29, జూన్ 2021, మంగళవారం

బహుముఖ ప్రజ్ఙాశాలి*

 *బహుముఖ ప్రజ్ఙాశాలి*


*పాములపర్తి వెంకట నరసింహారావు*



||సీసమాలిక||

భారతదేశపు భవితను చాటిన

బహు భాషలందు న పండితుండు


బహుముఖ ప్రజ్ఞతో పలుసేవలందించి

మార్గదర్శిగ మేను మరచినాడు


మన తెలంగాణ లో మహనీయ చరితుడై

మన్నన పొందిన మహిత మూర్తి


ప్రతిభతో మనదేశ ప్రజలను పాలించు

భవ్య ప్రధానియౌ పాలకుండు


అపర చాణక్యుడు అభివృద్ధికాద్యుడు

పాములపర్తింట ప్రాజ్ఞుడతడు


ప్రావీణ్యుడైనట్టి భవ్య దక్షిణనేత

భారత రత్న కు ప్రభుతగలదు


పాములపర్తి సద్వంశ నీరధి లోన

పూర్ణ చంద్రుడు సదా పూజ్యుడితడు


||తే.గీ.||

లక్నెపల్లి లో రుక్మిణీ రాజ్ఞి సుతుడు

రంగరంగవైభోగ విరాజితుండు

జగతిలో ఖ్యాతి గాంచు రాజన్యుడితడు

పీవి నర్సింహరాయుని ఠీవి యిదియె.


భారతరత్నకు అర్హుడు 

సారస్వత మూర్తి యతడె చతురతజూపెన్

ధీరత గల్గినవాడై 

మారగజేసెనుభవితను మాన్యుడుతానై!!


||కం||

బహుభాషా కోవిదునకు

బహుమానమునివ్వ వలయు బాధ్యత తోడన్

బహుముఖ ప్రజ్ఞాశాలి కి

బహుమతి సరియైనదగును భారతరత్నే.


*గోగులపాటి కృష్ణమోహన్*

కవి, రచయిత, జర్నలిస్టు


వ్యవస్థాపక అధ్యక్షుడు, 

తెలుగు కవన వేదిక, 


మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రచయితల సంఘం


9700007653

కామెంట్‌లు లేవు: