శ్లోకం ☝️
సుఖదు:ఖే యధా సమ్యక్
అనిత్యే య: ప్రపశ్యతి !
కాయం చామేధ్యసంఘాతం
వినాశం కర్మసంహితమ్ !!
యచ్చ కించిత్సుఖం తచ్చ
ధు:ఖం సర్వమితి స్మరన్ !
సంసారసాగరం ఘోరం
తరిష్యతి సుదుస్తరమ్ !!
భావం: సుఖధు:ఖాలను అనిత్యాలు అని భావించేవాడు, శరీరాన్ని అపవిత్ర సమూహంగా భావించేవాడు,మృత్యువు కర్మఫలం అని తెలుసుకొన్నవాడు, సుఖం అనిపించేవి సమస్తమూ ధు:ఖమే అని భావించేవాడు, ఘోరమూ, దుస్తరమూ అయిన సంసారసాగరాన్ని తరిస్తాడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి