4, అక్టోబర్ 2023, బుధవారం

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


-

జనమేజయా! నారదుడు చెబుతుండగా వింటున్న నాకు కుతూహలం పెరిగింది. తరవాత

ఏమి జరిగింది. పర్వతుడూ నువ్వూ శాపవిమోచనం ఎలా పొందారు, దమయంతి సంగతి ఏమిటి?

వివరంగా చెప్పమని త్వర పెట్టాను. నారదుడు కొనసాగించాడు.

వ్యాసరీ! మాయావిలాసం ఏమి చెప్పమంటావు. అలిగి పర్వతుడు అలా వెళ్ళిపోతే నేనెంతగా

దుఃఖించానో ఆ భగవంతుడికి ఎఱుక. రాకుమారి దమయంతి యథాపూర్వంగా నాకు మళ్ళీ సేవలు

చేయనారంభించింది. నేను రాజగృహంలోనే ఉండిపోయాను. ఈ శాపమేమిటి. ఈ వానర ముఖమేమిటి

అని అనుక్షణమూ దిగులుచెందాను. రేపు ఏమి జరుగుతుందో అని భయపడ్డాను.

సంజయమహారాజుగారు కూతురికి వివాహం సంకల్పించారు. కించిత్ప్రకటితయౌవన అయ్యింది.

తగిన వరుణ్ణి అన్వేషించమని మంత్రులకు పురమాయించాడు. కుల రూప ఔదార్యాది సద్గుణాలు

కలిగిన యువశూరుణ్ణి చూడమన్నాడు. మంత్రులన్నారు కదా మహారాజా! యోగ్యులైన రాకుమారులు

చాలామంది ఉన్నా, వారిలో దమయంతీదేవి ఎవరిని ఇష్టపడుతుందో తెలుసుకోండి. అతడిని పిలిచి

హస్త్యశ్వరథసంయుతంగా వివాహం జరిపిద్దాం అని.

తండ్రి చేస్తున్న వివాహప్రయత్నాలు దమయంతికి తెలిసాయి. రహస్యంగా ధాత్రిని (రాజకన్యలకు

పెంపుడు తల్లి పిలిచి తన అభిప్రాయం తెలియజేసింది. ఆ వృద్ధురాలు వెళ్ళి రాజుగారి చెవిని వేసింది.

మహారాజా! దమయంతి నాతో చెప్పింది. నీకు చెప్పమంది. మహతీవీణావాదన నిపుణుడైన ఈ

మేధావి నారదుణ్ణి వరించానంది. అతడికే ఇచ్చి వివాహం జరిపించమంది. మరింకెవరినీ పతిగా

అంగీకరించవంది. నక్రతిమింగల రహితమూ, క్షార గుణవిరహితమూ సంపూర్ణమూ రసాత్మకమూ

అయిన నారద నాదసింధువులో మునిగిపోయాను. కనక అతడే నా ప్రియుడు, అతడే నా వరుడు అని 

స్పష్టం చేసింది.

కామెంట్‌లు లేవు: