*1942*
*కం*
మిక్కిలి బలవర్ధకమని
కుక్కుట భ్రూణములు తినెడి కుత్సిత మతులన్
కుక్కుట శాపంబువలన
తక్కక శిక్షించు విభుడు ధరణిన సుజనా.
*భావం*:-- ఓ సుజనా! పసిగుడ్డు అనే జాలి లేకుండా మిక్కిలి బలవర్ధకమైనది అనే నెపంతో కోడిగుడ్డు లను చంపితినే కుటిలాత్ములను ఆ కోళ్ళ శాపం వలన పరమాత్మ తప్పకుండా శిక్షిస్తాడు.
*సందేశం*:-- బలహీనమైన పిల్లల పై తల్లిదండ్రులకు ఎక్కువ అభిమానం ఉండే విధంగా మూగజీవులపై భగవంతుని కి ఎక్కువ శ్రధ్ధ ఉంటుంది., కానీ దానిని చిన్న విషయం గా తీసుకుని మనుషులు మూగజీవాలను వేధిస్తే భగవంతుని శిక్ష కు పాత్రులగుదురు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి