6, జనవరి 2021, బుధవారం

చెట్టు నీడ

 చెట్టు నీడ


అదొక పల్లెటూరు. ఆ ఊళ్లో ఒక అమాయకుడున్నాడు. అతను ఎప్పుడూ సత్యమే చెబుతాడని, అబద్ధం చెçప్పడని ఊళ్లో వాళ్లకి గట్టి నమ్మకం. అదే వూరిలో పురాతన కాలం నాటి ఒక దేవాలయం ఉంది. కొన్ని తరాల కిందట ఆ గుడిలో దొంగలు పడి దేవుడి విగ్రహాన్ని ఎత్తుకు పోవడంతో ఆ దేవాలయం పూజాపురస్కారాలూ లేక, దాని ఆలనాపాలనా చూసేవారు లేక శిథిలావస్థకు చేరింది. ఆ దేవాలయం మొండి గోడల మీద రావి, తుమ్మ వంటి చెట్లు మొలిచి, లోనికి ప్రవేశించడానికి వీలు కానంతగా పాడిబడిపోయింది. దాంతో ఎవరూ ఆ గుడిలోకి ప్రవేశించడానికి సాహసించేవారు కాదు.ఒకరోజు రాత్రి ఆ గుడిలోనుంచి గంటల శబ్దం, శంఖనాదాలు వినిపించసాగాయి. అదేపనిగా గంటలు మోగుతుండడంతో ఊరిలో వాళ్లు ఉండబట్టలేక  లాంతర్లు తీసుకుని గుడి వైపుగా అడుగులు వేశారు. పచ్చ కర్పూరపు పరిమళాలు వెలువడుతుండడంతో అడ్డు వచ్చిన కంపను కొట్టివేస్తూ, ధైర్యంగా లోనికి వెళ్లారందరూ. అ గుడి పరిస్థితి ఎప్పటిలాగే ఉంది. వాళ్లు ఇంకొంచెం ముందుకు పోయి, లోపల ఏం జరుగుతోందో అని చూశారు.


అక్కడ ఆ అమాయకుడు గోడకు ఆనుకుని బిగ్గరగా శంఖం ఊదటం, గంట గొట్టడం, హారతి ఇవ్వడం కనిపించింది. ఎలాగూ ఇక్కడి దాకా వచ్చాము కదా అని జనాలందరూ కలసి నేల పరిశుభ్రం చేయడం మొదలు పెట్టారు. గుడిలో వింత ఏం జరుగుతోందో చూద్దామని వస్తున్న వారందరూ ఎవరికి అడ్డం వచ్చిన చెత్తను, కంపను వారు తొలగించుకుంటూ వస్తున్నారు. కొందరు బూజుకర్రలు తీసుకు వచ్చారు. ఇంకొందరు అదే వూపులో అక్కడ పాడుబడిన దిగుడు బావినుంచి, నీళ్లు తోడి తీసుకొచ్చి ఆలయ ప్రాంగణంలో నిండి పోయి ఉన్న చెత్తను తొలగించి, శుభ్రం చేయసాగారు. ఇలా తెల్లవార్లూ జరిగింది. గుడి ఎలాగూ శుభ్రపడింది కాబట్టి, గుడిలో దేవతా విగ్రహం లేకపోవడం అరిష్టం అని చెప్పి పంతులు గారి దగ్గర ముహూర్తం పెట్టించుకుని, మంచిరోజు చూసి గుడిలో దేవుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఎడతెరపిలేకుండా వస్తున్న విరాళాలు, శ్రమదానాలతో పూజలు, పురస్కారాలతో గుడి పునర్వైభవం సంపాదించుకుంది. ఆలయం, ఆలయ ప్రాంగణమూ శుభ్రంగా లేకపోవడం వల్లే కదా, అందరూ ఆ గుడిని దూరం పెట్టింది. ఆలయం శుభ్రం కావడంతోనే, గుడిలోకి దేవుడొచ్చేశాడు. మనసులోని మాలిన్యాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకుంటే గుండె గుడిలోకి కూడా దైవం ప్రవేశిస్తాడు. అయితే అందుకు ఎవరో ఒకరు పూనుకోవాలి.

దేవుడి గది


దేవుడి గది ఎలా ఉండాలి..?


ఇంటిలో దేవుడి పటాలకు, ప్రతిమలకు మనం పూజలు చేసుకుంటాం. గృహంలో దేవుడి గది ప్రత్యేకం. అయితే ఎవరి ఆర్ధిక స్ధోమతను బట్టి వారు దేవుడికి అలమరాలలో ఒక అరగాని, ప్రత్యేకించి ఒక మందిరంగాని లేదా ప్రత్యేకంగా ఒక గదినిగాని ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఇంటిలో ఎక్కడ వీలు దొరికితే అక్కడ దేవుడి గదిని ఏర్పాటు చేసుకోకూడదు. దేవుడి గది కోసం కూడా వాస్తును పాటించాల్సిందే. 


దేవుడికి ప్రత్యేకించి ఒక గదిని ఏర్పాటు చేయలనుకుంటే, ఈశాన్యం గదిని అందుకు వాడుకోవటం మంచిది. అయితే ఈశాన్యం గదిలో ఎత్తుగా అరుగుగాని మందిరం మాదిరి కట్టడంగాని నిర్మించుకూడదు. దేవుడి పటాలను ఈశాన్యం గదిలో దక్షణ, పశ్చిమ నైరుతిలలో పీట వేసిగాని, ఏదైనా మంచి వస్ర్తము వేసి దానిపై పటాలు, ప్రతిమలు వుంచి పూజించుకొనవచ్చును. 


పటాలను గోడకు వ్రేలాడదీయదలిస్తే దక్షిణ, పశ్చిమ గోడలకు వ్రేలాడదీయాలి. ఈశాన్యం గదిలో దక్షిణ, పశ్చిమగోడలలో గల అలమారలో కూడా దేవుణ్ణి వుంచవచ్చును. 


ఈశాన్యం గదిని దేవుడి గదిగా ఏర్పాటు చేయడం వీలుకాని పక్షంలో తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ, వాయవ్యాలలో దేవుడిగదిని ఏర్పాటు చేసుకోవచ్చు. నైరుతి ఆగ్నేయ గదులు మాత్రం దేవుడి గదులుగా చేయకండి. ప్రత్యేకించి దేవుడిగదిని ఏర్పాటు చేయటం అనుకూలం కాని పక్షంలో గృహములో ఏ గదిలోనైనా సరే (నైరుతి, ఆగ్నేయ, గదులలో అయిన సరే) అలమారలలోగాని, పీటమీదగాని దేవుడి పటాలు, ప్రతిమలు వుంచుకొని పూజించవచ్చు. 


అయితే దేవుడి పటాలు, ప్రతిమలు ఎటువైపు(ఏ దిక్కుకు) అభిముఖంగా వుండాలి? అనేది అనేకమంది ప్రశ్న కొందరు తూర్పు, ఉత్తరాలకు దేవుడు అభిముఖంగా వుండాలని, మరికొందరు పూజించేవారి ముఖము తూర్పు, ఉత్తరాలకు అభిముఖంగా వుండాలని చెబుతున్నారు. మీరు ఏ వైపుకు అభిముఖంగా వున్నా ఇందు వాస్తుకు సంబంధం లేదని, అది మనలోని భక్తికి సంబంధించినదని చెప్పవచ్చు. అయితే ధ్యానం చేసే అలవాటు వుంటే తూర్పుకు అభిముఖంగా వుండి ధ్యానం చేయటం ఉత్తమం. ఉత్తరాభిముఖము కావటం రెండవ పక్షంపై అంతస్తుల్లో కూడా పూజగదిని ఏర్పాటు చేసుకొనవచ్చును. 


దేవుని గది నిర్మాణంలో జాగ్రత్తలు


గృహ నిర్మాణంలో మిగతా వాటిలాగే పూజ గదికి కూడా వాస్తు ప్రాముఖ్యత వుంది. నిజానికి ఈశాన్యంలో పూజ గది ఉండాలని, ఈశాన్యం గదిని పూజ గదిగా ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఇది సరైన పద్ధతి కాదు. ఈశాన్యం గదిలో నుంచి రాకపోకలు వుండే విధంగా రెండు ద్వారాలు వుంచి బరువులు వుంచకుండా, పరిశుభ్రంగా వుంచుతూ వాడుకోవడం మంచిది. 


తూర్పు, ఉత్తర దిక్కులలో పూజా గదిని ఏర్పాటు చేసుకోవడంలో ఏ మాత్రం దోషం లేదని గ్రహించండి. దక్షిణ, పశ్చిమాల వైపు పూజ గదిని ఏర్పాటు చేయడం వల్ల ఇతర అవసరాల కోసం ఇంటిలో ఎక్కువగా తూర్పు, ఉత్తర భాగాలను వాడడం జరుగుతుంది. ఇది ఒక రకంగా శుభకరం అని గ్రహించండి. 


మరో ముఖ్య విషయం ఏమిటంటే.. పూజ గదికి ఎటువైపు కూడా అనుకుని బాత్ రూమ్ లేదా టాయిలెట్సు ఉండకూడదు. ఇదే విధంగా పూజ గది పైనగాని, కింద గాని టాయిలెట్సు, వుండకూడదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి పొరపాటు చేయకూడదు. వీటి విషయంలో అపార్ట్ మెంట్ లో ఉండే వారు జాగ్రత్తగా ఉండాలి. చాలా వరకు అపార్ట్ మెంట్స్ లో ఒకరి పూజ గది పైన ఇతరుల టాయిలెట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోకూడదు.


అలాగే పూజ గది మీద 'లో-రూఫ్' వేసి అనవసరమైన సామాను వేయడం చాలా మంది చేస్తుంటారు. ఇలా చేయకూడదు. పూజ గదిలో అరుగులు నిర్మించి దానిపై దేవుని పటాలను వుంచి పూజ చేసుకోవడం చాలా ఇళ్లల్లో అలవాటుగా వుంది. పూజ పటాలను అరుగులపై వుంచే కన్నా, కొయ్యపీట, మండపములో వుంచుకోవడం మంచిది. అరుగు మీద లేదా నేల మీద పూజ పటాలు వుంచినప్పుడు నేలపై కొత్త వస్త్రాన్ని ఏర్పాటు చేసి దానిపై పూజ పటాలను ఏర్పాటు చేయాలి. వట్టి నేలపై కూర్చొని పూజ చేయకూడదు. చాపగాని, వస్త్రముగాని వేసుకొని దానిపై కూర్చొని పూజా కార్యక్రమం నిర్వహించాలి. పూజా గృహంలో నిత్య దీపారాధన ఎంతో శుభకరం. 


ఇక చాలా మంది తమ పెద్దల ఫోటోలను దేవుని ఫోటోల పక్కన వుంచి పూజించడం అలవాటుగా వుంది. పెద్దల విషయంలో మనకున్న గౌరవానికి గాను వారి ఫోటోలకు ప్రత్యేకంగా వుండాలేగాని, పూజ గదిలో దేవుడి ఫోటోలతో సమంగా వుంచడం శుభకరమైన విధానం కాదు.

స్వస్తి🙏🙏🙏🙏

విడిచిన దుస్తుల్నే ధరిస్తే..?

 శుక్రవారం విడిచిన దుస్తుల్నే ధరిస్తే..? 


బియ్యం కొలిచే పాత్రను బోర్లిస్తే?


శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మీదేవిని ఉపాసన చేస్తే ధన సమృద్ధి కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి. సంపదలతో తులతూగాలి అనుకునే వారు శుక్రవారం పూట అష్టైశ్వర్యాలు ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించడం చేయాలి. ఇంకా ఇంట పసుపు, ఉప్పు అయిపోయాయనే మాట వినబడ కూడదు. పసుపును కొనాలి. లేదా ఉప్పును తేవాలి అని చెప్పడం చేయొచ్చు.


ఉప్పు, పసుపు అయిపోయేంతవరకు ఉపయోగించకూడదు. అవి అయిపోయే లోపు ఇంట తెచ్చుపెట్టుకోవడం చేయాలి. అలాగే ఇంట్లో అన్నం వండేందుకు ముందు బియ్యాన్ని కొలుస్తాం. ఆ కొలిచే పాత్రను ఎప్పటికీ బోర్లించకూడదు.


ఇంట సుఖసంతోషాలు, సిరిసంపదలు పొందాలంటే.. విడిచిన బట్టలను తలుపుకు వేలాడదీయకూడదు. విడిచిన బట్టలను రెండో రోజు, మూడో రోజు ధరించకూడదు. ప్రత్యేకించి శుక్రవారం నాడు విడిచిన దుస్తులు ధరిస్తే దరిద్ర్యం చుట్టుకుంటుందని ఆధ్యాత్మిక పండితులు హెచ్చరిస్తున్నారు.


* శుక్రవారం నాడు సాత్త్విక ఆహారాన్ని తీసుకోవాలి. పాలను వినియోగించాలి.

* శుక్రవారం పూట సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి, రంగ వల్లికలతో అలంకరించి.. దీపారాధన చేయాలి.

* రోజూ లేదా శుక్రవారం రాత్రిపూట కొద్దిపాటి అన్నాన్ని శేషంగా ఓ చిన్నపాటి గిన్నెలో వుంచి వంటింట్లో వుంచడం సంప్రదాయం. ఇలా చేస్తే పితరులు, దేవతలు ఆ ఇంట అన్నం ఎల్లప్పుడూ వుండుగాక అంటూ దీవిస్తారని ప్రతీతి.

* శుక్రవారం నుదుట బొట్టు ధరించే వారికి కలకాలం సౌభాగ్యం నిలిచివుంటుంది. ఇంకా స్టిక్కర్లను నుదుటన ధరించకుండా తెల్ల వక్కలతో తయారైన కుంకుమను శుక్రవారం ధరిస్తే మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శుక్రుని అనుగ్రహం కూడా లభిస్తుంది.

* తెల్ల వక్కలను, నేతిలో వేయించి చూర్ణం చేసి ఆ మిశ్రమానికి కస్తూరి పొడి, కుంకుమ పువ్వు పొడిని కలిపి చూర్ణం చేసుకుంటే కుంకుమ సిద్ధమవుతుంది. ఈ కుంకుమను నుదుటన ధరించడం ద్వారా సుగంధ భరితమైన సువాసనతో పాటు శుక్రుని అనుగ్రహం కూడా లభిస్తుంది. ధనవృద్ధి వుంటుంది.

* శుక్రవారం పూట తెల్లని వస్త్రాలను ధరించడం ఓ నియమం. తెల్లని వస్త్రాలంటే శుక్రునికి, మహాలక్ష్మీకి ప్రీతికరం. తెల్లని దుస్తులను శుక్రవారం ధరిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

* అలాగే శుక్రవారం పూట కమలములతో, కలువలతో లక్ష్మీదేవికి అర్చన చేసినట్లైతే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇంకా పుష్పాలను దానం చేసినా, అన్నదానం చేసినా, వస్త్ర దానం చేసినా శుభఫలితాలుంటాయి. కస్తూరిని మిత్రత్వం కోరి స్నేహితులకు అందించినా, శుక్రవారం వర్జ్యం వున్న సమయంలో మౌనవ్రతం పాటించినా ఆ ఇంట తప్పకుండా ధన సమృద్ధి కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు

ఇబ్బందులు



ముఖ్యమైన అంశాలు :-


 ఇల్లు అమ్ముడు పోక ఇబ్బందులు పడుతున్న వారు ఇంట్లో ఏదో ఒక గదిలో పసుపు రంగును వేయిస్తే ఆ ఇల్లు అతి తొందరగా మంచి దరకు అమ్ముడు అవుతుంది.


 భూ వివాదాలు ఏర్పడినప్పుడు ప్రతీ మంగళవారం తప్పనిసరిగా భార్యచేతి వంట లేదా స్వగృహంలోనే భోజనం చేయడం కొంత వరకు వివాదాలు తొలగి పోతాయి.


 సంతానం విషయం లో విచారంగా ఉన్న వ్యక్తులు కాళికాదేవికి నిమ్మకాయల దండను సమర్పించిన సంతానం వృద్ధి చెందుతారు , ఈ విధంగా 9 లేదా 11 వారాలు చేయాలి ప్రతీ మంగళవారం.


 మీ ఇంట్లో వివాహం ఆలస్యం అవుతున్న ఆడపిల్ల లేక వచ్చిన సంబంధం తిరిగి వెనక్కి వెళుతుంటే తలదువ్వుకున్నప్పడు వచ్చే చిక్కును జాగ్రత్తగా తీసి శనివారం రోజు పారే నదిలో వేయాలి.


 రహస్య శతృవులు ఉన్న వారు ఏడు ఎండుమిరపకాయలను ఎరుపు రంగు గుడ్డలో వేసి కట్టి దానిని తీసికొని వెళ్ళి ఇంటికి దూరంగా పారేయాలి. ఇది రాహుకాలం లో చేయడం వల్ల సరైన ఫలితాలు ఉంటాయి. ఇలా ఈ విధంగా చేసే సమయంలో మనసులో శతృ నివారణ జరగాలని అన్ని పనులు అనుకూలంగా అవాలని సంకల్పంతో కోరుకోవాలి.


 పంట దిగుబడి సరిగా రాని రైతులు పోలంలో భూసూక్త పారాయణం చేయిస్తే మంచి ఫలితాలు వస్తాయి.


 కార్తీక మాసం లో బ్రాహ్మణులకు ఉసిరికాయలు దానం చేస్తే దారిద్ర్యం తొలగిపోతుంది నాశనం అవుతుంది .


 అన్ని అర్హతలు ఉండి కూడా ఉద్యోగం రాకుండా నిరుద్యోగిగా ఉంటే తొమ్మిది పసుపు కొమ్ములను కాల్చి మసి చేసి ఆ బూడిదని పారే నీటిలో కలపండి.


భార్యాభర్తల మధ్య తరచు విభేదాలు , గొడవలు తగాదాలు ఏర్పడుతుంటే ప్రతీ రోజు ఇంటికి వెళ్లేటప్పుడు ఎలక్కాయను కుడి బుగ్గన పెట్టుకొని నములుతూ వెళ్ళడం ఉత్తమం.


ధీర్ఘకాలంగా అనారోగ్యం తో ఇబ్బందులు పడుతున్నా మీ వయసు ఎంత ఉందో అన్ని బొగ్గులను తీసుకుని పారే నీటిలో వదలాలి.


 ఏదైనా కార్యాలలో తరచూ ఆటంకాలు, పనులు మధ్యలోనే ఆగిపోతుంటే వినాయకుడిని గరికెతో ప్రతీ రోజు ఆరాధించాలి...లేక గణపతి తర్పణాలు చేస్తే ఇంకా మంచిది.


 మీ ఆదాయం చాలి చాలని విధంగా ఉంటే శుక్రవారం రోజున గులాబీ పువ్వును అత్తరులో ముంచి మీ పూజా మందిరంలో ఉంచండి. ఈ విధంగా ఆరు శుక్రవారాలు చేస్తే మీ సంపద గతం కంటే కొంచెం మొరుగ్గా ఉంటుంది.


అధికమైన ఋణభాధలతో మీరు బాధపడుతుంటే ప్రతి రోజూ ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు , ఇంట్లోకి వచ్చేటప్పుడు మీ కాలు గడపకు తగలకుండా జాగ్రత్త వహించాలి.


స్వస్తి🙏🙏🙏🙏

*విష్ణు సహస్ర నామ మహిమ

 🙏 *విష్ణు సహస్ర నామ మహిమ* 🙏


🍃🌺పూర్వం పూరీ నగరం లో జగన్నాధపురం లో ఒక మహా పండితుడు భార్య తో సహా ఒక పూరి గుడిసె లో నివాస ముండెడివాడు.


🍃🌺ఇతను శ్రీ మహావిష్ణువునకు పరమ భక్తుడు పూట గడవని దారిద్ర్యస్థితి అతనిది,


🍃🌺ప్రతి నిత్యమూ విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణ చేసి ఇతడు ఆ ఊరిలో మూడిళ్ల వద్ద భిక్షాటన కు వెళ్లేవాడు.


🍃🌺ఆ వచ్చినదానితో కుటుంబాన్ని పోషించుకునేవాడు .భార్య మాత్రం పరమ గయ్యాళి , దైవం పట్ల నమ్మకం లేనిది , ఎటువంటి నియమాలనూ పాటించనిది.


🍃🌺ఇంటి లో భార్య పోరు ఎంత ఇబ్బందిగా ఉన్ననూ ఇతడు హరి నామ స్మరణను  విడువలేదు.


🍃🌺ప్రతినిత్యమూ చేయుచున్న విధముగా ఆరోజు కూడా విష్ణుసహస్ర పారాయణము చేయుచుండగా భార్య వచ్చి భర్త తో " ఏమిటి చేస్తున్నావు ? " అని గద్దించి అడిగింది.


🍃🌺దానికి ఆ భర్త "విష్ణుసహస్ర నామాలను స్తోత్రం చేస్తున్నాన"న్నాడు. అందుకు ఆ భార్య " ప్రతీ రోజూ స్తోత్రం చేస్తూనే ఉన్నావు కదా ! ఏమి ఇచ్చాడు ఆ శ్రీమహావిష్ణువు ? అడుక్కోవడానికి భిక్షాపాత్ర తప్ప " అంది.


🍃🌺అక్కడితో ఆగక " ఏదీ ! నువ్వు చదువు తున్నదేమిటో చెప్పు" అన్నది.


🍃🌺అందుకు ఆ భర్త " వెయ్యి నామాలే ! ఏమిటి చెప్పేది ? నీకేమిటి అర్ధమౌతుంది ? ఎప్పుడూ పాడు మాటలే మాట్లాడే నీకు విష్ణుసహస్ర నామాలేమి అర్ధమౌతాయి ? " అన్నాడు.


🍃🌺ఆ భార్య మాట్లాడుతూ " వెయ్యి నామాలక్కరలేదు , మొట్ట మొదటిది చెప్పు చాలు " అన్నది.


🍃🌺అందుకు ఆ భర్త " విశ్వం విష్ణుః " అని ఇంకా చెప్పబోతూ ఉంటే భార్య " ఆపు అక్కడ ! దీనర్ధమేమిటో చెప్పు " అన్నది.


🍃🌺అందుకు ఆ భర్త " విశ్వమే విష్ణువు , ఈ ప్రపంచమంతా విష్ణుమయమే " అని వివరించగా " ప్రపంచమంతా విష్ణువే అంటున్నావు , 


🍃🌺అందులో నువ్వూ , నేనూ ఉన్నామా ? ఉంటే యాచిస్తే గాని తిండి దొరకని కటిక పేదరికాన్ని  అనుభవిస్తూ , పూరిగుడిసె లో జీవితాంతం దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉండి కూడా ప్రతీ రోజూ నువ్వు ఆ శ్రీమహావిష్ణువుని గానం చేస్తున్నావే ? అయినా నీ విష్ణువు నిన్నేమైనా కరుణించాడా ? కనుక నువ్వు చెప్పిన మంత్రానికి అర్ధం లేదయ్యా ! " అంది.


🍃🌺భార్య మాటలకు సందేహంలో పడిన భక్తుడు " నా భార్య మాటలు కూడా నిజమేనేమో ? విశ్వమంతా విష్ణువే ఐతే మా పరిస్థితి ఇలాగ ఎందుకు ఉండాలి ?


🍃🌺కనుక " ఈ మంత్రంలో విశ్వం" అనే పదాన్ని చెరిపేస్తానని నిశ్చయించుకుని ఒక బొగ్గు ముక్కతో ఆ " విశ్వం" అనే పదాన్ని కనబడకుండా మసి పూసి ( తాటాకు ప్రతి ఉండేదిట ఈ భక్తుడి ఇంట్లో ) ఎప్పటిలాగే యాచన కై బయలుదేరి వెళ్లి పోయాడట


🍃🌺ఆ తరువాత వైకుంఠంలో ఒక విచిత్రం జరిగింది . 


🍃🌺ప్రతినిత్యమూ పాల సముద్రంలో శ్రీమహావిష్ణువును శ్రీమహాలక్ష్మి సేవిస్తున్నట్లుగనే ఆరోజు కూడా స్వామిని సేవిస్తూ ఒకసారి స్వామి ముఖాన్ని చూసి అమ్మవారు ఫక్కున నవ్విందిట ! 


🍃🌺అందుకు శ్రీమహావిష్ణువు " ఏమిటి దేవీ ? ఈరోజు నన్ను చూసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు ? " అని అడిగితే అమ్మవారు 


🍃🌺" నాధా ! మిమ్ములను నల్లని వాడని , నీల మేఘ శ్యాముడని అందరూ స్తుతించడం విన్నాను కానీ అంత మాత్రంచేత ఆ నల్లటి రంగును ముఖానికి కూడా పూసుకోవాలా " అని పరిహాసమాడగా....


🍃🌺శ్రీమహావిష్ణువు తన ముఖాన్ని పాల సముద్రంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటే తన ముఖానికి పూసిన నల్లరంగు కనబడిందిట.


🍃🌺వెంటనే శ్రీ మహా విష్ణువు జరిగినదంతా దివ్యదృష్టి తో గమనించాడుట. లక్ష్మీదేవి " ఏమిటి స్వామీ ఆలోచిస్తున్నారు ? మీ ముఖము పై ఆ నల్లరంగుకు గల కారణమేటో తెలిసినదా ?" యని అడుగగా స్వామి,


🍃🌺" దేవీ ! ఇది నా పరమ భక్తుడు చేసిన పని " యని పలికాడుట. లక్ష్మీదేవి " అదేమిటి స్వామీ ! పరమ భక్తుడంటున్నారు ? అతడెందుకిలా చేస్తాడని యడుగగా స్వామి తన భక్తుని జీవితదీన స్థితిని వివరించగా ....


🍃🌺లక్ష్మీదేవి " అంతటి పరమ భక్తుని దీనస్థితికి కారణమేమి ? మీరాతనిని ఉద్ధరింపలేరా ? స్వామీ ! " అని యడుగగా " 


🍃🌺దేవీ ! గత జన్మలో ఈ భక్తుడు గొప్ప ధనవంతుడే ఐనప్పటికీ ఎన్నడూ ఎవరికీ దానమిచ్చి యెరుగడు కనుకనే ఈ జన్మలో భక్తుడైననూ దరిద్రమను భవించుట తప్పలేదు .


🍃🌺అయిననూ నీవు కోరితివి కనుక నేటితో ఇతనికి కష్టములు తొలగించెదన" ని పలికి,


🍃🌺మానవ రూప ధారియై ముఖానికి వస్త్రము చుట్టుకొని విష్ణుమూర్తి కొంతమంది పరివారంతో సరాసరి భక్తుడి ఇంటికి వచ్చి తలుపు తట్టగా అప్పటికే ఆ భక్తుడు యాచనకై ఇల్లు వదిలి పోయాడు. 


🍃🌺ఇంటి ఇల్లాలు వచ్చి తలుపు తీయగా ఎదురుగా మారువేషము లోనున్న శ్రీ మహా విష్ణువు ఆ ఇల్లాలితో " అమ్మా ! నీ భర్త వద్ద నేను అప్పుగా తీసుకున్న సొమ్ము ను తిరిగి తీర్చుటకు వచ్చితిని , 


🍃🌺సొమ్మును తీసికొన వలసినదని చెప్పగా ఆ ఇల్లాలు " నీవెవరవో నాకు తెలియదు కానీ మేమే కటిక దారిద్ర్యంలో ఉన్నాము , నా భర్త ఒకరికి అప్పు ఇచ్చేంత ధనవంతుడు కాదు , 


🍃🌺ఎవరనుకుని మా ఇంటికి వచ్చారో, వెళ్లిపోమ్మని తలుపు వేయబోతూ ఉండగా స్వామి లేదమ్మా ! 


🍃🌺నేను పొరబాటు పడలేదు , అసత్యమసలే కాదు , నీ భర్త వద్ద అప్పు గా తీసుకున్న సొమ్ము ఇదిగో ! నువ్వు స్వీకరించు , 


🍃🌺నీ భర్త కు నేను తరువాత వివరిస్తానని ఆమెకు అశేష ధన , కనక , వస్తు వాహనాలు , మణి మాణిక్యాలు , సేవక జనం, తరాలు తిన్నా తరగని ఆహార ధాన్యాలూ కానుకలుగా ఇచ్చి వెళ్లిపోబోతూ ఉండగా....


🍃🌺ఆ ఇల్లాలు  ఓయీ ! నీ ముఖం మీద కప్పియున్న వస్త్రాన్ని తొలగించి నీ ముఖాన్ని నాకు ఒకసారి చూపించు ! నా భర్త కు చెప్పాలికదా ! నువ్వు ఎలా ఉంటావో ? అని పలుకగా....


🍃🌺స్వామి  అమ్మా ! నా ముఖాన్ని నీకు చూపలేను , నా ముఖం మీద ఎవరో నల్లరంగు పూశారమ్మా ! నేనెవరో నీ భర్తకు తెలుసులే !" అని పలికి విష్ణుమూర్తి వెనుదిరిగి వెళ్లి కొంతదూరం పోయాక అంతర్ధాన మైనాడు.


🍃🌺ఇంతలో ఊరిలో యాచనకు వెళ్లిన భక్తుడు ఇంటికి తిరిగి వచ్చి చూడగా అతని పూరిగుడిసె ఉండాల్సిన ప్రదేశంలో కళ్లు మిరుమిట్లు గొలిపే అద్భుతమైన భవంతి దర్శనమిచ్చింది , అనేకమంది సేవకులూ , ఉద్యానవనాలతో కళ కళలాడిపోతోంది ఆ భవనం. 


🍃🌺ఇంతలో ఇతని భార్య లోపలి నుండి వచ్చి " లోపలికి రమ్మని భర్తని ఆహ్వానించగా , ముందు తన భార్యని గుర్తుపట్ట లేకపోయాడు , 


🍃🌺అసలు ఆ సంపదని ఎందుకు స్వీకరించావు ? మనము ఎవరికో అప్పివ్వడమేమిటి ? అది తిరిగి వారు తీర్చడమేమిటి ? మన దీన స్థితి నీకు తెలియనిదా ? 


🍃🌺అంటూ భార్య పై ప్రశ్నల వర్షం కురిపించగా అనంతరం జరిగినదంతా భార్య నోటివెంట విన్న తరువాత తన కళ్లను , చెవులను తానే నమ్మలేకపోయాడు.


🍃🌺అయితే ఆ వచ్చినవాడు ఎలా వున్నాడు ? అతడి ముఖము ఎలాగ ఉన్నది ? అని భార్యని ప్రశ్నించగా....


🍃🌺నేను అతడి ముఖాన్ని చూడ లేదు , అతడి ముఖం పై ఎవరో నల్లని రంగు పులిమారట , ముఖము చూపించ లేనంటూ వస్త్రంతో ముఖాన్ని కప్పుకున్నాడు , అయినా అతడు వెళుతూ వెళుతూ నాగురించి నీ భర్త కు పూర్తిగా తెలుసమ్మా అని చెప్పి వెళ్లిపోయాడన్నది . 


🍃🌺అది వినిన భక్తుడు హతాశుడై భార్యతో " వచ్చినవాడు మరెవరో కాదు , మారువేషంలో వచ్చిన సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే ! ప్రతి నిత్యమూ నేను విష్ణువును స్తుతిస్తున్నా ఆ స్వామిని నేను దర్శించ లేకపోయాను,


🍃🌺ఏ జన్మ లో చేసుకున్న పుణ్యమో నీకు స్వామి దర్శన భాగ్యం కలిగింది" అని పలికి ఇంటి లోపలికి వెళ్లి ఉదయము విష్ణు సహస్రనామాలలో  మొట్టమొదటి " విశ్వం " అనే నామంపై పులిమిన  నల్లరంగును తొలగించాడు . 


🍃🌺తరువాత భార్య తో " నీతో మాట్లాడిన తరువాత ఆ వ్యక్తి ఏ దిక్కుగా పోయినాడు  అడగగా భార్య చెప్పిన దిక్కుగా భక్తుడు బయలుదేరి పోవగా సముద్రము ఒడ్డుకు చేరుకున్నాడు.


🍃🌺అక్కడ సముద్రం వైపునకు తిరిగి ఊర్ధ్వదిక్కుగా చేతులు జోడించి శ్రీమహావిష్ణువు నుద్దేశించి స్తోత్రగానం చేశాడు . 


🍃🌺అప్పుడు అశరీర వాణి " భక్తా ! పూర్వ జన్మ కర్మఫలముల కారణంగా ఈ జన్మ లో నీకు భగవద్దర్శనము కలుగదు , మరణానంతరం నీవు వైకుంఠానికి చేరి జన్మరాహిత్యాన్ని పొందెదవు " అని పలికినది.


🍃🌺విష్ణు సహస్త్రనామ నిత్యపారాయణ వలన కలుగు ఫలిత మిదియని అందరూ గ్రహించండి , ప్రతి నిత్యమూ పఠించండి , అవసరార్ధులకు సహాయం చెయ్యండి.


🙏 *ఓం నమో వేంకటేశాయ* 🙏


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


సేకరణ .

రాసినవారికికృతజ్ఞతలు .

మోకాళ్ళ నొప్పులు

 _🅱️➕ 

నిలబడి నీళ్ళు త్రాగే వారికి మోకాళ్ళ నొప్పులు వస్తాయి. నిలబడి నీళ్ళు త్రాగే వారి మోకాళ్ళ నొప్పిని ప్రపంచంలో ఏ డాక్టర్ బాగు చేయలేడు. కాబట్టి,  కూర్చుని త్రాగండి.

🅱️ ➕ 

వేగంగా తిరిగే ఫ్యాన్ గాలి క్రింద లేదా A. C.లో పడుకుంటే శరీరం పెరిగి లావై పోతారు.

🅱️ ➕ 

70% నొప్పులకు ఒక గ్లాసు వేడి నీళ్ళు చేసే మేలు నొప్పి తగ్గించే మాత్రలు ఏవీ కూడా అంతగా చేయవు.

🅱️ ➕ 

కుక్కర్లో పప్పు మెదుగు తుంది, ఉడకదు. అందుకే గ్యాస్ మరియు ఎసిడిటీ వస్తుంది.

🅱️ ➕ 

అల్యుమినియం పాత్రల ప్రయోగం బ్రిటీష్ వాళ్ళు భారతీయ దేశభక్తులైన ఖైదీలని అనారోగ్యం పాలు చేయటానికి వాడేవారు.

🅱️ ➕ 

షర్బతు మరియు కొబ్బరి నీళ్ళు ఉదయం 11 గం. లోపు త్రాగితే అమృతం వలే పనిచేస్తాయి.

🅱️ ➕ 

పక్షవాతం వచ్చిన వెంటనే రోగి ముక్కు👃లో దేశవాళి ఆవు నెయ్యి వేస్తే 15 నిమిషాల్లో  బాగవుతారు.

🅱️➕ 

దేశవాళి ఆవు శరీరం పైన చేతి✋ తో నిమిరితే 10 రోజుల్లో బ్లడ్ ప్రెషర్ నయమౌ తుంది. పక్షవాతం రాదు.

🅱️➕ 

ఈ మంచి మాటలు, మంచివారికి, తమకు ఇష్టమైన మిత్రులకు, బంధువులకు మరియు గ్రూపులో తప్పక షేర్ చేయండి. ఈ విధంగా నైనా మనం ఒకరి జీవితం రక్షించిన వారమవుతాం.

😇 !!!!! ధన్యవాదములు !!!!!

Yoga

     This is one of the best messages in my New Yoga Book edition       


పురుషార్థాలు నాలుగు ఉన్నాయి. అవి ధర్మం, అర్థం, కామం, మోక్షం. వీటికి సనాతన ధర్మంలో ఉన్నత స్థానమిచ్చారు. ఇవి వేర్వేరుగా ఉన్నా ఒక దానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. మొదటిదైన ధర్మంతోనే మిగతా మూడింటిని లగింపు చేసుకోవాలని పెద్దలు అంటారు. ధర్మాలు పాటించటమే కాక అర్ధ సంపాదన ధర్మంగా  ఉండాలని, కామం ధర్మ బద్ధమైనదే అయి ఉండాలని, ధర్మంగానే మోక్ష సాధనకు కృషి చేయాలన్నది దీనిలో అంతర్గతంగా ఉన్న మరో అర్థమని వారు చెబుతుంటారు. ధర్మా చరణ అంటేనే అన్ని పనులు ధర్మబద్ధంగా చేయడమని, ధర్మ కార్యాలను ఆచరించేటపుడు కలిగే 

 కష్ట నిషురాలను సహిస్తూ వెనుకంజ వేయక ఆయా కార్యాలను పూర్తి చేయడం ధృతి అనబడుతుంది. ధర్మాన్ని ప్రాణాపాయ స్థితిలో కూడా విడవరాదని మనువు అంటాడు.  

                                              yogamurthy

సహనం

 సహనం


🍁🍁🍁🍁


🪴మనిషికి తొందరపాటు ఎక్కువ. అనుకున్నది వెంటనే చేసేయాలనుకుంటాడు.


🪴మనిషికి భయం ఎక్కువ. ఆపద కలగగానే డీలా పడిపోతాడు


🪴మనిషికి ఆవేశం ఎక్కువ. ఇతరులపై కోపం కలగగానే అక్కసు వెళ్లగక్కుతాడు.


🪴మనిషికి నిరాశ ఎక్కువ. బాధ కలగగానే కుమిలిపోతాడు.


🪴మనిషికి దురాశ ఎక్కువ గుడికి వెళ్ళి ఒక్క సెకనుసెకను దణ్ణం పెడతాడు. తరతరాలు కూర్చుని తింటే తరగని సంపదని కోరతాడు.


🪴మనిషికి సహనం తక్కవ ఒక్క రోజు ధ్యానం చేస్తాడు నేను బుద్ధుడు ను కావాలి అంటాడు.


🪴ఒక్కరోజు ధ్యానం చేస్తాడు నాకు ఆరోగ్యం కావాలి అంటాడు.


🪴ఆరోగ్యం రాకపోతే ఫోటోలు మారుస్తాడు గుళ్ళు మారుస్తాడు.  మతాలు మారుస్తాడు. దేవుళ్ళను మారుస్తాడు.


🪴దేనికీ కుాడా సహనం ఉండదు మానవునకు.

అందుకే అన్నారు పత్రీగారు సహనమే ప్రగతి అని


🪴మనకు ఏదైతే కావాలో దానికోసం సాధన ఎంతైనా అవసరం.


🪴అయితే...సాధనతో పాటు కాస్తంత ‘సహనం’తో నిరీక్షిస్తే అంతిమంగా ‘విజయం’ సాధించవచ్చు.


🪴సహనం ఒక నిగ్రహశక్తి, ఒక మానసిక పరిపక్వత గల స్థితి.


 🪴సహనమనేది నీగమ్యాని కి నిన్ను చేర్చే మార్గం


 🪴ముఖ్యంగా కష్టసమయాల్లో ఏదైనా ఉద్వేగాన్ని దాటవేయాలన్నా, వాయిదా వేయాలన్నా సహనం తప్పనిసరి.


 🪴ఎదుటి మనిషి నుంచి మనకు దేని కారణంగా ఒత్తిడి కలుగుతుందో, అందులోకి మనం కలసిపోవడం.


🪴అంటే ఎదుటివారిలోని ఏ గుణం మనకు కోపాన్ని తెప్పించి, సహనాన్ని పోగొడుతుందో దానిని మనలోకి ఆవహింపచేసుకోవడమే సహనం.


🪴మరి దీని కోసం ధ్యాన సాధన అవరం.


🪴మరి మనమందరమూ సహనంతో ధ్యాన సాధనచేద్దాం.మన గమ్యాన్ని మన చేరుదాం.




🌸జై శ్రీమన్నారాయణ🌸


🍁🍁🍁🍁

ప్రాణ “ 5వ భాగము

 *🧘‍♂️“ ప్రాణ “ 5వ భాగము🧘‍♀️*

🕉️🌞🌏🌙🌟🚩


*1) ప్రతి జీవి యొక్క ఆయుర్దాయము శ్వాసలపై ఆధారపడి ఉంటుంది – ఏ జీవికి శ్వాసలు తక్కువగా ఉంటాయో ఆ జీవికి ఆయుష్షు ఎక్కువగాను , ఏ జీవికి శ్వాసలు ఎక్కువగా ఉంటాయో – ఆ జీవికి ఆయుష్షు తక్కువగాను ఉంటుంది – ప్రతి జీవికి జీవిత కాలములో ఇన్ని శ్వాసలు తీసుకోవాలని – ఆ శ్వాసల సంఖ్యను ఆ సృష్టి కర్త ముందే నిర్ణయిస్తాడని మన పెద్దలు అంటూ ఉంటారు – ఆ ఇచ్చిన శ్వాసలను ( కోటా లేదా రేషన్ ) త్వరగా తీసేసు కున్నట్లయితే మనము త్వరగా పైకి వెళ్లి పోతాము – అదే శ్వాసలను పొదుపు చేసుకుంటూ , దీర్ఘముగా గతులు నడిపినచో తక్కువ శ్వాసలను రోజుకి తీసుకుంటూ ఉంటే ఎక్కువ కాలం జీవించవచ్చు – > మనిషికి నిమిషానికి 16 నుండి 18 శ్వాసలు ఉంటాయని ఆధునిక వైద్య శాస్త్రములో వ్రాసి ఉంటుంది – మనిషి నిమిషానికి 18 శ్వాసలు తీసుకుంటే ఎంత ఆయుష్షు ఉంటుందో ఆలోచిద్దాము.*



*నిమిషానికి 18 శ్వాసలు అయితే ఒక గంటకు 1080 శ్వాసలు అవుతున్నాయి – ఈ లెక్కన రోజుకి 25,920 శ్వాసలు అవుతున్నాయి – ఇన్ని శ్వాసలు రోజుకి తీసుకుంటే మనిషి ఆయుషు 80 స౦వత్సరాలు అని చెబుతారు – మనకు తెలిసి మనిషి పూర్తి ఆయుషు 100 సంవత్సరాలు – అలా అంతకాలము మనము జీవించాలంటే నిమిషానికి 15 శ్వాసలు కంటే తక్కువగా తీసుకోగలిగితే రోజుకి 21,600 శ్వాసలు అవుతున్నాయి – > నిమిషానికి 15 శ్వాసలతో మనిషి 100 సంవత్సరాలు పూర్తిగా జీవించవచ్చని శాస్త్రం చెబుతుంది.*



*ప్రస్తుతము భారతీయుడి సగటు ఆయుర్దాయం 55 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలుగా నిర్ణయించడమైనది –అంటే ప్రస్తుతము మన శ్వాసలు 21 నుండి 22 వరకు నిమిషానికి నడుస్తున్నాయి- దీన్ని బట్టి నిమిషానికి 21 శ్వాసలు చొప్పున రోజు మొత్తములో 30 , 240 శ్వాసలు తీసుకుంటున్నాడు – అంటే రోజుకి 8,640 శ్వాసలు ఎక్కవ సార్లు తీసుకోవడము వలన ఆయుర్దాయం 100 సంవత్సరాల నుండి 55 ,60 సంవత్సరాలకు వచ్చేసింది – మరికొంతమంది నిమిషానికి 25, 28 శ్వాసలు తీసుకునే వారు కూడా ఉంటారు- అలాంటి వారు ఇంకా ముందే కాలం చేస్తారు.*



 *– శ్వాసలను బట్టి జీవుల ఆయుషు ఏ విధంగా ఉంటుందో చూడండి -*


*1) కుక్క – నిమిషానికి 28-30 శ్వాసలు తీసుకుంటే – దాని ఆయుష్షు 14 సంవత్సరాలు.*


 *2) గుఱ్ఱం –నిమిషానికి 20-22 శ్వాసలు తీసుకుంటే – దాని ఆయుషు 40 సంవత్సరాలు.*


 *3) మనిషి – నిమిషానికి 15-16 శ్వాసలు తీసుకుంటే – అతని ఆయుషు 100 సంవత్సరాలు.*


*4) పాము –నిమిషానికి 7-8 శ్వాసలు తీసుకుంటే – దాని ఆయుషు 150 సంవత్సరాలు.*


 *5) తాబేలు – నిమిషానికి 4-5 శ్వాసలు తీసుకుంటే – దాని ఆయుషు 200-300 సంవత్సరాలు.*



 *మన బుషులు ప్రాణాయామము ద్వారా దీర్ఘ శ్వాసలు అలవాటు చేసుకొని దీర్ఘ కాలం జీవించడం తెలుసుకున్నారు – 200 ,300 సంవత్సరాలు తేలికగా జీవించ గలిగారు – వారు నిమిషానికి 5,6 శ్వాసలు తీసుకునేవారని చరిత్రలో చాల గ్రంథాలలో వుంటుంది – నిమిషానికి 4 శ్వాసలతో గడిపేవారు కూడా వుంటారు.*



*శ్వాసలకు , గుండెకు అవినాభావ సంబంధము వుంది – ఒక శ్వాసకు 4 సార్లు గుండె కొట్టుకుంటుంది – అంటే 1:4 అని అర్ధం – శ్వాసలను తగ్గిస్తే గుండె కొట్టు కోవడము కూడా తగ్గుతుంది – మన లెక్క ప్రకారము నిమిషానికి 22 శ్వాసలు అంటే 88 సార్లు గుండె కొట్టు కొంటుంది అని అర్ధం – ఎక్కువ సార్లు గుండె కొట్టుకుంటే ఆయుషు తక్కువై పోతుంది – > మన ఆయుష్షు అనేది శ్వాసలను బట్టి ఆధార పడివుంది.*



