17, జులై 2020, శుక్రవారం

రవి అస్తమించని రాజ్యంలో తెలుగు బ్రాహ్మణుల విజయకేతనం.

 కేవలం యూకే తెలుగు బ్రాహ్మణులకోసం ఒక సంస్థ కావాలి అనే దృఢ సంకల్పం తో మొట్టమొదటగా జూన్, 2017 లో తొలి అడుగు పడింది. దాని ప్రతిరూపంగా యూకే లో ఉన్న ప్రధాన నగరాల్లో మొదటి విడుతగా బ్రాహ్మణుల సమీకరణాలు, సమావేశాలు జరిగాయి. అందరి ఆలోచనలు, సలహాల మేరకు ఫిబ్రవరి, 2018 లో కేవలం మన యూకే తెలుగు బ్రాహ్మణుల కోసం అధికారికంగా యూకే తెలుగు బ్రాహ్మణ అసోసియేషన్" (UKTBA ) పేర సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసి 13 మంది కొర్ సభ్యులతో ప్రారంభించబడింది.  ఇప్పుడు సుమారు 900 బ్రాహ్మణ కుటుంబాలు ఈ సమూహము లో ఉన్నాయి.

 సంఘం నిర్మాణకర్త మరియు  ప్రధాన భూమిక పోషించిన హరి హృషీకేశ్ బోరపట్ల గారిని అధ్యక్షుడు గా, గోపాల్ తాళ్లూరి గారిని ఉపాధ్యక్షుడుగా ఎన్నుకొని. మిగతా వారిని కార్యవర్గ సభ్యులు గా నియమించి అనేక బ్రాహ్మణ సంభందిత కార్యమాలు చెప్పట్టబడినవి. అందులో భాగంగా కేవలం యూకే తెలుగు బ్రాహ్మణుల కోసం  ప్రతీ సంవత్సరం ఉగాది, దీపావళి సంబరాలు, కుంకుమార్చన, సామూహిక సత్యనారాయణ వ్రతాలు, కార్తీక వనభోజనాలు, బ్రాహ్మణ పిల్లల సాంస్కృతిక సభ వంటివే కాక ఆన్లైన్లో ప్రతి శుక్రవారం లలితాసహస్రనామాలు, ప్రతి ఆదివారంనాడు పిల్లల తెలుగు పద్య విభావరి, శనివారం హనుమాన్ చాలీసా, గోవింద నామాలు వంటి వాటిని కూడా చేస్తూ అటు పిల్లలకు, ఇటు పెద్దలు మన బ్రాహ్మణ సంస్కృతి వీడి పోకుండా ఉండేందుకు అలాగే అందరూ ఒకరినొకరు తెలుసుకునేందుకు ఈ సంస్ధ అహర్నిశలు కృషి చేస్తుంది.

కన్న తల్లిని ఉన్న ఊరిని మరిచి పోవద్దు అనే నానుడి ఎప్పుడూ యూకే తెలుగు బ్రాహ్మణులు మరిచిపోలేదు. అందులో భాగంగా అనేక మంది తెలుగు పేద బ్రాహ్మణులకు మేము ఉన్నామంటూ సేవలు అందించిందీ సంస్థ. ఇప్పటికి 20 నుండి 30 కుటుంబాలకు నేరుగా డబ్భులు పంపి వారి జీవితానికి భరోసా ఇచ్చిన సంస్థ ఇది .
విశాఖ లోని రామనాథం గారి కుమార్తె వైద్య ఖర్చులకు 2 లక్షల, 50 వేలతో మొదలు పెట్టి, గుంటూరు విశ్వనాథం గారికి 50 వేలు, హైదరాబాద్ నాళాలో చనిపోయిన వారికి 25 వేలు, కోదాడ లో ప్రమాదంలో చనిపోయిన వారికి, ఒంగోలులో చనిపోయిన పేద బ్రాహ్మనుడికి, ముసారాంబాగ్ లో చనిపోయిన పురోహితునికి, నెల్లూరు లో నేలరాలిని  పేద పురోహితునికి, వరంగల్ లో చనిపోయిన పేద బ్రహ్మణునికి సంగం తరపున ఒక్కొక్కరికి 25 వేల రూపాయలు, కాళ్ళుచచ్చుబడి దయనీయ స్ధితిలో ఉన్న శ్రీకాంత్ శర్మ గారికి 3 లక్షల పై చిలుకు ఇచ్చి వారి శాశ్వత వైద్య సహాయం ఇలా అనేక మందికి యూకే తెలుగు బ్రాహ్మణ సంగం వెన్నుదన్నుగా ఉండి ఆదుకుంటుంది.

ఇంతే కాక, యూకే లో తెలుగు రాష్ట్రాల వారు మన తెలుగు బ్రాహ్మణ పురోహితులు తెలియక ఇతర భాషా పురోహితులను పిలిచే వారు. కానీ మన తెలుగు బ్రాహ్మణ సంగం ఏర్పడిన తరువాత అందరికీ విస్తృతంగా సేవలు మొదలు పెట్టాము. యూకే లో ఉన్న ప్రతి తెలుగు పురోహితుల వివరాలు తీసుకొని ఇప్పుడు మన తెలుగు వారికి కేవలం మన కట్టు, బొట్టు, మన సంప్రదాయం, మన శాస్త్రోక్తంగా మన పురోహితులను అందుబాటులోకి తెచ్చాము. ఇది ఈ సంస్ధ అపూర్వ విజయం.. ఈ దేశంలో కుల సంఘాన్ని అధికారికంగా ఏర్పాటు చేసుకున్న మొట్టమొదటి  సంస్థ మన "యూకే తెలుగు బ్రాహ్మణ అసోషియేషన్" ఇది ఈ దేశ చరిత్రలో మరొక అధ్యాయం.

మేము ఎప్పుడూ మన తెలుగు రాష్ట్రాల బ్రాహ్మణులకోసం పరితపిస్తాము. మాకు మన రాష్ట్ర బ్రాహ్మణులు తోడు ఉన్నారని ఒక భరోసా, మేము తిరిగి స్వంత గూటికి వస్తే అక్కున చేర్చుకుంటారని ఆశ ఇంతకు  మించి మా సభ్యులకు ఏ కోర్కెలు, స్వార్థం లేదు. 

బ్రాహ్మణ సేవ భగవంతుని సేవతో సమానం

కామెంట్‌లు లేవు: