10, మార్చి 2021, బుధవారం

దొంగ పిల్లులను

 దొంగ పిల్లులను తరిమేసిన కాశ్మీరి ప్రజలు.

...............................................................

పూర్వం కాశ్మీరదేశాన్ని సహమిత్రుడనే రాజు పరిపాలించేవాడు. అతని భార్య పేరు గిరిభద్ర. నిష్టాగరిష్టులైన సంప్రాదాయవాదులు. సర్వమత సహనం కలవారు. ఎన్నో పూజలు వ్రతాలు చేసుకోవడం వలన వారికి లేకలేక సంతానం కలిగింది. పుట్టిన పిల్లవాడికి క్షారచక్షువు అనే పేరు పెట్టారు. చారచక్షువంటే గూఢచారిలాంటి కన్నులు కలవాడని అర్థం. పరిసరాలను నిశితంగా గమనించేవాడని కదా !


ఆ బాలుడికి మూడునెలల వయసు వున్నపుడు తల్లి ఆ బాలుడిని ఊయలలో పడుకొబెట్టి జోలపాట పాడుతోంది. ఉన్నట్టుండి ఆ పసిబాలుడు ఫక్కున నవ్వసాగాడు. తల్లికి ఆశ్చర్యమేసింది, పసిబాలుడేమిటికి గట్టిగా నవ్వడమేమిటని.

ఆ బాలుడు నవ్వు ఆపడంలేదు.


ఆ రాణికి  ఏం చేయాలో తోచలేదు.

మహరాజుకు కబురుపెట్టింది. మహరాజును చూచినప్పటికి ఆ పసిబాలుడు ఇంకా బిగ్గరగా నవ్వసాగాడు.


ఆ రాజు విషయం తెలుసుకోవాలని ఆస్థాన పురోహితుడిని, జ్యోతిష్కుడిని, మహమంత్రిని, ఆస్థాన వైద్యడిని పిలిపించాడు. ఎవరు వచ్చి ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆ బాలుడు నవ్వు ఆపడం లేదు. రాజవైద్యుడి వైద్యప్రక్రియ అంతా నిరర్థకమే అయింది.


ఎవరికి ఏం చేయాలో తోచలేదు. చివరికి రాజుగారి జ్యోతిష్కుడు ఆలోచించి, ఓ రాజా పసిబాలుడు నవ్వుతూవున్నాడంటే ఇతను సామాన్యుడేమి కాదు. ఈ బాలుడికి పూర్వజన్మ జ్ఞానముంటుంది. అందుకే ఏదో తెలిసి ఇలా నవ్వుతున్నాడు. ఆ బాలుడు తప్ప ఇతరులెవ్వరు ఆ నవ్వుకు సమాధానం చెప్పలేరు.కనుక ఆ బాలుడినే అడగడం శ్రేయస్కరమంటూ విన్నవించాడు.


ఇది నిజమేననుకొన్న ఆ రాజదంపతులు "బాబు నీ నవ్వుకు కారణమేమిటని " అడిగారు.


 అందుకా బాలుడు మహరాజా జాతహరిణి అంటే ఏమిటని అడిగాడు. అందుకా రాజు ఓ పసిబాలుడా! ఈ నెలల వయసుకే నువ్వు నవ్వడం మాటాడటం విచిత్రంగా వుంది,


అయినా అడిగావు కనుక చెబుతున్నా విను! జాత అంటే జాతి.నా ప్రజలు, నా వారు, నా వారసులు, నా భాష, సంప్రాదాయబద్ధులు, ఇంకా హరిణి అంటే నశింపజేయునది అని సమాధానమిచ్చాడు.


అందుకా బాలుడు చిన్నగా నవ్వి, మహరాజా, నిజమే జాతహరిణి అంటే ప్రజలను నశింపచేయునదనే అర్థమే. నీ రాజ్యంలో జాతహరిణి అనే పిల్లి, తన పరివారంతో ప్రవేశించింది. ఈ పిల్లులు నీ దేశంలో ఏ ఒక్కరిని నశింపచేయవు, చంపవు. నీ సంస్కృతి సంప్రాదాయాలు ఆచారాలు వ్యవహారాలు పూజలు కట్టుబాట్లు మొదలైనవాటిపై దాడి చేస్తాయి.


ఈ పిల్లులకు  విదేశిశక్తుల అండదండలు ధనసాయం దండిగా వుంది. కత్తిపట్టి యుద్ధం చేయవు. ఘటికా స్థానాలలో ఆశ్రమగురుకులాలలో అన్ని రకాల విద్యా సంస్థలలో, సేవ పేరుతో వైద్యశాలలలో ప్రవేశిస్తాయి. ఇవి సేవచేస్తున్నట్లు సంస్కరిస్తున్నట్లు కనబడతాయి.


కాని నీ రాజ్యంలో పేదరికాన్ని, అవిద్యను, అనారోగ్యాన్ని, మూఢ నమ్మకాలను ఆశ్రయించి మెల్లమెల్లగా తమ దేవుడిని అందులో జొప్పిస్తాయి. ఎంతగానంటే కన్నతల్లి, స్వంతమతాల కంటే వీరి దైవవాక్కులు, ప్రార్ధనలే గొప్పవి అనేంతగా.


వారి ఉచ్చులో పడినవారందరు కన్నతల్లిని వదలి వారి తల్లి వైపు మారుతారు.


మహారాజా ! నీ రాజ్యంలో వున్న ప్రతి జాతహరిణి ప్రమాదమే. ఇపుడు కూడా దైవబోధనల పేరుతో మంత్రించిన నూనె తీసుకొని నా మీద చల్లటానికి, తద్వారా నీకు మేలుచేస్తున్ననే మిషతో ఓ జాతహరిణి గుమ్మం బైట వేచివుంది. ఆ జాతహరిణి చేష్టలు చూస్తుంటే నవ్వు వచ్చిందిఅందుకే నవ్వా నంటూ, రాజా మేలుకోమంటూ ఆ బుడతడు సమాధానమిచ్చాడు.


అందుకా రాజు ఈ పిల్లులన్ని నాకు రాజకీయంగా మద్దత్తు ఇస్తూ నేను ఎదగటానికి ఓటు రూపంలో సాయంచేస్తున్నాయి. అంతేకాదు స్వదేశీవిదేశీ దండయాత్రలపుడు నాకు వీరంతా ధనసాయం కుడా చేస్తున్నారు. బాగా పలుకుబడి ఉన్నవాళ్ళు, నాకు అధికారమే ముఖ్యం కదా ! వీరినెలా నేను విడిచిపెట్టను అంటూ ఆ రాజు ప్రశ్నించాడు.


ఓ రాజా వారి సాయం ఎంతవరకునంటే నీ సంస్కృతి, సంప్రాదాయాలు, నాగరికతలు, పూర్వీకులు ఇచ్చిన వారసత్వాన్ని కబలించేటంత వరకే. నీ దేశ నాగరికతను ధ్వంసం చేసిన తరువాత నీ సింహాసనాన్ని ఆక్రమిస్తారు. నీ ప్రజలు అమాయకులు తెల్లనివన్ని పాలేననుకొనే మనస్తత్వం వారిది. ఈ పిల్లులను నమ్మి స్వంత కొంపను ముంచుకొన్న తరువాత


కట్టేబట్ట, తినేతిండి, పూజలు, దేవతలు, నడక, నడత ఇవన్ని వారి చేతులలోనే వుంటాయి. వారు చెప్పినట్లుగా మీరు వినాలి, విని తీరాలి.


అంతా మంచిదే అన్ని మతాలు అందరు దేవుళ్లు సమానమనే నీవు నీ రాజ్యప్రజలు ఇకనైనా మేలుకోకపోతే ఇంటింటా జాతహరుణులు తయారైతారు!

కాబట్టి ఓ రాజా రాబోయే ఆపదలను నివారించేందుకు భారతీయ జనతను బలోపేతం చేయి,


 ఓ రాజా నీ రాజ్యంలో పేదరికాన్ని, అవిద్యను, అనారోగ్యాన్ని, మూఢ నమ్మకాలను ఆశ్రయించి సంఘ సంస్కరణల పేరుతో మెల్లమెల్లగా తమ దేవుడిని అందులో జొప్పిస్తాయి. ఎంతగానంటే కన్నతల్లి, మాతృభాష, స్వంతమతాల కంటే వీరి దైవవాక్కులు, ప్రార్ధనలే గొప్పవి అనేంతగా.


వారి ఉచ్చులో పడినవారందరు కన్నతల్లిని వదలి వారి తల్లి వైపు మారుతారు.అంతా అయిపోయిన తరువాత మనం ఈ దేశంలో జీవిస్తూ కూడా జీవచ్ఛవాలుగా బ్రతకాల్సిందే.


మహారాజా ! నీ రాజ్యంలో వున్న ప్రతి జాతహరిణి ప్రమాదమే. ఇపుడు కూడా దైవబోధనల పేరుతో మంత్రించిన నూనె తీసుకొని నా మీద చల్లటానికి, తద్వారా మేలు చేస్తున్ననే మిషతో ఓ జాతహరిణి గుమ్మం బైట వేచివుంది. ఆ జాతహరిణి చేష్టలు చూస్తుంటే నవ్వు వచ్చిందిఅందుకే నవ్వా నంటూ, రాజా మేలుకోమంటూ ఆ బుడతడు సమాధానమిచ్చాడు. ఏం చేస్తావంటూ ప్రశ్నించాడా చారచక్షువు. దాంతో రోషం తెచ్చుకొన్న ఆ రాజు బడిత తీసుకొని నాలుగు పీకేసరికి ఆ పిల్లి కుయ్యో, మొర్రో అంటూ పరుగుపెట్టింది. ప్రజలందరూ తిరగబడి పిల్లులను తరిమేసి, తమ రాజ్యవారసత్త్వాన్ని కాపాడుకొన్నారు.


జైహింద్.

..............................................................................................................జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

హిందువుల భవిష్యత్

 హిందువుల భవిష్యత్ కాపాడుకోవాలనుకుంటే  ఇదొక్కటే మార్గం గా కనిపిస్తుంది.....


*హిందూ సోదరులు మరియు సోదరీమణులందరినీ అభ్యర్థించేలా చూసుకోండి*


జీవితంలో కుదిరనంత వరకు ఇది చెయ్యాలి.... లేకపోతే కుప్పకూలిపోవడం ఖాయం..... కేవలం అత్యవసర దాహం తీర్చుకోవడానికి వాడినట్టు గా నే మిగతా వారివి ఉపయోగించుకోవలసి ఉంది


 *1) డాక్టర్ హిందూ ని* *ఎంచుకోండి* 

 2) *అడ్వకేట్  హిందూ* *ఎంచుకోండి*

 *3) ఇంజనీర్  హిందూ ఎంచుకోండి* 

 *4) సి.ఎ.  హిందూ  ఎంచుకోండి* 

 *5) భాజీతో  హిందూ  ఎంచుకోండి* 

 *6) మొబైల్ రీఛార్జ్ స్టోర్  హిందూ  ఎంచుకోండి* 

 *7) మెడికల్ స్టోర్  హిందూ  ఎంచుకోండి* 

 *8) పాల పాడి  హిందూ  ఎంచుకోండి* 

 *9) ప్రింటింగ్ ప్రెస్  హిందూ  ఎంచుకోండి* 

 *10) మిల్క్‌మ్యాన్  హిందూ ని ఎంచుకోండి* 

 *11) స్టేషనరీ దుకాణాలను ఎంచుకోండి * హిందూ ** 

 *12) బట్టల షోరూమ్ ఎంచుకోండి మరియు షాపింగ్*  *హిందూ* 

 *13) ఎలక్ట్రానిక్ మరియు ఎలక్ట్రికల్ స్టోర్ * హిందూ * ఎంచుకోండి* 

 *14) వ్యవసాయ సేవా కేంద్రాన్ని ఎంచుకోండి * హిందూ* *

 *15) ట్రావెల్ బుకింగ్  *హిందూ* *ఎంచుకోండి* 

 *16) ఫ్లోర్ మిల్లు *హిందూ*  *ఎంచుకోండి*

 *17) కిరాణా దుకాణాలను ఎంచుకోండి  హిందూ* 

 *18) హార్డ్వేర్ షాప్  *హిందూ* *ఎంచుకోండి*

 *19) జిరాక్స్ సెంటర్  *హిందూ* *ఎంచుకోండి*

 *20) హోటల్  *హిందూ**  *ఎంచుకోండి*

 *21) కూరగాయలు మరియు పండ్లతో *హిందూ* *ఎంచుకోండి* 

 *22) రాజ్ మిస్త్రీ *హిందూ*  *ఎంచుకోండి** 

 *23) స్వీట్ షాప్  *హిందూ* *ఎంచుకోండి*

 *24) మంగలిని ఎంచుకోండి*  *హిందూ* 

 *25) కొబ్బరికాయను ఎంచుకోండి*  *హిందూ* 

 *26)పూలమాలలు హిందూ  ఎంచుకోండి* 

 *27) మరియు అన్ని విషయాల కోసం  *హిందూ*  *వ్యాపారిని ఎంచుకోండి*


  *హిందువులకు అలాంటి ఆలోచన ఉండాలి ఎందుకంటే ఒక చిన్న ఆలోచన ముందుకు వెళ్ళే పెద్ద ఆలోచన అవుతుంది* 


  *వినయపూర్వకమైన అభ్యర్థన: ఈ సందేశాన్ని ప్రతి 10 మంది హిందువులకు పంచుకోండి మరియు రోజుకు ఒకసారి ఈ సందేశాన్ని జోడించండి  🙏🙏* 


     🚩 *హిందూ ధర్మం* 🚩

*నన్ను కన్నరోజు

 🕉️ *నన్ను కన్నరోజు (ఓ కథ)*

 

 *సౌదామిని వంట పూర్తి చేసి రెండోసారి కాఫీ చేసి పేపర్ చదువుతున్న భర్త అశోక్ కు ఇచ్చి తానూ తాగుతూ అక్కడే కూర్చోబోయింది.*


 *ఇంతలో లాండ్ లైన్ మ్రోగింది. ఒక చేత్తో కాఫీ కప్పు పట్టుకుని రెండో చేత్తో ఫోన్ రిసీవర్ ఎత్తింది.* 


 “ *హలో అమ్మా!  ఏం చేస్తున్నావ్? నేను చెప్పింది గుర్తుందిగా. తొందరగా పని తెముల్చుకుని ఐదుగంటల వరకు రెడీగా ఉండండి.*  *నేనిచ్చిన కొత్తచీర మాత్రమే కట్టుకోవాలి . బ్లౌజ్ కూడా కుట్టించాకదా. నాన్నగారికి కూడా చెప్పు. నేను కార్ పంపిస్తా..లేట్ చేయొద్దు మరి.“ అని హడావిడిగా చెప్పింది కూతురు భావన..* 


 *“అమ్మలూ... నీ* *పుట్టినరోజు నాడు కూడా ఈ హడావిడి ఎందుకురా? నీ ఆఫీసు ప్రోగ్రాం కాగానే పిల్లలు, అల్లుడు గారితో కలిసి ఇంటికొచ్చేయి. నీకిష్టమైనవి చేసి ఉంచుతా. అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కలిసి తిందాం.. ఎన్ని రోజులైంది మనమంతా కలిసి. నువ్వేమో ఎప్పుడూ బిజీ బిజీ అంటావు”  అనునయంగా చెప్పింది సౌదామిని.* 


 *“అమ్మా! పది రోజుల* *మందునుండి చెప్తున్నా. ఇవాళ మా ఆఫీసు* *వార్షికోత్సవంతోబాటు నాకు అవార్డు ఇస్తున్నారు.  నా పుట్టినరోజు కూడా  అని నిన్నూ, నాన్నగారిని రమ్మని. మళ్లీ ఇప్పుడిలా అంటావేంటి. నా మాటంటే అసలు లెక్కలేదా నీకు. అవునులే.. నిన్ను రమ్మన్నాను చూడు నాదే తెలివితక్కువతనం. ఇంతకీ వస్తున్నావా లేదా. ఆఖరిసారి అడుగుతున్నా!” కోపంగా అరిచింది భావన.* 


 *“వస్తున్నా తల్లీ! అంత నిష్టూరాలెందుకు? నువ్వు ఇచ్చిన చీరనే కట్టుకునే వస్తాను. సరేనా!!  ఐదుగంటలకు కార్ పంపించు“ నవ్వుకుంటూ చెప్పింది.*


*పేపర్ చదువుతూనే ఇటువైపో చెవి వేసిన అశోక్ కూడా గుంభనంగా నవ్వుకున్నాడు..*


*ఫోన్ పెట్టేసి తర్వాత సౌదామిని నిశ్శబ్దంగా కూర్చుంది. ఏమీ మాట్లాడలేదు. అశోక్ అలసిపోయినట్టుంది అని కాస్సేపు చూసాడు. కాని తన ధోరణిలో మార్పు రాలేదు.*


*“ఏంటి సౌదా! ఏమైంది? ఈ మధ్య నువ్వు చాలా డల్ గా ఉంటున్నావు. ఆరోగ్యం బావుంది కదా. ఏధైనా జరిగిందా. నాకు చెప్పొచ్చుగా.. ఇంట్లో ఉన్నదే మనమిద్దరం. నువ్విలా ఉంటే ఎలా?”*


*“అంత సీరియస్ ఏమీ లేదండి. బాధ్యతలేమీ లేవు, పిల్లలు ఎవరి సంసారాల్లో వాళ్లు సంతోషంగా ఉన్నారు. అబ్బాయి కూడా మనకు దగ్గరలో లేడు. వాడి పిల్లలను కూడా చూడలేదు మనం.*


 *అయిదేళ్లయిపోయింది వాడు ఇండియా వచ్చి. రమ్మంటే సెలవులు లేవంటాడు.  అమ్మాయి పిల్లలు కూడా పెద్దవాళ్లయ్యారు. వాళ్లు స్కూళ్లు అంటూ మనకు కనపడడం తగ్గిపోయింది.*


 *వాళ్లను నేనేమీ అనడం లేదు, కాని ఈ ఒంటరితనాన్ని కాదు గాని, ఖాళీ సమయాన్ని భరించలేకపోతున్నాను.*


 *మనిద్దరికి వంట చేయడం, పూజ, పుస్తకాలు తప్ప నాకు వేరే పనేమీ లేదు. మీరన్నా కనీసం స్నేహితులతో క్లబ్బులో కలుస్తుంటారు..” ఉదాసీనంగా అంది సౌదామిని.*


*“అలాంటప్పుడు నువ్వు మళ్లీ ఎందుకు చదువుకోకూడదు. రోజూ కాలేజీకి వెళ్లేపని లేకుండా దూరవిద్యలో చేరు. పెళ్లప్పుడు ఎమ్.ఏ.తో ఆపేసావు కదా. ఇంకా చదువు. మనకు డబ్బులకేమీ కొదువ లేదు. నీకు తీరిక సమయం కూడా చాలా ఉంది.  ఎమ్.ఫిల్. లేదా పిహెచ్.డి చేయొచ్చుగా.. కాలక్షేపం ఉంటుంది. ఈ నిరాశ, నిరాసక్తత కూడా మాయమైపోతుంది.”  అన్నాడు అశోక్.*


*“ఇప్పుడు చదువా? అందరూ నవ్వుతారేమోనండి.. చదువంటే నాకు ఇష్టమే కాని చిన్నపిల్లలతో కలిసి పరీక్షలు రాయడం.. అదీ నావల్ల కాదేమో.. సరేలెండి చూద్దాం. ఏది ఎలా జరగాలనుందో” అంటూ లేచి వంటింట్లోకి వెళ్లి సర్దడం మొదలుపెట్టింది. కాని తన ఆలోచనల్లో మౌనంగా మారిపోయింది.*

*****


*సాయంత్రం సరిగ్గా ఐదుగంటలకు భావన పంపిన కారు వచ్చింది.* *అప్పటికే తయారై ఉన్న సౌదామిని, అశోక్ లు ఇంటికి తాళం వేసి బయలుదేరారు.* 

*వాళ్లు భావన ఆఫీసు ప్రాంగణానికి చేరుకునేసరికి, అక్కడంతా కోలాహలంగా ఉంది. ఉద్యోగులంతా హాలులోకి ప్రవేశిస్తున్నారు.*


 *తల్లిదండ్రులను చూసిన భావన వారికి ఎదురొచ్చి అమాంతంగా తల్లిని కౌగిలించుకుంది.*


 *“అమ్మా! ఈ నెమలిపింఛం రంగు  పట్టుచీర నీకు ఎంత బావుందో... చాలా అందంగా కనిపిస్తున్నావు.*

*కదా నాన్నగారు?” అని అడిగింది.*


*అశోక్ మందహాసం చేసాడు.  సౌదామిని మాత్రం సిగ్గుపడిపోయింది. భావన వాళ్లిద్దరినీ మొదటి వరుసలో కూర్చోబెట్టి మళ్లీ కలుస్తానని స్టేజి వెనుకవైపు వెళ్లిపోయింది.*


*మెల్లిగా హాలు నిండిపోయింది. కంపెనీ 10వ వార్షికోత్సవంతోబాటు, ఇటీవలే ఒక పెద్ద విదేశీ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసినందుకు చాలా ఘనంగా ఏర్పాట్లు చేసారు.*


 *ఈ కార్యక్రమానికి ప్రాజెక్ట్ మానేజర్ భావన కాబట్టి తనకి ఇంకా ఎక్కువ భాధ్యతలు ఉన్నాయి. కంపెనీలోని అన్ని విభాగాలలో పనిచేసే ఉద్యోగులందరూ వచ్చినట్టున్నారు. కోలాహలంగా ఉంది హాలంతా..*


*భావన పిల్లలను అల్లుడు తీసుకుని వస్తాడని వాళ్లకోసం ఎదురు చూడసాగింది  సౌదామిని.* 

*****

*మరోగంటలో ముఖ్య అతిధి రాగానే కార్యక్రమం మొదలైంది. కంపెనీ డైరెక్టర్లు, ముఖ్య అతిధి ప్రసంగాలు ముగిసిన తర్వాత ప్రాజెక్టులో పాల్గొన్నవారందరికీ బహుమతులు ఇచ్చారు.*


 *వాళ్ల నాయకురాలిగా ఎంతో సమర్ధవంతంగా పనిచేసిన భావనను అందరూ ప్రశంసించారు.*


 *అంతేకాకుండా ఈరోజు భావన పుట్టినరోజు కాబట్టి  మరింత ఘనంగా శుభాకాంక్షలు అందిద్దామని కంపెనీ చైర్మన్ ప్రకటించాడు.*


 *సౌదామిని భావన పిల్లలకోసం అటూఇటూ చూస్తూనే భావనకు  వస్తోన్న అభినందనలు చూసి మురిసిపోతోంది.*

*పది నిమిషాల్లో ఒక పెద్ద కేకును స్టేజ్ మధ్యలో టేబుల్ మీద పెట్టారు. స్టేజ్ మొత్తం రంగురంగుల బెలూన్లను కట్టారు. భావనను పిలిచారు. భావన ముందుకొచ్చింది.*


*కాని “ఒక్క నిమిషం“ అంటూ మైక్ దగ్గరకు వెళ్లి “అమ్మా! ఒక్కసారి స్టేజ్ మీదకు రావా? నాన్నగారు కూడా రావాలి. నాకోసం..” అని పిలిచింది. వెంటనే అందరూ చప్పట్లు కొట్టారు.*


*మేమెందుకు అనుకుంటూ సందేహంగానే సౌదామిని, భర్తతో కలిసి స్టేజ్ మీదకు వచ్చింది. భావన తల్లిని కేక్ ముందు నిలబెట్టింది. అటు, ఇటు తను, తండ్రి నిలబడ్డారు. కేక్ మీద రాసింది చదివిన సౌదామిని నివ్వెరపోయింది..  భావనకు బదులు తన పేరు కనఫడింది. అమ్మకు శుభాకాంక్షలు అని..*


 *అయోమయంగా కూతురివైపు చూసింది.*

*భావన చిరునవ్వుతో మైక్ ముందుకు వచ్చి “ ఫ్రెండ్స్! ఇవాళ కంపెనీ విజయోత్సవాలతోబాటుగా నా  పుట్టినరోజు కూడా జరపాలని అనుకోవడం చాలా సంతోషంగా ఉంది. కాని ఇవాళ నా పుట్టినరోజు కాదు” అని ఆగింది..*


 *“అవును.. ఇది నా పుట్టినరోజు కాదు. మా అమ్మ, నన్ను కన్నరోజు. తను అమ్మగా మారినరోజు.  ఈ రోజు నా జన్మకు కారణమైన నా తల్లికి కాక నాకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడమేంటి?*

*అందుకే ఈ రోజును మా అమ్మ నన్ను కన్నరోజుగా జరుపుకోవాలనుకుంటున్నాను. చిన్నప్పుడు ప్రతీ సంవత్సరం అమ్మ మన పుట్టినరోజు పండగలా జరుపుతుంది. కొత్తబట్టలు, చాక్లెట్లు, స్వీట్లు... ఎన్ని చేసేదో, కాని పెద్దయ్యాక మన  పుట్టినరోజులో అమ్మ అంతగా కనిపించదు. స్నేహితులు, కాబోయే భర్త లేదా అత్తవారింటివారు మాత్రమే ఉంటారు. కాని  మన పుట్టుకకు కారణమైన అమ్మలేని మన పుట్టినరోజును ఎంత ఘనంగా జరుపుకున్నా  వృధాయే కదా. అందుకే ఈ విజయోత్సవ వేళ  అమ్మకే  ఈ రోజు అంకితం.. అమ్మా! అటు చూడు"అంటూ స్టేజ్ కుడివైపుకు చూపించింది..*


*అది చూసిన సౌదామిని ఆశ్చర్యపోయింది. తను చూస్తుంది కలయా? నిజమా ? అని నమ్మలేకపోయింది.*

*అమెరికాలో ఉండే  సౌదామిని కొడుకు అన్వేష్, కోడలు స్వప్న, మనవరాళ్లు శిల్ప, శ్రేయ కనబడ్డారు. వారి వెనకాలే అల్లుడు, మనవళ్లు  నేహాంత్, శ్రేయాంశ్...* *మనవరాళ్లు ముచ్చటగా పట్టుపరికిణీలలో, మనవళ్లు సిల్క్ కుర్తా పైజామాలు వేసుకుని ఎంత ముద్దుగా ఉన్నారో..*


*సౌదామిని తన కొడుకును చూసి అయిదేళ్లయింది.  మనవరాళ్లను కూడా మొదటిసారి ప్రత్యక్షంగా చూస్తోంది. వాళ్లు పుట్టినప్పటినుండి వాళ్ల ఆటలన్నీ స్కైప్ లోనే చూడడం. వాళ్లంతా వచ్చి సౌదామినిని చుట్టుముట్టారు. మనవళ్లు, మనవరాళ్లు అమ్మమ్మా! బామ్మా! అంటూ కౌగిలించుకున్నారు..*

*సౌదామినికి సంతోషంతో కళ్లనీళ్లు వచ్చేసాయి.  అది చూసి హాల్లో ఉన్నవారికి కూడా మనసు చెమరించింది.*


*భావన పిలవగానే పిల్లలు నలుగురూ వచ్చి మైక్ ముందు నిలబడి నెల రోజులనించి ప్రాక్టీసు చేసిన, సౌదామినికి ఇష్టమైన అన్నమయ్య కీర్తనను పాడారు.*

  

*కంపెనీ చైర్మన్, డైరెక్టర్లు కూడా ఈ ఏర్పాట్లు ముందే తెలుసన్నట్టు చిరునవ్వులతో నిలబడ్డారు*.


*అన్వేష్ వచ్చి మైక్ అందుకున్నాడు..” ఫ్రెంఢ్స్.. నిజానికి ఇది అక్కకి సంబంధించిన ప్రోగ్రామ్.. తన కంపెనీ, తన ప్రాజెక్టు విజయంతోపాటు తన పుట్టినరోజు కూడా..  కాని ఇలా తన పుట్టినరోజను అమ్మ కన్నరోజుగా మార్చడం అన్న ఆలోచన వచ్చినందుకు నిజంగా హాట్సాఫ్ అక్కా.. నువ్వు చెప్పింది నిజమే..*


 *అమ్మలేకుండా మనం లేము.  మన పుట్టినరోజును అమ్మ ఎప్పుటికీ మర్చిపోదు కారణం తను నవమాసాలు మోసి కని, అల్లారుమద్దుగా, క్రమశిక్షణతో పెంచుతుంది. అమ్మకు తోడుగా నాన్న ఎప్పుడూ వెన్నంటే ఉన్నారు. నాన్న డబ్బులు కట్టినంత మాత్రాన మనం  ఇంజనీర్లు, డాక్టర్లం అయిపోతామా.. మనకోసం, మన చదువులు, సంతోషంకోసం నాన్న సంపాదనలో బిజీగా ఉంటారని, మన ప్రతీ ఆవసరం అమ్మకు తెలుసుకుంటుంది..ఎంత కష్టమైనా తీర్చడానికి ప్రయత్నిస్తుంది. నాన్నను, మనను, మన పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది అమ్మ*.


 *కాని తన అవసరాలు, ఇష్టాల గురించి ఎవరికి ఎంత తెలుసని. కనీసం తన  పుట్టినరోజు కూడా మనం గుర్తుపెట్టుకోము. ఎందుకంటే మనం మన ఉద్యోగ, వ్యాపార, కుటుంబ వ్యవహారాల్లో బిజీ కాబట్టి...*


 *ఇప్పుడు అక్క కారణంగా నేను చేస్తున్న తప్పు కూడా తెలిసి వచ్చింది. అందుకే  సెలవులు లేవు, తీరిక లేదు అంటూ అమ్మ దగ్గరకు రావడాన్ని వాయిదా వేస్తున్న నేను వెంటనే వచ్చేసా. నేను రావడమే అమ్మకు పెద్ద బహుమతి అని నాకు తెలుసు కదా” అని ఉద్వేగంతో మాట్లాడిన అన్వేష్ కళ్లు తుడుచుకుంటూ తల్లి దగ్గరకు వెళ్లాడు.*


*సౌదామిని ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఏం మాట్లాడాలో కూడా తెలీడం లేదు. కూతురి ఆలోచనకు సంతోషించాలా? తన  పిల్లలు తనను ఇంతగా ప్రేమిస్తూ, గౌరవిస్తున్నందుకు సంతోషించాలా అర్దం కాని స్థితిలో ఉంది.  భర్త, పిల్లలు, మనవళ్లతో  కేక్ కట్ చేసింది. హాలు మొత్తం కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోయింది.*


*“అమ్మా! మీరు మా అందరికీ  రెండు మంచి మాటలు చెప్పండి. తల్లిమీద ఇంత మంచి అభిప్రాయం , ప్రేమ, ఆఫ్యాయతలు ఉన్న మీ పిల్లలను చూస్తే మీ పెంపకం, మీరు నేర్పిన సంస్కారం కనిపిస్తున్నాయి. ఇవి ఈనాటి పిల్లలందరికీ  అర్ధమవ్వాలి. చెప్పండి ప్లీజ్.. ” అని రిక్వెస్ట్ చేసాడు కంపెనీ చైర్మన్ నారాయణరావు..*

 

*“అయ్యో! నేనేం మాట్లాడగలను.  మీరనుకున్నంత గొప్పదాన్నేమీ కాదు. అందరిలాంటి తల్లినే. వద్దు” అంటూ చేతులు జోడించి మొహమాటంగా చెప్పింది సౌదామిని.*


*“మాట్లాడాలి....మాట్లాడాలి.. “అంటూ హాల్లో కేకలు వినపడ్డాయి..*


*భావన కూడా తల్లిని మాట్లాడమనడంతో తప్పనిసరై మైక్ ముందుకు వచ్చింది.*


*“వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక క్రింద ఉన్న పెద్దలకు నమస్కారాలు. పిల్లలకు ఆశీర్వాదాలు. మా పిల్లలు నామీద ఉన్న ప్రేమతో మరీ గొప్పగా చెప్తున్నారు కాని నేను చేసిందేమీ లేదు. అందరు అమ్మలలాగానే నా  పిల్లలు కూడా గొప్ప చదువులు చదవాలి, మంచి ఉద్యోగంలో స్థిరపడాలి. పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. వారికి తగిన సహాయ సహకారాలను అందించాను.*


 *కాని మీరంతా నా పిల్లల ఈడువాళ్లే కాబట్టి ఒక్క మాట మాత్రం చెప్పాలనుకుంటున్నాను.*

*పెద్ద చదువులు చదవండి. ఉద్యోగాలు చేయండి. సంపాదించండి.*


*కాని కుటుంబాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. కుటుంబం అంటే తల్లిదండ్రులే కాదు భాగస్వామి, పిల్లలు కూడా... మీరు ఎంత సంపాదించినా మీకోసం మీ పిల్లలకోసమే కదా. మీరు మీ భాగస్వామితో , పిల్లలతో ఆనందంగా ఉండడానకి కావలసినంత సంపాదించండి చాలు.*


 *తరతరాలకు సంపాదించడం కోసం ఇప్పటి మీ సంతోషాలను, జీవితాలను పణంగా పెట్టకండి. యంత్రాలలా కాకుండా మనుషుల్లా మీ మనసుకు తగినట్టుగా బ్రతకండి.. అంతే..*


*మరొక్కమాట.. మీ పుట్టినరోజు సంబరాలు  మీకు మాత్రమే  సొంతం కాదు. మీ జన్మకు కారణమైన అమ్మానాన్నలు కూడా ఉన్నారని మాత్రం మరచిపోవద్దు. ఉంటాను “  అని వినయంగా చెప్పింది.*

 

*కంపెనీ ఉద్యోగులు, చైర్మన్, డైరెక్టర్ల కరతాళ ధ్వనులతో హాలంతా మారుమ్రోగిపోయింది.*

*భర్త, పిల్లలతో కలిసి సంతోషంగా ఇంటికి బయలుదేరింది సౌదామిని.*


 *ఇప్పుడు ఆమెకు ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా ఉంది.. కారులో కూడా మనవళ్లు, మనవరాళ్లతో తెగ కబుర్లు చెప్పసాగింది, వాళ్ల కబుర్లు వింటూ చిన్నపిల్లలా మారిపోయింది..  తన కూతురు, కొడుకు కలిసి చేసిన ఈ కార్యక్రమంలో తన వంతు బాధ్యతను పూర్తి చేసానన్న తృప్తితో ఆ మనోహరమైన దృశ్యాన్ని అశోక్ చూస్తూ ఉండిపోయాడు.*


*ఇంటికి రాగానే అందరూ హాల్లో చేరారు. వాళ్లకు భోజనం ఏర్పాట్లు చేయడానికి వంటింట్లోకి వెళ్లబోతున్న సౌదామినిని బలవంతంగా హాల్లోనే కూర్చోబెట్టారు. అంతలోనే హోటల్ నుండి ఆర్డర్ చేసిన భోజనం వచ్చేసింది.*


 *సౌదామిని, భర్తను, పిల్లలను, వాళ్ల పిల్లలను చూసుకుంటూ  పట్టరాని ఆనందంతో పొంగిపోయింది. వాళ్లు రావడం ఒక ఎత్తైతే తను కన్నరోజు అంటూ అంత గొప్ప గౌరవాన్ని ఇవ్వడం గురించి తలుచుకుని ఇంకా ఆశ్చర్యంగానే ఉంది.*


*తమ పిల్లలతో పాటు అమ్మకు అటు ఇటు కూర్చున్న భావన, అన్వేష్ కలిసి తాము నెలరోజులనుండి ప్లాన్ చేసిన ఈ కార్యక్రమం గురించి తల్లికి వివరించసాగారు.  వాళ్లకు తోడుగా నిలిచిన  కోడలు, అల్లుడు, అశోక్ దూరం నుండే వాళ్లను చూసి నవ్వుకున్నారు.  వాళ్ల మాటలు ఎంతకీ ఆగడం లేదు..*


*“సౌదా! ఇదిగో నా తరఫున నీకో చిన్న బహుమతి. నీకు చాలా ఇష్టమైనదే అని నాకు తెలుసు” అంటూ అశోక్ ఒక కవర్ ఆమె చేతిలో పెట్టాడు.*


*“అయ్యో! ఇప్పుడు మీరు కూడా బహుమతి ఇవ్వాలా? పిల్లలకు తోడుగా ఉండి ఇదంతా చేయించారు చాలదూ.. ఏముంది ఈ కవర్ లో?” అంటూ కవర్ తెరిచింది.*


*పిల్లలందరూ కూడా ఆ కవర్ లో ఏముందా అని ఆసక్తిగా చూసారు.*


*సౌదామిని పేరు మీద ఎమ్.ఫిల్  అఫ్లికేషన్ ఫారమ్ పూర్తిగా నింపి, కావలసిన సర్టిఫికెట్లు జతచేసి ఉన్న కాగితాలవి. సంతకం పెట్టి సబ్మిట్ చేస్తే చాలు.*


*అది చూసి పిల్లలంతా సంతోషంగా చప్పట్లు కొట్టారు.. ఆ నవ్వులు, కేరింతలు సౌదామిని మొహంలో  కూడా ప్రస్ఫుటంగా కనిపించాయి.*


🙏🙏🙏🙏🙏

మొగిలిచెర్ల అవధూత

 *మహాశివరాత్రి..స్వామి ప్రసాదం..*


మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద మహాశివరాత్రి ఘనంగా జరుగుతుంది..RTC వారు సుమారు 80 ప్రత్యేక బస్సులు ఇక్కడికి కేటాయిస్తారు..వేలసంఖ్యలో భక్తులు శ్రీ స్వామివారి సమాధి దర్శనానికి వస్తారు..మేము కూడా అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తాము..సుమారు పదిహేను వేల మందికి అన్నప్రసాదం కూడా రెండుపూటలా ఏర్పాటు చేస్తాము..స్వామివారి వద్ద జరిగే ఈ అన్నదానానికి సంబంధించిన ఒక ముచ్చట ఈరోజు మీతో పంచుకుంటున్నాను..ఈ సంఘటన రెండు సంవత్సరాల క్రిందటిది..


"ఇది రెండో సంవత్సరం అన్నయ్యా..శివరాత్రి అన్నదానానికి సరుకులు తెచ్చి ఇవ్వడం..ఆ దత్తాత్రేయుడు చల్లంగా చూస్తే..ప్రతి ఏడూ శివరాత్రి అన్నదానానికి సరుకులు తెచ్చి ఇస్తాను..ఇప్పటి వరకూ మాకు ఏ లోటు చేయలేదు..ఆ తండ్రి మాతో ఉండబట్టే..మేమూ మా పిల్లలూ లక్షణంగా ఉన్నాము.." అని ఈశ్వరమ్మ చెపుతోంది..ఆవిడ చెప్పే మాటల్లో నిజముంది..గత పదేహేనేళ్లుగా ఈశ్వరమ్మను నేను గమనిస్తూనే వున్నాను..మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చేటప్పుడు ఈశ్వరమ్మ ఏనాడూ ఖాళీ చేతులతో  రాలేదు..ఒక బియ్యపు బస్తా..లేదా..నూనె డబ్బా..లేదా..ఓ పాతిక కేజీలు కందిపప్పు..ఇలా ఏదో ఒక వస్తువు..అదికూడా అన్నదానానికి పనికి వచ్చే వస్తువులు తీసుకొని రావడం ఆవిడ అలవాటు..


పోయిన సంవత్సరం శివరాత్రికి ఒక నెల రోజుల ముందు శివరాత్రి రోజు మధ్యాహ్నం..మళ్లీ..రాత్రికి..చేయబోయే అన్నదానానికి ఎంత బియ్యం అవసరం అవుతాయని నన్ను అడిగింది..సుమారుగా ఒకటిన్నర టన్ను అవసరం అవుతాయి అని చెప్పాను..ఒక్క క్షణం ఆలోచించి.."ఆ మొత్తం బియ్యం నేను తెచ్చి ఇస్తాను..ఇంక నువ్వు ఎవరినీ అడగొద్దు" అని చెప్పింది..అలాగే అన్నాను..మళ్లీ ఒక గంట  తరువాత వచ్చి.."అన్నయ్యా..ఇప్పుడు మంటపం లో పడుకొని ఉంటే..నిద్ర పట్టింది.."ఒక్క బియ్యం ఇస్తే చాలదు కదా..మిగిలిన సరుకులు..కూరగాయలు..అన్నీ తెచ్చి ఇవ్వు.." అని స్వామి చెప్పినట్టు కలలో అనిపించింది..నిజమే కదా..అన్నీ ఉంటేనే కదా అన్నం పెట్టేది..ఆ సరుకుల పట్టీ కూడా ఇస్తే..అవి కూడా తెచ్చి ఇస్తా..ఇదిగో  నన్ను ఈ విధంగా చెయ్యమని ఇప్పుడే ఆ దత్తయ్య  చెప్పాడు..ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే..అందుకు కారణం ఈ స్వామే కదా..ఆయన మాకు ఇచ్చిన దాని నుంచి..మేము తిరిగి ఇస్తున్నాము..అంతే..అంతా ఆ నాయన చూసిన చల్లటి చూపు.." అని మాతో చెప్పింది...


ఈశ్వరమ్మ వాళ్లది పూర్తిగా వ్యవసాయాధారిత కుటుంబం..మొదటి సారి మొగలిచెర్ల కు వచ్చి శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకున్న నాటి నుంచీ..నేటివరకూ శ్రీ స్వామివారినే మనసారా నమ్మి కొలుచుకుంటున్నారు..తనకు కష్టం వచ్చినా..మొగలిచెర్ల కు వచ్చి శ్రీ స్వామివారి సమాధి వద్ద చెప్పుకొని.."స్వామికి నా కష్టం చెప్పుకున్నాను..ఇక ఆ తండ్రిదే భారం.." అని నిశ్చింతగా ఉండేది..ఆమె నమ్మకమో..లేక..ఆ సమాధిలో నిశ్చలంగా కూర్చున్న స్వామివారి కరుణో..తెలీదు కానీ..ఈశ్వరమ్మ కష్టం తేలికగా తీరిపోయేది..ఏదైనా సంతోషకరమైన వార్త విన్నప్పుడు కూడా స్వామివారి సమాధి వద్ద నమస్కారం చేసుకొని వెళ్ళేది..సుఖ దుఃఖాలు రెండింటినీ స్వామివారి కి చెప్పుకుంటేనే ఆవిడకు తృప్తిగా ఉండేది..ఆ రెండింటినీ తనకు స్వామివారి ప్రసాదం క్రిందనే భావించడం..వాటిని సమంగా స్వీకరించడం ఆవిడకు అలవాటు..


అలా ఈశ్వరమ్మ కు స్వామివారి ఆదేశం అందింది..అన్నదానం కొరకు మార్గం సుగమం అయింది..ఇక వంటవాళ్లకు..ప్లేట్లు..గ్లాసులు..పందిళ్ళు..ఇత్యాదులకు మరో లక్ష రూపాయలు ఖర్చు అవుతాయి..అందుకు కూడా దాతలు సహకరించారు..స్వామివారి వద్ద అన్నదానం చేయడానికి ఏనాడూ ఇబ్బంది పడలేదు కనుక..ఈ శివరాత్రికి కూడా భక్తులకు అన్నప్రసాదం సజావుగా అందించే ఏర్పాటు చేస్తున్నాము..


ఈ కార్యక్రమంలో మీరూ మీ శక్త్యానుసారం భాగస్వాములు కావొచ్చు..


సంకల్పం కలిగించేది..అందుకు మమ్మల్ని కార్యోన్ముఖులుగా చేసేది..అంతా స్వామివారే..ఆయన లీలలో ఇది ఒక భాగం మాత్రమే..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

ప్రదోష వ్రతం*_

 ఈరోజు ప్రదోష వ్రతం*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


సూర్యాస్తమయం నుంచి 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోష కాలం అని కొందరు , సూర్యాస్తమయమయ్యాక మూడు గడియలు *"ప్రదోషోరజనీముఖమ్"* రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం అని కొందరు. ప్రదోష సమయం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్రదోషమంటే అది ఒక కాల విశేషము. ప్రదోషమంటే పాప నిర్మూలన అని అర్థము. ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయములో చంద్రుడి కదలికల వలన ఏర్పడునది ప్రదోషము. అనగా , చంద్రుడి గతి వలన , ఏర్పడే తిథుల సంధులలో సూర్యాస్తమయము అయితే , అప్పుడు ప్రదోషము అంటారు. కాబట్టి ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయమునకు తిథి మారితే , అప్పుడు ప్రదోషము కలిగే అవకాశము ఉంది. త్రయోదశినాడు కలిగే ప్రదోషాన్ని  *మహా ప్రదోషం* అంటారు. 


దోషాలను హరించే ప్రశస్తమైన కాలాన్ని ప్రదోషకాలం అంటారు. సూర్యుడు అస్తమించే సమయంలో తిథి మారితే అది ప్రదోషకాలం. ప్రదోషకాలం రాత్రికి ప్రారంభం వంటిది. ఆ సమయంలో పార్వతితో కలిసి పరమేశ్వరుడు అర్థనారీశ్వరునిగా అతిప్రసన్నుడై దర్శనమిస్తాడు. శనివారం , త్రయోదశి , ప్రదోషం మూడూ కలిస్తే అవి శుభఘడియలుగా పరిగణించవచ్చు. గ్రహపీడా నివారణకు , శని ప్రభావంతో ఇక్కట్ల పాలవుతున్నవారికి శని ప్రదోష సమయం దైవానుగ్రహ కాలంగా పరిగణిస్తారు. ప్రదోషకాలం అంటే ఏమిటి , ప్రదోష వ్రతాన్ని ఎలా చేయాలి అనే విషయాలు తెలుసుకోండి.


మనము రోజూ ఎన్నో పాపకర్మలు చేస్తుంటాము. వాటి ఫలము వలన మనకు మనమే కొన్ని ప్రతిబంధకాలను తెచ్చుకుని ,  మన పురోభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిమితం చేసుకుంటున్నాము. మన పాపకర్మ ఫలమును నిర్జీవం చేయాలంటే , దానికి తగ్గ పుణ్య కర్మలు చేయాలి. ఈ త్రయోదశీ ప్రదోషము మనకు దేవుడిచ్చిన వరము.


ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమభాగాన పార్వతి దేవి రెండవ భాగమున పరమేశ్వరరూపంగా *"అర్థనారీశ్వరుడుగా"* దర్శనమిచ్చేకాలం ఈ ప్రదోషకాలం అని చెప్పబడినది. పరమ శివుడు సదా ప్రదోషకాలంలో , హిమాలయాలలో , కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాలలో నాట్యం చేస్తూ ఉంటాడు.  ఆనందముగ ఉన్నప్పుడు మాత్రమే కాదు దుష్ట సంహారం చేసేటప్పుడు కూడా స్వామి నాట్యం చేస్తు ఉంటాడు అనేది విదితం. గజాసురుణ్ణి సంహారించేటప్పుడు , అంధకాసుర సంహారంలోను శివుడు చేసిన నృత్యం భైరవరూపంలో మహా భయంకరంగా ఉంటుంది. నిరాకారంలో ఉన్న శివుడు ఆనందం కోసం రూపాన్ని ధరించి ఆనంద తాండవ నృత్యం చేస్తాడని నృత్య రత్నావళి ద్వారా మనకు తెలుస్తోంది.


🕉️  త్రయోదశి ఆదివారం వస్తే రవి ప్రదోషం 


🕉️  త్రయోదశి సోమవారం వస్తే దాన్ని సోమ ప్రదోషం


🕉️  త్రయోదశి

 మంగళవారం వస్తే బౌమ ప్రదోషం


🕉️  త్రయోదశి బుధవారం వస్తే బుధ ప్రదోషం


🕉️  త్రయోదశి గురువారం వస్తే గురు ప్రదోషం


🕉️  త్రయోదశి శుక్రవారం వస్తే శుక్ర ప్రదోషం


🕉️  త్రయోదశి శనివారం వస్తే దాన్ని శని త్రయోదశి అనీ ,   శని ప్రదోషమని పిలుస్తారు. అన్ని త్రయోదశులలోనూ శివపూజ తప్పనిసరి.


*☘ప్రదోష వ్రతం ఆచరించే విధానం☘*


ప్రదోష సమయం రోజు వస్తున్న త్రయోదశి నాడు వచ్చే ప్రదోష సమయం చాలా పవిత్రమైనది. ఈ సమయంలో ప్రదోష వ్రతాన్ని ఆచరించి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి శివారాధన చేస్తూ శివునికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది. త్రయోదశి వ్రతాన్ని ప్రదోష వ్రతం అని అంటారు. *ప్రతినెలలో వచ్చే రెండు త్రయోదశుల్లోనూ.. (శుక్లపక్ష , కృష్ణపక్ష త్రయోదశులు) త్రయోదశి వ్రతం చేయాలి. శుక్లపక్ష సోమవారం నాడు , లేదా బహుళపక్ష శనివారం నాడు త్రయోదశి కలసివచ్చినప్పుడు గనుక త్రయోదశి వ్రతం చేస్తే ఫలితం మరీ విశేషంగా ఉంటుంది.* ప్రదోష కాలంలో ఈశ్వరుని ఆలయంలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. ముఖ్యంగా ఈశ్వరునికి జరిగే అభిషేకంతో పాటు నందీశ్వరునికి జరిగే అభిషేకాన్ని వీక్షించే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుందని నమ్మకం. శనివారం నాడు ప్రదోష సమయాన శివ ఆరాధన చేసినట్లయితే కర్మ దోషాలు తొలగి సుఖశాంతులు పొందవచ్చును. శని కర్మకారకుడు , శివుడు సంహార కారకుడు కావున శని ప్రదోష సమయాన శివారాధన చేయడం ఉత్తమం.


వ్రతం ఆచరించేవారు త్రయోదశి నాడు ఉదయాన స్నానమాచరించి శివుని పూజించి శివనామ స్మరణతో సూర్యాస్తమయం వరకు గడపాలి. ఉపవాసం చేయలేనివారు పాక్షిక ఉపవాసం జరపవచ్చు అంటే పాలు , పండ్లు వంటివి తిని గడపవచ్చు. సాయంత్రం పూజ జరిపిన తర్వాత ఆహారం తీసుకోవచ్చు. అయితే త్రయోదశి నాడు వండని అంటే ఉడికించని పదార్థాలను స్వీకరించి , మరుసటి రోజు వండిన ఆహారం భుజించాలి. అంటే వ్రతం నాడు పక్వపదార్థాలు నిషేధం అని చెబుతారు. సూర్యాస్తమయానికి ఒకటిన్నర గంటల మునుపు ప్రారంభమయ్యే ప్రదోషకాలం , సూర్యాస్తమయం తర్వాత ఒక గంట వరకూ ఉంటుంది. ఈ సమయంలోనే ప్రదోష వ్రతం నిర్వహించాలి. అంటే రెండున్నర గంటలపాటు పూజ జరుగుతుంది.


ప్రదోషం సందర్భంగా త్రయోదశి రోజున ఉపవాసం ఉండి ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. సాయంత్రం ఈ పూజ జరుగుతుంది. ఏ వయసు వారైనా , స్త్రీపురుష భేదం లేకుండా ప్రదోషవ్రతం ఆచరింపవచ్చు. 


స్కందపురాణం ప్రకారం ప్రదోష వ్రతాన్ని రెండు విధాలుగా ఆచరింపవచ్చు. మొదటిది రాత్రి , పగలు ఉపవాసం ఉండి రాత్రి జాగరణం చేయడం.

రెండవ విధానం  సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం చేయడం. సాయంత్రం  శివపూజ జరిపిన తర్వాత ప్రసాదం స్వీకరించి వ్రతం పూర్తిచేయడం. నిర్వహించేవారి ఓపిక , సానుకూలత ప్రకారం వ్రతం జరపవచ్చు.


ముందుగా గణేషు ని పూజించి తరువాత శివ పార్వతుల తో పాటు సుబ్రమణ్యస్వామి , నందికి కూడా పూజ చేస్తారు.


శివ లింగానికి పాలు , పెరుగు మొదలగు ద్రవ్యాల తో అభిషేకం చేస్తారు. తరువాత బిల్వదళాలతో పూజ చేస్తారు. ప్రదోష కాలం లో బిల్వదళాలతో  శివునికి పూజ చేయడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి అని భక్తులు నమ్ముతారు.


తరువాత ప్రదోష వ్రత కథ , శివ పురాణం శ్రవణం చేస్తారు.


*మహా  మృతుంజయ  మంత్రం ని 108   సార్లు పఠిస్తారు.*


*ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం |*

*ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ ||*


పూజ ముగించిన తరువాత శివాలయానికి వెళతారు. ప్రదోషం రోజు శివాలయం లో ఒక దీపం వెలిగించిన అనేక రెట్ల ఫలితం ఉంటుంది అని భావిస్తారు.


స్కంద పురాణం ప్రకారం ఈ వ్రతం భక్తి శ్రద్ధ ల తో ఆచరించిన వారికిీ అన్ని కోరికలు నెరవేరుతాయి. అలాగే ఆరోగ్యం , ఐశ్వర్యం తో పాటు మహా శివుడు మంచి ఆనందకర జీవితం ప్రసాదిస్తాడు. ముఖ్యంగా శివ భక్తులు ఈ వ్రతాన్ని అత్యంత నియమ , నిష్టల తో ఆచరిస్తారు.


*☘ప్రదోష వ్రత ఫలితాలు☘*


ప్రదోషం వ్రతం వల్ల కుటుంబంలోని ఇబ్బందులు తొలగిపోతాయి , అపవాదులు దూరమవుతాయి , వ్యాపార వ్యవహారాలలో నష్ట నివారణ  జరుగుతుంది , సంతాన సాఫల్యం కలుగుతుంది , చేపట్టే కార్యాల్లో ఆశించిన ఫలితం లభిస్తుంది.


*☘శివ ప్రదోష స్తోత్రము☘*


*కైలాస శైల భవనేత్రిజగజ్జనిత్రీం |*

*గౌరీం నివేశ్య కనకాంచిత రత్నపీఠే ||*

*నృత్యం విధాతు మభివాంఛతి శూలపాణౌ |*

*దేవాః ప్రదోష సమయేను భజంతి సర్వే ||*


*వాగ్దేవీ ధృతవల్లకీ శతమభోవేణుందధత్పద్మజః |*

*తాలో న్నిద్రకరో, రమా భగవతీ గేయ ప్రయోషాడ్వితా ||*

*విష్ణుస్సాంద్ర మృదంగ వాదనపటుర్దేవాస్సమం తాత్‌స్ఖితా |*

*సేవంతే తమనుప్రదోష సమయేదేవంమృడానీపతిమ్ ||‌*


*గంధర్వ యక్ష పతగోరగ సిద్ధ సాధ్య |*

*విద్యాధరామర వరాప్సర సాంగణాశ్చ ||*

*యేన్యే త్రిలోక నిలయాస్సహభూతవర్గాః |*

*ప్రాప్తే ప్రదోష సమయే హరపార్శ్వసంస్థాః ||*


*|| ఓం నమః శివాయ ||*


Facebook గ్రూప్స్ నుండి సేకరణ.

By పెనుగొండ శ్రీ కామాక్షమ్మ whatsapp గ్రూప్.


https://chat.whatsapp.com/HpZ6KbDoBY19bU9CFFVkRh

తాటాకుల గ్రంథాలు

 తాటాకుల గ్రంథాలు తయారు చేయడం ఒక కళ. తాటి మట్టల నుంచి ఆకులు విడిపించి, సమానంగా కత్తిరించి నీడలో ఎండించేవారు. నీడలో ఎండించడానికి సంస్కృతభాషలో 

'ఛాయాశుష్కం' అంటారు. నీడలో యెండిస్తే పెళుసు బారవు. తర్వాత వాటిని నీటిలోగానీ,ఆవుపంచితంలోగానీ నానబెట్టేవారు. పిదప ఉడికించేవారు.తద్వారా ఆకులు మెత్తబడతాయి. వాటిమీద శంఖంతో కానీ, గవ్వలవంటి నున్నని వస్తువులతో రుద్దేవారు.

దానితో ఆకు గరుకుదనం పోయి నునుపుదేరుతుంది.తర్వాత కొంచెం యెడం విడిచి 

ఒకవైపుగానీ రెండువైపులాగానీ రంధ్రాలు చేసి దారాలతో కట్టేవారు.ఇదే గ్రంథం.

గ్రంథం అంటే చేర్చబడినది అని అర్థం.సూత్రమంటే దారం. ఈ తాటాకుల్లోని దారం 

(సూత్రం)పూసల్లోని దారంలాగా ఆకులను చుట్టుకొని వుంటుంది కదా! ఇలాగే చాలా 

విషయాలకు వర్తించే వాక్యం సూత్రమైంది.ఈ గ్రంథమే ప్రోతమై అంటే కూర్చబడినదై 

పోదీ, పొత్త మైంది. పోస్ట్ అనే పారసీ శబ్దం నుంచి పుస్తకం అన్నమాట వచ్చిందన్నది పెద్దల మాట  ('తెలుగులుగు" మాసపత్రిక  సౌజన్యముతో)   

               -------------------------శుభరాత్రి-----------------------

మొగలిచెర్ల

 *దత్తుడు చూపిన దారి..*


"కొన్ని రోజులపాటు కేసు పొడిగించవచ్చు కానీ..మనం ఈ కేసు గెలవలేము..అన్ని రకాల ఆధారాలూ వాళ్ళవైపు బలంగా ఉన్నాయి..మరి ఎలాగ..?" అన్నారు లాయర్ గారు.."నేను కోరుకునేది కూడా ఆరేడు నెలల సమయం మాత్రమే..నేను వాళ్లకు బాకీ ఉన్నమాట నిజం..ఇప్పటికిప్పుడు అంత మొత్తాన్ని కట్టుకోలేను..నావద్ద ప్రస్తుతం ఉన్న డబ్బు వాళ్లకు ఇచ్చి..కొంత సమయం అడుగుదామని అనుకుంటున్నాను..కానీ వాళ్ళు అందుకు సుముఖంగా లేరు..కోర్టులోనే తేల్చుకుంటాము అని ఖచ్చితంగా చెప్పారు..అందువల్ల మీ సహాయం అడుగుతున్నాను.." అన్నాను.."అది కాదండీ..ప్రస్తుతం ఉన్న జడ్జీ గారు ఇలాటి కేసులకు ఎక్కువ సమయం ఇవ్వటం లేదు..త్వరగా ముగించి శిక్ష ఖరారు చేస్తున్నారు..మీరు జాగ్రత్త పడటం మంచిది..నా వరకూ ఓ రెండుమూడు నెలలు పొడిగించగలను..ఆలోపల మీరు మీ ప్రత్యర్థులతో రాజీ పడటం మంచిది..మీ అన్నయ్య గారు వృత్తిపరంగా నాకు మంచి స్నేహితులు..ఆ చనువుతో చెపుతున్నాను.." అన్నారు.."సరేనండీ..మీ ప్రయత్నం మీరు చేయండి..నేను మా ఊరు వెళ్లి.. ఆ దత్తాత్రేయుడి పాదాలు పట్టుకుంటాను..అంతకు మించి నాకు వేరే దిక్కు కూడా లేదు.." అని చెప్పాను..ఆరోజు కోర్టుకు హాజరయ్యాను..మరో పదిహేను రోజులకు వాయిదా వేసి పంపించారు..నేను మా ఊరు వచ్చేసాను..


మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిర నిర్వహణా బాధ్యతలు తీసుకున్న తొలినాళ్లలో జరిగిన సంఘటన..అప్పట్లో నేను పూర్తిగా ఆర్ధిక సమస్యల్లో చిక్కుకొని వున్నాను..ఋణదాతల వత్తిడులు ఎక్కువగా ఉన్నాయి..వాటికి తోడు కోర్టు కేసులూ ఉన్నాయి..స్వామివారి మందిరం నిర్వహిస్తూ..ఈ బాధలను అనుభవిస్తూ..రోజులు గడుపుతున్నాను..ఆర్ధికంగా సమస్యల్లో వున్నప్పుడు..దగ్గరగా ఉన్నవాళ్లు కూడా దూరం జరిగిపోతారు..అది సహజం కూడా..విజయవాడ లో ఈ కేసు నడుస్తోంది..నా మీద కేసు పెట్టిన కంపెనీ వాళ్ళతో నేరుగా మాట్లాడదామని నేను శతవిధాల ప్రయత్నం చేసాను..కానీ కుదరలేదు..వాళ్ళు ఆ అవకాశమూ ఇవ్వలేదు..నేను వాళ్లకు బాకీ పడ్డ మొత్తం లో సగం చెల్లించడానికి సిద్ధంగా వున్నాను..మిగిలిన సగానికి కొంత సమయం తీసుకొని చెల్లించాలని నా ఆలోచన..వాళ్ళు కేవలం కోర్టు ద్వారానే విషయం తేల్చుకోవాలని అనుకున్నారు..


లాయర్ గారి వద్దనుంచి తిరిగి ఇంటికి వచ్చిన మరునాడు..మొగిలిచెర్ల కు మా దంపతులము వచ్చాము..విజయవాడలో లాయర్ గారితో జరిగిన సంభాషణ మొత్తం ఆవిడతో చెప్పాను.."స్వామివారి పాదాల వద్ద మన సమస్య విన్నవించుకుందాము..పరిష్కారం చూపుతారు అనే నమ్మకం నాకు ఉంది.." అని ఆవిడ చెప్పింది.."చూద్దాం.." అన్నాను..స్వామివారి మందిరానికి చేరిన వెంటనే కాళ్ళూ చేతులూ శుభ్రం చేసుకొని..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి..మనసులోని ఆవేదనను చెప్పుకున్నాము..ఆ ప్రక్కరోజు శనివారం..స్వామివారి పల్లకీసేవ లో మా దంపతులము కూడా అర్చన చేయించుకున్నాము..ఆదివారం ఉదయం భక్తుల రాకపోకలతో ఉన్న హడావుడి లో నా సమస్య గురించి తాత్కాలికంగా మర్చిపోయాను..మధ్యాహ్నం అర్చకస్వామి స్వామివారికి నైవేద్యం పెట్టి..హారతి ఇచ్చే సమయం లో మళ్లీ మా దంపతులము స్వామివారిని మనసులోనే వేడుకున్నాము..

ఆరోజు మధ్యాహ్నం మూడు గంటల సమయం లో మందిరం ముందు ఒక కారు వచ్చి ఆగింది..అందులోంచి నలుగురు వ్యక్తులు లోపలికి వచ్చారు..మందిరం చుట్టూ ప్రదక్షిణాలు చేసి..సమాధి ని దర్శించుకొని, తమ గోత్రనామాలతో అర్చన చేయించుకొని ఇవతలికి వచ్చారు.."మేము విజయవాడ నుంచి వచ్చామండీ..ఇద్దరం లాయర్ల గా ఉన్నాము..మరో ఇద్దరు ఆడిటర్లు..భైరవకోన చూద్దామని వచ్చాము..అక్కడ ఈ క్షేత్రం గురించి చెపితే..ఇలా వచ్చాము.." అన్నారు..


నాకెందుకో నా సమస్య వీళ్ళతో చెప్పాలని అనిపించింది..ఆ ఇద్దరు లాయర్లనూ కూర్చోబెట్టి విజయవాడ కోర్టు కేసు విషయం చెప్పాను..అంతా విన్నారు.."మీరు సగం డబ్బు చెల్లించడానికి సిద్ధంగా వున్నారు..మిగిలిన సగం చెల్లించడానికి మీకు మరో ఐదారు నెలల సమయం కావాలి..ఈ వార్త మీరు మీమీద కేసు వేసిన వాళ్ళతో చెప్పాలని అనుకున్నా..కుదరటం లేదు..అంతే కదా ప్రసాద్ గారూ..?" అన్నారు.."అవునండీ.." అన్నాను.."మీరేమీ కంగారు పడకండి..ఆ కంపెనీ తరఫున ఉన్న లాయర్ల లో నేనూ ఒకడిని..నేను వాళ్లకు చెపుతాను..మీరు నేరుగా వాళ్ళతో మాట్లాడే ఏర్పాటు చేస్తాను.." అని ఆ ఇద్దరిలో ఒకరు అన్నారు..నా నెంబర్ తీసుకున్నారు..కేసు నెంబరూ తీసుకున్నారు..వెళ్ళొస్తామని చెప్పి వెళ్లిపోయారు..ఆ ప్రక్కరోజు సోమవారం ఉదయం పదిగంటల వేళ.."ప్రసాద్ గారూ..నిన్న మీతో మాట్లాడిన లాయర్ గారిని మాట్లాడుతున్నాను..మీరు చెప్పిన విషయం కంపెనీ వాళ్ళతో చెప్పాను..మిమ్మల్ని ఎల్లుండి బుధవారం రమ్మన్నారు..తప్పకుండా విజయవాడ రండి..మీతోబాటు మీ లాయర్ గారిని రమ్మనండి..నేనూ ఉంటాను..మాట్లాడుకుందాము.." అన్నారు..


"స్వామివారు మనకు దారి చూపిస్తారు అని ముందే చెప్పాను కదా..మీరు ఎల్లుండి విజయవాడ వెళ్ళండి.." అని మా ఆవిడ అన్నది..మళ్లీ ఇద్దరమూ స్వామివారి సమాధికి నమస్కారం చేసుకొని వచ్చాము..బుధవారం విజయవాడ వెళ్ళాను..నాతో మాట్లాడిన లాయర్ గారు వున్నారు..కంపెనీ ప్రతినిధుల తో నేరుగా మాట్లాడటం జరిగింది..ప్రస్తుతం నేను చెల్లించగలిగిన మొత్తాన్ని చెప్పాను..మరే అభ్యంతరమూ లేకుండా ఒప్పుకున్నారు..ఒక గంటలోపలే అంగీకారం కుదిరింది..తరువాతి వాయిదా నాటికి కేసు ఉపసంహరించుకోవాలని అనుకోవడం..అందుకు తగ్గ కాగితాలు సిద్ధం చేయడం కూడా జరిగిపోయింది..వాళ్ళను ఒప్పించిన ఆ లాయర్ గారికి కృతజ్ఞతలు చెప్పాను..


ఆరోజు మధ్యాహ్నం మా లాయర్ గారు నాతో మాట్లాడుతూ.."ప్రసాద్ గారూ మీరు అదృష్టవంతులు..ఈ కేసు లో ఆ కంపెనీ వాళ్ళు రాజీ పడకుండా వుండి ఉంటే..మీరు డబ్బూ కట్టాలి..పైగా  శిక్ష కూడా పడేది..దైవమే మిమ్మల్ని కాపాడాడు.." అన్నారు..


ఆ దైవం వేరెవరో కాదు..మొగిలిచెర్ల లో సిద్ధిపొందిన అవధూత దత్తాత్రేయుడే అని వేరే చెప్పుకోవాలా?..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

ఉపవాసం ఆచరించే గజరాజు*

 *ఏకదాశి ఉపవాసం ఆచరించే గజరాజు*

🐘🐘🐘🐘🐘🐘🐘


🌹గురువాయూర్ కేశవన్🌹


దక్షిణ భారతదేశపు ప్రాచీన హిందూ దేవాలయాలలో ‌ఆలయ సేవల‌లో గజరాజ వాహనసేవ గొప్పదిగా చెప్పవచ్చు. ఎన్నో దక్షిణాది దేవాలయాలలో ఇప్పటికి ఏనుగులను ఆలయాల్లో కైంకర్యాలకి వినియోగించటం అనాదిగా ఒక ఆచారంగా వస్తోంది!

ముఖ్యముగా దక్షిణాదిన కేరళలోని ప్రాచీన ఆలయాల్లో గజరాజులపై భగవంతుని మూర్తులను ఊరేగిస్తారు! ఇలా ఆలయ కైంకర్యాల్లో పేరు మోసిన ఏనుగుల్లో గురువాయూర్ క్షేత్రంలో వెలసిన శ్రీకృష్ణునికి డెబ్భై సంవత్సరాలకు పైగా ఉత్సవాలలో వాహన కైంకర్యాలు నిర్వర్తించిన "కేశవన్" అనే ఏనుగు ఏనుగులకే రాజుగా "గజరాజు"గా పేరొందింది!

అన్ని ఏనుగులకెల్ల భిన్నమైన ఈ ఏనుగు ప్రత్యేకత ఏమిటంటే, కేశవన్ ఎవ్వరు చెప్పకపోయినా ఏకాదశి పర్వదినాన్ని గుర్తుపెట్టుకుని, ప్రతి ఏకాదశికి పూర్తి ఉపవాసం ఉంటుంది! తనపై గురువాయూర్ కృష్ణుని ఉత్సవమూర్తిని మొయ్యడానికి తనకు తానే స్వయంగా వంగి కూర్చుని తన భక్తి శ్రద్ధలను చాటే ఈ ఏనుగు గొప్పతనం చూద్దాం!


*గురువాయూర్ ఆలయానికి కేశవన్ రాక*


పూర్వం గురువాయూర్ ని పరిపాలించే నిలంబూర్ రాజు తన రాజ్యంపై తరచూ శత్రురాజులు దండెత్తి రావటంతో భగవంతుడైన గురువాయూర్ కృష్ణుని ప్రార్థించగా శత్రు దండయాత్రలు క్రమంగా తగ్గిపోయాయట! దానికి కృతజ్ఞతగా 1922లో నిలంబూర్ రాజు వంశీయులు గురువాయూర్ ఆస్థానానికి పది ఏనుగులను దానమిచ్చారట! వాటిలో పదేళ్ల వయస్సు గల కేశవన్ అనే ఏనుగుపిల్ల కూడా ఒకటి!


*కేశవన్ కి కృష్ణుని వెన్న నైవేద్యం:*


మిగిలిన ఏనుగుల కంటే భిన్నంగా కేశవన్ అనే ఏనుగు ఉత్తమమైన గజ సాముద్రిక లక్షణాలున్న మేలు జాతి గున్న ఏనుగుపిల్ల! చూడటానికి ఎంతో ముచ్చటగా ఉన్నా కేశవన్ విపరీతమైన అల్లరి చేష్టలతో ఎంతకీ మావటివాని మాటలు వినేది కాదు! ఇది ఎంతో కాలం ఇలాగే గడిస్తే ఏనుగుని నియంత్రించటం కష్టమని తెలిసి అప్పటికి ఆలయంలో ప్రధాన గజమైన పద్మనాభన్ అనే ఏనుగు వద్ద కేశవన్ ని పెట్టారట! అంతే కాక, కృష్ణుడికి రోజూ నైవేద్యం పెట్టిన వెన్నని కేశవన్ కి తినిపించేవారట! భగవంతుని భుక్త శేష ప్రాశన ప్రభావమో లేక పెద్ద ఏనుగు వద్ద భయభక్తులతో ఉండాలనో కానీ కేశవన్ కి  అల్లరి చేష్టలు క్రమంగా తగ్గిపోవటమే కాక, భగవంతునిపై భక్తి కూడా పెరగనారంభించిందిట! ఆలయ ఉత్సవాలకు భగవంతుని విగ్రహాలని  మోసే ప్రధాన ఏనుగైన పద్మనాభన్ తోనే ఉంటూ భయభక్తులు, స్వయం నియంత్రణ, మావటివాడు చెప్పినవి పాటించటం వంటివి నేర్చుకుందట కేశవన్! ఇలా క్రమంగా తానూ ఆలయ ఉత్సవాలలో భాగమై, మిగిలిన ఏనుగుల కంటే భిన్నముగా  అత్యంత భక్తి, శ్రద్ధలతో నియంత్రణతో సద్బుద్ధితో మెలిగేదట కేశవన్! కొన్నాళ్ళకి పెద్ద ఎనుగైన పద్మనాభన్ పరమపదించగా, కేశవన్ ఆస్థాన గజంగా నియమింపబడింది! అప్పటి నుంచి కేశవన్ లో మరింత పరిణతి, మార్పు వచ్చింది! రోజూ ఉదయమే స్నానం ఆచరించి మావటివాడు లేకుండా  తానే స్వయంగా గురువాయూర్ ఆస్థానానికి వెళ్లి ఆలయానికి ప్రదక్షిణలు చేసి ధ్వజం వద్ద మోకరిల్లి ఘింకరిస్తూ నమస్కరించేది! ఆలయంలోకి ప్రవేశించాక మౌనంగా నడిచేది, మలమూత్ర విసర్జన కూడా ఆలయ ప్రాంగణంలో చేసేది కాదట కేశవన్! ముఖ్యంగా ఆహారం విషయంలో అత్యంత శ్రద్ధ తనకు తానే వహించేదిట! ఆలయ ఉత్సవాల సమయంలో తక్కువగా తినేదిట! తన జీవితాంతం ఏకాదశి నాడు పచ్చి మంచి నీళ్లు కూడా తాగకుండా పూర్తి ఉపవాసం ఉండేదిట! ఎన్ని పంచాంగాలు చదివినా నెలలో ఏకాదశులు ఎప్పుడు వస్తాయో సరిగ్గా గుర్తుండని మానవుల కంటే ఒక ఏనుగు ఏకాదశి ఎప్పుడు వస్తుందో సరిగ్గా గుర్తుపెట్టుకుని ఉపవాసం ఉండటం నిజంగా దైవ లీల, భగవంతునికి ఆ ఏనుగుపై ఉన్న దివ్యానుగ్రహానికి తార్కాణంగా చెప్పవచ్చు!


*భగవంతుని నేనే మోస్తాను!*


గురువాయూర్ ఆస్థానంలో ప్రతీ ఏడాదీ కుంభ మాసంలో (ఫిబ్రవరి, మార్చి) ఏనుగుల పరుగు పందేలు జరుగుతాయి! ఆ పందెంలో వేగంగా, నియంత్రణతో పెరిగెత్తి, గమ్యానికి ముందు చేరుకున్న ఏనుగుని గురువాయూర్ ఆస్థానం అధికారులు, అర్చకులు సత్కరించి ఆ ఏడాది గురువాయూర్ కృష్ణుని ఉత్సవమూర్తులను మోసే అధికారాన్ని ఇస్తారు! అయితే శ్రీకృష్ణునికి కేశవన్ మీద ఉన్న ప్రేమ ప్రభావమో ఏమో ఆ పందెంలో ఎన్ని ఏనుగులు పాల్గొన్నా ప్రతీ సంవత్సరం కేశవన్ కే మొదటి బహుమతి వచ్చేది! అలా ప్రతీ సంవత్సరం ఉత్సవమూర్తులను ఊరేగింపు చేసే భాగ్యం కేశవన్ కే దక్కేది! అయితే ఒకటి రెండుసార్లు మాత్రం కేశవన్ ఆ పరుగు పందెంలో ఓడిపోవటంతో మరొక ఏనుగుకి ఉత్సవమూర్తులు మోసే అవకాశం లభించింది! అప్పుడు, భగవంతుణ్ణి తనపై ఊరేగింపు చేయరనే దిగులు కేశవన్ కి బలంగానే నాటుకుంది! ఆ బాధ తట్టుకోలేక గుడిలో జరుగుతున్న ఉత్సవంలో దేవుడి విగ్రహాలని మరొక ఏనుగుపైకి ఎక్కించే సమయంలో భయంకరంగా ఘింకరిస్తూ గొలుసులు తెంచుకుని ఆస్థానంలోకి పరుగెత్తుకుని వచ్చేసి ఎవ్వరినీ ఏమీ చేయకుండా మౌనంగా దేవుడి ముందు వంగి తనపై ఎక్కించమని వీపు చూపించిందిట కేశవన్! ఇది పలుమార్లు జరగటంతో గురువాయూర్ ఆస్థాన పండితులు ధర్మ సంకటంలో పడి, మూగ జీవమైనా ఏనుగు కేశవన్ ప్రవర్తనకి ఆశ్చర్యపడి  "దైవ ప్రశ్న" అనే భగవంతుని ప్రశ్న అడిగి సమాధానం తెలుసుకునే ప్రక్రియ ఏర్పాటు చేశారట! 


*కేశవుడే నన్ను మొయ్యాలి!*


కేరళ ప్రాచీన జ్యోతిషంలో ప్రశ్నకాండకి పెట్టింది పేరు! ముఖ్యంగా తిరువనంతపురం, గురువాయూర్ వంటి ప్రాచీన క్షేత్రాలలో ధర్మసంకటములు, మానవ మాత్రులు పూరించలేని సమస్యలు ఎదురైనపుడు జ్యోతిషం ప్రకారం ప్రశ్నకాండని నిర్వహించి భగవంతుని ఆజ్ఞని నిర్ణయిస్తారు! దీనిని దైవప్రశ్నమ్ అంటారు! దీనికి తగిన మంచి రోజుని, శుభ ముహుర్తముని ముందుగానే నిర్ణయించి ఇద్దరు ఆస్థాన జ్యోతిష పండితులని ఆహ్వానిస్తారు! ప్రశ్నకాండలో భాగంగా నలుచదరంగా 12 గడులు గీసి ఒక అమ్మాయిని గాని, అబ్బాయిని గాని ఒక బంగారు నాణేన్ని ఆ గడుల్లో పెట్టమని చెబుతారు! అలా వారు నాణెం వేసిన గడిని బట్టి సంఖ్యాశాస్త్రం ఉపయోగించి తగిన లెక్కలు వేసి మనం వేసిన ప్రశ్నకి భగవంతుడు ఇచ్చే సమాధానాన్ని నిర్ణయిస్తారు! ఇక గురువాయూర్ క్షేత్రంలో మిగిలిన ఏనుగులని ఉత్సవమూర్తులని ఎత్తనివ్వకుండా చేసిన కేశవన్ విషయంలో ఇదే దైవ ప్రశ్నని ఆస్థాన పండితులు నిర్వహించగా ఆశ్చర్యంగా, "జీవితాంతం కేశవుడే నన్ను మొయ్యాలి!", అన్న భగవంతుని వాక్కు వెలువడింది! అప్పటి నుంచి తన జీవితాంతం కేశవుడే గురువాయూర్ కృష్ణుడికి ఆస్థాన గజరాజుగా ఉత్సవ వాహకుడిగా తన జీవితాన్ని చరితార్థం చేసుకున్నాడు! 


*కుష్టురోగిని రక్షించి!*


ఒకనాడు కేశవన్ ని మావటివాడు పక్క ఊరికి తీసుకెళ్లాడు! అక్కడే చాలా సేపు కాలయాపన చేసాడు మావటివాడు! ఇటు ఆస్థానంలో స్వామి కైంకర్యానికి సమయం అయిపోతోందని గ్రహించిన కేశవన్ పలుమార్లు హెచ్చరించినా మావటివాడు పట్టించుకోలేదు! ఇక ఆగలేక కేశవన్ గొలుసులు తెంచుకుని రోడ్ల వెంబడి పరిగెత్తుతూ గురువాయూర్ వైపు వెళ్ళసాగింది! మావటివాడు లేకుండా వీధుల్లో పరుగెత్తుతున్న ఏనుగుని చూసి జనాలు బెంబేలెత్తిపోయి చల్లా చెదురుగా పారిపోయారు! ఇంతలో ఒక కుష్టురోగి ఆ జన సందోహంలో ఎటూ నడవలేక మిగిలిన జనాలు తనని తోసేసి కింద పడేస్తే లేవలేక రోడ్డు మీదనే పడిపోయాడు! అటువైపు పరుగెత్తుకొస్తున్న కేశవన్ ని చూసి జనాలు భయంతో ఆ కుష్టురోగిని ఎంత హెచ్చరించినా లేవలేని స్థితిలో ఉన్న కుష్టురోగి ఇక తాను చేసేది ఏమీ లేక ఏనుగు కాళ్ళ కింద పడి నీలిగిపోతానని నిశ్చయించుకుని అలాగే కూర్చున్నాడు! ఇంతలో అతని వద్దకి వచ్చిన కేశవన్ ఆశ్చర్యంగా అందరూ చూస్తుండగా ఆ కుష్టురోగిని తొక్కలేదు సరి కదా అతని వద్ద ఆగి, అతణ్ణి జాగ్రత్తగా తన తొండంతో పైకెత్తి రోడ్డు పక్కన కూర్చుబెట్టి తన పాటికి తాను పరిగెత్తుతూ వెళ్ళిపోయింది! ఎంత జంతువైనా భగవద్కైంకర్యంలో తలమునకలైన కేశవన్ కి ఇంగిత జ్ఞానం మెండుగా ఉందని అనడానికి ఇదో ఉదాహరణ!


*భగవంతుడే ముందు, మనుషులంతా వెనుక!*


మనుషుల చేత సాకబడే ఏనుగుల్లో స్వాభావికంగా మావటివాడి మాట వినే తత్వమే తప్ప స్వతంత్రంగా ప్రవర్తించే గుణం ఉండదు! కానీ గజరాజైన కేశవన్ ప్రవర్తన మాత్రం  దానికి భిన్నంగా మనుష్యులలో తారతమ్యాలు కనిపెట్టి వారి వారి గుణాలని బట్టి ప్రవర్తించేదిట! ముఖ్యంగా ఉత్సవ సమయాల్లో కృష్ణుని విగ్రహంతో ఎక్కే అర్చకుని తన శిరస్సు, తొండం వంచి సగౌరవంగా ముందు నుంచి ఎక్కించుకునేది! మిగిలిన వారెవరైనా వెనకాల నుంచి కూర్చుని ఎక్కించుకునేది! దేవుడి విగ్రహం చేతిలో లేకపోతే ఎంతటివారైనా సరే ముందు నుంచి ఎక్కడానికి ఒప్పుకునేది కాదు! భగవంతునికే తాను దాసుడనని, మనిషికి కాదని తన ప్రవర్తనతో గట్టిగా ఉద్ఘాటించేది కేశవన్! అలాగే వేరే ఊరు వెళ్ళినప్పుడు మావటివాడికి గౌరవం ఇచ్చి అతడు చెప్పినట్టు నడుచుకునే కేశవన్ గురువాయూర్ లో మాత్రం తాను స్వతంత్రంగా ఉండేది! అయితే ఈ స్వతంత్రతలో ఎంతో క్రమశిక్షణ, నిబద్ధత ఉండేది!


*ఏకాదశిరోజు పరమపదం!*


జనాల యొక్క అదృష్టం ఎంతో వారి మరణ సమయంలో ప్రస్ఫుటమవుతుంది అంటారు! అది గజరాజైన కేశవన్ విషయంలో కూడా నిజమయ్యింది! గురువాయూర్ కృష్ణుని కైంకర్యంతో తన జన్మ సార్థకం చేసుకున్న కేశవన్ 70వ వయస్సులోకి ప్రవేశించగానే క్రమంగా శరీరంలో బలం సన్నగిల్లనారంభించింది! 1973లో అప్పటికి యాభై సంవత్సరాలుగా ఉత్సవ దిగ్గజంగా సేవలు అందించిన కేశవన్ ని గురువాయూర్ ఆలయం వారు గొప్పగా సన్మానించి ఆలయ మర్యాదలతో, మిగిలిన ఏనుగులతో కవాతు నిర్వహించి కేశవన్ కి "గజరాజు" అనే బిరుదునిచ్చి గొప్పగా సత్కరించారు! ప్రతీ సంవత్సరంలో డిసెంబర్ నెలలో వృశ్చిక మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశికి "గురువాయూర్ ఏకాదశి"గా, "భూలోక వైకుంఠ ఏకాదశి"గా ప్రసిద్ధి. ఈ ఏకాదశికి నెల రోజుల ముందు నుంచి గురువాయూర్ కృష్ణుని సన్నిధిలో వేల కొలది దీపాలు వెలిగించి ఉత్సవాలు చేస్తారు. వృశ్చిక మాసపు శుక్ల అష్టమి నుంచి ఏకాదశి వరకు ఉత్సవాలు, ఊరేగింపులు కృష్ణ పరమాత్మకు విశేషంగా నిర్వహిస్తారు! అలాగే ఆ ఏకాదశి నాటి రాత్రి జాగరణతో ఆలయం   భక్తులు అంతా చేరి వేల కొలది దీపాలు వెలిగించి స్వామికి నీరాజనాలు సమర్పిస్తారు! ఈ ఉత్సవాలలోనే కేశవన్ ఆస్థాన దిగ్గజంగా ప్రతీ ఏడూ స్వామిని భక్తి శ్రద్ధలతో తనపై మోస్తూ ఉరేగింపుకి తీసుకెళ్లేది! కానీ వయసు పైబడ్డాక నిదానంగా కేశవన్ కి ఉత్సాహం, బలం సన్నగిల్లాయి! 1976వ సంవత్సరంలో వచ్చిన గురువాయూర్ ఏకాదశి ఉత్సవాలలో కేశవన్ బాగా నీరసించిపోయింది! రెండు రోజుల ముందు అష్టమినాటి ఉత్సవంలో కాళ్ళు తడబడి తూలిన కేశవన్ వీపుపై నుంచి విగ్రహాలని జాగ్రత్తగా దించి మరో ఏనుగుపైకెక్కించారు నిర్వాహకులు! తరువాతి రోజు నవమి, దశమి నాటి ఉత్సవానికి కేశవన్ కి ఓపిక రాలేదు! ఏకాదశి నాడూ, తన జంతు జన్మకి చిట్టచివరి రోజూ రానే వచ్చింది! ఏకాదశి రోజు ఎప్పటిలాగే ఉపవాసమున్న కేశవన్ అంత నీరసంలోనూ ఉదయం వెళ్ళి కృష్ణుని దర్శనం చేసుకుని తన తుది ఘడియలు సమీపిస్తున్నాయని గుర్తించి వడివడిగా అడుగులేసుకుంటూ గజశాల వద్దకి తిరిగి వచ్చి నేలపై కూలబడింది! బహుశ ఆలయంలో మరణిస్తే ఆలయం అపవిత్రమవుతుందని అనుకుందో ఏమో! శరీరంలో సత్తువ పూర్తిగా కరిగిపోయిన కేశవన్ తన దంతాల సాయంతో శిరస్సుని అతి కష్టం మీద పైకెత్తి కృష్ణుని సన్నిధి ఉన్న దిక్కువైపు తల తిప్పి తొండం పైకెత్తి "కృష్ణా!" అంటూ పెద్ద ఘింకారం చేసింది! అదే కేశవన్ తుది శ్వాస! భగవన్నామ స్మరణలో తుది ఘింకారంతో, తన ప్రాణవాయువుతో సహా తన జీవాత్మను కూడా బయటకి లాగి శ్రీకృష్ణుని పాదాల చెంత సమర్పించింది! పరమపద సామ్రాజ్యాన్ని అలంకరించింది!


*కేశవన్ స్మారక విగ్రహం!*


అన్ని ఏనుగులలోకెల్లా విలక్షణమైన, విభిన్నమైన గజరాజు కేశవన్ సేవలని గురువాయూర్ దేవస్థానం గుర్తించి కేశవన్ స్మారక విగ్రహం చేయించి గజశాల ప్రాంగణంలో ప్రతిష్టించారు! ప్రతీ సంవత్సరం గురువాయూర్ ఏకాదశి నాడు విధివత్తుగా ఆలయ మర్యాదలు, కృష్ణునికి ధరింపచేసి శేషవస్త్రం, పూలమాల, ప్రసాదం నైవేద్యంతో ఆలయ మర్యాదలతో అధికారులు వచ్చి కేశవన్ విగ్రహానికి నివాళులర్పిస్తారు! తరువాత ఆస్థాన ఏనుగులు కవాతు చేసి "గజరాజు" కేశవన్ కి గౌరవ వందనం సమర్పిస్తాయి! ఈ సంప్రదాయం ఇప్పటికీ మనం గురువాయూర్ వెళ్తే చూడవచ్చు!


💥ముక్తి పొందాలి అంటే భక్తి ప్రధానం🙏🙏🙏

గజేంద్రాయ నమః🙏


🦣సర్వేజనాసుఖినోభవంతు 🦣


శ్రీ ధర్మశాస్త సేవాసమితి 🐆విజయవాడ 🏹7799797798

మన మహర్షులు - 43

 మన మహర్షులు - 43


శౌనక మహర్షి


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


పూర్వం విజ్ఞానఖని తపస్సంపన్నుడైన ఒక మహర్షి శునకుడనే పేరుతో వుండేవాడు. ఆయన  కొడుకే మన శౌనక మహర్షి. 



శౌనకుడు వేదవేదాంగాలు నేర్చుకుని, అన్ని యజ్ఞాలు చేయించగల సామర్థ్యం వచ్చాక తపస్సు చేసుకుందుకు నైమిశారణ్యానికి వెళ్ళాడు.


 నైమిశారణ్యం ఎంత అందంగా వుండేదో కొంచెం మనం కూడా తెలుసుకుందాం...


నైమిశారణ్యం విష్ణుమూర్తి మందిరంలా, మాధవీ మన్మధులకి ఇష్టమయినట్లు, సరస్వతీదేవితో కలిసివున్న బ్రహ్మగారిల్లులా, ఈశ్వరసభలా, వహ్ని, వరుణ, సమీరణ చంద, రుద్ర, హైమవతీ, కుబేర, గాలవ, శాండిల్యలాంటి మునులతో కూడుకుని, కుబేరుడి ఖజానాలా, రఘురాముడి యుద్ధంలా, పరశురాముడి పౌరుషంలా, కురుక్షేత్రంలా ఇంకా వేదాల్లా గాయత్రీ నిలయమై అమరావతీ పట్టణంలా, వైకుంఠపురంలా, పురుషోత్తముడి

సేవకవసరమైన ఫలాల్తో, లంకానగరంలా, సుగ్రీవుడి సైన్యంలా, గొప్ప గొప్ప మునుల తపస్సులతో పవిత్రమై, సూర్యరథంలా ఉండేది. కాబట్టి  ఆ ప్రదేశానికి శ్రీవిష్ణుక్షేత్రం అనే పేరు వచ్చింది .


అలాంటి  నైమిశారణ్యంలో బ్రహ్మజ్ఞానిగా వెలిగిపోతున్న ఆ శౌనక మహర్షి ఎంతోమంది మునుల్ని శిష్యులుగా చేసుకుని ఉండిపోయాడు.


ఒకసారి శౌనకుడు వెయ్యి సంవత్సరాలు జరిగే సత్రయాగం చెయ్యాలని అనుకుని దాన్ని జరిపించడానికి సూతుణ్ణి ఎంచుకున్నాడు. సూతుడు ఎన్నో గ్రంథాలు చదివి, ఎన్నో పురాణాలు విని దివ్యజ్ఞానం పొందినవాడు.

 శౌనక మహర్షి కి ఇంకా అక్కడ మునులందరికి భగవంతుడి ఏకవింశత్యవతార కథలు అంటే విష్ణుమూర్తి 21 

అవతారాలు  ఎత్తిన కథలు, అన్ని పురాణలు కూడా వాళ్ళకి విన్పించాడు సూతుడు.


కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ శౌనకుడు లోకానికంతకీ మంచి జరగాలని ద్వాదశ సంవత్సర సత్రయాగం మొదలుపెట్టి మళ్ళీ సూతుణ్ణి పిలిచి మునులందరికీ భారత కథలు చెప్పించాడు.


ఈరకంగా నైమిశారణ్యం శౌనక మహర్షి చేసే యాగ సమయంలో విజ్ఞాన కథలు పురాణాలు, ఇతిహాసాలు, సూతుడు శౌనకాదులకి చెప్తుంటే ఆ ప్రదేశం పుణ్యక్షేత్రమై బ్రహ్మలోకంలా అనిపించేది.


పాండవులు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు గంగాతీరంలో ఒక చెట్టు కింద ఒక రాత్రి గడిపి మళ్ళీ బయలుదేరారు.


 అక్కడున్న బ్రాహ్మణులు   పాండవుల వెనకాలే బయలుదేరారు. 


 ధర్మరాజు శౌనక మహాముని చెప్పినట్లు విని సూర్యుడ్ని ఆరాధన చేసి, ఆయన

అనుగ్రహంతో అనేకవేల బ్రాహ్మణులకి అతిథిపూజ చేసి తర్వాత వెళ్ళాడు.


 మునులందరూ మళ్ళీ చేరి శౌనక మహామునిని పద్మపురాణం చెప్పించమని అడిగారు. అదే సమయానికి సూతుడు వచ్చాడు. అందరూ ఆనందించి మాకు పద్మపురాణం చెప్పమని అడిగారు.


పద్మపురాణమంటే విష్ణుమూర్తి నాభినుంచి పుట్టిన కమలం గురించి చెప్పేది. కల్పాంతంలో మత్స్యరూపంలో వున్న ఆదిదేవుడు సముద్రం నుంచి వేదవేదాంగ పురాణలతో పద్మపురాణం కూడా దేవలోకంలోనూ, మనుష్య లోకంలోనూ ప్రతిష్టించబడింది


దానిని హరి బ్రహ్మకీ, బ్రహ్మ నారదుడికి, నారదుడు వ్యాసుడుకి, వ్యాసుడు నాకు చెప్పారని సూతుడు శౌనకాది మహామునులకి పద్మపురాణం వివరంగా చెప్పాడు.


శౌనకమహర్షి బ్రహ్మాజ్ఞానిగా, బహువిధ యజ్ఞకర్తగా, మహాధర్మవేత్తగా కూడ ప్రసిద్ధికెక్కాడు.


జిజ్ఞాసువు శౌనకుడు అంగీరస మహర్షి వద్దకు వచ్చి "ఏది తెలుసుకుంటే సర్వమూ తెలుసుకున్నట్లవుతుంది?" అని అడిగిన ప్రశ్నకు అంగిరసుడు "పరావిద్య, అపరావిద్య అని రెండు రకాలు తెలుసుకోవలసినవి ఉన్నాయని బ్రహ్మవిదులు అంటారు. పరావిద్య అంటే పరబ్రహ్మకు సంబంధించిన జ్ఞానం. అపరావిద్య అంటే లౌకికమయిన ధర్మాధర్మాలకు సంబంధించినది. రెండవదానికంటే మొదటిది గొప్పది. దాన్ని తెలుసుకున్నవాడు సంసారచక్రం నుంచి విముక్తుడవుతాడు." అంటూ ముండకోపనిషత్తు అనే ఉపనిషత్తును అంగీరసుడు బోధించాడు.


శౌనక మహర్షి చరణవ్యూహ అను ధర్మశాస్త్రమునకు గ్రంథకర్త.


 'మదనరత్నప్రదీప' అనే ధర్మశాస్త్రం, 'చరణవ్యూహ' అనే ధర్మశాస్త్రం కూడ ఈయనవే. మను ధర్మశాస్త్రంలో శౌనకుడు ధర్మశాస్త్ర కర్తగా ఉండటమే కాకుండా 'ప్రణకల్ప అనే గ్రంథం కూడా రచించాడు


శౌనక మహర్షి సూతుడు చేత ఎన్నో పురాణాలు, భారత కథలు, విష్ణుకథలు అన్నీ చెప్పించడం వల్ల ఎంతోమంది మునులు విని తరించారు. ..


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

మన మహర్షులు- 42

 మన  మహర్షులు- 42


 శ్వేతకేతు మహర్షి


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


పూర్వం మంత్ర ద్రష్ట, మంత్రవేత్త, మంత్ర మహితుడు, మహాతపస్వి అయిన ఉద్దాలకుని కొడుకు శ్వేతకేతుడు.


అష్టావక్రుడి మేనమామ శ్వేతకేతుడు. ఇద్దరూ ఒకే సమయంలో పుట్టారు.


 స్వచ్చమైన తెల్లటి రంగుగల శరీరంతో పుట్టాడని శ్వేతకేతుడకి ఆ పేరు పెట్టారు.


 అష్టావక్రుడు శ్వేతకేతుడు ఒకే చోట పెరిగారు. శ్వేతకేతుడు చిన్నతనంలోనే సర్వ వేదశాస్త్రాలు, వేద రహస్యాలు, ధర్మ మర్మాలు

తెలుసుకుని పూర్ణిమనాటి చంద్రుడిలా వెలిగిపోయాడు.


 శ్వేతకేతుడు మహా తపస్సు చేసి బ్రహ్మజ్ఞానం పొంది వేదతత్త్వం, క్రియాస్వరూపం,

కర్మఫల త్యాగం, ఆత్మజ్ఞానం సంపాదించి బాల సూర్యుడిలా ప్రకాశించాడు.


శ్వేతకేతుడికి వివాహం చేయ్యాలని నిర్ణయించుకున్నాడు ఉద్దాలకుడు .అదే సమయంలో మహాతపస్వి, వేదవేత్త, శాస్త్రవిజ్ఞుడు, ఆచారవంతుడు, ధర్మజ్ఞుడు

అయిన దేవల మహర్షి తన కూతురు సువర్చలకి పెళ్ళి చేయ్యాలని వరుడి కోసం వెతుకుతున్నాడు.


సువర్చల విద్య, వినయం, విజ్ఞానం, అందం అన్నీ కలబోసి లక్ష్మీదేవిలా వుంటుంది. ఎవర్నిచ్చి చెయ్యాలా? అని దేవలుడు ఆలోచిస్తున్నాడు.


 తండ్రితో గ్రుడ్డివాడు, గ్రుడ్డివాడు కానివాడు ఒకే కాలంలో వున్న మహాత్ముడైతేనే నేను వివాహం చేసుకుంటానని చెప్పింది సువర్చల.


దేవల మహర్షి అల్లాంటివాడిని నువ్వే ఎంచుకోమని చెప్పాడు సువర్చలకి.


 ఏకకాలంలో అంధుడై, అంధుడు కానివాడు ఎవరుంటారని ఒక్కొక్కళ్ళే వెళ్ళి పోతున్నారు.


శ్వేతకేతుడు దేవలుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి నేను అలాంటివాడ్నే అన్నాడు సువర్చలకి వివరంగా చెప్పాడు. 


ప్రపంచం మిధ్య, వినడం, మాట్లాడడం, చూడడం, తాకడం పన్లు చెయ్యడం ఇల్లాంటివన్నీ మిథ్య అని ఏ జ్ఞాన నేత్రానికి తెలుసో ఆ జ్ఞాన నేత్రం లేనివాడు గ్రుడ్డివాడు. అది నాకుంది కాబట్టి నేను గ్రుడ్డివాణ్ణి కాదు..


 కాని నేను గ్రుడ్డివాణ్ణి .... లోకుల దృష్టిలో వాళ్ళల్లాగా నేను వస్తువులు చూడట్లేదు. వారి అజ్ఞాన దృష్టి నాకు లేదు. కాబట్టి వాళ్ళదృష్టిలో నేను గ్రుడ్డివాడిని.


ఈ విధంగా ఒకే క్షణంలో నేను గ్రుడ్డివాణ్ణి, గ్రుడ్డివాణ్ణి కాని వాణ్ణి కూడా. అందుకే నన్ను పెళ్ళి చేసుకోమన్నాడు శ్వేతకేతుడు.


సువర్చల అంగీకరించగానే దేవలుడు, ఉద్దాలకుణ్ణి మిగిలిన ఋషులందర్నీ పిలిచి సువర్చలాశ్వేతకేతులకి వివాహం జరిపించారు. 


 శ్వేతకేతుడు వేరే ఆశ్రమం ఏర్పాటు చేసుకుని గుహస్థధర్మం నిర్వర్తించాడు.


సువర్చాలా శ్వేతకేతులు ధర్మకార్యాలు చేస్తూ గుణవంతులైన సంతానాన్ని పొంది పితృదేవతల్ని, యజ్ఞాలు చేసి దేవతల్ని, తపస్సు అధ్యయనం అనే సత్ప్రవర్తనతో ఋషుల్ని సంతోషపెట్టి భూలోకంలోనే స్వర్గలోకం చూస్తూ అందరికీ చూపిస్తూ అపూర్వ దంపతుల్లా వెలిగారు


శ్వేతకేతుడు బ్రహ్మజ్ఞాన విషయాలన్నీ భార్యకి చెప్పి ఆమెని కూడా జ్ఞానవంతురాల్ని చేసి చివరికి ఇద్దరు సన్యాసం తీసుకుని మోక్షం పొందారు.


సమంగానది దగ్గర సోమకశిచి తీర్థం దగ్గర శ్వేతకేతు తపస్సు చేసిన ప్రదేశాన్ని "శ్వేతకేతుతీర్థం' అంటారు.


 ఇక్కడే సరస్వతీదేవి మానుష రూపంలో శ్వేతకేతుడికి దర్శనమిచ్చింది.


ఈ విధంగా దంపతులిరువురు జ్ఞానదీక్షపరులై ధర్మజీవనం సాగించి మోక్షం పొందారు.


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌷

శ్రీరమణీయం* *-(140)*_

 _*శ్రీరమణీయం* *-(140)*_

🕉🌞🌎🌙🌟🚩


_*"నిద్ర లేవగానే తెలియకుండానే దేహభ్రాంతి అవరిస్తుంది, అదెలా పోతుంది ?"*_


_*అనుభవాలే మనకు  జ్ఞాపకాలుగా ఏర్పడుతాయి. జ్ఞాపకాలతో లేని క్షణాల్లో మనసు ఆత్మస్వరూపంగా ఉంటుంది. సాధనలో ఇలాంటి క్షణాలే నిమిషాలుగా గంటలకు పెరిగి తురీయావస్థ అవుతుంది ! అదే జీవన్ముక్తుని చేసే సహజ సమాధి స్థితికి మనని చేరుస్తుంది. తల్లి కొట్టకముందే పిల్లవాడు ఏడవటం, తండ్రి బొమ్మలు తెస్తున్నాడని తెలిసి సంబర పడటం మనకు నవ్వులాటగా అనిపిస్తాయి. కానీ జ్ఞాపకాలు, ఊహలతో మనం చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. నిద్ర లేవగానే మనకు కలిగే మొదటి జ్ఞాపకం దేహమే. అదే అప్పటి వరకు నారాయణ స్వరూపంగా ఉన్న మనసుని నరునిగా మారుస్తుంది !*_



_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*_

_*'ఆత్మవిచారణతో అన్ని మార్గాలు సమన్వయం !'*- *


🕉🌞🌎🌙🌟🚩


 _*శ్రీరమణీయం* *-(141)*_

🕉🌞🌎🌙🌟🚩


_*"ఆలోచించి పని చేయాలా, పని చేసి ఆలోచించాలా ఏది ఉత్తమం ?"*_


_*అవసరాన్నిబట్టి తత్ క్షణమే స్ఫురించేదే నిజమైన ఆలోచన ! 'పని చేసేముందే ఫలితాన్ని ఊహించటం, పని పూర్తయ్యాక దాని గురించి చింతించటం' ఆ పని చేసేందుకు ఉపయోగపడే ఆలోచనలు కావు. ఆశ, భయాలు మన ఊహలకు, జ్ఞాపకాలకూ కారణాలు. వాటినే మనం ఆలోచనలు అనుకుంటున్నాం. కానీ అవసరానికి అనుగుణంగా స్ఫురించే ఆలోచనతో మనంచేసే పనులు కౌశలమై 'కర్మయోగాన్ని' సిద్ధింపచేస్తాయి !*_


_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*_

_*'ఆత్మవిచారణతో అన్ని మార్గాలు సమన్వయం !'*- 


🕉🌞🌎🌙🌟🚩

ఆచార్య సద్బోధన*

 *ఆచార్య సద్బోధన*


భగవంతునికి సంబంధించిన పనులు చేయటమే మన ప్రథమ కర్తవ్యం.


మన నిజ స్వభావాన్ని తెలుసుకుంటూ, భగవంతునితో మనకు గల అనుబంధాన్ని తెలుసుకొమ్మని మహాత్ములు మనకు బోధిస్తారు.


పవిత్రతను ఆచరణలో చూపడం ద్వారా ఈ జ్ఞానం కలుగుతుంది. అన్నింటికంటే పవిత్రతే శ్రేయాన్ని కలిగిస్తుంది.


పవిత్రతా శక్తి కలిగి ఉన్నవానికే ఆనందం స్వంతం అవుతుంది. సిద్ధాంతాలవల్ల, మత సంప్రదాయాలవల్ల ప్రపంచం సంస్కరించబడదు.


మతం యొక్క శక్తి అంతా పవిత్రతలోనే ఉంది.


*శుభంభూయాత్*

ఆచార్య సద్బోధన*

 *ఆచార్య సద్బోధన*


అంతఃశుద్ధి కొరకు ప్రయత్నించని ప్రతీ వ్యక్తి తనను తాను వంచించుకుంటున్నాడు. మన ఆచరణకు పవిత్రతను జత కలిపితే మనకు మనం మేలు చేసుకున్నవారమవుతాము. దైవభీతి ఒక్కటే ఉన్న చాలదు, ధర్మబద్ధుడై మెలగాలి.



ఒక వ్యక్తిలో నిమ్న విషయాల పట్ల ఆసక్తి అధికంగా ఉంటే వాటి వలన అతనికి చివరకు హానియే జరుగుతుంది. అదే ఉన్నత విషయాల పట్ల ఉంటే ఫలితం కూడా ఉన్నతంగానే ఉంటుంది.


మన ఆలోచనా పరిధి భగవత్ సంబంధిత విషయాల గురించి యోచించడం ద్వారా విస్తరిస్తుంది. ఈ విశాల విశ్వం మనవైపు చేతులు చాచి చూస్తోంది కానీ మనం దానిపై సరియైన రీతిలో దృష్ఠిపెట్టలేకున్నాం. 


ఈ విశ్వం నుంచి గ్రహించవలసినవి ఎన్నో ఉన్నాయి అవే పాఠాలు, ప్రేరణలు, ఆశీర్వాదాలు.


*శుభంభూయాత్*

పంచారామాలు

 "పంచారామాలు" అనగా ఏమిటి ? 


ఈ క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి మరియు ఈ దేవాలయాల విశిష్టత గురుంచి విపులంగా "హితోక్తి" ప్రేక్షకుల కోసం...


మీరు తెలుసుకొని, నలుగురుతో పంచుకోండి....


"ఓం నమః శివాయ నమః"...


ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధమైన  "శైవక్షేత్రాలను", "పంచారామాలు' అని పిలుస్తారు.  'పంచారామాలు' ఏర్పడుటకు, స్కందపురాణంలో ఇలా వివరించబడి యున్నది..


పూర్వం.. తారకాసురుడు అను రాక్షసుడు, 'శివుని' గురించి ఘోర తపస్సు చేసి 'శివుని' ఆత్మలింగము సంపాదిస్తాడు.  దీనితో వీర గర్వముతో, దేవతలను అనేక రకాలుగా హింసలు గురిచేయగా, ఇందుకు దేవతలు, విష్ణుమూర్తిని ప్రార్ధించగా, 'శివపార్వతుల' వల్ల కలిగిన కుమారుడు "కుమారస్వామి" వల్లనే తారకాసురుని వధించుట సాధ్యపడుతుందని తెలిపి "కుమారస్వామిని" యుద్ధానికి పంపుతారు. యుద్ధమునందు "కుమారస్వామి",  తారకాసురుని కంఠంలో గల 'ఆత్మలింగమును' చేధిస్తేనే మరణము కలుగునని గ్రహించి ఆ 'లింగమును' చేధిస్తాడు.  దీనితో తారకాసురుడు మరణిస్తాడు.


చేధిoచే సమయంల్లో, ఆ.. 'ఆత్మలింగము'  వేరై,  ఐదు ప్రదేశములలో పడుతాయి. తరువాత వాటిని ఆ...యా...ప్రదేశాలలో, దేవతలు లింగ ప్రతిష్ఠ కావిస్తారు.. కనుక ఈ అయిదు 'క్షేత్రాలను',  'పంచారామాలు' అని పిలుస్తారు..


1. దాక్షారామము :


పంచరామాల్లో మొదటిదైన దాక్షారామము తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఉంది.  ఇక్కడ స్వామిని "భీమేశ్వరుడు" అని పిలుస్తారు. 

 స్వామి లింగాకారం 60 అడుగులు ఎత్తులో ఉంటుంది. పై అంతస్తు నుండి పూజలు నిర్వహిస్తారు.  ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి లింగాకారం సగం భాగం తెలుపు మరిఇయు  సగభాగం నలుపుతో ఉంటుంది.


ఇక్కడ దక్షప్రజాపతి యజ్ఞం నిర్వహించాడు. కనుక ఈ ప్రాంతానికి దాక్షారామము అని పేరు వచ్చిందంటారు.  ఈ ఆలయం చాళుక్యరాజయిన, భీముడు నిర్మించాడని పురాణాలలో చెప్పబడి యున్నది.  అనేక పురాణాల్లో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది.   పూర్వకాలంలో ఎంతో మంది దేవతలు, రాజులు స్వామి వారిని దర్శించుకొని, తరించారని తన 'భీమేశ్వర పురాణంలో' చెప్పబడి యున్నది.  ఈ ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉంటుంది.  ఇక్కడ "మహాశివరాత్రి" పర్వదినం కన్నుల పండుగగా నిర్వహిస్తారు.


2. అమరారామము :


పంచారామల్లో రెండవదైన 'అమరారామము',  గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణానదీతీరమునందు వెలసినది.  ఇక్కడ స్వామిని "అమరేశ్వరుడు" అని పిలుస్తారు.  గర్భగుడిలో స్వామి విగ్రహం 9 అడుగుల ఎత్తులో,  తెల్లగా మెరుస్తూ ఉంటుంది.  


ఈ ఆలయం 20 అడుగుల ఎత్తుగల విశాలమైన వేదికపైన నిర్మించబడింది.

అమరేశ్వరుడైన 'ఇంద్రుడు' చేత ప్రతిష్టించి ఈ ఆలయానికి తన నగరమైన అమరావతి పేరునే పెట్టారు అని పురాణాలలో చెప్పబడి యున్నది.


3. క్షీరారామము :


క్షీరారామము, పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో కలదు. ఇక్కడ 'శివుని' మూర్తిని "శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి"  అని పిలుస్తారు.  ఇక్కడ స్వామివారిని త్రేతాయుగ కాలంలో  'సీతారాములు' కలిసి ప్రతిష్ఠించారట.  ఈ గ్రామానికి పాలకొల్లు అని పేరు రావడానికి కూడా ఒక కధ ఉంది. 


'శివుడు' తన బాణమును భూమిలోనికి వెయ్యగానే భూమి నుండి పాలధార వచ్చిందట.   క్షీరం అనగా పాలు, దీనిమూలంగా క్షీరపురి అనే పేరు వచ్చింది. 

క్రమంగా 'క్షీరపురి' కాస్తా 'పాలకొల్లుగా' మార్పు చెందింది. స్వామి వారి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు.  ఆలయం 125 అడుగుల ఎత్తులో '9' గోపురాలుతో కట్టబడింది.


4. సోమారామము :


పంచరామాల్లో నాల్గవదైన "సోమారామము".   పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి రెండు కిలోమిటర్లు దూరంలో గల గునిపూడిలో కలదు. ఇక్కడ స్వామి వారిని "సోమేశ్వరుడు" అని పిలుస్తారు.  ఇచ్చట 'శివలింగానికి'  ఒక ప్రత్యేకత ఉంది.  మాములు రోజుల్లో తెలుపు రంగులో ఉండే 'శివలింగం',  అమావాస్య రోజు వచ్చేసరికి గోధుమ రంగులోనికి మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యధాస్ధానానికి చేరుతుంది.


ఇక్కడ స్వామిని 'చంద్రుడు' ప్రతిష్టించాడు. చంద్రునిచే ప్రతిష్ఠించ బడినది కావున దీనికి 'సోమారామము' అని పేరు వచ్చింది.


5. కుమారభీమారామము :


పంచారామాల్లో చివరిది, 5వది అయిన 'కుమారభీమారామము',  తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమిటరు దూరంలో కలదు.  ఇక్కడ స్వామిని "కాల బైరవుడు"  అని పిలుస్తారు.


ఈ ఆలయాన్ని దాక్షారామాన్ని నిర్మించిన, చాళుక్య రాజయిన భీముడు ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడు. ఇక్కడి 'శివలింగం' సున్నపురాయితో చేసినదిలాగా ఉంటుంది.  ఈ ఆలయంలో "మహశివరాత్రి" ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.


ఈ అయిదు ఆలయాలను, ఒకే రోజు, అంటే, సంధ్యా సమయంల్లో మొదలుబెట్టి, సాయంకాలం లోపు దర్శించుకొన్న మోక్షము లభిస్తుంది అని పెద్దలు చెబుతారు.


"ఓం నమః శివాయ నమః"... "ఓం నమః శివాయ నమః"...🙏🙏🙏


శుభోదయం🌹🌹🌹

ఆవు పాలతో అధ్బుత వైద్యం -

 ఆవుతో అధ్బుత వైద్యం  - 


 

  రక్తపైత్య రోగానికి  - 


 *  రక్తపైత్య రోగం అనగా నోటివెంట దగ్గినప్పుడు రక్తం పడటం .


 

    నాటు ఆవుపాలు పావు లీటరు తీసుకుని గిన్నెలో పోసి దానిలో మంచినీరు 1 1/4 లీటరు కలిపి చిన్న మంట పైన నీరంతా ఇగిరిపోయి పాలు మిగిలే వరకు మరగబెట్టి దించి చల్లారిన తరువాత ఆ పాలను ప్రతిరోజూ తాగుతూ ఉంటే దగ్గులో రక్తం పడే రక్త పిత్త వ్యాధి కొద్దిరోజులలోనే తగ్గిపోవును .


      ఇంత సులువైన మందు యే వైద్య విధానంలో లేదు .


 *  విరిగిన ఎముకలు తొందరగా అతుక్కోవడానికి -


      కాచిన ఆవుపాలు పావు లీటరు తీసుకుని దానిలో పటికబెల్లం పొడి 30 గ్రా , ఆవునెయ్యి 20 గ్రా , లక్కపొడి 2 గ్రా కలిపి ఒక మోతాదుగా రోజు రెండుపూటలా తాగిస్తూ ఉంటే ఒకటి లేక రెండు వారాలలో విరిగిపోయిన ఎముకలు తప్పకుండా అతుక్కుంటాయి. 


 *  అతి కఫం హరించుట కొరకు   - 


    రోజు రెండు పూటలా పావు లీటరు ఆవుపాలలో ఒక గ్రాము మిరియాల పొడి , పటికబెల్లం పొడి 20 గ్రాములు కలిపి తాగుతూ ఉంటే ప్రకోపించిన అతి కఫం అదృశ్యం అవుతుంది.


 *  పాండు రోగం , క్షయ హరించుట కొరకు  - 


       ఇనుప పాత్రలో కాచబడిన ఆవుపాలు పావు లీటరు తీసుకుని దానిలో తగినంత కండ చక్కర పొడి కలిపి రోజు పరగడపున సేవిస్తూ ఉంటే క్రమంగా పాండురోగం పారిపోయి రక్త వృద్ది కలుగుతుంది. క్షయవ్యాధి బహు త్వరగా పారిపోతుంది.


 *  ఎక్కిళ్లు వెంటనే తగ్గుట కొరకు  - 


     కాచిన ఆవుపాలు పావు లీటరు మోతాదుగా పటికబెల్లం పొడి కలిపి గోరువెచ్చగా కొంచంకొంచం తాగుతూ ఉంటే అప్పటికప్పుడే ఎక్కిళ్లు తగ్గుతాయి 


 *  పిల్లల ఆరోగ్యానికి  - 


      అప్పటికప్పుడు చిలికిన మజ్జిగ నుంచి తీసిన ఆవువెన్న ని పసిపిల్లల అన్నప్రాసన రోజు నుంచి ఉదయం, మద్యాహ్నం, సాయంత్రం వేళ్ళల్లో వయసుని బట్టి పూటకు ఒక గ్రాము నుంచి పెంచుకుంటూ 10 గ్రాముల వరకు తినిపిస్తుంటే ఆ పిల్లల శరీరం ఉక్కులా బలంగా తయారు అయ్యి అవయవాలు అందంగా ఉంటాయి. తెలివి పెరుగును.


 *  సంభోగ సుఖం కొరకు  - 


      గోరువెచ్చని ఆవుపాలు పావు లీటరు తీసుకుని దానిలో పటికబెల్లం పొడి 25 గ్రా కలిపి మొదటిసారి సంభోగం అయ్యాక వెంటనే సేవిస్తే ఆ సంభోగం తాలుకు నీరసం తగ్గిపోవడమే కాక తిరిగి త్వరగా మరలా సంభోగం చేయగల శక్తి లభించును.


  గమనిక  -  


                పైన చెప్పిన ఫలితాలు కేవలం నాటు అనగా దేశి వాళి ఆవుపాలు ద్వారానే సాధ్యం . సంకర జాతి పాలతో సాధ్యం కాదు. 


  

     గమనిక  -


                  నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు