29, జూన్ 2021, మంగళవారం

కోవిడ్ 19 రెండవ వేవ్ గురించి

 ఇప్పుడు మన ప్రజల మనస్తత్వం మారవలసిన అవసరం ఎందుకు?


" ఇది అతనిని ఖచ్చితంగా కట్టి పడేస్తుంది.  అతను చాలా వివరణలు ఇచ్చుకోవలసి ఉంటుంది. " 


కోవిడ్ 19 రెండవ వేవ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రొఫెసర్ మరియూ నా స్నేహితురాలు గొంతులో ఆనందం స్పష్టంగా కనిపించింది. మోడీకి ఇబ్బంది పెరిగిందని ఆమె తన ఆనందం దాచుకోలేకపోతోంది. ఇందులో ఆమె ఒంటరిగా లేదు. మహమ్మారి ఎక్కువ వ్యాప్తిపై భయం కంటే ఇది మోడీకి ఎంత ఎక్కువ ఇబ్బంది తెస్తుందనే దాని మీద లెక్కలు వేస్తున్నవారు చాలా మంది ఉన్నారు.


దేశం ఎదుర్కొంటున్న ఒక సంక్షోభం తరువాత మరో సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి అతను ప్రయత్నిస్తూ, ప్రతి ఒక్కరిని లేచి పోరాడమని ప్రోత్సహిస్తున్నప్పుడు ఒక మనిషి పట్ల ఇంత ఈ ద్వేషపూరిత ద్వేషానికి కారణం మరియు మూలం ఏమిటి? 


కోవిడ్ 19 మహమ్మారి మనలను కదిలించింది, మన ఉనికినే బెదిరిస్తున్నాది కానీ ఆ వ్యక్తి మీద ద్వేషంతో దీనిని పోల్చితే మరియు,  నా స్నేహితులలాంటి వ్యక్తులు మోడీ ఇబ్బందుల్లో ఉన్నాడని అతని కష్టాలను కోవిడ్ ఎలా పెంచుతుందో  ఆనందాన్ని వ్యక్తం చేయడంతోనూ పోలిస్తే కోవిద్ చిన్నది లాగే కనిపిస్తుంది. అతను వారికి ఏమి హాని చేయనప్పటికి మన సమాజంలో ఒక వర్గం అతని మీద అంతటి శత్రుత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నాదో మనలని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.


నేను ఈ వ్యాసం రాస్తున్నప్పుడు, మోడీ టీవీ/ రేడియో ప్రసంగం తర్వాత ఒక సందేశం చక్కర్లు వేయడం ప్రారంభమైంది. అది ఏమిటంటే " మీ  అవసరాలను మీరే చూసుకోవడం అంతే కాని సహాయం కోసం ప్రభుత్వం వైపు తిరగడం కాదు"

 "అందుకే అలాంటి ప్రభుత్వంలో జీవించడం నేర్చుకోండి, దేవుడే మనకు సహాయం చేస్తాడు ” అనే వ్యంగ్య సందేశం ఒక మేధావి నుండి వచ్చింది.


లేచి పోరాడమని మనకు  సూచించే మోడీ సందేశం అలాంటి వ్యంగ్య వ్యాఖ్యలను ఎందుకు ఆహ్వానిస్తోంది?


కారణం,   గతంలో భారతీయ నాయకులు తమ ప్రజలతో ఈ భాషలో చాలా అరుదుగా మాట్లాడేవారు. మన చీకటి రోజుల్లో ఆశ యొక్క చిహ్నంగా మనం పిలుచుకునే వారు ఎవరూ లేరు. వారు సంక్షోభ నిర్వాహకులుగా ఎక్కడా నిలబడి లేరు. గాంధీ నిశ్శబ్దంగా ఉపసంహరించుకునేవారు. అంతే కాదు సంక్షోభాన్ని ఎదుర్కొ వలసివచ్చినపుడు ప్రజలను సొంతంగా గాలికి వదిలివేసే సమాధానాల కోసం తన చక్రం తిప్పడం ప్రారంభించే వారు. అతని బెట్ నోయిర్ నెహ్రూ విభజన సమయంలో కూడ ఇలాగే ఉండేవారు.  చైనీయుల దండయాత్ర సమయంలో, అతను తన ప్రజలను జాగృతపర్చడానికి గుర్తుంచుకోవలసిన పదం ఎప్పుడైనా చెప్పాడా అని నేను ఆశ్చర్యపోతుంటాను. తరచుగా అతను తన  చేతుల మధ్య తల ఉంచి ఆలోచనలో మునిగిపోతూ కూర్చునేవాడు. శతాబ్దాల బానిసత్వం మరియు వలసవాదం నుండి బయటికి వచ్చిన తరువాత మన నాయకులు చాలా మంది ఈ విషయంలో విఫలమయ్యారు. విచిత్రం ఏమిటంటే మన నాయకులలోని వారి నిష్క్రియాత్మకతను మనం సహజంగా అంగీకరించాము. 


బంగ్లాదేశ్ యుద్ధంలో ఇందిరా గాంధీ చాలా అరుదుగా ప్రజలు ఏదో సందేశం చెప్పేవారు. అలా చెప్పడం మానేక్షా వంటి జనరల్స్ కు వదిలివేయబడింది. ఆమె అత్యవసర పరిస్థితిని ప్రకటించి వేలాది మందిని జైలు శిక్ష మొ. వాటితో హింసించింది. ఆమె హత్య తర్వాత జరిగిన దారుణానికి బాధ్యత స్వీకరించడానికి బదులుగా ఆమె కుమారుడు రాజీవ్ ఒక పెద్ద చెట్టు పడిపోయినప్పుడు భూమిలో చీలికను సృష్టిస్తుందని చెప్పారు. బొంబాయిలో ఉగ్రవాద దాడి తరువాత మన్మోహన్ సింగ్ ‘హిందూ టెర్రర్’ అనే పదాన్ని అనుమతించేంతవరకు వెళ్ళారు. గత విధానం ఏమిటంటే  ' వేచి ఉండి ఏమీ చేయకూడదు' అని.   జ్ఞాపకశక్తి యొక్క చివరి నిమిషం మసకబారే వరకు నిష్క్రియాత్మకతను కొనసాగించండి అనేదే గత అనుభవం.


అటువంటి భాషలో మాట్లాడని మొదటి నాయకుడు నరేంద్ర మోడీ. బానిసత్వం లేని మనస్తత్వం ఉన్న స్వతంత్ర భారతదేశపు మొదటి నాయకుడిగా చరిత్రకారులు ఒకరోజు ఆయనను వర్ణించవచ్చు. అతను ఒక సంక్షోభ నిర్వాహకుడు, అతను ఆర్టికల్ 370 రద్దు చేయడం లేదా రామ ఆలయాన్ని వంటి గత సమస్యలను పూర్తి చేయడానికి ప్రశాంతంగా  చర్యలు తీసుకుంటాడు. భారతదేశానికి చెందిన హిందూ నాయకుడిని చూడటం ప్రపంచానికి అలవాటు లేదు, అతను నెహ్రూ లాగా వేడుకోడు, విజ్ఞప్తి చేయడు లేదా మన్మోహన్ సింగ్ లాగా ముడుచుకున్న చేతులతో నిలబడడు. అతను ప్రతి గాయం లేదా ప్రతి గాయం యొక్క అనవాలును గుర్తుంచుకొని రక్షణాత్మకంగా మిగిలిపోకుండా తన భాషలో తిరిగి సమాధానం ఇస్తాడు. గతంలోని హిందువులు ఆయన లాగ ఆత్మవిశ్వాసంతో సంక్షోభం లేదా విపత్తుతో వ్యవహరించలేదు. మనం దీనిని గ్రహిస్తే, మన నిష్క్రియాత్మకత లక్షణం తరువాతి తరానికి చనిపోతుంది.


బ్రిటిష్ వారి గురించి ఒక పాత సామెత నాకు గుర్తుంది, "శాంతి కాలంలో వారిని నిర్వహించడం అసాధ్యం కాని సంక్షోభంలో వారు ఐక్యమై అన్ని తేడాలను విడిచిపెడతారు." కానీ భారతీయులైన మనం, ఒక సంక్షోభంలో ఒకరికొకరు శత్రువులుగా మారి, మనకు సహాయం చేయమని మన బాహ్య శత్రువును వేడుకుంటున్నారు. మనం ఒకరినొకరు నిందించుకుంటాము. భారతదేశంలోని ప్రతి శత్రువు అంటే అలెగ్జాండర్, మొహమ్మద్ ఘోరి నుండి బ్రిటిష్ వారి వరకు ఇది తెలుసు. ఇది మారితేనే, మనం మరలా బానిసలుగా మారము. మోడీ ప్రసంగాలు మనకు ఈ మార్పు తేగలవు అని నేను నమ్ముతున్నాను.


ఇది సరిదిద్దలేని మన జన్యువులలోని దోషమా లేదా మనలని జాతీయ స్థాయిలో  సరిదిద్దగల నాయకత్వం విఫలమా? వలసవాద సంప్రదాయంలో విద్యావంతులైన ప్రతి ఇతర ఉదారవాద మరియు మేధావులచే మోడీ పట్ల ఈ ద్వేషానికి ఒక కారణం ఆయన నాయకత్వం ఆ లోపాన్ని మనకు ఎత్తి చూపుతున్నాది అని నేను నమ్ముతున్నాను.


దేశానికి ఆయన ఇస్తున్న ఉపన్యాసాలు భవిష్యత్తులో ఎలా మదింపు చేయబడతాయి? సామాన్య ప్రజల గుండె లోతులను తట్టి లేపుతున్నాయి. దేశంలో మరే ఇతర భారత నాయకుడూ ప్రయత్నించని ప్రారంభం ఇదేనని నేను నమ్ముతున్నాను. ప్రస్తుత పరిస్థితులలో నేను నెహ్రూ, గాంధీని దృశ్యమానం చేస్తే దిశ లేకపోవడం, అసమర్థత మరియు నిస్సహాయతను అభ్యర్ధించడం తప్ప మరేమీ చూడలేను.


ప్రత్యర్థి శక్తులతో వ్యవహరించే మోడీ శైలి ఇతర నాయకుల మాదిరిగా కాకుండా వారి స్వంత వైరుధ్యాల బరువుతోనే వారిని విచ్ఛిన్నం చేయడం. అతని పద్ధతులు రక్షణాత్మకమైనవి కావు, శత్రువుపై దాడి చేస్తాయి. అందువల్ల అతనిని దూకుడు అని పిలుస్తారు. అతని ప్రతి విరోధికి ఇది తెలుసునని నేను నమ్ముతున్నాను అందుకే అతను అలాంటి వారికి ముప్పు.


చరిత్ర యొక్క గొప్ప నాయకులు వారి ప్రజలను వారి నిష్క్రియాత్మకతను వదిలించి, ఎదగాలని ప్రోత్సహిస్తారు. వారు ఉచితాలు వాగ్దానం చేయరు,  దేశం కోసం లేదా అంతకంటే గొప్ప కారణం కోసం ఎదగాలని, ప్రజలు త్యాగాలు చేయమని అడుగుతారు.


ఐసన్‌హోవర్, విన్‌స్టన్ చర్చిల్, బిస్మార్క్, కెన్నెడీ సంక్షోభ సమయంలో గొప్ప నాయకులు అయ్యారు. రెండవ ప్రపంచ యుద్ధంలో చర్చిల్ బ్రిటిష్ వారిని నడిపించాడు. దేశంలో వస్తువుల కొరత గురించి ఫిర్యాదు చేయవద్దని ఆయన ముందుగా కోరిన తరువాత మన విజయానికి ప్రజల అనేక త్యాగాలకు సిద్ధపడమని చెప్పాడు. వారి ప్రసంగాలు ప్రజలకు వాగ్దానాలు చేయలేదు, ప్రజాలనుండి పోరాటం, ధైర్యం  కోరాయి.  మోడీ కూడా ఇప్పుడు అదే చేస్తున్నారు. బహుశా అందుకే, మోడిని తొలగించాలనే కోరిక అతని విరోధులచే అన్ని నిబంధనలను దాటివేయిస్తున్నాది. మోడీ విరోధులు భారతదేశ వలస చరిత్రను మరచిపోయి పాకిస్తాన్, చైనా మరియు అమెరికా నుండి సహాయం కోసం కూడా అడుగుతున్నారు.


చరిత్రలో నరేంద్ర మోడీ ఎలా గుర్తుకు వస్తారు? ఆయనకు ముందు భారతదేశంలో ఏ నాయకుడూ  ప్రయత్నించని అదే తన ప్రజలను నిద్రలో నుండి మేల్కొల్పిన నాయకుడిగా,  వ్యక్తిగా ఆయన జ్ఞాపకం అవుతారా? దేశంలో ఆయన మార్పులను తీసుకురావడానికి ప్రయత్నించిన ప్రతిసారీ అతను ఎదుర్కొంటున్న ఎగతాళి, వ్యంగ్యం చరిత్ర ద్వారా ఎలా కనిపిస్తుంది? అతను  వెయ్యి సంవత్సరాల బానిసత్వ ఆలోచనలుతో ఉన్న గొలుసుల నుండి ప్రజలకు విముక్తి కల్పించడానికి ప్రయత్నించిన ప్రతీసారీ హేళనకు గురి అవుతునే ఉన్నాడు.


ఇది రజిత్ మిత్ర, సైకాలాజిస్టు మరియు

'ఇన్ఫీడెల్ నెక్స్ట్ డోర్' పుస్తక రచయిత

రాసిన ఒక పెద్ద ఆర్టికల్ కి సంక్షిప్త స్వేచ్చానువాదం.


...చాడా శాస్త్రి...


కామెంట్‌లు లేవు: