23, జులై 2021, శుక్రవారం

మధ్యతరగతి అంతరంగంలో

 *మధ్యతరగతి అంతరంగంలో ఆ #అంతరం అలాగే ఉండిపోయింది!*

🤔🤔🤔🤔🤔🤔🤔🤔


1) *చిన్నప్పుడు రైల్లో ప్రయాణం చేసేటప్పుడు తినడానికి ఇంటినుండి అమ్మ చేసినవి తీసుకెళ్ళేవాళ్ళం, కొంతమంది రైల్లో కొనుక్కుని తినేవాళ్ళని చూసినపుడు మనమూ అలాగే కొనుక్కుని తినాలనిపించేది!* 

అప్పుడు నాన్న చెప్పేవాళ్ళు, అది మన స్థాయికి చేయదగ్గది కాదు, డబ్బులున్న గొప్ప వాళ్ళు చేసేది అని!


ఇప్పుడు పెద్దయ్యాక మనం కొనుక్కుని తినే టైంకి ఆ పెద్ద వాళ్ళు గొప్పవాళ్ళు ఆరోగ్య రీత్యా ఆహారం ఇంటినుండి తెచ్చుకుని తింటున్నారు.


*దాంతో ఆ అంతరం అలాగే ఉండిపోయింది .*


2) *చిన్నప్పుడు కాటన్ దుస్తులు వేసుకుంటే, కొంతమంది టెర్లిన్ బట్టలు తొడుక్కునే వాళ్ళు, అదిచూసి అటువంటివి కావాలనిపించినపుడు, నాన్న చెప్పే వారు అది ఖరీదైనది మనం అంత పెట్టగలిగేవాళ్ళంకాదని!*   


పెద్దయ్యాక మనం టెర్లిన్ వాడటం మొదలు పెడితే వాళ్ళు కాటన్ కు దిగారు ఇప్పుడు, కాటన్ దుస్తుల ధరే ఎక్కువ ! 


*దాంతో ఆ అంతరం అలాగే ఉండిపోయింది ..*😒🤔


⚖⚖⚖⚖⚖⚖⚖


3) *చిన్నప్పుడు ఆడుకుంటూ ఉన్న కాటన్ ప్యాంటుకే మోకాళ్ళ దగ్గర చినిగితే పారేసెందుకు మనసొప్పక అమ్మ లేదా టైలర్ తమ పనితనం చూపి నీట్ గా #రఫ్ చేసి ఇస్తే మళ్ళీ హ్యాపీగా వేసుకునేవాళ్ళం!* 


పెద్దయ్యాక చూస్తే జనం ఆ మోకాళ్ళదగ్గర చిరుగులు ఉన్నవాటిని ఫ్యాషన్ పేరుతో #అధికధరలకు కొంటున్నారు !


*దాంతో ఆ అంతరం అలాగే ఉండిపోయింది ...*🤔😒


⚖⚖⚖⚖⚖⚖⚖⚖


4) *ఓ వయసులో మనకు సైకిల్ కొనగలగడమే కష్టం, అదీ సాధించేసరికి వాళ్ళు స్కూటర్ నడిపించేవాళ్ళు, మనం స్కూటర్ కొనే సమయానికి వాళ్ళు కార్లలో తిరిగేవారు, మనం కొంచెం ఎదిగి మారుతి 800 కొనే సమయానికి వాళ్ళు BMW ల్లో తిరిగారు, మనం రిటైర్మెంట్ వయసుకి వచ్చిన కూడబెట్టుకున్న వాటితో కొంచెం పెద్ద కారు కోనేసమయానికి వాళ్ళు ఆరోగ్యావసరాలతో సైక్లింగ్ చేస్తున్నారు!


*దాంతో ఇప్పటికి ఆ అంతరం

 అలాగే ఉండిపోయింది . .🤔😒*

                        **

ప్రతి దశలో ప్రతి సమయాన విభిన్న మనుషుల మధ్య స్థాయి అంతరం ఉండనే ఉంటుంది.


*"ఆ అంతరం నిరంతరం" ఎప్పటికి ఉండి తీరుతుంది *


రేపటిఆలోచనతో ఇవాళ్టిది వదులుకుని మళ్ళీ రేపటిరోజున గతించిన #ఇవాళ్టి గురించి చింతించేకంటే, ఇవాళ అందినదానితో ఆనందిస్తూ ఆస్వాదిస్తూ రేపటి స్వాగతం పలకడం శ్రేయస్కరం.


*మన, మనవారి గురించి

కాలాన్ని వెచ్చిద్దాం *

💐🌹💐🌹💐🌹💐🌹

🙏☯️🕉️🌞🔱🚩

*మనం నవ్వుతూ ఉందాం*😊

 *జీవితం కూడా సంతోషంగా ఉంటుంది * 😊

త్వమేవాహమ్‌

 *THVAMEVAAHAM త్వమేవాహమ్‌*


కన్నతల్లి కడుపులోంచి బయటపడి......

తొలిసారి ఊపిరిని పీల్చిన క్షణం నుంచి......

పుడమితల్లి కడుపులోకి చేరుకునేందుకు.......

ఆఖరిసారి ఊపిరిని విడిచిపెట్టడం దాకా 

సాగే ప్రస్థానం.......

పేరే......


             *నేను =I*


*ఈ "నేను"* ప్రాణశక్తి అయిన "ఊపిరి"కి మారుపేరు!


*ఊపిరి ఉన్నంతదాకా "నేను"* అనే భావన కొనసాగుతూనే ఉంటుంది....


*జననమరణాల మధ్యకాలంలో* సాగే జీవనస్రవంతిలో ...ఈ 

*"నేను"* ఎన్నెన్నో పోకడలు పోతుంది. మరెన్నో విన్యాసాలూ చేస్తుంది...


*ఈ "నేను"* లోంచే 

*నాది* అనే భావన పుడుతుంది!


*ఈ *నాది* లోంచే....


1.నా వాళ్ళు, 

2.నా భార్య,

3.నా పిల్లలు,

4.నా కుటుంబం,

5.నా ఆస్తి,

6.నా ప్రతిభ, 

7.నా ప్రజ్ఞ, 

8.నా గొప్ప... 


అనేవి పుట్టుకొచ్చి....


చివరికి ఈ *"నేను"* అనే భావన భూమండలాన్ని కూడా మించిపోయి,

ఆకాశపు సరిహద్దును కూడా దాటిపోయి, నిలువెత్తు విశ్వరూపాన్ని దాల్చి *అహం* గా ప్రజ్వరిల్లుతుంది.


              *EGO అహం* 


అనే మాయ పొర కమ్మేసిన స్థితిలో ఈ *”నేను"*, *”నేనే సర్వాంతర్యామిని* అని విర్రవీగుతుంది.


*నాకు ఎదురే లేదని ప్రగల్భాలూ పలుకుతుంది.*


1. పంతాలతో 

2. పట్టింపులతో, 

3. పగలతో, 

4. ప్రతీకారాలతో...... 


తన ప్రత్యర్థిని సర్వనాశనం చేయడానికీ సిద్ధపడుతుంది.


1 .బాల్య, 

2.కౌమార, 

3.యౌవన, 

4.వార్ధక్య,  


దశలదాకా....విస్ఫులింగ తేజంతో విజేతగా నిలిచిన ఈ

*నేను* అనే ప్రభ ఏదో ఒకనాడు మృత్యుస్పర్శతో కుప్పకూలిపోతుంది.


*వందిమాగధులు కైవారం చేసిన శరీరం కట్టెలా మిగులుతుంది.*


 *సుందరీమణులతో మదనోత్సవాలు జరుపుకొన్న దేహం నిస్తేజంగా పడి ఉంటుంది.*


 *సుఖభోగాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగిన ఈ నేను* చుట్టూ చేరిన బంధుమిత్ర సపరివారపు జాలి చూపులకు కేంద్ర బిందువుగా మారుతుంది.


*కడసారి చూపులకోసం, కొన్ని ఘడియలపాటు ఆపి ఉంచిన విగతజీవికి అంతిమయాత్ర మొదలవుతుంది.*


 *మరుభూమిలో చితిమంటల మధ్యే సర్వబంధనాల నుంచీ విముక్తి కలుగుతుంది.*


*మొలకుచుట్టిన ఖరీదైన కౌపీనంతో సహా, మొత్తంగా కాలి బూడిద అవుతుంది.*


*1.నేనే* శాసన కర్తను, 


 *2.నేనే* ఈ సమస్త భూమండలానికి అధిపతిని, 


*3.నేనే* జగజ్జేతను... 


అని మహోన్నతంగా భావించిన ఈ *నేను* 

లేకుండానే మళ్ళీ తెల్లవారుతుంది. - ఎప్పటిలా

రోజు మారుతుంది.


*ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన ఈ ‘నేను’* కథ అలా సమాప్తమవుతుంది.


*అందుకే ఊపిరి ఆగకముందే ఈ “నేను”*

గురించి తెలుసుకో అంటుంది “శ్రీమద్భగవద్గీత”

“SRIMADBHAGAVATH GEETHA”....


*చితిమంటలను చూస్తున్నప్పుడు కలిగేది *శ్మశానవైరాగ్యం* మాత్రమే!


   *అది శాశ్వతం కానే కాదు*


ఈ *నేను* గురించిన సంపూర్ణమైన అవగాహనతో ఉన్నప్పుడే, పరిపూర్ణమైన 

*”వైరాగ్యస్థితి”* అభిలాషికి సాధ్యమవుతుంది.


*వైరాగ్యం* అంటే అన్నీ వదిలేసుకోవడం కానేకాదు. 

*దేనిమీదా మోహాన్ని కలిగి ఉండకపోవడం.తామరాకుమీద నీటి బొట్టులా జీవించ గలగడం*.


*స్వర్గ-నరకాలు ఎక్కడో లేవు. మనలోనే ఉన్నాయి.*


*మనిషి ఆత్మదృష్టి నశించి బాహ్యదృష్టితో జీవించడమే-నరకం*


*అంతర్ముఖుడై నిత్యసత్యమైన ఆత్మదృష్టిని పొందగలగడం-స్వర్గం.*


*ఈ జీవన సత్యాన్ని తెలియచేసేదే-వేదాంతం*.


1. నిజాయితీగా,

2. నిస్వార్థంగా, 

3.సద్ప్రవర్తనతో,

4. సచ్ఛీలతతో, 

5.భగవత్‌ ధ్యానం 


తో జీవించమనేదే

*వేదాంతసారం*.


*అహం బ్రహ్మాస్మి* అంటే 

*అన్నీ నేనే* అనే స్థితి నుంచి

*త్వమేవాహమ్‌* అంటే *నువ్వేనేను* అని 

భగవంతుడి పట్ల చిత్తాన్ని నిలుపుకోగల తాదాత్మ్య స్థితిని చేరుకోగలిగితేనే

*మానవ జన్మకు సార్థకత* 

      🙏 *శుభమ్ భూయాత్*🙏

రుక్మిణి అనే పదానికి ‘ప్రకృతి’

  రుక్మిణి అనే పదానికి ‘ప్రకృతి’ అనేది ఒక అర్థం. ప్రకృతి పురుషుడి ఆలంబన వల్ల, పురుషుడు ప్రకృతి ప్రేరణ వల్ల ఒకరికొకరు రాణిస్తారు. కృష్ణుడు పూర్ణ (పురాణ) పురుషుడు, రుక్మిణి ప్రకృతి. వారు ఒకర్నొకరు చూసుకోకపోయినా గుణాలు వినడం వల్లనే గాఢంగా ప్రేమించుకుని పెళ్ళి చేసుకోవాలనే గాఢవాంఛ కలవారయ్యారు. సాధకుడు భగవంతుణ్ని చేరాలని ఎంత గాఢంగా ప్రయత్నిస్తే అతడి ఇష్టాన్ని కాదనలేక భగవంతుడు అతడికి అంత తొందరగా వశమైపోతాడనేది దీని భావం. జీవులతో పరమాత్మకు గల సంబంధం అంత గాఢమైంది.రుక్మిణి సాధకుడిలోని జీవ చైతన్యానికి సంకేతం. కృష్ణుడు పరమాత్మ తత్వానికి ప్రతీక. జీవతత్త్వం, పరమాత్మ తత్త్వం ఒకదాన్ని మరొకటి విడిచి వేరుగా ఉండనివని, రెండింటికీ అనుసంధానంగా ఉండేది ఒక్క ప్రేమ తత్త్వమేననీ రుక్మిణీ కృష్ణుల పరిణయాసక్తికి అర్థం.


 జీవుడు బ్రహ్మజ్ఞానంతో పరబ్రహ్మ స్వరూపాన్ని ఆరాధిస్తే, ప్రకృతి కల్పించే మాయాబంధం నుంచి తప్పించి, అజ్ఞానానికి వశం కాకుండా కాపాడమని చేసే నిరంతర జ్ఞానసాధనే రుక్మిణి- అగ్నిద్యోతనుడి చేత సందేశం పంపడంలోని అంతరార్థం. ఆ సందర్భంలో ఆమె ‘భువన సుందరా’ అని సంబోధించింది. ఇక్కడ భువనమంటే సకల చరాచర జగత్తు. వాటన్నింటిలో సుందరుడు అంటే ఆనందం కలిగించేవాడు. సహజమైన ఆనందం దూరమైతే అవ్యక్తానందాన్ని అలౌకిక ఆనందాన్ని కలిగించేవాడు భగవంతుడొక్కడే. అందుకే అలా సందేశం పంపింది.

గణిత పదనిసలు....*

 *🌷గణిత పదనిసలు....*


🔅🔅🔅🔥🔥🔥🔅🔅🔅


ఆట విడుపు ....


⭕6 బయట 7 స్తూ కూర్చోకు!


⭕లెక్కలు అర్ధం కాకుంటే 7 పొస్తుంది.


⭕100న రావు ఎలా ఉన్నాడు??


⭕గురువులకు 100 నం చేద్దాం!


⭕1/2 టి కాయ బజ్జీలు బాగా రుచిగా ఉంటాయి.


⭕ఈ రోజు మా కూర 1/2 టి కాయ వేపుడు.


⭕కూరలో కారం తక్కువ 1000.


⭕10 కాలాల పాటు చల్లగా ఉండాలి.


⭕చెడువ్యసనాలతో ఆయువు 3 తుంది.


⭕పెళ్లికూతురు 100000 ణంగా ఉంది.


⭕పై 1/2 లో 1/4 రం ఉన్నది.


గరికపాటి వారి నవ్వులు వెదజల్లే ప్రవచనాల సంకలనం - 

🔅🔅🔅🔥🔥🔥🔅🔅🔅