29, జూన్ 2021, మంగళవారం

శరీర విజ్ఞాన పరీక్ష - శస్త్ర చికిత్స

 . పురాతన శరీర విజ్ఞాన పరీక్ష - శస్త్ర చికిత్స .


  భారతీయ పురాతన ఆయుర్వేద నిపుణులు , మహర్షులు మానవ శరీర నిర్మాణమును తెలుసుకొనుటకు వారి వారి ఆశ్రమాలలో శవాలను తీసుకొచ్చి వాటిని కోసి పుర్తిగా పరీక్షించే వారు . 


         సుశ్రుతములో శరీర పరీక్ష గురించి కొంత వివరణ ఇవ్వబడింది. ఇప్పుడు దాని గురించి మీకు తెలియజేస్తాను. మొదట శరీర స్థానం నందు పూర్తి పరిజ్ఞానం తెలుసుకొవలెను. అటు మనిషుని యెక్క శరీరమును "ద్రుష్ట కర్మం" ( Dissection) కు సిద్దం చేసి ప్రతి అవయవ భాగం ను ప్రత్యక్షం గా పరీక్షించ వలెను.


 పరీక్షార్ధం నిర్దిష్టమైన మృత కళేబరం తీసుకొనవలెను. వ్రుద్దునిది, ధీర్గకాల రోగ పీడితునది , విషాదుల చేత మృతి నొందినది కాక సర్వాయవ స్పూర్తి నొందినది కలిగి ఉండవలెను. ముందు మృత కళేబరం నందు ఉండు వ్యర్ధములను " వస్థి కర్మం " ( enema) చేత బయటకి వెడలించి శోధనం చేయవలెను . పిదప ముంజ గడ్డి , దర్భ, నార మొదలగు వాని చేత అన్ని అవయవములను బాగుగా కట్టి చేపలు మొదలగు   నీటి జంతువులు తినకుండా ప్రవాహం నందు కొట్టుకొని పోకుండా పంజరస్థం గావించి నిలువయున్న నీటిలో వాగునందు కుళ్లే విదంగా ఉంచవలెను. అలా 7 దినములు నీటిలో ఉంచవలెను. 7 దినములు అయిన తరువాత బాగుగా కుళ్ళిన శరీరమును పైకి దీసి దర్భ, గడ్డి వీని వేళ్ళతో చేసిన కుంచెను గాని , వెదురు కుంచెతో గాని చర్మం , మాంస కండరములు , సిరలు , నరములు , ధమనులు, ఆంత్రము ( Intestines) , యక్రుత్తు ( Liver) , ప్లీహము (spleen) , హృదయము (Heart) , వ్రుక్కములు ( kidneys) , పుప్పుసము ( Lungs) , క్లోమము ( pancreas) మొదలగు అవయవములును , అస్తులు (Bones) ,అస్థి సంధులు (Joints) . మొదలగు చర్మ బాహ్య,అంతర అవయవాలను విభజించి బాగుగా పరీక్షించ వలెను.ఈ రీతి శరీర శాస్త్రమును చక్కగా అభ్యసించవలెను .


 శరీర పరీక్ష నేర్చుకునే విదానము.-

       

         పలుమార్లు శిష్యునకు శవ పరీక్షా విదానం చేసే విదానం చూపించిన తరువాత శిష్యుని చేత స్వయంగా పరీక్ష చేయించవలెను. 


 చేదన కర్మం - 

  

        సోరపుచ్చ, నూగు దోస , బుడమ, పెద్ద దోస , మొదలగు కాయలను కోసి చూపవలెను .అదే విదంగా ఉత్కర్థానము (పైకి కోయుట ), పరికర్థనము (ధిగువకు కొయుట ).మొదలుగునవి కుడా బోధిం పవలెను .


 బేధ్య కర్మం - 


         నీరు నింపిన తిత్తులు గాని , మృతి చెందిన జంతువుల మూత్ర కోశములు గాని , జిగురు వస్తువులలో , లేక పలుచనైన బురదతో నింపిన తోలుతిత్తులను గాని చీల్చి చూపవలెను .


 లేఖ్య కర్మం - 


          రోమయుక్తమగు చర్మమును పైన , లొపల బేదములు ను చూపవలెను .


 వేద్య కర్మం - 


           మృత జంతువులు యెక్క సిరలును కలువ కాడలును , మొదలగువానిని వేధించి చూపవలెను . ఇయ్యది కేవలం జలోదరం, మూత్ర వృద్ది మొదలగు వాని యందు ఉపయోగించవచ్చు .


 ఏష్య కర్మం - 


          పురుగు తినిపోయిన బెజ్జములు గల కొయ్య కర్రల యందు , వెదురు గోట్టములు , తుటి కాడలు, తామర కాడలు, ఎండిపొయిన సొరకాయలు, మొదలగు వానిని ముఖ ములములందు చేయవలసిన శస్త్ర చికిత్సకు ఉదాహరణగా చూపించ వచ్చు. దీనిని ఏషిని అను శలాకమ్ ఉపయొగించి నేర్పించవలెను .


 ఆహార కర్మం - 


         పనస, మారేడు, దొండ, మొదలగు ఫలముల నుండి గింజలు బయటకు తీయు విద్యను అభ్యసించవలెను. ఈ విదానం నోటిలోని దంతము లను ఉడ దీయుటకు ఉపయొగించ వలెను.


 విశ్రావ్య కర్మం - 


          విశ్రావ్య కర్మను శాల్మలి ఫలకం నందు మైనం పూసి ప్రతిమలు చేసీ ఆయా ప్రదేశం నందు చీము మొదలగు వానిని స్రవింప జేయవలెను .


 సీస కర్మం - 


          మృదువగు వస్త్రములును చర్మం మొదలగు వాని ఎందు యుంచి కుట్టి సేవన కర్మం చేయవలెను . 


 స్థల బేధమున శస్త్ర ఉపయోగ బేదములు - 


      కనుబొమ్మ, కణత , నొసలు, గండ భాగము, కనురెప్ప, క్రింద పెదవి, పంటి చిగురు, చంక, కటి, బోడ్డు , గజ్జ, వీని యందు దిర్యక్చేధనం చేయవలెను .అరిచేయి , అరికాలు, వీనీ యందు జంద్ర మండలాక్రుతి గా ( గుండ్రముగా ) కోయవలెను. గుదము, మేడ్రము వీని యందు అర్థ చంద్రాక్రుతిలో కొయవలెను లేనిచో సిరలు (venis) , ధమనులు తెగిపోయి మిగుల బాధను కలిగించును. అలగే మానుట చాలా కష్టం. అలానే ఉంటే ఆ గాయం గ్రందిలా తయారగును. కనుక జాగ్రత్త వహించవలెను.


 శస్త్ర చికిత్స చేయు విదానం - 


         శస్త్ర చికిత్స చేయుటకు పూర్వం రోగి కి చాలా తక్కువ ఆహారం ఇవ్వవలెను. శస్త్ర చికిత్స బాధలు తెలియకుండా ఉండుటకు బాగా మత్తుగా ఉండు మధ్యములను త్రాగిపించవలెను . శస్త్ర చికిత్స ముందు భుజించడం మూలాన "మూర్చ " మొదలగునవి కలవు. మద్య ద్రవ్యములను ఉపయోగించుట చేత బాద తెలియకుండును.

 

   శస్త్ర చికిత్సకు కావలిసిన వస్తువులు.- 


   * శస్త్రములు - ( Inustruments , Lancet etc .)

   * యంత్రములు - ( surgical అప్ప్లైంచెస్)

   * క్షారము  - ( Alkali) .

   * అగ్ని  -  ( Fire for cauterisation) .

   * జలూక  - ( Leeches) .

   * శలాక  -  ( Probe or direetor ).

   * జాంబ వోష్ణము -( Cavtersing 

                                Inusruments) .

   * పిచువు -  (Cotton) .

   * ప్లోతము - ( Lint) .

   * సూత్రము - (Thread) .

   * పట్టము - ( Tow ).

   * తేనే       - ( Honey) .

   * నెయ్యి   - ( Ghee) .

   * కొవ్వు.

   * పాలు.

   * నూనే .

   * తర్పణం - ( powederd wheat soaked in 

                      water ) .

   * కషాయం - ( Decoctions) .

   * అలేపము - ( Medicated Plasters) .

   * కల్కము  -  ( Paste) .

   * చన్నీళ్ళు.

   * వేడి నీళ్ళు .

   * కవలిక   -  ( Splints) .

   * వెదురు వేళ్ళు  - ( Skin of Bamboos ).

   * స్పటికం  -  ( Lens) .

   * కురువింద రాళ్ళు .

   * అయస్కాన్థములు .

   * గాజు తునకలు.

   * టేకు ఆకులు. మరియు మత్తు కలగ చెయు పదార్దం.  


           పైన చెప్పిన విధముగా రకరకాల పరికరాలు ఉపయోగించి అత్యంత నైపుణ్యతతో మన పూర్వికులు శస్త్రచికిత్సలు చేసెడివారు . 


     గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

కాశీ కి వెళితే

 🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹

కాశీ కి వెళితే...కాయో పండో వదిలేయాలి అని పెద్దలు అంటారు.... అందులో మర్మమేమిటి ??


అసలు శాస్త్రం లో ఎక్కడ కూడా.. కాశీ కి వెళితే కాయో, పండో వదిలేయాలి అని చెప్పలేదు..


శాస్త్రం చెప్పిన విషయాన్ని.. కొందరు తెలిసీ తెలియని విషయ పరిజ్ఞానం తో కొంచం వాళ్లకు అనుకూలంగా మార్చుకున్నారు.


కాశీ క్షేత్రం విషయంలో శాస్త్రము చెప్తున్నది ఏమిటి అంటే... కాశీ వెళ్లి గంగ లో స్నానం చేసి " కాయాపేక్ష మరియు ఫలాపేక్ష" ను గంగలో వదిలి, ఆ విశ్వనాథ దర్శనం చేసుకొని ఎవరి ఇళ్ళకు వాళ్ళు తిరిగి వెళ్ళాలి అని.


ఇక్కడ కాయాపేక్షా, ఫలాపేక్ష అన్నారు...అంటే...ఈ కాయము పై ( శరీరము పై అపేక్ష ని ) , ఫలాపేక్షా ( కర్మ ఫలము పై అపేక్ష ని) పూర్తిగా వదులుకొని...కేవలం నిజమైన భక్తితో ఆ ఈశ్వర చింతన కలిగి ఉండమని పెద్దలు చెప్పారు.


కాలక్రమేణా...అది కాస్తా కాయ, పండు గా మారిపోయింది.


అంతే కానీ...  కాశీ వెళ్లి ఇష్టమైన కాయగూరలు, తిండి పదార్థాలు గంగ లో వదిలేస్తే...మనకు వచ్చు భక్తి కానీ, అందులో నిజమైన పుణ్యం ఎం ఉంటుంది.


కనుక.... శాస్త్రం నిజంగా ఎలా చెప్తుందో అర్థం చేసుకొని... ఆ క్షేత్ర దర్శనము, ఆ సంప్రదాయం పాటిస్తే..నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం వస్తుంది... అంతే కాని మామిడి పండుని,  వంకాయ ని గంగలో వదిలేస్తే వచ్చే ఉపయోగం ఏమి ఉండదు.


కనుక...ఈసారి మీరు కాశీ వెళితే....మనకి శత్రువులు అయిన ఈ శరీరం పై ఎక్కువ ప్రేమని, మనం చేసే కర్మల మీద లేనిపోని కర్మఫలం అపేక్ష ని మాత్రమే వదులుకొని....ఆ విశ్వనాథ దర్శనం చేసి, నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం కలగాలి అని ప్రార్థిద్దాం.

🙏 జై శ్రీరామ్ శుభోదయం.

నారాయణాయ

 _*నారాయణ నారాయణ*_


ఒక అవ్వ ఎప్పుడూ- కూర్చున్నప్పుడూ, వంగినప్పుడూ, పైకి లేచినప్పుడూ కూడా "నారాయణ, నారాయణ" అంటూండేది. ఆమె మనవడు విష్ణు ఒకసారి "ఎందుకవ్వా! నువ్వు ఎప్పుడూ `నారాయణ, నారాయణ' అంటుంటావు? ఆ నారాయణుణ్ని ఓసారి నాకు చూపించు" అని అడిగాడు."నారాయణుడు ఉన్నాడు; కానీ ఆయన మనకు కనిపించడు రా నాయనా!" అని చెప్పింది అవ్వ.


"అదేంటవ్వా? దేవుడున్నాడంటావు, కానీ కనిపించడంటావు నువ్వు? ఉన్నవాడు కనిపించాలిగా మరి? ఏమో! నేను మాత్రం దేవుణ్ని చూడాల్సిందే. రేపు నన్ను తొందరగా లేపవ్వా! ఇక్కడ కనబడని దేవుడు మరెక్కడైనా కనిపిస్తాడేమో చూసి వస్తాను నేను!" అని చెప్పి పడుకున్నాడు వాడు.


మరుసటి రోజు ప్రొద్దున్నే అవ్వ విష్ణును లేపగానే, వాడు లేచి, దేవుణ్ని వెతుక్కుంటూ నిజంగానే అడవిలోకి బయలుదేరాడు. నడిచీ, నడిచీ, కొంతకాలానికి అడవిని దాటి ఒక రాజ్యం చేరుకున్నాడు. అక్కడి రాజుగారింటికి వెళ్లి "రాజాగారూ! రాజాగారూ! నేను నారాయణుని దగ్గరకు వెళ్తున్నాను. మీకు ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పండి. దానికి పరిష్కారం కనుక్కుని వస్తాను నేను" అన్నాడు.


ఆ మాటలకు రాజుగారు "చూడు బాబూ! నేను చాలా సంవత్సరాల క్రితమే ఒక చెరువును తవ్వించాను. నీటితో నిండి, పదిమందికీ ఉపయోగపడాల్సిన ఆ చెరువు, ప్రతి సంవత్సరమూ తెగిపోయి, నిరుపయోగమయి పోతున్నది. ఎన్నిసార్లు మరమ్మత్తులు చేయించినా ఫలితం లేకుండా పోతున్నది. ఎందుకలా అవుతున్నదో అర్థం కావటం లేదు. అదేంచేస్తే బాగౌతుందో నారాయణుణ్ని అడిగి తెలుసుకురా" అని చెప్పాడు. "సరే" అని విష్ణు ముందుకు సాగిపోయాడు.


అలా వెళుతున్న విష్ణుకు దారిలో ఒక పెద్ద పాము కనబడింది. "బాబూ! నువ్వు నారాయణుని దగ్గరికి వెళ్తున్నావని తెలిసింది. చాలా కాలం నుండి నా తల మీద ఒక పుండు ఉన్నది. అది ఎంతకీ నయం అవ్వట్లేదు. అది బాగవ్వాలంటే ఏం చేయాలో కాస్త కనుక్కొని రావా?" అని అడిగింది.


"ఓ! సరేలే! దానిదేముంది? తప్పకుండా కనుక్కుని వస్తాను" అని ముందుకు సాగాడు విష్ణు.అలా చాలా దూరం నడిచిన తరువాత, విశ్రాంతి తీసుకుందామనుకొని, విష్ణు ఒక చెట్టు కింద ఆగాడు. అది ఒక మామిడిచెట్టు. ఆ చెట్టు నిండా నోరూరించే మామిడి పళ్లు! 'ఒక్క పండు తిందాం' అనుకొని విష్ణు ఒక పండుని కోసి, రుచిచూశాడు. కానీ ఆ పండు చేదుగా ఉన్నది! మరో పండును కోసి చూస్తే, అది కూడా చేదే! "ఏమిటిది! మామిడిపళ్ళు చేదుగా ఉంటాయా?" అని పైకే గట్టిగా అన్నాడు విష్ణు.


అప్పుడు ఆ మామిడిచెట్టు మాట్లాడింది: "చూడు బాబూ! నువ్వు 'నారాయణ స్వామి' దగ్గరకు వెళ్తున్నావని తెలిసింది. నాకో సాయం చేసి పెట్టు. ప్రతి సంవత్సరమూ నేను చాలా కాయలు కాస్తాను. కానీ నా పండ్లన్నీ చేదుగా ఉంటున్నాయి. ఎవ్వరూ వాటిని ఇష్టపడటంలేదు. ఏం చేస్తే నా బాధ తీరుతుందో ఆ స్వామిని కాస్త అడిగిరా బాబూ!" అన్నదది. 'సరే' అని విష్ణు ముందుకు సాగాడు.


ఇంకొంత ముందుకు పోయాక, అతనికి విరగబూసిన మల్లె చెట్టు ఒకటి కనిపించింది. 'ఎంత అందంగా ఉన్నది, ఈ మల్లెచెట్టు!' అని దాని దగ్గరకు వెళ్ళాడు విష్ణు. అంతలో ఆ మల్లెచెట్టు అన్నది: "బాబూ! నేను ఇన్ని పూలు పూస్తాను కదా! ఎవ్వరూ నా పూలకోసం రావటమే లేదు. ఈ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను. నువ్వు నారాయణుని దగ్గరకు వెళ్తున్నావల్లే ఉంది. ఏం చేస్తే నా యీ బాధ దూరమౌతుందో కాస్త ఆ నారాయణున్ని అడిగి కనుక్కుని రావా?" అని. విష్ణు అందుకు ఒప్పుకుని ముందుకు నడిచాడు.


ఆ తరువాత అతను "నారాయణ, నారాయణ" అనుకుంటూ ముందుకు సాగాడు. ఎంతో అలసిపోయాడు- కానీ తన ప్రయత్నాన్ని మాత్రం వదలలేదు. వెనకడుగు వేయలేదు. అలా పోతున్న విష్ణుకి ఒకనాడు ఒక ముసలాయన కనిపించాడు. ఆ తాత విష్ణుని దగ్గరకు పిలిచి "బాబూ! నాకు చాలా దాహం వేస్తోంది. తాగడానికి కొన్ని నీళ్లు తెచ్చి ఇవ్వు నాయనా!" అని అడిగాడు.


'సరే' అని విష్ణు నీళ్లకోసం వెతికాడు. దగ్గరలోనే ఒక చిన్న నీళ్లగుంత కనిపించింది అతనికి. కానీ నీళ్లను తీసుకెళ్ళేందుకు పాత్ర ఏదీ లేదే!? కొంచెం ఆలోచించిన మీదట, విష్ణు తన కండువాను ఆ నీళ్లలో తడిపి, తాత దగ్గరికి తీసుకెళ్ళి, "తాతా! దీన్ని పిండు. నీళ్ళు వస్తాయి" అని చెప్పాడు. విష్ణు తెలివితేటలను మెచ్చుకొన్న తాత "మనవడా! నువ్వెవరు? ఎక్కడికెళ్తున్నావు?" అని అడిగాడు.

"నారాయణుణ్ని చూసేందుకు" అన్నాడు విష్ణు.


"నారాయణుణ్ని చూడాలని ఎందుకు అనుకుంటున్నావు?" అని అడిగాడు తాత.


"మా అవ్వ ఎప్పుడూ 'నారాయణ, నారాయణ' అంటూ ఉంటుంది. కానీ ఆమెకు ఎన్నడూ ఆ నారాయణుడు కనిపించలేదు. నేనైనా ఆవిడ కోరిక తీరుద్దామనుకున్నాను.,ఆ నారాయణుడి కోసం వెతుక్కుంటూ పోతున్నాను" అని చెప్పాడు విష్ణు. ఆపైన తను దారిలో కలిసిన వాళ్లందరి సమస్యల గురించి కూడా చెప్పాడు.


తాత అన్నాడు: "నారాయణుని గురించైతే నేనేమీ చెప్పలేను; కానీ మిగిలినవాళ్ళ సమస్యల్ని మాత్రం తీర్చగలను. గత జన్మలో ఆ మల్లెచెట్టు ఒక అమ్మాయిగా పుట్టింది. అప్పుడు ఆ పిల్ల చాలా పూలనూ, పూతీగలనూ కాళ్లతో అదేపనిగా తొక్కుకుంటూ పోయేది. అందుకే ఈ జన్మలో ఆమెకు ఇలా జరుగుతున్నది" అని."మరి, దానికి ఏమీ పరిష్కారం లేదా, తాతా?" అని అడిగాడు విష్ణు.

"లేకేమి? ఉంది! ఆ చెట్టు పువ్వులను ఎవరైనా ఒక రాణి తన తలలో ముడుచుకుంటే, ఆ తరువాత ఆ చెట్టు పూలను అందరూ వాడతారు" అన్నాడు తాత.


తర్వాత మామిడి చెట్టు గురించి అడిగాడు విష్ణు.


ఆ మామిడి చెట్టు కింద బిందెడు బంగారం ఉంది. దానిని దోవలో పోయే దాసప్పకి ఇస్తే, ఆ మామిడి కాయలు తియ్యగా పండుతాయి" అన్నాడు తాత.

'సరే'నని పాము గురించి అడిగాడు విష్ణు.

"ఆ పాము పుట్టలో ఒక వజ్రాల హారం ఉంది. దానిని దోవలో పోయే దాసప్పకు ఇస్తే, ఆ పాముకు పుండు మేలవుతుంది" అని చెప్పాడు తాత.

ఇక రాజుగారి గురించి అడిగాడు విష్ణు. "రాజు దోవలో పోయే దాసప్పను తెచ్చి, ఇంట్లో పెట్టుకొని, చదివించి, రాజును చేస్తే అతనికి మేలు జరుగుతుంది. సమస్యలన్నీ తీరిపోతాయి" అని చెప్పాడు తాత.

తన మాట ఎలా ఉన్నా మిగిలిన వారందరి సమస్యలకూ పరిష్కారం దొరికిందన్న సంతోషంతో వెనక్కి తిరిగాడు విష్ణు.


తొలుత ఎదురైన మల్లెచెట్టుతో, దాని సమస్యకు పరిష్కారం చెప్పాడు. అప్పుడా మల్లెచెట్టు "వేరే ఎవరో ఎందుకుగాని, నువ్వే నా పువ్వులను కోసుకెళ్లి రాణిగారికి ఇవ్వరాదూ?" అన్నది.


"సరే"నని, కొన్ని పువ్వులను కోసుకుని ముందుకు పోతూ, ఆ తర్వాత ఎదురైన మామిడి చెట్టుతో దాని సమస్య ఎలా తీరగలదో చెప్పాడు విష్ణు.


అప్పుడా మామిడిచెట్టు "వేరే ఎవరున్నారు ఇక్కడ? నువ్వే తీసుకో, ఆ బిందెడు బంగారాన్నీ!" అన్నది.


"సరే"నని ఆ బంగారం తీసుకొని ముందుకు సాగాడు విష్ణు.

ఆ తరువాత ఎదురైన పాముకు కూడా పరిష్కారం చెప్పాడు. ఆ పాము తన పుట్టలో పడిఉన్న రత్నాలహారాన్ని తెచ్చి, విష్ణుకే ఇచ్చింది.చివరకు రాజుని కలిసి అతని సమస్యకూ పరిష్కారం చెప్పాడు విష్ణు.


"ఎవరినో తెచ్చి ఇంట్లో పెట్టుకునేదెందుకు? నువ్వే ఉండు!" అని, రాజుగారు విష్ణుకు అర్ధరాజ్యమిచ్చి, విష్ణును, అవ్వనూ తనతోబాటే ఉంచుకున్నారు.


అంతలోనే విష్ణుకు తను నారాయణుణ్ని కలుసుకోలేదని గుర్తుకువచ్చింది. 

తన మతిమరుపుకు బాధపడుతున్న విష్ణుతో అవ్వ అన్నది: "దేవుడు ఏ రూపంలోనైనా ఉంటాడు - ఎక్కడైనా ఉంటాడు విష్ణూ! కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేస్తే ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు, కనికరిస్తాడు. నువ్వు నారాయణుణ్ని చూడలేదని బాధ పడవలసిన అవసరం లేదు. నీకు కనిపించిన ఆ ముసలాయన ఎవరనుకుంటున్నావు? ఇంకా అర్ధంకాలేదా? ఆ నారాయణుడే!" అని.


🕉️ ఓం నమో నారాయణాయ 🙏

కోవిడ్ 19 రెండవ వేవ్ గురించి

 ఇప్పుడు మన ప్రజల మనస్తత్వం మారవలసిన అవసరం ఎందుకు?


" ఇది అతనిని ఖచ్చితంగా కట్టి పడేస్తుంది.  అతను చాలా వివరణలు ఇచ్చుకోవలసి ఉంటుంది. " 


కోవిడ్ 19 రెండవ వేవ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రొఫెసర్ మరియూ నా స్నేహితురాలు గొంతులో ఆనందం స్పష్టంగా కనిపించింది. మోడీకి ఇబ్బంది పెరిగిందని ఆమె తన ఆనందం దాచుకోలేకపోతోంది. ఇందులో ఆమె ఒంటరిగా లేదు. మహమ్మారి ఎక్కువ వ్యాప్తిపై భయం కంటే ఇది మోడీకి ఎంత ఎక్కువ ఇబ్బంది తెస్తుందనే దాని మీద లెక్కలు వేస్తున్నవారు చాలా మంది ఉన్నారు.


దేశం ఎదుర్కొంటున్న ఒక సంక్షోభం తరువాత మరో సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి అతను ప్రయత్నిస్తూ, ప్రతి ఒక్కరిని లేచి పోరాడమని ప్రోత్సహిస్తున్నప్పుడు ఒక మనిషి పట్ల ఇంత ఈ ద్వేషపూరిత ద్వేషానికి కారణం మరియు మూలం ఏమిటి? 


కోవిడ్ 19 మహమ్మారి మనలను కదిలించింది, మన ఉనికినే బెదిరిస్తున్నాది కానీ ఆ వ్యక్తి మీద ద్వేషంతో దీనిని పోల్చితే మరియు,  నా స్నేహితులలాంటి వ్యక్తులు మోడీ ఇబ్బందుల్లో ఉన్నాడని అతని కష్టాలను కోవిడ్ ఎలా పెంచుతుందో  ఆనందాన్ని వ్యక్తం చేయడంతోనూ పోలిస్తే కోవిద్ చిన్నది లాగే కనిపిస్తుంది. అతను వారికి ఏమి హాని చేయనప్పటికి మన సమాజంలో ఒక వర్గం అతని మీద అంతటి శత్రుత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నాదో మనలని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.


నేను ఈ వ్యాసం రాస్తున్నప్పుడు, మోడీ టీవీ/ రేడియో ప్రసంగం తర్వాత ఒక సందేశం చక్కర్లు వేయడం ప్రారంభమైంది. అది ఏమిటంటే " మీ  అవసరాలను మీరే చూసుకోవడం అంతే కాని సహాయం కోసం ప్రభుత్వం వైపు తిరగడం కాదు"

 "అందుకే అలాంటి ప్రభుత్వంలో జీవించడం నేర్చుకోండి, దేవుడే మనకు సహాయం చేస్తాడు ” అనే వ్యంగ్య సందేశం ఒక మేధావి నుండి వచ్చింది.


లేచి పోరాడమని మనకు  సూచించే మోడీ సందేశం అలాంటి వ్యంగ్య వ్యాఖ్యలను ఎందుకు ఆహ్వానిస్తోంది?


కారణం,   గతంలో భారతీయ నాయకులు తమ ప్రజలతో ఈ భాషలో చాలా అరుదుగా మాట్లాడేవారు. మన చీకటి రోజుల్లో ఆశ యొక్క చిహ్నంగా మనం పిలుచుకునే వారు ఎవరూ లేరు. వారు సంక్షోభ నిర్వాహకులుగా ఎక్కడా నిలబడి లేరు. గాంధీ నిశ్శబ్దంగా ఉపసంహరించుకునేవారు. అంతే కాదు సంక్షోభాన్ని ఎదుర్కొ వలసివచ్చినపుడు ప్రజలను సొంతంగా గాలికి వదిలివేసే సమాధానాల కోసం తన చక్రం తిప్పడం ప్రారంభించే వారు. అతని బెట్ నోయిర్ నెహ్రూ విభజన సమయంలో కూడ ఇలాగే ఉండేవారు.  చైనీయుల దండయాత్ర సమయంలో, అతను తన ప్రజలను జాగృతపర్చడానికి గుర్తుంచుకోవలసిన పదం ఎప్పుడైనా చెప్పాడా అని నేను ఆశ్చర్యపోతుంటాను. తరచుగా అతను తన  చేతుల మధ్య తల ఉంచి ఆలోచనలో మునిగిపోతూ కూర్చునేవాడు. శతాబ్దాల బానిసత్వం మరియు వలసవాదం నుండి బయటికి వచ్చిన తరువాత మన నాయకులు చాలా మంది ఈ విషయంలో విఫలమయ్యారు. విచిత్రం ఏమిటంటే మన నాయకులలోని వారి నిష్క్రియాత్మకతను మనం సహజంగా అంగీకరించాము. 


బంగ్లాదేశ్ యుద్ధంలో ఇందిరా గాంధీ చాలా అరుదుగా ప్రజలు ఏదో సందేశం చెప్పేవారు. అలా చెప్పడం మానేక్షా వంటి జనరల్స్ కు వదిలివేయబడింది. ఆమె అత్యవసర పరిస్థితిని ప్రకటించి వేలాది మందిని జైలు శిక్ష మొ. వాటితో హింసించింది. ఆమె హత్య తర్వాత జరిగిన దారుణానికి బాధ్యత స్వీకరించడానికి బదులుగా ఆమె కుమారుడు రాజీవ్ ఒక పెద్ద చెట్టు పడిపోయినప్పుడు భూమిలో చీలికను సృష్టిస్తుందని చెప్పారు. బొంబాయిలో ఉగ్రవాద దాడి తరువాత మన్మోహన్ సింగ్ ‘హిందూ టెర్రర్’ అనే పదాన్ని అనుమతించేంతవరకు వెళ్ళారు. గత విధానం ఏమిటంటే  ' వేచి ఉండి ఏమీ చేయకూడదు' అని.   జ్ఞాపకశక్తి యొక్క చివరి నిమిషం మసకబారే వరకు నిష్క్రియాత్మకతను కొనసాగించండి అనేదే గత అనుభవం.


అటువంటి భాషలో మాట్లాడని మొదటి నాయకుడు నరేంద్ర మోడీ. బానిసత్వం లేని మనస్తత్వం ఉన్న స్వతంత్ర భారతదేశపు మొదటి నాయకుడిగా చరిత్రకారులు ఒకరోజు ఆయనను వర్ణించవచ్చు. అతను ఒక సంక్షోభ నిర్వాహకుడు, అతను ఆర్టికల్ 370 రద్దు చేయడం లేదా రామ ఆలయాన్ని వంటి గత సమస్యలను పూర్తి చేయడానికి ప్రశాంతంగా  చర్యలు తీసుకుంటాడు. భారతదేశానికి చెందిన హిందూ నాయకుడిని చూడటం ప్రపంచానికి అలవాటు లేదు, అతను నెహ్రూ లాగా వేడుకోడు, విజ్ఞప్తి చేయడు లేదా మన్మోహన్ సింగ్ లాగా ముడుచుకున్న చేతులతో నిలబడడు. అతను ప్రతి గాయం లేదా ప్రతి గాయం యొక్క అనవాలును గుర్తుంచుకొని రక్షణాత్మకంగా మిగిలిపోకుండా తన భాషలో తిరిగి సమాధానం ఇస్తాడు. గతంలోని హిందువులు ఆయన లాగ ఆత్మవిశ్వాసంతో సంక్షోభం లేదా విపత్తుతో వ్యవహరించలేదు. మనం దీనిని గ్రహిస్తే, మన నిష్క్రియాత్మకత లక్షణం తరువాతి తరానికి చనిపోతుంది.


బ్రిటిష్ వారి గురించి ఒక పాత సామెత నాకు గుర్తుంది, "శాంతి కాలంలో వారిని నిర్వహించడం అసాధ్యం కాని సంక్షోభంలో వారు ఐక్యమై అన్ని తేడాలను విడిచిపెడతారు." కానీ భారతీయులైన మనం, ఒక సంక్షోభంలో ఒకరికొకరు శత్రువులుగా మారి, మనకు సహాయం చేయమని మన బాహ్య శత్రువును వేడుకుంటున్నారు. మనం ఒకరినొకరు నిందించుకుంటాము. భారతదేశంలోని ప్రతి శత్రువు అంటే అలెగ్జాండర్, మొహమ్మద్ ఘోరి నుండి బ్రిటిష్ వారి వరకు ఇది తెలుసు. ఇది మారితేనే, మనం మరలా బానిసలుగా మారము. మోడీ ప్రసంగాలు మనకు ఈ మార్పు తేగలవు అని నేను నమ్ముతున్నాను.


ఇది సరిదిద్దలేని మన జన్యువులలోని దోషమా లేదా మనలని జాతీయ స్థాయిలో  సరిదిద్దగల నాయకత్వం విఫలమా? వలసవాద సంప్రదాయంలో విద్యావంతులైన ప్రతి ఇతర ఉదారవాద మరియు మేధావులచే మోడీ పట్ల ఈ ద్వేషానికి ఒక కారణం ఆయన నాయకత్వం ఆ లోపాన్ని మనకు ఎత్తి చూపుతున్నాది అని నేను నమ్ముతున్నాను.


దేశానికి ఆయన ఇస్తున్న ఉపన్యాసాలు భవిష్యత్తులో ఎలా మదింపు చేయబడతాయి? సామాన్య ప్రజల గుండె లోతులను తట్టి లేపుతున్నాయి. దేశంలో మరే ఇతర భారత నాయకుడూ ప్రయత్నించని ప్రారంభం ఇదేనని నేను నమ్ముతున్నాను. ప్రస్తుత పరిస్థితులలో నేను నెహ్రూ, గాంధీని దృశ్యమానం చేస్తే దిశ లేకపోవడం, అసమర్థత మరియు నిస్సహాయతను అభ్యర్ధించడం తప్ప మరేమీ చూడలేను.


ప్రత్యర్థి శక్తులతో వ్యవహరించే మోడీ శైలి ఇతర నాయకుల మాదిరిగా కాకుండా వారి స్వంత వైరుధ్యాల బరువుతోనే వారిని విచ్ఛిన్నం చేయడం. అతని పద్ధతులు రక్షణాత్మకమైనవి కావు, శత్రువుపై దాడి చేస్తాయి. అందువల్ల అతనిని దూకుడు అని పిలుస్తారు. అతని ప్రతి విరోధికి ఇది తెలుసునని నేను నమ్ముతున్నాను అందుకే అతను అలాంటి వారికి ముప్పు.


చరిత్ర యొక్క గొప్ప నాయకులు వారి ప్రజలను వారి నిష్క్రియాత్మకతను వదిలించి, ఎదగాలని ప్రోత్సహిస్తారు. వారు ఉచితాలు వాగ్దానం చేయరు,  దేశం కోసం లేదా అంతకంటే గొప్ప కారణం కోసం ఎదగాలని, ప్రజలు త్యాగాలు చేయమని అడుగుతారు.


ఐసన్‌హోవర్, విన్‌స్టన్ చర్చిల్, బిస్మార్క్, కెన్నెడీ సంక్షోభ సమయంలో గొప్ప నాయకులు అయ్యారు. రెండవ ప్రపంచ యుద్ధంలో చర్చిల్ బ్రిటిష్ వారిని నడిపించాడు. దేశంలో వస్తువుల కొరత గురించి ఫిర్యాదు చేయవద్దని ఆయన ముందుగా కోరిన తరువాత మన విజయానికి ప్రజల అనేక త్యాగాలకు సిద్ధపడమని చెప్పాడు. వారి ప్రసంగాలు ప్రజలకు వాగ్దానాలు చేయలేదు, ప్రజాలనుండి పోరాటం, ధైర్యం  కోరాయి.  మోడీ కూడా ఇప్పుడు అదే చేస్తున్నారు. బహుశా అందుకే, మోడిని తొలగించాలనే కోరిక అతని విరోధులచే అన్ని నిబంధనలను దాటివేయిస్తున్నాది. మోడీ విరోధులు భారతదేశ వలస చరిత్రను మరచిపోయి పాకిస్తాన్, చైనా మరియు అమెరికా నుండి సహాయం కోసం కూడా అడుగుతున్నారు.


చరిత్రలో నరేంద్ర మోడీ ఎలా గుర్తుకు వస్తారు? ఆయనకు ముందు భారతదేశంలో ఏ నాయకుడూ  ప్రయత్నించని అదే తన ప్రజలను నిద్రలో నుండి మేల్కొల్పిన నాయకుడిగా,  వ్యక్తిగా ఆయన జ్ఞాపకం అవుతారా? దేశంలో ఆయన మార్పులను తీసుకురావడానికి ప్రయత్నించిన ప్రతిసారీ అతను ఎదుర్కొంటున్న ఎగతాళి, వ్యంగ్యం చరిత్ర ద్వారా ఎలా కనిపిస్తుంది? అతను  వెయ్యి సంవత్సరాల బానిసత్వ ఆలోచనలుతో ఉన్న గొలుసుల నుండి ప్రజలకు విముక్తి కల్పించడానికి ప్రయత్నించిన ప్రతీసారీ హేళనకు గురి అవుతునే ఉన్నాడు.


ఇది రజిత్ మిత్ర, సైకాలాజిస్టు మరియు

'ఇన్ఫీడెల్ నెక్స్ట్ డోర్' పుస్తక రచయిత

రాసిన ఒక పెద్ద ఆర్టికల్ కి సంక్షిప్త స్వేచ్చానువాదం.


...చాడా శాస్త్రి...


సంస్కృత మహాభాగవతం

 *29.06.2021  ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - ఉత్తరార్ధము -  డెబ్బది నాలుగవ అధ్యాయము*


*శ్రీకృష్ణభగవానుని అగ్రపూజ శిశుపాలుని ఉద్ధారము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*74.27 (ఇరువది ఏడవ శ్లోకము)*


*తత్పాదావవనిజ్యాపః శిరసా లోకపావనీః|*


*సభార్యః సానుజామాత్యః సకుటుంబోఽవహన్ముదా॥11382॥* 


పిదప ధర్మరాజు పత్నీసహితుడై నిర్మలజలములతో ఆ పరమపురుషుని పాదపద్మములను  కడిగెను. లోకములను పునీతమొనర్చునట్టి, ఆ శ్రీపాద తీర్థమును ఆ మహారాజు భార్యాసహితుడై తన శిరస్సున దాల్చెను. పిమ్మట ఆయన సోదరులను, అమాత్యులను, బంధుమిత్రులను ఆ తీర్థజలములను తమ శిరస్సులపై చల్లుకొనిరి.


*74.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*


*వాసోభిః పీతకౌశేయైర్భూషణైశ్చ మహాధనైః|*


*అర్హయిత్వాశ్రుపూర్ణాక్షో నాశకత్సమవేక్షితుమ్॥11383॥*


అనంతరము యుధిష్ఠిరుడు కృష్ణప్రభువునకు పట్టుపీతాంబరములను, అమూల్యమైన ఆభరణములను, సంపదలను సమర్పించెను. నేత్రములు ఆనందాశ్రువులతో నిండియుండుటవలన ధర్మరాజు ఆ పురుషోత్తముని చక్కగా దర్శింపలేకపోయెను.


*74.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*


*ఇత్థం సభాజితం వీక్ష్య సర్వే ప్రాంజలయో జనాః|*


*నమో జయేతి నేముస్తం నిపేతుః పుష్పవృష్టయః॥11384॥*


నిండుసభలో శ్రీకృష్ణుడు అగ్రపూజను అందుకొనుటను జూచి, సదస్యులెల్లరును జయజయ ధ్వనులను గావించుచు ఆ ప్రభువుయొక్క పాదములకు ప్రణమిల్లిరి. ఆకాశమునుండి పుష్పవర్షములు కురిసెను.


*74.30 (ముప్పదియవ శ్లోకము)*


*ఇత్థం నిశమ్య దమఘోషసుతః స్వపీఠాదుత్థాయ  కృష్ణగుణవర్ణనజాతమన్యుః|*


*ఉత్ క్షిప్య బాహుమిదమాహ సదస్యమర్షీ సంశ్రావయన్ భగవతే పరుషాణ్యభీతః॥11385॥*


ధర్మరాజు శ్రీకృష్ణునకు అగ్రపూజచేయుటను, దానిని సదస్యులు ఎల్లరును సమర్థించుటను శిశుపాలుడు గమనించుచునేయుండెను. అందఱును శ్రీకృష్ణుని గుణములను ప్రశంసించుచుండుటవలన అసూయపరుడైన అతనిలో కోపము కట్టలు తెంచుకొనెను. వెంటనే అతడు తన ఆసనమునుండి దిగ్గున లేచి అసహనముతో ఊగిపోవుచు చేతిని పైకెత్తి, జంకుగొంకులేక నిండుసభలో కృష్ణప్రభువునకు వినబడునట్లుగా ఇట్లు పరుషవచనములను పలికెను.


*74.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*ఈశో దురత్యయః కాల ఇతి సత్యవతీ శ్రుతిః|*


*వృద్ధానామపి యద్బుద్ధిర్బాలవాక్యైర్విభిద్యతే॥11386॥*


"సదస్యులారా! 'సర్వమును శాసించే కాలమును ఎవ్వరునూ ఉల్లఘింపజాలరు' అని శ్రుతివాక్యము వాస్తవమే అనిపించుచున్నది. ప్రస్తుతము మూర్ఖుడైన ఒక బాలుని వచనములముందు జ్ఞానవృద్ధుల, వయొవృద్ధుల బుద్ధులుగూడ పనిచేయకుండుటయే అందులకు ప్రత్యక్ష నిదర్శనము.


*74.32 (ముప్పది రెండవ శ్లోకము)*


*యూయం పాత్రవిదాం శ్రేష్ఠా మా మంధ్వం బాలభాషీతమ్|*


*సదసస్పతయః సర్వే కృష్ణో యత్సమ్మతోఽర్హణే॥11387॥*


ఈ సభలో అగ్రపూజకు అర్హులైన వారిని నిర్ణయించుటలో మీరు సర్వసమర్థులే. అందువలన 'అగ్రపూజకు శ్రీకృష్ణుడే అర్హుడు' అను బాలుడగు సహదేవుని వచనములకు మీరు సమ్మతింపవద్దు.


*74.33 (ముప్పది మూడవ శ్లోకము)*


*తపోవిద్యావ్రతధరాన్ జ్ఞానవిధ్వస్తకల్మషాన్|*


*పరమఋషీన్ బ్రహ్మనిష్ఠాంల్లోకపాలైశ్చ పూజితాన్॥11388*


*74.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*


*సదస్పతీనతిక్రమ్య గోపాలః కులపాంసనః|*


*యథా కాకః పురోడాశం సపర్యాం కథమర్హతి॥11389॥*


ప్రస్తుతము ఈ సభలో గొప్ప తపస్సంపన్సులు, మహావిధ్వాంసులు, వ్రతనిష్ఠాగరిష్ఠులు, తత్త్వజ్ఞానముతో పాపతాపములను అధిగమించినవారు (తత్త్వవేత్తలు), మహర్షులు, లోకపాలురచే గూడ పూజలను అందుకొనునట్టి బ్రహ్మనిష్ఠాపరులు మొదలగువారు ఎందఱో గలరు. వారిని అందఱిని కాదని అగ్రపూజను పొందుటకు కులాధముడైన ఈ ఆలకాపరి ఎంతవఱకు అర్హుడు? పురోదాశమునకు (యజ్ఞపూతమైన అపూపమునకు) కాకి ఎట్లు యోగ్యమగును?


*74.35 (ముప్పది ఐదవ శ్లోకము)*


*వర్ణాశ్రమకులాపేతః సర్వధర్మబహిష్కృతః|*


*స్వైరవర్తీ గుణైర్హీనః సపర్యాం కథమర్హతి॥11390॥*


ఈ గోపాలుడు జాతీ, నీతీ లేనివాడు సమాజములో ఒకస్థాయిలేనివాడు. సద్వంశములో జన్మించినవాడు కాదు. సకల ధర్మములను వదలిపెట్టినవాడు. వేదశాస్త్రమార్గములను, లోకమర్యాదలను ఉల్లంఘించి, విశృంఖలముగా ప్రవర్తించువాడు, ఎట్టి గుణములను లేనివాడు ఇట్టి అవలక్షణములుగల ఈతడు పూజకు ఎట్లు అర్హుడగును?


*74.36 (ముప్పది ఆరవ శ్లోకము)*


*యయాతినైషాం హి కులం శప్తం సద్భిర్బహిష్కృతమ్|*


*వృథాపానరతం శశ్వత్సపర్యాం కథమర్హతి॥11391॥* 


మునుపు ఈతని వంశము యయాతి శాపమునకు గుఱియయ్యెను. అందువలన సత్పురుషులు ఇతని వంశమును బహిష్కరించిరి. ఈ విషయమును మీరును ఎఱుగుదురు. ఈతని కులమువారు ఎల్లప్పుడును మధుపానమునందే మునిగియుందురు. అట్టివంశమునకు చెందిన ఈతడు పూజకు ఎట్లు అర్హుడగును?


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి డెబ్బది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

సంస్కృత మహాభాగవతం*

*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - ఉత్తరార్ధము -  డెబ్బది నాలుగవ అధ్యాయము*


*శ్రీకృష్ణభగవానుని అగ్రపూజ శిశుపాలుని ఉద్ధారము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*74.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*సదస్యాగ్ర్యార్హణార్హం వై విమృశంతః సభాసదః|*


*నాధ్యగచ్ఛన్ననైకాంత్యాత్సహదేవస్తదాబ్రవీత్॥11373॥*


సదస్యులలో అగ్రపూజకు అర్హులైన విషయమున ఏకాభిప్రాయము కుదరకుండెను. అచటనున్నవారు ఎవరికివారు తమ అభిప్రాయములను వేర్వేరుగా తెలిపిరి. అప్పుడు మాద్రిపుత్రుడగు సహదేవుడు ఇట్లు వచించెను-


*74.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*అర్హతి హ్యచ్యుతః శ్రైష్ఠ్యం భగవాన్ సాత్వతాంపతిః|*


*ఏష వై దేవతాః సర్వా దేశకాలధనాదయః॥11374॥*


"సభాసదులారా! యదువంశ శిరోమణియగు శ్రీకృష్ణభగవానుడే సదస్యులందఱిలో శ్రేష్ఠుడు. అందువలన అతడే అగ్రపూజకు అర్హుడు, సకలదేవతాస్వరూపుడు. అంతేగాదు, దేశకాలధనాది వస్తువులు అన్నియును ఆయన రూపములే.


*74.20 (ఇరువదియవ శ్లోకము)*


*యదాత్మకమిదం విశ్వం క్రతవశ్చ యదాత్మకాః|*


*అగ్నిరాహుతయో మంత్రాః సాంఖ్యం యోగశ్చ యత్పరః॥11375॥*


ఈ విశ్వమంతయును శ్రీకృష్ణుని రూపమే. సకల యజ్ఞములును శ్రీకృష్ణుని స్వరూపములే. ఆ మహాత్ముడే అగ్నిగా, ఆహుతులుగా, మంత్రములుగా విలసిల్లుచున్నాడు. జ్ఞాన, కర్మ యోగములు ఆ ప్రభువును చేరెడి మార్గములు.


*74.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*ఏక ఏవాద్వితీయోఽసావైతదాత్మ్యమిదం జగత్|*


*ఆత్మనాఽఽత్మాశ్రయః సభ్యాః సృజత్యవతి హంత్యజః॥11376॥*


సదస్యులారా! శ్రీకృష్ణుడు ఒక్కడే అద్వితీయుడైన పరబ్రహ్మము. చిదచిదాత్మకమైన ఈ సంపూర్ణజగత్తు ఆ స్వామి రూపమే. సమస్త జగత్తునకు అతడే ఆధారము. అతనికి వేఱొకటి ఆధారము కాదు. ఈ లోకములను అన్నింటిని తన సంకల్ప మాత్రమున అతడు సృష్టించును, పాలించును, లయమొనర్చును, అతడు జన్మాది షడ్వికారములు లేనివాడు.


*74.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*వివిధానీహ కర్మాణి జనయన్ యదవేక్షయా|*


*ఈహతే యదయం సర్వః శ్రేయో ధర్మాదిలక్షణమ్॥11377॥*


ఈ జగత్తులోని జనులు అందఱును శ్రీకృష్ణుని అనుగ్రహముచేతనే అనేక విధములైన కర్మలను అనుష్ఠించుచు *ధర్మార్థకామమోక్షములు* అను చతుర్విధ పురుషార్థఫలములను పొందుచున్నారు.


*74.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*తస్మాత్కృష్ణాయ మహతే దీయతాం పరమార్హణమ్|*


*ఏవం చేత్సర్వభూతానామాత్మనశ్చార్హణం భవేత్॥11378॥*


అందువలన మహాత్ముడైన శ్రీకృష్ణునకే అగ్రపూజను సమర్పింపవలయును. ఆ స్వామిని పూజించినచో సకలప్రాణులను పూజించినట్లేయగును. అంతేగాక, మనలను మనము గౌరవించుకొనినట్లు కాగలదు.


*74.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*సర్వభూతాత్మభూతాయ కృష్ణాయానన్యదర్శినే|*


*దేయం శాంతాయ పూర్ణాయ దత్తస్యానంత్యమిచ్ఛతా॥11379॥*


శ్రీకృష్ణుడు సకలప్రాణులలో అంతర్యామియై విలసిల్లువాడు. భేదబుద్ధిరహితుడు, శాంతుడు (రాగద్వేషములు లేనివాడు),  పరిపూర్ణుడు.అట్టి శ్రీకృష్ణునకు దానము చేయుట (అగ్రపూజచేయుట) యుక్తము. అట్లొనర్చుటవలన అక్షయత్వము సిద్ధించును".


*74.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*ఇత్యుక్త్వా సహదేవోఽభూత్తూష్ణీం కృష్ణానుభావవిత్|*


*తచ్ఛ్రుత్వా తుష్టువుః సర్వే సాధు సాధ్వితి సత్తమాః॥11380॥*


*74.26 (ఇరువది ఆరవ శ్లోకము)*


*శ్రుత్వా ద్విజేరితం రాజా జ్ఞాత్వా హార్దం సభాసదామ్|*


*సమర్హయద్ధృషీకేశం ప్రీతః ప్రణయవిహ్వలః॥11381॥*


శ్రీకృష్ణుని మహిమను, ప్రభావమును బాగుగా ఎఱిగిన సహదేవుడు ఇట్లు పలికి మిన్నకుండెను. ధర్మరాజు యొక్క యజ్ఞసభలోనున్న సత్పురుషులు అందఱును ఆ మాటలను విని సంతసించుచు 'బాగు బాగు' అనుచు ముక్తకంఠముతో తమ ఆమోదమును తెలిపిరి. అంతట సదస్యుల అభిప్రాయములను ఎఱింగి, ధర్మరాజు పరమానందభరితుడయ్యెను. బ్రాహ్మణోత్తముల ఆజ్ఞను గైకొని భక్తిపరవశుడై జితేంద్రియుడగు కృష్ణపరమాత్మను చక్కగా పూజించెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి డెబ్బది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

వేదాలు అపౌరుషేయాలు

 వేదాలు అపౌరుషేయాలు అని చెప్పుకున్నాం. అనాదికాలం నుంచీ అవిచ్చిన్నంగా గురు శిష్య పరంపరగా మనకు అంది వస్తున్నాయి. అవి శాశ్వతాలని కొందరు నమ్ముతారు. ఇవి ఎలా మొదలయ్యాయి అనే దాన్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. చరిత్రకారులు క్రీస్తు పూర్వం 1500 సవత్సరాల నాటివి అని కొందరు, క్రీ.పూ 3000 నాటివని కొందరూ అభిప్రాయ పడుతున్నట్లు చెబుతారు.


జగత్తును సృష్టించిన పిదప శ్రీమన్నారాయణుడే వేదాన్ని మరీచ్యాది ఋషులకు ప్రవృత్తి ధర్మంగాను, సనకాదులకు నివృత్తి ధర్మంగాను ఉపదేశించగా వారి ద్వారా వేదం ప్రచారమైనట్లు ఆది శంకరులు వ్రాశారు.


వేదంలో జ్ఞానం ; పరా విద్య, అపరా విద్య అని రెండి విధాలుగా ఉంది. పూర్వ భాగంలో కర్మకాండ ప్రతిపాదించ బడింది. ఇది అపరా విద్య- దీన్నే ప్రవృత్తి ధర్మం అనికూడా అంటాం. చివరిభాగంలో ఆత్మజ్ఞానాన్ని బోధించే పరావిద్య ఉంది. దీన్నే నివృత్తి ధర్మం అంటాం. ఇది ఆదికాలం నుంచీ అందివస్తున్న మూలగ్రంధం అవడం చేత - 'నిగమం' అనీ, గురుశిష్య పరంపరగా వినే దివ్యవాణి గనుక - 'శృతి' అనీ , మననం చేసుకోడం ద్వారా నేర్చుకోబడే విద్య అవడం చేత - 'ఆమ్నాయం 'అనీ పేర్లు ఉన్నాయి.


వేదంలో కర్మకాండ ధార్మిక క్రియలనూ, విధులను ఆచారాలనూ చెబుతుంటే, జ్ఞానకాండ ఆత్మ పరమాత్మలను, ప్రకృతి స్వరూపాలను గురించీ చెబుతుంది. మొదట్లో వేదం ఒకటిగానే ఉండేది. కాల క్రమేణా విద్యార్ధులు అర్ధంచేసుకొని వల్లి౦చడానికి కష్టమవడం వల్ల ద్వాపరయుగం ప్రారంభంలో కృష్ణద్వైపాయనుడు అనబడే వ్యాస మహర్షి దాన్ని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము అని నాలుగు భాగాలుగా విభజన చేశాడు. అలా విభజించిన వేదాలను తన శిష్యులకు బోధించేడు. కాలక్రమంలో ఈ గురువుల శిష్యులు వర్ధిల్లి , పరస్పరమూ విడిపోగా అనేక శాఖలు మొదలయ్యాయి. అలా ఏర్పడిన శాఖలకు కఠ, కౌతుమ, వాజసనేయ, మాధ్యందిన అనే పేర్లతో పిలువబడుతున్నాయి.


ప్రతీ వేదాన్నీ తిరిగి నాలుగు భాగాలుగా తీర్చి దిద్దేరు. వీటిలో మంత్ర భాగాన్ని సంహిత అనీ, సంహితలో మూలవిషయాన్ని వివరించడానికి ఉద్దేశించబడిన భాగాలకు బ్రాహ్మణములు అనీ అంటారు. వీటిలో యజ్ఞాలు మొదలైన కర్మకాండ ఎలా చెయ్యాలో తెలుపబడింది. ఇక మూడవది అరణ్యకాలు . ఇవి కర్మ ప్రతిపాదితమైనా కర్మల భౌతికభాగానికి గాక యజ్ఞ నిర్వహణలో ధ్యానానికి ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇవి ఏకాంత వ్రతాన్ని స్వీకరించి వనాలలో నివసించే వానప్రస్థులు వల్లించడం కోసం ఉద్దేశించ బడ్డాయి. ఇక వేదాల్లో చివరి భాగాలకు ఉపనిషత్తులని పేరు. ఇవి వేద విజ్ఞతకంతకూ సారం. వేదాల చివరి భాగం అవడం చేతనూ, వీటిని తెలుసుకుంటే ఇక తేలుసుకోవలసినదేదీ ఉండని కారణంగాను - వేదాంతం అని అంటారు. వేద శాఖలకు అనుగుణంగా అనేక ఉపనిషత్తులు వెలిశాయి. వీటిలో 108 చదువదగ్గవని నిర్ణయించడం జరిగింది. వీటిలో 10 - 12 ఉపనిషత్తులు మాత్రమే ముఖ్యమైనవిగా పరిగణించ బడుతున్నాయి. ఇదే సంగ్రహంగా వేదాల గురించి.

Last Cup of Coffee

 Last Cup of Coffee


"One day, Death encountered a Man and told him:

- Today's your Last Day.


The Man replied:

- But I am not ready! 


Death said:

- Your name is at the top of my to-do list for today.


The Man said:

- Alright then… 

Before you take me along, let's sit together and 

have one *Last Cup of Coffee.*


Death said:

- Of course.


The Man offered a 

*Cup of Coffee* to Death; the Coffee was laced with some sleeping pills...

Death drank the Coffee and soon it was fast asleep...


The Man took Death's to-do list, wiped his name from the top and placed it at the bottom of the page.


When Death woke up,

 it said: 

- You've treated me so kindly and with full of Love today.

 I would like to reciprocate you by starting my today's work from the names at the

 *Bottom of my List."*


*Sometimes some things are written in your Fate.* 

*No matter how hard you may try to Change them, they never Change...*


The Crow and the Parrot were both created ugly. 

The Parrot protested and was made  Beautiful. 

However, the Crow remained content with the will of its Creator.

 Today *the Parrot is in a Cage and the Crow flies free...*


*Behind each Incident is so Exquisite a Wisdom that maybe you will never understand it.*


*Therefore ...*

*Never ask "Why?"*

 *to the Creator.*

పంచముఖాంజనేయుడు

 #పంచముఖాంజనేయుడు 


మైరావణుని రాజ్యంలో ప్రవేశించిన ఆంజనేయుడు అతనితో యుద్ధాన్ని ఆరంభిస్తాడు. కానీ ఒక ఉపాయాన్ని సాధిస్తే తప్ప మైరావణునికి చావు సాధ్యం కాదని తెలుసుకుంటాడు. మైరావణుని పురంలో ఐదు దిక్కులా వెలిగించి ఉన్న దీపాలను ఒక్కసారిగా ఆర్పితే కానీ అతనికి చావు మూడదని తెలుస్తుంది. అందుకోసం తూర్పు , పశ్చిమము , ఉత్తరము , దక్షిణము , ఊర్ధ్వముఖం. ఇలా అయిదు దిక్కులా అయిదు ముఖాలను ధరించి , అయిదు దీపాలను ఒక్కసారిగా ఛేదిస్తాడు. పంచముఖాలతో పాటుగా ఏర్పడిన పది చేతులలో ఖడ్గం , శూలం , గద వంటి వివిధ ఆయుధాలను ధరించి మైరావణుని అంతం చేస్తాడు. అతనే #పంచముఖాంజనేయుడు. 


పంచముఖాల ప్రాశస్త్యం : అయిదు అనే సంఖ్య పంచభూతాలకు సంకేతం. అయిదు కర్మేంద్రియాలతో మనిషి ప్రపంచంలో మనుగడను సాధిస్తూ , అయిదు జ్ఞానేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటున్నాడు.అలాంటి అయిదు సంఖ్య గురించి చెప్పేదేముంది. స్వామివారి పంచముఖాలలో ఒక్కో మోముదీ ఒక్కో రూపం.

#తూర్పున_ఆంజనేయుని రూపం , 

#దక్షిణాన_నారసింహుని అవతారం , 

#పశ్చిమాన_గరుడ_ప్రకాశం , 

#ఉత్తరాన_వరాహావతారం , 

#ఊర్ధ్వముఖాన_హయగ్రీవుని అంశ. 

అలాగే ఆ అయిదు ముఖాలు తన భక్తులను అయిదు రకాల అభయాన్ని అందిస్తూ ఉంటాయి. #నారసింహ_ముఖం_విజయాన్ని , 

#గరుడ_రూపం_దీర్ఘాయుష్షునీ ,

#వరాహము_అష్ట_ఐశ్వర్యాలనీ , 

#హయగ్రీవుడు_జ్ఞానాన్నీ , 

#ఆంజనేయ_రూపం_అభీష్టసిద్ధినీ కలుగచేస్తాయి.

ఇంతటి శక్తిమంతమైన అవతారం కాబట్టే రాఘవేంద్ర స్వామి సైతం ఆంజనేయుని పంచముఖ రూపంలోనే దర్శించారు.

సాధకుడి లక్షణాలు..*

 *కార్య సాధకుడి లక్షణాలు..*


దుస్సాధ్యమైన కార్యాలను సాధించాలంటే ఆ ప్రయత్నం చేసే వాళ్లకు కొన్ని లక్షణాలు ఉండాలి. IAS pass అవ్వడము, ఏదైనా కొత్త project కానీ institution కానీ  మొదలుపెట్టి పైకి తీసుకు రావడము, జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో కానీ మరేదైనా విషయంలో గాని గొప్ప గుర్తింపు పొందడం ఇలాంటి పనులు అందరూ చెయ్యలేరు. అటువంటి పనులు చేసేవాళ్లను గొప్ప వాళ్ళు అంటాము.


నిత్యజీవితంలో మామూలుగా చెయ్యవలసిన పనులను కూడా కొంతమంది పాడు చేసుకుంటుంటారు. కొద్దిమంది తాము సాధించవలసిన విషయాలను అనాయాసంగా సాధిస్తుంటారు. వీళ్లను లోకంలో కార్యసాధకులు అంటారు. వాళ్లకుకొన్ని లక్షణాలు ఉంటాయి. 


*ఆత్మ విశ్వాసము* :: అటువంటి పని సాధించడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు పరికరాలు సహాయకాలు (resources) తన దగ్గర ఉన్నాయా లేవా,  అవి సమకూర్చుకో గలమా లేమా అనేవి ముందుగా ఆలోచించుకొని ఆ పని మొదలు పెట్టాలి. ఆత్మ విశ్వాసము అహంకారము రెండూ  చూడడానికి ఒకే లాగా ఉంటాయి. మనకు ఉన్నది ఆత్మ విశ్వాసము, ఎదుటి వాడికి ఉన్నది అహంకారము అనుకుంటాము. మనకు నిజంగా శక్తి నేర్పు ఉండి పని మొదలు పెడితే అది ఆత్మవిశ్వాసము. అవి లేకుండా పని మొదలు పెడితే అది అహంకారము.


*పధకం ప్రకారం ముందుకు వెళ్ళడము* :: College లో చేరి fees కట్టి పుస్తకాలు కొనుక్కోగానే ప్రతివాడు 1st క్లాసులో pass అవ్వాలి అనుకుంటారు. రేపటి నుంచి చదువు మొదలు పెడదాము అనుకుంటారు. Gold Medal తెచ్చుకునేవాడు ఆ college మొత్తానికి ఒకడుంటాడు. వాడు మాత్రం ఆ రోజు నుంచే చదువు మొదలు పెడతాడు. సెలవుల్లో కూడా రోజూ చదువుతూనే ఉంటాడు. వాడికి ఆడుకోడానికి సమయం ఉంటుంది పరీక్షలప్పటికి మానసిక ఒత్తిడి ఏమీ ఉండదు. రేపటి నుంచి చదువుకుందాము అనుకున్న వాడు సరిగ్గా పరీక్షల ముందు పుస్తకాలు తెరుస్తాడు. మొదటి వాడిది structured planning అంటారు. రెండవ వాడిది day dreaming అంటారు.


*వాస్తవ దృక్పధం* :: Resources గురించీ, contingency plans గురించి ముందే ఆలోచించు కోవడం కూడా structured planning లో భాగమే. మొదలు పెట్టబోయే పని యొక్క కష్ట నష్టాలు సరిగ్గా బేరీజు వేసుకొని మన శక్తి సామర్థ్యాలు లెక్కించుకుని అప్పుడు తీసుకునే నిర్ణయం సరైన నిర్ణయం అవుతుంది.  


*లక్ష్య శుద్ధి* :: కొంతమంది చాలా ఉత్సాహంగా సంగీతం క్లాసులలో డాన్స్ క్లాసులో కరాటే క్లాసులలో చేరి పోతుంటారు. చేరే వాళ్ళు వంద మంది అయితే అందులో drop outs 80 మంది ఉంటారు. 20:80 rule  (Pareto Principle) ఇటువంటి విషయాల్లో బాగా work out అవుతుంది. ప్రధానమైన కారణాలు బద్ధకము, మొదలు పెట్టినప్పుడు ఉన్న ఉత్సాహం ఆఖరి దాకా ఉండకపోవడము. దీనిని లక్ష శుద్ధి లేకపోవడము అంటారు. 


*మనోబలము* :: అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. అనుకోని ఇబ్బందులు అడ్డంకులు ఆపదలు మధ్యలో ఎదురవుతాయి.  మనోబలము లేకపోతే మధ్యలో వచ్చే అడ్డంకుల దగ్గర ఆగి పోతుంటారు. మధ్యలో కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు కుంగి పోకూడదు. వీటన్నింటికీ కూడా సిద్దపడి ఉండాలి.  ధైర్యంగా ముందుకు పో గలగాలి. సగం అయిపోయింది ముక్కాలు సాధించాము. 90% చేతిలోకి వచ్చింది. ఇట్లా గా పని పూర్తి కాకుండానే సంతోష పడకూడదు. ఆఖరులో కూడా ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. అఖరు దాకా ఓపిక తో ఉండాలి. 


*సామర్థ్యము* :: మధ్యలో  వచ్చే కొన్ని అడ్డంకులు ఇబ్బందులు అధిగమించడానికి సమయస్ఫూర్తి తెలివితేటలు పట్టుదల మొదలైన మానసిక శక్తులు కావాలి. కొన్ని రకాల అడ్డంకులను అధిగ మించడానికి ఆరోగ్యము, శారీరక బలము  మొదలైన శక్తులు కావాలి.


సుందరకాండ మొదటి సర్గ లో హనుమంతుడు నూరు యోజనాల సముద్రాన్ని దాటి లంకకు వెళ్లి సీతాదేవిని వెతికి కనిపెట్టి తిరిగి రావడానికి సంకల్పించుకుంటాడు. వాల్మీకి ఈ పనిని "దుష్కరం  నిష్ప్రతి ద్వంద్వం" అని వర్ణిస్తాడు. లంకలో సీతను వెతికే టప్పుడు పట్టుబడితే దిక్పాలకులను జయించిన రావణుడి తోనూ ఇంద్రుని జయించిన ఇంద్రజిత్తు తోనూ ఒంటరిగా యుద్ధం చేయాల్సి రావచ్చు. అక్కడికి వెళ్లే వాడు ఇందుకు సిద్ధపడి వెళ్లాలి. ఆంజనేయుడు ఇదంతా ఆలోచించుకొనే వెళ్లడానికి సంకల్పం చేస్తాడు. ఈ సంకల్పం అనేది ధైర్యానికి ఆత్మవిశ్వాసానికి ఉదాహరణము. 


మధ్యలో మైనాకుడి ఉదంతం లక్ష్య శుద్ధి కి అలసత్వం (pro​cras​ti​na​tion) లేకుండా ఉండడానికి పట్టుదలకు ఉదాహరణము. Gold Medal సంపాదించే పిల్లల గురించి ఇందాక చెప్పుకున్నాము. కాస్త గమనించి చూడండి. అటువంటి పిల్లలు మిగతా పిల్లలతో కలిసి TV చూస్తూ కూడా వాళ్ల home work వాళ్లు చేసుకుంటూ  ఉంటారు. అదే వాళ్లకూ, మిగతా పిల్లలకూ  తేడా.  మైనాకుడు ఆంజనేయుడి పని చెడ గొడదాము అనుకోలేదు. కానీ మైనాకుడి మాట విని మొహమాట పడి ఆతిథ్యం స్వీకరించి ఉంటే హనుమంతుడి కి ఆరోజు పని చెడి ఉండేది.   ఆంజనేయుడికి అది బాగా తెలుసు. 


సురసను జయించడం  సమయ స్ఫూర్తి కి తెలివి తేటలకు పరీక్ష. పైగా అది ఆయనకు దేవతలు పెట్టిన పరీక్ష. ఆమె రాక్షసి రూపంలో కనిపించినప్పటికీ ఆమెను గుర్తు పట్టి "దాక్షాయిణి నమోస్తుతే" అని నమస్కరిస్తాడు. అంటే ఆంజనేయ స్వామి రాక్షసుల మాయల కే కాదు దేవతల మాయలకు కూడా లో పడడు. ఆయన వద్ద భ్రమ ప్రమాదాలకు అవకాశం లేదు. సురస నాగమాత. ఆమెను మెప్పించి ఆమె ఆశీస్సులను దేవతల ఆశీర్వాదాన్ని కూడా సంపాదించుకుంటాడు. 


సింహికను సంహరించడం ఆయన శక్తిసామర్థ్యాలకూ నేర్పుకూ ఉదాహరణ. స్త్రీ అని చెప్పి లంకిణి ని చంపకుండా మెల్లిగా ఎడమ చేతితో గుద్దుతాడు. మరి సింహికను ఎందుకు చంపినట్లు. లంకిణి ఆంజనేయుడు దొంగతనంగా లంకలో ప్రవేశింస్తూ ఉంటే అడ్డుకుంటుంది. అది ఆమె బాధ్యత. సింహిక దారే పోయే వాళ్ళను మింగుతుంటుంది. ఈవిడ లోక కంటకి. అందువల్ల తాటికి లాగే  ఈవిడను ను చంపడం కూడా  అధర్మం కాదు.


హనుమంతుడు ఈ అడ్డంకులను అధిగ మించడం చూసి దేవతలు మొదలైన వాళ్ళు హనుమను ప్రశంసిస్తూ ఇలాగంటారు. 


*ధృతి ర్ద్రుష్టి ర్మతి ర్దాక్షం*

*స్వ కర్మసు న సీదతి*

*స తై స్సంభావితః పూజ్యః*

*ప్రతిపన్న ప్రయోజనః*


సుందర కాండ ప్రధమ సర్గ శ్లోకం 201.


పై శ్లోకంలో హనుమంతుడి లో దేవతలు చూసి మెచ్చుకున్న గుణాలు : ధైర్యము (ఆత్మవిశ్వాసము), లక్ష్యశుద్ధి,  సమయస్ఫూర్తి, పటుత్వము. ఇవే కార్య సాధకుడి లక్షణాలు. ఈ లక్షణాలు ఉన్న వాడు తలపెట్టిన అన్ని పనులను సాధించుకో గలుగుతాడు అని ఆ శ్లోకానికి అర్థము. ఇక్కడితో కథ అయిపోలేదు.


*ఓర్పు* :: లంకలో సీతాదేవి కనపడనప్పుడు ఆంజనేయుడు దిగులు పడతాడు. కానీ ఆశ వదిలిపెట్టడు పట్టుదల వదిలిపెట్టడు. దీన్నే మనం positive thinking అంటాము. చితి  చనిపోయిన మనిషిని దహిస్తుంది. చింత బతికున్న మనిషిని దహిస్తుంది. అందువల్ల చితి చింతల మధ్య చింతయే ఎక్కువ ప్రమాదకారి. మనిషి negetive ఆలోచనలను అదుపులో పెట్టుకుంటేనే ఏదైనా సాధించగలుగుతాడు. పని పూర్తయ్యే దాకా balanced thinking & positive thinking రెండూ ఉండాలి. అసహనం రాకూడదు.  నిరుత్సాహ పడ కూడదు. ఓపికతో ఉండాలి.


*మాట నేర్పు*  ::  ఆంజనేయుడు మొదటిసారి రాముడితో మాట్లాడినప్పుడు ఆయన మాటల నేర్పుకు శ్రీరాముడు ఉబ్బితబ్బిబ్బైయ్యాడు.  సీతాదేవితో పరిచయం చేసుకునే టప్పుడు ఆమెకు ధైర్యం చెప్పేటప్పుడు ఆంజనేయ స్వామి చాలా పొందికగా మాట్లాడతాడు. అంతకుముందు ఏమాత్రమూ పరిచయం లేని సీతకు ఆంజనేయుడు అత్యంత ప్రీతిపాత్రమైన నమ్మకమైన వ్యక్తిగా మారతాడు. పట్టాభిషేకానికి ముందు రాముడు పంపితే వెళ్లి భరతుడు తో అప్పటివరకు జరిగిన  విషయాలన్నీ చెప్పి రాముడు వస్తున్నాడు అనే వార్త తెలియజేస్తాడు. అప్పుడు  భరతుడు కూడా ఈయన మాటలకు పరవశుడై నాకు సోదరుడితో తో సమానము అని పొగుడుతాడు. కార్యసాధకుడు అంటే కొత్తగా పరిచయమైన వాళ్లతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి.  దీనికి మాట నేర్పు చాలా అవసరం. ఇది ఆంజనేయస్వామిని చూసి అందరూ నేర్చుకోవాలి.


*రామాయణం లో ఆంజనేయుడి నడవడిక ద్వారా  మానవాళికి వాల్మీకి  అందించిన personality development పాఠాలు ఇవి.  వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన వేరే పుస్తకాలు  చదివేటప్పుడు కుడా  ఆంజనేయ స్వామిని ఉదాహరణగా తీసుకుని,  రామాయణాన్ని సరిగా అన్వ యించుకుని  చదివితే  విషయం ఇంకా బాగా అర్థం అవుతుంది...*


*పవని నాగ ప్రదీప్.*

*12.ఉపమన్యు మహర్షి*

 *🙏మహర్షుల దివ్య చరిత్రలు🙏*

*12.ఉపమన్యు మహర్షి* 


                  ఉపమన్యు మహర్షి కృతయుగంలో వ్యాఘ్రపాదుడు అనే మహర్షికి పెద్దకొడుకుగా పుట్టాడు . ఉపమన్యుకు ధౌమ్యుడనే పేరుకల తమ్ముడుండేవాడు . వీళ్ళిద్దరూ వాళ్ళ అమ్మ చెప్పినట్లు విని బుద్ధిగా , ముద్దుగా ఉండేవాళ్ళు . ఒకరోజు బంధువుల ఇంటికి వెళ్ళి పరమాన్నం తిన్నారు . తిని ఊరుకున్నారా ! ఇంటికొచ్చి అలాంటి పరమాన్నం నువ్వు కూడా చేసి పెట్టు అన్నారు తల్లిని . ఇది మహర్షిగారి ఇల్లు కదా ! రకరకాల వంటలు ఎక్కడ ఉంటాయి . అన్ని కోరికలు తీరాలంటే ఈశ్వరుడి  గురించి తపస్సు చెయ్యండి . ఆయనే మీకేం కావాలన్నా ఇవ్వగలడు అంది తల్లి .


శివుడు ఎలా ఉంటాడు ? అని ఉపమన్యు తల్లిని అడిగాడు . శివుడు ఎలా ఉంటాడో ఆవిడకి తెలిసినంతవరకు వివరంగా చెప్పింది . ఉపమన్యు తల్లికి నమస్కారం చేసి " నేను తపస్సు చేసుకుందుకు వెళ్ళిపోతున్నాను ” అని వెళ్ళిపోయాడు తమ్ముడితో కలసి . అలా వెళ్ళి , వెళ్ళీ ఒక మంచి చోటు చూసుకుని ఎడంకాలి బొటనవ్రేలిమీద నిలబడి తపస్సు చేయడం ప్రారంభించాడు . ఒక వంద సంవత్సరాలేమో పండ్లు తిన్నాడు . ఇంకో వంద సంవత్సరాలు ఆకులు తిన్నాడు . ఇంకో వంద సంవత్సరాలు నీరు మాత్రమే త్రాగి , మిగిలిన సంవత్సరాలు గాలే భోజనం అనుకుని మొత్తం వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు . ఈశ్వరుడు ఇంద్రుడి రూపంలో వచ్చి ఉపమన్యు ! నీ తపస్సుకు నేను చాలా సంతోషపపడ్డాను . ఏం కావాలో కోరుకో అన్నాడు . అపుడు ఉపమన్యు నువ్వు ఈశ్వరుడు కాదు , నన్ను ఈశ్వరుడు వచ్చి ఏదైనా పురుగు అయిపో అంటే పురుగయిపోతాను , చెట్టు అయిపో అంటే చెట్టయిపోతాను , అంతేకానీ , ఇంకెవరయినా వచ్చి రాజ్యాలిచ్చినా నేను తీసికోనన్నాడు . ఈశ్వరుడు కనిపించేవరకు ఎన్ని జన్మలయినా ఇలాగే తపస్సు చేసుకుంటాను గాని , వేరే వాళ్ళు ఏమిచ్చినా తీసికోను అన్నాడు . ఉపమన్యు ,      ఇంద్రుడు డన్నాడు శివుడు , శివుడు అంటున్నావు , అతడు ఎలా ఉంటాడో చెప్పు ? అడిగాడు . మహర్షు లందరూ ఎవరినైతే సత్ , అసత్ , వ్యక్త , అవ్యక్త రూపం 


గలవాడంటారో , ఆది మథ్య అంతములేని వాడెవడో , జ్ఞానవంతుడు , అచింత్యుడు , పరమాత్మ అయినా వాడెవడో , అన్ని సంపదలూ ఎవరినుంచి వస్తున్నాయో , బీజ అబీజ సంభూతుడెవడో , లోకం ఎవరిలో లీనమయిందో వాడే ఈశ్వరుడు . ఆ సర్వేశ్వరుడు వరం ఇస్తే తీసుకుంటాను లేకపోతే లేదు . ఇంకెవరిచ్చినా నాకు వద్దన్నాడు ఉపమన్యు . వెంటనే ఉపమన్యు మహర్షికి తెల్లని తోక , బూడిదరంగులో పర్వతమంత శరీరం , వజ్రాల్లాంటి కొమ్ములు , బంగారు నగలు ఉన్న ఐరావతం అంటే పెద్ద ఏనుగు కన్పించింది . తర్వాత ఎద్దునెక్కి తెల్లటి బట్ట ధరించి మహాతేజస్సుతో పార్వతిదేవితో కలిసి ప్రశాంతమైన ముఖంతో పరమేశ్వరుడు కన్పించాడు . శివుడు అగ్ని శిఖలాగ వెలిగిపోతున్నాడు . ఆయనకి కుడివైపు హంసవాహనం మీద బ్రహ్మ , ఎడమవైపున గరుడవాహనం మీద గద , శంఖం , చక్రంతో విష్ణుమూర్తి , నెమలి వాహనం మీద కుమారస్వామి తల్లి పార్వతి దగ్గర శక్తి ఘంటాలతో రెండవ అగ్నిలా కనిపిస్తూ , ఆయన ఎదుట నంది ఉన్నారు . మనువులు , మహర్షులు ఇంద్రాది దేవతలు శివుడి చుట్టూ ఉన్నారు . సర్వభూత గణాలు , సర్వమాతృకలు ఆయనకు నాలుగు ప్రక్కలా ఉన్నారు . దేవతలు శివుడికి స్తోత్రం చేశారు . బ్రహ్మ , విష్ణువు ఆయన్ని వేదాలో కీర్తించారు . ఇంద్రుడు ఆయన్ని ఎన్నో విధాల కీర్తించాడు . ఇవన్నీ చూసి ఉపమన్యు మహర్షికి ఆనందంతో కళ్ళ నుంచి నీరు ధారగా కారిపోతున్నాయి . ఉపమన్యు పరమేశ్వరుడి పాదాల మీద పడి ఆయన్ని ఆనందంతో  చేశాడు . దాన్నే ఉపమన్యు శివస్తోత్రంగా ఇప్పటికీ మనం చదువుతూ ఉంటాం . 


దేవతలు పుష్పవర్షం కురిపించారు . పరమేశ్వరుడు ఉపమన్యు మహర్షిని మూడు వరాలు కోరుకోమన్నాడు . ఉపమన్యుడు స్వామీ ! మొదటి వరం నాకు ఎప్పుడూ నీమీదే భక్తి ఉండేటట్లు , రెండవ వరం నాకు భూత , భవిష్యత్ , వర్తమాన కాలాల గురించి తెలిసేట్లు , మూడవ వరం నీకు అభిషేకం చేయడానికి క్షీరం ఎప్పుడూ దొరికేటట్లు అనుగ్రహించమన్నాడు . శివుడు సరేనని చెప్పి అంతర్ధానమయ్యాడు . ఉపమన్యు మహర్షి హిమత్పర్వతం మీద చక్కటి ఆశ్రమం ఒకటి వేసుకుని తపస్సు చేసుకుంటున్నాడు . 

ఒకసారి శ్రీకృష్ణుడు పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసి తన భార్య అయిన జాంబవతికి ఒక కొడుకునివ్వాలని ఉపమన్యు ఆశ్రమానికి వచ్చాడు . ఉపమన్యు మహర్షి శివుడి గురించి శ్రీకృష్ణుడికి అన్నీ వివరంగా చెప్పి అక్కడే ఉండి తపస్సు చేసుకోమన్నాడు . శ్రీకృష్ణుడు ఉపమన్యుడికి శిష్యుడై పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసి శివుడి దర్శనం పొందాడు . ఆ సమయంలో శివుణ్ణి అర్ధనారీశ్వరుడుగా ఉపమన్యు స్తోత్రం చేశాడు . ఈ రకంగా ఉపమన్యు పాయసం కోసం మొదలు పెట్టి పరమేశ్వరుడ్నే దర్శనం చేసుకున్నాడు . 

*12.ఉపమన్యు మహర్షి* 


*Note:- మహర్షుల దివ్య చరిత్రను ఫార్వర్డ్ చేసి ప్రతి ఒక్క హిందూ చేత చదివిద్దాం. ఆ మహర్షుల దివ్య ఆశీస్సులు పొందు దాము*🙏

వస్తు తత్వమును తెలిసేది ఙ్ఞానం.

 వస్తు తత్వమును తెలిసేది ఙ్ఞానం. లేనియెడల ఎవరో చెప్పాలి వస్తువు గురించి. ఎవరు దానికి మూలం. తల్లి తండ్రి. అందుకే వారి పెంపకం. వారికి ఎవరు చెప్పాలి. వారి తల్లి దండ్రులు. యిది నిరంతరాయంగా దీనికి మొదలు తుది లేదు. 

కొంతవరకు వారి పరిధి ఆపై ఎవరికి వారే. మూల సూత్రములను శబ్దం ద్వారానే తెలియాలి. శబ్ద, శక్తి, పదార్ధ విచ్ఛిన్నం అనుకుంటాము, కానీ విశ్వంలో పదార్ధము లేదు శక్తి మాత్రమే యున్నది. పదార్ధ లక్షణము లేక పోయినా శక్తి అనంతమై వ్యాప్తమగుచూ లక్షణము పదార్ధం వ్యాప్తివలనతెలియుచున్నది. యిదే ప్రకృతి తత్వం. అది పదార్ధం వలన యింకా స్పష్టంగా తెలియుట. ఆంగ్లంలో దటీజ్ దీనిని ఎవరు తెలియాలి తత్ అనే ఙ్ఞానమును. తత్ పదార్ధం కాదు. అది ధాతువైన పదార్ధ రూపమే. పదార్ధ రూపం కూడా లక్షణము తెలిసిన సత్ అని యిది యని వస్తు లక్షణము తెలియుట. అదియును అనుభవం వలననే. వేద వాఙ్మయం సమస్తం శబ్ద పదార్ధముగా  రంగు, రుచి, లక్షణములను వానిని వ్యాప్తరూపంగానే తెలియుచువ్నది. వస్తువు వకటే. మూల తత్వం సూత్రము వకటే. కానీ దేని లక్షణము, రంగు, వాసన రుచి వేరు వేరు గా కనిపించు చున్నవి. యిదే తత్ దటీజ్. దటీజ్ తెలిసినది అనగా అది అనుభవపూర్వకమైనగాని స్థరంమైన౮ి యని తెలియుట లేదు. దీనిని మానవుల ద్వారానే వివేకము ద్వారానే అనగా సూక్మ పరిశీలన ద్వారానే తెలియనగును. మనకు మన పెద్దలు సమస్తం నిర్వచించి వుంచారు, అది గ్రహించుటయే ఙ్ఞానము. ఎవరికీ తెలియనప్పుడు వక విశేష సూత్రము ద్వారా  అనగా ప్రకృతి మార్పు ద్వారా తత్ సత్ యని తెలియ వచ్చును. ఎల్లప్పుడు కలిగియున్నదని తెలియవచ్చును.అనంతమైన శక్తిని ఙ్ఞానం ద్వారా తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*చదువు..సంభాషణ..*


శ్రీ స్వామివారి కి ఆహారం ఇచ్చి రావడమనేది నేను మొగలిచెర్ల లో ఉన్నన్ని రోజులూ నా దినచర్య గా మారిపోయింది..ఒక్కొక్కసారి శ్రీ స్వామివారు పలకరించేవారు..ఒక్కొక్కరోజు శ్రీ స్వామివారి దర్శనం కూడా  అయ్యేది కాదు..ధ్యానం లో ఉండిపోయేవారు..వేసవి సెలవులు పూర్తి కాగానే నేను తిరిగి కనిగిరికి చదువుకోవడానికి వెళ్ళిపోయాను..


1974 వ సంవత్సరం దసరా సెలవుల్లో ఒకటి రెండు సార్లు శ్రీ స్వామివారిని దర్శించుకునే అవకాశం మాత్రం కలిగింది..అమ్మా నాన్న గార్లు మాత్రం శ్రీ స్వామివారితో నిరంతర సంబంధం కలిగి ఉన్నారు..రోజులు గడచిపోతున్నాయి..


1975 వేసవి సెలవులకు నేను మొగలిచెర్ల వచ్చినప్పుడు  ఒకరోజు ఉదయాన్నే శ్రీ స్వామివారి ఆశ్రమానికి వెళ్ళాను..శ్రీ స్వామివారు ఆశ్రమం బైట నిలబడి వున్నారు..నన్ను చూడగానే.."ఎప్పుడొచ్చావు?.." అన్నారు..


"రెండు రోజులయింది స్వామీ.." అన్నాను..


"ఇంత పెందలాడే ఇటొచ్చావు.. మాగాణి కి పోతున్నావా?.." అన్నారు..


"లేదు స్వామీ..మిమ్మల్ని కలుద్దామని అనుకున్నాను..మీరు ధ్యానం లో వుంటే..ఇక్కడే వేచి వుండి కలసి పోదామని అనుకున్నాను.." అన్నాను..


"ఈ సన్యాసి కాడ ఏముందని చూడటానికి వచ్చావు..ఎలాగూ వీలున్నప్పుడు అన్నం డబ్బా తీసుకొస్తున్నావు కదా?..సరేలే..రా!..ఇక్కడ కూర్చో! " అన్నారు..తాను ధ్యానం చేసుకొనే గదిముందు వరండాలో కూర్చున్నారు..నేను కొద్దిగా దూరంగా మెట్ల కింద కూర్చున్నాను..


"ఇప్పుడు ఏం చదువుతున్నావు?.." 


"పదవ తరగతి పరీక్షలు వ్రాసాను..ఇంకా ఫలితాలు రాలేదు.." అన్నాను..


"పెద్దగా చదువు అబ్బినట్లు లేదే.."మొత్తమ్మీద నెట్టుకొస్తావు లే!.." అన్నారు నవ్వుతూ..


తలొంచుకున్నాను..నిజమే..నేను చదువులో వెనుకబడే వున్నాను..అతి కష్టమ్మీద అత్తెసరు మార్కులతో గట్టెక్కుతున్నాను..మా ముగ్గురిలో నేనే చదువులో మొద్దును..సిగ్గుగా అనిపించింది..మౌనంగా ఉండిపోయాను..శ్రీ స్వామివారికి ఈ విషయం ఎలా తెలిసిందా అని కొద్దిగా మథన పడ్డాను కూడా..


కొద్దిసేపు శ్రీ స్వామివారు కూడా  ఏమీ మాట్లాడకుండా వున్నారు..తరువాత లేచి తాను ధ్యానం చేసుకునే గది తలుపులు పూర్తిగా తెరచి పెట్టారు..ఆ గదిలో ఒక మూల ఉన్న పాదుకలను కాళ్లకు వేసుకొని..ఇవతలకు వచ్చి..నా ముందునుంచే నడుచుకుంటూ బావి దగ్గరికి వెళ్లి రెండు నిమిషాల పాటు అక్కడే నిలబడి..ఆశ్రమం చుట్టూరూ ప్రదక్షిణగా ఒకమారు తిరిగి వచ్చి..నాకు కొద్దిదూరంలో నిలబడ్డారు..నేనూ లేచి నిలుచున్నాను..


"అమ్మా నాన్న లను ఒకసారి వచ్చి వెళ్ళమని చెప్పు.." అన్నారు..


"సరే స్వామీ..నేను వెళ్ళొస్తాను.." అన్నాను..సరే నన్నట్లు తల ఊపారు..నాతో బాటు ప్రహరీ ద్వారం దాకా వచ్చి.."మర్చిపోకుండా నాన్నకు అమ్మకు చెప్పు..ముఖ్యమైన విషయం మాట్లాడాలి..వీలైతే ఈరోజు సాయంత్రం రమ్మనమని చెప్పు.." అన్నారు..సరే నని చెప్పి..నేరుగా ఇంటికొచ్చి అమ్మా నాన్న లకు శ్రీ స్వామివారు రమ్మంటున్నారని చెప్పాను..ఆరోజు సాయంత్రమే అమ్మా నాన్న శ్రీ స్వామివారిని కలవడానికి ఆశ్రమానికి వెళ్లారు..


ఆశ్రమం నుంచి తిరిగొచ్చిన అమ్మా నాన్న గార్లు ఏదో తీవ్రమైన సమస్యలో ఉన్నట్లు తోచింది..కొద్దిసేపటికి అర్ధమైన విషయమేమిటంటే..శ్రీ స్వామివారు తనను జీవసమాధి చేయమని కోరారట!..


సాధన..సజీవ సమాధి వివరణ!..రేపటి భాగంలో...


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..సెల్..94402 66380 & 99089 73699).

ఖాళీలు పూరించండి

 ఈ క్రింది ఖాళీలు పూరించండి అన్ని ఆ శివుడి నామాలే. ఈ రూపేనా మనం శివుని

 స్మరించి తరిద్దాO.


1. గం---ధ---డు 

2. మ---శ్వ---డు

3. మ---నాo--- ---డు

4. భూ---నా---డు

5. నీ---కం---డు

6. గి---జా---తి

7. ప---మే--- ---డు

8. ల---కా---డు

9. పా---తీ---తి

10. త్రి---చ---డు

11. కా---త---డు

12. వి---నా---డు

13. ఉ---కాం---డు

14. వి---పా---డు

నం15. వి---శ్వ---డు

16. మ---శ్వ---డు

17. మ---కా--- ---డు

18. భో---శం--- ---డు

19. నం---వా--- ---డు

20. స---శి---డు

21. త్రి---రాం--- ---డు

22. సాం---శి---డు

23. గౌ---నా---డు

24. ప---గ---ష---డు

25. మృ---జ---డు

బహుముఖ ప్రజ్ఙాశాలి*

 *బహుముఖ ప్రజ్ఙాశాలి*


*పాములపర్తి వెంకట నరసింహారావు*



||సీసమాలిక||

భారతదేశపు భవితను చాటిన

బహు భాషలందు న పండితుండు


బహుముఖ ప్రజ్ఞతో పలుసేవలందించి

మార్గదర్శిగ మేను మరచినాడు


మన తెలంగాణ లో మహనీయ చరితుడై

మన్నన పొందిన మహిత మూర్తి


ప్రతిభతో మనదేశ ప్రజలను పాలించు

భవ్య ప్రధానియౌ పాలకుండు


అపర చాణక్యుడు అభివృద్ధికాద్యుడు

పాములపర్తింట ప్రాజ్ఞుడతడు


ప్రావీణ్యుడైనట్టి భవ్య దక్షిణనేత

భారత రత్న కు ప్రభుతగలదు


పాములపర్తి సద్వంశ నీరధి లోన

పూర్ణ చంద్రుడు సదా పూజ్యుడితడు


||తే.గీ.||

లక్నెపల్లి లో రుక్మిణీ రాజ్ఞి సుతుడు

రంగరంగవైభోగ విరాజితుండు

జగతిలో ఖ్యాతి గాంచు రాజన్యుడితడు

పీవి నర్సింహరాయుని ఠీవి యిదియె.


భారతరత్నకు అర్హుడు 

సారస్వత మూర్తి యతడె చతురతజూపెన్

ధీరత గల్గినవాడై 

మారగజేసెనుభవితను మాన్యుడుతానై!!


||కం||

బహుభాషా కోవిదునకు

బహుమానమునివ్వ వలయు బాధ్యత తోడన్

బహుముఖ ప్రజ్ఞాశాలి కి

బహుమతి సరియైనదగును భారతరత్నే.


*గోగులపాటి కృష్ణమోహన్*

కవి, రచయిత, జర్నలిస్టు


వ్యవస్థాపక అధ్యక్షుడు, 

తెలుగు కవన వేదిక, 


మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రచయితల సంఘం


9700007653

🇮🇳I N D I A N R U L E R S🇮🇳*



 *🇮🇳I N D I A N R U L E R S🇮🇳*


 *బానిస రాజవంశం*

 1 = 1193 ముహమ్మద్ ఘోరి

 2 = 1206 కుతుబుద్దీన్ ఐబాక్

 3 = 1210 అరామ్ షా

 4 = 1211 ఇల్టుట్మిష్

 5 = 1236 రుక్నుద్దీన్ ఫిరోజ్ షా

 6 = 1236 రజియా సుల్తాన్

 7 = 1240 ముయిజుద్దీన్ బహ్రమ్ షా

 8 = 1242 అల్లావుద్దీన్ మసూద్ షా

 9 = 1246 నాసిరుద్దీన్ మెహమూద్

 10 = 1266 గియాసుడిన్ బల్బన్

 11 = 1286 కై ఖుష్రో

 12 = 1287 ముయిజుద్దీన్ కైకుబాద్

 13 = 1290 షాముద్దీన్ కామర్స్

 1290 బానిస రాజవంశం ముగుస్తుంది

 (ప్రభుత్వ కాలం - సుమారు 97 సం.)


 *ఖిల్జీ రాజవంశం*

 1 = 1290 జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ

 2 = 1296 అల్లాదీన్ ఖిల్జీ

 4 = 1316 సహబుద్దీన్ ఒమర్ షా

 5 = 1316 కుతుబుద్దీన్ ముబారక్ షా

 6 = 1320 నాసిరుదిన్ ఖుస్రో షా

 7 = 1320 ఖిల్జీ రాజవంశం ముగిసింది

 (ప్రభుత్వ కాలం - సుమారు 30 సం.)


 *తుగ్లక్ రాజవంశం*

 1 = 1320 గయాసుద్దీన్ తుగ్లక్ I.

 2 = 1325 ముహమ్మద్ బిన్ తుగ్లక్ రెండవ

 3 = 1351 ఫిరోజ్ షా తుగ్లక్

 4 = 1388 గయాసుద్దీన్ తుగ్లక్ రెండవ

 5 = 1389 అబూబకర్ షా

 6 = 1389 ముహమ్మద్ తుగ్లక్ మూడవ

 7 = 1394 సికందర్ షా మొదటి

 8 = 1394 నాసిరుదిన్ షా దుస్రా

 9 = 1395 నస్రత్ షా

 10 = 1399 నాసిరుద్దీన్ మహమ్మద్ షా వెంటాడే రెండవ స్థానంలో ఉన్నారు

 11 = 1413 డోలత్ షా

 1414 తుగ్లక్ రాజవంశం ముగుస్తుంది

 (ప్రభుత్వ కాలం - సుమారు 94 సం.)


 *సయ్యిద్ రాజవంశం*

 1 = 1414 ఖిజ్ర్ ఖాన్

 2 = 1421 ముయిజుద్దీన్ ముబారక్ షా రెండవ

 3 = 1434 ముహమ్మద్ షా నాల్గవ

 4 = 1445 అల్లావుద్దీన్ ఆలం షా

 1451 సయీద్ రాజవంశం ముగుస్తుంది

 (ప్రభుత్వ కాలం - సుమారు 37 సం.)


 * అలోడి రాజవంశం *

 1 = 1451 బహ్లోల్ లోడి

 2 = 1489 అలెగ్జాండర్ లోడి రెండవది

 3 = 1517 ఇబ్రహీం లోడి

 1526 లోడి రాజవంశం ముగుస్తుంది

 (ప్రభుత్వ కాలం - సుమారు 75 సం.)


 *మొఘల్ రాజవంశం*

 1 = 1526 జహ్రుదిన్ బాబర్

 2 = 1530 హుమయూన్

 1539 మొఘల్ రాజవంశం సమయం ముగిసింది


 *సూరి రాజవంశం*

 1 = 1539 షేర్ షా సూరి

 2 = 1545 ఇస్లాం షా సూరి

 3 = 1552 మహమూద్ షా సూరి

 4 = 1553 ఇబ్రహీం సూరి

 5 = 1554 ఫిరుజ్ షా సూరి

 6 = 1554 ముబారక్ ఖాన్ సూరి

 7 = 1555 అలెగ్జాండర్ సూరి

 సూరి రాజవంశం ముగుస్తుంది, (పాలన -16 సంవత్సరాలు సుమారు)


 *మొఘల్ రాజవంశం పున ప్రారంభించబడింది*

 1 = 1555 హుమాయు మళ్ళీ గడ్డిపై

 2 = 1556 జలాలుద్దీన్ అక్బర్

 3 = 1605 జహంగీర్ సలీం

 4 = 1628 షాజహాన్

 5 = 1659 u రంగజేబు

 6 = 1707 షా ఆలం మొదట

 7 = 1712 జహదర్ షా

 8 = 1713 ఫరూఖ్సియార్

 9 = 1719 రైఫుడు రజత్

 10 = 1719 రైఫుడ్ దౌలా

 11 = 1719 నెకుషియార్

 12 = 1719 మహమూద్ షా

 13 = 1748 అహ్మద్ షా

 14 = 1754 అలమ్‌గీర్

 15 = 1759 షా ఆలం

 16 = 1806 అక్బర్ షా

 17 = 1837 బహదూర్ షా జాఫర్

 1857 మొఘల్ రాజవంశం ముగుస్తుంది

 (ప్రభుత్వ కాలం - సుమారు 315 సంవత్సరాలు.)


 *బ్రిటిష్ రాజ్ (వైస్రాయ్)*

 1 = 1858 లార్డ్ క్యానింగ్

 2 = 1862 లార్డ్ జేమ్స్ బ్రూస్ ఎల్గిన్

 3 = 1864 లార్డ్ జాహోన్ లోరెన్ష్

 4 = 1869 లార్డ్ రిచర్డ్ మాయో

 5 = 1872 లార్డ్ నార్త్‌బుక్

 6 = 1876 లార్డ్ ఎడ్వర్డ్ లాటెన్లార్డ్

 7 = 1880 లార్డ్ జార్జ్ రిపోన్

 8 = 1884 లార్డ్ డఫెరిన్

 9 = 1888 లార్డ్ హన్నీ లాన్స్‌డన్

 10 = 1894 లార్డ్ విక్టర్ బ్రూస్ ఎల్గిన్

 11 = 1899 లార్డ్ జార్జ్ కర్జన్

 12 = 1905 లార్డ్ టివి గిల్బర్ట్ మింటో

 13 = 1910 లార్డ్ చార్లెస్ హార్డింగ్

 14 = 1916 లార్డ్ ఫ్రెడరిక్ సెల్మ్స్ఫోర్డ్

 15 = 1921 లార్డ్ రూక్స్ ఐజాక్ రైడింగ్

 16 = 1926 లార్డ్ ఎడ్వర్డ్ ఇర్విన్

 17 = 1931 లార్డ్ ఫ్రీమాన్ వెల్లింగ్డన్

 18 = 1936 లార్డ్ అలెగ్జాండర్ లిన్లిత్గో

 19 = 1943 లార్డ్ ఆర్కిబాల్డ్ వేవెల్

 20 = 1947 లార్డ్ మౌంట్ బాటన్


బ్రిటిషర్స్ పాలన సుమారు 90 సంవత్సరాలు ముగిసింది.


 * ఆజాద్ ఇండియా, ప్రధాని *

 1 = 1947 జవహర్‌లాల్ నెహ్రూ

 2 = 1964 గుల్జారిలాల్ నందా

 3 = 1964 లాల్ బహదూర్ శాస్త్రి

 4 = 1966 గుల్జారిలాల్ నందా

 5 = 1966 ఇందిరా గాంధీ

 6 = 1977 మొరార్జీ దేశాయ్

 7 = 1979 చరణ్ సింగ్

 8 = 1980 ఇందిరా గాంధీ

 9 = 1984 రాజీవ్ గాంధీ

 10 = 1989 విశ్వనాథ్ ప్రతాప్సింగ్

 11 = 1990 చంద్రశేఖర్

 12 = 1991 పివి నరసింహారావు

 13 = అటల్ బిహారీ వాజ్‌పేయి

 14 = 1996 H.D. దేవేగౌడ

 15 = 1997 ఐకె గుజ్రాల్

 16 = 1998 అటల్ బిహారీ వాజ్‌పేయి

 17 = 2004 డాక్టర్ మన్మోహన్ సింగ్

 * 18 = 2014 నుండి నరేంద్ర మోడీ *


 764 సంవత్సరాల తరువాత, ముస్లింలు మరియు బ్రిటిష్ వారి బానిసత్వం నుండి స్వేచ్ఛ పొందబడింది.  ఇది హిందువుల దేశం.  ఇక్కడ మెజారిటీ ఉన్నప్పటికీ, హిందువులు తమ దేశ బానిసలుగా మారుతున్నారు, నేడు ప్రజలు చెబుతున్నారు.  హిందువులు మతతత్వమయ్యారు ,,,,,,, 


 🚩🚩🚩🚩🚩

 ఈ ముఖ్యమైన సమాచారాన్ని యువకులందరి దృష్టిలో వీలైనన్ని సమూహాలలో పంపండి....


మనం 1000 సంవత్సరాలు కొన్ని కోట్ల మంది పోరాటం ఫలితంగా ఈ దేశం ఇంకా హిందూ దేశంగా మనుగడలో ఉన్నది.

 🙏🙏🙏

నామం జపిస్తే

 🙏🌺శ్రీ రామ నామం🌺🙏


 🌺ఏ నామం అయినా పలికితే ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు. అదే శ్రీ రామ అనే నామంలో రాముడు ఒక్కడే పలుకుతాడు అనుకోవడం పొరపాటు. 🌺


🌺శ్రీ రామ అనే నామం జపిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారట.అదెలాగో చూద్దాం.🌺


🌺1. రామ అంటే రాముడు పలుకుతాడు తెలిసిందే


🌺2. రామ అనే నామం ఉన్న చోట అందరికన్నా ముందర వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేది నిస్సందేహంగా ఆ హనుమంతుడే


🌺3. శ్రీ అంటే లక్ష్మి


🌺4. రా అంటే  విష్ణువు  (ఓం నమో నారాయణాయ అనే నామం లో నుంచి రా అనే జీవ అక్షరం తీసుకున్నారు)


🌺5. మ అంటే  శివుడు  (ఓం నమః శివాయ అనే నామం లో నుంచి మ అనే జీవ అక్షరం తీసుకున్నారు)


🌺6. శివుడు హనుమంతుడి రూపం లో భూలోకానికి రామ సేవ కోసం వస్తున్నప్పుడు పార్వతీ దేవి నాకు ఆ అదృష్టం కావాలి అన్నారట. 🌺


🌺అపుడు శివుడు ఇలా అన్నాడు ఈ అవతారం లో హనుమంతుడు బ్రహ్మచర్యాన్ని పటిస్తాడు కనుక నిన్ను తీసుకెళ్లడం కుదరని పని. 


అపుడు పార్వతీ దేవి అయితే నేను మీ తోక రూపంలో వస్తాను అని హనుమంతుడి తోక లో ప్రవేశించింది అట. 


మరి రామ అన్నపుడు హనుమ వస్తే *పార్వతీ* కూడా వచ్చింది కదా.


రాముడు, హనుమంతుడు, లక్ష్మి, విష్ణువు, శివుడు, పార్వతీ ఒక్క నామం పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదించగలరు. గమనించండి. 🌺


🌺శ్రీ రామ శ్రీ రామ* అని అంటూనే వుందాము. 

మన ఈ మానవ జన్మ తరింద్దాము.🌺


               🌺ఓం జై శ్రీరామ్ 🌺

దేవుడు

 ఒక్కోసారి దేవుడు ఇంగ్లాండు నుండీ కూడా వస్తాడు ! 


కొన్నేళ్ళ క్రితం మన దేశంలో [ ఉత్తరభారతం] ఒక ఆయుర్వేదవైద్యుడు వుండేవారు. పేద డాక్టరు .  భగవద్గీత లో శ్రీకృష్ణుడు మనిషిని ఎలా జీవించమని చెప్పాడో కచ్చితంగా అలానే జీవిస్తూవుండేవాడు. ఒకరోజుకు తన భార్య , కూతురు , తనకు ఎంత డబ్బు అవసరం అవుతుందో అంతే సంపాదించేవాడు. [ నన్ను నమ్మి ,  అహంకారం వదలి , నాకు శరణాగతి చేసుకొన్న వారి బాగోగులు నేనే చూసుకొంటాను - అనన్యాశ్చింతయోమా  ...యోగక్షేమం వహామ్యహం - 9 వ అధ్యాయం , 22 వ శ్లోకం] ] ఉదాహరణకు రోజుకు 80 రూ. కావాలి. ఎనిమిదిమంది పేషెంట్లు వచ్చారు , 80 రూ. వచ్చింది. అంతే . తొమ్మిదవ పేషెంటు దగ్గర డబ్బు తీసుకోడు. ఉచితం. ఎప్పుడూ దైవ చింతనలో వుండేవాడు.ప్రతి ఉదయం ఆయన భార్య ఆయనకు ఒక కాగితం మీద ఇంటికి ఏమి కావాల్నో వ్రాసి ఇస్తుంది. దాన్ని తీసుకొని ఆస్పత్రికి వెళతాడు. ఆ వస్తువులకు ఎంత డబ్బు ఖర్చు అవుతుందో అంత డబ్బు  [ ఫీజు రూపంలో ] రాగానే ఇక ఫీజు తీసుకోడు. రేపు ఎలా ? అనే ఆలోచన లేదు. ఈరోజు ఇచ్చిన పరమాత్మ రేపు పిసినారి అవుతాడా ? వాసుదేవమితి సర్వం .      


ఒక రోజు ఆసుపత్రి [ చిన్న గది] ముందు ఒక కారు వచ్చి ఆగింది. అందులోంచి ఒక వ్యక్తి , డాక్టరు దగ్గరికొచ్చి ' నన్ను గుర్తుపట్టారా ? '' అని అడిగాడు. '' క్షమించాలి , లేదు , '' అన్నాడు డాక్టరు. అపుడు ఆయన ఇలా చెప్పాడు : '' 15 ఏళ్ళ క్రితం ఒక రాత్రి ఈ వూరిగుండా వెళుతున్న నేను , ఇక్కడ కారు ఆగిపోతే కాసేపు ఆగాను. నా డ్రైవర్ కారు రిపేరు చేస్తున్నాడు. అపుడు మీరు వచ్చి ' లోపలికి రండి ' అన్నారు. గదిలోకొచ్చి కూర్చొన్న నన్ను చూసి ' మీరు ఏదో దిగులు పడుతున్నారు , ఆరోగ్యం సరిగాలేదా ? ' అన్నారు. అపుడు మీ టేబిల్ దగ్గర సుమారుగా ఆరేళ్ళు వుండే ఒక చిన్న పాప మిమ్మల్ని ' నాన్నా , ఇక ఇంటికి వెళదాం , రండి ' అని పిలిచింది. ' కాసేపు ఆగమ్మా , కారు వెళ్ళాక మనం ఇంటికివెళదాం ,' అన్నారు. ఆ చక్కటి పాపను చూస్తూ ఇలా అన్నాను ' , నేను ఇంగ్లాండులో వుంటాను. మాకు సంతానం లేదు. మా ఇంట్లో ఆడపాప వుండాలని మాకు ఎంతో కోరిక , కానీ తీరలేదు. ఇపుడు ఈ పాపను చూస్తే , నా బాధ  గుర్తుకొచ్చింది ,'' అన్నాను. మీరు రెండు పొట్లాల ఔషధం తయారుచేసి ' మీరు , మీ భార్య దీన్ని 60 రోజుల పాటు ఒక్కో గుళిక చొప్పున  తీసుకోండి 'అన్నారు.  నేను వీటికి డబ్బు ఎంత చెల్లించాలి ?  అని అడుగుతుంటే అపుడు మరో పేషెంటు వచ్చి తన జబ్బు చెప్పి మీదగ్గర మందు తీసుకొని వెళ్ళిపోతూ , నాదగ్గరకొచ్చి ' ఈరోజు కుటుంబం గడవడానికి ఎంత అవసరమో , ఆ డబ్బు అందాక వారు ఇక డబ్బు తీసుకోరు ' అని అంటూ  వెళ్ళిపోయాడు. కారు రిపేరు అయ్యింది. నేను మీకు ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాను. దిల్లీ వెళ్ళి అక్కడినుండి ఇంగ్లాండు వెళ్ళాం. ఇంగ్లాండు డాక్టర్లు మాకు సంతానం ఇక కలగదు అని చెప్పిన తరువాత కూడా , మీరంటే నాకు కలిగిన అపారమైన గౌరవం ,వృత్తిపట్ల మీ అంకిత భావం , మీ వ్యక్తిత్వం చూసాక నమ్మకం కలిగి నేను , రాధిక ఔషధం తీసుకొన్నాం. ఇపుడు మాకు ఇద్దరు ఆడపిల్లలు. పుత్తడిబొమ్మల్లావుంటారు. మీరు మాకు దేవుడితో సమానం. 


అప్పటినుండీ మీ ఋణం ఎలా తీర్చుకోవాలా అని ఇద్దరం ఆలోచిస్తున్నాం. నాకు ఇక్కడ భారత్ లో ఒక అక్కగారు వున్నారు . దురదృష్టం కొద్దీ ఆమె భర్త రోడ్డుప్రమాదం లో మరణించారు. వాళ్ళకో కూతురు. ఆమె పెళ్ళి బాధ్యత నేనే తీసుకొన్నాను. అపుడు నాకు 15 ఏళ్ళక్రితం ఈగదిలో నేను చూసిన మీ అమ్మాయి గుర్తుకొచ్చింది. ఆమె కూడా ఇపుడు పెళ్ళి వయసుకు వచ్చివుంటుంది. ఆమె పెళ్ళికి అయ్యే ఖర్చు మొత్తం మేమే భరిస్తాం. మాకు ఆ అవకాశం ఇవ్వండి. ఈనెల 24 న మా అక్క కూతురి  పెళ్ళి . మీ అమ్మాయి పెళ్ళికి ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలిసిన పద్దతిలో లెక్కవేసి ఈడబ్బు తెచ్చాను.మీరు డబ్బు కోసం ఎవరిదగ్గరా అప్పు చేయకండి. నేనున్నాను.ఇది మీరు తీసుకోవాలి '' అంటూ ఒక కవరులో పెద్ద మొత్తం డబ్బును టేబిల్ మీద పెట్టాడు.  అపుడు డాక్టరు తన జేబులోంచి ఈ రోజు కుటుంబానికి ఏమి కావాలో తన భార్య ఆరోజు ఉదయం వ్రాసి ఇచ్చిన అవసరాల లిస్టు ను అతనికి చూపించాడు. అందులో చివరన ఇలా వ్రాసివుంది : ' ఈనెల 22 న మన అమ్మాయి పెళ్ళి. మన దగ్గర వంద రూపాయలు కూడా లేవు. ఆలోచించండి.' 


అనన్యాశ్చింతయోమా....యోగక్షేమం వహామ్యహం

(ఈ కథ చదివిన తర్వాత ఒకరిద్దరికైనా కన్నీరు వస్తుంది కదా.. pn satish గారి పోస్ట్)🙏🏻🙏🏻🙏🏻

vaccines

When vaccine is taken people become weak, this happened to many people why ? 

the answer is : 


Generally, two vaccines are currently using in India. One is COVISHIELD by serum institute and the other is COVAXIN by Bharat biotech.

In covishield, there is duplicate virus present which is not the real virus but has similar outer structure. And in covaxin, real coronavirus is present with its genetic code already destroyed. Don’t worry, both are not harmful.

So, what happens.

When any of the vaccine enters in your body, your immune system gets activated and think it a real virus. It then starts fighting with virus and also preparing antibodies for it.

And whenever our immune system get strongly active, our body’s temperature rises which is an indication that our body is fighting against those duplicate virus.

So, this is the reason why you feel weakness because in most of the persons, they didn’t feel any kind of fever as they have strong immune system.

If you have not fever it means your immune system may be strong but may feel weakness because of activation of immune system.