13, ఆగస్టు 2022, శనివారం

Laugh at this

 *Laugh at this* :😂😂😂🤣🤣🤣 You cannot beat the Indians


A  Doctor can't find a job in a Hospital  so he opens a clinic and puts a sign outside 'GET TREATMENT FOR $20 - IF NOT CURED GET BACK $100


A lawyer thinks this is a great opportunity to earn $100 and goes to the clinic...


*Lawyer* :  "I have lost my sense of taste"


* doctor* :  "Nurse, bring medicine from box no. 22 and put 3 drops in patient's mouth"


*Lawyer* :  "Ugh..this is kerosene"


* doctor* :  "Congrats, your sense of taste is restored. Give me $20"


The annoyed lawyer goes back after a few days to recover his money...


*Lawyer* :  "I have lost my memory. I cannot remember anything"


* doctor* :  "Nurse, bring medicine from box no. 22 and put 3 drops in his mouth"


*Lawyer (annoyed)* :  "This is kerosene. You gave this to me last time for restoring my taste"


* doctor* : "Congrats. You got your memory back. Give me $20"


The fuming lawyer pays him, and then comes back a week later determined to get back $100.


*Lawyer* :  "My eyesight has become very weak I can't see at all "


* doctor* :  "Well, I don't have any medicine for that, so take this $100"


*Lawyer (staring at the note)* : "But this is $20, not $100"


* doctor* :  "Congrats, your eyesight is restored. Give me $20"

పాట

** !!!!! 😂😂😂😂😂

కర్ణుడి చావుకి బాలీవుడ్ కి చావు

 కర్ణుడి చావుకి వేయి కారణాలు !

ఒక్క అమీర్ ఖాన్ కె కాదు మొత్తం బాలీవుడ్ కి చావు దగ్గరలో ఉంది. గత 6 ఏళ్లుగా బాలీవుడ్ సినిమా రంగం వెనకబాట పట్టడానికి ప్రధాన కారణం ఇంటర్నెట్ అంటే అతిశయోక్తి కాదు!

2014 లో రిలయన్స్ జియో విప్లవాత్మక ధరల తగ్గింపు వల్ల మొబైల్ ఇంటర్నెట్ సామాన్యుడికి కూడా అందుబాటులోకి వచ్చింది. 

దాంతో ఉత్తరాది ప్రజలకి దక్షిణ భారత సినిమాలని విరివిగా చూడడానికి అవకాశం దొరికింది. అందివచ్చిన అవకాశాన్ని కొంతమంది హిందీ నిర్మాతలు కూడా అందిపుచ్చుకున్నారు. ఏ మాత్రం వివక్ష లేకుండా దొరికిన కాడికి అన్ని తమిళ్,తెలుగు,కన్నడ,మలయాళ చిత్రాల హక్కులు తక్కువ ధరకి కొనడం వాటికి హిందీ సబ్ టైటిల్స్ వేసి డబ్ చేసి విడుదల చేశారు. అప్పటిదాకా ఖాన్ త్రయం నటించిన సినిమాలు వాటి తాలూకు కధ డిమాండ్ చేయకపోయినా సరే విదేశాలలో భారత సంతతి కి చెందిన వారి జీవితాలని ఖరీదయిన శైలిలో చిత్రీకరించి వదలడం చూసిన ఉత్తరాది ప్రేక్షకులకి దక్షిణా పధాన పల్లెటూరిలో జరిగే సంఘటనల మీద తీసిన సినిమాలు బాగా నచ్చాయి. ఎంతలా అంటే డబ్బింగ్ ఖర్చులు కూడా రావేమో అనుకున్న తరుణంలో కాసుల వర్షం కురిపించాయి దక్షిణాది డబ్బింగ్ సినిమాలు. 

ప్రేక్షకులు సబ్ టైటిల్స్ లేకపోయినా సరే నేరుగా దక్షిణాది చిత్రాలని చూడడం మొదలుపెట్టారు. 

ఒక్క ఉత్తర భారత దేశంలో నే దక్షిణాది సినిమాలకి విపరీత ఆదరణ దొరికింది అంటే పప్పులో కాలేసినట్లే !

పాకిస్థాన్ లో కూడా ఉర్దూ సబ్ టైటిల్స్ తో దక్షిణాది సినిమాలు ఇంటర్నెట్ లో విపరీత ఆదరణ లభించింది. ఫలితంగా ప్రకటనల రూపంలో ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వచ్చింది. 

చివరకి పాకిస్థాన్ ప్రేక్షకులలో కూడా దక్షిణాది హీరోలకి విపరీతమయిన ఆదరణ లభించింది. 

నాలుగేళ్ల క్రితం పాకిస్థాన్ ప్రేక్షకులు తమ స్వంత యూట్యూబ్ ఛానెల్స్ ని ప్రారంభించి భారతీయ సినిమాల మీద మరీ ముఖ్యంగా దక్షిణాది సినిమాల మీద రివ్యూ లు చేయడం మొదలుపెట్టారు ఈ ట్రెండ్ 2017 లో మొదలయ్యి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది పాకిస్థాన్ లో. 

నిజం చెప్పాలి అంటే ఏదన్నా ఒక తెలుగు సినిమాకి సంబంధించి ట్రైలర్ కావొచ్చు లేదా టీజర్ కావొచ్చు రిలీజ్ అవగానే వెంటనే పాకిస్తానీ యూ ట్యూబ్ ఛానెల్స్ దానిమీద కూడా రివ్యూ ఇవ్వడం మొదలుపెట్టారు. మొదట్లో కొంచెంగా చూసేవాళ్ళ సంఖ్య ఉన్నా రాను రాను అది లక్షల్లోకి వెళ్ళిపోయింది. ఫలితంగా వాళ్ళకి యూట్యూబ్ ద్వారా నెలకి కనీసం 500 డాలర్ల ఆదాయం రావడం మొదలుపెట్టి కొందరికి ఇప్పుడు అది నెలకి రెండు వేల డాలర్ల ఆదాయం ఇచ్చేంతగా ఎదిగింది. ఆదాయం రావడం మొదలవగానే పాకిస్తానీ యూట్యూబ్ చానెల్ ని నిర్వహించే వాళ్ళు తమ రివ్యూ లలో చాలా స్పష్టంగా ఎలాంటి యాస లేకుండా తెలుగు ని తెలుగు గా , కన్నడ ని కన్నడ గా చాలా స్పష్టంగా పలకడం లో జాగ్రత్త తీసుకోవడం వలన పాకిస్థాన్ తో పాటు భారత్ లో కూడా వీళ్ళ ఛానెల్స్ కి ఆదరణ లభించింది అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 

విశేషం ఏమిటంటే మన దక్షిణాది హీరో లని మనం పెద్దగా పట్టించుకొము కానీ పాకిస్తానీ యూట్యూబర్స్ మాత్రం ఇంటర్నెట్ లో వెతికి మరీ మనకి కూడా తెలియని విషయాలని ప్రస్తావిస్తున్నారు అంటే దక్షిణ సినిమా రంగం వాళ్ళని ఎంతలా ప్రభావితం చేసిందో అర్ధం చేసుకోవచ్చు. 

సంస్కృతి !

పాకిస్తానీయులు కూడా దక్షిణ భారత సంస్కృతి మీద అవగాహన పెంచుకున్నారు. కానీ అదే సమయంలో బాలీవుడ్ హీరోల పాశ్చత్య సంస్కృతి మీద ఉన్న మక్కువని ద్వేషించడం మొదలుపెట్టారు. ఇది మొదట 2017 లో ఉత్తర భారత ప్రేక్షకుల నుండి మెల్లగా పాకిస్థాన్ వరకు పాకింది. ఎవరి సంస్కృతి,సాంప్రదాయాలని వాళ్ళు పాటించడం అనేది ఏ దేశానికి అయినా మామూలే కానీ బాలీవుడ్ మాత్రం భిన్నంగా కనిపించడం మొదలయ్యే సరికి అది కాస్త మరింత ద్వేషానికి కారణం అయ్యింది. దక్షిణ భారత హీరోల ఆచార,వ్యవహారాల మీద నిశితంగా దృష్టి పెట్టడం మొదలయ్యే సరికి అది క్రమేణా బాలీవుడ్ హీరోల పాలిట శాపంగా మారింది. 

సినిమా ముహూర్త సమయంలో చేసే పూజ దగ్గర దక్షిణ భారత హీరోలు చెప్పులు,బూట్లు వదిలేసి మరీ వచ్చి కొబ్బరి కాయ కొట్టడం,హారతి కళ్ళకి అద్దు కోవడం దగ్గర నుండి ఉత్తరాది ప్రేక్షకులు తేడాని చూడడం ప్రారంభించారు మెల్లగా. కొన్ని బ్లాగులలో బాగా చదువుకున్న ఆధునికమయిన జీవన శైలిని గడుపుతున్న ఉత్తరాది విద్యావంతులు దక్షిణ,ఉత్తర భారత సినీ పరిశ్రమలోని తేడాలని స్పష్టంగా వేలెత్తి చూపడం కూడా ఉత్తరాది ప్రేక్షకుల వైఖరిలో మార్పు రావడానికి కారణం అయ్యింది. 

బాహుబలి సిరీస్ రెండూ కూడా ఉత్తరాదిన అఖండ విజయం సాధించడం వెనుక ఇంటర్నెట్ ప్రధాన పాత్ర పోషించింది. గంపగుత్తగా బాలీవుడ్ సినిమాలని అక్కడి ప్రేక్షకులు నిరాకరించడం మొదలయ్యి ఇప్పటికీ 5 ఏళ్లు అవుతున్నది కానీ ప్రేక్షకుల లో వచ్చిన మార్పుని గుర్తించకపోవడం బాలీవుడ్ నిర్మాత,దర్శకులు,హీరోల వైఫల్యం ఆని అనే కంటే డబ్బు తెచ్చిన అహంకారం అనే చెప్పాల్సి ఉంటుంది. 

సత్యం తెలుసుకునే సమయం ప్రేక్షకులు ఇచ్చినా దానిని సద్వినియోగం చేసుకోలేక పోయింది బాలీవుడ్. 

గుర్తింపు తో పాటు డబ్బుని ఇచ్చేదీ సగటు ప్రేక్షకుడు అన్న సంగతి మరిచిపోయిన బాలీవుడ్ కి అదే ప్రేక్షకులు తమ ద్వేషాన్ని వాళ్ళ సినిమాలని చూడకుండా ఉండడం లో విజయం సాధించారు. మరీ ముఖ్యంగా నటన విషయంలో అగ్ర హీరోల బండారం బయటపెట్టింది OTT . దక్షిణాది నటుల తో పోలిస్తే ఉత్తరాది నటుల [అందరూ కాదు ] నటనని పొలుస్తూ ట్రోలింగ్ వీడియొ లు కొ కొల్లలుగా వచ్చేశాయి యూ ట్యూబ్ లలో. ఇదీ మరో కారణం అయ్యింది బాలీవుడ్ విఫలం అవడానికి. 

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హత్య !

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మీద కొన్ని అగ్ర సినీ హౌస్ లు పగ పట్టాయి. అయితే వీటి వెనుక కారణం మాత్రం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి లభిస్తున్న ఫాలోయింగ్ కొందరు హీరోలకి నిద్ర లేకుండా చేసింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పేరులో ఉన్న రాజ్ పుత్ ని తీసేయమని ఒత్తిడి తెచ్చారు కానీ నేను రాజ్ పుత్ ని నా పేరుని నేను మార్చుకోను అంటూ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనడం కూడా పరోక్షంగా అతని హత్యకి కారణం అయ్యింది. నిజానికి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో పాటు రాజ్ కుమార్ రావ్,నావాజుద్దీన్ సిద్దికి లాంటి టాలెంట్ ఉన్న నటులు బాలీవుడ్ లో ఉన్నా వాళ్ళకి తగిన అవకాశాలు ఇవ్వలేదు. ఇక నవాజుద్దీన్ సిద్దికీని  అయితే B గ్రేడ్ సినిమాలకి పరిమితం చేసింది బాలీవుడ్. ప్రేక్షకులు మాత్రం టాలెంట్ కె తమ వోటు అని చెప్తున్నా కపూర్,ఖాన్,సిప్పీ ఇలా కుటుంబ వారసులకే అవకాశాలు ఇవ్వడం మానుకోలేదు. ఇక ముందు అలా జరగదు అని భావిస్తే పప్పులో కాలేసినట్లే. 

మొత్తంగా చూస్తే వరుస పరాజయాలతో బాలీవుడ్ పరిశ్రమ కుప్ప కూలే పరిస్థితిలో ఉంది ఇప్పుడు. ఎంత మాఫియా అయినా ఎల్ల కాలం డబ్బుని ఇస్తూ పోలేదు. ఎక్కడో అక్కడ దానికి ఫుల్ స్టాప్ పడక తప్పదు. లేకపోతే ఎలాంటి ప్రోమోషన్ లేకుండానే పుష్ప సినిమా హిందీ బెల్ట్ లో అంత వసూళ్లు ఎలా చేయగలిగింది ? ఇప్పుడు ఉత్తరాదిన అల్లు అర్జున్,రామ్ చరణ్,ప్రభాస్,జూనియర్ ntr లకి ఉన్న ఫాలోయింగ్ ఖాన్ బ్రదర్స్ కి లేదు. ఎంతో వ్యయ ప్రయాసలకి పోయి తీసిన పృధ్వీ రాజ్ చౌహాన్ ఫ్లాప్ అవడానికి కారణం బాహుబలి తో పోల్చి చూడడమే కారణం.  మళ్ళీ రాజమౌళి పృధ్వీరాజ్ మీద సినిమా తీసినా ప్రేక్షకులు చూస్తారు. కధని నడిపించడం ఎలానో దక్షిణాది దర్శకులు బాగానే తెలుసుకున్నారు ఇప్పుడు అదే విజయానికి కారణం అవుతున్నది. పుష్ప సూపర్ హిట్ అవగానే సుకుమార్ తీసిన అన్ని సినిమాలు యూట్యూబ్ లో లక్షల్లో వ్యూస్ వచ్చాయి అంటే అర్ధం చేసుకోవచ్చు. 

నిజానికి బాలీవుడ్ పతనానికి పునాది రాయి 20 ఏళ్ల క్రితమే పడ్డది , అది ఖుషీ సినిమాలో పవన్ మీద స్ట్రీట్ ప్లే ఆధారంగా చిత్రీకరించిన  'ఏ మేరే జహ ఏ మేరే ఘర్ మేరే ఆషియ ' అనే పాటని పూర్తిగా హిందీలోనే KK చేత పాడించి విజయం సాధించింది. అప్పట్లో బాలీవుడ్ హీరోలతో పాటు దర్శకులు కూడా ఖుషీ సినిమాని స్పెషల్ షో వేయించుకుని మరీ చూశారు. 

మారిన ప్రేక్షకుల అభిరుచి ఏమిటో తెలుసుకొని తీస్తే హిందీ సినిమాకి పూర్వ వైభవం వస్తుంది కానీ ఆ పని వాళ్ళు చేయడానికి సిద్ధంగా లేరనే అనిపిస్తున్నది. 

నటుల వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుందో అనే దానిని కూడా ఇప్పటి ప్రేక్షకులు పరిగణలోకి తీసుకుంటున్నారు అన్న సంగతిని బాలీవుడ్ గుర్తించలేదు. 

గత కొంత కాలంగా ఉత్తరాది సోషల్ మీడియాలో వైరల్ అయిన అంశం బ్రహ్మానందం తన చేతితో గీసిన వేంకటేశ్వర స్వామి చిత్రాన్ని అల్లు అర్జున్ కి బహుకరించిన ఫోటో. గిన్నీస్ బుక్ లో చోటు చేసుకున్న బ్రహ్మానందం ని కేవలం హాస్య నటుడుగా కాకుండా డౌన్ to ఎర్త్ అంటూ బ్రహ్మానందం సర్ అంటూ సంబోధించడం మొదలుపెట్టారు. ఈ గౌరవం ఖాన్ బ్రదర్స్ కి ఇవ్వడం మానేశారు. అదే ఇప్పటి అమీర్ ఎర్ర చెడ్డీ పరాజయానికి కారణం అయ్యింది. ఏదీ ఒక్క రోజులో జరిగిపోదు. ఎర్ర చెడ్డీ పరాజయం నేరుగా ఖాన్ త్రయం రాబోయే సినిమా బిజినెస్ మీద ఖచ్చితంగా ఉండి తీరుతుంది. మార్కెట్ ఉంటే ఎంత డబ్బు అయినా పెట్టి తీస్తారు కొంటారు. సినిమా ఫ్లాప్ అయితే బయ్యర్లకి డబ్బు తిరిగి ఇచ్చే సాంప్రదాయం బాలీవుడ్ లో లేదు. ఇదీ ఒక మైనస్ పాయింట్ అక్కడ. 

వోట్లు వేసేది,సినిమా హిట్ చేసేది ఒకళ్ళే అని వీళ్ళు ఎప్పుడు గుర్తిస్తారు ?

నీతి_కథ 🦅

 నీతి_కథ  🦅


తన చివరి శ్వాసను విడుస్తున్న , జటాయువు నేను రావణుడితో గెలవలేనని నాకు తెలుసు, అయినా కానీ నేను పోరాడాను. నేను పోరాడకపోతే, రాబోయే తరాలవారు నన్ను పిరికి వాడు అని అనుకుంటారు.


రావణుడు జటాయువు రెండు రెక్కలను తెంచినప్పుడు. అప్పుడు  మృత్యువు వచ్చింది. అపుడు జటాయువు మృత్యువుకు సవాలు విసిరాడు. 


"జాగ్రత్త! ఓ మృత్యువా ! ముందుకు రావడానికి సాహసం చేయద్దు. నేను ఎప్పటివరుకు మరణాన్ని అంగీకరించనో, అప్పటి వరకు నువ్వు నన్ను తాకవద్దు. నేను సీతామాత యొక్క సమాచారం  "ప్రభు శ్రీరాముడి" కి చెప్పనంత వరకు నా వద్దకు రావద్దు అన్నాడు! మరణం జటాయువును తాకలేకపోతోంది, అది నిలబడి   వణుకుతూనే ఉంది. మరణం అప్పటివరకు కదలకుండా నిల్చునే వుంది, వణుకుతూనే ఉంది. తాను  కోరుకోగానే చనిపోయే వరం జటాయువుకి వచ్చింది.


కానీ మహాభారతానికి చెందిన భీష్మ పితామహుడు 58 రోజులు బాణాల అంపశయ్య మీద పడుకుని మరణం కోసం ఎదురు చూశాడు. అతని కళ్ళలో కన్నీళ్ళు. ఏడుస్తూవున్నాడు. కానీ భగవంతుడు మనస్సులో తనకి తాను  చిరునవ్వు నవ్వుతున్నారు!


ఈ దృశ్యం చాలా అలౌకికమైనది.


రామాయణంలో జటాయువు శ్రీరాముడి  ఒడిలో పడుకున్నాడు. ప్రభు "శ్రీరామ్" ఏడుస్తున్నాడు మరియు జటాయువు చిరునవ్వు నవ్వుతున్నాడు.


అక్కడ మహాభారతంలో, 


భీష్మ పితామహుడు  ఏడుస్తున్నాడు మరియు "శ్రీ కృష్ణుడు" చిరునవ్వు నవ్వుతున్నాడు. తేడా ఉందా లేదా?


అదే సమయంలో , జటాయువుకు ప్రభువు "శ్రీరాముడి" ఒడి పాన్పుగా  అయింది. కాని భీష్మపితామహుడు  చనిపోయేటప్పుడు బాణం పాన్పుగా అయింది!


జటాయువు తన కర్మ బలం ద్వారా ప్రభు "శ్రీరాముడి" యొక్క ఒడిలో ప్రాణ త్యాగం చేసాడు.  జటాయువు ప్రభు శ్రీరాముడి శరణులోకి చేరాడు. మరియు బాణాలపై భీష్మపితామహుడు  ఏడుస్తున్నాడు. 


ఇంత తేడా ఎందుకు? 


ఇంతటి తేడా ఏమిటంటే, 


ద్రౌపది ప్రతిష్టను నిండు సభలో  పరువు తీస్తున్నా భీష్మ పితామహుడు  చూశాడు. అడ్డుకోలేకపోయాడు!

దుశ్శాసనునికి  ధైర్యం ఇచ్చారు. దుర్యోధనుడికి అవకాశం ఇచ్చాడు. కాని ద్రౌపది ఏడుస్తూనే ఉంది. ఏడుస్తూ, అరుస్తూ,అరుస్తూ వున్నా సరే భీష్మ పితామహుడు తల వంచుకునే వున్నాడు. ద్రౌపదిని రక్షించలేదు.


దీని ఫలితం ఏమిటంటే, మరణం కోరుకున్నప్పుడే  వరం వచ్చిన తరువాత కూడా, బాణాల అంపశయ్య దొరికింది.


జటాయువు స్త్రీని సన్మానించాడు. తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, కాబట్టి చనిపోతున్నప్పుడు, అతనికి ప్రభు “శ్రీరాముడి” ఒడి అనే పాన్పు లభించింది!


ఇతరులుకు తప్పు జరిగిందని చూసి  కూడా ఎవరు కళ్ళు తిప్పు కుంటారో,  వారి గతి భీష్ముడిలా అవుతుంది. ఎవరైతే ఫలితం తెలిసినప్పటికీ, ఇతరుల కోసం పోరాడుతారో వారు, మహాత్మ జటాయువులా కీర్తి సంపాదిస్తారు.


 #నిజం అనేది  కలత చెందుతుంది, కానీ ఓడిపోదు. 


" *సత్యమేవ జయతే "*

సేకరణ: వాట్సాప్ పోస్ట్.