నరేంద్ర మోడీగారు మన మీడియాకి ఎందుకు నచ్చరో ఈ క్రింది ఆర్టికల్ చదివితే మీకే అర్థం అవుతుంది
ఇది రెండేళ్ల క్రితం రాసిన పోస్ట్...
భారత మీడియా హౌస్ లకి స్వర్ణ యుగం :2004-2014 UPA 1 & UPA 2. మౌన ముని [మన్మోహన్] ప్రధానిగా ఉన్న 10 సంవత్సరాలు అటు లెఫ్ట్ మీడియా ఇటు ఖాంగ్రెస్ బూట్లు నాకే మీడియా కి స్వర్ణ యుగం.
మౌనముని విదేశీ పర్యటనకి వెళ్ళినప్పుడల్లా ఆయన వెంట ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు, IFS,IRS,IAS అధికారులు వెంట వెళ్ళేవారు ఇది సహజం,అవసరం కూడా. కానీ ప్రధాని పర్యటన కవరేజీ కోసం తన వెంట మీడియా ప్రతినిధులని తీసుకెళ్ళేవారు. ఒకరో ఇద్దరో కాదు తంబలు తంబలుగా వెళ్ళేవారు. ఎయిర్ ఇండియా ఒన్ విమానంలో 36 'బిజినెస్' క్లాస్ టికెట్స్ వీళ్ళకోసం కేటాయించేవారు. విమానం ఎక్కినప్పటి నుండి వీళ్ళకి రాచ మర్యాదలు జరిగేవి. ఖరీదయిన విదేశీ మద్యం సరఫరా చేసేవారు ఇన్ ఫ్లయిట్ లో. వీళ్లలో కొందరు తమకి ప్రత్యేక బ్రాండ్ కావాలని పట్టుబట్టి మరీ సెర్వ్ చేయించుకునే వారు. ఆహారం అంతా కాంటినెంటల్ స్టైల్ అడిగి మరీ వడ్డించుకునేవారు. ఇక ప్రధాని వెళ్ళిన దేశంలో వీళ్ళకి ఫైవ్ స్టార్ హోటల్ లో బస ఏర్పాటు చేసేవారు అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారులు. ప్రధాని సమావేశం చాలా క్లుప్తంగా జరిగిపోయేది. ఒకరో ఇద్దరినో ఆ సమావేశం కోసం వదిలి మిగతావాళ్ళు ఆ దేశంలో ఉన్న ఫేమస్ ప్లేసెస్ ని చూడడానికి వెళ్ళేవాళ్లు అఫ్కోర్స్ ప్రయాణం కోసం కార్లు అక్కడి రాయబార కార్యాలయం అధికారులు ఉచితంగా ఏర్పాటు చేసేవారు. ఇక సాయంకాలాలు ఆయా దేశాల్లో షాపింగ్ చేసిన తరువాత ఆ దేశ ప్రధానో,అధ్యక్షుడో మన ప్రధానికోసం విందు ఏర్పాటు తప్పనిసరి ప్రోటోకాల్. సదరు జర్నలిస్టులు విందుకు హాజరయ్యేవారు. తాగినంత,తిన్నంత ...వస్తూ వస్త్తో అక్కడ అతిధులకోసం ఉంచిన మద్యం బాటిళ్ళు తమతో పాటు హోటల్ కి పట్టుకెళ్ళేవాళ్లు. ఇక ప్రధానితో పాటు వచ్చిన అతిధులు కాబట్టి ఆతిధ్యమ్ ఇచ్చే దేశం ఉచిత కానుకలు అందరితో పాటు వీళ్ళకి కూడా. తిరిగి మన దేశంలోకి వచ్చినప్పుడు దౌత్యవేత్తలకి మాత్రమే ఉండే 'గ్రీన్ చానెల్ ' ద్వారా విమానాశ్రయం నుండి బయటికి వచ్చేవాళ్లు ...అంటే కస్టమ్స్ చెకింగ్,పన్నులు కట్టడాలు ఏమీ ఉండవు. తమతో పాటు తెచ్చుకున్న ఖరీదయిన ఎలెక్ట్రానిక్ గాడ్జెట్స్ కి టాక్స్ ఫ్రీ ఎగ్జిట్ అన్నమాట. టాక్స్ పేయర్స్ సొమ్ము వీళ్ళ పాలు.
ప్రధానితో పాటు విమానంలో ప్రయాణిచ్చేటపుడు ప్రధాని కార్యాలయ [PMO ] ముఖ్య అధికారులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడడం వాటిని ఉపయోగించుకొని పైరవీలు చేసి డబ్బు సంపాదించడం జరిగింది. అడిగిందే తడవుగా మౌనముని వీళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాబట్టి అధికారులు వీళ్ళు అడిగిన పని చేసిపెట్టేవారు.ఇక ప్రధాని ఇచ్చే విందు సమావేశాలలో వీళ్ళకి 'బ్లాక్ లేబుల్ ' తప్పని సరిగా ఉండాలి. సమావేశం ముగియగానే తలా ఓ రెండు మూడు బ్లాక్ లేబుల్ బాటిళ్ళు తమతో తీసుకెళ్ళేవారు. ఒక దశలో వీళ్ళని ప్రధాని కార్యాలయ సిబ్బంది బ్లాక్ లేబుల్ బాచ్ వస్తుంది ఈ రోజు కాబట్టి మామూలుగా కంటే ఎక్కువ కౌంటర్ల మీద పెట్టాలి అని విసుక్కునెంతగా ఉండేది వీళ్ళ ప్రవర్తన.
వీళ్ళు చేసిన సేవలకి గాను పద్మశ్రీ,,పద్మ విభూషణ్ లు కానుకగా ఇచ్చింది UPA ప్రభుత్వం. రాజ్దీప్ సర్దేశాయ్, బర్ఖా దత్,శేఖర్ గుప్తా [పద్మ విభూషణ్ ],వినోద్ దువా , జావేద్ ఆనంద్ [ఈ పేరేంటో వింతగా లేదు ?తీస్తా సెతేల్వాద్ భర్త ],ప్రఫుల్ బిద్వాయి ,పుణ్య ప్రసూన్ బాజ్పెయీ ,విక్రమ్ చంద్రా [ఓనర్ NDTV ],ప్రాంజోయ్ గుహ తాకుర్త, రవీశ్ కుమార్ [NDTV ],అరుణ్ పూరీ , నిధి రజ్దాన్ [NDTV], కిరణ్ ధాపర్ ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది. వీళ్ళందరూ ఏం పొడిచారని ? ఖాంగ్రెస్ కుంభకోణాలని వెనకేసుకువచ్చారనా ?
డిసెంబర్ 2013 లో NDTV 25th వార్షికోత్సవం రాష్ట్రపతి భవన్ లో జరిగింది తెలుసా ? రాష్ట్రపతి భవన్ ఏమన్నా ఫంక్షన్ హాలా ? ఎవరి రికమెండేషన్ తో అనుమతి ఇచ్చారు ? ఇలాంటి అనుమతులే The Hindu,Times of India కి ఇచ్చారు. అసలు ఈ విషయం ఎవరి దృష్టికీ రాకపోయి ఉండవచ్చు.
రాజ్దీప్ సర్దేశాయ్ బంగ్లా ఢిల్లీ ల్యూటెన్స్ లో ఉంది. ఇతర జర్నలిస్టుల బంగ్లాలు కూడా అదే VVIP ప్రాంతంలో ఉన్నాయి. నీతి,నిజాయితీ అంటూ మడి కట్టుక్కూర్చున్న జర్నలిస్టులకి అక్కడ బంగ్లా ఉంటుందా ? NDTV మనీ లాండరింగ్ కేసులో కూరుకుపోయి ఉంది. బర్ఖా దత్, వీర్ సంఘ్వి ,రోహిణీ సింగ్ [The Wire], రాడియా టేపుల కుంభకోణంలో ఉన్నారు.
The Tribune : UPA2 కి వచ్చేసరికి ఒక జోక్ ప్రచారంలో ఉండేది అదేమిటంటే మౌనముని తన పార్టీలో ఏమి జరుగుతున్నది,అసలు తన ప్రభుత్వం గురుంచి తెలుసుకోవడానికి ట్రిబ్యూన్ పత్రిక చదివేవాడు. ఈ ట్రిబ్యూన్ పత్రిక పంజాబ్,హర్యానా,హిమాచల్ ప్రదేశ్, J&K రాష్ట్రాలలో ఫేమస్ కానీ పూర్తిగా ఖాంగ్రెస్ అనుకూల వార్తలు మాత్రమే ప్రచురిస్తుంది. అంటే తన ప్రభుత్వం గురుంచి తెలుసుకోవడానికి యే పత్రిక చదవాలో తెలియని పరిస్థితిలో ఉండేవాడు మౌనముని. ఈ విషయం ఇక్కడ ఎందుకు ప్రస్తావించాల్సి వస్తున్నది అంటే 2010 లో ఒక సమావేశంలో మాట్లాడుతూ కపిల్ సిబాల్ దాదాపు 150 ప్రింట్,ఎలెక్ట్రానిక్,వెబ్ మీడియా హౌసెస్ ప్రత్యక్షంగా పరోక్షంగా ఖాంగ్రెస్ కి చెందినవి ఉన్నాయి అంటూ నోరు జారాడు. తన పార్టీ గొప్పదనం గురుంచి చెప్పాలనుకొని అసలు విషయం బయటపెట్టుకొని సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు. 150 కాదు ఇంకా ఎక్కువే ఉన్నాయి కానీ కపిల్ సిబాల్ కి తెలియకపోవచ్చు. అసందర్భంగా కాంగ్రెస్ ని తిడుతూ సందర్భం వచ్చినప్పుడు కాంగ్రెస్ ని వెనకేసుకొచ్చే మీడియా కేంద్రాలు చాలానే ఉన్నాయి కాకపోతే మనం నిశితంగా పరిశీలిచలేకపోవడమే మనకి తెలియకపోవడానికి కారణం.
