17, సెప్టెంబర్ 2023, ఆదివారం

మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి జయంతి

 



ఈరోజు భాద్రపద శుద్ధ తదియ "అభినవ వ్యాస, సవ్యసాచి, పౌరాణిక సార్వభౌమ, పురాణోపన్యాస కేసరి" మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి జయంతి. ఆంగ్లమానం ప్రకారం తేదీ 22.08.1925 న వారు జన్మించారు. వేదాధ్యయనం తో ప్రారంభమైన వారి విద్యాభ్యాసం శ్రౌతస్మార్త, వ్యాకరణ, తర్క సాహిత్య, వేదాంత, పురాణ ,జ్యోతిషాది విద్యలతో శోభించింది. ప్రజలని ధర్మం వైపు నడిపించడానికి వారు పురాణ ప్రవచనాన్ని సాధనంగా ఎంచుకున్నారు. తాను అనుసరిస్తున్న సనాతన ధర్మాన్ని ప్రజలందరూ సరైన అవగాహన తో అనుసరించేలా తనదైన శైలిలో సుమారు డెబ్భై సంవత్సరాల పాటు పురాణ ప్రవచనాల ద్వారా అవిశ్రాంతంగా ప్రజలను చైతన్యపరిచారు‌. మొహమాటానికి కానీ ఇచ్చకానికి కానీ ఇతరుల మెప్పును ఆశించి కానీ ఏనాడూ ధర్మప్రచార, ప్రవచనాలు చేయలేదు. నిరంతర అధ్యయనం, సదాచార ఆచరణ, ధర్మప్రబోధం వారికి ఇష్టమైన విషయాలు. శ్రోతల ధర్మసందేహాలకు వారిచ్చే సమాధానాలు ఎప్పటికీ గుర్తుండిపోయేవి. పురాణ ప్రవచనం చేస్తుంటే వ్యాసవాల్మీకులు వారిలో కనపడేవారు. తాను నమ్మిన ధర్మాన్ని నిర్మొహమాటంగా వివరించి చెప్పటం వారి ప్రత్యేకత. దేశం నలుమూలలు తిరిగి అవిశ్రాంతంగా పురాణ ప్రవచనాలద్వారా ధర్మప్రచారం చేసిన శ్రీ మల్లాది వారు ప్రాతస్మరణీయులు.

కామెంట్‌లు లేవు: