15, నవంబర్ 2020, ఆదివారం

భగీని హస్త భోజనాలు

 



*మనసంస్కృతి - మన సాంప్రదాయం*

ఆత్మీయులు అందరికీ విన్నపములు 

ది. 16-11-2020 సోమవారం భగీని హస్త భోజనాలు 


*భగినీ హస్త భోజనం అంటే ఏమిటి? ఏరోజున చేయాలి ?*


కార్తీక శుద్ధ విదియ అంటే దీపావళి వెళ్ళిన రెండవ నాడు భగినీ హస్త భోజనం అనే వేడుకను జరుపుకుంటారు. సోదరీ సోదరుల ఆప్యాయతానుబంధాలకు అద్దంపట్టే ఒక సంప్రదాయం ఈ భగినీ హస్త భోజనం. భగిని అంటే అక్క లేక చెల్లెలు. ఆమె పెట్టే భోజనం కనుక భగినీ హస్త భోజనం అంటారు. సోదరీ సోదరుల ప్రేమకి అద్దం పట్టే పండుగల్లో రాఖీ పండుగ తర్వాత చెప్పుకోదగినది ఇది. ఈనాడు అన్నదమ్ములు తమతమ అక్కాచెల్లెళ్ళ ఇళ్ళకు బహుమానాలు తీసుకెళ్ళి, వారి చేతి వంట తిని వారిచేత తిలకం దిద్దించుకుంటారు.


“భయ్యా ధూజీ” అనే పేరుతొ ఉత్తరదేశంలో బాగా ప్రాచూర్యం పొందిన భగినీ హస్తభోజనం సోదరుని క్షేమానికి సంబంధించినది.


భగినీహస్త భోజనం పురాణగాధ

మన పురాణాల ప్రకారం యమధర్మరాజు సోదరి యమున వివాహమై వెళ్ళాక తన సోదరుని తన ఇంటికి ఎన్నోసార్లు ఆహ్వానించింది. కానీ యమధర్మరాజు వెళ్ళలేకపోయాడు. చివరికి ఒకసారి ఈ కార్తీక మాస విదియ రోజున యమున ఇంటికి వెళ్తాడు. సోదరుడు వచ్చాడని యమున సంతోషంగా పిండివంటలతో భోజనం పెట్టింది. చాలా రోజుల తర్వాత సోదరీ సోదరులు కలుసుకోవటంతో ఇరువురూ సంతోషించారు.


ఆ సంతోషంతో యమధర్మరాజు యమునని ఏదైనా వరం కోరుకోమన్నాడు. వాళ్ళు దేవతలు కనుక వారు కోరే వరాలు కూడా జన ప్రయోజనాలుగా వుంటాయి. ఆమె ఈ కార్తీకశుధ్ధ విదియనాడు లోకంలో ఎక్కడైనా సరే, తన సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేసిన సోదరులకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని అడిగింది. ఈ కోరికకి యమధర్మరాజు సంతోషించి, అలా వేడుక జరుపుకున్న వారికి అపమృత్యు దోషం (అకాల మరణం) లేకుండా వుంటుంది, ఆ సోదరి సౌభాగ్యవతిగా వుంటుంది అని వరాలిచ్చాడట. అందువల్లనే ఈ ఆచారం ఆచరణలోకి వచ్చింది. సోదరీ సోదరుల మధ్య అనుబంధాలు పటిష్టంగా ఉండాలంటే మన పెద్దలు సూచించిన ఇలాంటి సాంప్రదాయాలను మీరూ పాటించండి.

ప్రయాణములకు

 ప్రయాణములకు అనుకూల సమయాలు


మానవుడు తన నిత్యజీవితంలో ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందన్నట్లు... ప్రయాణాలు ఎప్పుడు పడితే అప్పుడు చేయడం మంచిది కాదు. ప్రయాణాలు ఎప్పుడు ఎలా చేయాలో శాస్త్రాలు వివరించాయి.


సుదూర ప్రయాణాలకు సోమ, బుధ, గురు, శుక్రవారాలు శుభప్రదం. అలాగే, విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి ప్రయాణానికి శుభ తిథులుగా పరిగణించాలి. ముఖ్యంగా దీర్ఘకాల ప్రయాణాలకు తీర్థయాత్రలు చేయటానికి అనువైన ముహూర్తాలను నిర్ణయించుకుని బయలుదేరటం మంచిది.

 

అలాగే శుక్ర, ఆది వారాలు పశ్చిమ దిశ ప్రయాణం మంచిది కాదు. గురువారం దక్షిణ దిక్కుకు ప్రయాణం చేయరాదు. భరణి, కృత్తిక, ఆర్థ్ర, ఆశ్లేష, పుబ్బ, విశాఖ, పూర్వాషాఢ, పూర్వభాద్ర అనే స్థిర లగ్నాల్లో ప్రయాణమే పెట్టుకోరాదు.

 

విదియ, తదియరోజులల్లోకార్యసిద్ధి, పంచమినాడు శుభం. సప్తమినాడు ఆత్మారాముడు సంతృప్తి చెందేలా అతిథి మర్యాదలు జరుగుతాయి. దశమిరోజు ధనలాభం. ఏకాదశి కన్యలాభమంత సౌఖ్యం. త్రయోదశి శుభాలను తెస్తుంది.


ఇక శుక్ల పాడ్యమి దుఃఖాన్ని కలిగిస్తుంది. చవితినాడు ఆపదలు వచ్చే అవకాశం. షష్ఠీనాడు అకాల వైరాలు. అష్టమినాడు అష్టకష్టాలు. నవమినాడు నష్టాలు. వ్యధలు కలుగుతాయి. ద్వాదశి నాడు మహానష్టాలు. బహుళ చతుర్ధీనాడు ప్రయాణం చేస్తే చెడును కలిగిస్తుంది. శుక్ల చతుర్దశినాడు ఏ పని కాదు.


ఇక మేషం, మిధునం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకరం, మీనం వంటి శుభ లగ్నాలలో ప్రయాణం చేపట్టడం మంచింది. ముఖ్యంగా సోమవారం తూర్పు దిశగా ప్రయాణాలు చేయకూడదు. ప్రయాణ ముహూర్తాలకు ఆది, మంగళ, శనివారాలు పాఢ్యమి, పంచ పర్వాలు, ద్వాదశి, షష్ఠి, అష్టమీలలో ప్రయాణాలు చేయకూడదు.

 

అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, అనూరాధ, శ్రవణం, ధనిష్ఠ, రేవతి శుభ నక్షత్రాలుగా పరిగణిస్తున్నారు. అందువల్ల ఈ నక్షత్ర కాలంలో ప్రయాణాలు ఆరంభించడం మంచిది.


పౌర్ణమి, అమావాస్యనాడు ప్రయాణాలు


మానవుడి మనసుపై గ్రహాల ప్రభావం ఉంటుందని తెలుసుకున్నాము. చంద్ర గ్రహ ప్రభావం మనసుపై స్పష్టంగా ఉంటుంది. పౌర్ణమినాడు చంద్రుడు పూర్ణ కళలతో ఉంటాడు. చంద్రుడు జలానికీ, లవణానికీ, మనసుకీ అధిపతి. అందుకే సముద్రంలో పౌర్ణమినాడు ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే మన శరీరంలో కూడా నీరు, లవణాలు, మనసు ఉంటాయి కదా. వీటికీ అధిపతి చంద్రుడే కనుక మన శరీరానికీ ఆటుపోట్లు ఎక్కువగా వుంటాయి. ఆయితే ఇవి అంతగా పైకి కనబడవు. మన శరీరంలో ఆటుపోట్లెక్కువగా ఉన్నప్పుడు మనం ఏ విషయంలోనైనా సరైన నిర్ణయం తీసుకోలేక పోవచ్చు. ప్రయాణాల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవటం ప్రయాణ సమయంలోకానీ, మన పనుల్లోకానీ చాలా అవసరం. అందుకే, ఆ నిర్ణయాలు తీసుకోలేని సమయంలో ప్రయాణం చేయవద్దని చెబుతారు. మొత్తానికి పూర్ణిమి రోజు పనులు ఏవి కావు.


ఇక అమావాస్యనాడు చంద్రుడు కనిపించడు. దీంతో రాత్రి పూట వెలుతురు చాలా తక్కువగా వుంటుంది. అందుకే అమావాస్యనాడు అర్ధరాత్రి ప్రయాణాలు చేయకూడదంటారు. వెలుతురు తక్కువగా ఉండటం మూలంగా దారి సరిగ్గా కనబడక ప్రమాదాలు జరగవచ్చు, చీకట్లో ఏదైనా చూసి ఇంకేదో అనుకుని భయపడవచ్చు, చీకట్లో దొంగల భయం కూడా ఉండవచ్చు. మనం ప్రయాణం చేసే వాహనం ఏ కారణం వల్లనన్నా ఆగినా ఇబ్బంది పడవచ్చు. రాత్రి పూట, అందులో చీకటి రాత్రి అలా జరిగితే ఎవరికైనా ఇబ్బందే కదా, అందుకే అమావాస్య అర్ధరాత్రి ప్రయాణాలు, అందులోనూ ఒంటరిగా అసలు ప్రయాణం చేయవద్దు. మొత్తానికి అమావాస్యనాడు ప్రయాణం చేస్తే ఆపదలు వస్తాయని శాస్త్రం చెబుతోంది.....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

భార్య - భర్త

 భార్య - భర్త


భార్య గురించి, భార్యాభర్తల సంబంధం గురించి మహాస్వామి వారు


వేదము ప్రతిపాదించిన శాస్త్రకర్మలు చేసితీరవలసిందే. ఇందుకోసం మానవుడు బ్రహ్మచర్యాశ్రమము తరువాత వేరొకరి సహాయం తీసుకొనవలసిందే. ఆ సహాకురాలు నీకు భగవంతుడు ఇచ్చిన బహుమానం. అది ఎప్పటికి నీనుండి విడదీయలేని ఆస్తి. ఆమె ఉపయోగం నీకు కేవలం వండిపెట్టడానికి, నీ ఇంద్రియాలకు తృప్తి నివ్వడానికి మాత్రమే కాదు. ఆమెను “ధర్మ-పత్ని”, “యజ్ఞ-పత్ని” అని శాస్త్రాలు కొనియాడాయి. కేవలం ధర్మాచరణకు ఆమె భర్తతో ఉండాలి. భర్తకు అటువంటి ధర్మానురక్తి కలిగించడం ఆమె కర్తవ్యం. ధర్మపత్నిగా ధర్మాచరణయందు ఆయన పక్కన ఉండాలి. మానవాళి సంక్షేమానికి చేసే యజ్ఞయాగాది క్రతువులందు ఆమె భర్తను అనుగమిస్తూ ఆయనకు సహాయం చెయ్యాలి.


ఆమె తన భర్తకు కేవలం వంట చేసి, అతని ఇంద్రియాలకు సుఖాన్ని ఇచ్చినా ఆమె ప్రపంచ క్షేమాన్ని కోరుకున్నట్టే. అది ఎలాగంటే ఆమె కేవలం తన భర్తకు మాత్రమే వంట చెయ్యదు. ఆమె చేసిన వంట వల్ల అతిథులు, అన్నార్తులు, పశుపక్ష్యాదులు కూడా ఆధారపడతాయి. ఇలా ఆమె వల్ల ‘అతిథిసేవ’ ‘వైశ్వేదేవము’ కూడా జరుపబడతాయి. ఆమెకు పుట్టిన పిల్లలు కేవలం తన భర్తకు ఇచ్చిన సుఖానికి ప్రతిఫలములు కాదు. ఆమె వైదిక ధర్మాన్ని పెంపొందించడానికి వారిని కంటుంది. కుమారుల పెంపకం కూడా భవిష్యత్ ధార్మిక ప్రయోజనాలకోసమే. ప్రపంచంలోని ఏ ఇతర ధర్మము వివాహ వ్యవస్థకి ఇంతటి లక్ష్యం ఆపాదించలేదు.


మన సనాతన ధర్మంలో స్త్రీపురుష సంబంధం కేవలం ప్రాపంచిక విషయ సుఖాలకోసం కాదు. ఆ పవిత్ర సంబంధం వల్ల ఆత్మోన్నతి, మానవ ఉద్ధరణ లభిస్తాయి. వేరే మతాల్లో కూడా దేవుని సాక్షిగానే వివాహాలు జరుగుతాయి కాని మన వివాహ వ్యవస్థ అంత ఉన్నతమైన వ్యవస్థ కాదు వారిది. మన సనాతన ధర్మంలో వివాహం, భర్తను ఉత్తమ స్థితికి తీసుకునివెళ్ళి భార్యకు పరిపూర్ణత్వాన్ని ప్రసాదించడమే. ఇంతటి మహోన్నత వ్యవస్థ వేరే సంప్రాదాయాలలో లేదు. వేరే దేశాలలో స్త్రీ పురుష సంబంధం కేవలం కుటుంబం లేదా కేవలం సమాజిక ఒప్పందం మాత్రమే. కాని ఇక్కడ వారిది ఆత్మ సంబంధం. కాని ఈ సంబంధం కూడా ప్రాపంచిక విషయాలనుంచి ఆత్మను దూరం చేసి ఆత్మోన్నతి పొందేది అయ్యుండాలి. ఇందులో విడాకులు అన్న పదానికి తావు లేదు. అది తలవడం కూడా పాపమే.


మూడు ముఖ్యమైన సంస్కారములు కలగలిసి వివాహము అనే సంప్రదాయం ఏర్పడింది. మొదటిది వేదాధ్యయనం అవ్వగానే పురుషునికి ఒక తోడు, సహాయకురాలు ఏర్పాటు చెయ్యడం. ఈ తోడు కేవలం ఇంటి అవసరాలు తీర్చడం కోసమే కాకుండా పురుషుని వైదికధర్మాచరణకు తోడ్పాటునివ్వడం. రెండవది మంచి వ్యక్తిత్వం మంచి నడవడిక గల ఉత్తమ సంతానాన్ని కనడం. వారి వల్ల ఆ వంశపు వైదికసంస్కృతి పరిఢవిల్లుతుంది. మంచి వ్యక్తులుగా ఎదిగి సంఘానికి మేలుచేసే సంతానం అవుతారు. మూడవది స్త్రీకి ప్రాపంచిక ఉనికినుండి విముక్తినివ్వడం. ఆత్మోన్నతి పూర్తిగా పొందని భర్తని అతని కర్మానుసారం భార్య నడిపిస్తుంది. అలా చేయడం వలన ఆమె పూర్తిగా భర్తకు అంకితమై అతనికంటే పైస్థాయిని పొందుతుంది. నాలుగవది పైమూడు విషయాలకోసం విచ్చలవిడి ఇంద్రియ సుఖాలను అణిచివేయడం.


కాని ఇప్పుడు మనం పై మూడింటిని మరచిపోయాము. మిగిలినది నాలుగవది ఒక్కటే శారీరక సుఖం లేదా ఇంద్రియ సుఖం. ఎల్లప్పుడూ అసత్యమైన ఈ శరీరమును సుఖింపచేయడం. మీరు నా సలహా పాటించి శాస్త్రము చెప్పిన ఉన్నతమైన ఆదర్శాలకొరకు సశాస్త్రీయ వివాహము చేసుకొన్న ఆత్మోన్నతి తప్పక పొందెదరు. చంద్రమౌళీశ్వరుడు మిమ్ము కాపాడుగాక !!!


బాలస్థావత్క్రీడాసక్తః తరుణస్థావత్తరుణీసక్తః

వృద్ధస్తావచ్చింతాసక్తః పరే బ్రహ్మణి కోపి న సక్తః ||


ప్రాముఖ్యత



 

ఇనాంభూముల ఆర్డినెన్స్‌కు

 *ఇనాంభూముల ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం లక్షలాది రైతులకు ఉపశమనం*


ఇనాం భూములు సమాజంలో సేవ చేసిన వారికి, విశిష్ట వ్యక్తులకు దేవాలయాలకు రాజుల కాలంలో ఇవ్వబడని భూములను ఇనాం భూములు అంటారు. ముస్లిం పాలక వ్యవస్థ లో జాగీర్లు గా పిలువబడ్డాయి. ఇనాం భూముల మెజర్ ఇనాం, మైనర్ ఇనాం అని పిలిచేవారు


●ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2018లో జారీచేసిన ఇనాం భూముల ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌  కొవింద్ ఆమోదముద్ర వేశారు. 


●‘‘ది ఆంధ్రప్రదేశ్‌ (ఆంధ్రా ఏరియా) ఇనాం (అబాలిషన్‌ అండ్‌ కన్వర్షన్‌ ఇన్‌టూ రైత్వారీ) (అమెండ్‌మెంట్‌) ఆర్డినెన్స్‌-2018’’


●రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 213 (1) నిబంధనల ప్రకారం రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. 


●ఫలితంగా 1956 నుంచి 2013 వరకు జరిగిన ఇనాం భూముల కొనుగోళ్లు, అమ్మకాలపై ఉన్న నిషేధం తొలగి లక్షల మందికి ఉపశమనం కలుగనుంది. 


●సర్వీస్‌, ఇనాం భూములకు ఫామ్‌-8 కింద రైత్వారీ పట్టా ఇచ్చినా ఆ భూముల కొనుగోళ్లు, అమ్మకాలు చెల్లవంటూ ఇనాం ల్యాండ్‌ అబాలిషన్‌ యాక్ట్‌కు సవరణ చేస్తూ 2013లో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 16/2013 చట్టం తీసుకొచ్చారు. 


●ఆ నిబంధనను 1956 నుంచి జరిగిన లావాదేవీలకూ వర్తింపజేయడంతో (రెట్రాస్పెక్టివ్‌) గతంలో చేతులు మారిన భూములన్నీ సమస్యల్లో పడ్డాయి. అప్పట్లో జరిగిన రిజిస్ట్రేషన్లన్నింటినీ స్తంభింపజేయడంతో చివరలో కొన్నవారు బాధితులుగా మిగిలిపోయారు. 


●ఆ ఇబ్బందులను తొలగించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2018లో ఆర్డినెన్స్‌ జారీచేసి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. 


●16/2013లో పెట్టిన షరతు ఆ చట్టం ఆమోదించక ముందు జరిగిన లావాదేవీలకు వర్తించదని, 2013లో చట్టం అమల్లోకి వచ్చాక జరిగిన వాటికే పరిమితం అవుతుందని సవరణ తెస్తూ ఆర్డినెన్స్‌ జారీచేసింది. 


●ఇప్పుడు దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో 2013కి ముందు జరిగిన లావాదేవీలపై నిషేధం తొలగిపోనుంది. 2013కి ముందు ఫామ్‌-8 ప్రకారం రైత్వారీ పట్టాలు పొందిన వారికి సదరు భూములపై పూర్తిస్థాయి హక్కులు ఉంటాయి.

ఆకాశదీపం ప్రారంభం🚩*

 _*🚩నేటి నుండి ఆకాశదీపం ప్రారంభం🚩*_


🕉☘🕉☘🕉☘🕉☘🕉☘🕉


*ఆకాశదీప మహాత్మ్యం*


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


కార్తికమాసం ఆకాశదీపంతో ప్రారంభమవుతుంది. నిజానికి ఏవి ఆకాశదీపాలు. మీరు నేను పెట్టక్కరలేదు. ఆకాశదీపాలు వెలిగించినవాడు పరమేశ్వరుడు. సూర్యుడు , చంద్రుడు , నక్షత్రాలు ఇవీ ఆకాశదీపాలు. *మరి కార్తికమాసం ప్రారంభం దేనితో మొదలు ?* ఆకాశదీపంతో ప్రారంభం. *ఆకాశదీపం ఎక్కడ వెలిగిస్తారు ?* దేవాలయంలో వెలిగిస్తారు. దేవాలయంలో ధ్వజ స్తంభానికి తాడుకట్టి ఒక చిన్న పాత్రలో దీపం వెలిగించి , గాలికి నిధనం కాకుండా రంధ్రములతో ఏర్పాటు చేసి దాన్ని జాగ్రత్తగా శమంతకంగా భగవంతుని నామాలు చెపుతూ , భక్తులందరూ చుట్టూ నిలబడి ఉండగా , ఆ దీపాన్ని పైకెత్తుతారు. ఎవరి శక్తి కొలదీ వాళ్లు తగినట్లుగా వారు కార్తిక మాసంలో భక్తులు ఆకాశదీపానికి చమురో , వత్తులో ఇస్తూ ఉంటారు. *ఆ దీపాన్ని పైకెత్తుతారు ఎందుకని ?*  ఆ దీపం ధ్వజస్తభంం మీద ఉండి అంతటా వెలుతురు చిమ్ముతుంది. ధ్వజస్తంభం మీదకి ఏదైనా లాగారు అంటే , పతాకాన్ని ఆరోహణ చేశారు అంటే ఈశ్వరునికి ఉత్సవం అవుతుందని గుర్తు. ఇంకా కార్తికమాసంలో మనమే ఉత్సవం చేస్తున్నాం. మనకి మనం ఉత్సవం. ఉత్‌ అంటే తలపైకెత్తడం , తల పైకెత్తి చూశాడు కాబట్టి ఉత్సవం. ఏమిటి తల పైకెత్తి చూడ్డం ? నాకు ఉన్న గౌరవం ఏమిటి ? ఈ శరీరంలో ఉంటూ నేను చేయగలిగిన అధికారం ఏమిటి ? సమస్త భూతాలకు నేను మహోపకారం చేయగలను కార్తికపౌర్ణమి నాడు. ఇతర ప్రాణులు చేయలేవు. నేనే చేయగలను.   ఏమిటి చేయగలను ? దీపం తీసుకెళ్లి ఓ గదిలో పెట్టాననుకోండి కొంత ఫలితం. వీధిలోకి తీసుకువచ్చి దీపం పెట్టాననుకోండి విశేషఫలితం. అందుకే గుత్తు దీపాలని పెడతారు. ఇంతంత వత్తులు వేసి కట్టకట్టి దీపం వెలిగిస్తారు ఆ రోజున. యథార్థానికి శాస్త్రంలో ఏమి చెప్పారంటే ఆ రోజున చెత్త కూడా వెలిగించాలి. వీధులలో ఉన్న చెత్త కూడా వెలిగించేసేయమన్నారు. కానీ లౌకికాగ్నితో వెలిగించకూడదు. మీ ఇంట దీపం వెలిగించి కార్తిక పౌర్ణమి నాటి ప్రదోషవేళ , దామోదరమావాహయామి అనిగాని , త్రయంబకమావాహయామ అనిగాని అని , ఆ దీపంతో వెలిగించాలి. ఈ దీపం పెట్టి ఒక్కసారి ఆకాశం వంక చూసి ఒక శ్లోకం చెప్పాలి.

*కీటాఃపతంగాః మశకా శ్చ వృక్షాః*

*జలేస్థలే… ఫలే ఏ నివసంతి*

*జీవా దృష్ట్యా ప్రదీపం నచ జన్మ భాగినః*

*భవతింత్వ స్వపచాహి విప్రాః*

ఈ శ్లోకం చెప్పి నమస్కారం చేయాలి. ఇప్పుడు నువ్వు నమస్కారం చేస్తే పరమేశ్వరుడు ఎంతో ఆనందాన్ని పొందుతాడు. ఒరేయ్‌ వీడికి నేను మనుష్య శరీరాన్నిస్తే వీడు ఇన్ని భూతాలలో ఉన్న విభూతులను వాడుకున్నాడు. ఇన్నిటిని వాడుకున్నందుకు ఇవాళ వీడు ప్రత్యుపకారం చేశాడు. ఈ ఉపకార బుద్ధి , కృతజ్ఞత ఉన్నవాడు కాబట్టి నా మాట నమ్మి ఉపకారం చేశాడు. కాబట్టి వీడికి నేను మళ్లీ మనుష్యు శరీరం ఇవ్వవచ్చు. ఈ మాట చెప్పినపుడు *‘కీటాఃపతంగాః మశకాశ్చ వృక్షాః’* కీటకములుంటాయి. చిన్నచిన్న పురుగులు. అవి ఎందుకు పుడతాయంటే దీపంలో పడి చచ్చిపోవటానికి పుడతాయి. వాటివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే నాకేం ఉండదు. బల్లులకుంటుంది. పురుగులను పట్టి తింటాయి. ఇతర భూతములకు ఆహారమై పోతాయి. అధవా వాటి ఆయుర్ధాయం దేనివల్ల నశించిపోతుంది. ఆ దీపం యొక్క జ్యోతి మీద కొంచెంగా పడిపోతాయి. కింద పడిపోయి వాటి రెక్కలు వూడిపోతాయి.

అటువంటి దీపపు పురుగులు దీపం మీద పడి కాలిపోవడం చచ్చిపోవడమే తప్ప అభ్యున్నతి పొందినది లేదు. ఆ దీపం వల్లనే అని తెలిస్తే కదూ ! పైగా దీపంలో ఎక్కువగా పడిపోతే దీపం నిధనమైన పాపం వస్తుంది వాటికి తప్ప , దీపం వల్ల ప్రయోజనం పొందలేదు. అని ఇవాళ ఈశ్వరా నేను ఒక సంకల్పం చెప్తున్నాను , ఈ దీపం దీపం కాదు , ఇది త్రయంబకుడు , ఇది దామోదరుడు , కాబట్టి దీనివల్ల మొదటి ఫలితమెవరికి వెళ్లాలంటే *కీటాఃపతంగాః మశకాశ్చ , కీటకములు: పురుగులు , పతంగాలు , మశకాశ్చ: దోమలు , వృక్షాః* అవి యెంతో ఉపకారం చేస్తాయి. కాయలిస్తాయి , పళ్లు ఇస్తాయి. ఆకులిస్తాయి , కొమ్మలిస్తాయి , రెమ్మలిస్తాయి , కలపనిస్తాయి , ఇళ్లు కట్టుకుంటాం. ఇన్ని చేస్తాం. కానీ ఎండలో అది నిలబడి మనకు నీడనిస్తుంది తప్ప దాని జన్మాంతరంలో అది మాత్రం ఎక్కడికీ వెళ్లలేదు. అలాగే ఉండాలి. ఒక ఆవు వచ్చి దాని కొమ్మలు కొరుక్కు తినేస్తున్నా , ఒక ధూర్తుడు వచ్చి కొమ్మ విరిచేస్తున్నా , ఏవో ప్రాణులొచ్చి దాని మీద కెక్కి అలజడి చేసేసి కొమ్మలన్నీ వొంచేస్తున్నా , గొడ్డలి పెట్టి తనను నరికేస్తున్నా , ఒక్క అడుగు ఇలా తీసి , అలా వేయలేని దైన్యం చెట్టుది. అదలాగే నిలబడుతుంది. ఆ చెట్టు ఎలా అభ్యున్నతిని పొందుతుంది. కదలలేనపుడు , కర్మ లేనపుడు , దానికి కర్మాధికారం ఏది ?  అది సంపాదించుకోలేదు. కాబట్టి ఈశ్వరా ! నీ దీపపు వెలుతురు ఆ చెట్టుమీద పడుతోంది. కాబట్టి దామోదరుడి చేయి దానిమీద పడినట్టే ! త్రయంబకుని చేయి దానిమీద పడినట్టే ! అది అభ్యున్నతిని పొందాలి.

నీటిలో ఉండే చేపలుంటాయి , కప్పలుంటాయి , తాబేళ్లుంటాయి. ఈ దీపపు వెలుతురు నీటిమీద పడినపుడు , నీటి లోపల ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా నీ అనుగ్రహాన్ని పొందాలి. అక్కడితో సరిపోతుందా ? 

ఇది కాదు. *జలేస్థలే నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచజన్మ భాగినః* వాటికేం తెలియదు. అవేం పుణ్యం చేయలేదు , కానీ ఈ వెలుతురు వాటిమీద పడిన కారణం చేత ఇక వాటికి జన్మ లేకుండుగాక ! అక్కడితో వాటికున్నటువంటి పాప పుణ్యాలన్నీ కూడా నశించిపోవుగాక ! అని *భవతింత్వ శపచాపవిప్రాః* అసలు వేదం మీద నమ్మకం లేకుండా కేవలం ప్రాపంచిక కర్మాచరణము మాత్రమే చేస్తూ ఈ లోకంలో తిరుగుతూ కేవలం ఉదర పోషణార్థమే బతుకుతున్న భయంకరమైన స్థితిలో ఉండిపోయిన వాడిమీద ఈ దీపం యొక్క కాంతి ప్రసరించిన కారణం చేత వాడుకూడా వచ్చే జన్మలో వేదము యొక్క ప్రమాణం తెలుసుకున్న వాడై స్వరంతో వేదాన్ని చదువుకొని వేదాన్ని ప్రచారం చేసి వేదానికి చేతులడ్డుపెట్టి లోకోద్ధరణ చేయగలిగిన నిస్వార్థతపూరితమైన లోకోపకారియైన బ్రాహ్మణుడిగా జన్మించి అభ్యున్నతిని పొందుగాక ! కాబట్టి *భవంతిత్వం స్వపచాహివిప్రా:*  ఈ దీపపు కాంతి అంత గొప్పది. కాబట్టి ఈశ్వరా , నీ యందు త్రయంబకుణ్ణి , దామోదరుణ్ణి అవాహన చేసి ఈ దీపపు వెలుతురు నీయందు ప్రసరించేటట్లు చేస్తున్నాను.

అందుకే కార్తిక పౌర్ణమి నాడు అన్ని చోట్లా దీపాలెత్తుతారు. ఇక దీపమెత్తని ప్రదేశముండదు. కార్తిక పౌర్ణమి నాడు సాయంకాలం ఉపన్యాసం చెప్తే ఎవరూ ఉండరు. చెప్పకూడదు. ఎందుకంటే కార్తికపౌర్ణమి అంటే ప్రతీ వాళ్లూ ఇళ్లలో చేసుకోవాలి.

🙏🙏🌷🙏🙏🌷🙏🙏🌷🙏🙏

నూటపదార్లు

 🚩🛕 *హిందూ ఆధ్యాత్మిక వేదిక*🛕🚩

=======================


*నూటపదార్లు* కథేంటి?


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


శుభకార్యాలలో చదివింపులకిగాను నూట పదార్లూ - వెయ్యిన్నూటపదార్లూ ఇస్తుంటారుగదా ఈ నూటపదారుకి ఏమైనా విశిష్ట ఉందంటారా ?


భారతీయ సంస్కృతి అంతా ఎప్పుడూ పూర్ణాంకం గురించే చెబుతుంది , శతం , సహస్రం , శత సహస్రం ఇలా , దశాంశంలో. మరీ నూటపాదారెక్కడనుంచి వచ్చి చేరిందన్నదే ఆలోచన , అదీ తెనుగునాటే , ఈ అలవాటూన్నూ.


తెనుగునాడు మూడు భాగాలుగా విడి ఉండేది పాలనలో. ప్రజలు మాత్రం ఒక చోటినుంచి మరోచోటికి రాకపోకలూ , వలసలూ బాగానే ఉండేవి. ఆ ప్రాంతాలకి పేర్లూ ఉన్నాయి., కోస్తా , రాయలసీమ ( దీన్నే సీడెడ్ జిల్లాలు అంటే వదలిపెట్టబడిన జిల్లాలు , అవి కడప , కర్నూలు , బళ్ళారి , అనంతపురం. తరవాత కాలంలో బళ్ళారిజిల్లా కర్నాటకలో జేరిపోయింది) ఇక మూడవది నైజాం రాష్ట్రం.


కోస్తా ప్రాంతం నిజంగానే కోస్తా ! సముద్రపు ఒడ్డు. బ్రిటిష్ వారి ఏలుబడిలో ఉండేది. స్వదేశీ సంస్థానాలుండేవి. ఉర్లాం , బొబ్బిలి , విజయనగరం , పిఠాపురం , పెద్దాపురం , నూజివీడు , వేంకటగిరి ప్రముఖమైన సంస్థానాలు. ఇక నైజాంలో కూడా సంస్థానాలున్నా గద్వాల్ కు  ఉన్నంత పేరు మిగిలినవాటికి లేదు. ఈ సంస్థానాధీశులంతా కవులను పండితులను పోషించేవారు , వార్షికాలూ ఇచ్చేవారు. ఇలా ఇచ్చే వార్షికాలు నూరు రూపాయలుగా ఉండేవి. ఈ మొత్తం నిజాంలో ఉన్న సంస్థానాలవారు పండితులకిస్తే అవి నిజాం హాలీ రూపాయలై ఉండేవి. నైజాం రూపాయల్ని హాలీ రూపాయలనేవారు. కోస్తా రాయలసీమ నుంచి నైజాం వైపు సంస్థానాలకి వెళ్ళిన వారికిచ్చిన నూరు హాలీ రూపాయలు బ్రిటిష్ పరగణాలో కొచ్చేసరికి నూటికి తగ్గేవి , కారణం ఏడు హాలీ రూపాయలు ఆరు బ్రిటిష్ రుపాయలకు మారకం అయేవి కనక. కాలం నడుస్తోంది , అటు సంస్థానాధీశుల లోనూ , ఇటు గ్రహీతలలోనూ నూరు రూపాయలు పూర్ణాంకం చేరటం లేదనే వ్యధ ఉండిపోయింది. మార్గం కనపడలేదు.


చివరగా తేలినదేమంటే నూట పదారు హాలీ రూపాయలకి నూరు బ్రిటిష్ రూపాయలొస్తాయి గనక ఇటునుంచి వెళ్ళిన పండితులకు సత్కారంగా నూటపదార్లు ఇవ్వడం మొదలయింది. అక్కడ నూట పదార్లు పుచ్చుకోవడం అలవాటైనవారు ఇక్కడా కోస్తాలో , రాయలసీమలో నూటపదార్లు , ఇవ్వడం , పుచ్చుకోవడం అలవాటు చేసుకున్నారు , అప్పటివరకూ ఉన్న అలవాటు పూర్ణాంకానికి బదులుగా. ఇలా నూటపదార్లు - వెయ్యిన్నూటపదార్లూ అలవాటులో మిగిలిపోయాయి. నేటి కాలానికి అర్ధనూటపదార్లు కూడా ఉన్నాయి. పెట్టడం పెద్దలనాటినుంచీ లేదుగాని పుచ్చుకోడం పూర్వీకులనుంచీ అలవాటేనన్న సామెతగా.


శతమానం భవతి , శతాయుః…అశీర్వచనం

నూరు సంవత్సరములు ఆయుస్సు కలుగుగాక.

శతం జీవ శరదో వర్ధమానా… ఆశీర్వచనం.

నూరు శరత్తులు వర్ధిల్లుదువుగాక……ఇలా పూర్ణాకం చెప్పడమే మన అలవాటు.


ఇదీ నూటపదార్ల కథ.

కథ

*✍🏼 నేటి కథ ✍🏼*



*బ్రహ్మరాక్షసుడి సంగీతం*



మూలం: ఎ.కె.రామానుజన్, ఫోక్ టేల్స్ ఫ్రం ఇండియా 


తెలుగు అనువాదం: నారాయణ


పేదబ్రాహ్మణుడొకడు తన పేదరికానికి తట్టుకోలేక కాశీయాత్రకని బయలుదేరాడు. ఎండలో చాలాదూరం నడిచీ నడిచీ అలసిపోయిన అతనికి, చక్కని తోట ఒకటి కనిపించింది. ఆ తోటలోని మహావృక్షాల నీడన విశ్రాంతిగా కూర్చొని, వెంట తెచ్చుకున్న అటుకులు భోంచేద్దామనుకున్నాడు అతను. ముందుగా కాలకృత్యాలు తీర్చుకొనేందుకని అతను ఓ పొద మాటున కూర్చోగానే గంభీరమైన స్వరం ఒకటి 'వద్దు' అన్నది.

అతను గబుక్కున లేచి అది 'ఎవరి గొంతు' అని అన్ని వైపులా చూశాడు; కానీ ఎవ్వరూ కనిపించలేదు. ఆ తర్వాత అతను నోరు కడుక్కునేందుకుగానూ అక్కడే ఉన్న కుంట దగ్గరకు పోగానే మళ్లీ అదే స్వరం వినబడింది: 'వద్దు' అని! అయితే ఈసారి అతను ధైర్యంగా తన పని కానిచ్చాడు, ఆ హెచ్చరికను పట్టించుకోకుండా.

అయితే అతను తన వెంట తెచ్చుకున్న అటుకుల మూటను విప్పినప్పుడు, మళ్లీ ఆ గొంతు "వద్దు" అన్నది. అతను దాన్నీ పట్టించుకోకుండా, తను తినగలిగినన్నింటినీ తిని, మిగిలిన వాటిని తిరిగి మూటగట్టుకొని, ముందుకు బయలుదేరాడు. అంతలో అదే స్వరం "వద్దు,వెళ్లకు" అన్నది.

బ్రాహ్మణుడు ఆగి, నలుదిక్కులా చూశాడు. ఎవ్వరూ కనబడలేదు. అందుకని అతను "ఎవరునువ్వు? ఎందుకిలా శబ్దం చేస్తున్నావు?" అని అరిచాడు.


"పైకి చూడు, నేనిక్కడున్నాను" అన్నది గొంతు. అతను పైకి చూసేసరికి, ఆ చెట్టు కొమ్మల్లో ఇరుక్కుని ఒక రాక్షసుడు కనబడ్డాడు.


ఆ రాక్షసుడు తన దీనగాథను బ్రాహ్మణునితో ఇలా మొరపెట్టుకున్నాడు. "గత జన్మలో నేనూ నీలాగానే ఒక బ్రాహ్మణ వంశంలో పుట్టి, గాన కళలో ఆరితేరాను. నా జీవితకాలమంతా నేను సంగీత రహస్యాల్ని సేకరించటంలోనే వెచ్చించాను తప్పిస్తే, వాటిని ఎవ్వరితోటీ పంచుకోలేదు; ఏ ఒక్కరికీ నేర్పలేదు. అందుకనే ఈ జన్మలో నేను రాక్షసుడినవ్వాల్సి వచ్చింది. భగవంతుడు నాకిచ్చిన శిక్ష ఇది. నువ్వలా వెనక్కి తిరిగిచూస్తే అక్కడో చిన్న గుడి కనబడుతుంది. ఆ గుడిలో ఒక సంగీతకారుడు సన్నాయి వాయిస్తూంటాడు- రోజంతా! అతను వాయించినంత ఘోరంగా సన్నాయిని ఎవ్వరూ వాయించలేరు- అన్నీ అపశృతులే. ఆ శబ్దం నాకు కలిగించే వేదన అంతా ఇంత అని చెప్పలేను - నా చెవుల్లో కరిగిన సీసం పోసినంత బాధగా ఉంటుంది. నేను దాన్ని అస్సలు భరించలేకపోతున్నాను. అతను వాయించే స్వరాల్లో తప్పుగా ఉన్న స్వరం ప్రతి ఒక్కటీ నాలోంచి బాణం మాదిరి దూసుకుపోతున్నది. ఆ శబ్దాలకు నా శరీరం తూట్లుపడి జల్లెడ అయిపోయినంత బాధ కలుగుతున్నది. ఒళ్లంతా నొప్పులే నొప్పులు. ఇదిగనక ఇలాగే కొనసాగితే నాకు పిచ్చెక్కి నేను ఏవేవో చేయటం తథ్యం. రాక్షసుడిని గనుక నన్నునేను చంపుకోలేను కూడాను. మరి ఈ చెట్టును విడిచి పోనూ పోలేను - నన్ను ఈ చెట్టుకు కట్టేశారు. కనుక ఓ బ్రాహ్మణుడా, నువ్వు చాలా మంచివాడివి. నీకు పుణ్యం ఉంటుంది. నామీద దయ తలుచు. తీసుకెళ్లి దూరంగా కనబడే ఆ తోటలోకి చేర్చు. అక్కడ నేను కనీసం కొంచెం ప్రశాంతంగా గాలి పీల్చుకోగలుగుతాను. అలా చేస్తే నా శక్తులు కూడా కొన్ని నాకు తిరిగి వస్తాయి. ఒకప్పుడు నీలాగే బ్రాహ్మణుడై, ఇప్పుడు నాలాగా రాక్షసుడైనవాడిని ఉద్దరించినందుకుగాను, నీకు బహు పుణ్యం లభిస్తుంది." అన్నాడు.



పేద బ్రాహ్మణుడు కరిగిపోయాడు. కానీ పేదరికం అతన్ని రాటుదేల్చింది. అతనన్నాడు -"సరే, నేను నీ కోరిక తీరుస్తాను. నిన్ను వేరే తోటకు చేరుస్తాను - అయితే దానివల్ల నాకేం ప్రయోజనం? నువ్వు బదులుగా నాకోసం ఏం చేస్తావు?" అని.


"నీ ఋణం ఉంచుకోను. నీకు మేలు చేస్తాను. నాకీ ఒక్క సాయం చెయ్యి చాలు" అని ప్రాధేయపడ్డాడు బ్రహ్మరాక్షసుడు.

'సరే'నని బ్రాహ్మణుడు వాడిని భుజాలమీద ఎక్కించుకొని, గుడికి దూరంగా ఉన్న వేరే తోటలోకి తీసుకుపోయి వదిలాడు.

బ్రహ్మరాక్షసుడి కష్టాలు తీరాయి. సంతోషం వేసింది. దానితోపాటు, పోయిన కొన్ని శక్తులు కూడా తిరిగివచ్చాయి వాడికి. వాడు బ్రాహ్మణుడిని ఆశీర్వదించి, అన్నాడు -"నువ్వు పేదరికంతో బాధపడుతున్నావని నాకు తెలుసు. నేను చెప్పినట్లు చేయి - ఇక జన్మలో పేదరికం నిన్ను పీడించదు. ఇప్పుడు నేను స్వతంత్రుడిని- కనుక నేను పోయి, మైసూరు రాజ్యపు యువరాణిని ఆవహిస్తాను. నన్ను వదిలించటం కోసం రాజుగారు రకరకాల మాంత్రికుల్ని రప్పిస్తారు. కానీ నేను మాత్రం వాళ్లెవరికీ లొంగను. నువ్వు వచ్చాకగానీ నేను ఆమెను వదలను. తన కుమార్తెను పట్టిన భూతాన్ని వదిలించినందుకుగాను సంతోషించి మహారాజుగారు, జీవితాంతం నిల్చేంత సంపదను నీపైన కురిపిస్తారు. అయితే ఒక్క షరతు - ఆ తర్వాత నేను వెళ్లి వేరే ఎవరినైనా ఆవహించినప్పుడు, నువ్వు ఇక ఎన్నడూ అడ్డురాకూడదు. దీనికి విరుద్ధంగా ఏనాడైనా జరిగిందంటే నేను నిన్ను తినేస్తాను మరి, ఆలోచించుకో" అని.


బ్రాహ్మణుడు ఒప్పుకున్నాడు. ఆపైన అతను కాశీకి పోయి, గంగలో స్నానం చేసి, వెనక్కి తిరిగివస్తూండగా బ్రహ్మరాక్షసుడి మాటలు గుర్తుకొచ్చాయి. దాంతో అతను అష్టకష్టాలూ పడి, చివరికి మైసూరు రాజ్యం చేరుకున్నాడు. అక్కడొక పూటకూళ్లమ్మ ఇంట్లో బసచేసి ఆ రాజ్య విశేషాలేంటని అడిగితే ఆమె అన్నది - "ఏం చెప్పను. మా యువరాణి చక్కని చుక్క. ఆమెనేదో భూతం ఆవహించింది, దాన్ని ఎవ్వరూ వదిలించలేకపోయారు. తన కుమార్తెను భూతం బారి నుండి కాపాడినవారికి నిలువెత్తు ధనం ఇస్తానని రాజుగారు చాటించారుకూడాను" అని.


ఈ సంగతి వినగానే'మంచిరోజులొచ్చాయని' బ్రాహ్మణుడికి అర్థమైపోయింది. అతను వెంటనే రాజభవనానికి వెళ్లి, "ఆ భూతాన్ని వదిలించే శక్తి తనకున్నదని లోనికి కబురంపాడు. ఈ పేదవాడికి అంతటి శక్తి ఉంటుందని ఎవ్వరూ నమ్మలేదు; కానీ 'ప్రయత్నిస్తే తప్పేంట'ని రాజుగారు బ్రాహ్మణుడికి ప్రవేశం కల్పించారు.

అంత:పురాన్ని చేరుకోగానే, బ్రాహ్మణుడు తననక్కడ యువరాణితో వదిలి అందరినీ వెళ్లిపొమ్మన్నాడు. అందరూ గది బయట నిలబడ్డాక, బ్రాహ్మణుడు గది తలుపులు మూశాడు. ఆ వెంటనే బ్రహ్మరాక్షసుడు యువరాణి ద్వారా మాట్లాడటం మొదలుపెట్టాడు: "నీకోసమే ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాను. నీకిచ్చిన మాట ప్రకారం ఈ క్షణమే ఈమెను వదిలి వెళ్లిపోతాను. కానీ- నేను నీకు గతంలో చెప్పిన సంగతిని గుర్తుంచుకో- నేను ఇప్పుడు వెళ్లే చోటుకుగనక -తప్పిజారైనా సరే- వచ్చావంటే మాత్రం, నేను నిన్ను తినకుండా వదిలిపెట్టను." అన్నాడు.


ఆపైన, పెద్దగా శబ్దం చేస్తూ బ్రహ్మరాక్షసుడు యువరాణి శరీరాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. యువరాణిగారు మామూలుగా అయిపోవటం చూసిన పురజనులంతా ఎంతో సంతోషించారు. రాజుగారు బ్రాహ్మణుడికి అనేక బహుమానాలు - బంగారం, భూములు అనేకమిచ్చి గౌరవించారు. బ్రాహ్మణుడు కూడా అక్కడే ఒక చక్కని యువతిని పెండ్లాడి, పట్టణంలోనే ఇల్లు కట్టుకొని, పిల్లాపాపలతో హాయిగా జీవించసాగాడు.


ఇక మైసూరు యువరాణిని వదిలిన బ్రహ్మరాక్షసుడు, నేరుగా కేరళ రాజ్యానికి పోయి, ట్రావన్ కూర్ యువరాణిని ఆవహించాడు. ట్రావన్ కూర్ రాజుగారు కూడా, పాపం తన బిడ్డను భూతం బారినుండి కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేశారు. కానీ ఏదీ ఫలించలేదు. ఒక రోజున ఆయనకెవరో చెప్పారు - మైసూరు యువరాణిని సరిగ్గా ఇదేలాంటి భూతం పూనినప్పుడు, ఒక బ్రాహ్మణుడు ఆమెను చిటికెలో ఎలా స్వస్థపరిచాడో. వెంటనే ఆయన తన మిత్రుడైన మైసూరు రాజుకు ఒక ఉత్తరం రాశారు- తన బిడ్డనుకూడా ఆ భూతం బారినుండి తప్పిస్తే బ్రాహ్మణుడిని తగిన విధంగా సన్మానిస్తామని.


మైసూరురాజుగారు బ్రాహ్మణుడిని పిలిపించి, ట్రావన్ కూర్ రాజుగారి ఆస్థానానికి వెళ్లి, ఆ యువరాణికి సాయం చేసి రమ్మని అభ్యర్థించాడు. ఆ బ్రహ్మరాక్షసుడిని మరోసారి ఎదుర్కోవటం అనగానే బ్రాహ్మణుడికి ఒళ్లు చల్లబడింది. వణుకు మొదలైంది. అయినప్పటికీ, రాజుగారి ఆజ్ఞాయె! అతిక్రమించే వీలు లేదాయె! చాలాసేపు ఆలోచించీ, ఆలోచించీ అతను ఒక నిర్ణయానికి వచ్చాడు: తనకేమన్నా అయితే తన భార్యా బిడ్డల పోషణ సరిగా జరిగేటట్లు ఏర్పాట్లు చేసి, తను ట్రావన్ కూర్ కు బయలుదేరివెళ్లాడు.


అయితే ఒకసారి అక్కడకు చేరుకున్నాక కూడా, బ్రహ్మరాక్షసుడిని ఎదుర్కొనేందుకు అతనికి ధైర్యం చాలలేదు. తనకు ఆరోగ్యం బాగా లేనట్లు నటిస్తూ అతను మూర్ఛపోయాడు. అలా దాదాపు రెండు నెలలపాటు తన గదిలోంచి కాలు బయట పెట్టలేదు. అయినా రెండు నెలల తర్వాత ఇక దాటవేసేందుకు వీలులేకపోయింది. యువరాణిని పీడిస్తున్న రాక్షసుడిని తరిమివేయాల్సిందేనని ఉత్తర్వులు వెలువడ్డాయి!


ఇక అతను ప్రాణాలు అరచేతబట్టుకొని, యువరాణీవారిని చూడటం కోసం బయలుదేరాడు. తనను ఈ గండం నుండి తప్పించమని భగవంతుడిని వెయ్యి రకాలుగా ప్రార్థిస్తూ, అతను రాజుగారి ప్రాసాదానికి చేరుకుని, అక్కడినుండి అంత:పురంలో యువరాణీవారి మందిరంలో ప్రవేశపెట్టబడ్డాడు. అతణ్ని చూసిన మరుక్షణం బ్రహ్మరాక్షసుడు గర్జించాడు - "నిన్ను చంపేస్తాను! ముక్కలు ముక్కలుగా చేసి తినేస్తాను. నీకు ఇక్కడికి రావాల్సిన పనేముంది? నిన్ను వదిలేది లేదు" అని అరుస్తూ వాడు ఒక పెద్ద ఇనుప రోకలిని చేతబట్టుకొని బ్రాహ్మణుని మీదకు ఉరికాడు. బ్రాహ్మణుడి పైప్రాణాలు పైనే పోతున్నాయి. అయినా ప్రాణాలకు తెగించి వచ్చి ఉన్నాడు గనుక ఆ తెగింపు నుండి వచ్చిన ధైర్యంతో నిటారుగా నిలబడి, లేని గాంభీర్యాన్ని గొంతులోకి తెచ్చుకొని గట్టిగా అన్నాడు- "చూడు, నువ్వు నేను చెప్పిన మాట విని మర్యాదగా ఈ యువరాణిని విడిచిపెట్టి వెళ్తావా?, లేకపోతే ఆ గుడిలోని సంగీతకారుడిని ఓసారి పిలిపించమంటావా? అతనైతే ఈ అంత:పురంలో కూర్చొని రాత్రింబవళ్లూ చక్కగా తనశైలిలో సంగీత సాధన చేస్తాడు మరి, నీకు అభ్యంతరం లేకపోతే!" అని.


'సంగీతకారుడు' అనే మాట వినగానే ఆ బ్రహ్మరాక్షసుడికి ఆ సంగీతమూ, దాని కారణంగా తను పడ్డ బాధా ఒకేసారి గుర్తుకొచ్చాయి. ఆ బాధను తలుచుకొని వాడు భయంతో వణికిపోయాడు- "వద్దు! వద్దు! అతన్ని మాత్రం పిలువకు! నేను వెళ్లిపోతున్నాను" అని అరుస్తూ వాడు యువరాణిని వదిలిపెట్టి ఒక్కసారిగా మాయమయిపోయాడు.


అటుపైన ట్రావన్ కూర్ యువరాణి ఆరోగ్యం త్వరితంగా కుదురుకున్నది. రాజుగారికి బ్రాహ్మణుడు చేసిన సహాయం ఎక్కడలేని ఆనందాన్ని ఇచ్చింది. ఆయన బ్రాహ్మణుడికి ఎన్ని బంగారు నాణేలు ఇచ్చాడంటే, ఆ మొత్తాన్నీ బండ్లల్లో నింపుకొని, మైసూరు చేరుకొన్న బ్రాహ్మణుడు, తన భార్యాపిల్లలతో కలిసి ఇంకా ఆ డబ్బును లెక్కపెడుతూనే ఉన్నాడు!

[15/11, 12:01 pm] +91 93913 24915: 🌼🌿*శ్రీ లలితా సహస్ర నామముల నుండి రోజుకు ఒక శ్లోకం నేర్చుకుందాం*🌼🌿


శ్లోకం 102


*మణిపూరాబ్జనిలయా,  వదనత్రయ సంయుతా !


వజ్రాదికాయుధోపేతా, డామర్యాదిభిరావృతా *!! 102


మణిపూరాబ్జనిలయా - మణిపూర పద్మములో (నాభి స్థానం)నందు వసించునది.


వదనత్రయ సంయుతా - మూడు ముఖములతో కూడి యుండునది.


వజ్రాదికాయుధోపేతా - వజ్రం మొదలైన ఆయుధములను ధరించి ఉండునది.


డామర్యాదిభిరావృతా - డామరము, ఆదిభి మొదలైన శక్తి దేవతలచే పరివేష్టింపబడి యుండునది.


          🌼🌿 శ్రీ మాత్రే నమః🌼🌿

[15/11, 12:01 pm] +91 93913 24915: _*రేపు ఆకాశదీపం ప్రారంభం*_




🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉




*ఆకాశదీప మహాత్మ్యం*




☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️




కార్తికమాసం ఆకాశదీపంతో ప్రారంభమవుతుంది. నిజానికి ఏవి ఆకాశదీపాలు. మీరు నేను పెట్టక్కరలేదు. ఆకాశదీపాలు వెలిగించినవాడు పరమేశ్వరుడు. సూర్యుడు , చంద్రుడు , నక్షత్రాలు ఇవీ ఆకాశదీపాలు. *మరి కార్తికమాసం ప్రారంభం దేనితో మొదలు ?* ఆకాశదీపంతో ప్రారంభం. *ఆకాశదీపం ఎక్కడ వెలిగిస్తారు ?* దేవాలయంలో వెలిగిస్తారు. దేవాలయంలో ధ్వజ స్తంభానికి తాడుకట్టి ఒక చిన్న పాత్రలో దీపం వెలిగించి , గాలికి నిధనం కాకుండా రంధ్రములతో ఏర్పాటు చేసి దాన్ని జాగ్రత్తగా శమంతకంగా భగవంతుని నామాలు చెపుతూ , భక్తులందరూ చుట్టూ నిలబడి ఉండగా , ఆ దీపాన్ని పైకెత్తుతారు. ఎవరి శక్తి కొలదీ వాళ్లు తగినట్లుగా వారు కార్తిక మాసంలో భక్తులు ఆకాశదీపానికి చమురో , వత్తులో ఇస్తూ ఉంటారు. *ఆ దీపాన్ని పైకెత్తుతారు ఎందుకని ?*  ఆ దీపం ధ్వజస్తభంం మీద ఉండి అంతటా వెలుతురు చిమ్ముతుంది. ధ్వజస్తంభం మీదకి ఏదైనా లాగారు అంటే , పతాకాన్ని ఆరోహణ చేశారు అంటే ఈశ్వరునికి ఉత్సవం అవుతుందని గుర్తు. ఇంకా కార్తికమాసంలో మనమే ఉత్సవం చేస్తున్నాం. మనకి మనం ఉత్సవం. ఉత్‌ అంటే తలపైకెత్తడం , తల పైకెత్తి చూశాడు కాబట్టి ఉత్సవం. ఏమిటి తల పైకెత్తి చూడ్డం ? నాకు ఉన్న గౌరవం ఏమిటి ? ఈ శరీరంలో ఉంటూ నేను చేయగలిగిన అధికారం ఏమిటి ? సమస్త భూతాలకు నేను మహోపకారం చేయగలను కార్తికపౌర్ణమి నాడు. ఇతర ప్రాణులు చేయలేవు. నేనే చేయగలను.   ఏమిటి చేయగలను ? దీపం తీసుకెళ్లి ఓ గదిలో పెట్టాననుకోండి కొంత ఫలితం. వీధిలోకి తీసుకువచ్చి దీపం పెట్టాననుకోండి విశేషఫలితం. అందుకే గుత్తు దీపాలని పెడతారు. ఇంతంత వత్తులు వేసి కట్టకట్టి దీపం వెలిగిస్తారు ఆ రోజున. యథార్థానికి శాస్త్రంలో ఏమి చెప్పారంటే ఆ రోజున చెత్త కూడా వెలిగించాలి. వీధులలో ఉన్న చెత్త కూడా వెలిగించేసేయమన్నారు. కానీ లౌకికాగ్నితో వెలిగించకూడదు. మీ ఇంట దీపం వెలిగించి కార్తిక పౌర్ణమి నాటి ప్రదోషవేళ , దామోదరమావాహయామి అనిగాని , త్రయంబకమావాహయామ అనిగాని అని , ఆ దీపంతో వెలిగించాలి. ఈ దీపం పెట్టి ఒక్కసారి ఆకాశం వంక చూసి ఒక శ్లోకం చెప్పాలి.

*కీటాఃపతంగాః మశకా శ్చ వృక్షాః*

*జలేస్థలే… ఫలే ఏ నివసంతి*

*జీవా దృష్ట్యా ప్రదీపం నచ జన్మ భాగినః*

*భవతింత్వ స్వపచాహి విప్రాః*

ఈ శ్లోకం చెప్పి నమస్కారం చేయాలి. ఇప్పుడు నువ్వు నమస్కారం చేస్తే పరమేశ్వరుడు ఎంతో ఆనందాన్ని పొందుతాడు. ఒరేయ్‌ వీడికి నేను మనుష్య శరీరాన్నిస్తే వీడు ఇన్ని భూతాలలో ఉన్న విభూతులను వాడుకున్నాడు. ఇన్నిటిని వాడుకున్నందుకు ఇవాళ వీడు ప్రత్యుపకారం చేశాడు. ఈ ఉపకార బుద్ధి , కృతజ్ఞత ఉన్నవాడు కాబట్టి నా మాట నమ్మి ఉపకారం చేశాడు. కాబట్టి వీడికి నేను మళ్లీ మనుష్యు శరీరం ఇవ్వవచ్చు. ఈ మాట చెప్పినపుడు *‘కీటాఃపతంగాః మశకాశ్చ వృక్షాః’* కీటకములుంటాయి. చిన్నచిన్న పురుగులు. అవి ఎందుకు పుడతాయంటే దీపంలో పడి చచ్చిపోవటానికి పుడతాయి. వాటివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే నాకేం ఉండదు. బల్లులకుంటుంది. పురుగులను పట్టి తింటాయి. ఇతర భూతములకు ఆహారమై పోతాయి. అధవా వాటి ఆయుర్ధాయం దేనివల్ల నశించిపోతుంది. ఆ దీపం యొక్క జ్యోతి మీద కొంచెంగా పడిపోతాయి. కింద పడిపోయి వాటి రెక్కలు వూడిపోతాయి.

అటువంటి దీపపు పురుగులు దీపం మీద పడి కాలిపోవడం చచ్చిపోవడమే తప్ప అభ్యున్నతి పొందినది లేదు. ఆ దీపం వల్లనే అని తెలిస్తే కదూ ! పైగా దీపంలో ఎక్కువగా పడిపోతే దీపం నిధనమైన పాపం వస్తుంది వాటికి తప్ప , దీపం వల్ల ప్రయోజనం పొందలేదు. అని ఇవాళ ఈశ్వరా నేను ఒక సంకల్పం చెప్తున్నాను , ఈ దీపం దీపం కాదు , ఇది త్రయంబకుడు , ఇది దామోదరుడు , కాబట్టి దీనివల్ల మొదటి ఫలితమెవరికి వెళ్లాలంటే *కీటాఃపతంగాః మశకాశ్చ , కీటకములు: పురుగులు , పతంగాలు , మశకాశ్చ: దోమలు , వృక్షాః* అవి యెంతో ఉపకారం చేస్తాయి. కాయలిస్తాయి , పళ్లు ఇస్తాయి. ఆకులిస్తాయి , కొమ్మలిస్తాయి , రెమ్మలిస్తాయి , కలపనిస్తాయి , ఇళ్లు కట్టుకుంటాం. ఇన్ని చేస్తాం. కానీ ఎండలో అది నిలబడి మనకు నీడనిస్తుంది తప్ప దాని జన్మాంతరంలో అది మాత్రం ఎక్కడికీ వెళ్లలేదు. అలాగే ఉండాలి. ఒక ఆవు వచ్చి దాని కొమ్మలు కొరుక్కు తినేస్తున్నా , ఒక ధూర్తుడు వచ్చి కొమ్మ విరిచేస్తున్నా , ఏవో ప్రాణులొచ్చి దాని మీద కెక్కి అలజడి చేసేసి కొమ్మలన్నీ వొంచేస్తున్నా , గొడ్డలి పెట్టి తనను నరికేస్తున్నా , ఒక్క అడుగు ఇలా తీసి , అలా వేయలేని దైన్యం చెట్టుది. అదలాగే నిలబడుతుంది. ఆ చెట్టు ఎలా అభ్యున్నతిని పొందుతుంది. కదలలేనపుడు , కర్మ లేనపుడు , దానికి కర్మాధికారం ఏది ?  అది సంపాదించుకోలేదు. కాబట్టి ఈశ్వరా ! నీ దీపపు వెలుతురు ఆ చెట్టుమీద పడుతోంది. కాబట్టి దామోదరుడి చేయి దానిమీద పడినట్టే ! త్రయంబకుని చేయి దానిమీద పడినట్టే ! అది అభ్యున్నతిని పొందాలి.

నీటిలో ఉండే చేపలుంటాయి , కప్పలుంటాయి , తాబేళ్లుంటాయి. ఈ దీపపు వెలుతురు నీటిమీద పడినపుడు , నీటి లోపల ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా నీ అనుగ్రహాన్ని పొందాలి. అక్కడితో సరిపోతుందా ? 

ఇది కాదు. *జలేస్థలే నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచజన్మ భాగినః* వాటికేం తెలియదు. అవేం పుణ్యం చేయలేదు , కానీ ఈ వెలుతురు వాటిమీద పడిన కారణం చేత ఇక వాటికి జన్మ లేకుండుగాక ! అక్కడితో వాటికున్నటువంటి పాప పుణ్యాలన్నీ కూడా నశించిపోవుగాక ! అని *భవతింత్వ శపచాపవిప్రాః* అసలు వేదం మీద నమ్మకం లేకుండా కేవలం ప్రాపంచిక కర్మాచరణము మాత్రమే చేస్తూ ఈ లోకంలో తిరుగుతూ కేవలం ఉదర పోషణార్థమే బతుకుతున్న భయంకరమైన స్థితిలో ఉండిపోయిన వాడిమీద ఈ దీపం యొక్క కాంతి ప్రసరించిన కారణం చేత వాడుకూడా వచ్చే జన్మలో వేదము యొక్క ప్రమాణం తెలుసుకున్న వాడై స్వరంతో వేదాన్ని చదువుకొని వేదాన్ని ప్రచారం చేసి వేదానికి చేతులడ్డుపెట్టి లోకోద్ధరణ చేయగలిగిన నిస్వార్థతపూరితమైన లోకోపకారియైన బ్రాహ్మణుడిగా జన్మించి అభ్యున్నతిని పొందుగాక ! కాబట్టి *భవంతిత్వం స్వపచాహివిప్రా:*  ఈ దీపపు కాంతి అంత గొప్పది. కాబట్టి ఈశ్వరా , నీ యందు త్రయంబకుణ్ణి , దామోదరుణ్ణి అవాహన చేసి ఈ దీపపు వెలుతురు నీయందు ప్రసరించేటట్లు చేస్తున్నాను.

అందుకే కార్తిక పౌర్ణమి నాడు అన్ని చోట్లా దీపాలెత్తుతారు. ఇక దీపమెత్తని ప్రదేశముండదు. కార్తిక పౌర్ణమి నాడు సాయంకాలం ఉపన్యాసం చెప్తే ఎవరూ ఉండరు. చెప్పకూడదు. ఎందుకంటే కార్తికపౌర్ణమి అంటే ప్రతీ వాళ్లూ ఇళ్లలో చేసుకోవాలి.

[15/11, 12:01 pm] +91 93913 24915: _*🚩కార్తీక పురాణం - 30 అధ్యాయాలు🚩*_


🕉️☘🕉☘🕉☘🕉☘🕉☘🕉


*1 . వ అధ్యాయం -  కార్తీక మాసం మహత్యం*



*2 . వ అధ్యాయం - సోమవార వ్రత మహిమ*



*3 . వ అధ్యాయం - కార్తీక మాస  స్నాన మహిమ*



*4 . వ అధ్యాయం - దీపారాధన మహిమ*



*5 . వ అధ్యాయం - వనభోజన మహిమ*



*6 . వ అధ్యాయం - దీపదానవిధి - మహత్యం*



*7 . వ అధ్యాయం - శివకేశవార్చన విధులు*



*8 . వ అధ్యాయం - శ్రీహరి నామస్మరణా ధన్యోపాయం*



_*9 . వ అధ్యాయం - విష్ణు పార్శద , యమ దూతల  వివాదము*_



*10 . వ అధ్యాయం - అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము*



*11 . వ అధ్యాయం - మంథరుడు - పురాణ మహిమ*



*12 . వ అధ్యాయం - ద్వాదశి ప్రశంస*



*13 . వ అధ్యాయం - కన్యాదాన ఫలము*



*14 . వ అధ్యాయం - ఆబోతును అచ్చుబోసి వదలుట (వృషోత్సర్గము)*



*15 . వ అధ్యాయం - దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మస్మృతితో నరరూపమందుట*



*16 . వ అధ్యాయం - స్తంభ దీప ప్రశంస*



*17 . వ అధ్యాయం - అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము*



*18 . వ అధ్యాయం - సత్కర్మానుష్టాన ఫల ప్రభావము*



*19 . వ అధ్యాయము - చతుర్మాస్య వ్రత ప్రభావనిరూపణ*



*20 . వ అధ్యాయము - పురంజయుడు దురాచారుడగుట*



*21 . వ అధ్యాయము - పురంజయుడు కార్తీక ప్రభావము నెరుంగుట*



*22 . వ అధ్యాయము - పురంజయుడు కార్తీక పౌర్ణమీ వ్రతము చేయుట*



*23 . వ అధ్యాయము - శ్రీ రంగక్షేత్రమున పురంజయుడు ముక్తినొందుట*



*24 . వ అధ్యాయము - అంబరీషుని ద్వాదశీవ్రతము*



*25 . వ అధ్యాయము - దూర్వాసుడు అంబరీషుని శపించుట*



*26 . వ అధ్యాయము - దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట - శ్రీహరి హితబోధ*



*27 . వ అధ్యాయము - దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట*



*28 . వ  అధ్యాయం - విష్ణు సుదర్శన చక్ర మహిమ*



*29 . వ అధ్యాయం -  అంబరీషుడు దుర్వాసుని పూజించుట - ద్వాదశి పారణము*



*30 . వ అధ్యాయం - కార్తీకవ్రత మహిమ్నా ఫలశ్రుతి*

🙏🙏🌷🙏🙏🌷🙏🙏🌷🙏🙏

[15/11, 12:01 pm] +91 93913 24915: *🚩కార్తీకపురాణం - 1 వ అధ్యాయం🚩*_


🕉☘️🕉️☘️🕉️☘️🕉️☘️🕉️☘️🕉️


*కార్తీక మాసం మహత్యం*


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


ఒకరోజు నైమిశారణ్యంలో శౌనకాది మహామునులు కలిసి గురుతుల్యులైన సూతమహర్షితో ఇలా కోరారు… *”ఓ మహాత్మా… మీ ద్వారా ఎన్నో పురాణేతిహాసాలను , వేదవేదాంగాల రహస్యాలను గ్రహించాము. కార్తీక మాసం మహత్యాన్ని కూడా వివరించండి. ఆ మాసం పవిత్రత , కార్తీకపురాణ ఫలితాలను కూడా వివరించండి..”* అని కోరారు.


శౌనకాది మహామునుల కోరికను మన్నించిన సూతమహర్షి ఇలా అంటున్నాడు… *”ఓ మునిపుంగవులారా… ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోకసంచారి అయిన నారదమహాముని బ్రహ్మదేవుడిని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించారు. అదే సమయంలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు , పార్వతీదేవికి పరమశివుడు ఈ పురాణాన్ని వివరించారు. అలాంటి పరమ పవిత్రమైన పురాణాన్ని మీకు వివరిస్తాను. ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి. ఈ పురాణగాథను విన్నంతనే ఇహలోకంలో , పరలోకంలో సకలైశ్వర్యములు పొందగలరు. కాబట్టి శ్రద్ధగా వినండి”* అని చెప్పసాగాడు.



పూర్వం ఒకరోజు పార్వతి పరమేశ్వరులు ఆకాశమార్గంలో విహరిస్తుండగా… పార్వతి దేవి పరమశివుడితో *”ప్రాణేశ్వరా… సకల ఐశ్వర్యాలను కలుగజేసి , మానవులంతా కులమత తారతమ్యం లేకుండా , వర్ణభేదాలు లేకుండా ఆచరించే వ్రతమేదైనా ఉంటే వివరించండి”* అని కోరింది.


అంతట పరమశివుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి ఇలా చెబుతున్నాడు *”దేవీ ! నీవు అడిగే వ్రతమొక్కటి ఉంది. అది స్కంధపురాణంలో ఉప పురాణంగా విరాజిల్లుతోంది. దానిని వశిష్ట మహాముని మిథిలాపురాధీశుడైన జనక మహారాజుకు వివరించారు. అటు మిథిలానగరం వైపు చూడు….”* అని ఆ దిశగా చూపించాడు.


మిథిలానగరంలో వశిష్టుడి రాకకు జనకమహారాజు హర్షం వ్యక్తం చేస్తూ అర్ఘ్యపాద్యాలతో సత్కరించారు. ఆపై కాళ్లు కడిగి , ఆ నీటిని తన తలపై జల్లుకుని ఇలా అడుగుతున్నాడు *”ఓ మహామునివర్యా… మీ రాకవల్ల నేను , నా శరీరం , నా దేశం , ప్రజలు పవిత్రులమయ్యాము. మీ పాద ధూళితో నా దేశం పవిత్రమైంది. మీరు ఇక్కడకు రావడానికి కారణమేమిటి ?”* అని కోరగా…. వశిష్ట మహాముని ఇలా చెబుతున్నాడు *”జనక మహారాజ ! నేనొక మహాయజ్ఞము చేయాలని నిర్ణయించాను. అందుకు కావాల్సిన ధన , సైన్య సహాయానికి నిన్ను కోరాలని వచ్చాను”* అని తాను వచ్చిన కార్యాన్ని వివరించారు.


దీనికి జనకుడు *”మునిపుంగవా… అలాగే ఇస్తాను. స్వీకరించండి. కానీ , ఎంతో కాలంగా నాకొక సందేహమున్నది. మీలాంటి దైవజ్ఞులైనవారిని అడిగి సంశంయం తీర్చుకోవాలని అనుకునేవాడిని. నా అదృష్టం కొద్ది ఈ అవకాశం దొరికింది. ఏడాదిలోని మాసాలన్నింట్లో కార్తీక మాసమే ఎందుకు పరమ పవిత్రమైనది ? ఈ నెల గొప్పదనమేమిటి ? కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా ?”* అని ప్రార్థించారు.


వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి *”రాజ ! తప్పక నీ సందేహాన్ని తీర్చగలను. నేను చెప్పబోయే వ్రతకథ సకలమానవాళి ఆచరించదగినది. సకల పాపాలను హరించేది. ఈ కార్తీకమాసం హరిహర స్వరూపం. ఈ నెలలో ఆచరించే వ్రత ఫలితం ఇదీ… అని చెప్పలేం. వినడానికి కూడా ఆనందదాయకమైనది. అంతేకాదు.. ఈ కార్తీక మాస కథను విన్నవారు కూడా నరక బాధలు లేకుండా ఈ లోకంలోనూ , పరలోకంలోనూ సౌఖ్యంగా ఉంటారు. నీలాంటి సర్వజ్ఞులు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవడం శుభప్రదం. శ్రద్ధగా ఆలకించు….”* అని చెప్పసాగాడు.


*కార్తీక వ్రతవిధానం*


*”ఓ జనక మహారాజా ! ఎవరైనా , ఏ వయసువారైనా పేద - ధనిక , తరతమ తారతమ్యాలు లేకుండా కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చు. సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా…. వేకువ జామున లేచి , కాలకృత్యాలు తీర్చుకుని , స్నానమాచరించి , దానధర్మాలు , దేవతాపూజలు చేసినట్లయితే… దానివల్ల అనన్యమైన పుణ్యఫలితాన్ని పొందగలరు. కార్తీకమాసం ప్రారంభం నుంచి ఇలా చేస్తూ… విష్ణుసహస్రనామార్చన , శివలింగార్చన ఆచరిస్తూ ఉండాలి. ముందుగా కార్తీక మాసానికి అధిదేవత అయిన దామోదరుడికి నమస్కారం చేయాలి. ‘ఓ దామోదర నేను చేసే కార్తీక మాస వ్రతానికి ఎలాంటి ఆటంకం రానీయక నన్ను కాపాడు’ అని ధ్యానించి ప్రారంభించాలి”* అని వివరించారు.


వ్రతవిధానం గురించి చెబుతూ… *”ఓ రాజా ! ఈ వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి , కాలకృత్యాలు తీర్చుకుని , నదికిపోయి , స్నానమాచరించి గంగకు , శ్రీమన్నారయణ , పరమేశ్వరులకు , బైరవుడికి నమస్కరించి సంకల్పం చేసుకోవాలి. ఆ తర్వాత నీటిలో మునిగి , సూర్యభగవానుడికి అర్ఘ్యపాదాలను సమర్పించి , పితృదేవతలకు క్రమప్రకారం తర్పణలు చేయాలి. గట్టుపై మూడు దోసిళ్ల నీరు పోయాలి. ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన గంగా , గోదావరి , కృష్ణ , కావేరీ , తుంగభద్ర , యుమన తదితర నదుల్లో ఏ ఒక్కనదిలోనైనా స్నానం చేసినట్లయితే… గొప్ప ఫలితం లభిస్తుంది. తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని , శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పూలను తానే స్వయంగా కోసి తీసుకొచ్చి , నిత్యధూప , దీప , నైవేద్యాలతో భగవంతుని పూజచేయాలి. గంధము తీసి , భగవంతునికి సమర్పించి , తానూ బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత అతిథిని పూజించి , వారికి ప్రసాదం పెట్టి , తన ఇంటివద్దగానీ , దేవాలయంలోగానీ , రావిచెట్టు మొదటగానీ కూర్చొని కార్తీకపురాణం చదవాలి. ఆ సాయంకాలం సంధ్యావందనం చేసి , శివాలయంలోగానీ , విష్ణు ఆలయంలోగానీ , తులసికోట వద్దగానీ , దీపారాధన చేసి , శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి , స్వామికి నివేదించాలి. అందరికీ పంచి , తానూ భుజించాలి. తర్వాతిరోజు మృష్టాన్నంతో భూతతృప్తిచేయాలి. ఈ విధంగా వ్రతం చేసిన మహిళలు , మగవారు గతంలో , గతజన్మలో చేసిన పాపాలు , ప్రస్తుత జన్మలో చేసిన పాపాలను పోగొట్టుకుని మోక్షాన్ని పొందుతారు. ఈ వ్రతం చేయడానికి అవకాశం లేనివారు , వీలు పడనివారు వ్రతాన్ని చూసినా , వ్రతం చేసినవారికి నమస్కరించినా… వారికి కూడా సమాన ఫలితం వస్తుంది.



*ఇది స్కాంద పురాణంలోని వశిష్టమహాముని చెప్పిన కార్తీక మహత్యంలోని మొదటి అధ్యాయం సమాప్తం.*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

[15/11, 12:01 pm] +91 93913 24915: *వీరయ్య దయ్యం -- చందమామ కథలు*


*ఒక ఊళ్ళో వీరయ్య అనే రైతు ఉండేవాడు. అతని భార్య పేరు మంగమ్మ. కష్టజీవులైన వాళ్ళకు రాజయ్య అనే కొడుకు ఉండేవాడు. రాజయ్య ముమ్మూర్తులా తండ్రి పోలికే. నాట్ల తరుణంలో ఒకనాడు వీరయ్య ముఖ్యమైన పనులున్నాయని, చీకటితో ఇంటి నుంచి బయలుదేరి పొలానికి వెళ్ళాడు. వెళ్ళిన కొంతసేపటికి నలుగురు మనుషులు వీరయ్య శవాన్ని ఇంటికి చేర్చారు. చీకట్లో అతన్ని పాముకరిచింది.*


*ఇంటి దగ్గిర ఏడ్చి, ఏడ్చి, ఏడ్చి, సొమ్మసిల్లి పడిపోయిన మంగమ్మకు మగతనిద్రలో ఒక కల వచ్చింది. తన భర్త దయ్యమై, వికృతంగా నవ్వుతూ, గుడ్లగూబలా అరుస్తూ, శ్మశానం దగ్గిర ఉన్న మర్రిచెట్టు మీదికి ఎగిరిపోయినట్టు ఆమె కలగని, కెవ్వున అరిచి, లేచి కూర్చున్నది. ఆమెను కనిపెట్టుకుని ఉన్న ఇరుగు పొరుగు అమ్మలక్కలు, ‘‘ఏమయింది, మంగమ్మా? పీడ కలగానీ వచ్చిందా?'' అని అడిగారు. ‘‘నా మొగుడు దయ్యం అయ్యాడు!''*


*అంటూ మంగమ్మ తనకు వచ్చిన కల వివరంగా వాళ్ళకు చెప్పింది. వీరయ్య పోయిన మూడో రోజున, శ్మశానం దగ్గిర మర్రిచెట్టు కింద మూర్ఛపోయి పడి ఉన్న ఒక వ్యాపారిని ఊరి వాళ్ళు తీసుకువచ్చి, ఉపచారాలు చేసి, తెలివి తెప్పించారు. వ్యాపారి మొదట పిచ్చిచూపులు చూసి, తరవాత తేరుకుని, క్రితం రాత్రి తనకు జరిగినది చెప్పాడు. ఆ వ్యాపారిది సమీపంలో ఉన్న మరొక గ్రామం.*


*అతను తన దుకాణానికి కావలిసిన సరుకులన్నీ ఎప్పుడూ ఈ వూరినుంచే పట్టుకుపోయేవాడు. ఆ ప్రకారమే అతను మూడో ఝామున లేచి, ఈ ఊరికి సరుకుల కోసం బయలుదేరాడు. దారి అతనికి అలవాటైనదే. తను శ్మశానం దగ్గిరికి వచ్చేసరికి నక్కలూ, గుడ్లగూబలూ అరవటం వినిపించి భయం పుట్టింది.*


*మర్రి ఆకులు గలగల మన్నాయి. లాల్చీవేసుకుని ఎవరో ఊగుతున్నట్టు అతనికి లీలగా కనిపించింది. అసలే ఆ వ్యాపారికి దయ్యాల భయం! దానికి తగ్గట్టుగా ఆ దయ్యం, ‘‘ఒరే వ్యాపారీ, నీ దగ్గిర ఉన్న డబ్బు ఇలా ఇచ్చిపో! నా పెళ్ళాంబిడ్డలకు జరుగుబాటు కావద్దా? నేనెవరో తెలుసా? వీరయ్యను! ఇవ్వక పోతే చంపేస్తా,'' అన్నది. వెంటనే వ్యాపారికి స్పృహ తప్పింది.*


*వ్యాపారి మాటలలో నమ్మకం కుదిరి ఊరివాళ్ళు, వ్యాపారి పోగొట్టుకున్న డబ్బు కోసం మంగమ్మ ఇల్లంతా గాలించారు. కాని వాళ్ళకు అక్కడ చిల్లిగవ్వ కూడా దొరకలేదు. మంగమ్మ వెక్కి, వెక్కి ఏడ్చింది. అకాలమరణం పాలైన గంగిగోవు లాటి తన భర్త దయ్యం కావటమేగాక, బాటసారులను బాధించి దోచుకోవటం ఆమెకు చాలా బాధ కలిగించింది. మంగమ్మ పట్ల ఊళ్ళోవాళ్ల ప్రవర్తన కూడా మారిపోయింది.*


*వాళ్ళు ఆమెను పలకరించటం మానేశారు. ఆమె కనబడితే మొహం తిప్పుకోసాగారు. మర్నాడు అర్ధరాత్రి పొద్దుపోయి పొరుగూరు నుంచి వస్తున్న ఆడమనిషి నగలు దయ్యం దోచేసి, ‘‘ఈ నగలు నా పెళ్ళాం పెట్టుకుంటే మరింత అందంగా ఉంటుంది!'' అన్నది. మర్నాడు ఊరి వాళ్ళంతా ఏకమై వచ్చి, మంగమ్మ ఇంటిని సోదాచేసి, ఏమీ దొరక్కపోయినా, ‘‘నీ మొగుడు ఈ ఊరికి పెద్ద పీడ అయి కూర్చున్నాడు. వాణ్ణి మర్యాదగా ఊరువదిలి వెళ్ళమను. లేకపోతే నీ మర్యాద దక్కదు!''*


*అని గట్టిగా బెదిరించి వెళ్ళిపోయారు. మంగమ్మకు ఏమీ పాలుపోలేదు. తనకూ, చచ్చిపోయిన తన భర్తకూ ఇంకా సంబంధం ఉన్నదనే ఊరివాళ్ళు అనుకుంటున్నారు! వరసగా మరి ముగ్గురికి దయ్యం కనిపించింది. చీకటి పడితే ఎవరూ శ్మశానం చాయలకు పోవటం లేదు, అటు నుంచి రావటమూ లేదు.*


*ఊళ్ళోవాళ్ళు మాత్రం తమలో తాము సుదీర్ఘంగా చర్చించుకుని, మంగమ్మతో, ‘‘నువ్వూ, నీ కొడుకూ ఈ ఊరు విడిచిపోతే గాని మాకు వీరయ్య దయ్యం బెడద వదలదు. రేపు లోపల మీరు వెళ్ళిపోకపోతే, మేమే మిమ్మల్ని సాగనంపగలం!'' అని హెచ్చరిక చేశారు.*


*ఇల్లూ, వాకిలీ వదిలేసి ఎక్కడికి వెళ్ళేట్టు? మంగమ్మ తన భర్తతోనే మంచిగా వెళ్ళి పొమ్మని చెప్పటానికి గుండె రాయిచేసుకుని, చీకటి పడ్డాక శ్మశానం కేసి వెళ్ళింది. ఆమెకు నక్కల కూతలు వినిపిస్తున్నాయి. ఆమె మర్రి చెట్టు ప్రాంతానికి రాగానే, చెట్టు కొమ్మల్లో నుంచి, ‘‘ఆగవే, ఆగు! నా పెళ్ళాం బిడ్డలకు జరుగుబాటు కావద్దా? నీ దగ్గిర ఉన్నదంతా అక్కడ పెట్టు! నే నెవరనుకున్నావు? వీరయ్యని!'' అన్నమాటలు వినిపించాయి.*


*మంగమ్మ నిర్ఘాంతపోయింది. ఆ గొంతు వీరయ్యది కాదు. ఆమె వెనక్కు తిరిగి ఊరివైపు వచ్చేసింది. ఆమె ఇల్లు చేరి, జరిగినదంతా రాజయ్యకు చెప్పి, ‘‘ఎవడో వెధవ నాన్న పేరు పాడు చేస్తున్నాడు. వాణ్ణి నలుగురికీ పట్టియ్యాలి,'' అన్నది. అందుకు రాజయ్య ఉపాయం ఒకటి ఆలోచించి, దాన్ని తల్లికి చెప్పాడు. అందుకు మంగమ్మ సమ్మతించింది. మర్నాడు మంగమ్మ ఊరివాళ్ళతో, ‘‘రేపు ఊరు విడిచి పోతున్నాం,'' అని చెప్పేసింది.*


*ఆ రాత్రి తల్లీ కొడుకు లిద్దరూ భోజనం చేశారు. జుట్టుకు తెల్లరంగు పూసుకుంటే రాజయ్య అచ్చగా వీరయ్య లాగే ఉన్నాడు. ఇద్దరూ శ్మశానం చేరారు. రాజయ్య తెల్లధోవతీ, తెల్లలాల్చీ తొడుక్కుని మర్రిచెట్టు తొరల్రో దాక్కున్నాడు. మంగమ్మ సమీపంలోనే ఒక పొద వెనక నక్కింది. కొంచెం సేపటికి ఊరివైపు నుంచి ఒక మనిషి తెల్లపంచే, తెల్లలాల్చీ ధరించి వచ్చి, మర్రిచెట్టు ఎక్కి కొమ్మల మధ్య కూర్చున్నాడు.*


*తరవాత వాడు గుడ్లగూబలు కూసినట్టు కూశాడు. రాజయ్య ఎప్పుడు బయటికి వస్తాడా అని మంగమ్మ తొరక్రేసే చూస్తున్నది. ఇంతలో అతను రానే వచ్చాడు. వచ్చి, చెట్టు మీద ఉన్న మనిషితో, ‘‘దొంగ వెధవా! నా పేరు పాడు చేస్తావా? చూడు, నిన్నేం చేస్తానో! నే నెవరనుకున్నావు? వీరయ్యని!'' అన్నాడు. ఆ మాటలకు చెట్టు మీది మనిషి కిందపడ్డాడు. వాడు భయంతో వణికి పోతూ, ‘‘తప్పయిపోయింది! క్షమించు, వీరయ్యా!'' అని బతిమాలుకున్నాడు.*


*‘‘నిన్నేమీ చెయ్యను. ఇన్నాళ్లూ దోచిన డబ్బు ఎక్కడ దాచావో చూపించు!'' అని వీరయ్య అనేసరికి ఆ మనిషి గజగజలాడుతూ చెట్టు మొదట్లో తవ్వసాగాడు. ఈలోపల మంగమ్మ ఊళ్ళోకి వెళ్ళి, ‘‘నా మొగుడి పేరు పాడుచేస్తున్న దొంగవెధవని చూద్దురు గాని రండి!'' అని నలుగురినీ వెంట బెట్టుకుని శ్మశానానికి వచ్చింది. నకిలీదయ్యం మనిషి, దీపాలతో వచ్చే, మనుషులను చూసి బిత్తరపోయాడు. వాడు తాను దాచిన దొంగ సొమ్మంతా అప్పటికే ఒక్కొక్కటిగా పైకి తీశాడు.*


*‘‘దొంగ వెధవా! ఇదా నువ్వు చేసే పని?'' అంటూ ఊరివాళ్ళు వాడి మీద పడి చితకతన్నారు. అప్పుడు చెట్టు తొరల్రోనుంచి రాజయ్య తొంగి చూసి, ‘‘ఏమిటీ గొడవ? ఏం జరిగింది? నాకు కాస్త కునుకు పట్టిందిలే!'' అన్నాడు. మంగమ్మ నిర్ఘాంత పోయింది. ఈ నాటకం ఆడినది రాజయ్య కాకపోతే మరెవరు? ఆమె తనకు తెలిసినదంతా చెప్పిన మీదట, వీరయ్య దయ్యమే నకిలీదయ్యాన్ని పట్టి ఇచ్చినట్టు ఊళ్ళోవాళ్ళకు అర్థమయింది.*


*పోయిన సొత్తంతా తిరిగి దొరికింది కూడానూ. ఊళ్ళోవాళ్ళు మంగమ్మకు క్షమాపణ చెప్పుకుని, ఊళ్ళోనే ఉండమని బతిమాలారు. దయ్యంలాగా నటించినవాడు మాత్రం ఎవరూ చెప్పకుండానే, తెల్లవారే లోపల ఊరు విడిచి వెళ్ళిపోయాడు. అటుతరవాత వీరయ్య దయ్యాన్ని చూసినవాళ్ళు లేరు.*

[15/11, 2:02 pm] +91 93913 24915: భగినీ హస్త భోజనం అంటే ఏమిటి? ఏరోజున చేయాలి ?

కార్తీక శుద్ధ విదియ అంటే దీపావళి వెళ్ళిన రెండవ నాడు భగినీ హస్త భోజనం అనే వేడుకను జరుపుకుంటారు. సోదరీ సోదరుల ఆప్యాయతానుబంధాలకు అద్దంపట్టే ఒక సంప్రదాయం ఈ భగినీ హస్త భోజనం. భగిని అంటే అక్క లేక చెల్లెలు. ఆమె పెట్టే భోజనం కనుక భగినీ హస్త భోజనం అంటారు. సోదరీ సోదరుల ప్రేమకి అద్దం పట్టే పండుగల్లో రాఖీ పండుగ తర్వాత చెప్పుకోదగినది ఇది. ఈనాడు అన్నదమ్ములు తమతమ అక్కాచెల్లెళ్ళ ఇళ్ళకు బహుమానాలు తీసుకెళ్ళి, వారి చేతి వంట తిని వారిచేత తిలకం దిద్దించుకుంటారు.


“భయ్యా ధూజీ” అనే పేరుతొ ఉత్తరదేశంలో బాగా ప్రాచూర్యం పొందిన భగినీ హస్తభోజనం సోదరుని క్షేమానికి సంబంధించినది.


భగినీహస్త భోజనం పురాణగాధ

మన పురాణాల ప్రకారం యమధర్మరాజు సోదరి యమున  వివాహమై వెళ్ళాక తన సోదరుని తన ఇంటికి ఎన్నోసార్లు ఆహ్వానించింది. కానీ యమధర్మరాజు వెళ్ళలేకపోయాడు. చివరికి ఒకసారి ఈ కార్తీక మాస విదియ రోజున యమున ఇంటికి వెళ్తాడు. సోదరుడు వచ్చాడని యమున సంతోషంగా పిండివంటలతో భోజనం పెట్టింది. చాలా రోజుల తర్వాత సోదరీ సోదరులు కలుసుకోవటంతో ఇరువురూ సంతోషించారు.


ఆ సంతోషంతో యమధర్మరాజు యమునని ఏదైనా వరం కోరుకోమన్నాడు. వాళ్ళు దేవతలు కనుక వారు కోరే వరాలు కూడా జన ప్రయోజనాలుగా వుంటాయి. ఆమె ఈ కార్తీకశుధ్ధ విదియనాడు లోకంలో ఎక్కడైనా సరే, తన సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేసిన సోదరులకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని అడిగింది. ఈ కోరికకి యమధర్మరాజు సంతోషించి, అలా వేడుక జరుపుకున్న వారికి అపమృత్యు దోషం (అకాల మరణం) లేకుండా వుంటుంది, ఆ సోదరి సౌభాగ్యవతిగా వుంటుంది అని వరాలిచ్చాడట. అందువల్లనే ఈ ఆచారం ఆచరణలోకి వచ్చింది. సోదరీ సోదరుల మధ్య అనుబంధాలు పటిష్టంగా ఉండాలంటే  మన పెద్దలు సూచించిన ఇలాంటి సాంప్రదాయాలను మీరూ పాటించండి.

[15/11, 2:05 pm] +91 93913 24915: *స్త్రీ*👑👑👑👑👑👑👑👑👑👑👑

-----


మగాడితోసహా సర్వ జీవులను పుట్టించేసిన దేవుడు చివరగా ఒక స్త్రీని సృష్టించడం మొదలుపెట్టాడు. ఒక రోజూ రెండు రోజులూ కాదు. ఏకంగా వారంరోజులు తీసుకున్నాడు స్త్రీ సృష్టికోసం. మిగిలిన పనులన్నీ మానుకుని తన నాథుడు స్త్రీ సృష్టికోసం ఇంతగా తలమునకలైపోవడం చూసిన దేవత అడిగింది...


*"స్త్రీని సృష్టించడానికి ఎందుకింత సమయం తీసుకున్నారని ?"*


ఆప్పుడు దేవుడు "ఏం చెయ్యను మరి...ఈ స్త్రీ హృదయంలో ఎన్ని విషయాలు పొదగాల్సి వచ్చిందో తెలుసా...ఇష్టాయీష్టాలకతీతంగా ఉండాలీ సృష్టి. వివక్ష తగదు. మొండికేసే పిల్లాడిని క్షణాల్లో దారికి తెచ్చుకోవాలి. చిన్న చిన్న గాయాలు మొదలుకుని ముక్కలయ్యే మనసులవరకూ ఎన్నెన్ని సంఘటనలను ఈ జీవి ఎదుర్కోవాలో తెలుసా...ఆమె ఎంతమందికి ఓ ఔషధంగా పని చేయాలో తెలుసా...ఆమెకు ఆరోగ్యం బాగులేకున్నా సరే తనకు తానే సర్దుకుపోవాలి. అడిగేవారు ఉండరూ ఉండకపోవచ్చు...రోజుకు పద్దెనిమిది గంటలు పని చేయాలి. ఇన్ని రకాల పనులు చెయ్యాల్సి వచ్చినా ఆమెకు ఉన్నవి రెండు చేతులే...." అన్నాడు.


"ఏంటీ ? ఇన్ని పనులు చేయడానికి ఆమెకు రెండు చేతులేనా?" అని ఆశ్చర్యపోతూ దేవత ఆమెను మెల్లగా తాకింది. "ఇదేంటీ ఇంత మృదువుగా ఉందే ఈమె దేహం" అని ప్రశ్నించింది. 


ఆప్పుడు దేవుడు "ఆమె శారీరకంగా మృదువుగా మెత్తగా నాజూకుగా ఉండొచ్చు. కానీ మానసికంగా ఆమె ఎంతో బలవంతురాలు. అందుకే ఆమె ఎన్నో సమస్యలను ఎదుర్కోగలదు. అంతేకాదు, ఆమె అన్ని భారాలనూ తట్టుకోగలదు. ఇష్టం,  కష్టం, ప్రేమ, కోపం, తాపం, అంటూ అన్ని భావోద్వేగాలనూ ఆమె చవిచూడాలి. అవసరమైతే దిగమింగాలి. కోపమొస్తే నవ్వుతూ వెల్లడించే శక్తి ఆమెకుండాలి. తనకు న్యాయం అనిపించినప్పుడు అందుకోసం పట్టుపట్టడమూ తెలుసు. ఇతరుల దగ్గర ఆశించేది ప్రేమానురాగాలను...." అన్నాడు.


"ఓహో. ఈమె ఆలోచించగలదా" అని దేవత అడిగింది.


అప్పుడు దేవుడు "ఎందుకాలోచించదు? అన్ని విషయాలూ ఆలోచించడమే కాకుండా సమస్యలు ఎదురైతే పరిష్కారాలు చెప్పగలదు..." అన్నాడు.


దేవత ఆమె చెక్కిళ్ళను తాకి "ఈ చెక్కిళ్ళు తడిగా ఉన్నాయేంటీ? కన్నీరు కారుస్తోందిగా....ఏంటిది? " అని అడిగింది.


అప్పుడు దేవుడు "అదా...కన్నీరది. ఆ కన్నీటిలో ఆనందమూ ఆవేదనా దుఃఖమూ దిగులూ ఆశ్చర్యమూ భయమూ అంటూ అన్ని రకాల ఉద్వేగానుభూతులూ ఉంటాయి. ఆ కన్నీటికున్న  శక్తి అనంతం....పైగా మరో జీవీకి ప్రాణంపోసి పది నెలలూ పొట్టలో మోసే నేర్పు ఆమెకు ఉంది" చెప్పాడు. 


దేవత ఆశ్చర్యపోతూ "మీ సృష్టిలో విశిష్టమైనది ఇదే. .." అని చెప్పింది. 


అయితే దేవుడు "అంతా బాగానే ఉన్నా ఆమెకు తన విలువా శక్తీ తెలిసినా వాటిని అవసరమైతే తప్ప ప్రయోగించదు. అప్పటివరకూ తెలియనట్టే ఉంటుంది..." అని చెప్పి భూమ్మీదకు పంపాడు స్త్రీని.....


*ఎచ్చట స్త్రీ గౌరవించబడుతుందో - 

ఆ ఇంట సర్వదేవతలు కొలువై ఉంటారు. 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


     🙏🏻లోకాసమస్తాః సుఖినోభవంతు.🙏❤️❤️❤️


సేకరణ...

Dedicated to “daughters and daughter in laws of Nuthakki’s

[15/11, 2:05 pm] +91 93913 24915: శివుడు సైనికుడు అయిన క్షేత్రం-జ్వాలాపహారేశ్వరస్వామి 


🌷 సాగర మథనంలో ఎగజిమ్మిన గరళాన్ని మింగి గరళకంఠుడయ్యాడు. భూలోకవాసుల దాహార్తిని తీర్చేందుకు గంగమ్మను తలమీద ధరించి గంగాధరుడని పిలిపించుకున్నాడు. సకల జనులకు ముక్తినొసగుతూ ముక్తేశ్వరుడయ్యాడు… ఇలా ఒకటా రెండా భక్తుల పాలిట కొంగుబంగారంగా భాసిల్లుతున్న బోళా శంకరుడికి నామాలు అనేకం. మహిమలు అనంతం. అంతటి మహిమకల స్వామి భక్తుడి ప్రాణాలు రక్షించడానికి స్వయంగా పహారా కాసిన క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కొలువైన జ్వాలాపహరేశ్వరస్వామి ఆలయం. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిమీదకు అనేకసార్లు దండెత్తిన జరాసంధుడు ఒకానొక యుద్ధంలో కిట్టయ్యచేతిలో మరణాన్ని తప్పించుకుని పారిపోయి హేలాపురి చేరుకుంటాడు. 


🌷 అక్కడే ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని శివుడి కోసం తపస్సు చేస్తాడు. అతడి తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు జరాసంధుడు తనకి శ్రీకృష్ణుడి చేతిలో మరణం సంభవించకుండా ఎప్పుడూ తన దగ్గరే ఉండి తనను రక్షించమని వేడుకుంటాడు. దీంతో శివుడు లింగరూపంలోనే ఉంటూ జరాసంధుడికి పహారా కాయడం వల్ల ఈ క్షేత్రానికి జ్వాలాపహరేశ్వర ఆలయం అనే పేరు వచ్చింది. కాలక్రమంలో హేలాపురి ఏలూరుగా స్థిరపడిపోయింది. 


చరిత్రకు దర్పణం

🌷 జ్వాలాపహరేశ్వరస్వామి ఆలయాన్ని పదో శతాబ్దంలో వేంగి చాళుక్యులు నిర్మించారని ఆలయ శాసనాలు తెలియజేస్తున్నాయి. వేంగీ రాజుల కాలంలో నిర్మించిన నూట ఎనిమిది శివాలయాల్లో జ్వాలాపహరేశ్వర ఆలయం ఒకటి. నాటి నుంచి నేటి వరకూ స్వామి భక్తుల పాలిట కొంగుబంగారంగా పూజలందుకోవడం విశేషం. ఈ క్షేత్రంలో కొలువైన జ్వాలాపహరేశ్వరస్వామిని జరా పహరేశ్వరస్వామి, జలా పహరేశ్వరస్వామి అని కూడా పిలుస్తారు. అంతరాలయంలోని శరభసాళ్వం అనే కుడ్యశిల్పం విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. 


🌷 శరభ సాళ్వం దర్శనంతో కాలసర్పదోషాలు తొలగిపోతాయని ప్రతీతి. కాకతీయుల కాలంలో శివాచార్యులు అనే శివభక్తుడు స్వామిని సేవించారని చెబుతారు. ప్రముఖ చరిత్రకారులు ఇంగువ కార్తికేయశర్మ, మల్లంపల్లి సోమశేఖరశర్మ ఆలయాన్ని సందర్శించి, ఇది వేంగి చాళుక్యుల కాలం నాటి ఆలయమని నిర్ధరించారు. 


సోదరభావానికి ప్రతీక

🌷 ఈ ఆలయాన్ని ఆనుకుని ముస్లింల దర్గా ఉంది. శివాలయంలోని రాజనంది కాలికి హజ్రత్‌పాషా షహీద్‌ పంచలోహ కడియాన్ని సమర్పించారని ప్రతీతి. దీనికి నిదర్శనంగానే ముస్లిం సోదరులు జ్వాలాపహరేశ్వరస్వామి ఆలయానికి వచ్చి నందిని దర్శించుకుంటారు. అలాగే దర్గాలో జరిగే ఉరుసు ఉత్సవాల్లో ఆలయ అర్చకులూ, హిందూ సోదరులూ పాల్గొంటారు. 


🌷 ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. ఆలయంలోని నందిని వేంగి చాళుక్య రాజనందిగా పిలుస్తారు. సంతానంలేని వారు నంది మెడలో శనగల మూట కడితే తప్పక సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఏ శివాలయంలోనైనా నంది తలమీద నుంచి శివయ్యను దర్శించుకోవడం ఆచారం. కానీ ఈ ఆలయంలో మాత్రం ఆలయం వెనక గర్భాలయం గోడకు ఉన్న రంధ్రం నుంచి శివుడినీ, ఆ తర్వాత రాజనందినీ దర్శించుకోవడం విశేషం. 


ఇతర ఆలయాలు

🌷 ఆలయ ప్రాంగణంలోనే వందల ఏళ్ల చరిత్రగల మహిషాసురమర్దని అమ్మవారి ఆలయం ఉంది. అమ్మవారు ఇక్కడ పెద్దమ్మగా పూజలందుకుంటోంది. అమ్మవారి విగ్రహాన్ని జగద్గురు ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించారని చెబుతారు. 


🌷 శరన్నవరాత్రులు, కల్యాణోత్సవం, కార్తికమాసం, మహాశివరాత్రి పర్వదినాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుంటారు. పెద్దమ్మ ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు తప్పక నెరవేరతాయని భక్తుల నమ్మకం. ఈ ప్రాంగణంలోనే సీతారామస్వామి ఆలయం కూడా ఉంది. ఆలయ ప్రదక్షిణ మార్గంలో ప్రతిష్ఠించిన గణపతిని సకల కార్యసిద్ధికి ప్రతీకగా కొలుస్తారు. 


ఎలా చేరుకోవాలి

🌷 ఏలూరులో కొలువైన జ్వాలాపహరేశ్వరస్వామిని దర్శించుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో కొత్త బస్‌స్టేషన్‌కి మూడు కి.మీ. దూరంలో ఉందీ ఆలయం. 


🌷 రాష్ట్రం నలుమూలల నుంచీ ఏలూరుకు బస్సు సౌకర్యం ఉంది. బస్టాండు నుంచి ఆటోరిక్షాల్లో ప్రయాణించి ఆలయానికి చేరుకోవచ్చు. రైల్లో వచ్చే భక్తులు… ఏలూరు రైల్వేస్టేషన్‌లో దిగి, రోడ్డు మార్గంలో ప్రయాణించి స్వామిని చేరుకోవచ్చు. 


 శ్రీ మణికంఠ  పుష్కరాల అన్నదాన సేవా సమితి


సర్వదా ఈశ్వరుని సేవలో 

మీ రుద్రాక్ష స్వామి

[15/11, 2:09 pm] +91 93913 24915: కార్తీక దీపారాధన శ్లోకము


 శ్లోకం ||

      కీటా: పతంగా: మశకాశ్చ  వృక్షా:

         జలే స్థలే యే నివసన్తి జీవా:

      దృష్ట్వా ప్రదీపం నచజన్మ భాగిన:

       భవంతి త్వం శ్వపచాహి విప్రా:||


దీప దాన శ్లోకము

 సర్వజ్ఞానప్రదం దీపం సర్వ సంపత్ శుభావహం!

దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ !!!🕉️🔥

శ్రీసూక్తమ్

 *శ్రీసూక్తమ్*


*(18) పద్మాసనే పద్మ ఊరూ పద్మాక్షీ పద్మసంభవే*

*త్వం మాం భజస్వ పద్మాక్షీ యేన సౌఖ్యం లభామ్యహమ్*


తా" పద్మం వంటి ముఖమూ, పద్మంవంటి ఊరువులూ, పద్మం వంటి కన్నులూ కలదానా, పద్మం నుండి ఉద్భవించినదానా, నేను దేని వలన సుఖిస్తానో దాన్ని నువ్వు నాకు అనుగ్రహించు.


==============================

కార్తిక పురాణం -2 వ భాగం:

 కార్తిక పురాణం -2 వ  భాగం:

కార్తీక పురాణము -- ద్వితీయాధ్యాయం:

అథద్వితీయాధ్యాయ ప్రారంభః

శ్రుణురాజన్ ప్రవక్ష్యామి మహాత్మ్యం కార్తీకస్యచ! కర్మత్రయ కృతాత్పాపాత్ ముచ్యతే శ్రవణాదపి!! ఓ రాజా! కార్తీకమహాత్మ్యమును వినుము. విన్నంతనే మనోవాక్కాయములవలన చేయబడిన పాపమంతయు నశించును. కార్తీకమాసమందు శివప్రీతిగా సోమవార వ్రతమాచరించువాడు కైలాసనివాసియగును. కార్తీకమాసమున సోమవారమందు స్నానముగాని, దానమును గాని, జపమును గాని చేసినయెడల అశ్వమేధయాగముల ఫలమును పొందును. ఇందుకు సందేహములేదు. కార్తీకమాసమందు ఉపవాసము, ఒకపూట భోజనము, రాత్రి భోజనము, ఛాయానక్తభోజనము, స్నానము, తిలదానము, ఈఆరున్నూ ఉపవాస సమానములగునని ఋషులు చెప్పిరి. శక్తిగలవాడు కేవల ఉపవాసము చేయవలెను. అందుకు శక్తిలేనివాడు రాత్రిభోజనమును చేయవలెను. అందుకు శక్తిలేనివాడు చాయానక్తము జేయవలెను. అందు శక్తి లేనివాడు బ్రాహ్మణులకు భోజనముపెట్టి వారితో పగలే భోజనము చేయవలెను. ఛాయానక్తమనగా సూర్యకాంతి తగ్గిన తరువాత రెట్టింపు కొలతకు తన నీడ రాగానే పగలే భుజించుట. సాయంకాలము 4 ½ గంటలకు భుజించుట చాయానక్తమగును. మానవులు పైన చెప్పిన ఆరింటిలో దేనినయినను ఆచరించినయెడల యెనిమిది యుగములు నరకమందు కుంభీపాకనరకములోను, రౌరవనరకములోను బాధలనొందుదురు. కార్తీక సోమవారమందు విధవ యధావిధిగా ఉపవాసముచేసి శివుని పూజించినట్లయిన శివలోకమునుబొందును. స్త్రీలుగాని, పురుషులుగాని ఎవరు కార్తీకసోమవారమందు నక్షత్రములను జూచి రాత్రి భోజనము చేయుదురో వారి పాతకములు అగ్నియందుంచబడిన దూదివలె నశించును. కార్తీకసోమవారమందు శివలింగమునకు అభిషేకమును, పూజయుచేసి రాత్రి భుజించువాడు శివునకు ప్రియుడగును. ఈవిషయమునందొక కథగలదు. చెప్పెద వినుము. ఇది వినువారికిని చెప్పువారికిని పాపనాశనమగును.


కాశ్మీరదేశమందొక పురోహితుని కూతురు స్వాతంత్ర్యనిష్ఠురియనునొక స్త్రీగలదు. అతి చక్కని రూపముతో మంచి యౌవనముతో గూడియుండి తలదువ్వుకొని అలంకరించుకొని బహుగా మాట్లాడుచూ జారిణియై యుండెడిది. ఈమె దుర్గుణములను జూచి తల్లిదండ్రులును, అత్తమామలును ఆమెను విడిచిరి. ఆమె భర్త సౌరాష్ట్ర దేశశ్థుడు. అతని పేరు మిత్రశర్మ. అతడు వేదవేదాంగ పారంగతుడును, సదాచారవంతుడును, సమస్త భూతములందు దయగలవాడును, అనేక తీర్థముల సేవించినవాడును, అబద్ధమాడనివాడును, నిరంతరము దయగలవాడును భర్త ఇట్టి ఉత్తమగుణములు గలవాడైనప్పటికి ఆదుర్మార్గపు భార్య ఇతనిని నిత్యము కొట్టుచుండెడిది. అట్లు నిత్యము ఆమెచేత దెబ్బలు తినుచును గృహస్థధర్మమందుండు కోరికచేత భార్యను విడువలేక ఆమెతో కష్టపడుచుండెడివాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము, అంగములనగా శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము వీటిని సంపూర్ణముగా చదివినవాడు వేదవేదాంగ పారగుడనబడును. ఈమిత్రశర్మ భార్యకు కర్కశయనియు నామముగలదు. భర్యయైన మిత్రశర్మయు సంభోగవాంఛచేత ఆమెయందు రాగముతోనుండెను. అంతనొకనాడు ఆమె రంకుమొగుడు ద్రవ్యములను నగలను వస్త్రములును తృప్తిగా ఇచ్చి నిరంతరము నీభర్తవల్ల భంగము గలుగుచున్నది గాన నీభర్తను చంపుమని చెప్పగా ఆమె సమ్మతించి రాత్రి భర్త నిద్రించగానే తానులేచి పెద్ద రాతిని తెచ్చి భర్త శిరస్సును కొట్టెను. ఆ దెబ్బతో అతడు మృతినొందెను. తరువాత కర్కశస్వయముగా తన భత శవము వీపుమీద వేసుకొని తీసుకొనిపోయి పాడునూతిలో పడవేసెను. ఇట్లు భర్తను చంపి తరుణులును పరస్త్రీ సంగమాభిలాషులును, కామశాస్త్ర ప్రవీణులును, వర్ణ సంకరకారకులును, అయిన అనేకజాతి పురుషులతో ఆలింగన చుంబనాదులతో నిత్యము సంభోగముచేయుచుండెడిది. ఇంతేగాదు. భర్తయందనురాగముతో గూడియున్న భార్యలను దుర్బోధలచేత ఇతరులతో సంభోగము చేయించుచు ఏకపత్నీ వ్రతపరాయణులను భంగపరచి వారితో సంభోగించుచు నిత్యము పరనిందచేయుచు పరద్వేషము కలదై దేవతాద్వేషి అయియుండెను. నిరంతరము దయాశూన్యయై ఆడంబరము చేతగాని, నవ్వుచేతగాని, కపటముచేతగాని, విష్ణు పాదారవిందమును ధ్యానించలేదు. హరికథను విననూలేదు. ఇటుండగానే ఆమెకు యౌవనము పోయి ముసలితనము వచ్చినది. తరువాత వ్రణ వ్యాధి కలిగినది. ఆ కురుపునకు పురుగులు జనించి తరువాత దుర్గంధముతో కూడినదయ్యెను. తరువాత జారులందరు రూపవంతులు మదయుక్తులైవచ్చి చూచి విగతాశులై వేశ్య ఇంటికి వచ్చుట మానివేసిరి. తరువాత పాపాధిక్యముచేత చాలా బాధనొంది ఆవ్రణవ్యాధితోడనే మృతినొందెను. తరువాత భయంకరులయిన యమదూతలు వచ్చి ఆకర్కశను పాశములచేత కట్టి యమునికడకు తీసుకొని పోయి యమునికి అప్పగించిరి. యముడు దానిని చూచి కోపముచేత కళ్ళెర్రజేసి దీనిని భయంకరమగు ముళ్ళతో గూడినదియు, ఇనుముతో చేయబడిన స్తంభమును కాల్చి మండుచుండగా ఆలింగనము చేయించుడని కఠినమైన శిక్షను విధించెను. అంత యమాజ్ఞ మీద భటులు ఆకర్కశను చేసిన పాపములను జెప్పుచు ఆవేడి స్తంభమును సంభోగించుమనిరి. ఆమె పాదములు రెండు పట్టుకొని గిరగిర త్రిప్పి రాతిమీద కొట్టిరి. రక్తమును కాచి త్రాగించిరి. సీసమును కాచి రెండుచెవులలోను పోసిరి. యమకింకరులు యమాజ్ఞ చిత్రగుప్తాజ్ఞలచే అనేక నరక బాధలకు గురిచేసిరి. ఆకర్కశ ఇట్లు తన పితృ పతామహులతోను, తన బాంధవులతో తనకు పూర్వము పదితరములు తరువాత పదితరముల వారితో ఘోరములందు నరకములందు మహాబాధలుపొంది తరువాత భూమియందు జన్మించెను. భూమియందు పదిహేనుమార్లు కుక్కగ జన్మించినది. అందులో పదిహేనవ జన్మ కళింగదేశమందు బ్రాహ్మణుని ఇంటివద్ద కుక్కగా పుట్టి యింటింటికి తిరుగుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు కార్తీకమాసమందు సోమవారము దినంబున పగలంతయి ఉపవాసముచేసి గృహమునందు శివలింగాభిషేక పూజాదులను జేసి నక్షత్రమండలమును జూచి గృహమునకు బోయి దేవ నివేదన చేసి పిమ్మట బలిదానము కొరకు బయటకువచ్చి భూమిమీద బలిని ఉంచి కాళ్ళు కడుగుకొని ఆచమనము చేసి తిరిగి యింటిలోనికి వెళ్ళెను. ఆకుక్క ఆనాడు పగలంతయి ఆహారము కొద్దియైనను దొరకనందున కృశించినదై కార్తీకసోమవారము రాత్రి విప్రుడువేసిన బలిని భక్షించెను. ఆబలిభోజనముచేత కుక్కకు పూర్వజాతిస్మృతిగలిగి బ్రాహ్మణోత్తమా! రక్షింపుము. రక్షింపుమని పలికెను. ఆమాటవిని బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యముతో గూడినవాడై ఓ శునకమా! మాఇంటిలో ఏమేమిచేసితివి. రక్షింపుమనుచున్నావు అని యడిగెను. కుక్క ఇట్లనెను. బ్రాహ్మణోత్తమా! వినుము. నేను పూర్వజన్మమందు బ్రాహ్మణస్త్రీని. పాపములను చేయుదానను. వర్ణసంకరము చేసినదానను. అన్యపురుషులను మరగి నిజభర్తను చంపితిని. ఈవిధిపాపములు అనేకములు చేసి చచ్చియమలోకమునకు పోయి అచ్చట అనేక బాధలనొంది తిరిగి భూమికి వచ్చి 15మార్లు కుక్కగా జన్మించితిని. చివరికి ఇప్పుడు నాకీ జాతిస్మరణ కలిగినది. ఎట్లు కలిగినదో చెప్పుము. విని తరించెదను. ఆబ్రాహ్మణోత్తముడీమాట విని జ్ఞానదృష్టితో చూచి తెలిసికొని యిట్లనియె. ఓ శునకమా! ఈకార్తీక సోమవారమునాడు ప్రదోషసమయము వరకు భుజింపక ఇప్పుడు నేను ఉంచిన బలిని భక్షించితివి గనుక నీకు జాతిస్మృతి గలిగినది. ఆమాటవిని కుక్క బ్రాహ్మణోత్తమా! ఈకుక్కజాతి నుండి నాకెట్లు మోక్షముగలుగునో చెప్పుమని విప్రుని అడిగెను. ఆకుక్క యిట్లు ప్రార్థించగా పరూపకార బుద్ధితో కార్తీకసోమవారములందు తానుజేసిన పుణ్యములో ఒక సోమవార పుణ్యమును కుక్కకు ధారపోసెను. బ్రాహ్మణుడు సోమవార పుణ్యమును ఈయగానే కుక్క దేహమును విడిచి ప్రకాశించుచున్న శరీరముగలదై ప్రకాశించెడి వస్త్రములను మాల్యములను, ధరించి ఆభరణాలంకృతయై తన పితరులతోగూడ కైలాసానికిబోయి అచ్చట పార్వతీదేవివలె శివునితోగూడ ఆనందించుచుండెను. కాబట్టి కార్తీకమాసమందు సోమవారవ్రతము ఆచరించదగినది. ఎవరు కార్తీక సోమవార వ్రతమును జేయుదురో వారికి మోక్షము హస్తమందుండును. కాబట్టి ఓ జనకమహారాజా! పుణ్యప్రదమైన కార్తీకవ్రతమును నీవు చేయుము.

ఇతి స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే ద్వితీయోsధ్యాయస్సమాప్తః


LIKE | COMMENT | SHARE |


🔱   శివానందా రూపం శివం శివం  🔱

శ్రీమద్భాగవతం -48🌷

 🕉శ్రీమద్భాగవతం -48🌷


.🌹 చిత్రకేతూపాఖ్యానం:


పూర్వకాలంలో చిత్రకేతువు అనబడే మహారాజుగారు ఉండేవారు. ఆయన శూరసేన దేశమును ఏలుతూ ఉండేవాడు. ఆయనకు అనేకమంది భార్యలు. ఇంతమంది భార్యలతో కూడి చిత్రకేతువు రాజ్యపరిపాలన చేస్తున్నాడు. కానీ నిరంతరం మనస్సులో ఒక్కటే శోకం. ఆయనకు సంతానం లేదు. ఆయన పెద్ద భార్య పేరు ‘కృతద్యుతి’. ఒకరోజున ఆయన వద్దకు అంగీరస మహర్షి వచ్చారు. ఆయన స్వాగతం పలికి అర్ఘ్యపాద్యారులు ఇచ్చాడు. అపుడు అంగీరస మహర్షి అన్నారు – ‘ఇంతమంది భార్యలు ఉన్నారు, ఐశ్వర్యం ఉంది, ఇంత పెద్ద సామ్రాజ్యం ఉంది. కానీ నీ ముఖంలో కాంతి లేదు. నీవు దేనిని గురించి బెంగ పెట్టుకున్నావు’ అని అడిగారు. అపుడు చిత్రకేతువు ‘మహానుభావా! మీరు త్రికాలజ్ఞులు. మీరు సర్వము తెలుసుకోగలరు’ అన్నాడు. అపుడు అంగీరస మహర్షి ‘నాకు అర్థం అయింది. నీకు పిల్లలు లేరు. అందుకు కదా బాధపడుతున్నావు. నీచేత పుత్రకామేష్టి చేయిస్తాను. నీకు బిడ్డలు కలుగుతారు’ అని పుత్రకామేష్టి చేయించి యజ్ఞ పాత్రలో మిగిలిపోయిన హవిస్సును నీ పెద్ద భార్యచేత తినిపించు. నీకు యోగ్యుడయిన కుమారుడు కలుగుతాడు. వాదివలన నీవు సుఖదుఃఖములు పొందుతావు’ అని చెప్పాడు. 

రాజు యజ్ఞపాత్ర తీసుకువెళ్ళి పెద్దభార్యకు ఇచ్చాడు. ఆవిడ దానిని స్వీకరించి గర్భాన్ని ధరించి ఒక పిల్లవాడు జన్మించాడు. ఇంక రాజు పరవశించి పోయాడు. అర్బుదముల బంగారమును దానం చేశాడు. రాజ్యం అంతా సంతోషంగా ఉంది. ఒకరోజు రాత్రి పెద్ద భార్య కుమారుని పెట్టుకుని నిద్రపోతోంది. మిగిలిన భార్యలందరికీ కోపం వచ్చింది. ‘మనకందరికీ పిల్లలు లేరు కాబట్టి రాజు ఇప్పటివరకు మనందరితోటి సమానంగా ఉన్నారు. ఇప్పుడు ఆవిడకి పిల్లాడు పుట్టాడు కాబట్టి కృతద్యుతి మందిరానికే వెళుతున్నాడు. ఇప్పుడు ఆవిడకి ఈ ఆదరణ పోవాలంటే ఆ పిల్లవాడిని చంపేయాలి’ అని వీళ్ళందరూ కలిసి ఆ పిల్లవానికి మెల్లగా విషాహారాన్ని పెట్టేశారు. మరునాడు ఉదయం చూసేసరికి పిల్లవాడు నల్లగా అయిపోయి మరణించి ఉన్నాడు. ఆ పిల్లవాని పాదముల వద్ద కూర్చుని తాను ప్రభువుననే విషయమును కూడా మర్చిపోయి ఏడుస్తున్నాడు. 

అపుడు అంగీరస మహర్షి బ్రహ్మలోకం నుంచి నారదునితో కలిసి వచ్చారు. వారు వచ్చేసరికి రాజు ఏడుస్తున్నాడు. ఎవరి వలన కొడుకు పుట్టాడో ఆ అంగీరస మహర్షిని మరచిపోయాడు. అపుడు అంగీరస మహర్షి ‘రాజా ఎందుకు ఏడుస్తునావు?’ అని అడిగాడు. రాజు ఆశ్చర్యపోయి ‘కొడుకు చచ్చిపోయినందుకు ఏడుస్తున్నాను’ అన్నాడు. అపుడు అంగీరసుడు ‘నువ్వు ఇప్పుడు నా కొడుకు నా కొడుకు అని ఏడుస్తున్నావు కదా. నేను ఇంతకుపూర్వం నీకు కొడుకు పుట్టడం కోసం నీచేత యజ్ఞం చేయించాను. అప్పుడు నీకు ఈ కొడుకు లేదు. అంతకుముందు నీకు కొడుకు లేనపుడు నీవు సుఖంగా ఉండేవాడివి. ఈ కొడుకు మధ్యలో వచ్చాడు. మధ్యలో వెళ్ళిపోయాడు. చిత్రకేతూ, మనుష్యుల జీవితముల ఎలా ఉంటాయో తెలుసా? నీకు ఒక విషయం చెపుతాను. ‘ఈ శరీరమును చూసి అనేకమయిన అనుబంధములను పెట్టుకుంటారు. అసలు దేనితో అనుబంధం పెట్టుకున్నారో అది విష్ణుమాయ. అది ఉండేది కాదు. కానీ లోపల ఉన్నది ఎప్పుడూ ఉండేది. రాజా, అసలు ఉండవలసిన అనుబంధం ఈశ్వరుని ఒక్కనితోటే. అదిలేక నీ కొడుకుతో పిల్లలు లేరన్న భ్రాంతితో ఉండిపోయి జ్ఞానం కలగడం లేదని సుఖదుఃఖకారణమైన కొడుకును నీకు ఇచ్చాను. ఇప్పుడు చూశావా – వాడే సుఖం, దుఃఖం ఇచ్చాడు. నీకు మాయయందు తగులుకునే స్వభావం ఉంది. దానివలన నీవు సుఖదుఃఖములను పొండుతున్నావు’. అపుడు నారదుడు ‘నాకొడుకు పోయాడు అని అంటున్నావు కదా. నీ కొడుకును బ్రతికిస్తాను. వరం ఇస్తాను. వాడు అంగీకరిస్తాడేమో చూద్దువు కాని. వాడిచేత మాట్లాడిస్తాను’ అని నారదుడు తన తపశ్శక్తితో ఆ వెళ్ళిపోయిన జీవుణ్ణి తెచ్చాడు. నువ్వు వెళ్ళిపోవడం వల్ల నీ శరీరమునకు తల్లిని, తండ్రిని అనుకున్న వాళ్ళు ఖేదం పొందుతున్నారు. కాబట్టి ఓ జీవుడా నువ్వునీ శరీరము నందు ప్రవేశించి నీవు కోరుకుంటే దీర్ఘాయుర్దాయంతో సింహాసనమును అధిష్ఠించి నీవు కోరుకుంటే నీ తల్లిదండ్రులకు ఆనందమును కలిగించు’ అన్నాడు. జీవుడు వెనక్కి వచ్చి ఇపుడు తండ్రివంక చూసి భ్రుకుటి ముడివేసి ‘నేను ఈ శరీరము వదిలిపెట్టి వెళ్ళిపోయాను. ఈ శరీరమునకు వారు తల్లిదండ్రులు. నా కర్మ వల్ల నేను ఇప్పటికి ఎన్ని కోట్లమంది తల్లిదండ్రులకు కొడుకుగా పుట్టానో! వాళ్ళలో వీరొకరు’. ఈమాట విని చిత్రకేతువు ఇంతవరకు వీడు నాకొడుకు నాకొడుకని అనుకున్నాను. ఇదా వీడు మాట్లాడడం అని వెనక్కి పడిపోయాడు. ఇప్పుడు చిత్రకేతుడు అసలు విషయం అర్థం చేసుకుని ‘ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది. వాడు అలా మాట్లాడిన తరువాత నాకు తత్త్వం అంటే ఏమిటో తెలిసింది’ అన్నాడు. అపుడు అంగీరసుడు ‘వానికి సంస్కారం చేసి యమునా నదిలో స్నానం చేసి ఆచమనం చేసి రావలసింది. నీకొక మంత్రం చెపుతాను. ఈ శరీరం ఉండగా చేరవలసింది ఈశ్వరుడిని. అనుబంధముల మాయా స్వరూపం తెలుసుకొని ఈశ్వరుడి పాదములు పట్టుకో. నేను నీకు ఉపదేశం చేస్తాను. ఈ ఉపదేశం చేత ఏడురాత్రులు ఈ మంత్రమును జపిస్తే నీకు సంకర్షణ దర్శనం అవుతుంది’ అన్నారు. ఆయనను నమ్మి చిత్రకేతువు ఏడురాత్రులు, ఏడు పగళ్ళు జపం చేశాడు. అలా జపం చేస్తే ఆయనకి శ్రీమన్నారాయణుడు పాదం పెట్టుకునే పాదపీఠియైన ఆదిశేషుడు దర్శనం ఇచ్చాడు. ఆయనను విశేషంగా స్తోత్రం చేశాడు. అలా సోత్రం చేస్తే ఆయన అన్నాడు –

ఆదిశేషుడు తన రూపమును భాసింప చేసి ‘నీటియందు బుడగపుట్టినట్లు ఆ బుడగకు అస్తిత్వము లేక నీటిలో కలిసిపోయినట్లు బ్రహ్మము నందే నామరూపములయిన మాయచేత జగత్తుగా పరిణమించింది. ఈ తత్త్వము అర్థమవడమే నా దర్శనం కలగడం. అందుకని ఇపుడు నీవు బ్రహ్మజ్ఞానివి అయిపోయావు’ అన్నాడు. ఆయన ఇచ్చిన ఒకే ఒక వరం ఈయనపాలిటి శాపం అయి కూర్చుంది. అనంతుడు ఈయనకు ఒక విమానం ఇచ్చి ‘నీవు ఈ విమానంలో ఎక్కడికయినా విహరించు’ అని చెప్పి ఆయన తిరిగి సిద్ధ గణములతో వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతుంటే చిత్రకేతుడు ఆయనను స్తోత్రం చేసి తదుపరి విమానమును ఎక్కి అన్ని బ్రహ్మాండములు తిరుగుతూ యక్ష కాంతలతో హరికథలను నాటకములుగా ప్రదర్శనలు చేయిస్తూ లోపల పరమ భక్తి తత్పరుడై ఉండేవాడు. ఒకనాడు ఆ విమానం ఎక్కి కైలాస పర్వతమునకు వెళ్ళాడు. పార్వతీదేవి పెనిమిటి అయిన పరమశివుడు సభలో కూర్చుని వుండగా నాలుగు వేదములు పురుష రూపమును పొంది వాదించుకుంటున్నాయి. పరబ్రహ్మ తత్త్వం అంటే ఇలా ఉంటుందని అంటున్నారు కదా అంటే కాదు ఇలా ఉంటుంది అని వాదించు కుంటున్నాయి పరబ్రహ్మ తత్త్వాన్ని అర్థం చేసుకోలేక. బ్రహ్మగారు, సనక సనందనాది మహర్షులు అంజలి ఘటించి పరమశివా మాయందు నీ అనుగ్రహమును ప్రసరింపజేసి మాకు జ్ఞానమును ప్రసాదించమని అడుగుతున్నారు. అటువంటి పార్వతీ పరమేశ్వరులను చూసి పొంగిపోయిన భ్రుంగి నాట్యం చేస్తున్నాడు అంటారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో. అంత పరమపవిత్రమయియన్ సభలోనికి చిత్రకేతువు తన విమానంలోంచి క్రిందకు దిగాడు. పార్వతే దేవిని ఎడమ తొడ మెడ కూర్చోపెట్టుకొని చేతితో గాఢాలింగనం చేసుకొని ఉన్నాడు పరమశివుడు. అది చూసి అమ్మవారు వినేటట్లుగా పెద్ద ధ్వనితో నవ్వాడు. అందరూ ఆశ్చర్యపడిపోయి ఒక్కసారి అటు తిరిగి చూశారు. 

చిత్రకేతువు పెద్ద నవ్వు నవ్వేసరికి పార్వతీ దేవి చూసి ‘నీవు ఎందుకు నవ్వుతున్నావు’ అని అడిగింది. అపుడు చిత్రకేతుడు అన్నాడు – ‘ఏమీ తెలియని అజ్ఞాని కూడా భార్యను కౌగలించు కోవాలంటే ఇంట్లోకి వెళ్ళి కౌగలించుకుంటాడు. అంతేకానీ ఇంతమంది తాపసులు ఉన్న సభలో, బ్రహ్మగారు నిలబడ్డ సభలో, సనకసనందనాదులు నిలబడ్డ సభలో, సిగ్గులేకుండా ఆచార్యుడనని లోకానికి జ్ఞానమును ఇచ్చు వాడినని జగద్గురువు నని లోక రక్షకుడనని అనిపించుకు శర మంగళ ప్రదుడనని అనిపించుకున్న పరమశివుడు ఎడమ తొడమీద భార్యను కూర్చోపెట్టుకుని ఇంతమంది చూస్తుండగా భార్యను గాఢాలింగనం చేసుకున్నాడు. ఆ మిథున రూపమును చూస్తే నవ్వు వస్తోంది. ఆయనకు కూడా యింత కామ వ్యామోహమా” అన్నాడు. అపుడు పార్వతీ దేవి ‘ఏమిరా ధూర్తుడా, కపిలుడు, భ్రుగువు, నారదుడు, బ్రహ్మ, సనక సనందనాదులు శివుని ముందు నమస్కరిస్తూ నిలబడతారు. ఎవరి పాదములకు అంటుకున్న ధూళి మస్తకము మీద పడితే జ్ఞానము కటాక్షింపబడుతుందని కోరుకుంటారో ఎవరి పాదము తగిలితే మంగళ తోరణమై నీ ఇంటిని పట్టుకుంటుందో, ఎవరు అనుగ్రహిస్తే నీ ఇంట శుభకార్యములు జరుగుతాయో, ఎవరు లోపల ఉండడం చేత నీవు శివమై పదిమంది చేత నమస్కరింప బడుతున్నావో, ఏ శివము లోపలి నుంచి వెళ్ళిపోతే నీవు శవమై పోతావో, ఏ మహానుభావుడు లోకములన్నింటిని రక్ష చేస్తున్నాడో, ఎవరు తాను మహాత్యాగియై జ్ఞానిగా నిలబడ్డాడో అటువంటి పరమశివుని తూలనాడడానికి నీకు ఉన్న గొప్పతనం ఏపాటిది? ప్రకృతి పురుష తత్త్వమును తెలియక గుర్తెరుగక ఒక ప్రాకృతమయిన మనుష్యుడు హీనుడు మాట్లాడినట్లు మాట్లాడావు. నీవు విష్ణు భక్తుడవని అనిపించుకుందుకు నీకు అర్హత లేదు. శివుని గౌరవించని వాడు విష్ణు భక్తుడు కానేకాదు. నువ్వు ఇలా ప్రవర్తించావు కాబట్టి నిన్ను శపిస్తున్నాను. నువ్వు ఉత్తరక్షణం రాక్షస యోనియందు జన్మిస్తావు. కానీ నీవు చేసిన తపంబు చేత శ్రీమన్నారాయణుని చేరెదవు గాక’ అని అనుగ్రహించింది. 

చిత్రకేతువు విమానంలోంచి క్రింది పడిపోయి తల్లి పాదముల మీద పడిపోయి సాష్టాంగ నమస్కారం చేసి ఒక మాట అన్నాడు ‘అమ్మా అనంతుని దర్శనం చేశాను. సంకర్షణుని దర్శనం చేశాను. కానీ ఎన్ని జన్మల నున్దియో చిన్న అవిద్య అజ్ఞానం ఎక్కడో ఉండిపోయాయి. తల్లి నీ మ్రోలకు వచ్చి ఒక వెకిలి నవ్వు నవ్వాను. ఇంత శాపమును పొందాను. నువ్వు శపించిన శాపం నన్ను ఉద్ధరించడానికేనని అనుకుంటున్నాను. అలాగే రాక్షసయోనియందు జన్మిస్తాను. నా అజ్ఞానము అక్కడితో తొలగుగాక’ అని నమస్కారం చేసి క్షమాపణ చెప్పి ప్రణిపాతం చేసి లేచి విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. 

ఇది చూసి పరమశివుడు ‘పార్వతీ చూశావా ఇతను పరమభాక్తులు నీవు ఇంత శాపం ఇస్తే ఆటను కసుగందలేదు. నిజమయిన విష్ణుభక్తుడయినవాడికి అటువంటి సత్త్వగుణం కలగాలి. యితడు విష్ణు భక్తుడే. ఈ భక్తి వీనిని రక్షించి ఒకనాడు ఇంద్రసంహారం కొడం త్వష్ట ప్రజాపతి చేసిన యజ్ఞగుండంలోంచి వృత్రాసురునిగా పైకి వస్తాడు. వచ్చినా ధర్మం నిర్వర్తించాలి కాబట్టి యుద్ధం చేస్తాడు. మనస్సు మాత్రం శ్రీమన్నారాయణుడి దగ్గర పెట్టి శ్రీమన్నారాయణుని చేరుకుంటాడు. తాను చేసుకున్న సుకృతము చేత అపారమయిన భక్తితో నిలబడిపోతాడు’ అన్నాడు. ఈ ఆఖ్యానము ఇంత పరమ పావనమయినది కాబట్టి ఇహమునందు వాళ్లకి ఏమయినా ప్రమాదము రావలసి వుంటే అటువంటి ప్రమాదములు తొలగి పుత్రపౌత్రాభివృద్ధిగా మూడు తరములు చూసి, సమస్త ఐశ్వర్యములు పొంది అంత్యమునందు భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి, మరల పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్యమును పొందుతారు. అటువంటి స్థితిని కటాక్షించ గలిగిన మహోత్కృష్టమయిన ఆఖ్యానము ఈ వృత్రాసుర వధ.


సశేషం....

💥💥💥

ఉదయం స్నానం

 *🙏ఉదయం స్నానం ఎందుకు ?🙏*


 *తెల్లవారు జామున 4 గంటల నుండి 6 గంటల వరకు బ్రహ్మముహూర్త | కాల సమయం 2 గంటలు ఉంటుంది . ఈ రెండు గంటల కాల సమయములో | ఓజోన్ అనేటటువంటిది గాలిలో ఎక్కువగా ఉంటుంది . ఇది శరీరానికి తగలడం వలన శరీరానికి చాలా మంచిది . కనుక అందరూ తెల్లవారు జామున అనగా ఉదయం 4 నుంచి 6 గంటల లోపల స్నానం చేయాలి . అంతేకాకుండా మరియొక కారణం కూడా ఉన్నది . ఆ బ్రహ్మముహూర్త కాల సమయంలో దేవతలు భూలోక సంచారం చేస్తుంటారని , అందువలన | ధ్యానముతో భగవంతుడు సులువుగా ప్రసన్నుడౌతాడని ఆధ్యాత్మికుల అభిప్రాయం అందుకే హిందూ సాంప్రదాయకమైన దేవాలయాలన్నియు భగవంతుని మేలుకొల్పు , సుప్రభాతము మొదలగు పూజా కార్యక్రమములతో   ప్రారంభమవుతూ ఆ సమయంలోనే కోవెలలన్నీ తెరువబడతాయి . సుమారు |6 లేక 7 గంటల నిద్రవలన మానవుల తనువు తేలికబడి , మనసు ఉల్లాసంగా నిర్మలముగా ఉండి వారు చేయు పని పట్ల ఏకాగ్రత కుదురుతుంది . అంతేకాక వారిని ఆటంక పరిచే నిత్యమానవ విధులేవి ఆ సమయమునంద ఆరంభము | కావు . అందువలన దీక్ష కాలమున బ్రహ్మ ముహూర్తమున నిద్రలేవి | శిరస్నానమాచరించి స్వామిని సేవించవలెనని నియమము విధించారు .*


*🔥వత్తులు :-🔥*


*1 ) ఒక వత్తి : సామాన్య శుభం* 


*2 ) రెండు వత్తులు : కుటుంబ సౌఖ్యం* 


*3 ) మూడు వత్తులు : పుత్ర సుఖం*


*4 ) ఐదు వత్తులు : ధనం , సౌఖ్యం , ఆరోగ్యం , ఆయుర్ధాయం , అభివృద్ధి దీపారాధనకు పత్తితో చేసిన వత్తి శ్రేష్ఠము .*


*💥దీపారాధన విధానం :-💥*


*1 ) నెయ్యి : నేతితో దీపారాధన చేసిన ఇంటిలో సర్వ సుఖాలు సౌభాగ్యాలు కలుగును .*


 *2 ) నువ్వుల నూనె : నువ్వుల నూనెతో దీపారాధన చేసిన సమస్త దోషములు , పీడలు తొలగును .*


*3 ) ఆముదం : ఆముదముతో దీపారాధన చేసిన , దేదీప్యమానమగు జీవితం , బంధుమిత్రుల శుభం , దాంపత్య సుఖం వృద్ధియగును .*


*4 ) వేరుశెనగ నూనె : వేరుశెనగనూనెతో దీపారాధన చేసి నిత్య ఋణములు , దుఖం , చోర భయం , పీడలు మొదలగునవి జరుగును .*


*5 ) నెయ్యి , ఆముదం , వేప నూనె , కొబ్బరి నూనె , యిలప నూనె కలిపి 48 రోజులు దీపారాధన చేసిన , వారికి దేవీ అనుగ్రహం కలుగును .* 


*6 ) వేపనూనె , నెయ్యి , యిలపనూనె మూడు కలిపి దీపారాధన చేసిన ఐశ్వర్యం ఇలవేల్పులకు సంతృప్తి కలుగును .*


*7 ) ప్రతిరోజు దీపారాధన ఉదయం మూడు గంటల నుండి జరుగంటలలోపు చేసిన సర్వరుభములు , శాంతి కలుగును .*


*🏹దీపాల యొక్క దిక్కుల ఫలితములు :-🏹* 


*1 ) తూర్పు : కష్టములు తొలగును , గ్రహదోషములు పోదురు ,*


*2 ) పశ్చిమ : అప్పుల బాధలు , గ్రహదోషములు , శనిదోషములు తొలగును ,*


*3 ) దక్షిణం : ఈ దిక్కున దీపము వెలిగించరాదు కుటుంబమునకు కష్టము కలును ,*


 *4 ) ఉత్తరం : ధనాభివృద్ధి , కుటుంబములో శుభకార్యములు జరుగును .*


*🎪దీప వత్తుల యొక్క ఫలితములు : -🎪*


*1)పత్తి:-పత్తితో దీపము వెలిగించినదో ఆయుషు పెరుగును .* 


 *2 ) అరటినార :-ఆరటి నారతో దీపము వెలిగించినదో చేసిన తప్పులు తొలగి కుటుంబమునకు శాంతి కలుగును .*


 *2 ) జిల్లేడినార:- జిల్లేడినారతో దీపము వెలిగించినచో భూత , ప్రేత , పిశాల బాధలు ఉండవు ,*


*4 ) తామర నార :-పూర్వ జన్మలో చేసిన పాపములు తొలగును . ధనవంతు లగుదురు .* 


*6 ) నూతన పసుపు వస్త్రము :- అమ్మవారి అనుగ్రహమునకు పాత్రులగుదురు*


*6)నూతన ఎరుపు వస్త్రము :- పెళ్ళిళ్ళు అగును , గొడ్రాలికి సంతానము కల్గును*


*7 ) నూతన తెల్ల వస్త్రము :- పన్నీరులో ముంచి ఆరబెట్టి దీపము వెలిగించిన శుభకార్యములు జరుగును ,*


 *సాయంత్ర సమయములందు శ్రీ మహాలక్ష్మికి దీపారాధన చేసి పసు కుంకుమతో అర్చన చేస్తే కుటుంబ క్షేమం , సౌభాగ్యం కల్గును .*

అద్దిరిపోయే విషయాలు

 మానవ శరీరం గురించి అద్దిరిపోయే విషయాలు:

* మన కడుపులో ఉండే ఆమ్లము (acid) రేజర్ బ్లేడ్ లను కూడా కరిగించగలదు.

* మనం రోజుకి సగటున 40 నుండి 100 వెంట్రుకలు కోల్పోతున్నాం.

* మన ఒక్కో వెంట్రుక 3 నుండి 7 సంవత్సరాల వరకు పెరుగుతూనే ఉంటాయి.

తర్వాత అవి రాలిపోయి వాటి స్థానంలో వేరేవి పెరుగుతాయి

* ఒక్క అంగుళం చర్మం మీద 3 కోట్లకు పైగా బాక్టీరియా ఉంటుంది.

* రోజుకి మన గుండె ఉత్పత్తి చేసే శక్తితో ఓ సాధారణ ట్రక్ ని 30 కిలో మీటర్ల వరకు నడిపించవచ్చు.

* లేవకుండా ఒక మనిషి నిద్రించిన రికార్డు 11 రోజులు.

* 90 శాతం కి పైగా జబ్బులు స్ట్రెస్ వల్లనే అని తేలింది.

* శరీరం నుండి తల వేరు చేసినా.. తల 15 సెకన్ల వరకు స్పృహ కోల్పోదు.

* మీరు పడుకునే గది ఎంత చల్లగా ఉంటె... మీకు పీడ కలలు వచ్చే అవకాశాలు అంత పెరుగుతాయి.

* నిద్రించే సమయంలో మన వాసనా పీల్చే భావం పనిచేయదు.

* మనవ శరీరం లో ఉన్న DNA మరియు అరటిపండులో ఉన్న DNA 50 శాతం కలుస్తాయి.

* మనం తిన్నది అరగడానికి మన శరీరంలో ఏవైతే సహాయ పడతాయో... చనిపోయిన 3 రోజులకి అవే మనల్ని తినడం మొదలపెడతాయి.

* గుండె పోటు వల్ల చనిపోయే వారిలో 20 శాతం మంది సోమవారం నాడే చనిపోతారు.

* 7 గంటల కన్నా తక్కువ నిద్రిస్తే.. త్వరగా చనిపోతారు.

* వెలి ముద్రలు ఉన్నట్టే.. నాలుక ముద్రలు కూడా ఒకరితో ఒకరికి పోలిక లేకుండా ఉంటాయి.

* ఒకవేళ మన కళ్ళు కెమెరా అయితే.. 576 మెగా పిక్సెల్స్ ఉన్న కెమెరాలా ఉండేది.

* మనిషి కన్నుని తయ్యారుచేయాలంటే కొన్ని లక్షల కోట్లు కర్చవుతుందట.

* మన నోరు 100 కోట్లకు పైగా రుచులను గుర్తించగలదు.

* మీకు 60 ఏళ్ళు వచ్చే సరికి నోటిలో ఉండే టేస్ట్ బడ్స్ సగానికి పైగా చనిపోతాయి.

* మీకు ఎంత ఎక్కువ IQ ఉంటె.. అన్ని కలలుగంటారు.

* మన కాళ్ళ గోర్లకన్నా చేతి గోర్లు 4 రెట్లు త్వరగా పెరుగుతాయి.

* చింపాంజీ శరీరం పై ఉన్నన్ని వెంట్రుకలే మన శరీరం పై కూడా ఉంటాయి. కాకపోతే మనవి చాలా సన్నగా ఉంటాయి.

* మన శరీరం 30 నిమిషాలలో ఉత్పత్తి చేసే వేడితో 114 లీటర్ల నీటిని వేడి చేయవచ్చు.

* మన చర్మం నిమిషానికి 50000 సెల్స్ ని వదిలేస్తుంది. అంటే జీవిత కాలంలో అది 18 కిలోలనమాట.

* మీ బెడ్ పై ఉండే దుమ్ములో సగానికి పైగా మీ చర్మందే.

* మన బ్రెయిన్ 25 వాట్స్ విద్యుత్త్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్ తో ఓ బుల్బ్ ని వెలిగించవచ్చు.

* మీకు 40 ఏళ్ళు వచ్చే వరకు మీరు ఎదుగుతూనే ఉంటారు.

* మన బ్రెయిన్ పగటి పూటకన్నా రాత్రి పూటనే చురుకుగా పనిచేస్తుంది.

* ఒక సంవత్సరంలో 15000 కలలుగంటారట.

* మీరు వింటున్న మ్యూజిక్ కి తగ్గట్టుగా మీ గుండె కొట్టుకోవడం ప్రారంభమవుతుంది.

మీకు ఈ పోస్టు కనుక నచ్చితే షేర్ చేయడం మరువకండి..!!

ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ ముందుకు తెచ్చేందుకు ఎల్లపుడు ముందుంటాము!!

యమ ద్వితీయ

 *రేపు. 16. 11. 2020. సోమవారం. యమ ద్వితీయ, భగినీ హస్త భోజనం.* 


యుముడు ఇచ్చిన మాట... నిలబెట్టుకుంటాడట...


సోదరీ, సోదరుల ఆప్యాయతాను బంధాలకు అద్దంపట్టే ఒక సంప్రదాయం భగినీ హస్త భోజనం. భగిని అంటే సోదరి. ఆమె పెట్టే భోజనం కనుక భగినీ హస్త భోజనం అంటారు. కార్తీక శుద్ధ విదియ అంటే దీపావళి వెళ్ళిన రెండవ నాడు ఈ వేడుకను జరుపుకుంటారు. సోదరీ,సోదర ప్రేమకి అద్దం పట్టే పండుగ. సోదరీ, సోదరుల ఆప్యాయతాను బంధాలకు అద్దం పట్టే ఒక సంప్రదాయం భగినీ హస్త భోజనం. భగిని అంటే సోదరి. ఆమె పెట్టే భోజనం కనుక భగినీ హస్త భోజనం అంటారు. 


కార్తీక శుద్ధ విదియ అంటే దీపావళి వెళ్ళిన రెండవ నాడు ఈ వేడుకను జరుపుకుంటారు.సోదరీ సోదర ప్రేమకి అద్దం పట్టే పండుగల్లో రాఖీ పండుగ తర్వాత చెప్పుకోదగినది ఇది.


ఈనాడు అన్నదమ్ములు తమ తమ అక్కా చెల్లెళ్ళ ఇళ్ళకు బహుమానాలు తీసుకెళ్ళి వారి చేతి వంట తిని వారిచేత తిలకం దిద్దించుకుంటారు. 


రక్షాబంధనంలో అన్నదమ్ములు తమ సోదరి రక్ష( రాఖీ ) కట్టినందుకు ఆమె యోగక్షేమాలు తాము చూస్తామని రక్షిస్తామని చెపుతారు. రాఖీ సోదరి క్షేమానికి సంబంధించినది.


*"భయ్యా ధూజీ''* అనే పేరుతో ఉత్తర భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన భగినీ హస్త భోజనం సోదరుని క్షేమానికి సంబంధించినది.


మన పురాణాల్లో కధ ప్రకారం యమధర్మరాజు సోదరి యమున. ఆమె వివాహమై వెళ్ళాక తన సోదరుడిని తన ఇంటికి ఎన్నో సార్లు రమ్మని పిలిచింది. కానీ యమధర్మరాజు వెళ్ళలేక పోయాడు.


*What is importance of Bhagini Hastha Bhojanam?*


చివరికి ఒకసారి ఈ కార్తీక మాస విదియ రోజున యమున ఇంటికి వెళ్తాడు. సోదరుడు వచ్చాడని యమున సంతోషంగా పిండి వంటలతో భోజనం పెట్టింది.చాలా రోజుల తర్వాత సోదరీ సోదరులు కలుసుకోవటంతో ఇరువురూ సంతోషించారు.


ఆ సంతోషంతో యమధర్మరాజు యమునని ఏదైనా వరం కోరుకోమన్నాడు. వాళ్ళు దేవతలు కనుక వారు కోరే వరాలు కూడా జన ప్రయోజనాలుగా ఉంటాయి. ఆమె ఈ కార్తీక శుధ్ధ విదియనాడు లోకంలో ఎక్కడైనా సరే తన సోదరి ఇంటికి వెళ్ళ భోజనం చేసిన సోదరులకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని అడిగింది.


ఈ కోరికకి యమధర్మరాజు సంతోషించి అలా వేడుక జరుపుకున్న వారికి అపమృత్యు దోషం ( అకాల మరణం ) లేకుండా ఉంటుంది.ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుంది అని వరాలిచ్చాడట.అందు వలనే ఈ ఆచారం ఆచరణలోకి వచ్చింది.


ఒకప్పుడు యముడు తన భటుల్ని కర్తవ్య నిర్వహణలో ఎప్పుడైనా మనసుకి బాధ కలిగిందా? అని అడిగితె ఒక భటుడు భర్త ప్రాణాలు హరించినప్పుడు నవవధువు పడిన వేదన హృదయ విదారకంగా ఉండి తన మనసు పాడైందని చెపుతాడు.


యముడు కూడా బాధపడినా చేయగలిగిందేమీ లేదని చెపుతూ ఎవరైనా కార్తీక శుద్ధ విదియ నాడు సోదరికి బహుమానాలిచ్చి ఆమె చేతితో తిలకం పెట్టించుకుంటే అపమృత్యువును నివారించవచ్చు అంటాడు.దీనికి కారణం ఉంది.


యముడు యమున సూర్యుని పిల్లలు.సోదరిపైన ఉన్న ప్రేమతో ఎవరైతే తన సోదరి అనుగ్రహానికి పాత్రులౌతారో వారికి దూరంగా ఉంటానని వరం ఇచ్చాడట. 


అందువల్లనే యమునలో స్నానం చేసిన వారికి అపమృత్యు బాధ ఉండదట.


అందరూ యమునా స్నానం చేయలేరు కదా! సోదర,సోదరీ ప్రేమకు నిదర్శనంగా నిలిచినా యమున, యముల బంధాల్ని గుర్తు చేసుకుంటూ కార్తీక శుద్ధ విదియ నాడు భగినీ (సోదరి) హస్త భోజనం చేసినట్లయితే అదే ఫలితాన్ని పొందవచ్చు.ఉత్తర భారతంలో ఇది చాలా ప్రాంతాలలో జరుపుకునే పండుగ. 


తెలుగు రాష్ట్రాలలో దానిని గురించి తెలిసినా పెద్దగా పాటించరు.పురాణ కధలలో ఎదో అంతరార్ధాలు దాగి ఉన్నాయని గ్రహిస్తే ఆచారాలు ఆచరణలోకి వస్తాయి.


🌹🙏🌹

వనభోజనాలు

 స్నాన, దాన, జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం “కార్తీకమాసం’. చాంద్రమానం ప్రకారం కార్తీకమాసం ఎనిమిదవది. శరదృతువులో రెండవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమనాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి “కార్తీకమాసం” అని పేరు వచ్చింది.


“న కార్తీక నమో మాసః

న దేవం కేశవాత్పరం!

నచవేద సమం శాస్త్రం

న తీర్థం గంగాయాస్థమమ్”


అని స్కంద పురాణంలో పేర్కొనబడింది. అంటే “కార్తీకమాసానికి సమానమైన మాసము లేదు. శ్రీమహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు.” అని అర్ధం


శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు.

హరిహరాదులకు ప్రీతికరం... కార్తీక మాసం

మన భారతీయ సంస్కృతిలో కార్తీకమాసం వచ్చింది అంటే ఆ నెల రోజులు పండుగదినాలే! అందులోను కార్తీకమాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్షకుంకుమార్చనలు, విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగుబంగారంలా సంతోషం కలిగిస్తాడు. కాబట్టి ఆ స్వామికి ‘‘ఆశుతోషుడు’’ అనే బిరుదు వచ్చింది.

‘‘హరిః ఓం నమస్తే అస్తు భగవన్విశ్వేశ్వరాయ మహాదేవాయ త్య్రంబకాయ

త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ

మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః''


ప్రతి ఈశ్వరాలయంలో ఆ రుద్ర నమకం మంత్రభాగం మారుమోగిపోతూ, ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. హిందువుల గృహాలలో ‘‘ఆదిత్యమంబికా విష్ణూగణనాథం మహేశ్వరం’’ అనే పంచాయతన దేవతలను విశేషంగా ఆరాధిస్తారు. ఈ కార్తీకమాస మహత్యం గురించి పూర్వం నైమిశారణ్య ఆశ్రమములో శౌనకాది మహామునులు అందరికీ సూతమహాముని ఎన్నో విష్ణు భక్తుల చరిత్రలు, విష్ణు మహిమలను వినిపించే సమయంలో, "ఓ సూతముని శ్రేష్ఠా! కలియుగంలో ప్రజలు సంసార సాగరమునుండి తరింపలేక, అరిషడ్వర్గాలకు దాసులై, సుఖంగా మోక్షమార్గం తెలియక ఎన్నో ఈతిబాధలు అనుభవిస్తున్న ఈ మానవులకు ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మమేది? దేవతలు అందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమ దైవమెవరు? మానవునికి ఆవరించియున్న ఈ అజ్ఞానాన్ని రూపుమాపి పుణ్యఫలం యిచ్చే కార్యమేది? ప్రతిక్షణం మృత్యువు వల్ల వెంబడించబడే ఈ మానవులకు మోక్షము కలిగించు చక్కని ఉపాయము చెప్ప''మని కోరారు.

ఆ ప్రశ్నలను విన్న సూతముని, "ఓ ముని పుంగవులారా! క్షణికమైన సుఖభోగాల కోసం పరితపించుతూ, మందబుద్ధులు అవుతున్న మానవులకు ‘‘ఈ కార్తీకమాస వ్రతము’’ హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైంది. దీనిని ఆచరించటం వల్ల సకల పాపాలు హరింపబడి మరు జన్మలేక పరంధామము పొందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ కార్తీకమాస వ్రతమాచరించాలని కోరికను కలుగచేస్తాడు ఆ పరమాత్మ! దుష్టులకు, దుర్మార్గులకు వారి కర్మలు పరిపక్వమయ్యేవరకు ఏవగింపు కలిగిస్తాడు.


ఈ మాసంలో వచ్చే సోమవారాలు చవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, అత్యంత పుణ్యప్రదమైనవి. నెల అంతా సాధ్యపడని భక్తులు కనీసం ఆయా రోజులలో పవిత్రపుణ్య నదీ స్నానం ఆచరించి, ఉపవాస దీక్షలు చేస్తూ మహాన్యాస పూర్వక మహా రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, లక్ష కుంకుమార్చనలు, లలిత, విష్ణు సహస్రనామ పారాయణాలు, ప్రతి నిత్యం ఉభయ సంధ్యలలో దీపారాధన చేసేవారికి విశేష పుణ్య ఫలం లభిస్తుంది. ఈ కార్తీకమాసం ముప్పై రోజులు ఆచరించిన వారికి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని చెప్పబడింది.

ఇందులో అత్యంత మహిమాన్వితమైన కాలం ప్రదోషకాలం. సూర్యాస్తమయం అయ్యాక మూడు గడియలు (ఒక గంట) ప్రదోషోరజనీముఖమ్‌. రాత్రికి ఆరంభకాలమే ఈ ప్రదోష సమయం. ఇలా ప్రతి నిత్ర్యం వచ్చే ప్రదోషాన్ని నిత్య ప్రదోషంగా చెప్తారు. ఈ ప్రదోషం నాలుగు విధాలుగా మహాత్ములు వివరిస్తూ ఉంటారు. 1. నిత్య ప్రదోషం. 2. పక్ష ప్రదోషం 3. మాస ప్రదోషం 4. మహాప్రదోషం అని చెప్తారు.


కొందరు నిష్టాపరులు ఈ కార్తీకమాసమంతా పుణ్యనదీస్నానం ఆచరిస్తూ ప్రతి నిత్యం హరిహరాదులను పూజిస్తూ పగలు అపక్వాహారం అంటే వండని ఆహారం. పాలు, పండ్లు స్వీకరించి సాయంత్రం భక్తితో కార్తీక దీపారాధనలు, పూజలు చేసి, నివేదించిన అన్నాన్ని రాత్రి భుజిస్తూ ఉంటారు. ఇలా ఈ కార్తీక వ్రతాన్ని నిత్యం ఆచరిస్తారు.ఇక ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏక కాలంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి, రెండవ భాగంలో పరమేశ్వరరూపంగా ‘‘అర్థనారీశ్వ రుడుగా’’ దర్శనమిచ్చే కాలం ఈ ప్రదోషకాలం అని చెప్పబడినది. ఆ ప్రదోష సమయాల్లో ఆ తల్లి ‘‘అధ్యక్షురాలు’’గా అధిరోహించియుండగా! పరమేశ్వరుడు పరవశించి తాండవం చేస్తూ ఉంటాడు. ఆ నృత్యాన్ని దర్శించటానికి దేవతలందరూ అక్కడ కొలువుతీరి ఉంటారుట! ఆ సమయంలో ఆ తాండవ నృత్యానికి అనుగుణంగా సరస్వతి దేవి వీణవాయిస్తూ ఉంటే బ్రహ్మ తాళం వేస్తాడట. శ్రీ మహాలక్ష్మీ గానం చేస్తూ ఉంటే! శ్రీ హరి మృదంగం వాయిస్తాడుట. ఇంద్రుడు వేణునాదంతో పులకింపచేస్తూ ఉంటాడు! అలాంటి ప్రదోష సమయాల్లో దేవగంధర్వ మహర్షి సిద్ధులందరూ పరమాత్మ స్వరూపాన్ని కొలుస్తూ ఉంటారుట.

కాబట్టి ప్రదోష సమయాల్లో శివుని ఆరాధిస్తే! శివుని ఆశీస్సులతోపాటు మిగతా దేవతల ఆశీస్సులు కూడా ఏకకాలంలో మనం పొందగలుగుతామని చెప్పబడింది. ఇంకా మనకు ఆ అర్థనారీశ్వర స్వరూపాన్ని ధ్యానిస్తే! రెండు ప్రయోజనాలు లభిస్తాయట. కామం! అంటే కోర్కెలను నియంత్రించే శక్తి మరియు కాలాన్ని అంటే మరణాన్ని జయించే శక్తిని ప్రసా దిస్తాడుట! ఇంకా ఈ ప్రదోష దర్శనం సర్వశుభాలను కలుగచేసి, సర్వదారిద్య్ర బాధలను తొలగించి సర్వసంపత్తులు అనుగ్రిహస్తుంది అని చెప్పబడింది.

ఈ కార్తీకమాసంలో అత్యంత విశేషమైనది. ఉత్థానైకాదశి అంటే శ్రీ మహావిష్ణువు పాలకడలిలో ఆదిశేషుని పాన్పుపైన ఆషాడ శుద్ధ ఏకాదశినాడు తనయోగనిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశినాడు కనులు విప్పి యోగ నిద్ర నుండి మేల్కొన్న రోజుకే ఉత్థాన ఏకాదశి అనే పేరు. ఆ మరుసటి రోజు ద్వాదశినాడు ముప్పై ముగ్గురు దేవతలలో శ్రీ మహాలక్ష్మీ సమేతుడై తులసీ ధాత్రివనంలో ఉంటాడని చెప్తారు.

ఈ ద్వాదశిని క్షీరాబ్ధి ద్వాదశి అంటారు అంటే, పూర్వం కృతయుగంలో దేవదానవులు పాలసముద్ర మధనం చేసిన రోజు. కనుక దీనికి క్షీరాబ్ధి ద్వాదశి అను పేరు వచ్చింది. పాల సముద్రాన్ని చిలికారు కనుక చిల్కు ద్వాదశి అని కూడా అంటారు. కనుక స్త్రీలు ఈ రోజు వారి సౌభాగ్య సంపదల కోసం తులసీ ధాత్రి (తులసికోట) దగ్గర విశేష దీపారాధనలు చేసి షోడశోపచారాలతో తులసీధాత్రి లక్ష్మీనారాయణులను పూజిస్తారు. ఆ రోజు దేశం నలుమూలలా ఉన్న ఆలయాలలోని లక్ష్మీనారాయణ మూర్తులను మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ దీపకాంతితో, బాణసంచాలతో సమీప నదీజాలలో తెప్సోత్సవం నిర్వహిస్తూ ఉంటారు. కార్తీక పూర్ణిమనాడు వరిగడ్డిని వెంటిగా చుట్టి దానిని రెండు స్తంభాలకు కట్టి ఆ వెంటిని మూడుమార్లు కాగడాలతో వెలిగిస్తూ వాటి క్రింది పార్వతీపరమేశ్వరుల ప్రతిమలను పల్లకిలో ఉంచి మూడుసార్లు త్రిప్పి జ్వాలాతోరణ వేడుకను నిర్వహిస్తారు. అలా హరిహరాదులకు ప్రత్యేక ఉత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ఇలా ఈ కార్తీకమాస విశేషాలను కొనియాడి చెప్పడానికి సహస్రముఖాలు కలిగిన ఆదిశేషుడు, చతుర్ముఖుడైన బ్రహ్మకే సాధ్యం కాదని చెప్పగా, ఇక మానవ మాత్రులమైన మనమెంత?'' అని సూతమహాముని చెప్పారు.


మన సంస్కృతిలో ఈ దీపారాధన అనేది ప్రధానాంశం. ఈ దీపదానంలో ఆవునెయ్యి ఉత్తమోత్తమమైనది. మంచినూనె మధ్యమము, ఇప్పనూనె అధమము, ఇతర నూనెలు అడవిలో పుట్టిన నూనెలు అధమాతి అధమములు. గేదె నేతితో దీపము, వెలిగిస్తే పూర్వ పుణ్యము కూడా నశించి పోతుంది. అదే స్వల్పంగా ఆవునేయి కలిపి వెలిగింస్తే దోషములేదని, అలా ఒకటి మొదలు వేయి వరకు దీపాలు వెలిగించుటం ఎంతో శుభప్రదమని వాటి సంఖ్యనుబట్టి వివిధ ఫలితాలు అందిస్తుందని, దీపదాన మహాత్యంలో చెప్పివున్నారు. అలాంటి దీపారాధన పూజామందిరంలో, దేవాలయాలలో గృహప్రాంగణాలలో, తులసీ బృందావనంలో, మారేడు, రావి వంటి దేవతా వృక్షాల దగ్గర, పుణ్య నదీతీరాలలో వెలిగించుటం అత్యంత పుణ్యప్రదమని పురాణాలు వర్ణించి చెబుతున్నాయి


ఈ మాసంలో సోదరి చేతివంట భగనీ హస్తభోజనము చేసి యధాశక్తి వారికి కానుకలు సమర్పించుటంతో పాటు, సమీప వనంలో బంధువులు, స్నేహితులతో కలిసి ఉసి రిచెట్టును పూజించి, సాత్విక ఆహారంతో వనభోజనాలు చేస్తూ వుండటం మంచిది. అందువల్ల మన జీవన గమనంలో మంచి ఆహ్లాదంతో పాటు అన్నదాన ఫలితం కూడా లభిస్తుంది.

అలాంటి మహిమాన్వితమైన ఈ కార్తీకమాసంలో నియమనిష్టలతో హరిహరాదులను అనునిత్యం ఆరాధిస్తూ ‘‘కార్తీకపురాణ’’ పఠనం చేస్తే అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని, ఈ పవిత్ర పుణ్యదినాలలో అలసత్వం వహించకుండా యథాశక్తి దీపదానము, వస్త్ర, ఫల, పుష్ప, సువర్ణ దానాలు మొదలైనవి చేయుటం వల్ల ఇహంలో సర్వసుఖాలు అనుభవించుటమే కాకుండా, జన్మాంతరంలో జన్మరాహిత్యాన్ని పొందగలరని ఈ కార్తీకమాస వ్రతమహాత్యాన్ని గురించిసూతమహాముని శౌనకాది మునులకు వివరించాడు.


ఆయా మాసాలలో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండటంవల్ల ఈ మాసానికి కార్తీకమాసమని పేరు. ఈ మాసంలో కృత్తిక నక్షత్రానికి, దీపారాధనకు, సోమవారాలకు ప్రాధాన్యత ఉంది. ఈ విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కృత్తికా నక్షత్రం: కృత్తికానక్షత్రానికి నక్షత్రాలలో మంచి ప్రాముఖ్యత ఉంది. దేవతలలో ప్రథముడైన అగ్నిదేవుడు ఈ నక్షత్రానికి అధిపతి. అగ్ని నక్షత్రాలైన కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాడలలో మొదటిది కృత్తికయే. వేదకాలంలో సంవత్సరం కృత్తికా నక్షత్రంతోనే ఆరంభమయ్యేది. ఈ నక్షత్రాన్ని అగ్ని నక్షత్రమని అంటారు. అగ్ని ఆరు ముఖాలు కలవాడు. కృత్తికలు కూడా ఆరు నక్షత్రాలు. ఈ కృత్తికలు ఒక విశిష్టత ఉంది. అదేమిటంటే కుమారస్వామిని షణ్ముఖుడు అంటారు. అంటే ఆరు ముఖాలు కలవాడని అర్థం. ఆకాశంలోని ఆరు కృత్తికా నక్షత్రాలు మాతృమూర్తులై పాలు యివ్వగా కుమారస్వామి ఆరు ముఖాలతో పాలు త్రాగాడు. ఈ విధంగా కృత్తికలచే పెంచబడటంతో కుమరస్వామికి కార్తీకేయుడని పేరు వచ్చినది. ఈ కారణాల వల్ల కృత్తికలకు ప్రాముఖ్యం కలిగింది.


ఈ మాసంలో చెప్పుకోదగ్గ మరో అంశం దీపారాధన. ఈ మాస ప్రారంభం నుండి సూర్యోదయానికి పూర్వమే లేచి నదీస్నానం చేసి శుచిగా, పొడిబట్టలు ధరించి దీపారాధన చేయాలి. ఈ మాసంలోనే జ్వాలా తోరణాన్ని కొన్ని చోట్ల వెలిగిస్తారు. ఈ కాలమంతా దేవాలయాలన్నీ దీపాలచే అలంకరించబడి ప్రజలను ఉత్తేజపరుస్తూ శోభాయమానంగా ఉంటాయి. ప్రతి ఇంటిముంగిట ఈ మాసాంతం వరకు దీపం వెలుగుతూ ఉంటుంది. కార్తీకమాసంలో స్త్రీలు నదులలో, కోనేటిలలో దీపాలు వదలుతారు. ఈ దీపాలు ఆకాశంలోని చుక్కల్లాగా ప్రకాశవంతంగా వెలుగుతూ కన్నులపండుగను కలుగచేస్తాయి. ఈ మాసంలో స్త్రీలు దీపాన్ని దానంగా ఇస్తారు. దీని వల్ల వారికి ఎనలేని కీర్తిసౌ భాగ్యాలు కలుగుతాయని భావిస్తారు. ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానమునే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపుతాయి.


ఈ మాసవారాలలో సోమవారానికి ప్రత్యేకత ఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైన అగ్ని నక్షత్రాలలో మొదటిదైన కృత్తికను అధిపతిగా ఉండటం, చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండటం వల్ల మాసంలోని సోమవారాలకు విశిష్టత కలిగింది. చంద్రుని వారమైన ఈ సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. శైవభక్తులు ఈ మాసంలో ముఖ్యంగా సోమవారాలలో భక్తిశ్రద్ధలతో నియమనిష్టలతో శివుణ్ణి ఆరాధిస్తారు. ఈ మాసకాలంలో సూర్యోదయ పూర్వమే బ్రహ్మ ముహూర్తంలో నదీ స్నానం చేసి 'హరహరశంభో' అంటూ శివుణ్ణి స్తుతిస్తూ భక్తి ప్రపంచంలో మునిగిపోతారు. ముఖ్యంగా శైవభక్తులు ఈ మాసమంతా ఉపవాసముండి శివుడిని పూజిస్తారు. శివ ప్రీతికరమైన సోమవారం రోజు భానోదయం ముందు లేచి స్నానాదికార్యాక్రమాలు ముగించుకుని, పొడి బట్టలు ధరించి మొదటగా దీపారాధన చేయాలి. అనంతరం శివుడికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించాలి. ఈ విధంగా చేయడం వల్ల నిత్యమూ సిరిసంపదలతో, సుఖసౌఖ్యాలతో వర్థిల్లుతారని ప్రజల నమ్మకం. సూర్యుడు తులారాశిలో ప్రవేశించిన నాటి నుండిగాని, కార్తీక మాసారంభదినమైన శుద్ధపాడ్యమి మొదలుకొని గాని వ్రతారంభం చేయాలి. అలా ప్రారంభించే సమయంలో "ఓ కార్తీక దామోదార! నీకు వందనములు. నాచే ఆరంభింపబడే కార్తీక వ్రతాన్ని విఘ్నం లేకుండా చేయు''ము అని తరువాత స్నానం చేయాలి

ఆ విధంగా జీవనదికి వెళ్ళి గంగకు, శ్రీ మన్నారాయణునను, భైరవున్ని నమస్కరించి భైరవాజ్ఞను తలదాల్చి మొలలోతు నీటిలో నిలువబడి మొదట సంకల్పము చెప్పుకొని సూక్తాలను చదివి, మార్జన మంత్రముతోను, అఘమర్షణ మంత్రముతోను, గంగోదకమును శిరస్సున జల్లుకొని అఘమర్ష స్నానమా ఆచరించాలి. తరువాత సూర్యుడికి కర్ఘ్య ప్రదానం చేసి దేవతలకు, ఋషూలకు, పితృదేవతలకు క్రమ ప్రకారంగ తర్పణం వదలాలి. అప్పుడది సుస్నానం అవుతుంది. స్నానం చేసిన తరువాత నదీతీరము చేరి మూడుదోసిళ్ళ నీరు గట్టుపైన పోయాలి


కార్తీకమాసంలో గంగా, గోదావరి, కావేరీ, తుంగభద్రాది నదులలో స్నానం చేస్తే ఆత్యుత్తమం, గంగానది కార్తీకమాసంలో నదులన్నిటిలో ద్రవరూప సన్నిహితయై వుంటుంది. శ్రీ ఆదినారాయణుడు గోష్పాద మాత్ర ప్రదేశంలో జలములో సన్నిహితుడై ఉంటాడని వేదాలు చెప్పుతున్నాయి కాబట్టి సముద్రకామి అయిన నదీ స్నానం అత్యంత పవిత్రమైనది. నదీ స్నానానికి ఆవకాశము లభించకపోతే కులువలోగాని, చెరువులోగాని, కూపము దగ్గరగాని సూర్యోదయము స్నానం చేయాలి. తరువాత మడిబట్టలను ధరించి ముందుగా భగవంతుని స్మరించు కోవాలి. తరువాత భస్మాన్ని త్రిపుండ్రముగా నుదుట ధరించాలి. లేక గోపీచందనముపైన నుదుట నూర్ద్వ పుండ్రముగా వుంచుకోవాలి. తరువాత సంధ్యావందనము, బ్రహ్మ యజ్ఞాన్ని ముగించి, నిత్యాగ్నిహోత్రాన్ని చేసుకొని దేవతార్చన చేసుకోవాలి. స్నానతీర్థములోనే కార్తీక పురాణ శ్రవణమును చేయాలి.


సూర్యుడు ఆస్తమించే కాలంలో సాయంసంధ్యను పూర్తి చేసికొని శివాలయముగాని, విష్ణు ఆలయంలోగాని దీపారాధన చేయాలి. షోడశోపచార పూజావిధానంలో హరిహరులను పూజించి షడ్రసోపేతమై, భక్ష్యభోజ్యాదులతో కూడిన నైవేద్యము పెట్టాలి. ఈ విధంగా కార్తీకశుద్ధ ప్రతిపత్తు మొదలు అమావాశ్య తుదివరకు నక్తవ్రతం చేస్తే కార్తీకమాస వ్రతము పూర్తవుతుంది. మరునాడు శక్తిననుసరించి మృష్టాన్నముతో భూత తృప్తి కావించాలి. కార్తీక మాసంలో సోమవారం శివప్రీతికై సోమవారవ్రతము చేసినవారికి కైలాసంలో శివుని సన్నిధానమున నుండుట ప్రాప్తిస్తుంది. సోమవారవ్రత విధానం ఎలాంటిది అంటే - సోమవారం నదీ స్నానం చేసి సంపూర్ణంగా ఉపవాసం ఉండి, శివునికి అభిషేకం చేసి రాత్రి మొదటి ఝామున భుజించాలి.


 


About Kathika Masam, Importance of Karthika Masam, Significance of Karthika Month, Speciality of Karthika Masam


 


ఆ రోజున యితరులలాగా పదార్ధం గ్రహింపరాదు. తిలదాన మొనర్చినందువలన పాపములన్నియు నశించును. ఇంకా ఆత్యంత నిష్ఠతోను, భక్తితోను ఆచరింప అవకాశం ఉన్నవారు ఆ దినం రాత్రి కూడా నిద్రింపోక పురాణాది పఠనంతో జాగరణ చేసి, మరునాడు శక్తి కొలదిగా బ్రాహ్మణులకు సంతర్పణను చేసి తరువాత భుజించాలి. ఈ పై రెండూ చేయలేనివారు సోమవారం రోజు నపరాహ్ణము వరకు వుండి భుజించాలి. యిందులో ఏది చేయుడానికి శక్తిలేకపోతే నదీస్నానం చేసుకొని భగవంతుని ధ్యానించాలి. సోమవారం రోజు స్త్రీగాని, పురుషుడుగాని నక్షత్ర దర్శనం అయ్యేవరకు ఉపవాసం చేసి తరువాత భుజించినవారి పాపాలు అగ్నిలో పడిన దూదివలే నాశనం అవుతుంది. ఆ రోజునశివుడికి అభిషేకం చేసి, బిల్వదళంబులతో సహస్రనామార్చన చేసి, ఇతరులచే చేయించిమా, శివపంచాక్షరీ మంత్రాన్ని జపించినా, వారిని శివుడు ఆనుగ్రహించి సర్వసంపదలను, సమస్త శుభాలను చేకూరుస్తాడు.


 


About Kathika Masam, Importance of Karthika Masam, Significance of Karthika Month, Speciality of Karthika Masam


 


కార్తీక సోమవారాలు లేదా పౌర్ణమినాడుగాని లేక ఇతర దినాల్లో అయినా సాయంసమయాలలో శివాలయంలో ఉసిరికాయపైన వత్తులను వుంచి దీపం వెలిగించడం శ్రేష్టం. ఆవునెయ్యితో దీపం వెలిగించడం శ్రేష్టం. లేదంటే నువ్వులనూనెతో గానీ, కొబ్బరినూనెతో గానీ, నెయ్యితోగాని, అవిశనూనెతో గానీ, ఇప్పనూనెతో గానీ, లేదంటే కనీసం ఆముదంతోనైనా దీపాన్ని వెలిగించాలి. అంతే కాకుండా కార్తీకమాసంలో దీపదానం చేయాలని శాస్త్రవచనం. కార్తీకమాసంలో ముప్పై రోజులలో దీపం పెట్టలేనివారు శుద్ధద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ దినాల్లో తప్పక దీపం పెట్టాలని శాస్త్ర వచనం. ఈ విధంగా కార్తీకమాసంలో దీపాలను వెలిగించడం, దీపదానం చేయడం వల్ల సకల జీవరాశులే కాకుండా రాళ్ళూ, రప్పలు, వృక్షాలు వంటివి కూడా ముక్తి పొందుతాయని పురాణ కథనం.

కర్మఫలాలు

: *

వాసనలు, కర్మఫలాలు ఎలా ప్రోగు పడుతున్నాయి?* 

ప్రతి మానవుడూ ఏవో కర్మలను చేస్తూ ఉంటాడు. మమకారంతో, కోరికతో, రాగద్వేషాలతో ఇలా కర్మలు చేసినప్పుడు చేసిన కర్మల కారణంగా కర్మఫలాలు; కోరికల కారణంగా వాసనలు చేరుకుంటాయి. 


ఈ కర్మఫలాలు, వాసనలు రాకుండా ఉండాలంటే కర్మలు చేయకుండా ఉంటే సరిపోతుంది. 


ఐతే మానవుడు బండరాయి కాదు గదా! ఏ పనీ చేయకుండా ఉండడానికి. కనుక పని చేయాల్సిందే. 


‘కుర్వన్నే వేహ కర్మాణి’ - ‘ఇక్కడ కర్మలు చేస్తూ ఉండవలసిందే’ అని ఈశావాస్యోపనిషత్ చెబుతున్నది. 


‘నహికశ్చిత్ క్షణ మపి జాతు తిష్టత్య కర్మకృత్’ - ‘కర్మలు చేయకుండ ఒక్క క్షణం కూడా ఉండే వీలులేదు’ అంటూ భగవద్గీత బోధిస్తున్నది. 


కనుక కర్మలు చేయాల్సిందే.


 అయితే ఎలా చేయాలి? 


కోరికలు లేకుండా, నేను చేస్తున్నాను అనే స్పృహ లేకుండా - కర్తృత్వ బుద్ధి లేకుండా, కర్తవ్యతా భావంతో, భగవదార్పణ బుద్ధితో, కర్మలతో ఎట్టి సంగభావం లేకుండా, నిష్కామంగా చేయాలి. ఇలా చేసినప్పుడు క్రొత్త వాసనలు చేరుకోవు.


 కర్మఫలాలు కూడా నీకు అంటవు.


 'ఇలా చెయ్యాలి' అంటే మనం మన నిజస్వరూపం ఏమిటో తెలుసుకొని, మనస్వస్వరూపమైన ఆత్మలో నిలిచి, పరమాత్మలో మనస్సు నిల్పి నిర్లిప్తంగా చేయాలి. 


అలా చేసినప్పుడే ఇక పునర్జన్మ ఉండదు. అలా చేయనంతకాలం ఈ పుట్టటం - చావటం అనే చక్రబంధంలో ఇరుక్కుపోవాల్సిందే. 


  పుడితే ఏమిటి నష్టం? పుట్టేటప్పుడు ఏడుపు. పెరిగేటప్పుడు ఏడుపు. రోగాలొస్తే ఏడుపు. ముసలితనం వస్తే ఏడుపు. కోరుకున్నట్లు జరగకపోతే ఏడుపు. నీది అనుకున్నది నిన్ను విడిపోతే ఏడుపు. చివరకు మరణించేటప్పుడు అయ్యో! అన్నింటిని, అందరిని వదలి పోతున్నామే అని ఏడుపు. ఆ అవ్యక్తలోకాల్లో ఎన్ని కష్టాలు పడాలో, ఎంత నరకం అనుభవించాలో అని ఏడుపు. 

  ఇక మళ్లీ పుట్టేటప్పుడు తల్లి గర్భంలో ప్రవేశించాలి. అక్కడ తల్లి తీసుకున్న ఆహారంతో పెరగాలి. అక్కడ ఉండటానికి చాలా ఇరుకు. సూక్ష్మజీవులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి . జుగుప్సాకరమైన రక్తం, చీము, మాంసం మొదలైన పదార్థాలతో నివాసం. ఇక ఉండటం కూడా తలక్రిందకు మోకాళ్ళకు ఆని ఉంటుంది. అంతా ఉక్కిరి బిక్కిరిగా ఉంటుంది. దుర్భరం, బాధాకరం. అది గర్భనరకం. 

  ఇట్టి బాధాకరమైన పరిస్థితి నుండి మనలను మనం ఉద్ధరించుకోవాలి. 


మనకు సాధ్యమా ఇది? మన శక్తి సరిపోతుందా? చాలదు. కనుక పరమాత్మను ఆశ్రయించాలి.


 ఓ ప్రభూ! ఇక నీవే నాకు దిక్కు అని శరణు కోరాలి. భగవంతునితో తాదాత్మ్యం చెందాలి. ఆయనను విడిచి ఒక్క క్షణమైనా ఉండరాదు.

"అమర చైతన్యం"* 

 *( శ్రీ రమణ మహర్షి బోధనలు 


 *ప్రశ్న: నా ప్రమేయమేమి లేకుండా నాకేదైనా వచ్చిందనుకోండి, దానిని నేననుభవిస్తే దాని వల్ల చెడు ఫలితాలుంటాయా ?*


*జవాబు: ప్రతి పనికీ ఫలితముంటుంది. ప్రారబ్ధవశాన నీకేదైనా వస్తే నీవేమీ చేయలేవు దానికి. వచ్చిన దానిని ఏ మమకారమూ లేకుండా, అదే ఇంకా ఎక్కువ కావాలనే కోరిక లేకుండా, తీసుకుంటే నీకే కీడూ వాటిల్లదు. దానివల్ల మళ్ళీ జన్ననెత్త వలసి రాదు. అలాకాకుండా, ఎంతో ఆసక్తితో దానిని ఆస్వాదించి, ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటే, మళ్ళీ జన్మనెత్తాల్సి వస్తుంది.*


✨⚡️✨⚡️✨⚡️


 *ప్రశ్న: సంకల్పమంటూ ఏమైనా ఉందా అసలు ?*


*జవాబు: ఎవరి సంకల్పం ? కర్తృత్వ భావమున్నంత కాలం అనుభవముంటుంది. వ్యక్తి సంకల్పమూ ఉంటుంది.*


*ఆత్మ విచారం వల్ల ఆ భావం పోతే, దైవసంకల్పమే పనిచేసి అన్నిటినీ నడిపిస్తుంది. విధిని జ్ఞానం, ఆత్మజ్ఞానం అతిక్రమిస్తుంది. ఆత్మజ్ఞానం సంకల్పానికీ, విధికీ అతీతం.*


✨⚡️✨⚡️✨⚡️


*ప్రశ్న: దేనినైనా చేయటానికి మనిషికి గల స్వేచ్ఛ, బాధ్యతల మాట ఏమిటి?*


*జవాబు: మనిషికి గల స్వేచ్ఛ ఒక్కటే. ప్రయత్నించి, దేహాత్మబుద్ధిని తొలగించే జ్ఞానాన్ని సంపాదించటమే. ప్రారబ్థం వల్ల అనివార్యమైన కలాపాలను శరీరం చేస్తుంది. దేహంతో తాదాత్మ్యం చెంది దాని ఫలితాలని అనుభవించటానికి గాని, ఆ తాదాత్మ్యం లేకుండా కేవలం సాక్షీభూతుడుగా ఉండటం గాని మనిషి చేతుల్లో ఉంది.*

[14/11, 8:00 am] +91 93913 24915: *రమణాశ్రమ లేఖలు / జ్ఞానసంబంధ మూర్తి


 (తరువాత భాగం) 


  తమిళ్ భక్తులొకరు "వారు అరుణాచలానికి వచ్చిన సంభవం పెరియపురాణంలో విశదంగా లేదే" అన్నారు. "అవునవును పురాణాలలో లేదు సంస్కృత భాషలో ఉపమన్యుని శివభక్తవిలాసమునందున్నది. సంబంధులు అరయవివల్లూరు వచ్చి, విరాట్టేశ్వరుని దర్శించి పద్యకుసుమార్చలనచే ప్రీతుల గావించుకొని 

అతుల్యనాథేశ్వర సన్నిధి కరిగి, అక్కడా అదేవిధంగా పద్యాలు పాడి ఆ తరువాత ఆ స్థలమందుండే అరుణ గిరిశిఖరం మాలోకించి ఆనంద పరవశంతో పద్యములు పాడుటయేకాక ఆ స్థలమందు తామూ అరుణాచలేశుని  ప్రతిష్టించారు. ఆ తరువాత ఒక మండపంలో వారు కూర్చుని ఉంటే, అరుణాచలేశ్వరుడు మొదట జ్యోతి రూపమున ప్రత్యక్షమై, వెనుక ఒక వృద్ధ బ్రాహ్మణ రూపమున గోచరించాడు. ఆ విప్రుడెవరో వీరికి తెలియదు. ఆయన చేతిలో ఒక పూలబుట్ట కూడా ఉన్నది. ఆ కారణంగా సంబంధుల మనస్సు అయస్కాంతంవలే  ఆ విప్రునివైపుకు ఆకర్షింపబడింది. వెంటనే వందన పూర్వకంగా "అయ్యా! తమరెక్కడి నుండి దయచేశారు?" అన్నారు. "నేనా? అరుణాచలం నుండి వచ్చాను. ఇక్కడే మా ఊరు" అన్నాడా విప్రుడు. సంబంధులు చకితులై "అరుణాచలమా? తామిక్కడికి దయచేసి ఎంతకాలమైంది?" అన్నారు. ఆ విప్రుడు అలక్ష్యంగా 'ఎన్నాళ్లు ఏమిటి? అరుణాచలేశ్వరుని అర్పించే పూమాల కొఱకు నిత్యం ఉదయమే ఇక్కడికి వచ్చి, పూలు సేకరించుకుని మధ్యాహ్నానికి అక్కడకు చేరుకుంటాను' అన్నాడు.  సంబంధాలాశ్చర్యంతో "అలాగా చాలా దూరమన్నారే?"  అన్నారు. 'ఎవరయ్యా చెప్పింది . ఒక్క అంగలో పోయి ఒక్క అంగలో రావచ్చును. ఏమంత బ్రహ్మాండం '  అన్నాడా విప్రుడు. అది విన్న సంబంధులకప్పుడు అరుణాచల సందర్శనోత్సుకత కలిగి,"అయితే నేను నడవగలనా?" అన్నారు. 'ఉస్సీ, ఇంత వయస్సయినవాణ్ణి, ఇంత వృద్ధుడను నేనే నిత్యం వచ్చిపోతాను, బాలుడువుగదా నీవు రాలేవా? ఏమయ్యా నీ మాటలు' అన్నాడా విప్రుడు. 


    సంబంధులు అత్యంత కుతూహలాయత్తచిత్తులై "అయ్యా! అలాగైితే నన్ను కూడా తమతో పిలుచుకొని పోండని" ఆ విప్రుని ప్రార్ధించి,వెంటనే పరివారసమేతులై బయలుదేరారు. ఆ విప్రుడు ముందు వీరు వెనుకగా పోతూ ఉంటే, మార్గమధ్యంలో ఆ విప్రుడు అదృశ్యుడైనాడు. వీరు అటూ ఇటూ చూస్తూండగా బోయదండొకటి  వీరిని చుట్టుముట్టి పల్లకి, గొడుగు బంగారు తాళములు ఇంకా తక్కిన ముత్యాల చిహ్నములు, మొదలగు సర్వ సంపద, భోజన సామాగ్రీ, ఒక్కటీ మిగల్చకుండా పై బట్టలతో సహా దోచుకున్నారు. అంతా కౌపీనమాత్రులై నిలవాల్సి వచ్చింది. దోవ తెలియదు, పైన ఎండ, అందరికీ ఆకలి వేళ, ఏం జేస్తారు?  సంబంధులు అప్పుడు 'ఈశ్వరా! ఇది యేమి పరీక్ష. నన్నేమి చేసినను తొందర లేదు. ఈ తోడి వారిని అలయింపనగునా?' అని ప్రార్థిస్తే, స్వామి, నిజరూపుచూపి 'అప్పా! బోయలు నా ప్రమధగణములే అరుణాచలం సన్నిధికి ఆడంబర రహితంగా పోవుటయే శ్రేయస్కరమని ఈ విధముగా చేశారు. అక్కడికి చేరగానే నీ సంపద నిన్ను చెందుతుంది. సందేహింప నక్కరలేదు. ఇప్పుడు మధ్యాహ్నమయింది. విందారగించి తరువాత వెళ్ళవచ్చును' అని చెప్పి అదృశ్యుడైనాడు. 


     వెంటనే ఒక సమప్రదేశమందు పెద్ద డేరా తోచింది. ఆ డేరా నుండి కొందరు బ్రాహ్మణులు వెడలివచ్చి, సంబంధులును అనుచర సమేతంగా తమ డేరాకు 

దయచేయవలెనని, ఆహ్వానించి, పిలుచుకొనివెళ్లి, సకలోపచారములు చేసి, షడ్రసోపేతంగా భోజనం పెట్టి, చందన తాంబూలాదులతో సత్కరించారు. నిత్యం తామే అతిథులందరుకూ విందు చేసే సంబంధులు, ఆనాడు ఈశ్వరుని యింట విందారగించారు. రవంత విశ్రమించిన వెనుక ఆ విప్రులందొకరు లేచి, 'అయ్యా! అరుణగిరికి పోదామా?' అన్నారు. సంబంధాలానందభరితులై  అనుచర సమేతంగా లేచి ఆ విప్రుననుసరించారు.  వీరు దారిబట్టగానే ఆ డేరా, ఆ జనం అదృశ్యమైనారు. అందుకే ఆశ్చర్యపడుతున్న ఆ సంబంధమూర్తి అనుచర సహితులై అరుణాచలంలో అడుగుపెట్టగానే ఆ మార్గదర్శి అదృశ్యమైనాడు. ఉన్నట్లుండి అన్ని మూలల నుండి ఒక్కొక్కరుగా బోయలు వెలువడి వచ్చి, ముందు దోచుకున్న సామానంతా వారి ముందు నుంచి అదృశ్యలైనారు. సంబంధలప్పుడు ఆనందబాష్పపూరిత నేత్రములతో పులకాంకిత శరీరులై, "ఆహా! ఏమి నా తండ్రికరుణ" అని  వినుతీస్తూ, కొన్నాళ్ళందు నివసించి, స్వామిని సేవించి, పద్యకుసమములచే పూజించి వెళ్ళారుట. పితృభావమున  సేవించుచున్న సంబంధులపై కల వాత్సల్యాతిశయమున ఈశ్వరుడు తానుగానే వారినిక్కడికి రప్పించుకున్నాడన్నమాట"  అంటూ భక్తిపూరిత హృదయమున గద్గద కంఠులై మరి మాట పెగలక మౌనం వహించారు భగవాన్.


*ఆత్మ*


ప్ర: ఆత్మని ఎట్లా చూసేది? 


మ: "నేను ఉన్నాను"  అని ఎట్లా తెలుసుకున్నారు! అద్దంలో చూసి తెలుసుకున్నారా? లేక శాస్త్రాల్లో చూసి తెలుసుకున్నారా? తన్ను తెలుసుకోడానికి యింకోటి వుంటే కదా! రెండు ఆత్మలు లేవు. ఉన్నది ఒక్కటే. రెంటిని ఎట్లా చూడటం?  చూసేది ఆత్మే. అది వారికి తెలీదు.  పాపం ఏమి చేసేది? దేహం నేను అన్న తలంపు వదిలితే మిగిలిందే ఆత్మ

[14/11, 8:00 am] +91 93913 24915: _*🔥దీపావళీ ఐదు రోజుల పండుగ అంటారు ? వాటి విశేషాలేమిటి ?🔥*_

🕉🌞🌏🌙🌟🚩


*ధన్వంతరీ త్రయోదశి*


వాడుకలో ధన త్రయోదశి అని అంటూ ఆ రోజు బంగారం కొనాలనే ఆశ పడుతున్నాం!! కానీ ఆరోజు 'ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి మూల పురుషుడు శ్రీమన్నారాయణ స్వరూపుడు అయిన *'ధన్వంతరీభగవాన్'* జయంతి. పాల సముద్రం చిలికిన సమయంలో చేతిలో అమృత భాండముతో అవతరించాడు.


*నరకచతుర్దశి*


నరక యాతనల నుండి రక్షించమని యముడి ప్రీతి కొరకు మరియు పితృదేవతల ప్రీతి కొరకు ముందు దక్షిణ దిశలో దీపాన్ని వెలిగించి మిగతా అన్ని దీపాలను వెలిగించాలి. నరకుడు చనిపోయిన రోజు కూడా ఇదే రోజు ప్రాక్జ్యోతీషపురం (నేటి అస్సాము ) ను పాలించే ' నరకుడు' నర రూప రాక్షసుడు దేవీ ఉపాసకుడు కానీ దేవిని వామాచారంలో క్షుద్రపూజలు చేసి అనేక అధ్భుతశక్తులను సంపాదించి దేవతలను కూడా ఓడించాడు. వాడు ప్రతీ అమావాస్య- పౌర్ణమికి నవ యవ్వన రాచ కన్యలను దేవికి బలి ఇచ్చే వాడు , కాముకత్వంతో అనుభవించేవాడు. నరకుని చెరసాలలో వేలాది అందమైన మహిళలు ( రాచకన్యలు ) బందీలుగా వుండేవారు. ఆది వరాహమూర్తికి - భూదేవికి కలిగిన సంతానమే ఈ నరకుడు తామస ప్రవృత్తితో జనించాడు. శ్రీకృష్ణ భగవానుడు - సత్యభామ ( భూదేవీ అవతారం )తో కలసి గరుడారూడుడై వచ్చి శక్తి ఉపాసకుడైన నరకుని శక్తి ( సత్యభామ ) సహకారంతో సంహరించాడు. నరకుని పీడ విరగడైంది కావున ఇది 'నరక చతుర్దశి'.


*దీపావళీ*


రావణ సంహారం తర్వాత సీతారాములు అయోధ్యకు వచ్చిన శుభ సంధర్బంగా దీపావళి జరుపు కోవాటం , నరకుని బాధల నుండి విముక్తి లభించిన ఆనందంలో దీపావళిని జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం. దీపం - లక్ష్మీ స్వరూపం - ఐశ్వర్య స్వరూరం - జ్ఞాన స్వరూపం అందుకే మనం దీపావళీ రోజు లక్ష్మీపూజలు చేస్తాము. వ్యాపారస్తులు కొత్త లెక్కలు వ్రాసుకుంటారు.


*బలిపాఢ్యమి*


వామనావతారంలో శ్రీమన్నారాయణుడు బలి చక్రవర్తిని *'మూడు అడుగుల'* నేలను దానమడిగాడు. వామన వటువుకు దానమిచ్చాడు బలి , 'ఇంతింతైవటుడింతైనభోరాశిపైనల్లంతై' అన్నట్లుగా ఒక పాదంతో భూమిని , ఇంకో పాదంతో ఆకాశాన్ని ఆక్రమించిన 'త్రివిక్రముడు' వేరొక పాదంతో బలిని పాతాళానికి అణచాడు. సంవత్సరానికి ఒకసారి బలి పాడ్యమి రోజున బలి భూలోకానికి వచ్చి ఇక్కడి దీపకాంతులను చూసి మనమంతా సుఖశాంతులతో వుండాలని ఆశీర్వదించి వెలతాడట ఇదీ ఆయనకు వామనుడిచ్చిన వరం.


*యమద్వితీయ*


సూర్య భగవానునికి యముడు - శనిదేవుడు ఇద్దరు పుత్రులు. యమున అనే ఒక పుత్రిక కలదు. యముడు - యమున ఇద్దరూ అన్నా చెల్లెలు కదా ! తనపని ( జీవులను ఆయువు మూడిన తర్వాత తన యమపాశంతో ఈడ్చుక వచ్చి వారి వారి కర్మాను సారం వారి వారికి తగిన శిక్షలు విధించే పనిలో పడి పాపం చెల్లెలింటికి వెళ్ళటం లేదు యముడు. చెల్లి బతిమాలింది ఒకసారి మా ఇంటికి రా అన్నయ్యా అని బతిమాలింది చెల్లెలు కార్తీక శుద్ఘ విదియ , మంగళవారం రోజు తీరిక చేసుకుని తన చెల్లెలింటికి వెల్లి హాయిగా కొద్ది సేపు వుండి భోజనం చేసి వచ్చాడు యముడు చెల్లెలైన యమున అన్నయ్యను ఒక వరం అడిగింది. ఎవరైతే ఈ రోజు చెల్లెలింటికి వెల్లి చెల్లెలికి కట్నకానుక లిచ్చి వాల్లింట్లో భోజనం చేసి వస్తారో వారికి యముని బాధలు లేకుండా చేయి అని అడిగింది. ఈ యమునమ్మనే యమునా నది. కృష్ణుని భక్తురాలు. భగినీ హస్తభోజనం అన్న పేరుతో ఉత్తర భారతంలో ఈ పండుగ ఇప్పటికీ జరుపుకుంటారు.


🕉🌞🌎🌙🌟🚩

[14/11, 8:00 am] +91 93913 24915: 1.కార్తీకమాసం విశిష్టత.


2. శివ,కేశవులకు ఈ మాసం ఎందుకు ఇష్టమైనది.


3.ఈ మాసంలో ఎటువంటి పూజలు,దానాలు,పారాయణములు, స్తోత్రాలు చేయాలి.


4.ఏ సమయంలో శివుడిని ఆరాధిస్తే ఎక్కువ ఫలితాలను పొందుతాము.


5.ఈ మాసంలో ఎందుకు నదీ స్నానములు చేయాలి, ఏ సమయంలో చేయాలి.


6.దీపారాధనకు ఎటువంటి నూనె ఉత్తమం,ఎన్ని వత్తులతో చేయాలి.


7.ఈ మాసంలో ఉపవాసాలు చేస్తారు(ఏక భుక్తం,నక్తవ్రతం,ఉపవాసం)అంటే ఏమిటి.

ఉపవాసం చేయలేని వారు కనీసం ఏ ఏ ముఖ్యమైన రోజులలో చేయాలి.


8.కార్తీక మాసం మొత్తము అంటే ఏ తిథి రోజున ఏమి చేయాలి.


9.5రోజుల దీపావళి పండుగ.(ధన త్రయోదశి,నరక చతుర్దశి,దీపావళి,బలి పాడ్యమి,భగిని హస్త భోజనం)

వీటి గురించి,ఆ రోజు ఏమి చేయాలి.


10.ఈ మాసం అంతా తప్పనిసరిగా చర్యల్సిన పనులు,చేయకూడని పనులు.

11.ఎటువంటి ఆహారం తినాలి,ఉపవసములు చేసే వారు ఏమేమి తినకూడదు.


12.ఈ మాసం ఏ ఏ పూజలు చేయడం వల్ల సంవత్సరం అంతా పూజ చేసిన ఫలితం రావడమే కాకుండా సమస్త పాపాలు తొలగిపోతాయి..


13.ఈ మాసంలో వచ్చే ఇతర విశిష్టమైన రోజులు,పండుగలు.


14.కార్తీక పౌర్ణమి రోజున ఏమేమి చేయాలి.


15.శివుడికి ఏ పూజలు ఏ నామాలు ఏ స్తోత్రాలు అంటే ఇష్టం.


16.కార్తెకమాసం లో దీపాలు ఎక్కడెక్కడ వెలిగించాలి,ఎటువంటి ఫలితాలు.


17.కార్తీకమాసం లో పూజలు ఉపవాసాలు చేసేవారు ముందుగా మొదటిరోజు ఏమని సంకల్పం చేయాలి.


వీటి అన్నిటి గురించి ఈ ఆడియో లో తెలుసుకోవచ్చు...


https://youtu.be/U14Tp1flWJw


పైన లింక్ టచ్ చేస్తే వీడియో ఓపెన్ అవుతుంది🙏

[14/11, 8:00 am] +91 93913 24915: Sri Sivamahapuranamu-I    Chapters   


అథ ఏకోన వింశోsధ్యాయః


పార్థివ లింగ మహాత్మ్యము


ఋషయ ఊచుః |


సూత సూత చిరం జీవ ధన్యస్త్వం శివభక్తిమాన్‌ | సమ్యగుక్తస్త్వయా లింగమహిమా సత్ఫలప్రదః || 1


యత్ర పార్థివ మహేశ లింగస్య మహిమాధునా | సర్వోత్కృష్టశ్చ కథితో వ్యాసతో బ్రూహి తం పునః || 2


ఋషులిట్లు పలికిరి -


సూతా! నీవు చిరకాలము జీవింపుము. శివభక్తి గల నీవు ధన్యుడవు. మంచి ఫలముల నిచ్చే లింగ మహిమను నీవు చక్కగా వివరించితివి (1). మహేశ్వరుని పార్థివ లింగము సర్వశ్రేష్ఠమని వ్యాసుడు చెప్పియున్నాడు. నీవు ఇపుడు పార్థివ లింగమహిమను మరల చెప్పుము (2).


సూత ఉవాచ |


శృణుధ్వమృషయస్సర్వే సద్భక్త్యా హరతోsఖిలాః శివపార్థివ లింగస్య మహిమా ప్రోచ్యతే మయా || 3


ఉక్తేష్వేతేషు లింగేషు పార్థివం లింగముత్తమమ్‌ | తస్య పూజనతో విప్రా బహవస్సిద్ధి మాగతాః || 4


హరిర్బ్రహ్మా చ ఋషయస్స ప్రజాపతయస్తథా | సంపూజ్య పార్థివం లింగం ప్రాపుస్సర్వేప్సితం ద్విజాః || 5


దేవాసుర మనుష్యాశ్చ గంధర్వోరగ రాక్షసాః | అన్యేsపి బహవస్తం సంపూజ్య సిద్ధిం గతాః పరమ్‌ || 6


సూతుడిట్లు పలికెను -


ఋషులారా! మీరందరు వినుడు. జ్ఞానము సర్వము భక్తిచేత శివుని నుండి సంప్రాప్తమైనది. నేను శివుని పార్థివ లింగము యొక్క మహిమను చెప్పుచున్నాను (3). వర్ణింపబడిన లింగము లన్నింటిలో పార్థివ లింగము శ్రేష్ఠము. ఓ బ్రాహ్మణులారా! దానిని పూజించి ఎందరో సిద్ధిని పొందిరి (4). ఓ ద్విజులారా!విష్ణువు, బ్రహ్మ, ఋషులు మరియు ప్రజాపతులు పార్థివ లింగమును పూజించి కోర్కెల నన్నిటినీ బడసిరి (5). దేవతలు, అసురులు, మనుష్యులు, గంధర్వులు, పన్నగులు, రాక్షసులు మరియు అనేకులు ఇతరులు దానిని పూజించి పరమసిద్ధిని పొందిరి (6).


కృతే రత్నమయం లింగం త్రేతాయాం హేమసంభవమ్‌ | ద్వాపరే పారదం శ్రేష్ఠం పార్థివం తు కలౌయుగే || 7


అష్టమూర్తిషు సర్వాసు మూర్తిర్వై పార్థివీ వరా | అనన్య పూజితా విప్రాస్తపస్తస్మా న్మహత్పలమ్‌ || 8


యథా సర్వేషు దేవేషు జ్యేష్ఠ శ్రేష్ఠో మహేశ్వరః | ఏవం సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్ఠ ముచ్యతే || 9


యథా నదీషు సర్వాసు జ్యేష్ఠా శ్రేష్ఠా సురాపగా | తథా సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్ఠముచ్యతే || 10


కృతయుగములో రత్నలింగము, త్రేతాయుగములో బంగరు లింగము, ద్వాపరములో రసలింగము, కలియుగములో పార్థివ లింగము శ్రేష్ఠములు (7). శివుని అష్టమూర్తులలో (పంచభూతములు, సూర్యచంద్రులు, సోమయాజి) పార్థివమూర్తి శ్రేష్ఠము. కావున, ఓ విప్రులారా! ఇతర పూజల కంటె పార్థివ లింగపూజయే గొప్ప ఫలము నిచ్చు తపస్సు అగును (8). దేవతలందరిలో మహేశ్వరుడు శ్రేష్ఠుడు (9). నదులన్నిటిలో గంగానది శ్రేష్ఠము. అటులనే, లింగము లన్నింటిలో పార్థివ లింగము శ్రేష్ఠమని చెప్పబడును (10).


యథా సర్వేషు మంత్రేషు ప్రణవో హి మహాన్‌ స్మృతః | తథేదం పార్థివం శ్రేష్ఠమారాధ్యం పూజ్యమేవ హి || 11


యథా సర్వేషు వర్ణేషు బ్రాహ్మణః శ్రేష్ఠ ఉచ్యతే | తధా సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్ఠముచ్యతే|| 12


యథా పురీషు సర్వాసు కాశీ శ్రేష్ఠమాతా స్మృతా | తథా సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్ఠముచ్యతే || 13


యథా వ్రతేషు సర్వేషు శివరాత్రి వ్రతం పరమ్‌ | తథా సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్ఠముచ్యతే || 14


యథా దేవీషు సర్వాసు శైవీ శక్తిః పరా స్మృతా | తథా సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్ఠముచ్యతే || 15


మంత్రము లన్నింటిలో ఓంకారము చాల గొప్పది యని స్మృతులు చెప్పుచున్నవి. అటులనే, లింగములలో పార్థివ లింగము శ్రేష్ఠమైనది; ఆరాధించి, పూజించదగినది (11). వర్ణములన్నింటిలో బ్రాహ్మణుడు శ్రేష్ఠుడైనటుల (12), నగరము లన్నింటిలో కాశీనగరము వలె (13), వ్రతము లన్నింటిలో శివరాత్రి వ్రతము వలె (14), దేవీమూర్తులందరిలో శైవీ శక్తి వలె, లింగము లన్నింటిలో పార్థివ లింగము సర్వోత్కృష్టమైనది (15).


ప్రకృత్య పార్థివం లింగం యోsన్యదేవం ప్రపూజయేత్‌ | వృథా భవతి సా పూజా స్నానదానాదికం వృథా || 16


పార్థివారాధనం పుణ్యం ధన్యమాయుర్వివర్థనమ్‌ | తుష్టిదం పుష్టిదం శ్రీదం కార్యం సాధకసత్తమైః || 17


యథా లబ్ధోపచారైశ్చ భక్త్యా శ్రద్దాసమన్వితః | పూజయేత్పార్థివం లింగం సర్వకామార్థ సిద్ధిదమ్‌ || 18


యః కృత్వా పార్థివం లింగం పూజయేచ్ఛుభ##వేదికమ్‌ | ఇహైవ ధనవాన్‌ శ్రీమాన్‌ అంతే రుద్రోsభిజాయతే || 19


పార్థివ లింగమును గాక, మరియొక లింగమును పూజించినచో, ఆ పూజ వృథా యగును. ఆ పూజా సందర్భములో చేయు స్నానాదులు కూడా వ్యర్థమగును (16). పార్థివ లింగారాధన సాధకునకు పుణ్యమునిచ్చి, ఆయుష్షును పెంచి, జీవితమును ధన్యము చేయును; తుష్టిని, పుష్టిని, సంపదను ఇచ్చును; సాధకులు తప్పక చేయదగినది (17). సాధకుడు తనకు లభించిన సామగ్రితో ఉపచారములను చేసి, భక్తితో, శ్రద్ధతో కూడినవాడై, పార్థివ లింగమును ఆరాధించినచో, కోర్కెలన్నియూ ఈడేరును (18). లింగమునకు శుభకరమగు పార్థివ వేదిని చేసి పూజించు సాధకుడు ఈ లోకములో ధనముతో, శోభతో విరాజిల్లి, దేహమును వీడిన తరువాత రుద్రునిలో ఐక్యమును పొందును (19).


త్రిసంధ్యం యోsర్చయేల్లింగం కృత్వా బిల్వేన పార్థివమ్‌ | దశైకాదశకం యావత్తస్య పుణ్యఫలం శృణు || 20


అనేనైవ స్వదేహేన రుద్రలోకే మహీయతే | పాపహం సర్వమర్త్యానాం దర్శనాత్స్పర్శవాదపి || 21


జీవన్ముక్తస్స వై జ్ఞానీ శివ ఏవ న సంశయః | తస్య దర్శన మాత్రేణ భుక్తి ర్ముక్తిశ్చ జాయతే || 22


శివం యః పూజయేన్నిత్యం కృత్వా లింగం తు పార్థివమ్‌ | యావజ్జీవన పర్యంతం స యాతి శివమందిరమ్‌ || 23


పార్థివ లింగమును చేసి మూడు సంధ్యలలో మారేడు పత్రములతో పది, పదకొండు సంవత్సరములు అర్చించిన వ్యక్తికి లభించు పుణ్యఫలమును వినుడు (20). ఆతడు ఈ దేహముతోనే రుద్రలోకము నందు విరాజిల్లును. ఆతనిని చూచి, స్పృశించు మానవుల కందరికీ పాపములు తొలగును (21). ఆతడు జీవన్ముక్తుడు, జ్ఞాని, శివస్వరూపుడు అనుటలో సందియము లేదు. అట్టివానిని చూచుట చేతనే ఇహపరములు సంపన్నమగును (22). పార్థివ లింగమును చేసి నిత్యము జీవితకాలమంతా పూజ చేయు వ్యక్తి శివుని సన్నిధిని పొందును (23).


మృడేనా ప్రమితాన్‌ వర్షాన్‌ శివలోకే హి తిష్ఠతి | సకామః పునరాగత్య రాజేంద్రో భారతే భ##వేత్‌ || 24


నిష్కామః పూజయేన్నిత్యం పార్థివం లింగమూత్తమమ్‌ | శివలోకే సదా తిష్ఠేత్తతస్సాయుజ్య మాప్నుయాత్‌ || 25


పార్థివం శివలింగం చ విప్రో యది న పూజయేత్‌ | స యాతి నరకం ఘోరం శూలప్రోతం సుదారుణమ్‌ || 26


యథాకథంచి ద్విధినా రమ్యం లింగం ప్రకారయేత్‌ | పంచసూత్ర విధానం చ పార్థివేన విచారయేత్‌ || 27


ఆతడు శివునితో గూడి లెక్క లేనన్ని సంవత్సరములు శివలోకము నందుండును. ఆతడు కామనలు గలవాడైనచో, మరల భూలోకములో జన్మించి, భారతవర్షమునకు చక్రవర్తి యగును (24). కామనలు లేనివాడు నిత్యము శ్రేష్ఠమగు పార్థివలింగమును పూజించిచో, శివలోకము నందు చిరకాలము ఉండి, పిదప శివసాయుజ్యమును పొందును (25). బ్రాహ్మణుడు పార్థివ శివలింగమును పూజించినచో, భయంకరమగు నరకలోకములో శూలములకు కట్టబడి దారుణమగు వ్యథను పొందును (26). కావున, మానవుడు ఏదో విధముగా శ్రమించి, సుందరమగు పార్థివలింగమును యథావిధిగా రచించవలెను. పార్థివ లింగ పూజలో పంచసూత్ర విధానము గురించి చింతిల్ల బని లేదు (27).


అఖండం తద్ధి కర్తవ్యం న విఖండం ప్రకారయేత్‌ | ద్విఖండం తు ప్రకుర్వాణో నైవ పూజాఫలం లభేత్‌ || 28


రత్నజం హేమజం లింగం పారదం స్ఫాటికం తథా | పార్థివం పుష్పరాగోత్థ మఖండం తు ప్రకారయేత్‌ || 29


అఖండం తు చరం లింగం ద్విఖండమచరం స్మృతమ్‌ | ఖండాఖండ విచారోయం సచరాచరయేః స్మృతః || 30


వేదికా తు మహావిద్యా లింగం దేవో మహేశ్వరః | అతో హి స్థావరే లింగే స్మృతా శ్రేష్ఠా ద్విఖండితా || 31


పార్థివ లింగమును అఖండముగా చేయవలెను. రెండు భాగములను అతికి చేయరాదు. అట్లు ద్విఖండముగా చేసినచో, పూజాఫలము దక్కదు (28). రత్నము, బంగారము, రసము, స్ఫటికము, మట్టి, మరియు పుష్పరాగములతో చేయు లింగము అఖండముగా నుండవలెను (29). చరలింగము అఖండముగను, ప్రతిష్ఠిత లింగము ద్విఖండముగను ఉండవలెనని స్మృతులు విచారించి నిర్ణయించినవి (30). వేదిక మహా విద్య. లింగము మహేశ్వరుడు. కావున, ప్రతిష్ఠిత లింగము ద్విఖండముగా నుండుట శ్రేష్ఠమని స్మృతులు చెప్పినవి (31).


ద్విఖండం స్థావరం లింగం కర్తవ్యం హి విధానతః | అఖండం జంగమం ప్రోక్తం శైవసిద్ధాంతవేదిభిః || 32


ద్విఖండం తు చరం లింగం కుర్వంత్యజ్ఞాన మోహితాః | నైవ సిద్ధాంత వేత్తారో మనయ శ్శాస్త్రకోవిదాః || 33


అఖండం స్థావరం లింగం ద్విఖండం చరమేవ చ | యే కుర్వంతి నరా మూఢా న పూజాఫల భాగినః || 34


తస్మాచ్ఛాస్త్రోక్త విధినా అఖండం చరసంజ్ఞకమ్‌ | ద్విఖండం స్థావరం లింగం కర్తవ్యం పరయా ముదా || 35


స్థావర (ప్రతిష్ఠిత) లింగమును ద్విఖండముగను, చరలింగమును అఖండముగను నిర్మించవలెనని శైవసిద్ధాంత పండితులు చెప్పెదరు (32). సిద్ధాంతము తెలియనివారు, మునులు కానివారు, శాస్త్ర పాండిత్యము లేని అజ్ఞానులు చరలింగమును ద్విఖండముగా చేయుదురు (33). స్థావరలింగమును అఖండముగను, చరలింగమును ద్విఖండముగను చేయు మూర్ఖులకు పూజాఫలము దక్కదు (34). కావున, శాస్త్ర విధి ననుసరించి, చరలింగమును అఖండముగను, స్థావరలింగమును ద్విఖండముగను చేసి, ఆనందమును పొందవలెను (35).


అఖండే తు చరే పూజా సంపూర్ణ ఫలదాయినీ | ద్విఖండే తు చరే పూజా మహాహానిప్రదా స్మృతా || 36


అఖండే స్థావరే పూజా న కామఫలదాయినీ | ప్రత్యావాయకరీ నిత్యమిత్తుక్తం శాస్త్రవేదిభిః || 37


ఇతి శ్రీ శివ మహాపురాణ విద్యేశ్వర సంహితాయం సాధ్యసాధన ఖండే పార్థివ శివలింగ పూజన మహాత్మ్య వర్ణనం నామైకోన వింశోsధ్యాయః (19).


అఖండమగు చరలింగమును పూజించినచో, సంపూర్ణఫలము దక్కును. ద్విఖండ చర లింగమును పూజించినచో, గొప్ప హాని కలుగునని స్మృతులు చెప్పుచున్నవి (36). అఖండమగు స్థావరలింగమును పూజించినచో కోర్కెలు ఈడేరక పోవుటయే గాక, నిశ్చితముగా ప్రత్యవాయము సంప్రాప్తమగునని శాస్త్రవేత్తలు చెప్పెదరు (37).


శ్రీ శివ మహాపురాణములోని విద్యేశ్వర సంహిత యందు సాధ్య సాధన ఖండములో పార్థివ శివలింగ పూజన మహాత్మ్య వర్ణనము అను పంతొమ్మిదవ అధ్యాయము ముగిసినది (19).


Sri Sivamahapuranamu-I    Chapters

[14/11, 8:00 am] +91 93913 24915: Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters   


శ్రీ చి ద మ్బ ర మా హా త్మ్య


వే ద పా ద స్త వ ము లు


 


 


శ్రీ శివకా మసుందరీసమేత శ్రీ నటరాజస్వామినేనమః


 


 


శ్రీ చిదమ్బరమహాత్మ్య


వేదపాదస్తవములు


(శ్రీ వేదవ్యాస, జైమిని, శఙ్కరభగవత్పాదకృతములు)


ఆంధ్ర తాత్పర్య సహితము


ఆంధ్ర లిపి పరివర్తన తాత్పర్యకర్తలు:


శ్రీ శ్రీపాద వెంకటేశ్వరులు


(శ్రీ చిదమ్బర మహాత్మ్యము)


శ్రీ కొల్లి అనంతపద్మనాభశాస్త్రి


(శ్రీ వేదపాద స్తవములు)


సంపాదకులు - ప్రకాశకులు :


శ్రీ దర్బా సూర్యనారాయణ


సివిల్‌ ఇంజనీరింగు ప్రొఫెసరు- అణ్ణామలై యూనివర్సిటి


చిదమ్బరము - తమిళనాడు


All rights Reserved 1972


వెల : రు. 12


1972 ప్రథమముద్రణము - 1000 ప్రతులు


సర్వస్వామ్యములు ప్రకాశకులవి.


శ్రీ సత్యనారాయణ ప్రెస్‌,


రాజమండ్రి - 1.


 


ప్రధమ భాగము


శ్రీ చిదమ్బరమాహాత్మ్య నిత్య పారాయణవిధి


చిత్సభావర్ణనము


చిదమ్బర రహస్యస్వరూపనిర్ణయము


చిత్సభానాయకవర్ణనము


శ్రీ శివకామసుందరిస్తుతి


శ్రీ వ్యాఘ్రపాద చిదమ్బ రేశ్వర వన్దన స్తవము


శ్రీ శివకామసున్దర్యష్టకము


 


శ్రీ చిదమ్బర మాహాత్మ్యము


(26 అధ్యాయములు)


ప్రధమాధ్యాయసాఠము, మహేశ్వరనంది సంవాదము


క్షేత్రప్రశంసనము


మూర్తివైభవకధనము


éశివగంగాతీర్థవర్ణనము


త్రిసహస్ర ద్విజేంద్రప్రశంసనము


మాధ్యందిని చరితము


వాల్కలి చరితము


వుల్కస చరితము


వ్యాఘ్రపాద చరితము 


ఉపమన్యు చరితము


తాణ్డవమహిమ కధనము


దేవదారు వన చరితము


ఆనంద నర్తనదర్శనము


మహేశ్వర శేషసంవాదము


పతఞ్జలి చరితము


పతఞ్జలి వ్యాఘ్రపాద ప్రసంగము


ఆనన్ద తాణ్డవ ప్రదర్శనము


పతఞ్జలి వ్యాఘ్రపాదులు వరములడుగుట


బ్రహ్మ యాగవృత్తాంతము


సింహవర్మ చరితము


సింహవర్మ తిల్లవనముచేరుట


సింహవర్మ హిరణ్యవర్మయగుట


వ్యాఘ్రపాద హిరణ్యవర్మ సంవాదము


త్రిసహస్ర మునీశ్వరులు తిరిగి చిదంబరముచేరుట


మహోత్సవవిధి


రధోత్సవ తీర్థవిధానవర్ణము


ఫలశృతి


శ్రీ పతఞ్జలి మునికృత నటేశాష్టకము


శ్రీ నటేశాష్టోత్తర శతనామావలి


ద్వితీయ భాగము


శ్రీ వేదపాదన్తవములు


శ్రీ నటరాజ వేదపాదస్తవము


ఫలశృతి


శ్రీ ఆనన్ద నటరాజధ్యానము


శ్రీమత్రిపురసుందరీ వేదపాద స్తవము


చిదమ్బరక్షేత్రమున జరుగు పూజలు ఉత్సవములు


తప్పొప్పులపట్టిక


 


శ్రీ శివకామసున్దరీసమేత శ్రీనటరాజస్వామినేనమః


సమర్పణము


శ్రీ చిదమ్బరమాహాత్మ్య వేదపాదస్తవములు అను పవిత్రగ్రన్థ


సంపుటము శ్రీ శివకామసున్దరీసమేత శ్రీ నటరాజస్వామివారి


పాదపద్మములందు శ్రీపరీధావి సంవత్సర జ్యేష్ట బహుళ


చతుర్దశీ ఆదిత్యవారమున శ్రీ మాసశివరాత్రి పర్వ


దినమున (9-7-1972) పూజాపుష్పగుచ్ఛముగా


నిష్కామభక్తితో


దర్భా సూర్యనారాయణ శ్రీమతి సౌభాగ్యవతి సుబ్బలక్ష్మి


దంపతులచే సమర్పితము


శ్రీ శృంగేరీ జగద్గురు


శ్రీ మదభినవ విద్యా తీర్థ స్వాములవారు


 


ఓమ్‌


శ్రీ శృంగేరీ శ్రీ జగద్గురు సంస్థానమ్‌


శ్రీ


విద్యా


శఙ్కర


శ్రీ మత్పరమహంస పరివ్రాజకాచార్యవర్య, పదవాక్య ప్రమాణ పారావారపారీణ, యమనియామాసనప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణాసమాధ్యష్టాఙ్గ యోగానుష్ఠాననిష్ఠ తపశ్చక్రవర్త్యనాద్యవిచ్ఛన్న శ్రీశఙ్క రాచార్య గురుపరమ్పరా ప్రాప్త, షడ్దర్శన స్థాపనాచార్య వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర, సకలనిగమాగమసారహృదయ, సాంఖ్యత్రయ ప్రతిపాదిక వైదికమార్గ ప్రవర్తక, సర్వతన్త్రస్వతన్త్రాదిరాజధానీ విద్యానగర మహా రాజధానీ కర్ణాటకసింహాసన ప్రతిష్ఠాపనాచార్య శ్రీమద్రాజాధిరాజ గురుభూమణ్ణలాచార్య, ఋష్యశృఙ్గపుర వరాధీశ్వర, తుఙ్గభద్రాతీరవాసి, శ్రీమద్విద్యాశఙ్కర పాద పద్మారాధక శ్రీజగద్గురు శ్రీచన్ద్రశేఖర భారతీస్వామిగురు కరకమలసఞ్జాత


శ్రీ జగద్గురు


శృంగేరీ శ్రీమదభినవ విద్యాతీర్థస్వామిభిః ||


అస్మదత్య న్తప్రియశిష్య శ్రీ దర్భా సూర్యనారాయణ విషయే నారాయణ స్మరణపూర్వకం విరచితా శీఆషస్స ముల్లన్తు ||


వేదో హి నస్సమేషాం శ్రేయస్సాధనావగమాయ ప్రభవతి | నకేవలం తస్మాత్‌ శ్రేయస్సాధనా వగమఏవ కింతుఅధీయమాన స్సఏవ శ్రేయస్సాధనతాం ప్రపద్యతే | ఆత్రచ ప్రత్యక్షరం శ్రూయమాణం పుణ్య ముత్పాదయతీతి శాస్త్రవిదాంసిద్ధాన్తః ||


భగవాన్‌ జైమినిః పుణ్డరీకపురం ప్రాప్య భగవన్తం చిత్సభేశం వేదపదనిబద్ధైః శ్లోకైస్తుష్టావః తేషుచ శ్లోకేషు సర్వత్ర అంతిమః పాదః వేదరూపఏవ భవతీతి స్తోత్రస్యాస్య మహత్వాతిశయః


త్రిపురసున్దరీ వేదపాదస్తవమితి స్తుతికావ్యం శ్రీమచ్చఙ్కర భగవత్పాదప్రణీతం దేవీభక్తవర్గేషు సుప్రధితమాస్తే || తత్రాపి సర్వే7సి శ్లోకాః పాదాన్తేషు వేదరూపాఏవ || అనయోః స్తోత్రయోః పఠనేన నైకే లోకాః స్వాభిలాషితా న్యాసాదయన్తి పరాంతృప్తించ విన్దతే.


ఏవం చిత్సభేశ తత్షేత్రవృత్తాన్తాదికం హృదయఙ్గ మయా శైల్యాప్రతిపాదయత్‌ | చిదమ్బరమాహాత్మ్యం భక్త జనోల్లాసకరం సత్‌ ప్రకాశ##తే || తదేతత్త్రితయస్యాపి ఆన్ధ్ర భాషా మాత్రాభిజ్ఞేషు జనేష్వపి విశిష్టప్రచారాయ ఆన్ధ్రతాత్పర్యేణ సహ ముద్రాప్య ప్రకాశయతు ముద్యుఞ్జానా భవన్తః వేదేపాదస్తవయోః శ్రీ కొల్లి అనంతపద్మనాభశాస్త్రి ముఖేన, చిదమ్బరమాహాత్మ్యస్య శ్రీ శ్రీపాద వెంకటేశ్వరశర్మ ముఖేన చాన్ధ్రానువాదం సంపాద్య ప్రకాశయన్‌ || సర్వేపీమే లౌకికం ప్రయోజనం కించిదప్యనపేక్షమాణాః భగవతః కృపాం కేవలం కాంక్షమాణాః కార్యే7స్మి న్ప్రవృత్తా ఇత్యేతత్‌ నితరాం ప్రశంసార్హమ్‌ ||


సానువాదం గ్రన్ధత్రితయ మిద మవలోక్య హృష్టాన్తరఙ్గౌ వయం || సకుటుమ్బాన్‌ భవతః అత్ర ఉద్యుఞ్జానా నిమాన్‌ సర్వానపి శ్రీ శారదా చన్ద్రమౌళీశ్వరౌ మజ్గళపరమ్పరాభిః నమభి వర్ధయతా మిత్యాశాస్మహే ||


శృజ్గగిరి                                             ఇతి నారాయణస్మరణమ్‌


పరీధావి, అధిక వైశాఖ


కృష్ణదశమీ ఇన్దువాసరః శ్రీ


8-5-1972


శ్రీ


అస్మదత్యంత ప్రియశిష్యులైన శ్రీ దర్భా సూర్య నారాయణగారికి నారాయణ స్మరణపూర్వకాశీస్సులు.


మనమందరము వేదమునుండియే శ్రేయస్సాధనమును తెలిసికొనుచున్నాము. అంతమాత్రమే కాదు. ఆ వేదాధ్యయనముకూడా శ్రేయస్సాధనమే- ఆ వేదమందు వినబడు ప్రతియొక అక్షరము కూడ పుణ్యజనకమని శాస్త్రవేత్తల సిద్ధాంతము.


భగవంతుడగు జైమినిమహర్షి చిదమ్బర క్షేత్రమునకు వచ్చి భగవంతుడగు చిత్సభానాధుని వేదపదములతో గూడిన శ్లోకములతోస్తుతించెను.ఆశ్లోకములన్నిటియందును చివర పాదము వేదరూపముగా నుండును. గావున ఈస్తోత్రము చాల మహత్వ పూర్ణముగనున్నది.


త్రిపురసున్దరీ వేదపాదస్తవమను పేరుతో శ్రీమచ్ఛఙ్కర భగవత్పాదులచే రచింపబడిన స్తుతికావ్యము దేవీభక్తులందు ప్రసిద్ధమై యున్నది. ఆస్తోత్రమందును ప్రతిశ్లోకము యొక్క చివరపాదము వేదరూపముగనే యుండును. ఈ స్తోత్రమును పఠించి అనేకభక్తజనులు తమ అభీష్టములను, మరియు తృప్తిని పొందుదురు.


అట్లే చిదమ్బరనాధునియొక్కయు, చిదమ్బరక్షేత్రము యొక్కయు, వృత్తాన్తాదులను హృదయంగమయిన శైలితో ప్రతిపాదించు చిదమ్బదమాహాత్మ్యము భక్తజనులమనస్సులకు ఆహ్లాదకరమై విరాజిల్లుచున్నది. ఈ మూడింటికిని ఆంధ్రభాష తెలిసిన జనులయందుకూడ ప్రచారమునకై ఆంధ్రతాత్పర్యముతో నచ్చువేయించి ప్రకాశింపనుద్యుక్తులై వేదపాదస్తవములకు శ్రీ కొల్లి అనంతపద్మనాభశాస్త్రిగారిచేతను, చిదమ్బర మాహాత్మ్యమునకు శ్రీ శ్రీపాద వెంకటేశ్వర్లుగారిచేతను అనువాదము చేయించి ప్రకాశింపజేసితిరి. వీరందరును లౌకిక ప్రయోజనము నేమాత్రము నపేక్షింపక కేవలము భగవత్కృపనే కోరి ఈ పనియందు ప్రవృత్తులై రన్నది మిక్కిలి ప్రశంస నీయము.


అనువాదముతో గూడిన ఈ మూడుగ్రంథములను చూచి మేము సంతసించినవారమై, సకుటుంబులయిన తమరిని, మరియు నీకార్యమందు సహకరించిన వారినందఱను శ్రీ శారదా చంద్రమౌళీశ్వరులు మంగళపరంపరలతో అభివర్థింప జేయుదురుగాక యని యాశీర్వదించుచున్నాము.


శృంగేరి                                             ఇతి నారాయణస్మరణమ్‌


పరీధావి అధికవైశాఖబహుళ


దశమి సోమవారము శ్రీ


8-5-1972


ఆముఖ మాశీర్వచనంచ


శ్రీమతే గణశాయ మఙ్గళం


శ్రీమతే చిత్సభేశ్వరాయ మఙ్గళం భవతు ||


శ్రుతిభి స్తస్మూలాభిః స్మృతిభి శ్చ తథాపురాణనివ హైశ్చ బహశః ప్రపఞ్చిత మిదం చిదమ్బరం సర్వలోక విఖ్యాతమ్‌.


లోకే తావత్ర్పసిద్ధం తత్తత్‌ క్షేత్ర మాహాత్మ్యత త్తత్‌క్షేత్ర మాహాత్మ్య గ్రన్థేషు బహుధా ప్రతిపాద్యతే| అస్య చిదమ్బర క్షేత్రస్య మాహాత్మ్యస్య శ్రుతి స్మృతి పురాణతిహాసేతర క్షేత్రమాహాత్మ్యగ్రన్థ మన్త్రశాస్త్రమూలభూతా కాశ##భైరవ కల్పాదిభిః బహుభి ర్గ్రన్థైర్బహుశః ప్రతిపాద్యమానత్వాత్‌| అస్య చిదమ్బరక్షేత్రస్య సర్వక్షేత్రో త్తమత్వస్య వజ్రలేపాయి తత్వాత్‌, (1) సూతసంహితాయాం (2) హాలాస్య మాహాత్యే (3) ఆదివుర మాహాత్మ్యే(4) శైవైకాదశరుద్రసం హితాయాం (5) భరద్వాజసంహితాయాం (6) పుణ్డరీక మాహాత్మ్యే, ఇత్యాదిగ్రన్థేషు చ సమ్యక్‌ ప్రతిపాద్యమాన త్వాచ్చ నాస్తి పునరిదానీం వక్తవ్యాశంలేశః |


తచ్చేదం చిదమ్బరమాహాత్మ్యం చిదమ్బరపురాణస్య పఞ్చ భాగాత్మకస్య ప్రదమం కుసుమమ్‌. ఇదం 26 అధ్యాయఘటితమ్‌. 1444 1/2 శ్లోకోపేతంచ శతాధిక సంవత్సరాత్పూర్వం గ్రన్ధలిప్యాం, ఆన్థ్ర లిప్యాంచ ముద్రితం దుష్ప్రాస్య ముద్దిశ్య, తాణ్డవాధ్యా¸° (17-18) కేవలం మూలమాత్రం దేవనాగరిలిప్యాం, ఆన్థ్రలిప్యాం వ్యాఖ్యోపేతంచ ప్రకాశ##కేన అనేన ముద్రాప్య ప్రకాశితౌ | అనన్తరం భక్తానాం సహాయోగేన, ఇదంచ మహాత్మ్యం దేవనాగరిలిప్యాం 1971 తమే హాయనే ముద్రాప్య ప్రకాశితమ్‌ | తదిద మధునా ఆన్థ్రలిప్యా మాన్థ్రజనోపకారాయ, ఆన్థ్రభాషాతాత్పర్యోపేతం, సమగ్ర మన్యధనసాహాయ్య మనపేక్ష్య శ్రీనటరాజమూర్తౌ, అస్మాసుచ, భక్తివిశ్వాసౌ సంభావ్య, గోదావరీతీరవర్తి, రాజమహేన్ద్రనరనగరాభిజనేన, అన్నామలై విశ్వవిద్యాలయ సివిల్‌ ఇంజనీరింగు ప్రొఫెసరు శ్రీ దర్భా సూర్యనారాయణ శర్మణా సంప్రకాశ్యతే | వేదపాదన్తవః శ్రీజైమినికృతః శ్రీ నటేశస్తోత్రరూపః, తథా శ్రీ శఙ్కర భగవత్పాదకృతః శ్రీ త్రిపురసున్దరీ వేదపాదస్తవశ్చ మాహాత్మ్యం చాస్మిన్‌ సంయోజితౌ |


భక్తజనోపకారం కృతవతే ప్రకాశకాయా సై#్మ, తద్ధర్మపత్న్యై, శ్రీమత్యై సుబ్బలక్ష్మెచ అయురారోగ్యాభివృద్ధిః | సర్వసంపత్సమృద్ధిః, సర్వమఙ్గళావాప్తిః, అచఞ్చల నిష్కపట భక్తిసిద్ధిః జ్ఞాన వైరాగ్య సిద్ధిశ్చ భూయాదితి శ్రీనటరాజరాజం సంప్రార్థ్యాశాస్మహే |


తథా ఆన్థ్రభాషాతాత్పర్యకర్తృభ్యాం బ్రహ్మశ్రీ శ్రీపాద వేంకటేశ్వరశాస్త్రిణ, బ్రహ్మశ్రీ కొల్లి అనంతపద్మనాభ శాస్త్రిణ, పుస్తకప్రకాశ##నే సహయోగం కృతవతే బ్రహ్మశ్రీపీసుపాటి సూర్యప్రకాశశాస్త్రిణ చ శ్రీమత్‌ హేమ సభానాథః చిదమ్బర మహానటః శివకామిమనోజ్ఞశ్చ దేయాన్మఙ్గళసన్తతిమ్‌, జ్ఞానవైరాగ్యసిద్ధిం చ, ఆయురారోగ్యసమ్పదం, చిన్తితార్థప్రదానం చ దేయాత్‌ తిల్లవనేశ్వరః | శ్రీభగవతీ సర్వదేవోత్తమే, దేవతా సార్వభౌమే, అఖిలాంణ్డ కోటి బ్రహ్మాణ్డనాయకే బ్రహ్మవిద్యాస్వరూపశ్రీశివకామనున్దరీసనాధే ఆనన్దతాణ్డవరాజే, అతీవభక్తిం సంభావ్య తత్కృపయా కేవల మిదం తాత్పర్యం నిష్కామనయా కృత మభీనన్దనీయం.


శ్లో || గోరక్షిరత్నం భువనైకరత్న |


ముమాజనా ¸°వన భాగ్యరత్నం |


నటేశరత్నం సురసేవ్యరత్నం|


నమామి తం దీక్షితవంశరత్నం ||


శ్లో || గోరక్షిన్నితి నృత్తేశ ప్రచురక్షీర వాఞ్చయా |


శ్రితో మాతృస్తనక్షీర మప్యలభ్యం త్వయా కృతమ్‌||


ఇత్థం శ్రీదివ్యనటేశ చరణారవిన్దారాధనతత్పరః చిదమ్బరం శాస్త్రాచార్యపణ్డతరాజ సోమ శేఖరదీక్షితః చిదమ్బరం శ్రీనటరాజదేవాలయనిర్వాహకః సుహృత్సభాస్థాపకశ్చ |


పరీధావి వైశాఖ 13 శుక్ల చతుర్దశీ విశాఖ నక్షత్రం శ్రీగౌరీ మహాదేవ కల్యాణమహోత్సవదినం శుక్రవార 26-5-1972.


శ్రీ చిత్సభేశః శుభమాతనోతు.


 


శ్రీః


శ్రీ చంద్ర మౌళీశ్వరా


శ్రీమత్పరమహంస పరివ్రాజ కాచార్యవర్య


శ్రీమచ్ఛంకర భగవత్పాదప్రతిష్ఠిత


శ్రీకాంచీ కామకోటి పీఠాధిప జగద్గురు


శ్రీమచ్చన్ద్ర శేఖరేన్ద్ర సరస్వతీ


శ్రీపాదాదేశానుసారేణ శ్రీమజ్జయేన్ద్ర


సరస్వతీ శ్రీపాదైః


చిదమ్బరే అణ్ణామలై విశ్వవిద్యాలయ ఇంజనీరింగు కళాశాలాయాం అధ్యాపక పదవీం అధిష్ఠాయ విరతస్య శ్రీ దర్భా సూర్యనారాయణ శర్మణో విషయే క్రియతే నారాయణస్మృతిః


"దర్శనాదభ్రసదసి" "చిదమ్బరక్షేత్రము దర్శించుటచేతనే మోక్షమునిచ్చును" అని ప్రసిద్ధినందిన చిదమ్బర క్షేత్రముయొక్క మాహాత్మ్యమును దెల్పు మీ ప్రకటించిన గ్రంథమును జూచి చాలసంతోషించినాము. అందు వేదపాదస్తవములు శ్రీనటరాజ శివకామసున్దరీ సహస్రనామ స్తోత్రములు శ్రీసుబ్రహ్మణ్యశ్వర స్తోత్రరత్నములు మొదలగు వానిని సంకలనముచేసి ముద్రింపించి ప్రకాశము చేసిన మీ కృషి విని ఆనందభరితులయినారము.


ఇటువంటి సద్గ్రంథములను ప్రకటించుచు సత్ప్రవృత్తి యందున్న మీరు శ్రీ త్రిపురసున్దరీ సహితి శ్రీచన్ద్ర మౌళీశ్వర ప్రసాద పాత్రులయి సుఖాన నుండవలెనని ఆశించుచున్నారము.


యాత్రాస్థానమ్‌


విజయవాడ


ఆనంద - మాఘ ఇతి నారాయణస్మృతిః


పూర్ణిమీ సౌమ్య


వాసర ః


26-2-1975


ఓమ్‌


Dr. c.s. venkateswran , M.A.PhD.,


professor and Head of the Department of Sanscrit


Annamalai University


Annamalai Nagar


3-5-1972


ఆ శీ స్సు


"పరోపకారయ సతాం విభూతయ" "ఏకః స్వాదునభుఞ్జీత" ఇతిచ అస్తి అభియుక్తానా ముక్తిః | సుఖస్య మూలం మనసః శాన్తిః | శాన్తి సాధనసామగ్రేషు గరీయసీ భక్తిః | భగవచ్చరిత్రస్మరణన, తస్తోత్రపఠనేనచ భక్తి రఖివర్థతే | ఉభయమపి అమృతవత్‌ మధురం స్వాదు చ భవతి | అతఏవ అమృతత్వకామైః మర్యైః తదుభయ మవశ్య మాస్వాద నీయంచ | తదాస్వాదనే ఉపకుర్వన్తః నూనం క్మతకృత్యా జాయన్తె |


తత్వ మిదం మనసి విధాయ అణ్ణామలై విశ్వవిద్యాలయ వాస్తువిద్యావిభాగే ప్రాచార్యపద మతిష్ఠద్భిః కులీనైః ఆస్తికవరైః శ్రీదర్భా సూర్యనారాయణమహాశ##యైః భగవతః ఉమాపతేః . మాహాత్మ్యపరం చరితం స్తోత్రంచ దేవనాగరీ లిప్యాం ముద్రితం సామ్ప్రతం సానువాద మాన్ధ్రభాషాయాం తల్లిప్యాంచ ప్రకాశ్యతే తద్దేశీయానాముపకారాయ | తత్ర ప్రథమం షడ్వింశత్యధ్యాయయుతం చిదమ్బరమాహాత్మ్యమ్‌ |చిదమ్బరక్షేత్రే శ్రీనటరాజస్యా నన్దనటనావసరే దివిషదాం సదసి మహర్షిణా జైమినినా విరచితం, సార్థశతశ్లోకసమ్మితం వేదపాదస్తవాఖ్యం | స్తోత్రరత్నం ద్వితీయం దశోత్తర శతశ్లోక యుక్తం భక్తిమసృణం త్రిపురసున్దరీవేదపాదస్తోత్రం శ్రీశఙ్కరాచార్యప్రణీతం తృతీయం చ విజయతే |


అనువాదే మార్గదర్శకాః లంక వెంకటరామశాస్త్రి సోమయాజిమాహాశయాః తాత్కార్యే నిపుణం నిర్వూఢవన్తః శ్రీపాదవేంకఙ్కటేశ్వరశాస్త్రిమహోదయాః | కొల్లి అనన్తపద్మనాభశాస్త్రిణశ్చ సర్వధా అభినన్దనీయాసి, ఆచార్యానుగ్రహ మవలమ్బ్య భక్తిపూర్వ మేతాదృశకార్యేషు ప్రవృత్తానాం సకుంటుమ్బానాం దర్భసూర్యనారాయణ మహాశయానాం శ్రద్ధాభక్తిసుఖసమ్పదః ఉత్తరోత్తరమభివర్థన్తామ్‌ ఇతి శ్రీ శివకామసున్దరీసమేతం శ్రీశివనటరాజం ప్రార్థయామః |


ఏవం అన్నామలైవిశ్వవిద్యాలయ సంస్కృత విభాగాధ్యక్షఃవెఙ్కటేశ్వరశర్మా-


C. S. Venkateswaran


ఓమ్‌


లంక వెంకటరామశాస్త్రి సోమయాజి


సాంగవేదార్ధసమ్రాట్‌, అభినవాపస్తంబ


ఆశీస్సు


శ్రీ నటరాజయనమః


పరమేశ్వరుడు ప్రపంచములోని పాషాత్ముల నుద్ధరించుటకు అక్కడ్కడ వెలసి తనదర్శనమును చేయువారి నుద్ధరించుచున్నాడు శ్లో || అగ్నౌ దెవో ద్విజాతీనాం యోగి నాం హృదయె తధా | ప్రతిమాస్వ ల్పబుద్ధీనాం|| అను వచనము ననుసరించి పాపాత్ములు వివేకజ్ఞానము లేనివారు.ఆయాదేవతలను దర్శించి తరించుచున్నారు. ఇట్లుండ దక్షిణదేశమందు సుప్రసిద్ధమగు దివ్యక్షేత్రమగు చిదంబరక్షేత్రమందలి నటరాజేశ్వరస్వామివారి చరిత్ర (మాహాత్మ్యము) స్కాందపురాణములో నున్నది. ఆ మాహాత్మ్యమును బ్రహ్మశ్రీ దర్భాసూర్య నారాయణగారు. చాలా కాలమునుండి ఆక్షేత్రమందు అన్నామలై యూనివ్సటిలో సివిల్‌ ఇంజనీర్‌ ప్రొఫెసర్‌ గా పని చేయుచు సివసించుటవలన వారికి విశేషముగా వారి సతీమణి సౌభాగ్యవతి సుబ్బలక్ష్మిగారికి శ్రీనటరాజస్వామివారియందున్న అపరిమితభక్తిచే చిదంబర మాహాత్మ్యమును తెలుగుతాత్పర్యముతో అచ్చువేయించిన ఆంధ్రులందరు తరించుటకు సాధనమగునని తలచి బ్రహ్మశ్రీ శ్రీపాద వెంకటేశ్వర్లు (రిటైర్డు సంస్కృతపండితులు, రాజమండ్రి) గారిచే తెలుగు తాత్పర్యమును వ్రాయించి అచ్చువేయించిరి. ఇందులో వేదపాదస్తవము (జైమినిమహర్షి రచితము) ను శ్రీ శంకరభగవత్పాదకృతమగు త్రిపురిసుందరీ పాదస్తవమునుకూడ బ్రహ్మశ్రీ కొల్లి అనంతపద్మనాభ శాస్త్రిగారిచే తాత్పర్యమును వ్రాయించి కూర్చి " చిదంబర మాహాత్మ్య వేదపాస్తవములు" అని పేరుపెట్టిరి. ఇంతేకాక వ్యాప్రాదమహర్షి చేరచించబడిన చిత్సఖేశ్వర వందన స్తవమును శివకామసుందర్యష్టకమును పతఞ్జలమహర్షి విరచితమగు శ్రీ నటేశాష్టకమును తెలుగుతాత్పర్యములతో అచ్చువేయించి ఒకే గ్రంధముగా కూర్చిరి. వీటికి తాత్పర్యములను వ్రాసి వారునాకు చూపించిరి. వాటిని చాలవరకు నేను చూచినాను. మూలానుసారముగానే స్పష్టముగా వ్రాయబడినవి. ఈపుస్తకము సంస్కృతభాషరాని ప్రతిఆంధ్రునకు ఆంధ్రభాషను తెలిసికొనిన ప్రతిమానవునకు ఉపయోగించుననుటలో ఎంతమాత్రము సందియము లేదు. ఈ పుస్తకమును అచ్చు వేయించిన దర్భా సూర్యనారాయణగారు తూర్పుగోదావరి జిల్లా అమలాపురమునకు సరిహద్దు గ్రామమగు ఇందుపల్లి గ్రామవాసులగు దర్భా శేషయ్యగారికుమారులు. శేషయ్య గారు రామమంత్రమును సదా జపించుచు రామానుగ్రహమును పొంది ఒక కార్తికశుద్ధైకాదశినాడు 1928 సం|| కోనసీమలోని గంగలకుర్రు గ్రామమందలి ఉత్తరవాహినియగు కౌశికనదియందు స్నానముచేసి గ్రామములోనికివచ్చుచు మార్గమధ్యమందు రామనామస్మరణమును చేయుచు శరీరత్యాగమును చేసిరి. వారిని నేను బాగుగా ఎరుగుదును. వారి తపఃఫలము వీరు. వీరిభార్య సౌ|| సుబ్బలక్ష్మిగారుకూడా వీరి కనుకూలమగు సాధ్వీమణి. ముఖ్యముగా ఈగ్రంధ ముద్రణ మందు ఆమెప్రోత్సాహ మెక్కువగానున్నది. ఇంతియేకాక వీరికింకను ఇట్టి గ్రంథప్రచారమును చేయుట యందభిలాష కలదు. ఈ గ్రంథములు వీరికి పుత్రస్థానీయములై వీటిప్రచారమువలన ఈ దంపతులకు ఐహికాముష్మికసుఖములను గలిగించి సుఖింపచేయుటకును, ఈ గ్రంథములకు, తెలుగుతాత్పర్యముల వ్రాసి బ్రహ్మశ్రీ శ్రీపాద వెంకటేశ్వర్లుగారికి బ్రహ్మశ్రీ కొల్లి అనంతపద్మనాభశాస్త్రి గారికి ఆయురారోగ్యైశ్వర్యాభి వృద్ధినిచేయుచు ఇంకను అనేకగ్రంథములకు తాత్పర్యములను వ్రాయుటకు శక్తినిచ్చుటకును శ్రీ శివకామసుందరీసహిత శ్రీ నటరాజేశ్వరస్వామి వారిని ప్రార్థించుచున్వాను.


నేదునూరు                                లంక వెంకటరామశాస్త్రి సోమయాజి


తూ||గో||జిల్లా.                             సాంగ వేదార్థసామ్రాట్‌ 7అభినవాపస్తంబ


8-6-1972


ఓమ్‌


రెమిళ్ల సూర్యప్రకాశ శాస్త్రి


వేదార్దసమ్రాట్‌, మీమాంసావిద్యాప్రవీణ


శ్రీగౌతమీవిద్యాపీఠ సంస్కృతకళాశాలాధ్యక్షః


రాజమండ్రి - 1


ఆ శీ ర్వ చ న మ్‌


"సుఖం మే భూయాత్‌ దుఃఖం మే మాభూత్‌" అని సర్వప్రాణులు సుఖముకావలెననియు, దుఃఖము వద్దనియు కోరుచుందురు. సుఖప్రాప్తి దుఃఖపరిహారములకు వేదశాస్త్రములయందు అధికార తారతమ్యము ననుసరించి అనేకోపాయములు బోధింపబడినవి. "నిర్విణ్ణానాం జ్ఞానయోగో న్యాసినామిహకర్మను న నిర్విణ్ణో నావిసక్తో భక్తియోగో 7స్యసిద్ధిదః" అని శ్రీమద్భాగవతమందు అధికారి భేధముననుసరించి మధ్య మాధికారులకు భక్తియోగము ఉత్తమపురుషార్థ సాధనమని చెప్పబడినది. ఈ భక్తియోగము సర్వోపాయములలో అత్యనసులభోపాయమని శ్రీ అధ్యాత్మరామాయణమున "కర్మయోగో జ్ఞానయోగోభక్తియోగచ్చ శాశ్వతః | తేషాంతుశసులభోమార్గో భక్తియోగ స్సుపూజితః | అని చెప్పబడినది. భక్తియోగ మనగా పరమేశ్వరునియొక్క కథాశ్రవణాదినవవిధోపాయముల నాశ్రయించుట. అందు పరమేశ్వర స్తోత్రరూపోపాయము నాశ్రయించుట. అందు పరమేశ్వర స్తోత్రరూపోపాయము నాశ్రయించు వాడు వైదికమయిన యజ్ఞయాగాదులయొక్క ఫలమును బొందగలడని, "యోజాత మస్యమహతో మహిబ్రవాత్‌, సేదుశ్ర్శవోభిర్యుజ్యం చిదభ్యసత్‌" అను శ్రుతి స్పష్టముగా బ్రతిపాదించుచున్నది. ఈ ప్రకారము వేదశాస్త్రములచే మిక్కిలి ఉత్తమమయిన పురుషార్థ సాధనముగా వర్ణింపబడుచున్న భక్తియోగముయొక్క తత్వమును బాగుగా గుర్తించినవారు శ్రీ దర్భా సుబ్బలక్ష్మీ సూర్యనారాయణ దంపతులు. వీరు దక్షిణకాశీ యనబడుచున్న శ్రీ గౌతమీనదీతీరమునగల రాణ్మహేంద్రవరపురవా స్తవ్యులు ప్రస్తుతము అన్నామలై విశ్వవిద్యాలయములో సివిల్‌ ఇంజనీరింగు ప్రొఫెసరుగా యుండిరి. శ్రీ వీరిదంపతులు సుప్రసిద్ధమగు దివ్యక్షేత్రమయిన చిదంబరమందు నివసించుచు శ్రీ శివకామసుందరీసమేత నటరాజస్వామి వారియందు మిక్కిలి శ్రద్ధాభక్తియుక్తచిత్తులై వారుతరించుయేగాక ఆంధ్రభాషాభిజ్ఞులెల్లరును తరింపజేయుటకై ఉద్యుక్తలయిరి; గనుకనే శ్రీ జైమిని, శంకరభగవత్పాదులచే రచింపబడిన, మహామహిమోపేతమయిన వేదపాదస్తవములను, చిదంబరక్షేత్రమాహాత్మ్యమును శ్రీశ్రీపాద వెంకటేశ్వర్లుగారిచేతను, శీ కొల్లి అనన్తపద్మనాభశాస్త్రిగారిచేతను చక్కగా ఆంధ్రభాషలో తాత్పర్యమును వ్రాయించి లౌకికప్రయోజనము నపేక్షింపక పరమేశ్వరార్పరణబుద్ధితో ఇట్టి కార్యమును నిర్వహించుటకై సంకల్పించిరి. ఇందు వేదపాద స్తవములయందు శ్రి జైమిని శంకరభగవత్పాదులు ప్రతిశ్లోకముయొక్క అన్తిమభాగమున సాక్షాత్తు వేదవాక్యములనే పాదరూపములనుగా కూర్చుటవలన గ్రంధములు వేదపాద స్తవములని వ్యవహరింపబడుటయే గాక శ్రి శాస్త్రిగారు వీటికి తెలుగుతాత్పర్యమును వ్రాయు సందర్భములో ప్రకృతమున వేదవాక్యార్థయోజనకి నాతో సంప్రదించగా గ్రంథము నామూలాగ్రముగా చూచు భాగ్యము నాకున్న కలిగినది. శ్రి శాస్త్రివర్యులచే ఆంధ్రభాష సులభ##శైలిలో అనువదింపబడిన, చిదంబరమాహాత్మ్యవేదపాదస్తవములనబడు ఈ గ్రంథరాజము ఆంధ్రభాషాభిజ్ఞులందరికీ ఉపయోగపడుననుటలో ఎంతమాత్రము అతిశయోక్తిలేదు. ఇట్టి సర్వజనతారకమయిన ధర్మకార్యమును నిర్వహించుటకు బూనికొనిన శ్రీ సుబ్బలక్ష్మీ సుర్యనారాయణ దంపతులను శ్రి శివకామసుందరీ సహిత నటరాజేశ్వరస్వామి ఇతోధికముగా సకల శ్రేయో7బివృద్ధులను ఇచ్చి రక్షించుగాక యని నా యాశిర్వచనము.


23-6-1972                              రేమిళ్ల సూర్యప్రకాశశాస్త్రి


 


ఓమ్‌


గోడా సుబ్రహ్మణ్య శాస్త్రి


ఋగ్వేదభాష్యపరీక్షాధికారి, న్యాయవేద్తా విద్వాన్‌


(మైసూరు)


శ్రీగౌతమీ విద్యాపీఠ సంస్కృతకళాశాల


రాజమండ్రి - 1


ఆ శీ స్సు


ధర్మార్థకామమోక్షములను నాలుగుపురుషార్థములలో మోక్షము పరమపురుషార్థము. దీనికి జ్ఞానమే సాథనమైనను అజ్ఞానమును కర్మోపాసనలచే సంపాదించవలయును. ఉపాసనా మార్గమునే భక్తిమార్గమమందురు. వీటిలో కర్మలు చిత్తశుద్ధిని, భక్తియనగా ఉపాసనచిత్తైకాగ్రతను సంపాదించి జ్ఞానమునకు సాధనములగుచున్నవిగాన కర్మలకంటె భక్తి అంతరంగసాధనమగుచున్నది. అట్టి భక్తిమార్గములో శివకామసుందరీ నటరాజస్వాములను చిరకాలముగా సేవంచుచున్న భక్తవర్యులగు అణ్ణామలై యూనివర్సిటీలో సివిల్‌ ఇంజనీరింగుశాఖలో వాస్తువిభాగమునకు అధ్యక్షులగు బ్రహ్మశ్రీ దర్భాసూర్య నారాయణగారు, వారిసతీమణి శ్రీమతి సౌ|| సుబ్బలక్ష్మిగారి ప్రేరణచే వేదపాదస్తనములను (జైమిని వేదపాదస్తవము త్రిపురసుందరీ వేదపాదస్తవము) లిపిపరివర్తనము ఆంధ్ర తాత్పర్యముతో ఆంధ్రమహాజనుల మహోపకారముకొరకు వ్రాయించి ముద్రితముగావించి భగవత్సమర్పణము చేయవలయునను సత్కార్యమునకు పూనుకొనిరి. ఈ కార్యము వేదభాగములతో కూడియుండటచే కష్టసాధ్యమైనది. దీనిని శ్రీ గౌతమీవిద్యాపీఠం సంస్కృతకళాధ్యక్షులగానుండి విశ్రాన్తితీసుకొన్న శ్రీ కొల్లి అనంతపద్మనాభశాస్త్రిగారు నిర్వహించుటకు పూనిరి. దీనిదినేను ఆమూలాగ్రముగాచూచితివి. అచ్చటచ్చట నిక్షిప్తలుగానున్న వేదపాదములను ప్రకృతానుగుణముగా సమన్వయముచేసి చక్కటి తాత్పర్యమును చాల శ్రమ తీసుక1ని శ్రీ శాస్త్రిగారు రచించిరి. దీనినిచూచి నాకు చాలా ఆనందము కలిగినది. ఇటువంటి మహాకార్యమును చేయించిన శ్రీ సూర్యనారాయణ దంపతులకు శ్రీ శివకామసుందరీ సమేత నటరాజస్వామి ఆయురారోగ్యైశ్వర్యాది సకలాభ్యుదయ నిశ్రేయసములను ఒసంగి రక్షించుగాక యనియు యాఆదిదంపతులను ప్రార్థించుచున్నాను ఇట్టి తాత్పర్యమును రచించిన శ్రీ అనంతపద్మనాభశాస్త్రిగారికి ఆపరమేశ్వరుడు చతుర్విధపురుషార్థముల నిచ్చుగాకయని యాపరమేశ్వరుని ప్రార్థించుచున్నాను.


24-6-1972                                         గోడా సుబ్రహ్మణ్యశాస్త్రి


 


వి జ్ఞ ప్తి


చిదమ్బరము (పుండరీకపురము) భారతదేశమున సుప్రసిద్ధ పుణ్యక్షేత్రము. పంచభూతములలో నొకటైన అకాశమూర్తికి క్షేత్రము. ఇక్కడ ఎల్లప్పుడు శ్రీశివకామ నున్దరీ సమేత శ్రీ నటరాస్వామి దివ్యమైన ఆనందతాణ్డవ దర్శనము భక్తులకు ప్రసాదించును.


సమస్త ప్రపంచమును ప్రకాశింపజేయు జ్యోతిస్వరూప మీహృదయ పుండరీకములో నున్నది. చిదమ్బరము ప్రపంచమంతటికి హృదయపుండరీకము వంటిది. శరీరధారియగు జీవాత్మయందు ఈశ్వరుడు శుద్దమయిన ఆకారముతో సాక్షిగా నెట్లుండునో, అట్లే ప్రపంచమను దేహమునకు హృదయపుండరీకమయిన ఈ చిదమ్బరక్షేత్రమున శ్రీనటరాజు శివకామసుందరితో సాక్షిగానుండి సమస్త ప్రపంచమును ప్రకాశింపజేయును. శ్రీనటరాజే వేదస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు. ఆస్వరూపమే చిదాకాశము లేక చిదమ్బరము. భక్తితో చిత్సభేశ్వరుని నారాధించుటచే సర్వభయ బాధా నివారణమయి, మానవుని జీవితమంతయు నూతన చైతన్యము గలదై ఆనందనిలయమగును. భక్తియే మానవునకు శరణ్యము. "ముక్తి సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి".


శ్రీ శివకామ సుందరీ నటరాజుల కృపచే చిదమ్బర క్షేత్రముననున్న అణ్ణామలై విశ్వవిద్యాలయమున 22 సంవత్సరములు ఇంజనీరింగు కాలేజీలో ప్రొఫెసరుగా విద్యార్థులకు పాఠములుచెప్పు అవకాశము మరియు ఈ పార్వతీపరమేశ్వరుల దర్శనభాగ్యములు లభించినవి. చిదమ్బరక్షేత్ర మహిమను ఆంధ్ర సోదరీసోదరులకు తెలుపవలయునని సంకల్పము కలిగినది. భక్తురాలయిన నాభార్య శ్రీమతి సుబ్బలక్ష్మి ప్రేరేపణ ప్రోత్సాహము నా సంకల్పమునకు బలము చేకూర్చినవి. మాకును, మరియు ఆధ్రమహాజనులందరికి సులభముగా తెలియునట్లు తాత్పర్యసహితముగా "శ్రీ చిదమ్బర మహాత్మ్య వేదపాదస్తవములు" అను పుస్తకమును నా స్వీయద్రవ్యముతో ముద్రించి శ్రీ శివకామసుందరీ నటరాజులకు సమర్పించవలయునని సంకల్పిచితివి. దీనివలన మా భక్తిని పెంపొందించుకొనుటకును, పార్వతీపరమేశ్వరులను సర్వకాలములందు స్మరించు భాగ్యము చేకూరుటకును, మరియు ముక్తి పొందుటకు ఈ భక్తి మార్గమే శ్రేష్టమనియు తోచినది.


నా సంకల్పమును, నామిత్రులు, శ్రేయోభిలాషులు, సద్గుణసంపన్నులు, ఈశ్వరభక్తులు శ్రీపీసపాటి సూర్యప్రకాశం గారికి (ఇనకమ్‌ టాక్సు ప్రాక్టీషనరు, రాజమండ్రి) తెలియచేసినాను. వారీవిషయములో భక్తిశ్రద్ధలు చూపి మహాపండితులగు శ్రీ శ్రీపాద వెంకటేశ్వర్లుగారితోను, శ్రీకొల్లి అనంతపద్మనాభ శాస్త్రి గారితోను పరిచయము చేసి వారుభయులు ఈ కార్యమును నిర్వహించుటకు సమర్థులని చెప్పి వారి స్నేహభాగ్యము కలుగచేసిరి. కోరినంతనే వీరుభయులు మహానందముతోను ఈశ్వరభక్తితోను ఈ పుస్తకమును కొలది దినములలో లిపిపరివర్తనము తాత్పర్యము వ్రాసి యిచ్చిరి.


శ్రీ వెంకటేశ్వర్లు గారు, శ్రీ అనంత పద్మనాభశాస్త్రి గారు, అగ్రశ్రేణికి చేరిన గొప్ప సంస్కృతాంధ్రపండితులు. ఇది శ్రీ నటరాజేశ్వరుని పవిత్ర కార్యమగుచే వీరు విశ్రాంతి తీసికొనుచున్నను, చాల శ్రమకోర్చి భక్తిశ్రద్ధలతో రచన పూర్తిచేసినారు. వీరు తాత్పర్యమును మృదుమధురమయిన శైలితో సుకుమారమతులకు కూడ బోధపడునట్లు వ్రాసి, ఆంధ్రమహాజనులకు శాశ్వతమగు గొప్పసేవ చేసినారు. వీరు నిష్కామముతోను, స్వార్థరహితమయిన చిత్తముతోను అచంచలభక్తితోను చేసిన కృషి ఫలితమే ఈ పవిత్రగ్రంథము. వీరికి నా కృతజ్ఞత తెలుపుట ఎట్లో తెలియకున్నది.


ఈ పుస్తకములోని ప్రథమభాగములో శ్రీ వ్యాఘ్రపాద మహర్షి వ్రాసిన చిదమ్బరేశ్వర వన్దన స్తవము, శివకామ సుందర్యష్టకము, 26 అధ్యాయములు గల చిదమ్బరమహాత్మ్యము, పతఙ్జలి మహర్షి వ్రాసిన నటేశాష్టకము గలవు. మొత్తము సుమారు 1500 శ్లోకములు. ఈభాగమునకు ఆంధ్రభాషా తాత్పర్యకర్తలు శ్రీ శ్రీపాద వెంకటేశ్వర్లుగారు. ఇదివరలో 1970 సంవత్సరమున ప్రచురింపబడిన శ్రీనటరాజు ఆనందతాణ్ణవదర్శనమను చిన్నపుస్తకమునకు లిపిపరివర్తనము తాత్పర్యము శ్రీ వెంకటేశ్వర్లు గారు వ్రాసిన విషయము పాఠకులకు తెలియును. వీరి భక్తి శ్రద్ధలు, ఓపిక కార్యదీక్ష, పాండిత్యము ప్రశంసనీయము. శ్రీ వెంకటమహాలక్ష్మీ సమేత శ్రీ వెంకటేశ్వర్లు గారికి నా కృతజ్ఞతాభివందనములు సమర్పించుచు వారికుటుంబములోని అందరిని శ్రీ శివకామసుందరీ నటరాజులు సర్వశుభములను ప్రసాదించుగాక అని ప్రార్థించుచున్నాను.


ఈ గ్రంథములోని ద్వితీయభాగము శ్రీ వేదపాదస్తవములకు మొత్తము 275 శ్లోకములకు శ్రీ కొల్లి అనంతపద్మనాభశాస్త్రి గారు ఆంధ్రభాషావివరణకర్తలు. వీరు చాలకృషిచేసి, వేదపాదములకు స్థలనిర్దేశముచేసి సుందరమైన తాత్పర్యము వ్రాసిరి. వీరిభక్తి, కార్యదీక్ష పాండిత్యము చాల ప్రశంసనీయము. శ్రీ బంకారమ్మసమేత శ్రీ అనంత పద్మనాభశాస్త్రి గారికి వారి కుటుంబమునకు శ్రీ శివకామసుందరీ నటరాజులు సర్వశ్రేయములు ప్రసాదించుగాక అని ప్రార్థించుచు నా కృతజ్ఞతాపూర్వక వందనములు తెలుపుచున్నాను.


ఈ సంవత్సరము మే నెల 6-9 తేదీలు నేను నాభార్య పవిత్ర శృంగేరి క్షేత్రములో ఉండి శ్రీ శ్రీ శ్రీ శృంగగిరి శారదా పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ మదబినవ విద్యాతీర్థ భగవత్పాదుల వారిని దర్శించి ఈ పుస్తకమును వారికి చూపెడి భాగ్యము కలిగినది. శ్రీవారి పుస్తకమును బాగుగా పరిశీలించి చాల సంతోషించి, చేసిన కృషిని ప్రశంసించి శ్రీవారి శ్రీముఖము, ఆశీస్సులు, ప్రసాదములు మంత్రాక్షతలు మరియు వారి ఫోటోబ్లాకును ఇచ్చి మమ్ములననుగ్రహించి కృతార్థులను చేసినారు. శ్రీవారి శ్రీముఖము ఆశీస్సులు, మహాభాగ్యములు. శ్రీవారి ప్రేమ ఆదరణ, ఆసక్తి శునిశితప్రజ్ఞ చాలగొప్పవి. శ్రీవారికి మా హృదయపూర్వక సాష్టాంగప్రణామములను భక్తితో తెలుపుకొను చున్నాము.


చిదమ్బర క్షేత్రమున సుప్రసిద్థ సంస్కృత పండితులు, శ్రీనటరాజ దేవాలయ పరిపాలక పూజకులు, మాకు దీక్షితులు అయిన శాస్త్రాచార్య, పండితరాజు, సోమశేఖర దీక్షితులుగారు, వారి పుత్రుడు చతుశ్శాస్త్రశిరోమణి శ్రీసోమసేతు దీక్షితులుగారు ఈ గ్రంధమును తయారుచేయుటలో పెక్కు సలహాలిచ్చి మార్గదర్శకులై నాకీభక్తి మార్గము చూపినందులకు, మరియు వారి అముఖాశిర్వాదములకు నాకృతజ్ఞతాపూర్వక నమస్కృతులు సర్పించుచున్నాను.


అణ్ణామలై విశ్వవిద్యాలయమున సంస్కృత విభాగముమునకు అగ్రస్థానము వహించిన నాకు చిరకాలమిత్రులయిన ప్రొఫెసరు. సి.యస్‌. వెంకటేశ్వరన్‌గారు ఈ గ్రంధమును చూచి చాల సలహాలిచ్చి ప్రశంసించి ఆశీస్సులను ప్రసాదించిరి.


నేదునూరు వాస్తవ్యులు, అనేక యజ్ఞయాగాదులు చేసిన మహనీయులు "సాంగవేదర్దసామ్రాట్‌, అభినవ అపస్తంబ" ఇత్యాది బిరుదాలంకృతులునగు శ్రీలంక వెంకటరామశాస్త్ర సోమయాజి ఘనాపాఠీ గారు ఈపుస్తకము ప్రారంభించినది మొదలు చాల ప్రోత్సాహము, సలహాలనిచ్చి సందేహములను తీర్చి మార్గదర్శకులై వారి అభిప్రాయము ఆశీస్సులు ఇచ్చినారు.


మీమాంసవిద్యాప్రవీణ సాంగవేదార్థ సమ్రాట్‌, అభినవ విద్యారణ్య మొదలగు బిరుదులచే కీర్తింపబడు శ్రీ రేమిళ్ల సూర్యప్రకాశశాస్త్రిగారు పెక్కుసలహాలిచ్చి తోడ్పడి ఆశీర్వదించినారు.


సాంగఋగ్వేదనిష్ణాతులును, వ్యాకరణతర్క వేదాంత శాస్త్రములలో అగ్రశ్రేణికు చెందిన పండితులును గౌతమీ విద్యాపీఠ సంస్కృత కళాశాలయందు న్యాయవేదాన్తాచార్యులును అగు శ్రీ గోడా సుబ్రహ్మణ్యశాస్త్రిగారు వేదపాదస్తవములు వ్రాయుటలో వేదవాక్యార్థ నిర్ణయమునందు సంపూర్ణ సహాకారమొనర్చి తమ ఆశీస్సుల నిచ్చినారు.


సర్వవిధముల మాకు సలహాలిచ్చి సంపూర్ణసహకారములిచ్చి దయతో నాశీర్వదించిన పై మహనీయుందరికీ కృతజ్ఞతాపూర్వకముగా నమస్కృతులు సమర్పించుచున్నాను. శ్రీ శివకామసుందరీ శ్రీ నటరాజులు వీరందరికి సర్వశ్రేయములు ప్రసాదించుగాక అని నాప్రార్థన.


శ్రీ పీసుపాటి సూర్యప్రకాశంగారు బహుకార్య నిమగ్నులై ఉండియు ఈ పుస్తకముద్రణ కార్యమందు సంపూర్ణ సహకారమిచ్చి చేసిన మహాకృషి ఫలితమే నేటి గ్రంటరాజము. వీరికి నా కృతజ్ఞత తెలుపుటకు ఎట్లో తెలియకున్నది? శ్రీ శివకామసుందర నటరాజులు శ్రీ సూర్యప్రకాశంగారిని వారికుటుంబమును ఆశీర్వదించి వారికి సర్వమంగళములు ప్రసాదించుగాక.


ఈ గ్రంధములో ముద్రించిన కొన్ని శ్రీ శివకామ సుందరీ నటరాజస్వామివారి ఫోటోలకు బ్లాకులు ఇచ్చి సహాయపడిన శ్రీ శివకామసుందరీ కుంభాభిషేకము కమిటీవారికి మరియు శ్రీ ధర్మపురం అధీనమువారికి నా కృతజ్ఞతాపూర్వక వందనములు.


ఈపుస్తకమును సకాలములో శ్రద్ధతీసికొని చక్కగా ముద్రణచేసి ఇచ్చిన శ్రీ సత్యనారాయణప్రెస్సు యజమానులైన శ్రీకూసుపూడి వెంకట్రావుగారికి, వారి పనివారికి నా అభినందనములు.


ఈ పుస్తకములో ఏవిధమైన పొరపాట్లు తప్పులు ఉన్నను వానిని పాఠకులు మన్నించి తెలియపరచిన, కృతజ్ఞనతో స్వీకరించి ఇంకొక ప్రచురణలో సరిదిద్దుకొందును.


ఈ "చిదమ్బర మాహాత్మ్య వేదపాదస్తవములు" శ్రీ శివకామసుందరీ నటరాజులకు భక్తితో వినమ్రుడనై సమర్పించుకొనుచున్నాను. ఈపవిత్ర గ్రంధమును నాయందు కృపజూపి, పరిపూర్ణానుగ్రహముతో స్వీకరింపుమని వేడుకొనుచున్నాను. ఈకృషిలో సహాయపడిన వారినందరి ఆశీర్వదించి వారికి శుభములు ప్రసాదింపుమని ప్రార్థించుచున్నాను.


శ్లో|| శఙ్కరస్య చరితాకధామృతం చంద్రశేఖర గుణాను కీర్తనమ్‌|


నీలకంఠ! తవపాదసేవనం, సంభవంతు మమ జన్మ జన్మని ||


అన్యధాశరణం నాస్తిత్వమేవ శరణం మమ|


తస్మాత్‌ కారుణ్య భావేన రక్షరక్ష మహేశ్వర||


అపరాధసహస్రాణి క్రియన్తే7హర్ని శంమయా |


దాసో7యమితి మాం మత్వాక్షమస్వ పరమేశ్వర ||


అణ్ణామలై నగరము దర్భా సూర్యునారాయణ F.I.E.


తమిళనాడు (సంపాదకులు-ప్రకాశకులు)


9-71972 సివిల్‌ ఇంజనీరింగు పొఫ్రెసరు


అణామలె యూనివర్సిటీ


 


గురుర్బ్రహ్మా గురువిష్ణుః గురుర్దేవో మహేశ్వరః |


గురుస్సాక్షా త్పరంబ్రహ్మాతసై#్మ శ్రీగురవేనమః ||


శ్రీ జగద్గురు శ్రీమదభినవ విద్యాతీర్థమహాస్వామివారు,


శ్రీ దర్భా సూర్యునారాయణ, సుబ్బలక్ష్మి దంపతులు,


శృంగేరి. 8-5-1972


 


పరిచయము


శ్లో|| నాపరం శివగఙ్గాయాః


తీర్థం, స్థానం చిదమ్బరాత్‌ |


తన్మ న్తాన్నాపరో మన్త్రః


నాస్తి దేవో నటేశ్వరాత్‌ |


తదాలోక్యాప్నుహి ఫలం


చార్మణసై#్యవ చక్షుషః ||


చిదమ్బరమాహాత్మ్యే 24 అధ్యా.


ప్రాణిమాత్రము కోరునది సుఖము. పరమసుఖప్రాప్తికి జ్ఞానము, కర్మ, భక్తియని మూడు సాధనములు. జ్ఞానమునకు సాధనచతుష్టయసంపన్నుడే అర్హుడు. కర్మ కష్టతరము, బహుద్రవ్యసాధ్యము. కనుక పైమూడు సాధనములలో భక్తి ఉత్తమము, సులభము. భక్తికి మనుష్యమాత్రుడు లేక ప్రాణిమాత్రమధికారి. భక్తియనగా ఈశ్వరునియందు గాఢమైన ప్రేమయనియు "సాత్వస్మి9 పరమప్రేమరూపా" భగవద్గుణశ్రవణాదులచే మనస్సుకరగి ధారగా ప్రవహించి భగవదాకారమును బొందుటయనియు"ద్రుతస్య భగవద్ధర్మార్ధారావాహికతాం గతా| సర్వేషే మనసో వృత్తిర్భక్తిరిత్య భిధీయతే||" చెప్పిరి. భగవద్గుణ విశేష వర్ణనరూపమైన గ్రంథములను పఠించుటచేతను, వినుటచేతను భక్తి లభించును. పురాణములలో భగవద్గుణవర్ణనము, తద్భక్తుల చరిత్రలు విననగును.


ఈ చిదంబరమాహాత్మ్యము స్కాందపురాణములోనిది. ఇది ఇరువదియారధ్యాయముల గ్రంథము. దీనిలో చిదంబరముయొక్క గొప్పతనము, శివగంగమహిమ, కరుణామయుడైన పరమశివుడు వ్యాఘ్రపాద పతంజలుల ననుగ్రహించి యానందతాండవమును జూపుట, లోకమునుగూడ అనుగ్రహించుట, నృసింహవర్మను హిరణ్యవర్మగా జేయుట ఆ పరమ భక్తుడగు హిరణ్యవర్మ అచ్చటి దేవాలయాదులను, బ్రాహ్మణ గృహములను గ్రొత్తవిగాజేసి నటరాజస్వామి కుత్సవముల నేర్పాటుచేయుట మొదలగు విషయములు గలవు.


చిదంబరము వేదమందును సూతసంహితాదులయందును బ్రసిద్ధమైనది. ఈశ్వరనిర్మితమైన అరువది ఎనిమిది ముక్తిక్షేత్రములలో నిది సర్వోత్తమైనది. కాశీలో మరణించుటవలనను, అరుణాచలమును స్మరించువలనను, చిదంబరమున తాండవమూర్తిని చూచుటవలనను ముక్తి లభించును. వీనిలో జనన మరణ ధ్యానములు దుర్లభములు. మిక్కిలి సులభ##మైనది దర్శనము, కనుక చిదంబరము వానిలో నుత్తమము. పంచభూతముల లింగములుగల క్షేత్రములుగలవు. కాంచీపురమున పృథ్వీగంగము, జంబుకేశ్వరమున జలలింగము. అరుణాచలమున తేజోలింగము, కాళహస్తియందు వాయులింగము, చిదంబరమున ఆకాశలింగము. ఈ ఐదు క్షేత్రములలో అన్నిటికంటె సులభముగా దర్శనమాత్రముచేతనే ముక్తినిచ్చు ఉత్తమక్షేత్రము చిదంబరము.


ఇచ్చట మహాతపస్సు చేసిన వ్యాఘ్రపాద పతంజలులకు పరమశివుడు పార్వతితో వచ్చి కనకసభలో ఆనందతాండవమును జూపి లోకమందలి యనుగ్రహముచే నందరకును తాండవమునుజూపి తరింపజేయ నచ్చట స్థిరముగా నివసించెను. నటరాజు సేవకై భూమిలోనున్న ఏకామ్రేశ్వర, సుందరేశ్వరాది దేవతలందరు నిత్యము రాత్రి చిదంబరమునకు వచ్చెదరట పరమశివుడు పంచకృత్యపరాయణుడుగదా! నటరాజ రూప మాతడుచేయు ఐదుపనులను తెలుపునందురు. డమరుకము సృష్టిని, అభయహస్తము స్థితిని, అగ్నిగల హస్తము సంహారమును, స్థిరపాదము తిరోధానమును, కుంచితపాదము అనుగ్రహమును సూచించును. ఈనటరాజునుసేవించి వ్యాసుడు, సూతుడు జైమిని, మొదలగు ఋషులేగాక మార్గములలో బ్రహ్మహత్యలు చేసి ధనమపహరించిన పుల్కనుడు మొదలగు మహా పాపాత్ములుకూడ తరించిరి. సింహరూపమున బుట్టి దుఃఖించి రాజ్యమునువిడచి చిదంబరమునకు వచ్చిన సింహవర్మయను రాజు నటరాజుయొక్క అనుగ్రహముచే శివగంగలో స్నానముచేసి సింహరూపము తొలగ బంగారమువంటి కాంతితో హిరణ్యవర్మ యయ్యెను. అతడే తొలుత దేవాలయమును అచ్చటిమూడు వేలమంది బ్రాహ్మణుల గృహములను బాగుచేయించి ఉత్సవముల నేర్పరచినవాడు.


ఈవిధమున భక్తుల చరిత్రలు, నటరాజు మహిమయు నీ చిదంబరమాహాత్మ్యమున బాగుగా వివరింపబడినవి. ఈ గ్రంథమును చదివి, విని భక్తితో చిదంబరములోని నటరాజును సేవించినవారి కాతడు జ్ఞానదృష్టి నొసగును. దానితో వారు "సర్వైర్ముముక్షుభిర్ధ్యేయః, శమ్భురాకాశమధ్యగః" అను విధమున హృదయపుండరీకమధ్యముననున్న దహరాకాశములోని తాండమూర్తిని సేవించి పరమసుఖరూపమైన మోక్షమును పొందగలరు. ఈ చిదంబరమాహాత్మ్య ముపదేశించు ప్రధాన విషయమిది యనదగును. తుదకీ చిదబంరమాహాత్మ్యమును నిత్యము పారాయణచేసినను క్రమముగా తరింపగలరు.


ఈగ్రంధమును తెలుగులిపిలో తాత్పర్యముతో వ్రాయుటకు ప్రోత్సహించి అచ్చువేయించినవారు అణ్ణామలై విశ్వవిద్యాలయమున సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగములో ప్రొఫెసరుగానున్న శ్రీ దర్భా సూర్యనారాయణగారు, స్కాందపురాణము దుర్లభమగుటచే వారు మొదట గ్రంధక్షరిలో వ్రాయబడిన చిదంబరమహాత్మ్యమునుండి 17. 18 అధ్యాయములను చిదంబరములోని శాస్త్రాచార్య, పండితరాజ శ్రీ సోమశేఖర దీక్షితులవారిచే నాగరీలిపిలో వ్రాయించి అచ్చు వేయించిరి. పిమ్మట వీరి ధర్మపత్ని సౌభాగ్యవతియు నగు శ్రీ సుబ్బలక్ష్మిగారి ప్రేరణచే నాపుస్తకమును తెలుగులిపిలో తాత్పర్యముతో వ్రాయించి అచ్చువేయించిరి. తరువాత చిదంబరములోని సుహృత్సభ నుండి ఇరువదియారధ్యాయముల చిదంబరమాహాత్మ్యము సంపూర్ణగ్రంధము దేవనాగరీలిపిలో వెలువడగనే శ్రీ దర్భా సూర్యనారాయణగారు తెలుగువారందరికిగూడ సంపూర్ణగ్రంథము నందజేయవలెనను సత్సంకల్పముతో నాగ్రంధమును నాకుపంపి తాత్పర్యముతో తెలుగులిపిలో వ్రాయమని ప్రోత్సహించిరి. విశేషజ్ఞుడను కాకున్నను వారు నన్ను ప్రోత్సహించుటకు కారణము ఆజగత్పితరులగు శివకామసున్దరీ నటరాజుల కీవచ్చియు రాని మాటలు విని యానందింపవలెనను కోరిక యొక్కటెయని నాకు భాసించుచున్నది. తల్లిదండ్రులదగ్గర బాలుడట్టి మాటలు పలుకటకు సందేహింపక ఉత్సాహపడునుగదా! ఆజగత్పితరుల ప్రీతికొరకీ గ్రంధమును వ్రాసితిని. అల్పజ్ఞుడనగుటచే తాత్పర్యము వ్రాయుటలో నీగ్రంధమున కొన్ని దోషములు వచ్చియుండవచ్చును. విజ్ఞులు మన్నించి వానిని తెలిపినచో శిరసావహింతును.


ఈగ్రంధమును చాల భాగమున సరిచూచి దోషములను సవరించి నాకెంతయు సహాయముచేసిన నెల్లూరులోని సంస్కృతకళాలాధ్యాపకులగు శ్రీమాన్‌ కే.యస్‌. రామానుజాచార్యులుగారికిని, రాజమహేంద్రవరమున గౌతమీ విద్యాపీఠస్థ సంస్కృతకళాశాలయందు భూతపూర్వాధ్యక్షులగు శ్రీ కొల్లి అనంత పద్మనాభశాస్త్రులుగారికిని నేను కృతజ్ఞతను తెలుపుచుంటిని.


ఈ గ్రంధమును వ్రాయుటకు నన్ను ప్రేరేపించిన పుణ్య దంపతులు శ్రీ సుబ్బలక్ష్మీ సూర్యనారాయణుల కాశివకామ సుందరీ నటరాజు లఖిలాభీష్టము లొసగెదరుగాక.


మమ్ముల నాశీర్వదించి కృపజూపిన జగద్గురువులు శృఙ్గగిరిపీఠాధిపతులు నగు శ్రీ మదభినవవిద్యాతీర్థ భగవత్పాదులకు నా సాష్ఠాంగ దండప్రణామము లర్పించుచున్నాము.


ఇన్నీసుపేట ఇట్లు


రాజమహేంద్రవరము-2 శ్రీపాద వెంకటేశ్వర్లు


16-6-1972 రిటైర్డు సంస్కృత పండితులు


ప్రభుత్య కళాశాల


ఓమ్‌


ఉపోద్ఘాతము


ఏకరాశిగానున్న వేదసమూహమును ఋగాదిభేదముచే వ్యాస (విభాగ) మొనర్చుటచే సాత్యవతేయుడు వేదవ్యాసుడను నన్వర్ధనామధేయుడయ్యెను. ఆ మహర్షి అష్టాదశపురాణములను, ఉపపురాణములను, ఉపనిషదాధారముగా బ్రహ్మసూత్రములను, సర్వోపనిషత్సారమగు భగవద్గీతను రచించి, మనకు ప్రసాదించినాడు. ఋషియన బ్రహ్మమనియు నర్థము. బ్రహ్మబోధకమగుటచే వైదిక మతమునకు ఆర్షమతనియు ప్రఖ్యాతి గల్గినది.


శ్రీ వేదవ్యాసులవారు రచించిన స్కాందపురాణములో నంతర్గతము చిదంబరమాహాత్మ్యము . విరాట్పురుషుని రూపములోని పంచమహాభూతములలో ప్రధాన భూతమగు ఆకాశమూర్తికి స్థలము చిదంబరక్షేత్రము. పుష్యమీ నక్షత్రయుక్త పౌర్ణమాసీదినమున నటరాజస్వామి శివకామసుందరీ పరాశక్తిగూడి ఆనంద తాండవామృతమును మహర్షులు, సిద్ధులు, గంధర్వలు, దేవతలు మున్నగు భక్తవర్యులకు ప్రసాదించును.


దాక్షిణాత్యభక్తకవిపండితులు చిందరక్షేత్ర మహత్వమును బహువిధములుగా వివరించిరి. వారివాక్యముల యుర్థమును నిటపొందుపఱతును.


అయిదు భూతములలో నాకాశ##మే ప్రధానము. కావున ఆకాశ ప్రధానమయిన యీక్షేత్రము అన్నిటికన్న ప్రశస్తము. (1) తిరువాలంగాడు అనుక్షేత్రము రత్నసభ, (2) మధుర వెండిసభ, (3) తిరునల్వేలి తామ్రసభ, (4) తిరుక్కుంటాలము చిత్రసభ, (5) చిదంబరము కనకసభయు అని ప్రసిద్ధములు, ఈయైదు సభలలో పరమేశ్వరుడు పరమేశ్వరితో గూడి నటన మొనర్చుచుండును.


ఈనాట్యములో పరమేశ్వరుని పంచకృత్యములు నాట్యభంగిమములవలన వ్యక్తమగుచుండును. డమరుకమున్న చేతితో సృష్టి, అభయహస్తముచేస్థితి ఎత్తిన చేతితో సంహారము, నాట్యముచేయు పాదముచే అనుగ్రహము, మరొకపాదముచే తిరోధానమును సూచితములు. ఇది స్థూలచిదంబరము,


శరీరాంతర్గతమయినది సూక్ష్మచిదంబరము. భూతాకాశము లేక యితర భూతముల స్థితియెట్లులెదో అట్లే హృదయస్పందనములేక మిగిలిన యవయవములు పనిచేయవు. కనుక హృదయమును చిదాకాశముగా చెప్పుదురు. భగవంతుని స్థానము చిదాకాశము. భగవంతుని నటనముయొక్క ప్రతిధ్వనియే మన హృదయ స్పందనము. ఇడ. సుషుమ్న , పింగల, యను మూడు నాడులు మనశరీరములోగలవు. అందు సుషుమ్న మధ్యనాడి, దానిలో 6 చక్రములు గలవు. రెండేసి చక్రములు గలిసి యొకగ్రంధిగా నుండును. మూలాధారచక్రముమధ్య కులకండమను బిందువున కఱచి పెట్టుకొని కుండలినీశక్తి యుండును. మూలాధారము సుషుమ్నా నాడికి మూలస్థానము 4 దళములుగలది. బాహ్యప్రపంచముననిది కమలాపురము అను తిరువారూర్‌ గా నున్నది స్వాధిష్ఠానము 6 గళములు గలది. ఇది బాహ్యప్రపంచమున జంబుకేశ్వరముగా ప్రసిద్ధిగాంచినది, ఇది శరీరములో లింగప్రదేశము స్థానముగాగలది. ఈరెంటికి పైన బ్రహ్మగ్రంధికలదు. ఈరెండుచక్రములపైన మణిపూరచక్రము గలదు. అది 10 దళములతో విరాజిల్లును. ఇది బాహ్యప్రపంచమున అరుణాచలక్షేత్రము. మణిపూర చక్రముపైన 12 దశములుగల అసాహతచక్రముగలదు. ఇది శరీరములో హృదయ క్షేత్రమునగలదు. దీనిని సంవిత్కమలమనియు, పూర్ణగిరి పీఠమనియు స్తుతింతురు. దీనిని 12 సూర్యులు సంపూర్ణ కాంతితో ప్రకాశింపజేయుదురు. ఈ చక్రము బాహ్యప్రపంచమున చిదంబరము. దీనిపై గ్రంధి విష్ణుగ్రంధిః దీనికి పైన 16 దళములుగల విశుద్ధచక్రము మన కంఠస్థానమున నున్నది. ఇది వాయుస్థానము. ఇది కాళహస్తిగా చెప్పబడుచున్నది. దీనిపైన ద్విదళము ఆజ్ఞాచక్రము భ్రూమధ్యమందున్నది. ఇది బాహ్య ప్రపంచమున కాశీక్షేత్రము. దీనిపైన రుద్రగ్రంధి యుండును. దీనిపైన సహస్రదళములుగలిగి జ్వలించు సహస్రారచక్రము గలదు. దీనికి చంద్రమండలమనియు, ద్వాదశాంతమనియు, బ్రహ్మరంధ్రమనియు నామములుగలవు. దీనిని బాహ్యమున కైలాసమందురు.


శరీరములో మధ్యస్థానమగు హృదయమే చిదాకాశము. ఇదియే చిదంబరము. ఇదియే పరమేశ్వరుని నాట్యస్థానము. దీనివలన చిదంబరము స్థూలరూపము. దహరాకాశము సూక్ష్మరూపము - అని పర్యవసానము.


పుష్యమీ నక్షత్రయుక్త పౌర్ణమాసీదినమున చిత్సభయందు పరమేశ్వరుడు భక్తులకు ప్రసాదించు ఆనందతాండవామృతమును తనివితీర నాస్వాదించుటకు మహర్షి సిద్ధగంధర్వ దేవతాదులు నిరీక్షింతురు.


జైమిని మహర్షి అగ్ని కేశాదిశిష్యసమేతుడై దేవ గంధర్వాది సంసేవితమయిన చిత్సభ##కేతెంచెను. అచ్చట పరమేశ్వరుని నాట్యమును దూరమునుండియే గాంచి సాష్టాంగ ప్రణామ మొనర్చెను. నటరాజు నాట్యమును పార్శ్వము నుండి తిలకించు శివకామసుందరీ మహాదేవినిగాంచి సంతోషముతో ప్రణమిల్లెను. జైమిని పరమశివుని యనుగ్రహమున వేదాంత సారమును సంపూర్ణముగా నాకళించుకొని భక్తితో దోసిలి కట్టి యీయత్యు త్తమమయిన వేదపాదాంతస్తవమును రచించెను. ఇది జైమిని మహర్షి కర్తృకమగుటచే జైమిని వేదపాదస్తవముగా ప్రసిద్ధి గాంచెను.


శ్రీ వేదవ్యాసుల వారికి నలుగురు శిష్యులు పైలుడు జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు. జైమిని మహర్షి వ్యాసశిష్యులలో ప్రధానుడు. సర్వ వేదార్థసార సంపన్నుడగు నీమహర్షి సామవేదశాఖీయుడగు మహాత్ముడని యందురు. ఈయన పూర్వ మీనాంసాశాస్త్రప్రవర్తకుడు వేదములోని పూర్వభాగము కర్మబోధకము వేదార్థ నిర్ణాయకములగు నియమముల ననుసరించి వేదార్థమును నిర్ణయింపవలెను. ద్వాదశాధ్యాయ పరిమితమగు పూర్వమీమాంసాసూత్రముల నీజైమిని మహర్షి రచించెను.


లోకమున భక్తులగుకవు లనేకవిధములుగా విశిష్టభక్తి భావామృత పరిపుతమయిన తమ కవితాసుధాపూరముచే పరమేశ్వరుని తృప్తిగావించి, కృతార్థులయిన వారుగలరు. వారి స్తవరత్నములును పెక్కు గలవు. గానప్రియుడగు పరమాత్మను నాదబ్రహ్మోపాసకులయిన త్యాగరాజాది భక్తవరేణ్యులు రాగతాళసంపుటితమగు తమ గానమాధురీ భరిత సుధాభిషేకమున తనియించి ధన్యులయినవారును గలరు. వారి వారి రచనలు సుప్రసిద్ధములై లోకమున వ్యాపించియున్నవి. కాని యీజైమిని కృత స్తవమునకు వానికన్న విశిష్టతకలదు. ప్రతిశ్లోకాంతపాదము వేదవాక్యరూపమగుటయు సమస్తవేదవేదాంగ సార స్వరూపాభిజ్ఞుడు, సాక్షాద్వేదవ్యాస శిష్య సత్తముడగు జైమినిమహర్షి ముఖారవిందస్సృత మకరందమగు దీనిమాధుర్యము ప్రాశస్త్యము చెప్పుటయనావశ్యకము.


ఇట్లే పరమేశ్వరునితో నవినాభావినియగు శ్రీమత్త్రి పురసుందరియొక్క వేదపాదస్తవము. దీనిని రచించినవారు సాక్షాచ్ఛంకరావతారమయి, అద్వైత ప్రస్థానత్రయ రచయితలును, తత్ర్పవర్తకులును, ఇంకను ననేక ప్రకరణాది గ్రంథముల నద్వైతపరముగా రచించి, తమ యఖండ ప్రతిభావిశేషముచే నితరమత నిరసనపూర్వకముగా సర్వవేదాంతములకు నద్వైత మందే పరమతాత్పర్యమని శ్రుతియుక్తి ప్రమాణములతో నిర్ణయించి మనకు ప్రసాదించిన శంకరభగవత్పాదులగుట దీనిప్రాశస్త్యమును వేఱ చెప్పనేల!


ఈస్తవములు రెండును నిత్యపారాయణమొనర్చి తరించుటకు సర్వదా ఉపయుక్తములు.


వేదము సర్వధర్మములకును మూలము. అని వేదలక్షక్షణము: ఇష్టప్రాప్తి, అనిష్టపరిహారములకు, అలౌకికోపాయ బోధకమగునని వేదము "అలౌకిక శ్రేయస్సాధనతాలోథకోవేదః" మరియు "యస్యనిశ్వసితంవేదాః" అను సూక్తిచే పరమేశ్వరుని ముఖమునుండి నిశ్వాసమువలె నప్రయత్నముగ వెలువడినవని చెప్పుటచేత నవి యపౌరుషేయములనియు, నిత్యములనియు నిర్థారితమైనది. మరియు వేదః ప్రాచేతసాదాసీత్సాక్షాద్రామాయణాత్మనా" అనియు "భారతం పంచమో వేదః" అనియు రామాయణ మహాభారతములు వేదధర్మములను ప్రధాన తాత్పర్యముతో బోధించుటచే వానియందు వేదత్వమాగోపితమగుటచే వేదవైశిష్ట్యము బహుముఖముగా బోధింపబడుచున్నది.


అట్టి వేదవాక్యము పాదాన్తముగల స్తవములగుటచే నివి నిత్యపారాయణమువలన వేదపారాయణ ఫలమును ప్రాప్తింపజేయుచున్నవి. వీనియర్థమును దెలిసికొని పఠించినచో ఫలాధిక్యము సుస్పష్టమేకదా. "యదేవవిద్యాయాకరోతితదేవ వీర్యవత్తరంభవతి" అని శాస్త్రము. ఈరెండు వేదపాదస్తవములును సంస్కృతభాషలో నున్నవి. సంస్కృతభాషాసంస్కారము గలవారికే యవిగ్రాహ్యములు. ఆంధ్రజనసామాన్యము పఠించి తరించుటకు నవకాశమును కల్పింపవలెనని లిపిపరివర్తనము. ఆంధ్రభాషలో తాత్పర్యము వ్రాయించి ప్రకటింపవలయునను పవిత్రాశయముతో అన్నామలై విశ్వవిద్యాలయములో సివిల్‌ ఇంజనీరింగుశాఖలో వాస్తువిభాగమున కధ్యక్షులుగానున్న బ్రహ్మశ్రీ దర్భా సూర్యనారాయణగారు వారి ధర్మపత్ని, సాధ్వీమణి, శివకామసుందరీ నటరాజాది మదంపతులయందు పరమభక్తిబావసమన్విత శ్రీమతి, సౌభాగ్యవతి, సుబ్బలక్ష్మిగారి ప్రేరణచే నీసత్కార్యమునకు పూనుకొనిరి. "శివశ్శక్యాయుక్తోయదిభవతిశక్తః ప్రభవితుం" అనిగదా శ్రీ మచ్ఛంకరభగవత్పాదసూక్తి.


కాపాప్తమిత్రులును సత్కార్యనిర్వహణధురీణులును, భగవద్భక్తులును, సహృదయులునగు అడిటర్‌ బ్రహ్మశ్రీ పీసపాటి సూర్యప్రకాశముగారి ద్వారమున నీవేదపాదద్వయాంధ్రతాత్పర్యరచన చేయవలసినదని నాకు తెలియజేసిరి. వేదార్ధగంధములేని నేను వేదపాదస్తవముల కర్థమువ్రాయుటా యని జంకితిని. నిశ్చయించితిని. కాని శ్రీ సూర్యప్రకాశముగారి యందలి గౌరవమడ్డుకొన్నది. సత్కార్యముకదా! వేదవిద్యానిష్ణాతుల సాయమునుదీసికొని యీకార్యము నిర్వహింపలేమా! అని ధైర్యముతో నీకార్యమునకు పూనితిని. నా యోపినకలది పెద్దలసాయమును సంపూర్ణముగా గ్రహించి, యీరెండు పుస్తకములకును తాత్పర్యము వ్రాసితిని.


వేదములో నాయావేదభాగములసందర్భములు భిన్న భిన్నములుగానుండును. ఈ స్తోత్రములలో పైమూడు పాదముల యర్థముతో సమన్వితమగునట్లు చేయుట కొంతకష్టతరమగు విషయము. ఎంతవరకు నిర్వహింపగలిగితినో! "ఆపరితోషాద్విదుషాం నసాధు మన్యే ప్రయోగవిజ్ఞానమ్‌" అను కాళిదాసమహాకవి సూక్తిని మనసులో మననముచేసికొనుచున్నాను.


ప్రొఫెసరు దర్భా సూర్యనారాయణగారి కోరికచే స్కాందపురాణాంతర్గతమగు 26 అధ్యాయపరిమితసంస్కృత నటరాజమాహాత్మ్యమును పండితవర్యులు బ్రహ్మశ్రీ శ్రీపాద వెంకటేశ్వర శాస్త్రిగారు లిపిపరివర్తనము తాత్పర్యమును చక్కని మృదుమధురశైలిలో తెలుగుభాషలో సర్వాంగసుందరముగా రచించిరి. దానికనుబంధముగా నా రచనయగు నీస్తవద్వయమును గలిపి యేకసంపుటముగా జేసి ముద్రణము చేయించిరి.


వేదపాదస్తవ తాత్పర్యరచనకు, వేదాపాదార్థ వివరణముపై పాదములయర్థ సమన్వయము వేదపాదాపదార్ధనిర్ణయాదులలో నాకత్యంతము సాయముచేసిన పండితవర్యులు. సాంగవేదార్థసమ్రాట్‌. అభినవాపస్తంబ బ్రహ్మశ్రీ లంక వెంకటరామశాస్త్రి సోమయాజులుగారు సాంగవేదార్థసమ్రాట్‌. వేదర్థభాస్కర, మీమాంసావిద్యాప్రవీణ శ్రీ గౌతమీ విద్యా పీఠసంస్కృతకళాశాల ప్రిన్సిపాలు బ్రహ్మశ్రీ రేమిళ్ల సూర్యప్రకాశశాస్త్రి గారు.


ఋగ్వేదభాష్యపరీక్షాధికారి. న్యాయవేదాంత వ్యాకరణశాస్త్ర నిష్ణ్వాతులును, ప్రస్తుతము శ్రీ గౌతమీవిద్యాపీఠ సంస్కృత కళాశాలా న్యాయవేదాంత శాఖోపన్యాసకులునగు బ్రహ్మశ్రీ గోడా సుబ్రహ్మణ్యశాస్త్రిగారు.


ఈ మహావిద్వాంసులు మువ్వురు చేసిన సాయముచేతనే ఈమాత్రమయిన నేను వ్రాయగల్గితిని. కావున నీవేదమూర్తి త్రయమునకు నామస్కారముల నర్పించుకొనుచున్నాను.


జగద్గురువులును శృంగగిరి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమదభినవవిద్యాతీర్థమహాస్వామి గురువరేణ్యులను శ్రీ సూర్యనారాయణగారు దర్శించినప్పుడు ఈకృషికి శ్రీవారు మహానందముపొంది వారొసంగిన శ్రీముఖములో మాకృషిని ప్రస్తావించి, సంతసించి, మాకాశీర్వచనముల నొసంగిన శ్రీ జగద్గురుప్రభువులకు, మాసాష్టాంగ నమస్కారములను శ్రద్ధాభక్తిపూర్వక వినమ్రతతో నర్పించుకొనుచున్నాము.


మరియు నీకృషిని సంతోషముతో నాదరించిన పెద్దలకందరకు మాప్రణామములు.


ఇట్టి పరమపవిత్రకార్యమును సంకల్పించి, సత్కార్యనిర్వహణదీక్షాదక్షులగు సీసపాటి సూర్యప్రకాశముగారి సంపూర్ణ సాహాయ్యముతో నిర్వహించి, ఈ పవిత్రకార్య నిర్వహణమున మాకుగూడ సదవకాశమును కల్పించి శ్రీ శివ కామసుందరీసహిత నటరాజ పరమేశ్వర కారుణ్యలేశమున మాకుగూడ స్ధానముకల్పించి శ్రీ సుబ్బలక్ష్మీ సూర్యనారాయణ దంపతులకు వారి యిష్టదైవములు శ్రీ శివకామసుందరీ నటరాజాదిమదంపతులు దీర్ఘాయురారోగ్య సర్వసంపత్సమృద్ధి సమన్వితులను జేయుగాక, అని వారికిని మాకును ఇష్టదైవమగు శ్రీ శివకామసుందరీ సమేత నటరాజపరమాత్మను ప్రార్థింతును.


అనువాదమునందలి నా దోషములను, ముద్రణ దోషములను సహృదయులు దయతో తెల్పినచో కృతజ్ఞతతో స్వీకరించి వానిని సవరించుకొందును.


పరీధావిజ్యేష్ఠ                                     కొల్లి అనంతపద్మనాభ శాస్త్రి


శుక్లపూర్ణిమ                                        రిటైర్డు ప్రిన్సిపల్‌


26-6-1972                                 శ్రీ గౌతమీ విద్యాపీఠ ప్రాచ్య సంస్కృత


                                             కళాశాల, రాజమండ్రి.


 


శ్రీ శంకరకృప


11, హనుమున్‌ కోవిల్‌ వీధి


మద్రాసు - 600033


దక్షిణామ్నాయ శ్రీ శృంగేరీ శారదాపీఠమువారి యాజ


మాన్యమున వెలువడు ఆధ్యాత్మిక మాసపత్రిక


ఏప్రిల్‌ 1975


శ్రీ చిదంబరమాహాత్మ్య వేదపాదస్తవములు. (శ్రీ వేదవ్యాస, జైమిని, శంకరభగత్పాద విరచితములు) ఆంధ్రతాత్పర్యసహితము.


సంపాదకులు, ప్రకాశకులు : ఆచార్య శ్రీ దర్భా సూర్య నారాయణ (అణ్ణామలై యూనివర్సిటి, చిదంబరము)


గ్రంథములు దొరకుచోటు : శ్రీమతి దర్భా సుబ్బలక్ష్మీ కేరాఫ్‌ శ్రీ దర్భా సూర్యనారాయణ , సివిల్‌ ఇంజనీరింగ్‌ ప్రొఫెసర్‌, అణ్ణామలై యూనివర్సిటి, అణ్ణామలైనగరము తమిళనాడు 600 పుటలు వెల రు 12-00.


ఇది ఉత్తమభక్తి సాహిత్య గంధము. దీనిని సంపాదించి ప్రకటించుటలో సంపాదకులైన ఆచార్య దర్భా సూర్యనారాయణగారి భక్తి పారవశ్యము ద్యోతమాన మగుచున్నది. శ్రీ శ్రీపాద వేంకటేశ్వర్లు శ్రీ కొల్లి అనంత పద్మనాభశాస్త్రి గారలు సమకూర్చిన ఆంధ్ర తాత్పర్యములు సులభ సుందరముగా నున్నవి. ఈ గ్రంధము నందు చిదంబరహస్య స్వరూపనిర్ణయము, శివకామ సుందరీస్తుతి, శ్రీ వ్యాఘ్రపాద కృతస్తవము, శివకామ సుందర్యష్టకము, చిదంబరమాహాత్యము, పతంజలి కృతనటేశాష్టకము, నటేశ అష్టోత్తర శతనామావళి, శ్రీ జైమినిమహర్షి కృత శ్రీనటరాజ వేదపాదస్తవము శ్రీ శంకర భగవత్పూజ్యపాదకృత శ్రీమత్త్రిపురసుందరీ వేదపాదస్తోత్రము- ఆంధ్ర తాత్పర్యసహితముగ నున్నవి.


శ్రీ శృంగేరీ జగద్గురు చరణులు ఈ గ్రంధమును పరిశీలించి, వాత్సల్యపూర్ణముగా సంపాదకులకృషిని ప్రశంసించి, ఆశీర్వదించినారు.


భగవంతుడైన జైమినిమహర్షి పరమేశ్వరుడైన చిత్సభానాధుని వేదపదములతో కూడిన శ్లోకములతో స్తుతించెను. ఆ శ్లోకములన్నిటియందు చివరపాదము వేదరూపమగా నుండును. శ్రీమచ్ఛంకర భగవత్పూజ్యపాదులు రచించిన త్రిపురసుందరీ వేదపాదస్తోత్రమునందును ప్రతిశ్లోకముయొక్క చివరపాదము వేదమంత్రరూపముగ నుండును. కావున ఈస్తోత్రములు రెండును చాల మహత్వపూర్ణమైనవి.


చిదంబరమాహాత్మ్యము వేదవ్యాసకృతము. ఇది ప్రత్యక్షర పుణ్యజనకమైనది.


ఈ గ్రంధప్రకటనములో ప్రకాశకులు లౌకిక ప్రయోజనమును కాంక్షింపక, భగవత్కృపాపేక్షతో పూనుకొనిరి, ఇది ప్రశంసాపాత్రమైన విషయము.


ఈ గ్రంధమును పఠించిన ఆస్తికజనులు అభీష్టసిద్ధులను పొంది శ్రీ శివకామ సుందరీ నటేశ్వరుల కృపకు పాత్రులై మంగళపరంపరలను పొందుదురని చెప్పవచ్చును.


(శ్రీపాదుక).


శ్రీ చి ద మ్బ ర మా హా త్మ్య ము


(శ్రీ వేదవ్యాస ప్రణీతము)


స్కాందపురాణాంతర్గతము


లిపిపరివర్తనము - తాత్పర్యము


సాహిత్యవిద్యాప్రవీణ, ఉభయభాషాప్రవీణ


శ్రీ శ్రీపాద వెంకటేశ్వర్లు


రిటైర్డు సంస్కృతపండితులు, ప్రభుత్వకళాశాల


రాజమహేంద్రవరము


సంపాదకులు- ప్రకాశకులు


శ్రీ దర్భా సూర్యనారాయణ


సివిల్‌ ఇంజనీరింగు ప్రొఫెసరు


అణ్షామలై విశ్వవిద్యాలయము


చిదంబరము - తమిళనాడు


1972


 


ప్ర ధ మ భా గ ము


1972 ప్రధమ ముద్రణము


సర్వస్వామ్యములు ప్రకాశకులవి


 


శ్రీ వేదవ్యాస భగవానుడు


శ్లో || నమోస్తు7తే వ్యాస విశాలబుద్ధే|


పుల్లారవిందాయతపత్రనేత్ర|


యేనత్వయా భారతతైలపూర్ణః |


ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః ||


 


శ్రీ చి ద మ్బ ర మా హా త్మ్య


ని త్య పా రా య ణ వి ధిః


పారాయణక్రమః


అన్య శ్రీ చిదమ్బరమాహాత్మ్యస్య భగవాన్‌ వ్యాసో ఋషిః || అనుష్టుప్‌ ఛందః || దహరకుహరమధ్యగః శ్రీ చిత్సభేశ్వరః శ్రీమదజానన్దతాణ్డవరాజో దేవతా | ఓం బీజం నమః శక్తిః| శివాయేతి కీలకమ్‌ | శ్రీచిత్సభేశ్వరప్రసాదసిద్ధిద్వారా సకలభోగమోక్షసిధ్యర్థే వినియోగః ||


యస్మాత్సర్వం అంగుష్టాభ్యాం నమః| సముత్పన్నం తర్జనీభ్యాంనమః| చరాచరమిదం జగత్‌ మధ్యమాభ్యాంనమః . ఇదం నమః | అనామికాభ్యాంనమః | నటేశాయ తసై#్మ కనిష్ఠికాభ్యాం నమః | కారుణ్యమూర్తయే కరతలకరపృష్టాభ్యాం నమః | యస్మాత్సర్వం హృదయాయనమః |సముత్పన్నం శిరసేస్వాహా| చరాచరమిదం జగత్‌ శిఖాయై వౌషట్‌| ఇదంనమః కవచాయ హుం| నటేశాయ తసై#్మనేత్రత్రయాయ వౌషట్‌ | కారుణ్యమూర్తయే అస్త్రాయ ఫట్‌ | భూర్భవస్సువ రోమితి దిగ్బంధః |


ధ్యానం


శ్లో || హరిహరవిధిముఖ్యాన్‌ యో7సృజత్‌ విశ్వకర్తౄన్‌|


దహరకుహరమధ్యే యం ప్రపశ్యన్తి సన్తః |


ద్యిజకులతిలకై ర్యః పూజ్యతే వేదరీత్యా |


స భవతు మమ సేవ్యః సాంబమూర్తిః సభేశః ||


సాంబమూర్తిం నటేశాం చిత్సభాపతిమీశ్వరమ్‌ |


సోమరాజం దేవరాజం చిన్తయామిష్టసిద్థయే ||


మూకంకరోతివాచాలం పంగుం లంఘయతేగిరిమ్‌ |


యత్‌ కృపా, తమహంవన్దే పరమానందతాణ్డవమ్‌ ||


లం పృధివ్యాత్మనే గన్ధం సమర్పయామి | హం ఆకాశాత్మనే పుష్పాణి సమర్పయామి | యం వాయ్వాత్మనే ధూప మాఘ్రాపయామి| రం వహ్న్యాత్మనే దీపందర్శయామి| పం అమృతాత్మనే అమృతం నివేదయామి| సం సర్వాత్మనే సర్వోపచారాన్‌ సమర్పయామి.


శ్లో || శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|


ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే|


ఓంకాఠనిలయం దేవం గజవక్త్రం చతుర్భుజం |


పిచండిలమహం వన్దే సర్వవిఘ్నోపశాంతయే||


వ్యాసంవశిష్టనప్తారం శ##క్తేః పౌత్రమకల్మషమ్‌|


పరాశరాత్మజం వన్దే శుకతాతం తపోనిధిమ్‌||


అష్టాదశపురాణానాం కర్తారం చ మహామునిమ్‌|


బ్రహ్మసూత్రప్రణతారం నౌమి సత్యవతీసుతమ్‌ ||


వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే


నమో వై బ్రహ్మనిధయే వాశిష్టాయ నమో నమః||


 


శ్రౌతకాండంసూత్రజాలైః యేన సంగ్రధితం క్రమాత్‌


యేనాధీతా దహ్రవిద్యా వ్యాసాత్తం జైమినిం నుమః ||


అష్టాదశపురాణానామాలయం కరుణాలయం


పారాశర్యస్య సచ్ఛాత్రం వందే సూతం చ శాంభవమ్‌ ||


శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం,


నమామి భగవత్పా దశంకరం లోకశంకరమ్‌ ||


ధర్మస్త్వం వృషరూపేణ జగదానందకారక|


అష్ణమూర్తేః అధిష్ఠానం అతః పాహి సనాతన||


చామీకరాచలప్రఖ్యం సర్వాభరణభూషితమ్‌|


బాలేందుమకుటం సౌమ్యం త్రినేత్రం చ చతుర్భుజం||


దీప్తశూలమృగీటంకహేమవేత్రధరం ప్రభుమ్‌||


చంద్రబింబాభవదనమ్‌ భ##జే శ్రీసుయశాపతిమ్‌||


ఉపమన్యుం నందికేశం మణివాచకము త్తమమ్‌|


శ్రీమద్దహరవిద్యాయాః సంప్రదాయగురూన్‌ భ##జే||


మధ్యందినసుతం శాంతం వశిష్ఠభగినీపతిమ్‌|


ఉపమన్యోశ్చ పితరం వ్యాఘ్రపాదం నమామ్యహం||


పతంజలిం మహాభాష్యకరారం ఫణినాయకమ్‌|


అత్రేః సూనుం మహాభాగం అనసూయాత్మజం భ##జే||


నటరాజసమాన్‌ వందే త్రిసహస్రమునీశ్వరాన్‌|


నటేశపూజకాన్‌ విప్రాన్‌ చిదంబరనివాసినః||


యస్మాత్సర్వం సముత్పన్నం చరాచరమిదం జగత్‌|


ఇదం నమో నటేశాయ తసై#్మకారుణ్యమూర్తయే|


నమశ్శివాయ సాంబాయ సగణాయ సమానవే|


సనందినే సగంగాయ సవృషాయ నమో నమః||


పూ జ న మ్‌


తతః ప్రతిదినం సమగ్రం వా. తాణ్డవాధ్యాయం వా, ఏకాధ్యాయం వా, నద్రుతవిలంబితం ముక్తకణ్ఠమ్‌. న మృదు తారం సాధు సార్థబోధం పఠనీయమ్‌. పఠనానంతరం, పుస్తకం పీఠే నిధాయ, ధూపదీపాది ప్రదర్శ్య క్షీరం, ఫలం, స్వాద్వన్నం చ, నివేద్య, మంగళనీరాజనం విధాయ, పుష్పాంజలిం సమర్పయేత్‌. సాష్టాంగం ప్రణిపత్య, శ్రీ శివకామసుందరీపరాంబాసమేత శ్రీ నటరాజమూర్తిం