కొన్ని నిజాలు : 1.శోభన భర్తీయా ,కాంగ్రెస్ MP, చైర్ పర్సన్ ,హిందుస్తాన్ టైమ్స్ . 2.సోనియా సింగ్ , కాంగ్రెస్ MP -MPRPN సింగ్ భార్య ,ఎడిటోరియల్ డైరెక్టర్, NDTV. 3. రాజీవ్ శుక్లా , న్యూస్ 24 చానెల్ యజమాని , కాంగ్రెస్ MP. 4. నవీన్ జిందాల్ కాంగ్రెస్ MP మామకి 17% స్టేక్ NDTV లో ఉంది. 5. బర్ఖా దత్ ,గ్రూప్ డైరెక్టర్,NDTV, రాడియా టేపుల కేసులో నిండుతురాలు,కాంగ్రెస్ స్టూజ్ . 6. వీర్ సంఘ్వి ,అడ్వైసర్ , హిందుస్తాన్ టైమ్స్ గ్రూప్,రాడియా టేపుల కేసులో మరో నిందితుడు. ఈ లిస్ట్ చాలా పెద్దది వ్రాసుకుంటూ పోతే పెద్ద పుస్తకం అవుతుంది.
2014: శ్రీ నరేంద్ర మోడీ నాయక్త్వంలో BJP అధికారంలోకి వచ్చింది. PMO లో పని చేసే వారు ఎవరయినా 10.30 కల్లా వాళ్ళ సీట్లలో ఉండాలి. బయో మెట్రిక్ ని స్ట్రిక్ట్ చేశారు. ప్రధాన మంత్రి సమావేశం ఉంటే I&PR ద్వారా తెలియచేస్తారు. సమావేశానికి ముందు టీ ,బిస్కిట్స్ మాత్రమే ఏర్పాటు చేస్తారు. ప్రధాని సమావేశం అయిపోగానే ఎక్కువసేపు అక్కడ ఎవరూ ఉండడానికి వీలులేదు. రాజ్దీప్ సర్దేశాయ్,బర్ఖా దత్, రవీశ్ కుమార్ లాంటి వాళ్ళు ప్రధానికి దూరంగా ఉండి వివరాలు నోట్ చేసుకోవాలి. మౌన ముని లాగా పక్కన కూర్చోపెట్టుకొని బాతాఖానీ ఉండదు.
ఇక మోడీ విదేశీ పర్యటనకి తనతో పాటు దూర్ దర్శన్ కి సంబంధించిన 6 గురు సిబ్బందిని తీసుకెళతారు. రోజుకి 18 గంటలు పనిచేసే ప్రధాని వీలున్నంత వరకు ఎయిర్ ఇండియా ఒన్ ఫ్లయిట్ లోనే నిద్రపోతారు మరీ అత్యవసరం అయితేనే వెళ్ళిన దేశంలో హోటల్ లో బస చేస్తారు. ప్రోటోకాల్ ప్రకారం విందు ఉన్నా కేవలం పళ్ల రసంతోనే సరిపెట్టేస్తారు. తిరిగి భారత్ కి రాగానే ఎయిర్ పోర్ట్ లోనే పత్రికా సమావేశం పెట్టి విలేఖరులకి తన పర్యటన విశేషాలు చెపుతారు. ఇంకా ఇన్ఫోర్మేషన్ కావాలంటే దూర్ దర్శన్ నుండి తీసుకోవచ్చు. మద్యం,మాంసం ఉండవు. కాంప్లిమెంటరీ బ్లాక్ లేబుల్ బాటిల్స్ లేవు. మౌన ముని హయాం లో PMO లో అన్నీ విభాగాల్లో స్వేచ్చగా తిరిగి అన్నీ విషయాలు తెలుసుకునే వాళ్ళు ,కీలక రక్షణ రంగ కాంట్రాక్టుల విషయంలో తల దూర్చేవాళ్లు , చివరికి అగాస్టా హెలికాప్టర్ కుంభకోణంలో కొందరి జర్నలిస్టుల పేర్లు బయటపడ్డాయి అంటే వీళ్ళు ఎంతలా ప్రభుత్వ విషయాల్లో చొచ్చుకుపోయారో ఊహించుకోండి.కీలకమయిన రక్షణరంగ కాంట్రాక్టుల విషయంలో విదేశీ సంస్తలతో మాట్లాడి కాంట్రాక్ట్ ఇప్పించే హామీలు ఇచ్చే స్థాయికి వెళ్లారు. ఇప్పుడు ఆ అవకాశం కాదు కదా PMO ఛాయలకి వెళ్లడానికి అవకాశం లేదు.
అన్నీ మేజర్ మీడియా హౌస్ లకి NGO ల ద్వారా విరాళాల రూపంలో డబ్బు అందేదీ. మోడీ NGO లని లెక్కలు అడిగాడు. చెప్పము లేదా చెప్పలేము అన్న అన్నీ NGO లని మూసేశాడు. స్వదేశంలో ఆదాయం రాక,విదేశాలనుండి విరాళాలు ఆగిపోవడం చేత తమ జేబుల్లోనుండి డబ్బు ఖర్చు పెట్టాల్సి రావడం మోడీ వ్యతిరేకతకి ప్రధాన కారణం. మన్ కీ బాత్ పేరుతో మోడీ తానే నేరుగా ప్రజలతో మాట్లాడడం,అత్యవసర సమయాల్లో తానే టివి ముందుకు వచ్చి నేరుగా ప్రజలకి సందేశం ఇవ్వడం తో ఈ మీడియా హౌస్ ల ప్రాధాన్యం తగ్గడం మరో కారణం. మోడీ వీళ్ళని బై పాస్ చేసేశాడు. దూర్ దర్శన్ ని ప్రజలు మళ్ళీ చూడడం ప్రారంభించారు. ఫైవ్ స్టార్ హోటళ్ళకి వెళ్ళి ఎంజాయ్ చేసి బిల్ కట్టకుండా వచ్చే అవకాశం ఇప్పుడు లేదు , వీళ్ళని ఎవరూ లెక్క చేయడం లేదు. పారిశ్రామిక వేత్తల నుండి ఇదివరకటిలాగా డబ్బు రావట్లేదు అనేకన్నా వీళ్ళని బేఖాతర్ చేస్తున్నారు. క్వింట్ జర్నలిస్ట్ సుప్రీతో మోడీ చనిపోతే బాగుండు అని వాగాడు, మోడీ ఏమన్నా చర్య తీసుకున్నడా ? ఒక ప్రధానిని అలా అనడం పత్రికా స్వేచ్చ అన్నమాట . టైమ్స్ ఆఫ్ ఇండియా జర్నలిస్ట్ లతీఫ్ అనేవాడు మోడీకి కరోనా వైరస్ రావాలి అని బహిరంగంగా వాగాడు కానీ ఎడిటర్స్ గిల్డ్ ఎలాంటి చర్యా తీసుకోలేదు. స్థలాభావం వల్ల చాలా విషయాలు వ్రాయకుండా వదిలేస్తున్నాను.
ఇప్పుడు చెప్పండి ! పాల్ఘార్ లో నాగా అఖాడా సాధువులని చంపితే వీళ్ళు స్పందిస్తారు అని ఎలా అనుకుంటాం ? మోడీ మీది ద్వేషం వీళ్ళు కలిసికట్టుగా ఉండడానికి కారణం. పైగా గత నెలరోజులుగా కరోనా వల్ల వచ్చిన నష్టం వల్ల చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్నీ మీడియా హౌసులు ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని స్థితి. ఉద్యోగులని తీసివేయడం,జీతాలు లేకుండా సెలవుల మీద ఉండండి అని అడిగే స్థితి. చైనా కి జలుబు చేస్తే వీళ్ళకి తుమ్ములు వస్తాయి. పాకిస్తాన్ కి కడుపు నెప్పి వస్తే వీళ్ళకి వీరేఛానలు అవుతాయి. పాపం పండింది. వీళ్ళ మీడియా కంటే వేగంగా ఫేస్బుక్ లో వార్తలు,వీడియోలు వచ్చేస్తున్నాయి. వీళ్ళు అందరూ కలిసి ఆర్నాబ్ గో స్వామిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో మరో పోస్ట్ లో చెప్పే ప్రయత్నం చేస్తాను.
జై హింద్ !
పార్ధసారధి పోట్లూరి గారి వాల్ నుండి సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి