21, ఫిబ్రవరి 2021, ఆదివారం

ముద్దపప్పు సప్తాహములు

 పూర్వం మా తెనాలి రామలింగేశ్వర పేటలో, మణెమ్మ గారి మఠం లో ప్రతి ఏడాదీ, మాఘ మాసంలో 'వార్షిక ముద్దపప్పు సప్తాహం' ఘనం గా జరిగేది! తెనాలి చుట్టుపక్కల గల ఆరు అగ్రహారాలనుండి వేద పండితులే కాక, ముద్దపప్పు ప్రియులు కూడా అయిన సద్బ్రాహ్మణోత్తములు  వేంచేసి, ఆ ముద్దపప్పు సప్తాహపు ఏడు రోజులూ, ముద్దపప్పు భోజనం, మఠం నిద్రా కావించి తిరిగి వెడలేవారు!

ఒక ఏడాది మా తాత గారితో పాటు నేను గూడా ఆ ఏడు రోజులూ, ముద్దపప్పు సప్తాహపు వేడుకలన్నీ వీక్షించా!

మాఘ శుద్ధ పాడ్యమి నాడు, చెయ్యి తిరిగిన నరసరావుపేట వంట వారు కొల్లూరు గ్రామపు పొలాలలో పండిన ఏడాది వయసుగల కందిపప్పు వాడి, బాగుగా గజ భగోణీలలో గోధుమ రంగు బారే వరకూ వేయించి, అటు పిదప బాగుగా ఉడకపెట్టి, ఉప్పూ, పసుపూ వేసి దివ్యమైన ముద్ద పప్పు వండినారు! ఆ ముద్ద పప్పుకు అనుపానములుగా అంగలకుదురు పుల్ల దోసకాయలు వాడి, అనకాపల్లి ఆవపిండీ, చినరావూరు గానుగ నువ్వులనూనే, బుడంపాడు ఎర్ర మిరపకాయలు కొట్టిన ఖారమూ, వేటపాలెం రాళ్ళ ఉప్పూ తగు పాళ్ళలో వేసి, దేవతా దోసావకాయ తయారు చేసినారు! అంతే కాక, వలివేరు మెట్టపొలాలలో కాసిన ఎర్ర గుమ్మడి కాయలూ, ముదురు బెండకాయలూ యొక్క ముక్కలు బాగా తగిలించి, ప్రసస్తమైన  ఇంగువ తిరగమాత పడవేసి, గొప్ప గుమ్మడి ముక్కల పులుసు చేసినారు! తెనాలి పక్కన గల అనంతారం లో పండిన వడ్ల దంపుడు బియ్యం తో, మెత్తగా వేడన్నము వండినారు! ఇకపోతే, వేజెండ్ల గ్రామపు నల్లటి గోకు తేలుతున్న బర్రె నెయ్యి సిద్ధం చేశారు! సంగం జాగర్లమూడి బర్రెలు బకింగ్ హాం కాలువ తీరాన గడ్డి మేసి ఇచ్చిన చిక్కటి పాల జిడ్డు గడ్డ పెరుగు పదిహేను కుండలలో తోడు  పెట్టారు! ఇంగువ మినప వడియాలూ, పెసర ఎర్ర అప్పడాలూ వేయించారు!

మధ్యాహ్నభోజన వడ్డనకి ముందు ములుకుట్ల సదాశివ శాస్త్రి గారి హరికాధా కాలక్షేపం ఏర్పాటు చేశారు, ఒక గంట పాటు!

అటు పిమ్మట, పచ్చల తాడిపర్రు అరిటాకులు పరచి, పంక్తులు గా వడ్డన చేయగా, మేమందరం ఆ ముద్దపప్పు భోజనం కావించి తాదాత్మ్యం చెందాం!

ఇదే విధం గా, మాఘ శుద్ధ విదియా, తదియా, చవితీ, పంచమీ, షష్టీ, సప్తమీ దినాలలో కూడా, అదే ముద్ద పప్పూ, కానీ వేరు రకముల అనుపానాలూ, ఇతర హరికధా, బుర్రకధా, పురాణ పఠనా కాలక్షేపాలూ!

ఆ 'ముద్దపప్పు సప్తాహములు ' మరల తిరిగి రావు! ఆ రోజులే రోజులు!

మాఘ పురాణం*_🚩 🚩 _*10 వ అధ్యాయము*_

 🚩 _*మాఘ పురాణం*_🚩 

🚩 _*10 వ అధ్యాయము*_🚩


      *ఆదివారం*

*ఫిబ్రవరి 21, 2021*


🕉🌞🕉🌞🕉🌞🕉🌞


*ఋక్ష కయను బ్రాహ్మణ కన్య వృత్తాంతము*


🕉️☘☘☘☘☘☘🕉️


పూర్వము భృగుమహాముని వంశమునందు ఋక్షకయను కన్య జన్మించి , దినదినాభివృద్ధి పొందుచుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు , పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయెను. ఋక్షక తన దురదృష్టమునకు దుఃఖించి , విరక్తితో ఇల్లువిడిచి గంగానది తీరమునకుపోయి ఆశ్రమము నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభించెను. ఆ విధముగా చాలా సంవత్సరములు ఆచరించుటవలన అనేక మాఘమాస స్నానములు ఫలములు దక్కెను. ఆమె మనోవాంఛ తీరు సమయము దగ్గర పడినది. ఒకనాడామె తపస్సు చేసుకొనుచూ ప్రాణములు విడిచెను. ఆమె చాల సంవత్సరములు వైకుంఠ మందేవుండి తరువాత బ్రహ్మలోకమునకు పోయెను. ఆమె మాఘమాస వ్రత ఫలము కలిగిన పవిత్రురాలగుటచే బ్రహ్మదేవుడామెను సత్యలోకములో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా జేసి *"తిలోత్తమ"* అను పేరుతో సత్యలోకమునకు పంపెను. ఆ కాలములో సుందోపసుందులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోరతపస్సు చేసిరి. వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై *"ఓయీ ! మీకేమి  కావలయునో కోరుకొనుము"* అని అనగా , *"స్వామీ మాకు ఇతరుల వలన మరణము కలుగకుండునట్లు వరమిమ్ము"* అని వేడుకొనగా , బ్రహ్మ అటులనే ఇచ్చితిని అని చెప్పి అంతర్ధానమయ్యెను.


బ్రహ్మదేవుని వలన వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులును మహాగర్వము కలవారై దేవతలను హింసించిరి. మహర్షుల తపస్సుకు భంగము కలిగించుచుండిరి. యజ్ఞయాగాదిక్రతువులలో మల మాంస రక్తాదులు పడవేసి , ప్రజలను నానా భీభత్సములు చేయుచుండిరి. దేవలోకమునకు దండెత్తి , దేవతలందరినీ తరిమివేసిరి , ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని *"మహానుభావా ! సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము కలవారై తపశ్శాలురను బాధించుచు దేవలోకమునకు వచ్చి మమ్మందరను తరిమి చెరసాలలో బెట్టి నానాభీబత్సము చేయుచున్నారు. కాన వారి మరణమునకు యేదైనా ఉపాయమాలోచించు"* మని ప్రార్థించిరి. బ్రహ్మ దీర్ఘముగా ఆలోచించి తిలోత్తమను పిలిచి  *"అమ్మాయి ఈ సుందోపసుందులను రాక్షసులకు యితరులెవరి వల్లను మరణము గలుగదని వరము నిచ్చియున్నాను. వారు వర గర్వముతో చాల అల్లకల్లోలము చేయుచున్నారు. కాన , నీవుపోయి నీచాకచక్యముతో వారికి మరణము కలుగునటుల ప్రయత్నించుము"* అని చెప్పెను. తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసుందులు వున్న అరణ్యమున ప్రవేశించెను. ఆమె చేత వీణపట్టుకొని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరులున్న నివాసములకు సమీపములో తిరుగుచుండెను. వీణానాదమును ఆమె మధురగానమునూ విని ఆ దానవసోదరులు అటు నిటు తిరుగునట్లామెననుసరిస్తూ ప్రేక్షకులవలె వెంటాడుచుండీరి , నన్ను వరింపుము నన్ను వరింపుమని తిలోత్తమను యెవరికి వారు బ్రతిమలాడసాగిరి. అంతట నా తిలోత్తమ ఓ రాక్షసాగ్రేసురులారా ! మిమ్ములను పెండ్ళియాడుట నాకు ఇష్టమే. మీరిద్దరూ నాకు సమానులే నేను మీ ఇద్దరియెడల సమాన ప్రేమతోనున్నాను. కాని ఇద్దరిని వివాహమాడుట సాధ్యము కానిది కాని నాకోరిక యొకటి యున్నది అది ఏమనగా మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారికే నేను  స్వంతముకాగలను అని చెప్పెను.


ఆమె మాటలకు సుందోపసుందులకు పౌరుషములు వచ్చినవి. మీసములు మెలిపెట్టి నేను బలవంతుడనగా నేను బలవంతునని ఇద్దరూ తొడలు కొట్టుకొనిరి , గ్రుద్దుకొనిరి. మల్లయుద్దము చేసిరి , ఇక పట్టుదల వచ్చి గదలు పట్టిరి , మద్దరాలనెత్తిరి , దెబ్బకు దెబ్బ కొట్టుకొనుచుండిరి. వారి పోరాటము రెండు పర్వతాలు ఢీకొన్నట్లుగా ఉన్నది. మేఘాలు ఉరిమినట్లుగా అరచుచు భయంకరంగా యుద్ధము చేసిరి గదాయుద్ధము తరువాత కత్తులు దూసిరి. ఆ కత్తి యుద్ధములో ఒకరిఖడ్గము మరొకరికి తగిలినందున ఇద్దరి తలలూ తెగి క్రిందపడినవి , ఇద్దరూ చనిపోయిరి.


తిలోత్తమను దేవతలు దీవించిరి. ఆమె బ్రహ్మకడకు పోయి జరిగినందా తెలియపర్చగా బ్రహ్మ సంతోషించి , *"తిలోత్తమా ! నీవు మంచికార్యము చేసితివి. నీ వలన సుందోపసుందులు మరణించిరి. నీకీ బలము వచ్చుటకు కారణము నీవు చేసియున్న మాఘమాస వ్రతఫలమే గాన , నీవు దేవలోకమునకు వెళ్ళుము , దేవతలు నిన్ను గౌరవిస్తారు. అచట అప్సరసలందరికంటే నీవే అధికురాలవగుదు"* వని పంపెను.


*పదవ అధ్యాయము సమాప్తం*

🌹🌷🌼🛕🔔🌼🌷🌹


      🙏🙏 *సేకరణ*🙏🙏

        *న్యాయపతి వేంకట*  

       *లక్ష్మీ నరసింహా రావు*

గొప్ప వ్యక్తిత్వాలెం

 ఒక్కసారి పలకరించండి.. పెద్ద పెద్ద అగాధాలు పూడిపోతాయి..


ఉన్నదే చిన్న లైఫ్.. ఎందుకుండాలి మనుషులకు దూరంగా? ఎంతమందికని దూరంగా జరుగుతాం.. మనస్సు కష్టపెట్టుకునీ, అవతలి మనిషి మనస్సు కష్టపెట్టీ?


మాటల తూటాలో, అపార్థపు మంటలో, వ్యక్తిత్వంలోని లోపాలో ఒకానొకప్పుడు మిమ్మల్ని విడిచి ఉండలేని స్నేహితుల్నీ, సన్నిహితుల్నీ ఎవరి మానాన వారిని విసిరేసి ఉండొచ్చు.


కానీ మనుషుల్ని పోగొట్టుకుంటే ఏమొస్తుంది? పాత జ్ఞాపకాలు గుర్తొస్తే గుండెల్లో మెలిపెట్టే బాధ తప్పించి!!


తోటి మనిషిని క్షమించలేని గొప్ప గొప్ప వ్యక్తిత్వాలెందుకు?


వాళ్లూ చనిపోతారు, మనమూ చనిపోతాం... ఎవరి మానాన వాళ్లు చనిపోయే వాళ్లే అయినప్పుడు కనీసం బ్రతికున్నప్పుడైనా దూరమైన మనుషుల్ని కలుపుకుని సాగిపోతే ఎంత బాగుంటుంది?


ఊరికూరికే మనుషుల్ని దూరం చేసుకోకండి.. మనం బ్రతకాల్సింది మనుషుల మధ్యనే.. ఎవరి లోపాలెలా ఉన్నా వాళ్లు ఏదో రూపంలో మనల్ని అభిమానించే మనుషులే! వాళ్ల లోపాల్ని చూడకండి.. వారి అభిమానాన్ని చూడండి, అస్సలు దూరం చేసుకోబుద్ధి కాదు!!

Now you can listen to world wide radio

 Now you can listen to world wide radio even with out ear phone!!! This is from Indian Space Research Organisation (ISRO) when you click the link, you can see the globe rotating. There are green dot on which you simply touch you can start listening to live radio from that place. Try your local radio!! Amazing!!! 😃


http://radio.garden/live