*కాబట్టి తక్కువ శ్వాసలను తీసుకుంటే మంచిది – తక్కువ శ్వాసలలో ఎక్కువ గాలిని పీల్చుకో గలిగితే మనకు ఆయుర్దాయము పెరగడమే కాకుండా , ఆరోగ్యము , ఆనందము ,నిర్మలత్వము మొదలగునవి కూడా లభిస్తాయి – జీవితము ఎంతో సుఖమయంగా సాగుతుంది – ఇలాంటి ఆనందమయ దీర్ఘ కాలపు జీవనానికి దీర్ఘ ప్రాణాయామము ఎంతో సహాయము చేయగలదు.*



*బ్రహ్మంగారి కాలా జ్ఞానములో మనిషికి పూర్తి ఆయుష్షు ఇంకా రాను రాను దిగజారి ప్రస్తుతం ఉన్న 55 సంవత్సరాల నుండి 16 స౦వత్సరాల దిగజారుతుంది అని చెప్పబడింది – అలాంటి పరిస్థితి ఏర్పడకుండా దీర్ఘ ప్రాణాయామాన్ని తోడు చేసుకొని , ఆహార నియమాలను పాటిస్తే మనిషి ఈ వాతావరణ పరిస్థితులలో కూడా 100 సంవత్సరాల పైబడి ఆరోగ్యంగా జీవించ వచ్చు – అలాంటి చక్కని జీవనాన్ని అలవాటు చేసుకునే ప్రయత్నం చేద్దాము.*




*2) శ్వాసలకి, మనస్సుకి ఉన్న సంబంధం :- శ్వాసలకి, మనస్సుకి చాల దగ్గర సంబంధం ఉంది – ఈ రెండింటిని సంబ౦ధం ఎలాంటి దంటే గాలికి, అగ్నికి ఉన్న సంబంధం లాంటిది – గాలి పెరిగితే అగ్ని పెరుగుతుంది – అదేవిధముగా శ్వాసలు పెరిగితే మనస్సు చంచలంగా ఉంటుంది – గాలి నిలకడగా ఉంటె అగ్ని నిలకడగా ఉంటుంది – అలానే శ్వాసలు స్థిరంగా ఉంటె మనస్సు స్థిరంగా ఉంటుంది.*



*నిమిషానికి 15 శ్వాసల కంటే తక్కువ తీసుకో గలిగినప్పుడు మనస్సు నిర్మలంగా ఉంటుంది – నిమిషానికి 18 అంతకంటే ఎక్కువ అయినప్పుడు అలజడిగా – ఆలోచనలు ఎక్కువగా వస్తూ – ప్రశాంతత లోపిస్తుంది – శ్వాసలు తగ్గితే మనస్సు బాగుంటుంది – మనస్సు బాగుంటే శ్వాసలు తగ్గుతాయి – అలాగే శ్వాసలు పెరిగితే మనస్సు బాగోదు – మనస్సు బాగోపోతే శ్వాసలు మరల పెరుగుతాయి – మనస్సుకి – శ్వాసలకు ఉన్న అవినాభావా సంబంధం అటువంటిదన్న మాట – > ఈ సత్యాన్ని గ్రహించిన మన యోగులు మనస్సును అరికట్టాలంటే శ్వాసలను అరికడితే సరిపోతుందని చెప్పారు.*



*గౌతమ బుద్దుడు కుడా ఈ విషయాన్ని తెలుసుకొని శ్వాస ద్వారా మనస్సును – ఆలోచనలను స్వాధీనము చేసుకోవచ్చనే ధ్యాన ప్రక్రియను అమలు చేశాడు – గాలి పీల్చేటప్పుడు – వదిలేటప్పుడు మనకు తెలుస్తున్నది అంటే ఆ సమయములో మనస్సుకు నిలకడ తక్కువగా ఉంటుంది – > ఉచ్వాస, నిశ్వాసాలు వల్ల మనకు తెలియనంతా నెమ్మదిగా – దీర్ఘంగా గతా గతులు జరిగేటప్పుడు మనస్సు అతర్ముఖం అవుతుంది – ఆ స్థితిలో మన మనస్సు ఎలా చెబితే అలా వింటుంది – మన మనస్సుకు ఇలాంటి స్థితి రావాలంటే – శ్వాస క్రియలో మార్పు రావాలి – ధ్యానము చేయడం ప్రారంభించిన 5, 10 నిమిషాలలో కొంతమంది భాహ్య ప్రపంచాన్ని వదిలి వేస్తారు – ఆ స్థితిలో వారి శ్వాసలు అంత నెమ్మదిగా తెలియకుండా జరుగుతాయి – ఆ సమయములో శ్వాసల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది.*



*ఆహార నియమాలు బాగా పాటిస్తూ ధ్యానం చేసేవారికి ధ్యానములో 8 నుండి 10 శ్వాసలు మాత్రమే  నడుస్తాయి – ఇంత తక్కువ సంఖ్యలో శ్వాసలు నడిస్తే ఆ ధ్యానం నుండి లేవబుద్ధి కాదు – > ఒక ఆవును ఎటూ పరుగులు తీయకుండా కట్టి వేయాలంటే గట్టి తాడు ఒకటి ఉంటే  సరిపోతుంది – అలాగే పరిగెత్తే కోతిలాంటి మనస్సును కట్టి వేయాలంటే తక్కువ శ్వాసలతోనే అది సాధ్యం – ఏపూట మీలో బాగా తక్కువ శ్వాసలు నడుస్తూ ఉంటాయో ఆ పూట మీకు తెలియకుండా మనస్సు స్థిరంగా ఉంటుంది – ఎప్పుడూ శ్వాసలు పెరుగుతాయో అప్పుడే బద్ధకం, నీరసం, మత్తు మొదలగునవి మీకు తెలియకుండా వచ్చేస్తాయి.*




*3) ఈ రహస్యాన్ని గ్రహించిన మన పూర్వికులు మనస్సును చెప్పు చేతుల్లో ఉంచుకొని మానసిక – శారీరక సౌఖ్యాలను పొందడం కోరకు ఆహారాన్ని యుక్తమైనది తినేవారు – అనుకూలమైన ఆహారాన్ని తీసుకొని ఆనందాన్ని పొందగలిగే వారు – దీని ద్వారా శ్వాస క్రియ మనకు తెలియకుండా 24 గంటలు ప్రశాoతంగా సాగుతుంది.*



*మనము ఇప్పటి వరకు శ్వాస క్రియ తగ్గితే మనస్సు ఎలా అణిగి ఉంటుందో తెలుసుకున్నాము – అలాగే ఇప్పుడు మనస్సు అదుపు తప్పితే శ్వాస క్రియ ఎలా తప్పుతుందో తెలుసుకుందాం – > మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు శ్వాస క్రియ కూడా బాగా నెమ్మదిగా నడుస్తుంది – ఎప్పుడైతే మనస్సులో అలజడులు ప్రారంభం అవుతాయో అక్కడ నుండి శ్వాస క్రియ ఎక్కువ సార్లు తీసుకోవడం మొదలవుతుంది – కోపాలు వచ్చినప్పుడు, పోట్లాడుకున్నప్పుడు, భయం వేసినప్పుడు వెంటనే శ్వాసలో మార్పు వచ్చి ఎగ శ్వాస నడుస్తుంది – అంటే శ్వాస తీసుకొనేటప్పుడు గుండె, ఛాతీ పైకి బాగా లేస్తూ దిగుతూ ఉంటుంది – అప్పుడు శ్వాసలు సుమారుగా నిమిషానికి 25 నుండి 30 వరకు ఉంటాయి – ఛాతీ అలా ఎగరడాన్ని ఎవరిలో మనం చూసిన మనస్సు అలజడిలో ఉన్నాడని తేలిపోతుంది – మనస్సులో ఇలాంటి ఆందోళనలు చేలరేగిన వెంటనే రక్తంలోనికి “ ఎడ్రినలిన్ ” అనే హార్మోను విడుదల అవుతుంది – ఆ హార్మోను ప్రభావం వలన గుండె కండరాలు సంకోచిoచుకుంటాయి – గుండె వెంటనే దడదడా కొట్టుకుంటూ ఉంటాయి – ఎప్పుడైతే గుండె ఎక్కువగా కొట్టుకుంటుందో దానికనుగుణంగా శ్వాస క్రియ పెరుగుతుంది – నిమిషానికి 100 సార్లు గుండె కొట్టుకుంటే 25 సార్లు శ్వాసలు ఆడతాయి – ఇంకా భయం, గొడవ ఎక్కువవగా ఉంటె 150 నుండి 200 సార్లైనా గుండె కొట్టుకుoటుంది – అప్పుడు పై శ్వాసలు నడుస్తూ, నిమిషానికి 40, 50 సార్లు ఊపిరి తిత్తులు కొట్టుకుంటూ ఉంటాయి – ఇలా శ్వాసలు పైపైన ఉన్నప్పుడు సరిపడినంత ప్రాణవాయువు రక్తానికి చేరదు – అందుకే కోపాలు, చిరాకులు వచ్చినప్పుడు మనకు తెలియకుండా నీరస పడిపోతాము – ఇలాంటి పోట్లాటలు, కోపాలు, చిరాకులు, భయాలు మొదలగునవి రోజాలో ఒక్కసారి వస్తే ఆ హార్మోను ప్రభావం రక్తంలో ఎన్నో గంటలు ఉండి – శ్వాస క్రియను, గుండె పని తీరును పూర్తిగా మార్పు చేస్తాయి – అందు చేతనే మన పెద్దలు తన కోపమే తన శత్రువు అంటారు – కోపమనేది శ్వాస క్రియకు ముఖ్యముగా ఎంతో హాని కల్గిస్తుంది – శ్వాసలు తగ్గితే మనిషికి కోపము తగ్గిపోతుంది – కోపములో ఉన్న మనిషి ఇలా అంటూ ఉంటాడు – నాకు కనుక కోపము వచ్చిందటే నేను మనిషిని గాదు – నేను ఏమి చేస్తానో నాకే తెలియదు – మనిషిని పశువును చేసేది కోపమే – మనమేమిటో కూడా మనకు తెలియ కుండా చేస్తుంది – ఎవరు మనల్ని ఎలాంటి మాటలన్న పట్టించుకోక పొతే మనము బాగుపడుతాము.*



*ఒక తడవ బుద్దుడిపై చాలామంది వెళ్లి చాలాసేపు తిడుతుంటారు – బుద్దుడు ఏమి జవాబు చెప్పడు – అప్పుడు వారంటారు ఇంత సేపటి నుండి తిడుతున్నా నీకు అవి ఎక్కడము లేదా ? నీవు అసలు మనిషివా కాదా ? అని గట్టిగా అరుస్తారు – అప్పుడు బుద్దుడు ఇలా చెపుతాడు – “ మన ఇంటికి అతిధి వచ్చినప్పుడు మనము ఆహ్వానిస్తే లోపలకు వస్తాడు లేదా ఆహ్వానించక పొతే తిరిగి వెనక్కి వెళ్లి పోతాడు గదా ! – అలాగే మీరన్న మాటలను నేను స్వీకరిస్తే అవి నన్ను చేరి బాధిస్తాయి – లేదా నాలో కోపాన్ని పెంచుతాయి – నేను మీరన్న మాటలను స్వీకరించడము లేదు – అప్పుడు అతిథి తిరిగి వెనక్కి వెళ్ళినట్లుగానే ఆ మాటలు మిమ్మల్ని చేరతాయి తప్ప నన్ను ఏమి చేయలేవు – నాకు వాటికి ఏమి సంబంధము లేదు ” అని బుద్దుడు వారికి సమాధానం ఇస్తాడు – మనస్సును స్వాధీనము చేసుకోవాలంటే ముందు శ్వాసలను స్వాధీనము చేసుకోవడం అనేది సులువైన మార్గము – ఫలితానిచ్చే మార్గం – సరియైన మార్గము అని మరవకూడదు.*


🕉️🌞🌏🌙🌟🚩

నిర్మోహత్వం - నిస్సంగత్వం

 *నిర్మోహత్వం - నిస్సంగత్వం*


పూర్వకాలం లో మగధ దేశం  రాజు గారు, రాకుమారుణ్ణి మంచి విద్యావంతుడిని చేశాడు. సర్వశాస్త్రాలు నేర్పించాడు.


రాజ్యపాలనకు సంబంధించిన అన్ని విషయాలలో తర్ఫీదు ఇప్పించాడు. యవ్వనవంతుడైన ఆ కొడుకుకును యువరాజ పట్టాభిషేకం చేసాడు. రాజ్యపాలనలో యువరాజు సలహాలు తీసుకొనేవాడు.


ఒకరోజు రాజ్యంలోని కొందరు ప్రజలు రాజు దగ్గరకు వచ్చారు. అడవికి దగ్గరగా ఉన్న తమ గ్రామాలలోకి క్రూరమృగాలు వస్తున్నాయని, వాటి నుండి తమను రక్షించాలని కోరారు. వెంటనే రాజు పక్కనే ఉన్న యువరాజు వంక చూశాడు.


ఆ చూపు అర్ధం చేసుకున్న యువరాజు ప్రజల వెంట అడవికి బయలు దేరాడు. క్రూరమృగాల్ని వేటాడుతూ యువరాజు అడవిలో చాలా దూరం పోయాడు.


క్రూరమృగాల్ని చాలా మటుకు వధించాడు. వేటలో అలసట చెందిన యువరాజుకు దాహం వేసింది. నీటి కోసం చుట్టూ చూసాడు.


ఎక్కడ నీటి జాడ కనిపించ లేదు. దగ్గరగా ఉన్న ఒక చెట్టు ఎక్కి చూడగా కొద్ది దూరంలో ఒక ఆశ్రమం కనిపించింది. చెట్టు దిగి ఆశ్రమం చేరుకొన్నాడు. ఆశ్రమంలో ఒక స్వామి ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు.


యువరాజు వచ్చిన అలికిడికి కళ్లు తెరిచిన ఆ స్వామి యువరాజును లోనికి ఆహ్వానించి అతిధి మర్యాదలు చేసాడు.


సేద తీరిన యువరాజును ఆ స్వామి "మీరెవరు? మీ పేరేమిటి?" అని ప్రశ్నించాడు. అందుకా యువరాజు "స్వామీ! మాది సమీపంలోని ఒక రాజ్యం.

నేను యువరాజును నా పేరు మోహదీప్తుడు. అయినా అందరూ నిస్సంగుడు అని పిలుస్తారు" అని బదులిచ్చాడు.


అపుడా స్వామి "నాయనా! నీ పేరు విచిత్రంగా ఉందే" అన్నాడు. అందుకా యువరాజు "స్వామీ! నా ఒక్క పేరేమిటి? మా రాజ్యంలో పేర్లన్నీ ఇట్లాగే ఉంటాయి." అనగానే స్వామికి ఏదో తోచింది. 

"యువరాజా! మీరు ఇక్కడే విశ్రాంతి తీసుకోండి. ఆపైనున్న మీ ఉత్తరీయం నాకివ్వండి. నేను రాజ్యం లోకి పోయి మరలా వస్తాను." అని ఉత్తరీయాన్ని తీసుకున్నాడు.


కొంతదూరం పోయిన తర్వాత ఆ ఉత్తరీయానికి అక్కడక్కడ కొంత రక్తం మరకలు పులుముకుని రాజ్యం చేరుకున్నాడు.


రాజాంతఃపుర ద్వారం దగ్గర ఒక దాసి ఎదురైంది స్వామికి. అపుడా స్వామి ఆ దాసితో "అమ్మా! అడవిలో మీ యువరాజును పులి చంపేసింది. ఇదిగో రక్తంతో తడిసిన ఆయన ఉత్తరీయం అన్నాడు."

అప్పుడా దాసి "దానిదేముంది

స్వామీ భగవద్గీతలోని రెండవ అధ్యాయంలోని శ్లోకాలను గుర్తుకు తెచ్చుకోండ"ని వెళ్లిపోయింది. 


ఆశ్చర్యపోయిన ఆ స్వామి అంతఃపురంలోని రాజు దగ్గరకు పోయి యువరాజు మరణం గురించి చెప్పాడు.


అందుకా రాజు స్వామితో "ఋణగ్రస్తుడు. ఋణం తీరింది వెళ్లిపోయాడు" అని తన పనిలో మునిగిపోయాడు. స్వామికి మరింత ఆశ్చర్యం వేసింది. 


సరే అనుకుని రాణి దగ్గరకు పోయి కొడుకు మరణవార్త వినిపించాడు.


అందుకామె బాధ పడలేదు. పైగా "స్వామీ! చెట్టుపై సాయంత్రం చేరిన పక్షులు ఉదయమే వెళ్లిపోతాయి. మరలా సాయంత్రం ఆ చెట్టుపైకి ఎన్ని పక్షులు చేరుకుంటాయో తెలియదు కదా" అని అన్నది.


అదేమిటి ఈమె కూడా ఇట్లా అన్నదే అని ఆ స్వామి యువరాజు భార్య దగ్గరకు పోయి విషయం చెప్పాడు.


అందుకామె "స్వామీ ప్రవహిస్తున్న గంగానదిపై ఉన్న దుంగలం మేమంతా. అలలపై కొన్ని దుంగలు కొట్టుకుని పోతాయి. అందుకు చింతించాల్సిన పనిలేదు" అని సమాధానం చెప్పింది.

స్వామి ఇక్కడ యింకేం పని లేదనుకుని ఆశ్రమం చేరాడు.


యువరాజుతో "రాజా! మీ రాజ్యాన్ని శత్రురాజులు ఆక్రమించుకున్నారు. మీ తల్లిని, తండ్రిని బంధించారు" అని అన్నాడు.


అందుకా యువరాజు "స్వామీ ఇందులో విచిత్రమేముంది? యాత్రికులలాగా ఇక్కడికి వచ్చాం. యాత్ర ముగిసింది. అంతేగదా" అని అనగానే స్వామికి ఆనందం రెట్టింపు అయింది.


శంకరాచార్యులు చెప్పిన నిర్మోహత్వం అంటే ఏమిటో నిస్సంగత్వం అంటే ఏమిటో అర్ధం అయింది స్వామికి.

మౌనం మహా భాగ్యం*

 *మౌనం మహా భాగ్యం*


రోజూ ఒక్క అరగంట లేదా కనీసం పది నిమిషాలు మౌనంగా ఉంటే చాలు. చక్కటి శారీరక, మానసిక ఆరోగ్యం మీ సొంతమవ్వటమే కాదు. మీ ఆశలు, ఆశయాలు, కలలు, కోరికలు అన్ని నెరవేరతాయి. ఇదెలా సాధ్యం అంటే, ప్రయత్నిస్తే తెలుస్తుంది. ఎలా సాధ్యమో. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు ఎంతసేపు మనం మాట్లాడతాం? ఎంత సేపు మౌనంగా ఉంటాం?


మౌనంగా ఉండటమంటే ఇంట్లో పనులు చేస్తూ లేదా ఏ టీవీలోని కార్యక్రమాన్ని చూస్తూనో, కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేయడం కాదు. మౌనమంటే. అచ్చంగా మౌనంగా ఉండటం. ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు మన నోరు మాట్లాడకపోయినా, మనసులో ఆలోచనలు పరుగులు పెడుతూనే ఉంటాయి. అంటే మన మెదడు పనిచేస్తూనే ఉంటుంది. అవి మనల్ని మన నుంచి  వేరుగా ఉంచుతాయి.


అదే కళ్ళు మూసుకుని మాటని, మనసుని మౌనంలోకి జార్చామనుకోండి. కనీసం ఓ పదినిమిషాలు చాలు. కళ్ళు తెరిచాక ఎంతో హాయిగా ఉంటుంది. మౌనం మనకి మనల్ని దగ్గర చేస్తుంది. మనమంటే ఏమిటో మనకు తెలియజేస్తుంది. రోజంతా ఎవరెవరితోనో మాటలు, వాదనలు, కోపాలు అరుపులు అక్కడితో అయిపోతుందా, అవన్నీ మనసులో చేరి ఆలోచనలుగా మారి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మౌనంగా ఉండటాన్ని ధ్యానం, మెడిటేషన్, ప్రాణాయామం ఏదైనా పిలవండి ఏకాగ్రతగా శ్వాసపై ధ్యాస పెట్టగలిగితే చాలు. ఆ తర్వాత అంతకు ముందు వరకు ఉన్న చికాకు ఇట్టే మాయమవుతుంది. అంతే కాదు మౌనంగా ఉండటం వల్ల మాటలు చక్కగా వస్తాయి.

శివలింగానికి

 *శివాలయంలో ఉండే శివలింగానికి*

*మొత్తం 5, ముఖాలు ఉంటాయి*

===================


అందులో నాలుగు ముఖాలు

నాలుగు దిక్కులని చూస్తుంటే*

ఐదవ ముఖం ఊర్థ్యముఖమై ( పైకి చూస్తూ /

ఆకాశంవైపు చూస్తూ ) ఉంటుంది,*

5, ముఖాలకి 5, పేర్లు నిర్దేశించ బడ్డాయి,


1,సద్యోజాత,ముఖం, ( పశ్చిమ )*

2, తత్పురుష,ముఖం, ( తూర్పు )*

3, అఘోర,ముఖం ( దక్షిణ )*

4, వాసుదేవ,ముఖం ( ఉత్తర )*

5, ఈశాన, ముఖం ( ఆకాశం )*

శివాలయాలు అన్నింటిలో అత్యంత మహిమ

కలిగినది, కోరిన కోర్కెలు వెంటనే తీర్చేది,

పశ్చిమాభి ముఖమైన శివాలయం,*

మనకు ప్రతీ శివాలయములోనూ

ఈ 5, ముఖాలు ఉంటాయి,*

శైవాగమనంలో చెప్పినట్లుగా,

మనం తప్పకుండా,

శివాలయంలో ఏ దిక్కువైపు వెళితే

ఆ శివలింగం పేరునే స్మరించాలి,*

ఆ అయిదు ముఖాలలో నుండే

సృష్టి, స్థితి, లయ, తిరోదానము, అనుగ్రహము ( మోక్షము ) ఇవ్వబడతాయి,*

మీరు గుడిలోకి వెళ్ళగానే శివలింగం

పశ్చిమంవైపు చూస్తూ ఉంటుంది,*

దానిని సద్యోజాత శివలిగం అని అంటారు,*

అప్పుడు మనం తప్పకుండా అటువంటి శివలింగాన్ని చూసినప్పుడు ......

ఓం సద్యోజాత, ముఖాయ నమః అని అనాలి,

తూర్పువైపుకు చూస్తూ ఉంటే,

అటువంటి శివలింగాన్ని,

తత్పురుష ముఖం అని అంటారు,*

తత్పురుష ముఖం అనేది మనల్ని  

తిరోదానాన్ని చేస్తూ ఉంటుంది,*

ఓం వామ దేవాయ నమః అని అంటే

మనకు 3, ఫలితాలని ఇస్తుంది,


1, మీ దగ్గర ఏదైతే ఉందో,అది మీ చేయి

జారిపోకుండా మీతోనే ఉంచుతాడు,*

2, మనకు ఉత్తరోత్తరాభివృద్దిని

ఆయనే ఇస్తారు,*

3, మనకు ఉన్నదానిని అనుభవించే

ఆరోగ్యం ప్రసాదిస్తాడు,*

అఘోర ముఖమే సమస్త ప్రపంచాన్ని

లయం చేసి మళ్ళీ మనకు

జన్మను ఇస్తూ ఉంటారు,*

మనకు మృత్యువు పట్ల భయం పోగొట్టేది,

మనకు జ్ఞానం ఇచ్చేది ఇదే,*

శివాలయంలో లింగదర్శనం అయ్యాక

ఒకసారి పైకి చూసి

ఓం ఈశాన ముఖాయ నమః అని అనాలి,*

ఈ ఈశాన ముఖమే మనకు మోక్షాన్ని ప్రసాదించేది, ఈ ఈశానముఖం

ఆకాశంకి అధిష్ఠానం అయి ఉంటుంది,*

పురుషులు కేవలం పంచ మాత్రమే ధరించి,

పైన ఉండే ఉత్తరీయంని నడుముకు

కట్టుకొని మాత్రమే ప్రదక్షిణ చేయాలి,*

అలా ఎవరైతే చేస్తారో వారి పట్ల పరమేశ్వరుడు అత్యంత ప్రసన్నమవుతాడు !

🌹🌹🌹 ఓం నమః శివాయ 🌹🌹🌹

చమత్కార పద్యం*

 *చమత్కార పద్యం*


ఈ పద్యం చూడండి...


ఇది సోష్ట్యం అంటే యీపద్యం కేవలం పెదవులకు తగిలే -ప,బ,భ, మ- అనే నాలుగు అక్షరాలతోనే రచింప బడినది


దీనిని నాలుక కదలకుండా చదువవచ్చు. 


అందుచేత దీనిని 'అచల జిహ్విక' అని కూడా అంటారు.


మాఘ మామ పాప భీమమౌ ముప్పాపి

పాప మేపు మాపి బాము బాపి

భూమి బబ్బ మబ్బ బేము మమ్మో మమి

మేము బోము భామ మేమ భీమ


టీక:-  


 మామ మామపాప= మన్మథుని యొక్క,


 భీమమౌ=భయంకరమైనట్టి 

ముప్పు+అపి =బాధనాపి,


 పాపము=దుష్కృతము యొక్క,


 ఏపున్=ఔద్ధత్వమును,


మాపి=మాయజేసి,


 బామున్=దుఃఖమును,


 పాపి= విదజేసి, 


భూమి= పుడమి నందున 


--------------శ్రీ కాశీపత్యవధానులుగారు ----------- రచించినది.

సజ్జన సాంగత్యం

 సజ్జన సాంగత్యం

ఒక రాజు నిండా  ఆభరణాలు ధరించి ఒక  అడవిలో  ప్రయాణిస్తున్నారు ఆ  అడవిలో ఒక చెట్టు పైన ఒక చిలుక  ఆ రాజుని  చూసి అందరూ రండి బాగా బంగారు ఆభరణాలు డబ్బులు ఉన్న మనిషి వస్తున్నాడు రండి రండి అని అక్కడ ఉన్న బందిపోటులకు తెలియజేసింది.అప్పుడు బందిపోటు రాజును వెంబడించాడు. .

రాజు ప్రాణ భయంతో పరుగు పెట్టాడు..తన పరివారాన్ని వీడి వేగంగా గుర్రం మీద వెళ్ళినాడు.  కొంత దూరం వెళ్లిన తరువాత బందిపోటులు ఇక రారు అని అనుకోని  ఒక పెద్ద చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటుండగా.... ఆ చెట్టు పైన ఇంకో చిలుక రాజుని ఉద్దేశించి ఇలా అన్నది  అయ్యా ఈ పక్కన ఒక  ఆశ్రమం ఉంది. అక్కడి గురువుగారు చాలా మంచివారు మీకు మంచి భోజనం  పెడుతారు. అంతేకాదు వారి సాన్నిధ్యంలో మీకు రక్షణ కల్గుగుతుంది అని చిలుక  చెప్పిన మాటలను విని రాజు అక్కడ వున్న ఆశ్రమం దగ్గరకు వెళ్తాడు. వెళ్ళగానే అక్కడి శిస్యులు రాజుగారిని ఆదరించి మంచి నీళ్ళ  ఇచ్చి ,రుచికరమైన భోజనాన్నిపెట్టి ,సేధ తీసుకోవాటానికి తగిన ఏర్పాట్లు చేసి స్వేద తీర్చుకొని స్వస్థత చేకూరిన తరువాత వారి గురువుగారి వద్దకు తీసుకొని వెళ్లారు. అప్పుడు రాజు గురువు గారితో  ఇలా  అన్నాడు.

 మహానుభావా   మొదలు నేను బయలుదేరినప్పుడు ఒక చిలుక నా గూర్చి బందిపోటులకు సమాచారం ఇచ్చి నాకు ప్రాణభయాన్ని కలిగించింది.  కానీ మీ ఆశ్రమ సమీపంలో వున్న  రెండవ చిలుక మీ ఆశ్రమ సమాచారాన్ని ఇచ్చి నాకు ప్రాణ రక్షణకు మార్గం చూపించింది.  రెండు చిలుకలే కదా వాటి గుణం లో  ఎందుకు ఇలా మార్పుగా వున్నాయి అని అన్నాడు. 

దానికి గురువు గారు ఇలా చెప్పారు. రాజా మీరన్నట్లు రెండు కూడా చిలుకలే వాటికి నిజంగా మనుషులకు ఉన్నట్లు రాగ ద్వేషాలు వుండవు. కేవలము అవి నేర్చుకున్న వాటినే పలుకుతాయి. మొదటి చిలుక బందిపోట్ల మధ్యలో పెరిగింది.కాబట్టి వారు నేర్పిన పలుకులే పలికించి ఇక రెండవ చిలుక మా ఆశ్రమంలో ఆశ్రమంలో పెరిగింది. ఇక్కడి పలుకులే పలికింది. ఇదంతా సాంగత్య మహత్యం అని అన్నారు గురువు గారు.  అంటే మనం ఎలాంటి వారితో సాంగత్యం చేస్తే  అలాంటి గుణాలే  కలుగుతాయి/అలవడతాయి అని అన్నారు గురువు గారు. ఏ ఇంటి చిలుక ఆ ఇంటి పలుకు పలుకుతుంది అంటే ఇదే అన్నది ఇదే అన్నారు. 


118-మంద్రగీత

 *🌷118-మంద్రగీత🌷*

🕉🌞🌎🌙🌟🚩


 *క్షేత్రము-క్షేత్రజ్ఞుడు*


*15. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, జ్ఞానము వివరింపబడినవి. జ్ఞేయము లేక తెలియదగినది అను దానిని వివరింతును. దానిని జ్ఞానముగా పొందినవాడు అమృత స్వరూపుడగును. ఇచ్చట దానికది జ్ఞాన స్వరూపమై జీవికి జ్ఞేయముగా ఉండును. జీవి దానిని సమీపించిన కొలది అది జ్ఞానమగును. అప్పటికి జీవి కూడా జ్ఞానమగును.*



*ఆది అనగా ఎట్టిది? నిద్ర నుండి మేల్కాంచుట వంటిది. మెలుకువతో సర్వము దృశ్యమానమగును. దీనినే ఆది అందురు. ఇది చూచువానికి ఆది గాని, దర్శింపబడు తత్వమునకు కాదు. కనుక జ్ఞేయము ఆది లేనిది. దాని పరిమితి కూడా జ్ఞాత యొక్క పరిమితియే. కనుక, జ్ఞేయము పరము లేక పరిమితి లేనిది. ఇది కొలతలకు అతీతము కనుకను, ద్రష్ట కొలతలు కలవాడు కనుకను వాని కది జ్ఞేయముగా భాసించును. సృష్టి అంతయు ద్రష్టకు జ్ఞేయము. దానికది బ్రహ్మము. బ్రహ్మమనగా వ్యాపన శీలము. అదియే జ్ఞాతగా కూడ వ్యాపించినది గనుక బ్రహ్మమనబడును.*



*ద్రష్ట దృష్టిలో దానికి అస్తిత్వమున్నది. సొంతముగా దానికి అస్తిత్వము లేదు. ద్రష్టకు దృశ్యమంతయు ఉండుట, లేకుండుట అనువాని నడుమ ఉండును. నిద్ర నుండి మేల్కాంచినప్పటి నుండి మనకు సృష్టి యున్నది. మరల నిద్రించిన వెనుక మనకది లేదు. కనుక మేల్కాంచుట ఆది, నిద్రించుట అంతము. మేల్కాంచుట అస్తిత్వము. నిద్రించుట అసత్. అనగా లేకుండుట. ఈ స్థితులు జ్ఞాతకు గనుక జ్ఞేయమునకు ఉండవు. మనము నిద్రించునప్పుడు మన చుట్టునున్న ప్రపంచము న+అసత్=నాసత్ (లేకుండుట లేదు) అనుస్థితిలో ఉన్నది. ఈ సృష్టి మొత్తమునకు జ్ఞేయమగు పరబ్రహ్మము, అట్లే సత్ (అస్తిత్వం), అసత్ (అభావము), నాసత్ అను స్థితులకు అతీతముగా ఉన్నది, దీనిని జ్ఞేయము అందురు.*


🕉🌞🌎🌙🌟🚩

సన్మార్గం

 _*🧘సన్మార్గం🧘‍♂*_

🕉🌞🌎🌙🌟🚩


_*సన్మార్గం అంటే ఏమిటి - ఎలా ఆచరించాలి?*_


*_-[సన్మార్గం మనిషికి సుఖశాంతులు ప్రసాదిస్తుంది]-_*



*_జీవితాన్ని ధర్మబద్ధంగా కొనసాగించడానికి సన్మార్గమే ఉత్తమ సాధనం. తోటివారికి సహాయం చేయడం, సంఘ శ్రేయస్సు కోసం పాటుపడటమే సన్మార్గం._*



*_స్వార్థంతో ప్రవర్తించి, ఇతరులకు కీడు చేయడమే దుర్మార్గం. సన్మార్గంలో నడిచిన వ్యక్తి ఎప్పటికప్పుడు తానేమిటో, తన స్థాయి ఏమిటో తెలుసుకుంటాడు. ఆత్మవిమర్శ చేసుకొంటూ ఉన్నతమైన బాటలో ప్రయాణిస్తాడు._*



*_ఈ సమాజం ఎలా అయినా ఉండనీ గాక, మనమెలా ఉన్నామన్నదే ముఖ్యం. ఏం చేస్తామన్నదే ముఖ్యం. కమలం బురద మధ్యలో జీవిస్తున్నా తన తేజస్సు కోల్పోదు. కోమలత్వాన్ని వీడదు. మనిషి కూడా కమలం లాగే బతకాలి..._*



*_సన్మార్గంలో సాగడం వల్లే మనిషి ఈ సమాజంలో అత్యుత్తమ గౌరవాన్ని పొందుతాడు. మానవత్వం వల్లే అందరికీ ఆదర్శప్రాయుడవుతాడు. అందుకే భగవంతుడు ప్రసాదించిన ఈ జన్మ ద్వారా అందరికీ సహాయం చేసే స్థాయికి మనిషి ఎదగాలి._*



*_మరుజన్మ ఉన్నదో లేదో మనకు తెలియదు. గత జన్మ ఎలాంటిదో కూడా తెలియదు. ఈ జన్మలో లభించిన పవిత్రమైన మానవ జన్మను ప్రతి మనిషీ సార్థకం చేసుకోవాలి. పదిమందినీ ఉద్ధరించే ప్రయత్నం చేయాలి._*



*_ఒకసారి సన్మార్గం వైపు ప్రయాణించిన మనిషి, చెడుమార్గం వైపు మరి కన్నెత్తి చూడడు. సత్‌ కార్యాలు చేస్తూ ముందుకు సాగుతాడు._*

 


*_దారి దోపిడులు చేసే రత్నాకరుడనే బోయవాడు నారద మహాముని ఉపదేశం వల్ల పరివర్తన చెంది, రామనామ జపంతో వాల్మీకిగా ప్రసిద్ధి పొందాడు. ఆదికావ్యమైన రామాయణాన్ని లోకానికి అందించాడు._*



*_బుద్ధుడు సిద్ధార్థుడిగా ఉన్నప్పుడు ఎన్నో రాజభోగాలను అనుభవించాడు. ఆ సిద్ధార్థుడే అన్నింటినీ వదులుకుని సన్మార్గాన్ని అవలంబించి జ్ఞానోదయం పొందాడు. మహా బోధకుడిగా మారి అమరుడయ్యాడు..._*



*_శ్రేష్ఠులైనవారు దేన్ని ధర్మంగా భావించి ఆచరిస్తారో సజ్జనులూ దాన్నే ఆచరిస్తారని బోధించాడు శ్రీకృష్ణుడు. జ్ఞానులు, మహాత్ములు సన్మార్గాన్ని అనుసరించారు, చరితార్థులయ్యారు. ప్రతి మనిషీ మహనీయుల మార్గాన్నే అనుసరించాలి. కీర్తి శిఖరాలు చేరుకోవాలి._*



*_రావణాసురుడు గొప్ప శివభక్తుడు. స్త్రీ వ్యామోహం వల్ల దుర్మార్గంగా ప్రవర్తించి, చివరికి నాశనమయ్యాడు. వివేకం కోల్పోయి, బంధుమిత్రుల హితవచనాలు పెడచెవిన పెట్టినందువల్ల కౌరవ నాశనానికి కారకుడయ్యాడు దుర్యోధనుడు._*


 

*_ఏ మనిషైనా దుర్మార్గుడిగా మారడానికి ఎంతోకాలం పట్టదు. మంచివాడిగా, మానవోత్తముడిగా గుర్తింపు పొందడానికి చాలా కాలం పడుతుంది. తద్వారా వచ్చే కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది. సన్మార్గమే మనిషికి సంపద. సన్మార్గంలో ప్రయాణించే మనిషికి ధనధాన్యాలు లేకపోయినా అన్ని సంపదలూ ఉన్నట్లే. సత్ప్రవర్తన లేనివారికి సంపదలు ఉన్నా అవి లేనట్లేనన్నది నీతికోవిదుల మాట._*

 


*_చూసిన ప్రతిదాన్ని ఆశించడం, ఆశించినదాని కోసం పాకులాడటం, కోరుకున్నది దొరక్కపోతే బాధపడటం... ఇవన్నీ మనిషి అశాంతికి కారణాలు. ఇవే మనిషిని దుర్మార్గం వైపు నడిపిస్తాయి. అందుకే మనిషి ఎప్పటికప్పుడు కోరికలను నియంత్రించుకుని స్థిరచిత్తం ఏర్పరచుకోవాలి._*



*_సన్మార్గం మనిషికి సుఖశాంతులు ప్రసాదిస్తుంది. సన్మార్గంలో నడిచే వ్యక్తుల మనసులు కడిగిన ముత్యాల్లా నిర్మలంగా ఉంటాయి. వారు ఎవరితోనైనా మృదుమధురంగా మాట్లాడతారు. కలిమిలోను, లేమిలోను నిబద్ధత కలిగి ఉంటారు. మంచి పనుల ద్వారా అందరినీ ఆకట్టుకుంటారు. సన్మార్గంలో ప్రయాణించిన మనిషి మనీషిగా ఎదుగుతాడు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకుంటాడు, మంచి బాటలో నడిచిన మనిషికి దైవానుగ్రహం తప్పక లభిస్తుంది. అందుకే సన్మార్గం అందరికీ అనుసరణీయం !_*


🕉🌞🌎🌙🌟🚩

ఋభుగీత" (228)*

 _*"ఋభుగీత" (228)*_

🕉🌞🌎🌙🌟🚩


_*బ్రహ్మానందము"*_

_*16వ అధ్యాయము*_ 


_*మనని మనం గమనించి మార్చుకునేదే నిజమైన సన్మార్గం !*_


_*మౌనమే స్నానం, జపం, పూజ, మోక్షం అన్నీ అని సెలవిచ్చారు. మౌనం అంటే మనసుకు కలిగే నిశ్చింత. జననమరణాలు ఎప్పుడు అసత్యం అవుతాయంటే మనసుకు పరిపూర్ణమైన శాంతివచ్చినప్పుడు. అంతటి శాంతి ఎప్పుడొస్తుందంటే స్వస్వరూపం తెలిసినప్పుడు. స్వస్వరూపం పూజలు జపాలు, తపాలవల్ల తెలియదు. విచారణ, సత్సంగం, ధర్మాచరణ, ఆదర్శజీవనం వల్ల కలుగుతుంది. పూజలు, జపాలు, తపాలు అందుకు సహకరించేవే గానీ అవే మోక్షాన్ని ఇవ్వవు. అశాంతిగా ఉందని బాధపడుతుంటాం. అశాంతికి మూలాన్ని గుర్తించి ఆచరణాత్మకంగా దాన్ని తీసెయ్యకుండా అశాంతి ఎప్పటికీ పోదు. మనని మనం గమనించి మార్చుకునేదే నిజమైన సన్మార్గం !*_


🕉🌞🌎🌙🌟🚩

భాగవతము

 *భాగవతము*

*శ్రీగురుభ్యోనమః*

🕉🌞🌎🌙🌟🚩


*రావణుడు కంఠారావమునకు అధిపతి.  అనగా ఉచ్ఛారణమున కధిపతి. వేదమునకు  స్వరము ఏర్పరచమని దేవతలందరూ బ్రహ్మ దేవునితో కలిసి మహాదేవుని దగ్గరకు వెళ్లి వేడుకుంటారు. అపుడు మహాదేవుడు నా పరమ భక్తుడైన రావణుడు ఏర్పరుస్తాడు అని అంటాడు.*



 *రావణుడు  మొత్తము వేదానికి స్వరము కట్టినటువంటి వాడు. రావణునికి సంగీతము తెలుసు. ఆయన వీణ వాయిస్తే సృష్టి అంతా కరిగిపోయేటంతటి జ్ఞానము కలిగిన వాడు. పరమశివుడు గూడా ఆయన వీణా గానమునకు పరవశించి పోయేవాడు.*



*ఉదాత్తము, అనుదాత్తము, స్వరము మూడు చక్కగా పలుకుతూ వేదగానము చేస్తే కంఠము నుండి ధ్వని తరంగములు ఏర్పడి శరీరమంతా శుద్ధి అయిపోతుంది.* 


🕉🌞🌎🌙🌟🚩

*అన్న- తమ్ముడు

 *అన్న- తమ్ముడు -- చందమామ కథలు*


*ధర్మపురిలో సోమయాజులు, ఛయనులు అనే ఇద్దరు అన్నదమ్మిలు ఉండేవారు. అన్న సోమయాజులు గొప్ప వేదపండితుడు. పూర్వాచార పరాయణుడు. దానికితోడు దేవీ ఉపాసకుడు. తెల్లవారు జామున లేచి, నదీ స్నానం చేసి పూజలో కూర్చుంటాడు. మూడు గంటల సేపు పూజాగృహం నుంచి వెలుపలికిరాడు. దేవికి నైవేద్యం పెట్టనిదే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టడు. ఆయన పిలిస్తే దేవి పలుకుతుందని ఆ ఊళ్ళో అందరూ అనుకుంటారు.*


*ఆయన ఆయుర్వేదం బాగా తెలిసినవాడేగాని, ఇంటికి వచ్చిన వాళ్ళకు తప్ప, ఎంతటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా, ఒకరింటికి వెళ్ళి వైద్యం చేసి ఎరుగడు. ఆయన తమ్ముడు ఛయనులు వేదాలు చదివాడేగాని అన్న అంతటి పండితుడు కాడు. అన్నలాగా ఉపాసనాపరుడు గాక పోయినా, దేవీ భక్తుడు. ఆయుర్వేద వైద్యంలో మాత్రం అన్నను మించినవాడు.*


*దానికి తోడు ఎవరు వచ్చి పిలిచినా, అది ఏ అపరాత్రి వేళ అయినప్పటికీ వాళ్ళ వెంట వెళ్ళి వైద్యం చేసి వస్తాడు. ఒకసారి అర్ధరాత్రి సమయంలో పక్క ఊరి నుంచి ఇద్దరు వచ్చి, పిల్లవాడికి సంధిపాతం వచ్చి అపస్మారక స్థితిలో ఉన్నాడని మొరపెట్టుకుంటే, ఛయనులు ఇంట్లో భార్య ఒక్కతే ఉందని కూడా చూడకుండా మందులపెట్టె పట్టుకుని వాళ్ళ వెంట బయలుదేరాడు. వాళ్ళ ఊరు వెళ్ళే సరికి కోడి కూసింది. ఇంట్లో జనం అంతా ముగిసిపోయిందని పిల్లవాణ్ణి గడపలో పెట్టి లబో దిబో మంటున్నారు. ఛయనులు వాళ్ళను పక్కకు తప్పించి నాడి చూశాడు. ఆ తరవాత ఏదో పొట్లం విప్పి, అందులోని భస్మాన్ని తేనెలో రంగరించి పిల్లవాడికి పట్టించాడు. గంట తరవాత పిల్లవాడిలో కదలిక వచ్చింది. ఇంట్లో వాళ్ళ ఆనందానికి అంతులేకుండా పోయింది.*


*ఛయనులు రెండు గంటల తరవాత ఏదో కషాయం తయారు చేసి కళ్ళు తెరిచిన పిల్లవాడి చేత తాగించాడు. మరికొంత సేపటికి పిల్లవాడు లేచి కూర్చున్నాడు. ఇంట్లోని వాళ్ళందరూ కృతజ్ఞతతో ఛయనులుకి చేతులెత్తి మొక్కారు. అప్పటికే మధ్యాహ్నం కావడంతో ఛయనులుకి ఆకలి ఎక్కువయింది. ఆ ఇంటి వారు, "మా ఊళ్ళో పళు్ళ కూడా దొరకవు. పాలు తెస్తాం, తాగుతారా?" అని అడిగారు.*


*"మీరు వండుకోలేదా?'' అని అడిగాడు ఛయనులు. ఫడువండుకున్నాం. కానీ... కానీ...'' అంటూ ఆగాడు ఆ ఇంటి యజమాని. "పదండి. అందరూ కలిసే భోజనం చేద్దాం," అంటూ అరుగుపై నుంచి లేచాడు ఛయనులు. అందరితో కలిసి ఆనందంతో భోజనం చేసి వాళ్ళిచ్చింది పుచ్చుకుని సంతోషంగా ఇంటిదారి పట్టాడు. ఈ వార్త ఆనోటా ఈనోటా నలిగి, ఆఖరికి సోమయాజులు చెవినిపడింది.*


*మండి పడ్డాడు. తమ్ముణ్ణి పిలిచి చీవాట్లు పెట్టి ప్రాయశ్చిత్తం చేయాలన్నాడు. ఛయనులు, "ఆకలి భరించలేక, మరో మార్గం లేక ప్రాణాలు నిలుపుకోవడానికి వాళ్ళింట్లో భోజనం చేయడం తప్పుకాదనుకుంటాను," అన్నాడు వినయంగా. "చేసిన అపచారం చాలదని పెద్దవాడికి ఎదురు తిరుగుతున్నావా?" అన్నాడు సోమయాజులు ఆగ్రహంతో. "అన్నీ తెలిసినవారు. మీకు చెప్పేంత వాణ్ణి కాను నేను. ప్రాణాలు నిలిపే ఆహారాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నా తప్పులేదు," అన్నాడు ఛయనులు మళ్ళీ. ఆ మాటలు సోమయాజులుకు మరింత ఆగ్రహం తెప్పించాయి. "ఛీ, అప్రాచ్యుడా! అవతలికి వెళ్ళి*


*ఈ రోజు నుంచి నా తమ్ముడు లేడనుకుంటాను,'' అంటూ తలమీది నుంచి చేదతో నీళ్ళు కుమ్మరించుకున్నాడు. ఛయనులు అన్నకు బాధ కలిగించినందుకు చింతిస్తూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి సోమయాజుల ఇల్లు పండితులతో కళకళలాడుతూ ఉంటే, ఛయనులు ఇంటికి సామాన్య ప్రజలు ఎక్కువగా వచ్చేవారు. ఆకలి అని ఎవరు వచ్చినా ఛయనుల భార్య వాళ్ళకింత పెట్టి పంపేది.*


*ఇలా వుండగా ఒకసారి ఐదారు రోజులపాటు ఎడతెరిపిలేని జడివానతో పెను తుఫాను ఊరిని చుట్టు ముట్టింది. ఛయనులు ఏర్పాటు చేసిన పాకలో బీదా బిక్కీ జనం వచ్చి ప్రాణాలు ఉగ్గబట్టుకుని కూర్చున్నారు. సోమయాజులు, పూజాసమయం కావడంతో పూజాగృహంలో కూర్చుని ధ్యాన నిమగ్నుడయ్యాడు. హఠాత్తుగా ఆయన ధ్యానం చేస్తూన్న పూజాగృహం తప్ప, తక్కిన భవంతి, యజ్ఞశాల గోడలు తడిసి భయంకర శబ్దంతో కూలిపోయాయి. సోమయాజులు ఉలిక్కిపడిలేచి, కిటికీలోంచి చూస్తే, తమ్ముడి భోజనాల తాటిపాక సురక్షితంగా కనిపించింది.*


*సోమయాజులు ఆగ్రహావేశంతో దేవీ విగ్రహం పాదాల ముందు ప్రాణత్యాగం చేయాలని తలమోదుకుంటూ, "తల్లీ, ఏమిటీదారుణం? నీకు నైవేద్యం పెట్టకుండా నేను ఏనాడైనా పచ్చినీళ్ళయినా ముట్టానా? సదాచారంతో, నిష్ఠతో నిన్ను పూజించిన నా ఇంటిని నేలమట్టం చేసి, ఆచారాలను మంటగలిపి, నీ సంగతే మరిచిన నా తమ్ముడి తాటిపాకను చెక్కుచెదరకుండా కాపాడావు? ఇది దురన్యాయం కాదా?'' అంటూ విలపించసాగాడు. "పిచ్చివాడా, ఆగు! ఏమిటి నువ్వంటున్నది? నువ్వు నా భక్తుడివే, నిజం.*


*అయితే భక్తుడినన్న అహంకారంతో, ఆచారాలతో తోటి మానవులకు దూరమై ఒంటరివాడివై పోయావు. నీ తమ్ముడూ నా భక్తుడే. నువ్వు నీ ఎదుట వున్న విగ్రహంలోనే నన్ను చూస్తున్నావు. నీ తమ్ముడు ప్రతి జీవరాశిలోనూ నన్ను దర్శిస్తున్నాడు. తనతో పాటు అందరూ బావుండాలని అతడు కోరుకుంటున్నాడు.*


*అలాంటి వాణ్ణీ, అతన్ని ఆశ్రయించిన పేద ప్రజలనూ కాపాడడం నా బాధ్యత కాదా? పైగా ప్రకృతి విలయతాండవం చేస్తూన్న ఇంతటి ప్రళయంలోనూ, నిన్నూ, నీ భార్యా బిడ్డలనూ కాపాడాను కదా! ఆ సంగతి మరిచిపోయి నన్నే తప్పుపడతావా?'' అన్న మాటలు దేవీ విగ్రహం నుంచి గంభీరంగా వినిపించాయి. ఆ మాటలతో తన తప్పు గ్రహించిన సోమయాజులు, "తల్లీ, నా తప్పు తెలుసుకున్నాను. నన్ను క్షమించు. ఇకపై నీ ఆజ్ఞానుసారం వయసులో చిన్నవాడైనా జ్ఞానంలో పెద్దవాడైన నా తమ్ముడి అడుగుజాడలలో నడుస్తాను," అంటూ చేతులు జోడించాడు.*

వాక్శుద్ధి

 💦 *నీతి కథలు - 247*


*వాక్శుద్ధి*


హరి, గిరి అనేవాళ్ళు, ఇరుగు పొరుగు ఇళ్ళల్లో వుంటున్న …యువకులు. ఇద్దరికీ ఉద్యోగాల్లేవు. అయితే, ప్రవర్తనలో మాత్రం ఇద్దరికీ, ఏనుగుకూ, దోమకూ వున్నంత తేడా! హరి ఇంట్లో తల్లికీ, ఇంటి బయటి పనులకు తండ్రికీ అడగకుండానే వీలైనంత సాయం చేస్తూంటాడు. ఊళ్ళోని పెద్దలకు మర్యాద ఇస్తాడు. తన ఈడు వారితో ఎంతో స్నేహంగావుంటాడు. అందరూ హరిని మెచ్చుకుంటారు. తమ పిల్లలకు హరిలా వుండాలని తరచూ చెబుతూంటారు.


గిరి ప్రవర్తన హరికి పూర్తిగా భిన్నం. అతడు అడిగినా ఎవరికీ ఏ సాయమూ చే…యడు. ఎక్కువ సేపు నిద్రపోతూంటాడు. పెద్దలను గౌరవించడు. పెద్దా చిన్నా అని లేకుండా అందరితోనూ గొడవ పెట్టుకుంటాడు. అందరూ గిరిని తిట్టుకుంటారు. తమ పిల్లలకు గిరిలా వుండకూడదని చెబుతూంటారు. తనకు చెడ్డ పేరు వచ్చిందని గిరికి తెలుసు. అయితే అందుక్కారణం తన ప్రవర్తన అని అతడనుకోడు. హరి కారణంగానే తనకు చెడ్డ పేరు వచ్చిందని అందరితో అంటాడు. ఉత్త పుణ్యాన హరిని అవకాశం దొరికినపుడల్లా శాపనార్థాలు పెడతాడు.


ఇదంతా హరికి తెలుసు. అయినా అతడికి గిరిపట్ల కోపంలేదు. ఎవరైనా గిరి చెడ్డవాడని అంటే, ‘‘అందరి ప్రవర్తనా ఒక్కలాగావుండదు. కానీ అంతా గిరిని నాతో పోల్చి చిన్నబుచ్చుతూంటారు. అందుకే అతడికి నామీద కోపం. లేకుంటే మేమిద్దరం మంచి స్నేహితులమే!’’ అనేవాడు. ఇలావుండగా, ఒక రోజున గిరి మేనమామ శంకరయ్య, ఆ ఊరువచ్చాడు. కాసేపు గిరితో మాట్లాడాక, ఆయన, ‘‘బాబూ! నువ్వు చాలా తెలివైనవాడివి. మా ఊరు జమీందారుకు ఇద్దరు చురుకైన కుర్రాళ్ళు కావాలి. ఒకడు పనికీ, మరొకడు కబుర్లకీ. నువ్వేమో జమీందారుకు కబుర్లు చెప్పి కాలక్షేపం చేస్తే, మీ పొరుగింటి హరి పనులు చేసి పెడతాడు. జమీందారు, మీ ఇద్దరూ జంటగా వెళితే తప్పక ఉద్యోగాలిస్తాడు.



 ఆయన ఇచ్చే నెలజీతం కూడా చాలా ఎక్కువే వుంటుంది,’’ అన్నాడు.‘‘నేను ఒక్కణ్ణీ వెళ్ళి అడిగితే, నాకు ఉద్యోగం ఇవ్వడా మీ జమీందారు?’’ అని అడిగాడు గిరి.


‘‘ఇవ్వడు! కబుర్లు చెప్పేవాడికి తనతో సమానంగా జీతమిస్తే, పని చేసేవాడికి అసంతృప్తిగా వుంటుంది. అలాగని కబుర్లు చెప్పేవాడికి తక్కువ జీతమిస్తే వాడికి అసంతృప్తి పుట్టి కబుర్లు సరిగా చెప్పలేడు. అందుకని ఆ జమీందారు, ఇందుకు అభ్యంతరం చెప్పని జంట యువకులకే, ఈ ఉద్యోగాలిస్తాడు. మీ హరి చాలా మంచివాడు. మీరు జంటగా వెళితే తప్పక ఈ ఉద్యోగాలు దొరుకుతాయి. వాటిలో మీరు తప్పక రాణిస్తారు,’’ అన్నాడు శంకరయ్య.


‘‘నాకు ఉద్యోగం రాకున్నా ఫరవాలేదు కానీ, హరికి మాత్రం రాకూడదు. అందుకే, జమీందారు దగ్గరకు జంటగా వెళ్ళి ఉద్యోగమడగడం, నాకిష్టం లేదు,’’ అన్నాడు గిరి ఆవేశంగా. ‘‘ఆ హరి ఎంతో మంచివాడు. అతడంటే ఎందుకురా నీ కంత కోపం?’’ అని అడిగాడు శంకర…్యు. ‘‘వాడు మాయగాడు. తను మంచివాడినని అందర్నీ ఇట్లే నమ్మిస్తాడు. వాడితో పోల్చి అంతా నన్ను చెడ్డవాడనుకోవాలని వాడి ఉద్దేశ్యం. అందువల్ల, నేను పైకి వచ్చినా రాకున్నా వాణ్ణి మాత్రం పైకిరానివ్వను,’’ అన్నాడు గిరి. శంకరయ్యకు తన మేనల్లుడి ఓర్వలేని గుణం అర్థమైంది. ఆయన ఆ రోజే వెళ్ళి హరిని కలుసుకుని విషయం చెప్పి, ‘‘మీ ఇద్దరికీ ఇది చాలా మంచి అవకాశం. నువ్వు ఎలాగో గిరికి నచ్చజెప్పే ప్రయత్నం చేయి,’’ అన్నాడు.



ఇందుకు హరి సరేనని, ఆ సాయంత్రం గిరి వద్దకు వెళ్ళాడు. అతడు హరి చెప్పిందంతా శ్రద్ధగా విని, ‘‘ఆ జమీందారు మంచివాడు కాదని, వాళ్ళూ వీళ్ళూ అనుకుంటూండగా విన్నాను. ఆయన మనిద్దరికీ పనియిచ్చినా, తర్వాత కొన్నాళ్ళకు నన్ను పనులు చే…యమంటాడు; నిన్ను కబుర్లు చెప్పమంటాడు. నేను పనులు సరిగ్గా చెయ్యడంలేదనీ, నువ్వు కబుర్లు సరిగ్గా చెప్పడంలేదనీ తిట్టడం మొదలు పెడతాడు. అందుకే ఆ ఉద్యోగాలు వద్దన్నాను,’’ అన్నాడు. ‘‘ఇదంతా నీ ఊహ  అని నాకనిపిస్తున్నది. మరొకసారి బాగా ఆలోచించు,’’ అన్నాడు హరి.



ఇందుకు గిరి చిరాగ్గా, ‘‘పోనీ, ఊహే  అనుకుందాం. అయినా నాకు వాక్శుద్ధివుంది. నేనేమంటే అది జరుగుతుందని, మా ఇంట్లో అంతా అంటారు. వారం రోజుల క్రితం నాకు జున్ను తినాలనిపించి, ఇంట్లో పాలన్నీ విరిగి పోతే బాగుండునన్నాను. ఆ రోజు పాలు విరిగి పోయాయి. మూడు రోజుల క్రితం పెరట్లో మొక్కలకు నీళ్ళు పొ…య్యమని అమ్మ బలవంత పెడితే, కాసేపట్లో వాన పడుతుందిలే అన్నాను. నిజంగానే వాన పడింది. ఇప్పుడు జమీందారు దుష్టుడు అన్నాను. ఆ మాటా నిజమే అవుతుంది. నా మాట నమ్ము,’’ అన్నాడు.

‘‘నీ ఊహ  నిజమైనా కాకపోయినా, నాకు చాలా మంచి అవకాశం పోయిందని ఎంతో బాధగావుంది,’’ అన్నాడు హరి.


‘‘అవకాశం నాకూ పోయిందిగా! అయినా, నామూలంగా నీకు మంచి అవకాశం పోయిందని నువ్వనుకుంటున్నావు. కానీ అది నిజం కాదు. నీకు ఇంతకంటే గొప్ప అవకాశం తొందరలో వస్తుంది. అప్పుడు నీవు ఈ అవకాశం పోయినందుకు ఎంతగానో సంతోషిస్తావు. మరొకసారి చెబుతున్నాను నా మాట నమ్ము. నాకు వాక్శుద్ధివుంది. నా మాట తప్పదు,’’ అని గిరి తన ఉద్దేశ్యం ఖచ్చితంగా చెప్పేశాడు. హరి మంచివాడు కాబట్టి ఇంకేమీ అనలేక తిరిగి వెళ్ళాడు.


 అయితే, ఆశ్చర్యంగా మరి నాలుగు రోజులకు, హరికి దూరపు బంధువు కేశవుల నుంచి కబురొచ్చింది. కేశవులు పట్నంలో వుంటున్నాడు. ఆయన సముద్రయానం చేసి రకరకాల వ్యాపారాల ద్వారా, కూర్చుని తిన్నా తరతరాలు తరగనంత ఆస్తిని సంపాదించాడు. ఆయనకు పిల్లలు లేరు. ఇప్పుడు ముసలివాడై  పట్నంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు.



తన ఆస్తిని ధర్మకార్యాలకు వినియోగించాలని ఆయన కోరిక. అందుకు సమర్థుడు, మంచివాడు అయిన యువకుడు కావలసివస్తే, ఎవరో ఆ…యకు హరి పేరు చెప్పారు. తన ఆస్తిలో నాలుగోవంతు హరికిచ్చి, తను అతడి వద్దనే వుంటూ, మిగతా ఆస్తిని ధర్మకార్యాలకు వినియోగించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన కోరిక మేరకు హరి పట్నం వెళ్ళి ఆయన్ను కలుసుకున్నాడు. ఆయనకు హరి నచ్చాడు. తర్వాత హరి తన ఊరువచ్చి, తనీస్థితికి చేరుకునేందుకు సాయపడిన వారందరికీ పేరుపేరునా కానుకలిచ్చాడు. వారిలో తలిదండ్రులు, అన్నదమ్ములు, గురువులు, మిత్రులు వున్నారు కానీ గిరి లేడు.



గిరి అతణ్ణి కలుసుకుని, ‘‘నా వాక్శుద్ధి వల్లనే నీకీ ఉన్నత స్థితి కలిగింది. ఎంతో మంచివాడివని పేరు పొందిన నువ్వు, నా విషయం మరిచిపోవడం విచిత్రంగా వుంది,’’ అన్నాడు.

ఇది వింటూనే హరి చీదరింపుగా, ‘‘నాకు ఉద్యోగం రాకూడదని, నీ ఉద్యోగావకాశాన్ని కూడా వదులుకున్న దుష్టుడివి. నీకు నిజంగా వాక్శుద్ధివుంటే, నాకు మేలు జరగాలని కోరుకోవు గాక కోరుకోవు. వాక్శుద్ధి వుండాలంటే, మొదట మనసు నిర్మలంగా వుండాలి. అది నీలో లేదు. ఆ పాలు విరగడం, వాన కురవడం-ఒకటి నీ స్వార్థంకోసం, రెండోది పని తప్పించుకునేందుకు అన్నవే. మరొక సంగతి; తాను చెప్పిన చెడుపనులు జరిగినట్టయితే, అలాంటివారిని వాక్శుద్ధికలవారని చెప్పరు, నాలుక పైమచ్చగలవారని అంటారు!’’ అని హరి ఆగాడు.


గిరి వచ్చేకోపాన్ని బలవంతంగా ఆపుకుంటూ, ‘‘ఆగావేం? ఇంకేమైనావుంటే చెప్పు,’’ అన్నాడు. హరి అతడి ముఖంకేసి ఒకసారి పరీక్షగా చూసి, ‘‘చెప్పడానికి చాలావుంది. ప్రస్తుతానికి కానుకల సంగతి. నీకు కానుకలిస్తే, అర్హత లేని వారిని సన్మానించినట్లే! అది నేను సన్మానించిన మిగతా వారికి చిన్నతనం. కాబట్టి నేను నీకోసం ఏ కానుకా తేలేదు,’’ అన్నాడు. ఈ జవాబుతో గిరి మారుమాట్లాడక తలవంచుకుని అక్కణ్ణించి మౌనంగా వెళ్ళిపోయాడు.

            💦🐋🐥🐬💦

విదురుడు

 *📖 మన ఇతిహాసాలు 📓*



*విదురుడు*



విదురుడు యమధర్మరాజు అంశతో దేవరన్యాయం వల్ల వ్యాసునికి అంబ దాసీకి జన్మిస్తాడు.



*విదురుడి జననం*



కురువంశాన్ని నిలపడానికి సత్యవతి తన కోడళ్ళైన అంబికని అంబాలిక ని దేవరన్యాయం ప్రకారం ధర్మ సమ్మతంగా సంతానం పొందించే ఏర్పాటు చేస్తుంది. అంబిక వ్యాసుడిని చూసి కళ్ళు మూసుకొనడం వల్ల గుడ్డివాడగు ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు. అంబాలికకు వ్యాసుడిని చూసి కంపించడం వల్ల పాండు రోగంతో పాండు రాజు జన్మిస్తాడు. మంచి వారసత్వాన్ని ఇవ్వమని కోరితే వ్యాసుడు మళ్లీ దేవరన్యాయం వల్ల అంబకి సంతానం కలిగించడానికి అంగీకరిస్తాడు. గడ్డాలు గల వ్యాసుడితో సంభోగించడానికి ఇష్టం లేని అంబిక తన దాసిని వ్యాసుడి వద్దకు పంపుతుంది.ఈ విధంగా పంపబడిన దాసి ఎంతో సంతోషముతో వ్యాసుడితో సంభోగిస్తుంది. దాసితో సంభోగించగా జన్మించిన వాడు విదురుడు.

దెబ్బకు దెబ్బ

 *✍🏼 నేటి కథ ✍🏼*



*దెబ్బకు దెబ్బ*


(పర్షియన్ జానపద కథ}



అనగా అనగా బాగ్దాదు నగరంలో అబూసలీం, సుల్తాన్ అహ్మద్ అనే ఇద్దరు మిత్రులు ప్రక్కప్రక్క ఇళ్లలో ఉండేవాళ్ళు. అబూకు దైవభక్తి ఎక్కువ. తనకు ఎలాంటి కష్టం వచ్చినా బిగ్గరగా నమాజు చేసి భగవంతుడికి మొరపెట్టుకునేవాడు. సుల్తాన్ అహ్మద్ కు తన మిత్రుని ఈ ప్రవర్తనని చూస్తే ఎగతాళిగా ఉండేది. ఎలాగైనా అబూనుంచి ఈ అలవాటును దూరం చెయ్యాలని అతను తగిన సమయంకోసం వేచి చూడసాగాడు.


ఒకసారి అబు ఎప్పటిమాదిరే బిగ్గరగా నమాజు చేసి, దేవునితో తన కష్టాలు మొరపెట్టుకున్నాడు- "సంపాదన తక్కువౌతున్నది, ఖర్చులు చూస్తే పెరిగిపోతున్నాయి- ఎలాగైనా కాపాడే భారం నీదే" అని. ప్రక్క ఇంట్లోంచి వింటున్న సుల్తాన్ అహ్మద్ కు ఇదే తగిన సమయం అనిపించింది. ఒక సంచీలో కొన్ని బంగారు నాణాలు వేసి, మూటగట్టి, వాటిని గబుక్కున నమాజు చేస్తున్న అబూసలీం ఒళ్ళో పడేట్లు గిరాటు వేశాడు.


కళ్ళు తెరిచి చూసిన అబూసలీం తన ఒళ్ళో పడ్డ సంచీని తెరిచి చూశాడు. బంగారు నాణాలు! ఇది ఎవరి తుంటరిపనో అబూకు వెంటనే అర్థం అయ్యింది. అయినా 'ఇది అల్లా తనకిచ్చిన కానుక' అనుకొని, అతను దాన్ని తీసుకొని సంతోషంగా ఇంట్లోకి పరుగుతీశాడు.


కొంచెం సేపు గడిచిందో‌లేదో, సుల్తాన్ అహ్మద్ ప్రత్యక్షం అయ్యాడు. అబుకు అతను ఎందుకొచ్చాడో అర్థం అయ్యింది. అయినా ఏమీ తెలీనట్లు, "ఈరోజు చమత్కారం ఒకటి జరిగింది సుల్తాన్, నేను అటు నమాజ్ చేసి లేచానో-లేదో, ఇటు అల్లా నా మొర విని, నాకు ఈ బంగారు నాణాల సంచీని ప్రదానం చేశాడు!" అన్నాడు సంచీని చూపిస్తూ.


"అది అల్లా ఇచ్చిన డబ్బు కాదు! నీ‌ పిచ్చి వదిలిద్దామని, నేనే వాటిని నీమీదికి విసిరాను" అన్నాడు సుల్తాన్ అహ్మద్, ఇకిలిస్తూ.


"అదెలా అవుతుంది? అల్లా నాకిచ్చిన డబ్బు నాదే అవుతుంది" అన్నాడు అబూసలీం, గడుసుగా. ఇది వేరేవైపుకు మళ్ళుతున్నదని అర్థమైంది సుల్తాన్ అహ్మద్ కు. "ఇదిగో, చెబుతున్నాను- అది అల్లా డబ్బు కాదు. నీదీ కాదు. అది నా డబ్బు. మర్యాదగా నా డబ్బు నాకు ఇవ్వకపోతే న్యాయం కోసం ఖాజీ దగ్గరికి పోవాల్సివస్తుంది- ఏమనుకుంటున్నావో, ఏమో!" అన్నాడు కోపంగా.


"నాకేం భయం? నా డబ్బు నాదే. దాన్నెవరూ నానుండి లాక్కోలేరు- ఖాజీ అయినా సరే" అన్నాడు అబూ మొండిగా.


"సరే, అయితే పద, ఖాజీ దగ్గరికి నడు!" అన్నాడు సుల్తాన్ అహ్మద్, చికాకుగా.


"వద్దామనే ఉంది, కానీ‌ నాకు మంచి బట్టలే లేవాయె, బయటికెలా వచ్చేది?" అన్నాడు అబూ.


సుల్తాన్ అహ్మద్ తన ఇంట్లోంచి ఒక జత బట్టలు తెచ్చి ఇచ్చాడు, "ఇక బయలుదేరు" అని.


అబు వాటిని వేసుకున్నాడు, కానీ‌ కదల్లేదు- "టోపీ లేనిదే మర్యాదస్తులు బయటికెలా వస్తారు?" అని. సుల్తాన్ అహ్మద్ మళ్ళీ తన ఇంట్లోంచే టోపీ తెచ్చి ఇచ్చాడు.


అయినా కదల్లేదు అబు. "చెప్పుల్లేవు" అని.


సుల్తాన్ అహ్మద్ విసుక్కుంటూ చెప్పులు తెచ్చి ఇచ్చాడు.


"మరి గుర్రం?" అన్నాడు అబు.


"గుర్రంకూడా నేనే తెచ్చివ్వాలా?" అని విసుక్కున్నాడు సుల్తాన్ అహ్మద్.


"తప్పదు మరి, నాకు గుర్రం లేదు- నేనెలా వస్తాను, ఖాజీ దగ్గరికి?" అన్నాడు అబు.


అబుకో గుర్రాన్ని తెచ్చిపెట్టక తప్పలేదు సుల్తాన్ అహ్మదుకు .


అప్పుడుగాని అబు కదల్లేదు. ఇక ఇద్దరూ ఖాజీ దగ్గరికి వెళ్ళగానే, అబు తన డబ్బు తీసుకొని ఇవ్వట్లేదని ఫిర్యాదు చేశాడు సుల్తాన్ అహ్మద్.


"అయ్యా, వీడు నా మిత్రుడే- ఆరోగ్యం సరిగా లేదు పాపం. ఈ డబ్బు తనదంటున్నాడు, సరే- మరి నేను వేసుకున్న బట్టలూ, నేను పెట్టుకున్న టోపీ, ఈ చెప్పులూ, నేనెక్కిన ఈ గుర్రమూ- ఇవన్నీ ఎవరివో అడగండి" అని అబు ఊదాడు మర్యాదగా, ఖాజీ చెవిలో .


"ఏమోయ్, మరి ఇతనెక్కిన ఈ గుర్రం ఎవరిది?" అన్నాడు ఖాజీ.


"నాదే" అన్నాడు సుల్తాన్ అహ్మద్.


"ఇతను వేసుకున్న చెప్పులు?"


"నావే" అన్నాడు సుల్తాన్ అహ్మద్, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాక.


"మరి ఇతను పెట్టుకున్న టోపీ?"


"అదీ నాదే" చెప్పాడు సుల్తాన్ అహ్మద్.


"ఓహో, ఔనా, మరి ఇతను వేసుకున్న బట్టలు?"


"అవీ నావే"


ఖాజీ అతని వైపు జాలిగా చూశాడు. ఆపైన ఆయన అబు వైపు చూశాడు.


"మరి అదేనండి, నేను అన్నది" అన్నాడు అబు, వినయం నటిస్తూ.


ఖాజీ కేసు కొట్టేశాడు. "మీ మిత్రుడిని ఎవరైనా మంచి మానసిక వైద్యుడికి చూపించు" అని అబుకు సలహా ఇస్తూ.


ఇద్దరూ ఇల్లు చేరాక, అబు తన మిత్రుని వస్తువుల్ని అన్నిటినీ వెనక్కి తిరిగి ఇచ్చేశాడు. సుల్తాన్ అహ్మద్ డబ్బు సంచీతో సహా.


ఆపైన సుల్తాన్ అహ్మద్ ఏనాడూ అబుకు పాఠం చెప్పేందుకు ప్రయత్నించలేదు.


*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

పుణ్యఫలాలన్నీ

 మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్యఫలాలన్నీ ఒక్క చెడ్డపనితో తుడిచిపెట్టుకుపోతాయా??? 

🍁🍁🍁🍁

కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు. తన వందమంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు. కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురువెళ్లి బోరున విలపిస్తాడు. చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న అతని కృష్ణుడు ఓదార్చేందుకు ప్రయత్నిస్తాడు.



ధృతరాష్ట్రుడి దు:ఖం కోపంగా మారి కృష్ణుడిని నిలదీస్తాడు.


 ‘అన్నీ తెలిసి కూడా, మొదటి నుంచీ జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తూ భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్నకుండిపోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? ఈరోజు తనకు వందమంది పుత్రులను పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు’ అని నిలదీస్తాడు.


 అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు...


‘ఓ రాజా! ఇదంతా నేను చేసిందీ కాదూ, నేను జరగనిచ్చిందీ కాదు. ఇది ఇలా జరగడానికి, నీకు పుత్రశోకం కలగడానికీ అన్నిటికీ కారణం నువ్వూ, నీ కర్మ. యాభై జన్మల క్రితం నువ్వొక కిరాతుడివి(వేటగాడు). ఒకరోజు వేటకు వెళ్లి రోజంతా వేటాడినా నీకు యేమీ దొరకని సందర్భంలో ఒక అశోకవృక్షం మీద రెండు గువ్వల జంట వాటి గూటిలో గుడ్లతో నివసిస్తున్నాయి. వాటిని నీవు చంపబోగా ఆ రెండు పక్షులూ నీ బాణాన్ని తప్పించుకుని బతుకగా అప్పటికే సహనం నశించినవాడివై కోపంతో ఆ గూటిలో ఉన్న వందగుడ్లను ఆ రెండు పక్షులు చూస్తుండగా విచ్ఛిన్నం చేశావు. తమ కంటి ముందే తమ నూరుగురు పిల్లలు విచ్ఛిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయాయి. ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపం నుంచి విముక్తుడిని చేసి కర్మబంధం నుంచి విడిపించింది, నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా నీ కర్మ నిన్ను తప్పకుండా వెంటాడుతుంది. వదలక వెంటాడి ఆ కర్మఫలాన్ని అనుభవింపజేస్తుంది. కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు’ అని అంటాడు.


ధృతరాష్ట్రుడు సమాధానపడ్డట్టు అనిపించినా మళ్లీ కృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు. 


కర్మ అంత వదలని మొండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు? ముందే ఎందుకు శిక్షించలేదు.. అని ప్రశ్నిస్తాడు.


 అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి ‘ఓ రాజా! వందమంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి.. ఎన్నో సత్కర్మలు ఆచరించాలి. ఈ యాభై జన్మలు నువ్వు ఈ వందమంది పుత్రులను పొందడానికి కావాల్సిన పుణ్యాన్ని సంపాదించుకున్నావ్​. వందలాది మంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పనిచేయడం మొదలుపెట్టింది అని సెలవిస్తాడు. అది విన్న ధృతరాష్ట్రుడు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు.


మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్యఫలాలన్నీ ఒక్క చెడ్డపనితో తుడిచిపెట్టుకుపోతాయని శ్రీ కృష్ణుని అంతరార్థం. -

🍁🍁🍁🍁

***సేకరణ

జ్యొతిష్యుడు – జ్యోతిష్యం

 జ్యొతిష్యుడు – జ్యోతిష్యం


ఒక రోజున ఒక జ్యొతిష్యుడు కంచి పరమాచార్య స్వామి వారి దర్శనానికి విచ్చేసారు. ఆయన పరమాచార్య స్వామి వారితో ఇలా అన్నారు, “నాది చాల పెద్ద కుటుంబం. కానీ జ్యొతిష్య వృత్తి లొ ఉన్న నాకు ఆదయం చాలా తక్కువ. నాకు జీవనం చలా కష్ఠంగా ఉంది.”   


దానికి పరమాచార్య స్వామి వారు “ఓహొ! నీవు మీ తండ్రి గారు నివసించిన మీ పుర్వికుల ఇంట్లొనే ఉంటున్నావా లేక వేరే ఉంటున్నావా?” అని అడిగారు  


దానికి ఆ జ్యొతిష్యుడు ”లేదు స్వామి ఆ ఇంట్లొ మా అన్నగారు ఉంటున్నారు, నేను ఆ ఇంటికి పడమరన ఉన్న వేరే ఇంట్లొ ఉంటున్నాను” అన్నారు.   


వెంటనే పరమాచార్య స్వామి వారు “అలాగా, నీవు పడమరన ఉన్న ఇంట్లొ ఉండవద్దు. మీ పుర్వీకుల ఇంటికి తుర్పున ఒక పాత గోశాల ఉన్నది అక్కడ కుటీరము వెసుకుని నివాసం ఎర్పర్చుకొండి. నీ పుర్వికులు అందరు అక్కడ గోపూజ చెసేవారు అందుకని మీరు ఆ గొశాల వద్దకు నివాసం మార్చుకొండి” అని చెప్పి.. ఇంకొ విషయం నీవు బాగా గుర్తుంచుకొవాలి, నీ దగ్గరకి జ్యొతిష్యం చెప్పించుకుందాం అని వచ్చిన వారి  జాతకం చుసి నువ్వు “గురుడు నీచం, శని పాప కారకుడు అంటూ గ్రహలను దుషిస్తున్నావు. నీవు అలా అనరాదు. గురుడు అన్నిటి కన్నా పెద్ద గ్రహం సాక్షాత్తు దక్షిణాముర్తి రూపం. శని సూర్య భగవానుడి కుమారుడు. ఆయన కుడా ఐశ్వర్య కారకుడే. కానీ నీవు అతనిని పాపి అంటున్నావు. ఇన్ని మాటలు అనేకన్నా మీ గ్రహములు ఉండవలసిన స్థానములలొ లేవండి అంటే చాలు కదా.” 


వివాహం కోసం వధూవరుల జాతకం కుదిరిందో లెదో చుడమని నీదగ్గరకి తీసుకు వస్తే నువ్వు అవి చూసి వారి మొహం మీదే "ఈ జాతకాలు కలవలేదు" అని చెప్పడం కన్నా “వివాహనికి ఇంకా మంచి సమయం రావలి” అని సాధ్యమైనంత వరకు వారి మనస్సు నొప్పించకుండా మాట్లాడాలి. వివాహ విషయం లొ నీవు వధూవరుల జాతకాలు కలవడం కన్నా వారి కులం, గోత్రం మనస్సులు కలిసాయా లేదా అనేది ప్రధానంగా చూడవలిసి ఉంటుంది. పుర్వ కాలమున జాతకాలు కలవడానికి అంత ప్రముఖ్యత ఇచ్చేవారు కాదు. 


ఇది విన్న ఆ జ్యొతిష్యుడు చాల అనందించి, “నేను ప్రమాచార్య స్వామి వారు ఎలా చెయ్యమని చెప్పారో ఇక నుంచి అలాగే చెస్తాను” అని చెప్పి ప్రసాదం తీసుకుని తృప్తిగా ఇంటికి వెళ్ళాడు.


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

అనఘాష్టమి

 అనఘాష్టమి

అనేక రూపాలు ధరించే గురుదత్తాత్రేయునకి ఒక గృహస్త రూపం కూడా ఉంది . అటువంటి గృహస్త రూప దత్తునకే "అనఘస్వామి" అని పేరు . ఆ స్వామి అర్ధాంగికి "అనఘాదేవి" అని పేరు.ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారము. అనఘాదేవిలో శ్రీ రాజరాజేశ్వరి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉన్నాయి. అనఘస్వామిలో  బ్రహ్మ, రుద్ర, విష్ణు లక్షణాలు ఉన్నాయి. అనఘుడు విష్ణు స్వరూపుడు, అనఘాదేవి లక్ష్మి స్వరూపము. ఈ దంపతులిద్దరూ నిత్యమూ తపోమయమైన జీవనం గడుపుతూ భక్తులకు తత్వజ్ఞానాన్ని అనుగ్రహించే అతి ప్రాచీన ఆది దంపతులు. వారికే అష్టసిద్ధులు (అణిమా, లఘిమా, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశిత్వం, వశిత్వం, కామావసాయితా, మహిమా) పుత్రులై అవతరించారు.అనఘాదేవి యోగేశ్వరి, జగన్మాత, యోగంలో ప్రీతి గలది. గృహం, పతి, పత్ని, పుత్రులను అనుగ్రహిస్తుంది. వంశవృద్ధిని కలిగిస్తుంది. సమస్త కోరికలను సిద్ధింపజేస్తుంది. కవితా శక్తిని, కళలను ఇస్తుంది. ఈమెకే "మధుమతి" అనే పేరు కూడా ఉంది. ఈమె అనఘస్వామి భ్రూమద్య నుండి ఉద్భవించినది. దత్తాత్రేయుడు అనఘను వామభాగంలో ధరించి ఉన్న శాక్త రూపము . "అఘము" అంటే పాపము, ఇది మూడు రకాలు. అనఘము అంటే ఆ మూడు రకాల పాపాలను నశింపజేయడం. అనఘాస్టమీ వ్రతానికి ముఖ్యమైన రోజు మార్గశీర్షమాస కృష్ణపక్ష అష్టమి. ఈ రోజున ప్రతీ సంవత్సరం ఈ వ్రతం చేయడం చాల మంచిది.....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

జాతక దోష నివారణ పద్ధతులు

 జాతక దోష నివారణ పద్ధతులు


భూమి మీదున్న ప్రతి మానవునికి దేవ ఋణము, పితృ ఋణము అనే రెండు ఋణములు ఉంటాయి. అవి తీర్చుకోవాల్సిందే. కృతఘ్నతా దోషముతో మళ్లీ మళ్ళీ జన్మలెత్తడం, లేదా ఇంటిలో భూత ప్రేత పిశాచాల భయం, అకాల మరణాలు వంటి.. కఠిన సమస్యలతో సతమతమవటం జరుగుతూనే ఉంటుంది. కనుక ముందు ఈ ఋణములు తీర్చుకోవాలి.


దేవ, పితృ యజ్ఞాలు ప్రతివారు ఆచరించాల్సిన నిత్య కర్మలు. ఆ పితరులే లేకపోతే.. ఈ జీవితం శరీరం ఎక్కడిది?! కనుక తప్పక వారిని అర్చించాలి. వారికి ఆహారాన్ని స్వధా దేవి చేకూరుస్తుంది. 'స్వర్గం లోకం దధాతి యజమానస్యేతి స్వధా' అనగా పితృ యజ్ఞములు చేయువారికి ఉత్తమ స్థితులు, చేయనివారికి అధోగతులని భావం. మేము జ్ఞానులైపోయాము బదరీ క్షేత్రంలో పిండప్రదానం చేశాము, ఇక తామేమి చేయనక్కరలేదని పితృ యజ్ఞములు మానేస్తే మహా పాపమును పొందుతారని చెప్పబడుతోంది. జీవం ఉన్నంతవరకు.. హేతువైన పితృ దేవతలను నిత్యం స్మరించుకోవాలి.


సమస్య వచ్చినప్పుడే, పండగ వచ్చినప్పుడే దేవతలు గుర్తొస్తారనే విషయం చాలా మందిలో కనిపిస్తున్న వాస్తవం. పితరులకు భక్తి విశ్వాసాలతో ప్రతి ఏటా పితృ కార్యాన్ని ఆచరించినప్పటికీ... ఆయా కుటుంబాల వారు సుఖ శాంతులకు దూరంగానే ఉన్నారు. దీనికి కారణమేమిటనే ప్రశ్న తెరపైకి రావవచ్చు. నిజమే మరి.. స్వధా దేవిని కేవలం పితృ కార్యాలనాడే తలుచుకుంటారే తప్ప మిగిలిన రోజులలో మచ్చుకైనా గుర్తుచేసుకోరు. కేవలం సంవత్సరానికి ఒక రోజున వచ్చే పితృ కార్యం ఆచరించి చేతులు దులుపుకొన్నంత మాత్రాన లాభం లేదు, పితృతిధి రోజునే పితృ కార్యం ఆచరించిననూ  స్వధా దేవిని ప్రార్ధించటం లేదు. కేవలం ఆనాడు.. ఆ కార్యాన్ని పూర్తి చేయటానికి స్వధా దేవిని ఒక దూతగానే వాడుకున్నాం తప్ప ఆ తల్లి అనుగ్రహం నిత్యం ఉండాలని, చాలా మంది గమనించరు.


స్వాహా దేవికి 16 నామలున్నట్లుగానే, స్వధా దేవికి కూడా 8 నామాలున్నవి. పితృప్రాణతుల్యా, యజప్రీతికరా, యజదేవతారూపిణి, శ్రాద్ధాధిష్టాతృదేవీ, శ్రాద్ధఫలప్రదా, ఆత్మ మానసకన్యా, పితృదృష్టిప్రదా, కృష్ణవక్షస్థలా అనే 8 నామాలు. ఈ స్వధా దేవినే పురాణములలో గోలోక వాసినిగా ఉన్న కృష్ణవక్షస్థలా అనికూడా చెప్పబడింది.  ఈ 8 నామాలతో ఉన్న స్వధా దేవిని ప్రత్యేక పద్ధతులలో అర్చించాలి. కనుక శ్రీ లలితా సహస్రనామ స్తోత్రములోని మహా పుణ్యవంతమైన నామాలలో ఉన్న స్వాహా, స్వధా దేవతలను అర్చించటానికి కూడా ప్రత్యేకమైన రోజులు అవసరం. ఈ స్వాహా, స్వధా దేవతలను శాస్త్రీయ పద్దతిలో అర్చిస్తేనే, పూర్ణ ఫలాలను పొందగలుగుతారు.


ప్రతి ఒక్కరు దేవ యజ్ఞమును, పితృ యజ్ఞమును చేయాలి. దేవ యజ్ఞమును చేసినప్పుడు స్వాహాకారం, పితృయజ్ఞం చేసినప్పుడు స్వధాకారం ఉండును. ఈ రెండు శక్తులు వాక్కునకు మూలమైన అగ్నికి సంబంధించిన శక్తులుగా వర్ణింపబడినవి. ఈ విశ్వంలో దేవతలకి, పితృ దేవతలకి స్థానములున్నవి. వీరిరువురిని పూజించుట నిత్య కర్మలలో విధింపబడినది. భారతీయ యజ్ఞ విజ్ఞానంలో అనేక విషయములున్నవి. యజ్ఞాజ్ఞిలో  సరియైన ప్రేరణతోనే స్వాహా, స్వధా శబ్దములు ఉండాలి. వాటి వల్లనే దేవతలు, పితృదేవతలు తృప్తి చెందుతారు.


పితృ కార్యములు ఆచరించునప్పుడు ఒకే పరమేశ్వరాగ్ని 3 విధములైన దేవతలుగా చెప్పబడును. అవి వసు, రుద్ర, ఆదిత్య రూపమైన దేవతలు. అనగా అగ్ని, వాయు, సూర్యులలో దాగి ఉన్న పితృ శక్తి వసు, రుద్ర, ఆదిత్యుల రూపములుగా వ్యవహరింపబడుతున్నవి. ఈ 3 రూపములలో ఉన్నవారికి.. కర్త అయిన వ్యక్తి తన భావమును విన్నవించుకొనుటకు ఈ స్వధా దేవియే శరణ్యం. అగ్ని, వాయు, సూర్యుల ధారణా శక్తిని స్వధా అంటారు. ఇది వేదము చెప్పిన స్పష్టత. ఈ దేహములోనే కాక దేహానంతరము కూడా నడుపు శక్తి స్వధా దేవి. పితృ రూపములో జీవులు ఏ స్థితిలో ఉన్నారో, ఎక్కడ ఉన్నారో.. ఇక్కడ ఉన్నవారికి తెలియదు. కానీ ఆ పితృదేవతలను చేరుటకు మానవుని కర్మకు తగినటువంటి ఫలమును అందించుట ఒక్క స్వధా దేవికే సాధ్యం.


నైవేద్యం

ఎవరింట్లో అయితే పితృశాపం ఉంటుందో, ఎవరింట్లో అయితే పెద్దల కార్యాలను సరిగ్గా చేసి ఉండరో, ఎవరింట్లో అయితే అకాల మరణాలు ఎక్కువుగా సంభవిస్తూ ఉంటాయో, ఎవరింట్లో అయితే పెద్దల కలలోకి వస్తుంటారో, ఎవరింట్లో అయితే దెయ్యం, భూతం, పిశాచాల సమస్యలు ఉంటాయో అటువంటివారు దేవునికి నువ్వుల అన్నం లేదా నువ్వుల పొడితో చిత్రఅన్నని నైవేద్యంగా ఉంచి ప్రసాదంగా పంచాలి అలా చేస్తే వంశంలో, ఇంట్లో ఉన్న పితృ దేవతలా శాపాలు తొలగిపోతాయి. దేన్నీ చేసి మహాలయ అమావాస్య రోజు పెద్దల కార్యాలను చేస్తే అన్ని రకాల పితృ దోషాలు తొలగిపోతాయి.....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

తెలుగు సాంప్రదాయ క్యాలెండర్

 

తెలుగు సాంప్రదాయ క్యాలెండర్ కోసం క్రింద క్లిక్ చేయండి


https://drive.google.com/file/d/1W8q4AQbOdKzi0Vh4o3H4Rxd4xt4vKiRn/view?usp=drivesdk

భారతీయ గొప్ప తనాన్ని

 భారతీయ గొప్ప తనాన్ని చెప్పిన ప్రపంచ దేశ గొప్ప వ్యక్తులు, ఈ క్యాలెండర్  లో ఉంది చూడండి


https://drive.google.com/file/d/1WgU2eHmO0WXAB2qixB6rKAH4o_rdb8gb/view?usp=drivesdk

శని

 శని  

సూర్యునికి ఛాయ దేవికిని  వికారి నామ సంవత్సరం మార్గశిర కృష్ణ నవమి నాడు  కలిగిన సంతానమే "శని" ఇతని వృత్తాంతంము సూర్యుని వృత్తాంతమునందు చెప్పబడెను శని మానవ జీవితాలలో అత్యంత ప్రభావము చూపువాడు త్రిమూర్తుల సైతం ముప్పుతిప్పలు పెట్టినటువంటివాడు గ్రహమండలమున స్థానం పొందెను. అధిదేవత యముడు. ప్రత్యధిదేవత ప్రజాపతి. వాహనం: కాకి, ఋతువు: శిశిరం. సజ్ఞాదేవి శపించంగా శనికి మందగమనం ప్రాప్తించింది.

విపత్తి హానిం సంపత్తి కుక్షిరోగం సుతక్షయం

లక్ష్మీకరం మహర్ధైన్యం మరణం దేహ శోషణం

బంధనం లాభ నష్టంచ క్రమేణ కురుతే శని:

తాత్పర్యము : శని పన్నెండు రాశులలో సంచారము చేయు నపుడు 1 ఆపదలను 2 హానిని 3 సంపదను 4 గర్భసంభంద రోగములను 5 సంతానమునకు కష్టములను , నాశనమును 6 మహా ఐశ్వర్యమును 7 మహా దరిద్రమును 8 మరణ సమాన ఫలితములను 9 దేహ శోషణమును 10 బంధనమును 11 లాభమును 12 అనేక విధాల నష్టములను కలిగించు చున్నాడు .శని, సూర్యుడి నుండి ఆరవ గ్రహం. సౌర వ్యవస్థలో అన్ని గ్రహాల కంటే పెద్దదైన గురు గ్రహం తరువాత, శని అతి పెద్ద గ్రహం. ఇది పూర్తిగా వాయువులతో కూడుకుని ఉంటుంది. దీని సగటు వ్యాసార్థం, భూమి వ్యాసార్థానికి ఆరు రెట్లు ఉంటుంది.  సగటు సాంద్రత భూమి సాంద్రతలో ఎనిమిదవ వంతు ఉంటుంది. కానీ, శని ఘనపరిమాణం చాలా ఎక్కువ కావడాన, దాని ద్రవ్యరాశి భూమికి 95 రెట్లు ఉంటుంది. ఈ గ్రహానికి ఈ పేరు, హిందూ దేవుడు శని పేరిట వచ్చింది. దీన్ని ఇంగ్లీషులో శాటర్న్ అని అంటారు. ఇది రోమనుల వ్యవసాయ దేవత పేరిట వచ్చింది. శని గ్రహపు సంకేతం (♄) చేతిలో ఉండే కొడవలి పేరిట వచ్చింది.శనిగ్రహ ఉపరితలంపై బలమైన గాలులు వీస్తూంటాయి. ఈ గాలుల వేగం 1,800 కి.మీ./గం వరకూ ఉంటుంది. ఇది గురుగ్రహంపై గాలుల వేగం కంటే ఎక్కువ. నెప్ట్యూన్ పై గాలుల వేగంతో సమానం.   శనిగ్రహంపై ఒక రోజుకు 10 గంటల, 33 నిముషాల, 38 సెకండ్ల సమయం (+1 ని.52సె. -1ని.19సె) పడుతుందని 2019 జనవరిలో ఖగోళవేత్తలు లెక్కించారు. ఈ గ్రహపు అత్యంత ప్రముఖమైన విశేషం, దాని చుట్టూ ఉండే వలయాల వ్యవస్థ. ఇది మంచు ముక్కల తోను, రాళ్ళ శిథిలాల తోనూ కూడుకుని ఉంటుంది. శని చుట్టూ 62 సహజ సిద్ధ ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. భారతీయ జ్యోతిష శాస్త్రంలో శని ఒక గ్రహం. దీన్ని నపుంసక గ్రహంగా భావిస్తారు. వర్ణం నలుపు, నీలం సూచిస్తాడు. శని మకర రాశి, కుంభరాశులకు అధిపతి. తులారాశిలో ఉచ్ఛస్థితిని, మేషరాశిలో నీచ స్థితిని పొందుతాడు. పుష్యమి, అనూరాధ, ఉత్తరాభద్ర నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. మిత్రులు బుధుడు, శుక్రుడు, శత్రువులు రవి, చంద్ర, కుజులు, సముడు గురువు. ముసలి వారిని, సన్నని పొడగరులను సూచిస్తాడు. తత్వం వాయుతత్వం, దిక్కు పడమర, ఋతువు శిశిరం, జాతి శూద్ర, లోహము ఇనుము, ఉక్కు, రత్నములలో నీలం, గ్రహసంఖ్య ఎనిమిది, దిక్బలం సప్తమ స్థానం, గుణము తమోగుణము, ప్రదేశము హిమాలయాలలోని గంగా పరీవాహక ప్రాంతాన్ని సూచిస్తాడు. శరీర అవయవములలో ఎముకలు, క్లోమము, విసర్జకావయములను సూచిస్తాడు. క్రూర గుణం.ప్రాణుల పాపఫలితాన్ని అందించే గ్రహంగా గుర్తించబడింది.ఇది పాపగ్రహంగా కూడా వర్ణించబడింది. దశా కాలం: 19 సంవత్సరాలు. ఏలిననాటి శని జాతక చక్రంలో 12,1,2 స్థానాలలో శని సంచరించే కాలం ఏలిననాటి శని కాలం. ఇది జాతకుని అత్యంత కష్టాలపాలు చేస్తుందని విశ్వసించబడుతుంది.ఇది దాదాపు ఏడున్నర సంవత్సరముల కాలం.ఇది జాతకునికి నాలుగు సార్లు రావచ్చని భావన. పాద శని, పొంగు శని, మంగు శని 8 మరణశని. శతృవు: రవి,చంద్రుడు,కుజుడు శతృగ్రహాలుగా భావిస్తారు ఆకారణంగా రవి కారకత్వంగా కలిగిన తండ్రి చంద్రుడు కాతకత్వంగా కలిగిన తల్లి కుజుడు కారకత్వంగా కలిగిన సోదరులతో శని ఆదిపత్యం కలిగిన మకర మరియు కుంభ రాశుల వారికి పరస్పర వైరం ఉంటుందని భావిస్తారు.ఏలిన నాటి శని కాలం ఏడున్నర సంవత్సరమముల కాలం, శని మహర్దశ కాలంలో, అర్ధాష్టమి, అష్టమ స్థాన సంచార కాలంలో సమస్యలు సృష్టిస్తాడు. వీటికి ఆందోళన చెందవలసిన పని ఉండదు. పరిహారాలు ఉంటాయి. శని ఆధిపత్యంలో ఉన్న రాశులు అయిన కుంభ, మకర రాశుల వారికి, మిత్ర స్థానాలు అయిన మిధున, కన్యా, వృషభ, తులా రాశుల వారికి శని నక్షత్రాలైన పుష్యమి, అనూరాధ, ఉత్తరాభద్ర నక్షత్రాలలో జన్మింక్ష్చిన వారికి, కొంత వెసులుబాటు ఉంటుంది. కష్టాలు మనిషి అహంకారం తగ్గించి జీవిత సత్యాలను తెలియ చేయడమే కాక సుఖానికి ఉన్న విలువను గుర్తించేలా చేస్తుంది. శని జీవిత గమనానికి కావలసిన స్థిరాస్థులను ఏర్పరుచుకోవడానికి కారకుడౌతాడు కనుక కొంత మంచి జరుగుతుంది. కష్టాలను ఓర్చుకునే శక్తిని, వాటిని అధిగమించే శక్తిని ఇచ్చి మనిషిని పుటం పెట్టిన బంగారంలా మెరిసేలా చేస్తుంది. శని వైరాగ్యాన్ని, భక్తిని ప్రసాదిస్తాడు. ఆయుఃకారకుడు, ఆటంకములు, విరోధం, కష్టం, బాధలు, దుఃఖం, సేవకత్వం, దురాచారము, బంధనం, మూర్ఖత్వం, జూదము, జైలు జీవితం, మద్యపానం, అంగవైకల్యం, మూర్చ రోగం, అంగవైకల్యం, బ్లాక్ మార్కెట్, అన్యాయార్జన, జీవహింస, అవమానము, రాజదండన, బద్ధకం, క్షుద్రశక్తులు, అప్పులు, మృత్యుదేవతారాధాన, అంద విహీనత, బంధు మిత్ర తిరస్కారం సూచిస్తాడు. వంటవారు, నపుంసకులు, చండాలురు, అక్రమసంతానం, సేవకులు, నీచులను సూచిస్తాడు. పురాతన భవనాలు, పురాతన వస్తువులు, పూరావస్తు శాఖ, సొరంగాలు, గుహలు, చలివేంద్రములు, నువ్వుల నూనె, గానుగ, నూనె దుకాణములను సూచించును. నువ్వులు, ఉల్లి, వేరు శనగ, బంగాళాదుంపలు, రాగులు, జొన్నలు, మినుములు, దున్నపోతు, గాడిద, ఒంటె, కోడి, బొగ్గు, తారు, నల్లమంగోళ్ళకు సంబంధించిన సమస్యలు, అజీర్ణం, కిరోసిన్, వెండ్రుకలు, ఎముకలు, దంతములను సూచిస్తాడు. కలప, తోలు పరిశ్రమలను సూచిస్తాడు. ఆలస్యము, దురదృష్టము, సరిహద్దులు, దహనకార్యక్రమాలు, అపవాదు, పదవీ విరమణ, నిర్మాణం, శాస్త్రీయదృక్పదం, ఒంటరి తనం సూచిస్తాడు. గనులు, వంతెనలు, చర్మము, ఆనకట్టలు, పిరికి వాళ్ళు, రాళ్ళు, ఆస్తి, ఆపద, మంచు, ఆందోళన, వినయము, అనుమానము, అనుకూలత, వినయము, సెరామిక్స్, మట్టిని సూచిస్తాడు. శని వాత సంబంధ వ్యాదులను సూచిస్తాడు. కీళ్ళ వాతం, పక్షవాతం, బలహీనత, నొప్పులు, కిడ్ని లివర్ మొదలైన వాటిలో రాళ్ళు ఏర్పడుట, క్షయ, దగ్గు, ఆస్త్మా, న్యుమోనియా, ఎముకలకు సంబంధించిన వ్యాధులు, వెంట్రుకలకు సంబంధించిన సమస్యలు, అజీర్ణ వ్యాధులు, పని చేయలేని అశక్తి, డ్రగ్స్ అలవాటు మొదలైన వాటికి కారకుడు. చంద్రుడితో కలిసిన మతి భ్రమణం, పిచ్చి, వాతం, గుండె నొప్పి, కండరాల నొప్పి, తల నొప్పి, బద్దకం, నీరసం మొదలైనవి సూచిస్తాడు. గురువుతో చేరిన జీర్ణ వ్యస్థకు సంబంధించిన వ్యాధులు. బుధుడితో కలిసిన మాటలు సరిగా రాకుండుంట, నత్తి, నాలుక మొద్దుబారటం, మెదడు మొద్దుబారటం, చెవి సంబధిత వ్యాధులు సూచిస్తాడు. కుజుడితో కలిసిన కండరాల నొప్పి, కండరాల జబ్బులు సూచిస్తాడు. శుక్రుడితో కలిసిన గొంతు నొప్పి, టాన్సిల్స్, పైల్స్, విరేచనాలు మొదలైన వ్యాదులను సూచిస్తాడు. రాహువుతో కలిసిన విషప్రయోగం, వైరస్ వ్యాదులను సూచిస్తాడు.కేతువుతో కలిసిన రక్త పోటు వ్యాదులను సూచిస్తాడు.  జైలర్, ప్లంబర్, వాచ్‌మన్, పాకీపని చేయు వారు, వీధులు ఊడ్చు వారు, కూలీలు, మేస్త్రీ పని వారు, తోటమాలి, రైతులను సూచిస్తాడు. లోహాలు, తోలు, కలప వ్యాపారాలు. చంద్రుడితో కలిసిన సివిల్ ఇంజనీర్లు, బిల్డర్స్, సర్వేయర్లు, ఎక్స్‌రే టెక్నీషియన్లను సూచిస్తాడు. రవితో కలిసిన ప్రభుత్వరంగ సేవలు చేసే వారు. గురువుతో కలిసిన భూముల కొనుగోలు అమ్మకాల వ్యాపారం, గనుల యజమానులు, సైంటిఫిక్ లాబ్‌లో పని చేయు వారు. బ్యాంక్ సిబ్బంది, ప్రచారం చేయు వారిని సూచిస్తాడు. బుధుడితో కలిసిన రచయితలు, శాస్త్రవేత్తలు, కలప కోయు వారు, ఉపాధ్యాయులు, సెన్సార్ బోర్డ్, సి ఐ డి డిపార్ట్ మెంటులో పని చేయు వారిని సూచిస్తాడు. శనికి ప్రీతికరమైన జ్యేష్టశుద్ధ ద్వాదశి, మార్గశిర శుద్ధ అష్టమి నాడు పూజలు జపాలు నిర్వహించడం శ్రేష్టం. దోషనివారణకు నీలమణి, ఎర్రచందన మాల, చతుర్దశ ముఖ రుద్రాక్ష ధారణ చేయాలి. హోమముకు వాడవలసిన సమిధ జమ్మి. ప్రీతికరమైన వారం శనివారం.


లగ్నంలో శని ఉన్న జాతకుడు దు॰ఖపూరితుడు, నిస్సహాయుడు, మలినాంబరధారి, నీరసి అయి ఉంటాడు. అయినా శని స్వరాశులైన మకరం, కుంభం, ఉచ్ఛ స్థానమైన తుల రాశులు లగ్నమై వాటిలో శని ల్గ్నస్థుడై ఉంటే మాత్రం రాజతుల్యుడు, ప్రధాన పదవులు వహించే వాడు, నగరపాలకుడు ఔతాడు.

ద్వితీయస్థానమున శని ఉన్న జాతకుడు జుగుస్సు కలిగించే ముఖం కలవాడు, ధనహీనుడు, అన్యాయవర్తనుడు, కాలక్రమమున దూరప్రాంతములణందు నివసించు వాడు ధనవంతుడు ఔతాడు.

తృతీయస్థానమున శని ఉన్న జాతకుడు మిక్కిలి విజ్ఞానవంతుడు, ఉదారుడు, భార్యాసమేతంగా సుఖపడువాడు, ఉత్సాహి, దుఃఖం లేని వాడు ఔతాడు.

చతుర్ధస్థానమున శని ఉన్న జాతకుడు సుఖహీనుడు, గృహము లేని వాడు, వాహనములు లేని వాడు, బలారిష్టములు అనుభవించు వాడు, తల్లిని పీడించువాడు ఔతాడు.

పంచమస్థానమున శని ఉన్న జాతకుడు, అజ్ఞాని, పుత్రులు లేని వాడు, ధనహీనుడు, సుఖహీనుడు, దురభిమాని, దురాలోచనాపరుడు ఔతాడు.

షష్టము స్థానమున శని ఉన్న జాతకుడు ధనవంతుడు, అధికంగా ఆహారం తినువాడు, దుశ్చరిత్రుడు, అభిమానవంతుడు, శత్రువుల చేత ఓడింపబడిన వాడు ఔతాడు.

సప్తమస్థానమున శని ఉన్న జాతకుడు తిరుగాడు వాడు, కళత్రం కలిగిన వాడు, భయకంపితుడు ఔతాడు.

అష్టమ స్థానమున శని ఉన్న జాతకుడు శుభ్రం లేని వాడు, ధనం లేని వాడు, మూల వ్యాధి పీడితుడు, క్రూరమనస్కుడు, సజ్జనుల చేత అవమానించబడిన వాడు ఔతాడు.అదే శని వక్ర మార్గం లో ఉంటే ఆయుష్షు నష్టం అవుతుంది. లగ్నం లో రవి 8 అష్టమం లో శని రోగపీడితులు.

నవమస్థానమున శని ఉన్న జాతకుడు అదృష్టం లేని వాడు, సంపదలేని వాడు, సంతతి లేని వాడు, పితృధర్మం లేని వాడు, మోసకారి ఔతాడు.


దశమస్థానమున శని ఉన్న జాతకుడు రాజు కాని, మంత్రి కాని ఔతాడు. ధైర్యవంతుడు, ధనవంతుడు, ఖ్యాతి కలవాడు ఔతాడు.


ఏకాదశ స్థానమున శని ఉన్న జాతకుడు చిరంజీవి, బహుసంపాదనాపరుడు, స్థిరసంపదలు కలిగిన వాడు, రోగములు లేని వాడు ఔతాడు.

ద్వాదశ స్థానమున శని ఉన్న జాతకుడు నిర్లజ్జ కలవాడు, ధనం లేని వాడు, పుత్రులు లేని వాడు, అంగవికలుడు, మూర్ఖుడు, శత్రువులచేత తరమబడిన వాడు, పుత్రులు లేని వాడు ఔతాడు.....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

మొగలిచెర్ల

 *మనసులో మార్పు..*


పది నెలల క్రిందట ఒక శనివారం సాయంత్రం ఐదు గంటల వేళ, ఆ దంపతులు మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చారు..ఉచిత దర్శన వరుసలో వచ్చి, శ్రీ స్వామివారి సమాధిని దూరం నుంచే చూసి, నమస్కారం చేసుకొని..అదే వరుసలో ఉంచబడిన స్వామివారి dcవెండిపాదుకులకు భక్తిగా నమస్కారం చేసుకొని, పూజారి ఇచ్చిన తీర్ధాన్ని తీసుకొని..ఇవతలకు వచ్చారు.."ఇక్కడ ప్రతి శనివారం నాడు పల్లకీసేవ జరుగుతుంది కదా..మేము అందులో పాల్గొనాలంటే ఎలా..? " అని అక్కడే ఉన్న మా సిబ్బంది లో ఒకరిని అడిగారు..అతను చెప్పిన జవాబు విని, టికెట్ కొనుక్కొని, తమ పేర్లు నమోదు చేయించుకొని..మంటపం లో కూర్చున్నారు..


ఆరోజు సాయంత్రం పల్లకీసేవ లో పాల్గొన్న తరువాత ఆ దంపతులు నా వద్దకు వచ్చారు.."ప్రసాద్ గారంటే మీరేనా..? " అన్నారు..నేను తలవూపాను..నా ప్రక్కన కుర్చీలో కూర్చున్నారు.."రేపుదయం ఎన్ని గంటలకు ఆలయం తెరుస్తారు..?మేము స్వామివారి సమాధి వద్దకు వెళ్లాలని అనుకుంటున్నాము..మమ్మల్ని అనుమతిస్తారా?..చాలా సమస్యలో ఉన్నాము.." అన్నారు..మందిరం వేళలు చెప్పాను..ఉదయం ఏడు గంటల తరువాత సమాధి దర్శనానికి వెళ్లొచ్చని తెలిపాను..సరే అన్నారు..ఏదో చెప్పాలని సందేహిస్తున్నట్లు అనిపించింది.."ఏమన్నా సందేహం ఉందా.."? అని అడిగాను..

"సందేహం ఏమీ లేదండీ..మా సమస్య చెప్పుకుందామని అనుకుంటున్నాము..మీరు స్వామివారి వద్దే ఎక్కువ కాలం వుంటారు కదా..పైగా స్వామివారితో వ్యక్తిగతంగా సాన్నిహిత్యం తో వున్నారు..మీకు చెప్పుకుంటే..కొంచెం బాధ తగ్గుతుందని భావించాము.."అన్నారు..

"చెప్పండి.." అన్నాను..


"నా పేరు ఉమాపతి రావు, ఈమె సుబ్బరావమ్మ..మాకు ఇద్దరు సంతానం అండీ..అమ్మాయి, అబ్బాయి..అమ్మాయి పెద్దది..ఇంజినీరింగ్ చదివింది..MBA కూడా చేసింది..అబ్బాయి కూడా ఇంజినీరింగ్ చేసాడు..దేవుడి దయవల్ల వాడికి వెంటనే ఉద్యోగం వచ్చింది..ఇప్పుడు మా సమస్య మా అమ్మాయేనండీ..చిన్నతనం నుంచీ గారాబంగా పెంచాము..మొండితనం ఎక్కువ..తాను అనుకున్నది వెంటనే జరగాలి..లేకపోతే ముందూ వెనుకా చూడకుండా చేతిలో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు విసిరి కొడుతుంది..ఎంత నచ్చచెప్పినా వినదు.." అంటూ ఒక్కక్షణం ఆగాడు..


"అది ఆరకంగా తయారు కావడానికి ఈయన కూడా కారణమేలెండి..ఆడపిల్ల..మహాలక్ష్మి..అంటూ చిన్నప్పటి నుంచీ నెత్తికెత్తుకున్నారు..అది ఆడిగిందల్లా కొనివ్వడం చేశారు..అది మొండిగా మారింది..అంతా మా ఖర్మ..పెళ్లి కావాల్సిన పిల్ల..ఇలా ఉంటే ఎవరు చేసుకుంటారు?..ఈ స్వామివారి గురించి తెలుసుకొని, ఇక్కడ మొక్కుకుంటే దాని మనసు మారుతుందేమో అనే ఆశతో వచ్చామండీ..అమ్మాయిని కూడా తీసుకొద్దామని శతవిధాల ప్రయత్నం చేసామండీ..రాను గాక రాను..అని తెగేసి చెప్పింది..విధిలేక అమ్మాయిని ఒక్కదాన్నీ ఇంట్లో ఉంచలేక..అబ్బాయిని తోడు ఉంచి వచ్చాము..దాని మనసు మారి..ఒక దారిలో పడితే..అదే మాకు చాలు..ఇప్పుడు దానికి పాతికేళ్ళు..ఇప్పుడన్నా పెళ్లి చేయాలి కదా..మేము ఆ బాధ్యత తీర్చుకోవాలని ఆరాటపడుతున్నాము..ఏ దిక్కూ తోచక..ఇలా వచ్చాము.." అని ఆవిడ వేదనతో చెప్పింది..


"రేపుదయం స్వామివారి సమాధి దర్శించుకొని మీ ఆవేదన తెలుపుకోండి..ఆపై మీ ప్రాప్తం.." అన్నాను.."అంతేలేండి..ప్రారబ్ధాన్ని అనుభవించాలి కదా.." అన్నారు ఇద్దరూ..


ప్రక్కరోజు ఉదయం ఎనిమిది గంటలకు వాళ్ళిద్దరికీ శ్రీ స్వామివారి సమాధి దర్శనానికి వెళ్లే అవకాశం కలిగింది..ఇద్దరూ లోపలికి వెళ్ళొచ్చారు.."స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకొన్నామండీ..మళ్లీ పది గంటల బస్ కు మా ఊరు వెళతామండీ..అన్నీ సక్రమంగా జరిగి..అమ్మాయి మనసు మారి, దాని వివాహం జరిగితే..మళ్లీ వస్తాము.." అన్నారు..సరే అన్నాను..ఆరోజు భక్తులు ఎక్కువగా వున్నారు..ఆ హడావిడి లో ఉండిపోయాను..


మరో గంటన్నర తరువాత..ఆ దంపతులిద్దరూ లోపలికి వస్తున్నారు..వాళ్ళ వెనుకే ఒక అమ్మాయి అబ్బాయి వున్నారు..నేరుగా నా దగ్గరికి వచ్చి.."ప్రసాద్ గారూ..వీళ్ళిద్దరూ మా పిల్లలు..అమ్మాయి..అబ్బాయి..ఈ బస్ కు ఇక్కడికి వచ్చారు..రాత్రి నుంచీ మా అమ్మాయి,  మొగిలిచెర్ల వెళదాము..అమ్మా నాన్న దగ్గరకు పోదాము..అని మా వాడి తో ఒకటే పోరు పెట్టిందట..ఆ బాధ పడలేక తెల్లవారుజామున బయలుదేరి అమ్మాయిని తీసుకొని ఇక్కడకు వచ్చాడు..స్వామివారి సమాధిని తానూ దర్శించుకుంటానని చెప్పింది..ఏమిటోనండీ దీని ప్రవర్తన అర్ధం కావడం లేదు..సరే కనీసం స్వామివారి దగ్గరకు వచ్చింది కదా..ఆమాత్రం చాలు..ఆపై ఆ స్వామే చూసుకుంటాడు.." అన్నాడు ఆయన..


అందరూ మళ్లీ టికెట్లు కొనుక్కొని..స్వామివారి సమాధి వద్దకు వెళ్ళొచ్చారు..ఆ అమ్మాయిని చూస్తే..ఎంతో సౌమ్యంగా ఉంది..మధ్యాహ్నం భోజనం చేసి..ఆ తరువాత బస్ కు వాళ్ళ ఊరెళ్లిపోయారు..


పోయిన జూన్ మొదటివారం లో.."ప్రసాద్ గారూ నేను ఉమాపతి రావును మాట్లాడుతున్నాను..గుర్తొచ్చానా..కొన్నాళ్ల క్రితం మా అమ్మాయి సమస్యతో మొగిలిచెర్ల స్వామివారి మందిరానికి వచ్చాము.." అని ఫోన్ చేశారు.."చెప్పండి.." అన్నాను.."ఈనెల 21వతేదీ నాడు మా అమ్మాయి వివాహం..స్వామివారి దయతో అంతా సర్దుకున్నది..మా బంధువుల అబ్బాయే వరుడు..పెళ్లి కాగానే..వధూవరులను తీసుకొని స్వామివారి మందిరానికి వస్తాము..ఆయన చల్లగా చూడబట్టే..ఈ కార్యక్రమం జరుగుతున్నది..మీరు కూడా పెళ్లికి వచ్చి ఆశీర్వదించండి..తప్పకుండా రండి.." అన్నారు..


పాతికేళ్ల మొండితనం ఎటు పోయిందో తెలీదు..భర్తతో కలిసి స్వామివారిని అత్యంత భక్తితో సమాధిని దర్శించుకున్నది..ఉమాపతిరావు దంపతుల ఆనందానికి హద్దులు లేవు..

అన్నీ తెలిసిన శ్రీ స్వామివారు సమాధిలో ఉండిపోయారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380).

వారణాసి (కాశీి) గురించి

 వారణాసి (కాశీి) గురించి తెలియని కొన్ని విషయాలు

కాశీ వైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు. సముద్రం నుండి నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం:


1.  కాశీ పట్టణం గొడుగు లాంటి పంచ క్రోశాల పరిధి లో ఏర్పడ్డ భూభాగం. ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారం లో ఉంటుంది. కాశీ బ్రహ్మ దేవుని సృష్టి లోనిది కాదు.


2.  విష్ణు మూర్తి హృదయం నుండి వెలువడి, సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం.


3. ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని. ప్రపంచ సాంస్కృతిక నగరం.

4. స్వయంగా శివుడు నివాసముండె నగరం.


5. ప్రళయ కాలంలో మునుగని అతి ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయ కాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడతాడు.


6. కాశీ భువి పైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి, కాశీ పన్నెందు జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠమైనది.


7. పద్నాలుగు భువన భాండాలలో విశేషమైన స్థలం.


8. కాశీలో గంగా స్నానం,బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు,విశాలాక్షి, కాలభైరవ దర్శనము అతి ముఖ్యం....


9. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు బైరవుడు జీవిని కాశీ లోనికి అనుమతించడు.


10. కాశీలో మరణించిన వారికీ యమ బాధ పునర్ జన్మ ఉండదు.


11. కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిట్టా చిత్రాగుప్తుని నుండి మాయం అయి కాలభైరవుని వద్దకు చేరుతుంది....


12. డిండి గణపతి, కాల భైరవుడు పరిశీలించి యమ యాతన కంటే 32 రేట్లు అధిక శిక్షలు విధించి మరు జన్మ లేకుండా చేస్తాడు ...


13. కాబట్టే కాశీలో కాల భైరవ దర్శనం తరవాత పూజారులు వీపు పై కర్రతో కొట్టి దర్శించిన వారు కాశీ దాటి వెళ్లి పోయినా పాపాలు అంటకుండా రక్ష నల్లని కాశి దారం కడతారు.


14. కాశీ వాసం చేసే వారికి సమస్త యాగాలు, తపస్సులు చేసిన పుణ్యం తో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమైతాయి.


15. కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు.


16. అందుకే కాశ్యాన్తు మరణాన్ ముక్తి అని శాస్త్ర వచనం కాబట్టే చివరి జీవితం చాలా మంది కాశీలో గడుపుతారు.


17. మరణించిన వారి ఆస్తికలు కాశి గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా విశ్వనాథునిచే ఉద్దరింప బడతారు.


18. గోముఖం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్లి దక్షిణ దిశగా ప్రవహించి దన్నుసాకారపు కాశీి పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది


19. ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీ ఘాట్లను వదిలి దూరం జరగలేదు.


 శివుని కాశీలోని కొన్ని వింతలు......


1. కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.


2. కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ జాడ దొరకకుండా ఉంటుంది.


3. కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు, పూలచెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు.


4. అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశీి లో అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్య పోయ్యారు.


5. అస్సలు ఈ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి?


6. అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు


7. అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు.


8. కాశీి విశ్వేశ్వరునికి శవ భస్మ లేపనం తో పూజ ప్రారంభిస్తారు .


9. కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లభిస్తుంది.


10. కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది; పాపం చేసినా కోటి రెట్ల పాపం అంటుతుంది.


11. విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతాయి.


12. ఇక్కడి శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు జగత్ అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశి.


13.  ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీిలోనే వున్నది.


కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి......


ఇందులో దేవతలు, ఋషులు, రాజుల తో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి ఎన్నో వున్నాయి. అందులో కొన్ని :


1) దశాశ్వమేధ ఘాట్:

బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే. రోజూ సాయకాలం విశేషమైన గంగా హారతి జరుగుతున్నది.


2) ప్రయాగ్ ఘాట్:

ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా,సరస్వతిలు కలుస్తాయి.


3) సోమేశ్వర్ ఘాట్:

చంద్రుని చేత నిర్మితమైనది.


4) మీర్ ఘాట్:

సతీదేవీ కన్ను పడిన స్థలం. విశాలాక్షి దేవి శక్తి పీఠం.

ఇక్కడే యముడు ప్రతిష్టించిన లింగం ఉంటుంది.


5) నేపాలీ ఘాట్:

పశుపతి నాథ్ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టినాడు.


6) మణి కర్ణికా ఘాట్:

ఇది కాశీలో మొట్ట మొదటిది. దీనిని విష్ణు దేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు ఇక

.శివలింగంపై కాసిని నీళ్ళు

 శివలింగంపై కాసిని నీళ్ళు చల్లి, మారేడు ప్రతిని శివలింగంపై పడవేసినప్పటికీ, ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటిపశువుగా ఉంటుంది. ఆ భక్తుని ఇంట కల్పతరువు మల్లెచెట్టుగా ఉంటుంది. అంతటి దయాసముద్రుడు శివుడు. మరి, అంతటి బోళాశంకరునికి మారేడు దళాలు తప్ప మరే పుష్పాలతో పూజించే అవకాశం లేదా?!


ఈ ప్రశ్నకు సమాధానం శివధర్మసంగ్రాహం, శివరహస్యఖండం, లింగపురాణం, కార్తీకమాహాత్మ్యం గ్రంథాలు చెబుతున్నాయి. శివునికి ఇష్టమైన పువ్వుల గురించి ఆ గ్రంథాలు ఇలా చెబుతున్నాయి.


శివుని పుష్పాలతో పూజిస్తే, పది అశ్వమేధ యాగాలు చేసిన ఫలం లభిస్తుంది. ఎవరైతే కనీసం ఎనిమిది పుష్పాలతో శివుని పూజిస్తారో వారికి కైలాసప్రాప్తి కలుగుతుంది. శివుని పూజకు ఉపయోగించే పువ్వులు వాదిపోయినవిగా ఉండ కూడదు. కీటకాడులతో కొరకబదినవిగా ఉండేవి శివ పూజకు పనికిరావు. అలాగే ఇతరుల పూదోటలో పూచిన పువ్వులను దొంగతనంగా తీసుకువచ్చి పూజిస్తే ఫలితం కనిపించదు. ఇంకా పాపం కలుగుతుంది.


శివపూజకు అరణ్యంలో పూచిన పువ్వులకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. గన్నేరు, పొగడ, జిల్లేడు, ఉమ్మెత్త, కలిగొట్టు, పెద్దములక, తెల్లదింటెన, కట్లతీగ పువ్వులు, అశోకపువ్వు, మందారం, విష్ణుక్రాంత, జమ్మి, గులాబి, నెమ్మిపూలు, ఉత్తరేణి, తామర, జాజి, చెంగలువ, సంపెంగ, వట్టివేరు పూలు, నందివర్థనం, నాగకేసరం, పొన్న, పచగోరింట, తుమ్మి, మేడి, జయంతి, మల్లె, మోదుగ, మారేడు దళాలు, కుసుమపూవు, కుంకుమపూవు, ఎర్రకలువలు, నీలిపూలు శివపూజకు ప్రశస్తమైనవి. ఈ పుష్పాలతో ఏ పుష్పాన్ని సమర్పించినప్పటికీ శివ పరమాత్మ ఆనందంతో స్వీకరిస్తాడు. ఈ విషయాన్ని స్వామివారే ఉమాదేవికి చెప్పినట్లు పురాణవాక్కు.


అదేవిధంగా శివుని ఏయే మాసాలలో ఏయే పూలతో పూజిస్తే ఏయే ఫలితం ఉంటుందన్న విషయాన్ని గురించి కూడ చెప్పబడింది. చైత్రమాసంలో శంకరుని నృత్యగీతాలతో సేవిస్తూ, దర్భ పువ్వులతో పూజిస్తే బంగారం వృద్ధి చెందుతుంది. వైశాఖమాసంలో శివుని నేతితో అభిషేకిస్తూ తెల్లని మందారాలతో పూజిస్తే వారికి అశ్వమేధఫలం కలుగుతుంది.


జ్యేష్ఠ మాసంలో పెరుగుతో అభిషేకిస్తూ తామరపువ్వులతో పూజించిన వారికి పరమగతి కలుగుతుంది. ఆషాఢమాసంలో కృష్ణ చతుర్ధశినాడు స్నానం చేసి శివునికి గుగ్గిలంతో ధూపం వేసి తొడిమల తోడిమాలతో కూడిన పుష్పాలతో అర్చించినవారికి బ్రహ్మలోకాన్ని పరమపదం లభిస్తుంది. శ్రావణమాసంలో ఒంటి పూట భోజనం చేస్తూ గన్నేరుపూలతో శివుని పూజించినవారికి వేయిగోదానముల ఫలం లభిస్తుంది. భాద్రపద మాసంలో శివుని ఉత్తరేణి పూలతో పూజించిన వారు హంసధ్వజంతో కూడిన విమానంలో పుణ్యపదానికి చేరుకుంటారు. ఆశ్వయుజమాసంలో పరమశివుని జిల్లేడుపూలతో పూజించినవారు మయూర ధ్వజంతో కూడిన విమానంలో దివ్యపదాన్ని చేరుతారు.


కార్తీకమాసంలో శివుని పాలతో అభిషేకించి జాజిపూలతో పూజించినవారు శివపదాన్ని దర్శించుకుంటారు. మార్గశిర మాసంలో శివుని పొగడపూలతో పూజించినవారు, ముల్లోకాలను దాటి తామున్నచోటికే తిరిగిరాగలరు. పుష్యమాసంలో శివుని ఉమ్మెత్త పూలతో పూజించినవారు పరమ పదాన్ని పొందగలరు. మాఘ మాసంలో శివదేవుని బిల్వదళాలతో అర్చించినవారు, లేత సూర్యుడు, చంద్రుడులున్న విమాన,లో పరమపదానికి వెళతారు. ఫాల్గుణమాసంలో శివుని సుగంధజలంతో అభిషేకించి తుమ్మిపూలతో పూజించినవారికి ఇంద్రుని సింహాసనంలో అర్ధభాగం దక్కుతుంది.


ఇక, శివపూజలో ఒక్కొక్క పువ్వుతో పూజిస్తే, ఒక్కొక్క ఫలితం కలుగుతుంటుంది. శివుని రోజూ జిల్లేడు పువ్వులతో అర్చించేవారు బంగారాన్ని దానం చేసిననంత ఫలితాన్ని పొందుతారు.


శివపూజకు సంబంధించినంత వరకు వేయి జిల్లేడు పువ్వుల కంటే ఒక గన్నేరు పువ్వు ఉత్తమం.

వేయి గన్నేరు పూల కంటే ఒక మారేడు దళం ఉత్తమం.

వేయి మారేడు దళాలకంటే ఒక తామరపువ్వు ఉత్తమం.

వేయి తామరపువ్వుల కంటే ఒక పొగడపువ్వు ఉత్తమం.

వేయి పొగడపువ్వుల కంటే ఒక ఉమ్మేత్తుపువ్వు ఉత్తమం.

వేయి ఉమ్మెత్త పువ్వుల కంటే ఒక ములక పువ్వు ఉత్తమం.

వేయి ములక పూవుల కంటే ఒక తుమ్మిపూవు ఉత్తమం.

వేయి తుమ్మిపూవులకంటే ఒక ఉత్తరేణు పువ్వు ఉత్తమం.

వేయి ఉత్తరేణు పువ్వుల కంటే ఒక దర్భపువ్వు ఉత్తమం.

వేయి దర్భపూల కంటే ఒక జమ్మిపువ్వు శ్రేష్ఠం.


వేయి జమ్మి పువ్వుల కంటే ఒక నల్లకలువ ఉత్తమం అని సాక్షాత్తు శివ పరమాత్మే చెప్పాడు. శివపూజకు పువ్వులన్నింటిలోకి నల్లకలువపువ్వు ఉత్తమోత్తమమైనది. శివునికి వేయినల్ల కలువలతో మాలను అల్లి సమర్పించినవారు, శివునితో సమమయిన పరాక్రమంగలవారై వందల, వేలకోట్ల కల్పాలు నిత్యకైలాసంలో నివశిస్తారు. ఈ పుష్పమాలతో కాక మిగతా పుష్పాలతో పూజించే భక్తులు కూడా ఆయా పుష్పాలకు సంబంధించిన ఫలితాలను పొందుతారు.


పరమశివునికి పొగడపూలంటే అమితమైన ఇష్టం. ఆ స్వామిని ప్రతిదినం ఒక పొగడపువ్వుతో అర్చించే భక్తుడు వేయిగోవులను దానం చేసిన ఫలితాన్ని పొందుతాడు.

ఒక నెలపాటు పొగడపూలతో పూజించినవారు స్వర్గ సుఖాలను పొందుతారు. రెండునెలలపాటు పూజించిన వారు యజ్ఞం చేసినంత ఫలితాన్ని పొందుతారు. మూడు నెలల పాటు పొగడపూలతో అర్చించినవారికి బ్రహ్మలోక ప్రాప్తి. నాలుగు నెలలు పూజించినవారికి కార్య సిద్ధి. ఐదు నెలలు పూజించినవారికి యోగసిద్ధి. ఆరు నెలలు పూజించినవారికి రుద్రలోక ప్రాప్తి కలుగుతుంది.


సాధారణంగా శివునికి బిల్వపత్రాలే ప్రీతిపాత్రమైనవి. మిగతా పత్రాలు ప్రీతికరం కావని అనుకుంటుంటాం. లింగపురాణం ఆ స్వామికి ఇషామైన మరిన్ని పత్రాలను గురించిన వివరాలను అందిస్తోంది. మారేడు, జమ్మి, గుంట గలగర, అడ్డరసము, అశోకపత్రాలు, తమాలము, చీకటి చెట్టు, ఉలిమిడి, కానుగు, నేల ఉసిరి, మాచీపత్రి, నల్ల ఉమ్మెత్త, తామరాకు, నీతికలువ, మెట్టకలువ ఆకులు, సంపెంగ పత్రి, తుమ్మి, ఉత్తరేణి ఆకులను పత్రాలను పూజలో ఉపయోగించవచ్చు. అంటే, ఆయా పుష్పాలు లభించనపుడు, ఆయా పత్రిని ఉపయోగించవచ్చు.


ఇక పుష్పదానానికి సంబంధించినంతవరకు, పుష్పాన్ని గాని, ఫలాన్నిగాని దైవానికి నివేదిస్తున్నప్పుడు ఆ పుష్పం ముఖం బోరగిలబడకూడదు. అలా చేయడంవల్ల దుఃఖం కలుగుతుంది. అయితే ఆ పుష్పాలను లేక పత్రిని దోసిట్లో పెట్టుకుని నివేదించేటప్పుడు బోర్లాపడినప్పటికీ దోషం కాదు. ఉమ్మెత్త, కడిమిపువ్వులను శివునికి రాత్రివేళ సమర్పించాలి. మిగిలిన పూలతో పగిటిపూట. మల్లెలతో రాత్రివేళ, జాజి పూలతో మూడవజామున, గన్నేరుతో అన్నివేళలా పూజించవచ్చు.


ఇప్పటివరకు మనం ఏయే పూలతో శివుని పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయో తెలుసుకున్నాం. అయితే మన మనసులోని కోరికననుసరించి కూడ శివునికి పువ్వులను సమర్పించవచ్చు. ఉదాహరణకు ధనం కావాలను కున్నవారు శివుని గన్నేరుపూలతో, మోక్షం కావాలంటే ఉమ్మెత్తపూలతో, సుఖశాంతుల కోసం నల్లకాలువతో, చక్రవర్తిత్వం కోసం తెల్లతామరలతో, రాజ్యప్రాప్తి కోసం ఎర్రతామరలతో, నాగకేసరం, కేసరీపుష్పాలతో అనుకున్న కోరికలు నెరవేరుతాయట. గన్నేరు, అశోకం, ఊడుగు, తెల్లజిల్లేడులతో పూజించిన వారికి మంత్రసిద్ధి, రోజాపుష్పాలతో లాభాసిద్ధి, దంతి ప్రత్తి పూలతో సౌభాగ్యం కలుగుతుంది. కోరుకున్న కన్యను పొందాలంటే శివుని సన్నజాజి పూలతో పూజించాలి. సంతానం కావాలనుకునేవారు శివుని మొల్లపువ్వులతో పూజించాలి. దర్భపూలతో ఆరోగ్యం, రేలపూలతో ధనం, తుమ్మిపూలతో వశీకరణం, కడిమిపూలతో శత్రుజయం కలుగుతుంది. బిల్వదళ పూజ దారిద్ర్యాన్ని తొలగిస్తుంది. శివుని మరువంతో పూజిస్తే సుఖం, లోద్దుగపూలతో పూజిస్తే గోసంపద కలుగుతుంది. మోదుగ, బూరుగు పూలతో పూజిస్తే ఆయుర్వృద్ధి కలుగుతుంది.


ఇక, శివపూజకు పనికిరాని పువ్వుల గురించి మన పురాణ గ్రంథాలు పేర్కొన్నాయి.


మొగిలి, మాధవి, అడవిమల్లి, సన్నజాజి, దిరిసెన, సాల, మంకెన పువ్వులు శివార్చనకు పనికిరావు. బావంచి ఆకులు, పువ్వులు, కానుగపూలు, తాండ్ర ఆకులు, దాసాని, ఎర్రమద్ది, మందార, విషముష్టి, అడవిమొల్ల, తెల్ల విష్ణుక్రాంత, ఎర్ర, తెల్ల గులాబీలు, దిరిసెన పువ్వులు శివపూజకు పనికిరావు. వేప, వెలగ, గురివింద పూలు కూడా శివపూజకు అర్హం కావు.


దశసౌగంధికం పుష్పం నిర్గంధియది భామిని

శాతసాహస్రి కామాలా అనంతం లింగపూజసే


పది సుగంధపుష్పాలతో (ఒకవేళ పరిమళం లేకపోయిన వైనప్పటికీ) శివలింగాన్ని పూజిస్తే, శతసహస్రమాలలతో పూజించిన అనంత పుణ్యఫలం లభిస్తుందని శివధర్మ సంగ్రహం చెబుతోంది.


🙏🙏🙏💐💐💐🙏🙏🙏

పురోహితుడు అంటే

 *పురోహితుడు అంటే ఎవరు*


శ్లో:జన్మనా జాయతే శూద్రః

సంస్కారద్వ్దిజ ఉచ్యతే౹

విద్యయా యాతి విప్రత్వం

త్రిభిః శ్రోత్రియ ఉచ్యతే౹౹


🦢పుట్టుకతో శూద్రుడు, ఉపనయన కాలంలో ద్విజుడు,విద్యాభ్యాసంలో విప్రుడు, ఈ మూడింటితో అతడు శ్రోత్రియుడు అగును🦋


*పురోహితుడు* అనగా:

ముందుగా హితము పలికెడివాడు


*పురోహితుడు* అనగా: ధర్మార్థ కామమోక్షములకు సోపానము


*పురోహితుడు* అనగా: పూజనీయుడు


*పురోహితుడు* అనగా:

సహృదయతకు, మృదుభాషనకు, మధురానుభూతికి మారుపేరు


*పురోహితుడు* అనగా: నిత్య కర్మానుష్ఠానము ఒనర్చు ఒక తపస్వి


*పురోహితుడు* అనగా: ఆచార వ్యవహారాలకు పుట్టినిల్లు


*పురోహితుడు* అనగా: హైందవ సాంప్రదాయానికి రక్షణ కవచం


*పురోహితుడు* అనగా: సాదారణమైన పేరు వశిష్ఠుడు


*పురోహితుడు* అనగా: మానసిక వ్యాధిని ఛేదించె సైకాలజీ, ఒక హిప్నాటిస్ట్


*పురోహితుడు* అనగా: ఆత్మస్థైర్యమును, నమ్మకమును కలిగించె, బాధలను తొలగించె పిలాసపీ, ఒక మెజీషియన్


*పురోహితుడు* అనగా: సందేహ నివృత్తికి ఒక నిఘంటువు


*పురోహితుడు* అనగా: తాను ఉద్దరింపబడుచు, ఇతరులను ఉద్ధరింపజేయు జ్ఞాన దీపిక 


*పురోహితుడు* అనగా: భగవంతునికి భక్తునికి మద్య ఒక వారధి


*పురోహితుడు* అనగా: భూత భవిషత్వర్తమాన కాలముల సూచిక 


*పురోహితుడు* అనగా: శుభాశుభ కార్యములను ఆరాధించు సమదర్శి


*పురోహితుడు* అనగా: నిత్య కాల గణన చేయు గణిత వేత్త


*పురోహితుడు* అనగా: గోసంపద, వృక్ష సంపదతో వాతావరణ కాలుష్యాన్ని నివారించు యజ్ఞమూర్తి


*పురోహితుడు* అనగా: పర్యావరణ పరిరక్షణలో వృక్ష ప్రతిష్టకు మొదటి ప్రతినిధి

(జన్మ నక్షత్ర వృక్షాలు, యజ్ఞసమిదల వృక్షాలు, ఫలపుష్పాది వృక్షాలు, ఓషధివృక్షాలు మొదలగువాటిని ప్రతిష్టించి, పెంచి, పోషించుమని ప్రోత్సహించువాడు)


*పురోహితుడు* అనగా: ధర్మ శాస్త్ర ప్రియుడు


*పురోహితము*


పు- పురజనులందరికి


రో-  రోజురోజుకి


హి- హితముచెప్పుచు


త- తరింపజేసి


ము - ముదముగూర్చునది.


@adyatmikam