17, జులై 2020, శుక్రవారం

రవి అస్తమించని రాజ్యంలో తెలుగు బ్రాహ్మణుల విజయకేతనం.

 కేవలం యూకే తెలుగు బ్రాహ్మణులకోసం ఒక సంస్థ కావాలి అనే దృఢ సంకల్పం తో మొట్టమొదటగా జూన్, 2017 లో తొలి అడుగు పడింది. దాని ప్రతిరూపంగా యూకే లో ఉన్న ప్రధాన నగరాల్లో మొదటి విడుతగా బ్రాహ్మణుల సమీకరణాలు, సమావేశాలు జరిగాయి. అందరి ఆలోచనలు, సలహాల మేరకు ఫిబ్రవరి, 2018 లో కేవలం మన యూకే తెలుగు బ్రాహ్మణుల కోసం అధికారికంగా యూకే తెలుగు బ్రాహ్మణ అసోసియేషన్" (UKTBA ) పేర సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసి 13 మంది కొర్ సభ్యులతో ప్రారంభించబడింది.  ఇప్పుడు సుమారు 900 బ్రాహ్మణ కుటుంబాలు ఈ సమూహము లో ఉన్నాయి.

 సంఘం నిర్మాణకర్త మరియు  ప్రధాన భూమిక పోషించిన హరి హృషీకేశ్ బోరపట్ల గారిని అధ్యక్షుడు గా, గోపాల్ తాళ్లూరి గారిని ఉపాధ్యక్షుడుగా ఎన్నుకొని. మిగతా వారిని కార్యవర్గ సభ్యులు గా నియమించి అనేక బ్రాహ్మణ సంభందిత కార్యమాలు చెప్పట్టబడినవి. అందులో భాగంగా కేవలం యూకే తెలుగు బ్రాహ్మణుల కోసం  ప్రతీ సంవత్సరం ఉగాది, దీపావళి సంబరాలు, కుంకుమార్చన, సామూహిక సత్యనారాయణ వ్రతాలు, కార్తీక వనభోజనాలు, బ్రాహ్మణ పిల్లల సాంస్కృతిక సభ వంటివే కాక ఆన్లైన్లో ప్రతి శుక్రవారం లలితాసహస్రనామాలు, ప్రతి ఆదివారంనాడు పిల్లల తెలుగు పద్య విభావరి, శనివారం హనుమాన్ చాలీసా, గోవింద నామాలు వంటి వాటిని కూడా చేస్తూ అటు పిల్లలకు, ఇటు పెద్దలు మన బ్రాహ్మణ సంస్కృతి వీడి పోకుండా ఉండేందుకు అలాగే అందరూ ఒకరినొకరు తెలుసుకునేందుకు ఈ సంస్ధ అహర్నిశలు కృషి చేస్తుంది.

కన్న తల్లిని ఉన్న ఊరిని మరిచి పోవద్దు అనే నానుడి ఎప్పుడూ యూకే తెలుగు బ్రాహ్మణులు మరిచిపోలేదు. అందులో భాగంగా అనేక మంది తెలుగు పేద బ్రాహ్మణులకు మేము ఉన్నామంటూ సేవలు అందించిందీ సంస్థ. ఇప్పటికి 20 నుండి 30 కుటుంబాలకు నేరుగా డబ్భులు పంపి వారి జీవితానికి భరోసా ఇచ్చిన సంస్థ ఇది .
విశాఖ లోని రామనాథం గారి కుమార్తె వైద్య ఖర్చులకు 2 లక్షల, 50 వేలతో మొదలు పెట్టి, గుంటూరు విశ్వనాథం గారికి 50 వేలు, హైదరాబాద్ నాళాలో చనిపోయిన వారికి 25 వేలు, కోదాడ లో ప్రమాదంలో చనిపోయిన వారికి, ఒంగోలులో చనిపోయిన పేద బ్రాహ్మనుడికి, ముసారాంబాగ్ లో చనిపోయిన పురోహితునికి, నెల్లూరు లో నేలరాలిని  పేద పురోహితునికి, వరంగల్ లో చనిపోయిన పేద బ్రహ్మణునికి సంగం తరపున ఒక్కొక్కరికి 25 వేల రూపాయలు, కాళ్ళుచచ్చుబడి దయనీయ స్ధితిలో ఉన్న శ్రీకాంత్ శర్మ గారికి 3 లక్షల పై చిలుకు ఇచ్చి వారి శాశ్వత వైద్య సహాయం ఇలా అనేక మందికి యూకే తెలుగు బ్రాహ్మణ సంగం వెన్నుదన్నుగా ఉండి ఆదుకుంటుంది.

ఇంతే కాక, యూకే లో తెలుగు రాష్ట్రాల వారు మన తెలుగు బ్రాహ్మణ పురోహితులు తెలియక ఇతర భాషా పురోహితులను పిలిచే వారు. కానీ మన తెలుగు బ్రాహ్మణ సంగం ఏర్పడిన తరువాత అందరికీ విస్తృతంగా సేవలు మొదలు పెట్టాము. యూకే లో ఉన్న ప్రతి తెలుగు పురోహితుల వివరాలు తీసుకొని ఇప్పుడు మన తెలుగు వారికి కేవలం మన కట్టు, బొట్టు, మన సంప్రదాయం, మన శాస్త్రోక్తంగా మన పురోహితులను అందుబాటులోకి తెచ్చాము. ఇది ఈ సంస్ధ అపూర్వ విజయం.. ఈ దేశంలో కుల సంఘాన్ని అధికారికంగా ఏర్పాటు చేసుకున్న మొట్టమొదటి  సంస్థ మన "యూకే తెలుగు బ్రాహ్మణ అసోషియేషన్" ఇది ఈ దేశ చరిత్రలో మరొక అధ్యాయం.

మేము ఎప్పుడూ మన తెలుగు రాష్ట్రాల బ్రాహ్మణులకోసం పరితపిస్తాము. మాకు మన రాష్ట్ర బ్రాహ్మణులు తోడు ఉన్నారని ఒక భరోసా, మేము తిరిగి స్వంత గూటికి వస్తే అక్కున చేర్చుకుంటారని ఆశ ఇంతకు  మించి మా సభ్యులకు ఏ కోర్కెలు, స్వార్థం లేదు. 

బ్రాహ్మణ సేవ భగవంతుని సేవతో సమానం

"నవావతార హనుమాన్ పాతుమాం సర్వదస్సదా!"

ఆద్యః ప్రసన్న హనుమాన్ ద్వితీయో వీరమారుతిః
తృతీయో వింశతి భుజః చతుర్థః పంచవక్త్రకః
పంచమో అష్టాదశ భుజః శరణ్యః సర్వదేహినాం
సువర్చలా పతిఃషష్ఠః సప్తమస్తు చతుర్భుజః
అష్టమః కథితశ్శ్రీమాన్ ద్వాత్రింశత్ భుజమండలః
నవమో వానరాకారః ఇత్యేవ నవరూప ధృత్
నవావతార హనూమాన్ పాతుమాం సర్వదస్సదా!!

ఈ తొమ్మిది రూపములు యేమిటంటే వివిధ ఉపాసకులకి దర్శనమిచ్చిన రూపములు. అలా దర్శనమిచ్చిన తొమ్మిది నామములు ఒక దగ్గర పెట్టుకొని ఎవరైతే మననం చేసుకుంటారో "నవావతార హనుమాన్ పాతుమాం సర్వదస్సదా!"

ఇక్కడ విశేషం యేమిటంటే నవావతార స్మరణ యెల్లవేళలా రక్షిస్తుంది. అవతారం అంటే భగవంతుడు తనను తాను ప్రకటించుకుంటే దానిని అవతారం అంటారు. వివిధ ఉపాసకులు ధ్యానం చేసినప్పుడు ఉపాసనా ఫలంగా ప్రకటింపబడిన రూపమే ఈ నవావతార హనుమద్రూపము అని చెప్తున్నారు.
**********

ఎంతటి ఉగ్రతేజమో... అంత మృదుమధురం
ఎంత దేహదారుఢ్యమో... అంత సమున్నత బుద్ధి బలం
ఎంత ప్రతాప రౌద్రమో... అంత తీక్షణమైన బ్రహ్మచర్యం

ఇది హనుమ స్వరూపం... 

వాక్యకోవిదుడు, రాజనీతిజ్ఞుడు, ప్రియసఖుడు, వినయమూర్తి, రామభక్తాగ్రేసరుడు... ఇలా అనేక అద్భుత లక్షణాల మేలుకలయిక ఆంజనేయుడు...

అందుకే ఆయన నిత్యస్మరణీయుడు.

మనుస్మృతిలో మంచి దూతకు ఉండాల్సిన లక్షణాల గురించిన వివరణ ఉంటుంది. 

ప్రభువుపై అనురాగం, కపటమెరుగని స్థితి, సమర్థత, జ్ఞానం, దేశకాలతత్త్వం తెలిసి ఉండడం, మంచి దేహదారుఢ్యం, భయమన్నది లేకపోవడం, వాక్పటుత్వం ఆ ఎనిమిది లక్షణాలు. 

ఇవన్నీ హనుమలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే శ్రీరాముని ప్రేమకు ఆయన పాత్రుడయ్యాడు.

దుష్టానాం శిక్షణార్థాయ శిష్టానాం రక్షణాం రామకార్యార్థ సిద్ధ్యర్థం జాత శ్రీహనుమాన్‌ శివ:

రామకార్యాన్ని సిద్ధింపజేసి, దుష్టశిక్షణ, శిష్ట రక్షణ చేయటానికి సాక్షాత్తు పరమశివుడే హనుమంతుడిగా అవతరించాడని పరాశర సంహిత చెబుతోంది. 

శివుని అష్టమూర్తుల్లో ఒకడైన వాయుదేవుని అనుగ్రహం ద్వారా కేసరి అనే వానరవీరుని భార్య అంజనాదేవికి రుద్రతేజంతో హనుమ జన్మించినట్లు చెబుతారు. 

ఆయన ప్రజ్ఞాపాటవాలను రామాయణంలోని కిష్కింధకాండ అద్భుతంగా వర్ణిస్తుంది. 

ఎన్నో సుగుణాలతో హనుమ రామాయణం అనే మణిహారంలో రత్నమై భాసించాడు.

జై  హనుమాన్

తిరుమల తిరుపతి దేవస్థాన ప్రచురణల పుస్తకాలకు

 click here: ebooks.tirumala.org.

***********************


When BHAKTI enters

1. When BHAKTI enters FOOD,
FOOD becomes PRASAD

2 .When BHAKTI enters WATER,
WATER becomes AMRIT

3 .When BHAKTI enters TRAVEL,
TRAVEL becomes a TEERATH

4 .When BHAKTI enters MUSIC,
MUSIC becomes KIRTAN,

5 .When BHAKTI enters a HOUSE,
HOUSE becomes a TEMPLE

6 .When BHAKTI enters ACTIONS,
ACTIONS become SEWA

7. When BHAKTI enters in WORK,
WORK becomes KARMA,

AND

8 .When BHAKTI enters a MAN,
MAN becomes  HUMAN

క్రిస్టియన్స్ మతం మార్చడానికి వేసే వలలు.



1 వ వల :  ఒక అమ్మ ప్రసవ వేదన పడుతుంటే - అమ్మాయి ఏసుని నమ్ముకో సుఖ ప్రసవం అవుతుంది అని వేసే వల మొదటిది.

2 వ వల :  మనం పిల్లల్ని st johns, st thamos, missionary schools లో జాయిన్ చేయటం. వాళ్ళు అక్కడ ప్రార్ధన చేయిస్తారు, మనం పిల్లలచే ప్రార్ధన చేయించము.

3 వ వల :  టెన్త్ క్లాసు పరీక్షల ముందు ఒక పాస్టర్ గారు వచ్చి ఆ పిల్లాడికి ఒక 2/- పెన్ను ఇచ్చి దీంతో రాయి, పరీక్ష పాస్ అవుతావు అంటాడు. కాని 10 వ తరగతి పరీక్షలకు స్కూల్లో మాస్టారు కష్టపడ్డారు, ప్రైవేట్ క్లాసులు, వాళ్ళ నాన్న ఏ పెన్ బుక్స్ అంటే అవి కొన్నాడు, వాళ్ళ అమ్మ కూడా ఉండీ చదివించి, అన్నం తినిపించింది, ఆ పిల్లాడు కష్ట పడ్డాడు.  కానీ ఆ పిల్లాడు పరీక్ష పాస్ అవటానికి కారణం పాస్టర్ ఇచ్చిన పెన్ అనుకోని మతం మారే అవకాశం ఉంది.

4. క్రిస్టియన్స్ అమ్మాయిని  ప్రేమించటం. ఇబ్బందులు పడతావురా అంటే, మనవాడే మనతో నోర్ముయ్, అందరి దేవుళ్ళు ఓక్కటే అంటాడు, తీరా పెళ్లయ్యాక ఆ అమ్మాయి  గుడిలోకి వస్తావా అంటే రానని, సినిమా కి వస్తావా అంటే వస్తాను అంటుంది. ఇక మన పిల్లాడు ఒకడే ఏడుపు.

5 వ వల :  ఈ మధ్య అమ్మాయిలకు గాని అబ్బాయిలకు గాని పెళ్ళిళ్ళు అవటం లేదు, ఈ తరుణం లో అబద్ధాలు ఆడి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు.  తీరా మూడు ముళ్ళు పడ్డాక ఆ అమ్మాయి క్రిస్టియన్, ఏమి చేయలేక హృదయం నలికి పోతుంది. ఆ అమ్మాయి కూడా యేసు రక్తానికి జై, ఏం చేసుకొంటావో చేస్కో అంటుంది.

6 వ వల :  ఉద్యోగం వచ్చేస్తుంది ఏసుని నమ్ముకో అంటారు. ఇంకా క్రిస్టియన్స్ ఎవరు నిరుద్యోగి లేనట్లే.

7 వ వల :  ఇంటర్వ్యూ, ప్రమోషన్ ఏమి కావాలంటే అవి చేయాల్సింది అంతా ఒక్కటే, దేవుడిని మార్చేయాలి.

8 వ వల :  పిల్లలు పుట్టడం లేటయితే చాలు, దేవుడిని మార్చెయ్, ఏసుని నమ్ముకో, ఇంకా క్రిస్టియన్స్ లో ఎవరు పిల్లలు పుట్టని వారు లేనట్టే.

9 వ వల : మందు (ఆల్కహాల్) మానలంటే ఏసుని నమ్ముకో,  ఇంక విదేశాల్లో మందే తాగరు అన్నట్టు బిల్డప్.

10 వ వల :  వయసు మీద పడ్డాక ఎదో ఒక రోగం రాక మానదు, ఏసు ని నమ్ముకో రోగం తగ్గిపోతుంది అంటారు.  విదేశాల్లో హాస్పిటల్స్ల్ లేనట్టే, క్రిస్టియన్స్ ఎవరు హాస్పిటల్స్ కే వెళ్లనట్లే చెబుతారు.

ఈ పది  వలల్లో పడక పోతే -

1.  మీలా విమర్శించే వాళ్ళే ముందు మారతారు.

2. మన కులం వాళ్ళు ఎక్కువ మారుతున్నారు తెలుసా.

3. RRK మూర్తి గారు తెలుసా, రక్షణ టీవీ బెన్హర్, అనిల్ కుమార్ వీళ్ళంతా బ్రాహ్మణులు తెలుసా

ఇలా ఏన్నో రకాలుగా వలలు వేస్తారు

ఒక హిందువును పాస్టర్లు మతం మార్చడానికి ప్రధానం కారణం డబ్బు మతం మారిన వాళ్ళు పాస్టర్కి జీవితకాలపు ఆదాయం

మతం మారుస్తున్నందుకు విదేశి ఫండ్స్, చర్చ్ లో వచ్చే కానుకలు, చర్చ్ వెళ్ళే ప్రతి ఒక్కరి దగ్గర దశమభాగాలు ( తమ సంపాదనలో పదో వంతు తాను వెళ్ళే చర్చ్ కి ఇవ్వలి ) వసులు చెయడం, పుట్టుక నుండి చావు వరకు ప్రత్యేక ప్రార్థనలు, కూటములు, ఏసు రక్తం పేరిట కొబ్బరి నూనె సీసాలు అమ్మడం, ఇలా మతం మారిన వ్యక్తి జీవిత కాలపు ఆదాయపు వనరుగా మారిపొతారు ఒక పాస్టర్కి తనకు, తన తర్వత తరతరాలకు కష్టపడకుండా డబ్బు సంపాదించే మార్గం గా మారిపోతారు

మన రాష్టం లో వందల కోట్ల రూపాయలు ఈ మత మార్పిడి పేరిట వ్యాపారం జరుగుతుంది


ధర్మధ్వజం
హిందు చైతన్య వేదిక 

రేపుశనిత్రయోదశి

శని త్రయోదశి కేవలం శనిదేవుడి ఆరాధనకే కాదు..!

కర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే కర్మలకు ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం, చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి. దీనిని అందజేసేది శనీశ్వరుడు.
    
భారతీయులు కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతారు. ముఖ్యంగా హిందువులకు కర్మ సిద్ధాంతంపై నమ్మకం ఎక్కువ. దీని ప్రకారం మనిషి చేసే కర్మలకు ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం, చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి. ఈ బాధ్యతలను శనీశ్వరుడికి పరమేశ్వరుడు అప్పగించాడు. అందుకే ఆయనను కర్మ ఫలదాత అంటారు. ఒడిదొడుకులు ఎదురైనప్పుడే జీవితం విలువ గురించి తెలుస్తుంది. మనిషికి అప్పుడప్పుడూ మొట్టికాయలు వేస్తూ లోపాలను సరిదిద్దేది శనిదేవుడు. ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిన ప్రాయశ్చిత్తాన్ని కలిగిస్తాడు.

సూర్యభగవానుడు, ఛాయా సంతానమే శనిదేవుడు. అందుకే ఆయనను సూర్యపుత్రడు అనీ, ఛాయాసుతుడు అనీ అంటారు. నవ గ్రహాల్లో కీలకమైన శని.. జాతక చక్రంలోని ఒక్కో రాశిలో దాదాపు రెండున్నర ఏళ్లు సంచరిస్తాడు. అంటే రాశి చక్రంలో ఒకసారి ప్రయాణానికి దాదాపు 30 ఏళ్లు పడుతుంది. నిదానంగా సంచరిస్తాడు కాబట్టి శనికి మందగమనుడు అనే పేరు ఉంది. అయితే, రాశిచక్రంలో ఆయన ఉండే స్థానాన్ని బట్టి ఫలితాలు కూడా ఉంటాయి. జాతకరీత్యా శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు తమకు తక్కువ శ్రమ కలిగించాలని శనీశ్వరుని వేడుకుంటారు. అందుకోసం నవగ్రహాలు ఉండే ఆలయాన్ని దర్శిస్తారు. ఇక త్రయోదశి తిథి వచ్చే శనివారం నాడు ఆయనను పూజిస్తే మరింత త్వరగా ఉపశమనం కలిగిస్తాడని నమ్మకం. అయితే, శని త్రయోదశికి ఎంతో విశిష్టత ఉంది. శనివారం శని భగవానునికీ, అటు విష్ణుమూర్తికీ ప్రీతికరమైన రోజు కాగా, త్రయోదశి శివునికి ఇష్టమైన తిథి.

స్థితి, లయకారులిద్దరికీ ఇష్టమైన రోజుగా శనిత్రయోదశి స్థిరపడింది. దీని ప్రాముఖ్యతని మరింతగా వివరించేలా ఒక పురాణ గాథ కూడా ప్రచారంలో ఉంది. ఒకసారి కైలాసానికి వెళ్లిన నారద మహర్షి శనీశ్వరుడి గురించి పొగడటం మొదలుపెట్టాడు. ఎంతటివారైనా శని ప్రభావం నుంచి తప్పించుకోలేరన్నాడు. ఈ మాటలకు ఆగ్రహించిన శివుడి.. ‘శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా, నా మీద మాత్రం పనిచేయదు’ అని అన్నాడు. ఇదే మాటను నారదుడు యథాతథంగా శనిదేవుని వద్దకు మోసుకువెళ్లాడు.‘నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు. ఇది సృష్టి ధర్మం,’అని చెప్పిన శని.. పరమేశ్వరుని ఫలానా సమయంలో పట్టిపీడించి తీరతానని అన్నాడు.శని శపథం గురించి విన్న శివుడికి ఏం చేయాలో అర్థంకాక, మాట నెరవేరితే తన ప్రతిష్ఠకే భంగం కలుగుతుందని భావించాడు. అందుకే శని చెప్పిన సమయానికి అతని కంటపడకుండా ఉండేందుకు భూలోకంలో ఒక చెట్టు తొర్రలో దాక్కొన్నాడు.

మర్నాడు కైలాసానికి వచ్చిన శనిదేవుడిని చూసిన శివుడు ‘నన్ను పట్టి పీడిస్తానన్న నీ శపథం ఏమైంది’ అంటూ పరిహసించాడు. దీనికి శని ‘ప్రభూ! ఈ ముల్లోకాలకూ లయకారుడవైన నువ్వు ఆ చెట్టు తొర్రలో దాక్కొన్నావే! అది నా ప్రభావం కాదా. దీన్ని శని పట్టడం అనరా?’ అన్నాడు. శనిదేవుని శక్తిని గ్రహించిన పరమేశ్వరుడు.. ఈ రోజు నుంచి శనిత్రయోదశి నాడు ఎవరైతే నిన్ను పూజిస్తారో వారికి నీ అనుగ్రహంతో పాటు నా అభయం కూడా దక్కుతుందన్నారు. ఇక నుంచి నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో కూడా పరఢవిల్లుతావని ఆశీర్వదించాడు. అప్పటి నుంచి త్రయోదశి తిథి వచ్చే శనివారం నాడు నువ్వుల నూనెతో శనీశ్వరుని అభిషేకించి, తమని చూసీచూడనట్లుగా సాగిపొమ్మని వేడుకుంటున్నారు.

"అడుక్కొచ్చిన ఆవకాయ (జోకు)

 ఒక రోజు నా శ్రీమతి భోజనంలోకి వడ్డించిన ఆవకాయ తిని

"ఏంటమ్మి, ఆవకాయ ఇట్లాఉంది! నువ్వు పెట్టిందేనా!" అని అడిగా..

"అడుక్కొచ్చిన ఆవకాయ ఇంకెలా ఉంటుంది" అంది.

"అడుక్కు రావటమేంటి" అన్నా..

"ఎప్పుడో మే లో పెట్టింది సెప్టెంబర్ దాకా ఉంటుందా... జాడీలో అడుక్కు రాకుండా" అంది.❤️
వింజమూరి వెంకట అప్పారావుగారి పోస్టు.
**********
జనాభా లెక్కల సేకరణ కు "తలతిక్క నిలయం" అనే ఇంటికెళ్ళాడో జనాభా లెక్కల సేకరణ అధికారి.

అధికారి: ఏవండీ,ఇంట్లో ఎవరూ లేరా?
ఇంట్లోంచి : ఉన్నారు
అధికారి : మరి బయటికి రారేం?
ఇంట్లోంచి : నువ్వడిగావా?
అధికారి : ఓహ్, సారీ..నేను జనాభా లెక్కల సేకరణ అధికారిని, నాకు మీ ఇంట్లో ఉంటున్న వారి సమాచారం కావాలి.

ఇంట్లోంచి ఓ ముసలావిడ బయటకు వచ్చింది.
ఏం కావాలి నాయనా? అంది,
వచ్చిన అధికారి బామ్మను చూసి బుర్ర గోక్కుంటూ విషయం చెప్పాడు.
అధికారి : బామ్మగారూ, ఈ ఇంట్లో ఎంతమంది ఉంటారు?
బామ్మ : డజన్
అదికారి : డజనా? ఓహ్, పన్నెండు మందా.  సరే, పెద్దాయన ఏంజేస్తుంటారు?
బామ్మ : జైలు కెళ్ళాడు.
అధికారి : అదిరిపడి, జైలు కెళ్ళాడా? ఏం నేరం చేసాడు?
బామ్మ : నీ మెుహం మండా, వాడు జైలరు.
అధికారి : ఓహ్ ! అలానా, ఆయనకు ఎంతమంది పిల్లలు?
బామ్మ : ఓక పోతు, రెండు పెంటి
అధికారి : పోతు,పెంటి ఏంటండీ?
బామ్మ : వెధవా, అదికూడా తెలవకుండా ఎలా ఆఫీసర్ అయ్యావురా?  తింగరి వెధవ,
ఓక మగ, ఇద్దరు ఆడ
అధికారి : బామ్మగారు, మీరు మరీ మర్యాద లేకుండా మట్లాడుతున్నారు, ఇప్పుడు చెప్పండి, వారి అబ్బాయి ఏం జేస్తుంటాడు?
బామ్మ  : ఆ... కొంపలార్పుతుంటాడు
అదికారి : ఛ ఛ.. అదేం పనండీ? మీరైనా చెప్పలేక పోయారా?
బామ్మ : వాడు ఫైర్ డిపార్ట్ మెంట్ రా అరకాణీ వెధవా !
అదికారి : బామ్మ గారు, మీరు సరిగ్గా చెప్పండి, ఇలా డొంకతిరుగుడు నాకర్థం కాదండీ, మీరు మరీ తిట్టేస్తున్నారు, :(  ఏడ్పు మెుహం పెట్టి..
బామ్మ : ఈ మాత్రం తెలియని వాడివి నువ్వేం ఆఫీసరువురా?  పింజారీ వెధవ.
అదికారి : బామ్మ గారు, ఇక చాలు, మరి ఆడపిల్లలు ఏం చేస్తారో సూటిగా చెప్పండి, దయచేసి..
బామ్మ : ఓకత్తేమో ఊడపెరుకుతుంటుంది, ఇంకొకత్తేమో తైతక్కలాడుతుంటాది.
అదికారి : జుట్టు పెరుక్కుంటూ, బామ్మగారూ... ఊడబెరకడం, తైతక్కలాడడం ఏందండీ?
బామ్మ : ఓకతి పళ్ళ డాక్టర్, ఇంకోతి భరతనాట్యం అధ్యాపకురాలురా నెలతక్కువ వెధవా!
అధికారి అప్పటికే స్పృహ లో లేడు......
***********
అమ్మ :: ఒరేయ్ !! పొయ్యి పొయ్యి తమిళ్ అమ్మాయిని లవ్ చేసావు .
ఆ అమ్మాయిని నీకిచ్చి పెండ్లి చెయ్యాలంటే ఒక షరత్తు పెడతా
నెల రోజుల్లో తెలుగు నేర్పించు
అప్పుడే నీ పెళ్లి ఖాయం చేస్తా ,సరేనా
కొడుకు :: అలాగే అమ్మా కోమలి కి నెలరోజుల్లో తెలుగు నేర్పి నీతో మాట్లాడిస్తా ,సరేనా
********నెల తర్వాత ********
అమ్మ :: ఏరా !! మాటనిలబెట్టుకుంటావా ?
కొడుకు :: అమ్మా నీ చుమ్మా యిరి
నీ ఎన్నమ్మా తెలుంగు తెలుంగు అంపిచ్చి వేలాపందిట్ఠా
బాషా లో యెన్నా యిరుక్కి
మన్నిక్కునం
అమ్మ :: ఓర్నాయనోయ్ కొంపముంచావు కదురా.

ప్రదోషం........

ప్రదోషం అంటే దోషాలను తొలగించేది అని అర్థం. ప్రతి రోజూ సూర్యాస్తమయ కాలంలో దాదాపు ఆరు ఘడియల  (రెండు గంటల 24 నిమిషాల) సమయాన్ని ప్రదోష కాలంగా పరిగణిస్తారు. ప్రదోష కాలములో త్రయోదశి తిథి ఉంటే దానిని మహా ప్రదోషం అంటారు. మహా ప్రదోషం రోజున శివ భక్తులు  ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. 

రెండు త్రయోదశి తిథులలో (శుక్ల పక్షము మరియు కృష్ణ పక్షము) ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. కొన్ని ప్రాంతాలలో మాత్రం కేవలం కృష్ణ పక్ష ప్రదోషం రోజును మాత్రమే పాటిస్తారు. 

ప్రదోష సమయంలో శివుడు అర్థనారీశ్వర రూపంలో ఆనంద తాండవ నృత్యం చేస్తాడని నృత్యరత్నావళి లో చెప్పబడింది. ప్రదోష సమయంలో సమస్త దేవతలందరూ శివుడిని అర్చిస్తారని భావిస్తారు. ప్రదోష సమయంలో చేసే శివారాధన ఉత్తమమని చెప్పబడుతుంది. ఈ సమయంలో శివారాధన చేయటాన్ని సమస్త దేవతలను పూజించటంతో సమానంగా భావిస్తారు. 

ప్రదోష  సమయంలో శివాలయాలలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు సిద్ధిస్తాయని భావిస్తారు. ఈ సమయంలో శివుడితో పాటు నందీశ్వరుడిని కూడా ఆరాధిస్తారు. నందీశ్వరుడు నాలుగు వేదాలు, 64 కళలను అభ్యసించిన నిష్ణాతుడైనప్పటికీ, వినయంతో వుండి,  శివునికి ఏర్పడిన అనుమానాలను కూడా నివృత్తి చేస్తాడని విశ్వసిస్తారు. అందువల్ల  నందీశ్వరుడిని ఆరాధించడం వలన బుద్ధికుశలత, మానసిక ఉల్లాసం లభిస్తాయి. 

 త్రయోదశి మహా ప్రదోషం, 

ఆదివారం రోజు వస్తే దానిని రవి ప్రదోషం అని,
సోమవారం రోజు వస్తే దానిని సోమ ప్రదోషమనీ, 
మంగళవారం రోజు వస్తే దానిని భౌమ ప్రదోషమని, 
బుధవారం రోజు వస్తే దానిని బుధ ప్రదోషమని, 
గురువారం రోజు వస్తే దానిని గురు ప్రదోషమని, 
శుక్రవారం రోజు వస్తే దానిని శుక్ర ప్రదోషమని, 
శనివారం రోజు వస్తే దానిని శని త్రయోదశి అనీ, శని ప్రదోషమని పిలుస్తారు. 

వీటిలో శుక్ల పక్షంలో వచ్చే సోమ ప్రదోషం, కృష్ణపక్షంలో వచ్చే  శని ప్రదోషములు విశేషమైనవిగా భావిస్తారు. 

 ప్రదోష వ్రతాన్ని ఎలా చేయాలి ? 

ప్రదోషం రోజు ఉదయమే స్నానం చేసి తెల్లని వస్త్రాలను ధరించాలి. శరీరంపై విభూతిని, రుద్రాక్షమాలను కూడా ధరించటం మంచిది. ఆ రోజులో వీలైనప్పుడల్లా పంచాక్షరి మంత్రాన్ని  (ఓ నమ:శివాయ) జపం చేయాలి. ప్రదోషం రోజున నిశ్శబ్దంగా ఆరాధించటాన్ని శివుడు ఇష్టపడతాడని చెబుతారు. కఠిన ఉపవాసం చేయలేనివారు పండ్లు, పాలు లాంటివి తీసుకోవచ్చు. ఉడికించిన పదార్థాలను తీసుకోకూడదు. 

సాయంకాలం ప్రదోష సమయంలో స్నానమాచరించి శివ షోడశోపచార పూజ జరపాలి. ప్రదోషం రోజు ఆ పరమశివుడికి నేతి దీపారాధన, ఆవుపాలతో అభిషేకం అభిషేకం చేయటం, బిల్వ పత్రాలు మరియు శంఖుపూలతో అర్చించటం శ్రేయస్కరం. మహా మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించి ప్రదోష కథను వినటంగానీ చదవటం గానీ చేయాలి. ఇంటిలో పూజ ముగించిన అనంతరం శివాలయాన్ని దర్శించాలి. వీలైనవారు ప్రదోష స్తోత్రం, శివ స్తోత్రములను కూడా పఠించాలి.

స్కంద పురాణంలో ప్రదోష మహత్య కథ కూడా వివరింపబడింది.

 మహా మృత్యుంజయ మంత్రము 

ఓం త్రయంబకం యజామహే 
సుగంధిం పుష్టి వర్ధనం 
ఊర్వారుకమివ బంధనాత్ 
మృత్యోర్ముక్షీయ మామృతాత్

 శని ప్రదోషం 

దేవ దానవులు క్షీర సాగరాన్ని మధించినప్పుడు వెలువడిన హాలాహలం నుండి శివుడు ప్రపంచాన్ని రక్షించిన రోజుగా శనిప్రదోషం రోజును చెబుతారు. శని కర్మకారకుడు, శివుడు సంహార కారకుడు కావున శని ప్రదోష సమయాన శివారాధన చేయడం ఉత్తమంగా పరిగణిస్తారు.

శని ప్రదోష వ్రతం ఆచరించటం వలన కర్మ దోషాలు, జాతక దోషాల నుండి విముక్తి పొందవచ్చునని చెబుతారు. వివాహ దోషాలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఈ రోజున ప్రదోష కాలంలో శివారాధన చేయాలి. గత జన్మల పాపాలు కూడా తొలగి సకలసంపదలు చేకూరుతాయి. శని ప్రదోషానికి సంబంధించి ఉజ్జయిని మహాకాళేశ్వరునికి సంబంధించిన కథ ఒకటి చెప్పబడినది. 

 సోమ ప్రదోషం 

సోమవారము శివుడికి ప్రీతికరమైనది. కాబట్టి ఆ రోజున వచ్చే  సోమ ప్రదోషమును ప్రశస్తమైనదిగా భావిస్తారు. ఈ రోజున ప్రదోష వ్రతము ఆచరించటం వలన మనసులోని మలినాలన్నీ తొలగిపోతాయి . 

 గురు ప్రదోషం 

త్రయోదశీ ప్రదోషము గురువారము వస్తే ఆ రోజును గురు త్రయోదశిగా భావిస్తారు.  గురు ప్రదోష పూజ వలన విద్యాబుద్ధులు, సంపదలు కలుగుతాయని చెబుతారు. జాతకములో ఉండే గురు దోషములకు రుద్రారాధన విరుగుడుగా భావిస్తారు. 

ముగ్గురు జగద్గురువులు



1980వ దశకంలో కంచి కామకోటి పీఠానికి చెందిన ముగ్గురు జగద్గురువులు చంద్రశేఖరేంద్ర, జయేంద్ర, శంకర విజయేంద్ర సరస్వతులు ఏకకాలంలో ఈ భూమిపై నడయాడిని సంగతి చాలామందికి తెలిసినదే. పీఠంలో ప్రతిరోజు త్రికాల పూజలు జరుగుతాయి.
ముగ్గురు పీఠాధిపతులు ఒకే పూజ చేసినా ఒకొక్కరిదీ ఒక్కోశైలి.. ఇది గమనించిన ఒక గడుసరి భక్తుడు పరమాచార్య స్వామి వారి దగ్గరకు వచ్చి.. "స్వామీ మీరూ, బాల స్వామి వారు చాలా నిదానంగా చేస్తారు పూజ, కానీ జయేంద్ర స్వాముల వారు ఎందుకని త్వరగా ముగించేస్తారు ? వారికి శ్రద్ధ లేదా ఏమి ?" అని అడిగాడు.
దానికి సమాధనంగా ఒక చిరునవ్వుతో "నేనూ, చిన్న స్వామి వారూ పూజ చేసేటప్పుడు అమ్మవారిని వేడుకోవల్సి వస్తుంది.. అమ్మా రా అమ్మా ఈ పువ్వు స్వీకరించు అని అడిగితే కాని రాదు అందుకె నెమ్మదిగా సాగుతుంది. కాని జయేంద్రుల వారు చెసేటప్పుడు ఆ బాధ లేదు, వారు 108 బిల్వాలతో చంద్రమౌళీశ్వర అర్చన చేస్తే మొత్తం శివ గణాలన్నీ వచ్చి కూర్చుంటాయి, అమ్మవారి పూజకు అవిడ సిద్ధంగా కూర్చొని ఉంటుంది అందుకే వారి పూజ త్వరగా పూర్తవుతుంది" అని వివరించారుట చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు.
జయ జయ శంకర.. హర హర శంకర..

తమిళనాడు లోని ఒక ప్రముఖ శివాలయం

నోయాల్ నదికి సమీపంలో ఉన్న పెరూరు తమిళనాడు లోని కోయంబత్తూర్ నుండి 7 కి.  శివుడికి అంకితం చేసిన పత్తిస్వరస్వామి ఆలయానికి ఇది ప్రసిద్ధి. 

ఈ ఆలయం వాస్తవానికి

చోళులకాలంలో అందులోను  కరికల చోళ (CE 2 వ శతాబ్దం) సమయంలో నిర్మించినట్టు చెపుతున్నారు, కాని చాలావరకు ఆ తరువాత శతాబ్దాలలో పూర్తయింది అని అభిప్రాయం,

  ఇది శివుని తాండవస్థలము లేదా డాన్స్‌హాల్స్‌లో ఒకటి మరియు నృత్య ప్రభువు నటరాజగా బంగారు పూతతో ఉన్న శివుడి విగ్రహాన్ని కలిగి ఉంది.   చెక్కిన స్తంభం యొక్క ఈ ఛాయాచిత్రం గురించి ఈ క్రింది వివరణ ఇస్తుంది:-

 'ఈ దృశ్యం  ... ఏనుగు విగ్రహం తలపై ఉన్న శివుడిని సూచిస్తుంది.  ఒక అడుగు దాని తలపై ఉంటుంది, ఏనుగు ఆకారం శివుని వెనుక భాగంలో ఉండి తోక పైన కనిపిస్తుంది, మరియు కాళ్ళు ప్రతి వైపు రెండు ఉంటాయి ఈ శిల్పం ప్రాతినిధ్యం వహిస్తున్న పురాణం ఏమిటంటే స్పష్టంగా లేదు,   ఏనుగును ఆసియాలో ఒక ప్రత్యేక మృగంగా మరియు వివిధ పురాణాలలో లక్షణాలను కలిగి ఉంది.  ఈ ప్రత్యేకమైన శిల్పం వెనుక ఉన్న పురాణం గురించి  తెలియకపోయినా, ఏనుగు దాచు ధరించి శివుడు తన శక్తివంతమైన తాండవ నృత్య విజయాన్ని ప్రదర్శించినట్టు ఉంటుంది

కానీ శివుని వెనుక వైపు చూస్తే అది కూర్మాకారము అనికూడా అనిపిస్తుంది

కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్"..

ఈ పద్యం విన్నారా.. ఎప్పుడైనా?

ఒకసారి తెనాలి రామకృష్ణ కవికి రాయలవారు ఇచ్చిన సమస్య ఇది. 

"కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్". (అంటే ఏనుగుల గుంపు వెళ్లి దోమ గొంతులో ఇరుక్కొన్నదని అర్థం).

ఈ పద్యపాదాన్ని పూర్తిచేయమన్నారు.
అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.. రామకృష్ణుడు దానిని ఎలా పరిష్కరిస్తాడోనని...
ఆయన చతురత తెలిసిందే కదా!

"రంజన చెడి పాండవులరి
భంజనులై విరటు గొల్వ పాల్పడి రకటా
సంజయా! యేమని చెప్పుదు ?
కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్"

★ ఈ పద్య భావం :       

మహాభారతంలో  బలవంతులైన పాండవులు (పాండవులని ఏనుగులతో పొల్చుతూ).. , కౌరవులతో జూదంలో ఓడిపోయి, ఒక చిన్న సామంత రాజైన విరాట రాజు (విరాట రాజుని దోమతో పోల్చారు) కొలువులో చేరి అజ్ఞాతవాసంతో పనిచెయ్యవలసి వచ్చింది. ఓ రాజా ఇది ఏనుగుల గుంపు వెళ్లి దోమ గొంతులో కూర్చోవటం కాక మరేమిటి? అని ఆ సమస్యను పూరించారట.
సభలో ఎవ్వరికీ నోటమాట రాలేదు. రాయలవారు స్వయంగా రామకృష్ణ కవిగారిని ఆలింగనం చేసుకొని ప్రశంసించారట!

ఈ పద్యభావానికి అనుగుణంగా నేటి పరిస్థితి

ఈ భూమండలం మీద తానే మహా బలవంతుడనని, క్రూర మృగాలను జయించి ప్రక‌ృతిని గెలిచానని.. మహా సాగరాలను ఈది, మహా పర్వతాలను అధిరోహించిన మహా మేధావినని విర్రవీగిన మనిషి.. చివరకు కంటికి కనిపించని మహా సూక్ష్మ జీవికి లొంగిపోయి దానికి దొరక్కుండా గూట్లోకి దూరి దాక్కున్న వైచిత్రికి ఈ పద్యం అద్దం పడుతోంది కదా..

అందుకే.. మహాబలాఢ్యుడిని అనుకున్న మనిషిని ఇప్పుడు ప్రకృతి పరికించి చూస్తోంది.. పరిహాసం చేస్తోంది. 

ఆధిపత్యం ప్రదర్శించిన మనిషి తిరిగి తన మూలాల్లోకి.. గుహల్లోకి.. గ‌ృహాల్లోకి వెళ్లిపోవడంతో వన్య ప్రాణులు తిరిగి ప్రకృతి ఒడిలోకి చేరుకుంటున్నాయి.

★ థాయ్‌లాండ్ వీధుల్లోకి అడవి కోతులు ప్రవేశించి యథేచ్ఛగా తిరుగుతున్నాయి..

★ జపాన్ రోడ్ల మీద సికా జింకలు షికారు చేస్తున్నాయి..!

★ కాలిఫోర్నియా వీధుల్లో టర్కీ కోళ్లు సామూహికంగా విహరిస్తున్నాయి..

★ మన కోయంబత్తూరు రోడ్ల మీదకు అడవి జింకలు వచ్చి దర్జాగా తమ పూర్వ ప్రదేశాన్ని ఆక్రమించుకున్నాయి..

★ కొజికోడ్ వీధుల్లో పట్టపగలే అడవిపిల్లులు రాజ్యమేలుతున్నాయి.

★ నోయిడా రాచవీధిలో నీల్గాయ్‌లు తిరుగుతున్నాయి..

★ బెంగళూరు బస్ స్టాండు ఇప్పుడు పావురాల ప్రపంచమైపోయింది..

★ తిరుమల ఘాట్‌రోడ్లు.. మాడవీధులు జింకలకు ఆవాసమయ్యాయి.

ఇక్కడా అక్కడా అనిలేదు..

★ లండన్ నుంచి లాస్ ఎంజెల్స్ వరకు.. న్యూయార్క్ నుంచి న్యూ సౌత్ వేల్స్ వరకు.. టోక్యో నుంచి టోరోంటో వరకు..

ఎటు చూసినా.. మనిషి అహంభావానికి, స్వార్థానికి ప్రతీకలుగా నిలిచిన కాంక్రీట్ జంగిల్స్‌లో తిరిగి తమ మూలాలను వెతుక్కుంటూ.. తాము కోల్పోయిన వనాలను గుర్తుచేసుకుంటూ వన్య ప్రాణులు వాటిని తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటున్నాయి.

అర్ధనగ్న, పూర్తి నగ్న దృశ్యాలతో చెలరేగి.. బీరు సీసాలు, వైన్ గ్లాసుల చప్పుళ్లతో, అర్థంలేని వీరంగాల రణగొణ ధ్వనులతో నిన్నటిదాకా మారుమోగిన సాగర తీరాలు, ప్రేమికుల దినోత్సవాలతో, ఫ్లైయింగ్ కిస్సులతో, హాట్ హగ్గులతో బిత్తరపోయిన ఐఫిల్ టవర్లు, ఉద్యమాలతో దద్దరిల్లిన తియనాన్మెన్ స్వ్కేర్‌లు, కార్నివాల్స్‌తో చిత్తయిపోయిన సాల్వడార్లు ఇప్పుడు నిర్మానుష్యమైపోయాయి.

ఇప్పుడక్కడ అడవితల్లి ముద్దుబిడ్డలు.. కపట మెరుగని మూగజీవాలు ఆటలాడుకుంటున్నాయి!

ఓ మనిషీ.. భూమి, ఆకాశం, గాలి, నీరు.. అన్నీ.. ఈ జగత్తు మొత్తం నీ ఒక్కడి సొత్తే అన్నట్టు ఆక్రమించావు.

అడవుల్లోని జంతువుల నుంచి.. ఆకాశమార్గాన సాగిపోయే స్వేచ్ఛా విహంగాల నుంచి మహా సాగరాల్లోని తిమింగలాల వరకు అన్నింటినీ జయించావు.. ఇష్టారాజ్యంగా వధించావు.. ప్రకృతిని  దోచావు .

ఇప్పుడు కంటికి కనిపించని అతి సూక్ష్మజీవికి భయపడి దుప్పటి తన్నేశావు.. ముక్కుకు ముసుగేశావు.. నిజంగానే "కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్"అన్నట్లు నీ మూలాల్లోకి వెళ్లిపోయి గుహల్లో దాక్కున్నావు. నీ అసలు ముసుగు తొలగిందిలే..

ప్రక‌ృతి ముందు నువ్వు ఎప్పటికీ అంగుష్ఠమాత్రమేనని అర్థమైందిలే!!

ఇప్పటికైనా మేలుకో... కనీసం అయిదూళ్లయినా మాకివ్వు అంటున్నాయి ఆ అడవి జీవాలు.

ఈ సమస్త భూమండలం మీదా నీతోపాటే తమకూ సమాన హక్కులున్నాయని గుర్తుచేస్తున్నాయి ఈ వన్య ప్రాణులు.  తాము కేవలం ఆకలి తీరడానికి.. కడుపు నింపుకోడానికి మాత్రమే వేటాడతామని.. అదీ కేవలం ఆగర్భ శత్రువుతోనే తలపడతామని.. నీలా సర్వభక్షకులం కాదని కాకూడదని హెచ్చరిస్తున్నాయి ఈ మూగ జీవాలు.

ఇప్పటికైనా మేలుకొని సంధికొస్తే సరి.. కాదూ, కూడదూ.. సూది మొన మోపినంత భూమి కూడా లేదు అనే అనేశావంటే.. ప్రక‌ృతి చేసే కురుక్షేత్రంలో బలైపోతావు సుమా!!

✿భగవద్గీతలో ఈ ఐదు శ్లోకాలు ఎప్పుడు గుర్తు చేసుకుంటే చాలు✿



#భగవద్గీత !

మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళుతున్నాం, ఏం చేస్తున్నాం, ఏం ప్రతిఫలం అందుకుంటున్నాం? అందుకు ప్రతిగా ఏం చేయాలి? కన్ ఫ్యూజన్ లేకుండా భగవద్గీతను మూడు ముక్కల్లో చెప్పాలంటే- ఇంతకంటే పెద్ద సెంటెన్సులు లేవు. కొందరు అనుకున్నట్టుగా, భగవద్గీత ఎట్టిపరిస్థితుల్లో మతగ్రంథం కానే కాదు. కురుక్షేత్ర సంగ్రామంలో అందరినీ చంపడం అధర్మం అనే చింత. అందరూ చచ్చిపోతారనే బాధ. ఈ రెండింటి గురించి మథనపడే అర్జునుడికి- శ్రీకృష్ణుడు విడమరిచి చెప్పిన సారాంశమే భగవద్గీత
.
బేసిగ్గా ఒక సినిమా పాట-మూడు నెలలకు పాతదైపోతుంది. ఒక కథ-ఆర్నెల్లకు పాచిపోతుంది. ఒక నవల-ఏడాది తర్వాత కనుమరుగైపోతుంది. కానీ వేల ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా నిత్య చైతన్య ప్రవాహమై, దారిమరిచిన బాటసారికి కరదీపికై, సమస్త భూమండలాన్ని దివ్యశక్తితో ముందుకు నడిపిస్తున్న ఏకైక గ్రంథం - ఇగిరిపోని గంధం- భగవద్గీత. ఇదేదో మతోద్బోధ అనుకునే వాళ్ల మైండ్ సెట్ మార్చలేం.
.
ఆధ్యాత్మిక ప్రవచనమైనా, వ్యాపార సూక్తులైనా, మేనేజ్మెంట్ కోర్సులైనా, వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులైనా, ఆటలో గెలవాలన్నా, పరీక్షలో పాస్ కావాలన్నా, జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్నా, ఎక్కడో చోట ఏదో సందర్భంలో గీతను కోట్ చేస్తాం. గీత గురించి చర్చిస్తాం. ఆది శంకరాచార్య దగ్గర్నుంచి స్వామీ వివేకానంద, మాక్స్ ముల్లర్ దాకా భగవద్గీత గొప్పదనాన్ని వేనోళ్లా చాటినవారే.
వందల శ్లోకాలు ఔపోసన పట్టాల్సిన పనిలేదు. బట్టీ పట్టి కంఠశోష తెచ్చుకోమనడం లేదు. ఒక నాలుగైదు శ్లోకాలు చాలు.
ప్రతి వ్యాపారి , ఉద్యోగి అనుసరించవలసిన #విద్యుక్త్ధర్మాలు

భగవద్గీత లోని 5 simple management skills

✿భగవద్గీతలో ఈ ఐదు శ్లోకాలు డీకోడ్ చేసుకుంటే చాలు✿

.#1.

*కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |*
*మా కర్మ ఫలహేతుర్భూ: మాతే సంగోఅస్త్వకర్మణి ||*

అంటే, నువ్వు కర్మలు చేయడానికి మాత్రమే. ఆ కర్మఫలాలకు అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో ఎట్టిపరిస్థితుల్లో కర్మలు చేయకు. అలాగని చేయడం మానకు అని అర్ధం.
ప్రతీ ఆంట్రప్రెన్యూర్ కు ఈ శ్లోకం వర్తిస్తుంది. చేయాల్సిన పని గురించి రెండే రెండు ముక్కల్లో నిక్షిప్తమైన సార్వజనీన సత్యం ఇది. ప్రతీ వ్యాపారి లేదా ఉద్యోగి ఇదే సూత్రం మీద పనిచేయాలి. ప్రతిఫలం గురించి ఆశించకుండా చేసుకుంటూ పోవడమే. ప్రాసెస్ ఎంజాయ్ చేసుకుంటూ తీరం చేరుకోవాలే తప్ప.. ఎంతసేపూ ఫైనల్ ఔట్ పుట్ మీదనే ఏకాగ్రత చేయొద్దు. అలా అని పూర్తిగా ఆశావాదం లేకుండా పనిచేయమని కాదు. ఆశ పడటం తప్పు కూడా కాదు. కానీ ఎలాంటి చర్యా లేకుండా- గాల్లో దీపం పెట్టే దేవుడా నీవే దిక్కు అంటే మాత్రం కష్టం. చేయాల్సింది చేయాలి. ఫలితం సంగతి తర్వాత. ముందు ధైర్యంగా అడుగేయాలి.
#2.

*వాసంసి జీర్ణాని యథా విహాయ* 
*నవాని గృహ్ణాతి నరోపరాణి |*
*తథా శరీరాణి విహాయ జీర్ణాని*
*అన్యాని సంయాతి నవాని దేహీ||*
అంటే,"చిరిగిపోయిన బట్టలను పడేసి, మనం కొత్తబట్టలు ఎలా కట్టుకుంటామో, జీర్ణమైన శరీరాన్ని వదిలిన ఆత్మ కూడా- మరోకొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది" అని అర్ధం.
ఆంట్రప్రెన్యూర్లు కూడా అంతే. వెర్సటాలిటీ చూపించాలి. దేన్నయినా స్వీకరించేలా ఉండాలి. అవే సక్సెస్ రుచి చూపిస్తాయి. ముఖ్యంగా మార్పును ఎప్పటికప్పుడూ గమనించాలి. కొత్త ట్రెండ్ ఫాలో అవ్వాలి. నా ఇష్టం- నాకు ఇదే ఇష్టం అంటే- వాళ్లు అక్కడే ఉండి పోతారు. అలా కాకుండా కొత్తదాని కోసం అన్వేషించాలి. కొత్తదనాన్ని చదివేయాలి. కొత్త అవకాశాల కోసం ఎదురుచూడాలి. అదే నిజమైన ఆంట్రప్రెన్యూర్ లక్షణం. బిజినెస్ అంటేనే నిరంతర ప్రయాణం. వ్యాపారి నిరంతర పథికుడు. నాలుగు గోడల మధ్యనే ఉంటే ప్రపంచం ఏనాటికీ అర్ధం కాదు. మొండిగా ఉండొద్దు. ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలి. సంకుచిత భావాలు వదిలేయాలి. స్పాంజి నీళ్లను పీల్చుకున్నట్టు అనుభవాల్ని పాఠాలుగా మలుచుకోవాలి. అప్పుడే గమనం వేగం అందుకుంటుంది.
#3.

*క్రోధాద్భవతి సమ్మోహః* *సమ్మోహాత్ స్మృతి విభ్రమ*
*స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్దినాశాత్‌ప్రణశ్యతి||*

అంటే, కోపం వల్ల అవివేకం, అవివేకం వల్ల మతిమరుపు, మరుపుతో బుద్ధినాశనం, బుద్ధినాశనంతో మనిషే నాశనం.
ఇదొక యాంగర్ మేనేజ్‌మెంట్ లాంటిది. ఆంట్రప్రెన్యూర్లకు మస్టుగా ఉండాల్సిన లక్షణం. లేకుంటే చెప్పుడు మాటలు విని, వాస్తవాలతో పనిలేకుండా ఆలోచించి బుర్రపాడు చేసుకుంటారు. మైండ్ లో ఒకరకమైన కన్ ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. దాంతో సహజంగానే మతిమరుపు వస్తుంది. ఆటోమేటిగ్గా లక్ష్యం నుంచి తప్పుకుంటాం. అందరిముందు నవ్వుల పాలవుతాం. అందుకే కోపాన్ని జయించాలి. టెంపర్ ని అదుపులో ఉంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో సహనం కోల్పోవద్దు.
#4.

*తస్మాదసక్త స్సతతం కార్యం కర్మ సమాచార |*
*ఆసక్తో హ్యాచరన్ కర్మ పర మాప్నోతి పూరుష: ||*

కాబట్టి, చేసే పని, దాని ఫలితము మీద అదే పనిగా ఆసక్తి ఉండొద్దు. కర్మ ప్రకారం చేసుకుంటూ పోవాలంతే అంటాడు శ్రీకృష్ణ భ‌గ‌వానుడు
వ్యాపారమూ అంతే. ఓపెన్ మైండెడ్ గా ఉండాలి. అవసరమైతే జత కలవాలి. బలం పెంచుకోవాలి. అత్యాశకు పోవద్దు. వీలైనంత క్రియేటవివ్ గా ఉండాలి. ఇన్నవేటివ్ గా ఆలోచించాలి. మార్కెట్ మార్పులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనించాలి. అంతేగానీ బైనాక్యులర్ పట్టుకుని ఎలుకను వేటాడినట్టుగా ఉండొద్దు.
#5.
*ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ|*
*యథోల్యేనావఈతో గర్భస్తథా తేనేదమావృతమూ ||*

అంటే- పొగ చేత నిప్పు, ధూళి చేత అద్దం, మావి చేత గర్భస్త పిండం కప్పబడినట్లే, కోరికల చేత జ్ఞానం కూడా కప్పబడినట్లే, కోరికల చేత జ్ఞానం కూడా కప్పబడి వుంటుంది అని అర్ధం.
ఆంట్రప్రెన్యూర్లు వెతుక్కోవాలే గానీ ఇందులో బోలెడంత నిగూఢార్ధం దాగివుంది. కప్పేసే ప్రతీదీ మనల్ని మిస్ లీడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్.. ఒకచోట మంట అంటుకుంది అనుకుందాం. వెంటనే పొగ దాన్ని కప్పేస్తుంది. ఎదురుగా వుండే అద్దం మీద ధూళి- నిప్పును, పొగను రెండింటినీ దాచేస్తుంది. అంతులేని కోరికలు నాలెడ్జ్ ని కిల్ చేస్తాయి. అంతేకదా మరి.
ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి. ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గాలి అన్న విచక్షణా జ్ఞాన‌మే ఉద్యోగమైనా లేదా వ్యాపారమైనా...

*ఓ విజేత కథ*

  *జీవనం దీర్భరం అయిన సందర్భంలో వీధులలో బిచ్చ‌మెత్తుకుని జీవించాడు, బ్రతుకు తెరువు కోసం చిన్న నాటినుండే రకరకాల పనులు చేశాడు. విధిలేక ఓ ముసలి వ్యక్తికి కేర్ టేకర్ గా, సెక్యూరిటీ గార్డుగా, క్యాబ్ డ్రైవర్ గా రకరకాల పనులలో జీవితం ప్రారంభించి  ఇప్పుడు రూ.60 కోట్ల ట‌ర్నోవ‌ర్ క‌లిగిన కంపెనీకి య‌జ‌మాని, దాదాపు వేయి కార్లు, అనేక స్కూల్ బస్సులకు ఓనర్ ,23లక్షల ఖరీదయిన లగ్జరీ కారు... ఇది నిజమా???? ఎలా సాధ్యం???? అవును మీరు చదువు తున్నది నిజం..నిజం.సరే ఆయన ఎవరు?*

*మనిషికి ఒక ల‌క్ష్యం… దాన్ని సాధించేందుకు ఓ సంక‌ల్పం… అందుకు అనుగుణంగా ప‌ట్టుద‌ల‌, దీక్ష‌, అంకిత భావం, శ్ర‌మ‌… ఇవి ఉంటే చాలు ఏ వ్య‌క్తి అయినా, ఎలాంటి ప‌రిస్థితుల్లో ఉన్నా జీవితంలో ఉన్న‌త స్థానాల‌కు చేరుకుని అనుకున్న ల‌క్ష్యాన్ని నెర‌వేర్చ‌గ‌లుగుతాడు. ఆ కోవకు చెందిన వ్యక్తి నిజ జీవిత గాధే ఇది*

*అది బెంగుళూరుకు దగ్గరలో అనేకాల్ తాలూకాలో  గోపసంద్ర అనే గ్రామం. అక్కడ ఒక  చాలా నిరుపేద, తిన‌డానికి తిండి కూడా లేని అత్యంత క‌టిక పేద కుటుంబం. ఆయజమాని స్థానిక ఆల‌యంలో పూజారి. ఆల‌యానికి వ‌చ్చే భ‌క్తులు ఇచ్చే అంతంత మాత్రం తో కుటుంబం గడవక  ఊళ్లో యాచ‌న చేసి ఇంటికి ఇంత తిండి తెచ్చేవాడు.ఆయనకూడా ఆయన రెండవకుమారుడు కూడా యాచనచేసి వచ్చిన దాంతోనే  కుటుంబ స‌భ్యులు స‌రిపుచ్చుకునే వారు. ఆకుటుంబంలో  ఇద్దరు కుమారులు ఓ కుమార్తె ఉన్నారు.*  

*కుటుంబం గడవడం కోసం వారి రెండవకొడుకు  అక్క‌డా ఇక్క‌డా చిన్న చిన్న ప‌నులు చేస్తూ చ‌దువు కొన‌సాగించేవాడు.10వ త‌ర‌గ‌తి  వరకూ ఉపాధ్యాయులు సాయం చేసేవారు.ప్రతిగా ఆ అబ్బాయి వారి ఇల్లు ఊడ్చడం,బట్టలు ఉతకడం వంటి పనులు చేసేవాడు.  కానీ అప్ప‌టికి అత‌ని కుటుంబ ప‌రిస్థితి మ‌రీ దిగ‌జారి పోయింది. దీంతో  ఆ అబ్చాయి తండ్రి అతనిని ఓ ముసలి వ్యక్తి చర్మరోగివద్ద పనికి కుదిర్చారు. అక్కడ ఆయనకు ప్రతీ రోజు స్నానంచేయించడం ఆతని వంటి నిండా ఉన్న చర్మవ్యాధికి మందు పూయడం వంటి పనులు అతి కష్టంపై ఓ సంవత్సరం పాటు చేసినప్పటికి వారుఅత‌నికి సరైనా తిండి పెట్టేవారు కాదు*

*ఈ క్ర‌మంలో ఆ అబ్బాయిని తండ్రి ఆతనిని చెక్ పేటలో గల ఓ ఆశ్రంలో చేర్చాడు.అక్కడ మూడు సంవత్సరాలు ఉన్నాడు. అక్కడే సంస్కృతం ,వేదాలు నేర్చుకున్నాడు.*

*విధి బలీయమైందికదా!!! అప్పటికే అతని అన్న పెళ్లి చేసుకొని కుటుంబాన్ని వదలి దూరంగా వెళ్ళి పోయాడు. సరిగా అప్పుడే మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఆ బాలుని తండ్రి మరణించడంతో అతను మకాం ఇంటికి మారింది. తల్లి ,చెల్లి కుటుంబబారం అంతా ఆతని మీదే పడింది. వెంటనే అద్గుడి అనే ప్రాంతంలో ఉన్న ఓ ప్లాస్టిక్  కంపెనీలో చేరి ఓ సంవత్సరం పని చేసాడు. ఇక్కడే ఆతనికి జీవితంపై కసి, కుటుంబాన్ని ఉన్నతంగా ఉంచాలనే ఆశయం బాగా బలపడసాగింది.*

*ఆతరువాత యాడ్ లాబ్ కంపెనీలో స్వీపర్ గా చేరాడు.కొంతకాలానికి శ్యాంసుందర్ ట్రేడింగ్ కంపెనీలో హెల్పర్ ఉద్యోగం సాధించాడు. ఆసమయంలోనే అప్పటివరకూ పొదుపు చేసినసోమ్ము కొంత , అప్పు చేసి కొంత డబ్బుతో తోపుడు బండిపై ప్లాస్టిక్ సామాన్లు అమ్మే మొబైల్ వ్యాపారం ప్రారంబించాడు. కానీ సరైన చదువు లేక ,సరైన గైడెన్సు ఇచ్చే మెంటార్లు లేనందున అనతికాలంలోనే 30వేల రూపాయల నష్టం  వచ్చి వ్యాపారం మూసేసాడు. కానీ ఎదో ఒకటి చేసి కుటుంబాన్ని ఉన్నతంగా ఉంచాలనే కాంక్ష మరింత బలపడింది*.

*20సంవత్సరాల వయస్సులో ఇతనికి తల్లి ఒత్తిడి వల్ల వివాహంజరిగింది. ఆ అమ్మాయి కూడా ఉద్యోగంచేసి ఆర్దికంగా కొంత అండను అందించసాగింది. ఇదేసమయంలో ఆ యువకుడు ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం సంపాదించి, కాళీ సమయంలో కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాడు.కానీ డ్రైవింగ్ లైసెన్సుకు డబ్బులు లేక పెళ్ళి సమయంలో తనభార్య తెచ్చుకున్న ఉంగరం అమ్మి లైసెన్సు సంపాదించాడు.* 

   *చాలీ చాల‌ని జీతం వ‌స్తుండ‌డంతో డ్రైవ‌ర్‌గా జీవితాన్ని ప్రారంభిం చాడు.ఓ ప్రముఖ హాస్పటల్ లో అంబులెన్స్ నడిపి శవాలను సహితం ఒక్కడే ఉండి వారి వారి ఇండ్లకు చేర్చేవాడు. దాదాపు 300 శవాలను గమ్యం చేర్చాడు,*

  *మరోకంపెనీలో  డ్రైవ‌ర్‌గా యాత్రీకులకు ప్రదేశాలను చూపుతూ కష్టమర్స్ తో అణుకవుతో మెదలి వారి అభిమానం పొందేవాడు. అత‌ను కొన్నేళ్ల‌పాటు అనేక టాక్సీ కంపెనీల్లో పనిచేశాడు. ఓ సారి ఫ్రాన్స్  నుండి  విజిటర్స్  వస్తున్నారని ముందుగానే తెలుసుకొని వారితో నేరుగా మాట్లాడడానికి 2నెలల్లో ఫ్రెంచ్ భాష నేర్చుకున్నాడు. వారి నుంచి మంచితనంతో బాటు ఆర్ధిక లాభం (టిప్సు) కూడా పొంది తానే స్వయంగా ఓ కారు కొనాలనే నిర్ణయించుకున్నాడు*.

   *తాను టాక్సీ డ్రైవ‌ర్‌గా సంపాదించిన  డ‌బ్బుతోపాటు భార్య సంపాదించిన కొద్దిపాటి డ‌బ్బుతో  మరియు బ్యాంకు లోనుతో  2000 సంవత్సరంలో ఓ ఇండికా కారు కొని సిటీ సఫారీ అనే కంపెనీ రిజిష్టర్ చేసాడు.అనంతరం సంవత్సరంలోపే మరోకారు , ఆరునెలలో మరో కారు కొని 3కార్ల తో  తన వ్యాపారం బాగా పుంజుకున్నాడు*.

 *2006లో బెంగుళూరులో ప్రసిద్దిపోందిన ఇండియన్ సిటీ టేక్సి అనే సంస్ధ అప్పులలో కూరుకు పోయి 35 కార్లతో అమ్మకానికి  పెట్టింది. మిత్రులద్వారా ఈ విషయం తెలుకున్న అతను తన దగ్గర ఉన్న మూడు కార్లు అమ్మేసి కొంత బ్యాంకు లోను పెట్టి 6లక్షల 50 వేలకు ఆ సంస్ధను కొని దానిని ప్ర‌యివ‌సి క్యాబ్స్  పేరిట‌ సొంతంగా ట్రావెల్ కంపెనీనిగా ఏర్పాటు చేశాడు.  అక్కడనుండి ఓక్షణంకూడా వృదా చేయక తన కంపెనీ అభివృద్దికి అవిరామంగా కృచేస్తూ అనేక పెద్దపెద్ద కంపెనీలతో ట్రావెల్ ఒప్పందాలు  తన సంస్ధను లాభాలలో నడుపుతూ వృద్ధిలోకి తెచ్చాడు. జీవితంలో అన్ని కోణాలు జననం మరణం మధ్య జీవితం ను ఆయన చవి చూసాడు.*

 *మొద‌ట అత‌ని కంపెనీలో 3 కార్లు మాత్ర‌మే క్యాబ్‌లుగా ఉండేవి. కానీ ఇప్పుడు వాటి సంఖ్య దాదాపు వేయికి  చేరుకుంది. అంతేకాదు, ప‌లు కార్పొరేట్ సంస్థ‌ల‌కు, స్కూళ్లు, కాలేజీల‌కు నెల‌వారీ అద్దె ప్రాతిప‌దిక‌న బ‌స్సుల‌ను న‌డ‌ప‌డం కూడా మొద‌లు పెట్టాడు. దీంతో అత‌ని ట‌ర్నోవ‌ర్ ఇప్పుడు సంవ‌త్స‌రానికి రూ.60 కోట్లుగా మారింది.  దాదాపు 1200మంది అతని ద్వారా ఉపాధి పొందుతున్నారు.*

*ఇంత సాధించినా ఆయన మాత్రం తాను ఒక‌ప్పుడు చేసిన డ్రైవ‌ర్ వృత్తిని మ‌రిచిపోలేదు. త‌న‌లా ఉద్యోగం చేసుకుని బత‌కాల‌ను కుంటున్న ఎంతో మంది నిరుద్యోగ యువ‌తీ, యువ‌కుల‌కు డ్రైవ‌ర్ క‌మ్ ఓన‌ర్ ప‌థ‌కం ద్వారా 3 ఏళ్ల‌లో క్యాబ్ సొంత‌మయ్యేలా రూ.50వేల డిపాజిట్‌తో కార్ల‌ను అందిస్తూ త‌నకు చేతనైనంత స‌హాయం చేస్తున్నాడు. వారి జీవితాల‌ను ఆర్థిక ప్ర‌గ‌తి దిశ‌గా తీర్చిదిద్దు తున్నాడు.*

*ఇప్పుడు ఆయనకు  53 ఏళ్లు. త‌న వ్యాపారాన్ని ఇంకా వృద్ధి చేస్తాన‌ని, రూ.100 కోట్ల ట‌ర్నోవ‌ర్‌కు తీసుకువ‌చ్చి, ఇంకా ఎంద‌రో నిరుద్యోగుల‌కు స్వ‌యం ఉపాధి క‌ల్పిస్తాన‌ని ధీమాగా చెబుతున్నాడు*. 

*ఇంతకీ అతని పేరు చెప్పలేదు కదూ!!! ఆయన రేణుక ఆరాధ్య‌.* *MD, ప్రైవసీ క్యాబ్ కంపెనీ ,బెంగుళూర్ . ఈ వాస్తవకధ   అభిలాష, పట్టుదల ,కృషి  ఉంటే మనిషి ఎంతటి శిఖరాన్నయినా చేరుకోగలడు అనినిరూపించింది.*
*"రేణుక ఆరాధ్య‌" గురించి అనేక పత్రికలు సావనీర్స్ ప్రచురించాయి.*
*నేటి మనయువతరం ఈయనను  స్ఫూర్తి గా తీసుకొని అభివృద్ది పధంలో పయనిస్తారని ఆశిస్తూ.....*

  *హేట్సాప్ రేణుక ఆరాధ్య‌....,*

*ATTENTION PLEASE !!*
*Agarwal Samaj Hyderguda Shakha* 
The following items are  available for usage at
 *NO DEPOSIT* 
 *NO RENT* 

1. *OXYGEN CONCENTRATOR* ( 3 days only)
2. *PULSE/OXI METER* 
(Use & return back- Rs 1000.00 - deposit) 
3. *WHEEL CHAIR* 

 facility is available at no cost. Anyone in need can avail USE & RETURN BACK after use in good condition .* 

Please contact:
CA Manoj Kumar Agarwal
 *9393066923* 
 *( Chief Coordinator)* 
Location: Abids
 *Other coordinators*:
Mahesh Kanodia
 *9966994499* 
Banzara hills
Sanjay pasari *
9391002500*
Ameer pet
Ramesh Agarwal
(Manokamana group)
 *9848112060* 
Ghansi Bazar
CA Pankaj Kumar  Agrawal
 *9391056920* 
Mouzam zahi Market
Ravinder Goel(Bunti bhai)
 *9291308991* 
   Chelapura
Ramakanth Goel
 *9391034050*
  Malakpet
Rajesh Dhanuka
 *9030036200* 
Kondapur
Srinivas Bansal 
 *919246541126* 
    Ramkot 
Please forward this in other groups and let us fight this virus
collectively.

* సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు#*

మనం తరుచుగా వినే కొన్ని సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు తెలుసుకోవాలని అనిపించడం సహజం కదా!

 అలాంటి వాటిని కొన్నింటిని మీకోసం సిద్ధం చేశారు. చూడండి:

ముందుగా మనం తరుచుగా వినే మూల వాక్యాలు ఇవీ:

👉 *ధర్మో రక్షతి రక్షిత:*
👉 *సత్య మేవ జయతే*
👉 *అహింసా పరమో2ధర్మ:*
👉 *ధనం మూలమిదం జగత్*
👉 *జననీ జన్మ భూమిశ్చ*
👉 *స్వర్గాదపి గరీయసి*
👉 *కృషితో నాస్తి దుర్భిక్షమ్*
👉 *బ్రాహ్మణానా మనేకత్వం*
👉 *యథా రాజా తథా ప్రజా*
👉 *పుస్తకం వనితా విత్తం*
👉 *పర హస్తం గతం గత:*
👉 *శత శ్లోకేన పండిత:*
👉 *శతం విహాయ భోక్తవ్యం*
👉 *అతి సర్వత్ర వర్జయేత్*
👉 *బుద్ధి: కర్మానుసారిణీ*
👉 *వినాశ కాలే విపరీత బుద్ధి:*
👉 *భార్యా రూప వతీ శత్రు:*
👉 *స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:*
👉 *వృద్ధ నారీ పతి వ్రతా*
👉 *అతి వినయం ధూర్త లక్షణమ్*
👉 *ఆలస్యం అమృతం విషమ్*
👉 *దండం దశ గుణం భవేత్*
👉 *ఇవీ మన చెవిని పడుతూ ఉండే మూల వాక్యాలు. కదా?*

*ఇప్పుడు వీటి పూర్తి పాఠాలు చూదామా ?*

ధర్మ ఏవో హతో హంతి
"ధర్మో రక్షతి రక్షిత:"
తస్మా ధర్మో న హంతవ్యో
మానో ధర్మో హ్రతోవ్రధీత్

🔥ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే , అది మనల్ని ధ్వంసం చేస్తుంది. దానిని మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది. అందు చేత ధర్మాన్ని నాశనం చేయ కూడదు. ఎవరికి వారే తమంత తాముగా నశించి పోవాలని కోరు కోరు కదా !

🔥 సత్యమేవ జయతే నా2నృతం
సత్యేన పంథా వితతో దేవయాన:
యేనా క్రమం తృషయో హా్యప్త కామా
యత్ర త త్సత్యస్య పరమం నిధానమ్

🔥సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం వలన దేవతల మార్గం కనిపిస్తుంది. సత్యం వలన మహర్షులు కోరికలు లేని వారై పరమేశ్వరుని పొంద గలుగు తున్నారు. ఈశ్వరుడు సత్య స్వరూపుడు.

🔥 అహింసా పరమో ధర్మ:
తథా2 హింసా పరం తప:
అహింసా పరమం ఙ్ఞానం
అహింసా పరమార్జనమ్
🔥అహింస గొప్ప ధర్మం. గొప్ప తపం. మంచి ఙ్ఞానం. గొప్ప సాధన

🔥 ధనమార్జాయ కాకుత్స్థ !
ధన మూల మిదం జగత్
అంతరం నాభి జానామి
నిర్ధనస్య మృతస్య చ

🔥ఓ రామా ! ధనాన్ని సంపాదించాలి. ఎందు కంటే ధనంతో తోనే లోకమంతా ఉంది. ఈ విషయం లోని ఆంతర్యం గమనించాలి. ధనం లేని వాడు మృతునితో సమానం.

🔥 అపి స్వర్ణ మయీ లంకా
న మే రోచతి లక్ష్మణ !
జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపి గరీయసి.

🔥సోదరా, లక్ష్మణా ! ఈ లంక బంగరు మయ మయిన దైనప్పటికీ నాకు నచ్చదు. ఇక్కడ ఉండ లేను. ఎందుకంటే, తల్లి, పుట్టిన ఊరు స్వర్గం కంటె గొప్పవి కదా !

🔥 కృషితో నాస్తి దుర్భిక్షమ్
జపతో నాస్తి పాతకమ్
మౌనేన కలహం నాస్తి
నాస్తి జాగరతో భయం.

🔥చక్కగా వ్యవసాయం చేస్తే కరవు అనేది ఉండదు. జపతపాలు చేస్తే పాపం పోతుంది. మౌనంగా ఉంటే ఎవరితోనూ విరోధమే ఉండదు. జాగురూకతతో ఉంటే దేనికీ భయపడే పని లేదు.

🔥 గజానాం మంద బుధ్ధిశ్చ సర్పాణా మతి నిద్రతా
బ్రాహ్మణానా మనేకత్వం త్రిభిర్లోకోపకారకమ్

🔥ఏనుగుల మంద బుద్ధి తనం, పాముల అతి నిద్రా గుణం, బ్రాహ్మణులలో ఉండే అనైక్యత ... వీటి వల్లన లోకోపకారం జరుగుతోంది కదా !

🔥 రాఙ్ఞ ధర్మిణి ధర్మిష్ఠా, పాపే పాప పరా: సదా
రాజాను మను వర్తంతే, యథా రాజా తథా ప్రజా !

🔥రాజు ధర్మ పరుడయితే రాజ్యం ధర్మ పథంలో నడుస్తుంది. పాప వర్తనుడయితే రాజ్యం పాప పంకిల మవుతుంది. ఎప్పుడూ ధర్మా ధర్మాలు రాజుని అనుసరించి నడుస్తాయి. రాజు ఎలా ఉంటే, ప్రజలూ అలాగే నడచు కుంటారు.

🔥 పుస్తకం వనితా విత్తం
పర హస్తం గతం గత:
అధవా పునరా యాతి
జీర్ణం భ్రష్ఠా చ ఖండశ:

🔥పుస్తకం, స్త్రీ , ధనం ఇవి మన వద్ద ఉన్నంత సేపే . ఇతరులు చేతిలో పడితే మరి వాటి పని అంతే. తిరిగి వస్తాయను కో వద్దు. ఒక వేళ వచ్చినా. సర్వ నాశన మయి పోయిన స్థితిలో మనకి తిరిగి దక్కుతాయి సుమీ. ( స్త్రీని జాగ్రత్తగా చూసుకోవాలి అనే భావం ఇక్కడ గ్రహించాలి)

🔥 శత నిష్కో ధనాఢ్యశ్చ
శత గ్రామేణ భూపతి:
శతాశ్వ: క్షత్రియో రాజా
శత శ్లోకేన పండిత:

🔥వంద నిష్కలు ( ధన విశేషం) ఉన్న వాడే ధనవంతుడు అనిపించు కుంటాడు. వంద గ్రామాలకు అధిపతి అయిన వాడే భూపతి అవుతాడు. వంద గుఱ్ఱాలు కల వాడే రాజు అనిపించు కుంటాడు. వంద శ్లోకాలు వచ్చిన వాడే పండితుడు.

🔥విద్వత్త్వం చ నృపత్వం చ
నైవ తుల్యం కదాచన
స్వ దేశే పూజ్యతే రాజా
విద్వాన్ సర్వత్ర పూజ్యతే.

🔥పండితుడికీ, రాజుకీ పోలికే లేదు ! ఎందు కంటే, రాజు తన దేశంలో మాత్రమే పూజింప బడతాడు. కాని, పండితుడు లోకమంతా గౌరవించ బడుతాడు.

🔥 శతం విహాయ భోక్తవ్యం
సహస్రం స్నాన మాచ రేత్
లక్షం విహాయ దాతవ్యం
కోటిం త్యక్త్వా హరిం భజేత్

🔥వంద మందిని విడిచి పెట్టి అయినా భుజించాలి. వేయి మందిని విడిచి పెట్టయినా స్నానం చేయాలి. లక్ష మంది నీ వెంట రాక పోయినా దానం చేయాలి. కోటి మందిని విడిచి పెట్టయినా శ్రీహరిని సేవించు కోవాలి.

🔥 అతి దానాత్ హత: కర్ణ:
అతి లోభాత్ సుయోధన:
అతి కామాత్ దశగ్రీవో
అతి సర్వత్ర వర్జయేత్
( ఇది మరోవిధంగా కూడా ఉంది)

🔥విచ్చల విడిగా దానం చేయడం వలన కర్ణుడు చెడాడు. మిక్కిలి స్వార్ధ గుణం చేత దుర్యోధనుడు చెడాడు. అతి కామం చేత రావణుడు నాశనమయ్యాడు. కనుక అంతటా అతిని విడిచి పెట్టాలి. ఎప్పుడూ అతి పనికి రాదు. ఓవరాక్షను వికటిస్తుంది.

🔥 సత్యాను సారిణీ లక్ష్మీ
కీర్తి: త్యాగాను సారిణీ
అభ్యాసాను సారిణీ విద్యా
బుద్ధి: కర్మాను సారిణీ.

🔥లక్ష్మీ దేవి ఎప్పుడూ సత్యాన్ని అనుస రించే ఉంటుంది. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది. అలగే, కీర్తి త్యాగాన్ని అనుసరించి ఉంటుంది. త్యాగ గుణం లేనిదే కీర్తి ప్రతిష్ఠలు రమ్మంటే రావు. అభ్యాసం లేనిదే విద్య అలవడదు. నిత్యం చదవనిదే చదువు ఎలా స్తుంది ? అభ్యాసం కూసు విద్య కదా. ఇక, బుద్ధి కర్మను అనుసరించి ఉంటుంది. చెడి పోయే రాత మనకి ఉంటే మన బుద్ధి చెడు త్రోవలోను, బాగు పడే రాత ఉంటే మన బుద్ధి మంచి దారిలోను ప్రవర్తిస్తుంది. బుద్ధి మన కర్మలను అనుసరించి ఉంటుంది సుమా !

🔥న నిర్మితో వై నచ దృష్ట పూర్వో
న శ్రూయతే హేమ మయం కురంగ:
తథా2పి తృష్ణా రఘు నందనస్య
వినాశ కాలే విపరీత బుద్ధి:

🔥బంగారు లేడి ఉన్నదని ఎన్నడయినా విన్నామా ? ఎప్పుడయినా ఎక్కడయినా  అయినప్పటికీ రాముడు తన చెలి కోరిందని ముందు వెనుకలు యోచించ కుండా బంగారు లేడిని తెస్తానని వెళ్ళాడు. వినాశ కాలం దాపురించిన నాడు ఇలాంటి విపరీత బుద్ధులే పుడుతూ ఉంటాయి. చెడ్డ కాలం వచ్చి నప్పుడు తర్కం పని చెయ్యదు. బుద్ధి మందగిస్తుంది.

🔥 ఋణ కర్తా పితా శత్రు:
మాతా చ వ్యభిచారిణీ
భార్యా రూపవతీ శత్రు:
పుత్ర: శత్రురపండిత:

🔥 అప్పు చేసి, మనకి ఆస్తి కాకుండా అప్పు మిగిల్చే తండ్రి మనకి శత్రువుతో సమానం. వ్యభిచరించే తల్లి శత్రువు. రూపవతి అయిన భార్య శత్రువు. పండితుడు కాని కుమారుడు శత్రువు.

🔥 ఆత్మ బుద్ధి: సుఖం చైవ
గురు బుద్ధిర్విశేషత:
పర బుద్ధి ర్వినాశాయ
స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:

🔥 మనకి తోచినది చేయడం అన్నిటి కన్నా మేలు. పెద్దల సలహా ప్రకారం నడచు కోవడం ఇంకా మంచిది. కాని పరుల (శత్రువుల అని కూడా అర్ధం చెప్పు కోవచ్చును) ఆలోచనల మేరకు నడచు కోవడం నాశనం కొని తెచ్చు కోవడమే. ఇక, ఆడువారి ఆలోచనల బట్టి నడుచు కుంటే ప్రళయమే సుమా !

🔥 అసమర్ధస్య సాధూనాం
నిర్ధనస్య జితేంద్రియ:
వార్ధక్యో దేవతా భక్తి:
వృద్ధ నారీ పతివ్రతా.

🔥అసమర్ధుని మంచితనం, ధనం లేని పేద వాని ఇంద్రియ నిగ్రహం, ముసలి తనంలో దైవ భక్తి, వయసు ఉడిగిన ఆడుదాని పాతి వ్రత్యం ఒక్కలాంటివే.

🔥 ముఖం పద్మ దళాకారం
వచ శ్చందన శీతలం
హృదయం కర్తరీ తుల్యం
అతి వినయం ధూర్త లక్షణమ్

🔥ముఖమేమో, పద్మం లాగా ఉంటుంది. మాటలేమో చందనం వలె చల్లగా ఉంటాయి. కాని, దుర్జనుని మనసు మాత్రం కత్తెర పిట్టలాంటిది. అతి వినయం చూపడం చెడ్డ వాడి లక్షణం సుమా. 

🔥 సిద్ధ మన్నం ఫలం పక్వం
నారీ ప్రథమ యౌవ్వనం
కాలక్షేపం నకర్తవ్యం
ఆలస్యం అమృతం విషమ్

🔥వండిన అన్నాన్ని భుజించడానికీ, పండిన పండును కొరుక్కు తినడానికీ, యౌవ్వన వతి పొందును స్వీకరించడానికీ ఆలస్యం చేయ రాదు సుమా ! ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమై పోతుంది. అన్నం చల్లారి పోవడం, పండు కుళ్ళి పోవడం, యౌవ్వనం తరగి పోవడం జరుగుతాయి. ఆలస్యం చేయడం వల్ల అమృతం కూడా విషతుల్యమవుతుంది.

🔥 విశ్వా మాత్రా హి పశుషు, కర్ద మేషు జలేషుచ
అంధే తమసి వార్ధక్యే, దండం దశ గుణం భవేత్.

🔥పక్షులు, కుక్కలు, శత్రువులు, పాములు, పశువులు వీటిని అదుపు చేయడానికి వరుసగా, బురదలో, నీటిలో, చీకటిలో, గ్రుడ్డితనంలో , ముసలి తనంలో సాయంగా ఉండేది చేతి కర్ర. అందు వల్ల దండానికి (కర్రకి) దశగుణాలు ఉన్నాయి సుమీ !🔥

*ఇవీ మూల వాక్యాలకి పూర్తి పాఠాలు.*

*పూర్వులు చెప్పిన దానిని మార్చరాదు*