5, ఏప్రిల్ 2022, మంగళవారం

శనీశ్వరునికి పట్టిన శని*

 *శనీశ్వరునికి పట్టిన శని* 


🕉️🕉️🕉️🕉️🕉️


 ఎవరి జాతకంలోనైనా శనీశ్వరుడు ఏడున్నర సంవత్సరాలు ఉంటే

ఆ కాలాన్ని "ఏలిన నాటి శని"

అంటారు. ఏలిన నాటి శని ప్రభావం త్రిమూర్తుల మొదలు సామాన్యుల వరకు తప్పనిసరిగా వుంటుంది.


ఒకానొక సమయంలో హనుమంతునికి కూడా శని కాలం దాపురించింది. వానరవీరులంతా రాముడికోసం సేతువు నిర్మిస్తున్న సమయం.

శనీశ్వరుడు రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు. 

అక్కడ వానరులందరూ

సేతువు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకుని వచ్చి సముద్రంలో పడవేస్తున్నారు. హనుమంతుడు పెద్ద బండలను ఏరి పెడుతున్నాడు. శ్రీ రాముడు

ఒక బండ మీద ఆశీనుడై 

పర్యవేక్షిస్తున్నాడు.

అప్పుడు శనీశ్వరుడు రామునివద్దకు వచ్చి 

" నేను హనుమంతుని పట్టుకొనే

కాలం వచ్చింది." అని

శ్రీ రాముని అనుమతి అడిగాడు.  

" నన్నెందుకు అనుమతి అడగడం.. నీ విధిని నీవు చెయ్యి " అని

అన్నాడు శ్రీ రాముడు.


హనుమంతుని వద్దకు వెళ్ళి శని " నేను నీ వద్ద ఏడున్నర సంవత్సరాలు ఉండబోతున్నాను." అన్నాడు శనీశ్వరుడు. 


"నేను రామ కార్యంలో నిమగ్నమైయున్నాను ఇపుడంత కాలం కుదరదన్నాడు హనుమంతుడు .

" సరి , ప్రస్తుతానికి ఏడున్నరమాసాలు వుంటాను ,సరేనా " అన్నాడు. అందుకు హనుమ ఒప్పుకోలేదు.

...ఏడున్నర వారాలు .. అంటూ

కాల ప్రమాణం తగ్గించుకుంటూ వచ్చాడు 

శనీశ్వరుడు .

హనుమంతుడు , రామనామం ఆపకుండా

జపిస్తూనే చివరకు ఒక ఏడు క్షణాల కాలం తనను పట్టుకోవాలసిందిగా కోరాడు. 

అప్పుడు శనీశ్వరుడు "నీ కాళ్ళలో ప్రవేశించనా" 

అని అడిగాడు. 

హనుమంతుడు "వద్దు ...

సేతువు కట్టడానికి రాళ్ళను తేవాలి .. పరిగెత్తాలన్నా, నడవాలన్నా కాళ్ళు అవసరం"

అన్నాడు.

" సరి, నీ చేతులు పట్టుకోనా"

అన్నాడు శనీశ్వరుడు .

ఆ రాళ్ళని చేతులతోనే కదా మోసిబి

తెస్తున్నాను. చేతులు పట్టుకోవద్దు. అన్నాడు

హనుమంతుడు. 

"అయితే, నన్ను ఏం చెయ్యమంటావు? 

నీ భుజాల పైన ఎక్కమంటావా" అన్నాడు

శనీశ్వరుడు. 


"రామలక్ష్మణులను నా భుజాల మీద ఎక్కించుకుని వెడుతున్నాను. అందువలన

భుజాలు ఎక్కడానికి వీలులేదు " అన్నాడు హనుమంతుడు. 


" పోనీ, నీ హృదయం లో వుండవచ్చునా?"

అని అడిగాడు శనీశ్వరుడు.


"ఈ హృదయంలో, మహాలక్ష్మీరూపిణి అయిన సీతాదేవి,

నా దేవుడైన 

శ్రీరాముడు

నిరంతరంగా నివసిస్తూ వున్నారు ...అక్కడ నీకు

చోటు లేదు. " అన్నాడు

హనుమ.


" సరే , చివరకు నీ శిరస్సు ఒక్కటే

ఖాళీగా వున్నది. అక్కడే వుంటాను "అని

శనీశ్వరుడు , హనుమంతుని శిరస్సు

పైన ఎక్కి కూర్చున్నాడు.


హనుమంతుడు ఒక పెద్ద బండరాయిని తన శిరస్సు పై( అంటే శనీశ్వరుని

మీద) పెట్టుకుని ఒక్కొక్క బండను సముద్రంలో వేయడం మొదలెట్టాడు.

ఆ బండరాళ్ళ బరువును మోయలేక

శనీశ్వరుని కళ్ళుతేలేసాడు. మరో పెద్ద బండరాయిని హనుమ తన శిరస్సుపై పెట్టుకోగానే, 

శనీశ్వరునికి ఊపిరి సలపక

గిలగిలలాడాడు. హనుమంతుడు ఆ రాయిని

సముద్రంలో వేసిన మరుక్షణమే

శనీశ్వరుడు హనుమ శిరస్సుపైనుండి కిందకి దూకేశాడు. 


" మారుతీ, నీ వల్ల నాకు శ్రీ రాముని సేవించుకునే

భాగ్యం కలిగినది . నీవు సకల శక్తులకు అతీతుడవైన రామభక్తుడవు. నీముందు నా శక్తిచాలదు. నిన్ను నేను పట్టలేను, నన్ను వదిలిపెట్టు మహానుభావా" 

అంటూ చేతులెత్తేసి ఒకే పరుగుపెట్టాడు శనీశ్వరుడు. 

హనుమంతుని ముందా కుప్పిగంతులు!


నిర్మల భక్తితో , నిశ్చల మనస్సుతో శ్రీ రాముని సేవలో నిమగ్నమైయున్న ఎవరిని కూడా శనీశ్వరుడు

 రెండు క్షణాలు కూడా

పట్టుకొనలేడు.  

 పరిపూర్ణమైన నమ్మకంతో నిరంతరం

శ్రీరామనామం జపిస్తే కష్టాల నుండి

విముక్తి కలిగి తీరుతుంది.


*జై శ్రీరామ్ 🚩* 


*జై హనుమాన్ 🚩*

దేవతలు వాహనములు

 *దేవతలు వాహనములు*

1) విష్ణువు –గరుడుడు

2) లక్ష్మీదేవి –గుడ్ల గూబ

3) రతి మన్మదులు=కీరం(చిలుక)

4) హనుమంతుడు=ఒంటే

5) శివుడు =వృషభం

6) పార్వతి దేవి=సింహం

7) వినాయకుడు=మూషికం

8) కుమారస్వామి=నెమలి

9) బైరవుడు=శునకం

10) బ్రహ్మ=హంస

11) సరస్వతి=హంస

12) అశ్వినినులు=కంచర గాడిదలు

13) రావణుడు=గాడిదలు.

14) లలితాదేవి=వరాహం (కిరిచక్ర రధారూఢ)

15) శీతలా దేవి=గాడిద

16) గంగాదేవి=మకరం

17) యమునాదేవి=కూర్మం

18) అయ్యపస్వామి=తురగ (అశ్వం )

19) కాలునుకి=మహిషం

20) నముచి=ఉచ్చైశ్రవము

21) అలమేలుమంగ అమ్మవారు=చాతకం

22) వాస్తుపురుషుడు=గండభేరుండం

23) కల్కి=గుఱ్ఱం

24) చండి=వరాహం

25) చాముండి=గుడ్లగూబ

26) విశ్వకర్మ=నక్క 

27) మానసా దేవి=సర్పం

28) ఇంద్రుడు=ఐరావతం

29) అగ్ని=మేషం/గొర్రె 

30) యముడికి=మహిషం

31) నైరుతి=శవ వాహనం

32) వరుణుడు=మకరం

33) వాయువు=కృష్ణ మృగం

34) కుబేరుడు=నర వాహనం

35) ఈశానుడు=వృషభం

36) సూర్యుడు=సప్త అనే పేరు గల అశ్వం

37) చంద్రుడు=జింక/10 శ్వేత అశ్వములు 

38) కుజుడు=మేషం

39) బుధుడు=గుఱ్ఱం

40) గురుడు=ఏనుగు

41) శుక్రుడు=గుఱ్ఱం / మకరం

42) శని=కాకి

43) రాహువు=పులి

44) కేతువు=చేప

 *సంకలనం:-గొడవర్తి సంపత్కుమార్ అప్పలాచార్య*🥭🥭🌺🌺

స్వధర్మమును అనుష్ఠించుటయే

 శ్లో॥ వేదోదితం స్వకం కర్మ నిత్యం కుర్యాదతంద్రితః |

తద్ధి కుర్వన్ యథాశక్తి ప్రాప్నోతి పరమాంగతిమ్ ||

 (వ్యాసః) వైదికము, సనాతనము, ధర్మశాస్త్ర సమ్మతము అగు స్వధర్మమును అనుష్ఠించుటయే సర్వేశ్వరుడు, సర్వశక్తిమంతుడు అగు భగవంతుని మహత్తరమైన సపర్య అనగా అతని పూజయే అగును. అది మానవునికి శ్రేయమును అనగా మేలును, శుభమును చేకూర్చును. అందుకే గీతలో భగవానుడు స్వయంగా అంటాడు - 'స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః | (18–46) (తన స్వధర్మాచరణముద్వారా పరమేశ్వరుని పూజించుటవలన మానవుడు పరమసిద్ధిని పొందును.) ఇందువల్లనే నిత్యములు, నైమిత్తికములు అనెడు కర్మలను ఆచరించుట ప్రతివ్యక్తికి పరమధర్మమనియు, ముఖ్యకర్తవ్యమనియు వేదాది సమస్త శాస్త్రములయందు చెప్పబడియున్నది. ప్రతి వ్యక్తికి మూడు విధములగు ఋణములు ఉండును- 1. దేవఋణము 2. ఋషిఋణము 3. పితృ ఋణము “యత్కృత్వా నృణ్యమాప్నోతి దైవాత్ పైత్ర్యాచ్చ మానుషాత్ '' అని చెప్పినట్లుగా నిత్యకర్మలను చక్కగా ఆచరించుటవలన మానవుడు ఈ త్రివిధ ఋణములనుండి విముక్తుడై పోవును.


తమ జీవితపర్యంతము అత్యంత శ్రద్ధాభక్తులతో ప్రతినిత్యము యథాధికారముగా స్నానము, సంధ్యా, గాయత్రీజపము, దేవతార్చనము, వైశ్వదేవ-బలి, స్వాధ్యాయము ఇత్యాది నిత్యకర్మలను ఎవరు ఆచరించెదరో, వారి బుద్ధి ఆత్మయందు నిశ్చలమగును. బుద్ధి ఆత్మనిష్ఠమైన మీదట నెమ్మది - నెమ్మదిగా మనిషి బుద్ధిలోగల భ్రాంతి, జడత్వము, వివేకహీనత, అహంకారము, సంకోచము మరియు భేదభావము నశించిపోవును. అప్పుడు ఆ వ్యక్తి పరమాత్మచింతనలో నిమగ్నుడగును. తదనంతరము అతడు అహర్నిశములు పరబ్రహ్మయగు పరమేశ్వరుని సాక్షాత్కారమును పొందుటకై ప్రయత్నము చేయుచుండును. తద్వారా అతనికి పరమానందము యొక్క అనుభూతి కలుగుచుండును. పరమానందముయొక్క అనుభూతి లభించిన మీదట ఆ వ్యక్తికి పరమాత్మ యొక్క వాస్తవికమైన తత్త్వజ్ఞానము యొక్క పరిజ్ఞానము అనుభవమునకు వచ్చును. అప్పుడతడు శాశ్వతమైన


జీవన్ముక్త స్థితిని చేరుకొనును. చివరగా, 'సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ'లో పరినిష్ఠితుడై ఆత్మోద్ధరణము గావించుకొనును. ఇదియే విశిష్టమైన మానవజీవితమునకు సర్వోత్కృష్టమగు సార్థకత. కావున మానవజన్మమును సఫలమొనర్చుట కొరకై మానవమాత్రుడైన ప్రతివ్యక్తి నిత్యకర్మలను నియమానుసారముగా ఆచరింపవలయును.


నిత్యకర్మలలో కొన్నింటిని ప్రతివ్యక్తి సంతోషపూర్వకంగా నియమితరూపంగా చేయవలసివచ్చును. ఉదా: శౌచాది క్రియలు, స్నానము, భోజనము, శయనము మున్నగునవి. అయితే ఈ కర్మలన్నియును శాస్త్రమర్యాదను అనుసరించి జరుగవలయును. అప్పుడే అవి ధర్మాచరణముగా రూపాంతరమునొందును. జీవితంలోని అతిసామాన్యమైన, సర్వసాధారణమైన క్రియా-కలాపములనుగూర్చి కూడా శాస్త్రములు చక్కగా వివేచనము చేసి, ఒక నియతముగా తమ సమ్మతిని ప్రకటించినవి. ఉదయము నిద్రనుండి మేల్కొనుట ఎప్పుడు? మేల్కొనిన తర్వాత మొట్టమొదటగా ఏమి చేయాలి? ఇందుకుగాను శౌచము, దంతధావనము, క్షౌరము, తైలాభ్యంగము, స్నానము, వస్త్రధారణము, భోజనము, శయనము మొదలగు వాటినన్నింటిని గూర్చిన విధి-నిషేధములను తెలియజేసినవి. కావున శాస్త్ర మర్యాదను

అనుసరించి జీవనమును కొనసాగించుటయే శ్రేయపథమునకు దిక్సూచియగును.

జనకుని వంశ వంశవృక్షము

 🕉️✡️🕉️✡️🕉️✡️🕉️✡️🕉️🕉️✡️


*రఘవంశ మరియు జనకుని వంశ వంశవృక్షము.*



శ్రీరామ నవమిలో "శ్రీ సీతారాముల కల్యాణోత్సవం" సందర్భంగా ఇరువురి వంశ వృక్షాన్ని తెలియచేసారు.



🙏 *రఘువంశ వర్ణన* 🙏

(దశరథ మహారాజు పూర్వీకులు)

చతుర్ముఖ బ్రహ్మ

మరీచి --> 

కశ్యపుడు --> 

సూర్యుడు --> 

మనువు --> 

ఇక్ష్వాకుడు --> 

కుక్షి --> 

వికుక్షి -> 

భానుడు --> 

అనరంయుడు --> 

పృథుడు --> 

త్రిశంకువు --> 

దుందుమారుడు -> 

మాంధాత --> 

సుసంధి కి ఇద్ధరు ధృవసంధి, ప్రసేనజిత్‌ 

ధృవసంధి->

భరతుడు --> 

అశితుడు --> 

సగరుడు --> 

అసమంజసుడు --> 

అంశుమంతుడు --> 

దిలీపుడు --> 

భగీరతుడు --> 

కకుత్సుడు --> 

రఘువు --> 

ప్రవృద్ధుడు --> 

శంఖనుడు --> 

సుదర్శనుడు --> 

అగ్నివర్ణుడు --> 

శీఘ్రకుడు --> 

మరువు --> 

ప్రశిశృకుడు --> 

అంబరీశుడు --> 

నహుశుడు --> 

యయాతి --> 

నాభాగుడు --> 

అజుడు --> 

దశరథుడు --> 

రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నుడు.



🙏 *జనకుని వంశ వర్ణన*🙏

(జనక మహారాజు పూర్వీకులు)

నిమి చక్రవర్తి --> 

మిథి --> 

ఉదావసువు --> 

నందివర్దనుడు --> 

సుకేతువు --> 

దేవరాతుడు --> 

బృహధ్రతుడు కి ఇద్ధరు శూరుడు, మహావీరుడు.

మహావీరుడు --> 

సుదృతి --> 

దృష్టకేతువు --> 

హర్యశృవుడు --> 

మరుడు --> 

ప్రతింధకుడు --> 

కీర్తిరతుడు --> 

దేవమీదుడు --> 

విభుదుడు --> 

మహీద్రకుడు --> 

కీర్తిరాతుడు --> 

మహారోముడు --> 

స్వర్ణరోముడు --> 

హ్రస్వరోముడు కి ఇద్దరు. జనకుడు, కుశద్వజుడు. 

జనకుడు --> సీత, ఊర్మిళ 

కుశద్వజుడు --> మాంఢవి, శృతకీర్తి

శ్రీరామనవమి "శ్రీ సీతారాముల కళ్యాణోత్సవము" జరుగుతున్న శుభ సందర్భంగా...వేదపండితులు ఉచ్చరించే కళ్యాణ ప్రవరలు.

👏శ్రీరామ ప్రవర:-

చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. 

వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ, 

నాభాగ మహారాజ వర్మణో నప్త్రే...

అజ మహారాజ వర్మణః పౌత్రాయ...

దశరథ మహారాజ వర్మణః పుత్రాయ..

శ్రీరామచంద్ర స్వామినే కన్యార్ధినే వరాయ.

👏సీతాదేవి ప్రవర:-

చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు

ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం...

స్వర్ణరోమ మహారాజ వర్మణో నప్త్రీం..

హ్రస్వరోమ మహారాజ వర్మణః పౌత్రీం...

జనక మహారాజ వర్మణః పుత్రీం...

సీతాదేవి నామ్నీం వరార్ధినీం కన్యాం...

👉ఈ వివరాలు తెలుసుకున్న వారికి, తెలియజేసినవారికి వంశాభివృద్ధి..గోత్రాభివృద్ధి కలుగుతుంది.

 లవకుశుల_తర్వాత_అయోధ్య_ను_ఎవరు పాలించారు?


మహాభారత యుధ్ధం లో రఘువంశ (సూర్య) రాజులు ఎవరైనా పాల్గొన్నారా?


రాముని వంశవృక్షం అని ఈమధ్య మనందరికీ సుపరిచితమైన విషయానికి కొనసాగింపే ఈ వ్యాసం... 


రామునికి లవకుశులు కవల పిల్లలని ఆయన తర్వాత వారే రాజ్యపాలన చేశారని మనందరికీ తెలుసు. ఆ తర్వాత ఎవరనేది తెలుసుకునే ప్రయత్నం.


రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నలకు ఇద్దరేసి సంతానం కలరు.


వారు ......


1⃣ రాముడు     -  లవ , కుశ

2⃣ లక్ష్మణుడు   -  చిత్రాంగదుడు , చంద్రకేతు

3⃣ భరతుడు     -  తున్నీలుడు , పుష్కరుడు

4⃣ శతృఘ్నుడు -  సుబాహు , శోరశేణుడు.


రాముని తర్వాతి తరం :-

""""""""""""""""""""""""""""""

రాముడు

కుశుడు

అతిథి

నిషాధ

నల

నభస

పుండరీక

క్షేమధన్వ

దేవనిక

అహినాగు

పరిపత్ర

దల

ఉన్నాభ

వజ్రనాభ

శంఖణ

వ్యుషిత్సువ

విష్వసాహ

హిరణ్యనాభ

కౌసల్య

బ్రహ్మిష్ఠ

పుత్ర

పుష్య

ధృవసంధి

సుదర్శన

అగ్నివర్ణ


కాళిదాస విరచిత " రఘువంశం " లో ఇంతటితో ముగుస్తుంది.


తర్వాతి వివరణ " పద్మపురాణం " లో దొరుకుతుంది.


అగ్నివర్ణ

మరు

ప్రసృత

సుసంధి

అమర్ష & సహస్వంత

విశృశ్వంత (అమర్ష)

బృహద్బల


బృహధ్బలుడు :-

"""""""""""""""""""""

మహాభారత యుధ్ధ సమయానికి ఇతను మధ్య & దక్షిణ కోసల రాజ్యాన్ని పాలించేవాడు.

ఇతను పాండవులకు వ్యతిరేకంగా పోరాడి అభిమన్యుడి చేతిలో మరణిస్తాడు. భీష్ముని ప్రకారం ఇతను రథుడు మాత్రమే.


బృహధ్భలుడు

బృహత్క్షయ

ఊరుక్షయ

వాతక్షయ

ప్రతివ్యోమ

దివాకర

సహదేవ

బృహదశ్వ

భానురథ

ప్రతితశ్వ

సుప్రతీక

మరుదేవ

సునక్షత్ర

కిన్నెర

అంతరిక్ష

సువర్ణ

సుమిత్రఅమిత్రజిల

ధర్మిన

కృతంజీవ

సంజయమహాకోశల

ప్రసేనజిత

క్షుద్రక

కులక

సురథ

సుమిత్ర


సుమితృడు :-

""""""""""""""""""

ఇతను రఘువంశ రాజులలో ఆఖరివాడు. 

ఇతను నంద వంశ & మగధ దేశ రాజు మహాపద్మనందుని చేతిలో ఓడిపోతాడు.

దీనితో రఘువంశరాజుల పాలన సమాప్తమవుతుంది.


ఈ నందులను ఓడించి చంద్రగుప్తమౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు.


శల్యుడు :-

""""""""""""

లవకుశుల తరంలోని వాడైన మద్రదేశాధిపతి అయిన శల్యుడు కుడా పాండవులకు వ్యతిరేకంగా యుధ్ధం చేస్తాడు.

ఇతను నకుల,సహదేవుల మేనమామ, తల్లి అయిన మాద్రి సహోదరుడు.


బృహధ్బలుడు :-

"""""""""""""""""""""

మహాభారత యుధ్ధ సమయానికి ఇతను మధ్య & దక్షిణ కోసల రాజ్యాన్ని పాలించేవాడు.

ఇతను పాండవులకు వ్యతిరేకంగా పోరాడి అభిమన్యుడి చేతిలో మరణిస్తాడు. 


 నాడు - నేడు :- 

""""""""""""""""""""

➡ భరతుడు తక్షశిల ను ఏర్పాటు చేస్తాడు.

ప్రస్తుతం పాకిస్థాన్ లోని పంజాబ్ రాష్ట్రం లో ఇస్లామాబాద్ సమీపం లో ఉంది.


➡ లక్ష్మణుడు లక్ష్మణపురి ని ఏర్పాటు చేస్తాడు.అదే నేటి  ఉత్తరప్రదేశ్ లోని లక్నో. 


➡ శతృఘ్నడు మధువనం అడవిలో నగరాన్ని ఏర్పాటు చేస్తాడు. అదే నేటి  ఉత్తరప్రదేశ్ లోని మధుర. 


➡ లవకుశులు జన్మించిన వాల్మీకి అశ్రమం నేడు రామతీర్ధం . పంజాబ్ లోని అమృత్ సర్ సమీపం లో కలదు. 


➡ లవుడు దక్షిణ కోసల రాజ్యాన్ని పాలిస్తాడు. నేడు ఛత్తీస్ ఘడ్ లోని భిలాస్ పూర్ ప్రాంతం గా చెప్తారు.


➡ కుశుడు శ్రావస్తి నగర కేంద్రం గా ఉత్తర కోసల రాజ్యాన్ని పాలిస్తాడు.

నేడు ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ & ఖుషి నగర్ ప్రాంతం. 


➡ థాయ్ ల్యాండ్ లోని లావోస్ నగరం కూడా లవుని పేరు మీదుగా   ఏర్పడినదే. 

బ్యాంకాక్ సమీపంలో కల లబ్ పురి ని తక్షశిల రాజైన కలవర్నదిశుడు ఏర్పాటు చేశారని అంటారు. 


మహాభారత  కాలానికి కోసలరాజ్యం 5 భాగాలుగా విభజించబడింది.


మధ్య,తూర్పు, దక్షిణ - మగధ రాజ్యం గా జరాసంధుడు పాలించేవాడు.


*రాముడి వంశ వృక్షo*


*బ్రహ్మ కొడుకు మరీచి*


*మరీచి కొడుకు కాశ్యపుడు.*


*కాశ్యపుడు కొడుకు సూర్యుడు.*


*సూర్యుడు కొడుకు మనువు.*


*మనువు కొడుకు ఇక్ష్వాకువు.*


*ఇక్ష్వాకువు కొడుకు కుక్షి.*


*కుక్షి కొడుకు వికుక్షి.*


*వికుక్షి కొడుకు బాణుడు.*


*బాణుడు కొడుకు అనరణ్యుడు.*


*అనరణ్యుడు కొడుకు పృధువు.*


*పృధువు కొడుకు త్రిశంఖుడు.*


*త్రిశంఖుడు కొడుకు దుంధుమారుడు.(లేదా యువనాశ్యుడు)*


*దుంధుమారుడు కొడుకు మాంధాత.*


*మాంధాత కొడుకు సుసంధి.*


*సుసంధి కొడుకు ధృవసంధి.*


*ధృవసంధి కొడుకు భరతుడు.*


*భరతుడు కొడుకు అశితుడు.*


*అశితుడు కొడుకు సగరుడు.*


*సగరుడు కొడుకు అసమంజసుడు.*


*అసమంజసుడు కొడుకు అంశుమంతుడు.*


*అంశుమంతుడు కొడుకు దిలీపుడు.*


*దిలీపుడు కొడుకు భగీరధుడు.*


*భగీరధుడు కొడుకు కకుత్సుడు.*


*కకుత్సుడు కొడుకు రఘువు.*


*రఘువు కొడుకు ప్రవుర్ధుడు.*


*ప్రవుర్ధుడు కొడుకు శంఖనుడు.*


*శంఖనుడు కొడుకు సుదర్శనుడు.*


*సుదర్శనుడు కొడుకు అగ్నివర్ణుడు.*


*అగ్నివర్ణుడు కొడుకు శ్రీఘ్రవేదుడు.*


*శ్రీఘ్రవేదుడు కొడుకు మరువు.*


*మరువు కొడుకు ప్రశిష్యకుడు.*


*ప్రశిష్యకుడు కొడుకు అంబరీశుడు.*


*అంబరీశుడు కొడుకు నహుషుడు.*


*నహుషుడు కొడుకు యయాతి.*


*యయాతి కొడుకు నాభాగుడు.*


*నాభాగుడు కొడుకు అజుడు.*


*అజుడు కొడుకు ధశరథుడు.*


*ధశరథుడు కొడుకు రాముడు.*


*రాముడి కొడుకులు లవ కుశలు . .*


ఇది రాముడి వంశ వృక్షo

         🏹.జైశ్రీరామ్🏹

యశస్సును కీర్తిని గలవాడు

 ✡️🕉️ *సుభాషితమ్* 🕉️✡️

--------------------------------------------


శ్లోకం:

*జీవతి యశో యస్య*

*కీర్తిర్యస్య స జీవతి|*

*అయశోఽకీర్తి సంయుక్తో*

*జీవన్నపి మృతోపమః||*

                 ~సుభాషితరత్నావళి


తాత్పర్యం:

యశస్సును కీర్తిని గలవాడు జీవించినవాడగును.అయశస్సు ,అకీర్తితో కూడిన వాడు జీవించియున్నను మరణించిన వానితో సమానము.యశస్సు అనగా పరాక్రమధైర్యసాహసముల వలన కలిగేది.కీర్తి అనగా దానధర్మాదుల వలన కలిగేది.

ఉపవాసం ఉన్న పులి

 *ॐ卐 _-||- సుభాషితమ్||-_ ॐ卐*


శ్లో𝕝𝕝 దుర్జనస్య విశిష్టత్వం 

పరోపద్రవ కారణం|

ఉపోషితస్య వ్యాఘ్రస్య

పారణం పశుమారణమ్||


తా𝕝𝕝 *దుర్జనుడు సౌమ్యంగా ప్రవర్తిస్తున్నాడంటే, అది  పరులకు మరింత హాని చేయటానికే*.... 

ఉపవాసం ఉన్న పులి చేసే పారణం, 

(ఉపవాసానంతర భోజనం) 

పశు మారణమే కదా!!!!!

అక్రమ మార్గం

       *🌷అక్రమ మార్గం🌷*

   (కొచ్చెర్లకోట జగదీశ్ గారి కథనం)

                🌷🌷🌷 

స్కూల్లో ఐఐటీ బ్రిడ్జ్ కోర్సు, నీట్ క్రాష్ కోర్సంటూ నేర్పించే మాస్టర్లు క్లాసయిపోయాక సైకిలు మీద పిల్లాడెలా వెళ్లాలో నేర్పించరు. 


అపసవ్య దిశలో సైకిళ్లమీద, బైకులమీద ఇష్టానుసారంగా వచ్చేస్తూ కార్లకీ, బస్సులకీ అడ్డంపడిపోతూ, ఒక్కొక్కసారి యాక్సిడెంటుకి కూడా లోనవుతూ ఉంటారు. 


రాత్రివేళ ఊరు నిద్రపోతుండగా రోడ్లమీద జనసమ్మర్దం తగ్గినప్పుడు దగ్గరుండి మరీ పిల్లలకు సైకిల్ తొక్కడం నేర్పుతాడు నాన్న. ఎందుకటా? ఎటువంటి ప్రమాదమూ కలగకూడదని. 


తీరా నేర్పించిన తరవాత వాడికి ఎడాపెడా తొక్కడం వచ్చేస్తుంది. ఎలాకావాలంటే అలా తొక్కడమే కాకుండా ఎటుపడితే అటు, ఏ దారి దగ్గరైతే ఆ దారమ్మట వెళిపోవడం కూడా వచ్చేస్తుంది.


ఇక ఏ ప్రమాదమూ లేనట్టే! ఉంటేగింటే తనవల్ల ఊళ్లోవాళ్లకి ఇబ్బందే తప్ప! 


బండిమీద ముందొకరినీ, వెనకాల మరో ఇద్దరినీ ఎక్కించుకుని, స్కూల్ బ్యాగులని ముందు కుక్కేసి, రాంగ్ సైడ్ నడుపుతూ స్కూలుకి పిల్లల్ని దింపే అంకుళ్లూ ఆంటీలూ పొద్దున్న లేస్తే వాట్సప్‌లో సూక్తులూ, సూత్రాలూ బోధిస్తారు. 


కొణిదెల నీహారికని అలా పెంచకూడదని, గల్లా సిద్ధార్ధగాడికి డబ్బెక్కువైందనీ తీర్పులిచ్చేస్తారు. ఆర్యన్‌ఖాన్ అసలెందుకలా తయారయ్యాడో నెంబర్లేసి మరీ కారణాలు చెబుతారు.


అక్రమ మార్గమంటే కేవలం మాదకద్రవ్యాలు మాత్రమే కాదు. పిల్లలకి క్రమమైన మార్గం ఏదో చెప్పకపోవడం కూడా! 


రోజూ సాయంత్రం ఆరింటికి బయలుదేరి ఏడుకిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్‌కి వెళతాను. దాదాపు పదిపన్నెండు  మద్యం దుకాణాలు, వాటిముందు ఈగల్లా జనం, రోడ్డుమీద ఎక్కడబడితే అక్కడ వాహనాలు అడ్డదిడ్డంగా పెట్టేసి షాపు ముందు మాత్రం పద్ధతిగా క్యూలో నిలబడే కుర్రాళ్లు, అంకుళ్లు వందల్లో ఉంటారు.


మద్యం చట్టబద్ధమే కాదు, చవక కూడా.


మాదకద్రవ్యాలు చట్టవ్యతిరేకమే కాదు, చాలా ఖరీదు కూడా!


అంతే తేడా! 


ఒకవేళ అదే గంజాయి ప్యాకెట్లు చవకగా, విచ్చలవిడిగా వీధుల్లో అమ్మితే ఎగబడి కొనుక్కునేది మన పిల్లలే! ఈ అంకుళ్లే!


అంచేత....


డబ్బున్న మారాజుల పిల్లలకు వాటిని లోపలికి తీసుకోవడం ఎలా తెలుసో, వాళ్ల తల్లిదండ్రులకు వారిని బయటకు ఎలా తీసుకురావాలో కూడా తెలుసు. 


బెంగపడకండి.


........కొచ్చెర్లకోట జగదీశ్

నియమం లేదు.

 🕉️ *సుభాషితమ్* 🕉️


శ్లో.

*న వ్యాప్తిరేషా గుణినో గుణవాన్ జాయతే ధ్రువమ్।*

*చన్దనోఽనలసన్దగ్ధో న భస్మ సురభిః క్వచిత్॥*

                ~దృష్టాన్తకలికా శతకమ్.


తా.

"గుణవంతునికి నిశ్చయంగా గుణవంతుడైనవాడే (కొడుకు) పుడతాడు అని ఎక్కడా నియమం లేదు. చందనం నిప్పు చేత కాలుతుంది. (కానీ దాని) భస్మం సువాసనగా ఉండదు".

తల్లి,తండ్రికి నమస్కారం vచేస్తే...

 తల్లి… పరమోన్నతమైన దైవం.

భూప్రదక్షిణ షట్కేన

కాశీయాత్రాయుతేనచ


సేతుస్నాన శతైర్యశ్చ

తత్ఫలం మాతృవందనే


భూప్రదక్షిణలు, కాశీయాత్రలు, సేతుస్నానాలు ఇచ్చే పుణ్యఫలం ఎంతో, మాతృవందనం కూడా అంత పుణ్యఫలాన్ని ఇస్తుంది.


ఉపాధ్యాయాన్ దశాచార్య ఆచార్యాణాం శతం పితా

సహస్రస్తు పితృన్మాతా గౌరవేణాతిరిచ్యతే (మనువు)


పదుగురు ఉపాధ్యాయులకన్న ఒక వంశాచార్యుడు అధికుడు,

 అట్టి కులగురువులు నూరుగురి కన్న ఒక తండ్రి అధికుడు,

 అట్టి వేయి మంది తండ్రులకన్న *తల్లి అధిక పూజ్యురాలు*. అంతేకాదు 

‘‘న మాతుః పరదైవతమ్’’ (తల్లికి మించిన దైవం లేదు) అని శాస్త్రాలు చెబుతాయి.


మహనీయులందరూ ఆచరించి ఆదర్శంగా నిలుస్తారు.

*భగవాన్ రమణమహర్షి తల్లి అళగమ్మ. ధర్మాత్మురాలు, భక్తురాలు. ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదలి వెళ్లి పోయిన కొడుకు విషయమై ఎంతో దుఃఖించింది. చివరికి ఆ కుమారుని ఆచూకీ తెలిసికొని వచ్చింది. జడలు కట్టిన జుట్టుతో, కృశించిన దేహంతో ఉన్న కుమారుని చూసి కుమిలిపోయింది. ఇంటికి తిరిగి రమ్మని బతిమాలింది. తన కోరిక నెరవేరదని తెలిసికొని వెనుతిరిగింది. ఎంతో మానసిక క్షోభను అనుభవించింది. భర్త గతించిన తరవాత తన కుమారుని వద్దకు చేరింది. ఎందరెందరో దేశవిదేశీయులు తన కొడుకు సమక్షంలో అలౌకిక ఆనందాన్ని పొందటం కళ్లారా చూసింది. *అంతటి మహనీయుడిని లోకానికి ప్రసాదించిన తల్లిగా గౌరవం పొందింది*. 


తల్లిపట్ల మహర్షి శ్రద్ధ, ప్రేమ సాటిలేనివి.

దాదాపు చివరి దశలో ఆరు సంవత్సరాలు తన వద్దనే ఆమె ఉండటానికి అంగీకరించారు. *స్కందాశ్రమంలో* ఉన్నప్పుడే ఆమె తీవ్రమైన అనారోగ్యానికి గురయింది. భగవాన్ ఆమె వద్దనే ఉండి ఆమెకు ఆనందం కలిగించాడు. చివరి క్షణాల్లో తన దివ్య హస్తాలను ఆమె తలపైన, హృదయం పైన ఉంచి జన్మజన్మల కర్మను నశింపచేసి ఆమెకు ముక్తి కలిగించాడు. ఆమె దేహాన్ని అరుణాచల పాదం వద్ద ఖననం చేశారు. తల్లిగారి సమాధిపై ఆలయాన్ని నిర్మిస్తున్న సమయంలో మహర్షి ఎంతో శ్రద్ధను చూపారు. ఇటుకలను మోశారు. ఆ గుడికి సంబంధించిన ప్రతి కార్యక్రమానికి వెళ్లారు. ఎంతటి జ్ఞానికైనా తల్లి దైవమేనని ఆచరణ ద్వారా బోధించారు.


ప్రతిరోజూ తల్లి,తండ్రికి నమస్కారం vచేస్తే... జన్మ జన్మల ప్రారబ్దం వల్ల ఉన్న చెడు నశించును

విశ్వగురువులు

 విశ్వగురువులు


గత కొన్ని సంవత్సరాలుగా నేను, మా కుటుంబం మొత్తం పరమాచార్య స్వామివారి భక్తులం. ఆచార్యులకు, మాకు మధ్యన ఒక దృఢమైన బంధం ఏర్పడిందని నేను ఖచ్చితంగా చెప్పగలను. గత కొద్ది నెలలుగా మహాస్వామి వారి గురించి ఎందఱో ఎన్నో విషయాలను పంచుకున్నారు. స్వామివారి దర్శనానికి కంచి మఠానికి వెళ్ళినప్పుడు నాకు కలిగిన కొన్ని అనుభవాలను, నాపై, నా కుటుంబ సభ్యులపై స్వామివారు కురిపించిన అనుగ్రహాన్ని తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. అంతటి నిర్మలమైన, ప్రశాంతమైన మోమును నేను ఎప్పుడూ చూడలేదు. కేవలం కరుణను, ప్రసన్నతను ప్రసరించే మోము అది. దయను వర్షించే అయస్కాంతం లాంటి ఆ కళ్ళు ఎందరినో ఆదరించడం నన్ను కదిలించివేసింది.


ఇటువంటి సందర్భంలో కంచి మఠానికి, ఆచార్యులకు మమ్మల్ని దగ్గర చేసిన ఒకట్రెండు విషయాలను ప్రస్తావించబోతున్నాను. ఏ సామాజిక విషయాలు అయితే మాట్లాడడానికి అయిష్టపడతానో, అవి నేను సమాజంలో మాట్లాడడానికి అయిష్టపడాలి. అయితే పరమాచార్య స్వామివారు ఏమి చేసినా అది భక్తులను అశీర్వదించడానికే కాబట్టి నేను మాట్లాడాలి. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరొక్క విషయం, ఎవరైనా ఎంతటి కష్టమైన పని అయినా మఠం కోసం చెయ్యాలని తలపెడితే, అందుకు స్వామివారి ఆశీస్సులు పుష్కలంగా లభించి అది అత్యంత త్వరగా, పరిపూర్ణంగా పూర్తవుతుంది.


చాలా సంవత్సరాల క్రితం భారీ వర్షం కురుస్తున్న ఒకరోజు, పూర్తిగా తడిసిపోయిన ఇద్దరు వ్యక్తులు కంచి మఠం తరుపున ఒక విషయం నాకు తెలియజేయడానికి కాంచీపురం నుండి వచ్చారని నాకు తెలిపారు. వారిని నేను లోపలకు రమ్మన్నాను. పరమాచార్య స్వామివారు చిదంబర నటరాజ స్వామి వారికి వజ్ర కిరీటం చేయ సంకల్పించారని, కాని కొద్దిగా ధనం తక్కువ అవ్వడం వల్ల అది పూర్తీ కాలేదని వారు నాకు చెప్పారు. వారు మద్రాసుకు వచ్చిన పని, కొందరు భక్తులను కలిసి వారి వద్ద నుండి విరాళాలు సేకరించడానికే. దానికి ఇంకా ఎంత ధనం కావాలో అంట ధనం ఇవ్వడానికి నేను సిద్ధమని పరమాచార్య స్వామివారికి తెల్పమని వెంటనే వారికీ చెప్పాను. తరువాత స్వామి వారి దగ్గరకు వెళ్లి, నా మాటను నేరవేర్చాను. మహాస్వామి వారి ఆశీస్సుల వల్ల కిరీటం పని పూర్తయ్యింది. అలాగే మహాస్వామి వారికి, మఠానికి మేము మరింత దగ్గరయ్యాము.


దాదాపు మూడు సంవత్సరాల క్రితం, గల్ఫ్ యుద్ధం జరుగుతున్న సమయంలో మన మాజీ రాష్ట్రపతి శ్రీ ఆర్. వేంకటరామన్ గారు శ్రీమఠంలో ఉన్నప్పుడు, అక్కడి వైద్యులు పరమాచార్య స్వామి వారి ఆరోగ్య స్థితిని అంచనా వెయ్యడానికి స్వామివారి పూర్తి శరీరం స్కాన్ చెయ్యాలన్న అభిప్రాయాన్ని తెలిపారు. కాని మహాస్వామి వారు ఎటువంటి వాహనం ఎక్కరు కాబట్టి స్కానింగ్ యంత్రాలు ఉండే మద్రాసుకు శ్రీవారిని తీసుకుని వెళ్ళడం కుదరని పని. దాంతో మొబైల్ స్కానింగ్ మిషన్ ను అమెరికా నుండి తెప్పించాలాని రాష్ట్రపతి గారు అభిప్రాయపడ్డారు. అ యంత్రం కోసం వారు అమెరికా అధ్యక్షులు బుష్ (సీనియర్)ను సంప్రదించారు. గల్ఫ్ యుద్ధం కోసం అన్ని యంత్రాలను అక్కడకు పంపడంతో భారతదేశానికి పంపలేమని బుష్ తెలిపారు. ఇతర వ్యక్తుల ద్వారా అదృష్టవశాత్తు అమెరికాలోనే ఉన్న ఒక యంత్రాన్ని గుర్తించారు. శ్రీ వేంకటరామన్ మరియు శ్రీ రాజీవ్ గాంధీ గారు ఆ యంత్రాన్ని కాంచీపురానికి చేర్చే బాధ్యతను నాకు అప్పగించారు. ఆశ్చర్యంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా ఆ అధునాతన యంత్రం అమెరికా నుండి కంచీపురానికి క్షేమంగా వచ్చింది. ఆ యంత్రానికి ఎటువంటి హాని లేకుండా రావడం ఆనందకరమైతే, ఆ వచ్చిన యంత్రం స్వామివారిని పరీక్షించి వారి ఆరోగ్యం సరిగ్గా ఉందని తెలపడం మరింత ఆనందకరం. ఇది నా జీవితంలో మరచిపోలేని అనుభం.


మరొక్క సంఘటన కూడా చెప్పుకోవాలి. జనవరి 1992 మొదటి వారంలో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభం చెయ్యబోతున్న ‘శ్రీ వేంకటేశ్వర ఇంజనీయరింగ్ కళాశాల’ ఉత్సవం విజయవంతం అవ్వడానికి పరమాచార్య స్వామివారి ఆశీస్సుల కోసం నేను నా భార్య కాంచీపురం వెళ్ళాము. స్వామివారి ఆశీస్సులు తీసుకుని, తిరిగి వెళ్ళడానికి స్వామి వారి అనుమతి తీసుకున్న తరువాత నాకు ఒక శాలువా బహూకరించారు. స్వామివారు ఆ శాలువాను చూసి స్వామివారు కాస్త నిరాశ పడ్డారు. మమ్మల్ని కొద్దిసేపు వేచి ఉండమని చెప్పారు. స్వామివారు వేసుకున్న శాలువా తీసి, దాన్ని మృదువుగా తలకు రుద్దుకుని, నన్ను తమ పక్కకు పిలిపించుకుని, దాన్ని నాకు ఇవ్వాల్సిందిగా అక్కడున్న సేవకుడిని, దాన్ని నా భార్యకు ఇవ్వాల్సిందిగా నాకు సైగచేశారు. చెప్పాలంటే మాటల్లో చెప్పలేని పులకింతను పొందాము.


మా అబ్బాయి పెళ్ళికి పది నెలల ముందు మేము కంచి మఠానికి వెళ్ళినప్పుడు మరొక అద్భుత సంఘటన జరిగింది. మేము పరమాచార్య స్వామివారిని దర్శించుకుంటున్నప్పుడు స్వామివారి అంతేవాసులు మా అబ్బాయి అశ్విన్ వివాహం నిశ్చయమైందని మహాస్వామి వారికి తెలిపారు. పెళ్లి పత్రికతో సహా వచ్చి మహాస్వామి వారి ఆశీస్సులు తీసుకుందామని మేము ముందుగానే అనుకుని ఉండడం వల్ల ఆ విషయం స్వామివారితో ప్రస్తావించలేదు. స్వామివారు వెంటనే ఒక కొబ్బరికాయ తీసుకుని రమ్మని తెలిపి, ముందుగానే మాకు ఆశీపూర్వకంగా ఇచ్చారు. సాధారణంగా స్వామివారి ఆశీస్సులను ప్రత్యేకంగా అడిగినప్పుడే ఇలా చేస్తుంటారు. కాని స్వామివారు ఎంతో దివ్యదృష్టితో ఈ పని చేశారు. తరువాత కూడా మేము స్వామి వారి ఆశీస్సులను పొందలేకపోయాము. ఎందుకంటే, పెళ్ళికి పదిహేను రోజుల ముందరే స్వామివారు బ్రాహ్మీభూతులయ్యారు. జరిగిన విషయం తెలుసుకుని శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు ఆశ్చర్యపోయారు.


ప్రముఖులు, విద్యావేత్త అయిన మా తాతగారు డా. రాజా సర్ అన్నామలై చెట్టియార్ గారి స్ఫూర్తితో తమిళనాడులో కాని పుదుచ్చేరిలో కాని ఒక ఉన్నత విద్యాసంస్థను నెలకొల్పాలని చూస్తున్న తరుణంలో 1998లో నాకు కలిగిన మరొక అనుగ్రహం, శ్రీపెరుంబదూర్ లో ఉన్న శ్రీ వేంకటేశ్వర ఇంజనీయరింగ్ కాలేజి యాజమాన్య బాధ్యతలు తీసుకోవాల్సిన అవకాశం దొరకడం. పరమాచార్య స్వామి మరియు వారి ఇద్దరి శిష్యుల అనుగ్రహం వల్ల ఈరోజు శ్రీ వేంకటేశ్వర ఇంజనీయరింగ్ కాలేజ్ తమిళనాడులో ఉన్న ప్రముఖ కలాశాలలో ముందు వరుసలో ఉన్నది.


1993 మేలో జరగబోయే కనకాభిషేకానికి భక్తుల నుండి బంగారము, ధనము స్వీకరించే ఉపసమితికి అధ్యక్షునిగా నన్ను నియమించడం న అదృష్టం. అది చాలా కష్టమైనా బాధ్యతతో కూడుకున్న వ్యవహారం. కాని మహాస్వామి వారి అనుగ్రహం వల్ల వచ్చిన ఉత్సాహం చిన్నదేమీ కాదు. విరాళాలు విరివిగా వచ్చాయి. మొదలుపెట్టిన నాటినుండే ఎటువంటి ఇబ్బంది లేకుండా బగారం కొనుగోలు, రవాణా అన్నీ సక్రమంగా జరిగాయి. 1993 మే 27న పెద్ద ఎత్తున పరమాచార్య స్వామివారికి కనకాభిషేకం నిర్వహించడం జరిగింది. ఆ అరుదైన ఉత్సవాన్ని తిలకించడానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు.


పరమాచార్య స్వామివారు ఈ శతాబ్దపు మహోన్నత ఆధ్యాత్మిక చక్రవర్తి. స్వామివారి శతాబ్దపు జీవితం ఎన్నో ఉన్నత విషయాలు, అవిరళ కృషి, అద్భుతమైన విజయాల సమాహారం. స్వామివారు ఒక విజ్ఞాన సముద్రం. అంతే కాదు వారు కరుణా సముద్రులు కూడా. ఎన్నో దేశాల వివిధ నాగరికతల, సంప్రదాయాల, పద్ధతులపై ఎంతో లోతైన అవగాహన, పట్టు ఉన్నావారు. హిందూ వారసత్వపు పవిత్రతను కాపాడాలన్నదే వారి చిరకాల కోరిక. దేశ, జాతి, కుల, వర్గ, మత బేధాలు లేని విశ్వగురువు పరమాచార్య స్వామివారు. జనవరి 8 స్వామివారు శరీరం వదిలిన రోజు, ఎన్నో లక్షల మందిని కదిలించిన దృశ్యం స్వామివారిని చివరిసారిగా చూడడానికి వచ్చిన క్రైస్తవ నన్ లను, మహమ్మదీయ ప్రజలను చూసినప్పుడు.


--- డా. ఎ.సి. ముత్తయ్య. “kamakoti.org” నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

విస్సన్న చెప్పిందే వేదం"

 "విస్సన్న చెప్పిందే వేదం" అని మన పండిత వరులందరు వినియే వుంటారు...ఈ విస్సన్న ఎవరంటే....ఇంద్రగంటి విశ్వపతి శాస్త్రి గారు.. కోన సీమలోని "అయినపల్లి" గ్రామంలో కొన్నేళ్ల క్రితం వుంటూ వుండిన " బులుసు అచ్చయ్య శాస్త్రి" గారనే పండితుని కి శిష్యుడు.. విస్సన్న గారిది కోటిపల్లి నివాసి. గోపాలకృష్ణ శాస్త్రి గారి అబ్బాయి. ఫ్రెంచి,"యానాం" కవులలో ఎందరో విద్వాంసులు,పండితులు వున్నారు.వీరి గురువైన అచ్చయ్య శాస్త్రి గారు జగద్విఖ్యాత పండితులు..గురువు గారి లాగానే విస్సన్న a/s విశ్వపతి శాస్త్రి కూడా శ్రౌతంలో అథారిటీ గురువు గా పేరు గాంచి "విస్సన్న చెప్పిందే వేదం"గా నానుడి పుట్టింది..ఈ విషయాన్ని చెళ్లపిళ్ల వెంకటశేష శాస్త్రి గారు ఒకానొక సందర్భంలో తెలియజేశారు.. విస్సన్న చెప్పిన ఓ శ్లోకం చూడండి...ఇది ఇప్పటికీ ప్రమాణంగా వుంది...

"విస్సన్న చెప్పిందే వేదం" 


శ్లో. " ఘృత పక్వం తైల పక్వం పక్వం కేవలం వహ్నినా

శూద్రాదపి సమశ్నీయా దేవ మాహ పితామహః "


(శ్రీ విస్సన్న గారు మన్యం వారి దివాణంలో ఇతర పండితులందరితో వ్యతిరేకిస్తూ పై శ్లోకం చదివి కోమట్ల ఇళ్ళల్లో ఆబ్దికాలప్పుడు బ్రాహ్మణులు నూనెలో నేతిలో వేయించిన గారెలూ అరిసెలూ ఇంకా అటువంటివే ఇతరాలూ తిన వచ్చనీ తప్పు లేదనీ తీర్మానం చేసేరట. మరి '' విస్సన్న చెప్పినదే వేదం '' కదా? ... ఈ విధంగా '' నూనె వస్తువులకీ, నిప్పుమీద కాల్చిన వాటికీ అంటులేదనీ ఎప్పుడైనా తినవచ్చుననీ '' అంగీకరించబడింది. అందువల్ల రొట్టెలు తినడానికి రేవు వచ్చేవరకూ వేచి ఉండక్కర్లేదనే సామెత పుట్టిందన్నమాట. బాగుందా? (కీ.శే. చెళ్ళపిళ్ళ కవి గారికి కృతజ్ఞతలతో)

కర్మఫలాన్ని ఏం చెయ్యాలి..........!!

 కర్మలు చేస్తూ కర్మఫలాన్ని ఏం చెయ్యాలి..........!!


కొందరికి మనస్సు కుదురుగా ఉండదు. పూర్తిగా దైవకార్యాలలో మునిగిపోతే బ్రతుకుతెరువు ఎట్లా, అని సందేహం. వాళ్ళు స్వంతపనులు మానుకోలేరు. "అయితే కర్తృత్వాన్ని వదిలి ఎట్టి పనులు చేసినా సరిపోతుంది, అప్పుడవి భగవత్ కర్మలే అవుతాయి గదా!" అని తెలిసినా అలా కర్తృత్వాన్ని వదిలి ఉండలేరు. కర్తృత్వంతో కర్మలు చేయటం అలవాటు. ఎంతకాదనుకున్నా నేను కర్తననే అహంకారం వదిలిపోదు. మరి అలాంటి వారి గతిఏమిటి, వారికి కూడా భగవానుడు ఇక్కడొక ఉపాయాన్ని తెలియజేస్తున్నాడు.

అదే "సర్వకర్మ ఫలత్యాగం"

మనం పనులు చేస్తున్నప్పుడు ఏదో ఒక ఫలితం వచ్చి తీరుతుంది. ఆ వచ్చే ఫలితం మీదనే దృష్టి పెట్టి వస్తుందా, రాదా. ఒకవేళ వస్తే అనుకున్నంతగా వస్తుందా తక్కువగా వస్తుందా, అని ఆలోచిస్తూ ఉంటే చేసేపని మీద శ్రద్ధ ఉండదు. అందువల్ల నైపుణ్యంగా పనులు చేయలేము. అలా కాకుండా వచ్చే ఫలితాన్ని గురించి పట్టించుకోకుండా, దానిమీద ఏమాత్రం ఆసక్తి లేకుండా శ్రద్ధగా, కర్తవ్య భావంతో, తన విద్యుక్త ధర్మంగా కర్మలు చేస్తుంటే ఆ కర్మలు సక్రమంగా జరుగుతాయి, పనిలో నైపుణ్యం కూడా ఉంటుంది. కనుక కర్మఫలాలను భగవంతునికి అర్పించాలి. అలాచేస్తే లోపల పేరుకున్న రజోగుణం అణగిపోతుంది. సరే సర్వకర్మ ఫలత్యాగం అన్నారు గదా! అంటే పాపకర్మల ఫలాన్ని కూడా అర్పించాలా, చెడ్డకర్మలను, పాపకర్మలను వదిలివేయాలని ముందే చెప్పుకున్నాం. కనుక శాస్త్రవిహిత కర్మలనే చేయాలి. వాటి ఫలాన్నే వదిలివేయాలి. పాపకర్మలు అసలు చేయకూడదు.


ఈ సర్వకర్మల ఫలత్యాగం అనేది దాదాపుగా అందరికీ అనుకూలమైనదే. కొద్ది ప్రయత్నంతో ఎవరైనా అనుసరించవచ్చు. అందుకే "యతాత్మవాన్" అన్నారు. ప్రయత్నించి సాధించుకోవాలి.

నిజంగా భగవద్గీత యొక్క సారమంతా ఇదే. "కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన". కర్మలు చేయుటయందే నీకు అధికారం. ఫలితాన్ని ఎప్పుడూ కోరవద్దు. ఫలాలు కోరేవాడు పిసినిగొట్టు - 'కృపణా ఫల హేతవః' - అని అన్నారు. ఇది భగవద్గీత సారమేగాదు. భగవానుని జీవితసారం కూడా ఇదే.


1. దేవకీ వసుదేవులకు జన్మించినా తల్లిదండ్రుల వాత్సల్యాన్ని కోరలేదు.


2. నంద గోకులంలో వెన్న దొంగిలించినా తనకోసం కాదు, స్నేహితులకు కోతులకు పెట్టేవాడు .


3. కంసుని చంపినా రాజ్యాధికారాన్ని కోరలేదు. ఉగ్రసేనునికే కట్టబెట్టాడు.


4. జరాసంధుని చంపించినా రాజ్యాన్ని అతడి కుమారుడు సహదేవునే పట్టాభిషిక్తుని చేశాడు.


5. శిశుపాలుని వధించినా అతని కుమారుడు దృష్టకేతువుకే రాజ్యాన్ని అప్పగించాడు. నరకుని చంపి అతని కుమారుడు భగదత్తుని రాజుగా చేశాడు.


6. దంతవక్త్రుని చంపి అతడి రాజ్యాన్ని అతని కుమారునికే ఇచ్చాడు.


7. పౌండ్రక వాసుదేవుని చంపి అతని కుమారునే రాజ్యాభిషిక్తుని చేశాడు.


8. దుర్మార్గుడైన దుర్యోధనుడు సాయం కోరితే తన సైన్యం మొత్తాన్ని త్యాగం చేశాడు. నాకేం ఇస్తావు, అని అడగలేదు.


9. పాండవులకు ఎంతమేలు చేసినా, యుద్ధంలో ఎంత సాయపడినా తానేమీ ఫలితాన్ని కోరలేదు. రాజ్యంలో వాటా కోరలేదు.


10. రథాన్ని తోలేపని అప్పగించినా అప్పగించిన పనిని శ్రద్ధగా - సక్రమంగా నిర్వర్తించాడే గాని ఏ ఫలితాన్ని ఆశించలేదు. ఇంత చిన్నపనియా అనలేదు.


ఆయన ఏపని చేసినా, ఆ పనిని సక్రమంగా నిర్వర్తించటమే గాని కర్మఫలంపై ఏమాత్రం ఆసక్తి లేదు. దేనినీ కోరలేదు. మరి మనం మాత్రం ఏఫలితం లేకుండా ఎందుకు కర్మలు చేయాలి, అంటాం.


సూర్యుడు వెలుగునిచ్చి నీవద్ద నుండి ఏం కోరుతున్నాడు, వాయుదేవుడు గాలినిచ్చి నీ ప్రాణాన్ని నిలబెడుతూ ఏం కోరుతున్నాడు

 నదులు నీటినిచ్చి దప్పిక తీర్చి నీనుండి ఏమి కోరుతున్నాయి, భూమి నీకు ఆధారంగా ఉండి, పంటల నిచ్చి ఏమి కోరుతున్నది

చెట్లు ఫలాలను, పుష్పాలను, నీడను ఇచ్చి ఏమి కోరుతున్నాయి, చంద్రుడు చల్లదనాన్నిచ్చి ఏమి కోరుతున్నాడు, మన సమస్త ఇంద్రియాలకు శక్తి నిచ్చి పరమాత్మ ఏమి కోరుతున్నాడు


కానీ దేవాలయంలో పుజగాని, అభిషేకం గాని చేయించిన తరువాత "ఏతత్ ఫలం సర్వం పరమేశ్వరార్పణ మస్తు" అని పూజారి మంత్రం చదవగానే ఖర్చు మనదీ ఫలితం పరమాత్మకా అని లోలోపల గొణుక్కుంటాం అర్థం తెలిస్తే. మనకు పనికన్నా ఫలితం ముఖ్యం. అందువల్ల మనకు బంధమే గాని మోక్షం లేదు. కర్మఫలం కోరినందువల్ల మళ్ళీమళ్ళీ జన్మలను తెచ్చిపెడుతుంది. జన్మలు మళ్ళీమళ్ళీ కర్మలకు - కర్మఫలాలకు కారణమౌతాయి. ఇలా కర్మ - కర్మఫలం - జన్మ - కర్మ - కర్మఫలం - జన్మ అనే కర్మ - జన్మ వలయంలో, జననమరణ చక్రంలో, కర్మసుడిగుండంలో చిక్కుకుపోతాం. కనుక కర్మలు చేస్తూ కర్మఫలాన్ని త్యాగం చెయ్యాలి. సర్వం శ్రీకృష్ణార్పణం, రామార్పణం, భగవదార్పణం అంటూ సర్వకర్మలను చేయటం నేర్చుకోవాలి. 'గాలికి పోయే పేలపిండిని కృష్ణార్పణం' అనటం కాదు. ఇంట్లో ఉన్నదానిని, నోట్లోకి పోయేదానిని కూడా అనగలగాలి..   

        

                    సాధన సాధ్యతే సర్వం..