    సుగంధిం పుష్టి వర్ధనం*

      *"ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్"*

---------------------------------------

    *"రుద్రాగాయత్రి:"* 

----------------------------------------   *ఓంతత్పురుషాయవిద్మహే*

 *"మహా దేవాయ ధీమహి*

  *తన్నో రుద్రప్రచోదయాత్"*

----------------------------------------

*"పై మంత్రాలను మీ శక్తి మీరకు పఠించండి.."*

----------------------------------------

*"తొలిసారి రుద్రాక్ష ధరించేవారు ఈరోజు రుద్రాక్ష ధరిస్తే ఎంతో మంచిది. మహాశివరాత్రి రోజు బిల్వ పత్రాలతో పూజిస్తే మంచిది. మహాశివరాత్రి శివలింగానికి పంచామృతాల (పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార)తో అభిషేకిస్తే శివకృపకు పాతృలౌతారు."*

----------------------------------------

   *"మహాశివరాత్రి జాగరణ :"*

----------------------------------------

*"ఈరోజు పాటించేసిన నియమాల్లో జాగరణ ప్రాముఖ్యతే అధికం. మహాశివరాత్రి వచ్చిందంటే పిల్లలు పెద్దలు అందరూ ఎంతో నిష్ఠతో జాగరణ నియమాన్ని ఆచరించి ఆదియోగి, దేవాదిదేవుడైన ఆ పరమశివుని కృపకొరకు పోటీపడుతుంటారు. జాగరణలో ఉన్న శివభక్తులకొరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు, వేదప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు."*

---------------------------------------      *శివరాత్రి జాగారం , ఉపవాసం ఎందుకు చేస్తారో తెలుసా?*

----------------------------------------

శివరాత్రి పర్వదినాన ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివ నామ స్మరనతో మారుమోగిపోతున్నాయి. శివారాధనలో లింగరూపంలో పూజిస్తారు. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని నమ్మకం. వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రధానమైనవి. మహాశివరాత్రి పర్వదినాన శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు , పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు , భజనలతో శివనామం మారుమోగుతుంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం , శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి , భక్తిప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కల్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో , చింతనలో గడిపి , రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం.

----------------------------------------

*అసలు శివరాత్రి విశిష్టత ఏమిటి ? ఆ రోజు ఉపవాసం ఎందుకుంటారు ? జాగారం ఎందుకు చేస్తారు ? జాగారం ఎవరు , ఎప్పుడు ప్రారంభించారు ?* అంటే దానికి ఒక కథ ఉంది. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేశారు. అప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం పుట్టింది. హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలనూ దహించేసే ప్రమాదం ఉండటంతో దేవదానవులందరూ భయాందోళన చెందారు. హాలాహలం బారి నుంచి లోకాలను రక్షించాలంటూ మహాదేవుడైన శంకరుడిని శరణు వేడారు. లోక రక్షణ కోసం ఆ గరళాన్ని తానే మింగి , గొంతులో బంధించి అలా గరళకంఠుడయ్యాడు. హాలాహల ప్రభావానికి శివుడి కంఠం కమిలి , నీలంగా మారడంతో నీలకంఠుడిగా పేరుపొందాడు. గరళాన్ని గొంతులో బంధించడం వల్ల అది శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది. ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మథనంలో పుట్టిన చంద్రుడిని తలపై ఉంచుకున్నాడు. నిరంతర తాపోపశమనం కోసం గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడు.

----------------------------------------

అయినా , శివుడిని హాలాహల తాపం ఇబ్బంది పెడుతూనే ఉంటుందట. అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. హాలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్ఛిల్లాడట. ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకువ వచ్చేంత వరకు జాగారం చేశారట. అందుకే ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి , జాగారం ఉంటారు. జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనతోనూ , జప ధ్యానాలతోనూ కాలక్షేపం చేస్తారు. ఇదంతా మహాశివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం. నిజానికి శివారాధన పురాణాలకు ముందు నుంచే ఉనికిలో ఉంది.

----------------------------------------

క్రీస్తుపూర్వం 3వేల ఏళ్ల నాడే సింధులోయ నాగరికత విలసిల్లిన కాలంలో శివుడిని పశుపతిగా ఆరాధించేవారు. క్రీస్తుపూర్వం 1500-1200 నాటికి చెందిన రుగ్వేద శ్లోకాలలో రుద్రుడి పేరిట శివుని ప్రస్తావన కనిపిస్తుంది. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దికి చెందిన శ్వేతాశ్వతర ఉపనిషత్తులో శైవమత సిద్ధాంతాల ప్రస్తావన కనిపిస్తుంది. ఈ ఉపనిషత్తు భగవద్గీత కంటే మునుపటిది. అయితే , ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న శైవారాధన పద్ధతులు , సంప్రదాయాలు మాత్రం క్రీస్తుపూర్వం 200 నుంచి క్రీస్తుశకం 100 సంవత్సరాల మధ్య ప్రారంభమై ఉంటాయని గావిన్‌ ఫ్లడ్‌ వంటి చరిత్రకారుల అంచనా.

----------------------------------------

శివారాధనలో మూర్తి రూపం , లింగరూపంలోనూ పూజిస్తారు. లింగ రూపమే ప్రధానమైనది. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని నమ్మకం. వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రధానమైనవి. మహాశివరాత్రి పర్వదినాన శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు , పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. దేశంలోని 12 శివుని ప్రసిద్ద ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు , భజనలతో శివనామం మారుమోగుతుంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం , శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి , భక్తిప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కల్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో , చింతనలో గడిపి , రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం , జాగారం ముఖ్యం.

రణమొనరింపకుండc

 *రణమొనరింపకుండc గవి రాజుల కచ్చపుc గీర్తి గల్గునే*

ఈ సమస్యకు నా పూరణ. 


గణముల కూర్పు ప్రాసయతి కావ్యపు గౌరవముంచి నూత్నమై


గుణములు దోషముల్ తెలిసి గుంఫనగా పద శబ్దజాలముల్


తొణకక భావ మాధురుల తోరణముల్ వెలయించునట్టి పూ


రణమొనరింపకుండc గవి రాజుల కచ్చపుc గీర్తి గల్గునే.


అల్వాల లక్ష్మణ మూర్తి.

అభిజ్ఞానశాకుంతలమ్

 🙏అభిజ్ఞానశాకుంతలమ్ నామౌచిత్యం 🙏

                   రెండవ భాగం 

..

దుష్యంతునకు శకుంతల ధర్మాలు, నీతిబోధ చేయడం నాటక లక్షణాలకు పూర్తిగా విరుద్ధం.అందువల్లనే కాళిదాసమహాకవి దుర్వాస శాపవృత్తాంతం ప్రవేశ పెట్టి నాయకుడు అసత్యవాది కాదని నిరూపిస్తాడు. అంతేగాక జాలరి వృత్తాంతం కూడా చేర్చాడు శాప విమోచననికి జాలరి వృత్తాంతం ఎంతో ఔచిత్యం వహించింది. ఈవిధమైన భారత కథ మార్పు వల్ల అభిజ్ఞానశాకుంతలమ్ నాటకం నాటకరాజం ఆయింది 

కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు చ శకుంతలా

తస్యాంచ చతుర్ధ్వాంకః తస్మిన్ శ్లోక చతుష్టయం"

అనే ఆర్యోక్తి చరితార్ధమైనది. ఎన్నివేల సంవత్సరములైన నిత్య నూతనంగా ఉన్నది 

మొత్తం కథ వ్రాయలేము గాని సంక్షిప్తంకథ చూద్దాము 

కథలోకి వస్తే 

శకుంతల జాతకం ప్రకారం శకుంతలను దుష్టగ్రహాలు పీడిస్తుంటాయి. ఆ గ్రహాల్ని శాంతింపచేయడానికి కణ్వుడు సోమతీర్థానికి వెళుతాడు. రాక్షస మూకలు, ఏనుగుల గుంపులు భీభత్సం సృష్టించకుండ తపోవనాన్ని సంరక్షించాలని మునులు దుష్యంతుడ్ని కోరుతారు. రాజు కొన్నాళ్ళు అక్కడే విడిది చేస్తాడు. శకుంతల అతనికి అతిథి మర్యాదలు చేస్తుంటుంది. ఆ క్రమంలో వాళ్ళిద్దరు మరింత దగ్గరై గాంధర్వ వివాహం చేసుకుంటారు. కణ్వుడు లేని సమయంలో అతని కూతురిని తీసుకుని వెళ్లడం సాంప్రదాయం కాదనుకుంటాడు. గుర్తుగా తన పేరు చెక్కివున్న ఒక వజ్రపు ఉంగరాన్ని శకుంతలకు ఇస్తాడు. దాని మీద ఎన్ని అక్షరాలున్నవో అని రోజులు గడవక ముందే తన మనుషుల్ని పంపుతానంటాడు. కణ్వుని ఆశిస్సులతో శకుంతలను సాదరంగా హస్తినకు రప్పించుకుంటానంటాడు.

శకుంతల అనుక్షణం దుష్యంతుడినే తలుచుకుంటూ ఈలోకాన్ని మరచిపోతుంది. ఒక రోజు దుర్వాసుడు వచ్చి బిక్షం అడుగుతాడు. పరధ్యానంలోవున్న శకుంతల ముని రాకను గమనించదు. దుర్వాసుడు రెండోసారి అరుస్తాడు. అప్పుడూ శకుంతల గమనించదు. తనకు జరిగినపరాభవానికి దుర్వాసుడు రగిలిపోతాడు. శకుంతల ఎవరి గురించి ఆలోచిస్తున్నదో అతనే ఆమెను పూర్తిగా మరిచిపోవాలని శపిస్తాడు. ముని తనను శపించిన విషయం కూడ శకుంతలకు తెలీదు. శకుంతల చెలికత్తెలు వెళ్ళీ మునిని శాపవిముక్తి చేయమని ప్రాధేయపడతారు. దుష్యంతుడు శకుంతలను మరిచిపోయినా జ్ఞాపికను చూపగానే అతనికి తిరిగి జ్ఞాపకం వస్తుంది అంటాడు దుర్వాసుడు. శకుంతల దగ్గర ఎలాగూ ఉంగరం భద్రంగా వుంది కనుక ఇక ముని శాపం ప్రభావం లేనట్టేనని చెలికత్తెలు భావిస్తారు. ముని శాపం విషయాన్ని శకుంతలకు చెప్పరు..


కణ్వుడు ఆశ్రమానికి తిరిగి వచ్చేనాటికి శకుంతల గర్భం దాల్చి వుంటుంది. దుష్యంతుని వంటి సద్గుణాల రాజు అల్లునిగా దొరికినందుకు అతను సంతోషిస్తాడు. ఇద్దరు శిష్యులను తోడుగా ఇచ్చి శకుంతలను దుష్యంతుని దగ్గరకు పంపుతాడు


దారిలో శచీతీర్థం దగ్గర పడవలో పోతూ నదిని మొక్కుకుంటుంది శకుంతల. ఆ సమయంలో, దుష్యంతుని జ్ఞాపిక అయిన ఆమె వేలి వుంగరం ఆమెకు తెలియకుండానే నదిలో జారిపోతుంది..

ఆమె వియోగ వ్యథ చేత చిక్కి ఉంగరం వదులై జారి పడిపోయినట్లు అద్భుతంగా వర్ణిస్తాడు 

  దుర్వాసుని శాపం ప్రకారం ఏనాడో శకుంతలను మరిచిపోయిన దుష్యంతుడు ఆమె ఎదురుగా వచ్చి నిలబడినా గుర్తు పట్టలేడు. స్వార్ధపరులైన స్త్రీలు భోగపరాయణుల్ని తేనెలొలుకు కల్ల మాటలతో ఆకర్షిస్తారని నిందించి రాజసభలో ఆమెను అవమానిస్తాడు. కణ్వుని శిష్యులు కూడ శకుంతలను నిర్దయతో వదిలిపోతారు.


నిస్సహయురాలైన శకుంతలను ఆమె తల్లియైన మేనక ఆదుకుంటుంది. ఒక అప్సరసను పంపి శకుంతలను కశ్యప ముని తపోవనానికి చేరుస్తుంది. అక్కడే ఒక మగపిల్లవాడికి జన్మనిస్తుంది శకుంతల. అతడే భరతుడు.

శకుంతల జారవిడిచిన ఉంగరాన్ని ఒక ఎర్రని చేప మింగుతుంది. ఆ చేప ఒక జాలరికి దొరుకుతుంది. ఆ జాలరి కూర వండడానికి చేపను కోసినపుడు దాని కడుపులో వుంగరం బయటపడుతుంది. ఆ వుంగరం అనేక మలుపులు తిరిగి దుష్యంతునికి చేరుతుంది. దాన్ని చూడగానే దుష్యంతునికి శాపవిమోచన జరిగి గతం అంతా గుర్తుకు వస్తుంది. శకుంతలకు తాను చేసిన అన్యాయం తెలిసివచ్చి కుమిలిపోతాడు. విచారంలో మునిగి రాజ్యంలో ఉత్సవాలన్నింటినీ రద్దు చేసే స్తాడు.

ఇంద్రుని సూచన మేరకు కశ్యపుని తపోవనానికి వెళ్ళిన దుష్యంతునికి సింహపు కూనలతో ఆడుకుంటున్న భరతుడు కనిపిస్తాడు. అతను తన కొడుకే అని పోల్చుకుంటాడు. అక్కడే శకుంతలను కూడ కలిసి అందరి ముందు క్షమాపణ కోరుతాడు. శకుంతల అతన్ని మన్నిస్తుంది. కశ్యపుని ఆశిస్సులతో శకుంతల, భారతుడ్ని వెంట బెట్టుకుని దుష్యంతుడు హస్తినపురికి ప్రయాణమౌతాడు

. మహాభారతం యొక్క పురాణ యుద్ధంలో పోరాడిన కౌరవులు మరియు పాండవుల వంశానికి భరతుడు పూర్వీకుడు . ఈ భారతం తర్వాత భారతదేశానికి "భరతవర్ష", 'భరత దేశం' అనే పేరు వచ్చింది

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

ప్రభుత్వం కొత్త పథకం...

 ప్రభుత్వం కొత్త పథకం...

"ఈరోజు నుండి, భారతదేశంలో రక్త అవసరాలకు "104" ప్రత్యేక నంబర్ కానుంది." "Blood_On_Call" అనేది సేవ పేరు. ఈ నంబర్‌కు కాల్ చేసిన తర్వాత,

40 కిలోమీటర్ల పరిధిలో, నాలుగు గంటల్లోపు,

రక్తం డెలివరీ అవుతుంది..

బాటిల్ కు రూ.450/- మరియు రవాణాకు రూ.100/-. దయచేసి ఈ సందేశాన్ని మీరు సంప్రదించిన ఇతర స్నేహితులు, బంధువులు మరియు సమూహాలకు ఫార్వార్డ్ చేయండి.


ఈ సౌకర్యం చాలా మంది ప్రాణాలను కాపాడుతుంది.🤝🙏🤝

కేయూరాణి

 


*కేయూరాణి న భూషయన్తి పురుషం హారా న చన్ద్రోజ్జ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలఙ్కృతా మూర్ధజాః ।వాణ్యేకా సమలఙ్కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయన్తేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్ ॥*


భావము:


భుజ కీర్తులు గానీ దండ కడియాలు వంటి అలంకరణలు కానీ పురుషుని అలంకరింపవు. చంద్రుని కాంతివలె ఉజ్జ్వలముగా ప్రకాశించు నటువంటి ముత్యాల హారములు, చంద్రహారములు సూర్య హారములు వంటి హారములు కూడా పురుషుని అలంకరింపజాలవు. పన్నీటి జలకాలు, సుగంధ ద్రవ్యాల సువాసనలతో కూడిన శరీర లేపనములు మైపూతలు పురుషుని అలంకరణలతో సమతూగలేవు. పూల ధారణలు, వివిధ రకాలా కేశాలంకరణలూ కూడా పురుషునికి నిజమైన అలంకరణలు కాజాలవు.


వ్యాకరణాది శాస్త్రములచేత సంస్కరింపబడినటువంటి ఏ వాక్కు అయితే పురుషునిచే ధరింపబడుచున్నదో ఆ ఒక్క వాక్కు మాత్రమే పురుషునికి సరియైన అలంకార ప్రాయమగు భూషణము. తక్కిన సువర్ణమయాది భూషణములన్నియును క్రమేణ క్షీణించును. ఎల్లప్పుడును ధరింపబడి యున్నట్టి *వాక్భూషణమే* నశించనటువంటి *నిజమైన భూషణము.*


(ఇక్కడ పురుషుడు అంటే మానవజాతినే సంబోధిస్తుంది కాని పురుషులు స్త్రీలు అన్న లింగబేధాలు కావు, అందరికీ వర్తించగల సమర్థతగల పద్యం). 


మన ఏనుగు లక్ష్మణ కవి గారు కూడా పై పద్యానికి ధీటైన సమాధానమే తెలుగులో నొసంగారు. దానిని గుర్తు తెచ్చుకోవడం ఇక మీ వంతే

శివపార్వతుల కళ్యాణం

 ఓం నమఃశివాయ 


  శివపార్వతుల కళ్యాణం 


పసుపు.                  100గ్రాం 

కుంకుమ                 100గ్రాం 

పసుపు కొమ్మలు      100గ్రాం 

ఎండు ఖర్జూరాలు    100గ్రాం 

తమలపాకులు.        100 

వక్కలు.                   50 గ్రాం 

అగరుబత్తి 

కర్పూరం 

అరటి పళ్ళు.            3 డజన్లు 

కొబ్బరి కాయలు.      3 

కొబ్బరి బొండాలు.     5 (కాడతో    పచ్చగా ఉన్నవి)

గుమ్మడి పండు 

గంధపు చెక్క 

ఉత్తర జంధ్యాలు 

దారపు రీలు

బియ్యం.                3 1/2 కేజీ 

ఆవు పాలు.           100 ml

ఆవు పెరుగు           50 గ్రాం 

తేనె.                      50 గ్రాం 

మధు పర్కాలు 

జీలకర్ర బెల్లం నూరినది 

మంగళసూత్రాలు 

మెట్టెలు 

నల్లపూసలు 

మామిడి ఆకులు 

పువ్వులు దండలు            2

పువ్వుల మూరలు            5

పువ్వులు (చామంతి,గులాబి,లిల్లీ )

కర్పూరం దండలు.            2

లావెండర్ 

రోజ్ వాటర్ 

గంధం మంచిది 

చిల్లర పైసలు.                   25 

ఆవు నెయ్యి 

వత్తులు, అగ్గి పెట్టె 

తువ్వాలు పెద్దవి.              3 

రవికల గుడ్డ కాటన్           2 




           మంగళం మహత్

దేవాలయ దర్శనం

 🛕🛕🛕🛕🛕🛕🛕🛕

🙏🕉️దేవాలయ దర్శనం🕉️🙏

🛕🛕🛕🛕🛕🛕🛕🛕




దేవాలయంను దర్శించుకునే పధ్ధతి దయచేసి చదవండి.

దేవాలయం అంటే దైవం నెలవున్న స్థలం. పరమపవిత్రమైన క్షేత్రం. అఖిలాండకోటి బ్రహ్మాండ

నాయకుడు భక్తుల అభీష్టములు తీర్చడానికి కొలువైఉన్న పరమ పావన నివాసం. అలాంటి

దేవాలయమునకు దర్శనమునకు వెళ్ళునపుడు కొన్ని ధర్మములను / పద్ధతులను ఆచరించాలి.

అప్పుడే ఆ దైవం యొక్క అనుగ్రహమునకు పాత్రులము అవుతాము.


1) ప్రతి భక్తుడు ( స్త్రీ పురుషులు ) గుడికి వెళ్ళే ముందు శుచిగా స్నానం చేసి, విధిగా నుదుట కుంకుమ ధరించాలి.


2) సంప్రదాయమైన వస్త్రములు ధరించాలి. స్త్రీలు చీరలు, పురుషులు ధోవతి-ఉత్తరీయం, ఆడపిల్లలు పరికిణీలు లేదా చుడీదార్ ధరించాలి. ( చాలామంది ఆడపిల్లలు జీన్స్ టీ షర్టులు- మగపిల్లలు షార్టులు ధరించి వెళుతున్నారు.

ఇలా ధరించినవారిని ఆలయ ప్రవెశమునకు అనుమతిని ఇవ్వకుండా యాజమాన్యం చూసుకోవాలి. తల్లి

తండ్రులు ప్రొత్సహించరాదు.)


3) కనీస పూజా సామాగ్రిని తీసుకొని వెళ్ళాలి. పెద్దవారి దగ్గరికి వెళ్ళినా మహాత్ముల దగ్గరికి వెళ్ళినా ఒట్టి చేతితో

వెల్లరాదు. గీతలో పరమాత్ముడు '' పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి" ...ఎవరైతే నాకు భక్తీతో పత్రం కాని పుష్పం కాని ఫలం కాని ఉదకం కాని సమర్పిస్తారొ వాటిని ప్రీతితో స్వీకరిస్తాను'' అన్నాడు.


4) గుడి ముందుకు చేరుకోగానే మొదట కాళ్ళూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.


5) ఆలయం ప్రవేశించడానికి ముందు గోపురానికి నమస్కరించి తర్వాత మెట్లకు నమస్కరించాలి.


6) లోనికి ప్రవేశించినప్పటినుండి భగవంతుని నామం జపిస్తూ అన్యమస్కంగా కాకుండా ఏకాగ్రత

అంతా దేవుడిపైనే ఉంచాలి.


7) నామ జపం చేస్తూ మధ్యమ వేగంతో గర్భాలయం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి పురుషులు స్వామికి కుడి వైపు, స్త్రీలు ఎడమ వైపు నిల్చోవాలి.


8) మొదట మూల విగ్రహం పాదాలను దర్శించి అందులో లీనం కావాలి. తరువాత స్వామి కళ్ళలోకి చూస్తూ లీనం కావాలి.


9) అర్చన చేసుకునేవారు తమ గోత్రము ఇంటిపేరు నక్షత్రము చెప్పుకోవాలి. తీర్థం తీసుకునే  సమయంలో అరచేయిని గొకర్నాక్రుతిలొ ఉంచి చేయి కింద ఏదైనా వస్త్రం ఉంచుకుని '' అకాల మృత్యు  హరణం ...'' అనే మంత్రం స్వయంగా చెప్పుకుంటూ భక్తితో తీర్థాన్ని చప్పుడు రాకుండా తీస్కోవాలి.


10) దర్శనం అయిన తరువాత కాసేపు కూర్చొని నామ జపం చేస్తూ ప్రశాంత చిత్తంతో ఉండాలి.


11) ప్రసాదం భక్తులందరికీ పంచి తామూ భక్తితో తీస్కోవాలి.


12) తిరిగి వెళ్ళే ముందు మళ్ళీ స్వామికి నమస్కరించుకుని బయటికి వచ్చిన తరువాత మళ్ళీ గోపురానికి నమస్కరించి వెళ్ళాలి.


13) ఆలయ ప్రదక్షిణలు చేసేటప్పుడు వేగం కూడదు.


14) అనవసరంగా మాట్లాడటం.. పరుష పదజాలం ఉపయోగించకూడదు


15) ఆవలింతలు, జుట్టు పీక్కోవడం, తల గీక్కోవడం, తమలపాకులు వేయకూడదు.


16) జననం, మరణం సంబంధించిన విషయాలపై మాట్లాడకూడదు.


17) టోపీలు, తలకు వస్త్రాలు కట్టుకోవడం చేయకూడదు.


18) ధ్వజస్తంభం, బలిపీఠం, గోపుర స్థలాలను తొక్క కూడదు.


19) ఆకర్షణీయ దుస్తులను ధరించకూడదు.


20) నందీశ్వరుడు, శివలింగానికి మధ్యలో వెళ్ళకూడదు.


21) దర్శనం పూర్తయ్యాక వెనకవైపు కాస్త దూరం నడిచి, తర్వాత తిరగాలి.


22) ఒక చేత్తో దర్శనం చేయకూడదు.


23) భుజాలపై టవల్స్ వేసుకుని దర్శనం చేయకూడదు.


24) ఆలయంలో భుజించడం, నిద్రించడం చేయకూడదు.


25) ఆలయంలో ఎత్తైన ప్రాంతంలో కూర్చోకూడదు.


26) బలిపీఠంలో ఉన్న సన్నిధిని మ్రొక్కకూడదు.


27) ఆలయ ఆస్తులను అపహరించకూడదు.


28) అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి, మాస ప్రారంభం, సోమవారం, ప్రదోషం, చతుర్థి రోజుల్లో బిల్వ దళాలను తుంచకూడదు.


29) ఆలయంలో స్నానం చేయకుండా ప్రవేశించకూడదు.


30) మూల విరాట్ వద్ద దీపం లేకుండా దర్శనం చేయకూడదు.


31) ఆలయానికి వెళ్లొచ్చిన వెంటే కాళ్లను కడగకూడదు. కాసేపు కూర్చున్న తర్వాతే ఇవన్నీ

చేయాలి.


32) ఆలయంలోకి ప్రవేశించి, తిరిగి వచ్చేంతవరకు నిదానం ప్రదానంగా ఉండాలి.


33) గోపుర దర్శనం తప్పక చేయాలి.


34) ఆలయంలోని మర్రి చెట్టును సాయంత్రం 6 గంటల తర్వాత ప్రదక్షిణలు చేయకూడదు.


35) ఆలయం లోపల గట్టిగా మాట్లాడకూడదు.


36) మన మాటలు, చేష్ఠలు ఇతరులకు ఆటంకంగా ఉండకూడదు.


🌷🌷🌷🌷🌷🌷🌷🌷A Best Collection from Brahmana Samaakya.

జై శ్రీరామ్

జై శ్రీ కృష్ణ 

🛕🛕🛕🛕🛕🛕🛕🛕

🔥స్నేహం, పుస్తకం, ఆలోచన,దారి

 🙏🕉️శ్రీమాత్రేనమః.శుభోదయం🕉️🙏         🔥స్నేహం, పుస్తకం, ఆలోచన,దారి ఈ నాలుగు సరి అయినవి.. ఇవి మనిషి అందిపుచ్చుకుంటే జీవితం సఫలం అవుతుంది.. అర్ధం చేసుకునే బంధం తోడుగా ఉంటే జీవితం బాగుంటుంది.. ఎందుకంటే ఇష్టపడటం తెలిసిన మనసుకి ఇబ్బంది పెట్టడం తెలియదు కాబట్టి🔥సింహానికి ఈగల వల్ల బాధ తప్పదు అనట్లు ఎంతటి వారి కయినా విమర్శలు తప్పవు...ఒకరి అవసరాన్ని నువ్వు ఎలాగైతే పట్టించుకోవో, ఆ అవసరం నీకు అత్యవసరం గా మారినప్పుడు తెలుస్తుంది..అవకాశానికి- అవసరాలకు,,మనుషులకు మానవత్యానికి ఉన్న తేడా🔥పరిస్థితిని బట్టి నీ ఆలోచనలు మరియు అలవాట్లు మారితే బాగుంటుంది.. కానీ విలువలు, వ్యక్తిత్వం ఎప్పుడూ మారకూడదు.. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండటమే నువ్వు నీ జీవితంలో సంపాదించవలసిన గొప్ప విజయం.🔥సూర్యుడికి కాంతి, చంద్రునికి వెన్నెల ఎంత ప్రత్యేకత నిస్తుందో మనిషికి మానవత్యం అంతే ప్రత్యేకత నిస్తుంది.. బాధ కలిగినా, సంతోషం కలిగినా మనల్ని మనం కౌగిలించుకోలేము.. మన బుజాల మీద పడి మనం ఏడవనూలేం.. ఏ ఫిలింగ్ కీ అయినా మన అనే వారు ఉండాలి.. అందుకే ఆత్మీయులను ఎప్పుడూ దూరం చేసుకోకూడదు🔥🔥మీ  *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్& జనరల్ ఏజన్సీస్ డ్.న్.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్యసలహాలు ఉచితం మందులు అయి పోయిన వారు రాలేని వారు కొత్తవారికి మందులు కొరియర్ ద్వారా మందులు పంపబడును 94408935930 9182075510*

శివుని పంచ ముఖాల

 🍁  *శివుని పంచ ముఖాల గురించి ....😁*🍁


పరమేశ్వరుడు బ్రహ్మ దేవుడికి  సృష్టి కార్యాం భాధ్యత అప్పగించాడు. కానీ బ్రహ్మ దేవుడికి సృష్టి ఎలా చెయ్యాలో అర్థం కాలేదు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఆయన పంచ ముఖాల నుండి వెలువడిన అద్భుతమైన గ్రంథాలే వేదాలు పంచాక్షరి . ఇలా అయిదు ముఖాల నుండి ఏ ఏ గ్రంధాలు ఏ ముఖం నుండి ఉద్భవించాయి తెలుసుకుందాం.


ముందుగా శివుని పంచ ముఖాల గురించి తెలుసుకుందాం.


శివుని పంచముఖాలు (Shiva Panchamukha) అనగా ఆయనకు ఉండే ఐదు ముఖాలను సూచిస్తుంది. ఈ ఐదు ముఖాలు ఐదు దిశలను సూచించడమే కాకుండా, ఐదు తత్వాలను, ఐదు కార్యాలను, ఐదు ప్రధాన శక్తులను కూడా ప్రతిబింబిస్తాయి.


శివుని పంచముఖాలు & వాటి అర్థం


1. సద్యోజాతము (Sadyojata) – పశ్చిమ ముఖం


రంగు: తెలుపు


దిక్కు: పశ్చిమం


సంబంధిత తత్వం: పృథ్వీ (భూమి)


సంబంధిత శక్తి: క్రియా శక్తి


ఉద్దేశ్యం: సృష్టిని సూచిస్తుంది (Creation)


ఇది బ్రహ్మ స్వరూపంగా భావించబడుతుంది.


2. వామదేవము (Vamadeva) – ఉత్తర ముఖం


రంగు: ఎరుపు


దిక్కు: ఉత్తరం


సంబంధిత తత్వం: జల (నీరు)


సంబంధిత శక్తి: మయా శక్తి


ఉద్దేశ్యం: సంరక్షణ (Protection & Preservation)


ఇది విష్ణు స్వరూపంగా భావించబడుతుంది.


3. అఘోరము (Aghora) – దక్షిణ ముఖం


రంగు: నీలం


దిక్కు: దక్షిణం


సంబంధిత తత్వం: అగ్ని (కాలి పోయే తత్వం)


సంబంధిత శక్తి: జ్ఞాన శక్తి


ఉద్దేశ్యం: సంహారం (Destruction & Regeneration)


ఇది రుద్ర స్వరూపంగా భావించబడుతుంది.


4. తత్పురుషము (Tatpurusha) – తూర్పు ముఖం


రంగు: పసుపు


దిక్కు: తూర్పు


సంబంధిత తత్వం: వాయు (గాలి)


సంబంధిత శక్తి: యోగ శక్తి


ఉద్దేశ్యం: తపస్సు (Meditation & Concealment)


ఇది మహేశ్వర స్వరూపంగా భావించబడుతుంది.


5. ఈశానము (Ishana) – పై ముఖం


రంగు: బంగారు


దిక్కు: పై (ఆకాశం)


సంబంధిత తత్వం: ఆకాశం (Space)


సంబంధిత శక్తి: చిత్‌శక్తి


ఉద్దేశ్యం: పరిపూర్ణ జ్ఞానం (Supreme Consciousness & Liberation)


ఇది సదాశివ స్వరూపంగా భావించబడుతుంది.


పంచముఖ శివుని ఆరాధన ప్రత్యేకత


ఈ పంచ ముఖాలు సృష్టి, స్థితి, లయ, తపస్సు మరియు మోక్షాన్ని సూచిస్తాయి.


శివుని పంచముఖ లింగం (Panchamukha Lingam) అనేది పంచ భూతాలను సమతుల్యం చేయడానికీ, పవిత్రత పొందడానికీ ఉపయోగపడుతుంది.


పంచాక్షరి మంత్రం (ॐ నమః శివాయ) కూడా ఈ ఐదు ముఖాలను సూచించేలా ఉంటుంది.


పంచ ముఖ శివుని ఆరాధన ప్రాముఖ్యత


పంచాక్షరీ మంత్రం జపనితో ఐదు ముఖాల అనుగ్రహం పొందొచ్చు.


పంచముఖ లింగారాధన, రుద్రాభిషేకం, పంచముఖ హోమం చేయడం వల్ల అధిక శుభఫలాలు కలుగుతాయి.


భక్తులు పంచ ముఖాల స్మరణ ద్వారా తమ భౌతిక, ఆధ్యాత్మిక మరియు ధార్మిక జీవితాల్లో సమతుల్యతను పొందవచ్చు.


పంచముఖ రూపంలో ప్రసిద్ధ ఆలయాలు


1. శ్రీ కేదారేశ్వర స్వామి ఆలయం – కేదారనాథ్


2. శ్రీ పంచముఖ అనుమంతేశ్వర ఆలయం – కంచి


3. శ్రీ కపాలీశ్వర ఆలయం – చెన్నై


4. శ్రీ పంచముఖ లింగాల శివాలయం – మహారాష్ట్ర


పంచముఖ శివుని ధ్యానం ద్వారా మనం శివతత్త్వాన్ని, ఐదు భూతాలను, ఐదు ప్రధాన శక్తులను మరియు సర్వలోక పాలనను అర్థం చేసుకోవచ్చు.


శివుని పంచముఖాలు అనేక శాస్త్రాలు, వేదాంత తత్వాలు, మరియు ఆధ్యాత్మిక గ్రంథాలకు మూలంగా ఉన్నాయి. ప్రతి ముఖం భిన్నమైన జ్ఞానాన్ని ప్రదానం చేస్తుంది.


పంచముఖాల నుండి ఉద్భవించిన గ్రంథాలు & వాటి ఉపదేశం


1. సద్యోజాతము (Sadyojata) → రిగ్వేదం (Rig Veda)


కామిక آگమము (Kāmika Āgama)


ఉపదేశం: బ్రహ్మ దేవునికి, సృష్టి తత్త్వాన్ని బోధించేందుకు


విషయం: సృష్టి ప్రక్రియ, భక్తి మార్గం, అర్చన పద్ధతులు


2. వామదేవము (Vamadeva) → యజుర్వేదం (Yajur Veda)


యోగజ ఆగమము (Yogaja Āgama)


ఉపదేశం: విష్ణువు & ఋషులకు


విషయం: ధర్మ, కర్మ మార్గం, యాగ, హోమ నిబంధనలు


3. అఘోరము (Aghora) → సామవేదం (Sama Veda)


చింత్య ఆగమము (Chintya Āgama)


ఉపదేశం: ఋషి భృగు & రుద్రగణాలకు


విషయం: తాండవ తత్త్వం, సంక్షేమ విధానాలు, శివతత్వం


4. తత్పురుషము (Tatpurusha) → అధర్వణవేదం (Atharva Veda)


కరణ ఆగమము (Karana Āgama)


ఉపదేశం: ఋషి పతంజలికి


విషయం: యోగ, ధ్యానం, తపస్సు, తాంత్రిక విద్యలు


5. ఈశానము (Ishana) → శివాగమాలు (Shiva Agamas)


సువర్ణ ఆగమము (Suvarna Āgama)


ఉపదేశం: నందీశ్వరునికి, రుద్రగణాలకు


విషయం: మోక్ష మార్గం, అద్వైత తత్వం, పరబ్రహ్మ సిద్ధాంతం


సారాంశం


శివుని పంచ ముఖాల నుండి వేదాలు, ఆగమాలు, తంత్రాలు, యోగ శాస్త్రాలు ఉద్భవించాయి.


ఆయా గ్రంథాలను బ్రహ్మ, విష్ణువు, ఋషులు, నంది, రుద్రగణాలు, దేవతలకు ఉపదేశించారు.


వేదాలు – మంత్ర, యాగ, ధర్మ విషయాలు


ఆగమాలు – దేవాలయ నిర్మాణం, పూజా విధానాలు


తంత్రాలు – గుప్త విద్యలు, యోగ విద్యలు


యోగ గ్రంథాలు – ధ్యానం, మోక్ష మార్గం


ఈ తత్త్వాలు శివ భక్తులకు, యోగులకు, తపస్వులకు, ఆధ్యాత్మిక సాధకులకు మార్గదర్శకంగా నిలుస్తాయి.


అదేవిధంగా గా 


*🌿 శివుడి పంచ బ్రహ్మా మంత్రాలు*🌿


సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః |

భవే భవే నాతిభవే భవస్వ మామ్ | భవోద్భవాయ నమః ||


వామదేవాయ నమో” జ్యేష్ఠాయ నమ-శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః

కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో

బలప్రమథనాయ నమ-స్సర్వ-భూతదమనాయ నమో మనోన్మనాయ నమః ||


అఘోరే”భ్యో థ ఘోరే”భ్యో ఘోరఘోరతరేభ్యః |

సర్వే”భ్య-స్సర్వశ-ర్వే”భ్యో నమస్తే అస్తు రుద్రరోపేభ్యః ||


తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి |

తన్నో రుద్రః ప్రచోదయా”త్ ||


ఈశానః-సర్వ-విద్యానా-మీశ్వర-స్సర్వ-భూతానాం

బ్రహ్మా ధిపతి-ర్బ్రహ్మణో ధిపతి-ర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోమ్ |


🌼☘️🌹🌻🍃🌺🌸🌷🌹🌻


🔱 *ఓం నమః శివాయ 🙏 *శ్రీ మాత్రే నమః..* 🙏 🔱 *శివోహమ్* 🌺 *శివోహమ్* 🌺 


🙏 *ఓం హర నమః పార్వతి పతయే హర హర మహాదేవ శంభో శంకర* 🙏


🙏 *శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుః, విష్ణోశ్చ హృదయం శివః !* 🙏


🙏 


🐄🐄 

 

🚩🙏 *సర్వేజనా సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు*  🚩🙏🌹🎻🙏🌹

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: రెండవ అధ్యాయం

సాంఖ్యయోగం: శ్రీభగవానువాచ


ఏషా తే௨భిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు

బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి (39)


నేహాభిక్రమనాశో௨స్తి ప్రత్యవాయో న విద్యతే

స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ (40)


పార్థా ..  ఇంతవరకూ నీకు సాంఖ్యమతానుసారం ఆత్మతత్వం గురించి చెప్పాను. ఇక సంసారబంధం వదులుకోవడానికి సాధనమైన నిష్కామ కర్మయోగం గురించి చెబుతాను విను. ఈ కర్మయోగం ప్రారంభించి, పూర్తి చేయలేకపోయినా వృథాగా పోదు; దోషం లేదు. ఏ కొద్దిగా ఆచరించినా ఈ యోగం దారుణమైన సంసారభయం నుంచి కాపాడుతుంది.

మాఘ పురాణం - 28 వ అధ్యాయము*_

 _*మాఘ పురాణం - 28 వ అధ్యాయము*_


🌅🏞️🌅🌊🌅🏞️🌅

*🙏ఓం నమో భగవతే నారాయణాయ*


*క్రూర (రా) కథ*

*🌅🛕📚TVBC📚🛕🌅*

**************************

🕉️📚🕉️📚🕉️📚🕉️📚

గృత్నృమహమహర్షి జహ్నుమునితో నిట్లనెను. మాఘమాసమున నదీ ప్రవాహ స్నానము చేసి శ్రీహరిని పూజించి మాఘవ్రతము నాచరించిన వాని పుణ్య భాగ్యమును వినుము. అట్టివాడు దివ్య విమానమునెక్కి పూజ్యుడై తన వంశమువారి నందరినుద్ధరించుచు పుణ్యలోకమును చేరెను. ఈ విషయమును తెలుపు మరియొక కథను చెప్పుదును వినుము. పూర్వము ద్వాపర యుగమున విదేహదేశమున క్రూరయను పేరుగల శూద్ర స్త్రీ యుండెను. ఆమె యొక రైతు భార్య మిక్కిలి కోపము కలది. ఆ  దంపతులకు జ్ఞానియగు పుత్రుడుకలడు. అతడు దయావంతుడు ధర్మాచరణమనిన ఇష్టము కలవాడు. వాని భార్య పతి భక్తి కలిగినది ఉత్తమురాలు. ఆమెకును ధర్మకార్యములను చేయుటయందిష్టము కలదు. బంధువులకు దీనులకు అతిథులకు అందరికి యధా శక్తి సేవ చేయునది. అత్తమామలకెప్పుడును సేవచేయుచుండెను. క్రూర కోడలిని యే దోషము లేకున్నను నిందించెడిది కిట్టెడిది. అప్పుడప్పుడామె భర్తయు తలచి అత్తమామలు పెట్టు హింసలను భరించుచు నోర్పుతో వినయ విధేయతలతో వారికి యధాశక్తిగ సేవలు చేయుచుండెడిది.


ఒకనాడు యిట్టి హింసను పొంది దుఃఖించుచున్న భార్యను జూచి క్రూరా పుత్రుడు తన తల్లిదండ్రులతో నిట్లనెను. నాయనా ! అమ్మా ! నా మాటను వినుడు. నా మాట కీర్తిని కలిగించునది ధర్మమును సాధించునది. మీకు కోడలిపై కోపమెందులకు ? కలహమునకు కారణమేమి ? మీ శరీరములకును బాధను కలిగించు యీ కోపముతో మీకేమి ప్రయోజనము ? సర్వ సంపదలను నశింపజేయు కలహమెందులకు ? నేను గాని , నా భార్యగాని మీకేమి ఉపకారమును చేసితిమి ? మీ యీ కోపమునకు కారణమేమియు నాకు కనిపించుటలేదు. పెరిగిన కోపముచే ఆయువు ధనము , కీర్తి , సుఖము , గౌరవము , జ్ఞానము మున్నగునవి నశించును కదా ! సర్వజ్ఞులైన , పెద్దలైన మీరు కోపమును మాని మాయందు దయను చూపి సర్వజన సమ్మతమైన ఓర్పు వహించుడు అని పలికెను.


పుత్రుని మాటలను విని క్రూర భర్తతోబాటు మిక్కిలి కోపముతొ యిట్లనెను. మూర్ఖుడా పో పొమ్ము. నీవెంత ? నీ భార్యయెంత ? తల్లిదండ్రులకిట్లు నీతి బోధను చేయు నిన్ను నీ భార్యను యేమి చేసినను తప్పులేదు , అని పలికి కొడుకును కోడలిని మరల మాటిమాటికి పలుమార్లు నిష్కారణముగ కొట్టెను. ఇట్లు దెబ్బలు తినుచున్న పుత్రుడు రోషమును చెందెను. కాని సహజమైన శాంతమును పొందెను. *'అయ్యో తల్లితండ్రులను ద్వేషించుట యెంత తప్పు అట్టివారు శాశ్వతముగా నరకమునకు పొందుదురు కదా. తల్లిదండ్రులకు సమానమైన దైవము వేరొకటిలేదు. స్త్రీకి భర్తను మించిన దైవమును లేదు కదా ! విష్ణువుతో సమాన దైవము , గంగతో సమానమగు తీర్థము లేవు కదా అని తలచెను. భార్యను తగుమాటలతో నూరడించెను. ఓర్పుగా నుండుమని సమాధాన పరచెను.


🌅🏞️🌅🌊🌅🏞️🌅

*⛳🛕ॐ•TVBC•卐🛕⛳*

•••••••••••••••••••••••••••••

*🪀📖courtesy by📲🙏*.

*🛕卐ॐ•TVBC•ॐ卐🪔*•••••••••••••••••••••••••••

http://www.youtube.com/c/TVBCTelanganavenkateshwaraBhakthichannel

🕉️📚📚📚📚🕉️


కోపిష్టియగు క్రూర కోడలిని కొట్టి ఒక గదిలో నుంచి తలుపులను మూసి వేసెను. ఆమె కుమారుడీ ఆకృత్యమును జూచి తల్లినేమియు అనలేక పితృభక్తి వలన నేమియు చేయలేక మౌనముగా బాధపడుచు పూర్వము వలెనే తల్లిదండ్రులకు సేవ చేయునుండెను. కోడలు ఆ గదిలో ఏడురోజులు అన్నము , నీరులేక ఆవిధముగా నిర్భంధములోనుండెను. యిరుగుపొరుగువారు, బంధువులు , మిత్రులు యీపని కూడదని చెప్పినను క్రూర వారి మాటలను వినిపించుకొనలేదు, కోడలిని అట్లె నిర్బంధించి పీడించెను. ఏడవదినమున కోడలు అన్నము నీరు లేకుండుటచే దుఃఖించి కృశించి మరణించెను. పన్నెండవ దినమున క్రూర కుమారుడు భార్యను చూడవలయునని తల్లికి తెలియకుండ తలుపు తెరచి చూచెను. మరణించిన భార్యను జూచి సంతాపమునంది నిశ్చేష్టుడైయుండెను. కొంతకాలమునకు స్పృహ వచ్చి చిరకాలము దుఃఖించెను. గాలికి పడిన చెట్టువలె దుఃఖభారముచే నేలపై బడెను.


క్రూరయూ తలుపు తెరచి యుండుటను గమనించి కోపించెను. మరణించిన కోడలిని దుఃఖవివశుడైన పుత్రుని జూచెను. ఆశ్చర్యము ఆమెకును దుఃఖము యెక్కువగా వచ్చెను. ఆమె చేతులతో కొట్టుకొనుచు చిరకాలము శోకించెను. ఆమె యెడ్పును విని అందరును యేమియనుచు చూడవచ్చిరి. విషయమును తెలిసికొని క్రూరను బహువిధములుగ నిందించిరి. కొందరు బంధువులు కోడలి శవమును గొనిపోయి దహనము చేసిరి. క్రూర కుమారుడు దుఃఖమును భరింపలేక అచట నుండలేక గంగా తీరమును చేరెను. కొంతకాలమునకు శోక భారమున మరణించెను.


క్రూర పశ్చాత్తాపమునందెను , పుత్రశోకమును భరింపలేక చిరకాలము దుఃఖించెను. ఆమె భర్తయు శోకించెను. వారట్లు అధికముగ శోకించుటను జూచి జనులందరును విచారించిరి. కాని ఈ సమయమున విచారించి లాభమేమి , పుత్రశోకమును భరింపలేక నిద్రాహారములు మానిన వారు కొంతకాలమునకు మరణించిరి. యమలోకమును చేరిరి. వారు అసివత్ర నరకము(కత్తుల బోను) చిరకాలమనుభవించిరి. తరువాత చంపా తీరమున సర్పములై జన్మించిరి. రావి చెట్టు తొఱ్ఱలో నివసించుచుండిరి. కొంతకాలమునకు ధీరుడు , ఉపధీరుదు అను ఇద్దరు సజ్జనులు అచటకి వచ్చిరి , చంపానదిలో మాఘమాస స్నానము నాచరించి సర్పదంపతులున్న చెట్టు క్రింద శ్రీహరిని అర్చించిరి. మాఘమాస మహిమను పురాణముగ చెప్పుకొనిరి.


సర్పదంపతులు శ్రీహరి పూజను చూచుట వలన , శ్రీహరి మహిమను వినుటవలన , వారి పాపములు పోయినవి. పుణ్యము కలిగెను. వారు వెంటనే సర్పదేహములను విడిచి దివ్యదేహములను ధరించిరి. వారికై దివ్య విమానము వచ్చెను. శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి. జహ్నుముని వర్యా ! మాఘమాసవ్రత మిట్టిదని యెంతకాలము చెప్పినను పూర్తికాదు. ఇంతమందియే మాఘమాసవ్రత మహిమ వలన తరలచిరని చెప్పుటకును వీలులేదు. ఎన్నో యుగముల నుండి యెంతమందియో , ఉత్తమ మునులు , సజ్జనులు , రాజులు , వైశ్యులు , బ్రాహ్మణులు , శూద్రులు , పురుషులు , స్త్రీలు , బాలురు , పశుపక్ష్యాదులు వారు వీరననేల సర్వప్రాణులును మాఘమాసవ్రతము నాచరించుట వలన , చూచుట వలన , వినుట వలన తరించిరి. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతము నాచరించినచో , చేసిన పాపములు పోయి పుణ్య లోకములు కలుగుననుటకెన్ని ఉదాహరణములను చెప్పగలను ? ఎన్నియో ఉదాహరణములు ఉన్నవి సుమా అని గృత్నృమదమహాముని జహ్నుమునికి మాఘమాస వ్రత మహిమను వివరించెను.

*-❀꧁❀-TVBC❀-꧂❀-*


🟨🟥🟨🟥🟨🟥🟨🟥

*🙏స్వస్తి 🙏*

📚🕉️📚🕉️📚🕉️

*FOR MORE DAILY "DEVOTIONAL UPDATES"  & SPIRITUAL INFORMATION 📖 WATCH 🪀 AND SUBSCRIBE TO TVBC ON YOUTUBE.🤳*

🟨🟥🟨🟥🟨🟥🟨🟥

పనచిక్కడు దక్షిణ మూక్కాంబిక సరస్వతి ఆలయం

 🕉 మన గుడి : నెం 1031


⚜ కేరళ  : కొట్టాయం


⚜ పనచిక్కడు దక్షిణ మూక్కాంబిక సరస్వతి ఆలయం



💠 కేరళలోని కొట్టాయం జిల్లాలోని పనచికాడు గ్రామంలోని సరస్వతి ఆలయాన్ని దక్షిణ మూకాంబి అని పిలుస్తారు. 

అనేక సరస్వతి ఆలయాలు 'నవరాత్రి కాలంలో మాత్రమే పూజలు నిర్వహిస్తున్నప్పటికీ, ఈ ఆలయం భక్తులకు ఎల్లప్పుడూ 'దర్శనం' అందజేస్తూ పూజలను అందజేస్తుంది.


💠 ఇది కేరళలోని భక్తులకు అత్యంత ప్రముఖమైన సరస్వతి ఆలయాలలో ఒకటి. కానీ, ఆలయ ప్రధాన దేవత సరస్వతి దేవి కంటే చాలా కాలం ముందు ప్రతిష్టించబడిన విష్ణువు అయినా ఇప్పటికీ ఈ ఆలయాన్ని సరస్వతీ దేవాలయంగా పిలుస్తున్నారు.


💠 అమ్మవారి ప్రజాదరణ కారణంగా. ఆలయం లోపల శివుడు , గణపతి , అయ్యప్పన్ , పాము దేవతలు మరియు పనచిక్కట్టు యక్షికి ఉప మందిరాలు ఉన్నాయి.


🔅 స్థల పురాణం


💠 ఈ ఆలయానికి వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర ఉంది.

కిజుపురం, కరుణాడ్ మరియు కైముక్కు అనే మూడు బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయి.

కిజుపురతిల్లం నుండి గౌరవప్రదమైన బ్రాహ్మణుడుకి మగ వారసులు లేరు. 

పవిత్ర గంగా నదిలో స్నానం చేయడానికి వారణాసికి బయలుదేరాడు . 


💠 మార్గమధ్యంలో మూకాంబిక వద్ద ఆగి కొన్నిరోజులు అక్కడే ఉండి  దేవిని ప్రార్థించాడు. 

ఆ ప్రదేశంలోని ప్రశాంతత అతనిని ఆకర్షించింది మరియు అతను అక్కడ ఒక సంవత్సరం పాటు భజనలు పాడాలని నిర్ణయించుకున్నాడు . 


💠 ఆలయంలో ఒక సంవత్సరం గడిపిన తరువాత, ఒకరోజు దేవి అతని ముందు ప్రత్యక్షమై ఈ జన్మలో తనకు సంతానం కలగడం అసాధ్యమని చెప్పి, తన స్వగ్రామానికి వెళ్ళమని సలహా ఇచ్చింది.


💠 కరుణాత్తిల్లంలోని ఒక నంపూతిరి మహిళ ఇప్పుడు గర్భవతి అని, ఆమె ఇద్దరు పిల్లలకు జన్మనిస్తుందని ఆమె అతనికి చెప్పింది. 

పిల్లల్లో ఒకరిని తన సొంత బిడ్డగా దత్తత తీసుకుని పెంచాలి. 

దేవి ఆదేశానుసారం మరుసటి రోజు భక్తుడు స్నానం చేసి, దేవికి పూజ చేసి తన ఇంటికి తిరిగి వచ్చాడు. 


💠 పనచిక్కాడు చేరుకోగానే గుడి చెరువులో స్నానం చేయాలని నిర్ణయించుకున్నాడు. 

అతను తన ఒలకడ (తాటి ఆకులతో చేసిన గొడుగు)ని ఆలయానికి దక్షిణం వైపున ఉంచి స్నానం చేయడానికి వెళ్ళాడు. 

స్నానం ముగించుకుని గొడుగు తీయడానికి ప్రయత్నించాడు. నంబూదిరి అయోమయంగా నిలబడ్డారు. అప్పుడు ఒక వ్యక్తి అద్భుతంగా సాక్షాత్కరించి, మూకాంబికా దేవి గొడుగులో ఉంటోందని మరియు నంబూదిరి గొడుగును తిరిగి పొందే ముందు దైవత్వాన్ని ఒక విగ్రహానికి బదిలీ చేయాలని నంబూదిరికి వివరించాడు. 


💠 బదిలీకి అనువైన విగ్రహం సమీపంలోని అడవిలో దాగి ఉందని కూడా అతను నంబూదిరితో చెప్పాడు. విగ్రహాన్ని తీసుకునే ముందు దాని రక్షకుడైన యక్షిని శాంతింపజేయవలసి ఉంటుందని అతను హెచ్చరించాడు . నంబూదిరి తాను చెప్పినట్లు చేసాడు మరియు పనచిక్కడు దేవిని స్థల దేవతగా స్థాపించారు. 

మరో చిన్న విగ్రహం అర్చన బింబంగా పడమటి ముఖంగా ఉంచబడింది . 


💠 ఈ విగ్రహం పైకప్పు లేకుండా నీటితో నిండిన తక్కువ భూభాగంలో ప్రతిష్టించబడింది, దేవి చెరువు మధ్యలో కూర్చున్నట్లు అనిపిస్తుంది.

ఆలయ ప్రాంగణానికి చేరుకున్నప్పుడు విష్ణు మందిరానికి దక్షిణంగా కొన్ని మీటర్ల దూరంలో ఉన్న “విష్ణు దేవాలయం” మనకు కనిపిస్తుంది, 


💠 ఆలయంలో ఇతర చోట్ల ఉన్న ఆలయాల సాంప్రదాయ గర్భగుడి మరియు ఇతర ఆడంబర నిర్మాణాలు లేవు. 


💠 "దేవి సరస్వతి" యొక్క మూల విగ్రహం సమీపంలో అన్ని పూజలు నిర్వహించబడే మరొక ప్రత్యామ్నాయ విగ్రహం ఉంది.

ఇక్కడ 'బ్రహ్మరాక్షసు' విగ్రహం కూడా ప్రతిష్టించబడింది. 

ఇతర దేవాలయాలలో యక్షి మందిరాలు ఉన్నప్పటికీ, పనచికాడు వద్ద యక్షి యొక్క శక్తి చాలా అద్భుతంగా ఉంటుంది. 

అదనంగా ఇక్కడ శివుడు, శాస్తా, గణపతి, నాగయక్షి, నాగరాజు మరియు ఉప దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి.


💠 ఇక్కడ ప్రత్యేకంగా గమనించవలసిన రెండు విషయాలు లతలు మరియు నిష్కళంకమైన కోనేటి నీరు.

విగ్రహాన్ని కప్పి ఉంచే లత ఆకులను సరస్వతి ఆకులుగా పరిగణిస్తారు. ఇక్కడి నీటి బుగ్గ నుండి వచ్చే నీరు "దేవి" పాదాలను తాకుతూ ప్రవహిస్తుంది.

దేవి అటువంటి "సరస్సు " పై (చిన్న వాగు) ఉంటుంది కాబట్టి సరస్వతి అనే పేరు అర్థవంతంగా మారుతుంది. 


💠 పూజలు, ఇతర అవసరాలకు కావాల్సిన నీటిని బుగ్గ నుంచి తీసుకుంటారు. ఇక్కడ బావి లేదా ఇతర నీటి వనరులు అందుబాటులో లేవు. 


💠 భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు ఇక్కడికి 'దర్శనం' కోసం వస్తుంటారు, మతాలకు అతీతంగా ప్రజలు 'విద్యారంభం' (విద్య ప్రారంభించే వేడుక) కోసం ఇక్కడికి వస్తారు.

 'దుర్గాష్టమి', 'మహానవమి' రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో 'విద్యారంభం' ఇక్కడ నిర్వహిస్తారు. 


💠 సరస్వత మంత్రం నెయ్యి ' ఇక్కడ నుండి భక్తులకు పంపిణీ చేయబడుతుంది. 

ఈ నెయ్యి తీసుకోవడం వల్ల పిల్లల తెలివితేటలు మరియు విద్య కోసం ఇది చాలా మంచిదని భావిస్తారు. 


💠 ప్రతిరోజూ తెల్లవారుజామున సరస్వతి మరియు విష్ణువులకు పూజ నిర్వహిస్తారు-సరస్వతి 'సరస్వత సూక్తార్చన' మరియు విష్ణు పురుష సూక్తార్చన' చేస్తారు.


💠 ఈ ఆలయంకి కొట్టాయం (11 కి.మీ) మరియు చంగనాచెరి (13 కి.మీ). సమీప విమానాశ్రయం కొచ్చి (100 కి.మీ).


రచన

©️ Santosh Kumar

14-02-గీతా మకరందము

 14-02-గీతా మకరందము

        గుణత్రయవిభాగయోగము


-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - జ్ఞానముయొక్క మహిమను ఇంకను తెలియజెప్పుచున్నారు -


ఇదం జ్ఞానముపాశ్రిత్య 

మమ సాధర్మ్యమాగతాః | 

సర్గేఽపి నోపజాయన్తే 

ప్రళయే న వ్యథన్తి  చ || 


తాత్పర్యము:- ఈ జ్ఞానము నాశ్రయించి జనులు నాతో నైక్యమునొందినవారై (నా స్వరూపమును బడసి) సృష్టికాలమున జన్మింపరు. ప్రళయకాలమున నశింపరు. (జననమరణరహితులై పునరావృత్తిలేక యుందురని భావము).

వ్యాఖ్య:- ‘మమ సాధర్మ్యమాగతాః’- జ్ఞానముయొక్క అఖండమహిమను తెలియజేయుచున్నారు. ఈ జ్ఞానమును తెలిసికొనినవారు సాక్షాత్ భగవంతునితో నైక్యమొంది భగవద్రూపులే యగుచున్నారు. (జ్ఞానీత్వాత్మైవ మే మతమ్ (7-18) అని పూర్వమీభావమునే గీతాచార్యులు వ్యక్తపరచియుండిరి. ఈ జ్ఞానముచే జీవుడు శివుడగుచున్నాడు. భక్తుడు భగవంతుడగుచున్నాడు. "సాధర్మ్యమ్" అని చెప్పుటవలన జ్ఞాని భగవంతునితో సరిసమానమైన రూపము, ధర్మములు గలిగియుండునని స్పష్టమగుచున్నది. అట్టి స్థితి ఐక్యమువలననే సిద్ధించగలదు. ఏలయనిన, సమానధర్మములుగల - అనగా సద్రూపముగల రెండు వస్తువులు ఎచటను ఉండనేరవు. ఒకే సద్వస్తువు లోకమున ఉండగలదు. కాబట్టి జీవుడు జ్ఞానోపార్జనచే పరమాత్మయందు తప్పక లీనమగుచున్నాడని  ఋజువగుచున్నది. ఆహా! ఎంత గొప్ప పదవి! సాక్షాత్ భగవంతుడే తానగుటలో ఎంత ఘనత కలదు! కావున అట్టి మహోన్నతస్థితికై ఈ జీవితమందే యత్నించువాడు ధన్యాతిధన్యుడు.

అయితే అట్టి భగవత్సాయుజ్యమును, సాధర్మ్యమును, బొందుటవలన కలుగు ఫలితమేమి యనిన, అట్టివారు జననమరణరహితులై పునరావృత్తిలేక యుందురు. వారు సృష్టికాలమున జన్మించుటగాని, ప్రళయకాలమున నశించుట, బాధనొందుటగాని లేనివారై - "పునరపి జననం పునరపి మరణమ్" - అనుదానిని తప్పించుకొనినవారై ఈ సంసారచక్రపరిభ్రమణమునుండి విడివడి" పరమానంద మనుభవించుచుందురు. వెయ్యేల! ఆనందరూపులే యగుదురు. (సర్గేఽపి నోపజాయన్తే ప్రళయే న వ్యథన్తి  చ). కాబట్టి సంసారవ్యథలనుండి, బాధలనుండి తప్పించుకొనవలెననిన, ఈ ఆత్మజ్ఞానమొకటియే జనులకు శరణ్యమని తేలుచున్నది.


ప్రశ్న:- ఈ జ్ఞానమును బొందుటవలన గలుగు ఫలితమేమి?

ఉత్తరము:- ఈ జ్ఞానమును బొందుటచే జనులు (1) భగవంతునితో నైక్యమొందినవారై భగవత్స్వరూపులే యగుదురు. (2) మఱియు సృష్టికాలమున జన్మింపరు, ప్రళయకాలమున నాశమొందరు, బాధితులుకారు. (జననమరణరహితు లగుదురని భావము).

ప్రశ్న:- (దీనినిబట్టి) భగవత్సాయుజ్యమును, మోక్షమును బొందుట కుపాయమేమి?

ఉత్తరము:- పరమార్థజ్ఞానమును బడయుటయే.

తిరుమల సర్వస్వం -160*

 *తిరుమల సర్వస్వం -160*

*స్వామి పుష్కరిణి -7*



 *ధర్మగుప్తుడు* 


 ప్రాచీనకాలంలో 'ధర్మగుప్తుడు' అనే చంద్రవంశపు రాజు ఉత్తరభారత దేశాన్ని పరిపాలిస్తుండేవాడు. ఒకనాడు ఆ మహారాజు క్రూరమృగాలను వేటాడుతూ దట్టమైన అరణ్యం లోనికి ప్రవేశించాడు. ఒక భీకరమైన వనసూకరాన్ని (అడవిపంది) చాలాసేపు వెంటాడిన నందువల్ల కాలాతీతమై, సంధ్యచీకట్లు కమ్ముకున్నాయి. ఆ కీకారణ్యంలో మరే ఆశ్రయము లభ్యం కాకపోవడంతో ఆ రాత్రికి తనను వన్యమృగాల బారినుండి రక్షించు కోవడం కోసం, శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్న ఒక వటవృక్షాన్ని ఆశ్రయించాడు. అంతలో ఒక సింహం అతివేగంగా తరుముకు రావడంతో, తన ప్రాణసంరక్షణార్ధం ఒక భల్లూకం కూడా అదే చెట్టును ఆశ్రయించింది. అలా వటవృక్షం యొక్క ఒక శాఖపై ధర్మగుప్తుడు, దాని ప్రక్కనే ఉన్న మరొక శాఖపై ఎలుగుబంటి కూర్చుని ఉన్నారు. వీరిద్దరినీ వృక్షశాఖలపై కాంచిన సింహం చెట్టు మొదట్లో మాటు వేసింది. దాంతో ధర్మగుప్తుని పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారయింది. చెట్టు పైన ఉన్న తనపై ఎప్పుడైనా భల్లూకం దాడి చేయవచ్చు. క్రిందకు దూకితే తాను సింహానికి బలవ్వడం ఖాయం. ఆ విధంగా, ఏం చేయాలో పాలు పోకుండా సందిగ్ధావస్థలో ఉన్న ధర్మగుప్తుణ్ణి ఉద్దేశిస్తూ ఆ భల్లూకరాజం ధైర్యవచనాలు పలికింది. ఆందోళన వలదని, హాయిగా నిదుర పొమ్మని, ఆ సమయంలో ధర్మగుప్తునికి సింహం నుంచి ఏ హానీ జరగకుండా తాను కాపాడుతానని, మరి కొంతసేపటి తరువాత తాను నిద్రించినప్పుడు ధర్మగుప్తుడు తనను కాపాడాని పలికింది. అలా, ఇద్దరూ ఒక ఒప్పందానికి రావడంతో కొంతసేపు ధర్మగుప్తుడు నిశ్చింతగా విశ్రమించాడు. ఆ సమయంలో క్రింద వేచియున్న కుటిలబుద్ధి గల సింహం ఎలుగుబంటితో, ధర్మగుప్తుణ్ణి క్రిందకు త్రోసి వేయమని, అతనిని భుజించడంతో తన క్షుద్బాధ తీరుతుందని, ఆ విధంగా ఎలుగుబంటి రక్షింపబడుతుందని నమ్మబలికింది. కానీ, ధర్మానికి కట్టుబడ్డ ఎలుగుబంటి, తనను నమ్ముకున్న మహారాజుకు తాను అభయమిచ్చానని, తాను నమ్మకద్రోహం తలపెట్టనని సమాధానమిచ్చింది.


 మరి కొంతసేపటికి ధర్మగుప్తుడు నిద్ర నుండి మేల్కొనడంతో, ఎలుగుబంటి నిద్రకు ఉపక్రమించింది. అలా ఆ భల్లూకం గాఢనిద్రలో ఉన్న సమయంలో సింహం ధర్మగుప్తునితో కూడా అదే విధంగా ప్రస్తావించింది. అంతట ధర్మగుప్తుడు ఏమాత్రం ముందువెనుకలు ఆలోచించకుండా స్వార్థబుద్ధితో, నమ్మకద్రోహానికి ఒడికడుతూ ఎలుగుబంటును క్రిందకు త్రోసివేశాడు. ఈ హఠాత్పరిణామానికి నిద్ర నుండి మేల్కొన్న భల్లూకం క్రిందనున్న మరో చెట్టుకొమ్మ సాయంతో తిరిగి పైకి చేరుకోగలిగింది. స్వార్థమానవుని విశ్వాసఘాతుకానికి గురైన భల్లూకం పట్టరాని కోపంతో, ధర్భగుప్తునికి తన పూర్వజన్మ వృత్తాంతం తెలిపింది.

తాను అటవీమృగాన్ని కానని, 'ధ్యానకాష్ఠ' అనే నామధేయం కలిగిన మునిపుంగవుణ్ణని, మోక్షప్రాప్తికై ధ్యాననిష్ఠలో ఉన్న తనను దర్శించుకునే నిమిత్తం ఎందరో భక్తులు తన చెంతకు చేరేవారని, తనకు తపోభంగం కలుగకుండా ఉండే నిమిత్తం వేర్వేరు రూపాలు ధరించి సాధన చేసుకుంటానని, అందులో భాగంగానే తానీ సమయంలో ఎలుగుబంటి రూపంలో నున్నానని విశద పరిచింది. అంతే గాకుండా, ఆశ్రితులను కాపాడవలసిన మహారాజే నమ్మకద్రోహానికి ఒడిగట్టడంతో అతనిని పరుషమైన పదజాలంతో దుర్భాషలాడుతూ; మానవసహజమైన విచక్షణాజ్ఞానాన్ని విస్మరించి ప్రవర్తించినందున ధర్మగుప్తుడు, ఇకమీదట యుక్తాయుక్త విచక్షణను కోల్పోయి ఉన్మత్తుడై సంచరిస్తాడని శపించింది. ధర్మగుప్తుడు తక్షణం మతిస్థిమితం కోల్పోయాడు.


 ఇలా మతితప్పినవాడై, కేశసంస్కారం లేకుండా, ఆకులు-అలములు భుజిస్తూ, అరణ్యాలలో అలమటిస్తున్న ధర్మగుప్తుడు కొంతకాలానికి తన రాజ్యాన్ని చేరుకుంటాడు. ఆ మహారాజును గుర్తెరిగిన మంత్రులు అతనిని వానప్రస్థాశ్రమంలోనున్న మహారాజు తండ్రిగారైన 'నందుని' వద్దకు చేర్చుతారు. పుత్రుని దీనావస్థకు తీవ్రంగా మనస్తాపం చెందిన నందుడు తన వానప్రస్థాశ్రమాన్ని తాత్కాలికంగా విడనాడి, పుత్రునితో పాటుగా 'జైమినిమహర్షి' ని దర్శించుకొని, తన పుత్రునికి శాపవిముక్తి కలిగించ వలసిందిగా ప్రాధేయ పడతాడు. తన దివ్యదృష్టితో పూర్వాపరాలను అవగతం చేసుకున్న జైమినిమహర్షి, విశ్వాసఘాతుకానికి పాల్పడిన ధర్మగుప్తునికి నిష్కృతి లేదని, వేంకటాచలాని కేతెంచి, స్వామిపుష్కరిణిలో స్నానమాడి శ్రీనివాసుణ్ణి శ్రద్ధాభక్తులతో సేవించుకుంటే శాపవిముక్తుడవుతాడని శాపాంతరాన్ని బోధిస్తాడు.


 జైమినిమహర్షి వాక్కుననుసరించి నందుడు ఉన్మత్తుడైన పుత్రుణ్ణి తోడ్కొని వేంకటాచలాని కేతెంచి, స్వామిపుష్కరిణిలో స్నానమాడి, పుష్కరిణి తటాన సద్ర్భాహ్మణులకు విశేషంగా దానధర్మాలు చేసి, వేంకటాచలపతిని సేవించుకుంటాడు. స్వామిపుష్కరిణి మహిమతో, వేంకటేశ్వరుని కృపాకటాక్షాలతో ధర్మగుప్తుడు శాపవిముక్తుడై, తిరిగి రాజ్యభారాన్ని చేపట్టి, ప్రజారంజకంగా పరిపాలన సాగించాడు.


[ రేపటి భాగంలో... *త్రేతాయుగంలో స్వామి పుష్కరిణి* గురించిన విషయాలు  తెలుసుకుందాం]

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము ద్వితీయాశ్వాసము*


*299 వ రోజు*


*ధర్మరాజు అభిమన్యుని మరణానికి చింతించుట*


ధర్మరాజు తన శిబిరంలో కూర్చుని ఇలా " చింతింస్తున్నాడు. " ద్రోణాచార్య సురక్షితంమైన దుర్భేద్యమైన పద్మవ్యూహం ఛేదించుటకు అభిమన్యుని ఏల పంపవలె. నన్ను సంతోషపెట్టుటకు అభిమన్యుడు ఏల పద్మవ్యూహంలోకి చొరబడవలె. దుశ్శాసనాధి కురుప్రముఖులను ఓడించుట అనేక మంది యోధులను చంపుట పసి బాలునకు సాధ్యమా ? ఇది ఒరులకు ఏల సాధ్యము. అర్జునుడు వచ్చి ఏడీ నా కొడుకు అని అడిగిన నేను ఏమి చెప్పవలె. కృష్ణుడు వచ్చి నా గారాల మేనల్లుడు ఏడీ అని అడిగిన నేను ఏమి చెప్పవలె? అయ్యో ! బాలుడు సుకుమారుడు అయిన అభిమన్యునికి యుద్ధరీతులు ఏమి తెలియును. మహావీరులకే దూర శక్యముకాని పద్మవ్యూహము లోకి నేను ఎందుకు పంపించాను. పెద్దలు పిన్నలకు బహు ప్రియముగా బహుమానము ఇత్తురు నేను యుద్ధమునకు పంపి మరణముకు కారణమయ్యాను. నేను ఎంతటి పాషాండుడను. అభిమన్యునితో నేను పాటు నేను ఎందుకు మరణించ లేదు. పుత్రశోకంతో అలమటించే అర్జుడిని నేను ఎలా ఓదార్చగలను. కాలకేయులను చంపి ఇంద్రుడు అంతటి వాడిని ఆదుకున్న అర్జునుడు కుమారుడు ఇలా పగవారి చేత హతుడుకావలసిన దుర్ధశ దాపురించింది కదా! తన కొడుకును చంపారన్న కోపంతో అర్జునుడు ద్రోణాదులను చంపవచ్చును కాని మరణించిన కుమారుడు రాడు కదా! ఈ భూమిలోని సకల సంపదలు స్వర్గలోక సుఖములు సహితం చిరునవ్వులు చిందించు అభిమన్య ముఖారవిందముకు సాటి రావు కదా ! " అని పరి పరి విధముల విలపిస్తున్నాడు.*


*వ్యాసుని రాక*


అప్పుడు ధర్మరాజు వద్దకు వ్యాసుడు వచ్చాడు. ధర్మరాజు ఆ మహామునికి అర్ఘ్యపాద్యములు సమర్పించి సత్కరించి ఇలా అన్నాడు. " మహానుభావా ! శత్రుసేనలను జయించడానికి నేను అభిమన్యుని పంపాను. అభిమన్యుడు శత్రుసేనలను ఎదుర్కోడానికి పద్మవ్యూహములో జొరపడ్డాడు. వెంటనే మేము కూడా వెళ్ళాము కాని పరమశివుని వరప్రభావంతో సైంధవుడు మమ్ము అడ్డుకున్నాడు. అప్పుడు కౌరవయోధులు పెక్కు మంది అభిమన్యుని చుట్టుముట్టి రకరకములైన ఆయుధములతో అధర్మంగా చంపారు. బాలుని ఒంటరిగా యుద్ధముకు పంపిన నాలాంటి పాపాత్ముడు ఎక్కడైనా ఉంటాడా ! విపరీతమైన దుఃఖంతో నా మనసు ఉడికి పోతుంది నా పాపానికి నిష్కృతి లేదు " అని విలపించాడు. వ్యాసుడు " ధర్మజా ! శోకింపకుము. ఎంతోమంది యోధాను యోధునులను చంపిన అభిమన్యుడు బాలుడా ! శత్రువులు అతడి మీద క్రూరబాణములు వేయక పూలబాణములు వేస్తారా ! తెలివి విపత్తులు కలవారు నీలా శోకించరు. మరణం ఈ లోకంలోని ప్రాణులకు సహజం . గరుడ, ఉరగ, దానవులకే మరణం జయింప శక్యము కానిది. మానవ మాతృలము మనమెంత . విధినిని తప్పించుట ఎవరికి సాధ్యము. కనుక ధైర్యము తెచ్చుకుని కాగల కార్యము గురించి ఆలోచింపుము " అని పలికాడు. మునీంద్రా ! ఈ భూమిని ఏలిన ధైర్యశాలులైన, పరాక్రమవంతులైన రాజులు మహాత్ములు ఒక్కరు కూడా మృత్యుముఖము నుండి తప్పించుకొనుటకు సాధ్యము కాలేదే ఎందుకు " అని అడిగాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు ::

 🕉 108  శ్రీవైష్ణవ దివ్యదేశాలు ::


      81వ దివ్యదేశము 🕉


🙏తిరు ఊరగం (ఊరగథాన్) -

 శ్రీ ఉలగలంత పెరుమాళ్ ఆలయం (  త్రివిక్రమ అవతారం ),

 కాంచీపురం 🙏


🔅 ప్రధాన దైవం: త్రివిక్రముడు(ఉళగన్ద పెరుమాళ్)

🔅ప్రధాన దేవత: అమృతవల్లి త్తాయార్

🔅పుష్కరిణి: నాగతీర్థము

🔅 విమానం: సారశ్రీకర విమానము

🔅ప్రత్యక్షం: ఆదిశేషులకు(ఊరగమ్‌)


🔔స్థలపురాణం 🔔


💠 ప్రహ్లాదుడు మహా భాగవతోత్తముడు . అతని మనుమడు బలి చక్రవర్తియును విష్ణుభక్తి పరాయణుడే . 

ఆ బలి చక్రవర్తి గొప్ప యజ్ఞములు చేసి మహాబలవంతుడై జాతి వైరము స్వర్గలోక వైభవ లోభము , రాజ్యకాంక్షల వలన దేవేంద్రుని స్వర్గలోకముతో సహా సకల భువనములను జయించిన తరువాత శ్రీమహావిష్ణువు వామన రూపమున పోయి బలిచక్రవర్తి నుండి 3 అడుగుల ( పాదముల ) భూమిని దానము అడిగి త్రివిక్రమరూపమున 2 పాదములతో సకల భువనములను గ్రహించి మూడవ పాదమునకు బలిచక్రవర్తి తన శిరస్సును చూపగా అతని శిరస్సుపై పాదము నుంచి పాతాళమునకు పంపి అచ్చట ఉండుము అని చెప్పి అంతమున మోక్షమును పొందెదవు అని అనుగ్రహించెను . 

ఈ పురాణము అందరికీ తెలిసినే కదా ! 


💠ఈ దివ్యదేశము యొక్క పురాణ మేమనగా - మహాబలి చక్రవర్తి శ్రీమన్నారాయణుని ఆ త్రివిక్రమ రూపమును దర్శించ కోరెను . 

అది సాధ్యము కాలేదు . 

అందువలన శ్రీమహావిష్ణువును ధ్యానించి ప్రార్థించగా అనుగ్రహించి ఆదిశేషావతారునిగా ( ఉరగదన్ ) దర్శనమిచ్చెను . 

పెరుమాళ్ త్రివిక్రమ రూపము ప్రక్క ఆదిశేషుని కూడ దర్శించుకొనగలము . ఆవిధముగా ఆదిశేషునికి పెరుమాళ్ త్రివిక్రమ రూప ప్రత్యక్షము నిచ్చినట్లు కూడ నగును .


💠గంభీరమైన శ్రీ ఉలగలంత పెరుమాళ్ విగ్రహం కాంచీపురానికి ప్రత్యేకమైనది మరియు ఈ పరిమాణంలోని భగవంతుడు, ఏ ఇతర దివ్య దేశంలోనూ చూడలేడు


💠ఈ ఆలయం పెద్ద కాంచీపురంలో ఉంది మరియు కామాక్షి అమ్మన్ దేవాలయానికి దగ్గరగా ఉంది. తిరుక్కర్వణం, తిరుకరాగం, తిరుఓరాగం మరియు తిరునీరాగం అనే నాలుగు విభిన్న దివ్యదేశాలను కలిగి ఉన్న ఏకైక దేవాలయ సముదాయం ఇది .

వైష్ణవ దివ్య దేశాలలో ప్రత్యేకమైనది.


💠ఈ దేవాలయంలోని 5 తలల పాము ఆదిశేషుని రూపంలో ఎమ్పెరుమాన్ వ్యక్తమయ్యాడు. 

అతను తిరు ఊరగంలోని ఉలగళాంద పెరుమాళ్ పక్కన ఉన్న ప్రత్యేక సన్నిధిలో కనిపిస్తాడు.

 ఊరగం పామును సూచిస్తుంది మరియు విష్ణువు మహాబలికి సర్పదేవుడిగా దర్శనం ఇచ్చాడు, 

ఈ ప్రాంతాన్ని ఊరగం అని పిలుస్తారు మరియు స్వామిని ఊరగథాన్ అని పిలుస్తారు.


🙏 జై శ్రీమన్నారాయణ 🙏

బలహీనతలను గెలచుట

 *2022*

*కం*

బలహీనతలను గెలచుట

బలముల సద్వ్యయముకన్న ఫలవంతకమౌ.

బలహీనత గుర్తించని

బలముల విలువుండదెపుడు బలముగ సుజనా.

*భావం*:-- ఓ సుజనా! బలహీనతలను గెలవడం మనయొక్క బలములు వినియోగించడం కన్నా ఎక్కువ ఫలితాలనిస్తుంది. బలహీనతలను గుర్తించని బలముల విలువ ఎన్నడూ బలం గా ఉండదు.

*సందేశం*:-- బలహీనతలను జయించకుండా బలములు కూడా బలంగా సహకరించలేవు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

సుభాషితరత్నకోశః

 *🙏జై శ్రీరామ్....శుభోదయం....🌹*


𝕝𝕝 శ్లో 𝕝𝕝 *ఏకో౽పి కృష్ణస్య కృతః ప్రణామః*

*దశాశ్వమేధావభృథేన  తుల్యః ౹*

*దశాశ్వమేధీ పునరేతి జన్మ*

*కృష్ణప్రణామీ న పునర్భవాయ ౹౹*


*𝕝𝕝తా𝕝𝕝 కృష్ణునికి హృదయపూర్వకంగా చేసిన ఒకేఒక నమస్కారం పది అశ్వమేధయాగాలు చేశాక అవభృథస్నానం చేసినంత ఫలితంఇస్తుంది. కానీ? కృష్ణునికి చేసిన నమస్కారంలో ఒకవిశేషం ఉంది. దశాశ్వమేధాలు చేసినవాడు మళ్లీ జన్మిస్తాడు. కానీ?  "కృష్ణునికి నమస్కరించినవాడు మళ్లీ జన్మ ఎత్తడు.*


              ---సుభాషితరత్నకోశః


        *🪷సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🪷*

నీలకంఠేశ్వరా

 నీలకంఠేశ్వరా!   


మ: నిను సేవించిన గల్గు మానవులకున్ వీటీవధూటీఘటీ/

ఘనకోటీ శకటీకటీ తటిపటీ గంధేభవాటీ పటీ/

ర, నటీ, హారిసువర్ణహార మకుటీ ప్రఛ్ఛోటికా పేటికల్/

కనదామ్నాయమహాతురంగ!

శివలింగా! నీలకంఠేశ్వరా!


ఎఱ్ఱాప్రెగ్గడ:-నీలకంఠేశ్వర శతకం.


         కాకతి రాజుల కాలంలో వీరశైవం మహోన్నత స్థితిని అందుకొన్నది. ఆమహా తరుణంలో శివకవులు నలుముఖముల విజృభించి అద్భుతమైన సాహిత్య సృజన చేశారు. నాడు శతకసాహిత్యం ఆవిర్భావ దశలో ఉన్నను మంచి మంచి శతకాలు వెలిశాయి. అందులో నీలకంఠశతకం ఒకటి."ట"కార యమకంతో నాట్యంచేసిన యీపద్యం నాటి కవులకు గల భాషాధికారానికి నిలువుటద్దం!


అర్ధములు: వీటీవధూటీ ఘటీ-వారాంగనా సముదాయము;కోటీ:కోటిధనము;శకటీకటీ- వాహన(బండ్లు)సముదాయము;తటిపటీర:నదీతీరములయందుపెరిగినచందనవృక్షములు;గంధేభవాటీ- మదగజ సముదాయము;పటీర-చందన: నటీ-నాట్యకత్తెలు;హారి-మనోహరమైన; సువర్ణహార-బంగరుహారములు;మకుటీ-కిరీటములు;ప్రఛ్ఛోటికా-పల్లకీలు;పేటికల్- పెట్టెలు; కనత్-ప్రకాశించు; ఆమ్నాయమహాతురంగ-వేదములే గుర్రములైనవాడా!; 


భావము:- ఓనీలకంఠేశ్వరా! వేదాశ్వా! నిను పూజించిన వారికి ఏమికొదవ?వారాంగనా సముదాయములేమి,అనేకకోట్ల ధనమేమి?వాహన సముదాయములేమి? ,చందనవృక్షాదులేమి, మదగజాదులేమి, కర్పూరాది సుగంధద్రవ్యాదులేమి,నట్టువరాండ్రేమి? బంగరు హారాదులేమి.సర్వము సంపన్నమే! నీవు శంకరుడవుగదా! స్వామీ !సదానీసేవాభాగ్యము ననుగ్రహింపుము.


విశేషాంశములు: భోగపుకాంతలు నాటి విలాస జీవనమునకు ప్రతీకలు.


గజాంతమైశ్వర్యం"-అనునది నాటి నానుడి. మదగజములు గలిగినవాడు ధనవంతులలో మేటి.

.చందనము కర్పూరాది సుగంధవస్తుసేవనము నాటిధనికుల జీవనరీతి.


బంగరుగద్దెలు హారములు మంజూషలు వారి అపారమైన ఐశ్వర్యమునకు నిదర్శనములు.


అలంకారం:వృత్యను ప్రాసము

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - మాఘ మాసం - కృష్ణ పక్షం  -  ఉత్తరాషాడ -‌‌ భౌమ వాసరే* (25.02.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.






.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*