5, జులై 2020, ఆదివారం

2020-2021 పంచాంగం కోసం క్రింద క్లిక్ చేయండి

https://web.whatsapp.com/#


గురుర్బ్రహ్మ శ్లోకం వివరణ

"గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురు స్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"
అయితే ఈ శ్లోకం ఎందులోది?
ఏ సందర్భంలోది? ఎవరు వ్రాశారు? వంటి సందేహాలు ఎవరికయినా ఎప్పుడయినా వచ్చాయా? నాకొచ్చాయిగా! 
ఈ శ్లోకం వెనుక అత్యంత ఆసక్తికరమయిన కథ ఉంది. ఈ కథ ఇంతకుముందు తెలిసినవారు మళ్ళీ చదివేయండి, తెలియని వాళ్ళు శ్రద్ధగా చదవండి

కొనేళ్ళ క్రిందట గురుకులాలు ఉండేవి. అలా ఒకానొక గురుకుల ఆశ్రమంలో ఒక గురువుగారు ఉండేవారు ఆయన పేరు వేద ధర్ముడు. ఆయన సర్వశాస్త్ర కోవిదుడు, జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట. ఈయన ఎందఱో పిల్లలని చేరదీసి, ఆయన వద్దే ఉంచుకుని, భోజనం పెట్టి, ఆశ్రయం కల్పించి ఆయనకొచ్చిన విద్యలన్నిటినీ నిస్వార్ధంగా బోధిస్తూ ఉండేవారు. అలా ఈయన వద్ద కౌత్సుడు అని ఒక శిష్యుడు ఎంతో గురుభక్తితో ఉంటూ, విద్యను అభ్యసిస్తూ తను కూడా జ్యోతిష్య శాస్త్రంలో పట్టు సాధించాడు. చదువు ముగిసిపోయాక శిష్యులంతా స్నాతక సభ (మన గ్రాడ్యుయేషన్ వంటిదనుకోండి) ముగించుకుని గురువుని, ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయేవారు. అలా కౌత్సుని విద్య కూడా చివరికి వచ్చేసిన సందర్భంలో ఒక సారి గురువుగారు ఏదో పని మీద ఊరు వెళుతూ ఆశ్రమ బాధ్యతలన్నిటినీ కౌత్సునికి అప్పగించి వెళతారు. ఆయన తిరిగివచ్చేసరికి ఆయన లేని లోటు లేకుండా అన్నీ యధావిధిగా జరుగుతుండటం చూసి సంతృప్తితో ఆనందిస్తారు గురువుగారు.

ఇదిలా ఉండగా, స్నాతక సభ జరిగే రోజు రానే వచ్చింది. అందరూ గురువుగారితో తమకున్న అనుబంధాన్ని చెప్పుకుని, ఆయన వద్ద ఆశీర్వచనాలు తీసుకుని తమ తల్లిదండ్రులతో తమ తమ ఇళ్ళకు వెళిపోయారు. ఈ కౌత్సుడు మాత్రం నోరు మెదపలేదు, తల్లి దండ్రులు ఎంత బ్రతిమాలినా వాళ్ళతో వెళ్ళడానికి విముఖత చూపించాడు. చేసేది లేక అతని తల్లిదండ్రులు వెళిపోతారు. గురువుగారు ఇతనిని పిలిచి తను మాత్రం వెళ్లకపోవడానికి కారణమేమిటని అడుగుతాడు. అప్పుడు కౌత్సుడు బోరున విలపిస్తూ "గురువుగారూ! మీరు పొరుగూరు వెళ్ళినప్పుడు మీరు నేర్పిన జ్యోతిష్య విద్యతో మీ జాతకం చూశాను, ఈ కార్తీక మాసం (పదిహేను రోజుల్లో) నుండి తమకి దారుణమయిన కుష్ఠురోగం రాబోతోందని మీ గ్రహస్థితి చెబుతోంది. నాకు చదువు నేర్పించి, తిండి పెట్టిన మిమ్మల్ని కష్టమయిన కాలంలో వదిలి వెళ్ళలేను. కనుక మీతోనే ఉండి సేవలు చేసి మీరు ఆరోగ్యవంతులు అయిన తరువాతే వెళతాను, అప్పటిదాకా మిమ్మల్ని వదిలిపోను" అంటాడు. అది విన్న గురువుగారు ఆశ్చర్యం, ఆనందం, దుఃఖం అన్నిటినీ కలగలిపిన ఒక అనుభూతితో ఆనంద భాష్పాలు రాలుస్తారు.

కౌత్సుడు మాత్రం ఈయనకి ఆ వ్యాధి రాకుండా ఏమేం చేయాలో ఆలోచించి గురువు గారితో ఫలానా జపాలు, పూజలు, యాగాలు చేద్దాం, తద్వారా మీకు రోగం రాదు అంటాడు. దానికి గురువుగారు "ప్రారబ్ధం భోగతో నస్యేత్" అన్నట్టుగా ప్రారబ్ధం అన్నది ఎప్పుడయినా అనుభవించాల్సిందే కనుక ఇప్పుడు అనుభవించి నేను విముక్తుడిని అవుతున్నాను అన్న ఆనందముతో ఉన్నాను కనుక నువ్వు బాధపడకు అంటాడు. అప్పుడు గురువుగారి మాటను కాదనలేక, కాశీలో పాపం చేసినా పుణ్యం చేసినా రెట్టింపు ఫలం వస్తుంది అంటారు కనుక మనం అక్కడకి వెళ్ళి పుణ్య కార్యాలు చేద్దాం తద్వారా మీరు త్వరగా కోలుకుంటారు అంటాడు. సరేనని ఇద్దరూ అక్కడకి ప్రయాణమవుతారు. కాశీ వెళ్ళిన తరువాత అక్కడ విద్యాదానం చేయటం, శివపంచాక్షరీ మంత్ర జపం చేయించటం, చేతనయినంతలో ఇతరులకి సహాయ సహకారాలు చేయటం, ఇలా ఎన్నెన్నో మొదలు పెట్టాడు కౌత్సుడు. మిట్టమధ్యాహ్నం కాళ్ళకి చెప్పులు లేకుండా జోలె పట్టుకుని (భిక్ష ద్వారా వచ్చినది మాత్రమే తినేవారు అప్పట్లో) తిరిగి అన్నాన్ని తెచ్చి గురువుగారికి పెట్టి, తను తినేవాడు. ఒక్కోసారి గురువుగారు ఆయన తినక, తనని తిననీయక అన్నాన్ని విసిరేసేవారు. చీటికీ మాటికీ కౌత్సుడిని కొట్టడం, తిట్టడం చేయటం, చీదరించుకోవటం వంటివి చేసేవారు. అయినా కూడా ఎక్కడా విసుక్కోకుండా గురువుగారికి వ్యాధి ముదిరి మరింత బాధపెడుతోంది కాబోలు పల్లెత్తు మాట అనని ఈయన ఇలా ప్రవర్తించడానికి కారణం అదే అనుకుంటూ మరింత సేవలు చేసేవాడు. కౌత్సుడి గురుభక్తిని గమనిస్తున్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒక పందెం వేసుకున్నారు, "మన ముగ్గురిలో ఎవరు కౌత్సుడిని గురువుగారి వద్దనుండి పంపుతారో వారే మనలో గొప్పవారు" అని.

ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం, గురువుగారిని ఇబ్బంది పెట్టి ఆనందించడం దేవుళ్ళ లక్ష్యం కాదు, కౌత్సుడు భగవంతుడు పరీక్షలు పెట్టే స్థాయిని చేరుకున్నాడు అని. సరే, అనుకున్నట్టుగా ముందుగా బ్రహ్మ మారు వేషంలో వచ్చి "నువ్వు కాశీ వచ్చినప్పటి నుండీ చూస్తున్నాను, ఎందుకాయన దగ్గర అన్ని మాటలు పడుతూ ఉంటావు, పెద్ద వాడిని చెప్తున్నాను, నా మాట విని వేరే గురువుని చూసుకుని వెళ్ళిపో" అంటాడు. దానికి కౌత్సుడు "గురువుని, అదీ ఇటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్న ఆయనని వదిలేయమని చెప్తున్న మీరు పెద్దవారెలా అవుతారు? మీరు మా గురువుగారి పరిస్థితుల్లో ఉంటే శిష్యుడు వదిలి వెళ్ళిపోవాలనే అనుకుంటారా?" అనేసరికి బ్రహ్మ నోట మాట రాక వెళ్ళిపోతాడు. తదుపరి విష్ణువు మారు వేషంలో వచ్చి "రోగముతో ఉన్న గురువుగారికి సేవ చేస్తున్నందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, కానీ చేసిన మేలు మఱిచే కృతఘ్నునికి సేవ చేస్తే పాపం కూడా వస్తుంది కనుక ఆయనని వదిలి వెళ్ళిపో" అంటాడు. దానికి కౌత్సుడు "కృతఘ్నత అన్నది ఏదయినా ఉంటే ఇటువంటి సమయములో వదిలి వెళిపోతే నాదవుతుంది కానీ నన్ను చేరదీసి, భోజనం పెట్టి, నా నుండీ ఏమీ ఆశించకుండా తన విద్వత్తునంతా ధారపోసిన ఆయనది కాదు" అనేసరికి విష్ణువు వెను తిరుగుతాడు. ఇహ ఈశ్వరుడు మారు వేషములో వెళ్ళి "మానవ సేవే మాధవ సేవ అన్న మాట వాస్తవమే కానీ ఇలా చీత్కారాలు పొందుతూ ఎందుకు? తను తినటం మానేయటమే కాక నువ్వు తినే వీలు కూడా లేకుండా అన్నం నేలపాలు చేయటం తప్పు కాదా? నువ్వు దూరమయితేనే నీ విలువ తెలిసొస్తుంది కనుక కొన్నాళ్ళు దూరంగా ఉండు" అంటాడు. దానికి కౌత్సుడు సాష్టాంగ పడి, "తిండికి లేక బాధపడే నాకు తిండి పెట్టడమే ఎక్కువ, పైగా జీవితమంతా తిండిని పొందగల వీలునిచ్చే విలువయిన విద్యని నాకు ధారపోశారు. కొన్ని సంవత్సరాల పాటు ఉచితంగా భోజనం పెట్టి వృద్ధి చేసిన ఆయనకి కొన్ని రోజులు నన్ను ఉపవసించేలా చేసే హక్కు ఉంది. కనుక మహానుభావా!! వీలయితే నాకొక సాయం చేయండి. మీ ముందు ఇంకో ఇద్దరు వచ్చారు, మీరిక్కడే కాపలా ఉండి ఇలాంటి అనవసరమయిన నీతులు మరెవరూ చెప్పకుండా చేయండి చాలు" అంటాడు.

అంతే ఆ ముగ్గురూ ఇతని గురుభక్తికి మెచ్చి "కౌత్సా! మేము త్రిమూర్తులం. నీ గురుభక్తికి మెచ్చాం, మేము పెట్టిన పరీక్షలో నువ్వు నెగ్గి నీ అపారమయిన గురుభక్తిని చాటుకున్నావు. నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాము" అంటారు. దానికి ఆనందించిన కౌత్సుడు "మీ దర్శన భాగ్యం నా అదృష్టం. మీ గురించి నాకు చెప్పింది మా గురువుగారే. ఇప్పుడు మీ దర్శన భాగ్యం కలిగించినది కూడా ఆ గురువుగారే. 

"గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురు స్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"

కనుక నాకు నా గురువే  బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, మీ ముగ్గురినీ సృష్టించిన ఆ పరబ్రహ్మ ఎవరయితే ఉన్నారో ఆయన కూడా నాకు నా గురువే. అందువలన నాకు మోక్షానికి అర్హత వచ్చింది అంటే, నాకు ఇన్ని నేర్పించి, ఇంతలా తీర్చిదిద్దిన మా గురువు గారికి కూడా ఆ అర్హత ఉన్నట్టే కనుక ఆయనకే ఇవ్వండి" అంటాడు. ఇటువంటి గురుభక్తి ఉన్నందుకు శిష్యుడినీ, అటువంటి గొప్ప శిష్యుడిని తయారు చేసినందుకు గురువునీ ఇద్దరినీ మెచ్చిన త్రిమూర్తులు ఇరువురికీ మోక్షాన్ని ప్రసాదిస్తారు.

ఇటువంటి కథలు విన్నప్పుడు, చదివినప్పుడు స్ఫూర్తిదాయకంగా అనిపిస్తాయి. ఏ పనయినా పూర్తి చేయటానికి అత్యంత ముఖ్యం, అతి ముఖ్యం, ముఖ్యం అని మూడు కారణాలుంటాయి(ట). ఉదాహరణకి అన్నం వండాలనుకోండి, అత్యంత ముఖ్యమయినది బియ్యం, అతి ముఖ్యమయినవి నీళ్ళు, మంట, పాత్ర, మొ., ముఖ్యమయినది వండే విధానం తెలియటం. అదే విధముగా ఉద్యోగం సంపాదించి సుఖంగా జీవిస్తున్నారు అంటే గురువులు నేర్పిన విద్య అత్యంత ముఖ్యమయినది, అతి ముఖ్యమయినవి మన శ్రద్ధ, క్రమశిక్షణ, మొ., గురువులు నేర్పిన చదువులు బుద్ధికి పట్టేలా చేయగల బుద్ధిని ఇచ్చిన తల్లిదండ్రులు ముఖ్యమయినవారు. అందుకనే మాతృదేవోభవ, పితృదేవోభవ తరువాత ప్రాముఖ్యతని ఆచార్యదేవోభవ అంటూ గురువుకి ఇచ్చారు. ఇటువంటి జ్ఞానం మనకి అలవడిన నాడు నా కృషి వల్లనే నాకు ఉద్యోగం వచ్చింది అన్న అహంకారం ఉండదు. మరీ కౌత్సుడంత లేకపోయినా అసలంటూ గురుభక్తి పెంచుకుని, గురువులని గౌరవించాలని ఆశిస్తూ గురువులందరికీ అంకితం....

గురుపూర్ణి మా వైశిష్ట్యము

ఒక్క అక్షరమును నేర్పించినవారిని కూడా గురువని గౌరవించడము మన ధర్మము. అటువంటప్పుడు శ్రేష్ఠమైన బ్రహ్మవిద్యను బోధించేటటువంటి జగద్గురువులయందు ఎటువంటి శద్ధాభక్తులను కలిగియుండవలెననెడిది స్పష్టమగును.
యస్య దేవే పరాభక్తిర్యథా దేవే తథా గురౌ ।
తస్యైతే కథితా హ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః॥

ఎవరు గురువును దేవుడివలె చూస్తారో మరియు గురువు విషయంలో అపారమైన భక్తిని కలిగియుంటారో, వారికి సకల శ్రేయస్సులూ లభించును అని ఉపనిషత్తు తెలియజేస్తోంది. ధర్మమార్గమును బోధించి ఇహమునందు సుఖశాంతులను అనుగ్రహించడమేగాక, బ్రహ్మవిద్యను ఉపదేశించి దుఃఖమయమైన సంసారసాగరమును దాటించెడి వారు గురువులు. ఆత్మతత్త్వమును తెలిసికోగోరిన శిష్యుడు గురువును ఆశ్రయించవలెనని ఉపనిషత్తులు తెలుపుచున్నవి. దానినే భగవద్గీతలో కూడా తత్త్వదర్శులూ, జ్ఞానులూ అయిన గురువులను ఆశ్రయించి, వారిని సేవించి, వారినుండి తత్త్వమును తెలుసుకోవాలని ఉపదేశించబడినది –

తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ।
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్త్త్వదర్శినః॥

అటువంటి గురువరేణ్యులను కలిగియున్న అవిచ్ఛిన్న పరంపరలో రత్నసదృశులైనటువంటి శ్రీకృష్ణపరమాత్మని, వేదవ్యాసమహర్షులను మరియు శ్రీమత్ శంకరభగవత్పాదాచార్యులను విశేషముగా పూజించి తదనంతరము సదాశివునినుండి మొదలైన గురుపరంపరలో ఉన్నట్టి అందరు గురువర్యులను స్తుతించి వారి కృపకు పాత్రులగుట గురుపూర్ణిమ యొక్క వైశిష్ట్యము.

భృగువు చరిత్ర

శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-2
 భృగువు చరిత్ర

 భృగువు బ్రహ్మమానసపుత్రులలో ఒకఁడు.
ఇతని పుత్రుఁడు కవి. పౌత్రుడు అసురులకు గురువు అయిన శుక్రాచార్యులు.

భార్గవ వంశ మూలపురుషుడు అయిన  భృగువు బ్రహ్మ హృథయ స్థానం నుండి జన్మించెను

ఇదికాక ఇతనికి ఖ్యాతివలన ధాత, విధాత అని ఇరువురు కొడుకులు కలిగిరి. అందు ధాతకు మృకండుఁడు, విధాతకు ప్రాణుఁడును జన్మించిరి.

ప్రాణుని కొడుకు వేదశిరుఁడు. వేదశిరుని కొడుకు ఉశేనస్సు. మృకండుని కొడుకు మార్కండేయుఁడు.

భృగు మహర్షి ప్రజాపతులలో నవ బ్రహ్మలలో అగ్రజుడు కనుక ఆయన అత్యంత శక్తివంతుడే కాకుండ సకల దేవతలకు సకల ఋషులకు మానవులకు పూజ్యుడు
వారుణ యాగమున అగ్ని తేజమున జన్మించెను కనుక "వారుణీ విద్య" కు అధిపతి అయ్యారు

ఇతఁడు భాగీరథీ దక్షిణతీరమున మహాపద్మము అనియెడు పురమునందు ఉండెను

అతని భార్య  పులోమ గర్భవతిగా ఉన్నప్పుడు, ఒకనాడు భృగువు “నేను నదీ స్నానానికి వెళ్ళొస్తాను, ఈలోగ నువ్వు నిత్యాగ్నిహోత్రానికి అవసరమిన  సామాగ్రి కూర్చుము” అని చెప్పి వెడలినాడు.

పులోమ హోమగుండంలో అగ్ని వెలిగించి, మిగతా పనులు చేసుకుంటూ వుండగా
పులోముడు అను రాక్షసుడు, అక్కడికి వచ్చి ఆమెను చూసి కామించి, ఆమె గురించి అగ్నిదేవున్ని అడుగుతాడు.

" నేను నిజం చెప్పిన పులోమకి హాని కలుగును, అబద్ధము చెప్పిన నాకు అసత్య దోషము అంటును అని" అని అగ్నిదేవుడు యోచించి

చివరికి నిజమ చెప్పాలనే నిర్ణయంతో, ఆమె భృగు మహర్షి భార్య పులోమ అని చెప్తాడు.

పులోముడు ఆమెను పెళ్ళి కాకముందు ప్రేమిస్తాడు
కాని పులోమ తిరస్కరిస్తుంది.
ఇప్పుడు సమయం వచ్చిందని ఆమెను చెరబట్టాలని నిశ్చయించి
 పేద్ద వరాహంగా మారి ఆమెను తన భుజాలపై వేసుకుని పారిపోవడానికి ప్రయత్నించగా ఆమెకు ప్రసవం జరిగి మగ పిల్లవాడు జన్మిస్తాడు

అతనే చ్యవనడు, అత్యంత శక్తి మంతుడు
.
ఆ బాలుడు కోపంతో పులోమున్ని చూడగానె, మంటలలో పులోముడు కాలిపోతాడు.

అప్పుడు పులోమ ఆ పిల్లవాని తీసుకొని ఆశ్రమానికి పోయి జరిగిందంతా భృగువు కి చెప్తుంది.
భృగువు కోపంతో నీ గురించి ఎవరు చెప్పారు అని అడుగుగా అగ్నిదేవుడు చెప్పాడు అని పులోమ చెప్తుంది.
అగ్నిదేవుడు నేను అబద్ధం చెప్పిన పాపం చుట్టుకుంటుందని నిజం చెప్పాను అని
 పలుకగా   భృగువు " ఇక నుండి నువ్వు సర్వభక్షకునివి అగుదువు" అని శపిస్తాడు.

అప్పుడు అగ్నిదేవుడు "నేను సర్వభక్షకున్ని అయిన, దేవతలకు హవిస్సులు ఎలా తెసుకెళ్ళలి" అని, తన మంటలను ఆపివేస్తాడు.

ఇక హోమాలు, దేవతలకు హవిస్సులు లేకపోవడంతో బ్రహ్మదేవుడు అగ్ని దగ్గరికి వచ్చి   "ఓ అగ్నిదేవా, భృగువు శాపం ప్రకారం నువ్వు సర్వభక్షకునివే,
కానీ నీ పవిత్రత పోలేదు కావున నువ్వు ఎప్పటిలాగే దేవతలకు హవిస్సులు చేరవేస్తూండు" అని చెప్పగా  అగ్నిదేవుడు అంగీకరిస్తాడు

ఇంతటి  శక్తి మంతుడు ఆ భృగు మహర్షి అంతే కాక

భగవద్గీతలో శ్రీ కృష్ణ పరబ్రహ్మ భృగువు గురించి ఇలా పలికెను

శ్లో: మహర్షీణాం భృగురహం గిరామస్మ్యక మక్షరం!
 యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయం!!

మహర్షులలో భృగుమహర్షిని నేనే

అక్షరములలో ఓంకారమును నేనే

యజ్ఞములలో జపయజ్ఞము నేనే

స్థావరములలో హిమాలయమును నేనే యని పరమాత్మ పలికెను

అనగా శ్రీ మహా విష్ణువే "భృగు మహర్షి" యని అవగతమవుతున్నది

తన తపఃశక్తిచే తన పాదమునఒక నేత్రం మొలిచేలా చేసుకున్నమహా విశిష్టత కలిగిన మహాత్ముడు భృగు మహర్షి

ఆందువల్ల త్రిమూర్తులను పరీక్ష జేయగల కార్యమాయన మాత్రమే నిర్వర్తింపగలడు అని నిశ్చయించినారు

 తక్కిన మునులు కూడా ‘‘భృగువును పంపినచో పని చక్కబడును’’ అని ఏకీభవించిన వారయి వారి ఆమోదమును తెలిపిరి.

భృగువు తన పై బెట్టిన దుష్కర కార్యసాధనకై వారి వద్ద శెలవు గైకొని వెడలినాడు..


 నిత్యనిర్మల గోవిందా, నీలమేఘశ్యామా గోవిందా, పురాణపురుష గోవిందా, పుండరికాక్ష గోవిందా; |

 గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. | 

శ్రీవేంకటేశ్వరునిదివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం

🌸 ఓం నమో వెంకటేశాయా🌸

బ్రహ్మము వేరు, బ్రహ్మదేవుడు వేరు


మనందరికీ తప్పకుండా తెలిసిన శ్లోకం ఒకటుంది.

శ్లో।। గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దే వో మహేశ్వరః
గురుః సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ।।

శ్లోకాన్ని అర్థంచేసుకోవడానికి అందులోని పదాల్ని విడదీయాలి. దీన్ని పదవిభాగం అంటారు.
పై శ్లోకానికి పదవిభాగం ఇలా ఉందిగురుః, బ్రహ్మా, గురుః, విష్ణుః, గురుః, దేవః, మహేశ్వరః, గురుః, సాక్షాత్, పరంబ్రహ్మ, తస్మై, శ్రీగురవే, నమః. నమః = నమస్కరిస్తున్నాను, (ఎవరికి) శ్రీగురవే = దైవస్వరూపుడైన గురువుకు. (గురువు ఎలాంటివాడు?) గురుః = గురువు, బ్రహ్మా = సృష్టికర్త అనబడే నాలుగు తలల బ్రహ్మదేవుడు (తో సమానుడు). గురుః విష్ణుః = గురువు విష్ణువు (తో సమానుడు). గురుః = గురువు, దేవః మహేశ్వరః = దేవుడైన మహేశ్వరుడు (తో సమానుడు). గురుః సాక్షాత్ = గురువు సాక్షాత్తుగా, పరంబ్రహ్మ = పరబ్రహ్మము. అలాంటి గురువుకు నమస్కారమని అర్థము.

ఇందులో మొదటి వాక్యంలో బ్రహ్మా అని హకారానికి దీర్ఘ ముంది. రెండవ వాక్యంలో బ్రహ్మ అని హకారం హ్రస్వంగా ఉంది. రెండింటికీ తేడా తెలియడం చాల ముఖ్యం. పురాణవాఙ్మయంలో నాలుగు తలల బ్రహ్మదేవుణ్ణి, సరస్వతీదేవి భర్త ను గూర్చి తెలుసుకుంటాం. ఇతడొక వ్యక్తి. నాలుగు తలలు, నాలుగు వేదాలకు ప్రతీకలు (symbols). ఇతను బ్రహ్మదేవుడు. రెండవ వాక్యంలో చెప్పిన బ్రహ్మ ఒక వ్యక్తి కాదు. ఇంతకుముందు చెప్పుకున్న సత్యము, జ్ఞా నము, అనంతము అనబడే శుద్ధ చైతన్య స్వరూపము. దీనిని బ్రహ్మము అంటామనీ, అన్ని దేవతా స్వరూపాలూ దీనిలోని భావనలేననీ, సృష్టికి కారణం. 

ఇది  బ్ర. శ్రీ. డా. కె. అరవిందరావు విరచించిన పురోహిత ప్రపంచం అనే గ్రంథంలోని 52 పేజీ నుండి సంగ్రహణ 

జై హిందు

శ్లో।। తావద్ గర్జంతి శాస్త్రాణి జంబుకా విపినే యథా ।
న గర్జ తి జటాస్ఫోటాత్ యావద్ వేదాంతకేసరీ ।।

ఇతర మతాలూ వాటి మతగ్రంధాలు ప్రపంచంలో వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఎలాగంటే ఒక అడవిలో నక్కలు తిరుగుతూ అరుస్తూ(ఊళ ) వుంటాయో అలాగ 
మన హిందూ ధర్మ శాస్త్రాలైన వేదాలు జూలు విదిలించి గర్జిస్తే అవి అన్ని మిన్నకుంటాయి. అని ఈ శ్లోక అర్ధం.  

దీనిని బట్టి పూర్వంకూడా మన హిందూ ధర్మం మీద జరిగిన ఇతర మత ప్రబోధాలు ఉన్నట్లు తెలుస్తుంది.  కాబట్టి ఓ హిందువా మేలుకో మన జాతిమీద ఇతర మతాల ప్రభావం ఇప్పటిది కాదు.  మనం మన సంస్కృతీ తెలుసుకొని ఇతరులను వారి విమర్శలనుండి మన హిందూ ధర్మాన్ని కాపాడటానికి పూనుకోవాలి. 
జై హిందు
ఓం శాంతి శాంతి శాంతిః
సర్వే జన సుఖినోభవంతు,
  

*పదవి విరమణ పొందిన ఒక ఉద్యోగి అంతరంగం*



సమయం  గడిచిపోయింది, 
 ఎలా  గడిచిందో తెలియదు, 
జీవితమనే..పెనుగులాటలో..... వయసు  గడిచిపోయింది                   తెలియకుండానే....

✍భుజాలపైకి ఎక్కే పిల్లలు  భుజాలదాక వచ్చేశారు.
తెలియనేలేదు..
 
✍అద్దె ఇంటి నుండి  చిన్న గా మొదలైన  జీవితం. ఎప్పుడు  మన ఇంట్లో కి వచ్చామో,
 తెలియనే లేదు.......

✍ఆయాసంతో   సైకిల్  పెడల్ కొడుతూ..కొడుతూ..
కారు లో తిరిగే స్ధాయి కి ఎప్పుడొచ్చామో,
 తెలియనే లేదు......

✍ఒకప్పుడు  తల్లిదండ్రుల బాధ్యత  మాది. కానీ 
ఇప్పుడు  నా పిల్లలకు  నేను బాధ్యత గా మారాను 
ఇది కూడా  ఎలా  జరిగిందో  తెలియనే లేదు.....

✍ఒకప్పుడు   పగలు  కూడా  హాయిగా  నిద్ర పోయే వారం..
కానీ ఇప్పుడు  నిద్ర రాని  రాత్రులు  ఎన్నో ఇది కూడా ఎలా జరిగిందో తెలియనే లేదు....

✍ఒకప్పుడు  నల్లని కురులనుచూసుకొని  గర్వంగా  వగలు పోయే వాళ్ళం..
అవన్నీ  ఎప్పుడు  తెల్లగా  మారాయో,
తెలియనే లేదు...

  ✍ఉద్యోగం  కోసం  తిరిగి  తిరిగి  ..ఉద్యోగం పొందాక ఎప్పుడు  రిటైర్  అయ్యామో..
తెలియనేలేదు....

✍పిల్లల కోసం  ప్రతిదీ  అని ఎంత తాపత్రయం  పడ్డామో..
వాళ్ళు  ఎప్పుడు  దూరంగా  వెళ్లి పోయారో,
 తెలియనే లేదు.....

✍రొమ్ము విరుచుకొని అన్నదమ్ముల,అక్కచెల్లెండ్ల  మధ్య  గర్వంగా  నడిచే వాడిని  ఎప్పుడు  అందరూ...దూరమయ్యారో తెలియనే లేదు....

✍ఇప్పుడు   ఆలోచిస్తున్నాను..
నా కోసం..నా శరీరం  కోసం   ఏమైనా  చేసుకోవాలని..
కానీ..
శరీరం  సహకరించడం లేదు. 

 ✍ఇవన్నీ..జరిపోయాయి..
కానీ  కాలం  ఎలా  గడిచిందో....
తెలియనేలేదు..... తెలియనేలేదు....

     🦜It's  truth  of life.🦜

గురుపూర్ణిమ

🌹🌹వ్యాస పూర్ణిమ🌹🌹

శ్లో!! వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్!!

వశిష్టుని మనుమడు, పరాశర మహర్షి కుమారుడు శుకమహర్షి తండ్రైన వ్యాసుడు భగవత్తత్వాన్ని మానవజాతికి అందించిన దైవాంశ సంభూతుడు

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే అని.

సోమకుడనే రాక్షసుడు  వేదాలు అపహరించాడు అవి అన్నీ ఒకే రాశిగా విడదీయడానికి సాధ్యం కాని విధంగా ఉన్నాయి. అయితే వ్యాసుడు ఆ వేదాలను విభజించి, తిరిగి మనకు ప్రసాదించాడు. 

వ్యాసుడు గొప్ప విజ్ఞాన పారంగతుడు. మహాభారత ఇతిహాసాలు రచించిన వ్యాసుడు, ప్రాచీన పవిత్ర గాథలకు మూలమైన అష్టాదశ పురాణాలను సంకలనం చేశాడు. ఇవన్నీ చేయడం మానవమాత్రుడికి సాధ్యమా?

అందుకే ఆయనను మహావిష్ణువు అవతారంగా భావిస్తారు

జగద్గురువుల్లో మొదటివాడు వ్యాసుడే. వ్యాస పూజ అంటే వేద పూజ, ఈశ్వర పూజ.

దైవానుగ్రహం కావాలంటే, గురువు ఆశీస్సు లభించాలి.

శ్లో!! గు కారో అంధకారస్యాత్                                               రు కార స్తన్నిరోధకః అంధకార నిరోదిత్వాత్ గురురిత్యభిధీయతే !!అంటుంది గురుగీత

మనలోని అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టి జ్ఞాన జ్యోతిని వెలిగించి దారి చూపినవాడే గురువు.

ఆధ్యాత్మిక మార్గాన్ని బోధించే జ్ఞాన సంపన్నులను గురువులుగా పరిగణించి వారి శిష్యులు వారిని పూజిస్తారు. గురు పౌర్ణమి నాడు మనం పూజించే వ్యాసుడు ఫలానా వ్యక్తి అని ఒక్కర్ని గురించి చెప్పే పదం కాదు. అది పదవి! అది సకల కళానిధి మహాజ్ఞాని అయిన వేదవ్యాసుడు పరంపరలో వచ్చిన, వస్తున్న, రాబోయే గురువులందరికీ చెందుతుంది. అందువల్ల వ్యాస పూర్ణిమ నాడు ఎవరి గురువులను వారు ఆరాధించుకోవచ్చు.
కలియుగంలో ఈ సంప్రదాయాన్ని ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్లు చెబుతారు.

ఒకప్పుడు యతులు, సర్వసంగ పరిత్యాగులు పాటించిన ఈ పర్వదినం, ప్రస్తుతం జన సామాన్యంలోకి వచ్చింది. నేపాల్ లో ఇది ముఖ్యమైన పండుగ. మన దేశంలో అనేక విద్యాలయాల్లో గురుపూజ, వ్యాస పూజ జరుగుతాయి. శంకర పీఠాల్లో గురుపూర్ణిమ భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తారు

వ్యాసునికి మరోపేరు కృష్ణ ద్వైపాయనుడు.

మానవజాతికి మహోపదేశం చేసేవి వేదాలు.

సోమరితనం పాపమని, కృషిచేసేవాడికే దైవం తోడ్పడతాడని, శ్రమలోనే సంపద ఉంది ఉత్సాహవంతుడికి విద్య లభిస్తుందని, మనసు ఎప్పుడూ శుభాన్ని కోరాలని, అన్ని ప్రాణుల్నీ స్నేహబుద్ధితో చూడాలని... వేదం వచిస్తోంది. ధార్మిక సేవకు వేదం మూలమని మనుస్మృతి పేర్కొంది.

ఇలాంటి అద్భుత వైదిక వాంగ్మయం నేటికీ మనకు లభించడానికి కారకుడు వ్యాసుడు.

మన పవిత్ర గ్రంథం భగవద్గీత. తిలక్, గాంధీలను కార్యోన్ముఖులను చేసిన భగవద్గీత మహాభారతంలోని. అంతేకాదు పాశ్చాత్య దేశాలు సైతం గీత గొప్పదాన్ని కీర్తిస్తున్నాయి. గీత ద్వారా భగవానుడుతో చెప్పించిన అనేక అంశాలు మేనేజ్మెంట్ పాఠాలు అమోఘం. వేదసారాన్ని పిండి పంచమవేదమై మహాభారతాన్ని అందించిన మహర్షి వేదవ్యాసుడు. 

ఏదైనా కొత్త రచనలు చేసేవారిని వ్యాసుడు అనడం సహజం. వేదబోధను సామాన్యుల చెంతకు చేర్చడానికి భారతాన్ని రచించి మళ్లీ భారత ఉపదేశాన్ని భగవద్గీత ద్వారా ఆయన అత్యంత రమణీయంగా సంక్షిప్తీకరించాడు. ఆది శంకరుల వారి భాష్యంతో భగవద్గీతా జ్ఞానం అందరికీ మరింత చేరువ అయ్యింది.           
సత్యవతి, పరాశరుడు పుత్రుడైన వ్యాసుడు భారతాన్ని రచించడమే కాదు, అందులో తానూ ఒక పాత్రగా పలు పర్యాయాలు దర్శనమిస్తాడు. భారత రచన సంతృప్తి చెందని వ్యాసుడు, భాగవతాన్ని రచించి ధన్యుడయ్యాడు. వేదం ప్రభువులా శాసిస్తే, పురాణం మిత్రుడిలా కథారూపంలో ప్రబోధిస్తుంది. ఇలా భారతీయ సాంస్కృతిక మూలస్తంభాల నిర్మాతగా వ్యాసుడు అందరికీ పూజ్యనీయుడయ్యాడు.   
 
"వ్యాసోచ్చిష్టం జగత్సర్వం" అన్నారు. వ్యాసుడు స్పృశించని అంశం లేదు. సమస్త వాంగ్మయాన్ని వ్యాసుడు పట్టకున్నాడు.

ఆయన జన్మించిన రోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి. ఆధ్యాత్మిక జ్ఞాన ప్రదాతలందరికీ ఆద్యుడైన వ్యాసుడి పుట్టినరోజు పండుగ గురుపూజోత్సవంగా, కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతం ఆచరిస్తారు. శివభక్తులు శివ శయనవ్రతాన్ని పాటిస్తారు. ఆధ్యాత్మికవేత్తలకే పరిమితమైన వ్యాసపూర్ణిమ నేడు సర్వజన హృదయాలకు గురుపౌర్ణమి వ్యాప్తి చెందడం విశేషం.
   
శ్లో!! గురుర్ర్బహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః !!

గురువు త్రిమూర్తి స్వరూపుడు. బ్రహ్మ జ్ఞానాన్ని మనలో పుట్టించి, విష్ణువై రక్షించి, శివుడిలా అజ్ఞానాన్ని తుంచి మంచి చెడులను విశదీకరించి మానవతా విలువలు, సద్గుణ సంపన్నతలు ఎలాపొందాలో నేర్పుతాడు. మనసు నుంచి ఆలోచనలు ఆవిర్భవిస్తాయి. సర్వవ్యాపకమైన మనసు విష్ణు స్వరూపం. విష్ణుమూర్తి నాభి నుంచి ఉద్భవించిన బ్రహ్మ మాదిరిగానే వాక్కు కూడా మనసు నుంచి ఆవిర్భవిస్తుంది. బ్రహ్మ వాక్కు...ఈశ్వరుడే హృదయం. ఇలా మన వాక్కు మనసు, హృదయం త్రిమూర్తాత్మకమై ఉంటాయి

త్రిమూర్తులు మనలోని త్రిగుణాలకూ ప్రతీకలు

గురువు మనలో మంచిని సృష్టించి, లోకంలో ఎలా జీవించాలో నేర్పుతాడు. అమాయకత్వాన్ని, మోహాన్నీ తుంచివేసే శక్తి సంపన్నుడు.

అంతేకాదు గురువు గుణాతీతుడు, రూపరహితుడు భగవత్ సమానుడు.

జ్ఞానాన్ని కోరేవారు తమ ఆధ్యాత్మిక గురువులు ఈ రోజు స్మరించి ఆరాధించి కృతజ్ఞతలను తెలియజేస్తారు. భుక్తి విద్యలు కాక ముక్తి విద్యను బోధించే గురు దర్శనానికి , స్మరణనకు ఈ రోజు విశిష్ట ప్రాముఖ్యత ఉంది. చంద్రుడు మనసునూ, సూర్యుడు బుద్ధి ప్రకాశింపజేస్తారు. మానవుల మనసులో అష్టమదాలూ,అరిషడ్వర్గాలూ, అహంకార చిత్తం అనే పదహారు మలినాలు పూర్ణిమ నాడు గురు నామస్మరణతో తొలగిపోతాయి

గురువును ఎందుకు స్మరించాలి ? ఎందుకు దర్శించాలి? కృతజ్ఞతలు ఎందుకు తెలపాలి? అనే సందేహాలు సహజంగా ఏర్పడతాయి. గురువు ఒక శిల్పి లాంటి వాడు. బండరాళ్లపై అందమైన శిల్పాలు చెక్కి వాటికి ప్రాముఖ్యతను కలిగించగల ప్రజ్ఞాశాలి గురువు. ఓ మంచి గురువు మలచిన శిష్యులు సంస్కారవంతులై ,సమాజానికి ఉపయోగపడతారు.

అలా గురువు సమాజ సేవ చేస్తున్నారు.

స్వర్ణకారుడు బంగారాన్ని సానబట్టి తయారు చేసిన ఆభరణం ధరించేవారికి అందాన్ని ఇస్తుంది. అలాగే గురువు కూడా శిష్యులను సానబట్టి సద్గుణాలు నేర్పి పరిపూర్ణ మానవుడిగా మార్చి సమాజానికి అలంకారంగా అందిస్తున్నాడు. తోటమాలి నేను చక్కగా చదునుచేసి మొక్కలు నాటి ఎరువు వేసి పెంచి పోషించి అందరికీ ఉపయుక్తమైన ఫలాలు పుష్పాలు ఎలా అందిస్తాడో గురువు కూడా శిష్యులను సమాజానికి అలంకారాలుగా అందిస్తాడు.

గురువు మార్గ దర్శకుడు ,తన శిష్యులు ఏది ఎలా చేయాలో, ఎంత వరకు చేయాలో, ఏది మంచి, ఏది చెడు అని నిర్ణయించగలరు.
వ్యాసమహర్షి మానవజాతి అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి దైవత్వాన్ని చూపే శ్రుతి, స్మృతి పురాణాలు, శాస్త్రాలు అందించిన గురువు
వేద విభజన చేయడం వల్ల వేదవ్యాసుడు ప్రసిద్ధిగాంచినాడు.

పుట్టుకతో నలుపు రంగులో ఉండడంతో క్రిష్ణ ద్వైపాయనుడు అని నామకరణం చేశారు. పుట్టిన వెంటనే తల్లి అనుమతి తీసుకుని తపోవనానికి వెళ్లిపోయాడు. ఇతనికి బాదరాయణుడు, క్రిష్ణుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇక వ్యాసుడు అనేది ద్వాపరయుగంలోని ఒక పదవి పేరు. ప్రతీ ద్వాపరయుగంలోనూ ఒక వ్యాసుడు జన్మిస్తాడు వేదాల్ని నాలుగు భాగాలుగా విభిజించి క్రిష్ణ ద్వైపాయనుడు, వేద వ్యాసుడిగా మారాడు.

నాలుగు వేదాలను తన శిష్యులకు బోధించి వారిచే ప్రచారం చేయించాడు. శిష్యుల్లో రుగ్వేదం పైలుడు, యజుర్వేదం వైశంపాయునికి, సామవేదం జైమిని, అధర్వణ వేదం సుమంతునికి బోధించాడు

వేదాల్లోని సారాలను పదిమందికి చేరేలా చేసి సమాజంలో మంచి మరింత పెంచడానికి ప్రయత్నించాడు కాబట్టే మనకు గురువయ్యాడు

వ్యాస పూర్ణిమ రోజున కింది శ్లోకాన్ని పఠించి విష్ణు పురాణం దానమిస్తే అంతా మంచే జరుగుతుంది.

శ్లో!!శంకరం శంకరాచార్యం గోవిందం బాదరాయణం సూత్ర భాష్యకృతౌ వందే భగవంతౌపునః పునః.!!

గురువు భగవంతునికన్నా శక్తివంతుడు. ఆయన కోరికలను తీర్చడం... శిష్యునికి ఏది అవసరమో అందిస్తారు. గురువు గొప్పదనం గురించి వర్ణించిన ఓ మహానుభావుడు 'గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు.

కాని వర్షంలో వెళ్లడానికి ఉపయోగపడుతుంది

గురువు ఆ గొడుగులాంటి వాడు' అని అన్నాడు

గురువు, గోవిందుడు ఒకేసారి దర్శనమిస్తే ముందు తాను గురువు నమస్కరిస్తానని కబీరు తన దోహాలులో పేర్కొన్నాడు. దీనికి కారణం గోవిందుడి గురించి వర్ణించి చెప్పింది గురువు కాబట్టి

అవతారమూర్తులై రాముడు, కృష్ణుడు అందరూ గురువుల వద్దనే విద్య నేర్చుకున్నారు.

ఆషాఢ పూర్ణిమ గురుపూర్ణిమ, వ్యాస పూర్ణిమ జరుపుకుంటాం.

గీతోపదేశం చేసిన కృష్ణుడు కృష్ణం వందే జగద్గురుం అని కీర్తిస్తున్నాం. తర్వాత కాంలో అనేక మంది గురువులు ఉద్భవించారు. వేదాలకు భాష్యం రాసి అస్పృశ్యుడిలోనూ భగవంతుణ్ణి దర్శించిన ఆదిశంకరులను. లోక కల్యాణానికి గుణమే ప్రధానం కాని కులం కారణం కారాదని ప్రవచించి ఆచరించిన శ్రీ రామానుజుల వారిని గురువుగా స్వీకరించారు. సదాచార సంపన్న వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరమ్' అని గురువును నిత్యం స్మరిస్తూ ఉంటారు. గతంలో కాదు నేటికి అనేక మంది గురువులు మన కళ్ల ముందే ఉన్నారు.

🌹గురువులను పూజిద్దాం🌹

*తిరుమల లో శ్రీవారి ధ్వజస్తంభం వెనుక ఉన్న  కథ మీకు తెలుసా...?*
కర్ణాటక దండేలీ అడవుల్నుంచి 75 అడుగుల పొడవున్న 6 టేకుమానులు తీసుకుని 16 చక్రాల ట్రాలీ బయలుదేరింది. ఇంత భారీ వాహనం చేరాల్సిన గమ్యం 430 కిలోమీటర్లు!

డ్రైవర్ రెండు చేతులూ జోడించి దేవుని ప్రార్ధించాడు.
వందల కంఠాలు *"గోవిందా! గోవిందా!"* అంటూ ప్రతిధ్వనించాయి. అతన్ని ఏ శక్తి నడిపిందో మరుసటిరోజు సాయంత్రానికి గమ్యానికి చేరువలో అలిపిరి వద్దకు ఆ ట్రాలీ చేరుకుంది. 

డ్రైవర్ దిగి కొండవేపు చూశాడు. కలియుగ దైవం వేంచేసివున్న సప్తగిరి. చుట్టూ చూశాడు. వేలాది యువతులు 
హారతులిచ్చి, గోవిందా, గోవిందా అంటూ తన్మయులైనారు.

అక్కడే ఉన్న టి.టి.డి.చైర్మన్ నాగిరెడ్డి గారికి, ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ పివిఆర్కే ప్రసాద్ గారికి
నమస్కరించి" ఘాట్ రోడ్డు 18 కిలోమీటర్లు, ఏడు ఎనిమిది క్లిష్ఠమైన మలుపులున్నాయి.
ఇది నా జీవితంలోనే గొప్ప సాహసం. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రక్కును ఆపకుండా కొండ
మీదకు తీసుకుపోతాను. మధ్యలో పిట్టగోడలు దెబ్బతినొచ్చు,అంచులు తగిలి బండరాళ్లు దొర్లిపడవచ్చు, మీరు హామీ ఇస్తే పైకి చేర్చి 
తీరుతాను అన్నాడు" వారు డ్రైవరుతో పైకి చేర్చే బాధ్యత నీది.మిగిలిన బాధ్యతలు మావి
అని అభయం ఇచ్చారు. 

వాహనాల రాకపోకలను, పాత ఘాట్ రోడ్డుకు మళ్లించారు. ట్రక్కు బయలుదేరింది.వెనుకే వాహనాల్లో అందరూ
బయలుదేరారు. ఒక్కో మలుపు తిరుగుతుంటే
మానులు తగిలి, బండలు ఊడిపడ్డాయి. పిట్టగోడలు కూలిపడ్డాయి. ట్రాలీ లోయలో పడిపోతుందేమో అని వెనుక వారికి భీతి కలిగేది. ఇలా గుండెలు ఉగ్గబట్టుకుని, ఫీట్లు చేసుకుంటూ సంభ్రమాశ్చర్యాల మధ్య 55 నిమిషాల్లో..
సూర్యాస్తమయం లోగా
ట్రాలీ తిరుమల చేరిపోయింది. 

వేలాది భక్తుల ఆనందోత్సాహాలతో
గోవిందా..గోవిందా..
నామస్మణతో తిరుమల కొండ ప్రతిధ్వనించింది!

☘స్వామి వారి ధ్వజస్తంభం కోసం దండేలీ అడవుల్లోపుట్టి 300 ఏళ్ల వయసున్న 
ఈ 6 టేకుమానులు స్వామి వద్దకు క్షేమంగా చేరుకున్నాయి.👌

*🍀ఏమిటీ ధ్వజస్తంభం కథ?*

నాగిరెడ్డిగారు మర్రి చెన్నారెడ్డి ఆదేశాల మేరకు టిటిడి చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. 

తిరుమలలో అనేక మరమ్మత్తులు చేపట్టారు. అందులో భాగంగానే ధ్వజస్థంభానికి బంగారు 
తాపడానికి పాలిష్ చేయడం.
నాగిరెడ్డి గారికి తోడుగా సమర్ధుడైన ఐ.ఏ.ఎస్ అధికారి పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారు 
ఎక్జిక్యూటివ్ ఆఫీసరుగా వున్నారు. ఈ పనులన్నీ ప్రసాద్ గారు చిత్తశుద్ధితో చేసేవారు!
అప్పటి ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకటరామయ్య! ఇలా ధ్వజస్తంభం చుట్టూ వున్న నాలుగు వరుసల
గోల్డ్ ప్లేట్లు విప్పి పాలిష్ చేసే సమయంలో అసలు విషయం బయటపడింది. ధ్వజస్తంభాన్ని టేకుతో చేస్తారు. చూస్తే 
ఆ మానంతా పుచ్చిపోయివుంది. భూమిలో 
ఉండాల్సిన భాగం అసలే కనిపించడం లేదు? మరి ఏ ఆధారంతో ధ్వజస్తంభం నిలిచి ఉంది? కేవలం ఆ బంగారు ప్లేట్ల ఆధారంతో అది ఉంది. రేపో మాపో అది కూలిపోవచ్చు!
మరి ఇప్పుడేం చేయాలి? ఏం చేయాలి?వేరే వారైతే దాన్ని తాత్కాలికంగా ఏదో 
చేసేయ్యండి. 75 అడుగుల టేకుమానులు బజారులో దొరకవు అని సర్దుబాటు చేసేవారు! కానీ ఇక్కడ ఉన్నది..నాగిరెడ్డి, పివిఆర్కే ప్రసాద్! స్వామి వారి సేవలో అచంచల భక్తి వున్నవారు.
స్వామివారికి, ఆయన భక్తులకు ఏ చిన్న లోపం 
జరిగినా ఆ పాపం తమదే అని విశ్వసించే వారు.
అందుకే "ధ్వజస్తంభాన్ని పునర్మిద్దాం" 
అని ప్రకటించారు👌
ప్రకటించారు సరే..అసలు కథ ఇప్పుడే మొదలైంది!

*🛑ధ్వజస్తంభం వాడే మానుకి ఆగమశాస్త్రం ప్రకారం నిర్ణీత లక్షణాలు ఉండాలి.!*

ఆ మానుకి,ఎలాంటి తొర్రలు,పగుళ్లు,వంకలు,
కొమ్మలు ఉండకూడదు.75 అడుగుల ఎత్తున్న ఒకే మాను కావాలి. వందేళ్లకు పైగా మన్నిక
కల్గిన టేకు చెట్టు అయివుండాలి. 

*ఎక్కడ? ఎక్కడ?*

ఈ లక్షణాలున్న చెట్లు దొరుకుతాయి?
☘పాత మాను గురించి తెలుసుకుంటే దొరుకుతుంది అని 190 సంవత్సరాల 
రికార్డులన్నీ పరిశీలిస్తే..
ఎక్కడా ఈ ధ్వజస్తంభం ప్రస్తావన లేదు. మరో వేపు నాగిరెడ్డిగారు, ప్రసాద్ గారు ఇద్దరి నియామకాల గడువు పూర్తి కానున్న తరుణం. 
ఈ కొద్ది రోజుల్లో మనం..... 
ఇది చేయగలమా????ప్రశ్నలు???

🍀ఆ సమయంలో బెంగుళూరు నుండి వచ్చిన
ఓ భక్తుడు వారిని కలిసి" అయ్యా! మీరు 
ధ్వజస్తంభాన్ని మార్చాలనుకుంటున్నట్లు రేడియోలో విన్నాను. అటువంటి మానులు కర్ణాటక దండేలీ అడవుల్లో ఉన్నాయి. 
మీరు అనుమతిస్తే నేను ఆ పనిచేసి పెడతాను! వారంలోగా ఆ భక్తుడు వంద చెట్లను పరిశీలించి, అందులో నిర్ణీత ప్రమాణాలకు అనుకూలంగా 
ఆరు చెట్లను ఎంపిక చేశారు.అదే వారంలో 
కర్ణాటక ముఖ్యమంత్రి గుండూరావు గారు కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనానికి వచ్చారు..ఆయన ముందు ఈ ప్రతిపాదన ఉంచారు. ఆయన ఆనందంగా మహద్భాగ్యం అన్నారు. ధ్వజస్థంభానికి ఒక్కమాను సరిపోతుంది. అయినా 
ముందు జాగ్రత్తగా 6 చెట్లనూ తీసుకున్నారు. సమస్య అక్కడితో అయిపోలేదు.
దట్టమైన అడవిలో, కొండ వాలులో ఉన్న వీటిని 
మొదటికంటా తీయించి 8 కిలోమీటర్ల కిందికి తీసుకు రావడం చిన్న పనికాదు. రోడ్డు నిర్మించే బాధ్యత చీఫ్ కన్జర్వేటర్ తీసుకుంటే.. సోమానీ పేపర్ మిల్లు వారు ఈ భాగ్యం మాకు ప్రసాదించండి అని..దుంగల్ని క్రేన్ల సహాయంతో రోడ్డు వరకూ చేర్చారు. 

ట్రాలీకి 70,000 రూపాయల అద్దె! ట్రాలీ బయలుదేరింది. ఎటువంటి ఆటంకాలు 
లేకుండా తిరుమల చేరుకుంది!
1982 జూన్ 10వ తేదీన 
ధ్వజస్థంభాన్ని ప్రతిష్టించారు!

🍁ఉత్సవం చివరన నాగిరెడ్డి గారు ట్రైలర్ యజమానికి 70 వేల రూపాయల చెక్కును అందించారు! యజమాని.. 
*"స్వామివారి సేవకు నాకు బాడుగా? 5 రోజులు  ఆయనతో వున్న నేను కదా చెల్లించాలి!"*
అని దానిని తిరస్కరించారు!

డ్రైవరును స్వామివారి సమక్షంలో సత్కరించారు.
స్వామి వారి సన్నిధిలో నాగిరెడ్డి, పివిఆర్కె ప్రసాద్, 
ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకట్రామయ్యను
సత్కరించి, ఆయన చేతిలో ఓ కవర్ ఉంచారు!అది విప్పి చూసిన వెంకట్రామయ్య కళ్ళలో కన్నీళ్లు.. ఏడేళ్లుగా ఎదురు చూస్తున్న తన ప్రమోషన్ ఆర్డర్ అది! ఇలా..స్వామివారి 
సన్నిధిలో.. ఎందరికి ప్రాప్తం?..అనుకుంటూ..
ఆయన రెండు చేతులూ జోడించి ఆనందడోలికల్లో మునిగిపోయారు!

*ఓం నమో వెంకటేశాయ

ఆషాఢ (గురు) పూర్ణిమ

ఆషాఢ (గురు) పూర్ణిమ లో వైఙ్ఞానిక విశేషం మీకు తెలుసా, ఇప్పుడు వైఙ్ఞానికులు కూడా ఆషాఢ పూర్ణిమ విశేషతను అర్ధం  చేసుకొన్నారు. "విస్డమ్ ఆఫ్ ఈస్ట్" అనే పుస్తకంలో రచయిత ఆర్ధర్ చార్ల్స్ స్టోక్ ఇలా వ్రాసారు- ఏ విధంగా భారతదేశం ద్వారా వెలుగులోకి వచ్చిన శూన్యం (సున్నా), ఛందస్సు, వ్యాకరణం మొదలైనవాటి ఖ్యాతిని విశ్వమంతా గుర్తించి కీర్తిస్తున్నారో అదేవిధంగా భారతదేశం ద్వారా కీర్తించబడే సద్గురువు మహిమ కూడా విశ్వమంతటా గుర్తించే సమయం త్వరలో వస్తుంది. ఆషాఢ పూర్ణిమనే గురుపూర్ణిమగా ఎందుకు ఎన్నుకొన్నారో అది కూడా తెలిసివస్తుంది. స్టోక్ ఆషాఢ పూర్ణిమ విషయమై ఎన్నో రకాల అధ్యయనాలు మరియు పరిశొధనలు చేసారు. ఈ పరిశోధనల ఆధారంగా ఇలా చెబుతున్నారు - సంవత్సరంలో శరత్ పూర్ణిమ , వైశాఖ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ ఇత్యాది అనేక పూర్ణిమలు వస్తాయి. కానీ ఆషాఢ పూర్ణిమ ఙ్ఞాన మార్గంలో నడిచే సాధకులకై  విశేషమైనది. ఈ రోజు ఆకాశంలో ఆల్ట్రా  వయిలట్ రేడియేషన్ వ్యాపించి ఉంటుంది. దీని కారణం వలన మానవుని శరీరం మరియు మనస్సు ఒక విశేష స్థితిలో నెలకొని ఉంటాయి. అతని ఆకలి, నిద్ర, మనస్సుల చంచలత తక్కువగా ఉంటుంది. అందువలన ఈ స్థితి సాధకునికై   అత్యంత లాభదాయకమైనది. ఆ సాధకుడు దీనిని ఉపయోగించి ఎక్కువలో ఎక్కువ సాధన చేసి అధిక ఫలితం పొందగలుగుతాడు. అందువలన ఆషాఢ పూర్ణిమ ఆత్మోద్ధరణకై   ఉత్తమమైనదిగా వైఙ్ఞానిక పరంగా  చెప్పటం జరిగింది.

గురు బంధువులందరికీ గురు పూర్ణిమా మహోత్సవ ముందస్తు శుభాకాంక్షలు

దశ మహావిద్యలంటే ఏవి?

1. కాళీ
2. తార
3. త్రిపుర సుందరి
4. ధూమావతి
5. భువనేశ్వరి
6. భైరవి
7. ఛిన్నమస్త
8. మాతంగి
9. బగళాముఖి
10. కమలాత్మిక

అనేక దశాబ్దాల పాటు వీటి పేర్లు చెప్పుకోవడం కూడా వాటి ఆవాహనే అని భావించారు. వీటి సౌమ్యతరమైన రూపాలని, అర్ధాలని, అంతరార్ధాలని తెలుగు వారికి అందించిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. రమణ మహర్షి వంటి మహానుభావుల సమక్షంలో దశ మహా విద్యల సాధన చేసి అందులో ఉన్న శక్తి కేవలం గ్రంధాలుగా కాక నిజంగా చూపించిన వారు శ్రీ కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని. వారు వ్రాసిన ఉమా సహస్రాన్ని అమ్మ వారికి అంకితం చేసినప్పుడు అన్నారుట, " అమ్మా ! ఈ రచన నీకు నచ్చినట్లయితే నాకు తెలియజెయ్యి. ఏ భాగం నీకు నచ్చక పోతే ఆ భాగాన్ని నేను అగ్నికి ఆహుతి చేస్తాను " అని. అలా ఆయన ఆ మహా గ్రంధాన్ని చదవడం మొదలు పెట్టే సరికి, ఆ అమ్మ వారు కరుణాసముద్రయై ప్రతి పద్యానికో మెరుపు ఆకాశంలో చూపించిదిట. అంతటి దివ్య శక్తిని దర్శనీయంగా చూడడానికి ఎంత తపస్సు చేయాలో అనిపిస్తుంది. మరి ఈ దశ మహావిద్యలు దేన్ని సూచిస్తాయి అని సందేహం వస్తుంది. వీటి చిత్రాలు, విగ్రహాలు కూడా అన్నీ సౌమ్యం గా ఉండవు. ఉదాహరణకి కాళీ విగ్రహం ఎప్పుడూ ముండ మాలతో, ఖడ్గంతో భయంకరంగానే ఉంటుంది. వీటిలో కోమలత్వం ఏది అనిపిస్తుంది. మరి ఈ కాళికే తెనాలి రామలింగడికి విద్యని, ఐశ్వర్యాన్ని ఇచ్చింది. వెర్రి వాడైన కాళి దాసుకి కవిత్వాన్నిచ్చింది. అమ్మ తలుచుకుంటే లోటేముంది. అమ్మ ఒక సారి కోపంగా ఉంటుంది. ఒక సారి సంతోషంగా ఉంటుంది. బాగా అల్లరి చేస్తే ఒకటి పీకుతుంది కూడా. అమ్మ చేతి దెబ్బలు తినకుండా పెరిగిన వారెవ్వరు? ప్రేమ అనేది ఒక అపురూపమైన తత్వం. తిట్టుకున్న, కొట్టుకున్నా ప్రేమతో ఉంటే అవి అద్భుతంగానే ఉంటాయి.

ఈ దశ మహా విద్యల తత్వాన్ని చూస్తే, అవి ఇలా సూచిస్తాయి.

కాళీ, ఛిన్నమస్త - కాల పరిణామము
తార, మాతంగి - వాక్కు, వ్యక్తావ్యక్తము
త్రిపుర సుందరి, కమల - ఆనందము, సౌందర్యము
భువనేశ్వరి, ధూమావతి - అంతరాళము, అతీత పరబ్రహ్మ శక్తి
భైరవి, బగళాముఖి - శక్తి, గతి, స్థితి కాలం మనకి అనిపించేదే కాక అమరత్వాన్ని చూపే అనంత బయొలాజికల్ క్లాక్ లో నడిచే సమయం అన్నమాట. ఇక్కడ కాలభైరవుడు మార్గం చూపగలడు. అంతరాళం కూడా శూన్యమే కాదు, అది అంతులేని ప్రేమ వ్యక్త ప్రపంచంగా ఆవిర్భవించిని శక్తి. ఇది అర్ధం కావాలంటే శ్రీ కృష్ణుడు దారి చూపవలసిందే. వాక్కు అంటే కేవలం మాట కాదు, శూన్యంలో కూడా ప్రయాణించగల మనో తరంగ విశ్వసృష్టి స్పందన. దీన్ని తారా దేవి తెలియజేయ గలదు. ఇలా ప్రతి తత్వం ఆ తత్వపు మూల స్వరూపంలో ఆద్యా శక్తులుగా ఉపాసించడమే దశ మహా విద్యల స్వరూపం. అందుకే వీటిలో ఒక మౌలిక భావ సముదాయం ఉపాసనగా ఉంటుంది. సాధరణంగా వీటిని ఉపాసించే వారు వీటి విసృత పరిధిని జ్ఞాపకంలో పెట్టుకుని ఉంటారు.

*.గురుపౌర్ణమి.*


05-07-2020. ఆషాడ శుద్ధ పౌర్ణమి. ఆదివారం. 
👉ఈ గురుపౌర్ణమి కి ఊహించని *సదవకాశం* పరమాత్మ ప్రసాదించారు. 

ఈ *గురుపౌర్ణమి* సాయంకాలం కి పాడ్యమి తిధి రాగా....
★ఈ రోజు పూర్వాషాఢ నక్షత్రం ఉంది. ఈ నక్షత్రానికి మృత సంజీవని విద్య తెలిసిన దైత్య *గురువు* శుక్రుడు అధిపతి.

★దేవ *గురువు* ఆధిపత్యం ఉన్న ధనుర్లగ్నం లో అమృత ఘడియలు వచ్చాయి.

★అదే ధనుర్లగ్నం లో మనస్సుకు అధిపతి అయిన చంద్రుడు తో *లోక కళ్యాణ కారక మంత్రసిద్ధి* కి అధిపతి అయిన కేతువు కలిసి ఒకే రాశి లో ఉన్నారు. 

👉ఇది ఒక అద్భుత కాలచక్ర మహిమ. 

కాబట్టి అందరూ కూడా....
*6-50pm నుండి 7-20pm* వరకు ఈ క్రింద చెప్పబడిన మంత్రం జపం చేస్తే... 
*కరోనా వైరస్* అనేది ప్రపంచం లో లేకుండా పోతుంది. 

👉అంత అద్భుత సమయం ఇది. కానీ.... ఈ అద్భుత సమయం - వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగపడదు. 

👉 *లోకకల్యాణం కోసం మాత్రమే*.

పైన సూచించిన 30నిమిషాల అమృత సమయంలో కరోనా విపత్తు నుండి లోకాన్ని కాపాడడానికి ప్రతిఒక్కరు జపించాల్సిన మంత్రం ఏంటంటే.....

*ఓం నమోభగవతే*
 *వైద్యనాథాయ*
*అమృత కలశ హస్తాయ*
*సంజీవని ప్రదాతయ*
*క్షిప్ర ప్రసాద వరదాయ*
*సదాశివ పరబ్రహ్మణే*
*శ్రీమన్మహాదేవాయ నమ:*
(దీపారాధన చేసి జపము ప్రారంభించచ్చు. సంకల్ప - పూజాదికములు అవసరం లేదు).

విన్నపము:-- 
మహా మహిమాన్వితము ఈ మంత్రము. కరోనా వైరస్ నుండి విశ్వ మానవాళి రక్షింపబడడానికి అందరమూ పైన సూచించిన *అరగంట* సమయంలో ఈ మంత్రమును జపము చేద్దాం. 

విశ్వ ప్రాణికోటి ని రక్షించుకోవడం అనేది....
*మనందరి బాధ్యత*.

ఇలాంటి అమృత సమయం దొరకడం దుర్లభం. కాబట్టి అందరం నిష్ఠగా జపం చేద్దాం. 
అందరం చేసే జప-సంఖ్య  అసంఖ్యాకమై - మనం అందరం రక్షింపబడడం నిశ్చయం.

జై హనుమాన్ జై జై హనుమాన్.

         హనుమ అంటేనే తెలియని ఆనందం కల్గుతుంది.  ఈ స్వామి నామం తలుస్తుంటే తెలియని ధైర్యం వెంట చేరుతుంది. మన పెద్దలు హనుమనుగూర్చి ఏమి తెలిపారో ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం.  హనుమ అంటే శబ్దబ్రహ్మమట, హనుమ అంటే 
ముప్పది మూడు కోట్ల దేవతల స్వరూపమట, హనుమ అంటే 
1, 50, 000 గోవులను దానము చేసిన ఫలమట, హనుమఅంటే  సంకట హరుడట, అడిగిన/కోరిన కామ్యములు తీర్చే శక్తీభూతుండుట, రుద్రత్వమునుగల్గి కార్య జయము చేయగల మహా శక్తియట, హనుమ అంటే ఆనందమును కలుగ జేయువాడట.  చూచారా "హనుమ" అంటే ఏమిటో.

        తల్లి తండ్రులు పూజించిన దేవతలను వారి ఇంటివారు వారి ఇంటి ఇలవేలుపుగా తలచి  పూజించాలి.  నాకు చాలామంది మేము ఏ పని చేసినా కలసిరావటంలేదు అనితెలుపుతున్నారు. ఏదైనా నివారణోపాయం ఉంటే లఘువుగా తెలపండని. వారికి గల్గిన కష్టం ఎందువలన అని ఆలోచిస్తే  వారికే తెలుస్తుంది. అదేమిటో  ఇప్పుడు తెలుసుకుందాం.  తల్లి తండ్రులను పూజించకపోవటం మరియు వారు నిత్యం సేవించిన దేవతలను విస్మరించి ఇతర దేవతలను పూజించటమే కలసిరాకుండా ఉండుటకు ప్రధాన  కారణమని తలవాలి. 

         పితృదేవతలకుచేయవలసిన కర్మలు నిర్వహించకపోవడం రెండొవ కారణంగా తలువాలి. తల్లి తండ్రులను సేవించటమే గాకుండా 
వారు పూజించిన దేవతలను పూజిస్తే వారి ఇంట సంక్రాంతి పండగే. పితృదేవతల కార్యాలు సకాలంలో చేస్తే దేవతా అనుగ్రహం కలగటమేగాక సిరులు వారి ఇంట తాండవిస్తుంది అని తెలుసుకోవాలి.

        ఇహ పరాలకు కావలసిన సంపదను/పుణ్యాన్ని శ్రీ  హనుమంతులవారు నొసగగలరు. యత్ర యత్ర రఘునాధ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్. రామ అంటే మనం ఒనరించిన కర్మలచే గల్గె పాపం తొలిగి పోవటమే గాకుండా హనుమ ఆప్రాంతంలో నిలచివుంటారు. రామానుగ్రహం కలగటమే గాకుండా శ్రీ హనుమంతుని అనుగ్రహంకూడా వారికి కల్గుతుంది. హనుమ ఎవ్వరూ నొసగలేనిదానినైన నొసగగలవాడని, ఎటువంటి క్లిష్ట కార్యమైనా ఇట్టే జయము చేయగలవాడని తెలుస్తున్నది రామాయణాదులవలన. హనుమ అంటేనే  బుద్ధి, జ్ఞానం కల్గుతుంటే ఇంకేమి కావాలి.   హనుమ అను దివ్యనామ స్మరణతోనే కార్య జయం కల్గుతుంది. భక్తిగా పిలుస్తే పలికేవాడని తెలుస్తున్నది. పెద్దగా జప తపాదులు చేయ నవుసరములేదు ఈ కలియుగములో నామ స్మరణతోనే కార్య జయాన్ని పొందవచ్చని తెలుస్తున్నది. 

          ఈ స్వామీ చిరంజీవి. రాబోవు యుగమునకు కాబోవు బ్రహ్మముగా తెలుపబడింది. 33 కోట్ల దేవతల శక్తి ఒక్క హనుమ అని భక్తిగా అంటే వారికి కలుగుతుందని తెలుపబడింది.

          భక్తితో శ్రీ హనుమను సేవిద్దాం, కలి బాధలనుండి విముక్తినొంది   సుఖమైనా జీవనాన్ని 
మన సొంతం చేసుకుందాం.