తొలిదైవమైన ఆదిగణపతి గురించి చెప్పుకుంటే.. ఆయన ఎంతటి హేతుబద్ధమైన దైవమో తెలుస్తుంది. బొజ్జగణపయ్య.. బొజ్జ దేనికి గుర్తు. ఆ తొండం, తల ఏ భావానికి ప్రతీకలు? ఆయన చేతిలోని ఆయుధాలకు అర్ధమేమిటీ.. పరమార్ధమేమిటీ? ఆయన దేహమే ఓ సామాజికి దేవాలయం అంటారు దాని అంతరార్ధమేమిటి? ఆయన ఇష్టపడే ప్రతిదీ ప్రాకృతమైనదే? వినాయకుడి ప్రస్తావన తీసుకురావడం అంటేనే ఈ అండపిండ బ్రంహ్మాండానికి సంబంధించిన అన్ని విషయాలనూ ఒక్కసారిగా మాట్లాడుకున్నట్టే అంటారు. అదెంత వరకూ వాస్తవం?వినాయక చవితిని భాద్రపద మాసంలో జరుపుకుంటారు. అంటే వ్యవసాయ తొలి సీజన్ ఖరీఫ్ మంచి ఊపు అందుకునే సమయం కూడా ఇదే. మన దేశం వ్యవసాయ ప్రధాన దేశం. మనం చేసే ప్రతీ పనీ. జరిపే ప్రతి పండగ అన్నీ... వ్యవసాయానికి అనుసంధానించి వుంటాయి. వినాయక చవితి కూడా అంతే. సాధారణంగా నాట్లు వేయటంలో రైతన్నలు తీరిక లేకుండా గడిపే సమయమిది. అందుకే ఆయనకు తొలి పూజలు చేసి పవిత్రమైన వ్యవసాయ పనులను మొదలుపెడతారు కర్షక జీవులు. ఆయన శరీరం ఏనుగు శరీరం.. అంటే భారీ పదార్థం. భౌతిక శాస్త్రపరిభాషలో చెప్పాలంటే మెటీరియల్. అసలు పదార్థం నుంచే సృష్టి జరుగుతుంది.మట్టి నుంచే పంట పండుతుంది. అంటే ఆయన స్థూలంగా భూమికి ప్రతీక. ఆయన ఏనుగు ముఖం బుద్ధికి సింబల్. ఆయనకు ఉండే ఏక దంతం.. రైతు పొలంలో పట్టే నాగలికి గుర్తు. ఇక పెద్ద పెద్ద చెవులు తూర్పార బట్టే చేటలకు సంకేతం. ఆయన పెద్ద బొజ్జ పండిన వడ్లను పోసేందుకు ఉపయోగించే గాదెకు గుర్తు. ఎలుకల్ని వాహనంగా చేసుకోవటం అంటే పంటల్ని పాడు చేసే ఎలుకలను అణచివేయటానికి గుర్తు. బొజ్జగణపయ్య పొట్టను పాములతో బిగించి కట్టుకోవటం కూడా అందుకే ప్రతీక. వినాయకుడి వ్రతాన్ని చేసేప్పుడు 21 రకాల పత్రాలను వినియోగిస్తారు. జాజి, మారేడు, మాచీపత్రి, విష్ణుక్రాంత మొదలైన ఆకులన్నీ సాధారణంగా పంటపొలాల పక్కన కనిపించే ఔషధ మొక్కలే. అందుకే అన్ని విధాలుగా వినాయకుడు వ్యవసాయ ప్రధాన దేవుడయ్యాడని చెబుతారు. వినాయకుడిని పూజించటం అంటే పొలాన్ని, సేద్యాన్ని, భూమిని పూజించినట్లే.. అవుతుందని ఎంతో భక్తితో భావిస్తారు. ఇదీ సంగతి. ఇన్నేసి విషయాలు వినాయక రూపంలో ఇమిడి వున్నాయని అంటారు వినాయక భక్తులు.
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
17, సెప్టెంబర్ 2023, ఆదివారం
తెలంగాణ
*తెలంగాణ ఎప్పుడూ బ్రిటిష్ వారి ఆధీనంలో లేదు... చరిత్ర చదవండి!*
*నిజాంవిముక్త స్వాతంత్ర్యం*
*1947 ఆగష్టు 15 అర్ధరాత్రి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది.*
*దేశం మూడు ముక్కలై వచ్చిన ఈ స్వాతంత్య్రం వెనుక అనేకమంది వీరుల త్యాగం ఉంది. ఈ స్వాతంత్య్రం వెనుక అనేకమంది రక్తతర్పణమూ ఉంది. అదే రక్తతర్పణం, అదే వీరుల త్యాగం హైదరాబాద్ సంస్థానంలోనూ ఉంది. అయినా ఆ అర్ధరాత్రి ఇక్కడ స్వాతంత్య్ర భానూదయం కాలేదు. అందుకు కారకులు మతోన్మాది, నియంత నిజాం. అతని అడుగులకు మడుగులొత్తే రక్తపిశాచాలు మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సంస్థ రజాకార్లు.*
*నిజాం సంస్థానం లేదా హైదరాబాద్ రాష్ట్రమంటే ఇప్పటి తెలంగాణా అంతా, మరియు మహారాష్ట్ర, కర్ణాటకల్లో కొన్ని జిల్లాలు ఉండేవి.*
*ఈ సంస్థానం భాష దృష్టితో మూడు భాగాలుగా విభజితమయింది. అందులో *ప్రధానంగా తెలుగువారు నివసించేది తెలంగాణ. ఇవి ఎనిమిది జిల్లాలు. 1) వరంగల్, 2) కరీంనగర్, 3) ఆదిలాబాద్, 4) నిజామాబాద్, 5) మహబూబ్నగర్, 6) మెదక్, 7) హైదరాబాద్ అత్రాపుబల్దా (అత్రాపు అంటే చుట్టుప్రక్కల ప్రాంతాలనీ, బల్గా అంటే నగరమని అర్ధం), 8) నల్లగొండ.*
ఇక *రెండో భాగం మరఠ్వాడా,* *మహారాష్ట్ర ప్రజలెక్కువగా ఉండే ప్రాంతమిది. ఇందులో అయిదు జిల్లాలు. 1) ఔరంగాబాద్, 2) బీడు, 3) పర్బాని, 4) నాందేడు, 5) ఉస్మానాబాదు.*
*మూడవ భాగం*
*ఈ రెండిటికన్నా చిన్నది. ఇది కర్ణాటక ప్రాంతం. కన్నడం మాట్లాడేవారు ఎక్కువగా ఉండేది. ఇవి మూడు జిల్లాలు. 1) గుల్బర్గా, 2) రాయచూరు, 3) బీదరు.*
*సంస్థానం పూర్వ చరిత్ర.*
*శాతవాహనులు క్రీ.పూ. 250 నుండి క్రీ.శ. 250 వరకు పరిపాలించారు.*
*వారి రాజ్యంలో తెలంగాణతోపాటు కర్ణాటక మరియు మహారాష్ట్రలో కొంత భూభాగం ఉండేది.*
*నాగార్జున కొండకు ఇటువైపున ఉన్న నేటి తెలంగాణలోని కొంత ప్రాంతాన్ని ఇక్ష్వాకులు*
*పరిపాలించారు.*
*అమ్రాబాదు పాలమూరు జిల్లాలోనిది. ఇది ఆనాటి అమరావతి విష్ణుకుండినుల ఏలుబడిలో*
*9,10,11 శతబ్దాల్లో తెలంగాణ ప్రాంతంలోని కొంత భూభాగంను చాళుక్య రాజులు పరిపాలించారు.*
*క్రీ.శ. 1050 నుండి 1325 వరకు ఓరుగల్లును రాజధానిగా చేసుకొని కాకతీయులు తెలంగాణను పరిపాలించారు.*
*కాకతీయ రాజ్యం పతనం అయిన వెంటనే గోల్కొండ దాని చుట్టూ ఉన్న రాజ్యాల్ని బహమనీలు తమ చేతుల్లోకి తెచ్చుకున్నారు.*
*1518లో బహమనీల పెత్తనాన్ని కూలద్రోసి ఇరాన్ దేశీయుడైన కులీ హుందాని కుతుబ్ ఉల్ ముల్కు అనే బిరుద నామంతో స్వాతంత్య్రం ప్రకటించుకొని గోల్కొండకు పాదుషా అయ్యాడు. అప్పటినుండి కుతుబ్ షాహీల పాలన ప్రారంభమయింది.*
*1687లో గోల్కొండలో కుతుబ్ షాహీల పాలన అంతం అయ్యింది. ఔరంగజేబు నిజాం ఉల్ ముల్క్ అసఫ్ జాహ్ ను గోల్కొండ రాజ్యానికి (దక్కను సుభాకు) సుబేదారుగా నియమించాడు. ఇక్కడి నుండి నిజాంల పాలన ప్రారంభమయింది.*
*ఈ అసఫ్ జాహీలకు బిరుదు 'నైజాం' అనే పేరు ఉండడం వల్ల హైదరాబాద్ సంస్థానం 'నిజాం' రాజ్యంగా మారింది. ఏడుగురు నిజాంలు పాలించారు.*
*హైదరాబాద్ ను పరిపాలించిన ఈ ఏడుగురు నిజాముల్లో ఒక మీర్ మహబూబ్ అలీఖాన్ (6వ నిజాం) తప్ప, మిగతా అందరూ ప్రజా పీడకులే, నియంతలే, చరిత్రలో రక్తపాతాన్ని సృష్టించిన దుర్మార్గులే. హిందువుల మానప్రాణాలు హరించిన పరమ కిరాతకులే. అందులో...*
*చివరివాడైన ఏడో నిజాం అతి పరమ కిరాతకుడు, నరరూప రాక్షసుడు.*
*1927-28లో "మజ్లిస్ ఇత్తిహాదుల్ చైనులు స్లమీన్ అనే సంస్థ ఏర్పడింది.*
*దీనిలో హిందువులు ఎవరూ చేరని కారణంగా 1929లో ఇది మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ గా మారింది. దీనికి మొట్టమొదటి అధ్యక్షుడు సంస్థాన మత శాఖలోని ఓ పెద్ద అధికారి బహద్దూర్ యార్ జంగ్. ఇతడి తర్వాత మౌల్వి కాశీం రజ్వీ దాని అధ్యక్షుడు అయినాడు*
*హైదరాబాద్ సంస్థానంలో నిజాంలు మరియు రజాకార్లు జరిపిన అత్యాచారాలు, అమానుష చర్యలు...*
*బతుకమ్మ పండుగ సందర్భంగా కొన్నివేల ప్రదేశాల్లో స్త్రీలను నగ్నంగా చేసి బతుకమ్మ ఆడించి వినోదించారు.*
*రైతులు పండించిన కూరగాయలతో పాటు వారు పెంచుకున్న కోళ్ళను, మేకల్ని, గొర్రెల్ని ఎత్తుకొని పోయిన ఘట్టాలు లక్షలున్నాయి.*
*పొలాల్లో వ్యవసాయం పనుల మీదున్న స్త్రీలను ఎత్తుకొని వెళ్ళేవారు.*
*రాత్రిపూట రజాకార్లు వచ్చి ఓ ఊరు మీద పడేవారు. తుపాకులు పేల్చేవారు. కొందరిని చంపేవారు. కొందరిమీద అత్యాచారం జరిపేవారు. కొన్ని ఇళ్ళు దోచుకునేవారు.*
*స్త్రీలపైన కన్ను, ఆస్తిమీద కన్ను, భూమి మీద కన్ను, రాజ్యాల మీద కన్ను, దేవాలయం మీద కన్ను, భాషమీద కన్ను, సాహిత్యం మీద కన్ను, భక్తుల మీద కన్ను, ప్రతి మంచిదాని మీద కన్ను.*
*రజాకార్లంటే శాంతిని వాంఛించే స్వచ్ఛంద సేవకులు అని అర్ధం. కాని శాంతిని నాశనం చేసి, మానవ రక్తాన్ని త్రాగిన రాకాసి మూకలు రజాకార్లు.*
*90శాతం మంది హిందువుల మీద 10శాతం మంది ముస్లింల ఆధిపత్యం ఉండేది.*
*ఏ పల్లెటూరిలో ఒక్క ముస్లిం ఉన్నా, అతని కుటుంబమున్నా అతనే రాజు అన్నవిధంగా వ్యవహరించడం జరిగేది.*
*బతుకమ్మల నగ్న సత్యం:* *నిజాంకు హిందువుల పండుగలంటే పడదు. హిందూ మహిళలు బహిరంగంగా నిర్వహించే ఈ పండుగ ఆగిపోవాలి. బతుకమ్మ ఆటమీద దాడులు మొదలైనవి. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే మహిళల్ని వివస్త్రల్ని చేసి ఆటాడించి ఆనందించే వరకు వెళ్ళింది.*
*అష్రఫ్ పేట గ్రామంలో దోపిడి: నిజాం పోలీసులు అందులో కిరాయికి చేరిన పఠాన్ గూండాలు, మజ్లిస్, రజాకార్ గూండాలు వందమంది వరంగల్ జిల్లాలోని అష్రఫ్ పేటపై పడ్డాడు. గ్రామాన్ని దోచేసి 20 మందిని చంపివేశారు.*
*తల్లీ కూతుళ్ళను భర్తల ఎదుట: హైదరాబాదు సమీపంలోని పంజాగుట్ట గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఇంటిలోని తల్లీ కూతుళ్ళని వాళ్ళ భర్తల ఎదుట, పిల్లలఎదుట హీనాతిహీనంగా చెరిచారు.*
*1948 జూలై మొదటి వారంలో సైదాబాగ్ ఇది గుల్బర్గాకు 12 మైళ్ళ దూరంలో ఉంది. రజాకర్లు, ఈ గ్రామంలో 15మంది స్త్రీలను నీచాతినీచంగా నిజాం సైన్యం మానభంగం చేసింది.*
*పురోహితులను మంటల్లో కాల్చిన రాక్షస మూక:*
*ఒక రోజు శ్రాద్ధ కర్మలో భోక్తలుగా భోజనం చేసి ఏడుగురు బ్రాహ్మణులు తిరిగి వస్తున్నారు. త్రోవలో శాంతిని సంరక్షిస్తున్న రజాకార్ల ముఠా ఒకటి ఎదురైంది. ఆ ఏడుగుర్ని పట్టుకున్నారు. ఇద్దరు బ్రాహ్మణులు మాత్రం తప్పించుకొని పారిపోయారు. మిగిలిన ఐదుగుర్ని చింతచెట్టు కొమ్మకు వ్రేలాడదీశారు. క్రింద మంటలు పెట్టారు. ఆ మంటల్లో కాలి, మాడి, ఉడికి ఆ అమాయకులైన బ్రాహ్మణులు ప్రాణాలు వదిలారు.*
*భయంకర హింసతో అట్టుడికిన బైరాన్ పల్లి!: బైరాన్పల్లి నల్లగొండ జిల్లాలోని ఒక గ్రామం. రజాకార్ల క్రూరకృత్యాలు రోజురోజుకు మితిమీరి పోయాయి. రజాకార్ల నుండి తమ గ్రామాన్ని కాపాడుకోవడానికి బైరాన్పల్లి వాసులు స్వీయరక్షణ దళం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బైరాన్పల్లిని ఆదర్శంగా తీసుకొని గ్రామ రక్షక దళాలను అనేక గ్రామాలు ఏర్పాటు చేసుకున్నాయి. దానికి కక్ష సాధింపు చర్యగా రజాకార్లు, తెల్లవారుఝామున బైరాన్ పల్లిపై విరుచుకుపడ్డారు. క్రూరంగా గ్రామంపై బడ్డారు. బాంబులు విసిరారు. పశువుల్లా ఆడవాళ్లపైబడి బలాత్కారం చేశారు. *92మంది యువకులను ఊరవతల వరుసగా నిలబెట్టారు. త్రీనాట్ రైఫిల్ తో వరుసగా ఒకేసారి ఒకే గుండుతో ఎంతమందిని చంపవచ్చునో లెక్కగట్టి మరీ కాల్చారు.*
*నాలుగు వరుసలలో ఒకరి వెనక ఒకరిని నిలబెట్టారు. ఒకే గుండు ఒకేసారి నలుగురిని చంపగా పోటీలు పడి అధికారులంతా కాల్చి చంపారు. నరసంహారం తర్వాత గ్రామంలోని వారి జనులను పిలిచి*
*90 మంది శవాలను నిరుపయోగంగా వున్న ఒక బావిలో పడవేయించి సామూహిక సమాధి చేశారు.*
*మరో జలియన్ వాలాబాగ్ పరకాల...*
*భారత చరిత్రలో జలియన్ వాలాబాగ్ ఎంత రక్తసిక్తమయ్యిందో తెలంగాణ విమోచన పోరాటంలో పరకాల అంతే నెత్తురు త్రాగింది. 1947 ఆగష్టు 15న స్వాతంత్ర్యం రానే వచ్చింది. నిజాం రాజ్యంలో త్రివర్ణ పతాకం ఎగురవేయడం నేరం. జాతీయ పతాకావిష్కరణ చేయవద్దని నిజాం ప్రభుత్వం హుకుం జారీ చేసింది. కానీ 1947 సెప్టెంబర్ 02 నాడు పరకాలలో పతాకా విష్కరణకు రంగం సిద్ధమైంది. పరకాల చుట్టుప్రక్కల 25 గ్రామాల నుండి ప్రజలు తండోప తండాలుగా వచ్చారు. ఈ దృశ్యాన్ని నిజాం ప్రభుత్వ అధికారులు జీర్ణించు కోలేకపోయారు. జెండా ఎగురవేయడం నేరమయింది. ముందస్తు హెచ్చరిక కూడా లేకుండా కాల్పులు జరపడానికి సర్కిల్ ఇన్స్పెక్టర్ జియా ఉల్లా ఆదేశించారు. రజాకార్లు విచక్షణా రహితంగా బుల్లెట్ల వర్షం కురిపించారు. రక్తం ఏరులైపారింది. గ్రామం మొత్తం శవాల దిబ్బగా మారింది.*
*మొగిలయ్య గౌడ్ హత్య :* *భారతదేశం మొత్తం స్వతంత్ర భారత జయ జయ నినాదాలు చేస్తున్నది. వరంగల్లో బత్తిని మొగిలయ్య గౌడ్ కూడా జాతీయ జండాను ఎగురవేయాలి అని అనుకున్నాడు. మొగిలయ్య పెద్దగా చదువుకోకున్నా జాతీయదవాద భావాలు కలవాడు. కొంతమంది ప్రముఖులతో కలసి మొగిలయ్య పతాకా విష్కరణ చేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన రజాకార్ల గుంపు గ్రామంపై దాడి చేసింది. ఈలోగా తాటిచెట్లు గీయడానికి వెళ్ళిన మొగిలయ్య గౌడ్ కు ఈ దాడి వార్త తెలిసి హుటాహుటిన పరుగెత్తుకు వచ్చాడు. ఇంటిచూరులో ఉన్న కత్తిని తీసుకొని రజాకార్ల గుంపు పైబడ్డాడు. కత్తివిద్య తెలిసిన మొగిలయ్య దాడిలో ముగ్గురు నేలకూలారు. దానితో రజాకార్ల గుంపు చెల్లాచెదురయ్యింది. కొద్దిసేపట్లోనే వాళ్ళంతా కలసి అభిమన్యుని చుట్టుముట్టిన కౌరవుల్లా వచ్చి మొగిలయ్యను హత్య చేశారు. జాతీయ జెండాను ఎగురవేయడం మొగిలయ్య చేసిన నేరం....* *అమరవీరుడు షోయబ్ ఉల్లాఖాన్: 'రయ్యత్' పత్రిక సంపాదకుడు శ్రీ ముందుముల నర్సింగ రావు. నిజాం హయాంలో స్వతంత్ర అభిప్రాయాలతో వెలువడుతూ వచ్చిన 'రయ్యత్' పత్రికను నిషేధించారు. దీన్ని నిషేధించిన తర్వాత షోయబుల్లాఖాన్ ప్రజల భావాన్ని వ్యక్తం చేయటానికి ఒక పటిష్టమైన సాధనం కావాలి అని రయ్యత్ లేని కొరతను తీర్చాలనుకొని 'ఇమ్రోజ్' అనే పేరుతో ఒక దినపత్రికను ప్రారంభించాడు. 1947 నవంబర్ 15వ తేదీనాడు 'ఇమ్రోజ్' దినపత్రిక మొదటి సంచిక వెలువడింది. నిజాం సంస్థానం పోకడలను నిశితంగా విమర్శిస్తూ షోయబ్ సంపాదకీయాలు వ్రాసేవాడు. తన 'ఇమ్రోజ్' పత్రిక ద్వారా సాహసో పేతమైన పోరాటాన్ని సాగించాడు. న్యాయం, నీతి, మత సహనం కోసం నిర్భయంగా నిలుచున్నాడు. దీని పర్యవసానంగా షోయబుల్లాఖాన్ ను రజాకార్లు హత్య చేశారు.*
*ఓ నిజాము పిశాచమా!* *కానరాడు! నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంచి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ. అని ఎలుగెత్తి చాటాడు దాశరథి.*
*నిజాం సంస్థానంలో రజాకార్లుచేసినఅక్రమాల్ని హత్యల్ని దురంతాల్ని, విధ్వంసాల్ని తేదీలవారిగా కథనం చేస్తే కనీసం లక్ష పుటల చరిత్ర అవుతుంది.*
*1948 శ్రీ సర్దార్ వల్లాభాయ్ పటేల్ ద్వారా సైనిక చర్య తరువాత*
*రజాకార్లు పందుల్లా కొందరు వారి పాకిస్తాన్ పారి పోయారు..*
*వారి సంతతి వారు ఇంకా కొందరు ఇక్కడే మిగిలి పోయారు*
*అందుకే కొందరు ఇప్పటికీ Old City ని పాకిస్థాన్ అంటారు*
*అక్కడ నో Power Bill*
*No Eater Bill, No Law and Order*
*ఇంకా కొందరు రజాకార్లు ఓల్డ్ సిటీ లో మిగిలి ఉన్నారు...*
*తెలంగాణ ఎప్పుడు ఇంగ్లీష్ వారి ఆధీనము లో లేకుండెను..*
*మనకు 1948 సెప్టెంబర్ 17*
*నిజాం రాక్షస సంహారం పాలన నుండి విముక్తి లభించింది ..*
*కానీ ఈ చరిత్ర ఇప్పటి తరానికి తెలియదు*
*! జై భారత్!! భారత్ మాతాకీ జై!!! జై హింద్*
వినాయక వ్రత కల్ప విధానము
*వినాయక వ్రత కల్ప విధానము -సూత మహాముని శౌనకాది మహా మునులకు విఘ్నేశ్వరుని కథ ఇలా చెప్పాడు*💎
*వినాయక వ్రత కల్ప విధానము*
*విఘ్నేశ్వరుని కథ*
🍀సూత మహాముని శౌనకాది మహా మునులకు విఘ్నేశ్వరుని కథ ఇలా చెప్పాడు.పూర్వము గజ రూపము కల రాక్షసుడొకడు పరమ శివుని కొరకు ఘోరమైన తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చి భక్త సులభుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై 'భక్తా! నీ కోరికేమి ?' అని అడుగగా, ఆ రాక్షసుడు, స్వామీ! నీవు ఎల్లప్పుడూ నా ఉదరము నందే నివసించాలి' అని కోరాడు. శివుడు అతని కోరికను మన్నించి, గజాసురుని కడుపులో ప్రవేశించి నివసించ సాగాడు.
🍀కొద్ది రోజులకు పార్వతీ దేవికి ఈ విషయం తెలిసి చాలా విచారించి, మహా విష్ణువును ప్రార్థించి, 'ఓ దేవదేవా! ఇంతకు ముందు కూడా మీరే నా భర్తను యుక్తితో భస్మా సురుని బారి నుంచి కాపాడారు. ఇప్పుడు కూడా మీరే ఎదైనా ఉపాయంతో, మహా శివుని కాపాడ వలసింది' అని వేడుకుంది. శ్రీహరి ఆమెకు ధైర్యం చెప్పి పంపించి వేశాడు.
🍀శ్రీహరి గంగిరెద్దు మేళమే సరైన ఉపాయాంగా తలచి, నందీశ్వరుని గంగిరెద్దుగా, బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్య కారులుగా మార్చి, గజాసురుని పురానికి వెల్లి సన్నాయి వాయిస్తూ, నందిని ఆడించారు. దానికి తన్మయుడైన గజాసురుడు 'మీకేం కావాలో కోరుకోండి!' అనగా, విష్ణుమూర్తి 'ఇది మహమైన నందీశ్వరుడు. శివుని వెతుక్కుంటూ వచ్చింది. కాబట్టి నీ దగ్గర ఉన్న శివుడిని ఇచ్చెయ్యి' అని అడిగాడు. వెంటనే ఆ కోరిక కోరింది వేరెవరో కాదు సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే అని గ్రహించాడు. తనకిక మరణం తథ్యం అని గ్రహించి, శివునితో 'నా శిరస్సును లోకమంతా ఆరాధించ బడే టట్లుగా అనుగ్రహించి, నా చర్మమును నీ వస్త్రముగా ధరించమని' వేడు కొన్నాడు.
🍀అభయమిచ్చిన తరువాత, విష్ణుమూర్తి నందికి సైగ చేయగా, నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి చంపాడు. బయటకు వచ్చిన శివుడు శ్రీహరిని స్తుతించాడు. అప్పుడు విష్ణుమూర్తి 'ఇలా అపాత్ర దానం చేయకూడదు. దుష్టులకిలాంటి వరాలిస్తే పాముకు పాలు పోసి పెంచినట్టవుతుంది' అని చెప్పి అంతర్థ
*వినాయక జననము*
🍀కైలాసములో పార్వతీ దేవి శివుని రాక గురించి విని, చాలా సంతోషించి, తల స్నానం చేయటానికై నలుగు పెట్టుకుంటూ, ఆ నలుగుతో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి, ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి, ఎవరినీ రానివ్వ వద్దని చెప్పింది. ఆ బాలుడు సాక్షాత్తూ పరమేశ్వరునే ఎదుర్కొని తల్లి ఆనతి నెర వేర్చాడు. ఆ ధిక్కారానికి కోపం వచ్చిన పరమశివుడు అతని శిరచ్ఛేదముగావించి లోపలికి వెళ్లాడు. అప్పటికే పార్వతీ దేవి స్నానం ముగించి చక్కగా అలంకరించుకుని పతిదేవుని రాకకై ఎదురు చూస్తోంది. శివునికి ఎదురెళ్లి ప్రియ సంభాషణలు చేస్తుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుని విషయం వచ్చింది. శివుడు చేసిన పని విని ఎంతో దుఃఖించగా, శివుడు కూడా చింతించి, గజాసురుని శిరస్సును అతికించి ఆ బాలుని బ్రతికించాడు. అందువల్ల 'గజాననుడు'గా పేరు పొందాడు. అతని వాహనము అనింద్యుడనే ఎలుక. గజాననుడు తల్లిదండ్రులను భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు.కొన్నాళ్లకు పార్వతీ పరమేశ్వరులకు కుమార స్వామి పుట్టాడు. అతని వాహనము నెమలి. అతను మహా బలశాలి.
*విఘ్నేశాధి పత్యము*
🍀ఒక రోజు దేవతలు, మునులు పరమేశ్వరుని దగ్గరకు వెళ్లి 'మాకు ఏ పనిచేసినా విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుడిని కనికరించమని' కోరారు. ఆ పదవికి గజాననుడు, కుమార స్వామి ఇద్దరూ పోటీ పడ్డారు. ఆ సమస్య పరిష్కరించడానికి శివుడు, 'మీలో ఎవరైతే ముల్లోకముల లోని అన్ని పుణ్య నదులలో స్నానం చేసి ముందు వస్తారో వాళ్లే ఈ పదవికి అర్హులు' అన్నాడు. దానికి అంగీకరించిన కుమార స్వామి వెంటనే తన నెమలి వాహనమెక్కి వెళ్లి పోయాడు. గజాననుడు మాత్రం చిన్న బోయిన ముఖంతో 'తండ్రీ! నా బలాబలాలు తెలిసీ మీరిలాంటి షరతు విధించటం సబబేనా ? నేను మీ పాద సేవకుడిని కదా! నా మీద దయ తలచి ఎదైనా తరుణోపాయం చెప్ప'మని కోరాడు. అంతట శివుడు దయతో ఈ మంత్రం చెప్పాడు.
🍀'సకృన్ నారాయణే త్యుక్త్వా పుమాన్ కల్పశత త్రయం! గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక!'కుమారా! ఇది నారాయణ మంత్రం! ఇది ఒకసారి జపిస్తే మూడు వందల కల్పాలు పుణ్య నదులలో స్నానం చేసినట్టవుతుంది. షరతు విధించిందీ తండ్రే, తరుణోపాయం చూపిందీ తండ్రే కాబట్టి, ఇంక తాను గెలవగలనో లేదో, కుమార స్వామి తిరుగుతూ ఉంటే నేను ఇక్కడే ఉండి ఎలా గెలుస్తాను ? అని సందేహించకుండా, ఆ మంత్రం మీద భక్తి శ్రద్ధలతో జపించుచూ, మూడు మార్లు తల్లి దండ్రులకు ప్రదక్షిణ చేసి కైలాసములోనే ఉండి పోయాడు.
అక్కడ కుమార స్వామికి, మూడు కోట్ల యాభై నదులలో, ఏ నదికెళ్లినా అప్పటికే గజాననుడు ఆ నదిలో స్నానం చేసి తనకెదురు వస్తున్నట్లు కనిపించే వాడు. అన్ని నదులూ తిరిగి, కైలాసానికి వచ్చేసరికి అన్నగారు, తండ్రి పక్కనే ఉన్నాడు. తన అహంకారానికి చింతించి, 'తండ్రీ! అన్నగారి మహిమ తెలియక ఏదో అన్నాను. నన్ను క్షమించి అన్నకు ఆధిపత్యము ఇవ్వండీ అన్నాడు.'
🍀ఆ విధంగా బాధ్రపద శుద్ధ చవితి రోజు గజాననుడు, విఘ్నేశ్వరుడైనాడు. ఆ రోజు అన్ని దేశాల లోని భక్తులందరూ విఘ్నేశ్వరునికి అనేక రకములైన పిండి వంటలు, కుడుములు, టెంకాయలు, పాలు, తేనె, అరటి పళ్లు, పానకము, వడ పప్పు సమర్పించారు. విఘ్నేశ్వరుడు, తృప్తి పడి తిన్నంత తిని, తన వాహనానికి పెట్టి, తీసుకెళ్ల గలిగినంత తీసుకుని భుక్తాయాసంతో చీకటి పడే వేళకు కైలాసం చేరు కున్నాడు. ఎప్పటిలాగా తల్లి దండ్రులకు వంగి నమస్కారం చేయబోతే తన వల్ల కాలేదు. చేతులసలు నేల కానితేనా ? పొట్ట వంగితేనా ? అలా విఘ్నేశ్వరుడు అవస్థ పడుతుంటే, శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు పక పకా నవ్వాడు. చంద్రుని చూపు సోకి వినాయకుని పొట్ట పగిలి కుడుములన్నీదొర్లు కుంటూ బయటకు వచ్చేసాయి.
🍀పార్వతీ దేవి దుఃఖించుచూ, చంద్రుని ఇలా శపించింది. 'ఓరి పాపాత్ముడా! నీ చూపు తగిలి నా కొడుకు మరణించాడు. అందుకని నిన్ను చూసిన వాళ్లు, పాపాత్ములై నీలాపనిందలు పొందుతారు.'
ఋషి పత్నులు నీలాప నిందలు పొందుట
🍀ఆ సమయంలోనే సప్త ఋషులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్నికి ప్రదిక్షణాలు చేస్తున్నారు. అగ్ని దేవుడు ఆ ఋషి పత్నులను చూసి మోహించాడు. కాని ఋషుల శాపాలకు భయ పడ్డాడు. అతని కోరిక గ్రహించిన అగ్ని దేవుని భార్య, ఒక్క అరుంధతీ రూపము తప్ప మిగతా అందరి రూపమూ ధరించి అతనికి ప్రియం చేసింది. ఋషులది చూసి తమ భార్యలేనని తలచి వాళ్లను వదిలి వే్సారు. దీనికి కారణము, వారు చంద్రుని చూడటమే!
🍀దేవతలు, మునులు వెళ్లి శ్రీ మహా విష్ణువుకు విన్నవించుకోగా ఆయన సర్వజ్ఞుడు కాబట్టి, అసలు విషయం తెలుసు కుని ఋషులకు వివరించి, వాళ్ల కోపం పోగొట్టాడు. కైలాసమునకు వచ్చి విఘ్నేశ్వరుని పొట్టను పాముతో కుట్టించి అమరత్వాన్ని ప్రసాదించాడు. అప్పుడు దేవతలు మొదలగు వారంతా 'ఓ పార్వతీ! నీవిచ్చిన శాపం వల్ల లోకానికే ముప్పు. నీ శాపాన్ని ఉపసంహరించు' అన్నారు. పార్వతి కూడా తన కుమారుని ముద్దాడి, 'ఏ రోజైతే చంద్రుడు నా కుమారుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుని చూడ రాదు' అని శాపోపశమనమును కలుగ చేసింది. ఆ రోజు బాధ్రపద శుద్ధ చతుర్థి. ఆ రోజు చంద్రుని చూడకుండా అందరూ జాగ్రత్తగా ఉన్నారు. ఇలా కొన్నాళ్లు జరిగింది.
*శమంతకోపాఖ్యానము*
🍀ద్వాపర యుగములో ద్వారకలోనున్న కృష్ణుడి దగ్గరకు నారదుడు వచ్చి ఆ కబురూ ఈ కబురూ చెప్పి చంద్రుని మీద శాపం విషయం కూడా చెప్పాడు. "ఆ శాపం పొందిన వినాయక చవితి ఈ రోజే కాబట్టి నేను తొందరగా వెళ్ళాలి" అనేసి స్వర్గానికి వెళ్లిపోయాడు. కృష్ణుడు కూడా ప్రజలందరికీ చంద్రుడ్ని చూడవద్దని చాటింపు వేసాడు. అతనికి పాలంటే ప్రీతి కదా! తనే స్వయంగా పాలుపితుకుదామని, అకాశం కేసి చూడకుండా ఆవు దగ్గర కెళ్ళి పాలు పితుకుతూంటే పాలలో చంద్రబింబం కనిపించింది. 'హతవిధీ! నేనేమీ నీలాప నిందలు పడాలో కదా!' అనుకున్నాడు.
🍀కొన్నాళ్లకు సత్రాజిత్తు శ్రీకృష్ణుడి దగ్గరకి వచ్చాడు. అతని దగ్గర శమంతక మణి ఉంది. అది సూర్యవరము వల్ల పొందాడు. శ్రీ కృష్ణుడది చూసి ముచ్చటపడి తనకిమ్మని అడిగాడు. 'అది రోజుకు ఎనిమిది బారువులు బంగారము నిస్తుంది. అలాంటిది ఏ మూర్ఖుడు కూడా వదులుకోడు ' అన్నాడు సత్రాజిత్తు. దాంతో శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు.
🍀ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని కంఠంలో ధరించి వేటాడడానికి అడవికి వెళ్లాడు. అక్కడ ఒక సింహం ఆ మణిని చూసి మాంసమనుకుని అతనిని చంపి మణిని తీసుకుని పోతూండగా జాంబవంతుడనే ఒక భల్లూకము సింహమును చంపి మణిని తన గుహకు తీసుకుని పోయి తన కూతురికి ఆట వస్తువుగా యిచ్చాడు. ఇదంతా తెలియని సత్రాజిత్తు 'ఇంకేముంది మణి నివ్వలేదని కోపంతో శ్రీకృష్ణుడే నా తమ్ముడ్ని చంపి మణి తీసుకున్నాడని ' చాటింపు వేసాడు. శ్రీ కృష్ణుడు 'తను భయపడినట్టుగా నీలాపనిందలు రానేవచ్చాయి. దానినెలాగైనా రూపుమాపాలి ' అని సంకల్పం చేసి సపరివారంగా అడవిలోకి వెళ్ళి వెతకడం మొదలుపెట్టాడు. అక్కడ ప్రసేనుడి శవం, సింహం అడుగుజాడలు, గుహవైపుకి భల్లూకం అడుగు జాడలు కనిపించాయి.
🍀ఆ దారి వెంట పోయి గుహలోకి వెళ్ళి ఉయ్యాలకు కట్టి ఉన్న మణిని తీసుకుని వస్తూంటే ఎవరో వింత మనిషి వచ్చాడని జాంబవతి కేకలు వేసింది.
🍀అది విన్న జాంబవంతుడు కోపంగా శ్రీహరి మీదకి యుద్ధానికి దిగాడు. వాళ్ళిద్దరి మధ్య యిరువయ్యెనిమిది రోజులు రాత్రింబగళ్ళు హోరాహోరి యుద్ధం జరిగింది. రాను రాను జాంబవంతుడు క్షీణించడం మొదలుపెట్టాడు. అప్పుడతడు తనతో యుద్ధం చేస్తున్నది ఎవరో కాదు త్రేతాయుగంలో రావణాసురుని సంహరించిన శ్రీరామ చంద్రుడే అని గ్రహించాడు. వెంటనే చేతులు జోడించి 'దేవాదిదేవా! ఆర్తజనరక్ష!నిన్ను త్రేతాయుగంలో భక్తజన పాలకులైన శ్రీరామ చంద్రునిగా గుర్తించాను.
🍀ఆ జన్మలో నీవు నా మీద అభిమానంతో కోరిక కోరుకోమంటే నేను తెలివి తక్కువగా నీతో యుద్ధం చేయాలని కోరుకున్నాను. నీవు ముందు ముందు తీరుతుందన్నావు. అప్పటినుంచీ నీ నామస్మరణ చేస్తూ నీ కోసం ఎన్నో యుగాలుగా ఎదురు చూస్తున్నాను. నాయింటికి వచ్చి నా కోరిక నెరవేర్చావు. ధన్యుడిని స్వామీ! నాలో శక్తి క్షీణిస్తోంది. జీవితేచ్చ నశిస్తోంది నా అపచారము మన్నించి నన్ను కాపాడు. నీవే తప్ప నితః పరంబెరుగను ' అని పరిపరి విధాల ప్రార్థించాడు.
🍀శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుడి శరీరమంతా తన చేత్తో నిమిరి 'జంబవంతా! శమంతక మణిని అపహరించానన్న నింద వచ్చింది. దాన్ని రూపుమాపడానికి వచ్చాను. నువ్వు అ మణినిస్తే నేనువెళ్ళివస్తాను ' అన్నాడు. జాంబవంతుడు సంతోషంగా మణిని, తన కూతురు జాంబవతినీ కూడా కానుకగా ఇచ్చాడు.
🍀తనతో వచ్చిన తన బంధుమిత్ర సైన్యంతో, శమంతకమణితో, జాంబవతితో సత్రాజిత్తు దగ్గరకెళ్ళి అందరి సమక్షంలో జరిగింది వివరించాడు. సత్రాజిత్తు పశ్చాత్తాపం చెంది లేని పోని నిందలు వేసినందుకు క్షమాపణ కోరాడు. ఆ పాపపరిహారంగా తన కుమార్తె అయిన సత్యభామని భార్యగా స్వీకరించమని అ మణిని కూడా కానుకగా ఇచ్చాడు. శ్రీకృష్ణుడు సత్యభామని స్వీకరిం చి, మణిని మృదువుగా తిరస్కరించాడు.
🍀ఒక శుభముహుర్తమున శ్రీకృష్ణుడు సత్యభామనీ, జాంబవతినీ పెళ్ళి చేసుకున్నాడు. దానికి వచ్చిన దేవాది దేవతలు, ఋషులు శ్రీకృష్ణునితో స్వామీ! మీరు సమర్థులు కనుక నీలాపనిందలు తొలగించుకున్నారు. మాబోటి అల్పుల మాటేమిటి? అన్నారు. శ్రీహరి వారియందు దయతలిచి 'బాధ్రపద శుద్ధ చవితిరోజు ప్రమాదవశమున చంద్ర దర్శనము అయినా, ఆ రోజు ప్రొద్దున గణపతిని యధావిధిగా పూజించి శమంతకమణి కథను విని పూజాక్షతలు తలమీద వేసుకుంటే ఎటువంటి అపనిందలు పొందరు గాక 'అని ఆనతీయగా దేవతలు, మునులు సంతోషించారు.
🍀'కాబట్టి మునులారా! అప్పటినుంచి ప్రతి సంవత్సరము బాధ్రపద శుద్ధ చరుర్థి రోజు దేవతలు, మహర్షులు, మనుష్యులు, అందరూ తమ తమ శక్తి కొద్దీ గణపతిని పూజించి తమ తమ కోరికలను నెరవేర్చుకుంటూ సుఖంగా ఉన్నారు ' అని సూతముని శౌనకాది మునులతో చెప్పారు. ఇది వినాయక మహత్యం
వినాయక నిమజ్జనం
🍀బాధ్రపద శుద్ధ చవితి తరువాత వినాయకుడికి నవరాత్రి పూజలు చెసిన తరువాత, మట్టి వినాయకులను ఆడంబరముగా తీసుకొని వెళ్ళి దగ్గరలో ఉన్న నదిలో కాని సముద్రములో కాని నిమజ్జనం చేస్తారు.
జ్ఞానసింధు
❓ _*ప్రశ్నానురూపం ప్రతివచనమ్*_
✅ _*జ్ఞానసింధు - సమాధానము*_
💫🌈💫🌈🌈💫🌈💫🌈💫🌈
👌 *శ్రీ గురుభ్యోనమః!* 👌
🙏 *నమస్కారములు* 🙏
*ఆర్యా!*
❓ _*మాది ఒక ధర్మ సందేహం - చవితినాటి చంద్రుని ఎప్పుడు చూడాలి!? వినాయక వ్రత కాలములో చవితి చంద్రదోష నివారణ ఏమిటి!? దయచేసి తెలియజేయగలరు.*_
-- శ్రీమతి కె. నిర్మల, శ్రీకాకుళం
-- శ్రీ ఎం.ఆర్. వెంకట్రావు, గుణదల
♻️┈┉┅━❀✅❀━┅┉┈ ♻️
🚩 *® జ్ఞానసింధు ® - ధార్మిక మండలి సమాధానం*🚩
✍️ బ్రహ్మశ్రీ పరమాత్ముని రామచంద్రమూర్తి, ఒంగోలు.
చరవాణి : 96403 00507
♻️┈┉┅━❀✅❀━┅┉┈ ♻️
✅👉 *శ్రీ కంచి కామకోటి పీఠ పంచాంగము శ్రీ కేత్కరీయ జ్యోతిర్గణిత దృక్సిద్ధాంత విధానములో గుణించి నిర్ణయించిన పర్వదినం 19-09-2023 మంగళవారం* - _*"వరసిద్ధి వినాయక వ్రతం".*_
✅ *ముఖ్య అంశానికి వస్తే... ఇది చవితి చంద్రదర్శన వ్రతము కాదు. వరసిద్ధి వినాయక వ్రత వైభవాన్ని తెలియజేసే కథలో చవితి నాటి చంద్రదోష, నీలాపనిందల దోష నివారణ ఈ వ్రతము వల్ల కలుగుతుంది - అని ప్రకటించబడింది*
మరియు
✅ *"ధర్మ సింధు" ను అనుసరించి.....
_*"చతుర్ధి యందు చంద్రుని చూచిన, మిథ్యాపవాదము వచ్చును. కనుక, చతుర్ధి యందు ఉదయించిన చంద్రుని పంచమి నందు చూడవచ్చును. అట్లు వినాయక వ్రత దినమందు సంభవించిననూ దోషము లేదు.*
✅ *కావున, పూర్వ దినమందు సాయంకాలము మొదలుకొని వ్యాపించిన చతుర్ధి యందు వినాయక వ్రతము లేకున్ననూ... ఆ రాత్రి చంద్రదర్శనము నిషిద్ధము.*
✅ *చతుర్ధి యందు ఉదయించిన చంద్రుని, చూడనే కూడదనినచో, 5, 6 ముహూర్తములు శేషించిన... అనగా గడచిన చతుర్ది దినమందు నిషేధము. కానీ ఈనాటి జనులు - వినాయక వ్రతదినమందు చంద్రుని చూచుటలేదు గాని, ఉదయ కాలమందునూ, దర్శన కాలమందునూ, చతుర్ది ఉన్నదా లేదా అని విచారించుటలేదు.*
✅ *ఒకవేళ, చంద్రదర్శనమైనచో, ఆ దోషము పోవుటకు ఈ శ్లోకము పఠించవలెను.*
_*"సింహః ప్రసేన మవధీత్ సింహో జాంబవతా హతః |*_
_*సుకుమార కమారోదీ స్తవ హ్యేష స్యమంతకః||"*_
✅ *చతుర్థి యందు వినాయక వ్రతము లేకున్నను, చంద్రదర్శనము నిషిద్ధము* అని స్మృతికారుని వచనము
✅ ..... ఇలా శాస్త్రవిషయం పరిశీలించి, దృగ్ గణిత నిర్ణయం - _*19-09-2023 మంగళవారం - శ్రీ వరసిద్ధి వినాయక వ్రతం*_
🪷 _*18 వ తేదీన చంద్రుని దర్శించకూడదు - 19 వ తేదీ వ్రతము ఆచరించాలి. నిస్సహాయ స్థితిలో దర్శనము జరిగినప్పుడు పైన ప్రకటించిన శ్లోకముతో దోష నివారణ జరుగుతుంది. మరునాటి వ్రత ప్రభావము వల్ల ఆశీస్సులు ఉండగలవు.*
🚩® Gnaana Sindhu ® 🚩
🙏🍁🍁🍁🍁🕉️🌹🌹🌹🌹🙏
శంకరాచార్యలవారు
శృంగేరి పీఠానికి చెందిన శ్రీ శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్యలవారు రాహుల్ మరియు సిద్ధరామయ్య (కర్ణాటక సీఎం)లను ఆశీర్వదించడానికి నిరాకరించారు. జగద్గురువులు వారితో "మీరు మఠానికి వచ్చారు, ధన్యవాదాలు. కానీ, మీరు ఏమి చేస్తున్నారో, మీకు తెలియదా? మేము మిమ్మల్ని ఆశీర్వదించలేము."* అంటూ
*సమావేశంలో, మీకు హిందూమతం పట్ల అసహనం ఉంటే, మీ చర్యల ద్వారా హిందూమతంలో అసమానతను సృష్టించే బదులు, దయచేసి హిందూమతానికి దూరంగా ఉండండి అని జగద్గురువులు రాహుల్ మరియు సిద్ధరామయ్యలకు చెప్పారు. హిందూ మఠాలు, ఆలయాలు ఏం తప్పు చేశాయని, ఆలయాల నిర్వహణను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అంతే కాదు, హుండీ రూపంలో వచ్చే డబ్బుతో దేవాలయాలను పునర్నిర్మించకుండా, అదే డబ్బును ఇతర మతాల సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నారు ఇది ఆమోదయోగ్యం కాదు.* *మీరు మా మఠానికి రావడం మంచిది, కానీ మీరు హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న తీరుకు మేము మీకు ఆశీస్సులు అందించలేము* అని జగద్గురువు ఇద్దరికీ సూటిగా చెప్పారు.
*రాజకీయ నాయకులు రాహుల్ మరియు సిద్ధరామయ్య ఇద్దరూ జగద్గురువు నుండి ఇంత పదునైన వ్యాఖ్యలను ఊహించలేదు. ఇద్దరూ నిరుత్తరులయ్యారు మరియు సమావేశం నుండి బయటకు వచ్చిన తర్వాత, జ
వినాయకుని పూజించే 21 రకాల
వినాయకుని పూజించే 21 రకాల ఆకులు
వినాయకుని పూజించే 21 రకాల ఆకులు..మన ఆరోగ్యాన్ని కాపాడే దివ్యౌషధాలు.
అవి ఏమిటంటే...
1. మాచీపత్రం 2. బృహతీపత్రం (వాకుడు)
3. బిల్వపత్రం (మారేడు) 4. దూర్వాయుగ్మం (గరికె)
5. దుత్తూరపత్రం (ఉమ్మెత్త) 6. బదరీపత్రం (రేగు)
7. అపామార్గపత్రం (ఉత్తరేణి) 8. వటపత్రం (మఱ్ఱి)
9. చూతపత్రం (మామిడి) 10. కరవీరపత్రం (గన్నేరు)
11. విష్ణుక్రాంతపత్రం 12. దాడిమీపత్రం (దానిమ్మ)
13. దేవదారుపత్రం 14. మరువకపత్రం (మరువం)
15. సింధువారపత్రం (వావిలి) 16. జాజీపత్రం (సన్నజాజి)
17. గండకీపత్రం 18. శమీపత్రం (జమ్మి)
19. అశ్వత్థపత్రం (రావి) 20. అర్జునపత్రం (మద్ది)
21. అర్కపత్రం (తెల్ల జిల్లేడు)
ఈ పత్రాలలో కొన్ని పాలు స్రవించేవి, మరికొన్ని పసరు స్రవించేవి. స్వహస్తాలతో త్రుంచేటప్పుడు వాటినుంచి స్రవించే పాలు, పసర్లు కొంచమైనా మన చర్మ రంధ్రాలగుండా శరీరంలోకి వెళ్లి రక్తాన్ని శుద్ధిచేసి, నరాలకు పుష్టిని కలిగిస్తాయి. ఆ పత్రాలను సేకరించేందుకు చాలా సమయం చెట్ల దగ్గర మొక్కల దగ్గర గడుపుతూ, అవి విడుదల చేసే ప్రాణవాయువును పీలుస్తాం.మామూలు మొక్కలు విడుదల చేసే ప్రాణవాయువు కన్న, ఓషధీ మొక్కలు విడుదల చేసే ప్రాణవాయువు మృత్యుంజయ కారకాలు కనుక ఊపిరితిత్తులు శుద్ధిపడి, శ్వాస సంబంధమైన వ్యాధుల నుంచి విడుదల పొందుతాం. ఇది ఆరోగ్య కారణం. ఏనుగు వన సంచారి. ఆకులు, అలములు దాని ఆహారం. కనుక గజముఖుడైన వినాయకుని ఆకులతోనే అర్చించాలి. ఇది భౌతిక కారణం అంతేకాక.. అవసరమున్నా, లేకపోయినా, ఏనుగు.., తన తొండాన్ని కాళీగా ఉంచకుండా ఏ తీగనో, కొమ్మనో లాగుతూంటుంది. అలాగే గజముఖుడైన వినాయకుడు మన మనో వనసంచారి. ఆయన అంకుశం లాంటి తన తొండంతో మన మనస్సులలోని కల్మష భావాలనే కలుపు మొక్కలను సమూలంగా పీకేసి, తన మోదక ప్రసాదాలతో మన బుద్ధిని పవిత్రం చేసి, ఆనందమయ మార్గంలో మనలను నడుపుతాడు. ఇది ఆధ్యాత్మిక కారణం. అందుకు కృతఙ్ఞతగా వివాయకునికి ఇష్టమైన పత్రాలతో ఆయనను పూజిస్తాం.
శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం
శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం
గురూజీ సహదేవ రాజు సెల్ :9948381552
ఈ భూప్రపంచం మీద సమస్య లేని వాళ్ళు ఎవరు ఉండరు
)1విద్య
2)ఉద్యోగం
3)వ్యాపారం
4)భార్య భర్తల మధ్య గొడవలు
5)పుత్రసంతానం
6)ప్రేమ సమస్యలు
7)ఎన్ని సంబంధాలు వచ్చిన పెళ్లి ముడి పడకపోవడ
8)ధనము కలసి రాకపోవడం
10)కుటుంబ సమస్యలు
11)ఆర్థిక సమస్యలు
13)స్త్రీ వశీకరణం
14పురుష వశీకరణం
15)శని దోషం నాగదోషం నరదిష్ఠి
16)ఇంట్లో మనశాంతి లేకపోవడం మీ కుటుంబంలో దెయ్యాల సమస్యలు ఉంటే చెడు కర్మలు ఉన్నా గురూజీ చక్కటి పరిష్కరం చెప్పగలరు
ఎదో సరదాగా ఆడుకుందామని :::చేపి చేయొద్దు సమస్య ఉంటే ఫోన్ చేయండి
సర్వేజన సుఖినోభవంతు
నమ్మకంతో ఫోన్ చేయండి
సర్వ సమస్యలకు పరిష్కరం చేయబడును పూజారి లక్ష్మణ్ రాజు
సెల్ : 9150206445
రామాయణమ్ 327
రామాయణమ్ 327
...
తన పాదములపై దీనముగా వ్రాలిన దధిముఖుని చూసి సుగ్రీవుడు ,ఏమి జరిగినది ఎందులకు నాపాదములపై వ్రాలినావు అని అడిగినాడు.
.
అప్పుడు అంగదుడు ,హనుమంతుడు తదితర వానరులొనరించిన మధువన విధ్వంసము గురించి అడ్డువచ్చిన తమను బెదిరించి తన్నిన వైనాన్ని పూసగుచ్చినట్లు వివరించాడు.
.
అది వినడముతోడనే సుగ్రీవుని ముఖము విచ్చుకొని లక్ష్మణునితో ఓ మహాబాహూ సీతమ్మ జాడతెలిసినది అని అమితానందముగా పలికినాడు ..
.
అవును ఇది సత్యము సీతమ్మ జాడతెలియకున్న వారందరూ అచట చేరి మధుభక్షణము చేయరు .
.
, నీవు శీఘ్రమే వెళ్ళి నా ఆజ్ఞగా చెప్పి వారిని వెంటనే ఇటకు పంపు ,వారు చేసిన వన విధ్వంసమును నేను క్షమించినాను అని దధిముఖునితోసుగ్రీవుడు పలికినాడు.
.
రామ,లక్ష్మణ,సుగ్రీవుల అనుజ్ఞతీసుకొని దధిముఖుడు మధువనమునకు తిరిగి వచ్చెను.
.
సుగ్రీవాజ్ఞను వారికి ఎరిగించగా వానరులందరూ వెంటనే పయనమయ్యి సుగ్రీవుని సమక్షములో నిలిచారు.
.
వారిని చూడగనే వాలము ఎత్తి సంతోషముతో సుగ్రీవుడు నిలుచున్నాడు.
.
అప్పుడు హనుమంతుడు ,
శ్రీరామా! సీతాదేవి కనపడినది ,ఆమె పాతివ్రత్యమును కాపాడుకొనుచూ ఆరోగ్యముగా ఉన్నది అని రామచంద్రునికి విన్నవించెను.
.
ఆ వాక్కులు శ్రీరామహృదయమునకు అమృతపు జల్లువలె చేరెను .
.
అటుపిమ్మట జరిగిన విషయములన్నీ విన్నవించి ,కాకాసురవృత్తాంతము కూడా రామునికి తెలిపి సీతమ్మ ఇచ్చిన చూడామణిని భద్రముగా రామునకు అందించినాడు .
.
ఆమణిని చూడగనే ఆయన హృదయము కరిగి కన్నీరై జలజల ప్రవహించెను.
.
సీతామాత సందేహములుతీర్చి ఆమెకు ధైర్యము కలిగించినాను. ఆమె హృదయములో శాంతినిపొందినది అని హనుమంతుడు సవినయముగా రామునికి తెలియచేసినాడు.
.
(సుందరకాండ సమాప్తము)
.
వూటుకూరు జానకిరామారావు
.
చవితి పూజ ఎప్పుడు
18/09/2023 నాడు చవితి పూజ ఎప్పుడు ఆచరించాలి?
ఆరోజు చవితి ఉదయం 10.15 కి వచ్చింది
అయితే దుర్ముహూర్తం మధ్యాహ్నం 12.19 నుండి 1.08 వరకు ఉంది
కావున 10.15 నుండి 12.00 మధ్యలో పూజలు మొదలు పెట్టాలి
మరలా దుర్ముహూర్తం 2.45 నుండి 3.33 వరకు ఉంది
1.15 నుండి 2.30 మధ్యలో మొదలు పెట్టాలి
సాయంత్రం వర్జ్యం 4.56 నుండి 6.36 వరకు ఉంది.
3.50 నుండి 4.50 మధ్యలో చవితి పూజ ప్రారంభం చేయవచ్చు మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి జ్యోతిష వాస్తు శాస్త్ర సలహాలు సూచనలు కై సంప్రదించండి సకల శుభ పౌరోహిత్యం కార్యక్రమం లు కూడా చేయించబడును ముహూర్తం లు మా ప్రత్యేకత వినాయక చవితి కి పందిళ్ళు లో పూజలు చేయించబడును
నా ఫోన్ నెంబర్ 7981622895
వినాయక చవితి సందేశాలు సందేశం - 2/11
ॐ వినాయక చవితి సందేశాలు
-----------------------
సందేశం - 2/11
హస్తి ముఖుడు - పాండిత్య ప్రదాత
హస్తిముఖుడు
వినాయకుడు హస్తి ముఖుడు. హస్తమంటే తుండం. హస్తం కలది హస్తి. అంటే ఏనుగు ముఖం కలిగిన వాడు వినాయకుడని భావం.
వినాయకుడు పుట్టిన నక్షత్రం "హస్త". ఆ విషయాన్ని ఈయన ముఖం చూడగానే గుర్తించేలాగా కూడా హస్తిముఖుడయ్యాడు.
శ్రీరామనవమి సమయంలో "పునర్వసు" లాగా,
కృష్ణాష్టమీ సమయంలో "రోహిణీ" నక్షత్రంవలే,
వినాయకుని జన్మ నక్షత్రం "హస్త".
విశేషం
హస్తా నక్షత్రం కన్యారాశికి చెందుతుంది. కన్య అంటే పెళ్ళికానిదని సామాన్య అర్థం. వినాయకునికి వివాహం కాలేదని అంటారు.
సిద్ధి బుద్ధులు ఆయన భార్యలని మరొకచోట చదువుతాం.
సిద్ధి (Spiritual Power), బుద్ధి (Intellect) రెండూ కూడా, జ్ఞానానికి సంబంధించినవిగా అన్వయం.
పాండిత్యం
కన్యారాశికి నవగ్రహాలలో బుధుడు అధిపతి. బుధుడంటే పండితుడని అర్థం.
వినాయకుడు "విద్యల కెల్ల ఒజ్జ" (ఆది పూజ్యుడు) అయ్యాడు. మహా పండితుడు కూడా.
బుధగ్రహ దోషం - నివారణ
బుధగ్రహ దోషం ఉంటే, వారికి
- ధారాళంగా మాట్లాడగలగడం,
- తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పగలగడం,
- ఉచ్చారణలో శ్రావ్యత స్పష్టత ఉండదని చెబుతారు.
(వాక్పటిమ లోపిస్తుందని అంటారు)
బుధుడు ఆకుపచ్చగా ఉంటాడు. ఎవరికైనా బుధగ్రహం అనుకూలంగా లేకపోతే, నవధాన్యాల్లో ఆకుపచ్చనివైన పెసలని దానం ఇప్పిస్తారు.
ఆకుపచ్చని బుధగ్రహానికి సంబంధించినవాడు వినాయకుడని సూచన ప్రాయంగా గుర్తుచేస్తూ,
ఆకుపచ్చ పత్రితో పూజ ఏర్పాటైంది.
"బుధ" గ్రహ దోషనివృత్తిచేసి, పాండిత్యాన్ని అనుగ్రహించేవాడుగా,
సిద్ధి (Spiritual Power) ,బుద్ధి (Intellect) లతో కూడిన "వినాయకుడు" మన ఆరాధ్య దైవం.
* గమనిక
ఈ సంవత్సరం హస్తా నక్షత్రం ముందురోజే ఉంది.
ఒక్కొక్కసారి అధికమాసం వలన కావచ్చు, మరికొన్ని ఇతర కారణాల వలనా,
అటూఇటూ స్వల్ప మార్పులు వస్తూంటాయి.
ఇది తిథి ప్రధానంగా చేసుకొంటున్న పండగ.
రామాయణం శర్మ
భద్రాచలం
దైవము ఆవిర్భవిస్తాడు.
*1919*
*కం*
దుష్టుల శిక్షించుటచే
శిష్టుల రక్షించి లోక శ్రేయము కొరకై
సృష్టంబగు దైవమిలను
భ్రష్టము ప్రబలంగ నెపుడు పదపడి సుజనా.
*భావం*:-- ఓ సుజనా! దుష్టులను శిక్షించడం ద్వారా శిష్టులను రక్షించి లోకకల్యాణం నెలకొల్పడానికి లోకం బలంగా చెడినప్పుడు దైవము ఆవిర్భవిస్తాడు.
భగవద్గీత లో శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పి న విధంగా ఇప్పుడు భారత దేశాన్ని ధార్మిక పాలన చేయుచున్న మాన్య ప్రధాన మంత్రి *శ్రీ నరేంద్ర మోదీజీ* కి హార్దిక జన్మదినోత్సవ శుభాకాంక్షాపూర్వక శుభాభివందనములు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
ధర్మో రక్షతి రక్షితః* "
* .....🙏🙏🙏
🔥🔥🔥🔥🔥🔥🔥🔥
అనే వాక్యం వాల్మీకి రచించిన
రామాయణంలోని ఒక శ్లోకంలోనిది.
జన ప్రాముఖ్యం పొందిన వాక్యాలలో
ఇది ఒకటి...
ఈ వాక్యం యొక్క అర్ధం
"ధర్మాన్ని మనం రక్షిస్తే
ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది".
రామాయణంలో ఈ వాక్యం ఉన్న శ్లోకం...
ధర్మ ఏవహతో హంతి,
ధర్మో రక్షతి రక్షితః !
తస్మాద్ధర్మోన హత వ్యో,
మానో ధర్మాహతో వధీత...!!
"చంపబడిన ధర్మం
ఆ ధర్మాన్ని చంపినవాణ్ణి చంపుతుంది;
రక్షింపబడిన ధర్మం
అ ధర్మాన్ని
రక్షించినవారిని ...కాపాడుతుంది....🙏
(ఈ పోస్ట్ ఎందుకు పెట్టానో..
మీకు అర్థం అయ్యందా...!...)
*ధర్మం.*
అందరూ అంటుంటారు
ధర్మమే గెలుస్తుంది అని.. అది తప్పు..
ధర్మం దానంతట అదే గెలవటం కాదు..
నువ్వు గెలిపించాలి,
మనం కలిసి గెలిపించాలి.. అర్థం కాలేదా...*
అయితే రండి...
ఒక్కసారి నెత్తుటితో తడిసిన చరిత్ర
పుస్తకాలలోకి తొంగి చూడండి..*
త్రేతాయుగంలో రాముడి భార్యను
రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు,
సరేలే ధర్మమే గెలుస్తుంది కదా,
తన సీత తిరిగి వస్తుంది అని రాముడు
చేతులు కట్టుకొని గుమ్మం వైపు
చూస్తూ కూర్చోలేదు..
రావణాసురుడి మీద
ధర్మయుద్ధం ప్రకటించాడు.
ఆ రాముడికి అఖండ వానర సైన్యం
తోడై ధర్మం వైపుకు అడుగులు వేశారు,
ఆ యుద్ధంలో రాముడికి సైతం
గాయాలు అయ్యాయి.
తన భుజాలను, తొడ భాగాల చర్మాన్ని
బాణాలు చీల్చుకొని వెళ్ళాయి.
నరాలు తెగి రక్తం చిందుతున్నా సరే
తట్టుకొని నిలబడ్డాడు, పోరాడాడు,
యద్ధంలో గెలిచాడు.. ధర్మం గెలిచింది...* 🙏
ద్వాపరయగంలో కురుక్షేత్ర యుద్ధంలో
కృష్ణుడు తను దేవుడు కదా అని ఓక
సామాన్య మానవుడు లా యుద్దాన్ని
చూడలేదు..
ధర్మం చూసుకున్నాడు.
పాండవుల పక్షాన నిలుచున్నాడు.
అర్జునుడికి రథ సారధిగా మారాడు,
గుర్రానికి గుగ్గిళ్లు పెట్టాడు,
దాని పేడ ఎత్తేశాడు.
స్నానాలు చేయించాడు.*
ఆ యుద్ధంలో రథాన్ని నడుపుతూ
ఆ వేగంలో...
వెనకాల అర్జునుడి మాటలు వినపడవు
గనుక అర్జునుడు తన కాలుతో కృష్ణుడి
కటి భాగంలో ఎటువైపు తగిలిస్తే రథాన్ని
అటువైపు తిప్పాలని ముందుగనే
అనుకున్నారు..
అలా కాళ్ళతో కూడా*
*తన్నించుకున్నాడు...
అవన్ని ధర్మం కోసమే చేసాడు.
ధర్మాన్ని గెలిపించడం కోసమే చేసాడు.
అలా కురుక్షేత్ర యద్ధం ముగిసింది,
ధర్మం గెలిచింది..* 🙏🙏🙏
*కలియుగం ఇప్పుడు కూడా మనం
ప్రతిరోజు సమస్యలతో పోరాడుతునే
వున్నాం..
ప్రతి ఒక్కరి మదిలో మంచికి చెడుకి
యుద్ధం జరుగుతునే వుంది..
నువ్వు నమ్మితే అది నిజం
మాత్రమే అవుతుంది.. ..
ఆచరిస్తే ధర్మం అవుతుంది.
అది భవిష్యత్ తరాలకు
మార్గదర్శకం అవుతుంది.*
అదే నువ్వు నా, ని, తన, మన భేదాలను
పక్కన పెట్టి న్యాయం ఆలోచిస్తేనే
ధర్మం అర్థం అవుతుంది..*
అలా ఆలోచించి పోరాడిన రోజే
ధర్మం గెలుస్తుంది,
తెగించి అలా ధర్మం వైపుకు నిలబడిన
రోజు నీ వెనకాల ప్రపంచమే నడుస్తుంది..*
*మన ధర్మాన్ని కాపాడుకుందాం.
మన భావితరాలకు అందిద్దాము...*🙏🙏
ధర్మో రక్షతి రక్షితః.....🙏🙏🙏
వరాహ జయంతి*_
_*వరాహ జయంతి*_
శ్రీ మహావిష్ణువు ధర్మ పరిరక్షణ మరియు దుష్టశిక్షణల నిమిత్తమై యుగయుగాల్లో ఎన్నో అవతారాలు ధరించాడు. వీటిలో దశావతారాలు ప్రముఖమైనవి. ఈ దశావతారాలలో మూడవ అవతారము వరాహావతారము.
శ్వేతవరాహ కల్పములో శ్రీ మహావిష్ణువు రెండు మార్లు వరాహ అవతారం ధరించాడు. మొదటిదైన స్వాయంభువ మన్వంతరములో ఒకసారి మరియు ఆరవదైన చాక్షుష మన్వంతరములో మరొకసారి ఈ అవతారమును ధరించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం మనము ఇదే కల్పములో ఏడవదైన వైవస్వత మన్వంతరములో నాలుగవదైన కలియుగంలో వసిస్తున్నాము.
*యజ్ఞ వరాహ జయంతి*
శ్వేతవరాహ కల్ప ఆరంభ సమయములో శ్రీ మహా విష్ణువు అంతవరకూ జలమయమై ఉన్న బ్రహ్మాండాన్ని ఏడు వూర్ధ్వ లోకములుగా , ఏడు అధో లోకములుగా విభజించి అవసరమైన వనరులను సమకూర్చసాగాడు. భూమిని తీర్చిదిద్ధే ప్రక్రియలో భాగంగా అనేక పర్వతాలు , నదులు మరియు సముద్రాలను సమకూర్చాడు. అయితే వాటి భారాన్ని తాళలేని భూమి పాతాళానికి కుంగిపోయింది.
దానితో ఆ మన్వంతరానికి అధిపతి అయిన స్వాయంభువ మనువు బ్రహ్మను ఆశ్రయించి ప్రళయమును నుండి రక్షింపమని వేడుకున్నాడు. బ్రహ్మ భూమిని గురించి బాధపడుతూ ఆలోచించసాగాడు. ఆ సమయములోనే అకస్మాత్తుగా బ్రహ్మ ముక్కు నుండి బొటనవ్రేలు అకారమంత ఉన్న ఒక వరాహ శిశువు ఉద్భవించినది. చూస్తుండగానే ఆ వరాహము మేఘ ఘర్జన లాంటి ఘర్ఘర ధ్వనిని చేస్తూ పర్వత సమానంగా పెరగసాగింది. బలిష్ఠమైన నల్లని దేహంతో , జ్యోతుల్లా ప్రజ్వరిల్లుతున్న ప్రకాశవంతమైన కళ్లతో , ఇనుప కమ్మీల్లాంటి కోరలతో అతి భీకరమైన ఆకారమును దాల్చినది. బ్రహ్మదేవుడు ఆ సూకరమును స్తుతింపగా , ఆ వరహ భగవానుడు ప్రసన్నుడయి , ప్రళయము నుండి భూమిని రక్షింపటానికి ఉద్యుక్తుడాయెను.
వరాహ రూపం ధరించిన మహా విష్ణువు తన కోరల మీద భూమిని పైకి ఎత్తి , ఆ స్థితిలో భూమిని స్థిరంగా ఉంచడానికి అష్టదిగ్గజాలను ఆసరాగా ఏర్పరచి , వాటి తొండముల మీద భూమిని ప్రతిష్ఠించాడు. అప్పటినుంచి ఆ అష్ట దిగ్గజాలే భూమి గతి తప్పకుండా కాపాడుతున్నాయి.
స్వాయంభువ మన్వంతరములో అవతరించిన ఈ వరాహ అవతారాన్ని యజ్ఞ వరాహరూపంగా భావిస్తారు. *ఈ యజ్ఞ వరాహ జయంతిని చైత్ర బహుళ త్రయోదశినాడు జరుపుకుంటారు.*
*ఆది వరాహ జయంతి*
సనకసనందాది మహర్షులు మహా విష్ణువు దర్శనార్ధమై వైకుంఠమునకు ఏతెంచగా , విష్ణుమూర్తి ద్వారపాలకులైన జయ విజయులు వారిని అడ్డగించారు. దానితో ఆగ్రహించిన మహర్షులు వారిని మూడు జన్మల పాటు రాక్షసావతారము దాల్చమని శపించగా , మొదటిజన్మలో హిరణ్యాక్ష , హిరణ్య కశపులుగా జన్మిస్తారు.
అమిత బల సంపన్నుడైన హిరణ్యాక్షుడు విష్ణు నామం జపించే వారిని కష్టాలపాలు చేయసాగాడు. ఒక సందర్భంలో భూమినంతటినీ చుట్టగా చుట్టి పాతాళలోకంలో పడవేసాడు. సకల లోకాలలో అత్యంత ప్రాధాన్యం , ప్రాభవం కలిగినది , సకల ప్రాణికోటికి నిలయమైనది అయిన భూమి కుంగిపోవటంతో దేవతలంతా ఆందోళనతో మహా విష్ణువును ఆశ్రయించారు.
హిరణ్యాక్షుని ఆగడాల పట్ల కోపోద్రిక్తుడైన విష్ణువు భీకరమైన వరాహ అవతారమును దాల్చి పాతాళలోకానికి మార్గమైన సముద్రంలోకి దిగి అక్కడి వరకూ వ్యాపించి ఉన్న కుల పర్వతాల మొదళ్లను తన ముట్టెతో పెకలించసాగాడు. దానితో ఆ పర్వతాలు భయమొంది హిరణ్యాక్షుడు ఉండే చోటును ఆ వరాహ భగవానునికి చూపించాయి. అప్పుడు జరిగిన యుద్ధములో హిరణ్యాక్షున్ని సంహరించి భూమిని యథా స్థానంలో నిలిపాడు. ఇలా భూమిని ఉద్ధరించి దేవతల చేత స్తుతింపబడిన వరాహమూర్తిని ఆదివరాహమూర్తిగా పరిగణిస్తారు. *ఈ ఆది వరాహ జయంతిని భాద్రపద శుక్ల తృతీయ రోజు జరుపుకుంటారు.*
*తిరుమల - ఆది వరాహ స్వామి*
తిరుమలలో ముందుగా వరాహ స్వామిని దర్శించిన తరువాతనే స్వామివారిని దర్శించాలనే ఆచారము ఉంది. దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన గాథ ఉంది.
హిరణ్యాక్షుని సంహరించిన తరువాత ఆదివరాహ స్వామి భూమిపైన సంచరించిన ప్రదేశమే నేటి తిరుమల క్షేత్రం. ఆ స్వామి ఇక్కడే నివాసమేర్పరచు కోవటంతో మొదట ఇది ఆదివరాహ క్షేత్రం గా ప్రసిద్ధి పొందినది. ఆ వరాహస్వామి ఒకసారి భూమి పైన సంచరించే సమయంలో వృషభాసురుడనే రాక్షసుడు తటస్థపడేసరికి వాడ్ని చంపి , తిరుమలకు చేరుతుండగా శ్రీనివాసుడు తటస్థపడతాడు. అప్పుడు వారు ఒకరినొకరు శ్రీ మహావిష్ణువు రూపాలుగా గుర్తిస్తారు. అలా రెండు రూపాలలో ఉన్న విష్ణు భగవానుడు ముచ్చటిస్తుంటే ముక్కోటి దేవతలు ఆనంద పరవశులయ్యారట.
ఆ శ్రీనివాసుడు కలియుగాంతము వరకు ఆ క్షేత్రములో నివసించాలన్న సంకల్పమును వెలిబుచ్చి , కొంత స్థలము ప్రసాదించమని వరాహ స్వామిని కోరగా , దానికి మూల్యము చెల్లిస్తే స్థలమిస్తానని వరాహ స్వామి తెలిపాడు. అప్పుడు శ్రీనివాసుడు స్థలమునకు మూల్యంగా దర్శనానికి వచ్చే భక్తుల ప్రధమ దర్శనము , ప్రధమ నైవేద్యము వరాహ స్వామి జరిగేటట్లు చేస్తానని మాట ఇచ్చాడు. అప్పటినుండి ముందుగా వరాహ స్వామిని దర్శించాలనే ఆచారం వచ్చినట్లుగా కథనం.
వరాహ రూపంలో ఉన్న విష్ణు దేవుడికి ప్రత్యేకమైన ఆలయాలు లేవు. ఆ తరవాతి అవతారమైన నరసింహావతారంతో కలిసి సింహాచలంలో వరాహ లక్ష్మీనరసింహ స్వామిగా పూజలందుకొంటున్నాడు. ప్రకాశం జిల్లాలో సింగరాయకొండ గ్రామంలో నారద మహర్షి ప్రతిష్ఠించినట్లుగా భావించే వరాహ నరసింహమూర్తి దేవాలయం ఉంది.
వసతి దశనశిఖరే ధరణీ తవ లగ్నా ,
శశిని కళంకకలేవ నిమగ్నా ,
కేశవ ధృతసూకరరూప జయ జగదీశ హరే||
*కుంగిపోయిన భూమిని తన నాసికపై చంద్రుని నెలవంక వలె నిలిపి కాపాడిన వరాహావతారమైన శ్రీహరికి , జగదీశ్వరునకు జయము జయము – జయదేవుడు*
సంస్కృత భారతీ* *6*
*సంస్కృత భారతీ*
*6*
*సన్నన్తాః*
కర్తుం ఇఛ్ఛా = చికీర్షా = చేయాలనే కోరిక,
గన్తుం ఇఛ్ఛా = జిగమిషా= వెళ్ళాలనే కోరిక,
వక్తుం ఇఛ్ఛా = వివక్షా = చెప్పాలనే కోరిక,
భోక్తుం ఇఛ్ఛా = బుభుక్షా = తినాలనే కోరిక,
జ్ఞాతుం ఇఛ్ఛా = జిజ్ఞాసా = తెలుసుకోవాలనే కోరిక,
ద్రష్టుం ఇఛ్ఛా = దిదృక్షా= చూడాలనే కోరిక,
...ఇలా ద్విపదకములు ఏకపదకములుగా మారుతాయి. ఇవన్నీ స్త్రీలింగ శబ్దములు. అందువలన తదనుగుణంగా సహాయ క పదములనూ స్త్రీలింగంలోనే ప్రయోగించవలెను.
****
షష్ఠీ విభక్తి పదానికి కృతే చేర్చినచో చతుర్థీ విభక్తి గా మారుతుంది.
మహ్యం / మమకృతే= నాకొరకు, తుభ్యం/ తవ కృతే = నీకొరకు, అస్మాకంకృతే = మన కొరకు, భవతః కృతే / యుష్మాకం కృతే = మీకొరకు, అస్యకృతే = వీని కొరకు, తస్య కృతే = వాని కొరకు,ఏతత్కృతే = దీని(నపుంసకలింగ) కొరకు, తత్ కృతే = దాని (నపుంసక) కొరకు
*ప్రయోగవిభాగః*
*** మమ సంస్కృతాధ్యయన చికీర్షా అస్తి... నాకు సంస్కృత మును చదివే కోరిక కలదు.
*** అస్య అమెరికా జిగమిషా అస్తి వా? ఈతనికి అమెరికా వెళ్ళే కోరిక ఉన్న దా? (వా అనేది కూడా ప్రశ్నించుటకై వాడబడును).
భవతః చలనచిత్ర దిదృక్షా అస్తి ఖలు? మీకు చలన చిత్రం చూచే కోరిక ఉన్న ది కదా.?
*శుభం భూయాత్*
**** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
*సంస్కృత భారతీ*
*5*
*పంచమ పాఠః*
*తుమున్ ప్రత్యయ విశేషః*
తుమున్ ప్రత్యయం చేర్చినచో కొరకు అనే భావం వస్తుంది.
*ఉదా*:-- కర్తుం = చేయుటకు, కారయితుం = చేయించుటకు, గన్తుం = వెళ్ళుటకు, గమయితుం = పంపుటకు, భోక్తుం = తినుటకు, వక్తుం = చెప్పుటకు, ఆనయితుం = తెచ్చుటకు, ప్రాపయితుం = పొందుటకు, ప్రాప్తుం = పొందుటకు, పఠితుం = చదువుటకు, గణితుం = లెక్కించుటకు, దాతుం= ఇచ్చుటకు... ఒకవేళ ఆ తుమున్ ప్రత్యయం ద్వారా కలిగే మార్పు తెలియక పోతే ఆ క్రియాపదానికి తదుపరి " కర్తుం" చేర్చి ప్రయోగించదగును.
*ఉదా*:-- గానం కర్తుం (గాతుం)= పాట పాడుట చేయుటకు( పాడుటకు), భోజయితుం/ భోజనం కారయితుం ఈ రెండింటికినీ భోజనం చేయించుటకు అనే భావమే కలుగుతుంది...ఇలా.
*ప్రయోగ విభాగః*
*ప్ర*:-- త్వం కుత్ర కిమర్థం గఛ్ఛసి? ... నీవు ఎక్కడ కు ఎందుకు వెళ్ళుచున్నావు?
*స*:-- అహం పాఠశాలాయాం ప్రతి పఠితుం గఛ్ఛామి... నేను పాఠశాల కు చదువుటకు వెళ్ళు చున్నాను.
*ప్ర*:-- త్వం శ్వః కుత్ర కిమర్థం గమిష్యసి?.. నీవు రేపు ఎక్కడ కు ఎందుకు వెళ్ళెదవు??
*స*:-- అహం శ్వః రాజమహేంద్రవరం పర్యన్తం గోదావరినదీస్నానం కర్తుం (నద్యాం స్నాతుం) గన్తుం ఇఛ్ఛామి... నేను రేపు రాజమహేంద్రవరం వరకూ గోదావరి నదీస్నానం చేయడానికి(నది లో స్నానం చేయడానికి) వెళ్ళుటకు ఇష్టపడుచున్నాను....ఇలా ప్రయత్నం చేయగలరు.
*శుభం భూయాత్*
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
ఉపాధ్యాయుడు, తల్లి తండ్రులు కి మనసా కర్మణా చేసిన ద్రోహం bhruna హత్య కన్నా ఎక్కువ. వాడిని మించిన పాపి ఇంకొకడు లేడు.
🌸🌼ಬೆಳಗಿನ 🌅 ಸೂಳ್ನುಡಿ🌼🌸
*ಉಪಾಧ್ಯಾಯಂ ಪಿತರಂ ಮಾತರಂ ಚ*
*ಯೇಽಭಿದ್ರುಹ್ಯಂತೇ ಮನಸಾ ಕರ್ಮಣಾ ವಾ |*
*ತೇಷಾಂ ಪಾಪಂ ಭ್ರೂಣಹತ್ಯಾ ವಿಶಿಷ್ಟಂ*
*ತಸ್ಮಾನ್ನಾನ್ಯಃ ಪಾಪಕೃದಸ್ತಿ ಲೋಕೇ ||*
(ಮಹಾಭಾರತ)
ಉಪಾಧ್ಯಾಯ, ತಂದೆ, ತಾಯಿ - ಇವರಿಗೆ ಯಾವನು ಮನಸ್ಸಿನಿಂದಲೂ, ಆಚರಣೆಯಿಂದಲೂ ದ್ರೋಹಮಾಡುತ್ತಾನೋ ಅವನ ಪಾಪವು ಭ್ರೂಣಹತ್ಯೆಗಿಂತಲೂ ಹೆಚ್ಚಿನದು. ಅಂತಹವನಿಗಿಂತ ಹೆಚ್ಚಿನ ಪಾಪಿ ಈ ಲೋಕದಲ್ಲಿ ಇಲ್ಲ.
*🌷🌺🙏ಶುಭದಿನವಾಗಲಿ!🙏🌺🌷*
ఉపాధ్యాయుడు, తల్లి తండ్రులు కి మనసా కర్మణా చేసిన ద్రోహం bhruna హత్య కన్నా ఎక్కువ. వాడిని మించిన పాపి ఇంకొకడు లేడు.
సుబ్బారావా_మజాకానా
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
సుబ్బారావా_మజాకానా ......!!
అమెరికా వెళ్ళాడు మన సుబ్బారావ్... పన్ను నొప్పి భరించలేక ఓ డెంటిస్టు దగ్గరకు వెళ్లాడు...
ఎందుకైనా మంచిదని ముందే అడిగాడు, ఎంత తీసుకుంటారు అని...! నిజమైన తెలుగు వారు ఎవరైనా అంతే కదా...
1200 డాలర్లు తీసుకుంటాను అన్నాడు డాక్టర్...!
అబ్బే, మరీ ఎక్కువ అన్నాడు సుబ్బారావ్ గారు ఆశ్చర్యం గా డాక్టర్ ని చూస్తూ.......!!
అనస్తీషియా ఇచ్చి, జాగ్రత్తగా పన్ను పీకేయాలి, సో, రేటు ఎక్కువే అని చెప్పాడు డాక్టరు.
ఇంకేమైనా చౌకగా పని పూర్తయ్యే మార్గం లేదా డాక్టర్ అనడిగాడు . హైదరాబాద్ వెళ్ళినప్పుడు సుల్తాన్‌బజార్ బేరం సంగతి గుర్తొచ్చి అదే ..తరహాలో...
డాక్టర్‌కు అతనాడే బేరం చూసి చిర్రెత్తి, అనస్తీషియా ఇవ్వకుండా పీకేస్తా, నొప్పి భరించగలిగితే వెంటనే వచ్చి ఈ కుర్చీలో కూర్చో, 300 డాలర్లు ఇవ్వు చాలు అన్నాడు కోపంగా.
వోకే, దానిదేముంది, ఆంధ్రా లో రోడ్ల మీద టూవీలర్ నడిపిన వాడిని, ఈ నొప్పులు గిప్పులు జాన్తానై అంటూ వెంటనే కుర్చీలో కూర్చున్నాడు,..😄
డాక్టర్ పన్ను పీకేశాడు, అంతసేపూ సుబ్బారావ్ గారు అలాగే నిర్వికారంగా కూర్చున్నాడు తప్ప కిమ్మనలేదు... నొప్పి కలుగుతున్న ఫీలింగ్ కూడా లేదు మొహంలో... పైగా ఒకటీరెండుసార్లు చిరునవ్వు నవ్వినట్టు కూడా అనిపించింది...
డాక్టర్ మహాశ్చర్యపోయాడు...
మిస్టర్ సుబ్బారావు, నొప్పిని నియంత్రించు కోవడంలో, భరించడంలో మీ నేర్పు, ఓర్పు సూపర్బ్... ఎంతో సాధన మీద గానీ సాధ్యపడదు... మీరు 300 డాలర్లు ఇవ్వనక్కర్లేదు, మిమ్మల్ని అభినందిస్తూ నేనే మీకు 500 డాలర్లు ఇస్తున్నాను అన్నాడు ఆ డెంటిస్ట్... ఇచ్చాడు, సుబ్బారావ్ గారు డాక్టర్ వంక అదోలా చూస్తూ వెళ్లిపోయాడు. ..
సాయంత్రం ఎప్పటిలాగే ఓ క్లబ్బులో తోటి డెంటిస్టులతో మాట్లాడుతూ... ‘‘అలాంటి అసాధారణ వ్యక్తుల్ని నేనెప్పుడూ చూడలేదు’’ అంటూ సుబ్బారావు గారి నొప్పిరహిత పన్నుపీకుడు ఎపిసోడ్ మొత్తం చెప్పాడు ఆయన...!😄
వెంటనే మరో డెంటిస్టు అదిరిపడి ఇలా చెప్పాడు... ''వార్నీ, వాడు అసాధ్యుడురా బాబూ... ముందు నా దగ్గరకు వచ్చాడు... అడిగిన రేటు ఇచ్చేస్తానన్నాడు... అనస్తీషియా ఇచ్చి, బయట అరగంట కూర్చోమన్నాను... ఆ తరువాత పిలిస్తే రాలేదు, బయటికొచ్చి చూస్తే లేడు అన్నాడు బాధగా"..........!!
"మన సుబ్బారావు గారు అంటే మాటలా....ఎవడైనా మటాష్ అయిపోవలసిందే".....!!
😂😂😂
*సేకరణ:- వాట్సాప్ పోస్ట్*
🙏💐🙏
ఉద్యోగి అంతరంగం
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
👨🦳 *పదవీ విరమణ పొందిన ఒక ఉద్యోగి అంతరంగం*👨🦳
🕦 సమయం గడిచిపోయింది, ఎలా గడిచిందో తెలియదు. జీవితమనే పెనుగులాటలో వయసు గడిచిపోయింది తెలియకుండానే.
✍ భుజాలపైకి ఎక్కే పిల్లలు భుజాలదాక వచ్చేశారు, తెలియనే లేదు.
✍ అద్దె ఇంటి నుండి చిన్నగా మొదలైన జీవితం ఎప్పుడు మన ఇంట్లో కి వచ్చామో తెలియనే లేదు.
✍ ఆయాసంతో సైకిల్ పెడల్ కొడుతూ కొడుతూ కారులో తిరిగే స్థాయికి ఎప్పుడొచ్చామో తెలియనే లేదు.
✍ ఒకప్పుడు తల్లిదండ్రుల బాధ్యత మాది. కానీ ఇప్పుడు నా పిల్లలకు నేను బాధ్యతగా మారాను. ఇది కూడా ఎలా జరిగిందో తెలియనే లేదు.
✍ ఒకప్పుడు పగలు కూడా హాయిగా నిద్ర పోయేవాళ్ళం. కానీ ఇప్పుడు నిద్ర రాని రాత్రులు ఎన్నో. ఇది కూడా ఎలా జరిగిందో తెలియనే లేదు.
✍ ఒకప్పుడు నల్లని కురులను చూసుకొని గర్వంగా వగలు పోయేవాళ్ళం. అవన్నీ ఎప్పుడు తెల్లగా మారాయో తెలియనే లేదు.
✍ ఉద్యోగం కోసం తిరిగి తిరిగి ఉద్యోగం పొందాక ఎప్పుడు రిటైర్ అయ్యామో తెలియనే లేదు.
✍ పిల్లల కోసం ప్రతిదీ అని ఎంత తాపత్రయం పడ్డామో. వాళ్ళు ఎప్పుడు దూరంగా వెళ్లి పోయారో తెలియనే లేదు.
✍ రొమ్ము విరుచుకొని అన్నదమ్ముల, అక్కచెల్లెండ్ల మధ్య గర్వంగా నడిచే వాడిని. ఎప్పుడు అందరూ దూరమయ్యారో తెలియనే లేదు.
✍ ఇప్పుడు ఆలోచిస్తున్నాను. నా కోసం నా శరీరం కోసం ఏమైనా చేసుకోవాలని. కానీ, శరీరం సహకరించడం లేదు.
✍ ఇవన్నీ జరిపోయాయి. కానీ కాలం ఎలా గడిచిందో తెలియనేలేదు, తెలియనేలేదు.
🦜 *It is the truth of life.*🦜
*సేకరణ:- వాట్సాప్ పోస్ట్*
హనుమంతుని సముద్ర లంఘనం
హనుమంతుని సముద్ర లంఘనం
--------------------------------------------------
ఉ: " చువ్వన మేనువంచి , రవి సోకుఁగఁ దోకవిదిల్చి , పాదముల్
వివ్వగఁబట్టి , బాహువులు వీచి , మొగంబు బిగించి ,కొండ జౌ
జవ్వన నూగి , ముందరికిఁ జాగి , పిరిందికిఁదూఁగి, వార్ధిపైఁ
రివ్వన దాటె , వాయుజుఁడు రెక్కలతోడి సురాద్రియోయనన్!
రామాయణము- కిష్కింధ కాండ-కుమ్మరి మొల్ల;
మనం చాలా రామాయణాలు చూశాం చదివాం. కానీ మొల్ల రామాయణ మంత సరళసుందరమైన రామాయణ
కావ్యాన్ని మనంచూడబోము.అలతి యలతి తత్సమ పదాలతో అతిసుందరంగా ఆనీలమేఘశ్యాముని రాముని సుందర
మందహాస వదనం మనముందుకు కదలి వస్తున్నాదా యనిపస్తుంది ఆమెకవిత్వం!
కం: చెప్ప వలె కప్పురంబులుఁ
గుప్పలుఁగాఁ బోసినట్లు కుంకుమ పై పై
గుప్పిన గతి"- అనియామె కవిత్వ నిర్వచనం! అందుకు తగనట్లే భాసించింది. ఇక ప్రస్తుతానికి వస్తా,
ఈపద్యం హనుమ సముద్ర లంఘనానికి చేసేప్రయత్నం. దృశ్యాన్ని కన్నులకు గట్టించటం మొల్ల ప్రత్యేకత!
ఎంత ప్రయత్నం లేకపోతే శత యోజన విస్తీర్ణమైన దుస్తరమైన సాగరాన్ని హనుమ ఒక్క గెంతులో దాటాడు? ఆ
మహా ప్రయత్నమిదో చిత్తగించండి!
చువ్వన మేను వంచాడట! ఎగరాలి యంటే శరీరాన్ని అందుకు తగిన రీతిగా మలుచుకోవాలి.తొలిప్రయత్నంగా
తన శరీరాన్ని యెగర టానికి కావలసినరీతిగా వంచుకున్నాడు. తరువాత ఒక్కసారి తోక విదిలించాడు. అది సూర్యునకు తగి
లేంతగా పైకి లేపాడట. పాదాలను రెండిటిని దూరంగా ఉంచాడట. యెగిరేటప్పుడు పట్టుకోసం. చేతులు నిటారుగా చాపాడట
తన శరీరాన్నొక వ్యోమ నౌకగా మార్చి చేతులను చుక్కానుల వలెనుపయోగించుటకు చేసే ప్రయత్నమిది. మొగంబు బిగించాడట. అంటే పెదవుల బిగబట్టి బింకంగా చూస్తున్నాడని భావం. ఒక్కసారి కొండ బలమెంతో తెలిసికొనుటకు కొండ జవజవలాడేలా ఊపుతున్నాడట. ముందుకి పరుగెడుతున్నాడట.ప్రక్కలకు వంగుతున్నాడట.
ఇంత బృహత్తర మైన ప్రయత్నం చేశాకే అన్నీ సరిగ్గా అమిరాయీ అనుకున్నాకే సమ్ముద్రంమీద రివ్వుమని యెగిరి రెక్కలు మొలచిన మేరు పర్వతమా యని చూచువారు అచ్చెరువొందు నట్లు సాగి పోతున్నాడట!
మొల్ల యీదృశ్యాన్ని యెంత సహజంగా చిత్రించింది! మాటలతో వర్ణించగలిగే విషయమా ఇది. మహనీయుడైన హనుమంతునికే దుస్తరమైన సాగరాన్ని దాటాలంటే ఇంత ప్రయత్నం చేయాల్సి వచ్చింది.
చూచారుగదా! ఇదిమనకుపదేశం; యేదైనా పనిచేసేముందు దానికి ప్రయత్నం అవసరం. ప్రయత్న సిధ్ధుడైన వానికి
కార్యవిఘ్నంఉండదు.కార్య సిధ్ధితప్పదు అని.
బాగున్నది గదా!
స్వస్తి!🙏🌷🌷🌷🌷💐💐🌷🌷💐💐💐🙏🙏🙏🙏🌷💐💐💐💐
సుధామూర్తి
#సుధామూర్తి
కార్యక్రమాల్లో... వెజ్ , నాన్ వెజ్ కి సెపరేట్ గరిటలనీ కూడా ఉంచితే బాగుంటుందీ.. అని సుధామూర్తి గారు ఓపెన్ గా చెప్పడాన్ని పూర్తి శాఖాహారులు లక్షల్లో పూర్తిగా ఏకీభవిస్తారు..శాకాహారులకు సమాజంలో ఉండే ఇబ్బందుల గురించి.. అనుభవాలతో కూడిన వివరణ చదవండి
పూర్తి శాకాహారులు.. బయట ఆహారం తినేందుకు ఇష్టపడరు.. ఒకవేళ బయట తినాల్సి వస్తే , వెజ్ , నాన్ వెజ్ కలిసి ఉండే హోటల్స్ వైపు కన్నెత్తి చూడరు.. పూర్తి శాఖాహార హోటల్ లో తినడానికె ఇష్టపడతారు..
రెండూ కలిసి ఉండే చోట తింటే ఏమవుతుంది? అనే సందేహం చాలామందికి వస్తుంది.. అటు నాన్ వెజ్ వడ్డించేందుకు వాడిన గరిటలతోనే... ఇటు వెజ్ పాత్రలలో కూడా వాటినే ఉపయోగించి, వడ్డిస్తూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం..
అలా కాకుండా..
వారంలో 6 రోజులు శాకాహారం తిని , ఒకరోజు నాన్ వెజ్ తినే వారికి.. తేడా ఏం తెలీదు.. గరిటే లో ఏముందిలే అనేసుకుంటారు..
కానీ అసలు మాంసాహారం తినని, పూర్తి శాకాహారులకి అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది
పూర్తి శాఖాహారం అలవాటు ఉన్నవారి ఇళ్ళలో .. నూటికి 75% ఉల్లి , వెల్లుల్లి నిషిద్ధం.. ఉద్యోగ వ్యాపారాలు చేసేవారు.. ఉల్లి, వెల్లుల్లి కూడా శాకాహారమే కదా.. అని... వాడుతూ ఉన్నారు.. కాలానుగుణంగా పరిస్థితి వలన కొందరు మారడం సహజం..
కొందరు వెల్లుల్లి ఘాటు మోతాదుకు మించి ఉంటే తినలేరు.. సరికదా.. ఆ వాసన కూడా వెగటుగా ఉండి తలనొప్పి కూడా వస్తుంది..
దేవాలయాల్లో వంటకు సాధారణంగా వెల్లుల్లి వాడరు కదా .. గానీ ఓ తమిళనాడు దేవాలయంలో పెట్టిన అన్నం లో చింతపండురసంతో కలిపిన ముద్ద నోట్లో పెట్టుకోగానే .. వెల్లుల్లి వేయడంతో ఆ ఘాటు కు కడుపులో తిప్పేసి సాయంత్రం దాకా వికారం తోనే ఉండాల్సి వచ్చింది.. ఎప్పుడన్నా వెల్లుల్లి తినే అలవాటు ఉన్న నా పరిస్థితే ఇలా ఉంటే.. అసలు అవి... వాడనివారికి..
అందునా... మాంసాహారం అనేదే తెలీని శాకాహారికి.. ఆ వాసన ఇంకెంత... ఇబ్బందిగ ఉంటుందో.. అర్ధం చేసుకోండి..
చాలామంది మాంసాహారులు వంటల్లో ఇంగువ వాడరు.. ఇంగువ వేసిన పచ్చడి తిన్నా , చారు తిన్నా నోరు పాడయింది.. ఛీ.. అంటూ ఉంటారు.. ఎందుకంటే వారికి ఇంగువ అలవాటు లేకపోవడం వల్ల.. ఆ రుచి నచ్చక, వాసన పడక.. ఇబ్బందిగా ఉంటుంది.. ఇంగువ పోపుతో చేసిన చారు తిని కక్కేసిన వారిని కూడా ఉంటారు.. వారికి ఇంగువ ఎలాగో.. వీరికి... మసాలాలు.. నాన్ వెజ్ లు .. అలాగే వికారం చేస్తాయి మరి..
ఎవరన్న తినేటప్పుడు..నాన్ వెజ్ తినేవారు పక్కనే కూర్చున్నా. లేదా పక్కింట్లో ఎవరన్న వండేప్పుడు.... కూడా.. ఆ వాసన చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.. మాంసాహారం తినేవారికి ఈ ఇబ్బంది ఏంటో అర్ధం కాపోవచ్చు.. కానీ.. ఆ వాసన కూడా ఆలవాటులేనివారికి... అదెంత ఇబ్బంది అనేది.. పడేవారికి మాత్రమే తెలుస్తుంది..
శాకాహారుల్ని స్కూల్స్ లో.. కాలేజెస్ లో.. టీజ్ చేయడం చాలామందికి తెలీదు ఏమో... అవి కూడా భరించిన అనుభవాలన్నీ ఇప్పుడు చెప్పలేం.
ప్రయాణాలలో శాఖాహారం ఆహార అలవాట్ల వల్ల చాలా ఇబ్బందులే ఎదుర్కొంటూ ఉంటాను.
నాకు ఇష్టమైన శాకాహారాన్ని నేను స్వీకరించే విషయంగా ఎన్నో అవహేళనల్ని ఎదుర్కొన్నాను. అయినా నా అలవాటు మార్చుకునే ప్రసక్తే లేదు..
"మీ కులం వారు చాలామంది తింటారే?" అని నవ్వుతూ అడుగుతూ (నీకేం పోయేకాలం? అని మనసులో )
"ముక్క రుచి ఒకసారి చూస్తే వదలవు తెలుసా "
"మీ పప్పు తిని ఎలా బ్రతుకుతారు అసలు "
"శాకాహారి గా ఉన్నావంటే నమ్ముతామా, రావమ్మా తిందువు గానీ"
"మేక శాకాహారే! మేక తో వండాం తిందువు రా "
సమాజంలో భోజనం టైం లో ఎదుర్కొన్న అనేక మాటలు
నా ఆహారం ... నా ఇష్టం...నేను నాకు ఇష్టమయిన... అలవాటు అయిన శాఖాహారం మాత్రమే తింటాను..
ఫైనల్ గా... చెప్పొచ్చేదేంటంటే..
సమాజం మారుతుందో.. మారదో తర్వాత సంగతి..
ఒకరి ఇబ్బందిని వ్యక్తం చేస్తున్న కూడా.. అదేదో గొప్పతనం గా చెప్పేవారికి పెద్ద 🙏.
ఈ ఒక్క ఆహార విషయంలో ఎంతో మంది ఎన్నో కార్యక్రమాలకే దూరంలో ఉంటూ ఉండటం కూడా మనం చూస్తూనే ఉంటాము. అసలు మనమొక పండుగ చేసుకుంటూ ఉంటే అనేక జీవరాశుల కు ప్రాణహాని కలిగించడం న్యాయమా అని కూడా ఆలోచించకుండా, మనతో బాటు ఉండే మూగప్రాణులు కూడా సంతోషించి ప్రకృతి ఆనందించే విధంగా మన కార్యక్రమాలు నిర్వహించుకోలేమా!!?? మన సంతోషం కోసం కొన్ని జీవుల ప్రాణాలను తీయడం సమంజసమా!!?? అని ఆత్మ విమర్శ చేసుకుంటే మనతో మన మిత్రులు, సాటి జీవరాశులు అన్నీ సంతోషం గా కలిసి మెలిసి ఆనందం పంచుకునే అవకాశం ఉంటుంది కదా!!
సర్వేజనాస్సుఖినోభవంతు...
స్వస్తి...
#I_support #sudhamurthi
మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి జయంతి
ఈరోజు భాద్రపద శుద్ధ తదియ "అభినవ వ్యాస, సవ్యసాచి, పౌరాణిక సార్వభౌమ, పురాణోపన్యాస కేసరి" మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి జయంతి. ఆంగ్లమానం ప్రకారం తేదీ 22.08.1925 న వారు జన్మించారు. వేదాధ్యయనం తో ప్రారంభమైన వారి విద్యాభ్యాసం శ్రౌతస్మార్త, వ్యాకరణ, తర్క సాహిత్య, వేదాంత, పురాణ ,జ్యోతిషాది విద్యలతో శోభించింది. ప్రజలని ధర్మం వైపు నడిపించడానికి వారు పురాణ ప్రవచనాన్ని సాధనంగా ఎంచుకున్నారు. తాను అనుసరిస్తున్న సనాతన ధర్మాన్ని ప్రజలందరూ సరైన అవగాహన తో అనుసరించేలా తనదైన శైలిలో సుమారు డెబ్భై సంవత్సరాల పాటు పురాణ ప్రవచనాల ద్వారా అవిశ్రాంతంగా ప్రజలను చైతన్యపరిచారు. మొహమాటానికి కానీ ఇచ్చకానికి కానీ ఇతరుల మెప్పును ఆశించి కానీ ఏనాడూ ధర్మప్రచార, ప్రవచనాలు చేయలేదు. నిరంతర అధ్యయనం, సదాచార ఆచరణ, ధర్మప్రబోధం వారికి ఇష్టమైన విషయాలు. శ్రోతల ధర్మసందేహాలకు వారిచ్చే సమాధానాలు ఎప్పటికీ గుర్తుండిపోయేవి. పురాణ ప్రవచనం చేస్తుంటే వ్యాసవాల్మీకులు వారిలో కనపడేవారు. తాను నమ్మిన ధర్మాన్ని నిర్మొహమాటంగా వివరించి చెప్పటం వారి ప్రత్యేకత. దేశం నలుమూలలు తిరిగి అవిశ్రాంతంగా పురాణ ప్రవచనాలద్వారా ధర్మప్రచారం చేసిన శ్రీ మల్లాది వారు ప్రాతస్మరణీయులు.
నవగ్రహా పురాణం🪐* . *28వ అధ్యాయం*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🪐నవగ్రహా పురాణం🪐*
. *28వ అధ్యాయం*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
*పురాణ పఠనం ప్రారంభం*
*కుజగ్రహ జననం - 1*
నిశ్శబ్దం తాండవిస్తున్న కైలాసం నారదుడికి ఆశ్చర్యం కలిగించింది. సతి యోగాగ్నిలో దగ్ధమైనప్పటికీ , ఇతర కైలాసవాసులు ఉండాలి కదా ! కైలాస ప్రాంతంలో సంచరిస్తున్న నారదుడికి ఒక ఏకాంత ప్రదేశంలో తపోదీక్షలో ఉన్న పరమశివుడు కనిపించాడు. తామర పువ్వులాగా ఎర్రబారిన శివుడి శరీరం ఆయన తపస్సు తీక్షణతను కళ్ళకు కట్టుతోంది.
మహోగ్ర తపోనిష్ఠలో ఉన్న రుద్రదేవుణ్ణి పలకరించే సాహసం చేయలేకపోయిన నారదుడు ఆయన ఉగ్రసౌందర్యాన్ని కళ్ళప్పగించి చూస్తూ , తనను తాను మరిచిపోయాడు. అలా నిలుచుండి పోయాడు.
లేత తామర పువ్వు రంగులో ప్రకాశిస్తున్న శరీరం. ధ్యాన ముద్రలో కూర్చోవడం వల్ల ఇనుమడిస్తున్న సౌందర్యం. శరీరం కాంతితో కలిసి , కలవకుండా చూపుల్ని లాగుతున్న రాగిరంగు జటాజూటం. ఓహ్ ! పరమశివుడి 'నిష్టా సౌందర్యం' అమోఘం ! నారదుడు అప్రయత్నంగా తనలో అనుకున్నాడు.
పరమేశ్వరుడి ముఖ సౌందర్యాన్ని తదేకంగా చూడసాగిన నారదుడి కళ్ళు ఆశ్చర్యంతో మరింత విచ్చుకున్నాయి. ఎందుకో... అగ్ని నేత్రం నెలకొన్న శివుడి ఫాలభాగం మెల్లగా ముదురు ఎరుపు రంగుకు మారుతోంది. క్షణంలో మందార పుష్ప వర్ణాన్ని సంతరించుకున్న పరమశివుడి నెన్నుదురు ఇంకా ఎర్రబారి కణకణ మండే అగ్ని వర్ణాన్ని అంది పుచ్చుకుంది.
ఆయన ఉగ్ర తపస్సులోని తీక్షణత కారణంగా , అందమైన 'అగ్ని ఫలకం'లా ఉన్న నుదురు మీద స్వేద బిందువు ఉబికింది. నిప్పు మీద నీటి బిందువు ! ఓహ్ ! నారదుడు అబ్బురపడిపోయి అలాగే చూస్తుండిపోయాడు.
ముక్కంటి మూడవ కంటిమీదుగా , అధోముఖంగా జారుతోంది ఆ పావన స్వేదం.
నుదురు మీద నుంచి నాజుకైన నాసిక మీదుగా జారుతూ , క్షణకాలం ముక్కుకొన మీద
ముత్యంలా ఆగిన శివస్వేదం - ఆయన ముందు నేల మీద పడింది.
స్వేదబిందువును వెంటాడుతూ ఉండిపోయిన నారదుడి చూపులు - అది వాలిన స్థానం మీదే నాటుకు పోయాయి. అతణ్ణి ఆశ్చర్యంలో ముంచేస్తూ - ఆ స్థానంలో ఒక పురుష శిశువు ఆవిర్భవించాడు.
అగ్ని వర్ణంలో , నాలుగు భుజాలతో ఆ శిశువు చూడచక్కగా , చూపరులను , అబ్బుర పరిచేలా ఉన్నాడు. నారదుడి చూపులు శిశువు మీద నుండి శివుడి ముఖం వైపు ఎగబ్రాకుతూ వెళ్లాయి. శివుడు తన ధ్యాన లోకంలో తానున్నాడు !
ఉన్నట్టుండి శిశువు బిగ్గరగా ఏడవడం ప్రారంభించాడు. దగ్గరగా వెళ్ళి , ఎత్తుకుని , అక్కున జేర్చుకుని ఓదార్చాలన్న కోరికను బలవంతంగా నిగ్రహించుకుంటూ , చలన రహితంగా నిలుచుండి పోయాడు నారదుడు. శిశువు రోదన సాగుతూనే ఉంది.
నారదుణ్ణి మరోసారి నివ్వెరపాటుకు గురిచేస్తూ ఒక స్త్రీ మూర్తి బాలుడి ముందు ప్రత్యక్షమైంది. ఆమెను నారదుడు క్షణంలో పోల్చుకున్నాడు. భూదేవి !
భూదేవి , రోదిస్తున్న బాలుణ్ణి జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకొని , సున్నితంగా తన వక్షానికి హత్తుకుంది.
భూదేవి లేచి నిల్చుని , ధ్యాన నిష్ఠలో నిమగ్నుడైపోయిన పరమేశ్వరుణ్ణి తదేకంగా చూసింది.
*"పరమేశ్వరా !"* ధైర్యంగా శివుణ్ని పిలిచిందామె.
శివుడి విశాల నేత్రాలను అర్ధనిమీలితాలుగా చేస్తూ , కిందికి వాలి ఉన్న రెప్పలు నెమ్మదిగా పేకిలేచాయి. ఎదురుగా నిలుచున్న భూకాంతనూ , ఆమె చేతుల్లోని శిశువునూ , నిర్వికారంగా చూశాయి , త్రినేత్రుడి రెండు కళ్ళు.
*"పరమేశ్వరా ! ఈ శిశువు మీ పుత్రుడు. మీ పావన స్వేదజలం నా మీద పడి , శిశువుగా మారింది. స్వీకరించండి"* శిశువును ముందుకు చూపుతూ అంది భూదేవి.
శివుడి ముఖం మీద చిరునవ్వు మెల్లగా మెరిసింది. *"దేవీ ! నీ ఒడిలో పడిన ఈ బాలుణ్ణి నీ పుత్రుడిగానే భావించు. నేను సతీరహితుణ్ని కదా ! బాలుని ఆలనాపాలనా చూడడానికి అశక్తుణ్ణి. బాలకుడు నీ పుత్రుడే అని నేను అనుశాసిస్తున్నాను. పుడమితల్లి ఈ పుత్రుడికి తల్లి !"*
*"స్వామీ... !"*
*"ఔను తల్లీ ! నువ్వు అక్కున చేర్చుకోగానే ఏడుపు మాని వేశాడు కదా ! భూపుత్రుడైన కారణాన బాలుడు 'భౌముడు' అనీ , 'కుజుడు' అనీ పిలువబడతాడు. అగ్నివర్ణుడైన కారణంగా 'అంగారకుడు'గా కూడా ప్రసిద్ధుడవుతాడు. ఈ క్షణం నుండి బాలకుడి పోషణ భారం నీదేనమ్మా. మహా బలవర్థకమైన నీ స్తన్యమిచ్చి ప్రయోజకుడ్ని చేయి.”*
*"మహా భాగ్యం !"* అంటూ భూదేవి బాలుణ్ణి తనకు హత్తుకుంది.
*"ఆది శంకరులకు అభివాదాలు !"* అంటూ లక్ష్మీ విష్ణువులూ , సరస్వతీ బ్రహ్మలూ ప్రత్యక్షమయ్యారు.
*"నవగ్రహాలలో తృతీయ గ్రహ దేవతను ఆవిర్భవింపజేసిన మీ దివ్యదృష్టికి అభినందనలు !"* బ్రహ్మ , విష్ణువులు అన్నారు.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 41*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
*భాగం 41*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
శ్రీరామకృష్ణుల మనోఫలకంపై నరేంద్రుని భవిష్యత్తు దేదీప్య మానమైన చిత్తరువులా ద్యోతకమయింది. సమావేశానంతరం ఆయన ఇలా అన్నారు: "ఏ శక్తితో కేశవ్ లోకప్రసిద్ధుడై ప్రశంసలందుకొంటున్నాడో అలాంటి పద్దెనిమిది శక్తులు నరేంద్రునిలో పరిపూర్ణ స్థితిలో నెలకొని ఉండడం చూశాను! కేశవ్ లోనూ, విజయ్ లోనూ జ్ఞానప్రకాశం ఒక దీపంలా మాత్రమే ప్రకాశిస్తూన్నది. కాని నరేంద్రుణ్ణి చూస్తే, అతడి హృదయంలో జ్ఞానభాస్కరుడే ఉదయించి ప్రకాశిస్తున్నాడు. ఆ ప్రకాశం, మాయను ఆసాంతం తుడిచివేసింది.”
మరొకసారి ఇలా అన్నారు....
“నరేంద్రుడు అత్యున్నత స్థితికి చెందినవాడు. మగతనం గలవాడు. ఎందరో భక్తులు ఇక్కడకు వస్తూవుంటారు. కాని మచ్చుకు ఒక్కరు కూడా అతడి మాదిరి లేరు. ఇక్కడకు వస్తూవున్న భక్తుల గురించి అప్పుడప్పుడు నేను యోచించడం కద్దు. వారిలో కొందరు దశదళ పద్మాలు, కొందరు శతదళ పద్మాలు, కాని నరేంద్రుడో సహస్రదళ పద్మం, తక్కిన భక్తులు కుండలు, కడవలు; నరేంద్రుడు పెద్ద గంగాళం. తక్కిన వారు చిన్న నీటి గుంటలు; నరేంద్రుడు హాల్దార్పుకూర్ లాంటి పెద్ద చెరువు. తక్కినవారు చిన్న చిన్న చేపలు; నరేంద్రుడు ఎర్రటి కళ్లుగల పెద్ద బాడిస చేప.”
శ్రీరామకృష్ణులు ముఖతా ఇలాంటి ప్రశంసలు వింటే ఆంతరిక ప్రకాశం కొరవడిన దుర్బలుడు, అహంకారంతో కన్నూమిన్నూ తెలియకుండా గంతులు వేస్తాడు. నరేంద్రుని విషయంలో ఈ మాటలు పూర్తిగా మరో విధమైన ప్రభావాన్ని చూపాయి. అసాధారణమైన అంతర్ముఖ స్థితిలో ఉండే అతడి మనస్సు లోలోతులకు పోయి కేశవ్, విజయ్ ఎనలేని సుగుణాలతో తన అప్పటి స్థితిని పోల్చి చూసింది. అంతటి ప్రశంసలకు తాను తగననుకొన్న నరేంద్రుడు శ్రీరామకృష్ణుల వాక్కులను నిరసించాడు:
“ఏమంటున్నారు? ఇది వింటే లోకులు మిమ్మల్ని పిచ్చివాడంటారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేశవ్ సేన్ ఎక్కడ? మహాత్ముడైన విజయ్ గోస్వామి ఎక్కడ? ఏమీలేని పాఠశాల విద్యార్థినయిన నే నెక్కడ? వారితో నన్ను పోల్చకండి, దయచేసి ఇలా మాట్లాడకండి" అన్నాడతడు. కాని నరేంద్రుని నిరసనను శ్రీరామకృష్ణులు పట్టించుకోలేదు. అది ఆయనకు సంతోషాన్నే కలిగించింది. ఆప్యాయంగా ఆయన ఇలా అన్నారు:
“నాయనా! నేనేం చేయగలను? ఈ మాటలు నేను పలుకుతున్నానని అనుకొంటున్నావా నువ్వు? జగజ్జనని నాకు. దర్శింపజేసింది. నేను చెప్పాను. ఆమె సత్యం తప్ప మరేదీ దర్శింపజేయదు. అందువల్లనే అలా మాట్లాడాను.”🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