26, జనవరి 2021, మంగళవారం

మన మహర్షులు- 5

 మన మహర్షులు- 5


 *అష్టావక్ర మహర్షి* 


🍁🍁🍁🍁

 

గొప్ప ఋషులలో ఒకరే ఈ అష్టావక్రుడు. 


తల్లి కడుపులో ఉండగానే ఎన్నో శాస్త్రాలను అలవోకగా నేర్చేసుకున్న మహా జ్ఞాని.  


జనక మహారాజుకు, యాజ్ఞవల్కుడికి ఈయన గురువు.


 అష్టావక్రుడు కడుపులో ఉండగానే అష్ట వంకరలతో పుడతావనే శాపాన్ని పొందాడు. ఆ శాపాన్ని ఇచ్చింది కూడా ఎవరో కాదు అతని తండ్రి ఏకపాదుడే. 


అలాంటి మహర్షికి   స్వయానా శ్రీకృష్ణుడే అంత్యక్రియలు చేసాడంటే అతని జన్మ ఎంత గొప్పదో మనకి తెలుస్తోంది కదా.


వివరాల్లోకి వెళితే ఒకప్పుడు ఏకపాదుడనే గొప్ప తపస్వి ఒకరు ఉండేవారు. ఆయన భార్య పేరు సుజాత. ఆతను వేదవేదాంగాలు తెలిసినవాడు కావటంవల్ల ఎంతోమంది శిష్యులు అతని దగ్గర వేదాలు నేర్చుకుంటూ ఉండేవారు.


 కొన్నాళ్ళకు గర్భవతి అయింది సుజాత.  కడుపులో ఉన్న బాబు  తండ్రి తన శిష్యులకు చెప్పే శాస్త్రాలను వింటూ ఉండేవాడు. 


ఒకరోజు తండ్రి చెప్పే అభ్యాసంలో తప్పు దొర్లటంతో ఆగలేక, నాన్నగారు మీరు తప్పు చెప్తున్నారు, ఇలా చెప్పాలి అని ఎలా చెప్పాలో కూడా వివరిస్తాడు.  దానితో ఆగ్రహించిన తండ్రి ఇప్పుడే ఇలా ఉంటే పుట్టాకా ఇంకా ఎన్ని తప్పులు ఎంచుతావో అని కోపగించి నువ్వు అష్ట వంకరలతో పుట్టుగాక అని శపిస్తాడు.


ఒకసారి  ఏకపాదుడు ధనం కోసం జనకుడి దగ్గరకి వెళ్ళే సమయానికి అక్కడ వరుణుని కొడుకైన వంది ఉంటాడు. వంది నాతో  వాదించి గెలిస్తే నీకు ఏది కావాలన్నా ఇస్తాను. ఓడిపోతే మాత్రం జలదిగ్బంధం చేస్తాను అని  అంటాడు.


 ఏకపాదుడు వందితో వాదించి ఓడిపోయి బందీ అయిపోతాడు.


తన తండ్రి గురించి తెలుసుకున్నఅష్టావక్రుడు జనకుని కొలువుకి వెళ్లి వందిని ఓడించి తన తండ్రిని విడిపించుకుని వస్తాడు.


 ఆ ఆనందంలో తండ్రి అతనిని అందంగా మారేలా వరమిస్తాడు.


 అలా అందంగా మారిన అష్టావక్రుడు సదాన్య మహర్షి కూతురు సుప్రభను వివాహం చేసుకుంటాడు.


అష్టావక్రునికి సంతానం కలిగాక తపస్సు చేసుకోవటానికి అడవులకు వెళ్ళిపోతాడు.


 అతని దగ్గరకి రంభ మొదలైన అప్సరసలు వచ్చి నాట్యం చేస్తారు. వారి నాట్యం చూసిన అష్టావక్రుడు ఏమి వరం కావాలో కోరుకోమంటాడు. అందుకు వాళ్ళు విష్ణుమూర్తిని పొందాలన్న తమ కోరిక తీరేలా చూడమని అడుగుతారు. అందుకు అష్టావక్రుడు ద్వాపర యుగంలో విష్ణుమూర్తి కృష్ణావతారం ఎత్తినపుడు మీ కోరిక తీరుతుంది అని వరమిస్తాడు. ఆ అప్సరసలే ద్వాపరయుగంలో పుట్టిన గోపికలు.


అంతేకాదు గంగను భూలోకానికి తేవాలనుకున్న భగీరథుడు చాలా బలహీనంగా ఉండేవాడు. అతనిని బలంగా ఉండేలా చేసి గంగను భూలోకానికి తేవటంలో సహాయం చేసింది కూడా ఈ అష్టావక్ర మహర్షే. 


ఆయన జనకమహారాజుతో చేసిన వేదాంత చర్చయే “అష్టావక్రసంహిత”. ఈ పుస్తకం ఇరవై అధ్యాయములతో అనేక విషయాలు కలది. శాంతి, ఆత్మజ్ఞానం, జీవన్ముక్తులపై ఎన్నో వివరములుగల పుస్తకం. ప్రతి ఒక్కరూ చదవదగినది.



 తరువాత అష్టావక్రుడు మనస్సును పరమాత్మయందు లయం చేసి, శ్రీకృష్ణుని దర్శించి ఆయన పాదముల వద్ద దేహత్యాగం చేశారు.


అతనికి సాక్షాత్తు శ్రీకృష్ణుడే అంత్యక్రియలు చేసాడు. 


ఇలా జన్మను విడిచిన అష్టావక్రుడు వైకుంఠానికి వెళ్లి మోక్షాన్ని పొందుతాడు.


🍁🍁🍁🍁

తెలుగు సంవత్సరాలు .


------------   తెలుగు సంవత్సరాలు .

-------------------------------------------------------------

1927, 1987, 2047, 2107 : ప్రభవ

1928, 1988, 2048, 2108 : విభవ

1929, 1989, 2049, 2109 : శుక్ల

1930, 1990, 2050, 2110 : ప్రమోదూత

1931, 1991, 2051, 2111 : ప్రజోత్పత్తి

1932, 1992, 2052, 2112 : అంగీరస

1933, 1993, 2053, 2113 : శ్రీముఖ

1934, 1994, 2054, 2114 : భావ

1935, 1995, 2055, 2115 : యువ

1936, 1996, 2056, 2116 : ధాత

1937, 1997, 2057, 2117 : ఈశ్వర

1938, 1998, 2058, 2118 : బహుధాన్య

1939, 1999, 2059, 2119 : ప్రమాది

1940, 2000, 2060, 2120 : విక్రమ

1941, 2001, 2061, 2121 : వృష

1942, 2002, 2062, 2122 : చిత్రభాను

1943, 2003, 2063, 2123 : స్వభాను

1944, 2004, 2064, 2124 : తారణ

1945, 2005, 2065, 2125 : పార్థివ

1946, 2006, 2066, 216 :  వ్యయ

1947, 2007, 2067, 2127 : సర్వజిత్

1948, 2008, 2068, 2128 : సర్వదారి

1949, 2009, 2069, 2129 : విరోది

1950, 2010, 2070, 2130 : వికృతి

1951, 2011, 2071, 2131 : ఖర

1952, 2012, 2072, 2132 : నందన

1953, 2013, 2073, 2133 : విజయ

1954, 2014, 2074, 2134 : జయ

1955, 2015, 2075, 2135 : మన్మద

1956, 2016, 2076, 2136 : దుర్ముఖి

1957, 2017, 2077, 2137 : హేవిళంబి

1958, 2018, 2078, 2138 : విళంబి

1959, 2019, 2079, 2139 : వికారి

1960, 2020, 2080, 2140 : శార్వరి

1961, 2021, 2081, 2141 : ప్లవ

1962, 2022, 2082, 2142 : శుభకృత్

1963, 2023, 2083, 2143 : శోభకృత్

1964, 2024, 2084, 2144 : క్రోది

1965, 2025, 2085, 2145 : విశ్వావసు

1966, 2026, 2086, 2146 : పరాభవ

1967, 2027, 2087, 2147 : ప్లవంగ

1968, 2028, 2088, 2148 : కీలక

1969, 2029, 2089, 2149 : సౌమ్య

1970, 2030, 2090, 2150 : సాధారణ

1971, 2031, 2091, 2151 : విరోదికృత్

1972, 2032, 2092, 2152 : పరీదావి

1973, 2033, 2093, 2153 : ప్రమాది

1974, 2034, 2094, 2154 : ఆనంద

1975, 2035, 2095, 2155 : రాక్షస

1976, 2036, 2096, 2156 : నల

1977, 2037, 2097, 2157 : పింగళ

1978, 2038, 2098, 2158 : కాళయుక్తి

1979, 2039, 2099, 2159 : సిద్దార్థి

1980, 2040, 2100, 2160 : రౌద్రి

1981, 2041, 2101, 2161 : దుర్మతి

1982, 2042, 2102, 2162 : దుందుభి

1983, 2043, 2103, 2163 : రుదిరోద్గారి

1984, 2044, 2104, 2164 : రక్తాక్షి

1985, 2045, 2105, 2165 : క్రోదన

1986, 2046, 2106, 2166 : అక్షయ

----------------------------------------------------------

మీ బంధుమిత్రులకు కూడా పంపండి.


🙏  🙏

మన మహర్షులు - 4*

 *మన మహర్షులు - 4* 


 *అరుణి మహర్షి* 


🍁🍁🍁🍁


పూర్వకాలమున అరుణుడను పేరు గల ముని ఉండెడి వాడు.ఆయనకు అరుణి యను పేరు గల కుమారుడు గలడు.అరుణి చిన్నతనమునుండి తపస్సాధనలో ఉండేవాడు.ఈతడు సర్వ గుణ శోభితుడు, మౌనవ్రతుడు.

బ్రహ్మతేజస్వి .

దేవికా నదీతీరాన ఆశ్రమము నిర్మించుకొని తపస్సు చేస్తూ ఉండేవాడు.


అరుణి మహర్షి భారతీయ చింతనకు ఒక రూపునిచ్చిన తత్వవేత్తలలో ప్రముఖుడు.


వేదాంతాలకు చిహ్నాలు అనదగిన మన ఉపనిషత్తులలో ఈ అరుణి మహర్షి ప్రస్తావన ప్రముఖంగా కనిపిస్తుంది. 


బృహదారణ్యక, ఛాందోగ్య ఉపనిషత్తులలో అరుణి బోధలు ప్రముఖంగా కనిపిస్తాయి. 


అంతేకాదు. భారతీయ చింతనకు సంబంధించి ముఖ్యంగా పేర్కొనే 'తత్వమసి' (అది నువ్వే) అనే వాక్యం అరుణి మహర్షి చెప్పినదే! 


అరుణి మహర్షికి ఉద్దాలకుడు అన్న పేరు కూడా ఉంది. 


ఈ పేరు వెనుక ఒక ఆసక్తికరమైన కథనమూ ఉంది.


 అరుణి తన చిన్నతనంలో దౌమ్యుడు అనే రుషి వద్ద విద్యను అభ్యసిస్తూ ఉండేవాడు. ఆ గురువు గారు ఒకనాడు ఏదో పని మీద వెళ్తూ ఆశ్రమానికి చెందిన పొలాలను జాగ్రత్తగా గమనించుకోమని అరుణికి చెప్పి బయల్దేరాడు.


 దౌమ్యుడు అలా వెళ్లాడో లేదో, ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకుని వచ్చాయి. చూస్తూచూస్తుండగానే వర్షం చినుకులుగా మొదలై ఉధృతంగా కురవసాగింది. దౌమ్యుని పంటపొలాలకు అనుకుని ఉన్న నీటి ప్రవాహానికి గండి పడనే పడింది. నీరు నిదానంగా పొలాలలోకి చేరసాగింది. ఆ పరిస్థితిని చూసిన ఆరుణికి ఏం చేయాలో పాలుపోలేదు. గండికి ఎంతగా మట్టి కప్పినా అది నిలవడం లేదు. ఇక ఎలాగైనా గురువుగారి పొలాలను, ఆయన మాటను కాపాడాలనే తపనతో... తానే ప్రవాహానికి అడ్డుగా పడుకొన్నాడు అరుణి.


 ఆ రోజు చీకటిపడే సమయానికి ఆశ్రమానికి చేరుకున్న గురువుగారికి అరుణి కనిపించలేదు. వెంటనే తన విద్యార్థులు కొందరిని వెంటబెట్టుకుని అడవిలోకి బయల్దేరారు గురువుగారు. అక్కడ తన పొలాలను చేరుకున్న దౌమ్యునికి, 

అంత వర్షంలో కూడా అవి నిండిపోకుండా ఉండటం చూసి ఆశ్చర్యం వేసింది. 


కారణం ఏమై ఉంటుందా అని నలుదిక్కులా పరిశీలిస్తున్న ఆయనకు సన్నగా ఒక మూలుగు వినిపించసాగింది. ఆ శబ్దం దిశగా చూస్తే ఏముంది! నీటి ప్రవాహానికి అడ్డుగా పడుకుని ఉన్న అరుణి కనిపించాడు. 


అరుణి చేసిన త్యాగానికి దౌమ్యుని నోట మాట రాలేదు. నీటి ప్రవాహాన్ని నియంత్రించినవాడు కాబట్టి, అరుణి ఇకమీదట ఉద్దాలకుడు అన్న పేరుతో పిలువబడతాడని ఆయన ఆశీర్వదించారు. అంతేకాదు! నీటి మీద చూపించిన సాధికారతే జ్ఞానం మీద కూడా చూపగలడని వరాన్ని అందించారు. 


 గురువుగారిచ్చిన మాట వృధా పోలేదు. తన స్వదేశమైన పాంచాలరాజ్యంలోనే కాకుండా మాద్ర, తక్షశిల వంటి రాజ్యాలన్నీ తిరుగుతూ... అక్కడ పేరుమోసిన గురువులందరి వద్దా విద్యను అభ్యసించాడు అరుణి.


 గురువుల దగ్గర్నుంచీ పొందిన జ్ఞానాన్ని మనకు ఉపనిషత్తుల రూపంలో అందించారు.


ఒకనాడు అరుణి దేవికానదిలో స్నానం చేయుటకు బయలుదేరిపోతూ ఉండగా భయంకరాకారంలో ఒక క్రూరుడు ఎదురుగా రాసాగాడు.మహర్షి శ్రీహరినామం జపిస్తూ నడుస్తూన్నాడు.అంత ఆ క్రూరుడు ఆ మహర్షి దివ్వతేజస్సును చూపి మంత్రముగ్ధుడై సాష్ఠాంగపడ్డాడు.అతడొక దొంగల నాయకుడు. అనేక క్రూరకృత్యాలు చేసాడు.

మహర్షిని చూడగానే అతని మనస్సు మారనది. వద్దన్ననూ మహర్షి వెంటబడ్డాడు.అతనికి సేవచేయసాగాడు.సంవత్సరముల తరబడిసేవచేస్తూనే ఉన్నాడు. మహర్షికి ఏ ఆపదా రాకుండ కాపాడుచున్నాడు. 


ఒకనాడొక బెబ్బులి మహర్షి పైకి రాబోగా ఆ దొంగల నాయకుడు బాణంతో దానిని సంహరించాడు. అది అరుస్తూ అరుణి సమీపాన పడి మరణించింది. ఆ అరుపునకు అదిరిపడి నమో నారాయణాయ 

అని బిగ్గరాగా అన్నాడు. మరణించి పడివున్న బెబ్బులి శరీరం నుండి ఒక దివ్వ పురుషుడు బయటకు వచ్చాడు.అతడు మహర్షికి నమస్కరించి మహాత్మా నేనొక వీరుడను. విప్రులను బాధించుటచే వారు నన్ను పులివికమ్మని శపించారు. శాపవిమోచనం ప్రసాదించమని కోరగా వారు నారాయణ మంత్రం నా చెవిని శోకిన మరు క్షణం ఈ పులి రూపం పోయి మనుష్యు రూపం వస్తుందని పలికారు. మీరు పలికిన నారాయణ మంత్రం నేను విన్నాను. శాపవిమోచనం కలిగింది.అని చెప్పాడు.


 మహర్షి ఆనందించాడు..  తనను సేవించే దొంగలరాజుని పిలిచి నాయనా, నీ సాహసానికి ఎంతో సంతోషంగా ఉంది. నీకు ఏం కావాలో కోరుకో అని పలుకగా .


 దొంగలనాయకుడు మహర్షి మోక్షమార్గ ముపదేశించు అనగా అరుణి..నీవు  నేటి నుండి మాంసము తినడం మాని, సత్య వ్రతుడివై నారాయణ స్మరణ చేయుచూ జీవించు అదే నీకు మార్గం ప్రసాదిస్తూంది. సాధన చేయి అని మహర్షి మౌనం వహించాడు.


 ముని అదేశానుశారం హరిస్మరణ చేస్తూ తపస్సు ప్రారంభించాడు. చివరికి హరి సాయుజ్యం పొందాడు. 


 మహర్షుల కృపకు పాత్రులైనవారు దేనినైనా సాధించగలరు గదా.


 అతనికి శ్వేతకేతు అనే కుమారుడు కలిగాడు.. శ్వేతకేతు బ్రహ్మచర్య దీక్షతో విద్యాధ్యయనం సాగించాడు.


కానీ  తను నేర్చినదే సమస్తమని గర్వించసాగాడు.

బ్రాహ్మణుడు

 కొన ఊపిరితో చావు బతుకుల్లో ఉన్న మన సనాతన హిందూ ధర్మానికి ఊపిరి పోసి బతికించిన మహానుభావుడు జగద్గురు ఆది శంకరాచార్యుల వారు ...బ్రాహ్మణుడు.


ఆజాద్ హిందూ ఫౌజ్ ను స్థాపించి బ్రిటీష్ వారిని గడగడలాడించి తెల్ల కుక్కలకు పగలే చుక్కలు చూపిన ధీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ....బ్రాహ్మణుడు.


హిందూ పద బాదషాహీ , హిందూ సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీని నడిపించి ఆది శంకరుల తర్వాత మళ్ళీ హిందూ ధర్మానికి జవసత్వాలు తీసుకువచ్చిన ధర్మప్రభువు సమర్థ రామదాసు ...బ్రాహ్మణుడు.


హిందూ ధర్మాన్ని , మన సనాతన గురుశిష్య పరంపరను , మన జ్ఞాన కేంద్రాలైన గురుకులాలను విధర్మీయులు కుట్రపన్ని క్రమేపి నాశనం చేయప్రయత్నిస్తూన్న తరుణంలో , అతి సామాన్యుడైన చంద్రగుప్తుడిని తన రాజనీతితో రాజుగా చేసి,హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించి పునఃధర్మ స్థాపన చేసిన మేధోధీరుడు చాణక్యుడు...బ్రాహ్మణుడు.


పసికందును వెనక కట్టుకుని అరివీర భయంకర రణరంగంలో బ్రిటీషులను గడగడలాడించి,భారత మాతను బానిస సంకెళ్ళ నుండి విడిపించుటకు సింహగర్జన చేసిన ఆడ సింహం రాణి ఝాన్సీ లక్ష్మీబాయి....బ్రాహ్మణురాలు.


ఐక్యతారాగాన్ని ఆలాపించి,చెల్లా చెదరుగా విడిన హిందూ సమాజాన్ని ఏకం చేసి భారత స్వాతంత్ర సమరనాదాన్ని పూరించి , వాడవాడలా వినాయకుడిని స్థాపించి..తద్వారా భారత స్వాతంత్ర్యానికి పూనాదులు వేసి,మన సనాతన ధర్మ రక్షణకు ప్రాణాలు త్యాగం చేసిన భారత మాతా భక్తుడు బాల గంగాధర తిలక్ ...బ్రాహ్మణుడు.


నలంద , తక్షశిల లాంటి మన భారత దేశ జ్ఞాన కేంద్రాలను ఆక్రమణదారులు మట్టుబెట్టి భస్మీకృతం చేస్తే...అలాంటి జ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేసి , భారత మాతకు పూర్వ జ్ఞాన వైభవమును తేవాలని , జోలేపట్టి ఆఖరికి శవాలపై వేసిన డబ్బును ఏరుకోవడానికి వెనకాడక , భిక్షాటన చేసి బనారస్ హిందూ విశ్వవిద్యాలయము ( BHU ) ను స్థాపించి దేశములో విద్యావెలుగులను నింపిన అసమాన కీర్తిమంతుడు మదన మోహన మాలవీయ ...బ్రాహ్మణుడు.


కశ్మీరును స్వతంత్రం చేయాలని , భారతమాత శిరస్సు ఖండించబడకూడదని ఆరాటపడి పోరాటం చేసిన త్యాగధనుడు, జనసంఘ్ ను స్థాపించి భారత భవిష్యత్తుకు పునాదివేసి , ప్రాణాలు అర్పించిన డా॥ శ్యామా ప్రసాద్ ముఖర్జీ....బ్రాహ్మణుడు.


ఈ రోజు నేను హిందువుని అని ధైర్యంగా చెప్పుకునే స్వేచ్ఛా భిక్షను అనుగ్రహించిన,రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ( RSS ) ను స్థాపించిన డా॥ హెడ్గేవార్ ...బ్రాహ్మణుడు.


నేడు నరేంద్ర మోడీని చూసి యావత్ ప్రపంచం గర్విస్తూన్నది.ఆ నరేంద్ర మోదీ గారిని తీర్చిదిద్దిన భారతీయ జనతా పార్టీకి పురుడుపోసిన దీనదయాల్ ఉపాధ్యాయ...బ్రాహ్మణుడు.


 అపర మేధావి , కవి , రచయిత...భారత యశస్వీ ప్రధానిగా కీర్తి గడించిన మన భారత రత్న అటల్ బిహారీ వాజపేయ్ ...బ్రాహ్మణుడు.


ప్రపంచ క్రికెట్ లో భారత దేశానికి అగ్ర స్థానాన్ని కల్పించి క్రికెట్ దేవుడిగా కీర్తింపబడే భారత రత్న సచిన్ టెండూల్కర్ ...బ్రాహ్మణుడు.


ఇలా చెబుతూ పోతే సంవత్సరాలు గడిచినా విషయం పూర్తవ్వదు.ఇది భారత జాతి కొరకు , భారత దేశం కొరకు , సనాతన హిందూ ధర్మం కొరకు తమ సర్వస్వాన్ని ధారపోసి , సంపూర్ణ జీవితాలను త్యాగం చేసిన త్యాగధనులైన బ్రాహ్మణుల చరిత్ర....ఎంత చెప్పినా తరగదు.


భారత మాత కొరకు కేవలం బ్రాహ్మణులే త్యాగం చేశారు...మిగితా వారు చేయలేదు...మిగితా వారు పాటుపడలేదు అనేది మా ఉద్దేశ్యం కాదు.దేశ నిర్మాణంలో అందరి పాత్ర ఉందీ...అన్నీ వర్గాల సమిష్టి పోరాటమే భారత రూపం.అందులో బ్రాహ్మణులు కూడా ఉన్నారనేది సమాజం గుర్తించాలి.


ఇంతటి త్యాగాలను చేసి దేశ వైభవాన్ని నిలిపిన , నిలుపుతూన్న బ్రాహ్మణుల గురించి చలన చిత్రాలలో వ్యంగ్యంగా చిత్రీకరించడం శోచనీయం...దానిని మిగితా హిందూ  సమాజం ఖండించకపోవడం దౌర్భాగ్యం.


సినిమాలలో బ్రాహ్మణులపై వెధవ జోకులేయడం

బ్రాహ్మణులను కాలితో తన్నడం

బ్రాహ్మణులను రౌడీలకు సలహాదారుగా చూయించడం...ఇలా ఒకటా రెండా....ఏ చిన్న అవకాశాన్ని చిత్ర పరిశ్రమ వదలదు..బ్రాహ్మణులను కించపరుస్తూనే ఉంటుంది.


ఇకనైనా ఇటువంటి వెకిలి చేష్టలు మానాలి.

బ్రాహ్మణులు దేశ నిర్మాణంలో చేసిన సేవలను గుర్తించాలి.

వారికి తగిన గౌరవాన్ని కల్పించాలి.


బ్రాహ్మణత్వం నాశనమైన రోజు హిందూ ధర్మం నిలవదు.హిందూ ధర్మం నాశనమైన రోజు దేశం మిగలదు.


ఈ దేశ పునాది బ్రాహ్మణత్వంలో ఉంది అనేది యావత్ సమాజం విస్మరించకూడదు.


॥ శ్రీమాత్రే నమః ॥

మన మహర్షులు - 3

 మన మహర్షులు - 3


 అరణ్యక మహర్షి


అరణ్యక మహర్షి పుట్టింది అడవిలోనే, పెరిగింది అడవిలోనే, తపస్సు చేసిందీ అడవిలోనే. ఆయనకి అడవి తప్ప వేరే ప్రదేశాలు ఏమీ తెలియవు. అందుకనే ఆయనకి అరణ్యక మహర్షి అని పేరు వచ్చింది.


ఈ మహర్షి ఆశ్రమం రేవానదీ ఒడ్డున ఉండేది. చాలా ప్రశాంతంగా ఉండేది. 


పెద్ద పెద్ద జంతువులు కూడ అక్కడ కలిసి మెలిసి ఉండేవి. ఆయన ఎప్పుడూ రామనామం చేస్తూ ఉండేవాడు


ఆయన రామనామ జపం ఎప్పుడూ చెయ్యడం వల్ల ఆశ్రమంలో ఎప్పుడూ రామనామం వినపడుతూ ఉండేది. 


పండిపోయిన ఆకులు రాలి పడుతున్నప్పుడు, ఎండిపోయిన పుల్లలు విరిగి కిందపడుతున్నప్పుడు, చీమలు పాకుతున్నప్పుడు, గాలి వేసినప్పుడు, చెట్లు ఊగుతున్నప్పుడు

ఏం జరుగుతున్నా రామనామమే వినిపించేది.


అంటే అరణ్యక మహర్షికి రామ మంత్రం, రామ ధ్యానం, రామ స్మరణం, రామ పూజనం, రామ చింతనం, రామ మననం, మొత్తం రామ మయంగా ఉండేవాడు.


ఒకసారి శత్రుఘ్నుడు ఆయన ఆశ్రమానికి వచ్చి నమస్కరించి, ఆయన రామ భక్తి చూసి స్వామీ ! నేను ఎప్పుడు రాముడితోనే ఉంటాను, అయినా నాకంటే మీకే ఎక్కువ రామ భక్తి ఎలా వచ్చింది? అని అడిగాడు..


అరణ్యక మహర్షి శత్రుఘ్నుడికి ఏం చెప్పాడో చదవండి మరి...


 'నేను ఎప్పుడు ఈ అడవి వదిలి ఎక్కడికీ వెళ్లలేదు. అయినా నాకు చిన్నప్పటి నుంచి జ్ఞానం సంపాదించాలని కోరిక ఉంది. కాని నాకు గురువు లేడు కదా... ఇలా అనుకుంటూ ఉండగా లోమశ మహర్షి వచ్చి నీకు గొప్ప మంత్రం, సంసార సాగరం నుంచి బయట పడే సేది చెప్తాను అని మంత్రం ఉపదేశించాడు


అదే.. 'రామనామం'. 'రామ' అనే రెండు అక్షరాల్ని ఎప్పుడూ మనస్సులో జపిస్తూ వుంటే వేరే వ్రతాలు, పూజలు, యాగాలు, దానాలు, మౌనవ్రతాలు ఇలాంటివి ఏమీ అక్కర్లేదు. అందుకని రామ' నామం జపించుకో ,'అని చెప్పాడు


తర్వాత అరణ్యక మహర్షి లోమశ మహర్షిని అడిగి రామకథ అంతా తెలుసుకుని ఆయన రూపురేఖలు ఎలా ఉంటాయో తెలుసుకుని రామ నామం చేసుకుంటున్నాడు.


ఇదంతా విన్నాక శత్రుఘ్నుడు అరణ్యక మహర్షికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన్ని అయోధ్యకి పంపించాడు.


 ఆ సమయంలో శ్రీరాముడు అశ్వమేధయాగం చేస్తున్నాడు.


 అరణ్యక మహర్షి సరయూనది ఒడ్డున యజ్ఞదీక్షలో ఉన్న రాముడ్ని చూసి

ఆనందంతో కళ్లనుంచి జలజల నీళ్ళు రాలుతుంటే భక్తితో ఆయన తన దేహాన్నే

మరిచిపోయాడు


శ్రీరాముడు అరణ్యక మహర్షిని చూసి ఎదురు వెళ్ళి మహర్షిని కౌగిలించుకుని, చేతులు పట్టుకుని తీసుకువచ్చి కూర్చోపెట్టాడు.


అరణ్యక మహర్షి శ్రీరాముడి పాదాలమీద పడి నమస్కారం చేసి స్వామీ! ఈ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నా తపస్సు పండింది. నా జన్మధన్యమైంది. నాకు మోక్షం ప్రసాదించు అన్నాడు.


వెంటనే ఆయన శరీరం లో నుండి ఒక తేజస్సు శ్రీరాముడిలో కలిసిపోయింది..


 చూశారా ! అరణ్యక మహర్షి 'రామ' అనే నామంతోనే భగవంతుడిలో ఎలా

కలిసిపోయాడో! 


రామనామం అంత గొప్పదన్నమాట. 


ఇదండీ.... పరమ రామభక్తుడైన అరణ్యక మహర్షి కథ!


అల్పపుణ్యప్రదంబు లైనట్టియాగ

ములును యోగంబులును వ్రతంబులును సరియె ?

తెగని సంసారబంధంబు త్రెంచివైచి

క్షేమ మొనగూర్చు శ్రీరామనామమునకు."

జై శ్రీరామ్..🙏🙏


🍁🍁🍁🍁

జ్ఞానోన్మత్తులం

 శ్లోకం:- డా౹౹ సూరం శ్రీనివాసులు


వయం జ్ఞానోన్మత్తాః పరికృతపురాణాదికథనాః

జడే జీవేఽసక్తా ఇవ సతతనాట్యా ధనధియః౹

అహం బ్రహ్మాస్మీతి ప్రకటనరతాః స్థేమవచనైః

కుతో వా ధాతస్త్వం భవసి విఫలస్సర్జనగతౌ౹౹


తాత్పర్యం : సూరం చంద్రశేఖరం 


మేము జ్ఞానోన్మత్తులం.పురాణ కథలను మా

పరివారంగా చేసుకున్నవారం. ఈ జడంమీదా

,జీవంమీద ఆసక్తి లేనట్లు నటిస్తుంటాం. మనసేమో 

ధనం మీద.అహం బ్రహ్మాస్మి అని గట్టిగా ప్రకటిస్తుంటాం.

విధాతా ! సృష్టిగతిని ఇలా కొనసాగిస్తూ నువ్వెందుకు 

విఫలుడవవుతున్నావు?

స్త్రీలు రుద్రాక్షలు

 *🍃స్త్రీలు రుద్రాక్షలు ధరించవచ్చునా ?🍃*




అయాచితంగా ,సులభంగా,ఎక్కువ శ్రమపడకుండా లభించే అమూల్య వస్తువులను అలక్ష్యం చేసే గుణం మానవులకి ఎక్కువే.


ఆలయ ఉత్సవాల సమయంలో, ఆధ్యాత్మిక కార్యక్రమాల సమయంలో

దైవీకశక్తి గల రుద్రాక్షలను 

పూజాగదిలో పెట్టి  పూజించి 

కంఠంలో ధరించడం వలన

అద్భుత శక్తులు పొంద వచ్చును. రుద్రాక్షలలో అయస్కాంత శక్తి వున్నది. 

అది మనలోని చైతన్య శక్తితో

చేరినప్పడు, మనసుకు ప్రశాంతతను కలిగించి ఆలోచనా శక్తిని

పెంపొందిస్తుంది.  మంచి ఆలోచనలు  కలగడం వలనసజ్జనుల సాంగత్యం   ఏర్పడి సత్చింతనతో సత్కార్యాలు చేయడానికి అవకాశం కలుగుతుంది. రుద్రాక్షధారణ వలన సాత్విక గుణాలు ఏర్పడే అవకాశముంది. అలాటివారిలో దైవచింతన వుంటుంది. విద్యార్థులు రుద్రాక్షలు మెడలో ధరిస్తే  మేధస్సు పెరుగుతుంది.

రుద్రాక్షలు ధరించినట్లయిన పవిత్రగంగలో స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు తెలుపుతున్నాయి. 

గంగ స్నానం వలన

చేసిన పాపాలు తొలగిపోతాయని

ఐహీకం. మానవుడి అనేక కష్టనష్టాలకు కారణం అతడు చేసే పాపాలే.  విజ్ఞానశాస్త్ర రీతిగా చూసినా   యీ దైవీక

రుద్రాక్షలను  ధరించిన వారికి

దీర్ఘాయువు, సిరి సంపదలు ప్రాప్తిస్తాయని జాబాల ఉపనిషత్  తెలుపుతున్నది.  ఒకటి నుండి14 ముఖాలదాకా రుద్రాక్షలు వున్నాయి.అనేక శారీరక ,మానసిక రుగ్మతల తీవ్రతను  రుద్రాక్షలు

తగ్గిస్తాయని  పరిశోధకులు

తెలుపుతున్నారు.  సర్వవేళలా రుద్రాక్షలను

ధరించ వచ్చును.


శివ దీక్ష తీసుకున్న స్త్రీలు

రుద్రాక్షలను ఎల్లవేళలా ధరించవచ్చును. సాధారణ గృహిణులు మాత్రం పూజా వ్రత సమయాలలో మాత్రమే  ధరించాలి. తరువాత, వాటిని మెడలో నుండి తీసివేసి పూజా గదులలో వుంచాలి.🍃

నీతి కథలు - 257*

 💦 *నీతి కథలు - 257*


*ధనపిపాసి*


హస్తివరం అనే గ్రామంలో, పోలయ్య అనే వడ్డీ వ్యాపారం చేసే ధనవంతుడు వుండేవాడు. అతడు పెద్ద ధనపిపాసి; పరమపిసినారి.

 

ఒక రోజు పొరుగు ఊళ్ళో పోలయ్యకు బాకీ వసూళ్ళు ఆలస్యం కావడంతో పొద్దుపోయి బాగా చీకటి పడింది. అతడు హడావిడిగా స్వగ్రామానికి తిరుగు ప్రయూణమయ్యాడు. ఆ సమయంలో ఎదురుపడ్డ గురప్రుబండివాడొకడు పోలయ్యను గుర్తు పట్టి, ‘‘అయ్యా, ఒక్క రూపాయి బాడుగ ఇస్తే, మిమ్మల్ని భద్రంగా మీ గ్రామం చేరుస్తాను,'' అన్నాడు.

 

అందుకు పోలయ్య చిరాగ్గా, ‘‘నేను నడక మొదలు పెట్టానంటే, నీ గూని గుర్రం నాతో పోటీ పడలేదు, ఫో!'' అనేశాడు.

 

‘‘ఒక్క రూపాయి ఖర్చుకు వెనకాడుతున్నావు. దారిలో దయ్యాలున్నాయి!'' అంటూ బండివాడు, పోలయ్యను భయపెట్టాలని చూశాడు. కానీ, పోలయ్య ఆ మాటలు పట్టించుకోకుండా నడక సాగించాడు. అది వెన్నెల రాత్రి అయినందున, కాలిబాట స్పష్టంగా కనబడుతున్నది. సగం దారిలో, ఊడలతో విశాలంగావున్న ఒక మర్రి చెట్టు పక్కన, ఏ నాటిదో ఒక పాడుబడిన సత్రం వున్నది.

 

ఆ సత్రం ముందు నిలుచుని వున్న ఒక ముసలివాడు, పోలయ్యను చూస్తూనే ఒకడుగు ముందుకువేసి, ‘‘బాగున్నావా, పోలయ్యా?'' అంటూ పలకరించాడు. పోలయ్య, అతడి కేసి పరీక్షగా చూస్తూ, ‘‘ఇంతకు ముందేనాడూ నిన్ను చూసిన గుర్తు లేదు. ఇంతకీ ఎవరు నువ్వు?'' అని అడిగాడు.

 

‘‘ఉట్టినే కాలం వృథా చేయడం ఎందుకు? నీకు ఏడుతరాల వెనకటివాడిని, అంటే నీముత్తాతకు, ముత్తాతను!'' అన్నాడు ముసలివాడు. ‘‘నా ముత్తాత నేను పుట్టక ముందే పోయాడు. ఆయన ముత్తాత ఇంకా బతికున్నాడంటే ఎవరూ నమ్మరు,'' అని, ఒక క్షణం ఆగి, కాస్త భయంగా, ‘‘నువ్వు ఆ ముత్తాత ముత్తాత దయ్యానివి కాదుగదా?'' అన్నాడు పోలయ్య.


‘‘అవును, బాగా గ్రహించావురా, పోలయ్యా. ఏం భయపడకు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకే, నేను బతికివున్నప్పుడు గుప్తంగా దాచిన సొమ్మంతా నీకు ఇవ్వడానికి వచ్చాను. అదంతా చెబుతాను విను,'' అంటూ దయ్యం తన గురించి చెప్పుకున్నది.

 

ఆ దయ్యం పేరు వరదయ్య. అతడు పోలయ్యకన్నా పెద్ద ధనవంతుడు; మరింత పిసినారి. ధన సంపాదన తప్పమరేదీ అతడికి పట్టేదికాదు. వరదయ్యకు చివరి దశలో ఒక బెంగ పట్టుకున్నది. అదేమంటే - అతడి కొడుకులూ, మనవళ్ళలో ఏఒక్కరికీ అతడి గుణం రాలేదు. పైగా, వారిది జాలిగుండె. అవకాశం దొరికితే దానధర్మాలు చేసేవాళ్ళు. ఏమాత్రం పొదుపరితనం లేదు. తను ఆర్జించిన ధనమంతా వాళ్ళ చేతుల్లో మంచులా కరిగిపోగలదన్న ఆవేదన కలిగింది అతడికి.

 

బాగా ఆలోచించి వరదయ్య ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాడు. అందర్నీ ఇంట్లోంచి తరిమేశాడు. మరణించాక దయ్యంగా మారి దానికి కాపలావుంటున్నాడు. ఇప్పుడు పోలయ్య గురించి తెలిసింది. తన వారసుడే కాబట్టి, ఆ సంపదను పోలయ్య చేతుల్లో పెడితే నిక్షేపంగా వుండడమేగాక, మరింత పెంపుకాగలదన్న నమ్మకం కలిగింది.

 

వరదయ్య దయ్యం చెప్పినదంతా శ్రద్ధగా విన్న పోలయ్య ఆనందభరితుడై పోయూడు. ‘‘ఒరే, పోలయ్యా! ఆ నా సంపదనంతా, నీకప్పగిస్తాను. కానీ, ఒక్క షరతు,'' అన్నాడు వరదయ్య. ‘‘ఏమిటది?'' అని అడిగాడు, పోలయ్య ఆత్రంగా.

 

‘‘అదృశ్యంగా ఎల్లప్పుడూ నిన్ను అంటి పెట్టుకుని వుంటాను. ఇంటి పెత్తనమంతా నాకు అప్పగించాలి,'' అన్నాడు వరదయ్య.

 

ధనం మీది ఆశతో పోలయ్య వెనకా ముందూ ఆలోచించకుండా వరదయ్యదయ్యం పెట్టిన షరతును అంగీకరించాడు. తర్వాత వరదయ్య, తను రహస్యంగా దాచివుంచిన ధనాన్ని పోలయ్యకు అప్పగించాడు. పోలయ్య ఇంటి పెత్తనం వరదయ్యదయ్యం చేతిలోకి వచ్చింది. ఆ క్షణం నుంచీ ఆ ఇంటి బతుకు నరక ప్రాయమైంది. ఇంట్లో పోలయ్య తల్లి, భార్య, ముగ్గురు పిల్లలతో సహా ఆరు మందివున్నారు. ప్రతి రోజు వాళ్ళ భోజనానికి సరిపడే బియ్యంలోంచి అద్దెడు పొదువు చెయ్యాలి. ఏమాత్రం రుచిలేని పచ్చడి, నీళ్ళ మజ్జిగతో భోజనం ముగించాలి.


పండగల్లో పిండి వంటలు నిషిద్ధం. వరదయ్య దయ్యం ఇంట్లో చేరక ముందు పోలయ్య ఇంత కఠినంగా వుండేవాడుకాదు. పోలయ్య ఇంత క్రూరంగా ఎందుకు మారాడో ఇంట్లో వాళ్ళకు అర్థంకాలేదు.

 

ఇలా ఉండగా పోలయ్య కూతురు పదేళ్ళ పార్వతికి జబ్బు చేసింది. ‘‘పార్వతిని పక్క ఊరి వైద్యుడి వద్దకు తీసుకువెళ్ళాలి.

 

ఇనప్పెట్టెలో కొంత డబ్బు తీసుకోవచ్చా?'' అని అడిగాడు పోలయ్య, వరదయ్య దయ్యాన్ని.

 

‘‘వద్దు. ఉపవాసం పరమౌషధం అన్నారు కదా పెద్దలు. పస్తు పెడితే జ్వరం దానంతట అదే తగ్గిపోతుంది,'' అన్నది వరదయ్య దయ్యం.

 

‘‘తగ్గే సూచన లేదు. ఒకవేళ జరగకూడనిది జరిగితే,'' అన్నాడు పోలయ్య ఆందోళనగా. ‘‘అదీ మనకు లాభమే. ఈ కాలంలో ఆడపిల్ల పెళ్ళి మాటలా? బోలెడు ఖర్చు. అదంతా మిగిలి పోతుంది,'' అన్నది వరదయ్య దయ్యం వికృతంగా నవ్వుతూ.

 

ఆ మాటకు పోలయ్య దిగ్భ్రాంతి చెందాడు. కూతురి ఆరోగ్యం పట్ల భర్త ఉదాసీనతకు ఆగ్రహం చెందిన పోలయ్య భార్య ఆదిలక్ష్మి, ఇనప్పెట్టెకు దొంగ తాళంచెవి సంపాయించింది. భర్త ఇంట లేని సమయం చూసి ఇనప్పెట్టెను తెరిచి, డబ్బు తీసి కూతురికి రహస్యంగా వైద్యం చేయించింది. కూతురి జ్వరం తగ్గుముఖం పట్టింది.

 

తనకు తెలియకుండా ఆ ఇంట్లో ఏదో జరిగిపోతోందని వరదయ్య దయ్యానికి అనుమానం వచ్చి, ఒక రోజు పోలయ్య వెంట పోకుండా ఇంటి వద్దే కాపు కాసింది. దానికి ఏం జరుగుతున్నదీ తెలిసిపోయింది.

 

ఆ రాత్రి పోలయ్య ఇంటికి తిరిగి రాగానే, వరదయ్య దయ్యం గుండెలు బాదుకుంటూ, ‘‘ఒరే, నట్టింటి భోషాణంలో ఏముందో వెళ్ళి చూడు,'' అన్నది.

 

పోలయ్య వెళ్ళి చూస్తే, అందులో రెండు రకాల భస్మాలు, లేహ్యం, ఒక కషాయం సీసా కనిపించాయి. అంతలో అక్కడికి వచ్చిన భార్య కేసి, ‘‘ఏమిటిదంతా?'' అన్నట్టు చూశాడు పోలయ్య.

 

‘‘ఔను, నేనే ఇనప్పెట్టెను దొంగతనంగా తెరిచి, డబ్బు తీసుకుని బిడ్డకు వైద్యం చేయించాను. అది తప్పా? బిడ్డ వైద్యానికి కూడా ఉపయోగపడని డబ్బు మనకెందుకు? నీకు డబ్బేగనక అంత ముఖ్యమను కుంటే చెప్పు.

 

నీతో ఉంటూ కడుపులు మాడ్చుకుని కొద్ది కొద్దిగా చావడంకన్నా, అందరం కట్ట కట్టుకుని ఒక్కసారిగా ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాం,'' అన్నది భార్య కన్నీళ్ళతో.


పోలయ్య మరేం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయూడు. ఆ రాత్రంతా నిద్రపోలేదు. తెల్లవారాక ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇనప్పెట్టె తెరిచి, కొంత డబ్బు తీసి భార్యకు ఇస్తూ, ‘‘నన్ను క్షమించు లక్ష్మీ. సరైన సమయంలో బిడ్డకు వైద్యం చేసి ప్రాణాలు కాపాడావు. చాలా సంతోషం. ఈ డబ్బుతో ఇంటికి కావలసినవాటినన్నిటినీ కొనుక్కుని, పిల్లలకు ఏ కొరతా లేకుండా చూసుకో,'' అన్నాడు.

 

ఇది చూస్తూనే వరదయ్య దయ్యం పోలయ్యను పెరట్లోకి తీసుకుపోయి, ‘‘ఒరే పోలయ్యా! నువ్వునాకిచ్చిన మాట తప్పావు,'' అన్నది కోపంగా. ‘‘నేను వ్యాపారస్థుణ్ణి. మాట తప్పడం నాకు అలవాటే,'' అన్నాడు పోలయ్య తాపీగా.

 

‘‘మన వంశం వాళ్ళు తరతరాలుగా ఐశ్వర్యవంతులుగా ఉండాలని, ఇదంతా చేశాను. మాట తప్పితే అధోగతి పాలవుతావు,'' అన్నది వరదయ్య దయ్యం.

 

‘‘నా అధోగతి సంగతి కాలమే నిర్ణయిస్తుంది. ఐనా ఐశ్వర్యం ఉన్నది ఎందుకు? మనమూ అనుభవించక, ఎదుటి వారికీ ఇవ్వక ఇనప్పెట్టెలో దాచి కాపలా కాయడానికా? ఇంట్లో వాళ్ళ కడుపులు మాడ్చి, చివరికి కన్న బిడ్డకు వైద్యం కూడా చేయించలేని ధనం ఎందుకు? నువ్వు డబ్బు మీది పేరాశతోనే బంధువులందరినీ వదులుకున్నావు. అమూల్యమైన ప్రేమానురాగాలకు దూరమై, చచ్చినా ధనపిపాసను చంపుకోలేక దయ్యంలా అశాంతితో తిరుగుతున్నావు. నీకు ఎప్పుడో పట్టిన దుర్గతి నాకు మునుముందు పట్టకూడదనే ఈ నిర్ణయానికి వచ్చాను,'' అన్నాడు పోలయ్య.

 

‘‘ఔరా, పోలయ్యా! ఇన్నాళ్ళకు నా కళ్ళు తెరిపించావు. నీ మాట అక్షరాలా నిజం. నా ధనం కూడా నీవద్దే ఉంచుకుని, నీ భార్యా పిల్లలకే కాక, నిన్ను ఆశ్రయించినవారికీ సాయపడుతూ, సంతోషంగా జీవించు,'' అంటూ వరదయ్యదయ్యం మాయమయింది.

              💦🐋🐥🐬💦

*రైలు పెట్టె

 *రైలు  పెట్టె🚃* 

🕉️🌞🌎🏵️🌼🚩


గంభీర వాతావరణం ఆవరించింది. రైలు పెట్టెలో పరిస్థితి గమనించిన పిలకా గణపతి శాస్త్రి గారు - వున్నట్టుండి ఒక్కసారి కళ్లు పెద్దవి చేసి బోలెడు ఆశ్చర్యం నటిస్తూ.........

    

   "ఆహా... ఏమి బిస... ఏమి బిస.... ఆ యొక్క రాక్షసబొగ్గుతో ఇంతమందినీ లాక్కుని ఈ విధంగా ఛుకు....ఛుకు...ఛుకు మని అలుపూ సొలుపూ లేకుండా పరుగెత్తడం వుంది చూశారూ... అరెరెరె... ఏమాశ్చర్యం...... ?"అని అందరివైపు నోరు తెరచి చూశారు.



    అప్పుడే వస్తున్న జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి ఆశ్చర్యప్రకరణమంతా విని-


"మనవాళ్ళు మామూలు తోటకూర తిని మహాకావ్యాలు రాసేస్తుండగా లేంది- బొగ్గుతో రైలు నడవడంలో ఆశ్చర్యం ఏముంది లెండి.." అన్నారు సౌమ్యంగా ఉత్తరీయాలు వున్నవాళ్లూ, లేనివాళ్లూ కూడా ఒక్కసారి బుజాల మీద చేతులు వేసుకున్నారు.


    తల్లావఝుల శివశంకరస్వామి నీటుగా సింగిల్ సీటు మీద రైల్లో కూడా నేను సభాపతినే అన్నట్టు కూర్చున్నారు ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్న భంగిమలో...


    జలసూత్రం ఓ క్షణం ఆగి "రైలు పట్టాల్ని చూస్తుంటే మా సభాపతిగా గారి కవిత్వం జ్ఞాపకమొస్తుంది. నాకు - అడ్డంగా వేసిన బద్దీలు నిక్కచ్చిగా కొలిచి తూచి వేసినట్టుంటే ఆయన పద్యపాదాల్లాగూ, క్రమంగా  వుంటాయి. ప్రతి ఎనిమిదింటికీ దూరం తగ్గించి కాస్తంత దగ్గరగా నాలుగు బద్దీలుంటాయి చూశారూ - సీసపద్యం కింద ఎత్తుగీతి లాగు - సమాసాల కంకరరాళ్లు సరేసరి - అటూ ఇటూ కొలిచి కొట్టిన మార్జిన్లు లాగు ఇనుప కమ్మీలు.. స్వామి వారి పద్యాలని తెచ్చి పొడుగ్గా పేర్చుకుంటూపోతే రైలు పట్టాలే సుమండీ... "అనేసి మెరుపులా మాయమైపోయారు.


    "ఉపమ బేషుగ్గా వుంది..." అని ముక్తకంఠంతో అక్కడ వున్న వారందరికీ అనాలనిపించింది. కాని తమాయించుకున్నారు.


    శివశంకర స్వామి వారు మాత్రం గొంతు పెగలనంతగా వుక్రోషించారు. వుపాయం తోచక వూరుకున్నారు.


    అలక్ష్య లక్ష్య లక్షణంగా పైజమా పైచొక్కా వేసుకుని నామార్గం వేరన్నట్టు ఇవతల కక్ష్యలో కూచుని హరీస్ ఛట్టో చదువుకుంటున్న శ్రీశ్రీ స్వామివారి వంక ఓ చూపు చూసి కళ్లద్దాలు సవరించుకున్నారు. అంతా నిశ్శబ్దం. వాతావరణం దిగులుగా వుంది. 


     ఇంతలో ఏపిల్...ఏపిల్...పావలా అని గుక్క తిప్పుకోని 

కేకతో పళ్లబ్బాయ్ కంపార్ట్ మెంట్ లోనికి వచ్చాడు.


     ఆ సమయంలో పళ్లబ్బాయ్ పెద్ద ఆసరా అయ్యాడు అందరికి - 

అప్పట్లో భావకవిత్వం బ్రేక్ త్రూ అయినట్టు-


"కొంటే బాగుంటుంది" - అన్నారు పింగళి.


"తింటే మరీ బాగుంటుంది" - అన్నారు కాటూరి.


    "జంట కవిత్వం బానేవుంది... అయితే నేను కొనాల్సిందేనా... అంటూ"

ఎంపిక చేసి పది పళ్లు బేరం చేశారు విశ్వనాథ-


    "మిగిలితే మాత్రం నాకొకటి ఇవ్వండి" అన్నారు గణపతిశాస్త్రి


    విశ్వనాథ వారు తలొకటి పంచి తనొకటి నోటికి తగిలించారు. 

పక్క క్యూలోంచి శ్రీశ్రీ బుసకొట్టిన శబ్దం చేసి "ఏపిల్ బూర్జువా వ్యవస్థకి

ప్రతీక... " అన్నారు.


    "అయితే మీరు జామిపళ్లు తప్ప తినరా ఏమిటి ఏప్ అంటే వానరము. ఏపిల్స్ ని నేను హనుమత్ప్రసాదంగా తింటూ వుంటాను.. " విశ్వనాథ ఏపిల్ నముల్తూ అన్నారు.


   మరోసారి హూంకరించి ఛట్టోలోకి వెళ్లిపోయారు శ్రీశ్రీ.  *(శ్రీరమణ పేరడీలు నుండి ......)


 🕉️🌞🌎🏵️🌼🚩

*సామ,దాన,భేద,దండోపాయాలు

 *సామ,దాన,భేద,దండోపాయాలు.*

🕉️🌞🌎🏵️🌼🚩


ప్రతి మనిషికి కోరికలుంటాయి. కొందరికీ కొండంత కోరికలుంటాయి. గొంతెమ్మ కోరికలూ ఉంటాయి. సహజ వాంఛలుంటాయి. అవసరాలు ఉంటాయి. ఇవన్ని మనిషికి చైతన్యాన్ని ఇచ్చి నడిపిస్తాయి!

కొందరు కోరికలు తీరలేదనే భావంతో పనులు చేయడం మానేసి ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఊహాలోకంలో తేలియాడుతూ ఉంటారు.

తాహతు కొద్ది కోరికలుంటే అది సహజం. ఇంకా ఏదో సాధించాలని ఉంటే అది అభిలాషణీయమే.

దేవకన్య కావాలి. ఊళ్ళో కన్నె పిల్లలందరూ నేనంటే పడి చావాలి. నేనేది కోరుకుంటే అదే జరగాలి! నియంతను కావాలి! ప్రపంచం నా పాదాక్రాంతం కావాలి! అని ఆశిస్తే మాత్రం, దురాశ, అత్యాశ, వెకిలి తనం, వెర్రితనం అవుతుంది.

వాంఛ చైతన్యానికి చిహ్నం. తాను ఆశించింది పొందడానికి మనిషి సామ, దాన, భేద, దండోపాయాలు ఉపయోగిస్తాడు.

ధనం కావాలి - ప్రేమ కావాలి - మనిషికి అధికార బలం కావాలి. తనను సమర్దించేవారు కావాలి - తలచినది కావాలి.సామం: కొన్ని పనులను చక్కగా పరిస్థితులను స్వయంగా వివరించి చెప్పడం వలన గాని, తగిన వారితో చెప్పించడం వలన గాని చక్కబెట్టుకోవచ్చును. దీనినే "సామోపాయం" అంటారు.

దానం: అప్పటికీ నెరవేరని కార్యాలను బహుమతులు, ధనాన్ని ఇచ్చి కాని, ఇతరత్రా ప్రలోభాలకు వారిని ఎరవేసి వారి కోరికలు నెరవేర్చడం వలన సాధించ వచ్చును. దీనిని "దానోపాయం" అంటారు.

భేదం: బుద్ధి బలం ఉపయోగించి వారి సన్నితుల మధ్య అపార్థాలు కల్పించుట, అంతఃకలహాలు సృష్టించుట, వలన గాని, ఈ విధంగా విధిలేని పరిస్థితులు కల్పించుట వలన గాని అనుకున్న కార్యాన్ని సులభంగా సాధించవచ్చును. దీనిని "భేదోపాయం" అంటారు.

దండన: తప్పని పరిస్థితుల్లో కొన్నింటిని బలప్రయోగం చేయడం ద్వారానే సాధించాల్సి ఉంటుంది. దీనిని "దండోపాయం" అంటారు.

అన్ని చోట్ల ఏ ఒక్కటి మాత్రమే పనిచేయదు. కొన్ని విషయాలలో అంచెలంచెలుగా వాటిని ప్రయోగిస్తూ కార్యసిద్దిని పొందాలి. ఈ విషయంలో సమయం, సందర్భం చూసుకోవాలి. సమయస్ఫూర్తి ప్రదర్శించాలి. దానికి తోడు మనోబలం కావాలి.

కొన్నింటిని సాధించేందుకు కొందరికీ అర్హత ఉండదు. అర్హత లేకున్నా ప్రయత్నిస్తే ఉపయోగమేముంటుంది?

భారతంలో చెప్ప బడిన రాజ నీతి, యుద్ద నీతిలో చెప్పబడిన చతుర్విదోపాయాలు.

ఈ చతుర్విద ఉపాయాల గురించి మహా బారతంలోని శాంతి పర్వం, ద్వితీయాశ్వాసంలో ఈ విధంగా వివరించబడింది.

రాజు తన ప్రధాన మూల బలం సైన్యంగా గుర్రించాలి. శత్రు శేషం లేకుండా చేసుకోవాలంటే తన సైన్యాన్ని ( చతురంగ బలాలను) ప్రేమగా చూడాలి.

శత్రువు అసమర్ధుడుగా ఉన్నాడని గ్రహించినప్పుడు మాత్రమే యుద్ధానికి వెళ్ళాలి. ఈ దండ నీతి వలన రాజునకు మిక్కిలి శుభం కలుగుతుంది.

యుద్ధం ఒక సాహస కృత్యం. యుద్ధం చేసి, శత్రు సంహారం వలన సంపాదించిన సిరి సంపదలు మేలు కలిగించవు సుమా ! దీని వలన వచ్చే రాజు అహంకారాన్నీ, కోపాన్నీ తగ్గించుకోవాలి.

అలాంటి రాజునకు శత్రువులు ఉండరు. రాజు ఎదిరి రాజు తనంతటి వాడని గ్రహించి నప్పుడు తగిన "సామోపాయం"తో ప్రవర్తించాలి.

‌‌ఒక్కోసారి తన సైన్యం లోనే అంత: కలహాలు చెల రేగుతూ ఉంటాయి. అలాంటప్పుడు రాజు యుద్ధానికి బయలు దేర కూడదు.

శత్రువు ఎంత బలహీనుడయినా సరే, అతనికి "దానోపాయం" అవలంభించి తగినంత ధనం ఇచ్చి సంతృప్తి పరచి వశం చేసు కోవడమే ఉత్తమం.

ఇలా "సామ దాన దండోపాయాలు" అనే మూడింటికి అవకాశం లేనప్పుడు శత్రువు బలహీనతలను గమనించి, అవకాశం చిక్కి నప్పుడు, శ్రద్ధతో రాచ కార్యాన్ని చేయ గల సమర్ధుని నియోగించి "భేదోపాయం" ప్రయోగించడానికి ప్రయత్నించాలి.

శుక్రాచార్యుడి ఉపేక్షాభావం: శుక్రాచార్యుడి అభిమతం ప్రకారం సామ దాన భేద దండోపాయాలే కాక, ఉపేక్షా భావం మనే మరో ఉపాయం కూడ ఉంది. దానిని ఎలా ప్రయోగించాలో చూడండి ...

తమలో తమకే వైరం కలిగి సతమతమయే రాజుని ఉపేక్షించాలి. ముల్లును ముల్లుతోనే తీయాలి.

కొందరు మంత్రులు రాజుకి ఆపదలు కలిగించడానికి చూస్తూ ఉంటారు. వారి పట్ల కూడ కొంత కాలం ఉపేక్షాభావం వహించి, అదను చూసి వారిని తొలిగించాలి.

ఈ ఆదునిక కాలంలో మానవులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు తమ కార్యసాధనలో సామ, దాన, భేద, దండోపాయాలను రకరకాల పద్ధతుల్లో ప్రయోగించి ఫలితాలను పొందు చున్నారు.


🕉️🌞🌎🏵️🌼🚩

త్రిలింగ వైభవం*

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


             *త్రిలింగ వైభవం*

                 ➖➖➖✍️


*‘త్రిలింగ’ అంటే మూడు లింగాలని అర్థం. దాక్షారామం, శ్రీశైలం, కాళేశ్వరం అనే మూడు పుణ్య శైవపుణ్య స్థలాలచే ఆవృతమైన ప్రాంతానికి త్రిలింగ దేశమనే పేరు వచ్చిందని ప్రాచీనకాలం నుంచి ఒక అభిప్రాయం ప్రగాఢంగా ఉంది.*


త్రిలింగము -ప్రకృతి,

తెలుగు- వికృతి


*క్రీ.శ. రెండో శతాబ్దానికి చెందిన గ్రీకు శాస్త్రజ్ఞుడు టోలమి ‘ట్రిలింగానా’ అనే పదం తన గ్రంథంలో ఉపయోగించాడు. వాయు, మార్కండేయ పురాణాల్లో ‘త్రిలింగాశ్చ’ అనే పదం కనిపిస్తుంది.  విద్యానాథుడనే పండితుడు తన ‘ప్రతాపరుద్రీయమ్‌’ అనే అలంకారశాస్త్ర గ్రంథంలో మొట్టమొదట త్రిలింగ వైభవం త్రిలింగాలను పేర్కొనడమేగాక తన రాజు కాకతీయ ప్రతాప రుద్రుణ్ని ‘త్రిలింగ పరమేశ్వర‘ అని సంబోధించాడు. 15వ శతాబ్దానికి చెందిన విన్నకోట పెద్దన తన ‘కావ్యాలంకార చూడామణి’లో త్రిలింగ పదం తెలుగుగా మారిందని పేర్కొన్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మూడు ప్రాంతాలకు ఈ మూడు శివక్షేత్రాలు ప్రతీకలు. దాక్షారామం కోస్తా ప్రాంతంలో ఉంటే, శ్రీశైలం రాయలసీమకు చెందినది. కాళేశ్వరం తెలంగాణలో ఉంది.*


*తూర్పుగోదావరి జిల్లాలోని దాక్షారామం పంచారామాల్లో ఒకటి. ఇక్కడి శివుడు భీమేశ్వరుడు. స్వయంభువుగా వెలసిన శివలింగాన్ని సూర్యుడు ప్రతిష్ఠించాడని పురాణ కథనం. దక్షప్రజాపతి తన అల్లుడైన శివుణ్ని అవమానించిన సందర్భంలో దాక్షాయణి, శివపత్ని అయిన సతీదేవి యాగాగ్నిలో తన దేహాన్ని ఆహుతి చేసుకుందని, ఆమె శరీర భాగాలు పడిన ప్రదేశాలు శక్తిపీఠాలు అయ్యాయని సంప్రదాయ విశ్వాసం. సతీదేవి కణత పడిన ప్రదేశమే మాణిక్యాంబ పీఠమైనదని, అదే దాక్షారామమని పురాణోక్తి. ఈ ఆలయంలో మూల విరాట్టు 20 అడుగుల ఎత్తున లింగాకారంలో ఉంటాడు. ఈ క్షేత్రంలో స్వామి అభిషేకానికై సప్తర్షులు గోదావరికి ఏడు పాయలుగా రూపొంది జలాలను సమకూరుస్తున్నారని అందుకే దీనిని ‘సప్తగోదావరం’ అంటారని ఐతిహ్యం.* 


*వింధ్య పర్వతానికి గర్వభంగం చేయడానికి దక్షిణానికి వచ్చిన అగస్త్యుడు ఈ ‘దక్షిణకాశి’లో భార్య లోపాముద్రతోపాటు నివసించాడు. కాశీ నుంచి బహిష్కృతుడై దాక్షారామానికి వచ్చిన వ్యాసుడికి అగస్త్యముని స్వాగతం పలికాడు. శ్రీనాథుడి ‘భీమేశ్వరపురాణం’ ఈ క్షేత్రమహాత్మ్యాన్ని వర్ణించే కావ్యం.*


*శ్రీశైల శిఖరం దర్శిస్తే పునర్జన్మ ఉండదని విశ్వాసం. ఇక్కడి శివుడు, మల్లికార్జునుడు. అమ్మవారు భ్రమరాంబిక. గణపతి పేరు ‘సాక్షి గణపతి’ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇది ఒకటి. ఆదిశంకరులు ఈ క్షేత్రంలోనే కూర్చుని శివానందలహరి, భ్రమరాంబపై అష్టకం రచించినట్లు ప్రతీతి. శ్రీశైలాన్ని శైవ సంప్రదాయంలోని కాపాలిక క్షేత్రంగా భవభూతి కవి ‘మాలతీ మాధవం’లో పేర్కొన్నాడు. ఇక్కడ అనేక మఠాలుండేవి. పార్వతీ కల్యాణం, కిరాతార్జునీయ  ఘట్టం, మహిషాసుర మర్దన వృత్తాంతం వంటివి ఇక్కడి శిల్పాల్లో విరాజిల్లుతున్నాయి.*


*కాళేశ్వరం తెలంగాణ రాష్ట్రంలో జయశంకర భూపాలపల్లి(కరీంగర్‌) జిల్లాలో ఉంది. ప్రాణహిత, గోదావరి నదుల సంగమ ప్రదేశంలో శివుడు వెలశాడు. కాలుడంటే యముడు. ఒకే పానవట్టంపై శివుడు, యముడు వెలశారు. పాపుల సంఖ్య తగ్గిపోతుందని యముడు శివుడితో మొరపెట్టుకుంటే తాను ముక్తేశ్వరుడిగా వెలసిన క్షేత్రంలో తన పక్కన పూజలు అందుకొమ్మని శివుడు అతడికి వరం ఇచ్చాడని స్థలపురాణం. అభిషేకించిన జలంపై గల రంధ్రం ద్వారా గోదావరి సంగమ స్థలానికి చేరుకుంటుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ మహా సరస్వతి ఆలయం ఉంది. బ్రహ్మతీర్థం, నరసింహతీర్థం, హనుమత్‌ తీర్థం, జ్ఞానతీర్థం ఉన్నాయి.*✍️


                      🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏



🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

పరనింద

 *పరనింద అంటే ఏమిటి??? - దాని వల్ల ఎలాంటి దోషమో !!! ఒకసారి తెలుసుకొందాము!!!*

ఓ బ్రాహ్మణుడు పితృకార్యము చేస్తున్నాడు, పాలు పెరుగు పోసే అమ్మాయి, తన ఇంటిని నుండి ఈయనకు పెరుగు పొయ్యాలని బయలుదేరింది. కాని తట్టలో పెట్టుకున్న పెరుగుకుండకు పైన పెట్టిన బట్ట గాలికి తొలిగింది. అదేసమయానికి ఒక గరుడపక్షి ఓపాముని భూమి నుండి ఎగరేసుకు పోయింది. పాము కక్కిన కాలకూట విషం ఈ పెరుగు కుండలో పడింది. ఇదేమి తెలియని ఆ గొల్లవనిత, బ్రాహ్మణుడి ఇంట్లో ఆ పెరుగు పోసి వెళ్ళింది. బ్రాహ్మణుడు పితృకార్యమునకు వచ్చిన వేదబ్రాహ్మణులు మృత్యువాత పడ్డారు. 


ఇది జరిగిన తరువాత ఆ గ్రామంలో ఈ విషయాన్ని పెద్దగా చర్చించటం మొదలుపెట్టారు. కొందరు *"ఆ గొల్లవనితది"* తప్పన్నారు. *కొందరు పాముది తప్పుఅని, కొందరు గరుడపక్షిది తప్పు అని, కొందరు బ్రాహ్మణుడిది తప్పు* అని వాదించటం ఆరంభించారు. 


ఈ వాదప్రతివాదములు యమలోకం దాకా వెళ్ళినాయి. చిత్రగుప్తుడు *"ప్రభూ! పాపం ఎవరికి చెందుతుంది"* అని తన ప్రభువైన యమధర్మరాజుని అడిగాడు. 


దానికా సమవర్తి *"చిత్రగుప్తా! ప్రకృతిసిద్ధంగా జరిగిన విషయాలకు పాపం ఎవరికి చెందదు. ఆకలిగొన్న పక్షి తన ఆహారంకోసం పాముని తన్నుకెళ్ళటం సహజం. అది ప్రాణభయంతో విషం క్రక్కుట సహజం. గాలికి పెరుగుకుండ పైన బట్ట తొలగటం సహజం. ఇలా సహజముగా జరిగిన సంఘటనలకు పాపం అంటావేమిటి? ఎమైనా పాపం ఉంటే, అక్కడ భూలోకంలో ఈ ధర్మసూక్ష్మాలు తెలియకుండా "పాపం వీరిది, వారిది అని" ధర్మనిర్ణయం చేస్తున్నారే, వారికి పంచు"* అని తీర్పునిచ్చాడు. 


కాబట్టి మనము ధర్మసుక్ష్మాలు తెలియకుండా వారిది తప్పు , వీరిది తప్పు అని నిర్ణయము చేస్తే, పాపము లో భాగము మనకు పంచుతారు. *తస్మాత్ జాగ్రత్త!*


*పరనింద మహాపాపం* ..


.