ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
1, జులై 2022, శుక్రవారం
రాయితీలు
నయంచేసే హోమియోపతీ
సూదులెట్టి పొడిచి సరసరా కోసినా
ఆంగ్ల వైద్యమేర అధికమనును
ఐసియూల్లొ జేరి ఐసులే అవుతారు
సకురు అప్పారావు సత్య మిదిర!
భావం: తియ్యటి బిళ్ళలతో, తియ్యగా, హాయిగా నయంచేసే హోమియోపతీ లాంటి వైద్యాలున్నా కూడా, మనవాళ్ళకు సూదుల్తో పొడిచి, కత్తులతో కోసి ఆపరేషన్ల పేరుతో హింసించినా, పరపరా కోసి పారేసినా అలోపతీ వైద్యమే మెరుగైన వైద్యమని ప్రగాఢ విశ్వాసం. దాని బారినపడి, ఐసీయూల్లో చేరి ఐసు పుల్లల్లా కరిగిపోయి, వాళ్ళ ఆస్తులన్నీ కరిగించుకోవడానికైనా, ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమే! ఎందుకంటే అది మాత్రమే నిజమైన వైద్యమనీ, మిగిలినవన్నీ వృధాఅనీ వాళ్ళ నమ్మకం! సకురు అప్పారావు చెప్పేది నిజం!
సకురు అప్పారావు గారు
శతక కవి: హోమియో వైద్యులు
9848025870
🙏🙏🙏