23, నవంబర్ 2023, గురువారం

Panchaag


 

 🌸 *రామాయణములో మనము తెలుసుకొన వలసిన విషయాలు* 🌸


"""ఉపాయము లేని వాడిని  ఊరి నుండి వెళ్లగొట్టమని"  సామెత.""


అదేమిటి ఉపాయాలు తెలియకపోతే ఉరినుండి వెలి వేసేస్తారా? అంటే  ఉపాయాలు తెలియని వాడు ఊరికి పనికిరాని వాడని అర్థము. ఊరికి ఉపకారము చేయలేని వాడు ఊళ్లో ఉన్నా లేక పోయినా ఊరికేమి లాభము. అందుకే అందరు  వాడిని వెలి వేయడానికైనా సరే సిద్దపడతారు కనుక కనీసము ముఖ్యమైన ఆరు ఉపాయాలన్నా తెలుసుకొమ్మని రామాయణము  మనలని హెచ్చరిస్తున్నది.ఏమిటి ఆ ఆరు ఉపాయాలు.


రామాయణము అరణ్యకాండములో చెప్పబడ్డ ఆరు ఉపాయాలు గమనించుకుందాము.

"" షడ్యుక్తయః"" (ఆరు ఉపాయములు),


""సంధివిగ్రహయానాసన ద్వైధీభావ సమాశ్రయాః.-షడ్యుక్తయః,""


శత్రువులతో ఒడంబడిక చేసుకొనుట సంధి,

రిపు విరోధము విగ్రహము,

అదనుచూసుకొని శత్రువుమీదకి దండెత్తుట యానము,

అనుకూలమైన కాలము కొరకు నిరీక్షించుట ఆసనము,

బలవంతులు బలహీనులైన శత్రువులిద్దరితోను మాటలతో మంచిగా వ్యవహరించుట ద్వైధీభావము,

బలవంతుని ఆశ్రయించుట సమాశ్రయము.


రామలక్ష్మణులు కబంధుని దేహమునకు అగ్నిసంస్కారములు ఒనర్చిన పిమ్మట కబంధుడు దివ్య దేహముతో బయటకు వచ్చి సీతాదేవిని తిరిగి పొందుటకు రామలక్ష్మణులకు  ఈ ఆరు ఉపాయములు చెప్పుతూ వాటి  గురించి ప్రస్తావిస్తూ ఇలా చెప్పాడు.


"" రామా! షడ్యుక్తయో లోకే

    యాభిః సర్వం విమృశ్యతే,

    పరిమృష్టో దశాంతేన 

   దశభాగేన సేవతే."""(72-18),


ఓ రామచంద్రప్రభూ!   లోకములో ఎవ్వరికైనా సరే సర్వ కార్యములు సాధ్యము కావాలంటే ఆరు ఉపాయములు గలవు.అవి పాటిస్తే విజయం ప్రాప్తిస్తుంది. అవే సంధి,విగ్రహము,యానము,ఆసనము,ద్వైధీభావముమరియు సమాశ్రయము ఈ ఆరింటిని ఆకళింపు చేసుకొని""సమాశ్రయము""ద్వారా  (సుగ్రీవుని ఆశ్రయించి) సీతాన్వేషణలో విజయము సాధించమని హితవు చేస్తాడు.


కబందుని సూచనమేరకు రాముడు సుగ్రీవుని కలిసి అగ్నిసాక్షిగా అతనితో మైత్రి సల్పి సమాశ్రయమనే ఉపాయనము ద్వారా సీతామాత ను రావణచెర నుండి విడిపించుకుటాడు.


ఈ కలియుగములో మనందరికి అనుకోకుండగానో, గ్రహపాటువల్లనో అనేకవిధములైన  సమస్యలు ఎదురవుతుంటాయి. ఆ సమయములో సాధకులు అధైర్యపడకుండ రామాయణములో చెప్పబడ్డ ఈ ఆరు ఉపాయములను గుర్తు తెచ్చుకొని వాటిద్వారా లభ్దిపొందగలగటమే రామాయణ పారాయణ మనకి ప్రసాదించే అతి పెద్ వరమని  గ్రహించుకోవాలి.



“””””””””హరయేనమ: శ్రీకృష్ణాయనమ:”””””””””

 మనుషుల్లో మూడు రకాల వాళ్లుంటారు. ఐహిక సుఖం కోరుకునేవారు, పరం చాలనుకునేవారు, ఇహపర సుఖాలు రెండూ కోరుకునేవారు. పరసుఖం అంటే మోక్షం. మోక్షం కావాలని కోరుకున్నా అది అందరికీ ప్రాప్తించదు. ఎన్నేళ్లు సాధన చేసినా, తపస్సు చేసినా ఋషులందరికీ మోక్షం లభించలేదు. అందుకు పూర్వజన్మ సుకృతమూ ఉండాలి. ఈ జీవితంలో చేసే అవిరళ కృషీ ఉండాలి.

భారతీయ దార్శనికక్షేత్రంలో మోక్షం అద్వితీయమైన పరమార్థం. ప్రపంచంలోని ఏ ఇతర ధర్మచింతనలోను కనిపించని ప్రాధాన్యం మోక్షానికి మన సనాతన ధర్మచింతనలోనే గోచరిస్తుంది. దేశంలోని సర్వ సంప్రదాయాల దర్శనమిది. చింతన అనేది అన్ని రకాలైన సత్యాన్వేషణకు పునాది. జీవితంలోని అన్ని లోపాలను సవరించి, దుఃఖాలనుంచి విముక్తి కలిగించే మార్గమే చింతన. అప్పుడే శాశ్వతానందపథం గోచరిస్తుంది. అదే మోక్షం. చతుర్విధ పురుషార్థ ఫలాల్లో మోక్షమే అగ్రేసర స్థానంలో నిలబడి ఉంది. మానవుడి చరమలక్ష్యం మోక్షప్రాప్తి. భారతీయ తత్వదర్శనంలో మోక్షం పరమోత్కృష్ట మూల్యం, సర్వశ్రేష్ఠ పురుషార్థం. దార్శినికులు ఆస్తికులు, నాస్తికులుగా విభిన్న అభిప్రాయాలు కలవారుగా ఉన్నప్పటికీ, భారతీయ సంప్రదాయాలన్నీ ఏకగ్రీవంగా మోక్షాన్నే సమర్థిస్తాయి. జీవితానికి చరమలక్ష్యంగా అంగీకరిస్తాయి. మోక్షం ఆత్మకు సంబంధించింది. నాస్తిక సంప్రదాయాన్ని అనుసరించిన బౌద్ధ దర్శనం కూడా మోక్ష సిద్ధాంతాన్ని నిర్ద్వంద్వంగా సమ్మతించింది. మోక్షానికి బౌద్ధం 'నిర్వాణం' అని పేరు పెట్టింది. అన్ని బంధాలు, దుఃఖాలు తీరిపోవటమే నిర్వాణం. మోక్షేచ్ఛకు నిర్వచనం కూడా దాదాపు అదే. జైనమతమూ మోక్ష సిద్ధాంతాన్నే చరమ లక్ష్యంగా భావిస్తుంది. మోక్షప్రాప్తికి సమ్యక్‌ జ్ఞానం, సమ్యక్‌ దర్శనం, సమ్యక్‌ చరిత్ర ఆవశ్యకమని చెబుతుంది.

  మోక్షం నిరానందస్థితి. ఇది తత్వజ్ఞానం వల్ల లభిస్తుంది. న్యాయ ధర్మ సిద్ధాంతాల అనుసారం తత్వజ్ఞానమంటే ఆత్మను శరీరం, మనసు ఇంద్రియాల నుంచి వేరుగా తెలుసుకోవడం. ఈ జ్ఞానం పఠన, శ్రవణ, మనన, నిధి ధ్యాసలవల్ల కలుగుతుంది. ఇవే మోక్షమార్గాలు. మోక్షం కోరుకునే జాతిలో ఏ అరిష్టమూ, అశుభమూ చోటు చేసుకోలేదు. విశ్వశాంతికి అటువంటి జాతే సర్వదా సహకరిస్తుంది.

   సాంఖ్య-యోగ దర్శనాలను అనుసరించి మోక్షమంటే కైవల్యం. దుఃఖం నుంచి సర్వులకూ విముక్తి కలిగించేది అదే. కైవల్యంలో సుఖం కూడా ఉండదు. అంటే అది శుద్ధచైతన్యావస్థ. ఈ స్థితి జ్ఞానంవల్లనే సిద్ధిస్తుంది. మోక్షసాధనాల్లో సర్వోత్కృమైన సాధనం భక్తే. భక్తి వల్లనే అంతర్యామి అనురాగం, ఆశ్రయం లభిస్తాయి. అద్వైతం జ్ఞానానికి ప్రాధాన్యమిస్తుంది. విశిష్టాద్వైతం భక్తికి ప్రాముఖ్యమిస్తుంది.

   స్థూలంగా మోక్షం అంటే సమర్పణభావం. ఇది అంత సులువు కాదు. అది ఒక పావన భావన. అందులో నిరహంకారం, వినయం, శ్రద్ధ, ప్రేమ, విశ్వాసం నిండుగా ఉండాలి. అత్యంత ప్రియతముణ్ని ఆత్మసమర్పణ చేసుకొమ్మంటాడు వాసుదేవుడు. ఆ ప్రియతముడే అర్జునుడు.

  అత్యంత దుర్లభమైన ఈ మానవ జన్మ లభించాక కూడా మోక్షప్రాప్తికి యత్నించని, తపించని మానవుడు మూఢుడు. జడుడు, మహాపాపి. పాపానికైనా, పుణ్యానికైనా ఈ శరీరం సహకరించాల్సిందే కద! అందుచేత సత్కర్మల కోసమే ఈ శరీరాన్ని స్వస్థతతో కాపాడుకోవాలి. ముక్తి కోసం ధ్యానయోగాల్ని, ధ్యానయోగాల కోసం జ్ఞానాన్ని, జ్ఞానం కోసం ధర్మాన్ని పరిరక్షించుకోవాలి. ధర్మాచరణ కోసం శరీరాన్ని ఆరోగ్యవంతంగా సంరక్షించుకోవాలి. కనుక మోక్షప్రాప్తికి శరీరారోగ్య పరిరక్షణ అత్యావశ్యకం, అనివార్యం.

   'ఇది నాది' అనుకుంటే మనిషి బంధాల్లో చిక్కుకుంటాడు. 'ఇది నాది కాదు' అనుకుంటే మోక్షార్హుడవుతాడు. సాంసారిక వాసనలతో నిండి ఇంద్రియచాపల్యం కలిగించే కర్మలు చేస్తున్న మానవుడికి పరమ తత్వజ్ఞానం అవగాహన కాదు. త్రికరణ శుద్ధిగా పవిత్రుణ్ని చేసే విద్యే విద్య. అటువంటి విద్యనే సాధకుడు హస్తగతం, మనోగతం చేసుకోవాలి. దాన్ని ఆచరణతో సమన్వయపరచుకోవాలి. దాన్ని జీవనలక్ష్యంగా స్వీకరించాలి. అందుకు సద్గురువు సహకారం అనివార్యం. ప్రాణ, మానమోహాలు వీడి, మమతాను బంధాలు త్యజించి, ధర్మవ్రతుడై ఏకాగ్రతతో ప్రణవం జరిపించి, జితేంద్రియుడై, ఐహిక శృంఖలాల నుంచి విముక్తి పొందడమే మోక్షం. అటువంటి మోక్షానికి మనసు దర్పణమై ప్రకాశిస్తుంది. అందులో విశ్వపురుషుడి ప్రతిబింబమే ప్రభాసిస్తుంది. ఆ అలౌకిక దర్శనానుభూతే మోక్షం!

ఋషి భృంగి*

 *కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయంలో ఋషి భృంగి*



 శివపురాణం ప్రకారం, ఋషి భృంగి భగవానుడు శివునికి అత్యంత భక్తుడు, కానీ  పార్వతీమాతను పూజించేవాడు కాదు. తన ఆరాధనలో భాగంగా పరిగణించడానికి నిరాకరించాడు.


 ఋషి బృంగి యొక్క రోజువారీ ఆచారంలో కైలాస పర్వతం వద్ద  శివుని రోజు పూజించేవాడు తన పూజ ముగింపులో అతను ఎల్లప్పుడూ శివుని ప్రదక్షిణ (ప్రదక్షిణ) చేసేవాడు.  పార్వతిదేవిని పూజించేవాడు కాదు. ప్రదక్షిణ చేసేవాడు కాదు. ఒకరోజు ఈ పూజలో భాగం కావాలని పార్వతిమాత శివునికి పక్కనే కూర్చుంది. ఋషి భృంగి దీనిని గమనించి  తనను తాను తేనెటీగగా మార్చుకుని  శివుని చుట్టూ మూడుసార్లు మాత్రమే తిరిగాడు.


పార్వతీదేవి కోపించి, భృంగిలోని తన స్త్రీ శక్తి అంతా లేకుండా పోవాలని శపించింది. రక్తమాంసాలతో కూడిన తన స్త్రీ శక్తిని కోల్పోయి, భృంగి అస్థిపంజర జీవిగా మారిపోయాడు. ఈ కారణంగానే చాలా చిత్రాలలో భృంగి అస్థిపంజరం వలె చిత్రీకరించబడింది. శాపం తర్వాత భృంగి తట్టుకోలేనంత బలహీనంగా తయారయ్యాడు. భృంగి దీనస్థితికి చలించిన శివుడు తను నిలబడటం కోసం  3వ పాదం ఇచ్చాడు. అందుకే భృంగిని ఎల్లప్పుడూ మూడు కాళ్లతో చిత్రీకరిస్తారు.


అయినా భృంగి మారలేదు, భృంగికి గుణపాఠం చెప్పడానికి  పార్వతిదేవి తన నుండి విడదీయరానిది అనే విషయాన్ని  తెలపడం కోసం , శివుడు  అర్ధనారీశ్వర రూపాన్ని ధరించాడు  భృంగి తన రోజువారీ పూజ కోసం కైలాసం వచ్చినప్పుడు . అయితే భృంగి తాను శివుడిని మాత్రమే పూజిస్తానని చాలా దృఢంగా భావించాడు, అతను తనను తాను ఈగగా మార్చుకున్నాడు  అర్ధనారీశ్వరుని మధ్యలో రంధ్రం చేయడం ప్రారంభించాడు, తద్వారా అతను శివ భాగం చుట్టూ మాత్రమే తిరిగాడానికి.


 అతని అచంచల భక్తికి ఆశ్చర్యపోయిన పార్వతి దేవి భృంగి యొక్క మొండితనాన్ని అంగీకరించి అతనిని  ఆశీర్వదించింది.


 హర హర మహాదేవ 🙏

Self service


 

Stitching technique


 

Alipiri anjaneya swami


 

Fall


 

Ride


 

Abusimble temple ezipt


 

Making pure gold


 

శివుడు కార్తీకేయకు చెప్పిన

 🙏🙏నరకం నుండి తప్పించుకోవడానికి శివుడు కార్తీకేయకు చెప్పిన రహస్యాలేంటో తెలుసా..!🙏✍️💯


హిందూ మతంలో అత్యధిక మంది పూజించే దేవుళ్లలో శివుడు ఒకరు. ఈ దేవుడికి భోళా శంకరుడు, అమరేశ్వరస్వామి, దక్షిణామూర్తితో పాటు ఇంకా ఎన్నో రకాల పేర్లతో ఈ దేవుడిని పూజిస్తారు. ఈ స్వామి అనుమతి లేనిదే చీమ అయినా కుట్టదు అని పురాణాల్లో పేర్కొనబడింది. అందరికీ రెండు కళ్లు ఉంటే శివుడికి మాత్రం మూడు కళ్లు ఉంటాయి. కానీ ఆ దేవుడు ఆ కన్నును ఇప్పటివరకు తెరవలేదని పురాణాల ద్వారా తెలిసింది. కానీ ఒకవేళ ఆ కన్ను తెరిస్తే మొత్తం భస్మం అవుతుందని పండితులు చెబుతారు.


ఇక విషయానికొస్తే శివపార్వతీ దేవి చిన్న కుమారుడైన సుబ్రమణ్యం స్వామికి అమర జీవితం యొక్క మోక్షం యొక్క రహస్యాలు చెప్పినట్టు చాలా మందికి తెలియదు. కొద్దిమందికి మాత్రమే తెలుసు. సుబ్రమణ్యం స్వామికి కార్తీకేయ అని, మురుగన్ అనే పేర్లు కూడా ఉన్నాయి. తమిళనాడులో మురుగన్ అని ఆ దేవుడిని కొలుస్తారు. శివుడు తన రెండో కుమారుడు అయిన సుబ్రమణ్యం స్వామికి ఏమేమి రహస్యాలో చెప్పాడో.. ఎందుకు చెప్పాడో ఈ స్టోరీలో తెలుసుకుందాం.


 మోక్షం పొందాలంటే.. ప్రజలు తమ పనులను సక్రమంగా పూర్తిచేస్తే కైలాసానికి వచ్చి మోక్షాన్ని సాధించగలరా అని శివుడిని అడగగా, అప్పుడు శివుడు చెప్పిన విషయం వింటే చాలా మందికి ఆశ్చర్యమేస్తుంది. ఇంతకీ శివుడు ఏమి చెప్పాడంటే స్వచ్ఛమైన భక్తితో పవిత్ర స్థలాలకు వెళ్లే వారంతా మోక్షాన్ని పొందవచ్చని శివుడు చెప్పాడు. పాపాలను కడిగేయాలంటే.. ఏయే ప్రదేశాలు మంచివి. ఏ కోరికలు, ఆలోచనలు స్వచ్ఛమైనవి సుబ్రమ్మణ్యం స్వామి శివుడిని అడిగాడు. ఇందుకు గాను శివుడు బదులిస్తూ ‘‘నదులన్నీ పవిత్ర గంగానదిలో పుట్టుకొచ్చాయి. కాబట్టి ప్రతి నది తీర్థయాత్ర ప్రదేశం మంచిది. ఎవరైనా తమ పాపాలను కడిగేయాలంటే.. మొదట ఈ నదుల నీటిలో స్నానం చేయాలి. లేదా ఈత కొట్టాలి. తర్వాత పవిత్ర త్రిమూర్తుల ఆశ్రయాలను సందర్శించాలి‘‘ అని చెప్పాడు.


 కష్టాల నుండి విముక్తి కావాలంటే.. కష్టాల నుండి విముక్తి కావాలంటే లేదా ఏదైనా తప్పు చేసి ఒప్పుకొన్నప్పుడు కాశీ, అయోధ్య, ద్వారక, మధుర, రామ్ దీర్త్, పుష్కర్ లో బ్రహ్మ, విష్ణు, తన వద్ద లొంగిపోతే వారి పాపాలను క్షమించడానికి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయరు. ఈ ప్రదేశాలను సందర్శించడం వల్ల ప్రపంచంలోని అన్ని కష్టాల నుండి విముక్తి పొందుతారని శివుడు చెప్పాడు. ఇక్కడ తప్పుచేసిన వారంతా తమకు తాము లొంగిపోయి దేవుని ఆశ్రయం పొందవచ్చు. బానిసత్వం నుండి విముక్తి కావాలంటే..


 ఎవరైనా బానిసత్వం నుండి విముక్తి కావాలంటే ఏమి చేయాలని సుబ్రహ్మణ్యస్వామి శివుడిని అడగగా ‘‘ ‘‘గోమతి నది పవిత్ర స్నానం, వారణాసిలో జనన, మరణ చక్రాల్లో స్మరించడం, విశ్వనాథ్ వందనం వంటి వాటిని సందర్శిస్తే బానిసత్వం నుండి విముక్తి లభిస్తుంది‘‘ అని శివుడు చెప్పాడు.


నరకం నుండి తప్పించుకునే మార్గం.. మన పవిత్ర పుస్తకాల్లో చెప్పినట్టుగా, శివుడు మన పూర్వీకులకు నువ్వులు మరియు పవిత్ర నదిపై నీరు ఇస్తే నరకం యొక్క హింస నుండి మనల్ని కాపాడుతుందని శివుడు చెప్పారు. మహాకాళేశ్వర్ ను ఆరాధించడం వల్ల మనిషి చేసి అన్ని పాపాలు తొలగిపోతాయని శివుడు చెప్పాడు.


శ్రీ కృష్ణుడు చెప్పిన రహస్యం.. ఒక వ్యక్తి తన జీవితంలో తీర్థయాత్రలు పూర్తి చేసినప్పుడు, అతను గంగోత్రి మరియు యమునోత్రికి వెళ్లాలి. అక్కడ అతను పవిత్ర జలం తీసుకుని బద్రీనాథ్ కు వెళ్లి లొంగొపోయి, చివరకు కేదారానాథ్ లో ఆశీర్వాదం పొందాలి. కృష్ణుడు చనిపోయే ముందు తీర్థయాత్రకు వెళ్లిన పాండవులకు ఈ రహస్యం చెప్పబడింది.

Electric


 

Multiple genetor


 

సౌందర్యలహరి🌹* . *శ్లోకం - 84*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*

.                   *శ్లోకం - 84*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*శ్రుతీనాం మూర్ధానో దధతి తవ యౌ శేఖరతయా*

*మమాప్యేతౌ మాత శ్శిరసి దయ యా ధేహి చరణౌ |*

*యయోః పాద్యం పాథః పశుపతి జటాజూటతటినీ*

*యయో ర్లాక్షాలక్ష్మీ      రరుణహరిచూడామణిరుచిః ‖*

*శ్రుతిసీమంతసిందూరీకృతపాదాబ్జధూళికా*


 అని లలితా సహస్ర నామములలో ఒకటి. ఇందులో వేదములను స్త్రీమూర్తులుగా చెప్పారు. ఈ ముత్తయిదువులు అమ్మవారి పాదపద్మములకు నమస్కరించినప్పుడు ఆమె యెర్రని నఖములకు కల సింధూర వర్ణము వారి పాపిటకు అంటినదట. అనగా వేదములు ఎల్లప్పుడూ అమ్మవారిని స్తుతిస్తూ  ఆరాధిస్తున్నాయని భావము. వేదములనే ముత్తయిదువుకు శిరస్సు ఉపనిషత్తు వేదాంతము. ఉపనిషత్తులు అమ్మవారిని ఆశ్రయించి పరతత్త్వాన్ని పొందాయట . అందుచేత అమ్మ పాదములను చేరవలెనంటే ఉపనిషత్ విజ్ఞానం ఎంతైనా అవసరం.


ఇప్పుడు శంకరులు ఈ సౌందర్యలహరి శ్లోకములో త్రిమూర్తులు అమ్మవారి పాదములను ఎలా సేవిస్తున్నారో చెప్తున్నారు, పైన చెప్పబడిన నామమునకు అన్వయిస్తూ.


శ్రుతీనాం మూర్ధానో దధతి తవ యౌ శేఖరతయా = వేదములనే యువతులు బయలుదేరి అమ్మవారి పాదములను శిరసుపై ధరించారట . అమ్మవారి పాదములు ఉపనిషత్తులలో చెప్పబడిన పరబ్రహ్మ తత్త్వం. వేదముల శీర్షములు ఉపనిషత్తులు కదా! వేదములు బ్రహ్మ ప్రోక్తములు. ఆ విధముగా ఆయన అమ్మవారికి నమస్కరిస్తున్నాడు.


యయోః పాద్యం పాథః పశుపతిజటాజూటతటినీ = మరి ఆ పాదముల పాద్యము ఏది? పరమేశ్వరుని జటాజూటములోని గంగా జలము. ఆమెకు నమస్కరించటానికి శివుడు కొద్దిగా వంగినప్పుడు ఆ గంగాజలం ఆమె పాదములను కడిగింది. 

పరమాచార్య స్వామి వారు చమత్కరించారు. శివునికీ పార్వతీదేవికి ప్రణయకలహము కలిగినపుడు ఆయన కొద్దిగా వంగి జటాజూటములోని గంగాజలంతో ఆమె పాదములను తడిపి ఆమెను ఉపశమింపజేసాడు అని.


యయో ర్లాక్షాలక్ష్మీ            రరుణహరిచూడామణి రుచిః = మరి పారాణి శోభ ఏమిటి? (లాక్షా లక్ష్మీ) నారాయణుడు అమ్మవారి పాదాలపై శిరసునుంచినప్పుడు ఆయన కిరీటంలోని చూడామణి కాంతి అమ్మవారి పారాణిగా ప్రకాశిస్తున్నదని. ఈ విధంగా త్రిమూర్తులు అమ్మవారి పాదములను ఆశ్రయించుకొని సృష్టి స్థితి లయ నిర్వహణను చేస్తున్నారు.


మమాప్యేతౌ మాత శ్శిరసి దయయా ధేహి చరణౌ = అట్టి మహిమాన్వితమైన నీ పాదములను దయయుంచి నా శిరస్సు పైన కూడా ఉంచు తల్లీ అంటున్నారు ఆచార్యులవారు.


అమ్మవారి పాదములు సహస్రారం పైన ఉంటే శరీరమంతా శక్తిపాతం జరిగి అమృతమయమవుతుంది. అలాగే ఉపనిషత్ జ్ఞానాన్ని సముపార్జిస్తే పరబ్రహ్మ తత్త్వం యెరిగి పరమాత్మలో లీనమవుతాడు జీవుడు. సద్గురువులు, బ్రహ్మజ్ఞానోపదేశమునకు అర్హుడైన శిష్యునికి, అతడి శిరసుపై పాదం ఉంచి దీక్షనిస్తారు. అందువల్ల శిష్యుని సహస్రార పద్మము ద్వారా గురువు యొక్క జ్ఞానామృత ధార ప్రసరిస్తుంది.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


తండ్రికి పుట్టిన తనయుడు మాంధాత

-

యౌవనాశ్వుడికి చాలాకాలం వరకు సంతానం కలగలేదు. నూరుమందిని వివాహమాడాడు.

అయివా ఒక్క కడుపు పండలేదు. రోజూ అతడిని ఇదే దిగులు కుంగదీసింది. అరణ్యాలకు వెళ్ళి

ఋషులను ఆశ్రయించాడు. నిట్టూ స్పలు విడుస్తూ విలపించాడు. ఋషులు ఓదార్చి శోకకారణం అడిగి

తెలుసుకున్నారు. మాకు చేతనైతే ఉపకారం చేస్తాం, చెప్పు అన్నారు.

మహర్షులారా! నాకు రాజ్యం ఉంది. సంపద ఉంది. గుర్రాలు ఉన్నాయి. నూర్గురు

భార్యలున్నారు. నాకంటే బలశాలి లేడు. శత్రువులు లేరు. మంత్రిసామంతులంతా విధేయులే. అన్నీ

బాగానే ఉన్నాయి. కానీ ఒకే ఒక్కలోటు. మాకు సంతానం లేదు. ఒక్క బిడ్డడైనా లేడు. అపుత్రుడికి

ఉత్తమగతులు లేవంటారు. స్వర్గం అసలే లేదంటారు. అందుకని దుఃఖిస్తున్నాను. సంతానం కావాలి.


అపుత్రస్య గతిరాస్తి స్వర్గం నైవ చ నైవ చ |

తస్మాత్ శోచామి విప్రేంద్రాః సంతానార్థం భృశం తతః

(9-52)

మీరందరూ వేదశాస్త్ర తత్త్వజ్ఞులు. మహాతపస్వులు. సంతానార్ధనైన నాకు ఏదైనా ఇష్ట

(యజ్ఞం) చెప్పండి. నాతో చేయించండి. మీరు దయాస్వభావులు. కనక అభ్యర్థిస్తున్నాను అవి

వేడుకున్నాడు యౌవనాశ్వుడు.

దీనికి ఇంత దుఃఖపడవలసింది ఏముంది ? అలాగే చేయిస్తామంటూ ఇంద్రదేవతాకమైన

ఇష్టిని చేయించారు. జలపూర్ణకలశాన్ని వేదోక్తులతో అభిమంత్రించారు. మరుసటి ఉదయం ఆ ఉదకాన్ని

రాజపత్నులకు ఇవ్వాలని సంకల్పించారు. కానీ ఆ రోజు అర్ధరాత్రి యౌవనాశ్వుడు దప్పిక తట్టుకోలేక

యాగశాలలో ప్రవేశించి, నిద్రపోతున్న విప్రులను లేపడమెందుకులే అని ఆ కలశంలో నిండా ఉన్న

ఉదకాన్ని తెలియక తాను పుచ్చేసుకున్నాడు. వెళ్ళి తన గుడారంలో పడుకొన్నాడు.

తెల్లవారుతూనే ఖాళీగా ఉన్న కలశాన్ని చూసి విప్రులు ఆశ్చర్యపోయి ఇందులో జలం ఎవరు

త్రాగేరని రాజును ప్రశ్నించారు. నేనే త్రాగేనని యౌవనాశ్వుడు చెబితే దైవయోగం ఇలా ఉంది కాబోలువని

విప్రులు సరిపుచ్చుకుని ఇష్టిని సమాప్తం చేశారు. ఎవరి ఆశ్రమాలకు వారు వెళ్ళిపోయారు.

మంత్రోదకం కారణంగా రాజుగారు గర్భం ధరించాడు. నెలలు నిండాయి. పొట్ట కుడివైపు

చీల్చుకుని మగబిడ్డ జన్మించాడు. అయితే అదృష్టం బాగుండి రాజుగారు మరణించలేదు

శ్రీసత్యసాయి

 *ॐ                   శ్రీ సాయిరాం* 



    *శ్రీసత్యసాయి జయంతి శుభాకాంక్షలు* 


       *శ్రీసత్యసాయి అవతారపురుష లక్ష్యం* 


*1. మాయ అంటని స్వచ్ఛ సమాజంగా మార్పు* 

                *( జలగ - పంకజం )* 


    పద్మం,జలగ రెండూ బురదనుంచీ పుట్టేవే!

    కానీ పద్మం తనని భక్తులు కోసి, భగవంతుని పాదపద్మాల వద్ద పూజిస్తే, భక్తుల ఆనందానికి భగవత్పాదాల వద్ద తన జీవితాన్ని చాలిస్తుంది.

    జలగ ఇతరుల రక్తాన్ని పీల్చి బాధపెడుతుంది.

   మానవులు అందరూ ఒకేలాగా జన్మించినా, "పరోపకారాయమిదం శరీరం" అని సేవాభావంతో త్యాగం  చేసే పద్మాలు కొన్ని.

    రాక్షసత్వంతో ఇతరులని పీడించే జలగలు కొన్ని.


    కలియుగంలో, మాయ అనే బురద తొలగించి, 

    మనలోనే ఉన్న "జలగ మనస్తత్వం" అనే రాక్షసత్వాన్ని సంహరించి, 

    పంకం అంటని పంకజాలుగా మార్చి, సంస్కరించడానికి, "ప్రేమ తత్వంతో" వచ్చిన అవతారపురుషుడు " శ్రీ సత్యసాయి".


*2. మానవజన్మ లక్షణాలను ఎఱుకపరచడం* 

                    *( కాకి - కోకిల )* 


    కోకిల గుడ్లు కాకి తన గూట్లో పొదుగుతుంది. 

    కోకిల పిల్లలు చూడడానికి కాకి పిల్లలలాగానే ఉంటాయి.

    తన పిల్లలే అనుకుని, ఆహారం కూడా తీసికొనివచ్చి కోకిల పిల్లలని పోషిస్తుంది.

    అవి కూడా ఆ ఆహారాన్నే తింటాయి. కాకి అరుపులే వింటాయి. 

    కానీ ఎగిరె శక్తి వచ్చేటప్పటికి, ఆ కోకిల పిల్లలు, 

    కాకి అరుపుతో కాక, తన కోకిల జాతి కూత -  "కుహు కుహూ" అని కూస్తూ ఎగిరిపోతాయి.

    అట్లే పెరిగే పరిసరాలూ ఎటువంటివైనా, ఎదిగి కార్యరంగంలోకి వచ్చినప్పుడుమాత్రం, 

    మొహమాటం లేకుండా మానవులుగా "సత్యధర్మాలు" ఆచరించే మానవులు కోకిలల వంటివారు.


    మన జీవితాలలో ఆ ఎరుక తెప్పించి, 

    దుష్టసావాసంలో మునిగిపోక, 

    మానవత్వం తెలియజెప్పేందుకు వచ్చిన అవతార పురుషుడే "శ్రీసత్య సాయి".


*3. దైవత్వంగా పదోన్నతి కల్పించడం* 

              *( కీటకం - భ్రమరం )* 


    కీటకం మరణిస్తే, తుమ్మెద దాని దగ్గరకి వచ్చి ఆగకుండా  "ఝంకారం" చేస్తూంటుంది.

    అది చేసే ధ్వనికి, ఆ పురుగు జీవం పొంది, కొంత సమయానికి రూపం కూడా మారి, భ్రమరం(తుమ్మెద)గా మారుతుంది.

    దీన్ని "భ్రమరకీటక" న్యాయం అంటారు. ఇక్కడ కీటకం భ్రమర రూపం పొందుతుంది.


    *జీవచ్ఛవాలుగా ఉన్న దీనులకి  సేవచేయిస్తూ, వారిని ఉద్ధరించడానికి ఒక ప్రక్క,* 

    *మఱొకప్రక్క, వారి అజ్ఞానాంధకారాన్ని తొలగించి, వారిలోని దైవశక్తిని తెలిపి,*

    *జ్ఞాన వెలుగు గల తుమ్మెదలుగా పదోన్నతి కల్పించేదే* 

        *- "సర్వప్రాణపతి"గా భక్తులు ప్రార్థించే - సద్గురువు "శ్రీసత్యసాయి"* 


                    =x=x=x=


    — రామాయణం శర్మ

             భద్రాచలం

కార్తిక పురాణము - 11*

 *కార్తిక పురాణము - 11*

🪷🪷🪷🪷🪷🪷🪷🪷

*కార్తిక పురాణము - పదకొండవ అధ్యాయము*


రాజోత్తమా! తిరిగి చెప్పెదను వినుము.కార్తీకమాసమందు అవిసె పువ్వుతో హరిని పూజించిన వాని పాపములు నశించును.చాంద్రాయణ వ్రత ఫలము పొందును. కార్తీకమాసమందు గరికతోను, కుశలతోను హరిని పూజించువాడు పాపవిముక్తుడై వైకుంఠమును చేరును.


కార్తీకమాసమందు చిత్రమైనరంగులతో గూడిన వస్త్రములను హరికి సమర్పించినవాడు మోక్షమునొందును.కార్తీకమాసమందు స్నానమాచరించి హరిసన్నిధిలో దీపమాలలను ఉంచువాడును, పురాణమును చెప్పువాడును, పురాణమును వినువాడును పాపములన్నియును నశింపజేసుకొని పరమపదమును పొందుదురు. ఈవిషయమై ఒక పూర్వకథగలదు. అది విన్నమాత్రముననే పాపములు పోవును. ఆయురారోగ్యములను ఇచ్చును. దానిని చెప్పెద వినుము.


కళింగదేశమందు మందరుడను ఒక బ్రాహ్మణుడు గలడు. అతడు స్నాన సంధ్యావందనాదులను విడిచి పెట్టినవాడై ఇతరులకు కూలి చేయుచుండెడివాడు. అతనికి మంచిగుణములు గలిగి సుశీలయను పేరుగల భార్య ఉండెను.ఆమె పతివ్రతయు, సమస్త సాముద్రిక లక్షణములతో గూడినదై ఆడవారిలో శ్రేష్ఠురాలై ఉండెను.


ఓ రాజా! ఆ సుశీల భర్త దుర్గుణ పూర్ణుడైనను అతనియందు ద్వేషము ఉంచక సేవించుచుండెను.తరువాత వాడు వేరైన జీవనోపాయము తెలియక కూలిజీవనము కష్టమని తలచి కత్తిని ధరించి అడవిలో మార్గము కనిపెట్టుకొని ఉండి దారి నడుచువారిని కొట్టి వారి ధనములను అపహరించుచు కొంతకాలమును గడిపెను.అట్లు చౌర్యమువలన సంపాదించిన వస్తువులను ఇతర దేశములకు పోయి అమ్ముకొని ఆ ధనముతో కుటుంబమును పోషించుచుండెను.


ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు చౌర్యముకొరకు మార్గమును కనిపెట్టియుండి మార్గమునవచ్చునొక బ్రాహ్మణుని పట్టుకొని మర్రిచెట్టుకు కట్టి అతని సొమ్మంతయును అంతా హరించెను.ఇంతలోనే క్రూరుడైన కిరాతుడొకడు వచ్చి ఆ ఇద్దరు బ్రాహ్మణులను చంపి ఆ ధనమంతయు తాను హరించెను.


తరువాత గుహలోనున్న పెద్దపులి కిరాత మనుష్య గంథమును ఆఘ్రాణించి వచ్చి వానిని కొట్టెను.కిరాతుడును కత్తితో పులిని కొట్టెను.ఇట్లు ఇద్దరును పరస్పర ప్రహారములచేత ఒక్కమారే చనిపోయిరి.


ఇట్లు ఇద్దరు బ్రాహ్మణులు, పులి, కిరాతుడు నలుగురు ఒక చోట మృతినొంది యమలోకమునకు బోయి కాలసూత్ర నరకమందు యాతన బడిరి.


యమభటులు వారినందరిని పురుగులతోను, అమేధ్యముతోను కూడినటువంటి భయంకరమైన చీకటిలో సలసలకాగుచున్న రక్తమందు బడవైచిరి.


జనకమహారాజా! ఆ బ్రాహ్మణుని భార్య సమస్త ధర్మములను ఆచారవంతురాలై హరిభక్తియుతయై సజ్జన సహవాసమును చేయుచు నిరంతరము భర్తను ధ్యానించుచుండెను.


ఓరాజా! ఇట్లుండగా దైవవశము చేత ఒక యతీశ్వరుడు హరినామము చేయుచు నాట్యము చేయుచు పులకాంకిత శరీరుడై హరినామామృతమును పానము చేయుచు, సమస్త వస్తువులందు హరిని దర్శించుచు, ఆనంద భాష్పయుతుడై ఆమె ఇంటికి వచ్చెను.


ఆమెయు ఆ యతిని జూచి భిక్షమిడి అయ్యా యతిపుంగవా! మీరు మా ఇంటికి వచ్చుట చేత నేను తరించితిని.మీవంటివారి దర్శనము దుర్లభము. మాయింటివద్ద నా భర్త లేడు. నేనొక్కదాననే పతిధ్యానమును చేయుచున్నదానను.


ఆమె ఇట్లు చెప్పగా విని యతీశ్వరుడు ప్రియభాషిణియు శ్యామయునయిన ఆమెతో అమ్మాయీ! ఈరోజు కార్తీక పూర్ణిమ మహాపర్వము. ఈదిన సాయంకాలము హరిసన్నిధిలో మె ఐంటిలో పురాణ పఠనము జరుపవలెను.ఆ పురాణమునకు దీపము కావలెను. నూనె తెచ్చెదను.గనుక వత్తి నీవు చేసి ఇమ్ము. శ్యామయనగా యౌవనవతియని అర్థము.


యతీశ్వరుడిట్లు చెప్పగా ఆ చిన్నది విని సంతోషముతో గోమయముతెచ్చి ఆ ఇల్లు చక్కగా అలికినదై, అందు అయిదురంగులతో ముగ్గులను పెట్టి, పిమ్మట దూదిని పరిశుద్ధము చేసినదై, ఆ దూదిచే రెండు వత్తులను చేసి నూనెతో యతీశ్వరుని వద్ద వెలిగించి స్వామికి సమర్పించెను.


ఆ చిన్నది దీపపాత్రను, వత్తిని తాను ఇచ్చినందుకు యతీశ్వరుడు చాలా సంతోషించి దీపమును వెలిగించెను.యతియు ఆ దీపమునందు హరిని పూజించి మనశ్శుద్ధి కొరకై పురాణపఠనము ప్రారంభించెను.ఆమెయు ప్రతి ఇంటికి పోయి పురాణశ్రవణమునకు రండని చాలామందిని పిలుచుకుని వచ్చి వారితో సహా ఏకాగ్రమనస్సుతో పురాణమును వినెను.


తరువాత యతీశ్వరుడు యధేచ్ఛగా పోయెను.కొంతకాలమునకు హరిధ్యానము చేత జ్ఞానమును సంపాదించుకొని ఆమె మృతినొందెను.అంతలో శంఖచక్రాంకితులును, చతుర్బాహులును, పద్మాక్షులును, పీతాంబరధారులునునైన విష్ణుదూతలు దేవతల తోటలోనున్న పుష్పములతోను, ముత్యాలతోను, పగడములతోను, రచించిన మాలికలతోను, వస్త్రములతోను, ఆభరణములతోను అలంకరించబడిన విమానమును దీసికొని క్వచ్చి సూర్యుడువలె ప్రకాశించెడి ఆ విమానమందు ఆమెను ఎక్కించి జయజయధ్వనులతో కరతాళములు చేయుచు చాలామంది వెంటరాగా వైకుంఠలోకమునకు చేరెను.


ఆమె వైకుంఠమునకు పోవుచు మధ్యమార్గమందు నరకమును జూచి, అచ్చట తన పతి నరకమునందు ఉండుటకు ఆశ్చర్యమొంది విష్ణుదూతలతోనిట్లు పలికెను.


ఓ విష్ణుదూతలారా! నిమిషమాత్రము ఉండండి.ఈ నరకకూపమునందు నా భర్త ముగ్గురితో పడియుండుటకు కారణమేమి?ఈవిషయమును నాకు చెప్పుడు.


వీడు నీభర్త, వీడు కూలిచేసియు, దొంగతనమును చేసియు పరధనాపహరణము చేసినాడు.వేదోక్తమయిన ఆచారమును వదలి దుర్మార్గమందు చేరినాడు. అందువల్ల వీడు నరకమందున్నాడు.ఈ రెండవ బ్రాహ్మణుడు మిత్రద్రోహి, మహాపాతకుడు, ఇతడు బాల్యమునుండి మిత్రుడైయున్న వాని నొకనిని చంపి వాని ధనము అపహరించి ఇతరదేశమునకు బోవుచున్నంతలో నీభర్తచేత హతుడాయెను.అట్టి పాపాత్ముడు గనుక ఇతడు నరకమందు బడియున్నాడు. ఈమూడవవాడు కిరాతుడు.వీడు నీభర్తను ఈ బ్రాహ్మణుని ఇద్దరిని చంపినాడు. అందుచేత వీడు నరకమందుండెను.ఈ నాల్గవవాడు, పులి, కిరాతులు పరస్పర ఘాతములచేత మృతినొందిరి.


ఈ పులి పూర్వమందు ద్రావిడ బ్రాహ్మణుడు.ఇతడు ద్వాదశినాడు భక్ష్యాభక్ష్య విచారణ చేయక నూనెతో చేసిన వంటకములను భుజించినాడు.అందుచేత వీడు నరకమందున్నాడు.ఇట్లు నలుగురు నరకమందు యాతనలనొందుచున్నారు.ద్వాదశినాడు నేయి వాడవలెను.నూనె వాడకూడదు.


విష్ణుదూతలిట్లు చెప్పగా విని ఆమె అయ్యలారా! ఏపుణ్యము చేత వీరు నరకమునుండి ముక్తులగుదురని యడిగెను.ఆమాటవిని దూతలిట్లనిరి. అమ్మా! కార్తీకమాసమందు నీ చేత చేయబడిన పుణ్యమందు పురాణ శ్రవణఫలమును నీభర్తకిమ్ము. దానితో వాడు విముక్తుడగును.


ఆ పురాణశ్రవణార్థమై దీపమునకు నీవు సమర్పించిన వర్తి పుణ్యమును ఈ కిరాతవ్యాఘ్రములకు సమానముగా ఇమ్ము. దానివలన వారు ముక్తులగుదురు. పురాణశ్రవణార్థమై నీవు ప్రతిగృహమునకు వెళ్ళి ప్రజలను బిలిచిన పుణ్యమును ఈకృతఘ్నునకు ఇమ్ము. దానితో వాడు ముక్తుడగును. ఇట్లు ఆయా పుణ్యదానములచేత వారు వారు ముక్తులగుదురు.


విష్ణుదూతల మాటలు విని ఆశ్చర్యమొంది బ్రాహ్మణస్త్రీ ఆయా పుణ్యములను వారి వారికిచ్చెను.దానిచేత వారు నరకమునుండి విడుదలయై దివ్యమానములను ఎక్కి ఆ స్త్రీని కొనియాడుచు మహాజ్ఞానులు పొందెడి ముక్తిపదమును గూర్చి వెళ్ళిరి.


కార్తీకమాసమందు పురాణశ్రవణమును చేయువాడు హరిలోకమందుండును. ఈ చరిత్రను వినువారు మనోవాక్కాయముల చేత సంపాదించబడిన పాపమును నశింపచేసుకొని మోక్షమును పొందుదురు.


*ఇతి శ్రీస్కాందపురాణే కార్తీకమహాత్మ్యే ఏకాదశోధ్యాసమాప్తః*

Stitching techniques


 

Striching technique


 

ఆశ్రమ స్థలానికి తరలి వెళ్ళటం

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*ఆశ్రమ స్థలానికి తరలి వెళ్ళటం..*


*(ముప్పై ఆరవ రోజు)*


శ్రీ స్వామివారు ప్రతిరోజూ చెపుతున్న ఉపదేశాలకు.. ఆధ్యాత్మిక విషయాలకు ముగ్ధులైన శ్రీధరరావు ప్రభావతి గార్లు..ఆశ్రమ నిర్మాణం పూర్తయ్యేవరకూ శ్రీ స్వామివారు తమ ఇంట్లోనే ఉండిపోతారని భావించారు..కానీ దైవ సంకల్పం వేరొక విధంగా ఉంటుందని వారికి తెలిసిరాలేదు..


శ్రీ స్వామివారు..ఆ దంపతుల ఇంటికొచ్చిన ఇరువైఒకటో రోజు సాయంత్రం నుంచీ రాత్రి పొద్దుపోయేదాకా వివిధ అంశాలమీద ఉపదేశం చేసి, తన బసకు వెళ్లిపోయారు..ఆ సంగతులే ముచ్చటించుకుంటూ...శ్రీధరరావు దంపతులు నిద్రకుపక్రమించారు..


 అర్ధరాత్రి దాటిన తరువాత గాఢ నిద్రలో ఉన్న ప్రభావతి గారికి , "అమ్మా!..అమ్మా!.." అన్న పిలుపు వినబడింది..ముందు కలలో ఏదన్నా ఆలాపన లాగా వచ్చిందేమో అని భ్రమ పడిన ప్రభావతి గారికి..మరలా అదే పిలుపు కొంచెం గట్టిగా.."అమ్మా!..తలుపు తియ్యండి.." అంటూ వినపడింది..ఈలోపల శ్రీధరరావు గారూ ఈ అలికిడికి లేచారు..ముందుగా తేరుకున్న శ్రీధరరావు గారు ఒక్క ఉదుటున లేచి తలుపు తీసారు..అవతలి గదిలో ఉన్న సత్యనారాయణమ్మ గారు కూడా మెల్లిగా లేచి వరండాలోకి వచ్చారు..


ఎదురుగ్గా శ్రీ స్వామివారు..వరండా లో వ్రేలాడుతున్న  లాంతరు తాలూకు వెలుతురులో..తేజోపుంజం లాగా  నిలుచుని వున్నారు..స్వచ్ఛమైన నవ్వు ముఖంతో చూస్తూ వున్నారు..


"ఏం నాయనా?..ఏమైనా కావాలా?.."అన్నారు ప్రభావతిగారు..


"అమ్మా!..ఈశ్వరాజ్ఞ అయింది..ఇక ఇక్కడ వుండనమ్మా..త్వరగా బండి సిద్ధం చేయండి..నేను ఆ ఆశ్రమ స్థలానికి వెళ్లిపోవాలి..అక్కడే వుంటాను!.." అన్నారు శ్రీ స్వామివారు అదే చిరునవ్వుతో..


శ్రీధరరావు గారు ప్రభావతి గార్లు ముఖాముఖాలు చూసుకున్నారు..


"అదేమిటి స్వామీ..అక్కడ కేవలం స్థలం చదును చేసారే గానీ..కనీసం పునాదులు కూడా తీయలేదు..గోడలు కట్టి, పై కప్పు పడితే గదా మీరు ఉండడానికి అనువుగా ఉండేది..ఇప్పటికిప్పుడు ఎలా తయారవుతుంది?..ఈ చలి కాలంలో ఆ నిర్జన ప్రదేశంలో ఎలా ఉంటారు?.." అన్నారు శ్రీధరరావు గారు ఆతృతగా..


"నాయనా!..ఇప్పుడేం తొందర వచ్చిందని ఈ నిర్ణయం?..మందిర నిర్మాణం పూర్తయ్యేవరకూ ఇక్కడే ఉండొచ్చు కదా?.." అన్నారు ప్రభావతి గారు ఆందోళనగా..


"లేదమ్మా..ఇక ఆలస్యం చేయకూడదు..అది ఈశ్వరాజ్ఞ తల్లీ..నేను ఆ ఆజ్ఞ ను మీరి పోకూడదు!..ఇప్పుడే వెళ్లిపోవాలి..మీకు బండి సిద్ధం చేయడం కుదరదంటే.. నేను నడచి వెళ్లిపోతాను..నడక నాకు అలవాటే కదమ్మా.." అన్నారు శ్రీ స్వామివారు..


"కనీసం రేపు సాయంత్రం వరకూ వుండండి.. అక్కడ చిన్న పాక లాగా వేయిస్తాను..చుట్టూరా తాటాకు దడి లాగా ఏర్పాటుచేయిస్తాను..కొద్దిగా ఓపిక పట్టండి.."అన్నారు శ్రీధరరావు గారు..నిజానికి ఆయనకు లోలోపల కొద్దిగా చిరాకుగా ఉంది..అర్ధరాత్రి సమయంలో ఈ వ్యవహారమేమిటని ఆయన ఆలోచన!..


"శ్రీధరరావు గారూ..నేనిప్పుడు వెళ్లిపోవాలి..వెళతాను కూడా..మీరనుకునే ఆ పాక ఏదో రేపుదయం వేయించండి.." ఈసారి శ్రీ స్వామివారి కంఠం లో ఒక విధమైన తీవ్రత వినిపించింది..


ప్రభావతి గారు ఇక ఉండబట్టలేకపోయారు..స్ర్రీ సహజమైన ఆవేశం తన్నుకొచ్చింది ఆవిడ స్వరం లో..

"నాయనా!..మేము చేస్తున్న ఉపచారాలలో నీ కేదైనా లోటు కనిపించిందా?..అపచారం ఏదైనా జరిగిందా?..లేక అజ్ఞానం తో అడగరాని ప్రశ్నలు వేసి విసిగిస్తున్నామా?..మేము అత్యంత పవిత్రంగా భావించే ఈ ఇంట్లో..నీకేదైనా అపరిశుభ్రత గోచరించిందా?..ఒక్కపూట కూడా వుండలేనంత ఇబ్బంది ఏం జరిగింది నాయనా!..నా మనసుకు కష్టంగా ఉంది!.." అన్నారు..


"ఎంత పిచ్చి తల్లివమ్మా నువ్వు!.." అన్నారు శ్రీ స్వామివారు..ఆ క్షణంలో ఆయన ముఖంలో కరుణ జాలువారుతున్నది..  "మీ ఇంట్లో నాకు ఎటువంటి అసౌకర్యమూ లేదు..నాకు అపచారమూ జరుగలేదు..అపవిత్రత అన్న మాటే లేదు!..నేను చెపుతున్నది ఈశ్వరాజ్ఞ గురించి..నేను మాలకొండ నుంచి ఇక్కడకు బయలుదేరే సమయంలో..అక్కడే కొద్దికాలం  వుండమన్నారు..కుదరదన్నాను..ఎందుకు?.. అదికూడా ఆరోజు ఆ ఈశ్వరుడి ఆదేశానుసారమే.. ఈరోజు మీ ఇంట్లో వుండమంటున్నారు.. ఈరోజు కూడా ఉండలేను..వుండబోను..ఇది కూడా ఈశ్వరుడి ఆదేశమే!..గృహస్తుల వద్ద ఎక్కువ కాలం మా లాంటి యోగులు ఉండరాదు..ఉండము కూడా..అది నియమం!..నన్ను వెళ్లనివ్వండి.." అన్నారు..


శ్రీ స్వామివారి వివరణ..ఫకీరు మాన్యం లో బస..రేపటి భాగంలో..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్.. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

దేవతల రోజు

 ॐ       ఉత్థాన ఏకాదశి శుభాకాంక్షలు 


దేవతల రోజు 


    సూర్యుడు 

  - మకరరాశిలోకి ప్రవేశించే "మకర సంక్రాంతి" ఉత్తరాయణంతో దేవతల పగలు ప్రారంభం.

  - కర్కాటకరాశిలోకి ప్రవేశించే "కర్కాటక సంక్రాంతి" దక్షిణాయనంతో దేవతల రాత్రి ప్రారంభం. 

  - మకరరాశిలోకి ప్రవేశించేముందు, ధనస్సులోకి ప్రవేశించే కాలం ధనుర్మాసం. అది  దేవతలకు తెల్లవారు ఝాము. 

    మనకి సంవత్సరం అంటే దేవతలకు ఒక రోజు.

    24 గంటల్లో మూడోవంతు నిద్రకి కేటాయిస్తున్నట్లు, 12 నెలల మన సంవత్సరం దేవతలకు ఒకరోజు. 

    అందులో మూడోవంతయినమన నాలుగు నెలల - దేవతల ఎనిమిది గంటల నిద్రాసమయం. అదే చాతుర్మాస దీక్ష. 

    ఈ నాలుగు నెలలలోనూ మూడు ఏకాదశులు చాలా ప్రాముఖ్యమైనవి. అవి 


1. శయన ఏకాదశీ 


    దేవతల రాత్రి అయిన దక్షిణాయనం ప్రారంభమైయ్యాక వెంటనే వచ్చే ఆషాఢమాస శుక్లఏకాదశినాడు (ఒక్కొక్కసారి అధిక మాసం వచ్చే సందర్భంలో ఇవి రెండూ ముందువెనుకలవుతాయి),  

    శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తాడు. దానిని "శయన ఏకాదశీ" అంటారు. 


2. పరివర్తన ఏకాదశీ 


   మన రెండు నెలల కాలం - అంటే దేవతలకు వారి నాలుగు గంటలు అయ్యాక, భాద్రపద శుక్ల ఏకాదశీనాడు స్వామి, అటువాడు ఇటు తిరిగి పడుకుంటాడు. 

    దాన్ని "పరివర్తన ఏకాదశీ" అంటారు. 

(మనం కూడా నిద్ర మధ్యలో అటువారం ఇటు ఒత్తిగిలి పడుకుంటాం కదా!) 


3. ఉత్థాన ఏకాదశీ 


    మరొక మన రెండు నెలలు - అంటే దేవతలకు వారి నాలుగు గంటల తరువాత, కార్తీక శుక్ల ఏకాదశీ నాడు ఆయన, యోగనిద్రనుండీ లేస్తాడు. దానిని "ఉత్థాన ఏకాదశీ" అంటారు. అదే ఈరోజు. 

    దీనితో చాతుర్మాస దీక్ష పూర్తవుతుంది. 

        

యోగనిద్ర 

   "యోగనిద్ర"లో ఈ నాలుగు మాసాలూ స్వామి జీవులను తనతో కలుపుకునే "యోగం" (యోగం అంటే కలయిక) కొఱకై, మరింతగా అనుగ్రహించడానికి ఆలోచిస్తూంటాడు. 


ముక్కోటి (వైకుంఠ) ఏకాదశీ 


    దేవతల రాత్రి అయిన దక్షిణాయణం ప్రారంభం కాగానే శయనించి, 

    వారి పగలు అయిన ఉత్తరాయణం ప్రారంభమయ్యే ముందు, 

    వారి తెల్లవారు ఝాము ధనుర్మాసంలోని శుక్ల ఏకాదశి అయిన  ముక్కోటి(వైకుంఠ) ఏకాదశినాడు ఉత్తర ద్వారంలో  ముక్కోటి దేవతలకు దర్శనమనుగ్రహిస్తారు. 


    మనకి యోగం కల్పించే సంకల్పంతో స్వామి "యోగ నిద్ర"లోకి వెళ్ళి, 

    ఆ నిద్రనుంచీ లేచిన ఈ శుభ సమయంలో, మనం కూడా, 

    దైవాన్ని మరింత ఏకాగ్రతతో ప్రార్థించి లబ్ధి పొందుదాం. 

    తద్వారా, జీవాత్మ - పరమాత్మల యోగంగా (కలయికగా), 

      మనలోని దైవాన్ని తెలుసుకొందాం.

     

                    =x=x=x=


    — రామాయణం శర్మ 

            భద్రాచలం

పంచాంగం

 *ఓం శ్రీ గురుభ్యోనమః*  శుభోదయం * పంచాంగం*

*నవంబరు 23, గురువారం,  2023*

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*

*దక్షిణాయనం**శరదృతువు*

*కార్తీకమాసం**శుక్లపక్షం*

తిథి: *ఏకాదశి రా. 10.22 వరకు, తదుపరి ద్వాదశి*  

వారం: *బృహస్సతివాసరే*

(గురువారం)

నక్షత్రం: *ఉత్తరాభాద్ర సా. 5.25 వరకు,*

యోగం: *వజ్రం, మ. 12.46 వరకు*

కరణం: *వణిజ, ఉ. 9.28*

& తదుపరి,

*భద్ర, రా. 10.22  వరకు,*

వర్జ్యం: *తెల్లవారితే శుక్రవారం 4.44-6.14*

దుర్ముహూర్తము: *ఉ9.54-10.39*

&

*మ. 2.21-3.06*

*అమృతకాలం- మ. 12.55-2.25*

రాహుకాలం: *మ 1.30-3.00*

యమగండం: *ఉ6.00-7.30*

సూర్యరాశి: *వృశ్చికం*

చంద్రరాశి: *మీనం*

సూర్యోదయం: *6.12*

సూర్యాస్తమయం: *5.20*

*అభిజిత్ కాలం- ప.11.31-12.16*

*సాధారణ శుభసమయాలు:-* 

*ఉ. 8.30-10.00 & 11.00-12.00 సా.4.00-6.30*

  *ప్రాతఃకాలం:- ఉ.6.15-8.30*

*సంగవకాలం:- ఉ.8.31-10.46*

*మధ్యాహ్నకాలం:- ఉ.10.47-01.01*

*అపరాహ్నకాలం:- మ.01.02-3.17*

*ఆబ్దీకపు తిథి:- కార్తీక శుద్ధ ఏకాదశి*

*సాయంకాలం:- మ.3.18-5.32*

*ప్రదోషకాలం:- సా.5.33-8.05*

*నిశీధకాలం:- రా.11.28-12.19*

*బ్రాహ్మీ ముహూర్తం:- తె.4.34-5.25*

పంచాంగం ఈ రోజు దశమి నవంబర్-22-బుధవారం.

 .*శుభోదయం* పంచాంగం 

ఈ రోజు దశమి 

నవంబర్-22-బుధవారం.   

స్వస్తిశ్రీ  శోభకృతు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు *కార్తీకమాసం* శుక్లపక్షం

తిథి:  దశమి 10.33pm

సౌమ్యవాసరే

నక్షత్రం:  పూర్వాభాద్ర 1.57 pm

వర్జ్యం: 03:40 am – 05:11 am

దుర్ముహుర్తం: 11:57 am - 12:48 pm

రాహుకాలం: 12:00 pm - 01:30 pm

యోగం:  హర్షణము 02:46 pm

కరణం:  కౌలవ 01:10 am, 

తైతుల 12:07 pm

గరజి 11:04 pm 

సూర్యోదయం   : 06:28

సూర్యాస్తమయం : 05:35

*     *

నర్తనశాల

 నేపథ్యం : మాధవపెద్ది


పోటుమగండు నా బుగిలిపోయిన వింటిని చేతబట్టి ఆ ర్భాటము మీరగా పిరికిపందల కొందర గెల్చితంట ఈ నాటికి నీదునేర్పు కదనమునగాంచు దినమ్ము వచ్చె నీ బూటకమంతయున్ తెలిసిపోవును నేటితో రమ్ముఫల్గుణా !


రచన : సముద్రాల


సీ॥


ఏనుంగు నెక్కి, పెక్కేనుంగు లిరుగడ రా పురవీధుల గ్రాలగలదె మణిమయంబైన భూషణజాలముల నొప్పి యొడ్తోలగంబున నుండగలదె కర్పూరచందన కస్తూరి కాదుల నింపు


సొపార భోగింపగలదె అతి మనోహరలగు చతురాంగనల తోడి సంగతి వేడ్కలు సలుపగలదె కయ్యమున ఓడిపోయిన కౌరవేంద్ర వినుము నా బుద్ధి మరలి, యీ తనువువిడిచి సుగతి వడయుము తొల్లింట చూఱగలదె జూదమిచ్చట నాడంగరాదు నమ్ము

నేపథ్యం : ఘంటసా

నర్తనశాల - 




ముద్ధాలను భద్రపరచి, అజ్ఞాతవాసానికి అనుకూలమైన రూపాలను


10 మారుపేరులతో వెళతారు, ద్రౌపది సైరంధ్రిగా, యతి


చార్యుడుగా అర్జునుడు,

నవగ్రహా పురాణం🪐*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *84వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*బుధగ్రహ చరిత్ర - 11*


*"ఆచార్యా..."* బుధుడు గద్గద కంఠంతో అన్నాడు. వ్యక్తం చేయలేని వ్యధ అతని కళ్ళల్లో స్పష్టంగా , తడిగా కనిపిస్తోంది , వశిష్ఠుడికి.


*"నాయనా , బుధా ! దుఃఖాన్ని దూరం చేసుకో ! ఇలతో నీ ఎడబాటు నిరంతరమైనదీ కాదు , శాశ్వతమైనదీ కాదు !"*


*"ఆచార్యా !"*


*"చెప్పానుగా , నాయనా ! ఆ అర్ధనారీశ్వరుడు దంపతులకు ఎడబాటు కలిగించడు. నువ్వూ , నేనూ , ఎవ్వరూ కోరుకోకుండానే , అర్ధించకుండానే ఆయన నీ గురించి ఆలోచించాడు. ఉభయతారకమైన ఉపాయంతో , శాపాన్ని పరిహరించాడు. శాపఫలంగా సుద్యుమ్నుడు ఒక నెలరోజులు 'ఇల'గా ఉంటాడు. నాకు కరుణించిన వరం ఫలంగా నెల రోజులు సుద్యుమ్నుడుగానే ఉంటాడు !"*


వశిష్ఠుని వివరణ ఏదో అదృశ్య కుంచికలాగా బుధుడి ముఖం మీద కాపురం చేస్తున్న విచారాన్ని తుడిచివేసింది.


*"ఆచార్యా... నిజమా ?"*


*"అవును , బుధా ! ఈ వైవస్వతుడి బిడ్డ , ఒక నెలపాటు అక్కడ పుత్రుడుగా రాజుగా వ్యవహరిస్తాడు. మరుసటి నెల ఇక్కడ నీ పత్నిగా దాంపత్యం నెరపుతాడు. ఇది ఆదిశంకరుని అనుశాసనం !"* వశిష్ఠుడు నవ్వుతూ అన్నాడు.


*"గురుదేవా ! నా తల్లిదండ్రులు మీ రుణం తీర్చుకోలేరు. నేను కూడా మీ రుణం తీర్చలేను !"* సుద్యుమ్నుడు ఆనందంగా అన్నాడు.


*"నీ అదృష్టం అద్వితీయం సుద్యుమ్నా !"* వశిష్ఠుడు చిరునవ్వుతో అన్నాడు. *"అది ద్విముఖం ! సూర్యపుత్రుడైన వైవస్వతుడి కొడుకుగా , అత్రి పుత్రుడైన చంద్రుడికి కోడలిగా రాణించే మహద్భాగ్యం నీది !"*


వశిష్ఠుడు బుధుడి వైపు తిరిగాడు. *"నీది కూడా అదృష్టమే నాయనా ! ఒక నెల వియోగం , ఒక నెల సంయోగం ! ఈ వియోగ , సంయోగాలు ఆవృత్తి మీ అనుబంధాన్ని నిత్యనూతనంగా ఉంచుతుంది. మరొక సూచన ఏమిటంటే - పురూరవుడు భావిసామ్రాట్టు. ఆశ్రమవాసం కన్నా రాజమందిర వాసం అతనికి తగినది ! రాజోచితమైన శిక్షణ పసితనం నుంచే అలవడాలి."*


*"పురూరవుడు కూడా లేకుండా నేను ఎలా ఉండగలను ?"* బుధుడు నిరుత్సాహంగా అన్నాడు.


*"బిడ్డల ఆలనా పాలనా తల్లి పర్యవేక్షణలో జరగాలి. పురూరవుడికి ఇక్కడ తల్లి ఇల. అక్కడ సుద్యుమ్నుడు !"* వశిష్ఠుడు నవ్వుతూ అన్నాడు.


*"గురుదేవుల సూచన ఆచరణీయం. పురూరవుణ్ణి నాతో తీసుకువెళ్తాను. అప్పుడప్పుడు భటులు ఆశ్రమానికి తీసుకువస్తారు."* సుద్యుమ్నుడు బుధుడితో అన్నాడు. 


బుధుడు మాట్లాడకుండా. పురూరవుణ్ణి ఎత్తుకున్నాడు. *"నాయనా ! నీకు అర్థమైందా ? అమ్మ... ఇదిగో... సుద్యుమ్నుడు అనే రాకుమారుడిగా మారింది. ఒక మాసం గడిచిన అనంతరం మళ్ళీ సుద్యుమ్నుడు మాయమైపోయి , అమ్మ అమ్మగా వస్తుంది ! ఇప్పుడు చెప్పు. యువరాజు ప్రద్యుమ్నుడిలో ఎవరున్నారు ?”* 


పురూరవుడు సుద్యుమ్నుడి వైపు చిరునవ్వుతో చూశాడు. *"అమ్మ ఉంది. నెల అనంతరం అమ్మలో యువరాజు సుద్యుమ్నుడు ఉంటాడు."*


*"అమ్మా , సుద్యుమ్నుడూ ఒక్కరే కాబట్టి , నువ్వు ఆయనతో బాటు రాజధానికి వెళ్ళాలి. మళ్లీ రావాలి"* బుధుడు వివరిస్తూ అన్నాడు.


*"ఎప్పుడు రావాలి , నాన్నగారూ ?”*


*“అనుకున్నపుడల్లా నువ్వు ఈ ఆశ్రమానికి రావచ్చు నాయనా ! భటులు నిన్ను రథంలో తీసుకు వస్తారు"* సుద్యుమ్నుడు పురూరవుడి తల నిమురుతూ అన్నాడు.


*"నాన్నగారూ ! నాన్నగారూ ! నేను రాజధానికి వెళ్ళి , మిమ్మల్ని చూడడానికి రథంలో వస్తాను"* పురూరవుడు ఉత్సాహంగా అన్నాడు. సుద్యుమ్నుడి వైపు వాలుతూ. సుద్యుమ్నుడు పురూరవుణ్ణి అందుకున్నాడు.


*"పురూరవా ! నీతో ఆడుకోవడానికి రాజధానిలోని మందిరంలో ఇంకా ఇద్దరున్నారు. తెలుసా ?"* వశిష్ఠుడు చిరునవ్వు నవ్వాడు.


*"ఎవరు గురుదేవా ?"* పురూరవుడు ఉత్సాహంగా అడిగాడు.


*"నీ మాతామహీ , మాతామహుడు ! అంటే నీ అమ్మకు అమ్మగారూ, నాన్నగారూ అన్నమాట !"* వశిష్ఠుడు వివరించాడు.


బుధుడు పురూరవుడి బుగ్గ మీద ముద్దు పెట్టుకొన్నాడు. సుద్యుమ్నుడు పురూరవుణ్ణి దించి , బుధుడి పాదాలను కళ్ళకు అద్దుకున్నాడు. బుధుడు చిరునవ్వుతో దీవించాడు.


*"సుద్యుమ్నా ! అక్కడ రాజదంపతులు నీరాక కోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నారు. బయలుదేరుదాం !"* వశిష్ఠుడు హెచ్చరించాడు.


*"ఇదీ బుధ చరిత్ర !”* నిర్వికల్పానంద శిష్యులతో అన్నాడు. *"ఎలా ఉంది ?"*


*"కథా , కథనం రెండూ అద్భుతంగా ఉన్నాయి గురువుగారూ !"* విమలానందుడు సంతోషంగా అన్నాడు.


*"గురువు గారూ ! ఒక సందేహం...”* సదానందుడు అన్నాడు.


*"ఏమిటి నాయనా , నీ సందేహం ?"* నిర్వికల్పానంద నవ్వుతూ అడిగాడు. 


*"బుధుడు ఇలాదేవిని వివాహం చేసుకున్నాడు. అంటే బుధపత్ని 'ఇల' అన్నమాటే కద ! అయితే నవగ్రహాల వివరాలు ఉదహరించే సందర్భాలలో , బుధుడి భార్య 'జ్ఞాని' అని అంటున్నారే ! బుధుడు ద్వితీయపత్నిని స్వీకరించాడా ?"* సదానందుడు ప్రశ్నించాడు.


*"మంచి ప్రశ్న అడిగావు ! కానీ , దీనికి ఇదమిత్థంగా సమాధానం చెప్పలేం. ఎందుకంటే , బుధుడు పునర్వివాహం చేసుకున్నట్టు ఏ పురాణమూ పేర్కొనలేదు. అలాగే ఆయన పత్ని 'ఇల' కాదు అని కూడా ఎక్కడా ప్రస్తావించబడలేదు. వైవస్వతుడి కుమారుడు సుద్యుమ్నుడు 'ఇల'గా మారి బుధుడి భార్య అయ్యాడన్నదే సర్వపురాణ సారాంశం ! చంద్రవంశానికి మూలం ఆ ఇద్దరి దాంపత్యమే. ఇలా బుధుల పుత్రుడైన పురూరవుడే చంద్రవంశ కర్తలలో ప్రముఖుడు !"*


*"అయితే ఆ 'జ్ఞాని' అనే స్త్రీ ఎవరు గురువుగారూ ?"* శివానందుడు ప్రశ్నించాడు.


*"ఇలా దేవి మరొక నామధేయమే 'జ్ఞాని' అని అనుకోవడం శ్రేయస్కరం అని నా ఉద్దేశం. స్త్రీగా జన్మించి , పురుషుడుగా మారి , శివపార్వతుల శాప ఫలంగా మళ్ళీ స్త్రీగా మారి , శివుడి కటాక్షంతో శాప విముక్తి పొంది , తదనంతర కాలంలో స్త్రీగా , పురుషుడిగా చరిత్ర సృష్టించిన 'ఇలా' దేవినే 'జ్ఞానిదేవి' అనుకోవడం అపరాధం కాదు ! బుధుడు నవగ్రహాలలో ఒకడుగా నియమించబడినప్పుడు ఆయన సతీమణికి నామధేయం 'జ్ఞాని' అనే బిరుదనామం లభించిందేమో !"* నిర్వికల్పానంద ఆగాడు.


*"అలా అనుకోవడం మంచిదే ! బుధుని ధర్మ పత్నిగా ఇలను గౌరవించినట్లు ఉంటుంది ,”* విమలానందుడు సమర్ధింపుగా అన్నాడు. 


*"సరే... ఇక ఐదవ గ్రహం బృహస్పతి. ఆయన చరిత్ర వినండి"* అంటూ ప్రారంభించాడు. నిర్వికల్పానంద.


*"ఒక్కసారి బృహస్పతి గురించి సింహావలోకనం చేసుకుందాం. చంద్రుడి వద్ద నుండి భర్త వద్దకు చేరిన తార బృహస్పతిని సేవించుకుంటూ ఉంది. బృహస్పతి ఆమె అపరాధాన్ని క్షమించి చేరదీశాడు. ఆ ఇద్దరి దాంపత్యం అన్యోన్యంగా సాగుతోంది..."*


*రేపటి నుండి గురుగ్రహ చరిత్ర ప్రారంభం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

నాయనార్ల చరిత్ర - 07*

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 07*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 *7. ఎరిబత్త నాయనారు*


కరువూరు నగరంలో ఎరిబత్తనాయనారు అనే భక్తుడు శివభక్తులకు

సదా సేవ చేయడమే జీవితాశయంగా కలిగి జీవనం సాగిస్తూ వచ్చాడు.


కరువూరులోని ఆనిలై దేవాలయంలో వెలసిన పరమేశ్వరుని మీది

అచంచల భక్తిప్రపత్తులను కలిగిన శివగామి యాండార్ అనే మునీశ్వరుడు

రోజూ ఉదయాత్పూర్వమేలేని పుష్పాలను సేకరించి వాటిని మాలలుగా

కట్టి స్వామికి అలంకరించి ఆనందిస్తూ ఉండేవాడు.

ఒకరోజు శివగామి యాండార్ పూలను కోసుకొని వస్తుండగా

రాజుగారి పట్టపుటేనుగు కపోలంలో మదజలం స్రవిస్తుండగా వీధిలో

నున్నవారు భయకంపితులై పరుగులు పెట్టగా పెద్దకొండవలె భీకరంగా వచ్చింది. 


ఆ ఏనుగు మావటీ వారికి లొంగక తనముందు వెళ్తున్న శివగామి యాండార్ను వెన్నంటి వెళ్లి ఆయన స్వామి కోసం తీసుకువెళ్తున్న

పూలబుట్టను తొండంతో లాగి కింద పడవేసింది. శివగామి యాండార్

కిందపడి చేతులతో నేలను మోదుతూ “పరమేశ్వరా! నీ కోసం తీసుకువస్తున్న

ఈ పుష్పాలు నేల పాలయ్యాయి కదా! నేనేం చేయగలను?” 


అని గట్టిగా ఈ విధంగా శివగామి యాండార్ రోదిస్తుండగా ఎరిబత్తనాయనారు

దానిని విన్నాడు. "శివభక్తులకు ఏనుగు కారణంగా ఎంతటి కష్టం సంభవించింది. ఎవరువచ్చి అడ్డగించినప్పటికీ నేను దానిని నరికి సంహరిస్తాను” అని భీకరంగా గర్జిస్తూ ఎరిబత్తనాయనారు గండ్రగొడ్డలి

చేత ధరించి వేగంగా వెళ్లి ఆ ఏనుగు పైకి లంఘించాడు. 


పొడవైన దాని

తొండం నేలమీద పడేలా దానిని రెండుగా నరికాడు. ఆ ఏనుగు నల్లని

పర్వతం వలె నేలమీద వాలిపోయింది. ఏనుగు మీదున్న మావటీ వారు

వెన్నంటి వస్తున్న సైనికులు తనను ఎదుర్కోగా ఎరిబత్త నాయనారు వారిని

కూడ సంహరించాడు. 


మిగిలిన సైనికులు పరిగెత్తుకుంటూ వెళ్లి రాజుగారికి ఈ సంగతిని విన్నవించారు. రాజుగారు చతురంగ బలాలను

సమీకరించుకొని ఏనుగు చనిపోయిపడి వున్న ప్రదేశానికి చేరుకున్నారు.

అక్కడ గండ్రగొడ్డలిని ధరించి తన ముందు నిలబడి ఉన్న శివభక్తుడైన

ఎరిబత్త నాయనారును చూశాడు. 


పరమేశ్వరుని భక్తుడైన ఇతడు ఈ ఏనుగును ఏ తప్పూ లేకుండా చంపి ఉండడు" అని మనసులో భావించి

సైనికులందరినీ అక్కడే ఉండమని చెప్పి తాను ఒంటరిగా ఎరిబత్త

నాయనారు దగ్గరికి వెళ్లి నమస్కరించాడు. చోళ చక్రవర్తిని చూసి శివభక్తుడైన

ఎరిబత్త నాయనారు “చోళ రాజా! శివగామి యాండార్ అనే భక్తుడు

పరమేశ్వరునికి సమర్పించడానికి తీసుకువెళ్తున్న పుష్పహారాలను ఈ ఏనుగు

లాగి కింద పడవేయడం వలన నేను దానిని నేలమీద కూలేలా

ఖండించివేశాను. 


ఏనుగు ఈ విధంగా తప్పుచేస్తుండగా మావటీవారు,

కావలివారు దానిని నివారించని కారణంచే చంపబడ్డారు. ఇదే ఇక్కడ

జరిగిన విషయం" అని చెప్పాడు. "శివభక్తులకు ఈ ఏనుగు చేసిన

అపకారానికి ఇక్కడ మావటీ వారిని చేర్చి ఏనుగును చంపడంతో సరిపోదు.


 ఈ దుండగం జరగడానికి కారణమైన నన్ను కూడ చంపాలి" అంటూ

రాజు తన నడుముకు వేలాడుతున్న కరవాలాన్ని చేతితో పెకలించి దానిని

ఎరిబత్త నాయనారు చేతికి ఇచ్చాడు. ప్రేమైకమూర్తి అయిన ఈ రాజుగారిని

కూడా దుండగీడు అని నేను భావించాను. 


నా శరీరాన్ని కత్తితో

పొడుచుకోవడమే ఈ దుష్కార్యానికి పరిహారమవుతుంది" అని భావించి

ఎరిబత్త నాయనారు రాజుగారు ఇచ్చిన ఖడ్గంతో తన కంఠాన్ని

ఉత్తరించుకోబోయాడు. ఆ సమయంలో ఆకాశంలో అందరికీ వినిపించేలా

ఒక పెద్ద శబ్దం వినిపించింది. 


"మీ భక్తిని ప్రపంచానికి తెలియజేయడానికై

పరమేశ్వరుని వలన ఈ సంఘటన జరిగింది" అనే మాటలు వినిపించాయి.

చనిపోయిన మావటివారితో, సైనికులతో సహా ఏనుగు కూడ నిద్రనుండి

లేచినట్లు అప్పుడే పైకి లేచింది. దేవతలు ఇరువురిమీద చల్లని పుష్పాలను కురిపించారు. 


ఈ అద్భుతాన్ని చూసి ఆనందించిన శివగామి యాండార్

అక్కడికి వచ్చి నిలబడ్డాడు.

ఎరిబత్త నాయనారు సదాచార వర్తనుడై జీవనం సాగించి ఆఖరున పవిత్రమైన కైలాస పర్వతంలో శివ గణాలకు నాయకుడయ్యే భాగ్యాన్ని పొందాడు.

      *ఏడవ చరిత్ర సంపూర్ణం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

🚩శ్రీ వివేకానందస్వామి

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.                      *భాగం 94*


ఆగస్ట్ నెలాఖరులోగా కాశీపూర్ ఇంటిని ఖాళీ చేసి ఇవ్వాలి. మాతృదేవి ఎక్కడకు వెళతారు? యువకులు ఎక్కడకు పోతారు? ఇంటిని ఖాళీ చేయవద్దని  మళ్లీ ఒకసారి గృహస్థ భక్తులకు, యువశిష్యులు విన్నవించారు. "మేం భిక్షాటన చేసి అయినా మాతృదేవిని పోషించుకొంటాం" అని చెప్పి చూశారు. కాని గృహస్థ భక్తులు ఇంటిని ఖాళీచేసి తీరాలని పట్టుబట్టారు. 


ఆగస్ట్ 21వ తేదీ మాతృదేవిని బలరాంబోస్ తన ఇంటికి తోడ్కొని వెళ్లాడు. యువకులు తమ కోసం పదిలపరచుకొన్న అస్థికల కలశాన్ని మాతృదేవి తమతో కూడా బలరాంబోసు ఇంటికి తీసుకుపోయి నిత్యం పూజించసాగారు. శ్రీరామకృష్ణులు ఉపయోగించిన వస్తువులను కూడా మాతృదేవి తమతో తీసుకు వెళ్లారు. ఆగస్ట్ 30 వ తేదీ యువభక్తులైన కాళీ, యోగీన్, లాటూలతోను, భక్తురాండ్రతోను బృందావనం మొదలైన పుణ్యస్థలాల తీర్థయాత్రకు మాతృదేవి బయలుదేరారు.


మరి యువశిష్యులు?


వారు ఎక్కడకు పోగలరు? మాతృదేవితో ఒకరిద్దరు వెళ్లారు. ఒకరిద్దరు ఇంటికి తిరిగి వెళ్లిపోయి తమ చదువులు కొనసాగించారు. నరేంద్రుడు అప్పుడప్పుడు ఇంటికి వెళ్లివచ్చేవాడు. పెద్దగోపాల్, నిరంజన్ ప్రభృతులు ఇల్లు ఉన్నా లేకపోయినా, మఠం ఉన్నా లేకపోయినా సన్న్యాస జీవితం కొనసాగించాలని నిర్ణయించుకొన్నారు.


 "పాము తనకంటూ నివాసం ఏర్పాటు చేసుకోదు. ఇతర జంతువుల నివాసాలలో నివసిస్తుంది. సన్న్యాసి కూడా అంతే. అతడు ధర్మ సత్రాలు, చావిళ్ళలో జీవితం గడపాలి. మనం కూడా అట్లే చేద్దాం” అన్నాడు నిరంజన్. "ఆగకుండా ప్రవహించే నీటిలా సన్న్యాసి ఒకే చోట ఉండిపోకుండా పయనించాలి" అన్నారు మరొకరు. ఏది ఏమైనప్పటికీ సన్న్యాస జీవితం కొనసాగించాలని వారు గట్టిగా నిర్ణయించుకొన్నారు. కాని ఎక్కడ బస చేయాలి?


శ్రీరామకృష్ణులు ఏదో ఒక దారి చూపుతారని యువశిష్యులకు అచంచల విశ్వాసం. ఒక కొత్త సందేశంతో అరుదెంచి, దానిని లోకమంతటా చేయడానికి యువకులకు శిక్షణనిచ్చిన ఆయన అనుగ్రహించకుండా ఉంటారా? లేదు,  అనుగ్రహించారు. ఆయన వరదాభయ హస్తాలు యువశిష్యులకు చేయూత నిచ్చాయి.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

శివానందలహరీ – శ్లోకం – 8*

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.      *శివానందలహరీ – శ్లోకం – 8*

.        శ్రీ ఆదిశంకరాచార్య విరచితం

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱


*యథా బుద్ధిశ్శుక్తౌ రజతమితి కాచాశ్మని మణి*

*ర్జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలమ్ |*

*తథా దేవభ్రాంత్యా భజతి భవదన్యం జడజనో*

*మహాదేవేశం త్వాం మనసి చ న మత్వా పశుపతే  8*


ఓ పశుపతీ ! దేవదేవుడవైన నిన్ను మూఢులు హృదయమునందు తలచక, ముత్యపుచిప్పలను వెండియనియూ, గాజురాళ్ళను మణులనియూ, పిండినీళ్ళను పాలనియూ, ఎండమావులను నీళ్ళనియూ భ్రమించునట్లుగా నీకంటే ఇతరులైనట్టి వారిని, దేవులనే భ్రాంతిచేత, సేవించుచున్నారు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

సౌందర్యలహరి🌹* . *శ్లోకం - 84*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*

.                   *శ్లోకం - 84*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*శ్రుతీనాం మూర్ధానో దధతి తవ యౌ శేఖరతయా*

*మమాప్యేతౌ మాత శ్శిరసి దయ యా ధేహి చరణౌ |*

*యయోః పాద్యం పాథః పశుపతి జటాజూటతటినీ*

*యయో ర్లాక్షాలక్ష్మీ      రరుణహరిచూడామణిరుచిః ‖*

*శ్రుతిసీమంతసిందూరీకృతపాదాబ్జధూళికా*


 అని లలితా సహస్ర నామములలో ఒకటి. ఇందులో వేదములను స్త్రీమూర్తులుగా చెప్పారు. ఈ ముత్తయిదువులు అమ్మవారి పాదపద్మములకు నమస్కరించినప్పుడు ఆమె యెర్రని నఖములకు కల సింధూర వర్ణము వారి పాపిటకు అంటినదట. అనగా వేదములు ఎల్లప్పుడూ అమ్మవారిని స్తుతిస్తూ  ఆరాధిస్తున్నాయని భావము. వేదములనే ముత్తయిదువుకు శిరస్సు ఉపనిషత్తు వేదాంతము. ఉపనిషత్తులు అమ్మవారిని ఆశ్రయించి పరతత్త్వాన్ని పొందాయట . అందుచేత అమ్మ పాదములను చేరవలెనంటే ఉపనిషత్ విజ్ఞానం ఎంతైనా అవసరం.


ఇప్పుడు శంకరులు ఈ సౌందర్యలహరి శ్లోకములో త్రిమూర్తులు అమ్మవారి పాదములను ఎలా సేవిస్తున్నారో చెప్తున్నారు, పైన చెప్పబడిన నామమునకు అన్వయిస్తూ.


శ్రుతీనాం మూర్ధానో దధతి తవ యౌ శేఖరతయా = వేదములనే యువతులు బయలుదేరి అమ్మవారి పాదములను శిరసుపై ధరించారట . అమ్మవారి పాదములు ఉపనిషత్తులలో చెప్పబడిన పరబ్రహ్మ తత్త్వం. వేదముల శీర్షములు ఉపనిషత్తులు కదా! వేదములు బ్రహ్మ ప్రోక్తములు. ఆ విధముగా ఆయన అమ్మవారికి నమస్కరిస్తున్నాడు.


యయోః పాద్యం పాథః పశుపతిజటాజూటతటినీ = మరి ఆ పాదముల పాద్యము ఏది? పరమేశ్వరుని జటాజూటములోని గంగా జలము. ఆమెకు నమస్కరించటానికి శివుడు కొద్దిగా వంగినప్పుడు ఆ గంగాజలం ఆమె పాదములను కడిగింది. 

పరమాచార్య స్వామి వారు చమత్కరించారు. శివునికీ పార్వతీదేవికి ప్రణయకలహము కలిగినపుడు ఆయన కొద్దిగా వంగి జటాజూటములోని గంగాజలంతో ఆమె పాదములను తడిపి ఆమెను ఉపశమింపజేసాడు అని.


యయో ర్లాక్షాలక్ష్మీ            రరుణహరిచూడామణి రుచిః = మరి పారాణి శోభ ఏమిటి? (లాక్షా లక్ష్మీ) నారాయణుడు అమ్మవారి పాదాలపై శిరసునుంచినప్పుడు ఆయన కిరీటంలోని చూడామణి కాంతి అమ్మవారి పారాణిగా ప్రకాశిస్తున్నదని. ఈ విధంగా త్రిమూర్తులు అమ్మవారి పాదములను ఆశ్రయించుకొని సృష్టి స్థితి లయ నిర్వహణను చేస్తున్నారు.


మమాప్యేతౌ మాత శ్శిరసి దయయా ధేహి చరణౌ = అట్టి మహిమాన్వితమైన నీ పాదములను దయయుంచి నా శిరస్సు పైన కూడా ఉంచు తల్లీ అంటున్నారు ఆచార్యులవారు.


అమ్మవారి పాదములు సహస్రారం పైన ఉంటే శరీరమంతా శక్తిపాతం జరిగి అమృతమయమవుతుంది. అలాగే ఉపనిషత్ జ్ఞానాన్ని సముపార్జిస్తే పరబ్రహ్మ తత్త్వం యెరిగి పరమాత్మలో లీనమవుతాడు జీవుడు. సద్గురువులు, బ్రహ్మజ్ఞానోపదేశమునకు అర్హుడైన శిష్యునికి, అతడి శిరసుపై పాదం ఉంచి దీక్షనిస్తారు. అందువల్ల శిష్యుని సహస్రార పద్మము ద్వారా గురువు యొక్క జ్ఞానామృత ధార ప్రసరిస్తుంది.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

               🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు - కార్తీక మాసం - శుక్ల పక్షం  -‌ ఏకాదశి - ఉత్తరాభాద్ర -‌  గురు వాసరే* *(23-11-2023)* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/vkjkyWg0rIc?si=U1LEztV8i3q1PClc


🙏🙏

శ్రీరామచంద్రుని గాఢాలింగన సుఖము

 శ్రీరామచంద్రుని గాఢాలింగన సుఖము

       ( యుద్ధ కాండము సర్గ -1

          12,13,14 శ్లోకములు)


"క్షితిజాత జానకి క్షేమంబులను తెల్పి

              యుపకృతి న్నొసగిన కపివరునకు

సత్యమ్ముగా నేడు ప్రత్యుపకారమున్ 

              మరి నొనర్చని యసమర్థు నైతి

పరమపావను డైన పావని కిపుడు నే

              నాలింగనము నిత్తు నాత్మ సాక్షి

అతని కీ తరుణాన యర్పించ  గల్గిన

               సర్వస్వ మియ్యదే సత్య మరయ"

ననుచు రాముడు పులకిత తనువు తోడ

కార్య సఫలత గావించి ఘనముగాను

మగిడి వచ్చిన మారుతిన్ మమత పొంగ

చిత్త మలరగ గుండెకు హత్తు కొనియె.


👆


✍️గోపాలుని మధుసూదన రావు 🙏