29, జూన్ 2021, మంగళవారం

పంచముఖాంజనేయుడు

 #పంచముఖాంజనేయుడు 


మైరావణుని రాజ్యంలో ప్రవేశించిన ఆంజనేయుడు అతనితో యుద్ధాన్ని ఆరంభిస్తాడు. కానీ ఒక ఉపాయాన్ని సాధిస్తే తప్ప మైరావణునికి చావు సాధ్యం కాదని తెలుసుకుంటాడు. మైరావణుని పురంలో ఐదు దిక్కులా వెలిగించి ఉన్న దీపాలను ఒక్కసారిగా ఆర్పితే కానీ అతనికి చావు మూడదని తెలుస్తుంది. అందుకోసం తూర్పు , పశ్చిమము , ఉత్తరము , దక్షిణము , ఊర్ధ్వముఖం. ఇలా అయిదు దిక్కులా అయిదు ముఖాలను ధరించి , అయిదు దీపాలను ఒక్కసారిగా ఛేదిస్తాడు. పంచముఖాలతో పాటుగా ఏర్పడిన పది చేతులలో ఖడ్గం , శూలం , గద వంటి వివిధ ఆయుధాలను ధరించి మైరావణుని అంతం చేస్తాడు. అతనే #పంచముఖాంజనేయుడు. 


పంచముఖాల ప్రాశస్త్యం : అయిదు అనే సంఖ్య పంచభూతాలకు సంకేతం. అయిదు కర్మేంద్రియాలతో మనిషి ప్రపంచంలో మనుగడను సాధిస్తూ , అయిదు జ్ఞానేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటున్నాడు.అలాంటి అయిదు సంఖ్య గురించి చెప్పేదేముంది. స్వామివారి పంచముఖాలలో ఒక్కో మోముదీ ఒక్కో రూపం.

#తూర్పున_ఆంజనేయుని రూపం , 

#దక్షిణాన_నారసింహుని అవతారం , 

#పశ్చిమాన_గరుడ_ప్రకాశం , 

#ఉత్తరాన_వరాహావతారం , 

#ఊర్ధ్వముఖాన_హయగ్రీవుని అంశ. 

అలాగే ఆ అయిదు ముఖాలు తన భక్తులను అయిదు రకాల అభయాన్ని అందిస్తూ ఉంటాయి. #నారసింహ_ముఖం_విజయాన్ని , 

#గరుడ_రూపం_దీర్ఘాయుష్షునీ ,

#వరాహము_అష్ట_ఐశ్వర్యాలనీ , 

#హయగ్రీవుడు_జ్ఞానాన్నీ , 

#ఆంజనేయ_రూపం_అభీష్టసిద్ధినీ కలుగచేస్తాయి.

ఇంతటి శక్తిమంతమైన అవతారం కాబట్టే రాఘవేంద్ర స్వామి సైతం ఆంజనేయుని పంచముఖ రూపంలోనే దర్శించారు.

కామెంట్‌లు లేవు: