4, అక్టోబర్ 2023, బుధవారం

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 43*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 43*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*ధునోతు ధ్వాన్తం న స్తులిత దలళితేన్దీవర వనం*

*ఘనస్నిగ్ధంశ్లక్ష్ణం చికుర నికురుంబం తవ శివే |*

*యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో*

*వసన్త్యస్మి న్మన్యే  వలమథన వాటీ విటపినామ్ ‖*


ఈ శ్లోకంలో అమ్మవారి కురుల సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు శంకరులు.


ధునోతు ధ్వాంతం నః = ధ్యానిస్తే మనలోని అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తుంది ఆ కురుల సౌందర్యం.


తులిత దలితేందీవర వనం= తులిత అంటే సమానమైనది. దేనితో? ఇందీవరవనం అనగా విచ్చిన నల్లకలువల వనంతో. (కలువలకు సుగంధంతో పాటు సౌకుమార్యం కూడా ఉంటుంది)


ఘనస్నిగ్ధo శ్లక్ష్ణం= అమ్మా, నీ కురులు ఘనంగా,ఒత్తుగా వున్నవి.

 స్నిగ్ధం-నునుపుగా శ్లక్ష్ణం-మృదువుగా వున్నవి. *బర్బరాలకా* అని అమ్మవారి నామం


చికుర నికురుంబం తవ శివే = అమ్మా నీ మృదువైన కురులు


సౌరభ్యం సహజం = సహజమైన సుగంధం కలవి 


వలమథన వాటీ విటపినామ్ = ఇంద్రుని నందనవనం లోని దివ్య కుసుమాల సుగంధం

*చమ్పకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా* అని అమ్మవారి సహస్రనామాల్లో ఒకటి.


యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో వసంత్యస్మిన్ మన్యే = ఇంద్రుని ఈ దివ్య పుష్పములు నీ కురుల సహజ సుగంధము నుండి సౌరభాన్ని పొందుతున్నాయి. అందుకే ఆ దివ్య పుష్పాలు నీ కురులను అలంకరిస్తున్నాయి.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: