30, ఏప్రిల్ 2023, ఆదివారం

దేవ్యుపాసనాఫలము

 దేవ్యుపాసనాఫలము


సౌందర్యలహరిలో చిట్టచివరిశ్లోకానికిముందటిశ్లోకంలో శాక్తోపాసకులు ఉపాసనా ఫలితముగా ఏయే ప్రయోజనాలు పొందుతారో ఆయాప్రయోజనాలను శ్రీమత్ శంకర భగవత్పాదులు విశదీకరించారు. 


శైశవంలో ఆకలివేసినప్పడూ దడపుట్టినప్పుడూ మనం మన శరీర ధారణకు కారణమైన కన్నతల్లి ఒడిలో చేరి ఆక్రందనం చేసి పాలు క్రోలి పెరిగి పెద్దలమైనాము. బిడ్డ కొంచెం ఏడిస్తే చాలు. తల్లితన పనులన్నీ ఒకవంకకునెట్టి తన శిశువును గమనిస్తుంది. శిశువులు తల్లిని నోరార 'అమ్మా' అని పిలిచేటట్లు లేగదూడలుకూడా తమ తల్లులను అంబా అని సంబోధిస్తవి. 'మేస్తూవున్న గడ్డి వదిలిపెట్టి దూడదగ్గరకు వేగముతో పరిగెత్తే గోమాత హృదయానికే ఆయేడ్పులోని కలత తెలుసు.' అంబా రవము నుండియే అమ్మ అనే మాట పుట్టివుండాలి. అంబాఅని ఆక్రందించే లేగదూడలవలె మనంకూడా ఆబ్రహ్మ కీటజననియైన అంబిక మ్రోల మొరపెట్టుకుంటే ఆలోకమాత అనుగ్రహానికి పాత్రులము కాగలమని గ్రంథాంతంలో ఆచార్యులవారు గ్రంథ ఫలశ్రుతిగా కాక అంబికాచరణ దాన ఫల శ్రుతిగానే చెప్పారు. 


సరస్వత్యా లక్ష్యా విధి హరి సవత్నో విహరతే 

రతేః పాతివ్రత్యం శిథిలయతి రమ్యేతి వపుషా, 

చిరం జీవన్నేవ క్షపిత పశుపాశ వ్యతికరః 

పరానందాభిఖ్యం రనయతి రనం త్వద్‌భజనవాన్. 


భక్తవత్సలవు నీవు. నీ భక్తులు నిన్ను ఏం కోరినా యిస్తావు. నీవో, లక్ష్మి ఒక చేత్తోనూ వాణి ఒక చేత్తోనూ వింజామరలు వీస్తుండగా కొలువుతీరుస్తావు. లక్ష్మీసరస్వతులు నీకు దాసికలై వింజామరలతో సేవ చేస్తుండగా నీ కతివత్సలుడైన నీభక్తునికి సైతం వారు సేవ చేయరా ఏమి? పరిపూర్ణతకు లక్ష్మీకటాక్షం తప్పనిసరి. ఆ లక్ష్మీ పురుషోత్తమునిధామం వైకుంఠం వదలి నీపాదాలముందే పడిగాపులు కాస్తూంది. అంతటితో ఆగక నీభక్తునికి సైతం పరిచర్యచేయడానికి సమకట్టుతూంది. అపుడు నీభక్తుణ్ణి చూస్తే పురుషోత్తమునికి అసూయ కలుగుతూంది. 


ఎవరైనాసరే లక్ష్మీకటాక్షాన్నే మొదట కోర్తారు. తన బిడ్డ తెలివితక్కువతనం తల్లికి తెలుసుగనుక లక్ష్మీకటాక్షాన్నే మొట్ట మొదట అనుగ్రహిస్తే అజ్ఞానవశాన ధనం దుర్వ్యయం చేసేసి పాపాలు మూటకట్టకుంటాడని అతనికి మొదట సరస్వతీ ప్రసన్నత అనుగ్రహించి, తరువాత ఐశ్వర్యాన్ని చక్కగా అనుభవించే వివేకం ఇస్తుంది శ్రీమాత. 


'స మేంద్రో మేథయా స్పృణోతు తతో మేశ్రియ మావహ' అని తైత్తిరీయం మొదట మేధ తరువాత శ్రీ ప్రసాదం. దీనికి ఆచార్యులవారు భాష్యం వ్రాస్తూ 'ఏవమాదీని కుర్వాణా శ్రీర్యా తాం తతో మేధా సాహిశ్రీ రనర్థాయేవేతి' మేధలేని వానికి డబ్బిస్తే అనర్థమే కలుగుతుందట. డబ్బెందుకు? పుణ్యము సంపాదించటానికి బుద్ధి లేని వానికి డబ్బిస్తే వాడు పాపాలభైరవు డవుతాడు. అట్టిచోట అర్థానికి అర్థం అనర్థమే- ''అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుఖలేశ స్సత్యమ్'' అని భజగోవిందంలో భగవత్పాదులే బోధించారు. 


సర్వోత్పాదకశక్తి పరాశక్తి. ఆమె కటాక్షమాత్రం చేత భక్తునికి ఎక్కడలేని తెలివీ పుట్టుకొని వస్తుంది. అతని మనస్సనే ఆకాశంలో మెరుపుతీగవలె అపూర్వములైన సత్యాలు హఠాత్తుగా మెరుస్తాయి. మంచిపనులు చేయడం అతనికి అలవాటవుతుంది. అతడెప్పుడూ ఇహానికీ, పరానికీ ఉపయోగించే కార్యాలనే ఎల్లప్పుడూ చేస్తుంటాడు. జగన్మాత యెడల ఏకాంతభక్తి నెరపినవానినాలుకమీద పలుకుల వెలది కాలి గజ్జలమోతలు వినిపిస్తయ్. అట్టి భక్తునియెడల సరస్వతికి గల మక్కువను చూచి బ్రహ్మగారికే కలవరం పుడుతుందిట. 


ఐశ్వర్యానికి ఏమిటి ప్రయోజనం? అది మొదట తన అనుభవానికి రావాలి. పరహితకోసం చేసే దానధర్మాలకు కూడిరావాలి. పాపికి ఐశ్వర్యంపడితే అది అతనికి కోపమోహ కారణమవడమేకాక లోకానికి కష్టకారణంకూడా అవుతుంది. 


డబ్బుమాట యెత్తితే అందరికీ కొరతే. అందరికీ ధనవాంఛే. ఒకనికెంతధనమున్నా బ్యాంకిలో ఎంత నిలువచేసినా అతన్ని అడిగిచూడండి. మీరేమిటో అనుకుంటున్నారు! నాదంతా పైవేషమే. నాచేతిలో నయాపైసా లేదు అని చెపుతాడు. 'ఫలానా ఆయన డబ్బుకలవాడు' అని ఎవరైనా చెపితే ఆ ఆసామికి ఆ చెప్పినవాడిమీద ఎక్కడలేని కోపం వస్తుంది. తమకు ఎంతధనమున్నా అదిఅల్పమనే అందరీభావన. మరింత సిరిపట్టకూడదా అని ఆగర్భ శ్రీమంతులుకూడా ఎదురుచూస్తుంటారు. ఇదిలోకంతీరు. అందుచేతనే భక్తుని చూచి 'నీకు డబ్బుకావాలా నాయనా? కావలిస్తే మొదట మేథావంతుడవు, వివేకివి కా. అప్పుడుకాని నీకిచ్చే అర్థం సార్థకం' అని అమ్మ బుద్ధి చెప్పుతుంది. 


నిజానికి దారిద్ర్యం అంటే ఏమి? నేను దరిద్రుడను అని చెప్పుకోడమే తృప్తికలవాడు నిత్యసంతోషి. 'నేనుదరిద్రుణ్ణి' 'నేనుదరిద్రుణ్ణి' అని సొద వెళ్ళబోసుకుంటే ఒక్కనయాసైసా యిచ్చే పుణ్యాత్ముణ్ణి చూపండి. 'అంతో ఇంతో దేవుడిచ్చాడు' అని తలపోస్తే సంతోషంగానైనా బ్రతకవచ్చు. 

సరి, వేదశాస్త్ర పరిజ్ఞానం, వివిధ భాషా కోవిదత్వం ఐశ్వర్యం వివేకం అన్నీ ఉన్నవి. అయినా ఏదోకొరత వున్నది. అదేమి? 


విద్యాధనాలుంటే చాలదు. అందచందాలు మీద ఇచ్ఛ పరుగులెత్తుతుంది. చూచేవాళ్ళకు కొట్టవచ్చినట్లుండే తేజస్సు కావాలని కోరిక వూరుతుంది. అంబికానుగ్రహంవున్న ఉపాసకునకు అదిన్నీ చేకూరుతుంది. అందంలో వధిపొందిన వాడు అంగలేనివాడు. 'కోటిమన్మథ విగ్రహమ్' అని ఈశ్వరాదుల వర్ణనం అనంగుని మించిన అందగాడు మరొకడులేడు. అతని శ్రీమతి రతి మహాసౌందర్యవతి. మగనికి తగిన మగువ. ఓ అమ్మా! నిన్ను థ్యానించేవాడు రతీదేవి పాతివ్రత్యానికి శైథిల్యం కలుగజేసి అందచందాలతో అలరారుతాడట. 


చదువూ డబ్బూ అందమూ ఇవి అన్నీవున్నా ఆయుర్దాయం లేకపోతే నిష్ప్రయోజనం. అంబికా కటాక్ష మున్న సాధకుడు దీర్ఘాయుష్మంతుడౌతాట్ట. 


మంచిది. అన్నీ అమరినవి. తతః కిమ్ - తరువాత? ఈ అనుభవానికి పిదప ఈప్రశ్న వైరాగ్యానికి బీజం. మనకు వైరాగ్యం గనుక సొంతంగానే కలిగితే అది క్షణకాలం ఉంటుందో. ఉండదో, అమ్మ దయచే కలిగితే ఆ వైరాగ్యం మేకు పాతినట్లే. 


అక్కరలేని విషయాలమీద ప్రేమ మనలను బాధిస్తూంది. బంధిస్తూంది. ఈ పాశాలు వున్నంతవరకూ మనం పశువులం. భగవానుడు పశుపతి. డబ్బు, మనస్సు, అందము, ఆయుస్సు అనే పాశాలతో ఆయన మనలను బంధించివున్నాడు. ఎన్నడు నిర్వేదపూర్వకమైన వైరాగ్యం కలుగుతుందో ఆనాడు మన పాశాలు జారి పశుత్వంపోయి పరబ్రహ్మలమై కూర్చుంటాము. శుద్ధప్రకాశచేతనవస్తువే ఆత్మ. మనము పాశవిముక్తులమైతే పరమానందం మన సొమ్ము. అంబిక మనకిచ్చే అంతిమ ఫలం అదే. 


పురుషార్థాలను ప్రసాదించేది పరమేశ్వరి. గోమాత కడకు వెళ్ళే లేగలవలె శ్రీమాత చరణారవిందములను చేరితే గాని ఐహికవిషయానుభవము పిదప మనకు ఆముష్మికమగు కైవల్యానందం దొరకదు.                        


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


--- “జగద్గురు బోధలు” నుండి


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

దేవుడంటే

 *దేవుడంటే ఏంటి? పూజ చేయకపోతే ఏమవుతుంది?* 

అని...

చిన్నపిల్లలే కాదు ..నేడు చదువుకున్న పెద్దవాళ్ళు కూడా అడిగే ప్రశ్న ఇది.

మనవాళ్లు వెంటనే చెప్పే సమాధానం.. " అలా మాట్లాడితే కళ్లుపోతాయి" అని .

మనకు భవవంతుని గురించి అవగాహనలేనప్పుడు... చెప్పడం చేతగానప్పుడు

... మనం వాడే మాట అదే!.


కళ్లు పోగొట్టడానికి దేవుడేం శాడిస్ట్‌ కాదు గదా !.

మనం చెప్పాల్సిన సమాధానం అది కాదు.

తెలియని వారికి అలా చెప్పడం వల్ల ...వారికి దేవునిపై మనసు విరిగే ప్రమాదం ఉందని గ్రహించాలి.


పూజ అనేది కూడా ఒక యోగ ప్రక్రియ, . మనసుతో చేసే వ్యాయామం.

మన తెలివితేటలు, జ్ఞానం పెరగడానికి ....మన మెదడుని మనమే ట్యూన్‌ చేసుకునే ప్రక్రియ.

దీప ప్రజ్వలనం అనేది..... త్రాటకం అనే యోగ ప్రక్రియ.

రోజూ ఓ మూడు నిమిషాలు నూనె దీపాన్ని తదేకంగా చూస్తే.... కంటి జబ్బులను అరికట్టవచ్చు అని పెద్దలు చెప్పిన మాట.

ఏదైనా కష్టమైన మంత్రాన్ని ఓ 11 సార్లు జపిస్తే.. నాలిక మొద్దుబారదు.

అది నాలికకు ఎక్సర్‌సైజ్‌. అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా పలకగలిగే శక్తి వస్తుంది

ధారణ శక్తి పెరుగుతుంది. భాష మీద పట్టు పెరిగితే...స్టేజ్‌ ఫియర్ కూడా‌ పోతుంది.


పూజ అంటే చాదస్తం కాదు .మన ఆరోగ్యం, మన జ్ఞానానికి సంబంధించిన విషయమని చెప్పండి.

మన హిందూ ధర్మాన్ని ప్రోత్సహించండి.

అదే సమయంలొ మూడ విశ్వాసాలకు దూరం గా ఉండే విధంగా పిల్లలను తయారు చేయాల్సిన భాద్యత కూడా పెద్దవారిపై ఉంది.....


అమూల్యమైన సందేశం పంపిన మిత్రులకు ధన్యవాదాలు

🙏🌷🙏

 *ఆచారాలు--సైంటిఫిక్*  వివరణలు

(మూఢాచారాలు కాదు) *మందిరము* 


*1. *మూలవిరాట్* 🚩 భూమిలో ఎక్కడైయితే electronic & magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు catalyst గా పని చేస్తాయి.

 

*2. ప్రదక్షిణ* 🚩 మనం గుడి చుట్టు clockwise direction లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన.. ఎక్కడైన వుంటాడు కాని ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు vedic architecture మీద ఆధారపడి వుంటాయి. యివి మన శరీరం లోని షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి.


 *3. ఆభరణాలతో దర్శనం* 🚩 ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు.. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని.


 *4. కొబ్బరి కాయ* 🚩 ఇది స్వచ్ఛతకు గుర్తు. పై టెంక మన అహంకారాన్ని.. దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును.. అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం.


 *5.మంత్రాలు* 🚩 ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే 96.. 26.. అలా ఒక పధ్ధతిలో అమరుస్తాం.. అంటే మనకి తెలియకుండానే neurons ని ఆక్టివేట్ చేసి డేటా ని దాస్తున్నాం.. అదే విధంగా మంత్రోచ్ఛారణలు అక్షర  నియమంతో ఒక లయను కల్గి neuron లను ఉత్తేజపరువస్తాయి.


*6. *గర్భగుడి* 🚩 గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు.


*7.*అభిషేకం* 🚩 విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి.. వాటికి పాలు తేనె వంటి వాటితో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. అంతేగాని సినీ కటౌట్ లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం.


*8. *హారతి* 🚩 పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు.. హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి.. దీనికి ఆయుర్వేద పరిభాష లో స్వేదకర్మ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు.


*9. *తీర్థం* 🚩 ఇందులో పచ్చ కర్పూరం.. తులసి.. లవంగాలు ఇలా ఎన్నో.. పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థం గా ఇస్తారు._


*10. *మడి* 🚩 తడిబట్టలకి ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది.. అందుకే మడి..!_


                              మీ

                      దుస్సా నరేష్

                   శ్రీ గణేష్ మొబైల్స్ 


 *లోకాః సమస్తాః*

                                *సుఖినోభవంతు*


*సర్వే జనాః సుఖినోభవం

హిడింబి

 

మహా భారత కథలు…


                    *హిడింబి*

                  ➖➖➖✍️


*హిడింబి - తండి - భీముడు - ఘటోత్కచుడు.*



*హిడింబి మహాభారతంలో భీముని భార్య. ఘటోత్కచుడు ఆమె కుమారుడు.*


*ఆదిపర్వంలోని 18 వ ఆశ్వాసంలో హిడింబి భీముని కలుసుకుంటుంది. ఈమెకే ‘పల్లవి’ అనే పేరు కూడా ఉంది.*


*పాండవులు లక్క ఇంటి నుంచి తప్పించుకుని ఒక దట్టమైన అడవిలోకి వెళతారు. చాలా సేపు నడచి అలసిపోయి ఆ రాత్రి ఒకచోట విశ్రమిస్తారు. అందరూ నిద్రపోతుండగా భీమసేనుడు కాపలాగా ఉంటాడు.*


*వారికి సమీపంలో రాక్షస జాతికి చెందిన హిడింబి, తండి  అనే అన్నా చెల్లెళ్ళు ఉంటారు.* 


*తండి పాండవుల వాసనను పసిగట్టి అక్కడ బాగా బలిష్టంగా ఉన్న భీముని ఆకర్షించి ఆహారంగా తీసుకుమ్మని హిడింబిని పంపిస్తాడు.*


*కానీ హిడింబి భీముణ్ణి మోహిస్తుంది. ఒక అందమైన స్త్రీ రూపం ధరించి తనను పెళ్ళాడమని భీముని కోరుతుంది.*


*భీముడు అందుకు అంగీకరించడు. ఆమె తన నిజస్వరూపం ధరించి తన అన్న చెప్పిన పని గురించి చెబుతుంది.*


*భీముడు తండితో యుద్ధానికి తలపడతాడు. ఆ పోరులో భీముడు తండిని సంహరిస్తాడు.*


*సోదరుని మరణంతో తనమీద ప్రతీకారం తీర్చుకుంటుందేమోనని భీముడు హిడింబిని కూడా చంపబోతాడు.*


*ధర్మరాజు అడ్డుకుంటాడు. తరువాత హిడింబి తను ఒంటరిదానను కాబట్టి పెళ్ళి చేసుకోమని భీముడిని ఒప్పించమని కుంతీదేవిని వేడుకుంటుంది.*


*ఆమె కుమారుడైన భీముడితో హిడింబిని పెళ్ళాడమని ఆజ్ఞాపిస్తుంది. అయితే భీమసేనుడు ఆమెను పెళ్ళాడిన తరువాత విడిచి వెళ్ళడానికి ఆమె అనుమతిస్తేనే అందుకు అంగీకరిస్తానంటాడు.* 


*హిడింబి అందుకు అంగీకరించి భీముని పెళ్ళాడుతుంది. వారికి ఘటోత్కచుడు అనే కుమారుడు కలిగిన తరువాత పాండవులు అక్కడినుండి నిష్క్రమిస్తారు.*


*ఆ పుట్టినవాని తల ‘కుండ లాంటి’ ఆకారంతో ఉండటం వల్ల ఘటోత్కచుడికి ఆ పేరు వచ్చింది.*


*ఘటోత్కచుడు పెరిగి పెద్దైన తరువాత మంచి యోధుడవుతాడు. మహాభారత యుద్ధంలో ప్రముఖ పాత్ర పోషిస్తాడు. అతని మంత్ర తంత్ర విద్యలకు తను తప్ప ఇంకెవ్వరూ సాటి రారని శ్రీకృష్ణుడు వరం ప్రసాదిస్తాడు.*


*హిమాచల్ ప్రదేశ్ లో హిడింబాదేవిని దేవతగా ఆరాధిస్తారు. మనాలిలో ఆమెకు ఓ ఆలయం కూడా ఉంది.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం… గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి..9493906277

లింక్ పంపుతాము.🙏

ముసలాయన స్వగతం*




           *ముసలాయన స్వగతం*

                    ➖➖➖✍️

                         (కవిత)

                  

           *కళ్ళజోడు

            బాగుచేయించమంటే

            ముసలాడివి

            నీకెందుకు

            నువ్వేమయినా

            చదువుకోవాలా

            పరీక్షలు రాయాలా

            అని

            చికాకు పడే

            పెద్ద కొడుకు !


           *నిజమే

            నేను

            ముసలాడిని

            అయిపోయాను !!


           *చిరిగిన చొక్కా

            చూపించి

            కొత్తవి కొనమంటే

            ముసలాడివి

            ఊరేగాలా

            ఊళ్ళేలాలా

            దానికే

            కుట్టు వేసుకో

            అని

            ఈసడించిన

            చిన్నకొడుకు !


           *అవును

            నేను

            ముసలాడిని

            అయిపోయాను !!


           *మనవడికి 

            చదువు

            చెబుదామంటే

            నీకు

            తెలీదులే తాతా

            అని

            తీసి పడేస్తాడు !

            నేను

            చదివిన

            రెండు ఎమ్మేలు

            వాడి ముందు

            ఏమీ కాకుండా

            పోయాయి !

            ఆవు

            చే లో మేస్తే

            దూడ

            గట్టున మేస్తుందా !!

            వాడికి

            ఏదైనా

            మంచి

            చెప్పబోతే

            వినిపించుకోడు

            పైగా

            నాది

            నసట

            నాదగ్గర

            ముసలివాసనట

            అది వాడికి

            అసహ్యమట !


           *అవును

            నేను

            ముసలాడిని

            అయిపోయాను !!


           *బజారుకెళ్ళొచ్చి

            కాఫీ ఇమ్మంటే

            కుదరదు మావయ్యా

            అని

            చీదరించుకునే

            చిన్న కోడలు !


           *నాది

            ముసలి వాసనేనని

            నాకప్పుడు

            బోధపడింది !!


           *గమ్మత్తు

            ఏమిటంటే

            మిట్ట మధ్యాహ్నం

            ఎండలో

            పెద్ద మనవడి

            స్కూలుకెళ్ళి

            కేరేజి

            అందించి

            వచ్చినప్పుడు


           *నేను

            ముసలాడిని కాను !!


           *చంటివాడికి

            జ్వరం వచ్చినప్పుడు

            అర్ధరాత్రి

            డాక్టరు దగ్గరికి

            మోసుకెళ్ళినప్పుడు


           *నేను

            ముసలాడిని కాదు !!


           *రోజూ

            ఆఖరి మనవడిని

            పక్క వీధి లో

            స్కూలు బస్సు

            ఎక్కించి వచ్చినప్పుడు


           *నేను

            ముసలాడిని కాదు !!


           *చిన్నప్పుడు

            వాళ్ళు

            తప్పు చేస్తే

            వాళ్ళని

            దండించేవాడిని

            ఇప్పుడు

            నేను మాట్లాడేది

            వాళ్ళకి

            తప్పు

            అనిపించి

            నన్ను

            చీదరించుకుంటున్నారు !


           *వాళ్ళకి

            నా అవుసరం

            లేనప్పుడు

            నేను

            ముసలాడిలాగ

            కనబడతాను !

            వాళ్ళకి

            నా అవుసరం

            ఉన్నప్పుడు

            నేను

            వాళ్ళకి

            ముసలాడిని కాదు !!


           *నాకు

            మునుపటిలాగ

            సంపాదన లేదు !

            చాలీచాలని

            అరకొర పెన్షను !

            నేనెవరికి కావాలి ?

            నాకు నేనే

            అక్కరలేని

            బ్రతుకు నాది !


           *నిజమే

            నేను

            ముసలాడిని

            అయిపోయాను మరి !!!✍️

            

                రచన: “సింహం”

                           30-8-2021

గమనిక:  పైన ఉదహరించిన బాధల లాంటి బాధలు పడుతున్న

వృద్ధులందరికీ ఈ కవిత అంకితం.——— ఇట్లు, వంక సంజీవరావు విజయలక్ష్మి.

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...

9493906277

లింక్ పంపుతాము.🙏

మధుమేహం

 మధుమేహం నియంత్రణలోకి రావడం లేదా..? ప్రపంచ ఆరోగ్య సంస్థ టిప్స్ ఇవే

చక్కెర, ఉప్పు పరిమితి మీరొద్దు

రోజులో 5 గ్రాముల ఉప్పు తీసుకోవచ్చు

పంచదార అయితే 25 గ్రాములకు పరిమితం కావాలి

శాచురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్స్ కు దూరంగా ఉండాలి

(JANAKI DEVI-TANUKU)

మధుమేహం.. ఇదొక జీవనశైలి, జీవక్రియలకు సంబంధించిన ఆరోగ్య సమస్య. క్రమబద్ధమైన ఆహారం, జీవనంతో దీన్ని చక్కగా నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు. కానీ, అలాంటి క్రమశిక్షణ కొద్ది మందికే సాధ్యపడుతుంది. ఎక్కువ మంది మధుమేహం నియంత్రణ కోసం పూర్తిగా ఔషధాలపైనే ఆధారపడుతుంటారు. ఆహారం, జీవనశైలి పరమైన మార్పులతో దీన్ని చక్కగా నియంత్రించుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం చెబుతోంది. 

మధుమేహం నియంత్రణలో లేకపోతే గుండె, మూత్రపిండాల సమస్యలు పలకరిస్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మధుమేహం, గుండె జబ్బులు, స్ట్రోక్, కేన్సర్ పై పోరాటానికి వీలుగా కొన్ని సూచనలతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ట్వీట్ చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం.. గుండె జబ్బులు, స్ట్రోక్, కేన్సర్, మధుమేహం, ఊపిరితిత్తుల సమస్యలు ఇవే ప్రపంచ మరణాల్లో 70 శాతానికి కారణమవుతున్నాయి. ఇలా మరణించే వారిలో 70 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఉంటున్నారు. కనుక ఈ సమస్యలను ఎదుర్కొంటున్నవారు ఏం చేయవచ్చో ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.

చక్కెర, ఉప్పు

ఒకరు ఒక రోజులో ఒక టీస్పూన్ లేదా 5 గ్రాములకు మించి ఉప్పు తీసుకోకూడదు. అది ఏ రూపంలో అయినా సరే రోజు మొత్తానికీ ఇదే పరిమితి వర్తిస్తుంది. ఉప్పు (సోడియం) అంటే కేవలం మనం వంటల్లో వేసుకునేది, విడిగా కలుపుకునేది అనుకునేరు. కూరగాయాల్లోనూ చాలా తక్కువ పరిమాణంలో సోడియం ఉంటుంది. స్నాక్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకుంటే మోతాదుకు మించిన సోడియం శరీరంలోకి చేరుతుంది. ఉప్పుకు బదులు తాజాగా ఎండబెట్టిన కరివేపాకు, తాజా దినుసులు వాడుకోవాలి. 

ఒక రోజులో ఒక వ్యక్తి 50 గ్రాములకు మించి చక్కెర తీసుకోకూడదన్నది మరో సూచన. అంటే ఒక రోజులో ఏ రూపంలో అయినా కానీ 12 టీస్పూన్లకు మించి చక్కెర తినకూడదు. ఇది నియంత్రణలో ఉంచుకోలేని వారికి మాత్రమే. అసలు 50 గ్రాములకు బదులు 25 గ్రాములకే పరిమితం చేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. మరీ ముఖ్యంగా రెండేళ్లలోపు పిల్లలకు ఇచ్చే ఆహారంలో ఉప్పు, పంచదార వేయవద్దు.

శాచురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్స్

తక్కువ ఫ్యాట్ ఉన్న పాలను వాడుకోవాలి. వైట్ చికెన్, చేపలకు పరిమితం కావాలి. మటన్ కు దూరంగా ఉండాలి. దీనికి అదనంగా నూనెతో బాగా వేయించిన, వేడి చేసిన పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటివల్ల శాచురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్స్ విడుదల అవుతాయి. ఇవి కొలెస్ట్రాల్ ను పెంచి గుండె జబ్బులకు కారణమవుతాయి. శీతల పానీయాలలో చక్కెరలు చాలా అధికంగా ఉంటాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాగకూడదు. ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. నీరు ఎక్కువగా తాగాలి. 

ఆరోగ్యకరమైన ఆహారం

ముడి ధాన్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. పాలిష్డ్, ప్రాసెస్డ్ ధాన్యాలను దూరం పెట్టాలి. బ్రౌన్ రైస్, గోధుమలను రోజువారీ తీసుకోవాలి. ఆకుపచ్చని తాజా కూరగాయలతోపాటు, పండ్లను తీసుకోవాలి. గుడ్లు, చేపలు కూడా తినొచ్చు. కాకపోతే గుడ్డు ఒకటికి మించి తీసుకోకూడదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ తాజా సూచనలకు అదనంగా రోజువారీ వ్యాయామం చేయడం వల్ల కూడా మధుమేహాన్ని చక్కగా నియంత్రించుకోవచ్చు. గుండె జబ్బుల నుంచి రక్షణ కల్పించుకోవచ్చు.

ఆచార్య సద్బోధన*

.

నేటి...


                *ఆచార్య సద్బోధన*

                   ➖➖➖✍️


*మీ ప్రార్థనలు భగవంతుడిని చేరుకోవటానికి, ‘విశ్వాసం’ యొక్క ముద్రను అంటించి, దాన్ని ‘ప్రేమతో’ పరిష్కరించండి.* 


*విశ్వాసం మరియు ప్రేమతో, మీ ప్రార్థనలు దూరంతో సంబంధం లేకుండా దేవునికి చేరుతాయి.* 


*అలాగే, దేవునిపట్ల మీ ప్రేమ స్వచ్ఛంగా మరియు అవాంఛనీయంగా ఉండాలి.  దేవుని పరీక్షలను ఎదుర్కోవటానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. * 


*జీవితంలో, మీరు అశాశ్వత ప్రాపంచిక ఆకర్షణలతో ఎంత అనుసంధానించబడి ఉన్నారో మరియు మీరు దేవుని కోసం ఎంతగా ఆరాటపడుతున్నారనే దానిపై మీరందరూ పరీక్షించబడతారు.* 


*మీరు ఈ పరీక్షలను ఎంత త్వరగా ఉత్తీర్ణత సాధిస్తారో, అంత దగ్గరగా మీరు దేవుని వద్దకు వస్తారు.* 


*దేవుని పరీక్షలలో ఉత్తీర్ణత సాధించకుండా ఆధ్యాత్మిక పురోగతి ఉండదు.* 


*దేవుని పట్ల మీకున్న ప్రేమ ప్రాపంచిక బహుమతుల పట్ల మీకున్న ప్రేమలో ఒక చిన్న భాగం అయితే, దేవుడు తన దయను మీపై చూపుతారని  మీరు ఎలా ఆశించారు?* 


*మీ విశ్వాసాన్ని తాత్కాలిక నుండి మరియు మార్పులేని శాశ్వతమైన వాస్తవికతకు మార్చండి.* 


*మీరు ప్రాపంచిక విషయాల గురించి ఆలోచిస్తూ చాలా గంటలలో, కొన్ని క్షణాలు కూడా దేవుని గురించి ఆలోచిస్తే, అది ఎంతో ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది!*✍️

 - దైవ ప్రసంగం, సెప్టెంబర్ 7, 1997

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

* గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...

9493906277

లింక్ పంపుతాము.🙏

జారిపోయిన క్షణం

 *శుభోదయం*


🙏🙏💐💐🙏🙏


గతానికి నిర్వచనం చెప్పవలసి వస్తే, 

*నీ నుంచి జారిపోయిన క్షణం నీ గతం.* 

అందులో చేదు, తీపి జ్ఞాపకాలు, బాధ, దుఖం, సంతోషం కలగలిసిన అనుభవాలూ ఉండొచ్చు..

 

భవిష్యత్తు అంటే అదెక్కడో లేదు. *ఈ క్షణంలో నీవు చేసే ఆలోచన, కర్మల ఫలితమే మరోక్షణంలో నీ ముందుకు నీకు అనుభవానికి వస్తుంది...* దానినే భవిష్యత్తు అంటున్నాము. 


మరి వర్తమానం అంటే....  *నీ ముందున్న ప్రస్తుత క్షణం...*


*ఈ క్షణంలో నీవు బతికే/ జీవించే విధానమే నీకు గతమై ఏదో ఒక జ్ఞాపకాన్ని ఇస్తుంది..* 


*భవిష్యత్తుగా అనుభవం రూపంలో నీ ముందు ప్రత్యక్షం అవుతుంది...* 


*జ్ఞాపకాలలో  ప్రస్తుత క్షణాన్ని  ముంచేస్తావో,* 

లేక *రాబోయే అనుభవాల్ని ఊహిస్తూ ఊహల్లో తేలిపోతావో,* 


*రెండూ వదిలేసి ప్రస్తుత క్షణాన్ని ఆనందంగా ఆస్వాదిస్తావో.. నీ చేతుల్లో ఉంది..*. 


*అదే జీవితం..* 


*నీ మరుజన్మకు కారణం ఈ క్షణంలో నీవు జీవించే జీవితమే...* 


 *మాలతీ లత..*

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి జీవిత చరిత్ర

 🙏 


*గ్రంథం*: శ్రీ అవధూత బోధామృతం, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి జీవిత చరిత్ర 

*రచన* : శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్


*కార్యదీక్ష*


కార్యదీక్ష అంటే ఎలా ఉండాలో ఆచరించి చూపారు శ్రీ స్వామివారు. "వర్షాలు లేక గొడ్డు పిల్లా చచ్చేట్టున్నారు" స్వామీ అని మొరపెట్టుకున్న భక్తులతో అట్లా అయితే *మనమన్నా కష్టపడి వర్షం కురిపించు కోవాలయ్యా!* అన్నారు. ఒక అరగంట తర్వాత గంజి తాగండి స్వామి అంటే *అనుకున్న పని అయితే గదయ్యా అన్నం తినాల్సింది* అని సెలవిచ్చారు. వర్షం కురిసే అంతవరకు మూడు రాత్రులూ, మూడు పగళ్ళు నిద్రాహారాలు లేకుండా ఆసనమైన మార్చకుండా కూర్చుండిపోయారు. కార్యదీక్ష అంటే ఎలా ఉండాలో శ్రీ స్వామివారిని చూసి నేర్చుకోవాలి.


 కానీ శ్రీ స్వామివారు సంకల్ప మాత్రం చేత వర్షాలు కురిపించిగలిగి ఉండి కూడా అలా చేయడం లేదు ఎందుకు? ప్రజల సామూహిక పాపకర్మల ఫలితమే అనావృష్టి రూపంలో అనుభవమవుతుంది. అట్టి పాప కర్మలను రెండు మూడు రోజులపాటు రేయింబవళ్ళు చేసిన తపోశక్తితో భస్మం చేశాకనే వర్షం కురిపిస్తున్నారు. కనుక మన సమస్యలు తీరాలంటే ఎంత పట్టుదలగా సాధన చేయాలో ఆలోచించండి. 


కొద్దిపాటి శ్రద్ధ పట్టుదల లేకుండా శ్రీ స్వామివారికి విన్నవించినంతమాత్రాన మన చెడు కర్మలను శ్రీ స్వామివారు తీసేయాలి అనుకోవడం ఎంత అధర్మమో ఆలోచించండి. మన బాధలు తీరేందుకు సాధన చేసే శక్తి, పట్టుదల, శ్రద్ధ ప్రసాదించమని శ్రీ స్వామివారిని హృదయపూర్వకంగా ప్రార్థించాలి. గొప్ప కార్యదీక్ష పట్టుదల లేకుంటే మానవుడు ఏమీ సాధించలేడని శ్రీ స్వామివారు ఆచరణపూర్వకంగా బోధించారు. ఈ విషయాన్నే శిరిడి సాయినాధుడు *శక్తినంతా వినియోగించి కృషి చేస్తేగాని ఆధ్యాత్మిక పథంలో ఫలితం ఉండదు* అని సెలవిచ్చారు.


🙏 *ఓం నారాయణ -  ఆది నారాయణ*🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*గ్రంథం:-నేను దర్శించిన మహాత్ములు*

*శ్రీ ఆనందమాయి అమ్మ దివ్య చరిత్ర*

*రచన:-*

*శ్రీఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు*


   ఆయన తమ శిష్యుని చేత మూడు పుస్తకాలు తెప్పించి వాటిపై ఒక పువ్వు, కొద్ది కలకండ పెట్టి నాకిస్తూ, "ఇది మా గురు మహారాజ్ శ్రీ టెంబైస్వామి సంస్కృతంలో వ్రాసిన గురుచరిత్ర, స్తోత్రాలు. మావద్ద ఈ గ్రంథాలన్నీ అయిపోయాయి. నీకోసమేనన్నట్లు ఇలా ఒక్క ప్రతి మిగిలింది, ఇవి చదువుకో" అన్నారు. వాటిలో ఒక గ్రంథం " 'శ్రీ సంహితాయన గురుద్విసాహస్రి", రెండవది "శ్రీ గురుచరిత్ర (సమశ్లోకి)", మూడవది "స్తోత్రావళి". నేను వారి భావం గుర్తించలేక వాటి వెల చెల్లించడానికి పైకం తీసేసరికి ఆయన నవ్వుతూ వారించి, "ఇవి మా గురు మహారాజ్ ప్రసాదం. ఇవి కోటి రూ||లు ఇచ్చినా లభించవు. వీటి వెల నీవేమి చెల్లిస్తావు? నీవివి చదువుకొని తరించడమే వీటి వెల" అన్నారు. నేను వారికి నమస్కరించుకొని సెలవు తీసుకొని శిరిడీ చేరి నా కార్యక్రమం నెరవేర్చుకున్నాను. ఇద్దరు- మహాత్ముల దర్శనము, వారి ప్రసాదము సాయి నాకు ప్రసాదించారు.


*******************************

ఆన్లైన్ లో చదువుటకు ఈ లింక్ ను ఉపయోగించుకోగలరు.


https://saibharadwaja.org/books/readbook.aspx?book=Sri-Aanandamai-Amma-Charitra&page=1


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*శ్రీ సాయిమాస్టర్ స్మృతులు*

       *సంకలనకర్త :- లక్ష్మీ నరసమ్మ*

                   *టాపిక్ :- 23*

                 *సర్వసమర్ధుడు*

                               శ్రీ రఘురామ్ రాజ్


మాస్టారుగారు గృహస్థాశ్రమ ధర్మాన్ని కూడా చాలా చక్కగా పాటించేవారు. ఇంటి విషయాలలో అమ్మగారి సలహాలు తీసుకునేవారు. ఒకసారి బనియన్లు అమ్మగారికి చూపిస్తూ "ఇవి బాగున్నాయా?" అని అమ్మగారిని అడిగే సమయానికి నేను మాస్టారుగారి దగ్గరకు పోవటము, ఆ సన్నివేశము చూసి "ఈయన ప్రతి చిన్న విషయాన్ని భార్యను అడిగేటట్లుంది అని నేను మనస్సులో అనుకోగానే నా వైపు చూచి "ఏంటిరా ” అని నవ్వారు. ఆయనకు మన మనసులోని విషయాలు వెంటనే తెలిసిపోయేవి. అలాగే పిల్లల విషయంలో వాళ్ళకు ఏదైనా జబ్బు చేసినప్పుడు వాళ్ళకు మందులు వాడేటప్పుడు గాని, వాళ్ళ విషయంలో జాగ్రత్త తీసుకునేటప్పుడు గాని ఒక ఆదర్శ గృహస్థుగా కన్పించేవారు.


                         🙏జై సాయిమాస్టర్🙏

పరమభూషణము

 .

           _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*ప్రాప్యాsపి మహతీం వృద్ధిం*

*వర్తేత పితురాజ్ఞయా।*

*పుత్రస్య పితురాజ్ఞాsపి*

*పరమం భూషణం స్మృతమ్‌॥*


తా𝕝𝕝 

పుత్రుడు ఉన్నత స్థానములో నున్నను తండ్రి యాజ్ఞననుసరించి నడవవలెను.... *తండ్రి యాజ్ఞను పాలించుట పుత్రునకు పరమభూషణము*....

సత్సంతానము

 శ్లోకం:☝️

*ఆయుః పుత్రాన్ యశః స్వర్గం*

 *కీర్తిం పుష్టిం బలం శ్రియమ్ |*

*పశు-సుఖం ధనం ధాన్యం*

 *ప్రాప్నుయాత్ పితృపూజనాత్ ||*

*దేవకార్యాదపి సదా*

 *పితృ కార్యం విశిష్యతే |*

*దేవతాభ్యః పితృణాం హి*

 *పూర్వమప్యాయనం శుభం ||*


భావం: శ్రాద్ధ కర్మలతో సంతృప్తి చెందిన పిత్రదేవతలు ఆ కర్తకి దీర్ఘాయువును, సత్సంతానము, కీర్తి, స్వర్గము, బలము, ధనధాన్యపశుసంపద మరియు సంతోషము అనుగ్రహించి ఆశీర్వదిస్తారు.

దైవారాధనకన్నా పిత్రదేవతారాధనకు విశేష ప్రాధాన్యత ఉంది. అందుకే దేవతలకంటే ముందు పిత్రదేవతలను పూజించడం - శ్రాద్ధం చేయడం ద్వారా వారిని సంతోషపెట్టడం మరింత శ్రేయస్కరం.🙏