4, అక్టోబర్ 2023, బుధవారం

Sun saiba sun

Sun saiba sun pyariki dhun 

incredible Dr. Jayanti Kumaresh. 🎻


Drincredible Dr. Jayanti Kumaresh. 🎻



 🎶 Relive the Magic of Dr. Jayanti Kumaresh! 🌟


Step back into the enchanting world of classical music with a mesmerizing performance by the incredible Dr. Jayanti Kumaresh. 🎻✨


It's a performance that will transport you to a world of musical bliss. 🌌


👉 Watch the Full Concert on https://video.charsur.com and let the music fill your soul. 📺🎶


#DrJayantiKumaresh #ClassicalMusic #MuttusvamiDikshitar #MusicFestival #Rupakam #CharSur #videocharsur #charsur #charsurartsfoundation

#muddugare yashoda #

It’s Krishna’s day🧈🦚 Muddugare Yashoda - A gem from Annamacharya’s musical treasure in ragam Kurinji. Wishing you all a very happy Janmashtami😍🙏🏻 #janmashtami #janmashtami2023 #muddugareyashoda #sukanyavaradharajan 

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||



మగ్నాహం నాదసింధౌ వై నక్రహీనే రసాత్మకే

అక్షారే సుఖసంపూర్ణే తిమింగిల వివర్జితే |

(26-57)

ధాత్రి చెప్పిన మాటలతో దమయంతి అభిప్రాయాన్ని గ్రహించిన సంజయుడు తన పట్టమహిషి

కైకేయితో సంప్రదించాడు. కైకేయీ! ధాత్రిమాటలు విన్నావుగదా! మన అమ్మాయి నారదుణ్ణి వరించిందిట.

అతడు ముని. ఇప్పుడు కోతిముఖం. ఎంత అందంగా ఉందో చూడు. దమయంతికి బుద్ధి

ఉందంటావా ? ఈ కురూపికి ఈ భిక్షువుకి ఇచ్చి వివాహం చెయ్యనా? అసంభవం. నువ్వు అమ్మాయితో

మాట్లాడు. బుద్ధిమరల్చు - అని ఆజ్ఞాపించి వెళ్ళాడు.

కైకేయి దమయంతిని తన మందిరానికి పిలిపించుకుంది. ఏకాంతంలో ప్రబోధించింది.

అమ్మాయీ! నీ అందానికి ఈ వానరాస్యుడా భర్త? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? పరిహసించరూ. పైగా

అతడు నిర్ధనుడు. భిక్షుజీవనం. వారిపంచనూ వీరిపంచనూ జీవితం గడుపుతున్నాడు. నువ్వేదో చాలా

తెలివైనదానివి అనుకున్నాను. చదువుకున్నావుకదా అనుకున్నాను. చివరికి ఇదా నీ నిర్ణయం? ఒక

భిక్షుకుడిని చూసి మోహపడ్డావా? నువ్వేమో పూలతీగెలా సుకుమారివి. అతడేమో వంటినిండా బూడిద

పులుముకునే మొరటు మనిషి. సుగంధద్రవ్యాలు అస్సలు వాడనేకూడని మునివృత్తి. మీ ఇద్దరికీ ఎలా

కుదురుతుంది చెప్పు? ఆ కురూపితో సంసారం ఎలా చేస్తావు, ప్రేమ ఎలా పుడుతుంది? అనవసరంగా

మొండితవానికి పోవద్దు. చక్కని రాకుమారుణ్ణి చూసి వివాహం జరిపిస్తాం. చేసుకో. ఇప్పటికే మీ నాన్న

చాలా బాధపడుతున్నారు. బాధపడరుమరీ. కోమలమైన మాలతీలత తుమ్మచెట్టుకి (బుబూలవృక్షం)

అల్లుకుంటే చూసినవాళ్ళ మనస్సు చివుక్కుమనదూ? ఎంతమూర్ఖుడైనా తాంబూలాన్ని దాసేరకుడికి

ఇంద-తిను అని అందిస్తాడా? (దాసేరకుడు = దాసీపుత్రుడు. దాశేరకుడు - పల్లెవాడు). చెయ్యిపట్టుకుని

ఆ వావరముఖుడి పక్కన నువ్వు నిలబడితే అబ్బా! అసలు ఆ దృశ్యాన్ని ఊహించుకోలేకపోతున్నాను

-ఎంత అసహ్యంగా ఉంటుందో! కన్నవాళ్ళ గుండెలు మండిపోవూ? పోనీ అంటే ఇదేదో ఒక పూటతోనో

ఒక రోజుతోనో తీరిపోయేది కాదాయె. వివాహమంటే నూరేళ్ళ బంధం. ప్రాణాలు గుటుక్కుమనేంతవరకూ

కట్టుకున్నవాడితో కాలం గడపాల్సిందే. ఎలా గడుపుతావ్? ఈ సంగతి ఆలోచించావా?

లగ్నాం బబూలవృక్షేణ కోమలాం మాలతీలతామ్ ·

దృష్ట్యా కస్య మనః ఖేదం చతురస్య న గచ్ఛతి

దాసేరకాయ తాంబూలీదళాని కోమలాని కః

దదాతి భక్షణార్థాయ మూర్ఖోఽపి ధరణీతలే


కుముఖేన సమం వార్తాన రుచిం జనయత్యతః ।

అమృతేస్తు కథం కాలః క్షపితవ్యస్త్వయామునా॥ (27-10, 11, 13)

⚜ శ్రీ పూరీ జగన్నాథ మందిర్

 🕉 మన గుడి : నెం 198





⚜ ఢిల్లీ : హౌజ్ ఖాస్


⚜ శ్రీ పూరీ జగన్నాథ మందిర్ 


💠 రోజువారీ పనులు, అంతులేని పని గంటలు మరియు పిచ్చి ట్రాఫిక్‌తో ఢిల్లీలో సామాన్యుల జీవితం చాలా చురుగ్గా ఉంటుంది. 

ఈ సందడి సమయంలో, మనం మనకు చాలా ముఖ్యమైనదాన్ని కోల్పోతాము - అదే మనశ్శాంతి. 

మీ మనస్సు మరియు శరీరం రెండూ విశ్రాంతిగా ఉండే చోటు ఢిల్లీలో దొరకడం కష్టం.

అటువంటి ప్రదేశం - 

ఢిల్లీలోని ఒరియా కమ్యూనిటీకి చిహ్నం జగన్నాథ ఆలయం హౌజ్ ఖాస్‌లో ఉంది. 


💠 ఒరిస్సాలోని పూరీలోని జగన్నాథ దేవాలయం 'చార్ ధామ్' (భారతదేశంలోని నాలుగు వేర్వేరు దిశల్లో ఉన్న  నాలుగు అత్యంత పవిత్రమైన దేవాలయాలు) మరియు హౌజ్ ఖాస్‌లోని ఆలయం పూరీలోని జగన్నాథ ఆలయానికి ప్రతిరూపం. 

1969 శ్రీ నీలాచల సేవా సంఘం  నిర్మించారు.


💠 ఢిల్లీలో ఉంటున్న చాలా మందికి ఒరిస్సా పూరీ క్షేత్రాన్ని సందర్శించే అవకాశం లేదు, అందుకే ఈ ఆలయం ఒరిస్సా యొక్క గొప్ప సంస్కృతి గురించి చాలా ఖచ్చితమైన మరియు సముచితమైన అంతర్దృష్టిని అందిస్తుంది. 


💠 ఇక్కడ పూజింపబడేవి జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర మరియు సుదర్శన చక్రం. 


💠 శ్రీ నీలాచల సేవా సంఘ్ 1969లో ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ నుండి భూమిని సేకరించి హౌజ్ ఖాస్‌లో ఆలయాన్ని స్థాపించింది. 

 ఒరిస్సా ప్రభుత్వం కూడా ఆలయానికి లక్ష రూపాయలను విరాళంగా ఇచ్చింది.


💠 జగన్నాథ ఆలయం  ఒడిశా శైలిలో పూరీలోని శ్రీ మందిరం మాదిరిగానే ఆలయ నిర్మాణంలో నిర్మించారు. 

 శ్రీ వరాహ, శ్రీ నరసింహ, మరియు శ్రీ వామన మొదలైన అనేక ఇతర  దేవతలు ప్రధాన ఆలయ నిర్మాణం వెలుపల చెక్కబడి ఉన్నాయి.  జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర మరియు చక్ర సుదర్శన దేవతలు వేప చెక్కతో తయారు చేయబడ్డాయి. 


💠 రథయాత్ర ఉత్సవం జరిగే కాలం ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం, ఎందుకంటే పండుగను గొప్ప వైభవంగా మరియు ప్రదర్శనతో జరుపుకోవచ్చు.


💠జగన్నాథుడు, బలభద్ర , సుభద్ర విగ్రహాలతో పాటు శివుడు, గణేశుడు, లక్ష్మి,  విమలాదేవి మరియు మా తారిణి విగ్రహాలు ఉన్నాయి.


💠 జగన్నాథ ఆలయంలో జరుపుకునే ప్రధాన పండుగలు అన్నీ హిందూ పండుగలు మరియు ఒరియా సమాజానికి సంబంధించిన కొన్ని పండుగలు.  

అయితే, అత్యంత ముఖ్యమైన పండుగ రథయాత్ర.


💠 శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్ర విగ్రహాలు చెక్క రథాలలో ఉంచబడతాయి.

రథయాత్ర అనేది జగన్నాథునికి సంబంధించిన పండుగ, ఇది ప్రతి సంవత్సరం జగన్నాథ ఆలయంలో జరుగుతుంది.  

ఇది పూరీలో ఒకే సమయంలో జరిగే పండుగకు ప్రతిరూపం.  

ఈ వార్షిక పండుగను ఆషాఢ శుక్ల ద్వితీయ నాడు జరుపుకుంటారు, ఇది జూన్-జూలై నెలలలో ఉంటుంది.


💠 శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్ర విగ్రహాలను నైపుణ్యం కలిగిన కళాకారులచే కాలక్రమేణా నిర్మించబడిన చెక్క రథాలలో ఉంచుతారు మరియు రథాలను వీధుల గుండా తీసుకువెళతారు.

అలా వారు కొన్ని కిలోమీటర్లు తీసుకువెళ్లాతారు మరియు ప్రయాణం తర్వాత వాటిని తిరిగి వారి అసలు స్థానానికి తీసుకువస్తారు. 

వేలాది మంది భక్తులు వీధుల్లో గుమిగూడి, దేవతల రథాల భారాన్ని పంచుకోవడంలో సహాయం చేయడం దృశ్యమానం.


💠 దర్శన సమయాలు:

ఉదయం 5 నుండి రాత్రి 10 వరకు (వేసవి)

ఉదయం 6 నుండి రాత్రి 9:30 వరకు (శీతాకాలం)

 

💠 ఎంట్రీ ఫీజు ఉచితం ;  డ్రస్ కోడ్ సాంప్రదాయ దుస్తులు

 

💠 ఇది సర్వోదయ స్కూల్ సమీపంలో గ్రీన్ పార్క్ మెట్రో స్టేషన్ నుండి 1.5 కి.మీ.

Panchaag


 

బృందావనార్చన సేవ :*

 *బృందావనార్చన సేవ :*


మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు చివరి దశ సాధన కోసం, ఇప్పుడు మొగిలిచెర్ల కి దగ్గరలో ఉన్న మన దత్తక్షేత్రాన్ని నిర్దేశించుకున్నారన్న విషయం మన దత్తబంధువులందరికీ విదితమే. శ్రీ స్వామి వారు సాధన చేసుకునేందుకు వీలుగా ఆశ్రమ నిర్మాణం తామే ప్రత్యక్షంగా ఉండి మరీ పర్యవేక్షించుకున్నారు, ఎందుకంటే వారి మోక్షప్రాప్తిని నిర్ధారించే ఈ ఆవాసంలో ఎటువంటి పొరపాట్లు జరగకూడదు అని. అయితే, ఆశ్రమ నిర్మాణ కర్త అయిన మీరాశెట్టి గారికి కానీ, స్థలం ఇచ్చిన పవని కుటుంబీకులకు కానీ, శ్రీ స్వామి వారు ఇచ్చిన ఆశ్రమ ప్రధమ ప్రణాళికలో మనం ఇప్పుడు బృందావనం గా వ్యవహరిస్తున్న నేల మాళిగ గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. కేవలం ఆశ్రమ నిర్మాణం జరుగుతున్న సమయంలో మాత్రమే, అక్కడ ఉన్న నిర్మాణ కార్మికులకు చెప్పి ఈ నేలమాళిగను స్వయంగా శ్రీ స్వామి వారే నిర్మింప చేయించుకున్నారు. అటుపైన శ్రీ స్వామి వారి తీక్షమైన తపోసాధనకు ఈ నేలమాళిగ ఆవాసంగా మారింది. అంతే కాదు, శ్రీ స్వామి వారు కాపాలమోక్షం పొందిన తరువాత, శ్రీ స్వామి వారు సాధన చేసుకున్న కొన్ని విశేష వస్తువులతో పాటు, శ్రీ స్వామి వారి పార్థివ దేహాన్ని సైతం మనం బృందావనంగా వ్యవహరిస్తున్న నెలమాళిగలో నిక్షిప్తం చెయ్యడం అయ్యింది. అంతటి మహా తపస్సుకు, తపస్వికి నిలయం అయ్యింది కనుకనే, ఇప్పటికీ కొంత మంది భక్తులకి, బృందావన దర్శనం చేసే సమయంలో ఒకరకమైన ప్రకంపనలకు లోనవుతారు. 


ఇక అంతటి మహిమాన్విత, తపఃశక్తి నిలయమైన బృందావనాన్ని అర్చించే భాగ్యన్ని శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిలిచెర్ల వారు ఈ శుక్రవారం అనగా *తేదీ : 06-10-2023 నాడు భక్తులకి కల్పిస్తున్నారు. ఈ సేవ, పైన చెప్పిన తేదీలో ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యి మధ్యాహ్నం 12.30 గంటలకు ముగుస్తుంది*. శ్రీ స్వామి వారు నైష్ఠిక బ్రహ్మచారి కనుక, ఈ సేవకు పురుషులు మాత్రమే అర్హులు. ఆ సమయంలో స్త్రీలు శ్రీ స్వామి వారి అనేక కైంకర్యాలకు వాడే వస్తువులని శుభ్రం చెయ్యవొచ్చు. ఎలా అయితే పల్లకిని మోసి మనకి శ్రీ స్వామి వారి పైన మన భక్తిని చాటుకొని మన విన్నపాలని విన్నవించుకుంటామో, అలానే *బృందావనార్చన సేవ కూడా శ్రీ స్వామి వారి కరుణకి పాత్రులు కావడానికి ఒక దివ్య మార్గం.* ఇంతటి మహాకార్యంలో పాల్గొనడానికి మరిన్ని వివరాల కోసం, క్రింద ఇచ్చిన నంబర్లను సంప్రదించగలరు.


నెంబర్ :  *85559 52927*

               *82475 77991*


ఇట్లు,

శ్రీ దత్తాత్రేయ స్వామి మందిర సిబ్బంది, మొగిలిచెర్ల


సర్వం,

శ్రీ దత్తకృప

మెచ్చే విధంగా చేయగలిగిన వాడే నేర్పరి(

 *1943*

*కం*

నచ్చిన పని జనులెల్లరు

మెచ్చెడిగతి చేయగలరు మేదిని యందున్.

నచ్చని కార్యంబు జనులు

మెచ్చెడిగతి చేయువాడె మేవడి సుజనా

*భావం*:-- ఓ సుజనా!ఈ లోకంలో అందరూ నచ్చిన పనిని జనులంతా మెచ్చుకునే విధంగా చేయగలరు.కానీ నచ్చని పనిని జనులు మెచ్చే విధంగా చేయగలిగిన వాడే నేర్పరి(మేవడి).

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

Tella jilladu


 

Spring


 

Home made


 

Block sports on face


 

Multy featured tools


 Multy featured tools

Indian science


 

BIKE CYCLR


 

Iditiki


 

Mysore


 

Bubble machine


 

Careful


 

Working princ


 

Kasi


 

Why only for hindus


 

Yogulu


 

Bhakti


 

Shankara vijayam 2


 

AP కాకలేపుతున్న


 

అస్తికుడు - నాస్తికుడు .

 🌸  అస్తికుడు - నాస్తికుడు ...!! 🌸


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🌿ఒక ఊరిలో ఒక ఆస్తికుడు, ఒక నాస్తికుడు ఎదురెదురు ఇళ్లల్లో ఉండేవారు. ఆస్తికుడు పరమ విష్ణు భక్తుడు. ఆ ఇద్దరూ కొద్దిరోజుల తేడాలో చనిపోయారు. 


🌸ముందు నాస్తికుడు చనిపోగా.. ఆ తరువాత ఆస్తికుడు మరణించాడు. విష్ణుదూతలు వచ్చి ఆస్తికుణ్ని వైకుంఠానికి తీసుకుని వెళ్లి అక్కడ సభలో విష్ణువును చూపించారు. ఆహా తన భక్తి పండింది అనుకున్నాడు ఆస్తికుడు. 


🌿ఆ స్వామిని ఎన్నో స్తోత్రాలతో స్తుతి చేశాడు.

ఇంతలో విష్ణు దూతలు వచ్చి అతణ్ని ‘‘పద.. పద’’ అని సభలోంచి తీసుకెళ్లడం ప్రారంభించారు. దానికి అతడు అయోమయంతో.. ‘‘ఎక్కడికి తీసుకుపోతున్నారు?’’ అని వారిని అడిగాడు.


🌸 ‘‘నువ్వు చేసుకున్న పుణ్యం అయిపోయింది. తిరిగి భూలోకానికి తీసుకుని పోతున్నాం’’ అని విష్ణుదూతలు చెప్పారు. ‘‘నా పుణ్యం అయిపోవడం ఏమిటి? నేను గొప్ప విష్ణు భక్తుణ్ని. నిత్యం ఆ స్వామిని కొలిచాను’’ అన్నాడు ఆస్తికుడు.


🌿 ‘‘అది నిజమే. కానీ నువ్వు మూడు కారణాలవల్ల తొందరగా వెనక్కి భూలోకానికి వెళ్లిపోతున్నావు.


🌷 ఒకటో కారణం : 🌷


🌸 నీకు నీ జీవితంలో భక్తి ఒక భాగం మాత్రమే. అందుకే రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఒక విధినిర్వహణలా పూజచేస్తూ మిగిలిన సమయంలో విష్ణువును ఆలోచనలలోనికి కూడా రానిచ్చేవాడివి కాదు.


 🌷రెండో కారణం.. 🌷


🌿‘స్వామీ! నన్ను వచ్చే జన్మలో గొప్ప ధనవంతుడిగా పుట్టించు.’ అని రోజూ ఆ దేవదేవుని కోరేవాడివి.

అంటే.. నీకు మళ్లీ పుట్టాలని, అదీ ధనవంతునిగా జన్మించాలని కోరిక ఉంది. 


🌷ఇక మూడో కారణం : 🌷


🌸 రోజూ పూజ పూర్తవగానే ‘ఒక్కసారి కనబడు తండ్రీ.. చాలు’ అని కోరేవాడివి. అందువల్ల నీకు కేవలం ఒక్కసారి మాత్రమే విష్ణుదర్శనం అయింది. మళ్లీ పుట్టాలనే కోరిక ఉన్నందున భూలోకానికి వెళ్తున్నావు’’  అని చెప్పారు. 


🌿అదే సమయంలో.. ఆస్తికునికి విష్ణు సభలో నాస్తికుడు కనిపించడంతో అతడు నివ్వెరపోయాడు. ‘‘వీడెలా వచ్చాడిక్కడికి? వీడు నాస్తికుడు కదా?’’ అని అతడు విష్ణుదూతలను అడిగాడు. 


🌸దానికి వారు.. ‘‘అవును, నిజమే. అయితే, బతికి ఉన్నంతకాలం ఇతడు ‘దేవుడు లేడు. దేవుడు లేడు’ అంటూ.. తెలియక చేసినా నీకంటే ఎక్కువగా భగవన్నామ స్మరణ చేశాడు.


🌿 వ్యతిరేకంగానైనా సరే.. నీకంటే ఎక్కువగా భగవంతుడి గురించి ఆలోచించాడు. మరొక ముఖ్యకారణం. ఇతడి ఇంట్లో ఇతడు తప్ప అందరూ ఆస్తికులే. ఇతడి భార్య విష్ణుమూర్తి భక్తురాలు. కొడుక్కి నారాయణ అని పేరుపెట్టుకుంది. 


🌸గడచిన నెలలో వైకుంఠ ఏకాదశి మరునాడు ఉదయం ఆమె పాయసం చేసింది. వీడు ఇంటి అరుగు మీద కూర్చుని ఆ పాయసం తింటుండగా పొలమారింది. 


🌿విపరీతంగా దగ్గుతూ ‘నారాయణా చచ్చిపోతున్నానురా!’ అంటూ కొడుకుని పిలిచి, అతడు మంచినీళ్లు తెచ్చేలోపునే మరణించాడు. ఏ కోరికా లేకుండా తన ప్రసాదం తిని, నారాయణ నామస్మరణ చేస్తూ మరణించినందున శ్రీమహావిష్ణువు వీడికి వైకుంఠంలో నివాసం కల్పించారు’’ అని చెప్పారు. 


🌸భక్తితో పాటు భావన కూడా చాలా ముఖ్యమని ఆస్తికుడు చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడు. అయితే.. మరుజన్మలో అతడు తన పాత తప్పుల్ని పునరావృతం చేయలేదు. 


🌿మనసారా విష్ణువును కొలిచి, చేసిన కర్మల ఫలితాన్ని ఆ పరమాత్మకు ధారపోయడం ద్వారా పాప, పుణ్యాలు అంటని మహా యోగి అయ్యాడు. తెలియక చేసినా భగవన్నామ స్మరణతో నాస్తికుడు వైకుంఠంలో స్థానం పొందితే.. 


🌸మరుజన్మలో స్వామిని త్రికరణశుద్ధిగా పూజించిన పుణ్యంతో ఆస్తికుడు చివరకు ఆ స్వామి హృదయంలోనే చోటు సంపాదించుకున్నాడు. జనన, మరణ చక్రం నుంచి విముక్తి పొందాడు...స్వస్తి.

కామెంట్లు చేసె వారికి సూచన,

 కామెంట్లు చేసె వారికి సూచన, 

ముందుగా మీరు ఫాలొవర్ కావలి. తరువాత మీ పేరు మొబేలు నంబరుతొ కామెంటు పెట్టండి.  వివరాలు గోప్యంగా వుంచిన కామెంట్లు బ్లాగులొ కనిపించవు

Dance


 

Verna


 

Harikadha


 

పలచబడి పోతున్న మానవ సంబంధాలు

 *🤍 పలచబడి పోతున్న మానవ సంబంధాలు 🤍*


నేను గత ముప్ఫై ఏళ్లుగా కుటుంబ సంబంధాలు మానవ సంబంధాలు లో వస్తున్న మార్పులను చాలా దగ్గరగా చూస్తూ వచ్చాను..

          పెద్దగా ఆస్తులు..చెప్పుకోదగ్గ ఆదాయ వనరులు.. సమాజంలో హోదా.. సౌకర్యాలు సౌఖ్యాలు పెద్దగా లేని రోజుల్లోనే మనుషుల మధ్య ఆప్యాయత అనుబంధాలు చిక్కగా వుండేవి..

               ఒకరికి ఒకరు చేదోడుగా.. నిజాయితీగా అరమరికలు లేని సంబంధాలు కొనసాగించారు..

          వున్నంతలో తృప్తిగా వున్నారు.. కష్టానికి సుఖానికి ఒకరికొకరు కలుసుకోవడం.. అందరం దగ్గర వాళ్ళం అనే అనుభూతి పుష్కలంగా వుండేది..

               కుటుంబంలో ఎవరి పిల్లలు అయినా ఏదైనా సాధిస్తే అది కుటుంబం మొత్తం ఉమ్మడిగా సంతోషం వ్యక్తం చేసేవారు..

               మా మనవడు లేదా మనవరాలు..అని తాతలు.. మా మేనకోడలు లేదా మేనల్లుడు అని అమ్మమ్మ ఇంటివారు నానమ్మ ఇంటి వారు అందరూ గర్వంగా చెప్పుకునే వారు..

             కానీ ఎప్పుడైతే 1983-84 నుంచి కార్పొరేట్ కాలేజ్ సంస్కృతి పెరగడం మొదలైందో.. ఎప్పుడైతే ఒక్కొక్కరు పిల్లలను చదివించడానికి priority ఇవ్వడం మొదలైందో.. ఎప్పుడైతే పిల్లలు కూడా ఒకరికి మించి ఒకరు అవకాశాలు అందిపుచ్చుకుంటూ.. కెరీర్ సృష్టించుకోవడం మొదలైందో..

             మొదట్లో వారే కుటుంబాలలో మిగిలిన వారికి మార్గనిర్దేశనం చేసే వారు.. మిగిలిన వారికి అరమరికలు లేకుండా అండదండలు అందించే వారు.. తాము ఎదగడంతో పాటు తమ వారు కూడా ఎదగడం కోసం సహాయ పడ్డారు..

             కానీ ఎప్పుడైతే సర్వీస్ సెక్టార్ ప్రాముఖ్యత పెరగడం మొదలైందో.. ఎప్పుడైతే వేగంగా కెరీర్ దొరకడం మొదలైందో.. వేగంగా కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మారడం మొదలైందో..

              అంతకు ముందు కన్నా జీవితంలో సౌఖ్యాలు.. విలాసాలు.. పెరిగాయో ఎందుకో మనుషుల వ్యక్తిత్వం మరింత పరిణతి చెందాల్సిన దగ్గర రివర్స్ లో కుంచించుకు పోవడం మొదలైంది పక్కాగా సంబంధాలు పలుచపడటం మొదలైంది..

              ఏ ఇద్దరు కలిసినా తమ పిల్లలు సాధించిన విజయాలు..  కొన్న ఆస్తులు.. చేయించుకున్న నగలు.. వారు పొందుతున్న సాలరీ ప్యాకేజ్.. వారు పొందుతున్న కంఫర్ట్ గురించి తప్ప..

               వెనుకటి రోజుల్లో లాగా ఆప్యాయంగా నోరారా పలకరించు కోవడమే తగ్గిపోయింది..

                నా చిన్న నాటి రోజుల్లో ఇంట్లో కీడు జరిగినా..శుభకార్యం జరిగినా కనీసం 10 మంది చుట్టాలు వారం పది రోజుల ముందు నుంచే వచ్చి వుండేవారు..

              తరువాత కూడా ఇంకో వారం రోజులు వుండేవారు..

            రాత్రి పూట ఆరుబయట మంచాలు వేసుకుని పొద్దుబోయిందాక చక్కగా కబుర్లు చెప్పుకుంటూ పడుకునే వారు..

               ఇప్పుడు ఎంత దగ్గర వారి కార్యక్రమం అయినా.. చేసే వారు కూడా ఆప్పో సొప్పో చేసి పక్క వాడి కన్నా ఘనంగా చేయాలి అని చూపించే శ్రద్ధ మన వాళ్ళను దగ్గరగా నిలుపుకుందాము అని మర్చిపోతున్నారు..

                అటెండ్ అయ్యే వారు కూడా తమ అతిశయం చూపించుకోవడానికి.. తమ స్థితిలో వచ్చిన మార్పు చూపించుకోవడనికి ఇస్తున్న ప్రయారిటీ..

             పారదర్శక సంబంధాలు కి ఇవ్వడం లేదు.. చాలా మొక్కుబడిగా ఆహ్వానాలు హజరులు మిగిలిపోతున్నాయి..

           అందరికి పిల్లలు దూరంగా వుంటున్నా.. ఇరుగు పొరుగు నే వుంటున్న రక్త సంబంధీకులు తో కూడా ఆత్మీయ అనుబంధాలు వుంచుకోవడం లేదు..

            నిష్కారణంగా చిన్న చిన్న కారణాలు తోనే విపరీతమైన అహం అతిశయం తో వ్యవహరిస్తూ.. అందరికి అందరూ గిరిగీసుకుని బతకడానికి అలవాటు పడుతున్నారు..

          వయసు పెరిగే కొద్దీ ఓర్పు సహనం పెరగాల్సిన దగ్గర అసూయ ద్వేషాలు పెంచుకుంటున్నారు..

         నూటికి 90% కుటుంబాలలో పిల్లలు దూరంగానే వుంటున్నారు.. వీళ్లకు పెద్ధతనం.. ఒంటరి తనం.. అనారోగ్య సమస్యలు.. మనిషి తోడు అవసరం..

            అయినా కొద్దిపాటి కూడా సర్దుబాటు ధోరణితో వుండడం లేదు.. విపరీతమైన తామసం.. పక్క వాడి నీడ కూడా సహించడం లేదు..

       చాలా కుటుంబాలలో ఇప్పటికే మనుషులు పలచబడ్డారు..

            వలసలు పుణ్యాన.. గత 60-70 సంవత్సరాలుగా అనుసరిస్తూ వచ్చిన ఫ్యామిలీ ప్లానింగ్ వల్ల ఇప్పటికే కుటుంబాల సైజ్ తగ్గిపోయింది.. 

        దానికి తోడు కేవలం కూడూ గుడ్డా కూడా పెట్టని ఈ అడ్డు గోడలు పర్యవసానం..

                బాధాకరమైన విషయం ఏంటంటే ఒక వేళ కజిన్స్ మన రూట్స్ కాపాడుకుందాం అనుకున్నా..రిలేషన్స్ లో ఎమోషన్ వుంచుకుందాము అనుకున్నా మెజారిటీ కుటుంబాలలో పెద్ద వాళ్ళు దూరిపోయి అగాధం పెంచుతున్నారు..

           చిన్నప్పటి మా రోజులే బంగారపు రోజులు అనిపిస్తున్నాయి..

              నేడు పిల్లలకు అసలు కుటుంబ సంబంధాలు పరిచయం చేయడం ఇన్వాల్వ్ చేయడం ఎప్పుడైతే తగ్గిపోయిందో..

      రేపటి రోజున మన తరువాత మన పిల్లలకు మన అనే వారే లేని..  మిగలని పరిస్థితి సృష్టిస్తున్నాము..

        నీ ఇంటికి వస్తే ఏమి పెడతావు? నా ఇంటికి వస్తె ఏమి తెస్తావు అన్న భావన నుంచి కొద్దిపాటి అయినా మార్పు చెందాలి..

           అందరూ కొద్దిగా ఆలోచించండి.. మన కుటుంబాల్ని మనమే ఎడం చేసుకుంటూ.. మనలో మనమే దూరం పెంచుకుంటూ ఇంకా సమాజం నుంచి మనం ఏమి ఆశిస్తాము..

               ఎవ్వరికీ వారు గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి.. మన చిన్ననాడు మనం ఏమేమి పొందాము నేడు మన పిల్లలకు ఏమేమి దూరం చేస్తున్నాము? 

           ఇప్పటికే చాలా మంది పెద్దవారు వెళ్ళిపోయారు.. మనకి ఎంత టైం వుంటుందో తెలియదు..

           మనం సక్రమంగా ఆరోగ్యంగా వున్నప్పుడే కనీసం మన వాళ్ళ దగ్గర అయినా పనికిమాలిన అహం అతిశయం వదిలి వెద్ధాము..

           మన తరువాత కూడా మన పిల్లలకి మన కుటుంబ అనుబంధాలు వారసత్వంగా ఇద్దాము..

           నేను కొన్ని వందల కుటుంబాలను చాలా సమీపంగా చూసి.. నేను కూడా ప్రత్యక్షంగా అనుభవించి రాస్తున్నా..


సేకరణ: వాట్సాప్ పోస్ట్ 

🤍🖤🤍🖤🤍🖤🤍

*04-10-2023* *రాశి ఫలితాలు

 *బుధ వారం* 

   *సౌమ్య వాసరః*

   *04-10-2023*   

    *రాశి ఫలితాలు*

*మేషం*

చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పవు. నేత్ర సంభందిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

*వృషభం*

వివాదాలకు సంబందించి విలువైన విషయాలు సేకరిస్తారు. రాజకీయ వర్గం వారితో పరిచయాలు పెరుగుతాయి. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలు కొంత పురోగమిస్తాయి.

*మిధునం*

ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్పదు. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. గృహమున కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. వ్యాపార ప్రారంభమునకు అవాంతరాలు తప్పవు. అనుకోని ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.  ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

*కర్కాటకం*

ప్రణాళికలు రూపొందించుకుని క్రమపద్ధతిలో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది.

*సింహం*

నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న విధంగా పూర్తి చేసుకుంటారు. నూతన గృహ వాహన యోగం ఉన్నది. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో విశిష్ఠ గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

*కన్య*

కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. నూతన వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యత పెరుగుతుంది. 

*తుల*

బంధువులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. ప్రయాణాలలో మరింత జాగ్రత్త వహించాలి. కుటుంబ  సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు స్థాన చలన సూచనలు ఉన్నవి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. 

*వృశ్చికం*

ఆప్తుల నుంచి  కీలక సమాచారం అందుతుంది. ముఖ్య వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో మీ విలువ మరింత పెరుగుతుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

*ధనస్సు*

నిరుద్యోగులకు అరుదైన అవకాశములు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. పాతబాకీలు వసూలవుతాయి. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన వాహన యోగమున్నది.

*మకరం*

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. బంధువులతో వివాదాలు సర్దుమణుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు  తగిన ఫలితం కనిపించదు. దాయాదులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు తప్పవు.

*కుంభం*

మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. స్ధిరాస్తి వివాదాలకు సంభందించి జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చవు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఇతరుల నుండి కొంత ఇబ్బందులు తప్పవు.

*మీనం*

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి.

🕉️

నన్నెచోడుని చమత్కారము

 


నన్నెచోడుని  చమత్కారము 


                  చ:  హరి వికచామలామలాంబుజ  సహస్రము పూన్చి ,మృగాంకునందవి


                        స్ఫురిత  మలాసితాబ్జమని , పుచ్చఁగఁ  జాచిన  చేయిఁజూచి ,   చం


                        దురుఁ డట  రాహు సావి  వెఱదుప్పులఁ దూలఁగ , జారుచున్న  న


                        య్యిరువురఁ  జూచి , నవ్వు  పరమేశ్వరుఁడీవుత!  మాకభీష్టముల్ ;


                            కుమార సంభవము-- అవతారిక-- 3 పద్యం:  నన్నెచోడ  మహాకవి !


                  కఠినపదములకు అర్ధము:- వికచ--వికసించిన; అమల--స్వఛ్ఛమైన ; అంబుజము--కమలము ;సహస్రము--వేయి;

 స్ఫురిత--కనిపించుచున్న; మల--మాలిన్యముతోకూడిన; అసితాబ్జము--నల్లనిపద్మము; పుచ్చగ--తొలగింపగ; మృగాంకుడు--చంద్రుడు;  రాహు సావి--రాహువని-- వెఱదుప్పులన్-తూలగన్--భయముతో వణకుచుండ ; జారుచున్న-- వెనుకకుజరగుచున్న;


                    భావము:  శ్రీ మహావిష్ణువు  పరిశుభ్రమైన  తెల్లని  వేయి  తామరపూలతో  శివుని  శిరస్సును పూజింపగా , శివజటాజూటముననున్నచంద్రుని, ఏణాంకములో  నలనల్లగా కనవచ్చు మచ్చను జూచి, యేమిది! పరిశుభ్రమైన తామఱలను గొనివచ్చితినే,  అందీ

పంక కళంకితమైన నల్లని తామఱయెటుల వచ్చినది?. దీనిని తొలగింతునుగాక! యనిభావించి  చేయిసాచి యాపద్మము నందుకొనజూచెను. కానీ  అదిపద్మము కాదుగదా చంద్రుడాయె. నల్లని పొడవైన యాకారమేదో  తనవయిపు వచ్చుటను చంద్రుడుజూచి  ఔరా! రాహువు  గ్రసించుటకు  వచ్చుచున్నాడేమో  నని భయపడి వెనుకకు వెనుకకు జరుగు చున్నాడట. వారియిరువుర తగులాటమును గాంచి శివుడు నవ్వుచున్నాడట! అట్టిపరమ శివుడు మాకభీష్టసంపద లొసగుగాక! యని కవిభావన.


                వ్యాఖ్య:-  నన్నెచోడకవి  రాజకవులలో నాద్యుడు. వీరశైవుడు. దేసి కవితాభిమాని. అతడు రచించిన 12 ఆశ్వాసముల 

కుమారసంభవ కావ్యము  ఆగామి ప్రబంధకవులకు  మేల్బంతి. నన్నయకు కొంచెము తరువాతివాడుగా  భావింప బడుచున్ననీతడు.ప్రతిభావంతుడైన ప్రౌఢకవి. 


                           ప్రస్తుత పద్య మతని చమత్కార సృజనకు  చక్కని  నిదర్శనము. విష్ణువు చంద్రునిలోని కళంకమునుగాంచి తానుతెచ్చినపూలలో  మలిన మైన పుష్షమేమో  ననిభ్రమపడుటయు, దానిని తొలగిం ప చేయిచాప, నల్లని యాహస్తమును గాంచి చంద్రుడు రాహువేమోనని భయమంది వెనుకకు జరగుచుండుటయు. వీరిరువురు భ్రాంతి నొందుటను గమనించి పరమశివుడు నవ్వుటయు.

                             నిందలి  చమత్కార వైభవము!   విష్ణువు నీలమేఘశ్యాముడు.నల్లని యతని బాహుదండమునుగాంచి రాహువేమోనని చంద్రుడుభ్రమయుట,చంద్రగతమైనకళంకమునుగాంచి మలినపుష్పమని విష్ణువుభ్రమయుట వలని ది పరస్ఫర భ్రాంతి. కావున 

                                        భ్రాంతి మదలంకారము !


                                                        స్వస్తి!🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

పంచాంగం 04.10.2023 Wednesday,

 ఈ రోజు పంచాంగం 04.10.2023  Wednesday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస కృష్ణ పక్ష: షష్థి తిధి సౌమ్య వాసర: రోహిణి  నక్షత్రం సిద్ది తదుపరి వ్యతీపాత యోగ: గరజి తదుపరి వణిజ కరణం ఇది ఈరోజు పంచాంగం.

షష్థి  రా.తె 05:41 వరకు.

రోహిణి సాయంత్రం 06:33 వరకు.

సూర్యోదయం : 06:10

సూర్యాస్తమయం : 05:59

వర్జ్యం : పగలు 10:25 నుండి 12:03 వరకు తిరిగి రాత్రి  12:26 నుండి 02:06 వరకు.

దుర్ముహూర్తం : పగలు 11:41  నుండి మధ్యాహ్నం 12:28 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.


యమగండం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.  



శుభోదయ:, నమస్కార:

పరమాత్మ తప్పకుండా శిక్షిస్తాడు.

 *1942*

*కం*

మిక్కిలి బలవర్ధకమని

కుక్కుట భ్రూణములు తినెడి కుత్సిత మతులన్

కుక్కుట శాపంబువలన

తక్కక శిక్షించు విభుడు ధరణిన సుజనా.

*భావం*:-- ఓ సుజనా! పసిగుడ్డు అనే జాలి లేకుండా మిక్కిలి బలవర్ధకమైనది అనే నెపంతో కోడిగుడ్డు లను చంపితినే కుటిలాత్ములను ఆ కోళ్ళ శాపం వలన పరమాత్మ తప్పకుండా శిక్షిస్తాడు.

*సందేశం*:-- బలహీనమైన పిల్లల పై తల్లిదండ్రులకు ఎక్కువ అభిమానం ఉండే విధంగా మూగజీవులపై భగవంతుని కి ఎక్కువ శ్రధ్ధ ఉంటుంది., కానీ దానిని చిన్న విషయం గా తీసుకుని మనుషులు మూగజీవాలను వేధిస్తే భగవంతుని శిక్ష కు పాత్రులగుదురు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

తరుణోపాయం

 కళ్ళు మూసి తెరిచే లోపు కాలం గిర్రున తిరిగిపోతుంది. రాజులు తరాజులవుతారు. ఓడలు బళ్ళు అవుతాయి. బాధ్యతలు చుట్టుముడతాయి. వ్యాధులు పైబడతాయి. వయసు, ఉత్సాహం ఉడిగి పోతాయి. నోటు మాటకే కానీ నోటి మాటకు విలువ ఉండదు. కాల చక్రం కరకు కోరల్లో జీవుడు ఇలా మగ్గిపోవాల్సిందేనా? తరుణోపాయం లేదా? ఉంది. భక్తి అనే తిరగలిలో విశ్వాసమనే పిడిని గట్టిగా పట్టుకుంటే నలగకుండా గట్టెక్కవచ్చు. గోవిందా అనుకో. నామం వదలకు. శరణాగతి మరువకు. ఇహానికి, పరానికి ఇదొక్కటే పెట్టుబడి. హరి ఓం./అంతరంగ తరంగం/AVR🙏

నవగ్రహా పురాణం🪐* . *43వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *43వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*బుధగ్రహ జననం - 6*



*"నవ్వితే నీ ముఖంలో అందం వెయ్యింత లవుతుంది తెలుసా ?"* తార అంది. *"ఇప్పుడు నా రెండో ప్రశ్నకు - మొదటి సారి వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పు ! నేను అందంగా ఉంటానా , మీ అమ్మగారు అందంగా ఉంటారా ?”* 


ఆరోజు , ఆశ్రమంలో , భోజన సమయంలో తార అడిగిన ప్రశ్న ! తను మరిచేపోయాడు ! చంద్రుడు ఆలోచిస్తూ తారను పరికించి చూశాడు.


ఆమె శరీరాన్ని అంటిపెట్టుకున్న పువ్వులు ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో చిరుగాలికి. కదుల్తున్నట్టు కదుల్తున్నాయి. మొక్కలకి అతుక్కుని ఉన్నప్పటి కన్నా తార శరీరం మీద పువ్వులు ఎక్కువ అందంగా కనిపిస్తున్నాయి !


*"చెప్పు చంద్రా ! ఎవరు అందంగా ఉన్నారో ?"* తార నవ్వుతూ హెచ్చరించింది.


చంద్రుడి మనో నేత్రం ముందు అనసూయ ప్రత్యక్షమైంది. క్షణంలో అంతర్థానమైంది. ఎవరు అందంగా ఉన్నారు ? తార ప్రశ్నకు సమాధానం దొరికింది చంద్రుడికి , అమ్మ అందం అనునయించే అందం. తార అందం రెచ్చగొట్టే అందం ! అమ్మ అందం జోలపాడే అందం ! తార అందం మేలుకొలిపే అందం !


తార చెయ్యి అతని చేతిని నొక్కుతూ ధ్వని లేని భాషలో ఏదో చెప్తోంది. *"చెప్పకపోతే , నా చిలకని రమ్మంటాను సుమా !"* తార హెచ్చరిస్తూ అంది. *"ఎవరు అందంగా ఉన్నాం ? మీ అమ్మా , నేనా ?”*


*"నువ్వే..."* తీగలాంటి తార శరీరాన్ని తనివితీరా చూస్తున్న చంద్రుడు అన్నాడు. ఏకవచన ప్రయోగం ! అప్రయత్నంగా ఆమెను 'నువ్వే' అన్నందుకు చంద్రుడు. ఆశ్చర్యపోయాడు.


*"నా భర్తా , నువ్వూ - మీ ఇద్దల్లో ఎవరు అందంగా ఉంటారో తెలుసా , నీకు ?"* చంద్రుడి ఆశ్చర్యాన్ని తీగలు సాగిస్తూ ఉన్నట్టుండి అడిగింది తార.


*“... తారా !"*


*"అడుగు !"* తార కవ్వింపుగా అంది. అతని చేతిని వేళ్ళతో నొక్కుతూ. 


*"తారా...”* అన్నాడు చంద్రుడు మళ్ళీ.


*"అడగకపోయినా , చెప్తాను ! నువ్వే అందంగా ఉంటావు"* అంటూ చంద్రుడి చేతిని తన చెంపకు ఆన్చుకుంది తార. *"ఇలా నా దగ్గరగా , రాచంద్రా !"*


*"తారా !"*


*"మన మధ్య ఉన్న దూరాన్ని దూరంచేయ్ !"* పువ్వుల్లో దాగి ఉన్న తార కుడిచెయ్యి లతలా కదిలి , చంద్రుడి భుజం మీద వాలింది. *"తారా... గురువుగారు...”* చంద్రుడు అప్రయత్నంగా అన్నాడు.


*"మనిద్దరి మధ్యా గురువుగారు కాదు , గాలి కూడా ఉండటానికి వీలు లేదు !"* తార కంఠంలో నిర్ణయం జీరగా ధ్వనించింది. ఆమె చేతులు అతని మెడ చుట్టూ లతల్లా అల్లుకున్నాయి. నదిని ఆకర్షిస్తున్న సముద్రంలా - తార సౌందర్యం , తారా ప్రణయం అతన్ని ఆకర్షిస్తూ లాగుతున్నాయి. చంద్రుడు ముందుకు వాలాడు. అతని చెంప తార చెంప మీద ఆనింది.


నిద్రపట్టని చంద్రుడు మౌనంగా నవ్వుకున్నాడు. మొదటిసారిగా ఆశ్రమ ప్రాంగణంలో అడుగుపెట్టిన క్షణం నుంచి తార కళ్ళు తనను వేటాడాతున్నాయి. వాతాయనంలోంచి తనను చూసిన క్షణం నుంచి ఆమె చూపులు తన చూపుల్ని లాగుతూనే ఉన్నాయి. తనను ఆశ్చర్య పరుస్తూ , అచిరకాలంలోనే తార తనకు మానసికంగా చాలా , చాలా దగ్గరైపోయింది. అది ఎప్పటి అజ్ఞాత సంబంధమో - ఏనాటి ప్రణయ బంధమో !


*“నదిలో జలక్రీడ హాయిగా ఉంటుంది ! రేపు సూర్యోదయ సమయానికి మనిద్దరం నది వద్ద ఉండాలి !"* పొదరిల్లు వదిలి వెళ్ళే ముందు తార అన్న మాటలు చంద్రుడి చెవుల్లో ఉన్నట్టుండి గింగురుమన్నాయి. చంద్రుడు నిద్రను ఆహ్వానిస్తూ పక్కకి తిరిగాడు....


తార నదిలో మత్స్య కాంతలా ఈదుతోంది. ఆమె చేతులు బంగారు తీగల్లా కదుల్తున్నాయి. కాసేపు ఈదులాడిన చంద్రుడు నీటి అంచున నిలబడి తార 'జలలాస్యాన్ని' కన్నులపండుగలా చూస్తున్నాడు. తార కాసేపు వెల్లకిలా నీళ్ళ మీద జారుతోంది. కాసేపు బోర్లా తిరిగి వేగంగా వెళ్తుంది. జలక్రీడలో ఆమెకు అద్భుతమైన నైపుణ్యం ఉన్నట్టుంది. ఆమెతో పాటు జలక్రీడ ఆడటం కన్నా ఎదురుగా నిలబడి ఆమె జలకేళీ సౌందర్యాన్ని ఎంతసేపైనా ఆస్వాదించాలనిపిస్తోంది , చంద్రుడికి.


తార తల నీళ్ళ మీద ఉండేలా , అతని వైపే చూస్తూ నీళ్ళని రెండు చేతుల్తో వెనక్కి తోస్తూ వస్తోంది. నీటిలోంచి నిక్కి చూస్తున్న కన్నె పద్మంలా ఉంది తార ముఖం. పొడుగాటి జుత్తు ఆ పద్మాన్ని అంటిపెట్టుకున్న నాచులా ఆమె వెంట వస్తోంది.


తార చంద్రుడి వైపు నవ్వుతూ చూస్తూ , *"రా , చంద్రా !"* అంది. చంద్రుడు తల అడ్డంగా ఊపాడు. తార వేగంగా ఈదుతూ వచ్చి , నడుంలోతు నీళ్ళలో ఆగి , నిలుచుంది. తడిసిన వలువల వెనక - నివురుగప్పిన నిప్పులా కనిపిస్తోంది ఆమె శరీరం చంద్రుడికి.


రెండు చేతుల్తో పొడుగాటి జుత్తును సర్దుకొని చేయూత ఇమ్మన్నట్టు చెయ్యి చాచింది తార , చంద్రుడి వైపు. చంద్రుడు కుడిచేతిని ఆమెకి అందించాడు. మరుక్షణం తార అతన్ని బలంగా లాగింది. చంద్రుడు తూలి ఆమె ముందు పడి , ఉక్కిరిబిక్కిరి అవుతూ లేచాడు. తార చేతులు అతన్ని బంగారు గొలుసుల్లా అల్లుకున్నాయి. ఇంకా ఉక్కిరిబిక్కిరయ్యాడు.


బృహస్పతి విద్యార్థులకు పాఠ ప్రవచనం చేస్తున్నాడు. విద్యార్థులు ఏకాగ్రతతో వింటున్నారు. చంద్రుడు అడుగులో అడుగు వేసుకుంటూ దగ్గరగా వచ్చాడు. చప్పుడు చేయకుండా , గురువుగారి దృష్టిని ఆకర్షించకుండా పంక్తిలో కూర్చోబోయాడు.


*"చంద్రా !"* బృహస్పతి కంఠం ఖంగుమంది. చంద్రుడు అలాగే నిలబడి , మౌనంగా చూశాడు.


*"పాఠ ప్రవచన సమయంలో ఎక్కడికెళ్ళావు ?"* బృహస్పతి ప్రశ్న చంద్రుడిని చెంప పెట్టులా తాకింది.


*"నదీ స్నానానికి... గురువుగారూ..."* చంద్రుడు తప్పు చేసినవాడిలా అన్నాడు.. *"తోటి విద్యార్ధులతో బాటు అనుష్ఠానాలు తీర్చుకోకుండా నదికి ఎందుకు వెళ్ళాల్సి *"వచ్చింది?".*


చంద్రుడు క్షణకాలం ఆలోచించాడు. ఆశ్రమంలో తారా , తనూ ఇద్దరూ లేని సంగతి అందరికీ తెలిసిపోయి ఉంటుంది. తాను నటించడం వ్యర్థం.


*"గురుపత్నిగారు తోడు రమ్మంటే... వెళ్ళాను, గురువుగారూ...”* అప్రయత్నంగా చంద్రుడి కళ్ళు నేల చూపులు చూశాయి.


*"ఇక్కడ నీ ప్రథమ కర్తవ్యం విద్యార్జన. ద్వితీయ కర్తవ్యం గురుశుశ్రూష. గురుపత్ని సేవకు అవకాశం లేదు !"* బృహస్పతి కంఠం గంభీరంగా ధ్వనించింది. *"చక్కగా విద్యను అభ్యసించి , నిజమైన ఆత్రేయుడ వనిపించుకో !”*


*"చిత్తం...”*


*"మరొక విషయం మా దృష్టికి వచ్చింది... గురుపత్ని నిర్దేశించిన పనులకు నువ్వు అధిక ప్రాధాన్యత ఇస్తూన్నట్టు తెలుస్తోంది. ఆశ్రమ నిర్వహణ యధావిధిగా జరిగిపోతుంది. నీ సహాయం అవసరం లేదని గురుపత్నికి తెలియజేస్తాం. విద్యార్థిగా నీ విధికి అంకితం కావాలి నువ్వు !"* బృహస్పతి ఆజ్ఞాపించాడు.


*"అలాగే... గురుదేవా !"* అన్నాడు చంద్రుడు.


కూర్చోమన్నట్టు చేతితో సౌంజ్ఞ చేస్తూ , బృహస్పతి తన పాఠప్రవచనం అందుకున్నాడు.

 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-65🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-65🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


తిరుమల అనగా శ్రేష్టమైనకొండ అని అర్ధము. ద్రావిడ భాషయందు శ్రీవైష్ణవ సిద్ధాంతములో తిరు అనునది. శ్రేష్ఠ వాచకము. మలై అను శబ్దమునకు పర్వతమనియర్ధము.


 ఈ పర్వతము తూర్పుకొండలలో నిది. 2500 అడుగులు యెత్తున్నది. తిరుమల అనెడి పేరుకంటె తిరుపతికొండనియు, తిరు మలైయనియు విశేషముగ వాడబడును

(ఈకొండకు కృతయుగములో వృషభాచలమనియు త్రేతాయుగములో సంజనాచలమనియు ద్వాపరయుగములో శేషాచలమనియు కలియుగములో వేంకటాచలమనియు పేర్లుగలవు.


"కలౌవేంకటనాయక:" అని ప్రసిద్ధి చెందిన క్షేత్రము. వడవానై (ఉత్తరదిగ్గజము) అని తిరుమంగై యాళ్వార్ల వర్ణనము. "వడక్కుత్తిరుమలై" యని (వడ తిరువేంగడం) "మణ్ణోర్ విణ్ణోర్ వైప్పు" అని సాంప్రదాయక తిరునామములు గలవు. 


ఈక్షేత్రమునకు పుష్పమంటపమనియు తిరునామము ఉంది.

 

అనంతాళ్వాన్ అను మహాత్ములు పుష్కరిణిని నిర్మించిరి. కురుబరుత్తనంబి స్వామికి ఆంతరంగికులు. పెరియ తిరుమలై నంబి గారు ఈమలై మీద వేంచేసి స్వామి కైంకర్యము నిర్వహించెడివారు.


అష్ట స్వయం వ్యక్త క్షేత్రములలో తిరుమల యొకటి. శ్రీ వైష్ణవులు అత్యంతము అభిమానించి సేవించు నాల్గుక్షేత్రములలో "తిరుమలై" రెండవది.

స్వయం వ్యక్త క్షేత్రములు

 

1. శ్రీరంగము శ్రీరంగనాదులు

2. శ్రీముష్ణము భూవరహ పెరుమాళ్

3. తిరుమలై తిరువేంగడముడై యాన్

4. తిరునీర్మలై శ్రీరంగనాధన్(నీర్వణ్ణన్)

5. నైమిశారణ్యం దేవరాజన్(వనరూపి)

6. పుష్కరమ్ పరమపురుషన్(తీర్దరూపి)

7. బదరికాశ్రమం తిరునారణన్

8. సాలగ్రామం శ్రీమూర్తి


*ఆళ్వార్ల కీర్తనలలో తిరుమల*


తొలుత దేశభాషయైన తమిళభాషలో తిరుమలేశుని కీర్తించి ఆతని మహిమను లోకమున చాటిచెప్పినవారు ఆళ్వార్లు.


 "వడతిరు వేజ్గడమ్; తిరుమలై" అని వారు ఈ పర్వతరాజమును కీర్తించారు. 


ఇచటి స్వామిని "తిరువేంగడత్తాన్; తిరువేంగడముడైయాన్; అలర్మేల్ మంగై యుఱై మార్పన్"అని ప్రస్తుతించారు.


భగవన్తుడు వేంచేసియుండు దివ్యదేశముల కన్నింటికి "తిరుప్పది" అనియే పేరు "పది" అనగా స్థానము అని అర్దము.


