30, ఏప్రిల్ 2021, శుక్రవారం

మన సిద్దాంతాలు

 మన సిద్దాంతాలు ...


⚜️⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️


*విశిష్టాద్వైతం:- దీనిని రామానుజాచార్యులు వారు ప్రవచించినారు.  ఈ సిద్ధాంతం ప్రకారం సృష్టి మొత్తం మూడే విస్తరించాయని ప్రతిపాదించినారు.  అవి జీవుడు వేరు, ప్రకృతి వేరు, పరమాత్మ వేరు అని.*


*ద్వైతం:-  దీనిని మధ్వాచార్యులు వారు ప్రవచించినారు.  వీరి ప్రకారం సృష్టిలో ఉన్నవి రెండే అని అవి జీవుడు మరియు పరమాత్మ అని వీరి సిద్ధాంతం.  ప్రకృతి అనునది జీవునిలో అంతార్భాగమేనని వీరి సిద్ధాంతం.*


*అద్వైతం:-  దీనిని ఆదిశంకరాచార్యులు వారు ప్రవచించినారు.  రెండు లేవు, ఉన్నది ఒకటేనని, ఆ ఒకటి ఆత్మ పదార్థం అని.  ఈ సృష్టి మొత్తం నిండి వున్నది ఆత్మ తప్ప మరేమి లేదు అని వీరి సిద్ధాంతం.*


*ఆది, అంతం లేనిదే 'వేదాంతం'.*


ఏ దారిలో వెళ్ళినా చేరుకునే. దేవుడు ఒక్కడే 🙏🏻🌷🙏🏻


⚜️⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️

_రాబోయే తరాలకు


ఎండమావులు


                                 *****


చిన్నప్పుడు

ఏ పండక్కో..పబ్బానికో

కొత్త గౌను కుట్టిస్తే..

ఎంత ఆనందమో...


ఎప్పుడు పండగ

వస్తుందా, ఎప్పుడు

వేసేసుకుందామా

అన్న ఆతృతే...


ఇంటికి చుట్టాలొచ్చి

వెళ్తో వెళ్తూ.. చేతిలో

రూపాయో... అర్ధ

రూపాయో పెడితే

ఎంత వెర్రి ఆనందమో...


చుట్టాలొచ్చి వెళ్లిపోతుంటే

దుఃఖం తన్నుకు వచ్చేది...

ఇంకా ఉంటే బాగుండు

అన్న ఆశ...

ఎంత ఆప్యాయతలో...


సినిమా వచ్చిన ఏ

పదిహేను రోజులకో

ఎంతో ప్లాన్ చేసి

ఇంట్లో ఒప్పించి

అందరం కలిసి

నడిచి వెళ్లి..

బెంచీ టికెట్

కొనుక్కుని  సినిమా

చూస్తే ఎంత ఆనందమో...


ఇంటికొచ్చాకా ఒక గంటవరకూ

ఆ సినిమా కబుర్లే...

మర్నాడు స్కూల్ లో

కూడా...

ఆ ఆనందం ఇంకో పది

రోజులుండేది...


అసలు రేడియో విచిత్రం..

అందులోకి మనుషులు

వెళ్లి మాట్లాడతారా అన్న

ఆశ్చర్యం...అమాయకత్వం..


పక్కింట్లోవాళ్లకి రేడియో

ఉంటే..ఆదివారం

మధ్యాహ్నం వాళ్ళ గుమ్మం

ముందు కూర్చుని 

రేడియోలో సంక్షిప్త

శబ్ద చిత్రం (ఒక గంటకి

కుదించిన) సినిమాని

వింటే ఎంత ఆనందం...

మనింట్లో కూడా రేడియో

ఉంటే...అన్న ఆశ...


కాలక్షేపానికి లోటే లేదు...

స్నేహితులు,

కబుర్లు, కధలు,

చందమామలు,

బాలమిత్రలు...


సెలవుల్లో మైలు దూరం

నడిచి లైబ్రరీ కి వెళ్లి

గంటలు గంటలు

కథల పుస్తకాలు

చదివి ఎగురుకుంటూ

ఇంటికి రావడం....


సర్కస్ లు, 

తోలు బొమ్మలాటలు

లక్కపిడతలాటలు...

దాగుడు మూతలు...

చింత పిక్కలు

వైకుంఠ పాళీ

పచ్చీసు..

తొక్కుడు బిళ్ళలు..

ఎన్ని ఆటలో...


మూడు గదుల రైలుపెట్టె

లాంటి ఇంట్లో అంతమంది

ఎంత సంతోషంగా ఉన్నాం...

వరుసగా కింద చాపేసుకుని

పడుకున్నా ఎంత హాయిగా

సర్వం మరిచి నిద్రపోయాం...


అన్నంలో కందిపొడి..

ఉల్లిపాయ పులుసు

వేసుకుని తింటే

ఏమి రుచి...

కూర అవసరమే లేదు..


రెండు రూపాయలు తీసుకెళ్లి

నాలుగు కిలోల 

బియ్యం తెచ్చేది...

ఇంట్లో,  చిన్నా చితకా

షాపింగ్ అంతా నేనే...

అన్నీ కొన్నాకా షాప్

అతను చేతిలో గుప్పెడు

పుట్నాల పప్పో, పటికబెల్లం

ముక్కో పెడితే ఎంత

సంతోషం...

ఎంత బరువైనా

మోసేసేవాని..


ఎగురుతున్న విమానం

కింద నుండి 

కళ్ళకు చెయ్యి అడ్డం

పెట్టి చూస్తే ఆనందం...


తీర్థంలో ముప్పావలా

పెట్టి కొన్న ముత్యాల దండ 

చూసుకుని మురిసి

ముక్కలైన రోజులు...


కొత్త పుస్తకం కొంటే

ఆనందం...వాసన

చూసి మురిపెం..

కొత్త పెన్సిల్ కొంటే

ఆనందం...

రిక్షా ఎక్కితే...

రెండు పైసల

ఇసుఫ్రూట్ తింటే

ఎంత ఆనందం..?


రిక్షా ఎక్కినంత తేలికగా... 

ఇప్పుడు విమానాల్లో 

తిరుగుతున్నాం...

మల్టీప్లెక్స్ లో ఐమాక్స్

లో సినిమా చూస్తున్నాం.

ఇంటర్వెల్ లో

ఐస్ క్రీం తింటున్నాం..


బీరువా తెరిస్తే మీద పడి

పోయేటన్ని బట్టలు...

చేతినిండా డబ్బు...

మెడలో ఆరు తులాల

నగ....

పెద్ద పెద్ద ఇళ్ళు, కార్లు...

ఇంట్లో పెద్ద పెద్ద టీవీలు...

హోమ్ థియేటర్లు...

సౌండ్ సిస్టమ్స్, అరచేతిలో

ఫోన్లు...అరచేతిలో

స్వర్గాలు...

అనుకోవాలే గానీ క్షణంలో

మన ముందు ఉండే 

తిను బండారాలు.. 

సౌకర్యాలు...


అయినా చిన్నప్పుడు

పొందిన  ఆ ఆనందం

పొందలేకపోతున్నాం

ఎందుకు నేస్తం...?

ఎందుకు...?ఎందుకు...?


చిన్నప్పుడు కోరుకున్నవి

అన్నీ ఇప్పుడు  

పొందాము కదా...

మరి ఆనందం లేదేం...

ఎందుకంత మృగ్యం

అయిపోయింది...?

ఎండమావి 

అయిపోయింది..?


మార్పు ఎందులో...?

మనలోనా...?

మనసుల్లోనా...?

కాలంలోనా...?

పరిసరాల్లోనా...?

ఎందులో... ఎందులో...?

ఎందులో నేస్తం...?

చెప్పవా తెలిస్తే....!!                    


👍 _*త్వరలో అంతరించబోతున్న పాత తరం తస్మాత్ జాగ్రత్త ...*_😢😢🙏


_*రాబోయే 10/15 సంవత్సరాలలో ఒక క్రమశిక్షణ కలిగిన, కష్టపడిన తరం ఈ ప్రపంచంనుండి కనుమరుగవబోతూవుంది..!


_అవును ఇది ఒక చేదు నిజం.!!_


_ఆ తరం ప్రజలు అతి సామాన్య వ్యక్తులు._


_వాళ్ళు.._


 _రాత్రి పెందరాళే పడుకునే వాళ్ళు.!_

_ఉదయం పెందరాళే లేచేవాళ్ళు.!_

_నడక అలవాటు ఉన్నవాళ్ళు.!_ 

_మార్కెట్ కి నడిచి వెళ్ళే వాళ్ళు.!_


_వాళ్ళు....._


 _ఉదయమే  వాకిట కళ్ళాపు చల్లేవాళ్ళు !_

_ముంగిట్లో ముగ్గులు పెట్టేవాళ్ళు!_

_మొక్కలకు నీళ్ళు పెట్టేవాళ్ళు!_

 _పూజకు పూలు కోసే వాళ్ళు !_

_వాళ్ళు...._


_పూజ కాకుండా ఏమీ తినని వాళ్ళు !_

_మడిగా వంట వండేవాళ్ళు!_

_దేవుడి గదిలో దీపం వెలిగించే వాళ్ళు!_

_దేవుడి గుడికి వెళ్ళే వాళ్ళు.!_

_దేముడి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు !!!_

_మనిషిని మనిషిగా ప్రేమించే వాళ్ళు.!!!_


_వాళ్ళు_ 


 _అందరితో ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు.!_ 

_కుశల ప్రశ్నలు వేసేవాళ్ళు..!_

_స్నేహంగా మెలిగే వాళ్ళు...!_

_తోచిన సాయం చేసేవాళ్ళు..!_

_చేతులు జోడించి నమస్కారం చేసేవాళ్ళు...!_


_వాళ్ళు_ 


_ఉత్తరం కోసం ఎదురుచూసిన వాళ్ళు..!_

_ఉత్తరాలు తీగకు గుచ్చిన వాళ్ళు...!_

_పాత ఫోన్ లు పట్టుకు తిరిగే వాళ్ళు...!_

_ఫోన్ నెంబర్ లు డైరీలో రాసిపెట్టుకునే వాళ్ళు....!


_వాళ్ళు_ 


_పండుగలకూ, పబ్బాలకూ అందరినీ పిలిచే వాళ్ళు.!_

_కుంకుడు కాయతో తలంటుకున్నవాళ్ళు..!_

_సున్నిపిండి నలుగు పెట్టుకున్నవాళ్ళు...!_

_పిల్లలకు పాలిచ్చి పెంచినవాళ్ళు ....!_ 


_వాళ్ళు ..._


_తీర్థయాత్రలు చేసేవాళ్ళు.!_

_ఆచారాలు పాటించే వాళ్ళు..!_

_తిధి, వారం, నక్షత్రం గుర్తుపెట్టుకునే వాళ్ళు.!_

_పుట్టినరోజు దీపం వెలిగించి జరుపుకునేవాళ్ళు..!_


_వాళ్ళు ...._


_చిరిగిన బనియన్లు తొడుక్కుని ఉండేవాళ్ళు.!_

_లుంగీలు, చీరలు  కట్టుకుని ఉండేవాళ్ళు...!_

_చిరిగిన  చెప్పులు కుట్టించుకుని వాడుకునే వాళ్ళు....!_

_అతుకుల చొక్కాలు కట్టుకున్నవాళ్ళు.!_


_వాళ్ళు ...._


_తలకు నూనె రాసుకునే వాళ్ళు .!_

_జడగంటలు పెట్టుకున్నవాళ్ళు..!_

_కాళ్ళకు పసుపు రాసుకునేవాళ్ళు...!_

_చేతికి గాజులు వేసుకునే వాళ్ళు.... !_


_ఇప్పటిలా మనుష్యులను వాడుకుని వస్తువుల తో స్నేహం కాకుండా... వస్తువులను వాడుకుంటూ మనుషులతో స్నేహంగా గడిపిన తరం....._


_ఈ తరాన్ని చూసి మూగబోయిన వాళ్ళు_


_మీకు తెలుసా ?_


_వీళ్ళంతా నెమ్మది నెమ్మదిగా మనల్ని వదిలి పెట్టి వెళ్ళిపోతున్నారు._


_మన ఇళ్ళల్లో ఇలాంటి వాళ్ళు అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు._


_మీ ఇంటిలో ఇలాంటి వాళ్ళు ఉంటే దయచేసి వాళ్ళను బాగా చూసుకోండి_ 


_లేదంటే ....._

_లేదంటే ...._ 

_లేదంటే ...._


_ఇప్పటి తరం చాలా కోల్పోవలసి వస్తుంది._


_వాళ్ళ ప్రపంచం, వస్తువులతో కాకుండా, మనుషులతో, మానవత్వంతో, స్నేహంతో కూడి ఉండే తరం.._


_సంతోషకరమైన జీవనం గడిపిన తరం అది ,!_


 _స్పూర్తిదాయక జీవనం గడిపిన తరం అది !_


_కల్లాకపటం లేని జీవనం గడిపిన తరం అది!_


 _ఉన్నది ఉన్నట్టు నిర్మొహమాటంగా ధైర్యంగా మాట్లాడగలిగినతరం_


_ద్వేషం, మోసం లేని స్నేహ జీవనం గడిపిన తరం అది!_


_సాత్విక ఆహారం తిని జీవనం గడిపిన తరం అది.!_


_లోకానికి తప్పు చేయడానికి భయపడి జీవనం గడిపిన తరం అది !_🙏


_ఇరుగుపొరుగుతో కలసిమెలసి జీవనం గడిపిన తరం అది!_😊


 _తనకోసం కొంత మాత్రమే వాడుకుని, తన సంతానం వృధ్ధి కోసం పరితపించిన తరం_


_వారినుండి మనం నేర్చుకోకపోతే ముందు తరాల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది_ 🤔


_మీ కుటుంబంలో పెద్దవారిని మీరు గౌరవించడం ద్వారా మీ పిల్లకు మంచి సంస్కారం అందివ్వండి. ._🙏


_సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలతో స్నేహంగా వుండేట్టు వారిని తయారు చేయాలి..._


_సంస్కారం లేని దేశం ... సంస్కృతి లేని దేశంగా ఈ భారతాన్ని  మార్చెయ్యకండి.!!!_


_తప్పులను సరిదిద్దగలది సంస్కారమే!_🤝

_సర్కారు చేసే చట్టాలు కాదు..._🙏


_రాబోయే తరాలకు ఆస్తులనే కాదు ... ఆప్యాయతలను, స్నేహాన్ని కూడా అందిద్దాం.. లేకుంటే రాబోయే తరాలవారిని మనుషులుగా కాక మర యంత్రాలుగా పిలుస్తారు.._🤔


_*అందరూ బాగుండాలి అందులో మనం వుండాలి* జై భారత్🌹🙏

మెడికల్ కిట్..

 * ఇంట్లో ఉండవలసిన కోవిడ్ మెడికల్ కిట్..💼*


   _*1. డోలో  650 mg*_

   _*2. అజిత్రో మైసిన్  500mg*_

   _*3. _Montek LC*_

   _*4. మౌత్ వాష్ మరియు గార్గ్ల్*_ 

       _*కోసం బీటాడిన్*_

   _*5. విటమిన్ సి మరియు డి3*_

   _*6. బి కాంప్లెక్స్ Beplex forte*_

   _*7. Zincovit tablets*_

   _*8. ఆవిరి కోసం ఆవిరి యంత్రం +                       Karvol plus గుళికలు*_

   _*9. పల్స్ ఆక్సిమీటర్*_

   _*10. థర్మ మీటర్*_


   -_*ఆక్సిజన్ సిలిండర్ (అత్యవసర*_

        _*పరిస్థితికి మాత్రమే)*_

  - _* ఆరోగ సేతు అనువర్తనం*_

  - _* శ్వాస వ్యాయామ పరికరాలు *_


 *☘️ కోవిడ్ మూడు దశలు :*


   _*1. ముక్కులో మాత్రమే కోవిడ్ -*_

        _*రికవరీ సమయం సగం రోజు.*_

        _*(ఆవిరి పీల్చడం), విటమిన్ సి*_

        _*సాధారణంగా జ్వరం ఉండదు.*_

        _*కన్పించడం.*_


   _*2. గొంతులో కోవిడ్ - గొంతు నొప్పి,*_

        _*కోలుకునే సమయం 1 రోజు*_

        _*(వేడి నీటి గార్గ్లే, త్రాగడానికి*_

        _*వెచ్చని నీరు, టెంప్ ఉంటే*_

        _*పారాసెటమాల్. విటమిన్ సి,*_

        _*బికాంప్లెక్స్. యాంటీబయాటిక్*_

        _*కన్నా తీవ్రంగా ఉంటే.*_


   _*3. ఊపిరితిత్తులలో కోవిడ్-*_

        _*దగ్గు మరియు ఊపిరి 4 నుండి*_

        _*5 రోజులు.  (విటమిన్ సి,*_

        _*బి కాంప్లెక్స్, వేడి నీటి గార్గ్లే,*_

        _*ఆక్సిమీటర్, పారాసెటమాల్,*_

        _*తీవ్రంగా ఉంటే సిలిండర్,*_

        _*ద్రవం చాలా అవసరం, లోతైన*_

        _*శ్వాస వ్యాయామం.*_


*🌸 ఆసుపత్రికి చేరుకోవలసిన దశ :*


       _*ఆక్సిజన్ స్థాయిని పర్యవేక్షించండి. ఇది 94 (సాధారణ 98-100) దగ్గరకు వెళితే మీకు ఆక్సిజన్ సిలిండర్ అవసరం. ఇంట్లో అందుబాటులో ఉంటే, ఆసుపత్రిలో చేరవలసిన అవసరం ఉండకపోవచ్చు .*_


_*ఆరోగ్యంగా ఉండండి, సురక్షితంగా ఉండండి!*_


       _దయచేసి భారతదేశంలోని మీ పరిచయాలకు ఫార్వార్డ్ చేయండి...  ఇది ఎవరికి సహాయపడుతుందో మీకు తెలియదు._


       _టాటా గ్రూప్ మంచి చొరవను ప్రారంభించింది, వారు చాటింగ్, టెలి మెడిసిన్ ద్వారా ఆన్‌లైన్‌లో ఉచిత వైద్యుల సంప్రదింపులను అందిస్తున్నారు.  ఈ సదుపాయం మీ కోసం ప్రారంభించబడింది, తద్వారా మీరు వైద్యుల కోసం బయటకు వెళ్లవలసిన అవసరం లేదు మరియు మీరు ఇంట్లో సురక్షితంగా ఉంటారు._


       _క్రింద ఉన్న లింక్, ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను._

 https://www.tatahealth.com/online-doctor-consultation/general-physician.


        [02/07, 15:20] 

       +91 74069 28123: 


       _*ఐసోలేషన్ ఆసుపత్రుల నుండి సలహా, మేము ఇంట్లో చేయవచ్చు.*_


       _*ఐసోలేషన్ ఆసుపత్రులలో తీసుకునే మందులు..*_


   _*1. విటమిన్ సి -1000*_

   _*2. విటమిన్ ఇ (ఇ)*_

   _*3. (10 నుండి 11) గంటల వరకు,*_

       _*సూర్యరశ్మిలో 15-20 నిమిషాలు*_

       _*కూర్చుని.*_

   _*4. గుడ్డు భోజనం ఒకసారి ..*_

   _*5. మేము కనీసం 7-8 గంటలు*_

       _*విశ్రాంతి తీసుకుంటాము /*_

       _*నిద్రపోతాము*_

   _*6. మేము రోజూ 1.5 లీటర్ల*_

       _*నీరు తాగుతాము*_

   _*7. అన్ని భోజనాలు వెచ్చగా*_

       _*ఉండాలి (చల్లగా కాదు).*_


       _*రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి మేము ఆసుపత్రిలో చేస్తున్నది అంతే..!*_


       _*కరోనావైరస్ యొక్క pH 5.5 నుండి 8.5 వరకు మారుతుందని గమనించండి.*_


       _*అందువల్ల, వైరస్ను తొలగించడానికి మనం చేయాల్సిందల్లా వైరస్ యొక్క ఆమ్లత స్థాయి కంటే ఎక్కువ ఆల్కలీన్ ఆహారాలను తీసుకోవడం.*_

  

  _*● ఆకుపచ్చ నిమ్మకాయ - 9.9 పిహెచ్*_

  _*● పసుపు నిమ్మకాయ - 8.2 పిహెచ్*_

  _*● అవోకాడో - 15.6 పిహెచ్*_

  _*● వెల్లుల్లి - 13.2 పిహెచ్*_

  _*● మామిడి - 8.7 పిహెచ్*_

  _*● టాన్జేరిన్ - 8.5 పిహెచ్*_

  _*● పైనాపిల్ - 12.7 పిహెచ్*_

  _*● వాటర్‌క్రెస్ - 22.7 పిహెచ్*_

  _*● నారింజ - 9.2 పిహెచ్*_



       _*మీరు కరోనా వైరస్ బారిన పడ్డారని ఎలా తెలుసుకోవాలి?*_


   _*1. గొంతు దురద*_

   _*2. పొడి గొంతు*_

   _*3. పొడి దగ్గు*_

   _*4. అధిక ఉష్ణోగ్రత*_

   _*5. శ్వాస ఆడకపోవడం*_

   _*6. వాసన కోల్పోవడం ....*_


       _*మరియు వెచ్చని నీటితో నిమ్మకాయ ఊపిరితిత్తులకు చేరే ముందు ప్రారంభంలో వైరస్ను తొలగిస్తుంది ...*_



       _*👆ఈ సమాచారాన్ని మీ వద్ద ఉంచుకోవద్దు.  మీ కుటుంబం మరియు స్నేహితులందరికీ అందించండి..🙏*_

అద్వైతం

 *🏵కాకి నేర్పే అద్వైతం🏵*


ఒకసారి భక్తుడొకరు పరమాచార్య స్వామివారిని, “మహాలయంలో మనం కాకులకు ఆహారం ఎందుకు పెడతాము? మన పూర్వీకులు కాకులుగా మారారా? అయితే ఇంతటి అల్ప పక్షిగా ఎందుకు మారారు? ఏదైనా పెద్ద స్థాయిలో ఉన్న పక్షిగా ఎందుకు మారలేదు?” అని అడిగాడు.


స్వామివారు ఒకసారి చిరునవ్వి, “తమిళంలో మనం కాకిని ‘కాకా’ అని పిలుస్తాము. ఇక ఏదైనా ప్రాణిని మనం అవి చేసే శబ్దాలతో పిలుస్తామా? పిల్లిని ‘మ్యావ్’ అని, చిలుకలు కికి అంటాయి కాబట్టి వాటిని ‘కికి’ అని పిలుస్తామా? లేదు! కాకిని దాని అరుపుతో పిలుస్తాము. అదే దాని ప్రత్యేకత.


క అంటే కాపాత్తు (కాపాడు), రక్షించు అని అర్థం. కనుక నువ్వు కాకికి ఆహారం పెట్టి ‘కా కా’ అని పిలిస్తే, కాపాడు అని పితృదేవతలని అడిగినట్టు!


విరివిగా ఉంటాయి, ఏది పడితే అది తింటాయి కాబాట్టి కాకిని నువ్వు అల్ప పక్షి అంటున్నావు. కాకి ఎంత గొప్పదో ఇప్పుడు చెబుతాను విను.


అది బ్రహ్మముహూర్తంలో లేస్తుంది. కా కా అని అరచి నిన్ను నిద్రలేపుతుంది. ఒక్కోసారి కోళ్ళు సరిగ్గా సమయానికి లేవవు. కాని కాకి సరైన సమయానికి లేస్తుంది. అది కాకా అని అరుస్తూ నీ జపానికి సరైన సమయమైన బ్రహ్మముహూర్తంలో నిన్ను నిద్రలేపుతుంది. 


అది పూజకు సరైన నిర్దేశం. అవును కదా?


అంతేకాక, దానికి ఆహరం దొరికితే ఇతర కాకులను పిలుస్తుంది. ఆహారాన్ని పంచుకుని తినండి అని మనకు తెలిపే వేరే ప్రాణుల్లో కనపడని ఒక ప్రత్యేకక లక్షణంకలిగినది.


మరలా సాయంత్రం నిద్రకు ఉపక్రమించే ముందు, మరలా కాకా అని అంటుంది. ఆరోజు జరిగిన అన్ని విషయాలకు భగవంతునికి కృతజ్ఞతగా. అలాగే, కాకులు సూర్యాస్తమయం తరువాత ఏమీ తినవు. ఇది శాస్త్రములు చెప్పిన ఉత్తమమైన విషయం కూడా.


ఇది ఎంతమంది పాటిస్తున్నారు?


కనుక నాకు తెలిసి కాకి అల్ప ప్రాణి కాదు. అది మనకు ఎంతో నేర్పుతుంది. అందుకే పితృ దేవతలు కాకి రూపంలో వస్తారు.

మరొక్క విషయం . . . కేవలం మహాలయంలోనే కాదు, ప్రతిరోజూ కాకికి ఆహారం పెట్టు.


కాకి మనకు అద్వైతాన్ని కూడా నేర్పుతుంది.


నువ్వు పెట్టిన ఆహారాన్ని చూడగానే కాకి ఎంతో సంతోషపడి ఆ ఆహారాన్ని స్వీకరిస్తుంది. అది తినడం చూడడం వల్ల నువ్వు కూడా ఆనందాన్ని పొందుతావు. కనుక ఇరువురు ఆనందంగా ఉంటారు. ఇద్దరూ భగవత్ స్వరూపులే!” అని తెలిపారు......🙏

29, ఏప్రిల్ 2021, గురువారం

శానిటైజర్స్

 🙏🕉💐🌼🏵❌✅🙏

 *శానిటైజర్స్ లభించటం లేదా? సమస్యే లేదు*

🙏🕉💐🌼🏵❌✅🙏


         డెట్టాల్, డెట్టాలు సోప్ లు దొరకడం లేదా? చింత వద్దు. సబినా సోప్/ లైఫ్ బాయ్ సోప్ ఉపయోగించండి.


      శానటైజర్స్ దొరకడం లేదా చింత వద్దు. మీరే తయారు చేసుకోండి.


           మార్కెట్లో దొరికే శానిటైజర్ చాలా ఖరీదుగా ఉంటోంది. అందులోనూ శానిటైజర్ల కోసం జనం ఎగబడటంతో స్టాకు కూడా ఉండటం లేదు. అయితే.. ఈ పరిస్థితుల్లో ఇంట్లోనే సులువుగా అతి తక్కువ ఖర్చుతో శానిటైజర్‌ తయారు చేసుకునే విధానం కోసం సామాన్యులు ఆసక్తి చూపుతున్నారు.


           ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఫార్ములా ప్రకారం రూ.20తోనే 200 మి.లీ.శానిటైజర్‌ తయారు చేసుకోవచ్చు. శానిటైజర్‌ తయారీకి వినియోగించే ద్రావణాలు  ల్యాడ్‌ కెమికల్స్‌ అమ్మే దుకాణాల్లో లభిస్తాయి. బజార్‌లో ప్లాస్టిక్‌ స్ప్రే బాటిళ్లు దొరుకుతాయి.


      ఇప్పడు శానిటైజర్ ఎలా చేసుకోవాలో చూద్దాం..


200 మిల్లీ లీటర్ల శానిటైజర్‌ తయారీకి అవసరమైనవి


ఐసోప్రొపైల్‌ ఆ్కహాల్‌ –100 మి.లీ.


హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ – టేబుల్‌ స్పూన్‌


స్వచ్ఛమైన నీరు –90 మి.లీ.


గ్లిజరిన్‌/గ్లిజరాల్‌ – టేబుల్‌ స్పూన్‌


ముందుగా 100 మి.లీ ఐసోప్రొపైల్‌ ఆ్కహాల్‌ను ఒక పాత్రలో తీసుకోవాలి. దీనికి టేబుల్‌ స్పూన్‌ చొప్పున గ్లిజరిన్‌, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ కలపాలి. దీనికి 90 మి.లీ శుద్ధమైన నీరు పోయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపితే, శానిటైజర్‌ తయారు. ఇంట్లో వాడేసిన ఖాళీ స్ప్రే బాటిల్‌ లేదా ప్లాస్టిక్‌ బాటిల్‌లో పోసి, ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రంగా కడుగడానికి శానిటైజర్‌గా వాడుకోవచ్చు.


2. లేదా వేపాకు ను తెచ్చుకొని, కొద్దిగా పసుపు పొడి కలిపి, కచ్చా పచ్చగా నలుగకొట్టి నీళ్లలో వేసి మరిగించి, వడకొట్టుకొని ఆ నీటిని వాడుకొనండి. కొంతలో కొంత మేలు జరుగుతుంది.

***************************

ఇట్లు

మీ శ్రేయోభిలాషి

యం.జి.మొదలియార్

*మనో దైర్యం

 *చావు వార్తలు ఆపండి*

*మనో దైర్యం నింపండి*


ఒక రైతు పొలం పని చేసుకొని చీకటి పడ్డంక ఇంటికి వెళ్తున్నాడు. దారిలో కాళ్ల మీద ఎదో పడ్డట్లు అనిపించింది. మసక చీకట్ల తెల్ల తెల్లగ కన్పించిన దాన్ని చూసి.. పాము అనుకొని చేతికర్రతో నాలుగైదు దెబ్బలేసి పాము సచ్చింది అనుకున్నాడు. ఇంటికి పోయి కుటుంబ సభ్యులకు విషయం చెప్పాడు. పాము కరవలేదు కానీ దానిని చంపిన అని వివరించాడు. కుటుంబ సభ్యులు దైర్యం చెప్పి పడుకోమంటే ఆ రైతు భయం భయంగనే ఆ రాత్రి నిద్రపోయాడు. ఉదయం చూస్తే చనిపోయి ఉన్నాడు.

కుటుంబ సబ్యులు ఏడ్చి ఏడ్చి.. పాము కరిచిందేమో చూద్దామని రాత్రి రైతు నడిచిన దారిలో వెతికారు. చచ్చిన పాము కనపపడలేదు. కానీ చనిపోయిన రైతు నడుముకు ఉండాల్సిన వెండి మొలతాడు వాళ్లకు దొరికింది. తన వెండి నడుము గొలుసు జారి తన కాళ్లమీద పడ్డట్టుంది. ఆ రైతు పాము అనుకొని భయంతో ఆలోచించి ఆలోచించి నిద్రలోనే చనిపోయాడు‌. భయం ఎంత చెడ్డదో ఈ కథ స్పష్టంగా చెప్పింది. 


ఇప్పుడు సేమ్ ఇదే పరిస్థితి కరోనా విషయంలోనూ జరుగుతుంది. ఈ మధ్య గాలి ద్వార కరోన వ్యాప్తి చెందుతుందని ప్రచారం చేస్తున్నరు అది నిజమో.. అబద్దమో.. తెలువదు. కానీ కరోనా గాలి ద్వారా వ్యాపిస్తే ఈ భూమి మీద మనుషులు అంతం అయినట్టే.


99% రికవరీ రేటును వదిలి కరోనాను భూతద్దంలో చూపెడితే ఎట్ల?? కరోనా చావులల్ల 90% భయం, ఇతర శరీర రుగ్మతల వల్లనే అన్నది 100% వాస్తవం.

 

*అన్ని తెలిసినోడు అమావాస్య నాడు చనిపోతే.. ఏమీ తెల్వనోడూ ఏకాశినాడు సచ్చిండంట*

కరోనా గురించి ఎక్కువ జాగ్రత్తలు తీసూకుంటూ తనకు తెలవకుండ భయానికి గురైతున్నరు చాలా మంది. కరోనా గురించి పెద్దగా అవగాహన లేనోళ్లు.. కరోనా వార్తలు అసలే పట్టించుకోనోళ్లు.. హాయిగా పని చేసుకొని ఏదైతే అదే అయితది అని మొండిగ ఉన్నోళ్లకు ఏమైతలేదు. తలలో భయాన్ని నింపితే అది గెలుకుతనే  ఉంటది.

దయచేసి కరోనా (చావు) వార్తలు పోస్ట్ చేయకండి. మనో ధైర్యాన్ని ఇచ్చే విషయాలను పోస్ట్ చేయండి.

🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏

నరేంద్ర మోడీగార మీడియాకి ఎందుకు నచ్చరో

 నరేంద్ర మోడీగారు మన మీడియాకి ఎందుకు నచ్చరో ఈ క్రింది ఆర్టికల్ చదివితే మీకే అర్థం అవుతుంది


ఇది రెండేళ్ల క్రితం రాసిన పోస్ట్...


భారత మీడియా హౌస్ లకి స్వర్ణ యుగం :2004-2014  UPA 1 & UPA 2. మౌన ముని [మన్మోహన్] ప్రధానిగా ఉన్న 10 సంవత్సరాలు అటు లెఫ్ట్ మీడియా ఇటు ఖాంగ్రెస్ బూట్లు నాకే మీడియా కి స్వర్ణ యుగం. 

మౌనముని విదేశీ పర్యటనకి వెళ్ళినప్పుడల్లా ఆయన వెంట ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు, IFS,IRS,IAS అధికారులు వెంట వెళ్ళేవారు ఇది సహజం,అవసరం కూడా. కానీ ప్రధాని పర్యటన కవరేజీ కోసం తన వెంట మీడియా ప్రతినిధులని తీసుకెళ్ళేవారు. ఒకరో ఇద్దరో కాదు తంబలు తంబలుగా వెళ్ళేవారు. ఎయిర్ ఇండియా ఒన్ విమానంలో 36 'బిజినెస్' క్లాస్ టికెట్స్ వీళ్ళకోసం కేటాయించేవారు. విమానం ఎక్కినప్పటి నుండి వీళ్ళకి రాచ మర్యాదలు జరిగేవి. ఖరీదయిన విదేశీ మద్యం సరఫరా చేసేవారు ఇన్ ఫ్లయిట్ లో. వీళ్లలో కొందరు తమకి ప్రత్యేక బ్రాండ్ కావాలని పట్టుబట్టి మరీ సెర్వ్ చేయించుకునే వారు. ఆహారం అంతా కాంటినెంటల్ స్టైల్ అడిగి మరీ వడ్డించుకునేవారు. ఇక ప్రధాని వెళ్ళిన దేశంలో వీళ్ళకి ఫైవ్ స్టార్ హోటల్ లో బస ఏర్పాటు చేసేవారు అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారులు. ప్రధాని సమావేశం చాలా క్లుప్తంగా జరిగిపోయేది. ఒకరో ఇద్దరినో ఆ సమావేశం కోసం వదిలి మిగతావాళ్ళు ఆ దేశంలో ఉన్న ఫేమస్ ప్లేసెస్ ని చూడడానికి వెళ్ళేవాళ్లు అఫ్కోర్స్ ప్రయాణం కోసం కార్లు అక్కడి రాయబార కార్యాలయం అధికారులు ఉచితంగా ఏర్పాటు చేసేవారు. ఇక సాయంకాలాలు ఆయా దేశాల్లో షాపింగ్ చేసిన తరువాత ఆ దేశ ప్రధానో,అధ్యక్షుడో మన ప్రధానికోసం విందు ఏర్పాటు తప్పనిసరి ప్రోటోకాల్. సదరు జర్నలిస్టులు విందుకు హాజరయ్యేవారు. తాగినంత,తిన్నంత ...వస్తూ వస్త్తో అక్కడ అతిధులకోసం ఉంచిన మద్యం బాటిళ్ళు తమతో పాటు హోటల్ కి పట్టుకెళ్ళేవాళ్లు. ఇక ప్రధానితో పాటు వచ్చిన అతిధులు కాబట్టి ఆతిధ్యమ్ ఇచ్చే దేశం ఉచిత కానుకలు అందరితో పాటు వీళ్ళకి కూడా. తిరిగి మన దేశంలోకి వచ్చినప్పుడు దౌత్యవేత్తలకి మాత్రమే ఉండే 'గ్రీన్ చానెల్ ' ద్వారా విమానాశ్రయం నుండి బయటికి వచ్చేవాళ్లు ...అంటే కస్టమ్స్ చెకింగ్,పన్నులు కట్టడాలు ఏమీ ఉండవు. తమతో పాటు తెచ్చుకున్న ఖరీదయిన ఎలెక్ట్రానిక్ గాడ్జెట్స్ కి టాక్స్ ఫ్రీ ఎగ్జిట్ అన్నమాట. టాక్స్ పేయర్స్ సొమ్ము వీళ్ళ పాలు.

ప్రధానితో పాటు విమానంలో ప్రయాణిచ్చేటపుడు ప్రధాని కార్యాలయ [PMO ] ముఖ్య అధికారులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడడం వాటిని ఉపయోగించుకొని పైరవీలు చేసి డబ్బు సంపాదించడం జరిగింది. అడిగిందే తడవుగా మౌనముని వీళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాబట్టి అధికారులు వీళ్ళు అడిగిన పని చేసిపెట్టేవారు.ఇక ప్రధాని ఇచ్చే విందు సమావేశాలలో వీళ్ళకి 'బ్లాక్ లేబుల్ ' తప్పని సరిగా ఉండాలి. సమావేశం ముగియగానే తలా ఓ రెండు మూడు బ్లాక్ లేబుల్ బాటిళ్ళు తమతో తీసుకెళ్ళేవారు. ఒక దశలో వీళ్ళని ప్రధాని కార్యాలయ సిబ్బంది బ్లాక్ లేబుల్ బాచ్ వస్తుంది ఈ రోజు కాబట్టి మామూలుగా కంటే ఎక్కువ కౌంటర్ల మీద పెట్టాలి అని విసుక్కునెంతగా ఉండేది వీళ్ళ ప్రవర్తన. 

వీళ్ళు చేసిన సేవలకి గాను పద్మశ్రీ,,పద్మ విభూషణ్ లు కానుకగా ఇచ్చింది UPA ప్రభుత్వం. రాజ్దీప్ సర్దేశాయ్, బర్ఖా దత్,శేఖర్ గుప్తా [పద్మ విభూషణ్ ],వినోద్ దువా , జావేద్ ఆనంద్ [ఈ పేరేంటో వింతగా లేదు ?తీస్తా సెతేల్వాద్  భర్త ],ప్రఫుల్ బిద్వాయి ,పుణ్య ప్రసూన్ బాజ్పెయీ ,విక్రమ్ చంద్రా [ఓనర్ NDTV ],ప్రాంజోయ్ గుహ తాకుర్త, రవీశ్ కుమార్ [NDTV ],అరుణ్ పూరీ , నిధి రజ్దాన్ [NDTV], కిరణ్ ధాపర్ ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది. వీళ్ళందరూ ఏం పొడిచారని ? ఖాంగ్రెస్ కుంభకోణాలని వెనకేసుకువచ్చారనా ?

డిసెంబర్ 2013 లో NDTV 25th వార్షికోత్సవం రాష్ట్రపతి భవన్ లో జరిగింది తెలుసా ? రాష్ట్రపతి భవన్ ఏమన్నా ఫంక్షన్ హాలా ? ఎవరి రికమెండేషన్ తో అనుమతి ఇచ్చారు ? ఇలాంటి అనుమతులే The Hindu,Times of India కి ఇచ్చారు. అసలు ఈ విషయం ఎవరి దృష్టికీ రాకపోయి ఉండవచ్చు. 

రాజ్దీప్ సర్దేశాయ్ బంగ్లా ఢిల్లీ ల్యూటెన్స్ లో ఉంది. ఇతర జర్నలిస్టుల బంగ్లాలు కూడా అదే VVIP ప్రాంతంలో ఉన్నాయి. నీతి,నిజాయితీ అంటూ మడి కట్టుక్కూర్చున్న జర్నలిస్టులకి అక్కడ బంగ్లా ఉంటుందా ? NDTV మనీ లాండరింగ్ కేసులో కూరుకుపోయి ఉంది. బర్ఖా దత్, వీర్ సంఘ్వి ,రోహిణీ సింగ్ [The Wire], రాడియా టేపుల కుంభకోణంలో ఉన్నారు.

The Tribune : UPA2 కి వచ్చేసరికి ఒక జోక్ ప్రచారంలో ఉండేది అదేమిటంటే  మౌనముని  తన పార్టీలో ఏమి జరుగుతున్నది,అసలు తన ప్రభుత్వం గురుంచి  తెలుసుకోవడానికి ట్రిబ్యూన్ పత్రిక చదివేవాడు. ఈ ట్రిబ్యూన్ పత్రిక పంజాబ్,హర్యానా,హిమాచల్ ప్రదేశ్, J&K రాష్ట్రాలలో ఫేమస్ కానీ పూర్తిగా ఖాంగ్రెస్ అనుకూల వార్తలు మాత్రమే ప్రచురిస్తుంది. అంటే తన ప్రభుత్వం గురుంచి తెలుసుకోవడానికి యే పత్రిక చదవాలో తెలియని పరిస్థితిలో ఉండేవాడు మౌనముని. ఈ విషయం ఇక్కడ ఎందుకు ప్రస్తావించాల్సి వస్తున్నది అంటే 2010 లో ఒక సమావేశంలో మాట్లాడుతూ కపిల్ సిబాల్  దాదాపు 150 ప్రింట్,ఎలెక్ట్రానిక్,వెబ్ మీడియా హౌసెస్ ప్రత్యక్షంగా పరోక్షంగా ఖాంగ్రెస్ కి చెందినవి ఉన్నాయి అంటూ నోరు జారాడు. తన పార్టీ గొప్పదనం గురుంచి చెప్పాలనుకొని అసలు విషయం బయటపెట్టుకొని సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు. 150 కాదు ఇంకా ఎక్కువే ఉన్నాయి కానీ కపిల్ సిబాల్ కి తెలియకపోవచ్చు. అసందర్భంగా కాంగ్రెస్ ని తిడుతూ సందర్భం వచ్చినప్పుడు కాంగ్రెస్ ని వెనకేసుకొచ్చే మీడియా కేంద్రాలు చాలానే ఉన్నాయి కాకపోతే మనం నిశితంగా పరిశీలిచలేకపోవడమే మనకి తెలియకపోవడానికి కారణం.

కొన్ని నిజాలు : 1.శోభన భర్తీయా ,కాంగ్రెస్ MP, చైర్ పర్సన్ ,హిందుస్తాన్ టైమ్స్  . 2.సోనియా సింగ్ , కాంగ్రెస్ MP -MPRPN సింగ్ భార్య ,ఎడిటోరియల్ డైరెక్టర్, NDTV.   3. రాజీవ్ శుక్లా , న్యూస్ 24 చానెల్ యజమాని , కాంగ్రెస్ MP. 4. నవీన్ జిందాల్ కాంగ్రెస్ MP మామకి 17% స్టేక్ NDTV లో ఉంది. 5. బర్ఖా దత్ ,గ్రూప్ డైరెక్టర్,NDTV, రాడియా టేపుల కేసులో నిండుతురాలు,కాంగ్రెస్ స్టూజ్ . 6. వీర్ సంఘ్వి ,అడ్వైసర్ , హిందుస్తాన్ టైమ్స్ గ్రూప్,రాడియా టేపుల కేసులో మరో నిందితుడు. ఈ లిస్ట్ చాలా పెద్దది వ్రాసుకుంటూ పోతే పెద్ద పుస్తకం అవుతుంది. 

2014: శ్రీ నరేంద్ర మోడీ నాయక్త్వంలో BJP అధికారంలోకి వచ్చింది. PMO లో పని చేసే వారు ఎవరయినా 10.30 కల్లా వాళ్ళ సీట్లలో ఉండాలి. బయో మెట్రిక్ ని స్ట్రిక్ట్ చేశారు. ప్రధాన మంత్రి సమావేశం ఉంటే I&PR ద్వారా తెలియచేస్తారు. సమావేశానికి ముందు టీ ,బిస్కిట్స్ మాత్రమే ఏర్పాటు చేస్తారు. ప్రధాని సమావేశం అయిపోగానే ఎక్కువసేపు అక్కడ ఎవరూ ఉండడానికి వీలులేదు. రాజ్దీప్ సర్దేశాయ్,బర్ఖా దత్, రవీశ్ కుమార్ లాంటి వాళ్ళు ప్రధానికి దూరంగా ఉండి వివరాలు నోట్ చేసుకోవాలి. మౌన ముని లాగా పక్కన కూర్చోపెట్టుకొని బాతాఖానీ ఉండదు.

ఇక మోడీ విదేశీ పర్యటనకి తనతో పాటు దూర్ దర్శన్ కి సంబంధించిన 6 గురు సిబ్బందిని తీసుకెళతారు. రోజుకి 18 గంటలు పనిచేసే ప్రధాని వీలున్నంత వరకు ఎయిర్ ఇండియా ఒన్ ఫ్లయిట్ లోనే నిద్రపోతారు మరీ అత్యవసరం అయితేనే వెళ్ళిన దేశంలో హోటల్ లో బస చేస్తారు. ప్రోటోకాల్ ప్రకారం విందు ఉన్నా కేవలం పళ్ల రసంతోనే సరిపెట్టేస్తారు. తిరిగి భారత్ కి రాగానే ఎయిర్ పోర్ట్ లోనే పత్రికా సమావేశం పెట్టి విలేఖరులకి తన పర్యటన విశేషాలు చెపుతారు. ఇంకా ఇన్ఫోర్మేషన్ కావాలంటే దూర్ దర్శన్ నుండి తీసుకోవచ్చు. మద్యం,మాంసం ఉండవు. కాంప్లిమెంటరీ బ్లాక్ లేబుల్ బాటిల్స్ లేవు. మౌన ముని హయాం లో PMO లో అన్నీ విభాగాల్లో స్వేచ్చగా తిరిగి అన్నీ విషయాలు తెలుసుకునే వాళ్ళు ,కీలక రక్షణ రంగ కాంట్రాక్టుల విషయంలో తల దూర్చేవాళ్లు , చివరికి అగాస్టా హెలికాప్టర్ కుంభకోణంలో కొందరి  జర్నలిస్టుల పేర్లు బయటపడ్డాయి అంటే వీళ్ళు ఎంతలా ప్రభుత్వ విషయాల్లో చొచ్చుకుపోయారో ఊహించుకోండి.కీలకమయిన రక్షణరంగ కాంట్రాక్టుల విషయంలో విదేశీ సంస్తలతో మాట్లాడి కాంట్రాక్ట్ ఇప్పించే హామీలు ఇచ్చే స్థాయికి వెళ్లారు. ఇప్పుడు ఆ అవకాశం కాదు కదా PMO ఛాయలకి వెళ్లడానికి అవకాశం లేదు. 

అన్నీ మేజర్ మీడియా హౌస్ లకి NGO ల ద్వారా విరాళాల రూపంలో  డబ్బు అందేదీ. మోడీ NGO లని లెక్కలు అడిగాడు. చెప్పము లేదా చెప్పలేము అన్న అన్నీ NGO లని మూసేశాడు. స్వదేశంలో ఆదాయం రాక,విదేశాలనుండి విరాళాలు ఆగిపోవడం చేత తమ జేబుల్లోనుండి డబ్బు ఖర్చు పెట్టాల్సి రావడం మోడీ వ్యతిరేకతకి ప్రధాన కారణం. మన్ కీ బాత్ పేరుతో మోడీ తానే నేరుగా ప్రజలతో మాట్లాడడం,అత్యవసర సమయాల్లో తానే టి‌వి ముందుకు వచ్చి నేరుగా ప్రజలకి సందేశం ఇవ్వడం తో ఈ మీడియా హౌస్ ల ప్రాధాన్యం తగ్గడం మరో కారణం. మోడీ వీళ్ళని బై పాస్ చేసేశాడు. దూర్ దర్శన్ ని ప్రజలు మళ్ళీ చూడడం ప్రారంభించారు. ఫైవ్ స్టార్ హోటళ్ళకి వెళ్ళి ఎంజాయ్ చేసి బిల్ కట్టకుండా వచ్చే అవకాశం ఇప్పుడు లేదు , వీళ్ళని ఎవరూ లెక్క చేయడం లేదు. పారిశ్రామిక వేత్తల నుండి ఇదివరకటిలాగా డబ్బు రావట్లేదు అనేకన్నా వీళ్ళని బేఖాతర్ చేస్తున్నారు. క్వింట్  జర్నలిస్ట్ సుప్రీతో  మోడీ చనిపోతే బాగుండు అని వాగాడు, మోడీ ఏమన్నా చర్య తీసుకున్నడా ? ఒక ప్రధానిని అలా అనడం పత్రికా స్వేచ్చ అన్నమాట . టైమ్స్ ఆఫ్ ఇండియా జర్నలిస్ట్ లతీఫ్ అనేవాడు మోడీకి కరోనా వైరస్ రావాలి అని బహిరంగంగా వాగాడు కానీ ఎడిటర్స్ గిల్డ్ ఎలాంటి చర్యా తీసుకోలేదు. స్థలాభావం వల్ల చాలా విషయాలు వ్రాయకుండా వదిలేస్తున్నాను. 

ఇప్పుడు చెప్పండి ! పాల్ఘార్ లో నాగా అఖాడా సాధువులని చంపితే వీళ్ళు స్పందిస్తారు అని ఎలా అనుకుంటాం ? మోడీ మీది ద్వేషం వీళ్ళు కలిసికట్టుగా ఉండడానికి కారణం. పైగా గత నెలరోజులుగా కరోనా వల్ల వచ్చిన నష్టం వల్ల చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్నీ మీడియా హౌసులు ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని స్థితి. ఉద్యోగులని తీసివేయడం,జీతాలు లేకుండా సెలవుల మీద ఉండండి అని అడిగే స్థితి. చైనా కి జలుబు చేస్తే వీళ్ళకి తుమ్ములు వస్తాయి. పాకిస్తాన్ కి కడుపు నెప్పి వస్తే వీళ్ళకి వీరేఛానలు అవుతాయి. పాపం పండింది. వీళ్ళ మీడియా కంటే వేగంగా ఫేస్బుక్ లో వార్తలు,వీడియోలు వచ్చేస్తున్నాయి. వీళ్ళు అందరూ కలిసి ఆర్నాబ్ గో స్వామిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో మరో పోస్ట్ లో చెప్పే ప్రయత్నం చేస్తాను. 

జై హింద్ !


 పార్ధసారధి పోట్లూరి గారి వాల్ నుండి సేకరణ

28, ఏప్రిల్ 2021, బుధవారం

కనువిప్పు

 *కనువిప్పు*


కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. ధుర్యొధనుడు భంగమైన వూరువులతో తన మృతువుకై ఎదురుచూస్తున్నాడు . పాండవులు ధుర్యొధనుణ్ణి ఆ తటాకంవద్దే వదిలిపెట్టి తమ తమ రధాలపై తిరుగు ప్రయాణమయ్యారు. బలరాముడు అక్కడ జరిగిన అధర్మ గధాయుద్దాన్ని ఖండిస్తూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు.


కురుక్షేత్రం మొత్తం రక్తంతో తడిసిపోయినట్లుందక్కడ. కనుచూపుమేరలో అన్నీ శవాలే కనిపిస్తున్నాయి. ఎన్నో అక్షౌహిణీల సైన్యం, అశ్వాలు, రధాలు, గజములు.. అంతా విగతమై పడివున్నాయి. ఆ రోజే మరణించిన శకుని శల్యాదుల శవాలను తీసుకెళ్ళేవారులేక అనాధల్లా పడున్నాయి. అవన్నీ చూస్తుంటే అర్జునుడి మనసు విజయోత్సాహంతో వుప్పొంగుతోంది. అప్రయత్నంగా తన మీసాలమీద చెయ్యివేసి -


"బావా చూసావా.. కౌరవులు ఎలా నశించారో..?" అన్నాడు. శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వాడు.


అర్జునుడు తన గాండివాన్ని ఒక్కసారి తడుముకున్నాడు. ఒక్కసారి భీష్మ, ద్రోణ, కర్ణాది శత్రువులంతా ఎలా తన అస్త్రాలకి బలైంది కళ్ళముందు కనపడినది. తను జయించాడు...కర్ణ వధానంతరం ఇక తనని ఎదిరించగలిగిన విలుకాడే ఈ భూమి మీదే లేడు..!!


అన్నిరధాలు రణరంగం మధ్యలో వున్న భీష్ముడి అంపశయ్య దగ్గరకు చేరాయి. ధర్మరాజు ఒక్క వుదుటన రధం కిందకు దూకి - "పితామహా.. పితామహా.. మేము జయించాం... కౌరవులందరూ నిహతులైనారు.." అన్నాడు.


భీష్ముడు దుఖ్ఖం పొంగుతుండగా కళ్ళు మూసుకున్నాడు.


"అయితే నాయనా నూర్గురు సోదరులని చంపినట్టేనా.." అన్నాడు. భీమసేనుడు వెంటనే అందుకున్నాడు -


"అవును పితామహా... సుయోధనుడి వూరువులను ఇప్పుడె భంగపరిచాను... గదా యుద్ధంలో తనకు ఎదురు లేదనుకున్న సుయోధనుడు నా చేతిలో హతుడైనాడు. నా ప్రతిజ్ఞలు నేరవేర్చుకున్నాను.. ఇక రాజ్య లక్ష్మి మా వశమైంది.."


"కురురాజ్యం అయితే ఇప్పుడు పాండవరాజ్యం అయ్యిందన్నమాట"


"అవును పితామహా.. ఇప్పుడు పాండవుల పరాక్రమాలు ప్రపంచానికి విదితమయ్యాయి.." నకులుడన్నాడు.


"నాడు కురురాజ్యసభలో చేసిన ప్రతిజ్ఞలు అన్నలు నెరవేర్చారు పితామహా.." సహదేవుడాన్నాడు.


భీష్ముడు నలుదిక్కులా కలయజూశాడు. "అర్జునా..." పిలిచాడాయన నెమ్మదిగా.


"చెప్పండి పితామహా.."


"నీవేమి చెప్పవేం..??"


"చెప్పేదేముంది పితామహా... నేను గెలిచాను.. మిమ్మల్ని పడగొట్టాను, కర్ణుణ్ణి వధించాను, ద్రోణుణ్ణి కూలగొట్టాను... ఇక రాజులమై అఖండ కురు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాము.."👍


"మంచిది నాయనా.. అవును వాసుదేవుడేడి..?" ఆ మాట వింటూనే శ్రీకృష్ణుడు ముందుకు వచ్చి శాంతనునికి నమస్కరించాడు.


"పరంధామా.. నాకెందుకయ్యా నమస్కరిస్తావు.. ధర్మ పక్షాన నిలిచావు, ఆయుధంపట్టకుండా యుద్ధాన్ని నడిపావు. ఈ గెలుపంతా నీదే ముకుందా... నీకే మేమంతా నమస్కరించాలి."


ఆ మాటలువింటూనే అర్జునిడికి కోపం వచ్చింది. ఇదేమిటి పితామహుడు ఇలా అంటున్నాడు.


"యుద్ధం చేసిందంతా నేను.. నా ధనుర్విద్యతో ఎంతమంది సైనికులు మట్టిగరిచారు. ఎంతటి మహావీరులు నేలకొరిగారు. శ్రీకృష్ణుణ్ణి పొగిడితే పొగిడాడు నా గురించి ఒక్క మాటైనా అన్నాడా తాత." అనుకున్నాడు.


అంతా భీష్ముడికి నమస్కరించి తమ గుడారాల వద్దకు చేరారు. అందరు తమ తమ రధాలు దిగారు. శ్రీకృష్ణుడు మాత్రం తన పార్ధసారధి స్థానం నుంచి దిగకుండా అర్జునుణ్ణి దిగమని సైగ చేసాడు. అర్జునుడు దిగగానే వాసుదేవుడు ఒకసారి రధం పైన వున్న ధ్వజం వైపు చూసాడు. జండా పై వున్న కపిరాజు హనుమంతుడు ఒక్కసారిగా దూకి రధమ్ముందు నమస్కరిస్తూ నిలబడ్డాడు.


"శ్రీరామచంద్రా... వాసుదేవా.. నాకెంతటి భాగ్యాన్ని ప్రసాదించావయ్యా... పార్ధుడి రధంపై ధ్వజమై నిలిపి నీ నోటివెంటవచ్చే భగవద్గీత విని నీ విశ్వరూప సదర్శనం చేసుకునే అదృష్టాన్ని ఇచ్చావు. నీకు నా భక్తి పూర్వక ప్రణామాలు దేవదేవా.." అంటూ ప్రణమిల్లాడు హనుమంతుడు.


శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూనే అర్జునుడి రధంపైనుండి దిగాడు. నెమ్మదిగా కొంతముందుకి వచ్చి రధంవైపు చూసి తన పిల్లనగ్రోవినెత్తి సైగచేసాడు.


అంతే... ఫెళ ఫెళ మంటూ రధం కుప్పకూలిపోయింది... రధ చక్రాలు తునాతునకలైయ్యాయి. రధాశ్వాలు భీకరమైన అరుపు అరుస్తూ నేలకొరిగాయి. అందరూ భయకంపీతులై చూస్తుండగానే రధం అశ్వాలతోసహా భస్మమైపోయింది. ఆ భయానకమైన చప్పుడు విని ధర్మరాజు "అర్జునా అర్జునా" అంటూ పరుగున వచ్చాడు.


అర్జునుడు భయపడుతూ "బావా వాసుదేవా.. " అంటూ కృష్ణుడి వద్దకు చేరాడు. "నీకేమికాలేదు కదా బావా.. ఏమిటిలా జరిగింది.." అన్నాడు ఖంగారుగా.


ఆ మాటలువింటునే కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. పక్కనే వున్న హనుమంతుడు గట్టిగా నవ్వాడు.


"ఆంజనేయా.. నా ఖంగారు నీకు పరిహాసంగా తోస్తున్నదా.." అన్నాడు అర్జునుడు. హనుమంతుడు మరింత గట్టిగా నవ్వి అన్నాడు -


"పార్థా.. నవ్వక ఏమి చెయ్యమంటావు. నిన్ను కాపాడిన పరమాత్ముణ్ణి నీవు పరామర్శిస్తుంటే నాకు నవ్వొచ్చింది."


"నన్ను కాపాడాడా..?"


"అవును అర్జునా... ఈ రధం ఇప్పుడుకూలిపోలేదు... భీష్మ బాణ ధాటికి నీ రధ చక్రాలు కూలాయి... కర్ణ అస్తాలకి నీ అశ్వాలు ఎప్పుడో మరణిచాయి.. నీ గురువు ద్రోణుడు ఆగ్రహజ్వాలల్లో నీ రధం ఎప్పుడో తునాతునకలయ్యింది... బ్రహ్మాస్త్ర ధాటికి నీ రధం యావత్తూ బూడిదయ్యింది..."


"మరి..?"


"నీ

రధంపైన సాక్షాత్తు ఆదివిష్ణువున్నాడు... ఆ పర్మాత్ముడి ఆజ్ఞలేక అన్నీ అలాగే నిలిచివున్నాయి. ఇప్పుడు వాసుదేవుడు అవరోహించడంతో ఆ అస్త్రాలు పనిచేసాయి. నీ రధం ముక్కలైంది. నువ్వు గెలిచాను గెలిచాను అని అనుకుంటున్న మహావీరుల అస్త్రాలు నీ పైన పనిచెయ్యలేదంటే దానికి కారణం తెలుసా.. అవి నిన్ను చేరాలంటే నీ కన్నా ముందు ఆసీనుడైన ఆ పరంధాముణ్ణి దాటి రావాలి కాబట్టి.."


హనుమంతుడు ఈ మాటలనగానే పాండవులకు తమ అజ్ఞానం బోధపడింది. పితామహుడు భీష్ముడు విజయాన్ని శ్రీకృష్ణుడి ఎందు ఎందుకు ఆపాదించాడో అర్థం అయ్యింది. అయిదుగురూ ఒక్కసారిగా శ్రీకృష్ణుడి పాదాలపై పడ్డారు.


"పరమాత్మా.. మా అజ్ఞానాన్ని మన్నించు తండ్రి.." అన్నాడు అర్జునుడు మనస్ఫూర్తిగా.

శ్రీకృష్ణుడు మళ్ళి మనోహరంగా చిరునవ్వు నవ్వాడు.


              💥 సర్వేజనా సుఖినోభవంతు💥

రత్నధారణ

 సిద్ధ నాగార్జునుడు చెప్పిన రత్నధారణ రహస్యాలు  -


  *  వజ్రము  - 


            దీనిని ధరించడం వలన ఐశ్వర్యం వృద్ది చెందును. ఎల్లప్పుడు నూతన వికాసము కలుగును. విడిపోయిన దంపతులను కలుపును. వజ్రమాల ధరించినచో సుఖప్రసవం అగును. కలరా , ప్లేగు వ్యాధుల నుండి రక్షింపబడును . 


 *  వైడుర్యం  - 


            దీనిని ధరించినచో ఎల్లప్పుడు ఉత్సాహంగా ఉండును. శత్రుభయం తొలగిపోతుంది. భూత , పిశాచ భాదలు నివృత్తి అవుతాయి. ఆపదలు , అపాయాలు పోగాట్టబడతాయి . దీనిని స్త్రీలు ధరిస్తే సుఖప్రసవం జరుగుతుంది. 


 *  గోమేధికం  - 


           దీనిని ధరించడం వలన నష్టమైన ధనం మళ్లి లభిస్తుంది. అమితమైన ఉద్రేకానికి ఉపశమనం కలుగుతుంది. ఇతరులను సమ్మోహితులను చేస్తుంది . ఆకర్షిస్తుంది.


 *  పుష్యరాగం  - 


           దీనిని ధరించడం వలన వంశము వృద్ది చెందును. భోగబాగ్యాలు కూడా బాగా సమకూరును. 


 *  మరకతం  - 


          దీనిని ధరించడం వలన జ్ఞాపకశక్తి , బుద్ధిబలం పెరుగును . పిచ్చి , ఉన్మాదం , విషదోషం  దృష్టిదోషం నివారించ బడతాయి.


 *  మాణిక్యం  - 


         దీనిని ధరించడం వలన ఆయువు వృద్ది అవుతుంది. ధనధాన్యాలు సిద్దించి లోకంలో ఉన్నత స్థితి కలుగుతుంది. మనసులోని అందోళన , విచారము , చికాకు తొలగిపోతాయి. అంటువ్యాధులు తొలగిపోతాయి. అంటువ్యాదులు రాకుండా నివారించబడును .


 *  నీలము  - 


              దీనిని ధరించడం వలన అర్ధాంతర మృత్యువు తొలగిపోతుంది. అంతులెని కీర్తి , ధనము , అదృష్టం కలుగుతాయి . శనిగ్రహం వలన కలిగే బాధలు తొలగిపోతాయి. సోకకుండా ఉంటాయి. 


 *  పగడము  - 


           దీనిని ధరించడం వలన శత్రువుల మీద విజయం కలుగుతుంది. పట్టరాని ఆవేశం , ఉద్రేకం శాంతిస్తాయి. అప్పులబాధ నుండి బయటపడతారు 


 *  ముత్యము  -  


             దీనిని ధరించడం వలన పనులు లలొ ఆటంకాలు తొలగిపోయి  సకాలంలో జరుగుతాయి. శరీరంలో అతి ఉష్ణం అనిగిపోతుంది . ధనలాభం కలుగుతుంది . వివాహం కానివారికి వివాహం అవుతుంది. 


   


          మరింత సమగ్ర సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


  గమనిక  -


                  నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

  

*శ్రీ స్వామివారి కోరిక...*


*(పదకొండవ రోజు)*


శ్రీధరరావు గారితో కేశవులు గారికి పరిచయం ఏర్పడ్డాక..శ్రీ స్వామివారి గురించి ఇద్దరూతరచూ ముచ్చటించుకునే వారు..కాలం గడచిపోతోంది..

శ్రీ స్వామివారి గురించిన ప్రాథమిక సమాచారం విన్న ప్రభావతి గారి మనసులో ఏమూలో వున్న చిన్నపాటి సందేహాలు కూడా తీరిపోయాయి..ఒక నిజమైన సాధకుడికి సేవ చేసుకునే భాగ్యం తమ దంపతులకు కలిగిందని ఎంతో ఆనందపడ్డారు..నిజానికి శ్రీధరరావు గారు మొదటినుంచీ శ్రీ స్వామివారు సాధారణ మానవ మాత్రుడు కాదని..ఒకానొక సిద్ధపురుషుడు ఈ రూపంలో తమ దగ్గరకు వచ్చాడని భావిస్తూ వున్నారు..అదే నిజమయ్యింది..శ్రీ స్వామివారి పరిచయం తరువాత ఆ దంపతుల జీవన శైలిలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి..


శ్రీధరరావు, ప్రభావతి దంపతులు యధావిధిగా ప్రతి శనివారం మాలకొండకు వెళ్లి వస్తున్నారు..మాలకొండ వెళ్లిన ప్రతిసారీ శ్రీ స్వామివారిని కలిసిరావడం వారి పర్యటనలో ఒక భాగం అయిపోయింది..శ్రీ స్వామివారు కూడా ఈ దంపతులు వచ్చేసమయానికి కొద్దిగా అటూ ఇటుగా..పార్వతీదేవి మఠానికి చేరుకునేవారు..ఒక్కొక్కసారి ఆయన తపస్సాధన లో మునిగిపోయివుంటే..శ్రీధరరావు గారు ప్రభావతి గారు కొద్దిసేపు ఎదురుచూసి..తిరిగి తమ గ్రామానికి చేరుకునేవారు..


అలా ఒక శనివారం సాయంత్రం నాలుగు, ఐదు గంటల ప్రాంతంలో..శ్రీ స్వామివారిని కలుద్దామని ఈ దంపతులిద్దరూ పార్వతీదేవి మఠం వద్ద వేచి ఉన్నారు..కొద్దిసేపటికే శ్రీ స్వామివారు శివాలయం వద్దనుంచి మెల్లిగా దిగివచ్చి..పార్వతీదేవికి సాష్టాంగ నమస్కారం చేసుకుని..వీరిద్దరి ఎదురుగ్గా పద్మాసనం వేసుకుని కూర్చున్నారు..ఆయన ముఖం ఎంతో ప్రశాంతంగా ఉంది..చల్లటి చిరునవ్వు..ఆప్యాయత ఉట్టిపడే చూపు..ఉదయం నుంచీ మాలకొండ లక్ష్మీ నృసింహుడి దర్శనం.. ఆ తరువాత కొండ శిఖరం పై ఉన్న లక్ష్మీ అమ్మవారి ఆలయం..ఇవన్నీ ఎక్కి దిగి..మళ్లీ పార్వతీదేవి మఠం దాకా మెట్ల మార్గంలో వచ్చిన బడలిక అంతా..శ్రీ స్వామి వారి ప్రసన్న వదనం చూడగానే మటుమాయం అయింది..


"ధ్యానం లో ఉండగా బ్రాహ్మణ దంపతులిద్దరూ వచ్చారని ఆదేశం వచ్చిందమ్మా..వెంటనే లేచి ఇలా వచ్చేసాను..శ్రీధరరావు గారూ మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి..అమ్మవారి ఆజ్ఞ కూడా అయింది..చెప్పమంటారా?.." అన్నారు శ్రీ స్వామివారు..


శ్రీధరరావు ప్రభావతి గార్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని.."చెప్పండి.." అన్నారు..


"ఈ మాల్యాద్రి లక్ష్మీ నృసింహుడి కొండమీద..ఈ శివ పార్వతుల సమక్షం లో నా తపస్సాధన పూర్తి అయింది..త్వరలో నేను ఆశ్రమం నిర్మించుకొని...అందులో కొరవ సాధన చేసి..మోక్ష ప్రాప్తిని పొందాలి..ఆశ్రమ నిర్మాణం కొరకు నాకు స్థలం కావా!ఈ..అది మీరు ఏర్పాటు చేయాలి.." అన్నారు గంభీరంగా..


శ్రీధరరావు ప్రభావతి గార్లు ఇద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు..వాళ్ళిద్దరి హృదయాలలో శ్రీ స్వామివారి కోరిక కలవరం కలిగించింది..మళ్లీ ఇద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు..ప్రభావతి గారు ఏదో అడుగబోయేంతలో శ్రీధరరావు గారు కల్పించుకుని.."మీరు త్వరపడకండి స్వామీ..మేము ఇంటికెళ్లి ఆలోచించుకుని మళ్లీ మిమ్మల్ని కలుస్తాము..సావకాశంగా ఈ విషయం గురించి మాట్లాడుకుందాము..మనం కూర్చుని కూలంకషంగా చర్చించుకుని ఆపై ఒక నిర్ణయానికి వద్దాము.." అన్నారు..


శ్రీధరరావు గారు ఎంతో సంయమనంతో చెప్పిన మాటలు విన్న స్వామివారు.."మీరూ ఆలోచించండి..కానీ ఈ క్షేత్రం లో నా సాధన పూర్తి కావొచ్చింది..ఇక ఇక్కడ ఎక్కువ కాలం వుండే పరిస్థితి లేదు..మీరు చెప్పినట్లే మళ్లీ త్వరలో..( త్వరలో అన్నమాట శ్రీ స్వామివారు నొక్కి చెప్పారు..) ఈ సంకల్పం నెరవేరుతుంది..ఇప్పటికే పొద్దు కూకుతోంది..మీరు మళ్లీ మొగలిచెర్ల వెళ్ళాలి..ఇక బైలుదేరండి.." అన్నారు..


శ్రీధరరావు ప్రభావతి గార్లు శ్రీ స్వామి వారికి నమస్కారం చేసి, పార్వతీదేవి మఠం వద్దనుండి మెట్లు దిగి, తమ గూడు బండిలో కూర్చుని మొగలిచెర్లకు పయనం అయ్యారు..


అప్పటిదాకా ఓపిక పట్టివున్న ప్రభావతి గారు..ఇక ఆగలేక పోయారు.."శ్రీవారూ..ఇదేమిటి?..ఈయన ఈ కోరిక కోరాడు?..పాపం కేశవులు గారు ఎంతో ఆశపెట్టుకుని ఆశ్రమం కొరకు  ఇస్తానన్న భూమి వద్దన్నారు..మనలను మాత్రం తానే అడిగారు..ఈ క్షేత్రం లో చేసే సాధన కన్నా..జన బాహుళ్యం లోకి వచ్చి, ఆశ్రమం కట్టుకొని చేసే సాధన ఏ విధంగా సాగుతుంది..సాధారణ మనుషుల మధ్యకు వస్తే..ఇతరత్రా కోరికలు పట్టవా?..మామూలు ప్రలోభాలకు లొంగిపోరా?.." అని అడిగారు..శ్రీధరరావు గారు మాత్రం నిశ్చింతగా.."నువ్వు ఇలా ఆవేశంగా మాట్లాడతావనే..నేను ముందుగా గ్రహించి..నేనే స్వామివారితో మళ్లీ చర్చిద్దామని చెప్పాను ప్రభావతీ..కాలం మన జీవితాలను ఏ మలుపు తిప్పుతుందో తెలీదు..అన్నీ పరిశీలిద్దాము..చూద్దాం..ఏం జరుగుతుందో.." అన్నారు..ఈ జవాబుతో ప్రభావతి గారు సంతృప్తి చెందలేదు..ఆవిడ మనసులో రకరకాల ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి..


శ్రీ స్వామివారి వివరణ... రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్: 94402 66380 & 99089 73699).

27, ఏప్రిల్ 2021, మంగళవారం

Pillala kathalu

 https://youtu.be/pwxtAISOzYM

మార్గమయ్యె

 పనికిమాలినదన్న బ్రాహ్మణాచారమే

మానవాళికి నేడు ‌మకుటమయ్యె

చాదస్తమనియన్న సంప్రదాయమిపుడు

మరణమ్ము తప్పించు మార్గమయ్యె

తగులబెట్టెదమన్న తత్వంబు ధర్మంబు

విశ్వమునకె ప్రాణభిక్షయయ్యె

దూరమ్ము దూరమ్ము దూరముండుడటన్న

మాటయే అపమృత్యుమంత్రమయ్యె

సకలదేశవిధానాలు వికలమయ్యె

భారతదేశసంస్కృతిప్రభల్ ప్రకటమయ్యె

ఇలకు మా జ్ఞానమే రక్ష కాగలదటంచు

గర్వముగ చాటెదను నేను శార్వరీశ!

     జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు

కాంతమ్మత్త

 ఆవకాయ పచ్చడి ఏంట్రా, మీ సంకర భాషని పాతెయ్య. వాస్తవానికి పచ్చళ్ళు అంటే ఏమిటో, తొక్కు అంటే ఏమిటో, ఊరగాయ అంటే ఏమిటో తెలియకుండా ఏం బ్రతుకుతున్నారు, దిక్కుమాలిన గోలా? ఉప్పు, కారం, నూనె కలిపి ఊరేస్తే ఊరగాయ అనాలి. ఆవకాయ, మాగాయా మెంతికాయా వంటివి దంచి చేసిన దాన్ని తొక్కు అంటారు చింతకాయ వంటివి. తరిగి, వాడ్చి, లేదా నాన పెట్టి రుబ్బి చేసేవి పచ్చళ్ళు కొబ్బరి పచ్చడి, గోంగూర పచ్చడి, కొత్తిమీర పచ్చడి, కంది పచ్చడి ఇటువంటివి. 


అంతే గానీ ప్రతీదీ పచ్చడి అనకూడదు. మీ మొహాలు సంతకెళ్ళ. తిని ఏడవడం రాకపోతే పోయింది నిజానికి దేన్ని ఏమి అంటారో కూడా తెలిసి చావక పోతే ఎలాగఱ్ఱా. ఇంతకీ క్రొత్త ఆవకాయలో మీగడ తరక నంజుకు తింటున్నారా ఒక దినము మజ్జిగ పులుసు పెట్టుకుని మాగాయా టెంక నంజుకు తిని ఏడవండి. మహా రంజుగా ఉంటుంది. వెధవ సోకులకు పోకుండా పెద్దరసాల పండు పెరుగులో వేసుకు జుఱ్ఱుకు తినండి. ఏ కాలం పండు ఆ కాలంలో తినాలి. దినామూ మూడు పూటలా మజ్జిగ త్రాగి అఘోరించండి, వేడి చేసి ఏడవకుండా ఉంటుంది. బోధ పడిందా ఢింబకుల్లారా !!!


మీ భాష తగలడ..పులుసుని సాంబారు అంటారా ! చారుని రసం అనీ, అన్నంని రైసు అనీ, పచ్చడిని చట్నీ అనీ, త్రాగే నీటిని వాటర్ అంటావురా!! దద్దమ్మా ! స్వఛ్ఛంగా తెలుగు మాట్లాడి ఏడవండి.

     

                        ఇట్లు

             మీ కాంతమ్మత్త


#లచ్చి కథ.


               🌷🌷🌷

#లచ్చి 


"మామ్మా! ఇవాళ మా స్కూల్లో ఓ గమ్మత్తు జరిగింది" ఎనిమిది సంవత్సరాల సిద్దూ అన్నాడు. 


"ఏంటి కన్నా" మనవడి బుగ్గలు పుణికి అడిగింది సావిత్రమ్మ. 


రోజూ పడుకునే ముందు నాయనమ్మ చేత కథ చెప్పించుకుని గాని నిద్రపోడు 'సిద్దూ' అని ఇంట్లో అందరూ ముద్దుగా పిలుచుకునే సిద్దార్థ. 


"మామ్మా! లచ్చి తెలుసుకదా నీకు...దాన్ని నాక్లాస్మేట్ రంగడుతో పెళ్లి చేస్తానంటే పారిపోయి స్కూలుకొచ్చేసింది. వాళ్ళ నాన్న, అమ్మతో పాటు...రంగడు అమ్మా నాన్న కూడ వచ్చి దాన్ని లాక్కు పోతూంటే శారదా టీచర్ పట్టుకుని ఆపారు.


" ఏదీ మల్లిగాడి కూతురు లచ్చినా?!"అడిగింది ఆవిడ. 


అవునన్నట్లు తలూపేడు. 


"మరి వాడు ఊరుకున్నాడా?"  


"లేదు మామ్మా! ఇదిగో టీచరమ్మా నువ్విలా అడ్డొస్తే మరేదగుండదు" అని రంగడు నాన్న అన్నాడు. 


అప్పుడు "సరే మా అన్నయ్య పోలీసాఫీసరు ఫోన్ చేసి రప్పిస్తా" అని టీచర్ అంటోన్నా వినకుండా లాక్కెళ్ళి పోయారు" సిద్ధూ చెప్పింది విని. 


"అయ్యో బొడ్డూడని పిల్ల...దానికి పెళ్ళేమిటి...ఈ రోజుల్లో కూడా..." అనుకుంది. మనవడు కథ విని నిద్రపోయాక ఆవిడ ఈవిషయమే ఆలోచిస్తూ గతంలో కెళ్ళి పోయింది.  


***********


"ఈ సంవత్సరం సావిత్రి పెళ్లిచేసేద్దామను కుంటున్నాను" పరాంకుశం తన స్నేహితుడు తాతారావుతో అన్నాడు. 


"చక్కగా చదువుకుంటూన్న పిల్లకి పెళ్లికి తొందరేమొచ్చింది?" అని తాతారావు అంటే 


"ఇప్పటికే లేటుచేశానని మాఅమ్మ మొత్తుకుంటోంది.

ఆడపిల్లకు ఎనిమిది సంవత్సరాలు నిండకుండా చేయాలి. పిల్లకప్పుడే పన్నెండేళ్ళు నిండుతున్నాయని గొడవ చేస్తోందిరా! తప్పేటట్టులేదు" అన్నాడు. 


బయట అరుగుమీద మాట్లాడుకుంటున్న వారి సంభాషణ వింటున్న సావిత్రి భయంగా తల్లి వీరవేణి వంక చూసింది. 


"అమ్మా... నా కప్పుడే పెళ్ళేమిటమ్మా" కూతురు అడిగిన ప్రశ్నకు సమాధానమివ్వలేని నిస్సహాయస్థితి ఆమెది. 


 ఇంకా ఇప్పటికీ తన తోటి పిల్లలతో బొమ్మల పెళ్ళిళ్ళు చేసి ఆడుకుంటూన్న అమ్మాయికి పెళ్లి చేయడం తనకు కూడ ఇష్టంలేదని చెప్పలేని దయనీయస్థితిలో ఉంది. 


పెళ్ళయి ఏడాది తిరక్కుండానే మూడునెలల గర్భంతో  తలచెడి పుట్టింటికి చేరిన వీరవేణి...వారి ఆరుగురు సంతానంలో ఆఖరిది. 


అందరికంటే పెద్దవాడయిన అన్నయ్య పరాంకుశం ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్ళే నలుగురు అక్కలకు జరిగే మర్యాద వితంతువైన తనకు దక్కదని తొందరలోనే అర్ధమయింది ఆమెకు. 


'అన్న ఇంట్లోనే ఉంటున్న తల్లిదండ్రులవద్ద కాక మరెక్కడ ఉండగలను...తన తలరాత ఇంతే' అనుకుని ఇంట్లో వదినగారికి అణగిమణగి ఉంటూ రోజులు నెట్టుకొస్తూంది. 


తనకు కలిగిన ఆడపిల్ల సావిత్రిలో భర్తను చూసుకుని దుఃఖాన్ని మరచి జీవితం సాగిస్తోంది. 


మరునాడు "అన్నయ్యా! సావిత్రి పెళ్ళికి తొందరేముంది?! మంచి మార్కులు వస్తున్నాయి. పోగ్రెస్ కార్డు మీద సంతకం చేసే నీకు నేను చెప్పనక్కరలేదు. స్కూల్ ఫైనల్ అయాక చేస్తే బాగుంటుందని..." వాక్యం పూర్తి చేయకుండా అన్నగారి ముఖంలోకి చూసింది. 


అతను సమాధాన మివ్వక పోయేసరికి కళ్ళల్లో 

తిరుగుతున్న నీళ్లను అతనికి కనపడనీయకుండా తలదించుకుని చెంగుతో కళ్ళు వత్తుకుంటూ వెనుదిరిగింది. 


సంబంధం చూసి ముహూర్తం కుదిరి పెళ్లిచేసి పంపడానికి సంవత్సరకాలం పట్టింది. ఎయిత్ పరీక్షలు వ్రాసి క్లాస్ ఫస్ట్ వచ్చిన సావిత్రి అయిదు వరకు చదివి అనంతరం పౌరోహిత్యం చేస్తున్న రామ్మూర్తికి ఇల్లాలయి అతని చిటికిన వేలు పట్టుకుని గృహిణిగా ఉమ్మడి కుటుంబంలోకి అడుగు పెట్టింది. 


సహజంగా బుద్ధిమంతురాలు...తల్లి ఒద్దికలో మేనమామ ఇంట పెరిగిన పిల్లేమొ ఎవరిని పన్నెత్తుమాట అనకుండా అనిపించుకోకుండా మసలేది. 


రామ్మూర్తికి ఐదుగురు అన్నలు ఇద్దరు అక్కలు ఒకచెల్లెలు వెరసి తొమ్మండుగురు వాళ్లు. అక్కచెల్లెళ్ళు ముగ్గురూ  పెళ్ళిళ్ళయినవాళ్ళే. ఐదుగురు అన్నల్లో పెద్దవాళ్ళిద్దరూ వ్యవసాయం చేస్తూంటే మూడోఅతను ఆ ఊరి దేవాలయంలో అర్చకుడుగా ఉన్నాడు. 


మిగిలిన ఇద్దరు రామ్మూర్తిలానే పురోహితులు. 


భర్త యొక్క పెద్దక్క ఇద్దరు కూతుళ్లు, చిన్నక్క కొడుకైన సూర్యం... సావిత్రి కన్న ఒకటిరెండు ఏళ్ళు పెద్దవాళ్ళే. 

వాళ్ళు రామ్మూర్తిని అందరిలాగే 'రామం' అనే పిలిచేవారు. 

సావిత్రిని మాత్రం ఆమెను ఏదైనా అడగాలన్నా, చెప్పవలసి వచ్చినా... మాటకు ముందు 'అత్తా' అని పిలిచి మరీ అడగడం చెప్పడం చేసేవారు. 


మగపిల్లవాడు పోనీ పేరుపెట్టి పిలిస్తే బాగోకపోవచ్చు కాని ఆడపిల్లలు 'సావిత్రి' అని పిలవచ్చుగా...! అని పెళ్ళయిన కొత్తలో అనుకునేది. 


ఇరుగుపొరుగు వారు కూడ...తన ఈడువారు తనకంటే పెద్దవాళ్ళు కూడ అలాగే పిలిచేవారు. మొదట్లో మనసు చివుక్కు మన్నా తర్వాత అలవాటయిపోయింది. 


రామ్మూర్తి చుట్టుపక్కల నాలుగయిదు గ్రామాలకు తానే పౌరోహిత్యం చేసేవాడు. సంపాదన బాగానే ఉండేది. అన్నదమ్ములు ఐకమత్యంతో మెలగడమే కాదు 

తోడికోడళ్ళు కూడ ఆ విధంగానే ఉంటూ ఏదైనా 

చిన్నచిన్న తగాదాలు వచ్చినా వెంటనే సర్దుకు పోయేవారు. 


సావిత్రికి ముందుగా ఒకమ్మాయి పుట్టింది. ఆతర్వాత 

పది సంవత్సరాలకు పుట్టినవాడే ఈ 'సిద్ధూ' తండ్రి.


సావిత్రికి ఏదైనా అసంతృప్తి అనేది ఉందీ అంటె అది కేవలం తన తల్లిని తమ ఇంట్లో ఉంచుకుని చూసుకోలేక పోయాననే బాధతో కూడిన ఆలోచనే. 


భర్త పోయి వేరేదిక్కులేక మేనమామ ఇంట్లో తన తల్లి పడే అవస్థ చూసి అనుకునేది... బాగా చదివి ఉద్యోగం చేసి అమ్మను తన వద్ద ఉంచుకోవాలని. అలా ఇష్ట పడిన అబ్బాయినే వివాహమాడాలని. 


అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే అది జీవితం కాదేమో!!


రామ్మూర్తిని అడిగితే కాదనడని తెలుసు ఆమెకు.  


ఉమ్మడికుటుంబంలో అమ్మకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో నన్న భయంతో కొంత... అమ్మకూడ రావడానికి ఒప్పకోదేమో నన్న శంకతో కొంత... నోరువిప్పి అడగలేకపోయింది. 


పిల్లలు పెద్దయి వాళ్ళ చదువుల కోసమయితేనేమి

ప్రైవసీ కోసమైతేనేమి ఎవరికివారు వేరే వేరే ఊళ్ళు వెళ్లి విడి సంసారాలు ఏర్పడేవేళకు తల్లి కాలం చేసింది. ఈవిధంగా ఆమె కోరిక తీరలేదు. 


ఆలోచిస్తోన్న సావిత్రి నాలుగు సంవత్సరాల క్రితం గతించిన భర్తను తలచుకొని చిన్నగా నిట్టూర్పు విడిచి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది.


********


మర్నాడు సావిత్రమ్మ 'మల్లిగా' అని పిలిచే మల్లేశ్వర్రావుకు కబురంపి వచ్చాక మందలిస్తూంటే 


"ఆగిపోయిందమ్మా పెళ్ళి ఆ శారదమ్మ దయవల్ల" అన్నాడు. 


"ఆగిపోయిందా... హమ్మయ్య... అదిసరే దానికప్పుడే పెళ్లి చేద్దామని ఎందుకనుకున్నావురా!" అన్న ఆవిడతో  


"ఏం చేయనమ్మా ఆగణేష్ కాడ అప్పుతీసుకుని రెండేళ్ళవుతోంది. ఇంకొన్ని రోజులాగు తీర్సేత్తాను అంటోన్న ఇనకుండా పిల్లని నా కొడిక్కిచ్చి పెళ్ళయిన చేయి కాకుంటే వెంటనే బాకీయైన తీర్చేయ్ అంటూ ఒకటే గోలమ్మా" అన్నాడు.  


"పెళ్ళికి బాకీకి లింకేమిట్రా" విస్తుబోయిందావిడ. 


"పిల్లదాని తల్లి పోయిందని తెలుసు కదమ్మా మీకు. దాని పేరనున్న అరెకరం లచ్చికేగా ఎల్తది. ఇప్పుడు కాకపోయినా కాపరానికి పంపేటప్పుడు ఎలానూ ఇచ్చేత్తమని ఆడాస."


"అయితే మాత్రం ఊరి పెద్దలముందు పెట్టి తేల్చుకోవాలి అంతేకాని తల్లిలేని ఆ పసిదాని గొంతు కోద్దామనుకోవడం తప్పనిపించలేదట్రా! ఇప్పుడు శారద ఆపింది కాబట్టి సరిపోయింది. మళ్లీ ఈ అఘాయిత్యానికి పూనుకోరనేముంది! ఒరేయ్ మల్లిగా లచ్చి జీవితాన్ని 

నాశనం చేయకురా... నీరెండో పెళ్ళాం స్వయాన దాని పినతల్లేకదా! దానికెలా మనసొప్పిందిరా...!"


"ఆడొచ్చి గోలపెడుతుంటే  అదిమాత్తరం ఏటి సేత్తాదమ్మా దానికీ ఇట్టంలేదు ఇలా చేయడం...ఇక పర్వాలేదమ్మా పిల్లని శారదమ్మ గోరు తీసుకుపోయినారు.


"శారద తీసుకెళ్ళడమేమిటిరా" మళ్లీ ఆశ్చర్యపోయింది. 


"అవునమ్మా! పిల్లను చదివించి పెద్దయాక దానికిట్టమైన వాడికిచ్చి పెళ్లిచేసే బాద్దెత నేను తీసుకుంటున్నాను. ఇక నుంచి ఇది నా కూతురు అని చెప్పి తీసుకుపోయారమ్మా!"


ఆవిషయం విన్నాక ఆవిడ మనసు శాంతించింది. మల్లేశ్వర్రావు వెళ్ళిపోయాడు. 


*********


శారద గురించి చెప్పవలసి వస్తే ఆమె ఒక అభాగిని అనవచ్చు. మంచి సాంప్రదాయ కుటుంబంలో పుట్టింది. డిగ్రీ అనంతరం బియిడి చేసి టీచర్ పోస్టులో జాయినయిన వెంటనే కొలిగ్ అయిన శ్రావణ్ కుమార్ తో పెళ్ళయింది. 


తర్వాత తెలిసింది అతను శ్రావణ్ కాదని రావణ్ అని. 

ఇంకా చెప్పాలంటే రావణునితో పోల్చడం తప్పేనేమో  పురాణాల్లో ఎక్కడా రావణుడు స్త్రీని హింసించినట్లు చెప్పలేదనుకుంటా. 


శ్రావణ్ తిరుగుబోతే కాదు... శాడిస్ట్ కూడ. మానసికంగా శారీరకంగా చిత్రహింసలు పెడుతూంటే తట్టుకోలేక 

విడాకులు తీసుకుని ఒంటరిగా బతుకుతోంది. మళ్లీ పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు అన్నా చేసుకోలేనంత 

విరక్తి కలిగేలా చేశాడు వాడు ఆమెకు. 


స్కూలుకు వచ్చి లచ్చిని లాక్కునిపోయాక వెంటనే అన్న జగదీశ్ కు ఫోన్ చేసి వచ్చినవెంటనే మల్లేశ్వర్రావు ఇంటికి బయలుదేరి వెళ్లారు. అప్పటికే పీటలమీద కూర్చోపెట్టి బ్రాహ్మణుడు మంత్రాలు చదువుతున్నాడు. లచ్చి ఏడుస్తోంది. చేతిలో చంటిబిడ్డను ఎత్తుకున్న సవతితల్లి (పినతల్లి) దీనంగా చూస్తోంది. వీళ్ళను చూసి గణేష్ భయపడి పారిపోబోతూంటే పట్టుకున్నాడు. 


మల్లేశ్వర్రావును గణేష్ ను జీపెక్కించబోతే కాళ్ళావేళ్ళాబడి బతిమాలుకొన్నారు. ఇకపై ఇలాంటి తప్పుడుపని సేయమని  అన్నా వదలలేదు. శారద చెప్పేక వదిలితే గణేష్...కొడుకుని పెళ్ళాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు శారద లచ్చిని "నాతో వచ్చి ఉంటావా" అని అడిగి... అది ఒప్పుకున్నమీదట  


"అన్నయ్యా! లక్ష్మిని నాతో తీసుకువెళ్దామను కుంటున్నాను. దానికి నువ్వు ఏమంటావ్" అంది. 


"విషయం స్పష్టంగా చెప్తే కదా ఏమనడానికైనా" అతనన్నదానికి 


"ఇకనుంచి నాకు పెంపుడు కూతురు ఇది. దీని చదువుసంధ్యలు, పెళ్లి చేయడం సమస్తం నేనే చూసుకుంటాను. అదైనా నీవంగీకరిస్తేనే..." అంది. 


"అలాగే శారదా! పెళ్లిలో బుట్ట ఎత్తి తీసుకువచ్చే మేనమామగా ఓకే చెప్తున్నా" ఈవిధంగా నైన చెల్లెలు సంతోషంగా ఉంటే చాలని మనసులో అనుకున్నాడు. 


ఈవిధంగా బొమ్మలపెళ్ళిలాంటి ఆ ఘట్టం ముగిసింది.

🌷🌷🌷🌷🌷

#కమలాదేవి #పురాణపండ

సవరించబడిన అపస్వరం! #కథ

 .*

              🌷🌷🌷

సవరించబడిన అపస్వరం! #కథ


ఒక్కొక్క చటాయి తొంభై రెండు రూపాయులకు అమ్మితే ఆరోజు అమ్మిన పన్నెండు చటాయిల మొత్తం చెప్పమంటే.... పదకొండొందల నాలుగు...అని చటుక్కన నోటిలెక్కేసి చెప్పేయగలదు భన్సీ! లెక్కల్లో అంత చురుకు! 


భన్సీ.... అంటే “ మురళి”....అమ్మ ఇష్టంగా పెట్టుకున్న పేరుట! మరి అంత ఇష్టమైన పేరుపెట్టి తొమ్మిదేళ్ళు అంత గారంగా పెంచుకున్న అమ్మ...  నిర్దయగా తనను వదిలి ఎందుకు వెళ్ళిపోయిందో ఎప్పుడూ అర్ధం కాదు భన్సీకి! నాన్న మాటల బట్టీ... ఎవరో బీహారీఅంకుల్ తో అమ్మ పాట్నా వెళ్ళిపోయిందట. ఎప్పటికీ మరిక రాదట! “..... తలుచుకుంటేనే గుండెల్లోంచి దుఃఖం తన్నుకొస్తుంది భన్సీకి. 


        అయితే ఆ పిల్లకు తెలియని విషయం.... తల్లి ఎప్పటికీ తిరిగిరాని లోకాలకు తరలించబడిందని. 


అప్పారావు పోర్టులో కళాసీ! తాగుబోతు మొగుడి ఆగడాలు భరించలేక మొదటిభార్య కాల్చుకుని చచ్చిపోయింది. 


ఒకరోజు స్టేషన్ దగ్గర చిన్నబట్టలమూట చేతిలో.... మూడేళ్ళ ఆడపిల్లను చంకలో పెట్టుకుని నీలూ.... భన్సీ వాళ్ళమ్మ...... మొహమాటంగా హిందీలో అడుక్కుంటూ అప్పారావు కంటపడింది. 


భర్తపోయి, అత్తారి ఆరళ్ళు భరించలేక... బొకారో ఎక్స్ ప్రెస్ ఎక్కి పారిపోయి వచ్చానని చెప్పగానే.... దారిచూపిస్తానని చెప్పి ఇంటికి తెచ్చి పెట్టుకున్నాడు అప్పారావు. కొన్నాళ్ళకు తాళికట్టి సొంతం చేసుకున్నాడు! 


అందమయిన పెళ్ళం మీద ఎవరి కన్ను పడుతుందా... అని అడుగడుగునా అనుమానం అతనికి. పొయ్యి మీంచి పెనం మీద పడ్డ చందమయింది నీలూకు. గుడ్డిలో మెల్లలా “ భన్సీ” ని మాత్రం బాగానే చూసుకునేవాడు! అదే పదివేలనుకుంది. కూతురి భవిష్యత్తుకోసం అప్పారావు మానసికంగా, శారీరకంగా పెట్టే హింసంతా భరించేది. 


నీలూ...ఇంట్లోనే రోజుకు రెండొందల దాకా జొన్నరొట్టెలు చేసి... చుట్టుపక్కల కాలనీల్లో ... తన పొరుగున ఉన్న ఒరియా ఆమెతో అమ్మించి.... ఆ డబ్బులన్నీ అప్పారావు కంటపడకుండా  దాచేది. అదే ఆమె కొంపముంచింది. 


            భన్సీ తొమ్మిదోపుట్టినరోజుకు ముందురోజు నీలూ ... పోర్టుస్కూల్లో చదువుకుంటున్న కూతురికోసం పక్కింటామెకు డబ్బిచ్చి... ఆమె భర్తద్వారా చక్కని ఆడపిల్లల సైకిల్ తెప్పించింది. 


అర్ధరాత్రి చీట్లపేకలో డబ్బు పోగొట్టుకుని...పూటుగా తాగొచ్చి... నీలూను ఎలాగయినా కుళ్ళబొడిచి....అసహనం తీర్చుకోవాలని ఇంటికొచ్చిన అప్పారావు... వీధిగదిలో మూలన దుప్పటికప్పిన సైకిలును చూసాడు. లోపలగదిలో నీలూ పక్కన ముసుగేసుకుని పడుకున్న మనిషిని చూసాడు. 


మరోమాట మాట్లాడకుండా కోడికోసే కత్తితెచ్చి.... నీలూని మంచం మీంచి లాగి..... జుట్టుపట్టి..... మెడమీద ఒక్క వేటువేసాడు. అంతే! ఆ అభాగ్యురాలి దుర్భాగ్యచరిత్ర ముగిసిపోయింది. 


          ఆ ముసుగుమనిషి తన తల్లి అని తెలుసుకునే సరికే దుర్మార్గం జరిగిపోయింది. తల్లిసాయంతో.......వంటింట్లో మట్టినేల తవ్వి, గొయ్యితీసి నీలూని కప్పెట్టేసాడు. 


పక్కింట్లో పడుకున్న భన్సీకి తెల్లారేసరికల్లా కొత్తసైకిలు, తల్లి లేచిపోయిందన్న వార్త మిగిలాయి. 


మరో వారానికల్లా పోర్టులో కళాసీ పని మూడులక్షలకు అమ్మేసుకుని..... అప్పారావు పరారు అయిపోయాడు. 


ఇక  మిగిలిపోయింది భన్సీ... అనాధ ముద్రవేసుకుని! 


పక్కింటి సాహూ అంకుల్ పూర్ణామార్కెట్ సేట్ తో మాట్లాడి అమ్మడానికి చాపలు ఇప్పించాడు! సేట్ లేనప్పుడు గొడౌన్ లో కుర్రాడు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తాడు. ఎవరితో చెప్పినా ఉన్న ఆధారం పోతుందని భయం! 


చదువుకునే స్కూల్లో టీచరు తనింట్లో పిల్లలను చూసుకోడానికి పనిపిల్లగా చేరమంది. చేరనందుకు క్లాసులో ఏదో ఒక వంకపెట్టి కొడుతోంది. . 


ఒక చాప అమ్మితే పదిరూపాయిలు వస్తాయి. రోజుకు ఇన్నని అమ్మితీరాలి.

వచ్చిన డబ్బులు వచ్చినట్టు సాహూ ఆంటీకిచ్చేస్తుంది. పాపం కడుపునిండా భోజనం పెడుతుంది ఆమె.... పూరీ జగన్నాధుని సేవలా భావించి!


రాత్రి పడుకోడానికి ఇంటికెళ్తే “ ముదనష్టపు ముండల్లారా! మీ వలన నా కొడుకు నాకు దూరమైపోయాడు”, అని అరుస్తూ  పొయ్యిలోంచి కట్టె తీసి  విసురుతుంది దాదీ. 


      భన్సీ కధ కొత్తదికాదు. ఆమె ఒక అపస్వరాల మురళి! ఆ పాపలా ఎందరో వీధుల్లో. ఏ బిడ్డ బతుకు కదిపినా కడలంత విషాదం. కరడుకట్టిన దౌష్ట్యవలయం వారిచుట్టూ. ఏ కష్టమో చేసుకుని బతుకుతూనే ఉంటారు. ఆశను వదలరు. ఆకలినీ వదలరు. ఏ దుర్ముహుర్తానో వీరి బతుకులు కాటేయడానికి అనుక్షణం అపాయం ఎదురుచూస్తూనే ఉంటుంది. అయినా భన్సీలా ఏటికి ఎదురీదుతారు.


      ***^^******^*****^*************


భన్సీకి పెద్దపరిక్షలు అయిపోయాయి! పువ్వుల రామూ దగ్గర మల్లెపూలూ, జాజుల దండలు తీసుకుని, బీచ్ లో అమ్మకుని వచ్చింది. సాహు అంకుల్ వాళ్ళు పూరీ వెళ్ళడంతో, ఇంటిబయట, ఆరుబయలు నులకమంచం వాల్చుకుని పడుకుంది! అర్ధరాత్రి “ భన్సీ! భన్సీ”! ... అంటూ ఎవరో కుదుపుతున్నారు. హడిలిపోయి లేచి చూసేసరికి... వీధిలైట్ కాంతిలో.. ఆమె తండ్రి అప్పారావు! “ నాన్నా!” అని అనబోయేలోగా నోరునొక్కేసి...” లే! మనం ఊరు వెళ్ళాలి!”.. అంటూ తొందరచేస్తున్నాడు. 


నిద్రమత్తులోనే.. భన్సీ దండెం మీంచి తన బట్టలు చిన్నమూట కట్టుకుంది. తండ్రి కంటపడకుండా... తను దాచుకున్న డబ్బుల చిక్కం బట్టల మధ్య పెట్టుకుంది! బయట ఆగివున్న ఆటోలో ఎక్కాకా, కంచెరపాలెం దగ్గర రైల్వేట్రాక్ పక్కన పొదలదగ్గర దింపమన్నాడు అప్పారావు! అక్కడ కాసేపాగాకా, విశాఖ టు ఫరీదాబాద్ స్టీల్ సిటీ సమతా ఎక్సె ప్రెస్ అవుటర్ దగ్గర ఆగింది!... దానిలోకి... భన్సీని ఎక్కించి, తనూ ఎక్కేసాడు అప్పారావు! ఎర్రనికళ్ళతో, గుప్పున సారావాసనతో... భయంకరంగా ఉన్న తండ్రిని “ఎక్కడికెళ్తున్నాం “..అని అడిగే ధైర్యం కూడా లేకపోయింది భన్సీకి! 


ముప్ఫైఆరు గంటల ప్రయాణం తరువాత,రైలు దిగి, క్రిక్కిరిసిన ఒక డొక్కుబస్సులో.. ఒక చిన్న పల్లెటూరు తీసుకెళ్ళాడు అప్పారావు...భన్సీని! 


           ఎర్రచీర కట్టుకుని, తలమీంచి ముసుగేసుకుని, నోట్లో జర్దాపాన్ నముల్తున్న ఒకామెను “ మీ అమ్మ “,అని పరిచయం చేసాడు. ఆమె చూస్తుంటే తండ్రికన్నా పెద్దదానిలా ఉంది. కానీ దయగానే ఉంది! “ ఆవో బేటీ! “... అంటూ లోపలికి తీసుకెళ్ళింది. వేసుకోడానికి మంచి బట్టలిచ్చింది. కడుపునిండా భోజనం పెట్టి, పడుకోమని మంచం చూపించింది. బడలికతో భన్సీ ఎన్నిగంటలు పడుకుందో తెలీదు! లేచేటప్పటికి ఇంట్లో సందడి వినిపిస్తోంది. 


          ఎర్రచీరామె... భన్సీకి టీతెచ్చి ఇచ్చింది. మెరుపులు మెరుపుల ఎర్ర లెహంగా ఇచ్చింది వేసుకోమని. భన్సీకి తల నున్నగా దువ్వి, మాంగ్ టీకా, మాథాపట్టీ తో అలంకరించింది. రెండు దండలకూ... బాజ్ బంధ్ లు కట్టింది! ముక్కుకు నత్తు పెట్టి, మెడలో పచ్లడా వేసింది! నడుముకు తగ్డీ ...వడ్డాణంలా తగిలించింది. భన్సీ రెండు చేతులూ తీసుకుని, మణికట్టుకు హాథ్ ఫూల్ తగిలించింది! ఆల్తా తో చేతుల్లో మెహందీ , కాళ్ళకు పారాణీ అద్దింది! మొహానికి మేకప్ చేసి, కళ్ళకు కాటుక, పెదాలకు ఎర్ర లిప్స్టిక్ పెట్టింది. కనుబొమల మీద... ఎరుపు, తెలుపు చుక్కలు పెట్టింది. చక్కని రాళ్ళ బిందీని బొట్టులా అమర్చింది. భన్సీకి ఏమవుతోందో అర్ధమవడం లేదు. కానీ అద్దంలో... అందంగా కనబడుతున్న తన ప్రతిబింబాన్ని చూసుకుని... మురిసిపోతోంది. 


           మరికొందరు తోడురాగా అప్పారావు, అతని భార్య అనబడే ఆమె... భన్సీని ఒక డొక్కు జీప్ లో కూర్చోపెట్టి, ఆరుగంటలు ప్రయాణించి... మరొక పల్లెటూరు చేరారు. ఆ మట్టిరోడ్లలో, మండువేసవిలో ప్రయాణం భన్సీకి నిస్త్రాణ తెప్పించింది. 


అదొక పెద్దలోగిలిలో ఇల్లు! ఇంటిముందు వేపచెట్టుకింద, నులకమంచం మీద పాన్ నములుతూ ఒక ముసలమ్మ కూర్చునుంది. భన్సీ చేత ముసలమ్మ పాదాలు నొక్కిస్తూ... నమస్కారం చేయించారు. ఆ ముసలావిడ... భన్సీని చూసి తృప్తిగా తలాడించింది. “ యే లో పగిడీ!” అంటూ మొలలోంచి, కొంత డబ్బు తీసి అప్పారావు భార్య చేతిలో పెట్టింది. అందరూ కలిసి... ఇంటిలోకి వెళ్ళారు. 


అక్కడ జరుగుతున్న పెళ్ళి ఏర్పాట్లు చూసి, భన్సీకి పైప్రాణాలు పైనే పోయాయి. బంధువుల ఇంటికి తెచ్చారనుకుంది, కానీ తనకు పెళ్ళిచెయ్యబోతున్నారని ఊహించలేకపోయింది! తండ్రి దగ్గరకు వెళ్ళబోయింది. అందరూ పాలల్లో భంగువేసుకుని తాగుతూ ...చిలుం పీలుస్తూ... ఈలోకంలో లేరు. సవితి తల్లి... భన్సీ చేతిమీద బలంగా చెయ్యి బిగించింది బయటకు పారిపోకుండా. మునపటి మార్దవం లేదిప్పుడు ఆమెలో! 


        ఇంతలో షేర్వాణీ వేసుకున్న చిన్న కుర్రాడిని తెచ్చారు. వాడికి ఎనిమిదేళ్ళయినా ఉంటాయో లేదో! బాగా ఏడ్చినట్టున్నాడు! కళ్ళూ, బుగ్గలూ ఎర్రగా వాచిపోయి ఉన్నాయి! ఇద్దరి మొహాలకూ మల్లెపూల పరదాలు తగిలించారు. తలో పూలదండ చేతికిచ్చి... బలవంతంగా ఒకరి మెడలో ఒకరికి వేయించారు. వరమాల కార్యక్రమం అయిపోయిందని... అందరూ పువ్వులు చల్లారు. పాపిట్లో సింధూరం పెట్టించారు! అగ్నిహోత్రం చుట్టూ, సప్తపది చేయించారు. పెళ్ళయిపోయిందన్నారు. 


ఆ ఇంట్లో ఈ కుర్రాడి తల్లి, ముసలమ్మ తప్పా, మిగిలిన అందరూ మొగవారే ఉండడం గమనించింది భన్సీ! పూరీ, జిలేబీతో మంచి విందుభోజనం తిని, భన్సీని అక్కడే వదిలేసి...వెళ్ళిపోయారు ఆడపెళ్ళివారు! వెళ్తూ... కనీసం వస్తానని చెప్పకుండా, తూలుకుంటూ పోయాడు అప్పారావు,వాళ్ళిచ్చిన నోట్లు లెక్కపెట్టుకుంటూ! 


            చాపలమ్ముకుంటూ, చదువుకునే భన్సీ... ఇప్పుడు...ఉదయాన్నే ఇళ్ళూ, వాకిళ్లూ ఉడ్వాలి, గోలాలకు నిండా నీళ్ళుతోడాలి, గొడ్లకు మేతలేసి..పాలుపిండాలి! పెద్దపళ్ళెంలో... రెండుపూట్లా రెండుకేజీలకు పైగా గోధుంపిండి కలపాలి! అత్తగారు రొట్టెలు కాలుస్తుంటే... రొట్టెలు ఒత్తాలి. అవి గుండ్రంగా ఒత్తకపోతే... వేడి అట్లకాడతో ఒక్కటేసేది అత్తగారు. ఖాళీ సమయమంతా... ముసలమ్మకు నడుము, కాళ్ళూ ఒత్తాలి. కడుపునిండా తిండిపెట్టినా, బండెడు చాకిరీ చెయ్యడం భన్సీ కి శక్తికి మించిన పని! 


           భన్సీ పెళ్ళికొడుకు చందన్... తెలియక భన్సీని “దీదీ “...అని పిలుస్తూ... తన్నులు తినేవాడు. రోజు మొత్తం మీద భన్సీకి ఆనందాన్నిచ్చే పని చందన్ కు చదువుచెప్పడమే! మంచి పోషణ దొరకడం వలన భన్సీ ఆరునెలల్లో ఏపుగా పెరిగింది. మెల్లమెల్లగా ఆ ఇంటి మగవారి కళ్ళు భన్సీమీద పడసాగాయి. ఏదో వంకను ఆమెను తాకేవారు! బట్టలు,మిఠాయిలు తెచ్చిచ్చి మచ్చికచేసుకోవాలని ప్రయత్నించేవారు. ముసలమ్మ ఇదంతా గమనించి, వారిని కర్రతో కొట్టేది. “భన్సీ...ఈడేరేకా... మీ అందరి సొత్తూ అది. తొందరపడకండి!”... అంటూ అరిచేది. తల్లి వలన భన్సీకి హిందీ కొంచెంగా వచ్చు. మెల్లమెల్లగా ఆ ఇంట్లో వారి మాటలు, ప్రవర్తన అర్ధమై, తన పరిస్థితి ఏమవుతుందా అని తల్లడిల్లేది. తల్లిని తల్చుకుని ఏడ్చేది. 


        ఉత్తరభారతదేశంలో... ఆడశిశువుల భ్రూణహత్యల దుష్ఫలితమే... ఆడపిల్లల శాతం గణనీయంగా తగ్గి....ఈ బాల్యవివాహాలు! ఇలా ఆడపిల్లలకు ఓలిచ్చి కొనుక్కుని... అమ్మాయిలు దొరక్క బ్రహ్మచారుల్లా మిగిలిపోయిన ఇంటికొడుకులందరికీ ఉమ్మడిభార్యగా... ఆ పిల్లను మార్చడం... అతి పెద్ద దురాచారంగా ప్రబలిపోతోంది ఆ ప్రాంతాల్లో! 


తెలివయిన భన్సీకి తన భవిష్యత్తు తెలుస్తోంది. పూర్తి గృహనిర్బంధం, సెల్ ఫోన్ ఆమెకు అందుబాటులో ఉంచకపోవడం, అనుక్షణం... పదిజతల కళ్ళు ఆమె మీద నిఘా, పూర్తిగా అపరిచితమైన ప్రాంతం... ఆమెను నిస్సహాయురాలిగా చేసాయి! 


        ఒకరోజు అదృష్టం ఆమె తలుపు తట్టింది. ఆ ప్రాంతమంతా జాతీయఎన్నికల హడావిడి మొదలయింది. భన్సీ మావగారు అక్కడి పంచాయత్ సభ్యుడు. అన్నదమ్ములంతా ఊరూవాడా ప్రచారం కోసం తిరుగుతున్నారు. ఆరోజు ఇంటిల్లిపాదీ ఫరీదాబాద్ వెళ్ళిపోయారు! జననాయక్ జనతాపార్టీ తో బీజేపీ పొత్తుపెట్టుకోవడంతో... ఆరోజు నరేంద్ర మోడీగారు ఫరీదాబాద్ లో పెద్ద బహిరంగసభలో, ప్రసంగించబోతున్నారు!  


ఇంట్లో ముసలమ్మ, చందన్, భన్సీ మాత్రమే ఉన్నారు. చందన్ , భన్సీ దగ్గరకు వచ్చి రహస్యంగా...” దీదీ! రోడ్ మీదకు వెళ్ళినిలబడితే... మోడీజీ మీటింగ్ కు జనాలతో వెళ్ళే లారీలు కనిపిస్తాయి. ఆ లారీలెక్కి, ఫరీదాబాద్ వెళ్ళిపో! అక్కడ నుంచి మీ వూరు పారిపో! వీళ్ళు మంచివాళ్ళు కాదు! నువ్వు రావడానికి ముందు మా చాచాకి ఒకమ్మాయిని తెచ్చారు. రోజూ ఏడిచేది. పారిపోబోతే...తుపాకీతో కాల్చి చంపేసారు! ఇదిగో ఈ డబ్బులు తీసుకో! ఎలాగోలా పారిపో! ఈ కట్టెతో నా నెత్తిమీద కొట్టి, పారిపో....!” అంటుంటే... చందన్ బుగ్గమీద ముద్దుపెట్టుకుని... వాడు చెప్పినట్లే చేసింది ... ఫరీదాబాద్ చేరింది భన్సీ! 


      ఫరీదాబాద్ లో ప్రధాని ప్రసంగం స్వచ్ఛమైన హిందీలో గంగాఝరిలా సాగుతోంది! అందరూ మంత్రముగ్దులై వింటున్నారు. భన్సీ జనంలోంచి దారిచేసుకుని, వేదికకు దగ్గరగా, బేరికేడ్ల దగ్గర నిలబడింది. మోడీగారు నిర్భయా వంటి ఆడపిల్లల రక్షణ చట్టాల గురించి, బేటీ బచావ్, బేటీ పఢావ్....అంటూ, తమ ప్రసంగంలో మాట్లాడింది ...భన్సీ బుర్రలోకి చేరింది. ఈయనే నా రక్షకుడనుకుంది. ప్రసంగం ముగించి, వారు జనానికి చెయ్యూపుతూ... వేదిక దిగుతున్నారు. వారి చుట్టూ సుశిక్షితులైన సెక్యూరిటీ! జనం జయజయ ధ్వానాలు చేస్తున్నారు. 


భన్సీ... మొత్తం ఊపిరిని తన గొంతులోకి తెచ్చుకుంది. ఎలుగెత్తి.... “ మోడీజీ! ముఝే బచావ్! మోడీజీ ముఝే బచావ్” అంటూ అరుస్తోంది! అనుక్షణం.. అటువంటి అసహాయుల పిలుపులకు... తన చెవులను, హృదయాన్ని, జీవితాన్నే అంకితం చేసిన ఆ నేత చెవిన... భన్సీ పిలుపు పడనే పడింది. ఒక్కసారి ఆగిపోయారు ఆయన. ముందువరసలో చేతులూపుతూ అసహాయంగా ఒక ఆడపిల్ల! భన్సీకి చెయ్యూపారు ఆయన! ! పక్కనే ఉన్న హర్యానా ఐజీ ఆఫ్ పోలీస్ కు సంకేతాలిచ్చారు! భన్సీకి అభయమిచ్చి... ఆయన హెలీపేడ్ వైపుకు తరలిపోయారు! 


       ఈరోజు భన్సీ న్యూఢిల్లీలో అత్యుత్తమ బాలికా సంరక్షకగృహంలో, అత్యంత భద్రత మధ్య చదువుకుంటోంది. ఇప్పుడామె కళ్ళ నిండా కలలు, ఆశయాలే... మోడీగారివంటి నాయకురాలిని  అవ్వాలని, బాలికారక్షణకు కంకణం కట్టుకోవాలని! 


ధన్యవాదాలతో

ఓలేటి శశికళ


ఈ కథకు మానవతారంగు తప్పా రాజకీయ రంగు లేదు. మిత్రులు గమనించాలి. ఇలాంటి బాలికల రక్షణార్ధం రాజకీయాలకు అతీతంగా అందరూ పనిచెయ్యాలి!

పెంపకంలో తల్లి

 👍 *పిల్లల పెంపకంలో తల్లి* *భాద్యత* 👍


ఒక బాలుడికి జట్కాబండిలో ప్రయాణించడం చాలా ఇష్టం. రోజూ బడికి జట్కాలోనే వెళ్లేవాడు.


పెద్దయ్యాక ఏం కావాలనుకున్నారని స్కూల్లో టీచరు అడిగారు.

ఒకరు డాక్టరని,

ఇంకొకరు ఇంజినీరని,

మరొకరు లాయరని

అన్నారు.


ఈ బాలుడు మాత్రం జట్కావాలా అవుతానన్నాడు.


టీచరు, పిల్లలు ఘొల్లున నవ్వారు. 


ఇంటికెళ్లేలోపే ఇది బాలుడి తల్లికి తెలిసి, ప్రశాంతవదనంతో


బాబూ! పెద్దయ్యాక ఏమవుతావని అడిగింది.


స్కూళ్లో చెప్పిందే చెప్పాడు.


తల్లి:

"అలాగే అవుదువుగానీ, ఇలా రా"

అంటూ పూజామందిరం తలుపులు తెరిచి,

"ఒక్క గుర్రంతో నడిపే బండి కాదు! నాలుగు గుర్రాలు నడిపే బండీకి నువ్వు జట్కావాలావి కావాలి, అదిగో ఆ శ్రీకృష్ణుడి లాగా" అని బోధించింది ఆ తల్లి


ఆ 4గుర్రాల పేర్లు

*ధర్మ, అర్థ, కామ, మోక్షాలనీ*,

ఆ *బోధించే జట్కావాలా జగద్గురువైన శ్రీకృష్ణుడనీ* చెప్పింది.

"నువ్వు కూడా జగత్తుకి

ఈ నాలుగింటిని బోధించే గురువువి కావాలి, సరేనా!" అంటూ అతడిఆలోచనను మలుపు తిప్పింది.


ఆ బిడ్డడే పెద్దయ్యాక వివేకానందుడయ్యాడు.


పెంపకం అంటే అదీ!

పిల్లలు తెలియక తప్పు చేసినా,

తప్పు మాట్లాడినా

దానిని సరిదిద్దాల్సింది తల్లే!


*అందుకే అమ్మని తొలి గురువు, తొలి దైవం అంటారు.*


 *అమ్మ మాటలో ఎంతో మహత్తు వుంది కదా*


**సర్వేజనా సుఖినోభవంతు.**

🙏🙏🙏

తెల్లవారుజామున

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

అది 1976 నవంబర్ 11 వ తేదీ, న్యూఢిల్లీ ... 


తెల్లవారుజామున 5 గంటలకు టెలీఫోన్ మొగుతోంది, పక్క గదిలో ధ్యానం చేసుకుంటున్నాడు వైద్యనాథ్, అతని భార్య గౌరీ వెళ్లి ఫోన్ తీసుకుంది ...  


గౌరీ : హలో ఎవరు ?

అవుతలి వ్యక్తి : మేడమ్ !!! నేను పరమేశ్వర్ మాట్లాడుతున్నాను, అయ్యగారు ఉన్నారా ? 


గౌరీ : అయ్యగారు ధ్యానంలో ఉన్నారు పరమేశ్వర్, ఏమిటీ విషయం ఇంత పొద్దున్నే ఫోన్ చేశావ్ ? 

పరమేశ్వర్ : సరే అమ్మా, అర్జంట్ గా అయ్యగారితో మాట్లాడాలి, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ... 


గౌరీ : సరే ఆయన రాగానే చెబుతాను, ఆయనతో మాట్లాడు

పరమేశ్వర్ : అలాగే అమ్మ ... 


ధ్యానం అయిపోయాక గౌరీ పరమేశ్వర్ ఫోను చేసిన విషయం చెప్పింది. వైద్యనాథ్ పరమేశ్వర్ తో మాట్లాడి హుటాహుటిన రామేశ్వరం ప్రయాణమయ్యాడు ...


గౌరీ : ఏమిటండీ ఈ పరుగులు, అంత అర్జంట్ ఏమిటీ అని అడిగింది.

 

రామేశ్వరంలో ఒక రోగికి అత్యవసర చికిత్స చేయాలి, సమయం తక్కువగా ఉంది, వెంటనే వెళ్లకపోతే ప్రాణానికే ప్రమాదం అంటూ, ఆ వైద్యానికి కావలసిన పరికరాలు ఒక పెద్ద సూట్ కేసులో సర్దుకుని బయల్దేరాడు. 


రామేశ్వరమా !!! అయితే సముద్ర స్నానం చేసి, స్వామి వారి దర్శనానికి కూడా వెళ్ళిరండి అనింది గౌరీ. చూడు నాకు దేవుని మీద నమ్మకం లేదు అని తెలుసు కదా, ఇలాంటివి నాకు చెప్పకు అన్నాడు చిరాగ్గా.


ఇక ఏమి చెప్పాలో తెలియక ఊరుకుంది గౌరీ, నిజానికి వైద్యనాథ్ నాస్తికుడు. తన తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడం వల్ల, మేనమామ దగ్గర పెరిగాడు, తన తల్లిదండ్రులను అంత చిన్న వయసులోనే దూరం చేసాడనే దేవుడంటే కోపం. దానికి తోడు చిన్నప్పటినుండీ తన మేనమామ కూడా నాస్తికత్వం నూరిపోసాడు. 


నేను వెళ్ళి రెండురోజుల్లో వచ్చేస్తాను అంటూ, టెలిఫోన్ ద్వారా రెండు విమాన టికెట్లు రానూ పోనూ బుక్ చేసాడు. ఆయనతో పాటుగా కాంపౌండర్ ను కూడా తీసుకెళ్లాడు వైద్యనాథ్, రమేశ్వరానికి నేరుగా విమాన సౌకర్యం లేదు, మధురైకి వెళ్లి అక్కడి నుండీ 150 కిలోమీటర్లు ప్రయాణించాలి. సాయంత్రం 6 గంటలలోపు చేరుకోవాలి.


 మధ్యాహ్నం 3:30 గంటలకు మధురై చేరారు. అక్కడ వారికోసం ఒక కారు సిద్ధంగా ఉంది. ఆ కారు డ్రైవర్, ఢిల్లీ నుండీ వచ్చిన డాక్టర్ విద్యానాథ్ మీరేనా అని అడిగాడు, అవును నేనే అని సమాధానం చెప్పాడు వైద్యనాథ్. మీకోసం రామేశ్వరం నుండీ కారు పంపించారు డాక్టర్ సుందరేశ్ అన్నాడు ఆ డ్రైవర్. 

డాక్టర్ సుందరేశా, ఆయనెవరో నాకు తెలియదే అనుకున్నాడు మనసులో కానీ రామేశ్వరంలో ఇంచార్జ్ అయ్యుంటాడులే అని సమాధానపడి, సరే వెళదాం పదా అన్నాడు వైద్యనాథ్.


 వాళ్ళు కారు ఎక్కుతుండగా, ఒక వృద్ధుడు వారి దగ్గరకు వచ్చాడు. ఆయన ఒంటి నిండా విభూతి రేఖలు, మేడలో రుద్రాక్షలు, జడలు కట్టిన జుట్టు, చిల్లులు పడిన పాత మాసిన పంచ కట్టుకుని, చేతి కర్ర సాయంతో వారి దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ఆయన ఎవరో బిక్షకుడు అనుకుని రెండు రూపాయలు ఇవ్వబోయాడు వైద్యనాథ్, " నాకు వద్దు ఏమీ నాయనా, గౌరీ ఎలా ఉంది " అని అడిగాడు ఆ వృద్ధుడు. 


గౌరీ వాళ్ళ పూర్వీకులది మధురైయ్యే కానీ ఈయన్ని ఎప్పుడూ చూసిన గుర్తులేదు. " క్షమించండి, మీరు భిక్షకు వచ్చారేమోనని అలా ప్రవర్తించాను, మిమ్మల్ని ఎప్పుడూ చూసిన గుర్తులేదు, మీ పేరు ? " అని అడిగాడు వైద్యనాథ్. 


" నేను మిమ్మల్ని ఎరుగుదును, నేను భిక్షకుడినే, నా పేరు ఏమని చెప్పను, ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పిలుస్తారు, ఇప్పుడే గౌరీ పెట్టిన బొబ్బట్లు తిన్నాను, అన్నాడు ఆ వృద్ధుడు. అది వినగానే ఈయనెవరో మతిస్థిమితం లేనివాడు అనుకున్నాడు వైద్యనాథ్. ఆయనతో మాట్లాడుతూ సమయం వృధా చేయడం ఇష్టంలేక వైద్యనాథ్ సతమతమవుతూ చూస్తున్నాడు, నీకు సమయం అవుతున్నట్లుంది, ఇందా ఇది తీసుకుని వెళ్ళి ముత్తులక్ష్మికివ్వు, కుమార్ కి నయమవుతుందని ధైర్యం చెప్పు అంటూ ఒక చిన్న పొట్లం వైద్యనాథ్ చేతిలో పెట్టి, బయలేదరండి అని డ్రైవర్ తో అన్నాడు . 


వారు మధురై నుండీ బయలుదేరిన కాసేపటికే ఆకాశం మేఘావృతమై ఉంది, స్వాతంత్రం 4 గంటలకే నల్లని మేఘాల వల్ల చిమ్మ చీకటి ఆవరించింది, చెవులు చిల్లులు పడేలా ఉరుములు, కళ్ళు మిరిమిట్లు గలిగేలా మెరుపులు, కొండలను కొట్టుకుపోయేలా గాలులు, వీటి మధ్య ప్రయాణం మొదలయింది. ఉన్నట్లుంది కుండపోతగా వానా కురవడం మొదలయ్యాయి. త్వరగా చేరుకోవాలని వేగంగా వెళుతోంది కారు. వారికి ఒక 100 మీటర్ల దూరంలో ఒక చెట్టు మీద పిడుగు పడి అది నిలువునా చీలిపోయి కాలిపోతూ రోడ్డు మీద అడ్డంగా పడిపోయింది.


ఉన్నఫళాన కారు ఆపే సరికి, ఆ వేగం వలన తడి రోడ్డు మీద కారు ఒక పది మీటర్లు జారుతూ వెళ్లి నిలిచింది. అందరి గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. కొద్ది సేపట్లోనే తేరుకున్నారు, సమయం దగ్గర పడుతోంది, వేరే దారి ఏదైనా ఉందా అని డ్రైవర్ ని అడిగాడు వైద్యనాథ్, వెనక్కు తిరిగి ఒక 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే, ఒక చిన్న దారి వస్తుంది కానీ అది అంత సౌకర్యంగా ఉండదు, పైగా వర్షం కదా, బురదగా ఉంటుంది, టైర్లు బురదలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది అని చెప్పాడు డ్రైవర్.


మనకు వేరే దారి లేదు కదా, ఆ దారిలోనే వెళదాం, సమయం లేదు అన్నాడు వైద్యనాథ్. సరే మీ ఇష్టం సర్ అంటూ డ్రైవర్ కారును వెనక్కి తిప్పి ఆ ఇరుకు మార్గంలో ప్రయాణం కొనసాగించాడు. మట్టి రోడ్డు కావడం వలన నిదానంగా వెళుతున్నారు. అలా కాస్త దూరం వెళ్ళాక వారి దారికి అడ్డుగా ఒక వాగు పొంగి పోర్లుతోంది. 


ఇక ఎటూ పోలేని పరిస్థితి, అన్ని దారులూ మూసుకుపోయాయి, ఇప్పుడెలా అని ఆలోచిస్తున్నారు. సర్, ఈరోజు రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయం వెళ్ళడం మంచిది, కొద్ది దూరంలో ఒక చిన్న పల్లెటూరు ఉంది, అక్కడకు వెళ్ళి తలదాచుకుందాం, ఇక్కడ క్రూర మృగాలు సంచరిస్తుంటాయి అన్నాడు డ్రైవర్. 


సరే, ఇక చేసేదేముంది అని తలూపుతూ, చీకటి, పైగా వర్షం, వీధి దీపాలు కూడా లేవు, ఎవరింటికి వెళ్ళి తలుపు తట్టాలన్నా ఇంత రాత్రి సమయంలో కొత్తవారిని ఆదరిస్తారో లేదో అన్నాడు వైద్యనాథ్. మీరు చెప్పింది నిజమే కానీ ఇలాంటి పరిస్థితులలో ఈ అడవిలో ఉండడం కంటే ఆ ఊరి దగ్గర ఉంటే మంచిది కదా అన్నాడు డ్రైవర్. సరే పద అన్నాడు వైద్యనాథ్.


ఆ డ్రైవర్ చెప్పిన పల్లెకు చేరేసరికి రాత్రి 8 గంటలయ్యింది. హోరున వాన, పట్టుమని పదిళ్ళు కూడా లేవు, నిర్మానుష్యంగా ఉంది. కారు వచ్చిన దగ్గర నుండీ ఆ ఊరిలోని కుక్కలు అరవడం మొదలుపెట్టాయి. వర్షం తగ్గేంతవరకూ వేచి ఉండడమే తప్ప బయటకు వెళ్ళలేని పరిస్థితి. అందరికీ చాలా ఆకలిగా ఉంది. 


అలా ఒక అరగంట పాటూ కారులోనే ఉన్నారు వాళ్ళు, అప్పుడు  ఒక లాంతరు పట్టుకుని, గొడుగు అడ్డుపెట్టుకుని, వాళ్ళ కారు వైపుకు ఎవరో వస్తున్నట్లు అనిపించింది. వస్తున్నదెవరో సరిగ్గా కనిపించడం లేదు. సర్ తొందరపడి తలుపు తీయకండి, ముందు చూద్దాం ఎవరో ఏంటో అని చెప్పాడు డ్రైవర్. సరే అన్నాడు వైద్యనాథ్, ఎంత ప్రయత్నించినా ఆ కారు అద్దాల మీద నుండీ వర్షపు చినుకులు కారుతుండడం వల్ల ఆ వస్తున్న మనిషిని చూడలేకపోతున్నారు. ఆ వ్యక్తి వాళ్ళ కారు కిటికీ వైపుకు వచ్చి, అద్దం మీద తట్టాడు.


నిదానంగా కిటికీ అద్దం కిందకు దించాడు వైద్యనాథ్, ఎవరో ఒక ముసాలివిడ నిలబడి ఉంది, ఎవరు బాబు మీరు, ఇందాకటినుండీ చూస్తున్నా, దారి తప్పిపోయారా అని అడిగింది. ఆవిడను చూసాక కాస్త ధైర్యం వచ్చింది వారికి, అవును అవ్వా మేము రామేశ్వరం వెళ్ళాలి వర్షం వల్ల వాగు పొంగుతోంది అందుకే ఇక్కడ ఉన్నాము అన్నాడు డ్రైవర్. సరే మా ఇంటికి రండి నాయనా, రాత్రికి ఉండి రేపు పొద్దున్న వెళ్ళచ్చు అన్నది. హమ్మయ్య !!! అనుకుని ఆవిడ వెనుకే వాళ్ళింటికి వెళ్ళారు ముగ్గురూ ... 


ఆ వర్షంలో పూర్తిగా తడిసిపోతూ ఆ ముసలవ్వ ఇంటికి చేరారు ముగ్గురూ. ఇందా ఈ తువాలుతో తలలు తుడుచుకుని, ఈ పంచలు కట్టుకోండి అని మూడు పాత పంచలు ఇచ్చింది ఆ ముసలవ్వ. రెండు గదులున్న పూరి పాక అది. అవి కట్టుకుని కూర్చున్నారు. ఎప్పుడు తిన్నారో ఏంటో, కాస్త వేడిగా ఈ రాగి జావ జాగి తాగి, ఈ జొన్న రొట్టెలు తినండి అంటూ మూడు కంచాల్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిరపకాయలు, కాస్త ఉప్పు, జొన్న రొట్టెలు పెట్టిచ్చింది. వైద్యనాథ్ కి ఆ పదార్ధాలు అమృతంలా అనిపించాయి. అవి తిని తమ ఆకలి తీర్చుకున్నారు. మీరు ఇక్కడే పడుకోండి అని చెప్పి మూడు చాపలు, దుప్పట్లు ఇచ్చింది.


 పాపం ఆ రోగికి ఎలా ఉందో ఏమిటో, సమయానికి చేరుకోలేకపోయాను అంటూ కాస్త బాధపడి, అయినా నా చేతుల్లో ఏముంది అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు వైద్యనాథ్. 

 

నీకోసం కనీసం ఒక్క రొట్టైనా ఉంచుకోవచ్చు కదమ్మా, ఇలా పస్తుంటే ఎలాగ, అసలే నీ ఆరోగ్యం కూడా అంతంతమాత్రమే కదా, అని ఎవరో అనగానే, నాకేమీ కాదులేరా, మనం ఎదుటివారి ఆకలి తీరిస్తే, మన ఆకలి ఆ భగవంతుడే తీరుస్తాడు అని ఆ ముసలవ్వ వినిపించింది. ఆ తీరుస్తాడు, తీరుస్తాడు మరి రాత్రంతా నీ ఆకలి ఎందుకు తీర్చలేదు అన్నాడు మళ్ళీ. తనకు మెలకువ వచ్చినప్పటి నుండీ ఈ సంభాషణ వింటునే ఉన్నాడు వైద్యనాథ్. లేచి వెళ్ళి ఆ వచ్చిందెవరో చూసాడు. 


ఆ ముసలమ్మ కొడుకు షుమారు 45 సంవత్సరాల వయసుంటుంది. వాళిద్దరూ ఆరుబయట కుర్చుని మాట్లాడుకుంటున్నారు, వైద్యనాథ్ ను చూస్తూనే రండి అని పలకరించాడు ఆ వ్యక్తి. వీడు నా కొడుకు కార్తీక్ అని పరిచయం చేసింది ఆ ముసలవ్వ. అవునా మంచిది అంటూ నవ్వుతూ పలకరించాడు విశ్వనాథ్. ఏవిటి ఇందాకటినుండీ ఏదో మాట్లాడుతున్నారు ఆని అడిగాడు వైద్యనాథ్.


ఏమీ లేదులే బాబు, నువ్వు మొహం కడుక్కొని రా జావ తాగుదువు గానీ అన్నది ఆవిడ. సరే అని వెనక్కి తిరిగి చూడగానే గోడకానుకుని ఒక ఆవిడ కూర్చుని ఉంది, ఆమె ఒడిలో తల పెట్టుకుని 11 సంవత్సరాల బిడ్డ పడుకొని ఉన్నాడు. వైద్యనాథ్ ను చూస్తూనే నమస్కారం పెట్టింది, తను కూడా నమస్కారం పెట్టి మొహం కడుక్కుని ఇంట్లోకి వెళ్ళాడు వైద్యనాథ్. తనకు వేడి వేడి జావ ఒక చెంబులో ఇస్తూ ఇక్కడ కాఫీ టీ దొరకవు బాబు అని చెప్పింది. అయ్యో పరవాలేదు అవ్వ అన్నాడు వైద్యనాథ్. 


 వాళ్ళు నా కోడలు, మనవడు అని పరిచయం చేసింది ముసలవ్వ. వైద్యనాథ్ ఆ రెండవ గదిలోకి తోని చూసాడు, మొత్తం పేడ నీళ్ళతో తడిసిపోయుంది. అవ్వా ఈ గదంతా ఇలా తడిసిపోతే నువ్వెక్కడ పడుకున్నావ్ అని అడిగాడు, మాకిది అలవాటేలే బాబు, ఇక్కడే పడుకున్నాను అనింది. అక్కడ ఎవరూ నిద్రపోలేరు అలా ఉంది ఆ గదిలో పరిస్థితి, రాత్రి నువ్వు రొట్టెలు తినలేదా అవ్వా అని అడిగాడు వైద్యనాథ్, ఆ తిన్నాను బాబు అంటుండగానే ఇంతలో వాళ్ళబ్బాయి కార్తీక్ అప్పుడే లోపలికి వస్తూ లేదు సర్, తనకోసం మేము చేసి పెట్టి వెళ్ళినవి మీకిచ్చి, తను పస్తుంది, పైగా తనకు చెక్కర వ్యాధి కూడా ఉంది అన్నాడు, ఈ వయసులో ఇంకా ఉపవాసాలు, పస్తులు ఉంటుంది అన్నాడు. వైద్యనాథ్ గుండె ద్రవించింది, ఆవిడ త్యాగం శ్లాఘనీయం అనిపించింది. ఎంత గొప్ప మనసు ఈవిడది అనుకున్నాడు. రాత్రంతా పస్తుంది, నిద్ర కూడా లేదు, ముక్కూ మొహం తెలియని వారికోసం ఇంత త్యాగం ఎలా చేసావు, ఎంత గొప్ప మనసు అవ్వా నీది అంటుండగా బయటకి నుండీ ఒక కేక వినిపించింది.


పరుగున వెళ్ళారు అవ్వా, కార్తీక్. వైద్యనాథ్ కూడా వెళ్ళి చూచాడు. వాళ్ళ మనవడు గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఏమయ్యింది అన్నాడు వైద్యనాథ్, ఏదో జబ్బు చేసింది నా మనవడికి, పట్నంలో పెద్దాసుపత్రిలో చూపిస్తున్నాం, దానికి ఎంతో కర్చవుతుందట పైగా దీన్ని నయం చేసే వైద్యుడు కూడా ఇక్కడ లేడు అంటున్నారు అని చెప్పాడు కార్తీక్. ఏదీ తన రిపోర్ట్లు ఉంటే ఇవ్వండి అన్నాడు విశ్వనాథ్, అది చూసి ఆశ్చర్యపోయాడు.


తను రామేశ్వరంలో ఏ జబ్బుకైతే ఆపరేషన్ చేయాలని వచ్చాడో అవే లక్షణాలు ఉన్న ఈ అబ్బాయిని చూసాడు. మాకోసం ఇంత సహాయం చేసిన వీరికోసం ఈ మాత్రం చేయడం నా కనీస ధర్మం అనిపించింది విశ్వనాథ్ కి. అవ్వా నేను డాక్టర్ ని, మీ మనవడికి వెంటనే ఆపరేషన్ చేయాలి అన్నాడు వైద్యనాథ్. ఎంత కర్చవుతుంది అన్నాడు కార్తీక్, వాటి గురించి ఆలోచించకండి, నా దగ్గర ఆపరేషన్ కి కావలసిన పరికారాలు సిద్ధంగా ఉన్నాయి, కొన్ని మీరు ఇంట్లో ఉండేవే సమకూరిస్తే ఇప్పుడే చేస్తాను అన్నాడు. ఆ మాటలు వినగానే ఆ అవ్వ కళ్ళలో నీళ్ళు మొదలయ్యాయి. 


వెంటనే వైద్యనాథ్ అడిగినవన్నీ సమకూర్చారు, కాంపౌండర్ సహాయంతో వాళ్ళ మనవడికి ఆపరేషన్ చేసాడు. మీ మనవడికి నయమవుతుంది, భయపడాల్సిన పని లేదు ఈ మందులు వాడితే చాలు, పది రోజుల తరువాత కుట్లు ఊడిపోతాయి అన్నాడు వైద్యనాథ్, కృతజ్ఞతతో వైద్యనాథ్ కాళ్ళ మీద పడ్డారు కార్తీక్, అతని భార్య. మీరు దేవుడిలా వచ్చారు సర్, మీ ఋణం తీర్చుకోలేము అన్నాడు కార్తీక్. అలాంటిదేమీ లేదు అని చెప్పి, భోంచేసి త్వర త్వరగా రామేశ్వరం బయలుదేరారు. అక్కడకు చేరి, ఆసుపత్రిలో విచారిస్తే అసలు అలాంటి జబ్బుతో అక్కడ ఎవరూ లేరు అని చెప్పారు వాళ్ళు. ఆశ్చర్యపోయాడు వైద్యనాథ్. మరి డాక్టర్ సుందరేశ్ పంపించారని చెప్పి, మధురైకి కారు ఎవరు పంపించారు అని అడిగాడు వైద్యనాథ్. అసలు ఇక్కడ సుందరేశ్ అనే పేరుతో ఏ డాక్టరూ లేరు, మేమేకారూ పంపలేదు, ఏదీ చూద్దాం పదండీ అన్నారు అక్కడి సిబ్బంది. 


బయటకు వెళ్ళి చూసేసరికి అక్కడ ఏ కారూ లేదు, ఆశ్చర్యపోయారు వైద్యనాథ్ , కాంపౌండర్. అంతా విచిత్రంగా ఉంది అనుకుంటుండగా మధురైలో కనిపించిన వృద్ధుడే కాస్త దూరంలో కనిపించాడు వైద్యనాథ్ కి. వెంటనే ఆయన దగ్గరకు పరిగెత్తాడు వైద్యనాథ్ కానీ అంతలోనే ఆయన అదృశ్యమయ్యాడు. అప్పుడు వైద్యనాథ్ కి ఆ వృద్ధుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి, వెంటనే ఒక కారు మాట్లాడుకుని మళ్ళీ ఆ పల్లెటూరికి వెళ్ళాడు. అక్కడ ఆ ముసలవ్వను చూస్తూనే, మీ పేరేమిటి అని అడిగాడు, ముత్తులక్ష్మీ బాబు అనింది. నీ మనవడి పేరు కుమార్ కదూ అన్నాడు, అవును బాబు అనింది ఆ ముసలవ్వ.


 ఇక చేసేది లేక తిరుగు ప్రయాణం అయ్యాడు, అప్పుడు తనకు ఒక విషయం గుర్తొచ్చింది, ఆ ముసలవ్వ మనవాడి పేరు రిపోర్ట్ లో కుమార్ అని ఉంది. వెంటనే ఆ పల్లెటూరికి వెళ్ళారు వాళ్ళు, మళ్ళీ వీళ్ళను చూస్తూనే ఎంతో సంతోషించింది ఆ అవ్వ. నీ పేరేంటి అవ్వ అని అడిగాడు వైద్యనాథ్. ముత్తులక్ష్మీ బాబు అన్నది. అప్పుడు అర్ధమయ్యింది ఆ ముసలాయన ఇచ్చిన పొట్లం వీరికోసమే అని, తన బాగు లోనుండీ తీసి అది ఆవిడకు ఇచ్చాడు. మొదటిసారిగా ఒళ్ళు పులకరించింది వైద్యనాథ్ కి, తనలోని నాస్తికత్వం పటాపంచాలయ్యింది, కళ్ళలో నీళ్ళు కారడం మొదలయ్యాయి. ఏవిటి బాబు ఏమయ్యింది, ఇవన్నీ ఎందుకడుగుతున్నారు అనడిగింది ఆ ముసలవ్వ. 


అవ్వా ! నువ్వెంత అదృష్టవంతురాలివి నీకోసం ఢిల్లీ నుండీ నన్ను రప్పించాడు ఆ దేవుడు అని జరిగినదంతా చెప్పి, తన బాగు లోనుండీ అ పొట్లం తీసి వణుకుతున్న చేతులతో ఆ ముసలవ్వకిచ్చాడు వైద్యనాథ్. అక్కడి వారందరికీ ఆ క్షణం భగవంతుని అనుగ్రహం వర్షిస్తున్నట్లనిపించింది. ఆనందబాష్పాలు రాలుతుంటే ఆవిడ అది తెరిచి చూసింది, అందులో కాస్త విభూతి, అక్షితలు ఉన్నాయి. ఆ ఇచ్చింది సుందరేశ్వరుడైన ఈశ్వరుడే, మా ఇంటి దేవుడు ఆయనే అని చెప్పి కన్నీళ్లు తుడుచుకుంటూ, ఆ పొట్లాన్ని భక్తితో కళ్ళకద్దుకుని నుదుటిన పెట్టుకుని, అక్కడ ఉన్న అందరికీ పెట్టింది. వైద్యనాథ్ ఒళ్ళంతా పులకరించింది, వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని ఢిల్లీ కి ప్రయాణమయ్యారు వైద్యనాథ్, కాంపౌండర్.


తను ఇంటికి చేరి జరిగిందంతా చెప్పాలనే ఆతృతతో ఉన్నాడు. తలుపు తీస్తూనే గౌరీ, నీకో విషయం చెప్పాలి ఇలారా అంటూ సోఫాలో కూర్చోబెట్టి జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పాడు, గౌరికి కూడా ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యింది. ఉండండి అంటూ లోపలికి వెళ్ళి ఒక కవర్ తెచ్చిచ్చింది. దాని మీద పేరు ఊరు లేదు, ఎక్కడి నుండీ వచ్చింది, ఎవరు పంపిందో తెలియదు, ఇదేక్కడిది అని అడిగాడు వైద్యనాథ్. మొన్న మీరు రామేశ్వరం వెళ్ళిన రోజున మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఒకాయన వచ్చారు, మీకు బాగా తెలుసునని చెప్పి మీకిమ్మని ఈ కవర్ ఇచ్చారు అని చెప్పింది. దానిని వెంటనే తీసి చూసాడు, అందులో పది వేల రూపాయలు, ఒక లెటర్ ఉంది. ఆ లెటర్ తీసి చూస్తే అందులో మీనాక్షీ సుందరేశ్వరుల దివ్య ఆశీస్సులతో అని రాసుంది, అలానే ఆ దేవతా మూర్తుల చిత్రపటం చిన్నది ఒకటుంది. 


వైద్యనాథ్ వలవలా ఏడ్చేశాడు, స్వామి వారి అనుగ్రహం ఎంతని చెప్పగలం అంటూ, అది చూసి నివ్వెరపోయింది గౌరీ, మీరెంత అదృష్టవంతులండీ స్వామి మీతో మాట్లాడారు అని భర్త కాళ్ళ మీద పడి దణ్ణం పెట్టింది. 


 అప్పుడు వైద్యనాథ్, ఆయన వచ్చినప్పుడు తినడానికి బొబ్బట్లు  పెట్టావా అని అడిగాడు, అవునండీ అనింది గౌరీ, ఆయన నాకు మధురైలో నువ్వు బొబ్బట్లు పెట్టిన విషయం కూడా చెప్పాడు, అప్పుడు ఏదో పిచ్చి వాడు అనుకుని పట్టించుకోలేదు, ఆ మహాదేవుడ్ని గుర్తించలేకపోయాను అంటూ ఏడుస్తూనే ఉన్నాడు. ఈ విషయం వినగానే గౌరి ఒళ్ళంతా వెయ్యి వాట్ల విద్యుత్తు ప్రవహించినట్లయ్యింది, తన ఇంటికి వచ్చి, తను పెట్టిన బొబ్బట్లు సాక్షాత్తూ ఆ ఈశ్వరుడే తిన్నాడంటే ఎంత అదృష్టం కదా, ఎన్నో జన్మల పుణ్యఫలం అది. స్వామి నీతోనూ మాట్లాడాడు, నువ్వు పెట్టిన నైవేద్యం తిన్నాడు అని చెప్పాడు వైద్యనాథ్. అది తలచుకుని ఆనందభాష్పాలు రాల్చింది గౌరీ.


సాధారణంగా అటువంటి ఆపరేషన్ కు 7 వేలు తీసుకుంటాడు వైద్యనాథ్, రాను పోనూ చార్జీలతో కలిపి పది వేల వరకూ అయ్యింది. అదే ఇలా ఇచ్చాడు అనిపించింది వైద్యనాథ్ కు. వెంటనే గౌరీ వైద్యనాథ్ లు మధురై వెళ్ళి, మీనాక్షీ సుందరేశ్వరులను దర్శించుకుని, మళ్ళీ ఆ పల్లెటూరికి వెళ్ళి కుమార్ కు ఎలా ఉందో కనుక్కుని, ఆ పది వేలు ఆ అవ్వకు ఇచ్చేసారు ...


చూసారా ఢిల్లీ ఎక్కడ, మధురై ఎక్కడ, ఆ పల్లెటూరు ఎక్కడ, రామేశ్వరం ఎక్కడ ... ఎవరిని ఎలా కలుపుతాడో, ఏ పావును ఎలా కదుపుతాడో ఆ ఈశ్వరునికే ఎరుక ... మా అమ్మమ్మ ఈ లీలను చెప్పడం అయ్యేసరికి అందరికీ ఆనందభాష్పాలు రాలడం మొదలయ్యింది, పిల్లలకు అన్నం తినిపించేప్పుడు ఇలాంటివి చెప్పడం వలన వాళ్లలో సత్వగుణం మేల్కొంటుంది, వారి తినే అన్నం కూడా పవిత్రమైన ప్రసాదమవుతుంది అని మా అమ్మమ్మ అంటుండేది, ఈ లీల జరిగిన కొన్ని సంవత్సరాలకు డాక్టర్ వైద్యనాథ్ వాళ్ళ కుటుంబం మధురై వచ్చి స్థిరపడ్డారట, వాళ్ళ బంధువులు చెన్నైలో మా అమ్మమ్మ గారి పక్కింట్లో ఉన్నప్పుడు చెప్పిన అనుభవం ఇది, ప్రస్తుతం వారి వివరాలు తెలియవు కానీ ఇటువంటి లీలలు ఎందరో భక్తుల జీవితాలలో నేటికీ జరుగుతూనే ఉన్నాయి, మన అదృష్టం కొద్దీ మనకు కూడా తెలుస్తుంటాయి, మరింత భక్తి శ్రద్ధ విశ్వాసాలు పెంపొందించుకుంటే మనకూ అనుభవమవుతూ ఉంటాయి.


🌺🍀🌹💦💐🌷🌻☘️

సర్వేజనా సుజనోభవంతు

సర్వే సుజనా సుఖినోభవంతు


అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ

సేకరణ: ముఖ పుస్తకం.

రుద్రంలో భగశ్చమే

 రుద్రంలో భగశ్చమే యని భగము అనగా ఈశ శబ్ద చైతన్యమై పదార్ధ రూపం దాల్చి సృష్టి ధర్మ లక్షణములుగల క్షేత్రమని తెలిను. ఆ రూపం ధరణియై అమ్మ రూపంలో సృష్టి మూల కారణమై ప్రకాశవంతమగుచున్నది.లేనియెడల క్షేత్రము చైతన్యమవనియెడలఅటువంటి సృష్టి మూలమైన ప్రకృతి ధర్మం తెలియదు. దీనికి సూర్య శక్తి మూల కారణము. సూర్యకాంతి కూడా జీవ లక్షణమునే  తెలియుచున్నది. సూర్యకిరణాలు ప్రతీ రోజు వక డిగ్రీ మార్పు వలన కాంతి లక్షణము భూమిపై మార్పు కలుగుచున్నది. మూర్ఖపు పిడి వాదన వలన సత్యం మరుగున పడి అజ్ఞానం, ఆవహించును జీవకోటికి. ఆంగ్ల భాషకు యితర అన్ని భాషలకు మూలమైన సంస్కృతం మూలం. బ బి అనగా కొంత మాత్రమే అనగా దాని లక్షణం తెలియదు. మెటీరియలైజ్ అయి భ ప్రకాశవంతమైన దాని లక్షణము తెలియును.అదియును జీవ ఆవిర్భావ లక్షణము అనగా భూ అయినది.భూ శక్తి ః విసర్గగా మారి భూః ప్రణవం తో కలిసి అనగా ఆ ప్రాణశక్తి ఫల్గుణీయని అణువు మార్పు చెందుటను తెలుపుచున్నది. అదియును కేతు శక్తి యైన మఘ ఎమ్ అనే పంచభూతాత్మకమైన మెటిీరియల్స్ సముదాయం మాఘ మాస శక్తి లక్షణముగా (కాంతి) నక్షత్రం యెుక్క రూపమే తరువాత నక్షత్ర శక్తి ఫల్గుణీయని అనగా చైతన్య మైన కాంతి లక్షణము గా తెలియుచున్నది. యిదే ఓం ప్రణవంతో గూడిన వ్యాహృతమైన భూః యని తెలియుచున్నది.తెలియుట అనగా భువః యని రూఢిగా తెలియుట. అనగా అది సత్యమని తెలుయుచున్నది. ప్రకృతి రూపంలో గల సృష్టి సత్యం. కాని  లయం కూడా సత్యమే. తెలుసుకుంటూనే వుందాం ఆచరిస్తూనే వుందాం.

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

  

*శ్రీ చెక్కా కేశవులు గారి అనుభవం..*


*(పదవ రోజు)*


శ్రీ స్వామివారితో చెక్కా కేశవులు గారు, తమ మనసులోని కోరికను సందేహిస్తూనే బయటపెట్టారు..ఆ కోరిక వినగానే శ్రీ స్వామివారు ఫక్కున నవ్వారు..


తనకు అమ్మవారి దర్శనం చేయించమని శ్రీ స్వామివారిని కేశవులు గారు కోరారు..శ్రీ స్వామివారు.."అది అంత సులభంగా..అరచేతిలో చూపేది కాదనీ..గొప్ప గొప్ప సాధకులకే సాధ్యం కాని కోరికలు కోరకూడదనీ.." కేశవులు గారికి నచ్చచెప్పబోయారు..కానీ..కేశవులు గారు మాత్రం..తల్లి వద్ద పసిబిడ్డ మారాము చేసినట్టు, అదే పట్టు మీద ఉండిపోయారు..


శ్రీ స్వామివారు..."సరే!..నాయనా..ఇలారా..నాకెదురుగా పద్మాసనం వేసుకొని స్థిరచిత్తంతో కళ్ళు మూసుకొని కూర్చో..ఎటువంటి పరిస్థితుల లోనూ కళ్ళు తెరవకు!..జాగ్రత్త సుమా!.." అని హెచ్చరించి కేశవులు గారిని తమ కెదురుగా కూర్చోబెట్టుకున్నారు..కేశవులు గారు కళ్ళు మూసుకున్నారు..శ్రీ స్వామివారు కూడా పద్మాసనం వేసుకొని..కళ్ళుమూసుకొని..సమాధి స్థితి లోకి వెళ్లిపోయారు..కొద్దిసమయం గడిచేసరికి..కేశవులు గారికి, తన శరీరమంతా కంపించిపోతున్నట్టు..ఏదో వెలుగు తన శరీరమంతా క్రమ్ముకుంటునట్లూ..తాను గాలిలో తేలిపోతున్నట్లు..అనుభూతి కలుగసాగింది..ఏం జరుగుతుందో అర్ధం కాలేదు..ఒకరకమైన భయం మనసునిండా ఆవరించిపోయింది..తట్టుకోలేక కళ్ళు తెరిచారు..పార్వతీదేవి మఠం లేదు..స్వామివారు లేరు..నింగినుండి నేలదాకా.. ఎఱ్ఱని కాంతిపుంజాలు వ్యాపించి ఉన్నాయి..


"స్వామీ!..స్వామీ!.." అంటూ వెఱ్ఱి కేకలు పెట్టారు..తనెక్కడున్నాడో తెలీడం లేదు..ఏదో మాయ క్రమ్ముకొస్తోంది..కొద్దిసేపటికి ఆ కాంతిపుంజాలు మాయమయ్యాయి..శ్రీ స్వామివారు పద్మాసనం లో నిశ్చలంగా కూర్చుని నవ్వుతూ వున్నారు..


"ఏం కేశవులు గారూ..అమ్మ దర్శనం అయిందా?.." అన్నారు..కేశవులు గారు ఇంకా ఆ భ్రమలో నుంచి బైటపడలేదు..వళ్ళంతా చెమటలు పట్టి.. కంపిస్తోంది..


"లేదు స్వామీ..ఆ వెలుగు భరించలేకపోయాను.." అన్నారు..


"చూసావా నాయనా!..కొద్దిపాటి చిత్కళ నే భరించలేకపోయావే.. ఇక సంపూర్ణ దర్శనం అయితే తట్టుకొని ఈ భూమ్మీద వుండగలవా?..మహా మహా యోగులు ఎంతో సాధన చేసి..తపస్సు చేసి..ఒక స్థాయికి చేరిన తరువాతే..ఆ వెలుగును భరించగలరు..ఆ నమ్మకం వారికి కలిగాకే..వారు భగవంతుడి సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేస్తారు..దైవ దర్శనం, యోగం, బ్రహ్మవిద్య అనేవి సులభసాధ్యాలైతే..ధనం తోనో..కానుకలతోనో..పొందేవి అయితే..ఈపాటికి ఈ భూమ్మీద ఎంతో మంది ధనవంతులు దేవీ దేవతల సాక్షాత్కారం పొంది..వారిని కూడా తమ ఇనప్పెట్టెలో దాచివుంచేవారు..దేనికైనా ఒక స్థాయి ఉంటుంది..గృహస్తు కర్తవ్యం గృహస్థు చేయాలి..సన్యాసి కర్మ..సన్యాసి చేయాలి..ఎవరికి నిర్దేశించిన మార్గం వారు అనుసరించాలి..నాలాటి వారికి ఈ యోగ సాధన అనువైనది..మేము ప్రలోభాలకు లొంగకూడదు..నా సౌకర్యాల కోసం నీవు తపించకు.." అని చెప్పారు..


కేశవులు గారికి ఆ క్షణమే శ్రీ స్వామివారు చేసిన బోధ బాగా హత్తుకున్నది.. ఆనాటి నుంచీ శ్రీ స్వామివారికి శిష్యుడిగా మారిపోయారు..తన కర్తవ్యమేమిటో చెప్పమని స్వామివారిని కోరారు..


"ఆ మాల్యాద్రి లక్ష్మీనృసింహుడి గర్భాలయాన్ని బాగుచేయించు!..భక్తులకు ఇబ్బందిగా ఉంది..పదిమందికి సేవ చేసినట్లుగా ఉంటుంది" అని శ్రీ స్వామివారు ఆజ్ఞాపించారు..తక్షణమే ఆ పని చేయిస్తానని..కాకుంటే ఒక్కసారి తన కోరికను మన్నించి, తన గృహాన్ని పావనం చేయమని ప్రాధేయపడ్డారు కేశవులు గారు..శ్రీ స్వామివారు సరే నని ఒప్పుకున్నారు..


ఆ తరువాత కొంతకాలానికి  విజయవాడ లోగల కేశవులు గారింటికీ శ్రీ స్వామివారు వెళ్లారు..అక్కడ కొంతకాలం వున్నారు..కేశవులు గారి తోడల్లుడు శ్రీ మెంటా మస్తాన్ రావు గారింట్లోనూ కొద్దిరోజులున్నారు స్వామివారు..శ్రీ స్వామివారు ఎక్కడున్నా తన సాధన మాత్రం ఖచ్చితంగా చేసేవారు..కేశవులు గారు, మస్తాన్ రావు గార్లు నాగార్జున సాగర్ సమీపంలో ఒకటిన్నర ఎకరా స్థలాన్ని శ్రీ స్వామివారి ఆశ్రమం కోసం ఇస్తామని తెలిపారు..వద్దు అని ఖచ్చితంగా చెప్పేసారు శ్రీ స్వామివారు.


శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నృసింహుడి గర్భాలయ మరమ్మత్తులు కేశవులు గారు మొదలుపెట్టారు..సరిగ్గా అప్పుడే శ్రీధరరావు గారితో పరిచయం ఏర్పడింది కేశవులు గారికి..శ్రీధరరావు గారితో శ్రీ స్వామివారి గురించిన మరెన్నో విశేషాలు కేశవులు గారు చెప్పుకొచ్చారు..ఇద్దరికీ శ్రీ స్వామివారి మూలంగా విడదీయరాని అనుబంధం ఏర్పడింది..


అలా శ్రీధరరావు గారు  శ్రీ స్వామివారి గురించి అన్ని వివరాలూ సేకరించారు...అందుకే..ప్రభావతి గారడిగినప్పుడు "అన్ని విషయాలూ నేను చెపుతాను ప్రభావతీ!.." అన్నారు...


శ్రీ స్వామివారి కోరిక....రేపటి భాగంలో..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

సమర్పించిన

 వందేమాతరం


దత్తా అనే పదానికి "సమర్పించిన" అనే అర్థముంది, త్రిమూర్తులు   సప్తర్షులలో ఒకడైన అత్రి మహర్షి, అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము "సమర్పించుకున్నారు" కనుక అతడికి దత్తా అని పేరు వచ్చింది. ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు "ఆత్రేయ" అయింది.


గురుతత్వానికి మొదటివాడు అవడంవల్ల ఈయనకు ఆదిగురువనే పేరు ఉంది.  ఆయన ఎందరో మహా పురాణపురుషులకు, దేవతలకు జ్ఞానబోధ చేసినట్లు వివిధ పురాణాలలో ప్రస్తావించబడ్డాయి.


ఆ ఆదిగురువు అవతారాలలో ఒకటైన  విశ్వాంబరావధూత   జననం  *చైత్ర పౌర్ణమితో కూడిన మంగళవారం*.‌ అటువంటి మహత్యము గల ఈరోజు శ్రీ దత్తాత్రేయుని జన్మ విశేషాలు, ఆయన షోడశ అవతారములు, వాటి విశేషాల గురించి శ్రీమతి పమ్మి శేషారత్నం గారు విపులంగా వివరించారు.


https://drive.google.com/file/d/1L2bdfWXbGU5qi9Q0TREEgtIJUZ4-uPf7/view?usp=drivesdk


ఇది భక్తులు అందరూ తప్పక విని శ్రీ దత్తాత్రేయుని అవతార విశేషాలు తెలుసుకోగలరని మనవి.


భవదీయుడు


దశిక ప్రభాకర శాస్త్రి

హనుమజ్జయంతి

 _*హనుమజ్జయంతి ఎప్పుడు జరుపుకోవాలి ? హనుమజ్జయంతి రోజు ఆంజనేయ స్తోత్రాలను స్తుతిస్తే ?*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


హనుమజ్జయంతి చైత్రంలోనా , వైశాఖంలోనా.. ఎప్పుడు చేసుకోవాలనే అనుమానం చాలామందిలో కలుగుతుంది. అలాంటి వారు ఈ కథనం చదివితే సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి , శనివారం జన్మించారని తెలిపారు. అదే రోజున హనుమజ్జయంతి చేసుకోవాలి. 


అయితే కొన్ని ఐతిహ్యాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదిరత రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది. ఈ కారణంగా ఆ రోజు హనుమద్‌ విజయోత్సవం చేసుకునే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. దీన్ని ఉత్తరాదిలో హనుమజ్జయంతిగా చేసుకుంటారని పండితులు సూచిస్తున్నారు. 

 

అలాగే చైత్ర పూర్ణిమ నాడు హనుమంతుని జయంతి జరుపుకుంటారు. చైత్ర పూర్ణిమ నుంచి 41 రోజుల పాటు ఆంజనేయునికి దీక్ష చేస్తారు. ఈ దీక్ష చివరి రోజున మళ్లీ హనుమజ్జయంతి చేసుకుంటారు. ఈ 41 రోజులు తెలుగు ప్రజలు ఆంజనేయునికి ఉత్సవాలను జరుపుతారు. వైశాఖ బహుళ దశమి నాడు దీక్షా విరమణ చేసి.. వైభవంగా పూజలు నిర్వహిస్తారు. 

 

హనుమజ్జయంతిని వైశాఖ బహుళ దశమినాడు జరుపుకునేందుకు ఓ బలమైన కారణం వుంది. *"కలౌ పరాశర స్మృతి:"* అని శాస్త్రాలు చెప్తున్నాయి. 

 

*శ్లో: వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే* 

*పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనూమతే ||* అని చెప్పబడింది. దీని ప్రకారం వైశాఖ మాస బహుళ దశమి నాడు హనుమజ్జయంతిని జరుపుకుంటారు. ఈ రోజున హనుమాన్ చాలీసా , ఆంజనేయ స్తోత్రాలను స్వామిని స్తుతిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

fb నుండి సేకరించబడినది

మహాభారత తాత్పర్యము

మహాభారత తాత్పర్యము

ఇక్కడ ఉన్నదే ఎక్కడైనా ఉన్నది. ఎక్కడ లేనిది ఎక్కడా లేదు. అన్న వ్యాసుడి వాక్యం మహాభారతాన్ని స్థూలంగా వర్ణించేది. విశ్వమంతా వ్యాపించి ఉన్న ప్రతి అంశం దీనిలో నిక్షిప్తం కావడం వల్ల విశ్వం యొక్క తాత్పర్యం గ్రహించడం ఎంత కష్టమో, దీని తాత్పర్యం గ్రహించడం అంతే కష్టం. మహాభారత ఆరంభంలో రెండు చెట్లను వ్యాసుడు వర్ణించాడు. యుధిష్ఠిరుడనే ధర్మ వృక్షము, దుర్యోధనుడనే మన్యు వృక్షము ఈ గాథకి ప్రధాన ఆధారాలు. రెండు చెట్లు విడిగా వర్ణించడం వల్ల ఈ గాథంతా రెండు ప్రవాహాలుగా, సమాంతరంగా.. కొన్ని చోట్ల ఓతప్రోతంగా ప్రవహించినట్లు గ్రహించవచ్చు. మొత్తం గాథలో శంతనుడి కామ భావం, ఆధారంగా సత్యవతి వివాహం జరగడం భీష్ముడు రాజ్యత్యాగం చేయడం ఈ కథకు ఆధార బిందువు. అయితే, భీష్ముడి వంటి దైవాంశ సంభూతుడు, ఆద్యంతము వ్యాపించి ఉండటము, అతడు సమర సందర్భంలో ధర్మ పక్షంలో కాకుండా అధర్మ పక్షంలో నిలిచి పోవడం ఒక విలక్షణమైన విరోధాభాస. పతితమైన బ్రాహ్మణ్యం శస్త్రాన్ని ధరించడం ద్రోణుడి పాత్రలో వ్యక్తమైతే, ఆతడు ప్రతీకార వాంఛతో ద్రుపదుణ్ణి పరాభవించటం, ఏకలవు్యడి నుంచి గురుదక్షిణగా అంగుష్ఠాన్ని యాచించడం, మొత్తం యుద్ధంలో పాండవులకు వ్యతిరేకంగా ప్రవర్తించటం ఒక విచిత్రమైన సన్నివేశం. అంతేకాక ద్రోణుడి కుమారుడు అశ్వత్థామ ఎప్పుడూ ధర్మ చైతన్యంతో సంబంధం లేకుండా అసూయతో జీవించటం, యుద్ధాంతంలో అపాండవం కరిష్యామి అని చనిపోతున్న దుర్యోధనుడికి వాగ్దానం చేసి నిద్రితులైన ఉప పాండవులను సంహరించటం, గర్భస్థుడైన ఉత్తరాసుతుణ్ణి సంహరించటానికి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించటం ఒక పిశాచావేశం లాగా గోచరిస్తుంది. అర్జునుడితో పాటు తాను రుద్ర ఆరాధకుడైనా, రుద్రుడి లోని ఆనుకూల్యాంశం ఇతణ్ణి ఎప్పుడూ ఆవేశించలేదు.

ధృతరాష్ట్రుడికి రాజ్యాధికారం లేకపోవడం, పాండురాజు దిగ్విజయాలు సాధించి అతని చేత నూరు అశ్వమేధాలు చేయించినా, చివరకు అరణ్యవాసంలో శాపగ్రస్తుడై మరణించటం వల్ల ధృతరాష్ట్రుడు, రాజు కావడం సంభవించింది. రాజ్యాధికారం కలిగిన గుడ్డివాడు, అతని ప్రవృత్తి అంతా అంతర్బహిర్చేతనలలో వైరుధ్యంతో పుత్ర మమకారం వల్ల పాండవుల యందు పెంచుకున్న అప్రీతి వల్ల ఒక నాటకంగా జీవితం గడపడం జరిగింది. మహా భారతానికి మొత్తం నాయకుడైన ధర్మరాజు ద్యూత వ్యసనం వల్ల ద్రౌపది దయ వల్ల కలిగిన రాజ్యం కూడా పోగొట్టుకోవడం అరణ్యవాస, అజ్ఞాత వాసములు చేయవలసి వచ్చింది. ధర్మరాజులో ఎంత మెత్తదనం ఉన్నదో అంతటి ప్రతీకారేచ్ఛ కూడా ఉన్నట్టు అది గడుసుదనం వల్ల చప్పబడినట్లు యుద్ధ పర్వాల్లో గోచరమవుతుంది. దుర్యోధనుడు క్రోధము, అసూయ ఈ రెండు లక్షణాలు మూర్తీభవించినవాడు. తనకు జన్మతః సంక్రమించని రాజ్యాధికారాన్ని పొంది దాన్ని ఇతరులతో పంచుకునే ఉద్దేశం లేకుండా దురాశ వల్ల పాండవులను చిన్ననాటి నుంచి ప్రతీకారేచ్ఛతో రూపుమాపడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఈ విషయంలో అతడు చేయని దుష్కార్యం, పాపము మరెక్కడా లేదు. దుశ్శాసనుడు కేవలం సేవాధర్మం కలిగిన వాడే తప్ప అతని స్వతంత్రించి చేసిన కార్యమంటూ ఏమీ లేదు. ద్రౌపది వస్త్రాపహరణ సందర్భంలో కర్ణుడు ప్రవర్తించిన తీరు సజ్జనులకెవరికైనా సిగ్గు తెప్పించేదే. దుర్యోధనుని వస్త్రాపహరణాది దుష్కార్యాలకు ప్రేరేపించి తన దుష్టమైన వాక్కుల చేత భారతానికే కళంకం ఆపాదించినాడు. అతని లోని ధర్మవేతృత, దానుగుణం, పరాక్రమము, మిగిలిన గుణాలన్నీ ఈ ఒక్క దోషంతో తుడుచుకుపెట్టుకు పోతున్నవి.

అసలు విచిత్ర వీర్యుడు చనిపోయిన తరువాత సత్యవతి ప్రార్థననుసరించి భీష్ముడే రాజ్యాన్ని గ్రహిస్తే, చరిత్ర మరొకరకంగా ఉండేది. ఆతడు రాజు కాకున్నా, కాశీరాజు సభలో ఆతని పుత్రికలను బలవంతంగా తీసుకువచ్చినప్పుడు తరువాత అంబను విడిచిపుచ్చడం, ఆమె తిరిగి రాగా స్వీకరించకపోవడం ఆ పట్టుదలను నిలుపుకోవడం కోసం గురువుతో కూడా పోరాడటం, అనేక సందేహాలకు ధర్మ వైరుధ్యాలకు తార్కాణమైన అంశం. యుద్ధం తరువాత అంపశయ్య మీద నుంచి ధర్మరాజుకు ఉపదేశం చేయడం తాను అంతకు ముందు ఆచరించిన దోషాలను తొలగించుకోవడం కోసం చేసిన ప్రాయశ్చిత్త కర్మగా కనిపిస్తుంది. అతని లోని కృష్ణ భక్తి తత్త్వ జ్ఞానం, ఇవేవీ అంపశయ్య మీదకు చేరేదాకా పనిచేసినట్టు లేవు. భీష్ముడు వసు రుద్రాదిత్యులలో వసువులు భూ చైతన్యానికి చెందిన వారు. అందువల్లనే శరీరాన్ని పోషించిన కౌరవుల యెడ ఆతడు కృతజ్ఞుడై ఉండటం జరిగి ఉండవచ్చు.

మహాభారతంలో ప్రధానంగా మూడు యజ్ఞాలు, కనిపిస్తుంటాయి. సర్పయాగము, రాజసూయం, అశ్వమేథం. సర్పయాగం ప్రతీకార బుద్ధితో ఒక వ్యక్తి చేసిన దోషానికి ఒక జాతిని సంహరించే కార్యం. అంతకు ముందు భార్గవ రాముడు క్షత్రియుల విషయంలో ఇదే పని చేశాడు. ఈ ప్రతీకార బుద్ధి వల్ల సత్వరజస్సులు అణగి తమోగుణం ఆవరిస్తుంది. భారత ఆరంభం ప్రవేశ ద్వారం ఈ తమస్సు చేత నిర్మింపబడ్డది. రాజసూయం రజో గుణ ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పింది. ధర్మరాజు చక్రవర్తిగా అభిషేకింపబడటం దీని లక్ష్యం. దీని కోసం అతని తము్మలు నిర్వహించిన విజయయాత్రలు హింస లేనివని జన నష్టం లేనివని చెప్పడానికి అవకాశం లేదు. ధర్మరాజు యుద్ధానంతరం చేసిన రాజసూయం ఒక చక్రవర్తి చేయగలిగిన కార్యం. దీన్ని నిర్వహించినప్పుడు ఆ యాగంలో చేయబడే సర్వ త్యాగ లక్షణం చేత అది సత్వమయంగా నిర్వహింపబడి ఉండవచ్చు.

మహాభారతంలో మూడు ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. ఒకటి, సనత్సుజాతీయము, రెండు భగవద్గీత, మూడు విష్ణు సహస్రనామము. సనత్సుజాతీయములో మృత్యువు యొక్క స్వరూపము చెప్పబడింది. మృత్యువంటే ప్రమాదము, ఏమరుపాటు. ఏమరుపాటు లేనివానికి సదా బ్రహ్మచైతన్యంలో నిలిచి ఉండేవానికి మృత్యువు అనేది ఉండదు. మనం అనుకునే మృత్యువు దేహముల యందు మాత్రమే. జాగ్రదవస్థలో నిలిచి ఉండేవాడు నిత్య జన్మ జన్మాంతరాలలో చైతన్య ధార తెగకుండా ఉండటం వల్ల మృత్యు అనుభవాన్ని పొందనే పొందడు. అట్లాగే భగవద్గీత కూడా మృత్యు తత్వాన్నే ప్రధానంగా ప్రస్తావించింది. ``కాలోస్మి లోకక్షయకృత్‌ ప్రవృద్ధః'' నేను మృత్యు స్వరూపాన్ని లోకాన్ని నశింపజేయడం కోసమే ప్రవర్తిస్తున్నాను అని భగవంతుడు చెప్తున్నాడు. ఈ జీవితమంతా మృత్యుముఖంగా పయనించడమే దీని యథార్థ తత్త్వం. ఈ మృత్యు రహస్యాన్ని చెప్పడం కోసం కథాగతంగా నడుమ సావిత్రి ఉపాఖ్యానాన్ని వ్యాస మహర్షి ప్రపంచించడం జరిగింది. మృత్యువును తరించే లక్షణము ఈ గాథ ఉపనిషత్‌ సంప్రదాయం ప్రకారం నిర్వహించవలసిన యోగ రహస్యాన్ని చెప్పడం కోసం తెల్పబడింది. విష్ణు సహస్రనామము కూడా విశ్వం అనే శబ్దంతో ప్రారంభమై సర్వప్రహరణాయుధ శబ్దంతో పూర్తయి సృష్టి అంతా మృత్యుతీరానికి చేరుతున్న అంశాన్ని తెలియజేస్తుంది. అందువల్లనే మహాభారతానికి మృత్యువు పుత్రుడైన ధర్మరాజు నాయకత్వం వహిస్తున్నాడు. మొత్తం మహాభారతం సర్పయాగం నుంచి స్వర్గారోహణం దాకా మృత్యుహేలయై ప్రవర్తించింది. పాండవులందరూ మృత్యు పుత్రుడు తప్ప చివరకి మృతి చెందారు. అతని స్వర్గారోహణం కూడా నరక దర్శనం చేత మృత్యు తత్తా్వన్ని మరల మరల గుర్తు చేస్తుంది. అతని వెంట నడిచి వచ్చిన ధర్మరూపమైన శునకం కూడా మృత్యువునకు ప్రతీకయే కావచ్చును.

ఈ మొత్తం ఇతిహాసానికి కేంద్ర బిందువైన ద్రౌపది అగ్ని సంభూత. ఈ అగ్ని పంచభూతాలలో కేంద్ర స్థానంలో నిల్చి ఉంటుంది. పంచభూతాలు పంచపాండవులైతే, అగ్ని పార్థుడవుతాడు. ఈ పార్థుడు నరనారాయణులలోని నరుడనే తపస్వి. ఈ మృత్యుక్రీడ కోసం లోకంలో తమోమయ, రజోమయ శక్తులను తొలగించివేయడం కోసం అర్జునుడుగా ఈతడు అవతరించి లయకారకుడైన శివుని వరాన్ని పొంది కురుపాండవ యుద్ధాన్ని మొత్తం నిర్వహించాడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు ఈ మొత్తం ఇతిహాస ప్రవర్తనలో ఎక్కడా ప్రత్యక్షంగా జోక్యం కలిగించుకోలేదు. ఒక్క ద్రౌపది వస్త్రాపహరణ సందర్భంలో మాత్రమే ఆయన వస్త్రప్రదానం చేసి ఆమెను రక్షించడం ద్వారా సర్వ జగత్‌ ప్రవృత్తికి మూలమైన స్త్రీత్వాన్ని చెదరకుండా కాపాడటం జరిగింది. మిగిలిన అన్ని సందర్భాల్లో ఆయన సాక్షీభూతుడే. భగవద్గీత ఎంత ప్రవర్తించినా, దాని సారంగా తేలేది తస్మాత్‌ యుధ్యస్వ అన్న మాటయే. యుద్ధం చేయమని చెప్పడం స్థితికారకుడైన నారాయణ లక్షణం కాకుండా, రుద్రాంశ ఆవరించిన శివుని లక్షణంగా కనిపిస్తుంది. మొత్తం మహాభారతంలో ఈ దృష్టితో చూసినప్పుడు ఇదంతా హరిహరుల క్రీడవలె, మహామాతృ అంశమైన కాళికాదేవి వైభవం వలె గోచరిస్తుంది. ద్రౌపదీదేవి కాళికాదేవి యొక్క రూపాంతరమే.

కోవెల సువ్రసన్నాచార్య