 108 తిరుప్పదులు ఆళ్వార్లచే కీర్తింపబడినవి. అవి అన్నియు తిరుప్పదులే. కానీ కాలక్రమంలో "తిరుప్పది" అనుపేరు. ఈక్షేత్రమునకు మాత్రమే వాచకంగా రూడమైనది. "తిరుప్పది"యే తిరుపతిగా మారినది. 


"తిరుమాల్ అనగా శ్రియ:పతి. ఆయనకు నిత్యనివాసస్థానమైన తిరుమలై తమిళదేశానికి ఆనాటి ఉత్తర సరిహద్దుగా "తొల్కాప్పియం" అను ప్రాచీన తమిళ గ్రంథమున పేర్కొనబడింది.


ప్రపన్నజన కూటస్థులైన నమ్మాళ్వార్లు ఈ శ్రీనివాసుని పాదారవిందముల యందే "అలర్మేల్ మంగై యుఱైమార్పా....పుగలొ న్ఱిల్లా నడియేన్ ఉన్నడి క్కీళ అమర్న్దు పుకున్దేనే" అంటూ పిరాట్టిని (లక్ష్మీదేవిని) పురుషాకారంగా చేసికొని శరణాగతి చేసారు. మఱియు "అలర్మేల్ మంగై యుఱైమార్పా" అని ప్రస్తుతించి లక్ష్మీ పతిత్వమును ప్రకటించారు.


మరియు "ఒళవిల్ కాలమెల్లామ్" అను దశకమున సర్వదేశ సర్వకాల సర్వావస్థలయందును ఈస్వామి తిరువడి ఘుళ్ళలో (శ్రీపాదములయందు) కైంకర్యము చేయుటచే పరమ పురుషార్థమని ప్రవచించారు. అంతేకాక ఈ దశకములోనే "ఎజ్గళ్పాశంవైత్త" అను చోట స్వామియొక్క వాత్సల్యగుణమును ప్రకాశింపచేసారు.


శ్రీగోదాదేవి తమ నాచ్చియార్ తిరుమొళిలో "విణ్ణీలమేలాప్పు" అను దశకమున ఈస్వామివార్కి మేఘములద్వారా తమ సందేశాన్ని వినిపిస్తారు. ఇట్లే ప్రథమ దశకములో "వేంగడవఱ్కెన్నై విదిక్కిత్తియే" అంటూ "మన్మథా! నన్ను వేజ్కటాచలపతితో కలసపూ" అని ప్రాదేయ పడతారు.


ఈస్వామిమ్రోల "వడియాయ్ కిడన్దు ఉన్ పవళవాయ్ కాణ్బేనే" కడపరాయిగా పడియుండి స్వామి దివ్యాధరమును సర్వదా సేవించు చుందును గాక! అని శ్రీకులశేఖరాళ్వార్లు తమ పెరుమాళ్ తిరుమొళిలోని ఊనేఱశెల్వత్తు అను దశకములో ప్రార్థిస్తారు.


 కావుననే ఇచట గర్భ గృహద్వారమున గల గడపకు "కులశేఖరపడి" అని పేరు. 


"మన్దిపాయ్ వడవేంగడమామలై;వానవర్ శన్దిశెయ్య నిన్ఱాన్" అంటూ తిరుప్పాణి ఆళ్వార్ జ్ఞానులు అజ్ఞానులు అనుభేదం లేక ఊర్ధ్వలోక వాసులు భూలోకవాసులు సేవించునట్లు దయార్ద్రహృదయుడైన స్వామి తిరువేంగడమున వేంచేసియున్నాడు అని అభివర్ణించిరి.


తిరుమంగై ఆళ్వార్లును "తిరువేంగడ ముడై నెంజమే" ఓ మనస్సా ! తిరువేంగడమును ఆశ్రయింపుమని భావించి; "నాయేన్ వన్దడైన్దేన్ నల్గియాళైన్నై క్కొణ్డరుళే" అంతట సంచరించి అన్నిబాధలను అనుభవించి అగతికుడనై నిహీన జంతువువలె నీసన్నిధికి వచ్చి నిన్ను ఆశ్రయించితిని. ఆదరముతో నన్ను అనుగ్రహింపుము అని దీనంగా ప్రార్దిస్తారు. (పెరియతిరుమొళి)

"నమ్మాళ్వార్ ఈక్షేత్రమును "మణ్ణోర్ విణ్ణోర్ వైప్పు (భూలోక వాసులకును పరమపద వాసులకును సమానుడు)" అని అబివర్ణించియున్నారు. 


(కణ్ణావా నెన్ఱుమ్ మణ్ణోర్ విణ్ణోర్కు" తి.వా.మొ 1-8-3) తిరుమంగై యాళ్వార్ "వడవానై" (ఉత్తర దిశాదిగ్గజము తిరునెడున్దాణ్డగమ్ 10) అనిస్తోత్రము చేసియున్నారు. మరియు ఈక్షేత్రమునకు "వడక్కుత్తిరుమలై" యని సంప్రదాయక తిరునామము. 


*శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.🙏*

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 54*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 54*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*స్వామి వివేకానంద జీవిత గాథ*


శ్రీరామకృష్ణులు కృపాకటాక్షం వలన సాధనామయ జీవితంలో నరేంద్రుడు. సత్వరమే ప్రగతి సాధిస్తూన్నప్పటికీ, అతడికి సంబంధించినంతవరకు అదొక  గొప్ప విషయంగా తోచలేదు. భక్తులలో కొందరు పారవశ్య స్థితులను పొందడమూ, ధారగా కన్నీరు స్రవించడమూ లాంటి పరమానంద స్థితులను అనుభవించడం అతడు చూసినప్పుడు, బహుశా తాను పురోగమించలేదేమోనన్న సంశయం అతడికి కలిగింది.


 కనుక ఒక రోజు శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్లి, తనకూ అట్టి స్థితులను అనుగ్రహించమని ప్రాధేయ పడ్డాడు. 

 

అందుకు శ్రీరామకృష్ణులు, "నాయనా, దీని కోసం బాధపడాలా! ఒక ఏనుగు మామూలు నీటిగుంటలో దిగుతున్నప్పుడు, గుంటలోని నీరు అల్లకల్లోల మవుతుంది. కాని అదే ఏనుగు గంగానదిలో దిగినప్పుడు, గంగలో ఏమైనా మార్పు వస్తుందా? ఇది కూడా అలాంటిదే. ఈ భక్తులు కేవలం నీటిగుంటల వంటివారు; భక్తిపరమైన అనుభవాలు కాసిని పొందగానే ఇలా ఉద్వేగపు వెల్లువలో ఉర్రూతలూగుతారు. నువ్వు గంగలాంటి మహానదివంటివాడివి. ఇలాంటి ఉద్వేగపు వెల్లువ నీకు కలుగదు" అంటూ నిజాన్ని వెల్లడించారు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 43*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 43*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*ధునోతు ధ్వాన్తం న స్తులిత దలళితేన్దీవర వనం*

*ఘనస్నిగ్ధంశ్లక్ష్ణం చికుర నికురుంబం తవ శివే |*

*యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో*

*వసన్త్యస్మి న్మన్యే  వలమథన వాటీ విటపినామ్ ‖*


ఈ శ్లోకంలో అమ్మవారి కురుల సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు శంకరులు.


ధునోతు ధ్వాంతం నః = ధ్యానిస్తే మనలోని అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తుంది ఆ కురుల సౌందర్యం.


తులిత దలితేందీవర వనం= తులిత అంటే సమానమైనది. దేనితో? ఇందీవరవనం అనగా విచ్చిన నల్లకలువల వనంతో. (కలువలకు సుగంధంతో పాటు సౌకుమార్యం కూడా ఉంటుంది)


ఘనస్నిగ్ధo శ్లక్ష్ణం= అమ్మా, నీ కురులు ఘనంగా,ఒత్తుగా వున్నవి.

 స్నిగ్ధం-నునుపుగా శ్లక్ష్ణం-మృదువుగా వున్నవి. *బర్బరాలకా* అని అమ్మవారి నామం


చికుర నికురుంబం తవ శివే = అమ్మా నీ మృదువైన కురులు


సౌరభ్యం సహజం = సహజమైన సుగంధం కలవి 


వలమథన వాటీ విటపినామ్ = ఇంద్రుని నందనవనం లోని దివ్య కుసుమాల సుగంధం

*చమ్పకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా* అని అమ్మవారి సహస్రనామాల్లో ఒకటి.


యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో వసంత్యస్మిన్ మన్యే = ఇంద్రుని ఈ దివ్య పుష్పములు నీ కురుల సహజ సుగంధము నుండి సౌరభాన్ని పొందుతున్నాయి. అందుకే ఆ దివ్య పుష్పాలు నీ కురులను అలంకరిస్తున్నాయి.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

ఆహుతులు

 చిత్రాన్ని గీసిన వారికి అభినందనలు... 


*_అగ్నౌ ప్రాస్తాహుతి స్సమ్యగాదిత్య ముపతిష్ఠతే।_*

*_ఆదిత్యా జ్జాయతే వృష్టిః వృష్టేరన్నం తతః ప్రజాః॥_*


సమత్రకంగా అగ్ని లో సమర్పించిన ఆహుతులు ఆదిత్యుని చేరతాయి.... *సూర్యుని వల్ల వర్షం కలుగుతుంది.... వర్షం వల్ల ఆహారం పుడుతుంది*....ఆహారం తీసుకొని ప్రజలు వృద్ధి చెందుతున్నారు.....


(మనుస్మృతి_ 3-76)


యజ్ఞయాగాది క్రతువుల వల్ల కలిగే ఫలితాలు అనేకం..... అటువంటి వాటిలో ఒకదాన్ని ఈ చిత్రం ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.....

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


-

జనమేజయా! నారదుడు చెబుతుండగా వింటున్న నాకు కుతూహలం పెరిగింది. తరవాత

ఏమి జరిగింది. పర్వతుడూ నువ్వూ శాపవిమోచనం ఎలా పొందారు, దమయంతి సంగతి ఏమిటి?

వివరంగా చెప్పమని త్వర పెట్టాను. నారదుడు కొనసాగించాడు.

వ్యాసరీ! మాయావిలాసం ఏమి చెప్పమంటావు. అలిగి పర్వతుడు అలా వెళ్ళిపోతే నేనెంతగా

దుఃఖించానో ఆ భగవంతుడికి ఎఱుక. రాకుమారి దమయంతి యథాపూర్వంగా నాకు మళ్ళీ సేవలు

చేయనారంభించింది. నేను రాజగృహంలోనే ఉండిపోయాను. ఈ శాపమేమిటి. ఈ వానర ముఖమేమిటి

అని అనుక్షణమూ దిగులుచెందాను. రేపు ఏమి జరుగుతుందో అని భయపడ్డాను.

సంజయమహారాజుగారు కూతురికి వివాహం సంకల్పించారు. కించిత్ప్రకటితయౌవన అయ్యింది.

తగిన వరుణ్ణి అన్వేషించమని మంత్రులకు పురమాయించాడు. కుల రూప ఔదార్యాది సద్గుణాలు

కలిగిన యువశూరుణ్ణి చూడమన్నాడు. మంత్రులన్నారు కదా మహారాజా! యోగ్యులైన రాకుమారులు

చాలామంది ఉన్నా, వారిలో దమయంతీదేవి ఎవరిని ఇష్టపడుతుందో తెలుసుకోండి. అతడిని పిలిచి

హస్త్యశ్వరథసంయుతంగా వివాహం జరిపిద్దాం అని.

తండ్రి చేస్తున్న వివాహప్రయత్నాలు దమయంతికి తెలిసాయి. రహస్యంగా ధాత్రిని (రాజకన్యలకు

పెంపుడు తల్లి పిలిచి తన అభిప్రాయం తెలియజేసింది. ఆ వృద్ధురాలు వెళ్ళి రాజుగారి చెవిని వేసింది.

మహారాజా! దమయంతి నాతో చెప్పింది. నీకు చెప్పమంది. మహతీవీణావాదన నిపుణుడైన ఈ

మేధావి నారదుణ్ణి వరించానంది. అతడికే ఇచ్చి వివాహం జరిపించమంది. మరింకెవరినీ పతిగా

అంగీకరించవంది. నక్రతిమింగల రహితమూ, క్షార గుణవిరహితమూ సంపూర్ణమూ రసాత్మకమూ

అయిన నారద నాదసింధువులో మునిగిపోయాను. కనక అతడే నా ప్రియుడు, అతడే నా వరుడు అని 

స్పష్టం చేసింది.

సుభాషితమ్


ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐


// *శ్లోకం* //


*స్వే స్వే కిల కులే జాతే పుత్రే నప్తరి వా పునః౹*

*పితర: పితృలోకస్థా: శోచంతి చ హసంతి చ౹౹* 

*కిం తస్య దుష్కృతే౽స్మాభిః సంప్రాప్తవ్యం భవిష్యతి౹*

*కించాస్య సుకృతే౽స్మాభిః ప్రాప్తవ్యమితి శోభనమ్౹౹*


 *తాత్పర్యం:-*

పితృలోకమందున్న పితృదేవతలు తమతమ వంశమున కుమారులు, మనుమల పుట్టుకకు వారి చెడుపనివల్ల మనమేం పొందాల్సి ఉంటుందో? అని దుఃఖిస్తారు. అలాగే వారి మంచిపనుల వల్ల మనకేం మంచి లభిస్తుందో అని సంతోషిస్తారు.

Mechanical engineering


 

Power from sea


 

DC Fan


 

సాంఖ్య యోగః 🌸* *2-అధ్యాయం,49వ శ్లోకం*

 *🕉️🪷 ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః 🪷🕉️*

*🪷 శ్రీ మద్భగవద్గీత🪷*

*🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸*

*🌸 సాంఖ్య యోగః 🌸*


*2-అధ్యాయం,49వ శ్లోకం*


 *దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయ |* 

 *బుద్దౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫల హేతవః || 49* 


 *ప్రతిపదార్థం* 


బుద్ధి యోగాత్ = (సమత్వ ) బుద్ధి యోగము కంటెను; కర్మ = సకామకర్మ ; దూరేణ అవరమ్ (అతః )= మిక్కిలి నిన్న శ్రేణికి చెందినదని కావున ; ధనంజయ = ఓ ధనంజయా! ; బుద్దౌ= సమత్వ బుద్ధి యందే; శరణమ్ = తరుణోపాయమును; అన్విచ్ఛ = వెదకుము  ( సమత్వ బుద్ధియోగమును ఆశ్రయింపుము ) ;హి = ఏలనన ; ఫల హేతవః = ఫలములను ఆసించువారు (ఫలాసక్తి తో కర్మలను ఆచరించు వారు )i కృషణాః = అత్యంత దీనులు;


 *తాత్పర్యము* 


ఈ సమత్వ బుద్ధి యోగము కంటెను సకామ కర్మ మిక్కిలి నిమ్నశ్రేణికి చెందినది. కావున ఓ ధనంజయా! నీవు సమత్వ బుద్ధియోగమునే ఆశ్రయింపుము - ఏలననా ఫలాసక్తితో కర్మలు చేయువారు అత్యంత దీనులు కృపణులు.


 *సర్వేజనాః సుఖినోభవంతు* 

 *హరిః ఓం 🙏🙏*

శరీరానికి 24 రకాల ఖనిజ లవణాలు అవసరం

 మానవ శరీరానికి 24 రకాల ఖనిజ లవణాలు అవసరం అవుతాయి . మన శరీరములో ఖనిజ లవణాలు లోపించినప్పుడు శరీరం మొత్తానికి 60 గ్రాముల ఖనిజ లవణాలు మాత్రమే అవసరం . కాని దీనిలో ఏవి లోపించినా సమస్యలు వస్తాయి . క్యాల్షియం లోపించినప్పుడు కండరాలు పట్టేస్తాయి . ఎముకలు పెళుసుబారి పోతాయి . మెగ్నీషియం లోపం వలన వెంట్రుకలు రాలిపోతాయి . 


 ఖనిజ లవణాలు దొరికే ఆహారాలు - 


 * కలబందలో 18 రకాల ఖనిజ లవణాలు ఉంటాయి . 


 *  తేనెలో 10 రకాల ఖనిజ లవణాలు ఉంటాయి . 


 *  దేశివాళీ ఆవు పంచకములో 24 రకాల ఖనిజ లవణాలు ఉంటాయి . 


 *  పైనాపిల్ లో ఖనిజ లవణాలు ఉంటాయి. 


 *  ముల్లంగిలో ఖనిజ లవణాలు ఉంటాయి . 


 *  కొబ్బరిలో ఖనిజ లవణాలు ఉంటాయి . 


 *  ఖర్జూరములో ఖనిజ లవణాలు ఉంటాయి . 


 *  గోధుమ గడ్డి చూర్ణములో గాని , రసములో పుష్కలముగా ఉంటాయి . 


 *  దంపుడు బియ్యములో ఖనిజ లవణాలు ఉంటాయి . 


  

   మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                           9885030034  


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


        కాళహస్తి వేంకటేశ్వరరావు 


   అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


           9885030034

భూమి సంబందిత వివరాలు

 భూమి కొలతలు..

1) ఒక ఎకరాకు =  40 గుంటలు 

2) ఒక ఎకరాకు =  4840 Syd

3) ఒక ఎకరాకు =  43,560 Sft

4) ఒక గుంటకు =  121  Syd

5) ఒక గుంటకు =  1089 Sft

6) ఒక స్క్వయర్ యార్డ్ కు 3 x 3 = 09

    చదరపు ఫీట్లు 

7) 121 x 09  =  1089  Sft

8) 4840 Syd x 09 = 43,560 Sft

9) ఒక  సెంట్ కు   =  48.4  Syd 

10) ఒక సెంట్ కు  =  435.6  Sft


Land servay కోసం అత్యవసరమైన information...

 Common Terminology  in Revenue Department


గ్రామ కంఠం :

గ్రామంలో నివసించేందుsకు కేటాయించిన భూమిని గ్రామ కంఠం అంటారు. ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం. ఇందులో ప్రభుత్వ సమావేశాలు, సభలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామ కంఠం భూ వివరాలు పంచాయతీ రికార్డుల్లో ఉంటాయి.


అసైన్డ్‌భూమి :

 భూమిలేని నిరుపేదలు సాగు చేసుకునేందుకు, ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన భూమి. దీనిని వారసత్వ సంపదగా అనుభవించాల్సిందే తప్ప ఇతరులకు అమ్మడం, బదలాయించడం కుదరదు.


ఆయకట్టు :

 ఒక నీటి వనరు కింద సాగయ్యే భూమి మొత్తం విస్తీర్ణాన్ని ఆయకట్టు అంటారు.


బంజరు భూమి (బంచరామి) :

 గ్రామం, మండల పరిధిలో ఖాళీగా ఉండి ప్రజావసరాల కోసం ప్రభుత్వం నిర్దేశించిన భూమి. దీనిని రెవెన్యూ రికార్డుల్లో ప్రత్యేక గుర్తులతో సూచిస్తారు.


అగ్రహారం :

 పూర్వకాలంలో బ్రాహ్మణులకు శిస్తు లేకుండా తక్కువ శిస్తుతో ఇనాంగా ఇచ్చిన గ్రామం లేదా అందులోని కొంత భాగాన్ని అగ్రహారం అంటారు.


దేవళ్‌ ఇనాం :

 దేవాలయ ఇనాం భూమి. దేవాలయాల నిర్వహణ కోసం పూజారుల పేరునగానీ, దేవాలయం పేరున కేటాయించిన భూమి.


అడంగల్‌ (పహాణీ) :

 గ్రామంలోని సాగు భూముల వివరాలు నమోదు చేసే రిజిస్టర్‌ను అడంగల్‌ (పహాణీ) అంటారు. ఆంధ్ర ప్రాం తంలో అడంగల్‌ అనీ, తెలంగాణలో పహాణీ అని పిలుస్తారు. భూమికి సంబంధించి చరిత్ర మొత్తం ఇందులో ఉంటుంది. భూముల కొనుగోలు, అమ్మకాలు, సాగు చేస్తున్న పంట వివరాలు ఎప్పటికపుడు ఇందులో నమోదు చేస్తారు.


తరి : సాగు భూమి


ఖుష్కీ : మెట్ట ప్రాంతం


గెట్టు : పొలం హద్దు


కౌల్దార్‌ : భూమిని కౌలుకు తీసకునేవాడు


కమతం : భూమి విస్తీర్ణం


ఇలాకా : ప్రాంతం


ఇనాం : సేవలను గుర్తించి ప్రభుత్వం ఇచ్చే భూమి


బాలోతా ఇనాం :

 భూమిలేని నిరుపేద దళితులకు ప్రభుత్వం ఇచ్చే భూమి


సర్ఫేఖాస్‌ : నిజాం నవాబు సొంత భూమి


సీలింగ్‌ : భూ గరిష్ఠ పరిమితి


సర్వే నంబర్‌ : భూముల గుర్తింపు కోసం కేటాయించేది


నక్షా : భూముల వివరాలు తెలిపే చిత్రపటం


కబ్జాదార్‌ : భూమిని తన ఆధీనంలో ఉంచుకుని అనుభవించే వ్యక్తి


ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ) :

 భూ స్వరూపాన్ని తెలియజేసే ధ్రువీకరణ పత్రం. 32 ఏళ్లలోపు ఓ సర్వే నంబర్‌ భూమికి జరిగిన లావాదేవీలను తెలియజేసే దాన్ని ఈసీ అంటారు.


ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ (ఎఫ్‌ఎంబీ) బుక్‌ :

 దీన్నే ఎఫ్‌ఎంబీ టీపన్‌ అని కూడా అంటారు. గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఎఫ్‌ఎంబీ ఒక భాగం. ఇందులో గ్రామంలోని అన్ని సర్వే నంబర్లు, పట్టాలు, కొలతలు ఉంటాయి.


బందోబస్తు :

 వ్యవసాయ భూములను సర్వే చేసి వర్గీకరణ చేయడాన్ని బందోబస్తు అంటారు.


బీ మెమో :

 ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న వ్యక్తి శిస్తు, జరిమానా చెల్లించాలని ఆదేశించే నోటీస్‌ను బీ మెమో అంటారు.


పోరంబోకు :

 భూములపై సర్వే చేసే నాటికి సేద్యానికి పనికిరాకుండా ఉన్న భూములు. ఇది కూడా ప్రభుత్వ భూమే.


ఫైసల్‌ పట్టీ :

 బదిలీ రిజిస్టర్‌


చౌఫస్లా :

 ఒక రెవెన్యూ గ్రామంలో ఒక రైతుకు ఉన్న వేర్వేరు సర్వేనంబర్ల భూముల పన్ను ముదింపు రికార్డు.


డైగ్లాట్‌ :

 తెలుగు, ఇంగ్లిఫ్‌ భాషల్లో ముద్రించిన శాశ్వత ఏ-రిజిస్టర్‌.


విరాసత్‌/ఫౌతి :

 భూ యజమాని చనిపోయిన తర్వాత అతడి వారసులకు భూమి హక్కులు కల్పించడం.


కాస్తు :

 సాగు చేయడం


మింజుములే :

 మొత్తం భూమి.


మార్ట్‌గేజ్‌ :

 రుణం కోసం భూమిని కుదవపెట్టడం.


మోకా :

 క్షేత్రస్థాయి పరిశీలన(స్పాట్‌ఇన్‌స్పెక్షన్‌).


పట్టాదారు పాస్‌ పుస్తకం :

 రైతుకు ఉన్న భూమి హక్కులను తెలియజేసే పుస్తకం.


టైటిల్‌ డీడ్‌ :

 భూ హక్కు దస్తావేజు, దీనిపై ఆర్డీవో సంతకం ఉంటుంది.


ఆర్వోఆర్‌ (రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్స్‌) :

 భూమి యాజమాన్య హక్కుల రిజిస్టర్‌.


ఆర్‌ఎస్సార్‌ :

 రీ సెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌ లేదా శాశ్వత ఏ రిజిస్టర్‌.


పర్మినెంట్‌ రిజిస్టర్‌ :

 సర్వే నంబర్ల వారీగా భూమి శిస్తులను నిర్ణయించే రిజిస్టర్‌. సేత్వార్‌ స్థానంలో దీన్ని ప్రవేశపెట్టారు.


సేత్వార్‌ :

 రెవెన్యూ గ్రామాల వారీగా మొదటి సారి చేసిన భూమి సర్వే వివరాలు, పట్టాదారుల వివరాలు తెలిపే రిజిస్టర్‌. ఇది 1953 దాకా అమలులో ఉంది. తర్వాత ఖాస్రా పహాణీ అందుబాటులోకి వచ్చింది.


సాదాబైనామా :

 భూ క్రయ విక్రయాలకు సంబంధించి తెల్లకాగితంపై రాసుకొనే ఒప్పంద పత్రం.


దస్తావేజు :

 భూముల కొనుగోళ్లు, అమ్మకాలు, కౌలుకు ఇవ్వడం లాంటి ఇతరత్ర లావాదేవీలను తెలియజేసే పత్రం.


ఎకరం :

 భూమి విస్తీర్ణం కొలమానం. 4840 చదరపు గజాల స్థలంగానీ, 100 సెంట్లు (ఒక సెంటుకు 48.4 గజాలు)గానీ, 40గుంటలు (ఒక గుంటకు 121 గజాలు)ను ఎకరం అంటారు. ఆంధ్రా ప్రాంతంలో సెంటు, తెలంగాణలో గుంట అని అంటారు.


అబి :

 వానకాలం పంట


ఆబాది :

 గ్రామకంఠంలోని గృహాలు లేదా నివాస స్థలాలు


అసైన్‌మెంట్‌ :

 ప్రత్యేకంగాకేటాయంచిన భూమి


శిఖం :

 చెరువు నీటి నిల్వ ఉండే ఏరియా విస్తీర్ణం


బేవార్స్‌ :

 హక్కుదారు ఎవరో తెలియకపోతే దాన్ని బేవార్స్‌ భూమి అంటారు.


దో ఫసల్‌ :

 రెండు పంటలు పండే భూమి


ఫసలీ :

 జులై 1నుంచి 12 నెలల కాలన్ని ఫసలీ అంటారు.


నాలా :

 వ్యవసాయేతర భూమి


ఇస్తిఫా భూమి :

 పట్టదారు స్వచ్ఛందంగా ప్రభుత్వపరం చేసిన భూమి


ఇనాం దస్తర్‌దాన్‌ :

 పొగడ్తలకు మెచ్చి ఇచ్చే భూమి


ఖాస్రాపహానీ :

 ఉమ్మడి కుటుంబంలో ఒక వ్యక్తి పేరుమీద ఉన్న భూ రికార్డులను మార్పు చేస్తూ భూమి పట్టా కల్పించిన పహాణీ.


గైరాన్‌ :

 సామాజిక పోరంబోకు


యేక్‌రార్‌నామా :

 ఇరు గ్రామాల పెద్దల నుంచి సర్వేయర్‌ తీసుకునే గ్రామాల ఒప్పందం..

సంతోషిస్తారు

 🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


// *శ్లోకం* //


*స్వే స్వే కిల కులే జాతే పుత్రే నప్తరి వా పునః౹*

*పితర: పితృలోకస్థా: శోచంతి చ హసంతి చ౹౹* 

*కిం తస్య దుష్కృతే౽స్మాభిః సంప్రాప్తవ్యం భవిష్యతి౹*

*కించాస్య సుకృతే౽స్మాభిః ప్రాప్తవ్యమితి శోభనమ్౹౹*


 *తాత్పర్యం:-*


*పితృలోకమందున్న పితృదేవతలు తమతమ వంశమున కుమారులు, మనుమల పుట్టుకకు వారి చెడుపనివల్ల మనమేం పొందాల్సి ఉంటుందో? అని దుఃఖిస్తారు*.... 

*అలాగే వారి మంచిపనుల వల్ల మనకేం మంచి లభిస్తుందో అని సంతోషిస్తారు....*


🧘‍♂️🙏🪷 ✍️🙏

బుధవారం, అక్టోబరు 4, 2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


బుధవారం, అక్టోబరు 4, 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - వర్ష ఋతువు

భాద్రపద మాసం - బహుళ పక్షం

తిథి:పంచమి ఉ8.56 వరకు  

వారం:బుధవారం (సౌమ్యవాసరే)

నక్షత్రం:రోహిణి రా10.41 వరకు

యోగం:సిద్ధి ఉ11.39 వరకు

కరణం:తైతుల ఉ8.56 వరకు తదుపరి గరజి రా8.52 వరకు

వర్జ్యం:మ2.35 -4.12 & తె4.28నుండి

దుర్ముహూర్తము:ఉ11.26 - 12.13

అమృతకాలం:రా7.26 - 9.04

రాహుకాలం:మ12.00 - 1.30

యమగండ/కేతుకాలం:ఉ7.30 - 9.00

సూర్యరాశి కన్య

చంద్రరాశి వృషభం 

సూర్యోదయం:5.54

సూర్యాస్తమయం: 5.46


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

 *మిట్టాపల్లి*

గొప్ప వారు.

 *1941*

*కం*

చెడులను గని చెడుచెడనుచు

పడిపడి ప్రచురించకుండ పనిగట్టుకు నా

చెడులను శుభ్రము చేసెడి

వడిగలవారలె ప్రముఖులు పదపడి సుజనా.

*భావం*:-- ఓ సుజనా! చెడులను చూసి అది చెడు అని పదేపదే చెప్పకుండా విధిగా ఆ చెడులను శుభ్రం చేసే వేగం ఉన్న వారే గొప్ప వారు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*, 

కొత్త ఆవిష్కరణ



 తల్లి ఆవు పేడ నుండి కొత్త ఆవిష్కరణ.పూర్తిగా చదవాలి.   మిస్టర్ ఉమేష్ జీ   సోఫాలో కాళ్లు పైకి లేపి కూర్చోవడం నాకు అలవాటు కాబట్టి 10 నిమిషాలకు మించి కాళ్లు కిందికి దించలేకపోతున్నాను.   నేను రోజుకు 10-15 సార్లు 10-10 నిమిషాలు ఈ ఆవు పేడ పిడకలపై నా పాదాలతో కూర్చుంటాను.    నేను సాయంత్రం 6 గంటలకు యాదృచ్ఛికంగా నా చక్కెరను తనిఖీ చేస్తున్నాను, ఇది సంవత్సరాలుగా 250 లేదా 300 వద్ద కొనసాగుతోంది.   కానీ దాదాపు 15 రోజులుగా నేను ప్రతిరోజూ పిడ్డకలపై కాళ్లతో కూర్చున్నాను.  అలా నిన్న సాయంత్రం 6 గంటలకు షుగర్ 129కి వచ్చింది.  నేను కూడా ఆశ్చర్యపోయాను ఎందుకంటే నేను గత 15 రోజులుగా షుగర్ మాత్రలు తీసుకోవడం లేదు.   షుగర్ కంట్రోల్ లోకి వచ్చింది వెంటనే బెల్లం తిన్నాను.   ఇప్పుడు పిడకలపై అడుగు పెట్టడం ద్వారా మాత్రమే చక్కెర నియంత్రణ సాధించబడుతుంది.   గత రెండు రోజుల నుంచి ముక్కులో నుంచి నీరు ఎక్కువగా వస్తోంది అంటే గడ్డకట్టిన చలి బయటకు వస్తోంది.   ఇది కూడా పిడకల ఫలితమేనని నేను నమ్ముతున్నాను.   షుగర్‌ని నియంత్రించడం వల్ల కాలేయం, మూత్రపిండాలు మరియు గుండెపై వచ్చే దుష్ప్రభావాలు కూడా తగ్గుతాయి.   ధన్యవాదాలు🙏🏻 ఏ మాత్రం నడవలేని వ్యక్తి , ప్రతి రోజు గోమయ పిడకలపైన కాళ్ళు పెట్టుకుని వున్నారు . Sugar levels తగ్గిపోయింది . ఇతనిలోని Negative energy పోయింది , చాలా అనారోగ్య సమస్యలు వాటంతట అవే తగ్గిపోతాయి .. జై గోమాత ... జై జై విశ్వమాత . 🙏

రామాయణ కల్పవృక్షం లో

ఆమెనఖాంతకాంతులవియాడెను తారకలట్లు నామె దృ సీతాంబుదముల్ పరిణామమందు భూ


స్త్రీ మృదుకజ్జలంబులు చరించెడు


నాకసమట్లు నామె చే


లామృత కాంతిసంతతి


మీ మహిళా సుతాతనువె


మిన్నఖిలంబుగ కానిపింపగన్


ఆమె యొక్క నఖ(గోళ్ళ)కాంతులు నక్షత్రాలవలె మెరిసినాయి. ఆమె యొక్క మృదువైన కంటి చూపులు అనే సంపదల యొక్క కాటుకలు ఆకాశమువలె చరిస్తున్నాయి. ఆమె యొక్క చీరచెంగు యొక్క కాంతులు అనే గంగాజలములుగా మారిపోతున్నాయి. ఆవిధంగా భూమిసుత అయిన సీతాదేవి గొప్పగా కనిపిస్తోంది. 


*అని ఈ పద్యము యొక్క భావము*

 రామాయణ కల్పవృక్షం లో విశ్వనాథ సత్యనారాయణ గారు వ్రాసిన ఈ పద్యం పూర్తిగా అర్థం కాలేదు పెద్దలెవరైనా వివరింపగలరు 🙏